dharna
-
రెండే నెలలు గడువు.. లేకపోతే సమ్మె
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలైనా హామీలు అమలు చేయకపోవడంపై ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేలా రెండు నెలల్లో జీవోలు జారీ చేయాలని, లేకపోతే సమ్మె చేస్తామని హెచ్చరించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు గురువారం విజయవాడలో భారీ ధర్నా నిర్వహించారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన నిర్వహించిన ఈ ధర్నాకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఆశాలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు కె.పోశమ్మ, ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు, కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా అశా వర్కర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు. పని ఒత్తిడితో ఆశా వర్కర్లు అనారోగ్యం పాలవుతున్నా సెలవులు ఇవ్వడం లేదన్నారు. మెటర్నిటీ లీవులు కూడా ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పని ఒత్తిడి, వెట్టిచాకిరీ వల్ల ఆనారోగ్యం బారినపడి ఇటీవల కాలంలో అనేక మంది ఆశా వర్కర్లు ప్రాణాలు కోల్పోయారన్నారు. బీమా కంపెనీలకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో క్లెయిమ్‌లు నిలిచిపోయాయని, బాధిత కుటుంబాలకు ఎటువంటి ఆర్థిక సాయం అందక రోడ్డునపడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఆశా వర్కర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక్క పైసా కూడా ఇప్పటివరకు చెల్లించడం లేదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సంఘ రాష్ట్ర నాయకులు ఎ.కమల, ఎ.వెంకటేశ్వరరావు, పద్మ, రాఘవమ్మ, ధనశ్రీ, లక్ష్మి, సౌభాగ్య, సుభాషిణి, అమర, సుధారాణి, పార్వతి, రమణకుమారి, గంగా, జ్యోతి, వెంకటలక్ష్మి, వెంకటేశ్వరమ్మ, వాణిశ్రీ, తదితరులు మాట్లాడారు. -
పురుగులే పరమాన్నం..! ఘోర.. ముద్ద!
తమ పాఠశాలలో మధ్యాహ్న భోజనం సరిగా లేదని కొద్ది నెలలుగా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోకపోవడంతో విశాఖ జిల్లా చిన్నగదిలి మండలం వాడపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట తల్లిదండ్రులతో కలసి ధర్నాకు దిగారు.. భోజనంలో వచ్చిన పురుగును చూపిస్తున్న ఓ విద్యార్థి.సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో(Government school) డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని తినలేక పిల్లలు ఆకలి డొక్కలతో నకనకలాడుతున్నారు. డొక్కా సీతమ్మ ఎందరో అన్నార్తులు, బాటసారుల క్షుద్బాధను తీర్చి కడుపు నింపితే.. టీడీపీ కూటమి సర్కారు ఆ మహనీయురాలి పేరుతో నిర్వహిస్తున్న పథకంలో పిల్లలకు పురుగులు పట్టిన ఆహారాన్ని పంపిణీ చేస్తోంది. మధ్యాహ్న భోజనం పేరు మార్చటంపై ప్రదర్శించిన ఉత్సాహాన్ని పథకం అమలు చేయటంపై మాత్రం చూపడం లేదు. రాష్ట్రంలో విద్యార్థులకు పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత కొరవడి అత్యంత దారుణంగా తయారైంది.పిల్లలకు రుచిగా వండి పెట్టే ఏజెన్సీలు, ఆయాలను బలవంతంగా తొలగించి స్థానిక కూటమి నేతలకు ఇష్టమైన వారిని నియమించడంతో వ్యవస్థ గాడి తప్పింది. భోజనంలో నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. భోజనం అనంతరం పిల్లల అభిప్రాయాలను తెలుసుకోవడంతోపాటు ఉపాధ్యాయులు నాణ్యతను పరిశీలించే విధానాన్ని నిలిపివేశారు. వంటవారు వండి పెట్టిందే పరమాన్నంగా భావించాలని బలవంతం చేయడంతో ఏ పాఠశాలలోనూ సగం మంది కూడా భోజనం చేసే పరిస్థితి లేదు. కంచంలో వడ్డించిన పురుగుల అన్నం సహించక చెత్తబుట్టలో వేస్తున్న ఘటనలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి.రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో సగం మందికి పైగా విద్యార్థులు ఇంటి నుంచే అన్నం బాక్సులు తెచ్చుకునే పరిస్థితిని టీడీపీ కూటమి ప్రభుత్వం కల్పించింది. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా పిల్లలకు 16 రకాల వంటకాలతో రోజుకో మెనూ చొప్పున వారంలో ఆరు రోజులు రుచికరమైన పౌష్టికాహారాన్ని ‘జగనన్న గోరుముద్ద’ ద్వారా అందిస్తే.. ఈ పథకానికి ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం’గా పేరు మార్చిన కూటమి ప్రభుత్వం నాణ్యతను గాలికి వదిలేసింది. వండిన అన్నాన్ని పిల్లలు పారేస్తుండడంతో ఎలాగైనా తినిపించాలని పాఠశాలల సిబ్బందిపై ఒత్తిడి తెస్తోంది. ఉపాధ్యాయులతో ‘వెరీగుడ్’ అని యాప్‌లో అప్లోడ్ చేయిస్తోంది. కొన్ని చోట్ల వంట సరుకులు దారి మళ్లుతున్నాయి. 40 నుంచి 50 శాతం శాతం సరుకులు పక్కదారి పడుతున్నట్టు సమాచారం. వండేవారు, తినేవారు.. సగం మంది ఔట్!పాఠశాలల్లో మధ్యాహ్నం వంట చేసేందుకు దాదాపు 80 వేల మంది స్థానిక స్వయం సహాయక సంఘాల మహిళలు నియమితులయ్యారు. వీరిలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా వంట ఏజెన్సీల ఖాళీలు ఏర్పడితే స్వయం సహాయక సంఘాల మహిళలు.. ముఖ్యంగా తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చదివించే తల్లులకు వంట బాధ్యతలు అప్పగించారు. దీంతో వంటలో నాణ్యత పెరిగింది. ఉదయం 9 గంటలకు హాజరు తీసుకునే సమయంలోనే ఎంత మంది గోరుముద్ద భోజనం తీసుకుంటారో విద్యార్థులను అడిగి తెలుసుకునేవారు.ఆ మేరకు రేషన్ సరుకులు అందించి వంట సిద్ధం చేయించడం వల్ల సరుకుల గోల్‌మాల్‌కు అవకాశం ఉండేది కాదు. ఈ వివరాలు పాఠశాల విద్య కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరేవి. వంట పూర్తయ్యాక ప్రతి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు భోజనాన్ని స్వయంగా రుచి చూసిన అనంతరం విద్యార్థులకు అందించేవారు. తర్వాత టీచర్ల అభిప్రాయాలను యాప్‌లో అప్లోడ్ చేసేవారు. భోజనం ముగిశాక పై తరగతుల విద్యార్థులు ఇద్దరు లేదా నలుగురి నుంచి అభిప్రాయాలను సేకరించేవారు. ఆ రోజు భోజనం ఎలా ఉంది..? నాణ్యతలో ఇంకా ఏమైనా మార్పులు చేయాలా..? అనే అంశాలను పొందుపరిచి, ఆ వివరాలను ఫొటోలతో సహా ఉన్నతాధికారులకు పంపించేవారు.కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కూటమి అధికారంలోకి రాగానే స్థానిక నాయకులు ఎక్కడికక్కడ వంట ఏజెన్సీలో 40 వేల మందికి పైగా తొలగించి తమకు నచ్చినవారికి అప్పగించారు. మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల అభిప్రాయాల సేకరణను ప్రభుత్వం నిలిపివేసింది. ఎంత మంది ఆహారం తీసుకుంటారనే లెక్కలు లేవు. తిన్న తర్వాత నాణ్యత వివరాలు నమోదు కావడం లేదు. దీంతో స్కూళ్లలో అన్నం తినే విద్యార్థుల సంఖ్య 50 శాతానికి పైగా పడిపోయింది. 2014–19 మధ్య కూడా మధ్యాహ్న భోజనం తీసుకునే విద్యార్థుల సంఖ్య గరిష్టంగా 52 శాతం దాటలేదు. ఇప్పుడూ అదే పరిస్థితి నెలకొనడం గమనార్హం.మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్‌లో నిలదీసినా..టీడీపీ కూటమి ప్రభుత్వం గత డిసెంబర్లో నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌లో మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసిన తల్లిదండ్రులు పలుచోట్ల టీచర్లను నిలదీశారు. పిల్లలకు రోజూ ఇలాగే పెడుతున్నారా..? అని మండిపడ్డారు. ఈ నెల ఏడో తేదీన కృష్ణా జిల్లా పురిటిగడ్డ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పూర్తిగా మాడిపోవడంతో పిల్లలు తినలేకపోయారు. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి వంట చేశారు. ఇక్కడ తరచూ నాసికరం భోజనంపై ఫిర్యాదు చేసినా పట్టించుకున్న నాథుడు లేడని తల్లిదండ్రులు చెబుతున్నారు.ఇదే జిల్లా ఘంటశాల హైస్కూల్లో 380 మంది విద్యార్థుల్లో సగం మంది ఇంటి నుంచే అన్నం తెచ్చుకుంటున్నారు. మోపిదేవి హైస్కూల్లో సుమారు 400 మంది విద్యార్థులుండగా హాస్టల్ పిల్లలు మినహా డే స్కాలర్స్ ఎవరూ ముద్ద ముట్టుకోవడం లేదు. ఇక పిల్లల్లో రక్తహీనతను నివారించేందుకు గత ప్రభుత్వం పాఠశాలలకు సరఫరా చేసిన ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యాన్ని సైతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిలిపివేసింది.పెంచిన వంట చార్జీలు చెల్లించకుండా..పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న పీఎం పోషణ్ మధ్యాహ్న భోజనం వంట చార్జీలను కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో పెంచింది. బాలవాటిక, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థికి ప్రస్తుతం రూ.5.45 చొప్పున ఇస్తుండగా ఈ మొత్తాన్ని రూ.6.19కి పెంచింది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో (8వ తరగతి వరకు) విద్యార్థికి రూ.8.17 చొప్పున ఇస్తుండగా దాన్ని రూ.9.29కి పెంచింది. ఈ పెంపు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని ప్రకటించింది. పీఎం పోషణ్ నిధుల్లో కేంద్రం, రాష్ట్రం 60:40 నిష్పత్తిలో భరించాలి. 9, 10, ఇంటర్ విద్యార్థులకు భోజనం ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. కానీ రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన చార్జీలను వంట ఏజెన్సీలకు చెల్లించలేదు. దీంతో వంట చేసేవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మధ్యాహ్న భోజనానికి ఏటా ఎంత ఖర్చు?టీడీపీ హయాంలో రూ.450 కోట్లువైఎస్సార్ సీపీ హయాంలో రూ.1,400 కోట్లుజగన్ హయాంలో గోరుముద్దకు రూ.7,245 కోట్లుప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలనే సంకల్పంతో 2020 జనవరి 1న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ‘జగనన్న గోరుముద్ద’ పథకానికి శ్రీకారం చుట్టింది. గతంలో టీడీపీ హయాంలో రోజూ సాంబారు, అన్నంతో మధ్యాహ్న భోజనాన్ని సరిపెట్టగా.. వైఎస్ జగన్ రోజుకో మెనూ చొప్పున వారానికి 16 రకాల పదార్థాలతో పాటు ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యంతో రుచి, శుచితో పోషకాహారాన్ని పిల్లలకు అందచేశారు. ఎదిగే పిల్లల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ఐదేళ్లలో రూ.7,244.60 కోట్లు వ్యయం చేయడం గమనార్హం.పిల్లల్లో రక్తహీనతను అరికట్టడానికి వారంలో మూడు రోజుల పాటు బెల్లంతో చేసిన రాగి జావ, చిక్కీ, వారంలో ఐదు రోజులు ఉడికించిన కోడిగుడ్డును తప్పనిసరి చేశారు. రాష్ట్రంలో 45 వేల పాఠశాలల్లో విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి వంటలో మార్పులు చేశారు. రాష్ట్రంలో 1–10 తరగతుల విద్యార్థులు 40.50 లక్షల మంది ఉండగా నిత్యం సగటున 93 శాతం మంది గోరుముద్దను ఇష్టంగా తీసుకునేవారు. మిగిలిన 7 శాతం మందిలో బాలికలు ‘ప్రత్యేక’ పరిస్థితుల్లో ఇంటి నుంచి అన్నం తెచ్చుకుని కూరలు బడిలోనే తీసుకునేవారు.ఆ వివరాలను ఉపాధ్యాయులు ‘ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ సిస్టం ఫర్ మిడ్ డే మీల్స్ అండ్ శానిటేషన్’ (ఐఎంఎంఎస్) యాప్‌లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక ప్రతి నెలా స్థానిక ఆస్పత్రి వైద్య సిబ్బందితో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి రక్తహీనత ఉన్న వారికి ఫోలిక్ యాసిడ్ (ఐరన్) మాత్రలు, టానిక్‌లు ఇచ్చేవారు. దీంతో పిల్లల ఆరోగ్యం మెరుగుపడింది. విద్యార్థుల్లో రక్తహీనత తగ్గింది. కానీ ఇప్పుడు పరిస్థితి దయనీయంగా ఉంది. పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. బెల్లం చిక్కీలో నాణ్యత తగ్గిపోయినా కారణాలపై ఆరా తీసిన పాపాన పోలేదు. భోజనం నాణ్యతపై విద్యార్థుల అభిప్రాయాలు అడిగే నాధుడు లేరు.నాడు రోజుకో మెనూతో రుచికరంగా..⇒ జగనన్న గోరుముద్ద ద్వారా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కోసం 16 రకాల పదార్థాలతో రోజుకో రుచికరమైన మెనూతో పౌష్టికాహారం. ఉపాధ్యాయులు, విద్యార్థుల భాగస్వామ్యంతో వంటపై మూడంచెల పర్యవేక్షణసోమవారం: హాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్ పలావు, గుడ్డు కూర, చిక్కీ మంగళవారం: ఉదయం 10.20కి రాగిజావ, మధ్యాహ్నం 12.20కి చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డుబుధవారం: వెజిటబుల్ అన్నం, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీగురువారం : ఉదయం రాగిజావ, మధ్యాహ్నం సాంబార్ బాత్/నిమ్మకాయ పులిహోర, టమాటో పచ్చడి, ఉడికించిన గుడ్డుశుక్రవారం : అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీశనివారం : ఉదయం రాగిజావ, మధ్యాహ్నం ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్ -
BRS రైతు మహాధర్నా
-
ఎన్నికల ముందు పథకాల డ్రామా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: స్థానికసంస్థల ఎన్నికలు వస్తుండటంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పథకాల డ్రామా ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మండిపడ్డారు. ఆ ఎన్నికలు పూర్తయితే రైతుభరోసా బంద్ అవుతుందన్నారు. మంగళవారం నల్లగొండ గడియారం సెంటర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎన్జీ కాలేజీ నుంచి గడియారం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడే నిర్వహించిన మహాధర్నాలో కేటీఆర్ ప్రసంగించారు. మేం నాట్లకు ముందు.. కాంగ్రెస్ ఓట్లకు ముందు‘రేవంత్‌కు.. ఎన్నికలప్పుడే పథకాలు గుర్తుకొస్తా యి. అవి పూర్తయితే పట్టించుకోరు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తుండటంతో ఓట్ల కోసం కొత్త డ్రామా అడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో నాట్లకు ముందు రైతుబంధు ఇచ్చాం. కానీ రేవంత్ ప్రభుత్వం రైతుభరోసా డ్రామా ఆడుతోంది’అని కేటీఆర్ దుయ్యబట్టారు. ఒక్క హామీనీ పూర్తిగా అమలు చేయలేదు ఆరు గ్యారంటీల పేరుతో మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని కేటీఆర్ విమర్శించారు. రూ. 2 లక్షల మేర రైతు రుణాలను డిసెంబర్ 9న మాఫీ చేస్తానని ప్రకటించి మోసం చేశారని ఆరోపించారు.ఏ ఊళ్లోనూ 100 శాతం రుణమాఫీ చేయలేదని.. యాసంగి రైతు భరోసా సైతం ఇవ్వలేదన్నారు. ఎన్నికల ముందు కేసీఆర్ రైతుబంధు ఇస్తానంటే రేవంత్‌రెడ్డి ఎన్నికల సంఘానికి లేఖ రాసి ఆపించారని కేటీఆర్ విమర్శించారు. వానాకాలం రైతు భరోసాను ఎగ్గొట్టారని, ఇప్పటివరకు ఒక్కో ఎకరానికి రూ.17,500 రేవంత్‌రెడ్డి బాకీ పడ్డారన్నారు. మోసం చేయడంలోనూ చరిత్రాత్మకమే బీఆర్ఎస్ రూ.12 వేలు రైతుబంధు ఇస్తానంటే, తాను రూ.15 వేలు ఇస్తానని చెప్పి రేవంత్‌రెడ్డి ప్రజలను మభ్య పెట్టారని కేటీఆర్ విమర్శించారు. ఓట్లు వేయించుకొని గెలిచాక సిగ్గులేకుండా రూ.12 వేలకు కుదించారన్నారు. ప్రజలను మోసం చేయడంలోనూ కాంగ్రెస్‌ది చరిత్రాత్మకమేనని ఎద్దేవా చేశారు. ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తానని చెప్పి, చివరకు సన్నాలకే ఇస్తానని మెలిక పెట్టి మోసం చేశారన్నారు. . కేసీఆర్ హయాంలో 11 విడతలుగా రైతుబంధు కింద రూ.73 వేల కోట్లు రైతుల అకౌంట్లలో వేశారని గుర్తు చేశారు. రైతులు తిరగబడాలి: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై తిరగబడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యార్థులు, రైతు లు, చేనేత కారి్మకులు చనిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతుబంధు, రైతుభరోసా, రుణమాఫీ విషయంలో ప్రజలు తిరుగబడాలని, నల్లగొండ నుంచే పోరుబాట పట్టాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు అండగా ఉండేందుకే..: జగదీశ్‌రెడ్డి రైతులను మోసం చేస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ అన్యాయంపై పోరాడేందుకు బీఆర్ఎస్ ముందుంటుందన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి చేస్తున్న మోసాన్ని ప్రజలకు చెప్పేందుకే కేటీఆర్ నల్లగొండ వచ్చారన్నారు. ప్రశ్నిస్తున్న రైతులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందన్నారు.పలువురు నేతల ఫోన్లు, గొలుసులు చోరీ నల్లగొండలో కేటీఆర్ పాల్గొన్న రైతు మహాధర్నాలో దొంగలు రెచ్చిపోయారు. ఎన్జీ కాలేజీ నుంచి బీఆర్ఎస్ నేతలు చేపట్టిన ర్యాలీలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, స్థానిక నేత హమీద్ సెల్ఫోన్లతోపాటు ఆరుగురు నేతల నుంచి సుమారు 11 తులాల బంగారు గొలుసులు కొట్టేశారు. దొంగల ముఠాలోని ఒకరిని టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆరోగ్యశ్రీ అంటే వై.ఎస్..రైతుబంధు అంటే కేసీఆర్ ఆరోగ్యశ్రీ పథకం పేరు చెప్పగానే ప్రజలందరికీ ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకొస్తారని కేటీఆర్ చెప్పారు. అలాగే రైతుబంధు పథకం అనగానే మాజీ సీఎం కేసీఆర్ గుర్తుకొస్తారన్నారు. ఈ పథకాలను ఎవరూ చెరపలేరన్నారు. కానీ రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని పదేపదే చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి రైతుబంధు పథకాన్ని బంద్ చేయాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సామాన్యులకు రేషన్‌కార్డు కావాలన్నా, రైతుబంధు కావాలన్నా ప్రభుత్వం కేవలం దరఖాస్తులే తీసుకుంటోందని విమర్శించారు. -
ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సార్.. రైతుబంధు అంటే కేసీఆరే గుర్తొస్తారు: కేటీఆర్
సాక్షి, నల్గొండ: కాంగ్రెస్ పాలన కొత్త సీసాలో పాత సార అన్నట్లుగా ఉందని, పాలిచ్చే ఆవును కాదని దున్నపోతును తెచ్చుకున్నామని రైతులు అనుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నల్లగొండలో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ రైతు ధర్నాలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఇవాళ రైతు మహాధర్నాకు వచ్చినట్లు అనిపించలేదు. మళ్లీ మన ప్రభుత్వం వచ్చిందనే విధంగా నల్గొండలో అపూర్వ స్వాగతం లభించింది. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారనే రీతిలో స్వాగతం ఉంది. బ్రహ్మాండమైన విజయోత్సవ ఊరేగింపులా అనిపించింది.‘కేసీఆర్ 12సార్లు రైతుబంధు ఇచ్చారు కానీ ఇలా ప్రచారం చేసుకోలేదు. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సార్, రైతుబంధు అంటే కేసీఆర్ గుర్తొస్తారు. రుణమాఫీ,రైతుబంధు, వరికి బోనస్ అన్నింటిలో మోసాలే. మోసం చేయడంలో కాంగ్రెస్ నేతలు చరిత్ర సృష్టించారు.పంజాబ్,హరియాణాను తలదన్నేలా వరి పండించడంలో తెలంగాణను నెంబర్ వన్ చేశారు కేసీఆర్. జనవరి 26నే రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. కేసీఆర్ రైతు బంధు కింద 73 వేల కోట్లు ఇచ్చారు.నల్గొండ రైతులు అవస్థలకు,పిల్లలు జీవచ్ఛవాలుగా మారడానికి కారణం కాంగ్రెస్ నేతలే. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు. ఏ ఊర్లో అయినా వంద శాతం రుణమాఫీ జరిగిందని చూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా.రుణమాఫీ 25 శాతం కూడా కాలేదు.గ్రామ సభల్లో హామీల అమలుపై జనాలు నిలదీస్తున్నారు. నల్గొండ నుంచే ప్రభుత్వంపై రైతు పోరు ప్రారంభిస్తున్నాం. దరఖాస్తుల వ్యాపారంతో రాష్ట్రంలో జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు మాత్రమే సంతోషంగా ఉన్నారు’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. -
ఇవాళ నల్లగొండలో బీఆర్ఎస్ రైతు మహా ధర్నా
-
నేడు బీఆర్ఎస్ రైతు ధర్నా.. హాజరుకానున్న కేటీఆర్
సాక్షి,నల్గొండ: బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు నల్లగొండలో రైతు మహా ధర్నా జరగనుంది. ఈ ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. మాజీ మంత్రి గుంటకంట్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నాయకులు, రైతులు ధర్నాలో పాల్గొంటారు. నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో నిర్వహించనున్న మహాధర్నా నిర్వహించేందుకు పోలీసులు మూడు గంటలు మాత్రమే అనుమతించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా నిర్వహించాలి. రైతు మహాధర్నా బీఆర్ఎస్ పార్టీ ఈనెల 12న నిర్వహించాల్సి ఉండగా.. సంక్రాంతి పండుగ నేపథ్యంలో వాయిదా వేసుకుంది. తిరిగి ఈ నెల 21న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాక ధర్నాకు ఒక రోజు ముందు పోలీసులు అనుమతి నిరాకరించారు. సంక్రాంతి పండుగకు ఆంధ్రా ప్రాంతానికి వెళ్లిన వారు తిరిగి వస్తున్న క్రమంలో జాతీయ రహదారి అంతా రద్దీగా ఉంటుందని, పైగా క్లాక్ టవర్ సెంటర్ ఇరుకుగా ఉండటంతోపాటు, వాణిజ్య సముదాయాలు ఉన్నాయని, ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని, 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలు ఉన్నందున బందోబస్తు కల్పించలేమని పోలీసులు అనుమతి నిరాకరించారు.దీంతో బీఆర్ఎస్ నేతలు అదేరోజు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హైకోర్టు ఈ నెల 27వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. కాగా, 27వ తేదీన కాకుండా 28వ తేదీన ధర్నా నిర్వహణకు పోలీసుల అనుమతికి బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ దరఖాస్తు చేశారు. దీంతో పోలీసులు.. 1500 మందితో పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ నిర్వహించి, ఆ తర్వాత ధర్నా నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు.రైతుకు భరోసా ఇచ్చేందుకే మహా ధర్నా:జగదీష్‌రెడ్డి‘రైతులు మొదటి నుంచీ బీఆర్ఎస్ వెంటే ఉన్నారు. వారిని ఆత్మహత్యల నుంచి బయట పడేసింది బీఆర్ఎస్ పార్టీనే. ప్రస్తుతం రైతాంగాన్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అందరికి రుణ మాఫీ చేయలేదు. రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని తగ్గిస్తున్నారు. సన్న ధాన్యానికి బోనస్ ఇస్తామని మోసం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు తిరుగుబాటు చేస్తున్నారు. గ్రామసభల్లో నిలదీశారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ రైతులకు, ప్రజలకు అండగా ఉంటుంది. అందులో భాగంగానే రైతులకు భరోసా ఇచ్చేందుకు మహా ధర్నా చేపట్టబోతున్నాం. నల్లగొండ నుంచి రైతుల తరఫున పోరాటం చేసేందకు కేటీఆర్ వస్తున్నారు. బీఆర్ఎస్ ధర్నా అంటేనే జిల్లా మంత్రి, కాంగ్రెస్ నాయకులు భయపడిపోతున్నారు’అని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. -
ట్రిపుల్ ఆర్ రైతుల ధర్నాతో ఉద్రిక్తత
సాక్షి, యాదాద్రి: రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) అలైన్మెంట్ మార్చాలంటూ భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద భూ నిర్వాసితులు శనివారం తలపెట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. రైతులు హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు వేర్వేరుగా ట్రిపుల్ ఆర్ రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. రీజినల్ రింగ్‌రోడ్డు ఉత్తర భాగం అలైన్మెంట్ మార్చాలని కోరుతూ భూ నిర్వాసితులు భువనగిరి కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పిలుపు నివ్వగా.. ధర్నాకు అనుమతి లేదని నిర్వాసితులు ఏర్పాటు చేసుకున్న శిబిరాలను పోలీసులు తొలగించారు. ధర్నా నిర్వహించేందుకు కలెక్టరేట్ వద్దకు బీజేపీ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్, కంచర్ల రామకృష్ణారెడ్డి, క్యామ మల్లేశ్ తదితరులు హాజరయ్యారు. రైతులు బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ నాయకత్వంలో బీజేపీ ప్రతినిధి బృందం, మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి క్యామ మల్లేశ్‌తోపాటు 10 మంది నిర్వాసితులు వేర్వేరుగా కలెక్టరేట్‌లోకి వెళ్లి అదనపు కలెక్టర్ వీరారెడ్డికి వినతిపత్రం అందించారు. -
బీఆర్ఎస్ నల్లగొండ రైతు దీక్షకు హైకోర్టు అనుమతి
-
గజ్వేల్ లో డబుల్ బెడ్రూం లబ్ధిదారుల ఆందోళన
-
రేపటి బీఆర్ఎస్ రైతు మహా ధర్నాకు అనుమతి నిరాకరణ
సాక్షి, నల్గొండ జిల్లా: నల్లొండలో బీఆర్ఎస్(BRS Party) రైతు మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రేపు నల్గొండ(Nalgonda)లో కేటీఆర్(KTR) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. అయితే పోలీసులు మాత్రం ధర్నాకు నో చెప్పారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి నిరాకరణపై బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది.ధర్నా కారణంగా క్లాక్ టవర్ సెంటర్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని.. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందంటూ అనుమతి నిరాకరించారు. సంక్రాంతి సెలవులు ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు కలుగుతుందని పోలీసులు తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా తలపెట్టిన సంగతి తెలిసిందే. పట్టణ కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద జరుగనున్న ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి జిల్లా నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. కానీ పోలీసులు.. ధర్నాకు అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతి కోసం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారుహామీలను అమలు చేయాలని అడగడం తప్పా?రైతు మహా ధర్నాకు అనుమతి నిరాకరణపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని.. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నమే ఇదంటూ ధ్వజమెత్తారు. కేటీఆర్ వస్తున్నారంటే రేవంత్ ప్రభుత్వం భయపడుతోంది. రేవంత్ ఇచ్చిన హామీల అమలును నిలదీయొద్దా?. హామీలను అమలు చేయాలని అడగడం తప్పా?’’ అంటూ లింగయ్య ప్రశ్నించారు.ఇదీ చదవండి: కేసీఆర్, హరీశ్, ఈటలకు సమన్లు? -
17న విజయవాడలో రైతుల మహా ధర్నా
సాక్షి, అమరావతి : రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన టీడీపీ కూటమి ప్రభుత్వం పట్ల రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలలో దాదాపు 80కు పైగా మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నప్పటికీ మొక్కుబడిగా 54 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకుందే తప్ప పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదు. 2023–24లో ఖరీఫ్‌తో పాటు రబీ సీజన్లలో వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన 3.91 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.328 కోట్ల కరువు సాయం బకాయిలు విడుదల చేయలేదు.ఖరీఫ్–2023 సీజన్లో రైతుల తరఫున రూ.930 కోట్ల ప్రీమియం బకాయిలు చెల్లించకపోవడం వల్ల రైతులకు న్యాయంగా దక్కాల్సిన రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారం అందలేదు. ఇలా రైతులకు చెల్లించాల్సిన రూ.12,563 కోట్లు ఎగ్గొట్టింది. ఈ నేపథ్యంలో రైతాంగ సమస్యలపై ఈ నెల 17న విజయవాడలో భారీ ధర్నా నిర్వహణకు ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కే ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి రైతుకు రూ.20 వేల పెట్టుబడి సాయం ఇస్తామన్న హామీని ఎప్పుడు అమలు చేస్తారంటూ ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని నిలదీశారు.ఎన్నికలలో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నామని గొప్పగా చెబుతున్న చంద్రబాబు.. రైతులకు ఇచ్చిన హామీల సంగతేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. పెట్టుబడి సాయం హామీ ముఖ్యమంత్రికి గుర్తులేదా? గుర్తు ఉన్నా రైతులకు ఇవ్వటం ఇష్టం లేక అమలు చేయటం లేదా.. అన్నది స్పష్టం చేయాలన్నారు. ఈ నేపథ్యంలో రైతాంగ సమస్యల సాధనకు డిమాండ్ చేస్తూ ఈ నెల 17న విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించబోతున్నామని వారు స్పష్టం చేశారు. -
భువనగిరిలో బీఆర్ఎస్ ధర్నా ఉద్రిక్తం
సాక్షి, యాదాద్రి: యాదాద్రి జిల్లా కేంద్రం భువనగిరిలో ఆదివారం బీఆర్ఎస్ చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేకువజాము నుంచే పోలీసులు పట్టణాన్ని అష్ట దిగ్బంధనం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారు. కొందరిని పోలీసు స్టేషన్లకు తరలించారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో రాత్రి పొద్దుపోయే వరకు నిర్బంధించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ నేత కంచర్ల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యువజన కాంగ్రెస్, ఎస్ఎస్యూఐ కార్యకర్తలు.. భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ దాడికి నిరసనగా బీఆర్ఎస్ భువనగిరిలోని వినాయక చౌరస్తా వద్ద ఆదివారం మహాధర్నాకు పిలుపునిచ్చింది. పోలీసుల నిర్బంధాన్ని ఛేదించి బీఆర్ఎస్ నేతలు భువనగిరికి చేరుకుని మూడు చోట్ల ధర్నాలు చేశారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి వివేకానందుని విగ్రహానికి పూలమాల వేయడానికి వచ్చిన సందర్భంగా బీఆర్ఎస్ నేతలు పైళ్ల శేఖర్‌రెడ్డి, కంచర్ల రామకృష్ణారెడ్డి, కర్నె ప్రభాకర్ తదితరులు ఒక్కసారిగా ధర్నాకు దిగారు.దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలతో హోరెత్తించాయి. అక్కడ ఉద్రిక్తత నెలకొనటంతో పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అశ్వికదళంతో ప్రధాన రహదారితో పాటు పలు వీధుల్లో గస్తీ నిర్వహించారు. పోలీసుల తీరుపై పైళ్ల శేఖర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష నేతలను రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలతో భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు. కారులో ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన పోలీసులు భువనగిరిలో వినాయక చౌరస్తా వద్ద నిర సన తెలుపుతున్న వల్లపు విజయ్ను పో లీసులు వాహనంలో బస్టాండ్ వరకు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. దీంతో ఆయన వెన్నుపూసకు గాయాలైనట్లు వైద్యులు చెప్పారని బీఆర్ఎస్ కార్యకర్తలు తెలిపారు. -
జనవరి 3న జరగాల్సిన వైఎస్సార్సీపీ ధర్నా వాయిదా
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ధర్నాలో మార్పు జరిగింది. ప్రజా సమస్యలపై ఉద్యమ బాటలో భాగంగా విద్యార్థులకు బాసటగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జనవరి 3న రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ఆందోళనన కార్యక్రమాన్ని జనవరి 29కి ఆ పార్టీ అధిష్టానం వాయిదా వేసింది. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.2800 కోట్లు, వసతి దీవెన బకాయిలు రూ.1100 కోట్లు కలిసి మొత్తం రూ.3900 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. జనవరి 3వ తేదీన కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలకు వైఎస్సార్సీపీ ఇప్పటికే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, 3వ తేదీన ఇంజనీరింగ్, డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు ఉండటంతో ధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా 29న నిర్వహించాలని అధిష్టానం పిలుపునిచ్చింది.పోరుబాట విజయవంతం:ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీల పేరుతో యూనిట్ కు రూ.1.20 నుంచి రూ.1.25 పైసలు చొప్పున దాదాపు రూ.15,600 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు, ప్రభుత్వమే డిస్కమ్‌లకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వినియోగదారులతో కలిసి వైఎస్సార్సీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం విజయవంతమైందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని.. విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం వేయమన్న హామీ నిలబెట్టుకోవాలని విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స డిమాండ్ చేశారు. -
కదం తొక్కిన వీఓఏలు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కూటమి ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపులు, అక్రమ తొలగింపులకు వ్యతిరేకంగా వెలుగు వీఓఏలు కదం తొక్కారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నినదించారు. వీఓఏల నినాదాలతో విజయవాడలోని ధర్నా చౌక్ దద్దరిల్లింది. ఆంధ్రప్రదేశ్ ఐకేపీ యానిమేటర్ల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి యానిమేటర్లు తరలివచ్చారు.యానిమేటర్ల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం వీఓఏలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలన్నారు. కూటమి అధికారంలోకి వచి్చన వెంటనే కాలపరిమితి సర్క్యులర్‌ను రద్దు చేస్తామని వాగ్దానం చేసిందని గుర్తుచేశారు. వీఓఏలపై పని భారం పెంచుతూ మానసిక వేదనకు గురిచేస్తున్నారని, ప్రభుత్వ విధానాలను వెంటనే మార్చాలని ఆమె డిమాండ్ చేశారు. రోజుకో రకమైన యాప్‌తో వీఓఏల జీవితాలతో అధికారులు ఆటలాడుతున్నారన్నారు.అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు రూపాదేవి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై వీఓఏలు పెట్టుకున్న ఆశలను అడియాసలు చేయొద్దన్నారు. అక్రమంగా తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని,బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. -
ఎవరిని చూసుకుని ఈ జులుం?
సాక్షి ప్రతినిధి కర్నూలు: ‘నువ్వేం చూస్తావు రా.. నన్ను నువ్వేం చేస్తావు.. మళ్లీ చెబుతా విను.. ఇక్కడి నుంచి దెం..ని పోండి’ అంటూ చూపుడు వేలితో హెచ్చరిస్తూ, భీకరమైన గొంతుతో.. ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డిని సీఐ ఇబ్రహీం దుర్భాషలాడుతూ బెదిరించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. ఎవరిని చూసుకుని ఆ సీఐ ఇలా రెచ్చిపోయారంటూ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఖాకీ డ్రస్సు విప్పేసి ‘పచ్చ’ చొక్కా, ప్యాంటు ధరించాలని ప్రజలు సూచిస్తున్నారు. వీధి రౌడీని మరిపిస్తూ మందు బాబులా చిందులేసిన సీఐపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం ఎమ్మిగనూరు సోమప్పసర్కిల్లో ఆ పార్టీ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించారు. సీఐ ఇబ్రహీంను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చెన్నకేశవరెడ్డికి క్షమాపణలు చెప్పాలని ఆయన కుమారుడు ఎర్రకోట జగన్ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు.సీఐపై కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేస్తామని చెప్పారు. సీఐ ఇబ్రహీంను సస్పెండ్ చేయాలని ఎమ్మిగనూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జ్, మాజీ ఎంపీ బుట్టా రేణుక డిమాండ్ చేశారు. అతడిని విధుల నుంచి తప్పించాలన్నారు. ఇబ్రహీంపై పోలీసు ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. వీడియో వైరల్ఎమ్మిగనూరు నియోజకవర్గం పార్లపల్లిలో శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సీఐ ఇబ్రహీం.. చెన్నకేవశరెడ్డిని బెదిరించిన తీరు, సీఐ బాడీ లాంగ్వేజ్, దబాయిస్తూ మాట్లాడిన మాటలు, అయినప్పటికీ సహనం కోల్పోకుండా చెన్నకేవశరెడ్డి మాట్లాడిన తీరు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. చెన్నకేశవరెడ్డి వయస్సు 82 ఏళ్లు. తన రాజకీయ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని అత్యంత గౌరవంగా గడిపారు. ఏ పార్టీ, ఏ వ్యక్తి అతన్ని అగౌరవ పరిచిన సందర్భం లేదు. అధికారులు, ప్రత్యర్థి రాజకీయ పార్టీల నేతలను కూడా ఎంతో గౌరవంగా సంభోదిస్తూ ‘అజాత శత్రువుగా, పెద్దాయన’గా గుర్తింపు పొందారు. అలాంటి వ్యక్తిని అరేయ్.. ఒరేయ్.. అంటూ సీఐ బెదిరించడాన్ని జిల్లా వ్యాప్తంగా అంతా తప్పుపడుతున్నారు. చెన్నకేశవరెడ్డి సహనంతో మాట్లాడుతున్నా, అకారణంగా సీఐ రెచ్చిపోయి బెదిరించడం సరికాదని పోలీసులు సైతం విస్తుపోతున్నారు. ఘటన జరిగిన తీరిదిపార్లపల్లె 38వ నీటి వినియోగదారుల సంఘానికి శనివారం ఎన్నికలు జరిగాయి. టీడీపీ తరఫున పోటీ చేస్తున్న వారికి మద్దతుగా ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి బంధువులు విరూపాక్షిరెడ్డి, బాలిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి స్కూలు లోపలికి వెళ్లారు. వీరికి ఓటు హక్కు కూడా లేదు. వీరు వెళ్లిన తర్వాత గేటుకు తాళం వేశారు. చెన్నకేశవరెడ్డి తన కుటుంబ సభ్యులను పోటీ చేయించేందుకు 8 గంటలకు అక్కడికి వెళ్లారు. 9 – 9.45 గంటల వరకూ నామినేషన్లు. అయితే టీడీపీ మినహా మిగిలిన వారెవ్వరినీ సీఐ ఇబ్రహీం లోపలికి వెళ్లనివ్వలేదు. ‘లోపల టీడీపీ వాళ్లు ఉన్నారు. మమ్మల్ని నామినేషన్ వేయకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు..’ అని మాజీ ఎమ్మెల్యే అడిగారు. దీనికి సీఐ ఇబ్రహీం వేలితో హెచ్చరిస్తూ, తన చేతిని ప్రైవేటు పార్ట్స్ వైపు చూపిస్తూ.. తీవ్రంగా బెదిరించారు. ‘దెం..ని పోండి’ అని బూతులు మాట్లాడారు. అయినప్పటికీ చెన్నకేశవరెడ్డి ఓర్పుగానే తన వాళ్లను లోపలికి పంపాలని అడిగారు. ఆపై ఇతర పోలీసులు వచ్చి చెన్నకేశవరెడ్డిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. పోలింగ్ స్టేషన్‌కు దూరంగా ఉన్నా కూడా అక్కడ ఉండకుండా పంపించేశారు. చెన్నకేశవరెడ్డి వర్గీయులను నామినేషన్ కూడా వేయించలేదు. గేటు వేసిన తర్వాత టీడీపీ వ్యక్తులను నిచ్చెనపై నుంచి లోపలికి పంపి ఎన్నికలు ముగించేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, వయస్సును కూడా గౌరవించకుండా సీఐ ఇలా వ్యవహరించడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
వైఎస్సార్సీపీ ధర్నాల్లో స్వల్ప మార్పు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ సీపీ ధర్నాల్లో స్వల్ప మార్పు జరిగింది. ప్రజా సమస్యలపై ఉద్యమ బాటలో భాగంగా ఆ పార్టీ ఈ నెల 11న రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన రైతుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాన్ని 13వ తేదీకి వాయిదా వేసింది. ఐదు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోడ్ ఉన్నందున వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. 13న రైతాంగ సమస్యలపై జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించింది. మిగతా కార్యక్రమాలు యథాతథంగా జరగనున్నాయి.కూటమి ప్రభుత్వ మోసాలను నిలదీసి, ప్రజా సమస్యలపై ఉద్యమబాటకు వైఎస్ జగన్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రైతు సమస్యలపై ఈ నెల 13న, కరెంటు ఛార్జీల మోతపై 27న, విద్యార్ధులకు బాసటగా ఫీజు రీఇంబర్స్‌మెంట్‌పై జనవరి 3 న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.కూటమి ప్రభుత్వంలో వ్యవసాయ రంగం కుదేలైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్బీకేలు స్థాపించి, ఈ–క్రాప్ పెట్టి పారదర్శకంగా ప్రతి రైతుకు ఆర్బీకే ద్వారా ఉచిత పంటల బీమా అందించింది. దళారుల వ్యవస్థ లేకుండా ధాన్యం నేరుగా రైతు వద్దకే వచ్చి కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టింది. చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత ఏ రైతుకూ ధాన్యానికి కనీస మద్దతు ధర రావడం లేదని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: దుర్మార్గ పాలనపై పోరాటం: వైఎస్ జగన్ -
ఉద్యోగ భద్రత కోసం చంటి బిడ్డలతో టీచర్ల ధర్నా
అమరావతి: ‘డీఎస్సీ నుంచి మినహాయించి.. తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్స్ (సీఆర్టీ)గా కన్వర్ట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏడాది మూడు నెలల చంటి బిడ్డను ఒడిలో పెట్టుకుని ధర్నా చేస్తున్న ఈమె పేరు పి.పర్శిక. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కూనవరం గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో సైన్స్ టీజీటీగా పనిచేస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీలో తమ పోస్టులు కూడా ఉండడంతో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న తన ఉద్యోగం పోతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.దాదాపు 237 కిలోమీటర్ల దూరంలోని కూనవరం నుంచి విజయవాడకు వచ్చి తన ఉద్యోగానికి భరోసా కల్పించేలా కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్ (సీఆర్టీ)గా కన్వర్ట్ చేయాలని రోజుల తరబడి ధర్నా చేస్తోంది’.పర్శిక టీచర్‌తోపాటు వందలాది మంది తమ ఊరు, వాడ, గూడు వదిలి వచ్చి విజయవాడ ధర్నా చౌక్‌లో గత 13 రోజులుగా శాంతియుత నిరసన కొనసాగిస్తున్నా సర్కార్ కనికరించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరిస్తామని లోకేశ్ ఓఎస్డీ చెప్పిన గడువు శుక్రవారంతో ముగుస్తుందని, తమ డిమాండ్లపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని గిరిజన గురుకులాల ఔట్ సోర్సింగ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మీనాయక్ గురువారం నాటి కార్యక్రమంలో తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టంచేశారు. – సాక్షి, అమరావతి -
అదానీ, అల్లుడి కోసమే రేవంత్ పాలన: కేటీఆర్
సాక్షి,మహబూబాబాద్: ఏడాదిలో ఇరవైఎనిమిదిసార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. లగచర్ల ఫార్మాసిటీ బాధితులకు న్యాయం చేయాలని సోమవారం(నవంబర్ 25) మహబూబాబాద్ పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ మహాధర్నాలో కేటీఆర్ మాట్లాడారు.‘చిన్న సన్న కారు రైతులపై రేవంత్‌రెడ్డి జులుం ప్రదర్శిస్తున్నారు. లగచర్లలో సొంత అల్లుడి కోసం రేవంత్ పేదల భూములు లాక్కుంటున్నారు. రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పాలి. లగచర్లలో పేదల భూములను వెంటనే తిరిగి ఇచ్చేయాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. మహాధర్నాలో కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే.. లగచర్లలో 3 వేల ఎకరాల భూములను చెరబట్టాలని చూశారుసీఎం రేవంత్ రెడ్డి.. తన సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించిన ప్రజలను ఇబ్బంది పెడుతున్నారుఢిల్లీకి 28 సార్లు వెళ్లి 28 రూపాయలు కూడా తేలేదురేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో తిరుగుబాటు ఎదుర్కొంటున్నాడులగచర్లకు అధికారులు పోతే నిరసన వ్యక్తం చేశారు.. రేవంత్ రెడ్డి పోతే ఉరికించి కొట్టేవాళ్ళుప్రధాని మోదీ.. రైతులు ఏడాది పాటు నిరసన తెలిపితే నల్ల చట్టాలు వెనక్కి తీసుకున్నారురేవంత్ రెడ్డి రైతులతో పెట్టుకున్నారుజైల్లో పెట్టిన 30 మందికి సంఘీభావంగా మానుకోటలో ధర్నా చేస్తామంటే.. అడ్డుకునే ప్రయత్నం చేశారుఎవరికోసం ఫార్మా విలేజ్..?.. అల్లుడి కోసం పేదవాళ్ల భూములు లాక్కుంటున్నారుముఖ్యమంత్రి పేదల కోసం పనిచేయడం లేదు..అదాని కోసం.. అల్లుడి కోసం.. అన్నదమ్ముల కోసం పనిచేస్తున్నారుపేద ప్రజల కోసం సీఎం రేవంత్ రెడ్డి పనిచేయడం లేదుఇంకా నాలుగు రోజులు అయితే ఈ ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతుంది.. ఆరు గ్యారెంటీలు అన్నారు .. ఒక హామీ అయినా అమలైందారేవంత్ రెడ్డికి మహారాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు.. కాంగ్రెస్ పార్టీని తన్ని వెళ్ళగొట్టారునేను వస్తే రాళ్లతో కొడతామని కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు.అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామంటే పోలీసులు ఏం చేస్తున్నారుమానుకోట రాళ్ల మహత్యం ఏంటో తెలంగాణ ఉద్యమంలో చూపించాంకోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుంటే.. వెయ్యి మంది వస్తారు అనుకుంటే 20 వేల మంది వచ్చారుప్రభుత్వం మీద ఎన్నో వ్యతిరేకత ఉందో మానుకోట మహా ధర్నా చూస్తే అర్థమవుతుందినాలుగేళ్లు గట్టిగా కొట్లాడుదాం.. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి వస్తాంఢిల్లీకి వెళ్లి గిరిజనులు వివిధ కమిషన్లకు తమ బాధ చెప్తుంటే.. వాళ్లు కూడా ఎంతో బాధపడ్డారుగిరిజనుల రిజర్వేషన్ 6 శాతం నుంచి 10 శాతానికి పెంచారుమానుకోట మొదటి అడుగు మాత్రమే.. రాష్ట్రంలోని ప్రతి తండా, పల్లెకు వెళ్లి మద్దతు కూడా కడతాముఇదీ చదవండి: మహబూబాబాద్‌లో హైటెన్షన్..కేటీఆర్ ఫ్లెక్సీలు చింపివేత -
మహబూబాబాద్‌లో హైటెన్షన్.. కేటీఆర్ ఫ్లెక్సీలు చింపేసిన దుండగులు
సాక్షి,మహబూబాబాద్జిల్లా: లగచర్ల బాధితులకు మద్దతుగా మహబూబాబాద్ పట్టణంలో తహసిల్దార్ ఆఫీసు ఎదుట బీఆర్ఎస్ నేతలు సోమవారం(నవంబర్25) ధర్నా చేయనున్నారు. మహధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు ,ఎమ్మెల్సీలు,మాజీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.అయితే ధర్నా సందర్భంగా మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన కేటీఆర్ ఫ్లైక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు.ఫ్లెక్సీల రగడపై పోలీసులు ఆరా తీస్తున్నారు.మరోవైపు గో బ్యాక్ కేటీఆర్ అని పోస్టర్లు వెలిశాయి.దీంతో మహాధర్నాకు భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.ధర్నాలో ఏమి జరుగుతుందోనని స్థానికంగా టెన్షన్ నెలకొంది.ధర్నాను అడ్డుకొని తీరుతామని స్థానిక గిరిజనులు,కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరించారు.ఇదీ చదవండి: నేడు బీఆర్ఎస్ మహాధర్నా -
వలంటీర్లను కొనసాగించాలి
సీతమ్మధార/చిలకలూరిపేట/తిరుపతి అర్బన్: వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి, రూ.10 వేల వేతనం చెల్లిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు ధర్నా నిర్వహించారు. విశాఖ జీవీఎంసీ గాం«దీపార్కులో జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు మణి మాట్లాడుతూ చంద్రబాబు చెప్పిన మాటకు పూర్తి భిన్నంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ లేదని ప్రకటించడం విశ్వాస ఘాతుకమని దుయ్యబట్టారు. తక్షణం వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఏపీ ప్రజా గ్రామ వార్డు వలంటీర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంధం దీప్తి మాట్లాడుతూ కరోనా సమయంలో ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు సేవలందించామని గుర్తు చేశారు. చాలామంది కరోనా రోగుల్ని ఆస్పత్రులకు తీసుకెళ్లి, మెరుగైన వైద్యం అందించామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తమ బతుకులు నడిరోడ్డు మీదికి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. వలంటీర్లకు న్యాయం చేయకపోతే విజయవాడలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం కక్షసాధింపు తగదు ఇచ్చిన హామీ మేరకు వార్డు, గ్రామ వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని ఏపీ వలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జంగాల చైతన్య డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి వలంటీర్లను విధుల్లోకి తీసుకొనేది లేదని చేసిన ప్రకటనకు నిరసనగా శుక్రవారం వలంటీర్లతో కలసి చిలకలూరిపేటలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఉన్న వలంటీర్లను కొనసాగిస్తూ వాళ్లకు ఉద్యోగ భద్రత కలిగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతోపాటు ఐదు నెలల బకాయిలు చెల్లించి రూ.10 వేల గౌరవవేతనం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని, రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేసిన వలంటీర్లను కొనసాగేలా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. సీఎం, డిప్యూటీ సీఎం న్యాయం చేయాలి ‘మా ఉద్యోగం మాకు ఇవ్వండి.. మాకు రాజకీయ రంగు పూయకండి..ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అదేశాలను తు.చ. తప్పకుండా పాటించడమే మా పని.. గత సర్కార్లోను ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడంలో వారధిలాగానే పనిచేశాం’ అంటూ వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం వద్ద వలంటీర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచి్చన హామీని నిలబెట్టుకోమని గుర్తుచేస్తున్నట్లు చెప్పారు. -
బీఆర్ఎస్ మహబూబాబాద్ ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: గిరిజనులు, దళితులపై జరిగిన దాడికి నిరసనగా మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ తలపెట్టిన గిరిజన రైతు ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అనుమతిస్తూ.. ధర్నాలో వెయ్యి మంది మాత్రమే పాల్గొనాలని షరతు విధించింది.అయితే, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన రైతు ధర్నా ఇవాళ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.. కానీ పోలీసులు అనుమతించకపోవడంతో గిరిజన రైతు ధర్నాకు అనుమతి ఇవ్వాలంటూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. ధర్నాకు అనుమతినిస్తూ హైకోర్టు పచ్చజెండా ఊపింది. -
బీఆర్ఎస్కు షాకిచ్చిన పోలీసులు.. కేటీఆర్ పర్యటన వాయిదా
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ తలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. మరోవైపు.. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ కూడా ధర్నా వాయిదా వేసుకుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్.. మహబూబాబాద్ పర్యటనను వాయిదా వేసుకున్నారు.గిరిజన, దళిత, పేద రైతులపై దాడికి నిరసగా మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ నేతలు ధర్నాకు పిలుపునిచ్చారు. కాగా, బీఆర్ఎస్ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో వెంటనే రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మహబూబాబాద్ ఎస్పీ క్యాంపు కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు బుధవారం రాత్రి ధర్నాకు దిగారు.అయినప్పటికీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ రైతు మహా ధర్నాకు కేటీఆర్ కూడా హాజరు కావాల్సి ఉండగా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పర్యటనను రద్దు చేసుకున్నారు. మరోవైపు.. ఈరోజు మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన విధించినట్టు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. నిమిషానికి నలభైసార్ల KCR రావాలే అని తెగ ఒర్లుతావు! అసెంబ్లీలో KCR ముందు నుంచునే మాట దేవుడెరుగు…కనీసం మహబూబాబాద్ లో మహాధర్నా కు అనుమతిచ్చేందుకు ధైర్యం సరిపోవట్లేగా చిట్టినాయుడు?!— KTR (@KTRBRS) November 20, 2024 -
వీఓఏల పోరుబాట
సాక్షి నెట్వర్క్: తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీఓఏలకు సంబంధించి మూడేళ్ల కాలపరిమితితో జారీచేసిన సర్క్యులర్‌ను రద్దుచేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని అమలుచేయాలని వెలుగు వీఓఏల యూనియన్ డిమాండ్ చేసింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ వెలుగు యానిమేటర్స్ (వీఓఏ) ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో బుధవారం కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించారు. ఆ సర్క్యులర్ కారణంగా వీఓఏల కుటుంబాలు రోడ్డున పడతాయని వారన్నారు. దానిని రద్దుచేయాలని ఎన్నికల ముందు తాము ఆందోళన చేస్తున్న సమయంలో టీడీపీ తరఫున వర్ల రామయ్య స్వయంగా హాజరై, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, సర్క్యులర్ని రద్దుచేస్తామని, చంద్రబాబు తన మాటగా నన్ను చెప్పమన్నారని వర్ల హామీ ఇచ్చారని వీఓఏలు విజయవాడలో చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం సర్క్యులర్‌ను రద్దుచేయకపోగా దాని ఆధారంగా మూడేళ్లు పూర్తయిన వీఓఏలను మార్చుకోవచ్చని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటనలు చేయడాన్ని యూనియన్ తప్పుబట్టింది. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఎన్టీఆర్ జిల్లాలో 200 మందిని తొలగించారన్నారు. ఈ సర్కులర్‌ను రద్దుచేసి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వీఓఏలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. హెచ్ఆర్ పాలసీ అమలు, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం అమలుచేయాలని.. నాలుగు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని, మహిళా మార్ట్‌ల్లో బలవంతపు సరుకుల కొనుగోలు ఆపాలని భీమవరం, విశాఖç³ట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు, పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం, అనకాపల్లి, అమలాపురం, కాకినాడలో వీఓఏలు డిమాండ్ చేశారు. కొన్నేళ్లుగా పనిచేస్తున్న వారిని నిబంధనలకు విరుద్ధంగా తొలగించడం అన్యాయమని కర్నూలు, నంద్యాల కలెక్టరేట్ల వద్ద జరిగిన ధర్నాలో వీఓఏలు నినదించారు. రాజకీయ వేధింపులు ఉండవని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వేధింపులు చేయడం ఎంతవరకు న్యాయమని చిత్తూరులో వీఓఏలు ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ ధర్నాలకు ఏపీ వెలుగు వీఓఏ (యానిమేటర్స్) ఉద్యోగుల రాష్ట్ర సంఘం (సీఐటీయూ) నేతృత్వం వహించింది. -
కేటీఆర్ ధర్నాకు అనుమతి నిరాకరణ!
మహబూబాబాద్ రూరల్: ‘లగచర్ల’గిరిజనులకు సంఘీభావంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించ తలపెట్టిన మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనితో బీఆర్ఎస్ నేతలు ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎదుట బుధవారం రాత్రి ధర్నాకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ ఎంపీ మాలోత్ కవిత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు తదితరులు ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘‘మహాధర్నాకు అనుమతి కోసం రెండు రోజులుగా ప్రయతి్నస్తున్నాం. తొలుత అనుమతి ఇస్తామని పోలీసులు చూచాయగా చెప్పారు. తీరా ఎస్పీ అనుమతి ఇవ్వలేమంటూ నిరాకరించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పిరికి పంద చర్య’’అని నేతలు మండిపడ్డారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి దాకా ఎస్పీ కార్యాలయంలో కూర్చోబెట్టి చివరి నిమిషంలో అనుమతి ఇవ్వబోమని చెప్పటం ఏమిటని నిలదీశారు. ధర్నా సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా నియంత్రించలేమని, పోలీసులు చెప్పటం చూస్తే వారి దుస్థితి ఏమిటో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. అయితే బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగినా... పోలీసుల నుంచి స్పందన రాలేదు. దీనితో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అక్కడే నిద్రకు ఉపక్రమించారు. ఈ ధర్నాలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, ఇతర బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. -
కదంతొక్కిన ఆశా వర్కర్లు
సాక్షి నెట్వర్క్: తమ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం అన్ని జిల్లాల్లో వారు పెద్దఎత్తున ధర్నాలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ కదంతొక్కారు. ఎక్కడికక్కడ అధికారులకు వినతిపత్రాలిచ్చారు. పేదలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న తమను ప్రభుత్వం కార్మికులుగా గుర్తించాలని, ఇతర సౌకర్యాలు కల్పించాలని.. ఖాళీ పోస్టులను రాజకీయ జోక్యం లేకుండా ప్రభుత్వమే భర్తీచేయాలని విజయవాడలో నేతలు డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, రూ.60 వేలు పదవీ విరమణ బెనిఫిట్స్ ఇవ్వాలని, బీమా సౌకర్యం కల్పించాలని, చనిపోయిన ఆశాలకు మట్టి ఖర్చుల కింద రూ.20 వేలు చెల్లించాలని నరసరావుపేటలో డిమాండ్ చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం గతంలో చేసుకున్న ఒప్పందాలను వెంటనే అమలుచేయాలని ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆశా కార్యకర్తలు కోరారు. ఈ ఒప్పందాలకు సంబంధించి జీఓలు ఇవ్వమంటే కూటమి ప్రభుత్వం తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడం సరైనది కాదని ఏలూరు, భీమవరంలో నేతలు అన్నారు. గత ఆరునెలల్లో సీఎంను, ఆరోగ్యశాఖా మంత్రిని, అధికారులను అనేకసార్లు కలిసి తమ సమస్యలు వివరించి వినతిపత్రాలు ఇచ్చామని.. అయినా ఎలాంటి స్పందనాలేకపోవడంతో రోడ్డు మీదకు రావాల్సి వచ్చిందన్నారు. సకాలంలో జీతాలు ఇవ్వకుండా.. జీతాలు పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇక ఉదయం నుంచీ ఆందోళన చేసినా డీఎంహెచ్ఓ కలెక్టరేట్ నుంచి బయటకు రాకపోవడంతో అమలాపురంలో ఆశా కార్యకర్తలు కలెక్టరేట్‌లోకి దూసుకువెళ్లారు. దీంతో పోలీసులతో తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. తమపై విధించిన ఆంక్షలను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే, తమను అసభ్యపదజాలంతో పిలుస్తున్నారని, వేధింపులకు గురిచేస్తున్నారని శ్రీకాకుళంలో ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తంచేశారు. తమకు కనీస వేతనాలు అమలుచేస్తామన్న చంద్రబాబు పట్టించుకోకపోవడం అన్యాయమని విశాఖలో నాయకులు మండిపడ్డారు. ఐదు నెలలైనా అమలుచేయకపోవడం బాధాకరం..ఇక తమ ప్రభుత్వం వస్తే ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని టీడీపీ, జనసేన నాయకులు తమ శిబిరాల వద్దకొచ్చి హామీలు ఇచ్చినందున వారికి అధికారం కల్పించారని.. అధికారం పొంది ఐదు నెలలు పూర్తవుతున్నా హామీలు అమలుచేయకపోవడం బాధాకరమని కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వారు ఆవేదన వ్యక్తంచేశారు. కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారంలోకి వచ్చాక ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని వారు విమర్శించారు. తమతో అదనపు పనులు చేయించడం అన్యాయమని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆశా వర్కర్లు అభ్యంతరం వ్యక్తంచేశారు. మిషన్ ఇంధ్రధనస్సు, హౌస్‌హోల్డ్ సర్వే, సంబంధిత ఫార్మెట్లు ఇవ్వకుండా ఆశాలతోనే జిరాక్స్ కాపీల ఖర్చు పెట్టిస్తున్నారని అన్నమయ్య జిల్లా రాయచోటిలో నినాదాలు చేశారు. -
బాబుగారూ.. మట్టి ఖర్చులైనా ఇవ్వండి!
తిరుపతి అర్బన్/సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : అంగన్వాడీ ఉద్యోగులు మృతి చెందితే కనీసం మట్టి ఖర్చులకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోవడం ఏంటి అంటూ.. గత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన చంద్రబాబునాయుడు.. ఇప్పుడు కనీసం మట్టి ఖర్చులకైనా నిధులు కేటాయించాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. శనివారం తిరుపతి, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన ధర్నా చేశారు. వారికి సీఐటీయూ నేతలు మద్దతు పలికారు. సీఐటీయూ తిరుపతి జిల్లా అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల సమయంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఇచి్చన హామీలను కూటమి సర్కార్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా అంగన్వాడీల సంఘం అధ్యక్షురాలు పద్మలీల అధ్యక్షతన పెద్ద ఎత్తున జరిగిన నిరసన ధర్నాలో అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వరి, శ్రామిక మహిళా జిల్లా కనీ్వనర్ లక్ష్మీ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో అంగన్వాడీ కార్యకర్తలకు జీతాలు పెంచుతామని చంద్రబాబు చెప్పిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్‌కు ఓ వినతిపత్రాన్ని అందించారు. పాడేరులో అంగన్వాడీ సంఘం నాయకులు మాట్లాడుతూ.. మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్పు చేయాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి, తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే పెద్దఎత్తున రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని పలుచోట్ల హెచ్చరించారు. -
వెలుగు కార్యాలయం ఎదుట వీవోఏల ఆందోళన
జే.పంగులూరు: టీడీపీ కూటమి నేతల బెదిరింపులే లక్ష్యంగా 18మంది వీవోఏలను అక్రమంగా తొలగించారని నిరసన తెలుపుతూ వీవోఏలు, గ్రామ సంఘం అధ్యక్షులు, డ్వాక్రా మహిళలు సోమవారం మండల వెలుగు కార్యాలయం ముందు నిరవధిక ఆందోళనకు దిగారు. వీరికి సీపీఎం సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమకు న్యాయం జరిగే వరకూ 24 గంటలు వెలుగు కార్యాలయం ఎదుటే ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. మండలంలో 38మంది వీవోఏలు ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. జీతాలున్నా, లేకున్నా గ్రామంలోని మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వారి జీవనోపాధులు పెంచేందుకు తమ వంతు సాయి అందిస్తున్నట్లు పేర్కొన్నారు.ప్రభుత్వాలు ఎన్నిమారినా ఎవరూ తొలగించేవారు కాదనీ, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదునెలల్లోనే 18మంది వీవోఏలను నిర్ధాక్షిణ్ణ్యంగా ఎలాంటి సమాచారం, గ్రూపు సభ్యుల తీర్మానాలు లేకుండా, వారి సంతకాలు ఫోర్జరీ చేసి మరీ అక్రమంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సంబంధించిన వ్యక్తికి మద్దతు తెలపకుంటే ఇంటికి వచ్చే పథకాలు రద్దు చేస్తామని ఒత్తిడి చేసి డ్వాక్రా మహిళలతో వారికి ఇష్టం లేకుండా సంతకాలు చేయించుకుని వారికి నచ్చిన వారిని వీవోఏలుగా నియమిస్తున్నారని వాపోయారు.అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి రాయిణి వినోద్‌బాబు, సీఐటీయూ మండల కార్యదర్శి మల్లారెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి రామారావుతో కలిసి మండల సమైక్య అధ్యక్షురాలు బాచిన నాగలక్ష్మీ, వీవోఏలు, గ్రామ సంఘం అధ్యక్షులు, డ్వాక్రా మహిళలు తహసీల్దార్ సింగారావుకు వినతిపత్రం అందజేశారు. -
నా భర్తకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత
సాక్షి అమరావతి: తన భర్తకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీందర్ రెడ్డి భార్య కళ్యాణి హెచ్చరించారు. ఆమె శనివారం తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. పోలీసులు తన భర్తని రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయని, ఇంతవరకు ఎక్కడున్నాడో ఆచూకీ తెలియడంలేదని ఆమె చెప్పారు. శనివారం ఉదయం టీడీపీ నేత బీటెక్ రవి మాట్లాడిన మాటలను బట్టి చూస్తే.. ప్రభుత్వం తన భర్తకి హాని తలపెట్టే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోందని, ఆయన్ని అంతమొందించాలని పోలీసులు కుట్ర చేస్తున్నారని అనుమానంగా ఉందని చెప్పారు.ఆయన్ని పోలీసులు మీడియా ముందు హాజరు పర్చకపోతే డీజీపీ ఆఫీసు ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఐ–టీడీపీ, విశాఖకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు పినపాల ఉదయ భూషణ్, చంద్ర కిరణ్‌లతో రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ ఐడీ సృష్టించి, దాని ద్వారా షర్మిల, నర్రెడ్డి సునీత, వైఎస్ విజయమ్మలపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని తెలిపారు. దీనిపై రవీందర్‌రెడ్డి కడప ఎస్పీకి అప్పట్లోనే ఫిర్యాదు చేయగా, ఎస్పీ వారిని అరెస్టు చేసి మీడియాకు అసలు విషయాలు వివరించారని తెలిపారు.తన భర్త నిర్దోషి అని నాటి ఎస్పీ ప్రకటనతోనే స్పష్టమైందన్నారు. తన భర్త ఎవరి మీద పోస్టులు పెట్టలేదని, అసభ్యకరంగా పోస్టులు పెట్టినట్లు షర్మిల మాట్లాడటం సరికాదని అన్నారు. పులివెందుల వాసి అయినంత మాత్రాన వైఎస్ భారతి మేడానికి పీఏ అవుతారా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీపై కక్ష ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి గానీ, తన భర్తని పావుగా వాడుకోవడం సరికాదన్నారు. టీడీపీ నేతలకూ ఆడపిల్లలు, వారికి కూడా భర్తలు ఉన్నారు కదా? వారికి ఏమైనా జరిగితే తట్టుకుంటారా అని నిలదీశారు. తాను కూడా ఒక మహిళనే అన్న విషయం గుర్తించాలంటూ కళ్యాణి కన్నీటి పర్యంతమయ్యారు.నా తమ్ముడి ఆచూకీ తెలపాలి: వర్రా మల్లికార్జున్ రెడ్డి రవీందర్ రెడ్డిని పోలీసులు రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు మీడియా ద్వారా చూసి కుటుంబ సభ్యులందరం తల్లడిల్లిపోతున్నామని ఆయన సోదరుడు వర్రా మల్లికార్జునరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తన సోదరుడిని కోర్టులో లేదా మీడియా ముందు హాజరు పరచాలని, లేకుంటే కుటుంబమంతా డీజీపీ ఆఫీసు ఎదుట నిరాహార దీక్ష చేస్తామన్నారు. -
మూసీ నిర్వాసితులకు మద్దతుగా నేడు బీజేపీ ధర్నా
-
ఏక్ పోలీస్ విధానం అమలు చేయండి
సిరిసిల్లక్రైం: రాష్ట్రంలో ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని కోరుతూ బెటాలియన్‌లో విధులు నిర్వర్తించే పోలీసుల భార్యలు గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌చౌక్‌లో గురువారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకే విధానంలో పరీక్ష పెట్టి పోలీస్ ఉద్యోగాలకు ఎంపిక చేసి, విధుల్లో ఒక్కో రకమైన నిబంధనలు పెట్టడం సరికాదన్నారు. బెటాలియన్ విధుల్లోకి వెళ్లిన తమవారు ఇంటికి రావడానికి నెలల సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాన్న ఎక్కడ.. అమ్మా’అని పిల్లలు అడుగుతుంటే కన్నీళ్లు వస్తున్నాయని కన్నీటి పర్యంతమయ్యారు. ధర్నా విషయం తెలుసుకున్న సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అక్కడకు చేరుకొని ఆందోళన విరమించాలని సూచించగా, వారు వినకపోగా నినాదాలు చేస్తూ నిరసనను తీవ్రతరం చేశారు. ఈ క్రమంలోనే వారిని వ్యాన్‌లో సర్దాపూర్ బెటాలియన్‌కు తరలించారు. 17వ బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాస్‌రావును వివరణ కోరగా ఏదైనా సమస్య ఉంటే వినతిపత్రం ఇస్తే ఉన్నతాధికారులకు చెబుతామని, కానీ ఎవరూ వినతిపత్రం ఇవ్వలేదన్నారు. పదో బెటాలియన్ పోలీస్ కుటుంబసభ్యులు కూడా.. ఎర్రవల్లి: బీచుపల్లి పదో బెటాలియన్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు జోగుళాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లిలోని జాతీయ రహదారి–44 కూడలిలో గురువారం బైఠాయించారు. ఏక్ స్టేట్– ఏక్ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న అలంపూర్ సీఐ రవిబాబు ఆధ్వర్యంలో ఇటిక్యాల, కోదండాపురం ఎస్ఐలు వెంకటే‹Ù, స్వాతి సిబ్బందితో అక్కడికి చేరుకొని పోలీస్ కుటుంబీకులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. ఈ సందర్భంగా పలువురు టీజీఎస్పీ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ బెటాలియన్ పోలీసులకు ఐదేళ్లు ఒకే దగ్గర పోస్టింగ్ ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరారు. -
మా సర్వీస్‌ను రెగ్యులరైజ్ చేయాలి
సాక్షి, అమరావతి/ గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ (విలేజ్ క్లినిక్)లో సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్‌వో)లు డిమాండ్ చేశారు. అదే విధంగా నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులతో సమానంగా తమకు 23శాతం వేతనాలు పెంచాలని కోరారు. ప్రతి నెలా వేతనంతోపాటు ఇన్సెంటివ్ కూడా చెల్లించాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడలోని ధర్నా చౌక్‌లో సోమవారం సీహెచ్‌వోలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విజయవాడకు చేరుకున్న సీహెచ్‌వోల ధర్నాకు పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సీహెచ్‌వోల సమస్యలపై శాసన మండలిలో ప్రస్తావిస్తానని, అదే విధంగా వైద్య శాఖ మంత్రితో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఎన్హెచ్ఎం జేఏసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే 23శాతం జీతాలు పెంచాలని, లేనిపక్షంలో ఇప్పుడు ఇస్తున్న వేతనంతో పాటు ప్రతినెలా రూ.15 వేల ఇన్సెంటివ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈపీఎఫ్‌ను పునరుద్ధరించాలన్నారు. సీహెచ్‌వోల సంఘ రాష్ట్ర అధ్యక్షరాలు ప్రియాంక, ఉపాధ్యక్షుడు ప్రేమ్ కుమార్ తదితరులు మాట్లాడారు. వందలాది మంది సీహెచ్‌వోలు పాల్గొన్నారు. -
ఆర్టిజన్లను విస్మరిస్తే రాష్ట్రవ్యాప్త సమ్మె
హనుమకొండ: ఆర్టిజన్లను కన్వర్షన్ చేయకుండా రిక్రూట్మెంట్కు వెళ్తే రాష్ట్రవ్యాప్త సమ్మెకు వెళ్తామని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ కె.ఈశ్వర్రావు హెచ్చరించారు. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అర్హులైన ఆర్టిజన్లతో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండలోని టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం ఎదుట తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా నిర్వహించారు. ధర్నాకు టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 జిల్లాల నుంచి, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాదిగా ఆర్టిజన్ ఉద్యోగులు తరలివచ్చారు. ధర్నా అనంతరం సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డికి జేఏసీ నాయకులు వినతి పత్రం అందించారు. అంతకుముందు కె.ఈశ్వర్రావు మాట్లాడుతూ, ఆర్టిజన్లను కన్వర్షన్ చేసే వరకు జేఎల్ఎం, సబ్ ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు భర్తీ చేయొద్దన్నారు. ప్రజావాణిలో డిప్యూటీ సీఎంను జేఏసీ నాయకులు కలిస్తే పరిశీలిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. 23వేల మంది ఆర్టిజన్లను కన్వర్షన్ చేయకుండా 3,500 మందిని రిక్రూట్మెంట్ చేస్తామని యాజమాన్యం చెబుతుందని, ఆర్టిజన్లను కన్వర్షన్ చేయకుండా రిక్రూట్మెంట్కు వెళ్తే ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. -
డిక్లరేషన్ కోసం ఢీ
జగిత్యాల టౌన్: జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం రైతులు వివిధ డిమాండ్లతో ఆందోళనకు దిగారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ప్రకటించిన విధంగా షరతుల్లే కుండా రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, మద్దతు ధర, బోనస్, మూతపడిన చక్కర ఫ్యాక్టరీని తెరిపించాలన్న డిమా ండ్లతో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. జిల్లా నలు మూలల నుంచి వేలాదిమంది రైతులు తరలిరాగా.. నిజా మాబాద్ రోడ్డులోని మార్కెట్ యార్డు నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్, పటేల్‌చౌక్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుని ధర్నా చేపట్టారు.దాదాపు 4 గంటల పాటు ఆందో ళన నిర్వహించారు. కథలాపూర్‌కు చెందిన ఒక రైతు సొమ్మ సిల్లి పడిపోవడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని కలె క్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించి న కలెక్టర్ సత్యప్రసాద్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.అనంతరం రైతు ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రూణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీఎం నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్య క్రమంలో రైతు వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు మిట్టపల్లి తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి కర్నె రాజేందర్, బందెల మల్లన్న, బద్దం మహేందర్, వందలాది మంది రైతులు పాల్గొన్నారు. -
స్టీల్‌ప్లాంట్ వద్ద హైటెన్షన్
ఉక్కు నగరం (విశాఖ): విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మంగళవారం కాంట్రాక్ట్ కార్మికులు నిర్వహించిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లపై స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం రాత పూర్వక హామీ ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో మంగళవారం రాత్రి వరకు ధర్నా కొనసాగింది. స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం 4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను ఆకస్మికంగా తొలగించాలని నిర్ణయించి, వారి ఆన్లైన్ గేటు పాసులను నిలిపివేసిన విషయం తెలిసిందే.చివరకు ఒత్తిడిల నేపథ్యంలో యాజమాన్యం వారిని విధుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత కార్మిక సంఘాలతో జరిపిన చర్చల్లో తొలగించిన కార్మికులకు నెలవారీ పాసులు, వేరే రంగు పాసులు ఇస్తామని యాజమాన్యం ప్రతిపాదించింది. దీనికి ఆగ్రహించిన అఖిలపక్ష కార్మిక సంఘాలు ఈడీ బిల్డింగ్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చాయి. పోలీసు బలగాల మోహరింపు ధర్నాకు ముందెన్నడూ లేనివిధంగా విధుల్లో ఉన్న కార్మికులు కూడా హాజరయ్యారు. దీంతో పోలీసు బలగాలు పెద్దఎత్తున మోహరించాయి. పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది కార్మికులను నిలువరించేందుకు ఈడీ భవనం ముందు, వెనుక గేట్లకు తాళాలు వేశారు. దీంతో కార్మికులు భవనం ఎదుట కారిడార్‌లో బైఠాయించారు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన కొందరు కార్మికులు అక్కడి అద్దాలు పగులగొట్టారు. పూల కుండీలు ధ్వంసం చేశారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్మికులు రెండు గేట్ల వద్ద బైఠాయించడంతో భవనం నుంచి ఉద్యోగుల రాకపోకలు నిలిచిపోయాయి. ఒకానొక దశలో పోలీసులు ఆందోళనాకారులను లాఠీల సాయంతో పక్కకు నెట్టారు. అప్పటికే అక్కడికి మీటింగ్‌కు వచ్చి ఉన్న వివిధ విభాగాధిపతులు మధ్యాహ్నం భోజనానికి తమ విభాగాలకు వెళ్లలేక పోయారు. సాయంత్రం 5.30కు ప్లాంట్ నుంచి బయటకు వెళ్లాల్సిన ఉద్యోగులను కూడా బిల్డింగ్ బయటకు అనుమతించక పోవడంతో వారు తమ కార్యాలయాల్లో నిలిచిపోవాల్సి వచి్చంది.డిమాండ్లపై యాజమాన్యం ససేమిరా డిమాండ్ల సాధన కోసం యాజమాన్యం ప్రతినిధులతో కార్మిక సంఘాల నాయకులు పలుమార్లు చర్చలు జరిపారు. గతంలో మాదిరిగా పాసులు ఇవ్వాలని, వారికి పాత రంగులో పాసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై యాజమాన్యం రాతపూర్వకంగా హామీ కోరగా.. యాజమాన్యం ససేమిరా అనేసింది. దీంతో రాతపూర్వక హామీ ఇచ్చే వరకు ధర్నా కొనసాగిస్తామని కార్మికులు తెగేసి చెప్పారు. వర్క్స్ ఉన్నతాధికారులు, హెచ్ఆర్ అధికారులు ఉన్నత యాజమాన్యం అనుమతి కోసం ప్రయత్నం చేసినా సానుకూల స్పందన రాలేదు. ఫలితంగా కార్మికులు మంగళవారం రాత్రి కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. -
27న సిద్దిపేటలో బీఆర్ఎస్ రైతుధర్నా
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో రైతన్నకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ రైతు ధర్నాకు పిలుపునిచ్చింది.రుణమాఫీ,రైతు బంధు,పంట బోనస్ కోసం రైతుధర్నా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయనుంది.సెప్టెంబర్ 27వ తేదీ శుక్రవారం నాడు సిద్దిపేట జిల్లా నంగునూరు వేదికగా రైతు ధర్నా నిర్వహించనున్నట్లు మాజీమంత్రి హరీశ్‌రావు తెలిపారు.రైతు ధర్నాకు పెద్ద ఎత్తున కదిలి రావాలని రైతన్నలకు మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు వదిలిపెట్టబోమని చ్చరించారు.రైతు ధర్నాపై హరీశ్‌రావు శనివారం(సెప్టెంబర్21) రైతులు,పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇదీ చదవండి.. హరీశ్ హార్డ్‌వర్కర్..సలహాలివ్వొచ్చు: మంత్రి పొన్నం -
నేడు పీహెచ్సీ వైద్యుల చలో విజయవాడ
సాక్షి, అమరావతి: పీజీ వైద్యవిద్యలో ఇన్‌సర్వీస్ కోటా కుదింపును నిరసిస్తూ మంగళవారం చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైద్యుల సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ యూనస్‌మీర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్చలకు ప్రభుత్వం పిలుస్తామని చెప్పడంతో సోమవారం వేచి చూసినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ముందు నిర్దేశించుకున్నట్లు మంగళవారం చలో విజయవాడ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీహెచ్సీ వైద్యులు విజయవాడలో ర్యాలీ నిర్వహించి ధర్నాచౌక్‌లో శాంతియుత నిరసనలు తెలుపుతారని పేర్కొన్నారు. ఇంకా ప్రభుత్వం స్పందించకపోతే బుధవారం నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని తెలిపారు. సమ్మె నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీల్లో వైద్యసేవలు అందించబోమని స్పష్టం చేశారు. -
ప్రభుత్వ సాయం అందలేదని బాధితుల ధర్నా
భవానీపురం (విజయవాడపశ్చిమ): బుడమేరు వరద ముంపునకు గురైన తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందటం లేదని కృష్ణానదీ తీర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు గురువారం రాత్రి రోడ్డు మీదకు ధర్నా చేశారు. వరద నీటిలో పూర్తిగా మునిగిపోయిన తమ ఇళ్లలోని వస్తువులను వదిలేసి కట్టుబట్టలతో బయటకు వచ్చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడక్కడా తల దాచుకుంటున్న తాము గత నాలుగు రోజుల నుంచి తాగేందుకు నీరు, తినేందుకు ఆహారం దొరక్క నానా అవస్థలు పడుతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. బాధితులందరికీ సహాయం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వాస్తవ బాధితులకు అందటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో మఫ్టీలో ఉన్న ఓ పోలీస్ నిరసన తెలుపుతున్న మహిళలను ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించడంతో వారంతా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ దూసుకు వచ్చారు. దీంతో అక్కడ ఉన్న మరో ఇద్దరు పోలీసులు అతన్ని తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు. బాధితుల్లో కొందరు భవానీపురంలోని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆఫీస్‌కు వెళ్లగా అక్కడ ఉన్నవారు ‘మీ ప్రాంతం రెడ్ జోన్లో లేదు’ అని చెప్పటంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.కృష్ణానదీ తీర ప్రాంత ప్రజలు ధర్నా చేస్తున్నారని తెలిసి విజయవాడ పశ్చిమ తహసీల్దార్ వచ్చి బాధితులతో మాట్లాడారు. రెడ్ జోన్ విషయంపై ఆయన్ని నిలదీయగా.. అటువంటిదేమీ లేదని, అయితే ఈ ప్రాంతం జాబితాలో లేకపోవడంతో సమస్య ఏర్పడిందని సముదాయించారు. ఉదయమే వచ్చి నష్టపోయిన వారి జాబితా సిద్ధం చేసి సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. -
రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలి
నిర్మల్ చైన్‌గేట్: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివ రకు ఎంతమందికి రు ణమాఫీ చేసిందో శ్వేత పత్రం విడుదల చే యాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వ ర్‌రెడ్డి డిమాండ్ చేశా రు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరి పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు.ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇప్పటి వరకు సగం మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని చెపుతుంటే, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం పూర్తిస్థాయిలో రుణమాఫీ జరిగిందని ఒట్లు వేస్తూ దేవుళ్లను కూడా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ నెలాఖరులోపు రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.కొర్రీలొద్దు.. కోతలొద్దు: రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కొర్రీలు, కోతలు లేకుండా తక్షణమే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ డిమాండ్ చేశారు. రైతు దీక్షలో ఆయన మాట్లాడుతూ, అందరి రుణాలు మాఫీ అయ్యేవరకు రైతుల పక్షాన పోరాడతామన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో ఎంతోమంది రైతులు రుణమాఫీకి దూరమయ్యా రన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్‌రావు పటేల్ పాల్గొన్నారు. -
సంపూర్ణ రుణమాఫీ జరిగే వరకు పోరాటం
సాక్షి, హైదరాబాద్: రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని పేర్కొంటూ, ఇందుకు నిరసనగా భారత్ రాష్ట్ర సమితి గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా నిర్వహించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపు మేరకు రైతులతో కలిసి బీఆర్ఎస్ నేతలు, పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా మండల, నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన రైతు ధర్నాలో పాల్గొన్నారు. రుణమాఫీపై ప్రభుత్వం తీరును ఎండగట్టారు. రేవంత్ ప్రభుత్వం మెడలు వంచి సంపూర్ణ రైతు రుణమాఫీ జరిగేంతవరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.కేటీఆర్ చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు రైతు ధర్నాలో పాల్గొన్నారు. రైతులతో కలిసి నిర్వహించిన ర్యాలీలో కేటీఆర్ పాల్గొన్నారు. ఆలేరు, జనగామ నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన ధర్నాలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో దేవుళ్ల మీద ఒట్లు వేసి సీఎం రేవంత్ రైతులను మోసగించారంటూ, ఆయన చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపం కాకుండా రక్షించాలని యాదాద్రి ఆలయం తూర్పు రాజగోపురం వద్ద హరీశ్‌రావు పాప పరిహార పూజలు చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ కార్యక్రమాలు, పరస్పర దాడులతో ఉద్రిక్తత నెలకొంది.ఈ సందరభంగా గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్తలను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌కుమార్ పరామర్శించారు. కొన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చాలని ధర్నా శిబిరాల్లో రైతులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట ఎమ్మె ల్సీలు, ఇతర నేతలు ధర్నాకు నేతృత్వం వహించారు.తిరుమలగిరిలో రాళ్లు, కోడిగుడ్లతో పరస్పరం దాడులుతిరుమలగిరి (తుంగతుర్తి): సూర్యాపేట జిల్లా తిరుమల గిరిలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు గురువారం పోటాపోటీగా చేపట్టిన కార్యక్రమాలు ఉద్రిక్తతకు దారితీశాయి. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు పట్టణ చౌరస్తాలో ధర్నాకు దిగారు. ఇందుకు పోటీగా అదే ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిందని హర్షం వ్యక్తం చేస్తూ ర్యాలీ చేపట్టారు. బీఆర్ఎస్ శిబిరం వద్ద పలువురు నాయకులు మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుకూలంగా నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ శిబిరం వైపు వెళ్లడానికి ప్రయత్నించారు.పోలీసులు అడ్డుకున్నప్పటికీ కొంతమంది నాయకులు బారికేడ్లను తోసుకొని శిబిరం వద్దకు వెళ్లడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై ఒకరు కోడిగుడ్లు, రాళ్లు, టమాటాలు విసురుకున్నారు. దీంతో ప్రజలు, ఆర్టీసీ ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రాళ్లు రువ్విన సంఘటనలో రెండు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇరు పార్టీల నాయకులకు స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు స్వల్పంగా లాఠీచార్జీ చేసి అందరినీ చెదరగొట్టారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. సూర్యాపేట డీఎస్పీ రవి ఆధ్వర్యంలో సాయంత్రం వరకు పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. సీఎం డైరెక్షన్లోనే బీఆర్ఎస్పై దాడులు: జగదీశ్‌రెడ్డి సంపూర్ణ రైతురుణ మాఫీ కోసం తిరుమలగిరిలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైరెక్షన్లోనే బీఆర్ఎస్పై దాడులు జరుగుతున్నా యని ఆయన ఆరోపించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
రుణమాఫీపై ధర్నాకు బీఆర్ఎస్ పిలుపు
-
మీ గొంతు మూగబోయిందా లోకేశ్?
నెల్లూరు(టౌన్): ‘ఫీజు రీయింబర్స్మెంట్ గురించి యువగళంలో మాట్లాడిన మీ గొంతు మంత్రి పదవి రాగానే మూగబోయిందా లోకేశ్..’ అని ఏబీవీపీ నాయకులు ప్రశి్నంచారు. ‘యువగళంలో మాట్లాడిన నోరు మంత్రి పదవి రాగానే మూగబోయిందా..’ అనే బ్యానర్ చేతపట్టుకుని ఏబీవీపీ నాయకులు సోమవారం నెల్లూరులోని వీఆర్సీ సెంటర్లో ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కనీ్వనర్ రాహుల్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వచి్చన వెంటనే జీవో నంబర్ 77ను రద్దు చేస్తామని లోకేశ్ యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చారని చెప్పారు.ఫీజు రీయింబర్స్మెంట్ లేని కారణంగా ఎంతోమంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని, అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేశ్ మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై మంత్రి లోకేశ్ వెంటనే స్పందించాలని, లేకపోతే ఎక్కడికక్కడ ఆయన పర్యటనలను అడ్డుకుంటామని, సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రోడ్డుపై బైఠాయించిన ఏబీవీపీ నాయకులను పోలీసులు బలవంతంగా ఈడ్చి పక్కన పడేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సమీర్, సుమన్, రాబర్ట్, వినోద్, హేమంత్, సుకుమార్, నవీన్ పాల్గొన్నారు. -
జగన్ వెంటే జాతీయ పార్టీలు..
-
వణికిపోయిన కూటమి.. ఇదీ జగన్ సత్తా..
-
YSRCP దీక్షకు మద్దతు..
-
కూటమికి దాడులు ట్రెండ్ అయిపోయింది
-
ఈ బాబు దేశానికి ప్రమాదకరం
-
ధర్నా సూపర్ సక్సెస్..
-
చంద్రబాబు ఒక్కక్షణం కూడా అధికారంలో కొనసాగే హక్కులేదు..
-
YSRCP నేత షేక్ నాజర్ ఆఫీస్ పై కర్రలు,కత్తులు,రాళ్లతో టీడీపీ నాయకుల దాడి
-
చంద్రబాబుకు అధికారంలో ఉండే హక్కు లేదు: సంజయ్ రౌత్
ఢిల్లీ: ఏపీ కూటమి అరాచకపాలనకు నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన ధర్నాకు శివసేన(యూబీటీ) పార్టీ సంఘీభావం తెలిపింది. బుధవారం మధ్యాహ్నాం వైఎస్ జగన్‌ను కలిసిన ఆ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌రౌత్ తమ పార్టీ మద్దతు ప్రకటించారు. ఏపీ పరిస్థితులకు సంబంధించిన ఫోటో గ్యాలరీని ఆయన సందర్శించారు. అనంతరం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదు. వైఎస్ జగన్‌కు అండగా నిలవడం కోసం నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. మా పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే నాకు ఒకే విషయం చెప్పారు. ప్రభుత్వాలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ, ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం సరికాదు. ఆంధ్రప్రదేశ్‌లో గత 45 రోజులుగా నరమేధం కొనసాగుతోంది. ఈ రాజకీయ కక్ష సాధింపు ఏదైతే ఉందో.. అది దేశానికే మంచిది కాదు. .. దేశంలో కేంద్ర హోం మంత్రి, ఆ మంత్రిత్వ శాఖ ఉంటే.. వెంటనే స్పందించాలి. ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపాలి. అక్కడ జరుగుతున్న దాడుల, విధ్వంసంపై సమగ్ర విచారణ జరిపించాలి. దాడులకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు చూసిన తర్వాత.. మేము ఒక విషయం స్పష్టం చేయదల్చాము. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక్కరోజు కూడా అధికారంలో ఉండే హక్కు లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం లేదు. అందుకే మేము వైఎస్ జగన్‌కు, ఆయన పార్టీకి పూర్తి మద్దతు ఇస్తున్నాము. వైఎస్ జగన్ పోరాటానికి అండగా నిలబడతాం’ అని ఆయన అన్నారు.కేంద్రం తక్షణమే జోక్యం చేసుకోవాలి..శివసేన(యూబీటీ) ఎంపీ, ఆ పార్టీ లోక్‌సభ పక్ష నేత అరవింద్ సావంత్ వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఏపీలో జరిగిన దాడలకు సంబంధించి.. ఫొటో గ్యాలరీ సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ నేను శివసేన లోక్‌సభ పక్ష నేతను. మా ఆత్మకు క్షోభ కలిగించే ఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నాయి. మేము గతంలో చంద్రబాబుతో కలిసి, కూటమిలో ఉన్నాము. ఎన్డీఏలో కూడా కొనసాగాం. శివసేన పార్టీలో చీలిక వచ్చినప్పుడు, చాలా మంది పార్టీని వీడారు. కానీ ఉద్ధవ్ ఠాక్రే గట్టిగా నిలబడ్డారు. సరిగ్గా వైఎస్ జగన్ కూడా రాజకీయాల్లో అలా నిలబడ్డారు. అందుకే మేము మా పార్టీలో జగన్ గురించి మాట్లాడుకుంటాము. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, అన్నీ తట్టుకుని నిలబడ్డారు. ప్రజల మద్దతుతో సీఎం అయ్యారు. నేను ఈరోజు ఇక్కడ కొన్ని చిత్రాలు, వీడియోలు చూశాను. రాజకీయాల్లో గెలుపు, ఓటములు ఉంటాయి. కానీ ఈ తరహాలో ప్రతీకార దాడులు, కక్ష సాధింపు సరికాదు. ఈరోజు నీవు అధికారంలో ఉండొచ్చు. రేపు దాన్ని కోల్పోవచ్చు. కానీ, ఈ విధంగా గెల్చిన తరవాత, ఓడిన పార్టీపై దాడులు చేయడం, ఆ పార్టీ నాయకులను ఎంచుకుని మరీ చంపడం, వారిపై దాడులు చేయడం, వారి ఆస్తులు ధ్వంసం చేయడం.. ఏ మాత్రం సమర్థనీయం కాదు.ఏపీలో సీఎం కుమారుడు ఏకంగా రెడ్ బుక్ పట్టుకుని తిరుగుతున్నారు. విపక్షంపై దాడులను ప్రోత్సహిస్తున్నాడు. రాజకీయాల్లో ఈ తరహా చర్యలు ఏ మాత్రం సరికాదు. ఏపీలో జరుగుతోందే.. మహారాష్ట్రలో కూడా కొనసాగుతోంది. ఈడీ దాడులు. సీబీఐ కేసులు. వేధింపులు. నీవు ఈరోజు అధికారంలోకి రావొచ్చు. రాకపోవచ్చు. రాజకీయాల్లో గెలుపు, ఓటమిలు సహజం. దేన్నైనా స్వీకరించాలి. అంతేకానీ, ఈ తరహాలో విపక్షంపై దాడులు, వేధింపులు సరికాదు. అందుకే వైఎస్ జగన్, ఆయన పార్టీకి అండగా నిలవడానికి, మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. .. మా ముంబైలో తెలుగు ప్రజలు చాలా మంది ఉన్నారు. నేను కేంద్ర ప్రభుత్వానికి ఒక విషయం స్పష్టం చేస్తున్నాను. ఏపీలో ఇంత జరుగుతున్నా, మీరు ఇలాగే కళ్లు మూసుకుని కూర్చుంటే, అది మరో మణిపూర్ అవుతుంది. ఇది ఏ మాత్రం సరికాదు. కాబట్టి, వెంటనే జోక్యం చేసుకొండి. ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడండి. ఈ పోరాటంలో మేము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి అండగా నిలుస్తా. పార్లమెంటులో కూడా వారితో కలిసి పని చేస్తాం’ అని అన్నారు. -
మా అడుగులు జగన్ తోనే..
-
వైఎస్ జగన్ ను కలిసి మద్దతు ప్రకటించిన అఖిలేష్ యాదవ్
-
Watch: ఢిల్లీలో YS జగన్ ధర్నా
-
Watch Live: ఢిల్లీలో జగన్ గర్జన..
-
కూటమి ప్రభుత్వ అరాచకాలు.. ఢిల్లీలో ధర్నా
-
అన్నమో చంద్రబాబూ!
కర్నూలు(సెంట్రల్): ప్రతిష్టాత్మక కర్నూ లు సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల విద్యార్థులు అన్నం కోసం రోడ్డెక్కారు. కళాశాల హాస్టళ్లలో పెడుతున్న పురుగుల అన్నం, నీళ్ల సాంబారు తినలేక కడుపులు కాల్చుకుంటున్నామని కలెక్టరేట్ ఎదుట ఖాళీ ప్లేట్లతో ధర్నాకు దిగారు. తమకు కలెక్టర్ వచ్చి న్యాయం చేసే వరకు కదిలేదిలేదని బీష్మించారు. చివరకు డీఆర్వో వచ్చి హామీ ఇవ్వడంతో కలెక్టరేట్ వద్ద ధర్నాను నిలిపివేశారు. విద్యార్థులు అక్కడి నుంచి వెళ్లి ప్రిన్సిపాల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ కళాశాలలో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. తాగేందుకు, స్నానం చేసేందుకు కూడా నీళ్లు లేవన్నారు. మరుగుదొడ్లను శుభ్రంచేసే వారు లేకపోవడంతో తామే ఆ పనిచేయాల్సి వస్తోందన్నారు. కళాశాలలో చదవే ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థుల మెస్ చార్జీలను క్లస్టర్ యూనివర్సిటీ వసూలు చేసుకుని నిర్వహణకు ముందుకురాకపోవడంతోనే ఇబ్బందులు తలెత్తాయన్నారు. విద్యార్థులు చెల్లించే మెస్ చార్జీల్లో అధిక భాగం బియ్యం కొనుగోలుకే సరిపోతుండటంతో గతం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మానవత్వంతో సిల్వర్ జూబ్లీ కళాశాలకు అవసరమయ్యే బియ్యాన్ని కేజీ రూపాయికే ఇచ్చేలా జీవో ఇచ్చిందని వివరించారు.అయితే, టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ జీవోను అమలు చేయడంలేదన్నారు. దీంతో ప్రస్తుతం కేజీ బియ్యం కోసం కళాశాల రూ.41 చెల్లిస్తోందన్నారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలైతే కేజీ బియ్యం రూపాయికే వస్తాయని, మిగిలిన రూ.40లతో వంటకు అవసరైన కూరగాయలు, నూనెలు, ఇతర అన్ని రకాల సరుకులు కొనుగోలు చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ప్రభుత్వం స్పందించి సిల్వర్ జూబ్లీ కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
నేడు ధర్నాచౌక్‌లో బీజేపీ ధర్నా
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ‘ఫోన్‌ట్యా పింగ్’ అంశాన్ని రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం చేయాలని బీజేపీ భావి స్తోంది. ఫోన్‌ట్యాపింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ లేదా సమగ్ర దర్యాప్తు జరిపించాలనే డిమాండ్‌తో ధర్నాలు, వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమైంది. ఈ కార్యాచరణలో భాగంగా...శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహించనుంది. లోక్‌సభ ఎన్నికల కోడ్ కొనసా గుతున్న నేపథ్యంలో...ఈ ధర్నా నిర్వహణకు ఎన్ని కల కమిషన్ అనుమతి కోరుతూ రాష్ట్ర పార్టీ లేఖ రాసింది.ధర్నాచౌక్‌లో నిరసన తెలిపేందుకు పోలీసుల అనుమతి కోరుతూ సంబంధిత అధికారులకు లేఖను అందజేసింది. ఈ ఆందోళనా కార్యక్రమంలో బీజేపీ ఓబీసీమోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణను నీరుగార్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కేసును తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. -
దొడ్డురకం వడ్లకూ బోనస్ ఇవ్వాలి
భానుపురి (సూర్యాపేట): అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్నరకం, దొడ్డురకం వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ రైతులు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డు గేటు ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని రేవంత్‌రెడ్డి తన మేనిఫెస్టోలో పేర్కొన్నారని, కానీ ఇటీవల కేబినేట్ సమావేశంలో మాత్రం కేవలం సన్నరకం వడ్లకు మాత్రమే ఇవ్వా లని నిర్ణయించడం సరైంది కాదని రైతులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో లబ్దిపొందేందుకే కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి మోసం చేసిందని ధ్వజమెత్తుతూ కొందరు రైతులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రైతుబంధు నిధులను కూడా సకాలంలో అందించాలని, సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం మొండివైఖరిని విడనాడాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతులు భిక్షం, లక్ష్మయ్య, సుధాకర్ తదితరులు హెచ్చరించారు. -
కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోంది: సీఎం సిద్దరామయ్య
బెంగళూరు: కర్ణాటకలో ఉన్న మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు రెండో దశ ఎన్నికల్లో 14 స్థానాలకు ఓటింగ్ జరిగింది. మిగిలిన మరో 14 స్థానాలకు మూడో దశలో మే 07న ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో పాటు పలువురు మంత్రులు, శాసనసభ్యులు ఆదివారం ఇక్కడ ధర్నాకు దిగారు.కరువు సహాయ నిధులను విడుదల చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని సిద్దరామయ్య పేర్కొన్నారు. విధానసౌధ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట వీరంతా ధర్నా నిర్వహించారు.కర్ణాటకలోని మొత్తం 236 తాలూకాల్లో 226 తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, 48 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని మంత్రులు పేర్కొన్నారు. కరువు సహాయం కోసం రూ. 18,171 కోట్లు డిమాండ్ చేస్తే.. కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 3454 కోట్లు మాత్రమే విడుదల చేయడానికి సిద్దమైనట్లు వెల్లడించారు. ఈ మొత్తం రాష్ట్ర డిమాండ్‌లో నాలుగో వంతు కూడా లేదని ఆయన పేర్కొన్నారు. -
సాగునీరు ఇవ్వకుంటే ఆత్మహత్యలే
మంథని: నీరు లేక కళ్లెదుటే పంటలు ఎండిపోతుంటే అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ‘అధికార యంత్రాంగం స్పందించి ఇప్పటికైనా నీరు అందించి చేతికొచ్చే పంటలను కాపాడాలి.. లేదంటే మాకు చావుతప్ప మారోమార్గం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్దపల్లి జిల్లా మంథని – గోదావరిఖని ప్రధాన రహదారిపై మంగళవారం వేలాది మంది రైతులు రాస్తారోకో చేశారు. చేతుల్లో పురుగులమందు డబ్బాలు, వరి గంటలు పట్టుకొని రోడ్డుపై రోడ్డుపై బైఠాయించారు. గంట పాటు ఉండిపోయారు. వరి పొట్టదశకు చేరిందని, నీరు అందక పంట కళ్లముందే ఎండిపోతుంటే గుండెలు తరుక్కుపోతున్నాయని కన్నీటిపర్యంతమయ్యారు. కాలువ నీరే ఆధారంగా పంటలు సాగుచేస్తే ఎగువన ఉన్న కొందరు రైతులు మోటార్లు పెట్టి చివరి ఆయకట్టుకు సాగునీరు అందకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్, నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి నెలకొందని ఆరోపించారు. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో రోడ్డుకు ఇరు వైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న మంథని సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై వెంకటకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన విరమించాలని రైతులను కోరారు. నీటిపారుదల శాఖ ఈఈ బలరాం అక్కడకు చేరుకొని అక్రమంగా విద్యుత్ వినియోగించడంతోపాటు, కాలువలో విద్యుత్ మోటార్లు బిగిస్తున్న విషయంపై తమకు ఫిర్యాదు చేయాలన్నారు. విచా రణ జరిపి వాటిని తొలగించి చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. -
ఆరని అసంతృప్తి జ్వాలలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ లో టికెట్లు రాని అసంతృప్తుల ఆందోళనలు ఆగలేదు. తొలిజాబితా ప్రకంపనలు సోమవారం కూడా కొనసాగాయి. టికెట్లు ప్రకటించిన రోజున ఆదివారం హైదరాబాద్ వేదికగా గాందీభవన్‌కు పరిమితమైన ఆందోళనలు రెండోరోజు గన్‌పార్కు వరకు పాకా యి. గద్వాల టికెట్ ఆశించిన ఉస్మానియా విద్యార్థి నాయకుడు కురువ విజయ్‌కుమార్ నేతృత్వంలో గన్‌పార్కు వద్ద నిరసన తెలిపారు. పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారంటూ నినాదాలు చేశారు. ఇక, పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, బహదూర్‌పుర, చార్మినార్ స్థానాలను ముస్లిం నాయకులను కేటాయించాలని కోరుతూ వరుసగా రెండోరోజు స్థానిక నేతలు, కార్యకర్తలు గాంధీభవన్ మెట్లపై ధర్నా చేశారు. కాగా, పార్టీ నేతలపై ఆర్థిక ఆరోపణలు చేసిన కురవ విజయ్‌కుమార్, గాం«దీభవన్ మెట్లపై ధర్నా చేసిన పాతబస్తీ నేత కలీమ్‌లను సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. నాగం వాట్ నెక్స్ట్ ఇక, నాగర్‌కర్నూల్ టికెట్ ఆశించి భంగపడిన మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి స్థానిక కేడర్‌తో సమావేశమయ్యారు. మరోవైపు మాజీ ఎంపీలు మధుయాష్కీగౌడ్, బలరాం నాయక్, సురేశ్‌షెట్కార్, సిరిసిల్ల రాజయ్యలు మధుయాష్కీ నివాసంలో సమావేశమయ్యారు. పార్టీ విడుదల చేసిన తొలి జాబితాతో పాటు ఇంకా ఖరారు కాని టికెట్ల వ్యవహారంపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్‌ఠాక్రే బుజ్జగింపుల కోసం రంగంలోకి దిగారు. సోమవారం గాం«దీభవన్‌లోని వార్‌రూంలో ఆయన చాలా సేపు అసంతృప్తులతో మంతనాలు జరిపారు. ఉప్పల్‌తో పాటు నగరంలోని పలు నియోజకవర్గాలకు చెందిన నాయకులు ఆయనతో భేటీ అయ్యారు. టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణాలను వివరించిన ఠాక్రే ఆయా నేతల రాజకీయ భవిష్యత్తుపై హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ ఇద్దరు నేతల సస్పెన్షన్... ఇక, కురువ విజయ్‌కుమార్, కలీమ్‌లను సస్పెండ్ చేయా లని టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ నిర్ణయించింది. సోమవారం గాం«దీభవన్‌లో సమావేశమైన కమిటీ టికెట్ రాలేదన్న ఆక్రోశంతో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి గాందీభవన్ లో పార్టీ నాయకుల దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం, ఫ్లెక్సీలను చించి వేయడం, నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలను సీరియస్‌గా పరిగణించింది. టికెట్ల విషయంలో పీసీసీ అధ్యక్షుడిని మాత్రమే బాధ్యుడిని చేయడం కక్షపూరిత చర్యగా భావించిన కమిటీ కురువ విజయ్ కుమార్ (గద్వాల), కలీమ్‌బాబా (బహదూర్‌పుర)లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేవంత్ టార్గెట్‌గా ఆందోళనలు.. కాగా, అటు గాందీభవన్‌లో, ఇటు గన్‌పార్క్ వద్ద సోమవారం జరిగిన ఆందోళనల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కేంద్రబిందువు అయ్యారు. ఉస్మానియా విద్యార్థి నేత కురువ విజయ్‌కుమార్ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తనకు కేటాయించాల్సిన గద్వాల టికెట్‌ను రూ.10 కోట్ల నగదు, 5 ఎకరాల భూమికి అమ్ముకున్నాడని ఆరోపించారు. ఇప్పటివరకు పార్టీ లో 65 టికెట్లను రూ.600 కోట్లకు అమ్మేశారని ఆరోపించారు. దీంతో పాటు గాం«దీభవన్‌లో పాతబస్తీ నేతల ఆందోళనలోనూ రేవంత్‌ను విమర్శిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. 90 శాతం ముస్లిం ఓటు బ్యాంకు ఉండే స్థానాలను హిందువులకు కేటాయించడమేంటని, పాతబస్తీలో ఎంఐఎంపై గట్టిగా పోటీ చేయాలన్న ఆసక్తి రేవంత్‌కు లేదంటూ çప్లకార్డులు ప్రదర్శించడం చర్చనీయాంశమయింది. ఇక, నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత మళ్లీ కాంగ్రెస్ పార్టీ లోకి వస్తున్నారన్న వార్తల పట్ల స్థానిక డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పార్టీ లో చేరుతున్నారన్న వార్తలు కూడా స్థానిక నాయకత్వంలో అసంతృప్తిని రగిలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్లున్న తొలి జాబితా విడుదల తర్వాతే ఇంతటి అసంతృప్తి వ్యక్తమయితే ఇక రెండో జాబితా విడుదలయితే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. -
ఆరేళ్ల ప్రేమ, ఐదేళ్ల కిందట వేరొకరితో పెళ్లి.. కొడుకు పుట్టాక ప్రియుడు కావాలని..
నల్గొండ : తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తన ప్రియుడు మోసం చేశాడంటూ వివాహిత రోడ్డుపై ధర్నా చేపట్టింది. ఈ ఘటన వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామానికి చెందిన తరికొప్పుల శిరీష, ఆమనగల్లుకు చెందిన మహేష్ గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం శిరీష ఇంట్లో తెలియడంతో ఐదేళ్ల క్రితం ఆమెకు కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో వివాహం చేశారు. అయినప్పటికీ శిరీష, మహేష్ మధ్య ప్రేమ కొనసాగుతూనే వచ్చింది. శిరీష విడాకులు తీసుకుంటే తాను వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఆమె తన భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆమెతో పెళ్లికి మహేష్ నిరాకరిస్తున్నాడు. ఈ విషయమై పెద్ద మనుషులను ఆశ్రయించినప్పటికీ పట్టించుకోకపోవడంతో శనివారం మహేష్ స్వగ్రామమైన ఆమనగల్లుకు శిరీష చేరుకొని తనను పెళ్లి చేసుకోవాలని భీమారం–సూర్యాపేట రహదారిపై ధర్నా చేపట్టింది. అయితే శిరీష తన భర్తతో లీగల్‌గా విడాకులు తీసుకోలేదని, ఆమెకు మూడేళ్ల వయస్సు గల కుమారుడు ఉన్నట్లు తెలిసింది. -
వైద్య విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలి
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): గాంధీ వైద్య కళాశాల వైద్య విద్యార్థుల సస్పెన్షన్‌పై పునరాలోచించాలని కోరు తూ వైద్య విద్యార్థులు ప్రిన్సిపాల్ కార్యాలయాన్ని ముట్టడించి శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. గాంధీ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌కు పాల్పడిన పదిమంది వైద్య విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గాంధీ వైద్య విద్యా ర్థులు మంగళవారం ప్రిన్సిపాల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈక్రమంలో గాంధీ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, చిలకలగూడ సీఐ మట్టంరాజులు వైద్యవిద్యార్థులతో పలుమార్లు చర్చలు జరిపారు. ఢిల్లీలోని యూజీసీ యాంటీ ర్యాగింగ్ సెల్‌కు ఫిర్యాదు అందిన నేపధ్యంలో.. అక్కడి ఉన్నతాధి కారుల సూచన మేరకు గాంధీ వైద్య కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీ జరిపిన అంతర్గత విచారణలో ర్యాగింగ్ జరిగినట్లు నిర్ధారణయిందని అధికారులు వివరించారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ తీర్మానం మేరకే చర్యలు చేపట్టామని, ఇది డీఎంఈ నిర్ణయం కాదని స్పష్టం చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై చట్టప్రకారం పోలీస్ కేసులు నమోదు చేయాలని, విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఓ అధికారి పేర్కొన్నారు. డీఎంఈ, గాంధీ ప్రిన్సిపాల్ రమేశ్‌రెడ్డి ప్రస్తుతం అందుబాటులో లేరని, బుధవారం ఆయనతో సమావేశం ఏర్పాటు చేస్తామని వైస్ ప్రిన్సిపాల్ నచ్చజెప్పడంతో విద్యార్థులు ధర్నా విరమించి, తరగతులకు హాజరయ్యారు. -
ర్యాలీ కుదరదు.. షరతులకు లోబడే సభ
సాక్షి, అమరావతి : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్) పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో తలపెట్టిన బహిరంగ సభకు హైకోర్టు షరతులు విధించింది. ఈ షరతులకు లోబడే సభ నిర్వహించాలని ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘానికి తేల్చి చెప్పింది. ర్యాలీకి అనుమతినిచ్చే ప్రసక్తే లేదంది. సంఘం నిర్ణయించిన సెప్టెంబర్ 1న సభకు అనుమతించలేమని, మరో తేదీ చెప్పాలని ఆదేశించింది. ప్రైవేటు స్థలంలో సభకు షరతులు వర్తించవంటే కుదరదని స్పష్టం చేసింది. ప్రైవేటు స్థలంలోనైనా షరతులకు లోబడే సభ నిర్వహించాలని చెప్పింది. ఛలో విజయవాడ పేరుతో ఉద్యోగ సంఘాలు ముద్రించిన కరపత్రంలో 4 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులున్నట్లు పేర్కొన్నారని, ఇంత పెద్ద స్థాయిలో సమావేశానికి పిలుపునిచి్చనప్పుడు షరతులకు కట్టుబడి ఉండాల్సిందేనని తెలిపింది. నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే ఉద్యోగులు సభలో పాల్గొనేందుకు అనుమతిస్తామని తేల్చి చెప్పింది. షరతులను ఉల్లంఘించి సమావేశం నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే వెసులుబాటును పోలీసులకు ఇస్తామంది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సీపీఎస్‌ను రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ డిమాండ్‌తో సెప్టెంబర్ 1న విజయవాడలో ర్యాలీ, బహిరంగ సభకు ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నిర్ణయించింది. 1000 మందితో జింఖానా గ్రౌండ్స్‌లో బహిరంగ సభకు అనుమతి కోరుతూ సంఘం కార్యదర్శి హుస్సేన్ పోలీసులకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సభకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో సంఘం ప్రైవేటు స్థలంలో సభకు పోలీసుల అనుమతి కోరింది. అయితే పోలీసులు ఎలాంటి నిర్ణయం చెప్పకపోవడంతో సంఘం కార్యదర్శి హుస్సేన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపిస్తూ.. ప్రైవేటు స్థలంలో సభకు అనుమతులు అవసరం లేదన్నారు. కేవలం 1,000 మందితో సభ నిర్వహిస్తామని, 4 లక్షల మంది ఉద్యోగులు పాల్గొనరని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది (హోం) వి.మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. సీపీఎస్ ఉద్యోగుల సంఘంలో 4 లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్లు కరపత్రంలో ముద్రించారన్నారు. శాంతిభద్రతల సమస్యను సృష్టించే ప్రమాదం ఉన్నందునే జింఖానా గ్రౌండ్స్‌లో సభకు అనుమతించలేదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి ర్యాలీకి అనుమతినిచ్చేది లేదని చెప్పారు. సభ తాము విధించే షరతులకు లోబడే ఉండాల్సిందన్నారు. మరో తేదీని తెలియజేస్తే దానినిబట్టి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. విద్యుత్ కార్మికుల ధర్నాకూ హైకోర్టు షరతులు విద్యుత్ కార్మిక సంఘాల ధర్నాకు కూడా హైకోర్టు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. సెలవు రోజుల్లో మాత్రమే ధర్నా చేయాలని, తాము నిర్దేశించిన సంఖ్యకు మించి ఉద్యోగులు పాల్గొనడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ధర్నాలో పాల్గొనే ఉద్యోగులందరూ వారం ముందుగానే ఆధార్ కార్డులను పోలీసులకు సమర్పించాలని స్పష్టం చేసింది. రెండు గంటల్లో ధర్నా, నిరసన ముగించేలా ఆదేశాలిస్తామంది. ధర్నాను ఏ రోజున చేపడతారో నిర్ణయించి, తమకు చెప్పాలని నిర్వాహకులను ఆదేశించింది. దాని ఆధారంగా తగిన షరతులతో ఆదేశాలు జారీ చేస్తామంది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ డిమాండ్ల సాధనకు విజయవాడ ధర్నా చౌక్ లేదా జింఖానా గ్రౌండ్స్‌లో ధర్నా, నిరసన కార్యక్రమానికి అనుమతినిచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ పలు వామపక్ష విద్యుత్ కార్మిక సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. పిటిషనర్ల తరఫు న్యాయవాది నల్లూరి మాధవరావు వాదనలు వినిపిస్తూ.. తాము ధర్నా మాత్రమే చేస్తున్నామని, సమ్మెకు దిగడం లేదని చెప్పారు. అందువల్ల ఎస్మా వర్తించదని తెలిపారు. ధర్నా వల్ల విద్యుత్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండబోదన్నారు. ప్రభుత్వ న్యాయవాది (హోం) వి.మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. విద్యుత్ ఉద్యోగులు ఎస్మా పరిధిలోకి వస్తారని, ఎలాంటి నిరసనలు, ఆందోళనలు చేపట్టడానికి వీల్లేదన్నారు. అందువల్ల వీరి ధర్నా, నిరసనకు అనుమతులు ఇవ్వొద్దని కోర్టును అభ్యర్థించారు. -
ప్రగతిభవన్ వద్ద ధర్నాకు సిద్ధమేనా?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్లో 33% మహిళలకు టికెట్ల కేటాయింపు కోసం ప్రగతిభవన్ వద్ద ధర్నా చేసేందుకు ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత సిద్ధమేనా అని టీపీసీసీ అధికార ప్రతినిధి, మునుగోడు కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి సవాల్ విసిరారు. కల్వకుంట్ల కవితకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన తండ్రిపై పోరాటానికి సిద్ధం కావాలని కాంగ్రెస్ మహిళా నేతలు కోరారు. ఒక పార్టీ అధినేతగా తన తండ్రి కేసీఆర్ చేతిలో ఉన్న టికెట్ల కేటాయింపు అవకాశాన్ని వదిలిపెట్టి ఎక్కడో పార్లమెంటులో బిల్లులు గురించి కవిత మాట్లాడటం, జంతర్‌మంతర్ దగ్గర బూటకపు పోరాటాలు చేయడం సరికాదని హితవు పలికారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ...బీఆర్ఎస్ తరఫున మొత్తం 115 మంది అభ్యర్థులను ప్రకటిస్తే అందులో కేవలం ఏడుగురు మహిళలకే టికెట్లు కేటాయించారని, ఆ పార్టీ మహిళాసాధికారిత గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పారు. ప్రధాని పదవితో సహా రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, ఏఐసీసీ అధ్యక్షురాలి పదవులను మహిళలకు ఇచి్చన ఘనత కాంగ్రెస్ పారీ్టదని గుర్తుంచుకోవాలని కోరారు. -
పేదలపై దాడులు చేయడమే ఫ్రెండ్లీ పోలీసా: షర్మిల
హస్తినాపురం: తెలంగాణలో అణగారిన వర్గాలు, పేదలపై పోలీసులు పాశవికంగా దాడులకు పాల్పడటమే ఫ్రెండ్లీ పోలీసా.. అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మి ల మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం హస్తినాపురంలోని శ్యాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు లక్ష్మిని ఆమె పరా మర్శించారు. అనంతరం షర్మిల మాట్లాడు తూ గిరిజన మహిళ అని చూడకుండా లక్ష్మి ని పాశవికంగా చిత్రహింసలకు గురిచేసిన ఎల్బీనగర్ పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెలలో తన కూతురు పెళ్లి ఉందని కార్డు చూపించినా వినకుండా ఎస్ఐ రవికుమార్ చిత్రహింసలకు గురిచేయడం దారుణమన్నారు. పోలీసుల దాడిలో గాయపడిన లక్ష్మి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం, 120 గజాల ఇంటిస్థలం కేటాయిస్తామని మంత్రిగాని, ఎమ్మెల్యేగాని వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ముందు షర్మి ల గంటసేపు ధర్నా చేశారు. అనంతరం నాగార్జునసాగర్ రహదారిపై రాస్తారోకో చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో వనస్థలిపురం ఏసీపీ భీంరెడ్డి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఏసీపీ ఆదేశాలతో షర్మి లను మ హిళా కానిస్టేబుళ్లు అదుపులోకి తీసుకున్నారు. -
వాయిదా వేస్తే ఇప్పట్లో కష్టమే!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 పరీక్షల తేదీల మార్పు కష్టంగానే కనిపిస్తోంది. ఈనెల 29, 30వ తేదీల్లో గ్రూప్–2 పరీక్షల నిర్వహణకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. దాదాపు ఐదు నెలల క్రితమే పరీక్ష తేదీని ప్రకటించింది. అయితే వరుసగా పరీక్షలు ఉన్నాయని, కాబట్టి సన్నద్ధతకు మరింత సమయం కావాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఆందోళన కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. గురువారం టీఎస్పీఎస్సీ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. శుక్రవారం కూడా పలుచోట్ల ధర్నాలు నిర్వహించారు. పలు ప్రతిపక్ష పార్టీలు వీరికి మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో సర్విస్ కమిషన్ తర్జనభర్జన పడుతోంది. వాయిదా వేస్తే ఎదురయ్యే పరిణామాలను అధికారులు సమీక్షిస్తున్నారు. ఇప్పుడు వాయిదా వేస్తే మళ్లీ ఎప్పుడు నిర్వహించొచ్చనే కోణంలోనూ పరిశీలన చేస్తున్నట్లు, ఒకవేళ వాయిదా గనుక వేస్తే దీర్ఘకాలం వేచి చూడాల్సి ఉంటుందనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. వరుస ఎన్నికల ప్రక్రియతో అధికార యంత్రాంగం బిజీగా ఉండడం, రెండున్నర నెలల వరకు ఆన్లైన్ పరీక్షా కేంద్రాలు అందుబాటులో లేకుండా బుక్ అయిపోవడంతో పరీక్షల వాయిదాపై కమిషన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల్లో గందరగోళం... గతేడాది డిసెంబర్లో గ్రూప్–2 ఉద్యోగ ప్రకటన వెలువడింది. రాష్ట్రవ్యాప్తంగా దాదా పు 5.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల తేదీని దాదాపు ఐదు నెలల క్రితమే టీఎస్పీఎస్సీ ప్రకటించింది. దీంతో అభ్యర్థులంతా సన్నద్ధతలో నిమగ్నమయ్యారు. పరీక్ష తేదీ చాలా ముందుగానే ప్రకటించిన నేపథ్యంలో పరీక్ష కోసం పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరీ పుస్తకాలు చేతబట్టారు. అయితే మరికొన్ని పరీక్షలు సైతం సమీప తేదీల్లోనే ఉండటంతో గ్రూప్–2 వాయిదా వేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో కొందరు అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. పరీక్ష నిర్వహిస్తారా? లేదా? అనే సందేహం వారిని వెంటాడుతోంది. అయితే టీఎస్పీఎస్సీ ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఏదో ఒక స్పష్టత ఇచ్చి ఈ గందరగోళానికి తెరదింపాలని అభ్యర్థులు కోరుతున్నారు. -
పుంగనూరు ఘటనకు నిరసనగా ప్రొద్దుటూరులో భారీ ర్యాలీ
ప్రొద్దుటూరు: పుంగనూరులో చంద్రబాబు రెచ్చగొట్టే మాటలు మాట్లాడి పోలీసులపై, ప్రజలపై రాళ్లతో దాడులు చేయించినందుకు నిరసనగా ఆదివారం పుట్టపర్తి సర్కిల్లో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అల్లర్ల సందర్భంగా పోలీసులు కాల్పులు జరిపి ఉంటే ఎన్నో కుటుంబాలకు గర్భశోకం మిగిలేదని, సంయమనంతో వ్యవహరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన పోలీసులు గ్రేట్ అని అభినందిస్తూ వారికి సెల్యూట్ చేశారు. -
బీజేపీ కార్పొరేటర్ల ధర్నా
-
కాంగ్రెస్ ఖజానా నింపుతున్న గహ్లోత్
భరత్పూర్(రాజస్తాన్): రాజస్తాన్ రాష్ట్ర కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలపై బీజేపీ అగ్రనేత అమిత్ షా విమర్శలు గుప్పించారు. శనివారం రాష్ట్రంలోని భరత్‌పూర్‌లో బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో షా ప్రసంగించారు. ‘ ఓవైపు అవినీతి సొమ్ముతో కాంగ్రెస్ అధిష్టానం ఖజానాను సీఎం గహ్లోత్ నింపేస్తుంటే మరోవైపు సరైన కారణం లేకుండానే సచిన్ పైలట్ ధర్నాకు కూర్చుంటున్నారు. క్షేత్ర స్థాయిలో పైలట్ ఎంతగా చెమటోడ్చినా లాభం లేదు. ఎందుకంటే పార్టీ ఖజానాను నింపేస్తూ అధిష్టానం దృష్టిలో పైలట్ కంటే గెహ్లాట్ కొన్ని మెట్లు పైనే ఉన్నారు. రాష్ట్రాన్ని గెహ్లాట్ అవినీతి అడ్డాగా మార్చారు. రాష్ట్ర సొమ్మును లూటీ చేసి ఆ ధనంతో పార్టీ ఖాతా నింపుతున్నారు. దిగబోనని గహ్లోత్ సీఎం కుర్చీపై భీష్మించుకుని కూర్చున్నారు. ఈసారి సీఎం కుర్చీ నాదేనని పైలట్ ప్రతిజ్ఞ చేస్తున్నారు. వీరిద్దరూ అనవసరంగా అధికారం కోసం పోరాడుతున్నారు. వాస్తవానికి ఈ దఫా అధికారంలోకి వచ్చేది బీజేపీ’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. ‘ వారసత్వ రాజకీయాల కోసమే ఇన్నాళ్లూ గహ్లోత్ ప్రభుత్వం పనిచేసింది. కుల రాజకీయాలను రాజేసింది. బుజ్జగింపుల్లో టాప్ మార్కులు ఈ ప్రభుత్వానికే పడతాయి. రాష్ట్రంలో రెండు డజన్లకుపైగా పేపర్లు లీక్ అయ్యాయి. అయినా ఇంకా మీకు అధికారం కావాలా గహ్లోత్ జీ ? లీకేజీలో సెంచరీ కొడతారా ఏంటి ?. రాష్ట్ర ప్రజలకు మీరిక అక్కర్లేదు. ఈసారి మూడింట రెండొంతుల సీట్లు మావే. మొత్తం పాతిక ఎంపీ సీట్లూ గెల్చేది మేమే’ అని షా ధీమా వ్యక్తంచేశారు. ‘ ఇటీవలే రాహుల్ బాబా దేశమంతటా నడుస్తూ భారీ యాత్ర ముగించారు. కాంగ్రెస్‌కు లబ్ధి ఏమేరకు చేకూరుతుందని నన్ను పాత్రికేయులు అడిగారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందిగా’ అని షా అన్నారు. -
న్యాయం చేయాలని వితంతువు ధర్నా
అన్నానగర్: కళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్య కళాశాలలో సోమవారం వితంతువు ఆందోళన చేపట్టింది. కళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రి ఆవిన్ పాల పార్లర్ ఎదుట సోమవారం సాయంత్రం ఓ మహిళ ఏడుస్తూ కనిపించింది. ఆమెను ప్రశ్నించగా తాను వితంతువునని అధికారిక అనుమతి పొంది ఇక్కడ ఆవిన్ పార్లర్ నిర్వహిస్తున్నానని తెలిపింది. సోమవారం పబ్లిక్ వర్క్స్ అధికారులమంటూ కొందరు వచ్చి తన పార్లర్లో విద్యుత్ సరఫరాను నిలిపివేసి, దుకాణం మూసేశారని, పార్లర్‌ను మరొకరికి ఇవ్వడానికే ఖాళీ చేయ మంటున్నారని, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టినట్టు తెలిపింది. -
గనుల వేలం ఆపకుంటే యుద్ధమే
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి, పెద్దపల్లి/సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో శనివారం బొగ్గు గనుల ప్రాంతాల్లో మహాధర్నాలు నిర్వహించారు. భూపాలపల్లి, కొత్తగూడెం, మంచిర్యాల, గోదావరిఖని, రామగుండం, మందమర్రి, నస్పూర్, ఇల్లందులో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరసన తెలిపారు. బొగ్గు గనుల వేలాన్ని కేంద్రం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బీజేపీ హటావో.. సింగరేణి బచావో పేరిట నిర్వహించిన ఈ ధర్నాల్లో మంత్రులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రంపై ప్రధాని సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని నేతలు దుయ్యబట్టారు. కొత్తగూడెంలో... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన మహాధర్నాలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. సింగరేణి బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటు సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే కేంద్రంపై జంగ్ సైరన్ మోగిస్తామని హెచ్చరించారు. సింగరేణిని కాపాడుకునేందుకు సీఎం కేసీఅర్, మంత్రి కేటీఆర్ నాయకత్వాన మరో ప్రజా ఉద్యమం నిర్మిస్తామన్నారు. సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణపల్లి, పెనగడప బొగ్గు బ్లాక్‌ల వేలాన్ని ఉపసంహరించుకోవడమే కాకుండా ఇప్పటికే వేలం వేసిన బ్లాక్‌లను సింగరేణికి కేటాయించాలన్నారు. ఈ ధర్నాలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. భూపాలపల్లిలో... సింగరేణి బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణను రద్దు చేసే వరకు పోరాటాలు నిర్వహిస్తూ కేంద్రంపై ఒత్తిడి తెస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో వారు మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని నాలుగు బొగ్గు బ్లాక్‌లను కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, శంకర్‌నాయక్, నన్నపునేని నరేందర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, అరూరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. నస్పూర్‌లో... అదానీకి కట్టబెట్టేందుకే లాభాల్లో ఉన్న సింగరేణి బొగ్గు బ్లాక్‌లను వేలం వేసేందుకు చూస్తున్నారని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణం సీసీసీ కార్నర్ వద్ద జరిగిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో పది శాతంగా ఉన్న సింగరేణి లాభాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మరింత పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు ఎన్.దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, జోగు రామన్న, రాథోడ్ బాపురావు, ఆత్రం సక్కు, జెడ్పీ చైర్పర్సన్లు రాథోడ్ జనార్దన్, నల్లాల భాగ్యలక్ష్మి , కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీలు పురాణం సతీష్, నారదాసు లక్ష్మణ్‌రావు, సీపీఐ రాష్ట్ర నాయకులు కలవేణ శంకర్, టీబీజీకేఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గోదావరిఖనిలో... సింగరేణిని ప్రైవేటీకరించబోమంటూ గతేడాది రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారం¿ోత్సవం సందర్భంగా చెప్పిన ప్రధాని మోదీ ఆ మాట తప్పారని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ ‘ప్రధాని మోదీ.. నీకు అదానీ కా వాలో.. సింగరేణి కార్మికులు కావాలో తేల్చుకో..’అంటూ డిమాండ్ చేశారు. సింగరేణిని ప్రైవేటీకరిస్తే అందులో పనిచేసే 45 లక్షల మంది కార్మికులు ఏం కావాలని ప్రశ్నించారు. సింగరేణి బొగ్గు టన్నుకు రూ. 4,500కు లభిస్తుంటే ప్రధాని తన దోస్త్ అయిన అదానీకి ఇండోనేసియాలో ఉన్న బొగ్గు కంపెనీ నుంచి టన్నుకు రూ. 24,500 చొ ప్పున ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే చందర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, టీజీకేఎస్ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. -
మా నౌకరీలు మాగ్గావాలే
సాక్షి, హైదరాబాద్: ఈనెల 25న ‘మా నౌకరీలు మాగ్గావాలే’నినాదంతో బీజేపీ ఆధ్వర్యంలో ‘నిరుద్యోగ మహా ధర్నా’నిర్వహించనున్నారు. ఇందిరాపార్కు వద్ద ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరుద్యోగ యువతతో కలసి ఈ ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో నాయకులు సమావేశమయ్యారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా ఇదివరకే రాసిన వివిధ పరీక్షలు రద్దయి దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నందున, వారికి మద్దతుగా వివిధ రూపాల్లో ఆందోళనా కార్యక్రమాలు రూపొందించాలని నిర్ణయించారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా నిర్వహించిన సాగరహారం, మిలియన్ మార్చ్ వంటి అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. ఇందులో భాగంగా తొలుత 25న ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని, పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలని, ఖాళీ ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలనే డిమాండ్లతో ఈ ధర్నా నిర్వహించనున్నారు. ప్రశ్నించే గొంతుకలకు అండగా.. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై గళం విప్పుతూ.. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్న వివిధ సంస్థలు, జర్నలిస్టులకు అండగా నిలవాలని, వారి పక్షాన పోరాడాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. వివిధ సంస్థలు, స్వతంత్ర జర్నలిస్టులకు మద్దతుగా నిలిచేందుకు పార్టీనేతలు వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులతో బండి సంజయ్ ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎం.రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి, పార్టీ లీగల్ సెల్ నాయకులు ఆంటోనీరెడ్డి, పార్టీ కార్యదర్శి జయశ్రీ, అధికార ప్రతినిధి జె.సంగప్ప పాల్గొన్నారు. -
13న విద్యుత్ కార్యాలయాల ముందు కాంగ్రెస్ ధర్నా
సాక్షి, హైదరాబాద్: ఈనెల 13న రాష్ట్రవ్యాప్తంగా కరెంటు ఆఫీసుల ముందు ధర్నాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. రైతులకు నిరంతర విద్యుత్‌ను ఇవ్వని ప్రభుత్వం, ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించేందుకు కూడా అవకాశం ఇవ్వనందుకు నిరసనగా కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 13న అన్ని జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించినట్లు టీపీసీసీ కిసాన్ సెల్ చైర్మన్ సుంకేట అన్వేశ్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆచరణలో విఫలమైందని, రైతులకు రోజుకు 10 గంటలు కూడా కరెంటు అందడంలేదని ఆయన విమర్శించారు. అసలు కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని నమ్ముకుని పంటలు వేసుకున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు నెలరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సమస్యలు ఏర్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం తీరు ఇలానే ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. -
3న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు
ముషీరాబాద్ (హైదరాబాద్): ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా దళిత సంక్షేమానికి తీసుకొచ్చిన దళితబంధు పథకం విధివిధానాలు ప్రకటించాలని అందుకోసం ఫిబ్రవరి 3న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. విద్యానగర్‌లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ దళిత సంక్షేమానికి కృషి చేస్తూ దళితబంధు పథకం తీసుకొచ్చారని, ఈ పథకం లక్ష్యం నెరవేరకుండా ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. నిరుపేదలకి ఈ పథకం చేరే విధంగా విధివిధానాలను ప్రకటించాలన్నారు. జిల్లాస్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కమిటిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరి వెంకటేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ చందు, రాష్ట్ర ప్రధా న కార్యదర్శి తిరుమలేశ్, శ్రీకాంత్, ఓయూ అధ్యక్షుడు ఎల్.నాగరాజు పాల్గొన్నారు. -
మమ్మల్ని కలపండి సారూ
సాక్షి, హైదరాబాద్, ఖైరతాబాద్: తమ పిల్లలతో సహా ఉపాధ్యాయ దంపతుల ఆందోళన, దీక్ష,.. ప్రతిగా పోలీసుల అరెస్టులు.. తల్లిదండ్రులను ఎక్కడికి తీసుకువెళ్తున్నారో.. ఏం జరుగుతోందో తెలియక చిన్నారుల రోదనలు.. వెరసి శనివారం హైదరాబాద్‌లో స్పౌజ్ ఫోరం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దంపతులు నిర్వహించిన ధర్నాలో ఉద్విగ్న వాతావరణం చోటుచేసుకుంది. 13 జిల్లాలకు చెందిన వందలాది మంది ఉపాధ్యాయ దంపతులు తమ పిల్లలతో కలిసి వచ్చి బదిలీలకు సంబంధించిన జీవో 317కి వ్యతిరేకంగా పాఠశాల డైరెక్టర్(డీఎస్సీ) కార్యాలయం ముందు మౌనదీక్ష నిర్వహించారు. ‘ఉద్యోగ దంపతుల్ని కలపండి... ముఖ్యమంత్రి మాటను నిలపండి’... ‘భార్యా భర్తలను, పిల్లలను విడదీయకండి’... ‘అమ్మ అటు ... నాన్న ఇటు.. మరి నేను ఎవరివైపు???’అంటూ ధర్నాలో ప్లకార్డులు ప్రదర్శించారు. భార్య ఒకచోట, భర్త ఒక చోట ఉద్యోగం చేసే పరిస్థితికి స్వస్తి చెప్పి, ఒకే దగ్గర కలిసి ఉండేలా స్పౌస్ బదిలీలు నిర్వహించాలని ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన సంవత్సరంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని, ప్రతి స్పౌస్ బాధితుడికి న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2100 మంది బాధితులు... 615 మందికే స్పౌస్ బదిలీ! దంపతుల బదిలీలను బ్లాక్ చేసిన 13 జిల్లాల్లో 2100 మంది బాధితులు ఉండగా, అందులో 615 మందికి మాత్రమే స్పౌజ్ బదిలీలు జరుగుతున్నాయని నిరసన దీక్ష సందర్భంగా ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. 30 శాతం మందికే దంపతుల బదిలీలు చేపట్టి, పూర్తిగా అవకాశం ఉన్న క్యాడర్లను పక్కకు పెట్టడంతో స్పౌజ్ బదిలీల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలలో ఆవేదన మిగిలిందని వాపోయారు. రసాభాసగా మౌనదీక్ష ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసే క్రమంలో పరిస్థితి రసాభాసగా మారింది. తల్లిదండ్రులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేస్తుండటంతో పిల్లలకు అక్కడ ఏం జరుగుతోందో తెలియక విలపిస్తూ ఉండిపోయారు. దీంతో తల్లులు ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తల్లుల, పిల్లల రోదనలతో కొద్దిసేపు ఉద్విగ్న వాతావరణం నెలకొంది. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన 513మంది ఉపాధ్యాయులను అరెస్టు చేసి నాంపల్లి, చిక్కడపల్లి, గాంధీనగర్, ముషీరాబాద్, బేగం బజార్, నారాయణగూడ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాగా, నిరసన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని నేతలు వివేక్, కాదర్, కృష్ణ, నరేష్, మమత, త్రివేణి, సుజాత స్పష్టం చేశారు. పోలీసుల అరెస్టులను తెలంగాణ ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు సయ్యద్ షౌకత్ ఆలీ ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన వారందరినీ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ ఇచ్చే అవకాశం ఉన్నా ... సంగారెడ్డి జిల్లాలో ఎస్జీటీ కేడర్ లో ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే స్పౌజ్ బదిలీ కోసం దర ఖాస్తు చేసుకున్నారు. ఆ జిల్లాలో 362 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే సూర్యాపేటలో 252 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉంటే... 28 మంది ఎస్జీటీలు మాత్రమే బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో కూడా 40 మంది ఎస్జీటీ దంపతులు బదిలీల కోసం అర్జీ పెట్టుకోగా, 341 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహించనున్న ప్రమోషన్ల ప్రక్రియ ద్వారా కూడా వందల సంఖ్యలో ఖాళీలు ఏర్పడనున్నాయి. ఒకటి రెండు క్యాడర్ల మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ స్పౌజ్ అప్పీళ్ళు అన్నిటినీ క్లియర్ చేసే అవకాశం ఉందని ఉపాధ్యాయుల వాదన. సీఎం కేసీఆర్ వెంటనే తమ సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకున్నారు. -
రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు లైంగికంగా వేధిస్తున్నాడు
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ భారత స్టార్ మహిళా రెజ్లర్లు రోడ్డెక్కారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ అయిన బ్రిజ్‌భూషణ్ సుదీర్ఘకాలంగా తమని లైంగికంగా వేధిస్తున్నారని స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్, సాక్షి మలిక్ సహా 30 మంది రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగారు. ఆయన నియంతృత్వాన్ని, ఆగడాలను అరికట్టేందుకు ప్రధానమంత్రి, హోం మంత్రి జోక్యం చేసుకోవాలని... అధ్యక్ష పదవి నుంచి ఆయన్ని తప్పించేదాకా ధర్నా విరమించబోమని, పోటీల్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు. రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్, ప్రపంచ చాంపియన్‌షిప్ పతక విజేత సరిత మోర్, సంగీతా ఫొగాట్, సత్యవర్త్ కడియాన్, జితేందర్, సుమిత్ మలిక్ తదితర రెజ్లర్లు ధర్నా చేశారు. దేశానికి పతకాలు తెచ్చిన మేటి రెజ్లర్లు రోడ్డెక్కి నినదిస్తుంటే అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ మాత్రం ఈ ఆరోపణల్లో నిజం లేదని తేలిగ్గా కొట్టిపారేశారు. ఏ ఒక్కరినైనా తాను లైంగికంగా వేధించానని నిరూపిస్తే ఉరేసుకొంటానని బ్రిజ్‌భూషణ్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన 66 ఏళ్ల బ్రిజ్‌భూషణ్ 2011 నుంచి డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఉన్నారు. చదవండి: IND VS NZ 1st ODI: గిల్ హల్చల్.. పోరాడి ఓడిన న్యూజిలాండ్ -
భోజనం తినాలంటే భయమేస్తోంది
నెన్నెల: మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులు బుధవారం ఆందోళనకు దిగారు. ప్రతిరోజూ భోజనంలో పురుగులు, రాళ్లు వస్తున్నాయని, ఆ తిండి తినలేక అర్ధాకలితో అలమటిస్తున్నామంటూ ఉదయం అల్పాహారాన్ని బహిష్కరించి విద్యాలయం ఆవరణలో ధర్నా చేపట్టారు. విద్యార్థినులు రోడ్డుపైకి వెళ్లి బైఠాయించేందుకు ప్రయత్నించగా స్పెషల్ ఆఫీసర్ (ఎస్ఓ) అమూల్య వారిని అడ్డుకుని గేటుకు తాళం వేశారు. విషయం తెలుసుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, డీఈవో వెంకటేశ్వర్లు, ఎంఈవో మహేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ రమాదేవి, ఎస్సై రాజశేఖర్ పాఠశాలకు చేరుకుని మూసిఉన్న మెయిన్ గేట్‌ను తెరిపించి లోపలికి వెళ్లారు. మెనూ ప్రకారం భోజనం వడ్డించకుండా నిత్యం కిచిడీ, టమాటా, నీళ్ల పప్పు, చాలీచాలని అన్నం పెడుతున్నారని విద్యార్థినులు రోదించారు. టిఫిన్ బాగుండడం లేదని ఎస్ఓకు చెబితే ‘ఇంటివద్ద టిఫిన్ తింటారా’ అంటూ తీవ్ర పదజాలంతో దూషిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ టీచర్ పద్మ నుంచి సెల్‌ఫోన్ లాక్కొని తామందరినీ గదిలో నిర్బంధించారని సిబ్బంది పేర్కొన్నారు. దీంతో ఎస్ఓ అమూల్యపై డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నెపల్లిలో ఇలానే ప్రవర్తించడంతో సస్పెన్షన్ వేటు పడిందని, మానవతా దృక్పథంతో నెన్నెలకు పంపిస్తే ఇక్కడా అదే పద్ధతి అయితే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఓను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటిస్తూ, కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు. -
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: పంచాయతీల నిధుల విషయంపై ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన ధర్నా కోసం బయలుదేరిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఆయన నివాసం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధర్నాకు అనుమతులు లేవని పోలీసులు అడ్డుకోవడంతో కొద్ది సమయం రేవంత్ రెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం కొనసాగింది. అక్కడి నుంచి వెళ్లేందుకు అనుమతించని పోలీసులు.. రేవంత్‌ను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అరెస్టులు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇంటి నుంచి బయలుదేరే ముందు ధర్నా విషయంపై మాట్లాడారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సర్పంచ్ నిధులను ప్రభుత్వం దొంగిలించిందని ఆరోపించారు. నిధులు కాజేసిన ప్రభుత్వంపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచే కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం కొనసాగుతోంది. ఇదీ చదవండి: టీపీసీసీ చీఫ్ రేవంత్ సహా కాంగ్రెస్ ముఖ్యనేతల హౌస్ అరెస్ట్