
సాక్షి, చెన్నై : తమిళనాడులోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. వివరాల ప్రకారం తమిళనాడులోని సేలం జిల్లా కురుంగచావడి గ్రామానికి చెందిన అన్బళగన్ కుటుంబంలో ఐదుగురు మరణించడంతో ఒక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులందరూ గాఢ నిద్రలో ఉండగా తెల్లవారుజామున ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగాయి. మొత్తం 11 మంది ఉన్న ఆ కుటుంబంలో ఐదుగురు అక్కడికక్కడే సజీవదహనం కాగా మిగిలిన ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటనపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. ఎ. రామన్ ఆదేశించారు. (ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం, మూడేళ్ల చిన్నారిపై...)