
అందరినీ ఆకట్టుకునే సోషల్ మీడియా ఇప్పుడు కుంభమేళా ఫొటోలు, వీడియోలతో నిండిపోతోంది. వీటిలోని కొన్ని వీడియోలు అమితంగా అలరిస్తుండగా, మరికొన్ని ఆశ్చర్యపరిచేవిగా, తెగ నవ్వు తెప్పించేవిగా ఉంటున్నాయి. ఇదేకోవలోని ఒక వీడియో ఇప్పుడు తెగవైరల్ అవుతోంది. కుంభమేళాకు వచ్చి, కుటుంబ సభ్యులు తప్పిపోతారేమోనని భయపడేవారికి మంచి సలహా ఇస్తున్నట్లుంది ఈ వీడియో..
మహా కుంభమేళాలో జనసమూహం అధికంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అటువంటప్పుడు కుటుంబ సభ్యులు తప్పిపోతారనే భయం పర్యాటకుల్లో ఉంటుంది. అయితే దీనికి ఒక వ్యక్తి చక్కని పరిష్కారం కనుగొన్నాడు. దీనిని చూడగానే నవ్వు వచ్చినప్పటికీ, ఓమారు ఆలోచింపజేస్తుంది.
भारत एक जुगाड़ प्रधान देश है, पूरे परिवार को रस्सी से बांध लिया ताकि महाकुंभ में खो ना जाये 🤣🤣 #MahaKumbh pic.twitter.com/WJXU4EYCwO
— Raja Babu (@GaurangBhardwa1) January 15, 2025
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ముందుకు నడుస్తుండగా, అతని వెనుక అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఉండటాన్ని గమనించవచ్చు. అయితే వాళ్లెవరూ దారితప్పికోకుండా ఉండేందుకు వారందరి చుట్టూ ఒక తాడుతో కట్టినట్లు చూడవచ్చు. వారంతా ఆ తాడులోపలే ఉంటూ ముందుకు కదులుతుండటాన్ని కూడా చూడవచ్చు. ఈ వీడియోను @GaurangBhardwa1 అనే ఖాతా ద్వారా ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేశారు. ‘మహా కుంభమేళాలో తప్పిపోకుండా ఉండటానికి కుటుంబాన్నంతటినీ తాడుతో కట్టేశారు' అని ఆ వీడియో కింద క్యాప్షన్ ఉంది.
ఈ వీడియోను ఇప్పటివరకూ ఒక లక్షా 42 వేలకు పైగా జనం వీక్షించారు. ఈ వీడియో చూసిన ఒక యూజర్ ‘ఆడవాళ్లు ఇక్కడకు అక్కడకు వెళ్లిపోతారు. అలా వెళ్లిపోకుండా ఉండేందుకు సరైన పని చేశారు’ అని రాశారు. మరొక యూజర్ ‘ఈ టెక్నిక్ భారతదేశం నుండి బయటకు వెళ్లకూడదు’అని రాశారు.
ఇది కూడా చదవండి: Mahakumbh 2025: చూపుతిప్పుకోనివ్వని దృశ్యాలు