edukondalu
-
స్వయంగా బావిలోకి దిగి శవాన్ని వెలికి తీసిన ఎస్ఐ
తాండూరు రూరల్: ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ యువకుడు దుర్మరణం చెందగా.. ఎస్ఐ స్వయంగా బావిలోకి దిగి మృతదేహాన్ని వెలికి తీశారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కొత్లాపూర్‌లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్లాపూర్‌కు చెందిన రాయిపల్లి నర్సింహులు (30) హోలీ సంబరాల అనంతరం స్నానం చేసేందుకు ఓ బావి వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు అతడు అందులో పడి మృతి చెందాడు. అయితే, నీరు ఎక్కువగా ఉండటం, పురాతనమైనది కావడంతో గ్రామస్తులెవరూ ఆ బావిలోకి దిగేందుకు ముందుకు రాలేదు. దీంతో కరన్‌కోట్ ఎస్ఐ ఏడుకొండలు నడుముకు తాళ్లు కట్టుకొని స్వయంగా బావిలోకి దిగి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. దీంతో గ్రామస్తులు ఎస్సైని చప్పట్లతో అభినందించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. చదవండి: యూనిఫామ్‌లోనే ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య సైబర్ నేరగాళ్ళు.. పోలీసులకే టోకరా! -
కృష్ణాజిల్లాలో దారుణం...
విజయవాడ: కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం యాకమూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని తల్లి, భార్య, కుమారుడు కలిసి హతమార్చేందుకు యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికంగా నివాసం ఉంటున్న ఏడుకొండలు అనే వ్యక్తిని కుటుంబ సభ్యులంతా కలిసి బలవంతంగా పురుగుల మందు తాగించి అనంతరం ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు ఏడుకొండలును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే కుటుంబ సభ్యులు ఎందుకు ఈ దురగాతానికి పాల్పడ్డారనే విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
లారీ ఢీకొని ఇద్దరు వ్యక్తుల మృతి
నాయుడుపేట: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. పెళ్లకూరు మండలం పెన్నేపల్లికి చెందిన కొవ్వూరు ఏడుకొండలు(43), చిట్టమూరు మండలం జునపాటిపాలెం గ్రామానికి చెందిన దుక్కలూరి మనోజ్(16) నాయుడుపేటలోని మంజీరా వాటర్ ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి పని ముగించుకుని బైక్‌పై పెన్నేపల్లికి బయలుదేరారు. వారి వాహనాన్ని ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ఏడుకొండలు అక్కడికక్కడే చనిపోగా, తీవ్రగాయాలపాలైన మనోజ్ మంగళవారం మధ్యాహ్నం ఆస్పత్రిలో కన్నుమూశాడు. -
కూతురుని లైంగికంగా వేధిస్తున్న తండ్రి
అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు విజయవాడ(అజిత్‌సింగ్‌నగర్) : కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో వడ్డెర కాలనీకి చెందిన ఏడుకొండలు అనే వ్యక్తిని నున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజీవ్‌నగర్ వడ్డెర కాలనీకి చెందిన ఏడుకొండలు అతని భార్య నాగమ్మ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కూతురు(15)ను ఏడుకొండలు గత కొంత కాలంగా లైంగిక వేధింపులకు గురి చేస్తుండటంతో బుధవారం తల్లి నాగమ్మ సహాయంతో నున్న పోలీసు స్టేషన్లో మైనర్ బాలిక ఫిర్యాదు చేసింది. నున్న పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా గురువారం బాలిక తండ్రి ఏడుకొండలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా విచారణలో తన కూతురుకి మతి స్థిమితంలేదని ఏడుకొండలు చెప్పినట్లు పోలీసుల సమాచారం. -
చిన్నారిని కడతేర్చిన రెండో భార్య
మొదటి భార్య కొడుకుని భర్త ప్రేమగా చూస్తున్నాడనే అసూయే కారణం వెంకటాచలం: మొదటి భార్య బిడ్డను భర్త తన బిడ్డపై కంటే ప్రేమగా చూస్తున్నాడన్న అసూయతో అభం శుభం తెలియని మూడేళ్ల బాబును కడతేర్చింది ఓ మానవత్వం లేని తల్లి. ఈ సంఘటన పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌లో సీఐ శ్రీనివాసరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. వెంకటాచలం మండలం ఈదగాలికి చెందిన ఏడుకొండలుకి నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డుకు చెందిన మల్లి శ్రీనివాసులు కుమార్తె అనితతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి చాలా కాలం వరకు పిల్లలు లేరు. ఏడుకొండలు గూడూరు ఎస్‌బీక్యూ స్టీల్ ఫ్యాక్టరీకి ట్యాంకర్ ద్వారా వాటర్ సప్లై చేస్తుంటారు. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం అక్కడే పనిచేస్తున్న మహబూబ్‌నగర్ జిల్లా లింగాల గ్రామానికి చెందిన గౌరీ అనే యువతితో పరిచయం ప్రేమగా మారడంతో వివాహం చేసుకున్నాడు. ఈమెను నెల్లూరు ఆటోనగర్ వర్క్‌ర్స్ కాలనీలో కాపురం పెట్టాడు. పెళ్లయిన ఏడాదికి వీరికి శరణ్య అనే పాప పుట్టింది. ఈ పెళ్లి విషయాన్ని ఏడుకొండలు మొదటి భార్య వద్ద దాచాడు. కొద్ది నెలలకు మొదటి భార్యకు సాయితేజ(3) పుట్టాడు. ఈ క్రమంలో బాబుపై ఏడుకొండలు ఎక్కువ ప్రేమ చూపుతున్నాడని గౌరీ అసూయ పడసాగింది. ఈ ఏడాది జూన్‌లో మొదటి భార్య ఆడపిల్లకు జన్మనిచ్చి..కుటుంబ సంక్షేమ ఆపరేషన్ చేయించుకునేందుకు నెల్లూరు ఆస్పత్రిలో చేరింది. దీంతో ఏడుకొండలు సాయితేజని తీసుకుని జూన్ 11న రెండో భార్య ఇంటికి వచ్చాడు. అనంతరం పనిపై ఇంటి నుంచి బయటికెళ్లగా రాత్రి 8.30 గంటల ప్రాంతంలో గౌరీ.. సాయితేజ (2)ను ముక్కు, నోరు మూసి హతమార్చింది. ఈ విషయాలను పోలీసులు దర్యాప్తుల్లో వెల్లడయ్యాయి. చంటి బిడ్డను హతమార్చినందుకు గౌరీని, రెండో వివాహాన్ని దాచినందుకు ఏడుకొండలును పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. సీఐ వెంట ఎస్ఐ వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ సుబ్రమణ్యం, హోమ్ గార్డు సుచరిత ఉన్నారు.