తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా తిరుపతిలో తెలుగుతల్లి విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.
తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా తిరుపతిలో తెలుగుతల్లి విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సమైక్యవాదులు వేలాదిగా తరలి వచ్చారు. కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతూ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.
ధర్నా సందర్భంగా కొంతమంది మహిళలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. వారిలో సీత, రమణమ్మ అనే మహిళలకు గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.