
సాక్షి,మహబూబాబాద్‌జిల్లా: లగచర్ల బాధితులకు మద్దతుగా మహబూబాబాద్ పట్టణంలో తహసిల్దార్ ఆఫీసు ఎదుట బీఆర్‌ఎస్ నేతలు సోమవారం(నవంబర్25) ధర్నా చేయనున్నారు. మహధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు ,ఎమ్మెల్సీలు,మాజీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.
అయితే ధర్నా సందర్భంగా మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన కేటీఆర్ ఫ్లైక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపివేశారు.ఫ్లెక్సీల రగడపై పోలీసులు ఆరా తీస్తున్నారు.మరోవైపు గో బ్యాక్ కేటీఆర్ అని పోస్టర్లు వెలిశాయి.
దీంతో మహాధర్నాకు భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.ధర్నాలో ఏమి జరుగుతుందోనని స్థానికంగా టెన్షన్ నెలకొంది.ధర్నాను అడ్డుకొని తీరుతామని స్థానిక గిరిజనులు,కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరించారు.

ఇదీ చదవండి: నేడు బీఆర్‌ఎస్ మహాధర్నా
Comments
Please login to add a commentAdd a comment