పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక
మహబూబాబాద్: లగచ ర్ల బాధితులకు అండగా సోమవారం మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీ దళిత, గిరిజన రైతులతో కలసి మహా ధర్నా నిర్వహించనుంది. మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాల యం ఎదుట ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్ర మం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పా ర్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తదితరులు మీడియాతో మాట్లాడారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న సీఎం రేవంత్‌రెడ్డిలో మార్పు రావాలని, ఆయనలో మార్పు వచ్చేవరకూ వదిలి పెట్టమని ఎర్రబెల్లి అన్నారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వందకుపైగా సీట్లతో బీఆర్‌ఎస్ గెలుపు ఖాయమన్నారు. లగచర్ల రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేసి, వారిని విడుదల చేయాలని, ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీఎం సొంత గ్రామంలో ఆయన కుటుంబ సభ్యుల కారణంగా మాజీ సర్పంచ్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ తలపెట్టిన మహాధర్నాకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారని తెలిపారు.
ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ పోలీసులు సంఘవిద్రోహ శక్తులను ముందే అరెస్ట్ చేసి ధర్నాకు ఆటంకం కలగకుండా చూడాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ ధర్నాకు అనుమతి విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌కు చెంప పెట్టులాంటిందన్నారు. అనంతరం ధర్నా జరిగే ప్రాంతాన్ని నాయకులు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment