శ్రీకాళాహస్తిలోని ఓ ప్రైవేట్ లాడ్జీలో బుధవారం ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు.
శ్రీకాళహస్తి: శ్రీకాళాహస్తిలోని ఓ ప్రైవేట్ లాడ్జీలో బుధవారం ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. శ్రీనివాస్ అనే వ్యక్తి చేతులు కట్టేసి గుర్తుతెలియని దుండగులు హతమార్చినట్టు తెలిసింది. మృతుడు శ్రీనివాస్ హైదరాబాద్ వాసిగా పోలీసులు గుర్తించారు.
ఐసీఐసీఐ బ్యాంకులో ఎలక్ట్రిషయన్‌గా పనిచేస్తున్న అతను విధిలో భాగంగా శ్రీకాళహస్తికి వెళ్లినట్టు పోలీసులు వెల్లడించారు. మృతుని వద్ద లభించిన అతని ఆధార్ కార్డు అధారంగా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.