ఎమ్మెల్యే చింతలతో చర్చిస్తున్న డీఎస్పీలు
చిత్తూరు, సాక్షి: ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. అందుకే వైఎస్సార్‌సీపీ నాలుగు సంవత్సరాలుగా పోరాడుతోంది. ఈనేపథ్యంలో ‘హోదా’ పై కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల వంచనను నిరసిస్తూ మంగళవారం ఆ పార్టీ బంద్‌కు పిలుపుని చ్చింది. జిల్లాలో పోలీసులు బంద్‌ను అడుగడుగునా భగ్నం చేసేందుకు యత్నించినా పార్టీ శ్రేణులు.. ప్రజలు ముందుకు కదిలారు.. నిరసనను జయప్ర దం చేశారు. రూరల్‌జిల్లా పరిధిలో 1,006 మంది, అర్బన్ జిల్లాలో 196 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమైన నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. సామాన్యులు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, బ్యాంకులు మూతపడ్డాయి.
తిరుపతిలో గాంధీ విగ్రహం వద్ద శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డిని పోలీసులు ఉదయం 4 గంటల సమయంలోనే అదుపులోకి తీసుకున్నారు. దీన్ని అడ్డుకునేందుకు ఆ పార్టీ కార్యకర్తలు విఫలయత్నం చేశారు. గంటసేపు కరు ణాకర్‌రెడ్డి కోసం పోలీసులతో పోరాడారు. కార్యకర్తలందరినీ అరెస్టు చేసిన తరువాత భూమనను పోలీసులు ఎమ్మార్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తిరుచానూర్‌లో బంద్ నిర్వహిస్తున్న భూమన అభినయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
తిరుపతి నుంచి నగరికి వెళ్తున్న ఎమ్మెల్యే ఆర్కే రోజాను పుత్తూరు పున్నమి సర్కిల్‌లో పోలీసులు అరెస్టు చేశారు. శాంతియుతంగా ధర్నా చేసేం దుకు కూడా పోలీసులు అనుమతించకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా కోసం చేస్తున్న పోరాటాన్ని అణచివేస్తే చంద్రబాబుకు పుట్టగతులుండవని విమర్శించారు. 180 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను బంద్‌లో పాల్గొనకుండా అరెస్టు చేశారు.
పుత్తూరులో ఎమ్మెల్యే నారాయణస్వామిని ఉదయం 8గంటలకు అరెస్టు చేశారు. అయినా పార్టీ శ్రేణులు స్పందించి గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో బంద్ విజయవంతం చేశారు. ఆ పార్టీ కార్యకర్తలందరూ ‘హోదా’ వస్తే కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ వీ«ధివీధి తిరిగారు. ఉదయం నుంచే దుకాణాలు తెరుచుకోలేదు. నియోజకవర్గ వ్యాప్తంగా 40 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అరెస్టు చేశారు.
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం విన్నూత్నంగా నిరసన తెలిపారు. వాహనాలను శుభ్రం చేస్తూ హోదా వస్తే రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలను చెవిరెడ్డి వివరించారు. చంద్రబాబే రాష్ట్రానికి పెద్ద విలన్ అని ఆయన విమర్శించారు.
మదనపల్లి ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డిని పోలీ సులు హౌస్ అరెస్టు చేశారు. అరెస్టును ఆయన ప్రతిఘటిస్తుండటంతో పటిష్ట బందోబస్తు ఏర్పా టు చేశారు. 42 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అయినా నిమ్మనపల్లి, రామసముద్రం మండలంలో బంద్ విజయవంతంగా జరి గింది. ప్రజలుస్వచ్ఛందంగా బంద్ పాటించారు.
ఎమ్మెల్యే సునీల్ కుమార్ పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో జరుగుతున్న బంద్‌లో పాల్గొన్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో 165 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను నిర్భందించారు.
పీలేరులో ఉదయం 4 గంటల నుంచే ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. బస్సులు డిపోలకే పరిమితం అయ్యా యి. దుకాణాలు మూతపడ్డాయి. ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి విడుదల చేశారు. కలికిరిలో కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యం చేసినందుకు ఆ పోలీస్ స్టేషన్ ఎదుట రెండు గంటల పాటు చింతల దర్నా నిర్వహించారు.
చిత్తూరులో జంగాలపల్లి శ్రీనివాసులు బంద్‌లో పాల్గొన్నారు. ఉదయం 7 గంటల సమయంలో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. కార్యకర్తలు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేయడంతో విడుదల చేశారు. ఆయన ఆ పార్టీ కార్యకర్తలతో కలిసి గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. బంద్‌కు సహకరించాలని కలెక్టరేట్ ఉద్యోగులను కోరేందుకు వెళుతున్న జ్ఞాన జగదీశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా సచివాల యం సమీపంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద గాయత్రీదేవి నిరసన దీక్ష చేశారు. చిత్తూరు నియోజకవర్గ పరిధిలో 35 మంది కార్యకర్తలను ఉద్యమంలో పాల్గొనకుండా నిర్బంధించారు.
కుప్పంలో చంద్రమౌళిని పోలీసులు గృహ నిర్బధం చేశారు. 140 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. బంద్‌కు సామాన్య ప్రజలు, ప్రభుత్వ అధికారులు, వ్యాపారులు సహకరించారు. ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు టీడీపీ నాయకులు, పోలీసులు శథవిధాల ప్రయత్నించారు. బస్సులకు భద్రత కల్పిస్తామని పోలీసులు ఆర్టీసీ అధికారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
శ్రీకాళహాస్తిలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్‌కు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దుకాణాలు మూతపడ్డాయి. బస్సులు డిపోలకు పరిమితం అయ్యాయి. టూటౌన్ సీఐ చంద్రశేఖర్ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. అకారణంగా దుర్బాషలాడారు. జెండా కనిపిస్తే అరెస్టు చేస్తామని కార్యకర్తలను బెరించారు. 53 మందిని అరెస్టు చేశారు.
పలమనేరులో ఉదయమే వైఎస్సార్‌సీపీ నాయకులందరినీ అరెస్టు చేశారు. రోడ్డుపైకి వస్తే అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు వచ్చాయి. 144 సెక్షన్ వి«ధించి బంద్‌లో పాల్గొన్న నిర్భందించారు. దీన్ని నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎదుట ధర్న నిర్వహించారు.
పుంగనూరులో బంద్ ప్రశాతంగా ముగిసింది. శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. 20 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు.
తంబళ్లపల్లి నియోజకవర్గంలో బంద్ పాక్షికంగా జరిగింది. బంద్‌లో పాల్గొనడానికి వస్తున్న ద్వారకనాథ్‌రెడ్డిని ములకలచెరువు పోలీసులు అరెస్టు చేశారు. నియోజకవర్గ వ్యాప్తం 139 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అరెస్టు చేశారు.
సత్యవేడు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో బంద్ ప్రశాతంగా ముగిసింది. ఉదయం కార్యకర్తలను అరెస్టు చేశారు. ఉదయం 9 గంటల సమయంలో సమన్వయకర్త ఆదిమూలంను సత్యవేడు క్లాక్ టవర్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 60 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. పీలేరులో 38 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు.
కలికిరి: మండలంలో బంద్ పాటిస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై ఎస్‌ఐ శ్రీనివాసులు జులుం ప్రదర్శించారు. కలికిరి ఎల్లమ్మ ఆలయం నుంచి ర్యాలీగా వెళుతున్న పార్టీ నాయకులపై అకారణంగా తన ప్రతాపం చూపించారు. తాను అనుకుంటే ఎన్‌కౌంటర్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. కొందరు కార్యకర్తలను బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. స్టేషన్ ఎదుట బైటాయించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ఎన్‌కౌంటర్ చేస్తాననడం ఏంటని ప్రశ్నించారు. ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండు గంటల పాటు ధర్నా చేశారు. డీఎస్పీలు వీవీ గిరిధర్, చిదానందరెడ్డి, వాల్మీకిపురం సీఐ సిద్ధతేజోమూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని ఎమ్మెల్యేతో మాట్లాడారు. ధర్నా విరమించాలని కోరారు. ఎస్‌ఐపై చర్యలు తీసుకునేంత వరకు విరమించేది లేదని ఎమ్మెల్యే తేల్చిచెప్పారు. రేపటి నుంచి కలికిరి పోలీస్‌స్టేషన్ సీఐ పర్యవేక్షణలో ఉంటుందని, ఎస్‌ఐపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. మండల కన్వీనర్‌లు రమేష్‌కుమార్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, నీళ్ల భాస్కర్, ఎంపీటీసీ సభ్యులు వెంకటరెడ్డి, ప్రతా ప్‌కుమార్‌రెడ్డి, పార్టీ నాయకులు హరీష్‌రెడ్డి, హబీబ్‌బాషా తరుణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై ఎస్‌ఐ జులుం
విజయపురం : ప్రత్యేకహాదా కోసం శాంతియుతంగా బంద్ చేస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై నగరి ఎస్‌ఐ మునస్వామి విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే ఆర్‌కే రోజా సోదరుడు కుమార్‌స్వామి, నగరి రూరల్ నాయకులు నాగలాపురం బైపాస్‌రోడ్డుపై మంగళవారం ఉదయం బైఠాయించి బంద్ పాటిస్తున్నారు. అక్కడికి చేరుకున్న ఎస్‌ఐ మునస్వామి వారిపై ఒక్కసారిగా జులుం ప్రదర్శించారు. ప్రత్యే క హోదాకు అనుకూలంగా నినాదాలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై భౌతిక దాడికి దిగారు. కొట్టుకుంటూ వారిని పోలీస్ వాహనంలోకి ఎక్కిం చారు. కాగా ఎస్‌ఐ మునస్వామి తీరు తొలినుంచి వివాదాస్పదంగానే ఉందని, సామాన్యులతో ఆయన మరీ దురుసుగా ప్రవర్తిస్తున్నారని పట్టణవాసులు ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలపై ఎస్‌ఐ దాడికి దిగడాన్ని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న వారిపై ఎస్‌ఐ భౌతిక దాడికి దిగడాన్ని ఆమె తప్పుపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment