Family members
-
భార్య బిడ్డలను హత్తుకొని బన్నీ ఎమోషనల్
-
వైఎస్ జగన్‌ను కలిసిన ప్రేమ్‌కుమార్ కుటుంబ సభ్యులు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని గుంటూరుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ కొరిటిపాటి ప్రేమ్ కుమార్ భార్య సౌజన్య, పిల్లలు అభిసాత్విక, అభినయ్ కలిశారు. ప్రేమ్‌కుమార్ బెయిల్ విషయంలో అవసరమైన న్యాయ సహాయం అందజేయాలని వైఎస్సార్సీపీ లీగల్ టీమ్‌కు వైఎస్ జగన్ సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.పోలీసులు తెల్లవారుజామున తమ ఇంటికి వచ్చి దౌర్జన్యంగా వ్యవహరించి ప్రేమ్‌కుమార్‌ను తీసుకువెళ్లిన తీరును వైఎస్ జగన్‌కు కుటుంబ సభ్యులు వివరించారు. వారికి ధైర్యాన్నిచ్చి, అక్రమ కేసులు చట్టపరంగా ఎదుర్కుందామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ప్రేమ్‌కుమార్ కుటుంబసభ్యుల వెంట మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు ఉన్నారు.ఇదీ చదవండి: పోలీసుల పేరుతో అర్ధరాత్రి హల్చల్.. వైఎస్సార్సీపీ ప్రేమ్ కుమార్ ఎక్కడ? -
పిల్లలతో అనుబంధాలు తెగిపోతున్నాయ్
ఖిలా వరంగల్: ‘ నెలల తరబడి డ్యూటీలోనేనా.. వారానికి ఒక్కసారి ఇంటికి పంపరా.. పిల్లలతో అనుబంధాలు తెగిపోతున్నాయి’ అంటూ టీజీ పోలీసు కుటుంబ సభ్యులు మంగళవారం వరంగల్‌లోని రంగశాయిపేట గవిచర్ల క్రాస్ రోడ్డు జంక్షన్లో చంటి పిల్లలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ‘కొత్తగా తీసుకొచ్చే లీవ్ మాన్యువల్‌తో నెలకు ఒక్కసారి మాత్రమే ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబానికి దూరమై మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజులకు ఒకసారి ఇచ్చే నాలుగు రోజుల పర్మిషన్ లీవ్ పాత పద్ధతినే కొనసాగించాలి’ అని ఈ సందర్భంగా పల్లవి, నవ్యశ్రీ, అంజలి తదితరులు కోరారు. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్‌లో రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 1 నుంచి కొత్తగా తీసుకొస్తున్న లీవ్ మాన్యువల్‌పై పోలీసు కుటుంబాలు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీస్ కుటుంబాలు ఆందోళనకు దిగుతాయని ముందస్తుగా గమనించిన పోలీసులు ఆర్టీఏ జంక్షన్, బెటాలియన్ ప్రధాన గేటు వద్ద భారీగా మోహరించారు. పోలీసుల అంచనాలకు అందకుండా ఇతర ప్రాంతాల్లోని పోలీస్ కుటుంబాలు వివిధ మార్గాల్లో రంగశాయిపేట జంక్షన్‌కు చేరుకొని రోడ్డుపై బైఠాయించాయి. విషయం తెలుసుకున్న ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్, టీజీ ఎస్పీ కమాండెంట్ రాంప్రకాశ్, ఏసీపీలు నందిరాంనాయక్, తిరుపతి, సీఐలు వెంకటరత్నం, రమేష్‌లు మహిళా పోలీసులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పినా పోలీసు కుటుంబాలు ససేమిరా అనడంతో వారిని వ్యానులో ఎక్కించి బెటాలియన్‌కు తరలించారు. వినతిపత్రం స్వీకరించి సాయంత్రం వదిలేశారు. ఈ కార్యక్రమంలో 200 మంది పోలీసు కుటుంబాలు పాల్గొన్నాయి. బెటాలియన్‌లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందిని ఉదయాన్నే స్పెషల్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఆఫీసులకే పరిమితం చేశారు. -
కుటుంబానికి బీమా ధీమా..
షణ్ముఖ్, నిత్య దంపతులకు ఇద్దరు పిల్లలు. షణ్ముఖ్ ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. నిత్య గృహిణి. ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లేవు. సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం చిచ్చు పెట్టింది. షణ్ముఖ్ పేరిట లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు రెండున్నాయి. ఆ రెండింటి నుంచి వచ్చిన మొత్తం కేవలం రూ.15 లక్షలు. కుటుంబ జీవన అవసరాలకు ఈ మొత్తం చాలదని తెలియడంతో.. బాధను దిగమింగుకుని నిత్య ప్రైవేటు ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. జీవిత బీమా రక్షణ లేని వారు కొందరు అయితే.. ఉన్నా తగినంత కవరేజీతో సరైన ప్లాన్ తీసుకోని వారే ఎక్కువ. ఇలాంటి వారికి షణ్ముఖ్ కేసు కనువిప్పు కలిగిస్తుంది. సరైన బీమా పథకాన్ని, తగినంత కవరేజీతో తీసుకున్నప్పుడే దాని లక్ష్యం, ఉద్దేశం నెరవేరుతుంది. ఈ దిశగా అవగాహన కలి్పంచే కథనమే ఇది...తమపై ఎవరైనా ఆరి్థకంగా ఆధారపడి ఉంటే, అలాంటి ప్రతి ఒక్కరూ జీవిత బీమా రక్షణను (పాలసీ) తప్పకుండా తీసుకోవాలి. ఆర్జించే వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణించిన సందర్భాల్లో వారి కుటుంబం జీవన అవసరాల కోసం ఆరి్థకంగా ఇబ్బందులు పడకుండా జీవిత బీమా పరిహారం సాయంగా నిలుస్తుంది. కానీ, ఇదంతా సరైన, సరిపడా రక్షణ తీసుకున్నప్పుడే అని తప్పకుండా దృష్టిలో పెట్టుకోవాలి. తమ విలువైన జీవితంపై చేస్తున్న అసలైన పెట్టుబడిగా అర్థం చేసుకోవాలి.కవరేజీ ఎంత?ఏజెంట్ లేదా బ్రోకర్ చెప్పిన మేరకు లేదా ప్రీమియం తమకు సౌకర్యంగా అనిపించిన మేరకు జీవిత బీమా కవరేజీని ఎక్కువ మంది తీసుకుంటుంటారు. కానీ, ఇది సరైన విధానం కాదు. ఎంత లేదన్నా వార్షిక ఆదాయానికి కనీసం 10 రెట్ల మొత్తం జీవిత బీమా రక్షణగా తీసుకోవాలన్నది ప్రాథమిక సూత్రం. అలాగే, వార్షిక ఆదాయానికి 25 రెట్ల వరకు కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు. 20 రెట్లు మధ్యస్థంగా ఉంటుంది. ఒకవేళ రుణాలు తీసుకుని ఉంటే ఆ మేరకు కవరేజీని అదనంగా ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు వార్షికాదాయం రూ.12 లక్షలు ఉంటే, కనీసం రూ.1.2 కోట్ల సమ్ అష్యూర్డ్‌తో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇల్లు, కారు లేదా వ్యక్తిగత రుణాలు రూ.10 లక్షలు ఉన్నాయనుకుంటే.. అప్పుడు రూ.1.2 కోట్లకు బదులు రూ.1.3 కోట్లను ఎంపిక చేసుకోవాలి. దురదృష్టవశాత్తు పాలసీదారు మరణించినట్టయితే బీమా సంస్థ చెల్లించే పరిహారంతో అప్పులు తీర్చి, మిగిలిన మొత్తంతో కుటుంబం సాఫీగా జీవించడానికి అవకాశం ఉంటుంది.సరిపోతుందా..?ఇంతకు ముందు ఉదాహరణలో వార్షిక ఆదాయం రూ. 12 లక్షలకు పది రెట్లు అంటే రూ.1.2 కోట్లకు టర్మ్ లైఫ్ ప్లాన్ తీసుకున్న తర్వాత.. పాలసీదారు మరణించినట్టయితే వచ్చే పరిహారం కుటుంబానికి సరిపోతుందా..? ఇక్కడ రూ.1.2 కోట్ల డిపాజిట్‌పై 6 శాతం వార్షిక రేటు ఆధారంగా వచ్చే మొత్తం రూ.7.2 లక్షలు మించదు. అంటే అప్పటి వరకు వచ్చిన వార్షికాదాయం కంటే తక్కువ. తమకు ఏదైనా జరిగినా.. ఎప్పటి మాదిరే కుటుంబ జీవనం సాఫీగా సాగిపోవాలంటే ఇక్కడ రూ. 2.4 కోట్లకు బీమా రక్షణను (సమ్ అష్యూర్డ్) తీసుకోవాలి. ఉదాహరణకు షణ్ముఖ్ వయసు 30 ఏళ్లు. ప్రస్తుత వార్షికాదాయం రూ.12 లక్షలకు 20 రెట్ల చొప్పున రూ.2.4 కోట్లకు టర్మ్ లైఫ్ కవరేజీ తీసుకున్నాడని అనుకుందాం. 