కృష్ణాజిల్లాలో దారుణం... | family members who tried to kill son in krishna district | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లాలో దారుణం...

Published Mon, Oct 31 2016 6:03 PM | Last Updated on Tue, Aug 21 2018 6:21 PM

family members who tried to kill son in krishna district

విజయవాడ: కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం యాకమూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని తల్లి, భార్య, కుమారుడు కలిసి హతమార్చేందుకు యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికంగా నివాసం ఉంటున్న ఏడుకొండలు అనే వ్యక్తిని కుటుంబ సభ్యులంతా కలిసి బలవంతంగా పురుగుల మందు తాగించి అనంతరం ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు ఏడుకొండలును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే కుటుంబ సభ్యులు ఎందుకు ఈ దురగాతానికి పాల్పడ్డారనే విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement