Srikalahasthi
-
AP: కూటమి సర్కార్ లీలలు.. పోలీసుల పహారాలో ఇళ్ల కూల్చివేతలు!
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. పేదలను టార్గెట్ చేస్తూ కొందరు కూటమి నేతలతో ఆదేశాలతో అధికారులు దౌర్జన్యాలకు దిగుతున్నారు. తాజాగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అన్యాయంగా పేదల ఇళ్లను కూల్చివేశారు. అర్ధరాత్రి పోలీసుల బందోబస్తు మధ్య ఇళ్ల కూల్చివేత జరిగింది. ఈ క్రమంలో అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పేదల ఇళ్లపై కూటమి నేతల దౌర్జన్యం కొనసాగుతోంది. రేణిగుంట మండలం తూకివాకం గ్రామ పంచాయతీ పరిధిలోని గువ్వల కాలనీలో తాజాగా ఇళ్లను అధికారులు కూల్చివేశారు. కూటమి నేతల ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు, పోలీసులు ఇళ్లలోని వారిని బలవంతంగా ఖాళీ చేయించారు. అనంతరం, అర్థరాత్రి వేళ రేణిగుంట పోలీసుల బందోబస్తు మధ్య ఇళ్లను కూల్చివేశారు.ఇదిలా ఉండగా, చెన్నై-తిరుపతి మూడవ లైన్ విస్తరణ పనుల్లో భాగంగా ఇల్లు కోల్పోతున్న వారికి ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వకుండానే కూల్చివేతలను ప్రారంభించారు. అర్థరాత్రి ఇల్లు కూల్చివేయడంతో గువ్వల కాలనీవాసులు ఆర్తనాదాలు చేశారు. గువ్వల కాలనీలో 52 కుటుంబాలను ఖాళీ చేయించి ఇంటి సామాన్లను పోలీసులు సహాయంతో అధికారులు బయట పడేశారు. దీంతో, వారి ఆవేదన తెలుసుకుంటున్న మీడియాను సైతం రేణిగుంట పోలీసులు అడ్డుకున్నారు. తమకు నష్ట పరిహారం ఇవ్వకుండా ఇల్లు కూల్చివేస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. తమను బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు పంపారని విలపిస్తున్నారు. -
టీడీపీ నేతల ఓవర్ యాక్షన్...జనసేన నేతలపై దాడి
-
శ్రీకాళహస్తి టిడిపి ఇంఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డిపై కేసు నమోదు
-
ఏపీ అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ మద్దతు
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. రహదారులు, ఇళ్లు, పలు సంస్థల నిర్మాణాలకు ఎంతగానో ఆర్థిక సాయం చేస్తోందన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని బేరివారి మండపం వద్ద శనివారం సాయంత్రం నిర్వహించిన సంపర్క్ అభియాన్ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మంగళగిరిలో రూ.1,680 కోట్లతో ఎయిమ్స్‌ను అభివృద్ధి చేశామని తెలిపారు. ఇదే విషయాన్ని మన్ కీ బాత్‌లో ప్రధాని కూడా చెప్పారంటూ గుర్తు చేశారు. రాష్ట్రంలో 8,744 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు రూ.300 కోట్లతో తిరుపతి రైల్వేస్టేషన్‌ను వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్‌గా ఆధునికీకరిస్తున్నట్లు చెప్పారు. తిరుపతిలో రూ.800 కోట్లతో ఐఐటీ, రూ.1,491 కోట్లతో ఐసర్ నిర్మాణంలో ఉందని తెలిపారు. కడప–రేణిగుంట–నాయుడుపేట జాతీయ రహదారిని అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా ఏపీలో పట్టణ ప్రాంత పేదలకు 21 లక్షలు, గ్రామీణ ప్రాంత పేదలకు 2.48 లక్షల ఇళ్లు ఇచ్చామని తెలిపారు. స్వచ్ఛ భారత్ ద్వారా ఏపీలో 42 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా 3,273 కి.మీ మేర గ్రామీణ రోడ్లు నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఇంతగా కృషి చేస్తున్న బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే రాయలసీమ వెనుకబాటుతనం పోగొట్టడంతోపాటు రాష్ట్రాభివృద్ధికి మరింతగా బాటలు వేస్తామని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలకు దీటుగా భారత్ భారత ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో భారతావని ప్రపంచ దేశాలకు దీటుగా అన్ని రంగాల్లో సుస్థిరాభివృద్ధిని సొంతం చేసుకుని ప్రపంచ ఆర్థిక రంగంలో పటిష్టంగా నిలిచిందని నడ్డా అన్నారు. ప్రధాని మోదీ రాజకీయాలకు సరికొత్త భాష్యం పలుకుతూ ఓటు బ్యాంకు రాజకీయాలకు దూరంగా బాధ్యత, పారదర్శకతతో కూడిన రాజకీయాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. గతంలో కేవలం 59 గ్రామాలకే ఇంటర్నెట్ కనెక్షన్లు ఉంటే ఇవాళ కేంద్రం రెండు లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్షన్లు ఇచ్చిందన్నారు. 19 వేల గ్రామాలకు సౌభాగ్య పథకం ద్వారా విద్యుత్ సౌకర్యాన్ని కల్పించిందన్నారు. 3 లక్షల 28 వేల కిలోమీటర్ల గ్రామసడక్ పథకం ద్వారా గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేసిందని తెలిపారు. ప్రధాన మంత్రి గరీబ్ అన్న్ కల్యాణ్ యోజన పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 2 కోట్ల 60 లక్షల మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. పేదరిక నిర్మూలనను 22 శాతం నుంచి 10 శాతం కంటే తక్కువకు తీసుకొచ్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. మోదీ ముందు చూపు వల్లే దేశంలో ఆర్థిక వ్యవస్థ నిలకడగా ముందుకు సాగుతోందన్నారు. ప్రపంచ ఆర్థిక రంగంలో భారత్ 5వ స్థానానికి ఎగబాకిందని తెలిపారు. ఏపీలో అసమర్థ పాలన ఆంధ్రప్రదేశ్‌లో తాము వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించి రాష్ట్రాభివృద్ధికి నిధులు అందిస్తున్నప్పటికీ అసమర్థ పాలన కొనసాగుతోందని నడ్డా విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి ఎక్కువైందన్నారు. ఇసుక, మద్యం, ల్యాండ్, మైనింగ్ మాఫియా తారస్థాయికి చేరిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ఆనాడు ప్రధాని శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. రాష్ట్రానికి రాజధాని లేకపోవడం శోచనీయమన్నారు. చిత్తూరు జిల్లాకు కేంద్రం ఇచ్చిన నిధులను గత పాలనలో చంద్రబాబు పక్కదారి పట్టించి అధోగతిపాలు చేశారని ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రూ.7,400 కోట్లతో కండలేరు జలాశయం నుంచి శ్రీకాళహస్తి, తిరుపతి, మదనపల్లికి నీరందించే బృహత్తర పతకాన్ని చంద్రబాబు రద్దు చేశారని ధ్వజమెత్తారు. తిరుపతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కోసం బీసీసీఐ ముందుకొస్తే భూ సమస్య పరిష్కరించకుండా స్టేడియం ప్రతిపాదనను కూడా రద్దు చేశారని తెలిపారు. హైదరాబాద్ తరహా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేత తిరుపతిలో శంకుస్థాపన చేయిస్తే ఆ ప్రాజెక్టునూ టీడీపీ పక్కన పెట్టిందన్నారు. నిమ్జ్‌ను చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకుంటే దాన్ని కూడా రద్దు చేశారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ కేంద్ర పెద్దలను కాకా పట్టడం కోసం సీఎం జగన్ తరచూ ఢిల్లీ టూర్లకు వెళుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పురందేశ్వరి, సునీల్ దేవదర్, సత్యకుమార్, జీవీఎల్నరసింహరావు, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, సుజనాచౌదరి, ఆదినారాయణరెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డి, కోలా ఆనంద్, భానుప్రకాష్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు. కార్యకర్తల కష్టాల్లో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ బీజేపీ తిరుచానూరు (చంద్రగిరి)/తిరుమల : ప్రతి కార్యకర్త ఎటువంటి లాభపేక్ష లేకుండా కష్టపడి పనిచేయడంతోనే ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన జిల్లా శక్తి కేంద్ర ప్రముఖ్ కార్యక్రమాన్ని శనివారం తిరుచానూరు సమీపంలోని ఓ కల్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. ఎటువంటి అవినీతికి తావివ్వకుండా పారదర్శక పాలన అందిస్తున్న ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. అయోధ్యలో చరిత్రలో నిలిచిపోయేలా రామ మందిరం నిర్మిస్తున్న ఘనత కూడా బీజీపీకే దక్కిందని తెలిపారు. తొమ్మిదేళ్ల పాలనలో బీజేపీ చేపిట్టిన అభివృద్ధి పనులను ఈ నెల 20వ తేది నుంచి 30వ తేది వరకు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలని ఆయన పిలుపునిచ్చారు. త్వరలోనే ప్రధాని మోదీ కార్యకర్తలతో నేరుగా కలసే అవకాశం ఉందన్నారు. కాగా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు పండితులు వేద ఆశీర్వచనాలు, అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు శ్రీకాళహస్తిలోని జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. -
శ్రీకాళహస్తి: ఓటు బ్యాంకు రాజకీయాలతో అభివృద్ధి జరగదు: జేపీ నడ్డా
సాక్షి, శ్రీకాళహస్తి: ఏపీలోని శ్రీకాళహస్తిలో బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ సభ జరుగుతోంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొన్నారు. కాగా, సభలో నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. మహాజన్ సంపర్క్ అభియాన్ సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ.. బీజేపీ ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు. దేశమంతా అభివృద్ధి జరగాలన్నదే బీజేపీ విధానం. ఓటు బ్యాంకు రాజకీయాలతో అభివృద్ధి జరగదు. ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. తొమ్మిదేళ్లలో బీజేపీ అనేక విజయాలు సాధించంది. ఎన్డీఏ పాలనలో అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతోంది. పేదల పక్షపాతిగా మోదీ పాలన అందిస్తున్నారు. అభివృద్ధి అజెండాగానే బీజేపీ తొమ్మిదేళ్ల పాలన సాగింది. దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలకు మౌళిక సదుపాయాలు కల్పించాం. వెనుకబడిన వర్గాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాం అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: వాడకమంటే బాబుదే.. సీనియర్ నేత 30 ఏళ్ల సేవలు గుర్తులేవా? -
శ్రీకాళహాస్తిలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
-
CM Jagan Birthday: శ్రీకాళహస్తి పట్టణం వైఎస్ఆర్ సర్కిల్ వద్ద పండగల జననేత జగనన్న జన్మదిన వేడుకలు
-
శ్రీకాళహస్తిలో సీఎం జగన్ పుట్టినరోజు వారోత్సవాలు
-
శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన మంత్రి గుడివాడ అమర్నాథ్
-
అయ్యన్న బాగోతం.. మంత్రి అమర్నాథ్ ఏమన్నారంటే?
సాక్షి, శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి వాయు లింగేశ్వర స్వామిని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం దర్శించుకున్నారు. మంత్రికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఆలయ ఛైర్మన్ అంజూరు శ్రీనివాసులు స్వాగతం పలికారు. ఆలయ దక్షిణ గోపురం వద్ద ఈవో సాగర్ బాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మంత్రి అమర్నాథ్.. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆయనను వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. మంత్రిని కలంకారి వస్త్రంతో సత్కరించి వినాయక ప్రతిమను బహుకరించారు. చదవండి: ఇదేం దిగజారుడు.. ట్విట్టర్లో ఆ పోస్టులేంటి అయ్యన్న.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ఐటీ రంగంలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. అయ్యన్నపాత్రుడు ఆక్రమించుకున్న భూమినే ప్రభుత్వం తొలగిస్తుందన్నారు. చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు అక్రమ మార్గంలో సాగే వారిని, సక్రమమైన మార్గంలో నడిచే వారు కాదని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. అయ్యన్నపాత్రుడు తన ఇంటి కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని, ప్రభుత్వం ఆక్రమణల తొలగింపు చేపట్టిందన్నారు. ఆక్రమణలు చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి అన్నారు. శ్రీకాళహస్తి సమీపంలోని ఐనగలూరు రూ.700 కోట్లు పదివేల మందికి ఉపాధి కల్పించే విధంగా అపాచీ పరిశ్రమకు ఈ నెల 23న సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయనున్నారని తెలిపారు. అలాగే తిరుపతిలో ఐఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. పరిశ్రమల స్థాపన ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా సీఎం జగన్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఏపీని అగ్రగామి తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తున్నారన్నారు. -
ఢిల్లీ గడ్డపై కలంకారీ మెరుపు
శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా): గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న ఢిల్లీలోని రాజపథ్‌లో ప్రదర్శించే కళారూపాల్లో శ్రీకాళహస్తి కలంకారీకి చోటుదక్కింది. శ్రీకాళహస్తి యువ కళాకారుడు సుధీర్ ఏపీ, తెలంగాణ తరఫున ఈ ప్రదర్శనకు ఎంపికయ్యాడు. గత నెలలో చండీగఢ్‌లో జరిగిన అమృతోత్సవాల్లో 9 మంది బృందంతో పాల్గొన్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తరఫున మరుగునపడ్డ స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను కలంకారీని మిళితం చేసి 30 మీటర్ల వస్త్రంపై చిత్రీకరించారు. శ్రీకాళహస్తి ఖ్యాతిని రెపరెపలాడించిన కళాకారుడిని ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అభినందించారు. చదవండి: నెట్ సెంటర్లో వెబ్ వాట్సాప్ లాగౌట్ చేయని మహిళ.. చివరికి.. కలంకారీ చిత్రాలు గీస్తున్న కళాకారులు చాలా ఆనందంగా ఉంది చండీగఢ్‌లో జరిగిన అమృతోత్సవాల్లో ఏపీ, తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించాను. మరుగునపడ్డ జాతీయ నాయకుల చిత్రాలకు జీవం పోశాం. మా కలంకారీ కళను గుర్తించడం చాలా ఆనందంగా ఉంది. 2006 మహాత్మాగాంధీ మెమోరియల్ అవార్డు, 2007లో హ్యాండీక్రాఫ్ట్ విభాగంలో రాష్ట్ర అవార్డు వచ్చింది. హంపీలోని కన్నడ విశ్వవిద్యాలయంలో పెయింటింగ్‌లో బ్యాచిలర్ ఇన్ విజువల్ ఆర్ట్స్ పూర్తి చేశాను. జాతీయ అవార్డు తీసుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్నాను. – సుదీర్, కలంకారీ కళాకారుడు -
పరుపుల పంచాయితీ.. వాళ్లలో వాళ్లే కొట్టుకున్న ‘అమరావతి’ బౌన్సర్లు
సాక్షి, తిరుపతి: అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రకు విస్తృత ప్రచారం కోసం టీడీపీ శ్రేణులు రకరకాల కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయి. పాదయాత్ర నెల్లూరు జిల్లా నుంచి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చేరుకున్న తరుణంలో రైతుల ముసుగులో ఉన్న బౌన్సర్లు నిద్రపోయే పరుపుల విషయంలో బుధవారం సాయంత్రం గొడవపడి వాళ్లలో వారే కొట్టుకున్నారు. ఈ విషయం కాస్తా బయటకు పొక్కడంతో అమరావతి రైతులను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డి అనుచరులు చితక్కొడుతున్నారంటూ రోడ్డు మీదకొచ్చి ఆందోళనకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా పూతలపట్టు–నాయుడుపేట రహదారి పైకి గుంపుగా చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బస్సుల్లో ఉన్న ప్రయాణికులు, కార్లు, బైక్‌ల్లో వెళ్తున్న వారంతా ఏమి జరుగుతోందంటూ ఆరా తీశారు. అక్కడే ఉన్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, అమరావతి రైతుల ముసుగులో ఉన్న రియల్టర్లు దుష్ప్రచారానికి దిగారు. వైఎస్సార్సీపీ శ్రేణులు దాడి చేస్తున్నారంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టారు. ఏం లేదు.. మా వాళ్లే కొట్టుకున్నారు.. శిబిరం వద్ద ఏం జరుగుతోందోనని రోడ్డుపై నిలిచిన వాహనాల్లో ఉన్న వారంతా పరుగెత్తుకుంటూ పాదయాత్రికులు రాత్రి బస చేసే చోటుకు చేరుకున్నారు. ‘ఏమి జరిగింది.. ఎవరు కొట్టారు’ అని ఆరా తీశారు. అక్కడున్న వాళ్లలో ఓ వ్యక్తి ‘మావాళ్లే కొట్టుకున్నారు.. ఏమీ జరగలేదు.. వెళ్లిపోండి’ అన్నారు. వెంటనే అక్కడున్న వాళ్లు అతన్ని నోరు మూయించి పక్కకు లాక్కెళ్లారు. మీడియా ప్రతినిధులు ఫొటోలు తీస్తుండగా అడ్డుకున్నారు. ‘సాక్షి వారు కూడా వచ్చినట్లున్నారు.. లోనికి రానివ్వకండి.. తరిమివేయండి..’ అని పాదయాత్రకు నాయకత్వం వహిస్తున్న వారు కేకలు వేశారు. వెంటనే ఆ శిబిరం వద్దకు వచ్చిన వారందరినీ దూరంగా పంపించేశారు. పాదయాత్రికుల వాలకం చూసి ప్రయాణికులు విస్తుపోయారు. అనంతరం కొట్టుకున్న వారితో (బౌన్సర్లు) సమావేశం ఏర్పాటు చేశారు. ‘ఇక్కడికి మీడియా వాళ్లు వచ్చారు. రేపు మన గొడవ పత్రికలు, టీవీల్లో వస్తే ఇన్నాళ్లు మనం చేసిందంతా వృధా అవుతుంది. వైఎస్సార్సీపీ వాళ్లు కొట్టారని మేము చెబుతుంటే.. కాదు కాదు మా వాళ్లే కొట్టుకున్నారంటే అర్థం ఏముంది? ఇలాగైతే ఎలా? మాట్లాడటం చేతకానప్పుడు సైలెంట్‌గా ఉండాలి. రేపటి నుంచి మనకు చాలా కీలకం. మనం అనుకున్న ప్లాన్‌ను అనుకున్నట్లు అమలు చేయాలి’ అని క్లాస్ పీకారు. -
శ్రీకాళహస్తిలో దారుణం.. సీసీ కెమెరాలో దృశ్యాలు..
-
శ్రీకాళహస్తిలో అందర్ని ఆకట్టుకుంటున్న నవరత్నాల గుడి
-
రేపు శ్రీకాళహస్తిలో జగనన్న నవరత్నాల గుడి ప్రారంభం
-
‘మరో లోకేష్ బాబు వచ్చారు’.. మాజీమంత్రి కుమారుడికి చేదు అనుభవం
మీ నాన్న 30 ఏళ్లు మంత్రిగా.. ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. ఏ రోజైనా ఇటు వచ్చారా? సమస్యలు విన్నారా? మేము దళితులమనే మా ప్రాంతాన్ని చిన్నచూపు చూశారు. కనీసం కట్టుకున్న ఇళ్లు కూడా దక్కకుండా చేశారు. ఇప్పుడు అధికారం లేదని సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు. ఇదేనా ప్రజాసేవ అంటే..? ఇలాంటి పనికిమాలిన రాజకీయాలు చేయడమెందుకు..? అంటూ శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్‌ను స్థానికులు నిలదీయడంతో ఆయన కంగుతిన్నారు. అక్కడి నుంచి జారుకున్నారు. ఈ ఘటన శ్రీకాళహస్తిలో చర్చనీయాంశమైంది. సాక్షి, తిరుపతి / శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వంపై బురదజల్లేందుకు వచ్చి ప్రజావ్యతిరేకతతో అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. శ్రీకాళహస్తి సమీపంలోని రామచంద్రాపురం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 1,748 మందికి ఇందిరమ్మ గృహాలు మొదటి విడత కింద మంజూరు చేశారు. ఆ ప్రాంతానికి రాజీవ్‌నగర్ కాలనీగా నామకరణం చేసి, ఇంటి నిర్మాణాలు ప్రారంభించారు. ఆయన హఠాన్మరణంతో గృహనిర్మాణాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయిన సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొనసాగారు. ఆయన మంత్రిగా పలు కీలక పదవులు అలంకరించారు. ఆ సమయంలో రాజీవ్‌నగర్ అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా వైఎస్ రాజశేఖరరెడ్డికి పేరొస్తుందనే దురుద్దేశంతో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పక్కాగృహాలు అసంపూర్తిగా దర్శనమిస్తుండడంతో అధికారులు పట్టాలను రద్దుచేయడంతోపాటు ముందుగానే నోటీసులిచ్చి లబ్ధిదారులకు తెలియజేశారు. ఇది ఎవరికీ గుర్తుండవనుకుని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ ప్రభుత్వంపై బురదజల్లేందుకు శ్రీకాళహస్తిలో పర్యటనకు సిద్ధపడ్డారు. పట్టణానికి చెందిన టీడీపీ నేత ఒకరు పద్మాలయ చెరువును ఆక్రమించి రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలకు తెరలేపారు. ఇది తెలుసుకున్న అధికారులు ఆ నిర్మాణాలను తొలగించి పద్మాలయ చెరువులో బోర్డులు నాటారు. ఇది జరిగి పది రోజులైంది. అయితే గత సోమవారం శ్రీకాళహస్తికి చేరుకున్న బొజ్జల సుధీర్‌రెడ్డి హడావుడిగా వెళ్లి పద్మాలయ చెరువు ఆక్రమణల విషయమై నానాయాగీ చేశారు. అంతేకాకుండా రాజీవ్‌నగర్‌లో లబ్ధిదారులకు అండగా ఉంటానంటూ మంగళవారం ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. ఉదయం కొంత మందితో అక్కడికి చేరుకున్నారు. అయితే స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో.. టీడీపీ ప్రభుత్వంలో రాజీవ్నగర్ని నిర్మించామని బొజ్జల సుధీర్ నోరు జారారు. బొజ్జల మాట విన్న స్థానికులు కొందరు ‘మరో లోకేష్ బాబు వచ్చారు’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడడంతో ఆయన చిన్నగా అక్కడి నుంచి జారుకోవడం గమనార్హం. -
4 నెలల క్రితం అదృశ్యం.. పేడ దిబ్బలో అస్థిపంజరం
శ్రీకాళహస్తి రూరల్: నాలుగు నెలల కిందట అదృశ్యమైన ఓ మహిళ అస్థిపంజరంగా కనిపించిన సంఘటన మండలంలోని విశాలాక్షినగర్‌లో ఆది వారం వెలుగు చూసింది. శ్రీకాళహస్తి రూరల్ సీఐ కృష్ణమోహన్ కథనం మేరకు.. విశాలాక్షినగర్‌లో అమ్ములు అనే మహిళ నివాసముంటుంది. ఆమె కుమార్తె ఉష ఖమ్మం పట్టణానికి చెందిన నాగ రాజు అలియాస్ నిరంజన్ను ప్రేమించడంతో తొమ్మిదేళ్ల కిందట వారికి వివాహం జరిపించింది. రూ.5 లక్షలు అప్పు చేసి, ఇంటిని నిర్మించుకుని అందరూ కలసి అదే ఇంట్లో ఉంటున్నారు. ఉష శ్రీసిటీలోని ఓ మొబైల్ కంపెనీలో పనిచేస్తుండగా నాగరాజు ఖాళీగా ఉంటున్నాడు. ఖాళీగా ఉంటే అప్పు ఎలా తీర్చాలంటూ అమ్ములు తరచూ అల్లుడిని మందలించేది. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్ నుంచి అమ్ములు కనిపించకుండా పోయింది. దీంతో ఉష గత జనవరి 9న శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ విషయమై ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత నాగరాజు తమ ఊర్లో పని ఉందంటూ ఖమ్మం వెళ్లి, తిరిగిరాలేదు. ఇంటి ప క్కనే ఉన్న దిబ్బలో చెత్త తమ ఇంటి ఆవరణలోకి వస్తోందని, దాన్ని తొలగించాలని పక్క ఇంటి వారు అడుగుతుండడంతో ఉష ఆదివారం కూలీలతో పేడ దిబ్బను తొలగించింది. దిబ్బలో పుర్రె, ఎముకలు బయటపడడంతో వెంటనే ఆమె ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. సీఐ కృష్ణమోహన్, ఎస్ఐ వెంకటేష్, తహసీల్దార్ ఉదయ్‌సంతోష్ సిబ్బందితో కలసి ఘటనా స్థలా నికి చేరుకున్నారు. అస్థిపంజరాన్ని వెలుపలకి తీశారు. ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఆర్సీఎం రెడ్డి, విజయలక్ష్మి శవపంచనామా నిర్వహించారు. దిబ్బలో అమ్ములు చీర, నాగరాజు లుంగీ లభ్యం కావడంతో అల్లుడు నాగరాజుపైన అనుమానం వ్యక్తమవుతున్నట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ కృష్ణమోహన్ తెలిపారు. చదవండి: ముగ్గురు భార్యలు.. 3 అస్థిపంజరాలు: వీడిన మిస్టరీ -
శ్రీకాళహస్తిలో వైభవంగా రథోత్సవం
-
భార్య కాళ్లు, చేతులు నరికేశాడు
-
శ్రీకాళహస్తి భూ వివాదాలతో హత్యాయత్నం
సాక్షి, చిత్తూరు : శ్రీకాళహస్తిలో భూ వివాదాలు కలకలం రేపుతున్నాయి. ఓ భూ వివాదానికి సంబంధించి ఇద్దరు దళిత యువకులపై హత్యాయత్నం జరగడం పట్టణంలో కలవరం పుట్టిస్తోంది. శ్రీకాళహస్తి ఎమ్ఎమ్ వాడకు చెందిన కిరణ్,నరసింహులు అనే యువకులు పిచ్చాటూరు మార్గంలో రాజీవ్ నగర్ సమీపంలో వెళ్తుండగా వారిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడులకు పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన యువకులను హుటాహుటిన ఏరియా హాస్పిటల్ కు తరలించారు. యువవకులకు ఏరియా హాస్పిటల్ లో వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి దర్యాప్తు చేపట్టారు. బాధితులు కిరణ్ నరసింహులు విలేకరులతో మాట్లాడుతూ.. తమపై అగ్రవర్ణాలకు చెందిన వారు హత్యాయత్నం చేయించారని ఆరోపించారు. పట్టణంలోని దళితులకు చెందిన భూమి ఆక్రమించుకోవడంతో తాము అభ్యంతరం చెప్పగా తమపై హత్యా ప్రయత్నం చేయించారని వాపోయారు. (వైద్యం పేరుతో వికృత చేష్టలు ) కారు బోల్తా.. మాజీ మంత్రికి తప్పిన ప్రమాదం -
అక్కడ కరోనా అదుపులో ఉంది..
సాక్షి, చిత్తూరు: జిల్లాలో కరోనా వైరస్ అదుపులో ఉందని కోవిడ్ ప్రత్యేకాధికారి సిసోడియా అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గడిచిన ఐదు రోజులుగా శ్రీకాళహస్తిలో కొత్త కరోనా కేసులు నమోదు కాలేదన్నారు. శ్రీకాళహస్తిపై ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు. అక్కడ కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగించిందన్నారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్రీకాళహస్తిలో కొందరు ఉద్యోగులకు కరోనా సోకిందని పేర్కొన్నారు. లాక్డౌన్ అమలులో కఠినంగా వ్యవహరిస్తున్నామని ఆయన తెలిపారు. -
శ్రీకాళహస్తికి లాక్
సాక్షి, తిరుపతి/శ్రీకాళహస్తి: జిల్లాలో తాజాగా 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 73కు చేరింది. అందులో అత్యధిక కేసులు శ్రీకాళహస్తిలో నమోదు కావడంతో పట్ట ణం మొత్తం రెడ్ జోన్ పరిధిలోకి వెళ్లింది. ప్రజలు ఇళ్ల నుంచి వెలుపలి కి రాకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. ఇళ్లలో కూడా భౌతికదూరం పాటించాలని సూచించారు. నిత్యావసర సరుకులు అవసరమైన వారికి వలంటీర్ల ద్వారా డోర్ డెలివరీ చేయిస్తామన్నారు. ఈక్రమంలో గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో హైపవర్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ నారాయణ భరత్ గుప్త, సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సిసోడియా, డీఐజీ క్రాంతిరాణా టాటా, తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్‌రెడ్డి, ఆర్డీఓ కననకనరసారెడ్డి, ప్రత్యేక అధికారులు పృథ్వీతేజ్, సునీల్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి నుంచి ఉద్యోగుల రాకపోక లను నిషేధించామన్నారు. మే 3 వరకు ఎలాంటి సడలింపులు లేకుండా లాక్డౌన్ కొనసాగుతుందని స్పష్టంచేశారు. కేవలం 35వార్డులు ఉన్న పట్టణంలో ఇన్ని కేసులు నమోదు కావడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా జాగ్రత్త పడాలని హెచ్చరించారు. 14రోజులపాటు కొత్త కేసులు నమోదు కాకుంటే ఆరెంజ్ జోన్‌గా ప్రకటిస్తామని చెప్పారు. కేంద్రప్రభుత్వ హెల్ప్‌లైన్ నంబర్ 9849907502కు ఫోన్ చేసి సమస్యలు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. కోవిడ్–19 ప్రత్యేకాధికారిగా సునీల్‌కుమార్‌రెడ్డిని ప్రభు త్వం నియమించిందని తెలిపారు. అధికారుల మాక్ డ్రిల్ శ్రీకాళహస్తి పట్టణాన్ని రెడ్‌జోన్ గా ప్రకటించిన నేపథ్యంలో గురు వారం రాత్రి అధికారులు వాహనాల తో మాక్‌డ్రిల్ నిర్వహించారు. ప్రజల ను అప్రమత్తం చేశారు. శ్రీకాళహస్తితోపాటు తిరుపతి, నగరి, పలమనేరు, రేణిగుంట, ఏర్పేడు, చంద్రగిరి, నిండ్ర, వడమాలపేట, ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు, పుత్తూరు, బీఎన్‌కండ్రిగ మండలాల్లో కొత్త కేసులు నమోదు కావడంతో వాటిని కూడా రెడ్జోన్లుగా ప్రకటించామని కలెక్టర్ వెల్లడించారు. -
కరోనా వేళ.. అరాచకానికి కుట్ర
సాక్షి, శ్రీకాళహస్తి: ‘‘రాష్ట్రంలో అరాచకం సృష్టించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. కరోనా వైరస్‌తో అధికార యంత్రాంగం యుద్ధం చేస్తుంటే.. వారి ఆత్మస్థైర్యం దెబ్బతీస్తున్నారు. ప్రజలకు సాయం చేసేవారిని భయభ్రాంతులకు గురిచేస్తూ రాక్షసానందం పొందుతున్నారు’’ అని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీకాళహస్తిలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తికి తానే కారణమని చంద్రబాబు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తన వల్ల ఒక్కరికి పాజిటివ్ వచ్చిందని నిరూపిస్తే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. 30 ఏళ్లపాటు అధికారం అనుభవించిన బొజ్జల కుటుంబసభ్యులు, ప్రజలకు సేవ చేయకపోగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఉచిత సలహాతో చేతులు దులుపుకున్నారని విమర్శించారు. శ్రీకాళహస్తిలో రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు 40శాతం ఉన్నారని, వారు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచన మేరకు తన వంతు సాయం చేస్తున్నానని చెప్పారు. అందులో భాగంగానే ట్రాక్టర్లో నిత్యావసర సరుకులు తీసుకెళ్లి పట్టణంలోని 35 వార్డులో ఇంటింటికి పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఆ సమయంలో వాహనాల మధ్య 10 అడుగుల దూరం పాటించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. అదే చంద్రబాబు పుట్టిన రోజును పురస్కరించుకుని టీడీపీ నాయకులు కుప్పంలో సుమారు 200 మందికి బిర్యానీ పంచిపెట్టారని, అయితే దాన్ని తాను తప్పుపట్టలేదని గుర్తుచేశారు. ఈ విధంగా అయినా.. కొంత మంది పేదలకు అన్నదానం చేసినందుకు ఆనందించానన్నారు. శ్రీకాళహస్తిలో మాంసం విక్రయాలపై నిషేధం ఉన్నప్పటికీ ఆదివారం ఒక బీజేపీ నాయకుడు రెడ్‌జోన్ పరిధిలోనే బిర్యానీ చేయించి పోలీస్టేషన్లో పంపిణీ చేశారని తెలియజేశారు. ఆ బిర్యానీ తయారు చేసిన వ్యక్తికి కరోనా పాజిటివ్ బయటపడిందని, అతడి ద్వారానే పోలీసులకు వైరస్ సోకిందని వెల్లడించారు. దీన్ని బట్టి ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా సోకడానికి ఎవరు కారణమో తెలుస్తోందన్నారు. విపత్కర సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న పారిశుధ్య కారి్మకులు, వైద్య సిబ్బంది, పోలీసులు, వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు దేవుళ్లని కొనియాడారు. అందుకే వారికి పాదపూజ చేసి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నానని, అందుకు చాలా గర్వపడుతున్నానని తెలిపారు. విమర్శలు చేస్తున్నవారికి మానవత్వం ఉంటే సాయం చేయాలి కానీ, సేవలందిస్తున్న వారి చేతులు నరకడం ధర్మం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. -
శ్రీకాళహస్తిలో కొత్తగా మరో 5 కరోనా కేసులు
-
ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు నెగటివ్: పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: జిల్లాలో కరోనా వైరస్ (కోవిడ్-19) ఆందోళనకర స్ధాయిలో లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీకాళహస్తిలో ఓ వ్యక్తికి వైరస్ పాజిటివ్‌గా నిర్దారణ అయిందని ఆయన తెలిపారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి విదేశాల నుంచి వచ్చినట్లు మంత్రి చెప్పారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు అధికారులు పరీక్షలు నిర్వహించారని ఆయన తెలిపారు. ఇక కుంటుంబ సభ్యులందరికీ నెగటివ్‌గా రిపోర్టు వచ్చింనట్లు మంత్రి వెల్లడించారు. అదేవిధంగా వైరస్ నివారణకు మాస్కులు ఒక్కటే పరిస్కారం కాదని ఆయన స్పష్టం చేశారు. తప్పకుండా స్వీయ నిర్బంధం పాటించాలని మంత్రి సూచించారు. రైతులు పండించే కూరగాయలు సకాలంలో మార్కెట్‌కు చేరేలా చర్యలు తీసుకొంటున్నామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. వెంటిలేటర్స్ కొరత ఉందని.. వెంటనే తగినన్ని వెంటిలేటర్లు సమకూర్చుతామని ఆయన చెప్పారు. ప్రతి ఎమ్మెల్యే కూడా అప్రమత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారులకు సహాయ సహకారాలు అందించానలి సూచించారు. ప్రజలకు వైరస్ వ్యాపించకుండా అవగాహన కల్పించాలని మంత్రి చెప్పారు. ఎవరైనా నిబంధనలు పాటించకుంటే కఠినమైన కేసులు తప్పవని.. గ్రామ వాలంటీర్లుకు ప్రతి ఒక్కరు సహకరించాలని పెద్దిరెడ్డి కోరారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ ఈ సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. -
వలస బతుక్కి ఊతం..
నగరి: ఈ ఫొటోలోని వలస కుటుంబానిది.. శ్రీకాళహస్తి. బతుకుదెరువు కోసం ఉపాధి వెతుక్కుంటూ.. ఐదేళ్ల కిందట నగరి మండలం మాంగాడుకి చేరింది. ఇద్దరు పిల్లలున్న వీరు బుక్కెడు బువ్వ కోసం దినదిన గండం ఎదుర్కొంటున్నారంటే అతిశయోక్తి కాదు. కుటుంబ యజమాని సుబ్రమణ్యం మేస్త్రి పని చేస్తున్న సమయంలో ఎడమ కాలికి తీవ్రగాయమైంది. వైద్యులు పరీక్షించి కాలు తీసేయకపోతే ప్రాణానికే ముప్పని తేల్చేశారు. చివరికి కాలు తొలగించి జైపూర్ (కృత్రిమ) కాలు అమర్చారు. అప్పటి నుంచి పని చేసే శక్తిని కోల్పోయి నిస్సహాయంగా మిగిలాడు. అడపాదడపా పనికి పిలిచేవారు సైతం ‘నువ్వేం పనిచేయగలవు..బరువు కూడా ఎత్తలేవు కదా..’ అంటూ చీత్కరించుకునేవారు. దీంతో బతుకు బండిని లాగేందుకు నానా కష్టాలు పడుతున్నారు. కూర్చుని వ్యాపారం చేసుకునేంత ఆర్థిక స్తోమత వీరికి లేదు. వీరి దుర్భర జీవితానికి తోడు సొంత ఇల్లు కూడా లేక అద్దె గృహంలో ఆపసోపాలు పడుతున్నారు. పైగా ఊరు మారడంతో ఏర్పడిన సాంకేతిక కారణాల వల్ల రేషన్ కార్డు లేక దివ్యాంగ పింఛన్ కూడా వీరికి మంజూరు కాలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితులకు తోడున్నట్లుగా సుబ్రమణ్యం భార్య అరుణకు మాటలు రావు. దీంతో ఈమెను కూడా కూలిపనులకు పిలిచే దిక్కులేదు. ఇలాంటి సమయంలో తమ ఇద్దరు పిల్లలు (పెద్దబ్బాయి అఖిల్ 1వ తరగతి చదువుతున్నాడు. పాపకు మూడేళ్లు)కు చదువు చెప్పించడం వీరికి అసాధ్యమైంది. ఇదే తరుణంలో అమ్మఒడి తమ జీవితానికి ఆసరాగా కనిపించిందని, భగవంతుడి ఆశీర్వాదం, జగనన్న తోడ్పాటు వల్ల పిల్లలను బడికి పంపే అవకాశం కలిగిందని సుబ్రమణ్యం, అరుణ దంపతులు ఉబికి వస్తున్న ఆనంద భాష్పాలతో ‘సాక్షి’కి తెలిపారు. తమ వలస జీవితాలకు అమ్మఒడి చుక్కానిలాంటిదని హర్షం వ్యక్తం చేశారు. -
‘చిత్తూరు’లో భారీ ఫుట్‌వేర్ సెజ్!
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటైన మాంబట్టులోని అపాచీ ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్), విశాఖపట్నంలోని బ్రాండిక్స్ సెజ్ తరహాలోనే వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పించే మరో సెజ్ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్ సెజ్ డెవలప్మెంట్ సంస్థ భారీ పాదరక్షల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం అట్లనాగులూరు గ్రామంలో 298 ఎకరాల్లో దాదాపు రూ.700 కోట్ల (100 మిలియన్ డాలర్లు) పెట్టుబడితో ఈ యూనిట్ ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. సంస్థ సీఎఫ్‌వో టిమ్‌కుతు, డైరెక్టర్లు మిన్ హిసు తస్సాయి, హాసాయోయన్‌లీ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి, పెట్టుబడుల ప్రతిపాదనలను వివరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భాగస్వామ్య సంస్థతో కలిసి నెల్లూరు జిల్లా మాంబట్టులో అపాచీ పాదరక్షల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. స్కిల్ డెవలప్మెంట్ కింద ఇచ్చే రాయితీలు, పారిశ్రామిక విధానం ప్రకారం వచ్చే రాయితీలు తప్ప అదనపు రాయితీలేవీ అవసరం లేదని కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇంటెలిజెంట్ సెజ్ డెవలప్మెంట్ సంస్థ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమోదం తెలిపారు. త్వరలోనే ఒప్పందం కుదుర్చుకునేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎకరం రూ.6.5 లక్షలు వచ్చే పదేళ్లలో రూ.700 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఫుట్‌వేర్ సెజ్‌తో మహిళలకు ఉపాధి కల్పించనున్నట్లు ఇంటెలిజెంట్ సెజ్ డెవలప్మెంట్ సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. తొలుత రూ.350 కోట్లతో యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని, సెజ్ హోదా వచి్చన తర్వాత మిగిలిన మొత్తాన్ని పెట్టుబడి పెడతామని తెలిపారు. ఈ యూనిట్‌కు అవసరమైన 298 ఎకరాలను ఏపీఐఐసీ ఎకరం రూ.6.5 లక్షల చొప్పున కేటాయించనుంది. స్కిల్ డెవలప్మెంట్ కింద ప్రతి ఉద్యోగికి 12 నెలల పాటు ప్రతినెలా ఇచ్చే రూ.1,500 అలవెన్స్‌తో పాటు ఐదేళ్లపాటు చౌక ధరకు విద్యుత్‌ను సరఫరా చేయాలని ఇంటెలిజెంట్ సెజ్ డెవలప్మెంట్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ఫ్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ తదితరులు పాల్గొన్నారు. మాంబట్టు అపాచీలో భాగస్వామి హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్ ఇన్వెస్టిమెంట్ లిమిటెడ్ సంస్థ ఇండియాలో ఇంటెలిజెంట్ సెజ్ డెవలప్మెంట్ లిమిటెడ్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత ఆడిడాస్ బ్రాండ్ ఉత్పత్తులను అందిస్తోంది. ఇదే సంస్థ నెల్లూరు జిల్లా తడ మండలం మాంబట్టులో అపాచీ పుట్వేర్ సెజ్‌లో భాగస్వామి. రాష్ట్రంలో 2006లో మొదలైన ఈ సంస్థ నెలకు 12 లక్షల జతల పాదరక్షలను ఉత్పత్తి చేస్తోంది. -
అపహరించిన చిన్నారిని అమ్మకానికి పెట్టి..
సాక్షి, శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా) : గుంటూరులో అపహరించిన చిన్నారిని శ్రీకాళహస్తిలో అమ్మకానికి పెట్టి అడ్డంగా దొరికిందో భిక్షగత్తె. ఒకటో పట్టణ సీఐ నాగార్జున రెడ్డి కథనం మేరకు.. గుంటూరు జిల్లా తెనాలి పాతబస్టాండు ప్రాంతానికి చెందిన పోతురాజు, లక్ష్మి దంపతుల కుమార్తె నూకాలమ్మ (3). శ్రీకాళహస్తి సంతమైదానానికి చెందిన ఆదెమ్మ భిక్షాటన చేస్తూ తెనాలికి వెళ్లింది. బస్టాండు ప్రాంతంలో ఆడుకుంటున్న ఆ చిన్నారిని జూన్ 30 తేదీన అపహరించింది. రెండు నెలల పాటు తమ కుమార్తె కోసం బాధిత తల్లిదండ్రులు తీవ్రంగా గాలించారు. లాభం లేకపోవడంతో ఆశలు వదులుకున్నారు. సోమవారం సంతమైదానం అంకాళమ్మ ప్రాంతంలో కిడ్నాప్ చేసిన నూకాలమ్మను పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన పెంచలమ్మకు రూ.10,000లకు విక్రయించేందుకు ప్రయత్నించింది. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆదెమ్మను సీఐ నాగార్జునరెడ్డి అదుపులోకి తీసుకున్నారు. విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పాప తల్లిదండ్రులు పోతురాజు, లక్ష్మి దంపతులకు సమాచారమిచ్చారు. నూకాలమ్మను వారికి అప్పగించారు. నిందితురాలు ఆదెమ్మను, కొనేందుకు ప్రయత్నించిన పెంచలమ్మను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. కేసును గుంటూరు జిల్లా తెనాలికి బదిలీ చేసినట్లు సీఐ పేర్కొన్నారు. కేసును ఛేదించి, చిన్నారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చిన శ్రీకాళహస్తి పోలీసులకు ఎస్పీ అన్బురాజన్, డీఎస్పీ నాగేంద్రుడు రివార్డు అందించారు. రివార్డు అందుకున్న వారిలో ఎస్ఐ సంజయ్ కుమార్, ఏఎస్ఐ మణి, హెడ్ కానిస్టేబుల్ సహదేవ్, పీసీలు కృష్ణా, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. -
గ్రహణం రోజున ఆ ఆలయం తెరిచే ఉంటుంది
సాక్షి, చిత్తూరు : చంద్రగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ఆలయాలను మూసివేయనున్నారు. అయితే గ్రహణం రోజున శ్రీకాళహస్తి ఆలయం తెరిచే ఉంటుందని ఆలయ వేద పండితులు శివప్రసాద్ శర్మ తెలిపారు. గ్రహణకాల సమయంలో ప్రత్యేక గ్రహణకాల అభిషేకాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. మంగళవారం రాత్రి ఒంటి గంట నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సంపూర్ణ కేతు చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని తెరచి ఉంచి ఉదయం మూడు గంటల నుంచి గ్రహణ కాలాభిషేకాలు, సంకల్పము, స్వామి అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సాక్షి, తిరుమల : చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం శ్రీవారి ఆలయం మూసివేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.08 కోట్లు అని వెల్లడించారు. గ్రహణం కారణంగా మంగళవారం రాత్రి 7 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేస్తామని.. తిరిగి బుధవాం ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాలు తెరవనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సుప్రభాతం, శుద్ధి తర్వాత శ్రీవారి దర్శనం ఉంటుందని వెల్లడించారు. కాగా గ్రహణం సందర్భంగా అన్నప్రసాద కేంద్రాన్ని టీటీడీ మూసివేసింది. సాక్షి, యాదాద్రి : నేడు చంద్రగ్రహణం సందర్భంగా సాయంత్రం 6.30 నిముషాల నుంచి రేపు ఉదయం 5.30 నిమిషాల వరకు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ మూసివేయనున్నారు. రేపు ఉదయం 5.30 నిముషాలకు ఆలయం తెరిచి సంప్రోక్షణ అనంతరం నిత్య విధులు నిర్వహించి ఉదయం తొమ్మిది గంటల నుంచి భక్తులకు దర్శనాలకు అనుమతి ఉంటుంది. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం, రేపు ఉదయం భక్తులచే జరుపబడే ఆర్జిత సేవలు రద్దు చేయనున్నారు. -
డబ్బులు పంచుతూ పోలీసులకు చిక్కిన టీడీపీ నేతలు
-
శ్రీకాళహస్తి రోడ్ షోలో వైఎస్ విజయమ్మ
-
చంద్రబాబుకు ప్రజలు ఎన్నికల ముందే గుర్తుకువస్తారు
-
మీ ఆదరణే జగన్‌కు శ్రీరామరక్ష: విజయమ్మ
సాక్షి, శ్రీకాళహస్తి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మ్యానిఫెస్టో పేరుతో మళ్లీ ప్రజలను మోసం చేయడానికి సిద్ధం అవుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఆదివారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ మ్యానిఫెస్టోను చంద్రబాబు కాపీ కొట్టారన్నారు. అయిదేళ్ల తర్వాత ఆయనకు రైతు సంక్షేమం గుర్తుకు వచ్చిందా అని సూటిగా ప్రశ్నించారు. డ్వాక్రా మహిళలకు పెద్దన్నయ్య అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఇంతకాలం ఏం చేశాడన్నారు. డ్వాక్రా మహిళలకు నాలుగు దశల్లో మీ తమ్ముడు జగన్ మాఫీ చేస్తాడని హామీ ఇస్తున్నానని విజయమ్మ తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాలనను ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలని, ఆయన పాలనను మళ్లీ వైఎస్ జగన్ అందిస్తాడని అన్నారు. ప్రజా సంకల్ప పాదయాత్ర, ఓదార్పు యాత్రలో ప్రజలు కష్టాలు దగ్గర నుంచి చూసిన జగన్.. మీ సంక్షేమం చూసుకుంటాడని, ప్రజలు చూపుతున్న ఆదరణే జగన్‌కు శ్రీరామరక్ష అని అన్నారు. అంత పెద్ద ప్రమాదం నుంచి జగన్ బాబు బయట పడ్డాడని, ప్రజల ప్రార్థనలే తన బిడ్డను రక్షించాయని విజయమ్మ పేర్కొన్నారు. మన్నవరం ప్రాజెక్టు ఆరువేల కోట్లతో ఈ ప్రాంతంలో ఏర్పాటు కోసం వైఎస్సార్ కృషి చేశారని, దాన్ని కాపాడుకోలేని చేతకానీ ప్రభుత్వానిదనీ దుయ్యబట్టారు. చంద్రబాబు సొంత జిల్లాకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ప్రభుత్వ సహకార రంగంలో ఉన్న చక్కెర, పాల డైరీలు మూయించిన చరిత్ర చంద్రబాబుదన్నారు. ఏర్పేడు ఇసుక మాఫియా ఘటన దేశాన్నే కుదిపేసిందని, 17 మంది ప్రాణాలు కోల్పోయారని వైఎస్ విజయమ్మ ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీ నేతలు బరి తెగించి ఇసుక దందా చేస్తున్న చర్యలు లేవన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక గ్రామ సచివాలయం ద్వారా సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా చూస్తారని, ఏ ఫ్యాక్టరీ పెట్టినా స్థానికులకే మొదట ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. ఈ ఎన్నికల్లో 25మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధించడమే కాకుండా, గాజుల మాండ్యం షుగర్ ఫ్యాక్టరీ, విజయ డైరీ తెరిపించుకుందామని విజయమ్మ పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి వైఎస్సార్ సీపీ అభ్యర్థి బియ్యపు మధుసూధన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్‌ను గెలిపించాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టీడీపీ నేతలో ‘అపరిచిత కాముడు’
-
నువ్వు నాకు బా..గా నచ్చావ్!
శ్రీకాళహస్తి: ‘నువ్ అందంగా ఉంటావ్..నువ్వంటే నాకిష్టం..నీ వాయిస్ చాలా బాగుంటుంది..నువ్వు నాకు బా..గా నచ్చావ్..! ఇదీ ఓ బ్యాంకు మేనేజర్‌కు అర్ధరాత్రి వేళ శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్‌బోర్డు మాజీ సభ్యుడు, టీడీపీ ముఖ్యనేత పెట్టిన మెసేజ్‌లలో కొన్ని! ఆయనగారిలోని ‘అపరిచిత కాముడి’ తీరుపై ఆ బ్యాంకు మేనేజర్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఇది కాస్తా చర్చనీయాంశమయ్యేసరికి టీడీపీ నేతలు తలలు పట్టుకున్నారు. పార్టీ పరువుపోతుందని మధ్యస్థాలకు పూనుకున్నారు. సేకరించిన వివరాల మేర కు..స్థానికంగా ఓ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న అధికారిణికి వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. ఆ బ్యాంకులో ఖాతా కలిగి ఉన్న టీడీపీ ముఖ్యనేత గురువారం రాత్రి 11.30 గంటల నుంచి పలు అసభ్యకకరమైన మెసేజ్‌లు బ్యాంకు మేనేజర్‌కు పెట్టారు. శుక్రవారం ఉదయాన్నే వీటిని గమనించిన ఆమె దిగ్భ్రాంతి చెందారు. తన భర్తకు తెలియజేశారు. ఆ తర్వాత తన సిబ్బందితో కలిసి ఆ ‘కాముకుడి’ని చడామడా దులిపేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది ఆ నోటా ఈ నోటా పడి శ్రీకాళహస్తిలో చర్చనీయాంశమయ్యేసరికి టీడీపీ నేతలు కంగుతిన్నారు. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో ఇది పార్టీకి నష్టదాయకమని మరో నలుగురు టీడీపీ ముఖ్యనేతలు రంగంలో దిగారు. బ్యాంకు మేనేజర్‌ను, ఆమె భర్తను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఆమెతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఆమె భర్తతో సైతం ఓ హోటల్లో సుదీర్ఘంగా మధ్యస్తం చేసినా అది ఫలించలేదని తెలియవచ్చింది. లైంగిక వేధింపుల కేసు నమోదు దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు, టీడీపీ నాయకుడు అత్తింజేరి బాలాజిపై 354ఏ సెక్షన్ కింద లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ రామకృష్ణయ్య తెలిపారు. బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
లారీని ఢీకొన్న అంబులెన్స్.. ఇద్దరి మృతి
శ్రీకాళహస్తి రూరల్: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని ఇసుకగుంట సమీపంలో పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున లారీని అంబులెన్స్ ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకాళహస్తి రూరల్ సీఐ అబ్దుల్‌గౌస్ కథనం మేరకు.. గుంటూరు జిల్లా వినుకొండ దక్షిణ బజారువీధికి చెందిన సుబ్బారావు, పద్మావతి దంపతుల కుమారుడు అనిల్ బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సుబ్బారావుకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అప్పుడప్పుడు బెంగళూరు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నాడు. ఇటీవల సుబ్బారావు ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో అతన్ని భార్య పద్మావతి బెంగళూరులో ఉన్న కుమారుడి దగ్గరకు తీసుకెళ్లారు. కుమారుడు తన తండ్రిని కొలంబియా ఆస్పత్రిలో చేర్పించాడు. ఆరోగ్యం కొంత మెరుగుపడడంతో స్వగ్రామానికి తిరిగి పంపించేందుకు బెంగళూరులోని మాండ్యా జిల్లా పాండూపూర్ ప్రాంతానికి చెందిన అంబులెన్స్‌ను అద్దెకు మాట్లాడుకున్నాడు. ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో సుబ్బారావు(59), పద్మావతి(54), అనిల్(31), అంబులెన్స్ డ్రైవర్ గిరీష్(27), అతని స్నేహితుడు సందేష్(26) గుంటూరు జిల్లా వినుకొండకు బయలుదేరారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో శ్రీకాళహస్తి మండలం కాపుగున్నేరి పంచాయతీ ఇసుకగుంట సమీపంలో ఉన్న వంతెన వద్ద శ్రీకాళహస్తి నుంచి తిరుపతి వైపు వెళ్తున్న లారీని అంబులెన్స్ ఢీకొంది. సుబ్బారావు, అంబులెన్స్ డ్రైవర్ గిరీష్ అక్కడికక్కడే మృతి చెందారు. సుబ్బారావు భార్య పద్మావతి తీవ్రంగా గాయపడ్డారు. అనిల్, సందేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
పసిమొగ్గలపై మృగాళ్ల పంజా
సాక్షి, తిరుపతి/శ్రీకాళహస్తి రూరల్ : దాచేపల్లి మృగాళ్లు... జిల్లాలోనూ ఉన్నారు. అభం శుభం ఎరుగని చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. శ్రీకాళహస్తిలో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన... కల్లూరులో శనివారం రాత్రి జరిగిన అత్యాచార యత్నాలే ఇందుకు నిదర్శనం. గతంలోనూ జిల్లాలో పలుచోట్ల చోటు చేసుకున్న ఘటనలపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అత్యాచారాలకు పాల్పడుతున్న వారి ని కఠినంగా శిక్షించటంతో పాటు... భవిష్యత్‌లో దాచేపల్లి లాంటి ఘటనలు పునరావృతం కాకుం డా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాళహస్తిపరిధిలోని చెర్లోపల్లెకు చెందిన సుబ్బయ్యనాయుడు (58) అదే గ్రామానికి చెందిన ఐదు, ఏడేళ్ల బాలికలను కొంత కాలంగా వికృత చేష్టలతో వేధిస్తున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం సాయంత్రం గుడికి వెళ్లి వస్తున్న చిన్నారులకు చాక్లెట్ల ఆశ చూపి ఇంటికి పిలిచి వికృత చేష్టలు చేయబోయాడు. భయపడిన చిన్నారులు అక్కడి నుంచి పారిపోయి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పారు. కూలి పనుల నిమిత్తం నెల్లూరుకు వెళ్లి ఉన్న ఆమె భర్త ఆదివారం రావడంతో విషయం చెప్పారు. పిల్లలను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు. ఇది తెలుసుకున్న కలెక్టర్ ప్రద్యుమ్న చెర్లోపల్లెకు వెళ్లారు. బాధితుల కుటుంబసభ్యులతో మాట్లాడారు. వివరాలు తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే.. కల్లూరు బీసీ కాలనీలో నివాసం ఉంటున్న అల్తాఫ్ (24) అదే కాలనీకి చెందిన 13 ఏళ్ల బాలిక బంధువు నివాసంలోని మేడపై నిద్రిస్తుండగా బాలిక నోట్లో గుడ్డకుక్కి ఎత్తుకెళ్లాడు. బాలికను బెదిరిస్తుండగా బంధువులు నిద్రలేవడంతో అతను పారిపోయాడు. ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అల్తాఫ్‌ను అరెస్టు చేశారు. ఎందరో మృగాళ్లు.. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చిన్నారులపై కొందరు మృగాళ్లు అత్యాచారయత్నానికి పాల్పడగా మరికొందరిని లైంగికంగా వేధించిన సంఘటనలు ఉన్నాయి. సోమలలో రామచంద్ర య్య (60) అనే వ్యక్తి తన ఇంటిపక్కనున్న మూడేళ్ల పాపపై అత్యాచారం చేశాడు. చాక్లెట్లు, బిస్కెట్లు కొనిచ్చి చిన్నారిని బలాత్కారం చేశాడు. 2016లో జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనం రేపింది. అలాగే మదనపల్లెలో శివయ్య(58) అనే వ్యక్తి మాయమాటలు చెప్పి 12 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తిరుపతిలో గత ఏడాది నాలుగేళ్ల చిన్నారిపై మరో బాలుడు అఘాయత్యానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడు మైనర్ కావడంతో చితకబాది కౌన్సెలింగ్ ఇచ్చి పంపినట్లు తెలిసింది. వెలుగు చూసినవి కొన్నే అయితే... వెలుగుచూడనివి అనేకం ఉన్నట్లు తెలుస్తోంది. బయటకు చెబితే పరువు పోతుందని పలువురు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సమాచారం. ఇలాంటి సంఘటనలు తలెత్తకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులపై ఇంటిపక్కనున్నవారు, బంధువులు, పాఠశాల టీచర్ల నడవడికపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. -
దేవుడి వెండి స్వాహా!
సాక్షి, అమరావతి : బంగారం కొట్టులో కిలో వెండి (కడ్డీ రూపంలోని వెండి) ధర ప్రస్తుతం రూ.43 వేల దాకా పలుకుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ కిలో వెండి ధర రూ.40,642 నుంచి రూ. 43,042ల మధ్యలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కిలో వెండిని సగటు ధర రూ.33 వేల చొప్పున విక్రయించింది. అంటే కిలోకు రూ.10 వేల నష్టం వాటిల్లింది. రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు చెందిన 16,559 కిలోల వెండిని ప్రభుత్వం అమ్మేసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు కలిసి రూ.16కోట్లు కమీషన్ల రూపంలో కొట్టేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ధర ఇంత తక్కువా? దేవదాయ శాఖ పరిధిలోని ప్రధాన ఆలయాల్లో భక్తులు సమర్పించిన వెండి ఆభరణాల నిల్వలు భారీగా పేరుకుపోయాయి. ఆ వెండిని అమ్మి, వచ్చిన సొమ్ముతో బంగారం కొనుగోలు చేయాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు గతేడాది జులైలో నిర్ణయించారు. దేవుడి అలంకరణకు ఉపయోగించని వెండి ఆభరణాలను కరిగించి, కడ్డీల రూపంలోకి మార్చాలని ఆయా ఆలయాల ఈవోలను ఆదేశించారు. వెండి ఆభరణాలను కడ్డీల రూపంలోకి మార్చిన తర్వాత.. శ్రీకాళహస్తి ఆలయానికి చెందిన 14,936.040 కిలోలను ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో రూ.49.38 కోట్లకు విక్రయించారు. కిలోకు సరాసరి ధర రూ.33,063 చొప్పున శ్రీకాళహస్తి ఆలయానికి అందింది. విజయవాడ దుర్గ గుడికి చెందిన 1,123.696 కిలోల వెండి కడ్డీలను రూ.3,68,88,506 కు ఇటీవల అమ్మారు. కిలోకు సరాసరి ధర రూ.32,827 చొప్పున ఆలయానికి దక్కింది. శ్రీశైలం ఆలయానికి చెందిన 500 కేజీల వెండిని కూడా తక్కువ ధరకే అమ్మేశారు. అర గంటలో వేలం ముగింపు ఆలయాల్లో ఏ పనికైనా ఈ–టెండర్ విధానాన్ని అమలు చేసే దేవాదాయ శాఖ భారీ మొత్తంలో వెండి అమ్మకానికి మాత్రం కేవలం అరగంటలో వేలం ప్రక్రియ ముగిసే విధానాన్ని ఎంపిక చేసుకుంది. బంగారం, వెండి వంటి వస్తువుల అమ్మకం, కొనుగోలుకు మధ్యవర్తిత్వం వహించే కేంద్ర ప్రభుత్వరంగ బ్రోకరేజీ సంస్థ ఎంఎంటీసీ ద్వారానే వెండి అమ్మకం జరపాలని ప్రభుత్వం దేవాదాయ శాఖను ఆదేశించింది. ఎంఎంటీసీ ద్వారా జరిగే వేలం ప్రక్రియ అరగంట వ్యవధిలోనే ముగుస్తోంది. ఆ సమయంలో అన్లైన్లో అమ్మకానికి పెట్టిన వెండిని ఎవరు ఎక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ముందుకొస్తారో వారికే బిడ్ ఖరారు చేస్తారు. ముందే సమాచారం లీక్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీ ద్వారా వేలం ప్రక్రియ కొనసాగినప్పటికీ.. కేవలం ఆరగంట పాటు కొనసాగే వేలాన్ని ఏ రోజు, ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై రెండు రోజుల ముందే ప్రభుత్వ పెద్దలకు సమాచారం ఇచ్చేలా ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో తమకు బాగా కావాల్సిన వ్యక్తులతో దేవుడి వెండిని కొనిపించి, కమీషన్లు కొట్టేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
‘నటి శ్రీదేవిది హత్యే’
సాక్షి, శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం ఆస్థాన పండితుడు ములుగు రామలింగేశ్వరస్వామి ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం చేశారు. ప్రముఖ నటి శ్రీదేవిది హత్యేనని, సన్నిహితులే శ్రీదేవిని చంపారని ఆదివారం నిర్వహించిన పంచాంగ శ్రవణంలో ఆయన పేర్కొన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఒక్క లోక్‌సభ సీటు కూడా రాదని పేర్కొన్నారు. ఆలయంలో ఉగాది సందర్భంగా భక్తుడైన కన్నప్పకు శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం తరఫున సారె అందజేశారు. ఆనవాయితీగా కైలాసగిరి కొండపై వెలసి ఉన్న భక్తకన్నప్ప ఆలయానికి మేళతాళాల నడుమ సంప్రదాయబద్ధంగా వెళ్లి సారెను అందజేశారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక అభిషేక పూజలు, అలంకరణలు జరిగాయి. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కూడా సర్వాంగసుందరంగా అలంకరించారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల రద్దీ నెలకొంది. విద్యుద్దీపాలు, పుష్ప, మామిడి తోరణాలు, అరటి చెట్లతో ఆలయం కొత్తశోభను సంతరించుకుంది. ఈఓ భ్రమరాంబ, ఏఈఓ శ్రీనివాసులురెడ్డి, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
శనీశ్వరాభిషేకం టిక్కెట్‌కు రెక్కలు
సాక్షి, శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రతిరోజూ నిర్వహించే శనీశ్వరాభిషేకం పూజలను రూ.150 నుంచి రూ.300కు పెంచారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పూజలు నిర్వహిస్తారు. శనివారం ఈ పూజను ఎక్కువ మంది భక్తులు చేయించుకుంటారు. ఇటీవల రూ.300 టిక్కెట్ ద్వారా నిర్వహించే రాహుకేతు సర్పదోష నివారణ పూజలు రూ.500కు పెంపుదల చేశారు. ఇక ఆరు నెలల క్రితం రూ.600 టిక్కెట్ ద్వారా నిర్వహించే రుద్రాభిషేకం టిక్కెట్‌ను రూ.1000కి పెంచిన విషయం తెలిసిందే. అదే క్రమంలో సోమవారం శనీశ్వరస్వామి అభిషేకం టిక్కెట్లు రెట్టింపు చేశారు. ఇదే తరహాలో మరికొన్ని పూజా టిక్కెట్లు పెంపుదల చేస్తారని చర్చ సాగుతుంది. ఇలా పూజా టిక్కెట్లు పెంపుదల చేయడంతో సామాన్య భక్తులు పూజలు చేయించుకోవడం భారంగా మారుతుందని పలువురు విమర్శలు చేస్తున్నారు. -
పేదోడికి పూజలూ భారమే
శ్రీకాళహస్తి ఆలయం రాహుకేతు పూజలకు ప్రసిద్ధి. ఆలయ ఆదా యంలో 85శాతం కేవలం ఈ పూజల ద్వారానే వస్తుంది. అంత టి ప్రాశస్త్యం ఉన్న పూజలు పేదలకు అందుబాటులో లేకుండా టి క్కెట్ ధరలు పెంచడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై పునరాలోచించాలని భక్తులు కోరుతున్నారు. శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజలు చేయిస్తే సర్వ దోషాలు నివారణ అవుతాయని భక్తుల నమ్మకం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పూజలు పెద్దలకు మాత్రమే పరిమితం కాకూడదనే ఉద్దేశంతో పేదల కోసం రూ.250 టికెట్ ఏర్పాటు చేశారు. అలాగే రూ.750, రూ.1,500, రూ.2,500, రూ.5000 టికెట్లు కూడా ఉన్నాయి. భక్తులు వారివారి స్థోమతను బట్టి పూజలు చేయించుకుంటున్నారు. పెద్దలు ఎక్కువగా చేయించే టికెట్ల జోలికిపోని అధికారులు పదేళ్ల క్రితం రూ.250 టికెట్‌ను రూ.300కు పెంచారు. ఇకపై దాని ధర పెంచబోమని అప్పటి అధికారులు వెల్ల డించారు. ఆ మాటను పక్కనబెట్టి ప్రస్తుతం రూ.300 టికెట్‌ను రూ.500లు చేశారు. దీనిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానాన్ని పూర్తిగా వ్యాపార కేంద్రం చేసేశారంటూ మండిపడుతున్నారు. మాస్టర్ ప్లాన్ అమలుకు రూ.కోట్లలో ఖర్చు చేయాలి.. భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు చేస్తున్న మాస్టర్‌ప్లాన్ పూర్తి చేయడానికి కొన్ని కోట్ల రూపాయిలు ఖర్చు చేయాల్సి ఉంది. ఇక పూజా సామగ్రి ధరలు పెరిగిపోయిన విషయం తెలిసిందే. విధిలేని పరిస్థితుల్లో రూ.300 టికెట్‌ను రూ.500 చేయాల్సి వచ్చింది. – భ్రమరాంబ, ఆలయ ఈఓ ముందస్తు సమాచారం లేకుండా పెంచేశారు దేవస్థానం వారు ధరలు పెంచాలంటే పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయాల్సి ఉంది. ముందస్తు సమాచారం లేకుండా ఇలా ఒక్కసారిగా పెంచడం సరికాదు. చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న మాలాంటి వారికి ఇది భారమవుతుంది. రూ.200 అదనంగా ఖర్చు కావడంవల్ల శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లోని ఆలయాలను దర్శించుకో కుండా వెళ్లిపోతున్నాం. –రామయ్యగౌడ్, మహేశ్వరి ఒక్కసారిగా రూ.200 పెంచడం సరికాదు రూ.300 టికెట్ ధరను ఒక్కసారిగా రూ.200 పెంచడం సరికాదు. పేద వారికి అందుబాటులో ఉండే టికెట్ ఇదొక్కటే. దాన్నే పెంచేశారు. నేను ఆరు నెలలకొకసారి సికింద్రాబాద్ నుంచి వచ్చి పూజ చేయిస్తుంటాను. దేవాదాయ శాఖ మరోసారి ధర పెంపుపై ఆలోచన చేయాల్సి ఉంది. – నివేద్‌వర్మ, ఆశ, దంపతులు -
పేదోడికి పూజలూ భారమే
శ్రీకాళహస్తి ఆలయం రాహుకేతు పూజలకు ప్రసిద్ధి. ఆలయ ఆదాయంలో 85శాతం కేవలం ఈ పూజల ద్వారానే వస్తుంది. అంతటి ప్రాశస్త్యం ఉన్న పూజలు పేదలకు అందుబాటులో లేకుండా టిక్కెట్ ధరలు పెంచడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై పునరాలోచించాలని భక్తులు కోరుతున్నారు. శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజలు చేయిస్తే సర్వ దోషాలు నివారణ అవుతాయని భక్తుల నమ్మకం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పూజలు పెద్దలకు మాత్రమే పరిమితం కాకూడదనే ఉద్దేశంతో పేదల కోసం రూ.250 టికెట్ ఏర్పాటు చేశారు. అలాగే రూ.750, రూ.1,500, రూ.2,500, రూ.5000 టికెట్లు కూడా ఉన్నాయి. భక్తులు వారివారి స్థోమతను బట్టి పూజలు చేయించుకుంటున్నారు. పెద్దలు ఎక్కువగా చేయించే టికెట్ల జోలికిపోని అధికారులు పదేళ్ల క్రితం రూ.250 టికెట్‌ను రూ.300కు పెంచారు. ఇకపై దాని ధర పెంచబోమని అప్పటి అధికారులు వెల్ల డించారు. ఆ మాటను పక్కనబెట్టి ప్రస్తుతం రూ.300 టికెట్‌ను రూ.500లు చేశారు. దీనిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానాన్ని పూర్తిగా వ్యాపార కేంద్రం చేసేశారంటూ మండిపడుతున్నారు. మాస్టర్ ప్లాన్ అమలుకు రూ.కోట్లలో ఖర్చు చేయాలి.. భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు చేస్తున్న మాస్టర్‌ప్లాన్ పూర్తి చేయడానికి కొన్ని కోట్ల రూపాయిలు ఖర్చు చేయాల్సి ఉంది. ఇక పూజా సామగ్రి ధరలు పెరిగిపోయిన విషయం తెలిసిందే. విధిలేని పరిస్థితుల్లో రూ.300 టికెట్‌ను రూ.500 చేయాల్సి వచ్చింది. – భ్రమరాంబ, ఆలయ ఈఓ ముందస్తు సమాచారం లేకుండా పెంచేశారు దేవస్థానం వారు ధరలు పెంచాలంటే పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయాల్సి ఉంది. ముందస్తు సమాచారం లేకుండా ఇలా ఒక్కసారిగా పెంచడం సరికాదు. చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న మాలాంటి వారికి ఇది భారమవుతుంది. రూ.200 అదనంగా ఖర్చు కావడంవల్ల శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లోని ఆలయాలను దర్శించుకో కుండా వెళ్లిపోతున్నాం. –రామయ్యగౌడ్, మహేశ్వరి ఒక్కసారిగా రూ.200 పెంచడం సరికాదు రూ.300 టికెట్ ధరను ఒక్కసారిగా రూ.200 పెంచడం సరికాదు. పేద వారికి అందుబాటులో ఉండే టికెట్ ఇదొక్కటే. దాన్నే పెంచేశారు. నేను ఆరు నెలలకొకసారి సికింద్రాబాద్ నుంచి వచ్చి పూజ చేయిస్తుంటాను. దేవాదాయ శాఖ మరోసారి ధర పెంపుపై ఆలోచన చేయాల్సి ఉంది. – నివేద్‌వర్మ, ఆశ, దంపతులు -
ముక్కంటి సేవలో సుమ దంపతులు
చిత్తూరు, శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి సోమవారం యాంకర్ సుమ, రాజీవ్ కనకాల దంపతులు కుటుంబసభ్యులతో విచ్చేశారు. ప్రత్యేకంగా రాహుకేతు పూజలు చేయించుకున్నారు. తర్వాత స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. అనంతరం గురుదక్షిణామూర్తి వద్ద వేదపండితుల ఆశీర్వాదం పొందారు. వారికి ఆలయాధికారులు స్వామి, అమ్మవార్ల జ్ఞాపికను, తీర్థప్రసాదాలను అందజేశారు. వారితో పాటు ఆలయ ట్రస్టు బోర్డు మాజీ సభ్యులు కండ్రిగ ఉమ,మల్లెమాల ప్రమీలమ్మ,అత్తింజేరి బాలాజీ ఉన్నారు. -
వైభవోపేతంగా వరలక్ష్మీ వ్రతం
తిరుచానూరు/శ్రీకాళహస్తి : చిత్తూరు జిల్లా తిరుచానూరులో కొలువుదీరిన లక్ష్మీ స్వరూపిణీ శ్రీవారి దేవేరి శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో, శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మీవ్రతం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏటా శ్రావణపూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని నోచుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. తిరుచానూరులో వెలసిన నిండు ముతై ్తదువైన అలివేలుమంగమ్మ చెంత వరలక్ష్మీవ్రతం నోచుకుంటే అమ్మవారు భక్తులకు సకల సిరిసందలు, దీర్ఘ సుమంగళి, ఆయురారోగ్యం ప్రసాదిస్తారని విశ్వాసం. ఇందులో భాగంగా ఉదయం 8గంటలకు అమ్మవారిని సన్నిధి నుంచి వేంచేపుగా ఆస్థాన మండపంలోని వ్రతమండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. 10గంటలకు పాంచరాత్య్ర ఆగమ శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు కలశంలోకి వరలక్ష్మిని ఆవాహనం చేసి పూజలు చేశారు. పసుపు, కుంకుమ, పూలతో వ్రతాన్ని నిర్వహించారు. భక్తులకు వ్రత మహత్యాన్ని తెలిపే కథను ఆలయ అర్చకులు వినిపించారు. వరలక్ష్మి వ్రతం నోచుకోవడానికి అధిక సంఖ్యలో దంపతులు పాల్గొన్నారు. రాత్రి తిరువీధుల్లో స్వర్ణరథంపై అమ్మవారు ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. శ్రీకాళహస్తిలో.. శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ వ్రతం నిర్వహణకు తిరుమల తిరుపతి దేవస్థానం సహకారం అందించింది. శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ప్రసన్న వరదరాజుల స్వామి ఆలయంలోని కల్యాణమండపంలో శుక్రవారం వెయ్యి మందికిపైగా మహిళలు వరలక్ష్మీ వ్రతాన్ని నోచుకున్నారు. ప్రత్యేకంగా లక్ష్మీదేవిని ఏర్పాటు చేసి సర్వాంగసుందరంగా అలంకరించి వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. -
చనిపోవడానికి వెళ్లిన ఏడుగురు కుటుంబ సభ్యులు..
-
చనిపోవడానికి వెళ్లిన ఏడుగురు కుటుంబ సభ్యులు..
పటాన్చెరువు: కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తికి వెళ్తన్నామని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన ఏడుగురు కుటుంబ సభ్యులు అదృశ్యం అయిన సంఘటన పటాన్చెరువు మండలం అమీన్పూర్లో బుధవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న బిమయ్య(50) కుటుంబం ఈ నెల 15న శ్రీకాళహస్తికి వెళ్తున్నామని చెప్పి ఇంట్లోనుంచి వెళ్లారు. ఈ క్రమంలో రెండు రోజుల నుంచి బిమయ్య పెద్ద కూతురు తండ్రితో మాట్లాడటం కోసం ప్రయత్నిస్తుండగా.. ఫోన్ స్విచ్ఛాప్ వస్తుండటంతో ఇంటికి వచ్చి చూసింది. ఇంటికి తాళం వేసి ఉండటంతో.. పోలీసులకు ఫిర్యాదు చేసి వారి సాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా.. ఇంట్లో ఓ సూసైడ్ నోట్ లభించింది. నోట్ సారాంశం.. అప్పుల బాధను భరించలేకపోతున్నాం.. వస్త్రాల వ్యాపారంలో తీవ్రంగా నష్టం పోయాం. ఇళ్లు కట్టడానికి తెచ్చిన అప్పులు కూడా భారీగా పెరిగిపోయాయి. దీంతో బతకాలనే ఆశ చచ్చిపోయింది. కుటుంబ సభ్యులమంతా కలిసి శ్రీకాళహస్తిలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అందుకే వెళ్తున్నాం.. మాకోసం వెతకొద్దు అని సూసైడ్ నోట్లో రాసి ఇంటి పక్కన ఉన్న వారికి శ్రీకాళహస్తి వెళ్తున్నామని ఈ నెల 15న ఇంటి నుంచి బయలు దేరారు. మెదక్ జిల్లా నారాయణ ఖేడ్‌కు చెందిన ఎస్. బిమయ్య(50) గత కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి స్థిరపడ్డాడు. రాంచంద్రాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని లింగమయ్యకుంట బస్తీ సమీపంలో ఓ బట్టల దుకాణం నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ మధ్యే కొత్త ఇళ్లు పనులు ప్రారంభించాడు. ఈ క్రమంలో దుకాణంలో నష్టాలు రావడంతో పాటు ఇంటి కోసం తెచ్చిన అప్పులు విపరీతంగ పెరిగిపోవడంతో.. ఏం చేయాలో పాలుపోక భార్య నాగమణి, కొడుకు అనిల్, కోడలు హేమలత, మనుమలు ఆయుష్, ఆకాష్, కూతురు సంధ్యతో కలిసి ఇంట్లో సూసైడ్ నోట్ రాసి వెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బిమయ్య పెద్ద కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్మాయి ఆశ చూపించి హత్యలు
శ్రీకాళహస్తి: యువతులను ఆశ చూపించి హత్యలు చేసే ముఠాను శ్రీకాళహస్తి పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ వెంకట కిశోర్ స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. 2015 డిసెంబర్ 23వ తేదీన పట్టణంలోని నగిరివీధిలోని ఓ లాడ్జీలో శ్రీనివాస్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడని తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. చెన్నైకు చెందిన విజయుణ్, సురేష్ అనే ఇద్దరు సత్యారామచంద్రన్ అనే యువతిని పలువురికి ఆశ చూపించి బెదిరించి డబ్బులు దోచుకుంటున్నారని, ఎదురుతిరిగిన వారిని హత్య చేస్తున్నారని తెలిపారు. వారు గతనెల 22వ తేదీన శ్రీకాళహస్తిలోని నగిరి వీధిలో అద్దెకు రూమ్ తీసుకుని పక్క రూమ్‌లో ఉన్న శ్రీనివాస్‌కు సత్యారామచంద్రన్‌ను ఆశ చూపించారని తెలిపారు. తర్వాత శ్రీనివాస్ వద్ద ఉన్న రూ.6 వేలు నగదు, సెల్‌ఫోన్‌ను ఇవ్వాలని బెదిరించారని పేర్కొన్నారు. శ్రీనివాస్ ప్రతిఘటించడంతో హత్య చేశారని వివరించారు. శ్రీకాళహస్తి మండలంలోని తొండవునాడు క్రాస్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న విజయున్, సత్యారామచంద్రన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం తెలిసిందన్నారు. సురేష్‌ను కూడా త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. కేసును త్వరగా ఛేదించిన కానిస్టేబుళ్లు గోపి, చంద్రశేఖర్, సుబ్రమణ్యంను డీఎస్పీ అభినందించారు. గుర్తింపు ఉంటేనే గదులు అద్దెకు ఇవ్వాలని లాడ్జీ నిర్వాహకులను ఆదేశించారు. సీఐ చిన్నగోవింద్, ఎస్ఐ సంజీవ్కువూర్, ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
శ్రీకాళహస్తిలో హైదరాబాద్ వాసి దారుణహత్య
శ్రీకాళహస్తి: శ్రీకాళాహస్తిలోని ఓ ప్రైవేట్ లాడ్జీలో బుధవారం ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. శ్రీనివాస్ అనే వ్యక్తి చేతులు కట్టేసి గుర్తుతెలియని దుండగులు హతమార్చినట్టు తెలిసింది. మృతుడు శ్రీనివాస్ హైదరాబాద్ వాసిగా పోలీసులు గుర్తించారు. ఐసీఐసీఐ బ్యాంకులో ఎలక్ట్రిషయన్‌గా పనిచేస్తున్న అతను విధిలో భాగంగా శ్రీకాళహస్తికి వెళ్లినట్టు పోలీసులు వెల్లడించారు. మృతుని వద్ద లభించిన అతని ఆధార్ కార్డు అధారంగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భోజనానికి ఆగి.. బలైపోయాడు
తడ(నెల్లూరు): నెల్లూరు జిల్లా తడ - శ్రీకాళహస్తి మార్గంలో బుధవారం రాత్రి లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడ్ని చెన్నైకు చెందిన సుందరమ్గా గుర్తించారు. సుందరమ్ తిరుమలకు వెళ్లి బస్సులో తిరుగు ప్రయాణం అయ్యాడు. బుధవారం రాత్రి భోజనం కోసం బస్సును తడ సమీపంలో రహదారి పక్కన ఉన్న ఓ హోటల్ దగ్గర ఆపారు. దీంతో సుందరమ్ బస్సు దిగి రోడ్డు దాటుతున్న సమయంలో ఓ లారీ ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందాడు. -
శ్రీకాళహస్తి ఆలయ ఈవో బదిలీ
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బి.రామిరెడ్డిని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పరిషత్ సీఈవోగా బదిలీచేశారు. ఈ మేరకు దేవాదాయశాఖ నుంచి శ్రీకాళహస్తి దేవస్థానానికి శనివారం ఉత్తర్వులు అందాయి. 2014 నవంబర్ 20వ తేదీ రామిరెడ్డి ఆలయ ఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఏడాది గడవక ముందే నాయకుల ఒత్తిళ్లతో ఆయన బదిలీపై వెళుతున్నట్లు తెలుస్తోంది. విభజన తర్వాత ఇటీవల ఏపీకి మార్చిన భద్రాచలం ఆలయ ఈవో రఘునాథ్, కాకినాడ దేవాదాయశాఖ రీజనల్ జాయింట్ డెరైక్టర్(ఆర్జేడీ)గా పనిచేస్తున్న ఆజాద్, సింహాచలం ఆలయ ఈవోగా పనిచేస్తున్న భ్రమరాంబ శ్రీకాళహస్తి ఆలయ ఈవోగా రావడానికి పోటీలో ఉన్నట్లు తెలిసింది. -
రోడ్డు ప్రమాదం: 15 మంది భక్తులకు గాయాలు
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం చిన్న సింగనమల వద్ద తుఫాను వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో తుఫాను వాహనంలో ఉన్న 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. గుంటూరు జిల్లా మాచవరానికి చెందిన వీరంతా తిరుమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను తొలుత శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. గాయపడిన వారిలో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పట్టపగలే కత్తులతో దాడి
చిత్తూరు: పట్టపగలే కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో గురువారం మధ్యాహ్నం జరిగింది. రోడ్డుపై నడిచి వెళ్తున్న వ్యక్తులపై ఎవరో దుండగులే కత్తులతో దాడి చేశారు. ఎవరో తెలీదు.. ఎందుకో తెలీదు.. దాడి మాత్రం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి గాయపడ్డ వ్యక్తిని వైద్యం కోసం.. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తలరించారు. -
ఏటీఎం కేంద్రంలో అగ్నిప్రమాదం
చిత్తూరు: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఇండియన్ బ్యాంక్ ఏటీఎం కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. తేరు వీధిలో ఉన్న ఏటీఎంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేసింది. -
ఆర్టీసీ బస్సు బోల్తా, ఏడుగురికి గాయాలు
చిత్తూరు(శ్రీకాళహస్తి): చిత్తూరు జిల్లా కేవీబీ పురం మండలంలో బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురిని చిత్తూరు ఆస్పత్రికి తరలించారు. కాగా, పిచ్చాటూరు నుంచి శ్రీకాళహస్తి వెళ్తున్న ఈ బస్సులో మొత్తం 47మంది ప్రయాణికులున్నారు. -
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
పిచ్చాటూరు: చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం తిమ్మసముద్రం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. శ్రీకాళహస్తి నుంచి పదిమంది ప్రయాణికులతో షేర్ ఆటో కేవీబీపురానికి బయలుదేరింది. కేవీబీపురం మండలం తిమ్మసముద్రం వద్ద పిచ్చాటూరు నుంచి శ్రీకాళహస్తి వైపు వెళుతున్న లారీ రాంగ్ రూట్లో వస్తుండడం గమనించి ఆటోను డ్రైవర్ పక్కకు తిప్పాడు. ఆటో ఒక్కసారిగా పక్కకు రావడంతో లారీ డ్రైవర్ తికమకపడి ఆటోను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న కేవీబీపురం మండలం కోవనూరుకు చెందిన చెంగయ్యు(25), మఠం గ్రామానికి చెందిన ఉష(35), సబ్బులక్ష్మి(55), దిలీప్(3), జ్ఞానమ్మకండ్రిగకు చెందిన పద్మ(50), కళత్తూరుకు చెందిన భూపతవ్ము(50), ఓళూరు గ్రామానికి చెందిన రాజయ్యు(25) అక్కడికక్కడే వుృతిచెందారు. వురో వుుగ్గురు తీవ్ర గాయూపడ్డారు. మృతుల్లో ఉషా, సుబ్బులక్ష్మి, దిలీప్ ఒకే కుటుంబానికి చెందిన వారు. ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కావడంతో వుృతదేహాలు అందులోనే ఇరుక్కుపోయాయి. క్రేన్ రప్పించి మృతదేహాలను వెలికితీశారు. -
శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో గోల్డా...రోల్డేనా...?
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి దేవస్థానానికి చెందిన ఆభరణాలు భారతీయస్టేట్ బ్యాంకు లాకర్లలో ఏళ్ల తరబడి మగ్గుతున్నాయి. కనీసం బ్రహ్మోత్సవాల్లోనైనా పాతకాలం నాటి హారాలు, బంగారు కిరీటాలు, పాదాలు, కర్ణాలు, పెద్ద పెద్ద హారాలు, పచ్చలు పొదిగిన నగలు, చేతి కడియాలు తదితర స్వర్ణాభరణాలు కనువిందు చేస్తాయని భక్తులు నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రతిఏటా.. ఈ ఏడాది భద్రతా ఇబ్బందులున్నాయి...వచ్చే ఏడాది బంగారు నగలు తప్పక అలంకరిస్తాం.....అంటూ ఉత్సవాల నాటి ఈవోలు కాలంగడిపేస్తు వెళ్లిపోతున్నారు. భక్తులు ప్రశ్నించేందుకు వచ్చే ఏడాది ఆ ఈవోలు ఉండడంలేదు...(వరుసగా రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించిన ఈవోలు లేరు..) బదిలీపై వెళ్లిపోతున్నారు. దీంతో ఏటా గిల్టు నగలతోనే ఉత్సవాలు ముగిస్తున్నారు. భక్తులు మాత్రం తీవ్రమైన నిరాస చెందుతున్నారు. ఈ ఏడాది ఈవో కార్యాలయంలో జరిగిన పలు సమావేశాల్లో పలువురు పుర పెద్దలు బ్రహ్మోత్సవాల్లో బంగారు నగలు స్వామి, అమ్మవార్లకు అలంకరించి ఊరేగింపు చేయాలని విన్నవించారు. ఉత్సవమూర్తులను స్వర్ణాలంకారణతో దర్శించే భాగ్యం భక్తులకు కల్పించాలని కోరారు. ఈసారైనా ఆ అదృష్టం లభిస్తుందో.. లేదో? వేచిచూడాల్సి ఉంది. ’ అదిభిక్షువు వాడినేమి కోరేది... బూడిదిచ్చేవాడినేమి అడిగేది...అంటూ ఒక సినీ కవి పరమశివుడ్ని భిక్షువుతో పోల్చాడు. అయితే శ్రీకాళహస్తీశ్వరుడు ఆది నుంచి భిక్షువు కాదు. రాజులు, జమీందారులు ఆయనకు అపురూపమైన దివ్యాభరణాలను కానుకగా ఇచ్చారు. విజయనగరాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు కూడా వాయులింగేశ్వరునికి ఆభరణాలు కానుకగా ఇచ్చారు. శ్రీకాళహస్తి రాజు సుమారు 14వేల ఎకరాల కైలాసగిరులను ఇచ్చారు. అయితే ఆనాటి ఆభరణాలు ఇప్పటికీ చెక్కచెదరకుండా ఉన్నాయి. దేవస్థానం చేయించిన వజ్రకిరీటంతో పాటు కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్థనరెడ్డి కుటుంబీకులు స్వామి, అమ్మవార్లకు ఇచ్చిన ఆభరణాలు కూడా ఉన్నాయి. టీటీడీకి తప్ప జిల్లాలోని మిగిలిన ఏ ఆలయాలకు ఈ స్థాయిలో ఆభరణాలు లేవు. అయినా భక్తులు వాటిని దర్శించే భాగ్యం కలగడంలేదు. అభరణాలు వాడకంపై నిర్ణయం తీసుకోలేదు... బ్రహ్మోత్సవాల్లో ఉత్సవమూర్తులకు ఆలయ బంగారు ఆభరణాలు అలంకరిండంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. గతంలో భద్రతా ఇబ్బందులతో అలంకరించలేదని తెలుస్తోంది. పలువురు పుర పెద్దలు బంగారు నగలు ఉత్సవాల్లో వినియోగించాలని సూచించిన మాట వాస్తవమే. భద్రతాధికారులతో మరోసారి బంగారు అభరణాలపై చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. -రామిరెడ్డ్డి,ఆలయ ఈవో -
ముక్కంటి చెంత ఎన్టీఆర్ కుమార్తెలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి దేవస్థానానికి శుక్రవారం దివంగత నేత ఎన్టీఆర్ కుమార్తెలు దారపాటి లోకేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి, బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధర, నారా ఇందిర విచ్చేశారు. వారికి ఆలయ ఈవో రామిరెడ్డి స్వాగతం పలికారు. రూ.2,500 టికెట్ ద్వారా ప్రత్యేక రాహుకేతు పూజలు చేసుకున్నారు. తర్వాత స్వామి,అమ్మవార్లను ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నారు.అనంతరం గురుదక్షిణామూర్తి వద్ద వేదపండితుల నుంచి ఆశీర్వచనం పొందారు. వారికి స్వామి,అమ్మవార్ల చిత్ర పటాన్ని,తీర్థప్రసాదాలను ఈవో అందజేశారు. వారితోపాటు ఆలయ పీఆర్వో హరిబాబు యాదవ్ ఉన్నారు. -
శ్రీకాళహస్తిలో కానిస్టేబుల్ వీరంగం!
-
'నా భార్యపై మున్సిపల్ ఛైర్మన్ అనైతిక ప్రవర్తన'
మున్సిపల్ ఛైర్మన్ పేట రాధారెడ్డి తన భార్య పట్ల అనైతికంగా ప్రవర్తించారని శ్రీకాళహస్తిలోని శరవణభవన్ హోటల్ యజమాని మనోహరన్ ఆరోపించారు. తమ హోటల్‌ను ఆయన లాక్కోవాలని చూస్తున్నట్లు మనోహరన్ దంపతులు తెలిపారు. తమకు వాస్తవానికి 30 ఏళ్ల లీజు ఒప్పందం ఉన్నా, ఇప్పటికిప్పుడే ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్నారని, తమ అనుచరులతో రాధారెడ్డి పదే పదే దాడులు చేయిస్తున్నారని మనోహరన్ వాపోయారు. మహిళ అని కూడా చూడకుండా తన భార్యపట్ల రాధారెడ్డి అనైతికంగా ప్రవర్తించాడని ఆయన ఆరోపించారు. -
బొజ్జలపై బహిరంగంగా మండిపడ్డ బాబు
శ్రీకాళహస్తి: సొంత జిల్లా చిత్తూరులో ఎన్నికల ప్రచారం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆదరణ కరువవుతోంది. ఆయన ప్రసంగాలు వినేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. టీడీపీ అధినేత ఎన్నికల ప్రచారం ఆశించిన స్థాయిలో సాగడం లేదు. మంగళవారం శ్రీకాళహస్తిలో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో జనం లేక వెలవెలబోయింది. దీంతో స్థానిక నేతలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. సరైన మైకు కూడా ఏర్పాటు చేయలేకపోయారంటూ శ్రీకాళహస్తి అసెంబ్లీ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డిపై బహిరంగంగా మండిపడ్డారు. చంద్రబాబు తన పర్యటనలో అసంతృప్తులను బుజ్జగించేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టు కనబడుతోంది. -
టెండర్లకు బ్రేక్
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: శ్రీకాళహస్తి దేవస్థానంలో జరిగే రాహుకేతు పూజలకు వినియోగించే ఎర్రగుడ్డ, నల్లగుడ్డ, కండువాలతో పాటు 40రకాల వస్తువుల టెండర్ల ప్రక్రియను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టు మంగళవారం స్టే విధించింది. ఫలితంగా బుధవారం జరగాల్సిన టెండర్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గతంలో ఎర్రగుడ్డ, నల్లగుడ్డ, కండువాలతో పాటు ఆలయ స్టోర్స్‌కు చెందిన 40 రకాల నిత్యావసర సరుకులకు ఒక్కటిగా టెండర్లు నిర్వహించేవారు. అయితే ఈ ఏడాది ఒక్కటిగా కాకుం డా ఏడు విభాగాలుగా విభజించి టెండర్లు నిర్వహించడానికి ఈవో రామచంద్రారెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు 10 రోజుల కిందట ప్రకటనలు ఇచ్చారు. అంతేకాకుండా ఎర్రగుడ్డ, నల్లగుడ్డ, కండువాలతోపాటు 40రకాల వస్తువులను ఒక్క యూనిట్‌గా టెండర్లు నిర్వహిం చే సమయంలో ఏడాదిలో 5 కోట్లు టర్నోవర్ చూపాలనే నిబంధనలు ఉండేవి. ఈ ఏడాది ఒక్క యూనిట్‌ను ఏడు యూనిట్లుగా విభజించి టెండర్లు నిర్వహించడంతోపాటు (7యూనిట్లు) ఏడాదిలో కేవలం రూ.2 కోట్లు టర్నోవర్ మాత్రమే చూపాలని ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో స్థానికుడు చంద్రశేఖర్‌రావు అనే వ్యక్తి రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు స్పందించింది. దేవాదాయశాఖ అనుమతులు తీసుకోకుండా ఒక యూనిట్‌ను ఏడు యూనిట్లుగా విభజించడం, 5కోట్ల టర్నోవర్‌ను 2 కోట్లకు తగ్గించడం సరికాదని హైకోర్టు పేర్కొంటూ స్టే విధించింది. మొదటిరోజు(సోమవారం) 27షాపులకు, రెండవరోజు(మంగళవారం)నాలుగు టెండర్లు యథావిధిగా జరిగినప్పటికీ మూడవరోజు బుధవారం జరగాల్సిన టెండర్ల ప్రక్రియ కోర్టు స్టేతో ఆగిపోనుంది. స్థానికులకు లబ్ధిచేకూర్చడానికే ఏడు టెండర్లు.. స్థానికులకు లబ్ధి చేకూర్చడానికే ఒక్క యూనిట్‌ను ఏడు యూనిట్లు చేసినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. 40 వస్తువులకు పలువురుకి టెండర్లు అప్పగిస్తే గందరగోళంగా మారుతుందని, అంతేకాకుండా చిన్నచిన్న కాంట్రాక్టర్లు అయితే సక్రమంగా నిర్వహించలేరనే ఉద్దేశ్యంతో గతంలో ఏడాదికి రూ.5కోట్ల టర్నోవర్ చూపాలనే నిబంధనలు రూపొందించారు.అయితే అందుకు భిన్నంగా కొందరు నాయకుల ఒత్తిళ్లతో వారికి అనుకూలంగా ఇలా చేసినట్లు విమర్శలు గుప్పుమంటున్నాయి. యథావిధిగా నాలుగు టెండర్లు మంగళవారం నాలుగు టెండర్లను ఆలయ ఈవో రామచంద్రారెడ్డి యథావిధిగా పూర్తి చేశారు. రాహుకేతు పూజలకు వినియోగించే టెంకాయల టెండర్ గతేడాది రూ.65.50 లక్షలు ఉండగా, ఈ ఏడాది రూ.కోటి 11 లక్షల యాబైవేలు చెల్లించడానికి నరసింహారెడ్డి ముం దుకు వచ్చారు. కారు పార్కింగ్ గతేడాది రూ.కోటి 15 లక్షలు ఉండగా ఈ ఏడాది కోటి రూపాయిలకు ముత్యాల వెంకటకృష్ణ దక్కించుకున్నారు. అదేవిధంగా రాహుకేతు పూజలకు వినియోగించే ఉద్దులు, ఉలవలు గతేడాది రూ.9.50 లక్షలు ఉండగా,ఈఏడాది రూ. 12.70లక్షలు చెల్లించడానికి కె.పద్మావతి ముందుకు వచ్చారు. -
తిరుపతి, శ్రీకాళహస్తిలను తమిళనాడులో కలపాలి: రాందాస్
పీఎంకే అధినేత రాందాస్ డిమాండ్ సాక్షి, చెన్నై: ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిపోయిన దృష్ట్యా గతంలో ఉమ్మడి సంయుక్త రాష్ట్రం నుంచి విడిపోయిన తిరుపతి, శ్రీకాళహస్తిలను తిరిగి తమిళనాడులో కలపాలని పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ బుధవారం డిమాండ్ చేశారు. మద్రాసు రాజధాని నుంచి 1956లో విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు తమిళనాడులోని 9 మండలాలు దూరమయ్యూయన్నారు. పెద్ద ఎత్తున పోరాటాలు సాగించి కేవలం తిరుత్తణిని మాత్రమే తిరిగి దక్కించుకోగలిగామని వివరించారు. పుత్తూరు, శ్రీకాళహస్తి, చిత్తూరు, సత్యవేడు, తిరుపతి తదితర 8 మండలాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండిపోయాయన్నారు. మెజారిటీ సంఖ్యలో ఉన్న ఈ 8 మండలాల్లోని తమిళులు ద్వితీయశ్రేణి పౌరులుగా దుర్భర జీవితం అనుభవిస్తున్నందున వారికి న్యాయం జరిగేలా తమిళనాడులో తిరిగి కలపాలని, ఇందుకు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రాందాస్ డిమాండ్ చేశారు.