పోలీసుల పేరుతో అర్ధరాత్రి అరెస్ట్‌.. వైఎస్సార్‌సీపీ ప్రేమ్‌ కుమార్‌ ఎక్కడ? | AP Police Arrest YSRCP Social Media Activist Prem Kumar At Guntur, Watch Video Inside | Sakshi
Sakshi News home page

పోలీసుల పేరుతో అర్ధరాత్రి అరెస్ట్‌.. వైఎస్సార్‌సీపీ ప్రేమ్‌ కుమార్‌ ఎక్కడ?

Published Thu, Dec 12 2024 9:15 AM | Last Updated on Thu, Dec 12 2024 10:23 AM

AP Police Arrest YSRCP Social Media Activist Prem Kumar At guntur

సాక్షి, గుంటూరు: ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో అక్రమ కేసుల్లో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను, సోషల్‌ మీడియా యాక్టివిస్టులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తాజాగా గుంటూరులో సోషల్‌ మీడియా కార్యకర్తను అర్ధరాత్రి తీసుకువెళ్లడం తీవ్ర కలకలం సృష్టించింది. దీనిపై పోలీసులు సమాచారం ఇవ్వాలని మాజీ మంత్రి అంబటి రాంబాబును డిమాండ్‌ చేశారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా ట్విట్టర్‌ వేదికగా అరెస్ట్‌ వీడియోను షేర్‌ చేశారు. ఈ సందర్భంగా అంబటి..‘గుంటూరుకి చెందిన వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త కొరిటిపాటి ప్రేమ్ కుమార్‌ను ఎవరో తీసుకెళ్లారు. అర్ధరాత్రి మూడు గంటలకు వచ్చి పోలీసులు అని చెప్పి.. ప్రేమ్‌ కుమార్‌ను తమ వెంట లాక్కెళ్లారు. ఈ ఘటనపై తక్షణమే పోలీసు డిపార్ట్‌మెంట్‌ ప్రేమ్‌ కుటుంబానికి సమాచారం ఇవ్వాలి’ అని డిమాండ్‌ చేశారు.

ఇక, ఈ వీడియోలో కొందరు వ్యక్తులు ప్రేమ్‌ కుమార్‌కు తీసుకువెళ్తున్నారు. వారిలో ఏ ఒక్కరూ పోలీస్‌ యూనిఫామ్‌ ధరించకపోవడం గమనార్హం. మరోవైపు.. ప్రేమ్‌ కుమార్‌ను తీసుకున్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులు వారిని అడ్డుకున్నప్పటికీ వారు పట్టించుకోలేదు.

ఇది  కూడా చదవండి:  మేడం చెప్పారు.. స్టేషన్‌కు రండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement