ప్రేమిస్తున్నానంటూ మూడేళ్లుగా యువతి వెంటబడిన యువకుడు
యువతి జన్మదినాన్ని డెత్ డేగా మారుస్తానంటూ పోస్టులు
కత్తితో యువతి తల్లి, తాతపై దాడి
యువతి కుటుంబ సభ్యుల ఎదురుదాడిలో మృతి
మల్యాల(చొప్పదండి): ప్రేమ పేరుతో మూడేళ్లుగా వేధిస్తున్న యువకుడు.. నేరుగా ఆ యువతి ఇంటికే వెళ్లి కుటుంబ సభ్యులపై కత్తితో దాడికి తెగబడ్డాడు. యువతి కుటుంబ సభ్యులు ఆత్మరక్షణ కోసం ఆ యువకుడిపై దాడి చేయగా.. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన బోగ మహేశ్ తన దూరపు బంధువైన తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ మూడేళ్లుగా ఫోన్‌లో వేధిస్తున్నాడు.
భరించలేని ఆ యువతి ఈనెల 2న మల్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కక్ష పెంచుకున్న మహేశ్ ఆ యువతిని చంపేందుకు కత్తితో సోమవారం మధ్యాహ్నం 2.20 గంటలకు తక్కళ్లపల్లిలోని యువతి ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయానికి మొదట యువతి తల్లి కనపడగా. ఆమెపై కత్తితో దాడికి యత్నించాడు. తప్పించుకునే క్రమంలో కత్తి ఆమె కాలికి తగిలింది. అనంతరం అక్కడే మంచంలో పడుకున్న యువతి తాతపైనా దాడి చేసి కత్తితో పొడవగా ఆయనకూ గాయాలయ్యాయి.
ఈ క్రమంలో యువతి తల్లి అక్కడే ఉన్న తన తమ్ముడు నర్సయ్యతో కలిసి మహేశ్‌ని ఆపే ప్రయత్నం చేస్తుండగానే మరోసారి దాడికి యత్నించాడు. ఈ క్రమంలో ముగ్గురి మధ్య జరిగిన ఘర్షణలో మహేశ్ కింద పడిపోయాడు. అక్కడే ఉన్న బండరాయితో మహేశ్‌పై యువతి తల్లి దాడి చేయగా.. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దాడిలో గాయపడిన నర్సయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌కు తరలించారు.
పంచాయితీ పెట్టించినా మారని తీరు
యువతికి దూరపు బంధువు కావటంతో పరిచయం పెంచుకున్న మహేశ్.. ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ప్రేమించాలంటూ మూడేళ్లుగా వెంటపడి వేధిస్తున్నాడు. విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో రెండేళ్ల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి కొంతకాలం యువతికి ఫోన్ చేయకుండా దూరంగా ఉన్న మ హేశ్.. ఇటీవల కొద్దిరోజులుగా ఫోన్‌లో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు పంచాయితీ పెట్టించారు. పెద్దలతో నూ హెచ్చరించారు. అయినా అతడిలో మాత్రం మార్పు రాలేదు.
యువతి జన్మదినాన్ని డెత్ డేగా మారుస్తానంటూ పోస్టులు
యువతి జన్మదినం ఈనెల 6న ఉండగా.. డెత్‌డేగా మా రుస్తానంటూ మహేశ్ పోస్టులు పెడుతున్నాడు. దీంతో ఈనెల 2న పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశా మని సదరు యువతి తెలిపింది. కాగా, మహేశ్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో యువతితోపాటు తల్లి, అన్న, వది న, అమ్మమ్మ, తాతయ్యపై కేసు నమోదు చేసినట్లు మల్యా ల ఎస్సై అబ్దుల్ రహీం తెలిపారు. సంఘటన స్థలాన్ని డీ ఎస్పీ రఘుచందర్ స్థానిక పోలీసులతో కలిసి పరిశీలించా రు. యువతి ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశా రు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment