మాట తప్పిన నేతపై దండెత్తిన జనం | Maha dharna in 13 districts of Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మాట తప్పిన నేతపై దండెత్తిన జనం

Published Sun, Dec 7 2014 12:04 AM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM

విశాఖపట్నం సభలో ప్రసంగిస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - Sakshi

విశాఖపట్నం సభలో ప్రసంగిస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలుపు కోవడం అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీ విధ్యుక్త ధర్మం. నీతి, న్యాయం కూడా. ఓటు వేయ డం ద్వారా అది ప్రజలు చెప్పే చట్టం. ఒకసారి అధి కారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అయిదేళ్ల వరకు ఎన్నికలు ఉండవన్న కారణంగా ధర్మం, న్యాయం, నీతి తప్పితే ఏమవుతుంది? ఆ రాజకీయ పార్టీ విశ్వసనీయత కోల్పోతుంది. ప్రజలు అసహ్యించు కుంటారు. ఓటు వేసిన ప్రజలకు ఓపిక, సహనం నశిస్తే వారిలో ఆగ్రహం పెల్లుబుకుతుంది. ప్రజా స్వామ్య వ్యవస్థలో అది ప్రజలకున్న హక్కు.  అలా ప్రజాగ్రహం వెల్లువెత్తినప్పుడు పాలకపక్షం తన ధోరణి మార్చుకోవాలి. ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వందారి తప్పుతున్నప్పుడు ప్రజల్లో వ్యక్తమ య్యే ఆగ్రహావేశాలను గమనించైనా నేతల్లో చలనం రావాలి.
 
 తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి ఆరు నెలలు దాటు తోంది. పరిపాలనలో అపార అనుభవం కలిగిన వారికి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ గడువు ఎక్కు వే. ఆ దిశగా అడుగులు పడనప్పుడు ప్రజల్లో ఆగ్ర హావేశాలు పెల్లుబకడం సహజం. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, వాటి సంగతేంటో ఏం చేయబోతు న్నారో కూడా ప్రజలకు జవాబు చెప్పలేనప్పుడు ప్రజలు పాలకులను నిలదీస్తారు. ప్రజల్లో వ్యక్తమవు తున్న ఆకాంక్షలకు అనుగుణంగా వారందరినీ సమీ కృతం చేసి ప్రభుత్వాన్ని తట్టిలేపడానికి ప్రతిపక్ష మైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తమ బాధ్యతగా గొంతెత్తితే.... ఎన్ని కల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఒత్తిడి చేయడానికి ప్రజాస్వామిక పోరాటమార్గం ఎంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో మహాధర్నా నిర్వహిస్తే...  భారీ ఎత్తున ప్రజలు పాల్గొని గొంతు కలపడమంటే... అధికార పార్టీ పాలన తీరుతెన్ను లకు ఇది నిదర్శనం మాత్రమే.

రుణ మాఫీ చేయ లేదని రైతులు, డ్వాక్రా రుణాల మాఫీ సంగతేంటని మహిళలు, ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే 2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న మాట ఏమైందంటూ యువకులు నినదించారు. ఎక్కడి కక్కడ ప్రభుత్వంపై మండిపడ్డారు. ధర్నాలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన వారు ఆవేశంగా చెబుతున్న మాటలను ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిది.  
 
మేనిఫెస్టో అపవిత్రమైందా...?
తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు విడుదల చేసిన మేనిఫెస్టో (ప్రణాళిక) ఆసాంతం పరిశీలిస్తే ఎవరికైనా ఒక అంశం సులభంగా అర్థమవుతుంది. 52 పేజీల ఆ రంగురంగుల పుస్తకంలో 90 శాతం వరకు హామీలతోనే నింపారు. ‘‘తెలుగుదేశం పార్టీ ఒక వినూత్నమైన అభివృద్ధి పథాన్ని, మేనిఫెస్టో రూపంలో మీ ముందు ఉంచుతున్నాం. ఇది మనం దరికీ ‘దశ-దిశ’ చూపించే ఒక పవిత్ర పత్రం. నిపు ణులతో చర్చించి, మాకున్న అపారమైన పరిపాలనా అనుభవాన్ని జోడించి దీనిని రూపొందించాం.’’ అంటూ పరిచయ భాగంలోనే మేనిఫెస్టోను ఒక పవిత్ర పత్రంగా పేర్కొన్నారు. ఆరు నెలలు తిరక్క ముందే దాన్ని విస్మరించి అపవిత్రం చేయడం సమంజసంకాదు. చంద్రబాబు రాజకీయ జీవితం లో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ తర్వాత  ముఖ్య మంత్రి కావడం ఇదే మొదటిసారి. ఎన్టీఆర్ నుంచి అధికారం తీసుకున్నప్పుడు, ఆ తర్వాత ఏనాడూ ఆయన ప్రతిపక్షంలోలేరు. దాదాపు తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆ తర్వాత పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశారు.
 
 ప్రభుత్వాధినేతగా, ప్రతిపక్ష నేతగా ఉండటంలోని తేడాని ఆయనే పోల్చారు. మీకోసం పేరుతో పాదయాత్ర చేసినప్పు డు ప్రజలను మరింత దగ్గరగా చూశానన్నారు.  ఇప్పు డు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత అందరిలోనూ తలెత్తుతున్న సందేహాలేంటంటే... ప్రజలను అత్యంత సన్నిహితంగా ఆయన వారిలో ఏం చూశారు? ఏం అర్థం చేసుకున్నారు? వారి బాధ లను ఏమేరకు అవగతం చేసుకున్నారు? ‘‘2817 కి.మీ. పాదయాత్రలో రాష్ట్రంలో రైతుల కష్టాలను స్వయంగా దగ్గరుండి పరిశీలించడం జరిగింది... దెబ్బతిన్న రైతుల్లో ఆత్మవిశ్వాసం కలిగించి భవిష్యత్ పట్ల భరోసా నింపేందుకే తెలుగుదేశం పార్టీ రైతు రుణ మాఫీ ప్రకటించింది.’’ అని స్వర్ణాంధ్రను నిర్మిద్దామన్న పేరుతో మేనిఫెస్టో (8వ పేజీ) లో చెప్పుకున్నారు.
 
 మరి మాటలకూ చేతలకూ పొంత నేది? ఆరునెలలవుతున్నా... రైతుల భాషలో అయి తే (ఖరీఫ్, రబీ) రెండు సీజన్లు గడిచాయి. వారిలో ఏ రకంగా ఆత్మవిశ్వాసం కల్పించారు? అలా చేయ కపోగా తొలి సంతకంతోనే వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారు. పరిపాలనలో అపార అనుభవం ఉన్న వారెవరూ ఆ పని చేయరు. 2014 మార్చి వరకు ఉన్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని ముందు ఒక జీవో జారీచేసి ఆ తర్వాత 2013 డిసెంబర్ వర కున్న రుణాలకు మాత్రమేనంటూ సవరించారు. లక్షలాది వ్యవసాయదారులను ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదన్న సాకుతో వారిని ఆ జాబితాల్లోంచి తొల గిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఆ మాట చెప్పా రా? ఎక్కడా చెప్పలేదు.
 
 ఆర్థిక సమస్యలలో చిక్కు కున్న డ్వాక్రా సంఘాలను పునరుజ్జీవింపజేసే ప్రక్రి యలో భాగంగా ఆ సంఘాలు తీసుకున్న రుణా లన్నింటినీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామన్న హామీ గురించి ఇప్పుడు చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పగలరా? ఒకటేమిటి... సమాజం లోని అన్ని వర్గాలకు హామీలను గుప్పించారు. అధి కారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలో షెడ్యూల్డ్ కులాల బ్యాక్‌లాగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తామన్నారు. ఇవి నిర్ణీత కాలంలో చేస్తా మని చెప్పిన కొన్ని హామీలు మాత్రమే. ఈ రకంగా మేనిఫెస్టో నిండా హామీలతో నింపి ఇప్పుడు కుదర దంటే వాటినే నమ్ముకుని ఓట్లేసిన వారు ఏం చేయాలి?  కచ్చితంగా ప్రశ్నిస్తారు.
 
సత్తా కలిగిన నేతలెవరు?

‘‘కొత్త రాష్ట్రంలో భారీగా రెవెన్యూ లోటు ఉంటుం దని ఆర్థిక శాఖ నివేదికలే పేర్కొంటున్నాయి... ముందుచూపు, నిధులు సేకరించగలిగిన సత్తా బాధ్యతాయుతంగా పనిచేయించగలిగిన నాయక త్వం, అంతర్జాతీయంగా పలుకుబడి, పరిచయాలు కలిగిన వ్యక్తి నాయకుడుగా ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఈ మేనిఫెస్టోలో ప్రకటించిన వివిధ హామీల అమలుకు కావలసిన ఆర్థికపరమైన అన్ని అంశాలను పరిగణించాం.’’ నిధుల సమీకరణ విషయంలో మేనిఫెస్టో (10వ పేజీ)లో చంద్ర బాబు చెప్పిన మాట. ఈరోజు కాదనగలరా? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే... అత్యంత ఆర్భాటంగా నిర్వహించిన పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమానికి అన్ని శాఖలు కలిపి 30 కోట్ల మేరకు వెచ్చించాయి.
 
ఇచ్చిన హామీ లను నెరవేర్చడంపై శ్రద్ధ చూపకుండా సింగపూర్ తర హాలో రాజధాని నిర్మిస్తామని గడిచిన ఆరు నెలల్లో అరవైసార్లు చెప్పారు. హైదరాబాద్‌లో మాకు కూర్చోవడానికి కుర్చీ కూడా లేదని చెప్పిన చంద్ర బాబు రాజధాని కోసమంటూ ఏకంగా హుం డీలు పెట్టి చందాలు పోగుచేశారు. స్పందించిన పారిశ్రా మికవేత్తలు, మానవతావాదులు దాదాపు వంద కోట్ల రూపాయల విరాళాలు అందించారు. మరి చంద్రబాబు చేసిందేమిటి? సచివాలయంలో తన చాంబర్‌కు హంగులకు, క్యాంపు కార్యాలయం లేక్‌వ్యూ అతిథి గృహాన్ని తీర్చిదిద్దడానికి దాదాపు 30 కోట్లు ఖర్చు పెట్టారు.

ఇటుక ఇటుక పేర్చి రాజధాని నిర్మాణం చేపడుతానన్న చంద్రబాబు ఈ రకంగా తాత్కాలిక అవసరాల కోసం ఏకంగా కోట్లు ఖర్చు చేయడం వల్ల రేపటి రోజున ఎవరికి ప్రయోజనం? రాష్ట్ర ప్రజలకేమైనా పనికొస్తుందా?  దేశ విదేశాల్లో మీరు తిరిగే ప్రత్యేక విమానాలకయ్యే ఖర్చు ప్రజల కోసం వెచ్చించినట్టుగా భావించాలా? మాటలకు  చేతలకు పొంతన లేని కారణంగానే ఈరోజు ప్రజల నుంచి స్పందన వస్తోందని గమనించాలి.
 
 నినదించిన జనం

 మీరిచ్చిన హామీలను అమలు చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామంటూ ప్రతిపక్షం పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల కేంద్రాల్లోని కలెక్టరేట్ల ముందు ధర్నా విజయవంతం కావడంతో ప్రభుత్వ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ధర్నా ల్లో రైతులు, మహిళల నుంచి వచ్చిన స్పందనను బట్టి ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. అధికారం చేపట్టిన ఆరు మాసాల్లోనే ప్రభుత్వంపై ప్రజల నిరసన వ్యక్తమైంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే క్రమంలో జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన బాట పట్టినప్పుడు ఆ ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడమన్నది ఎవరి తప్పు! ప్రజలదా? ప్రతి పక్షానిదా? అసలే కాదు. కలెక్టరేట్ల ముందు జరిగిన ధర్నాల్లో పెద్దఎత్తున పాల్గొని ప్రజలు ఆ తీరుగా స్పందించారంటే... దాన్ని పాలకపక్షం అర్థం చేసు కోవాలి.
 
 జగన్ మహాధర్నాలో పెద్దఎత్తున ప్రజలు తరలిరావడం సీఎంకు రుచించకపోవచ్చు. దాంతో చంద్రబాబుతో సహా ఆయన మంత్రివ ర్గంలోని మంత్రులు, పార్టీ నేతలు ఒక్కొక్కరుగా జగన్‌పై వ్యక్తిగత నిందలకు దిగారు. అలాంటి దూషణల కోసం జగన్ ధర్నా చేయలేదు. పైగా వ్యక్తిగత విమర్శలు చేయడానికి ఇవేం ఎన్నికల ప్రచార సభలు కూడా కావు. ప్రజలు, ప్రతిపక్షం లేవ నెత్తిన అంశాలేంటి? వాటికి సమాధానం చెప్ప కుండా ఏకబిగిన ఎదురుదాడికి దిగారంటే దానర్థమేంటి? మీ పవిత్ర మేనిఫెస్టో మీరే అపవిత్రం చేశారని అర్థమవుతోంది.
 
హామీలపై మసిపూసి మారేడు కాయ చేస్తూ మీడియాలో ప్రచారం చేసు కోవడం అన్నీ చేశామని తప్పుదారి పట్టించే ప్రయత్నాలను ప్రజలు అర్థం చేసుకోలేరనుకుంటే పొరపాటే. భవి ష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. అపార అనుభవజ్ఞులైన నేతలకు ఆ విషయాన్ని గుర్తుచేయాల్సిన అవసరం లేదు. ఇచ్చిన మాట నిల బెట్టుకోకపోతే... ముందుముందు మరింతగా ప్రజా గ్రహానికి గురికాకతప్పదు. ఇది ఆరంభంగా గుర్తించి ఆత్మపరిశీలన చేసుకోవలసిన బాధ్యత, విధ్యుక్త ధర్మం అధికార పార్టీదే.
 సుధాకర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement