చెప్పిన పని చేయలేదని గ్రామం నుంచి వెలివేశారు | Tamilnadu: Family Members Trying To End Their Life Infront Of Collector Village Eviction | Sakshi
Sakshi News home page

చెప్పిన పని చేయలేదని గ్రామం నుంచి వెలివేశారు

Published Thu, Aug 5 2021 9:08 AM | Last Updated on Thu, Aug 5 2021 10:28 AM

Tamilnadu: Family Members Trying To End Their Life Infront Of Collector Village Eviction - Sakshi

సాక్షి, తిరువొత్తియూరు( చెన్నై): కట్ట పంచాయితీ చేసి గ్రామం నుంచి వెలివేశారని ఆరోపిస్తూ నాలుగు కుటుంబాలకు చెందిన 16 మంది బుధవారం నాగై కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆత్మాహుతికి యత్నించడం కలకలం రేపింది. సంబంధన్‌ పేటకు చెందిన పళణి (43), సోదరుడు కందన్‌ (40), అదే గ్రామానికి చెందిన కరుప్పన్న  స్వామి (32), అశోక్‌ (26) కుటుంబ సభ్యులు కలెక్టరేట్‌ ఎదుట ఆత్మాహుతికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

విచారణలో పళని తమ్ముడు ముత్తు (38) భార్య ప్రియ (30) మధ్య విభేదాలు వచ్చినట్లు.. కలిసి ఉండాలని గ్రామ పెద్దలు చెప్పినా ముత్తు నిరాకరించాడని.. దీంతో పంచాయితీ పెట్టి రూ.16 లక్షలు ప్రియకు చెల్లించాలని తీర్పు చెప్పినట్లు తెలిసింది. ముత్తు అదృశ్యం కావడంతో తమ కుటుంబాలను గ్రామం నుంచి వెలివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement