maha dharna
-
అల్లుడు, అదానీ కోసం రేవంత్ పని చేస్తున్నాడు
-
KTR: మోదీతోనే ఆందోళన చేసి సాధించుకున్నారు..
-
కేటీఆర్ ఫ్లెక్సీలను చించేసిన గుర్తుతెలియని వ్యక్తులు
-
నేడు మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ మహా ధర్నా
మహబూబాబాద్: లగచ ర్ల బాధితులకు అండగా సోమవారం మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ దళిత, గిరిజన రైతులతో కలసి మహా ధర్నా నిర్వహించనుంది. మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాల యం ఎదుట ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్ర మం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పా ర్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తదితరులు మీడియాతో మాట్లాడారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న సీఎం రేవంత్‌రెడ్డిలో మార్పు రావాలని, ఆయనలో మార్పు వచ్చేవరకూ వదిలి పెట్టమని ఎర్రబెల్లి అన్నారు.ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వందకుపైగా సీట్లతో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. లగచర్ల రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేసి, వారిని విడుదల చేయాలని, ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీఎం సొంత గ్రామంలో ఆయన కుటుంబ సభ్యుల కారణంగా మాజీ సర్పంచ్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ తలపెట్టిన మహాధర్నాకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారని తెలిపారు.ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ పోలీసులు సంఘవిద్రోహ శక్తులను ముందే అరెస్ట్ చేసి ధర్నాకు ఆటంకం కలగకుండా చూడాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ ధర్నాకు అనుమతి విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌కు చెంప పెట్టులాంటిందన్నారు. అనంతరం ధర్నా జరిగే ప్రాంతాన్ని నాయకులు పరిశీలించారు. -
విశాఖ స్టీల్ కు సొంత గనులుకేటాయించాలి..
-
ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో బీజేపీ మహాధర్నా
-
‘తప్పు చేసినోళ్లకు నోటీసులెందుకు ఇవ్వరు?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అన్నీ స్కామ్‌లే అని, లక్షల మంది నిరుద్యోగులతో ఆటలాడుకుంటున్నారని, టీఎస్పీఎస్సీ వ్యవహారంలో బీఆర్ఎస్ సర్కార్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద శనివారం బీజేపీ చేపట్టిన మహా ధర్నాలో ఆయన ప్రసంగించారు. తప్పు చేసిన టీఎస్పీఎస్సీని ఎందుకు రద్దు చేయరు. ఆ కమిషన్ చైర్మన్‌కు ఎందుకు నోటీసులు ఇవ్వరు. దొంగలను వదిలిపెట్టి ప్రతిపక్షాలకు నోటీసులు ఇస్తున్నారు. టీఎస్పీఎస్సీలో అసలు దొంగలను అరెస్ట్ చేయాలి. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి అని బండి సంజయ్ మహాధర్నా సాక్షిగా డిమాండ్ చేశారాయన. తెలంగాణలో అన్నీ స్కామ్‌లేనన్న బండి సంజయ్.. పేపర్ లీకేజీ కేసులో ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారాయన. మంత్రి కేటీఆర్ నిర్వాహకమే దీనికి కారణమని ఆరోపించిన బండి సంజయ్.. కేటీఆర్ రాజీనామా చేయాల్సిందేనని, లేకుంటే ఆయన్ని పదవి నుంచి దించి తీరతామని శపథం చేశారు. విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారం చేస్తున్నారని మండిపడ్డ బీజేపీ చీఫ్.. ముప్ఫై లక్షల మంది యువకులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ.. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేసి తీరతామని ప్రకటించారు. -
బీజేపీ మహాధర్నాకు హైకోర్టు అనుమతి
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులతో కలసి నేడు(శనివారం) ధర్నాచౌక్ వద్ద బీజేపీ నిర్వహించనున్న మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇస్తూ పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. 500 మంది కంటే ఎక్కువ మంది పాల్గొనరాదని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని ఆ పార్టీకి షరతులు విధించింది. షరతులను ఉల్లంఘిస్తే పోలీసులు చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా నిర్వహించుకోవచ్చని పేర్కొంది. ధర్నాలో పాల్గొనే కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ నేతల జాబితాను శుక్రవారంరాత్రి 9 గంటల వరకు పోలీసులకు అందజేయాలని పిటిషనర్‌ను కోర్టు ఆదేశించింది. ఆ మేరకు పోలీసులు భద్రతాఏర్పాట్లు చేయాలని సూచించింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీక్ వ్యవహారంలో ప్రభుత్వతీరును నిరసిస్తూ ఈ నెల 25న హైదరాబాద్‌లోని ధర్నాచౌక్ వద్ద నిరుద్యోగులతో కలసి మహాధర్నా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ధర్నాకు అనుమతి కోరుతూ పోలీసులకు బీజేపీ నేతలు దరఖాస్తు చేసినా ఎటూ తేల్చకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ‘టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై రాజకీయ పారీ్టలు నిరసనలు తెలపకూడదని లేదు కదా. ధర్నాచౌక్ ఉన్నది సమస్యలపై నిరసన నిర్వహించేందుకే.. ధర్నా చౌక్‌లో అనుమతి ఇవ్వకుంటే ప్రజలు ఎక్కడ ధర్నా చేసుకుంటారు? నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉంది’అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. -
కేసీఆర్ ప్రభుత్వ బడ్జెట్ ఓ పెద్ద స్కామ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణకు పట్టిన దరిద్రం కేసీఆర్ కుటుంబమని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విరుచుకుపడ్డారు. నిజామాబాద్‌లో శనివారం డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెబుతూ అనేక హామీలు ఇచ్చిన కేసీఆర్ వాటిని నెరవేర్చకపోగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. మరోవైపు రాష్ట్రంలో విచ్చలవిడిగా స్కాములు నడుస్తున్నాయన్నారు. ధరణి కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పెద్ద స్కామ్, ఇక తెలంగాణ బడ్జెట్ మహా స్కామ్ అని విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. రూ.2.5 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ప్రవేశపెడుతూ అందులో రూ.ఒక లక్ష కోట్లు కూడా ఖర్చు చేయడం లేదన్నారు. గతంలో డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.23,600 కోట్లు బడ్జెట్లో పెట్టి అందులో కేవలం రూ.380 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం నిదర్శనమని విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం లిక్విడ్ డైట్ (మద్యం అమ్మకాలు, చమురుపై పన్నులు)తో నడుస్తోందన్నారు. ఇక పోలీసు శాఖను చలాన్ల శాఖగా మార్చారని ఆయన దుయ్యబట్టారు. మరోవైపు విలువైన ప్రభుత్వ భూములను అమ్ముతూ స్కాములు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యం, మద్దతు ధర, ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాలతోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని విశ్వేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
ఉద్రిక్తంగా మారిన బీసీల మహాధర్నా
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ బీసీల మహాధర్నాతో రెండోరోజు ఉద్రిక్తంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేపట్టారు. వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, గుజ్జ కృష్ణ, లాల్ కృష్ణల నేతృత్వంలో చేపట్టిన చలో పార్లమెంట్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో బీసీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. మహాధర్నాలో వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రసంగించారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర స్థాయిలో 54 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే, అందులో బీసీ ఉద్యోగులు 4.62 లక్షలు మాత్రమే ఉన్నారని తెలిపారు. దేశంలో బీసీలను కేవలం ఓట్లేసే యంత్రాలుగా వాడుకుంటున్నాయని ఆర్.కృష్ణయ్య విమర్శించారు. ప్రదర్శనలో కోల జనార్ధన్, కర్రి వేణు మాధవ్, కృష్ణ యాదవ్ పాల్గొన్నారు. -
‘బీసీల మహాధర్నా’ ఉద్రిక్తం
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని, కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లతో జరిగిన బీసీల మహా ధర్నా ఉద్రిక్తంగా మారింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో వందలాదిమంది జంతర్‌మంతర్ వేదికగా మంగళవారం చేపట్టిన నిరసన కార్యక్రమం పార్లమెంట్ ముట్టడిగా మారింది. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నాయకులు, కార్యకర్తలు బారికేడ్లను దాటుకొని వెళ్ళేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, బీసీ సంఘం నాయకులు, కార్యకర్తల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. చివరకు పోలీస్ ఉన్నతాధికారులు నచ్చజెప్పడంతో బీసీ నేతలు వెనక్కి తగ్గారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. కేంద్రం వైఖరి మార్చుకుని బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించకపోతే కేంద్ర మంత్రులను దేశంలో తిరగనివ్వబోమని, ఆగస్టులో 5 లక్షల మంది బీసీలతో పార్లమెంటును ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీ బిల్లుతో పాటు విద్యా, ఉద్యోగ, ఆర్థ్ధిక, రాజకీయ, పారిశ్రామిక రంగాల్లో జనాభా ప్రకారం బీసీలకు వాటా ఇచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. ఏపీ సీఎం జగన్‌ను చూసి నేర్చుకోండి బీసీలకు హక్కులను కల్పించే విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని ఆర్.కృష్ణయ్య సూచించారు. పార్లమెంటులో బీసీ బిల్లును పెట్టింది కేవలం వైఎస్సార్సీపీనే అని, నామినేటెడ్ పోస్టుల్లోనూ 50% బీసీలకే పదవులు ఇచ్చిన ఏకైక ప్రభుత్వమని కొనియాడారు. -
జీవో 317పై ఉపాధ్యాయుల మహాధర్నా..
-
కేసీఆర్ దేవుడు.. ఆయననే ధర్నాలో కూర్చునేలా చేస్తారా..?
పంజగుట్ట: ‘కేసీఆర్ దేవుడు.. ఆయననే దీక్షలో కూర్చునేలా చేశారు.. కేసీఆర్ కన్నెర్ర చేస్తే ఎవ్వరూ ఉండరు’అంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నినాదాలు చేస్తూ రాజ్‌భవన్ ముందు ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేసేలా చూడాలని మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతి నిధులు గవర్నర్ తమిళిసైను కలసి వినతిపత్రం ఇచ్చేందుకు రాజ్‌భవన్‌లోకి వెళ్లగా బయట ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సూర్యాపేట జిల్లా మోతే మండలం లాల్‌తండాకు చెందిన బానోతు నాగరాజు(38) వ్యవసాయ కూలీ. సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని అభిమానించేవాడు. అప్పులబాధతో ఇబ్బంది పడుతున్నాడు. గురువారం రాజ్‌భవన్ వద్దకు కేసీఆర్ గవర్నర్‌ను కలిసేందుకు వస్తున్నారని పలు పత్రికల్లో చూసి సూర్యాపేట నుంచి రాజ్‌భవన్‌కు వచ్చాడు. వచ్చే సమయంలో తన వెంట ఓ బాటిల్లో పెట్రోల్ తీసుకొచ్చుకున్నాడు. అయితే రాజ్‌భవన్‌కు సీఎం రాకపోవడం, మంత్రులు మాత్రమే లోపలికి వెళ్లడం గమనించిన నాగరాజు.. మధ్యా హ్నం 2:55 గంటల ప్రాంతంలో రాజ్‌భవన్ ముందు ఒంటిపై పెట్రోలు పోసుకున్నాడు. పోలీసులు అడ్డుకుని పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
పాలన చేతకాక ధర్నాలు చేస్తున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలన చేతకాక ధర్నాలు చేస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. నేటి తెలంగాణను, రేపటి భవిష్యత్తును భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. రైతుల నుంచి ధాన్యం కొను గోలు చేయకుండా పలాయనవాదాన్ని అవలం బిస్తున్నారని విమర్శించారు. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలను ధారాదత్తం చేస్తారు కానీ.. రైతుల పంటను మాత్రం కొన లేరా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ‘800 స్కూళ్లలో బువ్వ పెడ్తలె’.. ’ఉద్యోగం రాలేదని మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య’.. అం టూ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను గురు వారం తన ట్విట్టర్ ఖాతాలో షర్మిల పోస్ట్ చేశా రు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను చావు బాట పట్టిస్తున్నారన్నారు. అంతే కాకుం డా బడి బువ్వ బంద్ పెట్టి పేద బిడ్డలను చదు వుకు దూరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఖాళీ గా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం చేతకాదా అని నిలదీశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే తన తొలి సంతకం.. ఉద్యోగ ప్రకటనల పైనే ఉంటుందని షర్మిల స్పష్టం చేశారు. నిరు ద్యోగులు ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీలు భర్తీ చేస్తామని భరోసా కల్పించారు. -
యుద్ధం కాదు.. కేసీఆర్ పతనం మొదలైంది
సాక్షి, హైదరాబాద్: కేంద్రంపై యుద్ధం ఆరం భంకాదు.. సీఎం కేసీఆర్ పతనం ప్రారం భమైందని బీజేపీ ఎమ్మె ల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎవరిపై యుద్ధం చేస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడి యాతో మాట్లాడారు. హుజూరాబాద్‌లో తన గెలుపును జీర్ణించుకోలేక దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ కొత్త డ్రామాకు తెరతీశారని విమర్శించారు. ఈ ఫలితం తర్వాత టీఆర్ఎస్లోచాలా మంది పునరాలోచ నలో పడ్డారని అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌కు, టీఆర్ఎస్కు, కేసీఆర్ కుటుంబానికి తెలంగాణలో ఇక భవిష్యత్ లేదన్నారు. గత 45 రోజులుగా ధాన్యం రోడ్ల మీదే ఉన్నా రైతులు వరి కుప్పలపైనే ప్రాణాలు వదులుతున్నా సీఎం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తనకే అన్నీ తెలుసనే అహం కారంతో చేస్తున్న పనులకు కేసీఆరే పూర్తి బాధ్యత వహించాలన్నారు. అధునాతన సాంకే తికతతో రైస్ మిల్లుల ఏర్పాటుకు సహకరి స్తామని సీఎం గతంలో చెప్పారే తప్ప దానిని అమలు చేయలేదని, సీఎంకు ముందుచూపు లేకపోవడంవల్లే ఈ దుస్థితి తలెత్తిందని అన్నారు. కేసీఆర్ తన కీర్తి గురించి తప్ప ప్రజల గురించి ఎప్పుడూ పట్టించుకోరని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి కరోనా వల్ల జరిగిన ఆర్థిక నష్టం కంటే కేసీఆర్ అనాలోచిత చర్యల వల్ల జరిగిందే ఎక్కువన్నారు. -
కొట్టుకున్నట్లు నటిస్తూ రైతులను చంపుతున్నారు..
రైతులను మోసం చేసేందుకు రాష్ట్రంలోని టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు పోటీపడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలు జేఏసీగా ఏర్పడి రైతులను ఇబ్బంది పెడుతున్నాయని మండిపడ్డారు. ఈ జేఏసీ అంటే.. ‘జాయింట్ యాక్టింగ్ కమిటీ’ అని ధ్వజమెత్తారు. ఇద్దరూ కొట్టుకున్నట్టు నటిస్తూ రైతులను చంపుతున్నారని దుయ్యబట్టారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ను ఆందోళనకారులు ముట్టడించారు. సాక్షి, హైదరాబాద్: రైతులను మోసం చేసేందుకు రాష్ట్రంలోని టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వాలు పోటీ పడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలు జేఏసీగా ఏర్పడి రైతులను ఇబ్బంది పెడుతున్నా యని మండిపడ్డారు. ఈ జేఏసీ అంటే.. ‘జాయింట్ యాక్టింగ్ కమిటీ’ అని ధ్వజమెత్తారు. ఇద్దరూ కొట్టు కున్నట్టు నటిస్తూ రైతులను చంపుతున్నారని దుయ్యబట్టారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ కమిషనరే ట్ను ముట్టడించారు. అక్కడ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. ధాన్యం కొను గోలు చేయాలని డిమాండ్ చేస్తూ పబ్లిక్ గార్డెన్స్ నుంచి బషీర్‌బాగ్ చౌరస్తాలోని కమిషనరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. 4 గంటల ధర్నా అనంతరం కాంగ్రెస్ నేతలు వ్యవసాయ శాఖ అదనపు డైరెక్టర్ విజయ్‌కుమార్‌కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, మండలి సభ్యులు టీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రులు దామోదర రాజనర్సింహా, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, వీ హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్‌ను కేంద్రమే కాపాడుతోంది సహారా కుంభకోణంలో జైలుకు వెళ్లకుండా కేసీఆర్‌ను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా కాపాడుతున్నారని రేవంత్ ఆరోపించారు. ‘ధాన్యం కొనుగోలు చేయమని రైతులు అడుగుతున్నారు. రైతులకు మేలు చేయాలంటే వెళ్లి కల్లాల్లో ఉన్న ధాన్యం చూడాలి. ఏసీలు, టెంట్లు వేసుకొని కూర్చుంటే పోరాటం ఎలా అవుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి పోరాటం చేస్తే రైతులుకు న్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో తిరిగి ఏం ఉద్ధరిస్తారు. పార్లమెంట్ సమావేశాల్లో కేసీఆర్ కార్యాచరణ ఏంటో ప్రకటించాలి. జంతర్‌మంతర్ వద్దకు ధర్నా చేయగలవా, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపగలవా?’ అని రేవంత్ అన్నారు. చైనా, పాకిస్తాన్ కొంటాయా: భట్టి రైతులు పండించిన పంటను రాష్ట్ర, కేంద్ర ప్రభు త్వాలు కాకుంటే.. చైనా, శ్రీలంక, పాకిస్తాన్, బర్మా దేశాలు కొంటాయా అని సీఎల్పీ నేత భట్టి విక్ర మార్క వ్యాఖ్యానించారు. ‘కేంద్ర సర్కార్ తెచ్చిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయని కేసీఆర్.. ఇప్పుడు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయడం విడ్డూరంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో నిత్యావసర ధరలు భారీగా పెరిగాయి. కేసీఆర్‌కు పాలన చేతగాకుంటే దిగిపో వాలి. రోడ్లపై దీక్షలు, ధర్నాలు చేసిన ప్రభుత్వాల ను ఇప్పటివరకు చూడలేదు. కేసీఆర్ పాలనలో రైతుల గుండెలు ఆగిపోతున్నాయి’ అని ఆయన మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేసే కుట్ర చేస్తున్నాయని, డ్రామాలు ఆపి వడ్లు కొనాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. -
ఉప్పెనలా వస్తం..కేంద్రం దిగొచ్చేదాకా పోరు:: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ కుటిలనీతి, దుర్మార్గ విధానాలు, రైతు వ్యతిరేక చట్టాలపై చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతామని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించా రు. తెలంగాణలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయా లని కేంద్రాన్ని పదేపదే అడుగుతున్నా పట్టించుకో వడం లేదని.. పైగా ఇబ్బందులు సృష్టిస్తోందని మండిపడ్డారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతి రేక విధానాలను మార్చుకోవాలన్న డిమాండ్‌తో మహాధర్నా చేపట్టామని.. కేంద్రంపై యుద్ధానికి ఇది ఆరంభమేనని చెప్పారు. హక్కులను కాపాడ టం కోసం ఉత్తర భారత రైతులను కలుపుకొంటామని.. కేంద్రం ప్రభుత్వం దిగివచ్చేదాకా ఉప్పెనలా పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. తెలంగాణలో 100% ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద గురువారం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ మహాధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ విధానాలపై కేసీఆర్ తీవ్రస్థాయి లో విరుచుకుపడ్డారు. రైతులను వరి పంట వేయమంటారా, వద్దంటారా స్పష్టంగా చెప్పాలని.. లేకపోతే తప్పు చేశామని ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. పంట కొనుగోలు అంశం రైతుల జీవన్మరణ సమస్య అని స్పష్టం చేశారు. ధర్నాలో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. రైతుల బాధను దేశానికి తెలిపేందుకే.. ‘తెలంగాణలో పండించే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నాం. సూటిగా సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు మాటలతో కేంద్రం మభ్యపెడుతోంది. తెలంగాణలో పండించే ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి, ఆ తర్వాత సీఎం హోదాలో నేను కేంద్రాన్ని కోరి 50 రోజులు కావస్తున్నా ఉలుకూపలుకూ లేదు. వరిసాగు వద్దని రైతులకు చెప్పడం ఇష్టం లేకున్నా.. ఒకేసారి ప్రత్యామ్నాయ పంటలకు మారాలంటే కష్టమే అయినా.. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వరి వద్దని చెప్తున్నాం. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పందించకున్నా.. రాష్ట్ర బీజేపీ వరి వేయండి అని రైతులకు చెప్తూ మభ్యపెడుతోంది. మన రైతుల బాధ దేశానికి, ప్రపంచానికి తెలియచేసేందుకే మహాధర్నా చేపట్టాం. ఇదేకాదు భారత రైతాంగ సమస్యలపై పోరాటానికి టీఆర్ఎస్ నాయకత్వం వహించి ముందుకు తీసుకుపోతుంది. కొనుగోలు బాధ్యత కేంద్రానిదే.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యుత్, నీటిపారుదల వ్యవస్థలను మెరుగుపర్చుకుని పంటలు పండిస్తు న్నాం. దేశంలో పంటలను కొనుగోలు చేసి, నిల్వచేసే బాధ్యత కేంద్రానిదే. దేశంలో ఆహార కొరతను తీర్చేలా ధాన్యం కొనుగోళ్లకోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకోవాలి. కానీ వ్యవసాయ మార్కెట్లను రద్దు చేస్తూ ప్రైవేటుపరం చేస్తోంది. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమ లు చేయకపోయినా.. కొత్త రాష్ట్రం కాబట్టి సర్దుబాటు చేసుకోవాలని అనుకున్నాం. వరి వేయాలని కేంద్రం చెప్తే.. విత్తనాలు, ఎరువులు అన్నీ ఇచ్చి 70 లక్షల ఎకరాల్లో సాగు చేయించాం. గత యాసంగికి సంబంధించి 5 లక్షల టన్నుల బియ్యాన్ని కేంద్రం ఇంకా తీసుకోవాల్సి ఉంది. మీరు తీసుకోకపోతే మా రైతుల చుట్టూ దిష్టితీసి ఆ బియ్యాన్ని మీ బీజేపీ ఆఫీసు ముందు కుమ్మరిస్తం. అబద్ధపు ప్రచారాలతో: బీజేపీ.. అడ్డగోలు అబద్ధాలతో, వాట్సా ప్, ఫేస్బుక్లో వితండ వాదాలతో వ్యక్తుల కేరక్టర్ దెబ్బతీసే ప్రచారాలు చేస్తూ పాలించాలని అనుకుంటోంది. సీఎం, మంత్రి పదవుల కోసం మేం భయపడే రకం కాదు. ఉద్యమ సమయం లో పదవులను చిత్తు కాగితాల్లా భావించి.. రాజీనామా చేశాం. బీజేపీది రాజకీయ డ్రామా.. ఉత్తర భారత్ రైతు ఆందో ళనలను అణిచివేస్తూ కార్లు ఎక్కించి చంపుతున్నవారు.. ఇక్కడ మన కల్లాల దగ్గర రాజకీయ డ్రామా ఆడుతున్నారు. ప్రపంచ ఆకలి సూచీ (గ్లోబ ల్ హంగర్ ఇండెక్స్) సర్వే లో 116 దేశాల్లో బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ కంటే అట్టడుగున భారత్ 101వ స్థానంలో ఉండటం సిగ్గుచేటు. దేశంలో 12 కోట్ల రైతులు, 40 కోట్ల ఎకరాల భూమి, జీవనదులు, అద్భుతమైన శాస్త్రవేత్తలు ఉన్నరు. బంగారు పంటలు పండే అవకాశం ఉంది. దేశ జనాభాలో సగం మందికి ఉపాధినిచ్చే వ్యవసాయ రంగాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ దేశ ప్రజలు బిచ్చగాళ్లు కాదు. చిప్పపట్టుకుని, బిచ్చమెత్తుకుని బతిమిలాడితే మన సమస్యలకు పరిష్కారం దొరకదు. దేశానికి అన్నం పెడతామంటే ఇంత అరాచకమా? దేశం మూగబోతోంది. మాట్లాడితే కేసులు పెడతాం అంటున్నారు. కేసీఆర్ అలా భయపడే వాడే అయితే తెలంగాణ వచ్చేదే కాదు. మేం పదవుల కోసం, కేసుల కోసం భయపడేవాళ్లం కాదు. – కేసీఆర్ రైతాంగ ఉద్యమం రగలాలి దేశంలో కరెంటు, నీళ్లు ఇవ్వలేని అసమర్థులకు చరమగీతం పాడాలి. మరో పోరాటానికి సిద్ధం కావాలి. దేశంలో కచ్చితంగా ఉద్యమ జెండా ఎగసి.. రైతాంగ ఉద్యమం రగలాలి. దానికి తెలంగాణ నాయకత్వం వహించాలి. రాజకీయం పక్కన పెడితే రణంలో టీఆర్ఎస్ను మించిన పార్టీ లేదు. దేనికీ భయపడకుండా ముందుకు సాగుతాం. గ్రామాల్లో చావు డప్పు కొడతాం. చెట్లకు రైతుల శవాలు వేలాడాలా? ఇది రాజకీయ సమస్య కాదు.. రైతుల జీవన్మరణ సమస్య. ధాన్యం కొనుగోలు చేయక పోతే.. రైతులు విషం తాగాలా? చెట్లకు రైతుల శవాలు వేలాడాలా? మీ దుర్మార్గ చట్టాల కింద ప్రజలు నలిగి నాశనమవ్వాలా? ప్రధానికి రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. యాసంగిలో వరి పంట వేయాలా వద్దా చెప్పండి. లేదంటే మా చావు మేము చస్తాం. రెండు రోజులు వేచి చూసి యుద్ధాన్ని ప్రజ్వరిల్లజేస్తాం. ఎందాకైనా తీసుకెళ్తాం. రాజకీయ కొట్లాటను పక్కనపెట్టి ప్రజల బతుకుదెరువు గురించి కేంద్రం సమాధానం చెప్పాలి. విద్వేషాలతో చిచ్చుపెడ్తున్నరు.. ప్రజా సమస్యలను పక్కనపెట్టి.. అక్కర ఉన్నప్పుడల్లా మతవిద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజల మధ్య చిచ్చుపెట్టి సెంటిమెంటును వాడుకునే రాజకీయాలకు కాలం చెల్లింది. మీ సర్జికల్ స్రైక్‌లు, మీరు సరిహద్దులో ఆడే నాటకాలు, మీరు చేసే మోసాలు మొత్తం బట్టబయలయ్యాయి. ఈ దేశానికి మంచి చేసే ఉద్దేశం, ఆ సంస్కారం బీజేపీకి లేదు. ఎన్నికలొస్తే భైంసా, పాకిస్తాన్ వంటి సెంటిమెంట్‌తో రాజకీయం చేస్తూ, అందులో తెలంగాణను కూడా భాగస్వామిని చేస్తోంది. ఈ దేశం ఎటుపోతుందో చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఈ రోజుతో వంద మందితో ప్రారంభమైన పోరాటాన్ని దేశవ్యాప్తం చేస్తాం. మోదీ విధానాల వల్లే ఇలా.. తెలంగాణ పోరాటాలు, విప్లవాల గడ్డ. పోరాటంతోనే పరాయి పాలన విషకౌగిలి నుంచి బయటపడింది. ఇప్పుడు కూడా ఎలా రక్షించుకోవాలో తెలంగాణకు తెలుసు. రైతుల ప్రయోజనాలను రక్షించేందుకు అవసరమైతే ఢిల్లీ యాత్ర చేస్తాం. ఇటీవల నియోజకవర్గ కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ధర్నాకు కూర్చుంటే రాష్ట్ర ప్రభుత్వమే చేస్తోందా అంటూ వ్యాఖ్యానించారు. 2006లో గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో మోదీ 51 గంటల ధర్నాకు కూర్చున్నారు. మోదీ విధానాల వల్లే సీఎంలు, మంత్రులు ధర్నాలో కూర్చునే పరిస్థితి వచ్చింది.’’ -
ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా
-
దిక్కుమాలిన ప్రభుత్వం కేంద్రంలో ఉంది: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: వరి కొనుగోలు అంశంపై కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య చెలరేగుతున్న మంట ఇప్పట్లో చల్లారేట్లు లేదు. ధాన్యాన్ని కొనుగోలుపై బీజేపీ, టీఆర్ఎస్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం గురువారం మహా దర్నా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ఈ ధర్నలో సీఎం కేసీఆర్‌తో సహా, మంత్రులు, ఎమ్మెల్యే పాల్గొన్నారు. చదవండి: ఇందిరాపార్క్ ధర్నా ముగిశాక రాజ్‌భవన్‌కు టీఆర్ఎస్ పాదయాత్ర? ఈ మేరకు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..తెలంగాణలో పండించే వడ్లను కొంటరా.. కొనరా అని కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం సూటిగా సమాధానం చెప్పకుండా వంకర టింకరగా సమాధానం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గోస తెలంగాణలోనే కాదు..దేశం మొత్తం ఉందన్నారు.. రైతు చట్టాలను రద్దు చేయండని ఏడాదిగా ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తున్నారని గుర్తు చేశారు. వానాకాలం పంటనే కొనే దిక్కు లేదు కానీ కేంద్ర ప్రభుత్వం యాసంగి పంటను ఎక్కడి నుంచి కొంటుందని ఎద్దేవా చేశారు. చదవండి: టీఆర్ఎస్ మహాధర్నా: స్టేజి కింద కూర్చున్న కేటీఆర్.. నాగలితో ఎమ్మెల్యే కేంద్రంలో దిక్కుమాలిన ప్రభుత్వం ఉందని సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. దేశాన్ని పాలించిన అన్ని పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. ప్రస్తుత ఈ దుస్థితికి కారణం ఆ పార్టీలేనని విమర్శించారు. వాస్తవాలు చెప్పలేక కేంద్రం అడ్డగోలు మాట్లాడుతోందని మండిపడ్డారు. హంగర్ ఇండెక్స్‌లో భారత దేశం 101 స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ కంటే భారత్ దీన స్థితిలో ఉందన్నారు. బీజేపీ అబద్ధాలు మాట్లాడుతూ అడ్డగోలు పాలన చేస్తోందని మండిపడ్డారు. ‘ఐటీఆర్ ప్రాజెక్టు ఇవ్వమంటే ఇవ్లేదు.. ప్రతి జిల్లాకు నవోదయాలు ఇవ్వమంటే ఇవ్వలే. చాలా ఓపికతో ఉన్నాం. ఈ సభలో కూడా బీజేపీకి సీఐడీలు ఉన్నారు. నిన్న కూడా ప్రధానికి లేఖ రాసిన. వడ్లు కొంటరా, కొనరా అని అడిగితే ఉలుకు పలుకు లేదు. రైతులు ఇబ్బంది పడతారనే యాసంగిలో వడ్లు వేయొద్దని చెప్పిన. పదవులను చిత్తు కాగితాల్లా ఎన్నిసార్లు వదిలేశామో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. రైతు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు రాజీ పోరాటం చేస్తాం. అనేక సమస్యలను పెండింగ్‌లో పెట్టారు. కుల గణన చేయాలని తీర్మాణం చేసి పంపితే ఇప్పటి వరకు దిక్కు లేదు. సమస్యలను పక్కకు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. నీళ్లివ్వకుండా రాష్ట్రాల మధ్య తగాదాలు పెడుతున్నారు. సమస్యలను ఎత్తి చూపితే పాకిస్తాన్ అని విద్వేషాలు రెచ్చగొడుతోంది బీజేపీ. కరెంట్ కోసం తెలంగాణ 30ఏళ్లు ఏడ్చింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చాకే కరెంట్ సమస్య తీరింది. కరెంట్ మోటర్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెబుతోంది. రైతు కడుపు నిండా కరెంట్ ఇచ్చేది తెలంగాణే. బీజేపీకి చరమగీతం పాడితేనే ఈ దేశానికి విముక్తి’ అని సీఎం కేసీఆర్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. -
టీఆర్ఎస్ మహాధర్నా: స్టేజి కింద కూర్చున్న కేటీఆర్.. నాగలితో ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోలు అంశం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. వరి కొనుగోలుపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో వరి కొనుగోలుపై కేంద్రం అవలంభిస్తున్న ద్వంద వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం గురువారం మహాధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఇందిరా పార్క్ వద్ద కొనసాగుతున్న ఈ ధర్నాలో సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చదవండి: కేంద్రంపై యుద్ధానికి శ్రీకారం చుట్టాం: సీఎం కేసీఆర్ అయితే కేసీఆర్‌తో సహా మంత్రులంతా స్టేజి పైన కూర్చొని ఉండగా కేవలం కేటీఆర్ ఒక్కరే స్టేజి కింద కార్యకర్తలు ముందు కూర్చున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మహాధర్నాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన శరీరంపై వడ్ల కంకులను అంకరించుకొని.. భుజంపై నాగలి పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఇదే తొలిసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ చేపడుతున్న ఆందోళనల్లో ఇది నాలుగోది. అయితే సీఎం కేసీఆర్ స్వయంగా నిరసనలో పాల్గొనడం మాత్రం ఇదే తొలిసారి. గతంలో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలపవడంపై టీఆర్ఎస్ రాష్ట్ర బంద్‌ను నిర్వహించింది. అనంతరం కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన భారత్ బంద్‌లో పాల్గొంది. ధాన్యం సేకరణ సమస్యను తీవ్రంగా పరిగణిస్తూ ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టింది. తాజాగా ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్ ఈ నిరసనలో ఆయన కూడా పాల్గొన్నారు. ఈ మహాధర్నా మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విపక్షాల సమరశంఖం
-
ఇందిరాపార్క్ వద్ద ఎమ్‌ఎస్‌వోల మహా ధర్నా
-
ఓటుతోనే కూల్చేస్తాం
టీడీపీ సర్కారు అనుసరిస్తున్న బీసీల అణచివేత వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. బీసీ సంక్షేమాన్ని గాలికి వదిలేసి సబ్‌ప్లాన్ నిధులను సైతం దారి మళ్లిస్తోందని కన్నెర్ర చేశారు. గత ఎన్నికల సమయంలో వందకుపైగా హామీలిచ్చిన చంద్రబాబు ఏఒక్కటీ అమలు చేయకుండా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం పట్ల మండిపడ్డారు. బీసీలను చిన్నచూపు చూస్తున్న చంద్రబాబుకు గుణపాఠం తప్పదని పేర్కొన్నారు. తమ ఓటుతో గద్దెనెక్కిన టీడీపీ సర్కారుకు వచ్చే ఎన్నికల్లోఅదే ఓటుతో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.బీసీ వర్గాలకు సంఘీభావంగా వైఎస్సార్సీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ధర్నాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలకు భారీ స్పందన వ్యక్తమైంది. అన్ని జిల్లాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, బీసీ సంఘాల నేతలు, ప్రజా సంఘాల నేతలు ఇందులో పాల్గొన్నారు. కుల వృత్తులతో నిరసన తెలిపారు. రాష్ట్రమంతా తన కుటుంబంగా భావించే వైఎస్ జగన్‌ను అధికారంలోకి తెస్తామని ప్రకటించారు. సాక్షి నెట్వర్క్ : రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న మోసంపై బీసీ వర్గాలు మండిపడ్డాయి. చంద్రబాబు సర్కారు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోంది. వారికి ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. ఏటా 10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అమలు చేస్తామన్న హామీని విస్మరించింది. విద్య, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానని హామీ ఇచ్చి, మోసం చేసింది. పదోన్నతుల్లో రిజర్వేషన్లు ఇస్తామంటూ కల్లబొల్లి మాటలు చెప్పింది. బీసీలకు కొత్తగా ఆశ్రమ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేస్తామన్న మాటనూ పక్కన పెట్టింది. నేతన్నలకు ఉచితంగా ఇళ్లు, మరమగ్గాలు ఇస్తామంటూ మాయ మాటలు చెప్పింది. మేకలు, గొర్రెల విక్రయ శాలలు ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా వీటి పెంపకందార్లకు మేలు కలుగుతుందని ఆశలు కల్పించింది. కుల వృత్తి దారుల కోసం అన్ని మండల కేంద్రాల్లో అత్యాధునిక అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పింది. ఇవే కాదు.. ఇలాంటివి అనేక హామీలిచ్చి, ఓట్లేయించుకొని నాలుగున్నరేళ్లు మాయ మాటలతో గడిపేసింది. ఒక్క హామీ నెరవేర్చలేదు. దీంతో బీసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాయి. ఇందులో భాగంగా గురువారం అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలసి నిరసన దీక్షలు, ర్యాలీలు నిర్వహించాయి. వంచనపై ప్రజాగ్రహం టీడీపీ గద్దెనెక్కాక బీసీలను వంచించడానికి నిరసనగా గుంటూరు, చిలకలూరిపేటల్లో వైఎస్సార్ సీపీ పిలుపుమేరకు ధర్నాలు చేపట్టి ర్యాలీలు నిర్వహించారు. గుంటూరు పార్లమెంట్ బీసీ సంఘ అధ్యక్షుడు కూరాకుల కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), షేక్ మొహమ్మద్ ముస్తఫా, గుంటూరు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కిలారి వెంకట రోశయ్య, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు చంద్రగిరి ఏసురత్నం, ఉండవల్లి శ్రీదేవి, మేకతోటి సుచరిత, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆతుకూరి ఆంజనేయులు, చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి డీఆర్వో శ్రీలతకు వినతిపత్రం సమర్పించారు. చిలకలూరిపేటలో నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజని ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, నియోజకవర్గ సమన్వయకర్తలు బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరి శంకరరావు, జెడ్పీ ఫ్లోర్ లీడర్ దేవళ్ళ రేవతి, వైఎస్సార్సీపీ నేత నిమ్మకాయల చినరాజనారాయణ తదితరులు ఇందులో పాల్గొన్నారు. కర్నూలు, నంద్యాలలో కదం తొక్కిన బీసీలు బీసీల ద్రోహి చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పడం ఖాయమని వైఎస్సార్సీపీ కర్నూలు, నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు బి.వై.రామయ్య, శిల్పా చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో కర్నూలుతోపాటు నంద్యాలలో బీసీ మహార్యాలీ నిర్వహించారు. కర్నూలులోని పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా బీవై రామయ్య, శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ బీసీల చేతిలో చంద్రబాబుకు చావుదెబ్బ తప్పదని హెచ్చరించారు. ర్యాలీలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి, శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులో భారీ ప్రదర్శన గత ఎన్నికల సమయంలో చంద్రబాబు బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు. పార్టీ బీసీ సెల్ ఆధర్వంలో ఒంగోలులో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ఆందోళన నిర్వహించిన అనంతరం జేసీ–2 మార్కండేయులుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని టీడీపీ నెరవేర్చలేదని విమర్శించారు. విశాఖలో హోరెత్తిన బీసీ ర్యాలీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంలో టీడీపీ సర్కారు వైఫల్యాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ బీసీ విభాగం విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించింది. బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కె.రామన్నపాత్రుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పార్టీ విశాఖ సిటీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, పార్లమెంటు కో ఆర్డినేటర్ ఎంవీవీ సత్యనారాయణ, నగర కో ఆర్డినేటర్లు, పార్టీ అనుబంధ విభాగాల నేతలు, శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీసీల కులవృత్తులను ప్రతిబింబించేలా నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకుని జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మళ్ల, తైనాల తదితరులు మాట్లాడుతూ ఏటా రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు గత నాలుగేళ్లలో కనీసం పదివేల కోట్లు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. బీసీలంటే బాబుకు చిన్నచూపు బీసీలంటే చంద్రబాబుకు చిన్నచూపు అని రాయచోటి, రైల్వేకోడూరు ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి విమర్శించారు. వైఎస్సార్ జిల్లా రాజంపేటలో పసుపులేటి సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ సామాజిక ర్యాలీకి హాజరైన ఎమ్మెల్యే గడికోట మాట్లాడుతూ బీసీలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ అధ్యయన కమిటీని నియమించారని చెప్పారు. జస్టిస్ ఈశ్వరయ్య లేఖ ద్వారా బీసీలంటే చంద్రబాబుకు ఎంత చులకన భావం ఉందో బహిర్గతమైందన్నారు. ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రబాబును గద్దె దించేందుకు బీసీలు సమాయత్తం కావాలన్నారు. పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ బీసీలను చిన్నచూపు చూడటం బాబుకు అలవాటన్నారు. బీసీలు రాబోయే ఎన్నికల్లో జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. ర్యాలీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి మెయిన్‌రోడ్డు, పాతబస్టాండు, ఆర్‌ఎస్‌రోడ్డు మీదుగా సబ్‌కలెక్టరేట్‌కు చేరుకుంది. అనంతరం ఆర్డీవో కోదండరామిరెడ్డికి వినతిపత్రాన్ని అందచేశారు. ‘అనంత’లో నిరసన ర్యాలీ.. టీడీపీ సర్కారు బీసీలను మోసగించటానికి నిరసనగా అనంతపురం, హిందూపురంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టారు. అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. పార్లమెంటు సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కిష్టప్ప, రాగే పరుశురాం, కళ్యాణదుర్గం సమన్వయకర్త ఉషశ్రీచరణ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పామిడి వీరా తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడి ర్యాలీకి సంఘీభావం తెలిపారు. హిందూపురంలో ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పార్టీ హిందూపురం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, ఎమ్మెల్యే తిప్పేస్వామి, మాజీ మంత్రి నర్సేగౌడ్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘని తదితరులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు బీసీల ద్రోహి అని మండిపడ్డారు. త్వరలో బీసీ గర్జన... వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే నాయీ బ్రాహ్మణ, రజక, వడ్డెర కులాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తామని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చెప్పారు. టీడీపీ ప్రభుత్వం బీసీల పట్ల వ్యవహరిస్తున్న మోసపూరిత