ప్రత్యేక హోదా కోసం అత్యంత శాంతియుతంగా ఢిల్లీలోని సంసద్‌మార్గ్‌లో మహాధర్నా నిర్వహిస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీసులు నిర్బంధకాండను ప్రయోగించారు. తమ ఆందోళనలో భాగంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ర్యాలీగా బయలుదేరిన వైఎస్‌ఆర్‌సీపీ నేతలను అడ్డుకొని.. బలవంతంగా అరెస్టు చేసి తరలించారు.