40 ఏళ్లకు వచ్చే సరికి షణ్ముఖ్ వార్షికాదాయం రూ.24 లక్షలకు పెరిగింది. ఈ ప్రకారం చూస్తే పదేళ్ల క్రితం తీసుకున్న టర్మ్ ప్లాన్‌లో రక్షణ వార్షిక ఆదాయానికి పది రెట్లకు తగ్గిపోయిందని తెలుస్తోంది. వయసు పెరిగే కొద్దీ జీవితంలో బాధ్యతలు, ఖర్చులు పెరుగుతాయని తెలిసిందే. కనుక పెరుగుతున్న ఆదాయానికి, జీవన వ్యయాలకు అనుగుణంగా బీమా కవరేజీ కూడా పెరిగేలా చూసుకోవాలి. సొంతిల్లు, పిల్లలకు మెరుగైన విద్య అన్నవి తల్లిదండ్రులకు ఎంతో ముఖ్యమైన లక్ష్యాలు. ఇంటికి ఆధారమైన వ్యక్తి మరణించినప్పుడు వచ్చే పరిహారం కేవలం ఆ కుటుంబ జీవన అవసరాలే కాదు, ముఖ్యమైన జీవిత లక్ష్యాల సాకారానికీ తోడ్పాటునివ్వాలి. అందుకుని వాటికయ్యే వ్యయాలను కూడా కవరేజీని నిర్ణయించుకునే విషయంలో పరిగణనలోకి తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి..? ‘‘వివాహం అయిన తర్వాత లేదా పిల్లలు కలిగిన తర్వాత టర్మ్ ప్లాన్ తీసుకోవాలనే ధోరణి సరికాదు. ఎంత వీలైతే అంత ముందుగా టర్మ్ ప్లాన్ కొనుగోలు చేయడం మంచిది. దీనివల్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. అంతేకాదు పాలసీ పూర్తి కాలానికి అదే కొనసాగుతుంది’’ అని ఆనంద్‌రాఠి ఇన్సూరెన్స్ బ్రోకర్స్‌కు చెందిన దినేష్ దిలీప్ భోయ్ సూచించారు. వీలైనంత ముందుగా అంటే.. సంపాదన మొదలు పెట్టిన వెంటనే అని అర్థం చేసుకోవచ్చు. జీవితంలో స్థిరపడడంలో ఆలస్యమైన వారు.. కనీసం తమ సంపాదన మొదలైన మొదటి 30 రోజుల్లో అయినా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడం మరిచిపోవద్దు. సాధారణంగా 18 సంవత్సరాల నుంచి 65 ఏళ్ల వయసు వారు టర్మ్ ప్లాన్ తీసుకోవచ్చు. ఆలస్యం చేసిన కొద్దీ వయసుతోపాటు ప్రీమియం పెరుగుతుంది. పైగా నేటి రోజుల్లో చిన్న వయసులోనే జీవనశైలి వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ తదితర సమస్యలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు జీవిత బీమా తీసుకోవడాన్ని నిర్లక్ష్యం చేసి, అనారోగ్య సమస్యలు పలకరించిన తర్వాత తీసుకోవాలంటే అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. ఆరోగ్య వంతులతో పోలి్చతే ప్రీమియం 20–50 శాతం అధికంగా పడుతుంది. కొన్ని సందర్భాల్లో రిస్క్ మరీ ఎక్కువ ఉంటుందని బీమా సంస్థలు భావిస్తే బీమా కవరేజీని తిరస్కరించే అవకాశం కూడా లేకపోలేదు.ఎంత కాలానికి? జీవిత బీమా తీసుకోవడం ఎంత ముఖ్యమో, ఎంత వయసు వచ్చే వరకు ఈ రక్షణ ఉండాలన్నది కూడా ముఖ్యమైన అంశమే అవుతుంది. మనలో చాలా మంది ఇక్కడే తప్పు చేస్తుంటారు. ఎక్కువ మంది 20–25 ఏళ్ల కాలానికే రక్షణను ఎంపిక చేసుకుంటుంటారు. ఉదాహరణకు 25 ఏళ్ల వ్యక్తి 25 ఏళ్ల కాలానికి జీవిత బీమా కవరేజీ తీసుకున్నారని అనుకుంటే.. అతడికి/ఆమెకు 50 ఏళ్లు వచ్చే సరికి ఆ రక్షణ ముగిసిపోతుంది. దీంతో అక్కడి నుంచి మళ్లీ కొంత కాలానికి మరో పాలసీ కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీనివల్ల ప్రీమియం భారంగా మారుతుంది. ప్లాన్ తీసుకునే నాటికి తమ వయసు ఎంతన్నది పరిగణనలోకి తీసుకోవాలి. ఎంతలేదన్నా రిటైర్మెంట్ వరకు (60 ఏళ్లు) జీవిత బీమా కవరేజీ ఉండాలి. కొందరికి ఆలస్యంగా వివాహం కావచ్చు. అంటే 30–45 ఏళ్ల మధ్యలో వివాహం చేసుంటే.. 60 ఏళ్లు వచ్చినా పిల్లలకు సంబంధించి, కుటుంబ బాధ్యతలు ఇంకా మిగిలి ఉంటాయి. పిల్లలకు కనీసం 23–25 ఏళ్ల వయసు వచ్చే వరకు అయినా తమకు టర్మ్ కవరేజీ ఉండేలా చూసుకోవడం సరైనది. రిటైర్మెంట్ నాటికి లేదా జీవితంలో అన్ని ముఖ్యమైన బాధ్యతలు తీరే నాటికి బీమా కవరేజీ ఉంటే సరిపోతుంది.ఎలాంటి టర్మ్ ప్లాన్? టర్మ్ ప్లాన్ అంటే అచ్చమైన బీమా రక్షణతో కూడిన పాలసీ కదా? అన్న సందేహం రావచ్చు. అవును టర్మ్ ప్లాన్ ఉద్దేశంఅదే. కానీ, వినియోగదారుల ధోరణి, అంచనాలు, అవసరాలకు అనుగుణంగా ఇందులోనూ పలు రకాలు వచ్చాయి. సంప్రదాయ ఎండోమెంట్ ప్లాన్లలో బీమా రక్షణతోపాటు, పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉన్నా కానీ రాబడి ప్రయోజనం లభిస్తుంది. అంటే అది బీమా, పెట్టుబడి కలిసిన సాధనం. టర్మ్ ప్లాన్ ఎలాంటి రాబడి ఇవ్వని.. కేవలం మరణించిన సందర్భాల్లోనే (పాలసీ కాల వ్యవధిలో) పరిహారం చెల్లించేది. కానీ, పాలసీ గడువు ముగిసే వరకు పాలసీదారు జీవించి ఉంటే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం నుంచి జీఎస్టీ మినహాయించి మిగిలిన మొత్తాన్ని వెనక్కిచ్చే టర్మ్ ప్లాన్లు మార్కెట్లోకి ప్రవేశించాయి. టర్మ్ ఇన్సూరెన్స్ విత్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం (టీఆర్‌వోపీ)గా దీన్ని పిలుస్తారు. లెవల్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇది అందరికీ తెలిసిన ప్లాన్. కాల వ్యవధి పూర్తయ్యే వరకు కవరేజీ స్థిరంగా ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల కాలానికి రూ.50 లక్షల కవరేజీతో ప్లాన్ తీసుకుంటే, కాల వ్యవధి ముగిసే వరకు రూ.50 లక్షల కవరేజీయే కొనసాగుతుంది. ఇంక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇందులో సమ్ అష్యూర్డ్ స్థిరంగా ఉండదు. నిరీ్ణత కాలానికోసారి పెరుగుతూ పోతుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం నుంచి పరిహారానికి హెడ్జింగ్ లభిస్తుంది. అంతేకాదు పెరిగే వయసుకు తగ్గట్టు బాధ్యతలు కూడా అధికమవుతుంటాయి. ఈ విధంగానూ అదనపు రక్షణ అక్కరకు వస్తుంది. డిక్రీజింగ్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇంక్రీజింగ్ ప్లాన్‌కు వ్యతిరేకంగా ఇది పనిచేస్తుంది. నిరీ్ణత కాలానికోసారి కవరేజీ తగ్గుతూ వెళుతుంది. ఉదాహరణకు ఏదైనా లోన్ తీసుకుని, దానికి రక్షణ కోసం టర్మ్ ప్లాన్ తీసుకున్నారని అనుకుందాం. కొంత కాలానికి రుణ భారం తగ్గిపోతుంది. దీనికి అనుగుణంగా బీమా రక్షణ తగ్గేలా ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. కన్వర్టబుల్ టర్మ్ ఇన్సూరెన్స్: ఇందులో టర్మ్ ప్లాన్‌ను ఎండోమెంట్ లేదా హోల్‌లైఫ్ పాలసీగా మార్చుకోవచ్చు. హోల్ లైఫ్ ఇన్సూరెన్స్: నూరేళ్ల కాలానికి ఈ ప్లాన్‌లో రక్షణ లభిస్తుంది. నోట్: టర్మ్ ప్లాన్‌లో ఎన్ని రకాలున్నా.. అచ్చమైన టర్మ్ ప్లాన్ (లెవల్ టర్మ్ఇన్సూరెన్స్) సులభమైనది. మిగిలిన వాటిల్లో తమకు ఏదైనా మరింత ప్రయోజనం అనిపిస్తే దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. లెవల్ టర్మ్ ప్లాన్‌లో కాల వ్యవధి ముగిసే వరకు ప్రీమియం మారదు. ఇంక్రీజింగ్ టర్మ్ ప్లాన్‌లో, కన్వర్టబుల్, హోల్‌లైఫ్ ప్లాన్లలో ప్రీమియం అధికంగా ఉంటుంది. సాధారణ లెవల్ టర్మ్ ప్లాన్‌తో పోల్చితే రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్‌లోనూ ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటుంది. రైడర్లు..టర్మ్ ప్లాన్‌కు అనుబంధంగా పలు రైడర్లను బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. క్రిటికల్ ఇల్నెస్ రైడర్: కేన్సర్, కాలేయ వైఫల్యం తదితర 20 నుంచి 64 వరకు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడినప్పుడు ఈ రైడర్ నుంచి ఏక మొత్తంలో పరిహారం లభిస్తుంది. ఈ రైడర్లో ఎన్నింటికి కవరేజీ అన్నది బీమా సంస్థలను బట్టి మారుతూ ఉంటుంది. వేవర్ ఆఫ్ ప్రీమియం: ప్రమాదంలో అంగవైకల్యం పాలైనా లేక తీవ్ర వ్యాధుల బారిన పడినా ఇక అక్కడి నుంచి పాలసీదారు ప్రీమియం చెల్లించే అవసరాన్ని ఇది తప్పిస్తుంది. బీమా సంస్థే మిగిలి ఉన్న కాలానికి ప్రీమియం చెల్లిస్తుంది. యాక్సిడెంటల్ డెత్, టోటల్, పర్మనెంట్ డిజేబిలిటీ రైడర్: ప్రమాదంలో మరణించినా లేదా అంగవైకల్యం పాలైనా ఈ రైడర్లో ఎంపిక చేసుకున్న మేర పరిహారం పొందొచ్చు. పరిహారం చెల్లింపు ఎలా..? పాలసీదారు మరణించినప్పుడు పరిహారం చెల్లింపులో పలు ఆప్షన్లను టర్మ్ ప్లాన్లు ఆఫర్ చేస్తుంటాయి. → ఎంపిక చేసుకున్న సమ్ అష్యూర్డ్ మొత్తాన్ని ఒకే విడత చెల్లించడం ఇందులో ఒకటి. → సమ్ అష్యూర్డ్‌లో 50 శాతాన్ని ఏకమొత్తంగా చెల్లించి, మిగిలిన 50 శాతాన్ని సమాన వాయిదాల్లో కొన్ని సంవత్సరాల పాటు చెల్లించడం మరో ఆప్షన్. → సమ్ అష్యూర్డ్‌లో కొంత మొత్తాన్ని ఒకే విడత చెల్లించి, మిగిలిన మొత్తాన్ని నెలవారీగా పెంచుతూ చెల్లించడం మూడో ఆప్షన్.చిట్కాలు→ తగినంత కవరేజీ ఎంపిక చేసుకున్న తర్వాత.. అందుకు ఏటా చెల్లించే ప్రీమియం తమ సామర్థ్యం మేరకే ఉండేలా చూసుకోవాలి. ప్రీమియం చెల్లించలేనంత భారంగా మారకూడదు. ప్రీమియం చెల్లించలేక పాలసీ మధ్య లో లాప్స్ అయ్యే రిస్క్ ఉంటుంది. అందుకని తగినంత బీమా రక్షణ ఒక్కటే కాదు, తమ చెల్లింపుల సామర్థ్యాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. → ఏదో ఒక కంపెనీ నుంచి పాలసీ తీసుకోవడం కాకుండా, వివిధ కంపెనీల మధ్య ఫీచర్లు, ప్రీమియం రేట్లను పరిశీలించి చూసుకోవాలి. → టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు అనుబంధంగా వచ్చే రైడర్లు, యాడాన్‌లను తప్పకుండా పరిశీలించాలి. ముఖ్యంగా యాక్సిడెంటల్ డిజేబిలిటీ రైడర్‌ను తీసుకోవడం ఎంతో అవసరం. → ఆఫ్‌లైన్ కంటే ఆన్లైన్లో పాలసీ తీసుకుంటే ప్రీమియంలో కొంత తగ్గింపు లభిస్తుంది. → పెరుగుతున్న జీవన అవసరాలకు అనుగుణంగా, అదనపు రుణం తీసుకున్న ప్రతి సందర్భంలో ఆ మేరకు బీమా కవరేజీని పెంచుకోవాలి. → ఎంపిక చేసుకునే బీమా సంస్థ, క్లెయిమ్‌లను ఏ మేరకు ఆమోదిస్తుందో తప్పకుండా పరిశీలించాలి. దీర్ఘకాలంలో మెరుగైన చెల్లింపుల చరిత్ర ఉన్న సంస్థను ఎంపిక చేసుకోవాలి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
3 నిమిషాలు మించి హత్తుకోకండి
వెల్లింగ్టన్: తమను విడిచి విదేశాలకు వెళ్లే వారికి ఎయిర్‌పోర్టుల్లో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు గుంపులుగా వచ్చి వీడ్కోలు చెబుతుండటం మనం చూసే ఉంటాం. ఇలా ఒక్కో ప్రయాణికుడికి వీడ్కోలు చెప్పే వారి సంఖ్య పెరుగుతుండటం, వచీ్చపోయే ద్వారాల వద్ద రద్దీ ఎక్కువవడంతో న్యూజిలాండ్‌లోని డ్యునెడిన్ ఎయిర్పోర్ట్ నిర్వాహకులు కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు. ‘‘మీ ఆప్తులకు హత్తుకుని వీడ్కోలు పలకాలంటే గరిష్టంగా మూడు నిమిషాలే హగ్ చేసుకోండి. ఇంకా ఎక్కువ సమయం మనసారా వీడ్కోలు పలకాలంటే కారు పార్కింగ్ స్థలాన్ని వినియోగించుకోండి’అని ఒక పెద్ద బోర్డ్ తగిలించింది. తమ నిర్ణయాన్ని ఎయిర్పోర్ట్ సీఈఓ డేనియర్ బోనో సమర్థించుకున్నారు. ‘‘విరహవేదన కావొచ్చు ఇంకేమైనా కావొచ్చు. ఆప్తులు దూరమవుతుంటే కౌగిలించుకుంటే ఆ బాధ కాస్తయినా తీరుతుంది. అందుకే కౌగిలించుకుంటే కేవలం 20 సెకన్లలోనే ప్రేమ హార్మోన్ ‘ఆక్సిటాసిన్’విడుదలవుతుంది. బాధ తగ్గుతుంది. అంతమాత్రాన దారిలో అడ్డుగా ఉండి అదేపనిగా హత్తుకుంటే ఇతర ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. డ్రాప్ జోన్ల వద్ద అడ్డుగా ఉండటం సబబు కాదు’అని ఆయన వాదించారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. తమ వారికి ప్రశాంతంగా కాస్తంత ఎక్కువ సమయం వీడ్కోలు చెప్పడం కూడా ఇతర ప్రయాణికులను ఇబ్బంది పెడుతుందా? అని కొందరు విమర్శలకు దిగారు. ఎయిర్పోర్ట్ నిర్ణయాన్ని కొందరు సమర్థించారు. ‘‘మిగతా దేశాల్లో కారులో లగేజీ దింపి హత్తుకుని, ఏడ్చి సాగనంపితే ఆ కొద్ది సమయానికే ‘కిస్ అండ్ ఫ్లై’చార్జీల కింద చాలా నగదు వసూలుచేస్తారు. ఈ ఎయిర్పోర్ట్ యాజమాన్యం ఎంతో మంచిది. తొలి 15 నిమిషాలు పార్కింగ్ ఉచితం’’అని ఒక ప్రయాణికుడు మెచ్చుకున్నాడు. ప్రయాణికుల వెంట వచ్చే వారిని తగ్గించేందుకు చాలా దేశాల ఎయిర్‌పోర్ట్‌లు ఆ కొద్దిసేపు కారు ఆపినందుకు కూడా చార్జీలు వసూలుచేస్తుండం గమనార్హం. బ్రిటన్‌లోని ఎస్సెక్స్ ఎయిర్పోర్ట్ యాజమాన్యం ఇందుకు 15 నిమిషాలకు దాదాపు రూ.768 వసూలుచేస్తోంది. -
అచ్యుతాపురం ప్రమాదంపై బాధితులు కన్నీటి పర్యంతం
-
‘రేణుకాస్వామి ఇంటికి వెళ్లింది రాజీ కోసం కాదు’
దొడ్డబళ్లాపురం: పరప్పన అగ్రహార జైలులో దర్శన్‌ను కలిసిన నటుడు వినోద్ రాజ్ కొన్ని రోజుల వ్యవధిలోనే రేణుకాస్వామి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించడంపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ వస్తున్నాయి. దర్శన్, రేణుకాస్వామి కుటుంబం మధ్య రాజీ చేయడానికి వినోద్‌రాజ్ వెళ్లారని వదంతులు వినిపిస్తున్నాయి.ఇందుకు సంబంధించి వివరణ ఇచ్చిన వినోద్ రాజ్...తోటి ఆర్టిస్టు అనే అభిమానంతో, దర్శన్‌తో ఉన్న అనుబంధం నేపథ్యంలో దర్శన్‌ను జైలుకు వెళ్లి కలిశానన్నారు. మానవత్వం కోణంలో ఆలోచించి ఆ కుటుంబానికి ఏమైనా సాయం చేద్దామని రేణుకాస్వామి కుటుంబ సభ్యులను కలిశానని, రాజీ కుదిర్చే ఉద్దేశం ఆలోచన తనకు లేవన్నారు. -
Hyderabad: సనత్‌నగర్‌లో తీవ్ర విషాదం
హైదరాబాద్: నగరంలోని సనత్‌నగర్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సనత్‌నగర్‌లోని జెక్ కాలనీలో ఉన్న ఆకృతి రెసిడెన్సీలో విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. వీరు విద్యుత్ షాక్‌గురై మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. వీరంతా బాత్రూమ్లో విగత జీవులై పడి ఉండటాన్ని గుర్తించారు. -
Amit Shah: ‘ఉగ్ర’ సంబందీకులకు ఉద్యోగాలు రావు
న్యూఢిల్లీ: కశ్మీర్‌పై కమ్ముకున్న ‘ఉగ్ర’ మబ్బులను చెల్లాచెదురు చేస్తున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ‘‘కశ్మీర్లో ఎవరైనా ఉగ్రవాద సంస్థల్లో చేరితే వారి కుటుంబసభ్యులు ఎన్నటికీ ప్రభుత్వోద్యోగాన్ని పొందలేరు. రాళ్లు రువ్వే ఘటనల్లో పాల్గొనే వ్యక్తుల కుటుంబాలకూ ఇదే వర్తిస్తుంది. అయితే అలాంటి వారి గురించి స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వెల్లడించే కుటుంబానికి మినహాయింపు దక్కుతుంది. ఉగ్రవాదుల మృతదేహాన్ని వారి కుటుంబానికి అప్పగిస్తే అంతిమయాత్రకు అనవసర ప్రాధాన్యం లభిస్తోంది. అందుకే ఆ ట్రెండ్‌కు ఫుల్స్టాప్ పెట్టాం. కేవలం కుటుంబసభ్యులు, ఆప్తుల సమక్షంలో అంత్యక్రియలు జరుగుతాయి. ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టినప్పుడు లొంగిపోవడానికి చాన్సిస్తాం. తల్లిదండ్రులు, భార్య, పిల్లలతో చెప్పిస్తాం. వింటే సరేసరి. లేదంటే ప్రాణాలు పోవడం ఖాయం. కేరళలో పురుడుపోసుకున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియావంటి ముస్లిం అతివాద సంస్థలను నిషేధించి వేర్పాటువాద సిద్దాంతాల వ్యాప్తిని అడ్డుకుంటున్నాం’’ అని చెప్పారు. -
విశాఖ జైలులో ఈ–ములాఖత్‌లు ప్రారంభం
ఆరిలోవ: విశాఖ జైలులో ఖైదీలు వారి కుటుంబ సభ్యులందరినీ ఒకేసారి చూసుకునే వెసులుబాటు లభించింది. ఇందుకోసం సోమవారం నుంచి ప్రత్యేకంగా ఈ–ములాఖత్‌ల విధానాన్ని జైలు అధికారులు అందుబాటులోకి తెచ్చారు. సాధారణంగా జైలులో ఉన్న ఖైదీలను వారి కుటుంబ సభ్యులు వారానికి రెండుసార్లు కలిసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల్లో కొందరికే ఈ అవకాశం ఉండేది. ములాఖత్‌కు వెళ్లిన వారి ద్వారానే మిగిలిన కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని తెలుసుకోవాల్సి వచ్చేది. ఇకపై స్వయంగా ములాఖత్‌లతో పాటు ఈ–ములాఖత్ విధానాన్ని కూడా అందుబాటులోకి తేవడంతో ఖైదీలు ఇంట్లో వారందరిని చూస్తూ వారితో మాట్లాడే అవకాశం కలుగుతుంది. ప్రత్యేక వెబ్సైట్లో దరఖాస్తు ఈ – ములాఖత్ కోసం అధికారులు ప్రత్యేకంగా వెబ్సైట్లో అప్లికేషన్‌ను రూపొందించారు. ఖైదీ కుటుంబ సభ్యులు ముందుగా ఆ వెబ్సైట్ ద్వారా ములాఖత్‌కు దరఖాస్తు చేసుకోవాలి. జైలు అధికారులు వాటిని పరిశీలించి వారికి నిర్దిష్టమైన తేదీ, సమయాన్ని కేటాయిస్తారు. ఆ వివరాలను ఖైదీకి కూడా తెలియజేస్తారు. ఆ సమయానికి ఖైదీ కంప్యూటర్లో కుటుంబ సభ్యులను చూస్తూ వారితో ముచ్చటించొచ్చు.ఇందుకోసం జైలులో కూడా ప్రత్యేకంగా కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. భౌతికంగా ములాఖత్‌కు రాలేని వారు ఇకపై ఆన్లైన్ ద్వారా అయినా వారానికి రెండుసార్లు మాట్లాడుకునే వెసులుబాటు లభించింది. ఈ–ములాఖత్ ద్వారా సోమవారం పలువురు ఖైదీలు వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించినట్లు విశాఖ జైలు సూపరింటెండెంట్ ఎస్.కిశోర్‌కుమార్ తెలిపారు. -
కేర్ వర్కర్లు కుటుంబీకుల్ని తీసుకురావద్దు
లండన్: ఇంటి పనుల్లో సాయపడే కేర్ వర్కర్లు ఇకపై తమ వెంట కుటుంబసభ్యులను బ్రిటన్‌కు తీసుకురావడానికి వీల్లేదంటూ బ్రిటన్ ప్రభుత్వం తేలి్చచెప్పింది. ఈ నూతన వలస విధానాన్ని ఈ వారం నుంచే అమలుచేసే అవకాశముంది. ఈ విషయమై బ్రిటన్ హోం శాఖ మంత్రి జేమ్స్ క్లెవెర్లీ మాట్లాడారు. ‘‘ కేర్ వీసా విధానం ద్వారా గత ఏడాది 1,00,000 మంది కేర్ వర్కర్లను బ్రిటన్‌లోకి అనుమతిచ్చాం. అయితే వారి వెంట 1,20,000 మంది డిపెండెంట్లు వచ్చారు. ఇది వీసా దుర్వినియోగాలపై మేం తీసుకుంటున్న చర్యలకు విఘాతం కల్గిస్తోంది. ఇలాంటి పరిస్థితిని అనుమతించబోం’ అని అన్నారు. దీనికి సంబంధించిన నూతన వలస విధానాన్ని గురువారమే ప్రభుత్వం పార్లమెంట్ ముందుంచనుంది. -
చంపడానికొచ్చి.. హతమయ్యాడు
మల్యాల(చొప్పదండి): ప్రేమ పేరుతో మూడేళ్లుగా వేధిస్తున్న యువకుడు.. నేరుగా ఆ యువతి ఇంటికే వెళ్లి కుటుంబ సభ్యులపై కత్తితో దాడికి తెగబడ్డాడు. యువతి కుటుంబ సభ్యులు ఆత్మరక్షణ కోసం ఆ యువకుడిపై దాడి చేయగా.. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన బోగ మహేశ్ తన దూరపు బంధువైన తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ మూడేళ్లుగా ఫోన్లో వేధిస్తున్నాడు. భరించలేని ఆ యువతి ఈనెల 2న మల్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కక్ష పెంచుకున్న మహేశ్ ఆ యువతిని చంపేందుకు కత్తితో సోమవారం మధ్యాహ్నం 2.20 గంటలకు తక్కళ్లపల్లిలోని యువతి ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయానికి మొదట యువతి తల్లి కనపడగా. ఆమెపై కత్తితో దాడికి యత్నించాడు. తప్పించుకునే క్రమంలో కత్తి ఆమె కాలికి తగిలింది. అనంతరం అక్కడే మంచంలో పడుకున్న యువతి తాతపైనా దాడి చేసి కత్తితో పొడవగా ఆయనకూ గాయాలయ్యాయి. ఈ క్రమంలో యువతి తల్లి అక్కడే ఉన్న తన తమ్ముడు నర్సయ్యతో కలిసి మహేశ్‌ని ఆపే ప్రయత్నం చేస్తుండగానే మరోసారి దాడికి యత్నించాడు. ఈ క్రమంలో ముగ్గురి మధ్య జరిగిన ఘర్షణలో మహేశ్ కింద పడిపోయాడు. అక్కడే ఉన్న బండరాయితో మహేశ్‌పై యువతి తల్లి దాడి చేయగా.. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దాడిలో గాయపడిన నర్సయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌కు తరలించారు. పంచాయితీ పెట్టించినా మారని తీరు యువతికి దూరపు బంధువు కావటంతో పరిచయం పెంచుకున్న మహేశ్.. ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ప్రేమించాలంటూ మూడేళ్లుగా వెంటపడి వేధిస్తున్నాడు. విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో రెండేళ్ల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి కొంతకాలం యువతికి ఫోన్ చేయకుండా దూరంగా ఉన్న మ హేశ్.. ఇటీవల కొద్దిరోజులుగా ఫోన్లో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు పంచాయితీ పెట్టించారు. పెద్దలతో నూ హెచ్చరించారు. అయినా అతడిలో మాత్రం మార్పు రాలేదు. యువతి జన్మదినాన్ని డెత్ డేగా మారుస్తానంటూ పోస్టులు యువతి జన్మదినం ఈనెల 6న ఉండగా.. డెత్‌డేగా మా రుస్తానంటూ మహేశ్ పోస్టులు పెడుతున్నాడు. దీంతో ఈనెల 2న పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశా మని సదరు యువతి తెలిపింది. కాగా, మహేశ్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో యువతితోపాటు తల్లి, అన్న, వది న, అమ్మమ్మ, తాతయ్యపై కేసు నమోదు చేసినట్లు మల్యా ల ఎస్సై అబ్దుల్ రహీం తెలిపారు. సంఘటన స్థలాన్ని డీ ఎస్పీ రఘుచందర్ స్థానిక పోలీసులతో కలిసి పరిశీలించా రు. యువతి ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశా రు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
పింఛనుకు సంతానాన్నీ నామినేట్ చేయొచ్చు
న్యూఢిల్లీ: మహిళా ఉద్యోగుల కుటుంబ పింఛను విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగినులు పెన్షన్ నామినీగా భర్తకు బదులుగా కుమార్తె లేదా కుమారుడి పేరును సైతం సూచించవచ్చంటూ సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు మృతి చెందిన ఉద్యోగి లేదా పింఛనుదారు జీవిత భాగస్వామికి మాత్రమే కుటుంబ పింఛను అందించేవారు. భాగస్వామి అనర్హులైన, మరణించిన సందర్భాల్లో మాత్రమే ఇతర కుటుంబసభ్యులకు పింఛను అర్హత ఉండేది. -
Air Canada: కుటుంబీకున్ని కొట్టిన బాలుడు... దారి మళ్లిన విమానం
విన్నీపెగ్: ఎయిర్ కెనడా విమానంలో ఓ 16 ఏళ్ల బాలుడు తమ కుటుంబసభ్యుడిని కొట్టడం ఆ విమానాన్ని దారి మళ్లించేందుకు దారితీసింది. విమానం టొరంటో నుంచి కాల్గరీకి బయలుదేరాక గ్రాండ్ ప్రయరీస్కు చెందిన 16 ఏళ్ల బాలుడు తమ కుటుంబానికే చెందిన ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టాడు. వారి గొడవను విమాన సిబ్బంది, తోటి ప్రయాణికులు అడ్డుకున్నారు. గాయపడిన వ్యక్తికి సిబ్బంది చికిత్స అందించారు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. అనంతరం విమానాన్ని విన్నీపెగ్కు అధికారులు దారి మళ్లించి, ఆ బాలుడిని అధికారులకు అప్పగించారు. ఇదంతా పూర్తయ్యేవరకు దాదాపు మూడు గంటలపాటు ప్రయాణికులు నిరీక్షించాల్సి వచి్చంది. అనంతరం ఆ విమానం గమ్య స్థానం వైపు బయలుదేరిందని ఎయిర్ కెనడా తెలిపింది. -
Phone Addiction: మీ సమయమంతా ఫోన్‌కే పోయిందా?
కాలం తిరిగి రాదు. కాలం విలువైనది. తెలుసు మనకు. కాని డిజిటల్ చొరబాటు పెరిగాక సమయమంతా ఫోన్‌కే పోయిందా? ఒక ఇంట్లో భార్య 3 గంటలు, భర్త 3 గంటలు, పిల్లలు చెరి 3 గంటలు ఫోన్ వాడితే రోజులో 12 విలువైన గంటలు నాశనమైపోతాయి. 2023లో మీ కుటుంబం మొత్తం కనీసం 180 రోజులు ఫోన్లో వృథా చేసింది. 2024లో మీ సమయం మీరు పొందగలరా? ఏదో సినిమాలో ‘నేనొక వంద రూపాయల అవినీతి చేస్తే తప్పేంటి?’ అని విలన్ అంటే, ‘అలా వంద రూపాయల అవినీతి కోటి మంది చేస్తే చిన్న తప్పు అవుతుందా?’ అని హీరో ప్రశ్నిస్తాడు. సేమ్. ‘ఇంట్లో కాసేపు ఫోన్ చూస్తే తప్పేంటి?’ అని తల్లో, తండ్రో, కొడుకో, కూతురో అనుకోవచ్చు. ‘మీ అందరూ కలిసి చాలా టైమ్ వేస్ట్ చేయడం తప్పే’ అని సమాధానం చెప్పాల్సి వస్తుంది. టైమ్‌ను సద్వినియోగం చేస్తే చాలా పనులు అవుతాయి. దుర్వినియోగం చేస్తే చాలా నష్టాలు తప్పక జరుగుతాయి. ఇటీవల చాలా స్కూళ్లల్లో పిల్లలు సరిగ్గా ఎగ్జామ్స్ రాయడం లేదని టీచర్లు మొత్తుకుంటున్నారు. దానికి కారణం పిల్లలు ఎగ్జామ్స్‌కు చదవడానికి కూచుని ఫోన్లు చూస్తున్నారని అర్థమవుతోంది. కరోనా వల్ల జరిగిన చాలా నష్టాల్లో పిల్లలకు ఫోన్లు అలవాటు కావడం ఒకటి. వాళ్లు ఫోన్లకు అడిక్ట్ అవడం వారి భవిష్యత్తునే ప్రభావితం చేస్తోంది. పిల్లల్ని ఫోన్లు చూడొద్దని చెప్పే నైతిక హక్కు తల్లిదండ్రులకు ఎప్పుడు వస్తుంది? వాళ్లు ఫోన్లు చూడనప్పుడు. కాని తల్లిదండ్రులు పిల్లల కంటే ఎక్కువగా ఫోన్లకు అలవాటు పడి ఉన్నారు. మానసిక, శారీరక, కౌటుంబిక, ఆర్థిక, అనుబంధ జీవనాలన్నింటికీ ఈ ఫోన్ వల్ల వృథా అవుతున్న సమయం చావు దెబ్బ తీస్తోంది. ఫోన్ ఎందుకు? కాల్స్ మాట్లాడేందుకు. ఏ మనిషికైనా రోజులో ఐదారు కాల్స్ మాట్లాడే అవసరం ఉంటుంది. ఉద్యోగాల్లో వృత్తిగతమైన కాల్స్ ఆఫీస్ టైమ్ కిందకే వస్తాయి. కాని ప్రయివేట్ టైమ్‌లో ఫోన్లు– అవసరమైనవి మాత్రమే తీసుకుంటే ఐదారు మించవు. మరి ఫోన్లకు ఇవాళ ఎలా వాడుతున్నారు? ఫోనులోని ఏవేవి మీ సమయాన్ని తీసుకుంటున్నాయి? 1. వాట్సాప్, 2.యూట్యూబ్, 3. రీల్స్ 4. ఫేస్బుక్, 5. ఓటీటీ యాప్స్ 6. ‘ఎక్స్’(ట్విటర్) 7.ఇన్‌స్టా ఇప్పుడు 2023లో వీటి ద్వారా నిజంగా మీరు పొందిన జ్ఞానం ఎంత? ప్రయోజనం ఎంత? లాభం ఎంత? ఆలోచించండి. వీటిని చూడటం వల్ల ఆర్థికంగా ఏమైనా ఉపయోగం జరిగిందా? ఆరోగ్య పరంగా ఏదైనా ఉపయోగం జరిగిందా? ఉద్యోగాలు వచ్చాయా? ప్రమోషన్లు సమకూరాయా? పిల్లలకు ర్యాంకులు వచ్చాయా? కెరీర్, విద్య కోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తే సరే. లేకుండా ఊరికే కాలక్షేపం కోసం ఫోన్‌ను స్క్రోల్ చేస్తూ రోజులు దొర్లించేస్తే ఏం సాధించినట్టు? ‘తేనెలో భార్యాభర్తల ఫొటో కూరితే వారు అన్యోన్యంగా ఉంటారు’, ‘షూటింగ్ మధ్యలో హీరో హీరోయిన్‌తో ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు’, ‘మా హోమ్టూర్కు రెడీయా?’... ఇలాంటి వీడియోలు, పిచ్చి నృత్యాల రీల్స్... వీటితో సమయం వృధా అయిపోతోంది ఫోన్ వల్ల. క్రైమ్, సస్పెన్స్, హారర్ వెబ్ సిరీస్‌లు బింజ్వాచ్ చేస్తే సమయం మొత్తం వృథా. గేమ్స్‌లో కూరుకు పోతే, ఫోన్లో బెట్టింగ్‌లకు అలవాటు పడితే, ఆన్లైన్ ట్రేడింగ్‌కు అడిక్ట్ అయితే, పోర్న్ వీడియోలు వదల్లేకపోతే... సమయం వృథా, వృథా, వృథా. పుస్తకం మనం ఎంచుకుని చదివేది. ఫోన్ అదేం చూపాలనుకుంటే అది చూపేది. కుటుంబం మొత్తం కలిసి ఏదైనా రెస్టరెంట్‌కు వెళితే కుటుంబ సభ్యులు నలుగురూ ఫోన్లు చూసుకుంటూ కూచుని ఉంటే కనుక అది ఏ మాత్రం కమ్యూనికేషన్ ఉన్న కుటుంబం కాదు. ప్రతి ఒక్కరూ సంబంధం లేని కంటెంట్‌తో కమ్యూనికేషన్లో ఉన్నట్టు. కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం, వ్యాయామానికి ఇవ్వాల్సిన సమయం, స్నేహితులను పరామర్శించుకోవడానికి ఇవ్వాల్సిన సమయం, డాక్యుమెంట్స్ చక్కదిద్దుకోవాల్సిన సమయం, బ్యాంకు లావాదేవీలు.. పాలసీలు సరి చేసుకోవాల్సిన సమయం, సంపాదన మెరుగు పర్చుకోవాల్సిన సమయం, డబ్బు ఆదా కోసం వెచ్చించాల్సిన సమయం, పిల్లల్ని చదివించాల్సిన సమయం, భార్యాభర్తలు కలిసి మాట్లాడుకోవాల్సిన సమయం మొత్తం ఫోన్ల వల్ల, సోషల్ మీడియా వల్ల 2023లో ఎంత వృథా అయ్యిందో ఆలోచిస్తే 2024ను సరిగ్గా ఆహ్వానించగలుగుతారు. 2024వ సంవత్సరం విలువైన కాలాన్ని వెంటబెట్టుకుని వస్తోంది. సద్వినియోగం చేసుకోండి. -
ఆస్తుల బదిలీ.. ఇలా ఈజీ!
కుటుంబ సభ్యుల ఆర్థిక భద్రత ప్రతి ఒక్కరికీ ప్రథమ ప్రాధాన్యంగా ఉండాలి. జీవితాంతం ఎంతో కష్టించి, ఆస్తులు, సంపద కూడబెట్టుకోవడంతోనే సరికాదు. తమ వారికి సాఫీగా బదిలీ అయ్యేలా చర్యలు తీసుకున్నప్పుడే ఆకాంక్ష ఫలిస్తుంది. ఒక ఆస్తికి ఒకటికి మించిన వారసులు ఉంటే పంపకం సమస్యగా మారకూడదు. క్లిష్టమైన కుటుంబ నిర్మాణం ఉన్న వారు ఈ విషయంలో ముందుచూపుతో వ్యవహరించాల్సిందే. దురదృష్టవశాత్తూ తమకు ఏదైనా జరిగితే, తమ పేరిట ఉన్న ఆస్తులు వారసులకు సాఫీగా బదిలీ అయ్యేది ఎలా? ఆస్తులకు సంబంధించి వివాదాలు ఏర్పడకుండా చూసుకునేది ఎలా..? ఎస్టేట్ (ఆస్తి) ప్లానింగ్ ఇందుకు పరిష్కారం అవుతుంది. వీలునామా రాస్తే సరిపోతుందిలే అనుకోవద్దు. దీనికంటే మెరుగైనది కుటుంబ ట్రస్ట్. ఆస్తులనే కాకుండా, కుటుంబ వ్యాపారాల సాఫీ పంపిణీ సైతం ఎస్టేట్ ప్లానింగ్‌తో సాధ్యపడుతుంది. ఎస్టేట్ ప్లానింగ్ అంటే..? ఆస్తుల పంపకాన్నే ఎస్టేట్ ప్లానింగ్‌గా చెబుతారు. తమ మరణానంతరం కుటుంబ సభ్యులకు ఆస్తులు ఎలా పంపిణీ చేయాలన్నది ఇందులో ఉంటుంది. తమ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటే కుటుంబ వ్యాపారానికి ఎవరు నాయకత్వం వహించాలి? అనే వివరాలు కూడా ఇందులో భాగమే. ప్లాట్లు, ఇళ్లు, పొలాలు, బంగారం, ఆభరణాలు, బ్యాంక్ బ్యాలన్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నింటికీ ఇందులో చోటు ఉంటుంది. కాయిన్లు, పెయింటింగ్‌లు తదితర అన్నింటి పంపిణీని ఎస్టేట్ ప్లానింగ్‌తో సులభతరం చేసుకోవచ్చు. ట్రస్ట్ ఏర్పాటు కొన్ని కుటుంబాల నిర్మాణం సంక్లిష్టంగా ఉంటుంది. అలాగే, కొన్ని పెద్ద కుంటుంబాలు ఉంటాయి. మొదటి వివాహం ద్వారా పిల్లలు ఉండి, తర్వాత రెండో వివాహం ద్వారా పిల్లలు కన్న వారికి ఆస్తుల పంపిణీలో సహజంగా వివాదాలు ఏర్పడుతుంటాయి. అలాగే, ప్రత్యేక అవసరాల (దివ్యాంగులు) వారూ ఉండొచ్చు. అలాంటి వారికి ఆస్తుల పంపిణీని తమ ఇష్ట ప్రకారం చేసుకోవాలంటే అందుకు వీలునామా లేదా ఫ్యామిలీ ట్రస్ట్ మార్గాలవుతాయి. తమ సంపద సాఫీగా బదిలీ అయ్యేందుకు ట్రస్ట్ వీలు కలి్పస్తుంది. ట్రస్ట్ అంటే ధర్మనిధి. ట్రస్ట్ ఏర్పాటు చేసే వ్యక్తికి, ధర్మ కర్తలకు మధ్య ఒప్పందమే ట్రస్ట్ డీడ్. దీని ద్వారా తనకు సంబంధించిన ఆస్తులను ధర్మకర్తలకు అప్పగిస్తారు. ట్రస్ట్ ఏర్పాటు చేసిన వ్యక్తి మరణానంతరం ట్రస్ట్ డీడ్‌లో పేర్కొన్న విధంగా ఆస్తుల బదిలీ పూర్తి చేయాల్సిన బాధ్యత ట్రస్ట్ నిర్వాహకులపై ఉంటుంది. ట్రస్ట్ ఏర్పాటు చేయాలని అనుకునే వారు ట్రస్ట్ డీడ్ రాయాల్సి ఉంటుంది. సంపదను ఎలా బదిలీ చేయాలన్నది అందులో స్పష్టంగా పేర్కొనాలి. స్థిర, చరాస్తులను ట్రస్ట్‌కు బదిలీ చేయాలి. ట్రస్ట్ డీడ్ రాసిన తర్వాత దాని నిర్వహణకు ట్రస్టీ (ధర్మకర్త)ని నియమించాలి. స్టాంప్ డ్యూటీ చెల్లించి, ట్రస్ట్‌ను రిజి్రస్టార్ కార్యాలయం వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. ట్రస్ట్ ఏర్పాటు ఉద్దేశాన్ని ట్రస్ట్ డీడ్ తెలియజేయాలి. దీని ఏర్పాటు ఉద్దేశం, ఎలా పనిచేయాలన్నది స్పష్టంగా పేర్కొనాలి. ట్రస్టీ లేదంటే ట్రస్టీలుగా ఎవరిని నియమించాలి? అన్న సందేహం రావచ్చు. స్నేహితులు లేదా బంధువులను ట్రస్టీలుగా నియమించుకోవచ్చు. లేదా కార్పొరేట్ సంస్థను అయినా ట్రస్టీగా నియమించొచ్చు. కొన్ని కార్పొరేట్ సంస్థలు ట్రస్ట్ సేవలను అందిస్తున్నాయి. ట్రస్ట్ వ్యవస్థాపకుడు మరణించినా లేదా తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురైన సందర్భాల్లో ఆస్తులను ఎలా వినియోగించుకోవాలన్న సూచనలను ట్రస్ట్ డీడ్‌లో పేర్కొనొచ్చు. అలాగే, ధర్మకర్త జీవించి లేకపోయినా లేక రిటైర్మెంట్ తీసుకున్నా.. తదుపరి ట్రస్టీగా ఎవరు వ్యవహరించాలన్నది కూడా టస్ట్ర్ డీడ్‌లో పేర్కొనాలి. వీలునామా.. కోర్టు విచారణలు! వీలునామా గురించే ఎక్కువ మందికి తెలుసు. సులభమైన, మెరుగైన సాధనమని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇందులో కొన్ని ప్రతికూలతలు లేకపోలేదు. వీలునామా రిజిస్టర్ చేసినా, చేయకపోయినా దాన్ని కోర్టుల్లో సవాలు చేయవచ్చు. వీలునామా అనేది కేవలం వ్యక్తి మరణానంతరం అమల్లోకి వచ్చే పత్రం. వైకల్యం లేదా తీవ్ర అనారోగ్యం బారిన పడిన సందర్భాల్లో వీలునామా పని చేయదు. మరణించిన వ్యక్తి ఆస్తుల బదిలీకి సంబంధించినదే కానీ, ఆ ఆస్తుల నిర్వహణకు సంబంధించినది కాదు. వీలునామా కింద లబి్ధదారులు హక్కులను కోర్టులో నిరూపించుకోవాల్సి వస్తుంది. ఇందుకు ఆరు నెలల నుంచి ఏడాది సమయం పట్టొచ్చు. అప్పటి వరకు ఆ ఆస్తులను వినియోగించుకోవడానికి వీలు పడదు. మోసం, ఫోర్జరీ, ఒత్తిడితో రాయించినట్టు లేదా మానసిక వైకల్యంతో బాధపడుతున్న సమయంలో రాయించినట్టు, తెలియకుండా రాయించుకున్నట్టు తదితర ఆరోపణలపై వీలునామాను కోర్టులో సవాలు చేయవచ్చు. వీలునామాను రిజిస్టర్ చేసినంత మాత్రాన అది చట్టబద్ధంగా చెల్లుబాటు అయిపోతుందని అనుకోవడం పొరపాటు. రిజిస్టర్ చేయించిన వీలునామా సైతం కోర్టుల విచారణ పరిధిలోకి వస్తుంది. మనదేశంలో ఎస్టేట్ ప్లానింగ్ కోసం హిందు అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) ఏర్పాటును కొంత మంది అనుసరిస్తుంటారు. ఇది పన్నుకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాటు. ఒక్కసారి హెచ్‌యూఎఫ్ రిజిస్టర్ చేసి, ఆస్తులు దానికి బదలాయించారంటే.. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు దఖలు పడతాయి. హెచ్‌యూఎఫ్ పరిధిలోని ఆస్తులను విభజించడం వివాదాలు, కోర్టు కేసులకు దారితీయవచ్చు. వీటన్నింటిలోకి మెరుగైనది ఫ్యామిలీ ట్రస్ట్. పిల్లలకు కూడా.. మైనర్ చిన్నారులు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఎస్టేట్ ప్లానింగ్ ప్రయోజనకరంగా ఉంటుంది. తాము లేని రోజున తమ పిల్లల బాధ్యతను బంధువులపై మోపడం.. వారు చూస్తారని ఆశించడం అన్ని సందర్భాల్లో సరైనది అనిపించుకోదు. ఇది పూర్తిస్థాయి, పెద్ద బాధ్యత. ట్రస్ట్ ఏర్పాటు చేసి, దాని నిర్వహణ బాధ్యతను కార్పొరేట్ ట్రస్టీకి అప్పగించడం మెరుగైనది అవుతుంది. కార్పొరేట్ ట్రస్టీ అయితే.. ప్రత్యేక అవసరాల పిల్లలకు (దివ్యాంగులు) పూర్తి సమయం పాటు సహాయకుడు/సహాయకురాలిని అందుబాటులో ఉంచుతారు. అలాగే వంట మనిíÙ, వైద్య సాయం సహాయకులు, స్పెషలిస్ట్ డాక్టర్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. పిల్లలు సాధారణంగా తమ హక్కులను క్లెయిమ్ చేసుకోలేరు. అందుకుని వీలునామా రాస్తే, దాని నిర్వహణ బాధ్యతను ఒకరికి అప్పగించాల్సి వస్తుంది. అందుకే వీలునామాలో ఉన్న ప్రతికూలతల దృష్ట్యా పిల్లల కోసం ఫ్యామిలీ ట్రస్ట్ మెరుగైనది అవుతుంది. ఎవరికి అవసరం..? నిజానికి ఎస్టేట్ ప్లానింగ్ లేదా వీలునామా అనేవి సంపన్నులకేనన్న ఒక అపోహ నెలకొంది. ఇది నిజం కాదు. ప్రతి ఒక్కరికీ ఇది ఎంతగానో సాయపడుతుంది. తమ పేరిట ఆస్తులు ఉన్నా, లేదా అప్పులు ఉన్నా సరే ఎస్టేట్ ప్లానింగ్‌తో వారసులకు మార్గం స్పష్టంగా మారుతుంది. అకాల మరణం ఎదురైతే, తమ పేరిట ఉన్న ఆస్తులు ఎలా పంచాలి? అప్పులు ఎలా తీర్చాలి? ఏ ఆస్తి విక్రయించి అప్పు చెల్లించాలి? వీటికి ఎవరు బాధ్యత వహించాలి? ఇలాంటి వాటికి స్పష్టత ఇవ్వొచ్చు. నిజానికి మనలో 90 శాతం మంది ఆస్తులకు సంబంధించి భవిష్యత్ ప్రణాళిక గురించి ఆలోచించరు. వీలునామా కూడా రాయరు. తాము క్షేమంగా ఉన్నందున, మరణం గురించి చర్చించడం, ఆస్తులపై చర్చను కోరుకోకపోవడం వల్ల ప్రణాళికకు దూరంగా ఉంటుంటారు. నిజానికి ఎంతో ముఖ్యమైన ఈ పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదు. దీనివల్ల ఉపయోగాలే కానీ, నష్టం ఉండదు. కనుక ప్రతి ఒక్కరూ దీనికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. మార్గాలు.. నామినేషన్, వీలునామా (విల్లు), ఫ్యామిలీ ట్రస్ట్ ఇవన్నీ ఎస్టేట్ ప్లానింగ్‌లో పలు రకాల సాధనాలు. ఆర్థిక సాధనాలకు నామినేషన్ సదుపాయం ఉంటుంది. సంబంధిత ఆస్తి ఎవరికి వెళ్లాలని అనుకుంటే వారి పేరును నామినీగా నమోదు చేసుకోవచ్చు. కానీ, అన్నింటికీ నామినేషన్ సదుపాయం ఉండదు. ముఖ్యంగా స్థిరాస్తులకు నామినేషన్ చేసుకోలేరు. కనుక అన్నింటికీ పరిష్కారంగా ఫ్యామిలీ ట్రస్ట్ అక్కరకు వస్తుంది. ఇలాంటి ఏర్పాట్లు ఏవీ లేకుండా ఓ కుటుంబ యజమాని మరణించిన సందర్భాల్లో లేదా వారసులు కాని వ్యక్తి నామినీగా ఉండి వివాదాలు ఏర్పడిన సందర్భాల్లో.. ఆస్తుల పంపిణీ అన్నది ఆయా మతస్థుల వారసత్వ చట్టం ప్రకారం చేసుకోవాల్సి వస్తుంది. దీనికి కోర్టులను ఆశ్రయించాల్సిందే. హిందూ వారసత్వ చట్టం ప్రకారమైతే మరణించిన వ్యక్తి జీవిత భాగస్వామి, అతని తల్లి, పిల్లలకు సమానంగా ఆస్తులు బదిలీ చేసుకోవాలి. ఈ విషయంలో వివాదం ఏర్పడితే అప్పుడు పరిష్కారానికి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇది నిజం కాదు.. ట్రస్ట్ ఏర్పాటు చేస్తే, తమ ఆస్తులన్నీ ట్రస్టీ నిర్వహణలోకి వెళ్లిపోతాయని, వాటిపై తాము నియంత్రణ కోల్పోతామనే అపోహ ఉంది. ట్రస్ట్ ఏర్పాటు చేసి, దానికి తమ ఆస్తులను బదిలీ చేసిన తర్వాత అప్పుడు ట్రస్టీయే యజమాని అవుతారు. నిజానికి ట్రస్ట్ డీల్‌లో పేర్కొన్న మేరకు బాధ్యతలను నిర్వహించడమే ట్రస్టీ పని. అంతేకానీ, సంబంధిత ట్రస్ట్ నిర్వహణలోని ఆస్తులను వినియోగించుకునే, అనుభవించే హక్కులు ట్రస్టీలకు ఉండవు. కేవలం ట్రస్ట్ డీడ్‌లో పేర్కొన్న లబి్ధదారుల ప్రయోజనాల కోసమే ఆ ఆస్తులను వినియోగించాల్సి ఉంటుంది. ట్రస్ట్ ఏర్పాటు చేసిన వారు జీవించి ఉన్నంత వరకు బదిలీ చేసిన ఆస్తులు, ట్రస్ట్ కార్యకలాపాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. నేడు పలు ప్రొఫెషనల్ ట్రస్ట్ ఏజెన్సీలు ట్రస్టీ సేవలను అందిస్తున్నాయి. అవి ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరిస్తాయి. ట్రస్ట్ డీడ్‌కు పూర్తి స్థాయి నిర్వాహకుడి మాదిరే పనిచేస్తాయి. -
ముగ్గురు బంధువులను కాల్చి చంపిన భారతీయ విద్యార్థి
న్యూయార్క్: అమెరికాలో ఓ భారతీయ విద్యార్థి కిరాతక ఘటనకు పాల్పడ్డాడు. తన తాత, అవ్వ, మామలను ఒకేసారి తుపాకీతో కాల్చి హత్య చేశాడు. న్యూజెర్సీలోని ఓ అపార్ట్మెంట్లో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఓం బ్రహ్మభట్ (23) అనే యువకుడు దిలీప్‌కుమార్ బ్రహ్మభట్ (72), బిందు బ్రహ్మభట్ (72), యశ్‌కుమార్ బ్రహ్మభట్ (38)లను కాల్చి చంపాడు. గుజరాత్ నుంచి వలస వచ్చిన నిందితుడు బంధువులతో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలో బంధువులతో అతనికి వాగ్వాదం జరిగింది. విచక్షణ కోల్పోయిన బ్రహ్మభట్.. వారిని తుపాకీతో కాల్చాడు. దీంతో బాధితులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన జరిగిన ప్రదేశంలోనే నిందితుడు ఉన్నాడని పోలీసులు చెప్పారు. కాల్పులకు ఉపయోగించిన తుపాకీని ఆన్లైన్లో కొనుగోలు చేసినట్లు నిందితుడు తెలిపాడని వెల్లడించారు. ఇదీ చదవండి: రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. ఏడుగురు కూలీలు మృతి -
కుటుంబం మద్దతుతోనే ఉద్యోగంలో రాణింపు
ముంబై: ఇంట్లో వాతావరణం సరిగ్గా లేకపోతే ఆ ప్రభావం ఉద్యోగంపైనా పడుతుందని మెజారిటీ ఉద్యోగులు అంటున్నారు. ఇంట్లో సరిగ్గా లేని రోజు ఉద్యోగంలోనూ అదే మాదిరిగా ఉంటుందని జీనియస్ కన్సల్టెంట్స్ అనే మానవ వనరుల సేవల సంస్థ నిర్వహించిన సర్వేలో మూడింట రెండొంతుల మంది చెప్పారు. చక్కని ఉద్యోగ/వృత్తి జీవితానికి, పనిలో ఉత్పాదకతకు కుటుంబం మద్దతు ఎంత ముఖ్యమో ఈ సర్వే గుర్తు చేసింది. వ్యక్తిగత జీవితంలో కష్టాలు/అశాంతి అనేవి కార్యాలయంలో ఒత్తిడితో కూడిన వాతావరణానికి దారితీస్తాయని, ఫలితంగా సామర్థ్యం తగ్గిపోతుందని సర్వేలో 69 శాతం మంది చెప్పారు. ఉద్యోగ–వ్యక్తిగత జీవితం మధ్య అంతర్గత అనుసంధానత ఉంటుందని, ఒక దాని ప్రభావం మరోదానిపై పడుతుందన్న అభిప్రాయం వినిపించింది. ఆగస్ట్ 20 నుంచి సెపె్టంబర్ 26 మధ్య 1,088 మంది వృత్తి నిపుణులను ప్రశ్నించి, జీనియస్ కన్సల్టెంట్స్ ఈ వివరాలు విడుదల చేసింది. బీఎఫ్ఎస్ఐ, నిర్మాణం, ఇంజనీరింగ్, విద్య, ఎఫ్ఎంసీజీ, ఆతిథ్యం, హెచ్ఆర్ సేవలు, ఐటీ, ఐటీఈఎస్, బీపీవో, లాజిస్టిక్స్, తయారీ, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా తదితర రంగాల్లో పనిచేసే వారు ఇందులో ఉన్నారు. నియమ రహితంగా, అస్తవ్యస్థంగా ఉండే వ్యక్తిగత జీవితం, పనిలోనూ అదే ధోరణికి దారితీస్తుందని ఈ సర్వే తేల్చి చెప్పింది. పనిలో వృత్తి నైపుణ్యాలు చూపించి, రాణించాలంటే.. వ్యక్తిగత జీవితం క్రమశిక్షణగా, నియమబద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. ► కుటుంబం మద్దతు ఉంటే ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుందని 70 శాతం మంది చెప్పారు. ► కుటుంబం మద్దతు ఉంటే పనిలో సామర్థ్యాల పెరుగుదలకు సాయపడుతుందని 15 శాతం మంది చెప్పారు. ఉద్యోగంలో ఎదుగుదలకు అనుకూలిస్తుందని 6 శాతం మంది తెలిపారు. ► పని ప్రదేశంలో ప్రశాంత వాతావరణం ఉండాలని 15 శాతం మంది చెప్పగా, పని ప్రాంతంలో గోప్యత అవసరమని 2 శాతం మంది పేర్కొన్నారు. ► మొత్తం మీద కుటుంబం మద్దతు ఉంటే ఉద్యోగంలో మెరుగ్గా రాణిస్తామని 71 శాతం మంది చెప్పారు. -
Rajasthan Assembly elections 2023: పతుల కోసం సతుల ఆరాటం
సాక్షి, న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గెలుపే లక్ష్యంగా పైచేయి సాధించేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రచారపర్వంలో కేవలం అభ్యర్థులు మాత్రమే కాకుండా వారి కుటుంబసభ్యులు సైతం ప్రజల మద్దతు కూడగట్టుకొనేందుకు ఇల్లిల్లూ తిరుగుతున్నారు. దక్షిణ రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌తో పాటు మేవాడ్, వగడ్ ప్రాంతాలలోని రాజ్‌సమంద్, చిత్తోడ్‌గఢ్, దుంగార్పూర్, బాన్స్వాడా, ప్రతాప్గఢ్ల్లోని 28 అసెంబ్లీ స్థానాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఏడుగురికి ఇద్దరు భార్యలున్నారు. వారంతా భర్తల గెలుపు కోసం ప్రచారంలో బిజీగా ఉన్నారు. ప్రతాప్‌గఢ్‌లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ఇద్దరేసి భార్యలున్నారు. ఈ అభ్యర్థుల భార్యలిద్దరూ ఇటీవల జరిగిన కర్వా చౌత్ పండుగను కలిసి ఉత్సాహంగా జరుపుకున్నారు. అంతేగాక ఇటీవల దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లోనూ ఈ ఏడుగురు అభ్యర్థులందరూ తమ ఇద్దరు భార్యల గురించి పేర్కొన్నారు. వీరిలో ఉదయ్‌పూర్ జిల్లాలోని వల్లభ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఉదయ్‌లాల్ డాంగి, ఖేర్వారా నుంచి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ దయారామ్ పర్మార్, ఝాడోల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి హీరాలాల్ దరంగి, ప్రతాప్‌గఢ్ జిల్లాలోని ప్రతాప్‌గఢ్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి హేమంత్ మీనా, కాంగ్రెస్ అభ్యర్థి రాంలాల్ మీనాల భార్యలు పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో ప్రజల మధ్యకు వెళ్లి తమ తమ భర్తలకు అనుకూలంగా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాక వగడ్ ప్రాంతంలోని బాన్స్వాడా జిల్లా గర్హి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి కైలాశ్ చంద్ర మీనా, ఘటోల్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నానాలాల్ నినామాకు కూడా ఇద్దరేసి భార్యలు ఉన్నారు. హిందూ వివాహ చట్టం ప్రకారం ఒక వివాహం మాత్రమే చెల్లుబాటు అయినప్పటికీ, రాజస్తాన్ గిరిజనులలో బహుభార్యత్వం ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. -
టీమిండియా స్పిన్ దిగ్గజం బిషన్ సింగ్ బేడీకి కుటుంబ సభ్యుల నివాళులు
-
అతడు.. ఆ ఆరుగురిలో సజీవం
లబ్బీపేట(విజయవాడ తూర్పు)/గన్నవరం/తిరుపతి తుడా: తనువు చాలించినా.. అవయవాల దానంతో ఆరుగురు జీవితాల్లో వెలుగులు నింపాడు 23 ఏళ్ల యువకుడు గారపాటి జయప్రకాష్. కొడుకు ఇక లేడన్న చేదు నిజం గుండెలను పిండేస్తున్నా.. పుట్టెడు దుఃఖంలో కూడా అతడి కుటుంబ సభ్యులు తీసుకున్న అవయవదానం నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే... కృష్ణాజిల్లా మొవ్వ మండలం చినముత్తేవి గ్రామానికి చెందిన గారపాటి జయప్రకాష్ (23) ఈ నెల 25న నిడుమోలు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు బలమైన గాయం కావడంతో ఆయుష్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. చిన్న వయసులోనే తమ బిడ్డ దూరమైనా, కనీసం ఇతరుల జీవితాల్లో అయినా వెలుగులు నింపాలని భావించిన ఆ తల్లిదండ్రులు తమ కుమారుడి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. జయ ప్రకాష్ గుండెను తిరుపతిలోని పద్మావతి ఆస్పత్రికి, లివర్, ఒక కిడ్నీని తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి, మరో కిడ్నీని విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రికి, కళ్లను విజయవాడలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలించారు. గుండెను తిరుపతి తరలించేందుకు ఆయుష్ ఆస్పత్రి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టు వరకు పోలీసులు గ్రీన్‌చానల్ ఏర్పాటు చేశారు. 32 ఏళ్ల యువకుడికి గుండె మార్పిడి వైఎస్సార్ కడప జిల్లా వేముల ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల యువకుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గుండె సంబంధిత సమస్యతో తిరుపతిలోని శ్రీపద్మావతి గుండె చికిత్సాలయంలో చేరాడు. గుండె మారి్పడి అనివార్యమని నిర్ధారించి తాత్కాలిక చికిత్సను ప్రారంభించారు. ఈ క్రమంలో జయప్రకాష్ అవయవదానం విషయమై శ్రీపద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్ డైరెక్టర్ శ్రీనాథ్‌రెడ్డికి సమాచారం అందింది. సంబంధిత వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపగా వారు అనుమతి మంజూరు చేశారు. గుండె మార్పిడి చికిత్సకు అవసరమైన రూ.12 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా విడుదల చేశారు. ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గుండెను తిరుపతికి తరలించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి గ్రీన్ చానల్ ద్వారా పద్మావతి కార్డియాక్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శనివారం రాత్రి వైద్య బృందం సుదీర్ఘంగా శ్రమించి విజయవంతంగా గుండె మార్పిడిని పూర్తి చేశారు. యువకుడికి పునర్జన్మను ప్రసాదించారు. అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మ ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మ లభించింది. శ్రీకాకుళానికి చెందిన బి.రామరాజు, లావణ్య దంపతుల కుమారుడు బి.కృష్ణశ్రావణ్ (17) ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఈ నెల 25న స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో విశాఖపట్నం ఎంవీపీ కాలనీ మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. శ్రావణ్‌కు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర దుఖఃలోనూ శ్రావణ్ తల్లిదండ్రులు అవయవదానం చేసేందుకు ముందుకొచ్చారు. ఒక కిడ్నీ మెడికవర్ ఆస్పత్రికి, మరో కిడ్నీ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్
సాక్షి, వరంగల్: ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ఆమె కుటుంబం స్పష్టం చేసింది. ప్రవళిక తల్లి విజయ, సోదరుడు ప్రణయ్ వీడియో రిలీజ్ చేశారు. శివరామ్ వేధింపుల వల్లే తన సోదరి ఆత్మహత్య చేసుకుందని ప్రవళిక అన్న ప్రణయ్ అన్నారు. తమ చెల్లి హాస్టల్లో చదువుకోవడానికి వెళ్లినప్పుడు వేధింపులకు గురి చేశారని, ఫ్రెండ్స్ ఫోన్లతో పాటు వేరే ఇతర నంబర్ల నుంచి కాల్స్ చేసి ఇబ్బందులకు గురిచేశాడని, దాంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక తన చెల్లి సూసైడ్ చేసుకుందని సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు. శివరామ్‌ను కఠినంగా శిక్షించాలన్నారు. రాజకీయాల్లోకి తమ కుటుంబాన్ని లాగొద్దని ప్రవళిక తల్లి, సోదరుడు విజ్ఞప్తి చేశారు. కాగా, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ ఆత్మహత్యకు పాల్పడిన మర్రి ప్రవళిక కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రియుడు తనని కాదని మరొకరితో వివాహానికి సిద్ధం కావడంతో మనస్తాపం చెంది ఆమె సూసైడ్ చేసుకుందని సెంట్రల్ జోన్ డీసీపీ ఎం. వెంకటేశ్వర్లు తెలిపారు. చదవండి: బతుకమ్మకు వస్తనంటివి బిడ్డా.. -
ఆ మహిళలు.. పేరుకే సర్పంచులు
రాంచీ: మహిళా సాధికారత సాధనకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో చూస్తే మాత్రం మహిళల భాగస్వామ్యం అంతంతమాత్రంగానే ఉంటోంది. జార్ఖండ్‌లో చేపట్టిన సర్వేలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో మహిళలకు సగం సీట్లు కేటాయించారు. ధన్‌బాద్ జిల్లాలో 95 మంది మహిళా సర్పంచులున్నారు. తమ ఫోన్‌కాల్‌కు వీరిలో 11 మంది సర్పంచులు మాత్రమే స్వయంగా స్పందించినట్లు సర్వే నిర్వాహకులు తెలిపారు. మిగతా 84 మందిలో సర్పంచుల భర్తలో, మరుదులో, లేక ఆమె కుటుంబంలోని ముఖ్యులో ఆ ఫోన్ కాల్లకు స్పందించారు. అధికారులు ఏర్పాటు చేసిన సమావేశాలకు సైతం సర్పంచులకు బదులుగా వారి భర్తలు, ఇతర కుటుంబసభ్యులే హాజరవుతున్నట్లు కూడా ఈ సర్వేలో తేలింది. బ్లాక్, సబ్ డివిజిన్, జిల్లా స్థాయి సర్పంచుల సమావేశాలకు హాజరై వీరు తమను ఫలానా గ్రామ సర్పంచి భర్త అనో లేక ఇతర కుటుంబ సభ్యులమనో పరిచయం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇకపై అధికారులు ఏర్పాటు చేసే సమావేశాలకు మహిళా సర్పంచులు మాత్రమే హాజరు కావాలని స్పష్టం చేసింది. వారికి బదులుగా కుటుంబసభ్యులను, ఇతరులను లోపలికి రానివ్వద్దంటూ అధికారులను ఆదేశించాల్సి వచ్చింది! -
చంద్రబాబుతో కుటుంబ సభ్యుల కీలక భేటీ
-
అత్యంత గౌరవంగా
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో అరెస్ట్ అయిన మాజీ సీఎం చంద్రబాబు పట్ల సీఐడీ సిట్ విభాగం అధికారులు ఆద్యంతం అత్యంత గౌరవంగా వ్యవహరించారు. నంద్యాలలో శనివారం ఉదయం 6 గంటలకు అరెస్టు చేసినప్పటి నుంచి ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత జ్యుడీషియల్ రిమాండ్ కోసం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించేంతవరకు చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా చూసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేతగా ఉన్న 73 ఏళ్ల చంద్రబాబు పట్ల సిట్ అధికారులు అత్యంత మర్యాద పూర్వకంగా వ్యవహరించారు. నిద్ర లేచేవరకు నిరీక్షించి.. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో ప్రధాన దోషి అయిన చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు సిట్ ఇన్చార్జ్ కె.రఘురామిరెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం శనివారం తెల్లవారు జామున 3 గంటలకు నంద్యాల చేరుకుంది. ఆయన బస చేస్తున్న ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న టీడీపీ నేతలకు సమాచారమిచి్చంది. ఆందోళన వ్యక్తం చేసిన వారికి సిట్ అధికారులు దర్యాప్తు అంశాలను వివరించి సర్ది చెప్పారు. అప్పటికి ప్రత్యేక వాహనంలో నిద్రిస్తున్న చంద్రబాబుకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా ఆయన నిద్ర లేచే వరకు వేచి చూశారు. ఉదయం 5.30 గంటలకు చంద్రబాబు నిద్ర లేచి వాహనం నుంచి బయటకు వచ్చారు. సిట్ అధికారులు ఆయన్ని కలిసి కేసు గురించి వివరించారు. ఈ కేసులో అరెస్ట్ చేసేందుకు వచ్చామని తెలిపారు. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో తన ప్రమేయం లేదని, తనను ఎందుకు అరెస్ట్ చేస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. తమ దర్యాప్తులో వెల్లడైన అంశాలను వివరించి అరెస్ట్‌కు సహకరించాలని ఆయన్ను అధికారులు కోరారు. సంబంధిత పత్రాలపై సంతకం తీసుకున్నారు. అనంతరం 6 గంటలకు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య లేదని నిర్ధారించుకున్న తరువాతే విజయవాడకు తరలించాలని నిర్ణయించారు. కుటుంబ సభ్యులతో గదిలో భేటీ శనివారం రాత్రి 7.50 గంటలకు చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, బావమరిది బాలకృష్ణ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. చంద్రబాబును కలిసేందుకు అనుమతించాలన్న వారి విజ్ఞప్తిని అధికారులు ఆమోదించారు. ఆయన తన కుటుంబ సభ్యులతో ఓ గదిలో ప్రత్యేకంగా మాట్లాడుకునేందుకు అవకాశం కలి్పంచారు. రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబును సంప్రదించి ఆయన అడిగిన ఆహారాన్ని అందించారు. అనంతరం తన న్యాయవాదులతో కూడా విడిగా కేసు విషయాలపై బాబు చర్చించారు. నిద్రించేందుకు ప్రత్యేక గది అనంతరం రాత్రి 9 నుంచి 11 గంటల వరకు చంద్రబాబును మరోసారి విచారించారు. చంద్రబాబు కోరిన మందులను తెప్పించి ఇచ్చారు. సిట్ కార్యాలయంలో ఆయన నిద్రించేందుకు ప్రత్యేక గదిలో తగిన ఏర్పాట్లు చేశారు. అరెస్ట్ చేసినప్పటి నుంచి రిమాండ్‌కు తరలించేవరకు చంద్రబాబు సహాయకుడు మాణిక్యం ఆయన తోనే ఉండేందుకు అధికారులు అనుమతించారు. తమ అదుపులో ఉన్న చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా సిట్ అధికారులు ఆద్యంతం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు. తమకు సరైన సౌకర్యాలు లేవనిగానీ, అధికారులు సరిగా వ్యవహరించలేదనిగానీ చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ఒక్క విమర్శ కూడా చేయకపోవడమే అందుకు నిదర్శనం. పటిష్ట భద్రతతో సెంట్రల్ జైలుకు.. ఆదివారం తెల్లవారుజామున దాదాపు 4 గంటల సమయంలో చంద్రబాబును విజయవాడలోని జీజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉదయం 5.30 గంటల సమయంలో న్యాయస్థానానికి తరలించారు. సాయంత్రం న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీ విధించిన తరువాత చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతించారు. అనంతరం పటిష్ట భద్రతతో ఆయన్ని రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. బాబు పక్కనే దమ్మాలపాటి.. తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్న తరువాత చంద్రబాబు కాసేపు విశ్రమించేందుకు అధికారులు అవకాశం కలి్పంచారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు విచారణ ప్రారంభించారు. తన న్యాయవాదుల పేర్లను ఓ కాగితంపై రాసి వారిని లోపలకు అనుమతించాలని చంద్రబాబు కోరడంతో అందుకు దర్యాప్తు అధికారులు సమ్మతించారు. ఆయన చెప్పిన నలుగురు న్యాయవాదులను కార్యాలయంలోకి అనుమతించారు. వారితో చంద్రబాబు కాసేపు చర్చించారు. అనంతరం విచారణ ప్రక్రియ ప్రారంభించారు. ఆ సమయంలో కూడా చంద్రబాబు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాసరావు ఆయన పక్కనే కూర్చొనేందుకు కూడా సిట్ అధికారులు అనుమతించడం గమనార్హం. న్యాయవాది సమక్షంలోనే విచారించారు. విచారణ సందర్భంగా కూడా అధికారులు చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా వ్యవహరించారు. కేసు దర్యాప్తునకు సంబంధించి ఆయన కోరిన అన్ని పత్రాలను అందించారు. వాటిని ఆయన చదివిన తరువాతే ప్రశ్నలు సంధించారు. ఆయన కోరినట్లుగానే.. నంద్యాల నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో ప్రయాణించడం 73 ఏళ్ల చంద్రబాబుకు ప్రయాస కలిగిస్తుందని సిట్ అధికారులు భావించారు. ఆయనకు సౌకర్యవంతంగా ఉండేందుకు హెలికాఫ్టర్‌ను ఏర్పాటు చేసి అదే విషయాన్ని తెలిపారు. అయితే తాను తన వాహనంలోనే రోడ్డు మార్గంలో విజయవాడకు వస్తానని చంద్రబాబు చెప్పడంతో అందుకు సిట్ అధికారులు సమ్మతించారు. నంద్యాలలో ఉదయం 8 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చంద్రబాబును తీసుకొచ్చారు. మార్గమధ్యంలో కొన్ని చోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయన్ని కలిసేందుకు వేచి ఉన్నారు. చంద్రబాబు కోరిక మేరకు వాహనాన్ని సిట్ అధికారులు కొద్దిసేపు నిలిపారు. టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు అభివాదం చేసి కాసేపు మాట్లాడారు. అందుకు సిట్ అధికారులు అభ్యంతరం చెప్పకుండా సహకరించారు. చిలకలూరిపేట వద్ద టీడీపీ నేతలు వాహన కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో చంద్రబాబు చెప్పేవరకు నిలిపి ఉంచారు. ఆయన సూచించిన తరువాతే కాన్వాయ్‌ను ముందుకు పోనిచ్చారు.