బంద్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారు? | YS Jagan Mohan Reddy Questioned CM Chandrababu On Twitter | Sakshi
Sakshi News home page

బాబూ.. బంద్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారు?

Published Mon, Jul 23 2018 10:17 PM | Last Updated on Sat, Aug 18 2018 4:18 PM

YS Jagan Mohan Reddy Questioned CM Chandrababu On Twitter - Sakshi

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

సాక్షి, సామర్లకోట/తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో కీలకమైన ప్రత్యేక హోదాను అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా మండిపడింది. ప్రత్యేక హోదా సాధన కోసం మంగళవారం చేపట్టనున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బంద్‌ను విఫలం చేయాలని ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ఆ పార్టీ ఆరోపించింది. ‘ప్రత్యేక హాదాకు చంద్రబాబు, టీడీపీ వ్యతిరేకం కాకపోతే బంద్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారు’అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

కాగా, మంగళవారం జరగనున్న బంద్‌ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, నాయకులు సన్నద్ధమయ్యారు. అలాగే, అన్ని వర్గాలు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బంద్‌ను విఫలం చేయాలని భావిస్తున్న ప్రభుత్వం సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైఎస్సార్‌ సీపీ నేతలను గృహ నిర్బంధం చేసింది. బంద్‌ను నిర్వీర్యం చేయడానికి పోలీసులకు, అధికార యంత్రానికి చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని వైఎస్సార్‌ సీపీ ఆరోపించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం జరుగుతున్న పోరాటంలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బంద్‌కు మద్దతు ఇవ్వాలని, ఇలాంటి అడ్డుకునే చర్యలను టీడీపీ విరమించుకోవాలని వైఎస్సార్‌ సీపీ హితవు పలికింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement