![ACB raids Warangal DTC Puppala Srinivas house](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/11.jpg.webp?itok=0_vZoebP)
కోట్లకు పడగలెత్తిన వరంగల్ డీటీసీ పుప్పాల శ్రీనివాస్
శుక్రవారం నుంచి ఆయన ఇళ్లలో ఏసీబీ సోదాలు
రూ.4.04 కోట్ల విలువైన అక్రమాస్తుల గుర్తింపు
బహిరంగ మార్కెట్‌లో భారీగా వీటి విలువ
శ్రీనివాస్‌ను కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ
సాక్షి, హైదరాబాద్/వరంగల్: వరంగల్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్ అక్రమాస్తుల చిట్టాను ఏసీబీ అధికారులు విప్పుతున్నారు. శుక్రవారం నుంచి శ్రీనివాస్, ఆయన బంధువుల ఇళ్లలో నిర్వహించిన సోదా ల్లో పెద్ద మొత్తంలో అక్రమాస్తుల పత్రాలు, బంగారంతోపాటు విదేశీ మద్యం గుర్తించినట్లు ఏసీబీ డీజీ విజయ్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
శుక్రవారం హనుమకొండ పలివేల్పుల రహదారిలోని దుర్గా కాలనీలో ఉన్న శ్రీనివాస్ నివాసంతోపాటు ఆయన బంధువుల ఇళ్లతో కలిపి మొత్తం ఐదు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో ఇళ్లు, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూమి, నగదు, బంగారం, ఇతర ఆభరణాలు, వాహనాలు, ఖరీదైన గృహోపకరణాలు కలిపి మొత్తం రూ.4,04,78,767 విలువైన ఆస్తులను గుర్తించినట్టు విజయ్‌కుమార్ వెల్లడించారు.
బహిరంగమార్కెట్‌లో ఈ ఆస్తు ల విలువ చాలా ఎక్కువగా ఉంటుందన్నారు.శ్రీనివాస్‌పై అవి నీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)(బి), 13(2)తో పాటు తెలంగాణ ఎక్సైజ్ చట్టం–1968 కింద కేసు నమోదు చేసి వరంగల్‌లోని ఏసీబీ కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు.
ఏసీబీ సోదాల్లో గుర్తించిన శ్రీనివాస్ అక్రమాస్తులు
» శ్రీనివాస్ నివాసంలో రూ.19,55,650 విలువైన 1,542.8 గ్రాముల (కిలోన్నర)బంగారం. రూ.28 వేల విలువైన వెండి ఆభరణాలు.
» శ్రీనివాస్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న రూ.2,79,32,740 విలువైన మూడు ఇళ్లకు సంబంధించిన పత్రాలు.
» రూ.13.57 లక్షల విలువైన 16 ఓపెన్ ప్లాట్ల పత్రాలు.
» రూ.14,04,768 విలువైన 15.20 ఎకరాల వ్యవసాయ భూమి పత్రాలు.
» బ్యాంకు ఖాతాలో రూ.5,85,409 డిపాజిట్లు.
» రూ.22,85,700 విలువైన గృహోపకరణాలు.
» రూ.43,80,000 విలువైన మూడు కార్లు, ఒక బైక్.
» రూ.5.29,000 ఖరీదు చేసే 23 విదేశీ మద్యం బాటిళ్లు.
Comments
Please login to add a commentAdd a comment