విధానాలను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట వైఎస్సార్ సీపీ బీసీ విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అవినాష్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్ర పూర్తి కాగానే బీసీ గర్జన నిర్వహించి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తామని చెప్పారు. బీసీలంతా వైఎస్ జగన్‌ను ఆశీర్వదించి పార్టీని అధికారంలోకి తేవాలని కోరారు. మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నట్లే చంద్రబాబు బీసీలకు కూడా వెన్నుపోటు పొడిచారని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. నిరసన కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, మైదుకూరు శాసనసభ్యుడు ఎస్. రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజయనగరం, పార్వతీపురంలో ర్యాలీలు.. బీసీలను అణచివేస్తున్న టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయనగరం, పార్వతీపురంలో నిర్వహించిన నిరసన ర్యాలీల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. బీసీలు వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓట్ల ద్వారా సమాధానం చెప్పాలని పార్టీ నేతలు సూచించారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై విజయనగరం డీఆర్వో జె.వెంకటరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, వైఎస్సార్ సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురంలో అరకు పార్లమెంటరీ జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు వాకాడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి సాలూరు, పార్వతీపుం, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల పరిధిలోని బీసీ నాయకులు, నేతలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఏవోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సాలూరు, పాలకొండ ఎమ్మెల్యేలు పీడికరాజన్నదొర, వి.కళావతి ఇతర నాయకులు పాల్గొన్నారు. తిరుపతిలో కుల వృత్తులతో నిరసన.. ప్రభుత్వం బీసీలకు చేసిన మోసాన్ని ఎండగడుతూ చిత్తూరు కలెక్టరేట్, తిరుపతిలోని సబ్‌కలెక్టరేట్ ఎదురుగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. తిరుపతిలో బీసీ కుల వృత్తులను ప్రదర్శించారు. అన్నమయ్య సర్కిల్ నుంచి సబ్‌కలెక్టర్ ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు కలెక్టరేట్ సమీపంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. డబ్బులతో గెలవాలనుకునే చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి... ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి గెలవాలని ప్రయత్నిస్తున్న సీఎం చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. బీసీల ప్రయోజనాలను చంద్రబాబు హరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అ«ధ్యక్షతన విజయవాడలోని ధర్నా చౌక్‌లో వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీల అమలును మరచిన చంద్రబాబు వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే భావిస్తున్నారని మండిపడ్డారు. సమస్యలు తీర్చకపోగా కొత్తవి సృష్టించేలా చంద్రబాబు పాలన తయారైందని విమర్శించారు. చంద్రబాబు అవినీతిని ప్రత్యక్షంగా గమనించిన ఇద్దరు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు చెబుతున్న విషయాలు వింటుంటే రాష్ట్రంలో ఏమేరకు అవినీతి జరిగిందో అర్ధమవుతోందన్నారు. రాష్ట్రమంతా తన కుటుంబంగా భావించే వైఎస్ జగన్‌కు అవకాశం ఇస్తే అభివృద్ధి, సంక్షేమం రెండూ ఉంటాయాన్నారు. అణగారిన ప్రజల అభివృద్థి పట్ల వైఎస్ జగన్‌కు స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్ధసారధి, తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలగడ్డ రక్షణనిధి, విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను, పార్టీ నేతలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, యలమంచిలి రవి, బొప్పన భవకుమార్, విజయవాడ పార్లమెంటు బీసీ సెల్ అ«ధ్యక్షుడు కసగోని దుర్గారావు గౌడ్, బీసీ సెల్ నగర అధ్యక్షుడు బోను రాజేష్, పార్టీ అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు. అనంతరం నేతలు ర్యాలీగా విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని వినతిపత్రం అందచేశారు. గత ఎన్నికల్లో బీసీలకు హామీ ఇచ్చి నెరవేర్చని వాటిలో ప్రధానమైనవి.. ►ఏటా రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ►విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లు 33 శాతానికి పెంపు.. పదోన్నతుల్లో రిజర్వేషన్లు ►బీసీలకు కొత్తగా రెసిడెన్షియల్ విద్యా సంస్థలు ► చేనేత కార్మికులకు రూ.1.5 లక్షలతో ఉచితంగా ఇళ్లు, మగ్గం ►రైతుబజార్ల తరహాలో మేకలు, గొర్రెల విక్రయ బజార్ల ఏర్పాటు ►అన్ని మండల కేంద్రాల్లో కుల ►వృత్తిదారులకు ఆధునిక అభివృద్ధి కేంద్రాలు ► బీసీ కులాలను ఒక గ్రూపునుంచి మరో గ్రూపులోకి మారుస్తాం -
27న విద్యుత్ ఉద్యోగుల మహా ధర్నా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలపై ఈనెల 27వ తేదీన మహా ధర్నా చేయనున్నట్లు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ (టీఎస్పీఈ) జేఏసీ గురువారం ప్రకటించింది. 2018 పీఆర్సీ అమలు, ఉద్యోగులు అందరికీ ఉచిత ఆరోగ్య పథకం సహా వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మహాధర్నా నిర్వహిస్తామన్నారు. ఈ ధర్నాలో టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంల నుంచి ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. -
కడప ఉక్కు-ఏపీ హక్కు