ఆసుపత్రి ముందు ధర్నా చేస్తున్న షర్మిల
హస్తినాపురం: తెలంగాణలో అణగారిన వర్గాలు, పేదలపై పోలీసులు పాశవికంగా దాడులకు పాల్పడటమే ఫ్రెండ్లీ పోలీసా.. అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మి ల మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం హస్తినాపురంలోని శ్యాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు లక్ష్మిని ఆమె పరా మర్శించారు.
అనంతరం షర్మిల మాట్లాడు తూ గిరిజన మహిళ అని చూడకుండా లక్ష్మి ని పాశవికంగా చిత్రహింసలకు గురిచేసిన ఎల్‌బీనగర్ పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెలలో తన కూతురు పెళ్లి ఉందని కార్డు చూపించినా వినకుండా ఎస్‌ఐ రవికుమార్ చిత్రహింసలకు గురిచేయడం దారుణమన్నారు.
పోలీసుల దాడిలో గాయపడిన లక్ష్మి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం, 120 గజాల ఇంటిస్థలం కేటాయిస్తామని మంత్రిగాని, ఎమ్మెల్యేగాని వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ముందు షర్మి ల గంటసేపు ధర్నా చేశారు. అనంతరం నాగార్జునసాగర్ రహదారిపై రాస్తారోకో చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో వనస్థలిపురం ఏసీపీ భీంరెడ్డి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఏసీపీ ఆదేశాలతో షర్మి లను మ హిళా కానిస్టేబుళ్లు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment