
వైఎస్సార్ నేత శిల్పా చక్రపాణి రెడ్డి
సాక్షి, కర్నూలు : సీఎం చంద్రబాబు నాయుడి ప్రభుత్వ వైఫల్యాలపై మే 16 వతేదీన కర్నూలు కలెక్టరేట్ ముందు మహాధర్నాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మే 14 వ తేదీన 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుంది. ఈ సందర్భంగా ఈ నెల 14, 15 తేదీల్లో మండలాల వారిగా సంఘీభావ పాదయాత్రలు చేపట్టాలని వైఎస్సార్‌సీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ.. సంఘీభావ పాదయాత్రలో గత నాలుగేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. అంతేకాక టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. నియోజకవర్గాల నుంచి భారీగా పార్టీ శ్రేణులు పాల్గొని మహాధర్నాను విజయవంతం చేయాలని శిల్పా చక్రపాణి రెడ్డి పిలుపునిచ్చారు. మహాధర్నా అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి వైఎస్సార్‌సీపీ నేతలు వినతి పత్రం అందజేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment