ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం  | Family Members Of Four People Missing At Anantapur District | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం 

Published Tue, Nov 16 2021 8:59 AM | Last Updated on Tue, Nov 16 2021 9:07 AM

Family Members Of Four People Missing At Anantapur District - Sakshi

అనంతపురం క్రైం: నగరంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కనిపించకుండా పోయారు. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురంలోని మారుతీనగర్‌కు చెందిన సంగమేష్, సాయిమౌనిక దంపతులు. 2011లో వివాహమైన వీరికి లిఖిత శరణ్య, లిఖిత కార్తికేయన్, మణికృష్ణ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. సంగమేష్‌ ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

చదవండి: పాతిక కోట్లను బాంబులతో పేల్చేశారు!

సోమవారం ఉదయం పిల్లలను పాఠశాల వద్దకు వదిలి వస్తానని చెప్పి వెళ్లిన భార్య సాయి మౌనిక తిరిగి రాలేదు. దీంతో పిల్లలు చదువుతున్న పాఠశాల, చుట్టుపక్కల ప్రాంతాల్లో సంగమేష్‌ గాలించాడు. ఫలితం లేకపోవడంతో సాయంత్రం నాల్గో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement