
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని గుంటూరుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ కొరిటిపాటి ప్రేమ్ కుమార్ భార్య సౌజన్య, పిల్లలు అభిసాత్విక, అభినయ్ కలిశారు.
ప్రేమ్‌కుమార్ బెయిల్ విషయంలో అవసరమైన న్యాయ సహాయం అందజేయాలని వైఎస్సార్‌సీపీ లీగల్ టీమ్‌కు వైఎస్ జగన్ సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
పోలీసులు తెల్లవారుజామున తమ ఇంటికి వచ్చి దౌర్జన్యంగా వ్యవహరించి ప్రేమ్‌కుమార్‌ను తీసుకువెళ్లిన తీరును వైఎస్ జగన్‌కు కుటుంబ సభ్యులు వివరించారు. వారికి ధైర్యాన్నిచ్చి, అక్రమ కేసులు చట్టపరంగా ఎదుర్కుందామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ప్రేమ్‌కుమార్ కుటుంబసభ్యుల వెంట మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు ఉన్నారు.

ఇదీ చదవండి: పోలీసుల పేరుతో అర్ధరాత్రి హల్‌చల్.. వైఎస్సార్‌సీపీ ప్రేమ్ కుమార్ ఎక్కడ?
Comments
Please login to add a commentAdd a comment