![Officials Remove Poor people Huts Near Mahabubabad Collectorate - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/13/Poor-people-Huts-Near-Mahabubabad.jpg.webp?itok=saLP_pha)
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కలెక్టరేట్ సమీపంలో ప్రభుత్వ భూమిలో వెలసిన గుడిసెలను అధికారులు తొలగించారు. 255/1 సర్వే నెంబర్ లోని పదెకరాల భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను మున్సిపల్ రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తొలగింపును అడ్డుకునేందుకు పేదలు యత్నించడంతో భారీగా పోలీసులు మోహరించారు.
ఈ క్రమంలో అధికారులతో గుడిసెవాసుల వాగ్వివాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు వెళ్ళిపోవాలంటూ గుడిసె వాసుల ఆందోళన చేపట్టారు. గుడిసె వాసులను బలవంతంగా పోలీసులు నెట్టివేసి గుడిసెలు తొలగించారు. కాగా అధికారులు పేదలు వేసుకున్న గుడిసెల తొలగింపు ప్రక్రియ చేపట్టడం ఇది నాలుగోసారి.
Comments
Please login to add a commentAdd a comment