ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్‌ | Sensational Statement By Family Members On Pravallika Case | Sakshi
Sakshi News home page

Pravallika Case: ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్‌

Published Tue, Oct 17 2023 3:50 PM | Last Updated on Tue, Oct 17 2023 5:08 PM

Sensational Statement By Family Members On Pravallika Case - Sakshi

సాక్షి, వరంగల్‌: ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ఆమె కుటుంబం స్పష్టం చేసింది. ప్రవళిక తల్లి విజయ, సోదరుడు ప్రణయ్‌ వీడియో రిలీజ్ చేశారు.  శివరామ్‌ వేధింపుల వల్లే తన సోదరి ఆత్మహత్య చేసుకుందని ప్రవళిక అన్న ప్రణయ్‌ అన్నారు.

తమ చెల్లి హాస్టల్‌లో చదువుకోవడానికి వెళ్లినప్పుడు వేధింపులకు గురి చేశారని, ఫ్రెండ్స్ ఫోన్‌లతో పాటు వేరే ఇతర నంబర్ల నుంచి కాల్స్‌ చేసి ఇబ్బందులకు గురిచేశాడని, దాంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక తన చెల్లి సూసైడ్ చేసుకుందని సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు. శివరామ్‌ను కఠినంగా శిక్షించాలన్నారు. రాజకీయాల్లోకి తమ కుటుంబాన్ని లాగొద్దని ప్రవళిక తల్లి, సోదరుడు విజ్ఞప్తి చేశారు.

కాగా, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ ఆత్మహత్యకు పాల్పడిన మర్రి ప్రవళిక కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రియుడు తనని కాదని మరొకరితో వివాహానికి సిద్ధం కావడంతో మనస్తాపం చెంది ఆమె సూసైడ్‌ చేసుకుందని సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ఎం. వెంకటేశ్వర్లు తెలిపారు.
చదవండి: బతుకమ్మకు వస్తనంటివి బిడ్డా..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement