Shilpa Chakrapani Reddy
-
శిల్పా చక్రపాణి రెడ్డి ఎన్నికల ప్రచారం
-
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, దొంగ హామీలు..
-
Mahanandi Temple: మహానంది ఆలయానికి మహర్దశ
మహానంది: భక్తుల కోర్కెలు తీర్చే మహానందీశ్వరుడి ఆలయానికి మహర్దశ వచ్చింది. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి చొరవ, ఈఓ కాపు చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షణతో మహానంది క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శైవక్షేత్రాల్లో ఒకటైన మహానంది క్షేత్రానికి గతంలో ఏడాదికి రూ.7 నుంచి రూ.10 కోట్ల ఆదాయం వచ్చేది. రెండేళ్ల నుంచి రూ.13 కోట్ల నుంచి రూ.16 కోట్ల వరకు వస్తోంది. ఇక ఈ ఏడాది భారీగా పెరిగింది. కోనేరుల మరమ్మతులకు శ్రీకారం ఆలయ పరిధిలో పెద్దకోనేరు(రుద్రగుండం)తో పాటు రెండు చిన్న కోనేరులు ఉన్నాయి. వాటి మరమ్మతులకు దేవదాయశాఖ రూ.80 లక్షలు మంజూరు చేసింది. అందులో భాగంగా సీజీఎఫ్ నుంచి రూ.40 లక్షలు, దేవస్థానం నుంచి రూ.40 లక్షలు కేటాయిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పనులకు త్వరలో భూమిపూజ చేయనున్నారు. అలాగే ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి స్వంత నిధులు రూ.2 కోట్లతో రాతి నంది విగ్రహాన్ని అభివృద్ధి చేశారు. చుట్టూ వాటర్ ఫౌంటెయిన్, గ్రీనింగ్, అధునాతనమైన లైటింగ్ అమర్చారు. వాటితో పాటు ఆలయ మాడవీధుల్లో ల్యాండ్ స్కేపింగ్ పనులు చేపడుతున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు ఒకరోజు ఇక్కడే ఉండి పోవాలన్నంత అందంగా తీర్చిదిద్దుతున్నారు. రూ.4.60 కోట్లతో గదుల నిర్మాణం టీటీడీ ఆధ్వర్యంలో రూ.4.60 కోట్లతో 27 గదుల నిర్మాణానికి త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా నంది విగ్రహం ఎదురుగా ఉన్న వేదపాఠశాల భవనం ప్రాంగణంలో సాయిల్టెస్టును సేకరించారు. త్వరలోనే పనులు మొదలు పెట్టనున్నారు. వీటితో పాటు దాతలు, భక్తుల సహకారంతో వంద వసతి గృహాల నిర్మాణం చేపట్టనున్నారు. ఏపీ టూరిజం, ప్రస్తుతం ఉన్న టీటీడీ వసతి గృహాల మధ్యలో ఖాళీగా ఉన్న స్థలంలో 50 గదులు, పార్వతీపురం రస్తాలో ఉన్న దేవస్థానం స్థలంలో మరో 50 వసతి గృహాలను నిర్మాణానికి దేవదాయశాఖ ఆమోదం తెలిపింది. మహానందీశ్వర, కామేశ్వరీదేవి, గంగాసదన్ల పేర్లు ప్రతిపాదించి త్వరలో నిర్మాణం మొదలు పెట్టనున్నారు. అన్నదానానికి రూ.2.30కోట్లు డిపాజిట్లు మహానంది దేవస్థానంలో నిర్వహించే అన్నదాన పథకానికి రూ.2.30 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. గతంలో రోజుకు 150 మందికి అన్నప్రసాద వితరణ చేసేవారు. ప్రస్తుతం 200 మందికి పంపిణీ చేస్తుండగా ఆ సంఖ్యను మూడొందలకు పెంచాలని ప్రతిపాదించారు. శని, ఆది, సోమవారాల్లో ఐదు వందల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అరిటాకుల్లో అన్నప్రసాదాలు పంపిణీ చేస్తూ భక్తుల మన్ననలు పొందుతున్నారు. భక్తుల సౌకర్యార్థం దాతల సహకారంతో రూ. 15 లక్షలు వెచ్చించి స్టెయిన్లెస్ స్టీల్ టేబుళ్లు, కుర్చీలు కొనుగోలు చేశారు. మరింత మంది భక్తులకు అన్నప్రసాదాలు అందాలన్న సదుద్దేశంతో రైతుల నుంచి 1,000 బస్తాల వరిధాన్యం సేకరించారు. కార్తీకమాసంలో రూ.1.40 కోట్లు ఆదాయం మహానందికి అన్ని విభాగాల నుంచి ఆదాయాన్ని పెంచి భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంలో హుండీ కానుకల లెక్కింపు జరిగితే రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షలు ఆదాయం వచ్చేది. గత ఏడాది నవంబర్‌లో 49 రోజులకు నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపు ద్వారా రూ.63,71,256 ఆదాయం సమకూరింది. అలాగే గత ఏడాది కార్తీకమాసంలో నెలరోజులకు రూ.96 లక్షల ఆదాయం రాగా ఈసారి రూ.1.40 కోట్ల ఆదాయం వచ్చింది. గతంలో కంటే అదనంగా రూ. 44 లక్షలు ఆదాయం పెరిగింది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. అవినీతి రహిత పాలనే ధ్యేయంగా పనిచేస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. మహానందీశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కడా రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు. ఆలయానికి ఆదాయం పెంచడంతో పాటు భక్తుల సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నాం. దాతల సహకారంతో ఇప్పటికే మరుగుదొడ్లు మరమ్మతులు చేశాం. త్వరలో డాక్టర్ భార్గవవర్ధన్‌రెడ్డి, డాక్టర్ విజయభాస్కర్‌రెడ్డిల సహకారంతో బస్‌షెల్టర్ నిర్మించనున్నాం. జిందాల్ కంపెనీ ఆధ్వర్యంలో టాయిలెట్లు నిర్మించనున్నాం. త్వరలో వంద వసతి గృహాలను నిర్మిస్తాం. – కాపు చంద్రశేఖర్‌రెడ్డి, ఈఓ, మహానంది -
ఆ ఘనత వైఎస్ జగన్‌దే - శిల్పా చక్రపాణిరెడ్డి
సాక్షి, కర్నూలు: సున్నిపెంటను పంచాయతీ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. 35 ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తున్న బుడ్డా, ఏరాసు కుటుంబాలు చేయలేని పనిని తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన కొద్దిరోజుల్లోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సాధించగలిగానన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత ఆయన తొలిసారిగా అసెంబ్లీలో ప్రసంగించారు. శ్రీశైలం నియోజకవర్గంలోని సున్ని పెంటలో 1964 నుంచి 35 వేల మంది జీవనం గడుపుతున్నా పంచాయతీగా మార్చలేదన్నారు. ఈ విషయాన్ని 10 రోజుల క్రితం అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లితే వెంటనే అధికారులతో కమిటీ వేశారన్నారు. ఆ కమిటీ 15 రోజుల్లోనే సున్ని పెంటను నగర పంచాయతీ చేస్తూ తీర్మానం చేయడంతో అక్కడి ప్రజలు ముఖ్యమంత్రి ఫొటో పెట్టుకుని పూజించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అలాగే శ్రీశైలం, సున్నిపెంట పక్కనే ప్రాజెక్టు ఉన్నా తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమీపంలో ఉండే చెంచు గూడెలకు సైతం నీటి వసతి లేదన్నారు. నీటి సదుపాయం కల్పనకు రూ.7 కోట్లు మంజూరు చేయాలని, అలాగే సున్నిపెంటలో నివాసం ఉంటున్న 5,800 మంది ఇళ్లను రెగ్యులరైజేషన్ చేయాలని ఆయన అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇతర మంత్రులను కోరారు. నైతిక విలువలకు కట్టుబడే అప్పట్లో ఎమ్మెల్సీకి రాజీనామా ‘నంద్యాల ఉప ఎన్నికల సమయంలో మా అన్న శిల్పా మోహన్‌రెడ్డి కోసం వైఎస్ఆర్సీపీలోకి రావాలని నిర్ణయం తీసుకున్నా. అయితే పార్టీలోకి రావాలంటే నైతిక విలువలకు కట్టుబడి ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. దీనిపై కొన్ని నిమిషాలు ఆలోచించి వెంటనే ఆయన నిర్ణయమే మంచిదని ఐదు సంవత్సరాల తొమ్మిది నెలల పదవీకాలాన్ని వదులుకున్నా’నని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సగర్వంగా అసెంబ్లీలో చెప్పారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను తీసుకుంటే ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవని అప్పట్లో చంద్రబాబునాయుడుకు చెప్పినా వినలేదన్నారు. దాని వల్లే ఆయనకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. ఫిరాయింపుల్లో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి విలువలకు నీళ్లొదిలార న్నారు. మనం చేసిన చట్టాలను మనమే చుట్టాలుగా చేసుకుంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధానికి కఠిన చట్టాలు చేయాలని ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. శిల్పాను ప్రశంసించిన స్పీకర్ మీరంటే రాష్ట్రంలో తెలియని వారు ఉండరని, మీరు నైతిక విలువలను పాటించే వ్యక్తి అని శిల్పా చక్రపాణిరెడ్డిపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశంసలు కురిపించారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తరువాతే వైఎస్ఆర్సీపీలో చేరారని కితాబు ఇచ్చారు. -
గత ప్రభుత్వంలో అనేక అవినీతి చర్యలకు పాల్పడ్డారు
-
శ్రీశైలం వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా శిల్పా చక్రపాణిరెడ్డి నామినేషన్
-
బాబుకు జగన్ ఫోబియా పట్టుకుంది
సాక్షి, కర్నూలు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాను చేసిన అభివృద్దిపై ఓట్లు అడిగే దమ్ముందా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి శిల్పా చక్రపాణి రెడ్డి సవాల్ విసిరారు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మాత్రమే చంద్రబాబు పనికొస్తారని.. సీఎంగా పనికిరారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోబియా పట్టుకుందని విమర్శించారు. రాజమండ్రిలో టీడీపీ తలపెట్టిన జయహో బీసీ సభలో బీసీలకు ఆశాభంగం కలిగిందని ఆరోపించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతర పార్టీలతో కలిసి చంద్రబాబు జయహో బీసీ అంటే.. వైఎస్ జగన్ ఏర్పాటు చేసే బీసీ గర్జన అదరహో అనేలా ఉంటుందన్నారు. చంద్రబాబు కొత్తగా ఇస్తున్న హామీలన్నీ నవరత్నాల కాపీలేనని దుయ్యబట్టారు. టీడీపీ మోసపూరిత రుణమాఫీతో రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. దీంతో ప్రతీ వ్యక్తిపైన సగటున రూ.75 వేల అప్పు ఉందని ఆరోపించారు. డ్వాక్రా రుణాల మాఫీ చేయని చంద్రబాబు మహిళలకు బాకీపడ్డారన్నారు. ఆడపడుచులకు చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలను సభల పేరుతో బ్లాక్మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. జయహో బీసీ సభలో ఖాళీ కుర్చీలు చంద్రబాబు ఇస్తున్న హామీలన్నీ ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీలేనని నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బి వై రామయ్య పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఉంటూ మళ్లీ హామీలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఇచ్చిన హామీల గురించి అడిగితే తోకలు కత్తిరిస్తాననడం బాబు నైజమన్నారు. బీసీలు సుప్రీం కోర్టు జడ్జిగా పనికిరారని లెటర్ ఇచ్చిన ఘనుడు చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. బీసీల హామీలపై బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో 11 బీసీ కులాలకు ఫెడరేషన్లు ఏర్పాటు నిజం కాదా అని ప్రశ్నించారు. తండ్రి బాటలో బీసీల సంక్షేమం కోసం ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మారుస్తామని వైఎస్ జగన్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. జయహో బీసీ సభలో ఖాళీ కుర్చీలు తప్ప జనాలు లేకపోవడం చంద్రబాబు ప్రజావ్యతిరేకతకు నిదర్శనమన్నారు. బీసీల ఆకాంక్షలకు అనుగుణంగా బీసీ డిక్లరేషన్ విడుదల చేయబోతున్నారని తెలిపారు. -
పూటకో మాట.. రోజుకో వేషం.. బాబు నైజం!
బొమ్మలసత్రం: తెలంగాణలో అమ్ముడుపోయిన నేతలు సంతలో పశువులంటూ చంద్రబాబు చెబుతున్నారని, ఆంధ్రాలో వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను ఆయనే కొనుగోలు చేశారని, మరి ఇక్కడ అమ్ముడుపోయిన వారినేమనాలో ఆయనే చెప్పాలని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీæ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. పూటకోమాట, రోజుకొక వేషం వేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం నంద్యాలలోని ఆయన నివాసంలో వైఎస్సార్సీపీ బీసీసెల్ రాష్ట్రప్రధాన కార్యదర్శి బోగోలు శివశంకర్ నాయుడు ఆధ్వర్యంలో 2019 క్యాలెండర్‌ను శిల్పా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో పనిచేసే కార్యకర్తలను రాష్ట్రస్థాయి నాయకులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అధినేత జగన్మోహన్ రెడ్డి అందరికీ పదవులను అందించారని అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం నాయకుని లక్షణమని, అది కేవలం వైఎస్ కుటుంబానికే దక్కుతుందని అన్నారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు వాల్మీకులను ఎస్టీల్లో, మాదాసు కురువ, బుడగజంగాలను ఎస్సీలో చేరుస్తామని చంద్రబాబు నమ్మించి మోసం చేశారన్నారు. అనంతరం బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోగోలు శివశంకర్ నాయుడు మాట్లాడుతూ బీసీల అభివృద్ధే ధ్యేయంగా అధినేత జగన్ మోహన్‌రెడ్డి బీసీసెల్ విభాగాన్ని ఏర్పాటు చేశారన్నారు. జగన్‌కు ఏకూటమితోనూ పనిలేదని, తనది బడుగు,బలహీన వర్గాలకు చెందిన కూటమని, వారి సహకారంతోనే ముందుకు వెళుతున్నారని అన్నారు. కార్యక్రమంలో మాధవరం సర్పంచ్ శ్రీను,నారాయ ణరెడ్డి, బండి ఆత్మకూరు మండల కార్యదర్శి పుల్లారెడ్డి, నాగేశ్వరరెడ్డి, బాలసుబ్బయ్య, రామలింగారెడ్డి, రామసుబ్బారెడ్డి, సుదర్శనం తదితరులు పాల్గొన్నారు. -
సాగు, తాగునీటి సమస్యలపై గళమెత్తిన వైఎస్సార్సీపీ..
-
నవరత్నాలతో అందరికీ మేలు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవర్నాల పథకాలతో అందరికీ మేలు జరుగుతుందని ఆపార్టీ నేతలు..ప్రజలకు వివరించారు. జిల్లాలో మూడో రోజు బుధవారం..‘రావాలి జగన్..కావాలి జగన్’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నవరత్నాలతో కలిగే లక్షల రూపాయల లబ్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. తెలుగుదేశం ప్రజాప్రతినిధులు, నాయకుల అవినీతిని కూడా ఎండగడుతుండడంతో ప్రజలు ఆసక్తిని కనబరుస్తున్నారు. ముఖ్యంగా నవరత్నాలతో ఎలా లబ్ధి చేకూరుతుందో వివరిస్తుండడంతో ప్రజలు సంతృప్తి చెందుతున్నారు. ♦ శ్రీశైలం నియోజకవర్గంలోని బండి ఆత్మకూరు మండలం సంతజూటూరు గ్రామంలో నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సమన్వయకర్త శిల్పా చక్రపాణిరెడ్డి.. కావాలి జగన్..రావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు బూత్‌ల్లో ఇంటింటికీ తిరిగి నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. టీడీపీ అవినీతి, అక్రమాలను వివరించి ప్రజలను చైతన్య పరచారు. ♦ పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ మండలంలోని 34వ వార్డు చింతలముని నగర్లో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి నవరత్నాలపై అవగాహన కల్పించి కరపత్రాలను పంపిణీ చేశారు. ♦ నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడుబంగ్లా మండలం తాటిపాడు గ్రామంలో ఎమ్మెల్యే ఐజయ్య, సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, మిడ్తూరు జెడ్పీటీసీ సభ్యుడు యుగంధర్‌రెడ్డి పాల్గొని నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ♦ ఆలూరు నియోజవకర్గంలోని హాలహర్వి మండలం బి.చాకిబండ, దేవినేహాలు గ్రామాల్లో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. ఇంటింటా తిరిగి నవరత్నాలు, టీడీపీ అవినీతి అక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తమ్ముడు గుమ్మనూరు శ్రీనివాసరెడ్డి, కల్యా గౌడ్, భీమస్ప చౌదరి పాల్గొన్నారు. ♦ మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలంలోని జంపాపురంలో ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి పాల్గొని టీడీపీ అవినీతి, అక్రమాలు, నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వై.ప్రదీప్‌కుమార్‌రెడ్డి, మురళీరెడ్డి, బెట్టనగౌడ్, ఇల్లూరి ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు. ♦ నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలం పసురుపాడులో శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి ఇంటింటికీ తిరిగి నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పీపీ నాగిరెడ్డి, పీపీ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. ♦ ఎమ్మిగనూరు మండలం దేవిబెట్ట గ్రామంలో పార్టీ నేత ఎర్రకోట జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మన్న., వెంకటరామిరెడ్డి, చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. ♦ పత్తికొండ నియోజకవర్గం దూదేకొండలో రావాలి జగన్..కావాలి జగన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఇన్చార్జి కంగాటి శ్రీదేవి ఆధ్వర్యంలో గ్రామంలో భారీ బహిరంగసభ సభ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి నవరత్నాల కరపత్రాలను పంచిపెట్టారు. అంతకముందు మెయిన్‌రోడ్డులోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మద్దికెరలో కూడా నవరత్నాల కరపత్రాలను శ్రీదేవి ఆవిష్కరించారు. ♦ ఆళ్లగడ్డ నియోజకవర్గం శిరివెళ్ల మండలంలోని మహదేవపురంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ నాయకుడు గంగుల బిజేంద్రారెడ్డి పాల్గొన్నారు. కోడుమూరు నియోజకవర్గం సి.బెళగల్ మండలం గుండ్రేవుల గ్రామంలో పార్టీ ఇన్చార్జ్ పరిగెల మురళీకృష్ణ ..నవరత్నాలపై ప్రచారం నిర్వహించారు. పేదరికం దూరమవుతుంది నవరత్నాల పథకాలు అమలైతే సంవత్సరానికి ప్రతి ఇంటికీ రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు లబ్ధి చేకూరుతుంది. పేదరికం దూరమవుతుంది. ప్రజలు ఆలోచించాలి. ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పే వారిని నమ్మొద్దు. ముఖ్యంగా స్వార్థం కోసం పార్టీలు మారే బుడ్డా రాజశేఖర్ రెడ్డి లాంటి నేతలతో అప్రమత్తంగా ఉండాలి. – బండిఆత్మకూరు మండలం సంతజూటూరు గ్రామంలో వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి -
అక్కడ పొత్తంటా.. ఇక్కడ చాలెంజంటా?
నంద్యాల: తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని, ఆంధ్రాలో చాలెంజ్ అంటూ సీఎం చంద్రబాబు రాజకీయ డ్రామాలాడుతున్నారని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని రెం డుగా చీల్చిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని ప్రజలు సహించరని, చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నంద్యాల పద్మావతినగర్లోనిపార్టీ కార్యాలయంలో మంగళ వారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నెట్టుకొచ్చిన ఆయన ఇప్పుడు మాయ మాటలు చెబుతూ మరోసారి జనాన్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆయన మాటలు నమ్మకుండా వచ్చే ఎన్నికల్లో టీడీపీని భూస్థాపితం చేయాలని ప్రజలకు పిలుపుని చ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కంటితుడుపు చర్యగా నిరుద్యోగ భృతి కింద రూ.1000 ప్రకటించారన్నారు. సమస్యలు తీర్చాలంటూ ప్లకార్డులు ప్రదర్శించిన ముస్లిం యువకులపై దేశ ద్రోహం కేసు పెట్టిన ఘన చరిత్ర చంద్రబాబుదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీరున్నా జిల్లా అవసరాలకు వాడుకునే అవకాశం లేకుండా ఇతర జిల్లాలకు తరలిస్తున్నార న్నారు. శ్రీశైలంలో కాంట్రాక్ట్ వర్కర్స్‌ను రెగ్యులర్ చేస్తానని చెప్పి చేయలేదని, నిర్వాసితులకు ఇళ్లు కూడా కట్టించలేకపోయారన్నారు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో 24 సార్లు నోటీసులిచ్చినా స్పందిం చని చంద్రబా బుకు మహారాష్ట్ర కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ ఇచ్చిందని, అయితే ఈ పరిస్థితిని కూడా చంద్రబాబు తన రాజకీయపబ్బం గడుపుకోవడానికి వాడుకుంటున్నారని విమర్శించారు. ‘కావాలి జగన్.. రావాలి జగన్’ను దిగ్విజయంగా పూర్తి చేద్దాం : వైఎస్సార్సీపీ చేపట్టిన రావాలి జగన్... కావాలి జగన్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని పార్టీ నాయకులను శిల్పా చక్రపాణిరెడ్డి కోరారు. కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్ని ఊర్లలో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలన్నారు. జగన్మోహన్రెడ్డి నవరత్నాల పేరుతో ప్రకటించిన పథకాలతో ఒక్కో కుటుంబానికి రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు లబ్ధి చేకూరుతుందని, ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. పార్టీ నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోగోలు శివశంకర్‌నాయుడు, నాయకులు రమణారెడ్డి, పుల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి, మహేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలులో వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు
-
యువనేస్తం.. అడుగడుగునా మోసం..
సాక్షి, కర్నూలు : ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పేరుతో నిరుద్యోగ యువతను సీఎం చంద్రబాబు నాయుడు దారుణంగా మోసం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శిల్పాచక్రపాణి రెడ్డి, బీవై రామయ్య, ఎమ్మెల్యే ఐజయ్య, కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్లు దుయ్యబట్టారు. శుక్రవారం జిల్లాలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వాస్తవానికి పది శాతం మంది నిరుద్యోగులకు కూడా భృతి అందడం లేదని చెప్పారు. గతంలో సుమారు రెండు కోట్ల మందికి రూ. 2 వేల చొప్పున నిరుద్యోగ భృతిని కల్పిస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు, నాలుగేళ్ల తర్వాత కేవలం 12 లక్షల మందికి రూ. వెయ్యి చొప్పున భృతి కల్పిస్తామని యూటర్న్ తీసుకున్నారని వివరించారు. నయవంచనకు, మోసానికి, వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబని అన్నారు. ముఖ్యమంత్రి యువనేస్తంతో ప్రభుత్వం చేసిన ప్రకటన కోట్లాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లిందని చెప్పారు. చంద్రబాబు నమ్మించి మోసం చేశారని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలోనూ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించారు. వివిధ శాఖల్లో 1.80 లక్షల ఖాళీలు ఉంటే కేవలం 20 వేల పోస్టులు భర్తీ చేయడమేంటని నిలదీశారు. పదవి కోసం బూటకపు హామీలు ఇచ్చిన బాబు పప్పులు ఇక ఉడకవని పేర్కొన్నారు. కాపులు మొదలుకుని మైనార్టీల దాకా అందరినీ బాబు మోసం చేశారని ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్ల పేరిట వేసిన కమిటీ ఇచ్చిన రిపోర్టులను వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ పాదయాత్రకు కాపు సోదరులు ఇస్తున్న మద్దతు చూసి చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఏ సామాజికవర్గ హక్కులకు, డిమాండ్లకు వైఎస్సార్ సీపీ వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. కాపు కార్పొరేషన్‌కు రూ. 10 వేల కోట్లు ప్రకటించడం వైఎస్ జగన్ దూరదృష్టికి నిదర్శనం అని అన్నారు. గోబెల్స్ ప్రచారంతో చంద్రబాబు వైఎస్ జగన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని తెలిపారు. చైతన్యవంతులైన ప్రజలు ఈ విషయాలను నిశితంగా గమనిస్తున్నారని చెప్పారు. ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్త టీడీపీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపు ఇచ్చారు. -
బాబు ప్రభుత్వ వైఫల్యాలపై మహాధర్నా
సాక్షి, కర్నూలు : సీఎం చంద్రబాబు నాయుడి ప్రభుత్వ వైఫల్యాలపై మే 16 వతేదీన కర్నూలు కలెక్టరేట్ ముందు మహాధర్నాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మే 14 వ తేదీన 2000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోనుంది. ఈ సందర్భంగా ఈ నెల 14, 15 తేదీల్లో మండలాల వారిగా సంఘీభావ పాదయాత్రలు చేపట్టాలని వైఎస్సార్సీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ.. సంఘీభావ పాదయాత్రలో గత నాలుగేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. అంతేకాక టీడీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. నియోజకవర్గాల నుంచి భారీగా పార్టీ శ్రేణులు పాల్గొని మహాధర్నాను విజయవంతం చేయాలని శిల్పా చక్రపాణి రెడ్డి పిలుపునిచ్చారు. మహాధర్నా అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి వైఎస్సార్సీపీ నేతలు వినతి పత్రం అందజేయనున్నారు. -
హోదాపై బాబు దొంగాట
ఆదోని టౌన్:ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు నాయుడు..రోజుకోమాట, పూటకో అబద్ధం చెబుతూ దొంగాట ఆడుతున్నారని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆదోని పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హోదా సంజీవని కాదని ఒక సారి.. దాని వల్ల ఒరిగిందేమీ లేదని మరోసారి.. ప్యాకేజీతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని ఇంకోసారి..పూటకో మాట మారుస్తూ ప్రజలను మభ్యపెట్టడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నట్లు కొత్త డ్రామాకు తెరతీశారన్నారు. మతిస్థిమితం కోల్పోయిన బాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చలేదని..టీడీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బాబు తన 40 ఏళ్ల రాజకీయంలో వెన్నుపోట్లు పొడవడం..మోసం చేయడం అనుభవంగా గడించారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా కొనుగోలు చేసి ..మంత్రి పదవులు కట్టబెట్టిన చంద్రబాబుకు విలువలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రజాదరణ చూసి ఓర్వలేక.. ప్రజాసంకల్ప యాత్రలో తమ పార్టీ అధినేత వైఎ‹స్ జగన్మోహన్రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక విమర్శలు చేయడమే టీడీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రాద్ధాంతం చేస్తున్నారని, ఇది దుర్మార్గమైన చర్య అని అన్నారు. టీడీపీ ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. హోదా కోసం ఎంపీలతో రాజీనామా చేయించకుండా దోబూచులాట ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని, వారి ఆటలు ఇక సాగబోవన్నారు. టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు.. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీలను విమర్శించేందుకే అసెంబ్లీని వేదికగా మార్చడం శోచనీయమని శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా..అసెంబ్లీని టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం చంద్రబాబు నాయుడు తప్పుదోవ పట్టించడం తగదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. టీడీపీ భూస్థాపితమై..త్వరలోనే ప్రజాప్రభుత్వం వస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు రాఘవరెడ్డి, పీఏసీ సభ్యుడు డాక్టర్ మధుసూదన్, పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు సురేంద్రరెడ్డి, కల్లుపోతుల సురేష్, కేసీ నాగన్న, నర్సింహ, బసవ, మాజీ సర్పంచ్ ఈరన్న, రవి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
సాగు నీటి కోసం పోరాటం
వెలుగోడు: సాగునీటి కోసం పోరాటం చేస్తానని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టులన్నీ 90 శాతం పూర్తి చేశారన్నారు. గాలేరు నగరి, మల్యాల ఎత్తిపోతల పథకం, అలగనూరు రిజర్వాయర్, పోతిరెడ్డిపాడును 44 వేల క్యూసెక్కుల సామర్థ్యం పెంచేందుకు వైఎస్ఆర్ కృషి చేశారని గుర్తు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మిగిలిన పనులు పూర్తి చేయడం లేదని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి రైతును అని చెప్పుకుంటూ అన్నదాతలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 7 టీఎంసీల ఉంటే మార్చి ఆఖరి వరకు సాగునీరు ఇస్తామని చెప్పడం రైతులను మోసం చేసినట్లే అన్నారు. ఒక ఎకరా కూడా రెండో పంట ఎండిపోకుండా వీబీఆర్ నుంచి మే చివరి వరకు నీరందించాలని డిమాండ్ చేశారు. లేదంటే పది వేల మంది రైతులతో పాదయాత్ర చేస్తానని హెచ్చరించారు. టీడీపీ నేతలు కాంట్రాక్టు పనులు చేసుకొని రైతుల కడుపు కొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రైతులకు అన్ని విధాల అండగా ఉంటానని భరోసా కల్పించారు. తాను గతంలో అధికార పార్టీలో ఉన్నప్పుడు వీబీఆర్‌లో డెడ్ స్టోరేజీ ఉన్న సమయంలో కూడా వన్‌ఆర్, వన్ ఎల్ తూముల నుంచి రైతులకు నీరందించానని గుర్తు చేశారు. సిద్ధాపురానికి తరలిరండి సిద్ధాపురం ఎత్తిపోతల పథకం వద్ద ఈ నెల ఆఖరున లేదంటే వచ్చే నెలలో నిర్వహించే వైఎస్ఆర్ జలహారతి కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం నుంచి సిద్ధాపురం చెరువు వద్దకు ట్రాక్టర్ల మీద తరలిరావాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు అంబాల ప్రభాకర్‌రెడ్డి, తిరుపంరెడ్డి, మండ్ల శంకర్‌రెడ్డి, పెద్ద స్వామన్న, వంగాల నాగేశ్వరరెడ్డి, నడిపి స్వామన్న, శ్రీనివాసులు, భూపాల్‌చౌదరి పాల్గొన్నారు. -
పవన్‌తో కలిసి చంద్రబాబు నాటకాలు..
సాక్షి, కర్నూలు : ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకుడు శిల్పా చక్రపాణి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. మొదటి నుంచి ప్రత్యేక హోదా సాధించడం కోసం అనేక కార్యక్రమాలు చేసిన ఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదేనని, ప్రత్యేక హోదాపై జగన్‌కు క్రెడిట్ దక్కకూడదనే పవన్‌తో కలిసి బాబు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని, రాజకీయలంటే సినిమాలు తీసినంత ఈజీ కాదంటు విమర్శించారు. మార్చి ఒకటో తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టదల్చిన కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని శిల్పా చక్రపాణిరెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మార్చి మూడో తేదీన పార్టీ ఎమ్మెల్యేలు, ఇంచార్జ్‌లు, ముఖ్యనాయకులంతా జగన్ మోహన్ రెడ్డిని కలిసి, అయిదో తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మహాధర్నాలో పాల్గొంటామని తెలిపారు. తెలుగు ప్రజల మనోభావాలు, ఆకాంక్షలు ఢిల్లీలో వినిపిద్దాం.. ప్రత్యేక హోదా సాధిద్దాం.. అంటు ఆయన నినాదం ఇచ్చారు. -
జన్మభూమి అట్టర్ ఫ్లాప్: శిల్పా
సాక్షి, కర్నూలు: వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు టీడీపీ ప్రభుత్వం భయపడుతోందని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. పాదయాత్ర సూపర్ హిట్.. జన్మభూమి అట్టర్ ఫ్లాప్ అని వ్యాఖ్యానించారు. పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం సూదేపల్లి గ్రామంలో మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమం ప్రజల పాలిట కర్మభూమిగా మారిందని అన్నారు. జన్మభూమి సభల్లో జనాలు లేరన్న విషయాన్ని టీడీపీ గుర్తించాలన్నారు. అధికార పార్టీ నాయకులు జన్మభూమికి వెళ్లలేని పరిస్థితి ఉందని, వాస్తవాలు ఒప్పుకోవడానికి ప్రభుత్వం వెనుకాడుతోందని పేర్కొన్నారు. క్షేత్రస్ధాయిలో వైఎస్సార్సీపీని బలోపేతం చేస్తున్నామని, సమన్వయంతో వచ్చే ఎన్నికల్లో జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలతో పాటు 14 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అరెస్టులు దారుణం నాలుగేళ్ళ టీడీపీ పాలనలో చేసింది శూన్యమని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు బివై రామయ్య అన్నారు. అభివృద్ధిపై బహిరంగ సవాల్‌కు ప్రభుత్వం సిద్ధంగా లేదని, బహిరంగ చర్చకు టీడీపీ నాయకులు మొహం చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు. జన్మభూమి కమిటీలకు మాత్రమే జన్మభూమి కార్యక్రమం వల్ల ఉపయోగమన్నారు. ప్రశ్నించే వారిని పోలీసులతో అరెస్టు చేయడం దారుణమన్నారు. మరోసారి మోసం జన్మభూమి కార్యక్రమం పేరుతో ప్రజలను మరోసారి ప్రభుత్వం మోసం చేస్తోందని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. నిరుపేదలకు రేషన్ కార్డులు ఇవ్వడం లేదని, అలాంటప్పుడు ప్రజల కష్టాలు ఎలా తీరుతాయని ఆయన ప్రశ్నించారు. -
బాబు చేతిలో ‘పవన్’ కీలుబొమ్మ
ఆత్మకూరు(కర్నూలు): టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి చేతిలో సినీనటుడు పవన్ కళ్యాణ్ కీలుబొమ్మగా మారాడని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి ఆరోపించారు. ఆత్మకూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీని స్థాపించి గత ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ , బీజేపీకి మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. వచ్చే ఎన్నికల్లోనైనా పోటీ చేస్తారా లేదో ప్రజలకు తెలపాలన్నారు. ఓటు నోటు కేసులో సీఎం చంద్రబాబు ఇరుక్కున్నా..ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీలకు 2 ఎకరాల భూమి లాంటి చంద్రబాబు ఇచ్చిన హామీలపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. రిజర్వేషన్ల కోసం పాదయాత్ర చేస్తున్న కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభంను గృహ నిర్బంధం చేస్తే ఎందుకు స్పందించలేదన్నారు. సొంత సామాజికవర్గ నేతకు మద్దతు ఇవ్వని పవన్ కళ్యాణ్ ఇతరుల గురించి ప్రశ్నించడం సరికాదన్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వివిధ కులాలను మభ్య పెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. శ్రీశైలం నియోజకవర్గం తన కృషితో అభివృద్ధి చెందిందన్నారు. పెద్దాపురం ఎత్తిపోతల పథకంతోపాటు ఆత్మకూరు పట్టణానికి రూ. వంద కోట్లతో మంచినీటి పథకం మంజూరుకు కృషి చేసినట్లు వివరించారు. శ్రీశైలం నియోజకవర్గంలో పక్కాగృహాల విషయంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. అందరికీ ఇళ్లు పూర్తయ్యాకే శ్రీశైలం నుంచి తరలించాలన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు భువనేశ్వర్ రెడ్డి, బండి ఆత్మకూరు మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మద్దిలేటి పాల్గొన్నారు. -
ప్రజాదరణ భరించలేకే టీడీపీ కుట్రలు
-
అధికార పార్టీ కక్ష సాధింపు
అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసుకొని మరీ వేధిస్తున్నారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో కీలక నేతలకు గన్మెన్లను తొలగించడం వీరి వేధింపులకు పరాకాష్ట. వీరంతా తెలుగుదేశం పార్టీలో ఆరునెలల క్రితం వరకు ఉన్నారు. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వచ్చిన అనంతరమే గన్మెన్లను తొలగించడంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నంద్యాలటౌన్: వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి, నంద్యాల నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి, నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచనలకు గన్మెన్లను తొలగిస్తూ జిల్లా పోలీసు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. శిల్పా చక్రపాణిరెడ్డి రెండుసార్లు ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఒకసారి శ్రీశైలం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. నంద్యాల ఉపఎన్నిక అనంతరం సూరజ్ హోటల్ వద్ద చక్రపాణిరెడ్డిపై టీడీపీ నాయకుడు అభిరుచి మధు హత్యాయత్నం చేయడానికి కొడవలి పట్టుకొని హల్చల్ చేసిన సంఘటన అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో అభిరుచి మధుపై కేసు నమోదు అయినా ఇంత వరకు అతన్ని అరెస్ట్ చేయలేదు. పైగా గన్మెన్లను కూడా కొనసాగిస్తున్నారు. అయితే రెండుసార్లు శాసనసభకు ఎన్నికైన చక్రపాణిరెడ్డికి 2+2 గన్మెన్లు తొలగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే వైఎస్సార్సీపీ నంద్యాల నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న శిల్పా మోహన్‌రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కూడా పని చేశారు. శిల్పామోహన్‌రెడ్డి రాజకీయ ప్రవేశం నుంచి 2+2 గన్మెన్లతో భద్రతా సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం వారిని తొలగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీపీ నాగిరెడ్డి..జిల్లా పరిషత్ చైర్మన్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్, డీసీఎంఎస్ చైర్మన్‌గా పని చేశారు. ప్రస్తుతం మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. 1+1 గన్మెన్లు ఉండగా వారిని తొలగించారు. అలాగే నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచనకూ పోలీస్ భద్రత తీసివేశారు. దేశం సులోచన సోదరుడు కేదార్నాథరెడ్డి గతంలో ప్రత్యర్థుల చేతిలో హతమయ్యారు. శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా మోహన్‌రెడ్డి, పీపీనాగిరెడ్డి, దేశం సులోచనలకు రాజకీయ పరంగా ప్రత్యర్థులు ఉన్నారు. ఎప్పటి నుండో ఉన్న గన్మెన్లను తొలగించడం రాజకీయ కక్ష సాధింపేనని చర్చించుకుంటున్నారు. గతంలో చెరుకుపాడు నారాయణరెడ్డికి కూడా వైఎస్సార్సీలో చేరాక గన్మెన్లను తొలగించారు. భద్రతను కొనసాగించాలని పోలీసు అధికారులను, ప్రభుత్వాన్ని వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. భద్రత లేని కారణంగా ప్రత్యర్థులు దారి కాచి నారాయణరెడ్డిని సులభంగా హతమార్చగలిగారు. ఇదే విధంగా ప్రస్తుతం భద్రతా సిబ్బందిని తొలగించిన ఈ నలుగురు వైఎస్సార్సీపీ ముఖ్య నేతలకు హాని జరిగితే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇబ్బందులు పెట్టేందుకే గన్మెన్లను తొలగించారు: టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరినందుకే గన్మెన్లను తొలగించారు. పార్టీ మారితే కక్ష సాధింపు చర్యలకు దిగడం మంచి పరిణామం కాదు. టీడీపీ బెదిరింపులకు మేం భయపడం. జిల్లా ఎస్పీకి, డీఐజీకి భద్రత కొనసాగించాలని విన్నవిస్తాం. లేదంటే కోర్టును ఆశ్రయిస్తాం. శిల్పాచక్రపాణిరెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు -
శిల్పా చక్రపాణి రెడ్డికి గన్మెన్లు తొలగింపు
-
శిల్పా గన్మెన్లను తొలగించిన ఏపీ సర్కార్
సాక్షి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డికి భద్రతగా ఉన్న గన్మెన్లను ఏపీ ప్రభుత్వం వెనుకకు తీసుకుంది. ఆయనకు ఎలాంటి ప్రాణహాని లేదనే ఉద్దేశంతో సెక్యూరిటీని ఉపసంహరిస్తున్నట్లు ఏపీ సర్కారు ఓ పంపింది. శిల్పా చక్రపాణిరెడ్డి భద్రతా విషయంలో ఏపీ సర్కారు తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. శిల్పాకు గన్మెన్ల ఉపసంహరణ కక్ష సాధింపు చర్యనని పార్టీ నేతలు మండిపడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో శిల్పా చక్రపాణి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి.. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. నంద్యాల ఉప ఎన్నికలు ముగిసిన అనంతరం శిల్పా చక్రపాణిరెడ్డి లక్ష్యంగా కాల్పులు కూడా జరిగాయి. అయినప్పటికీ శిల్పాకు సెక్యూరిటీ ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. -
నంద్యాలలో ఏవీ సుబ్బారెడ్డి వీరంగం
-
నంద్యాలలో ఏవీ సుబ్బారెడ్డి వీరంగం
కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాలలో టీడీపీ నేతల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డిపై హత్యాయత్నం ఘటన మరవక ముందే.. తాజాగా భూమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి వీరంగం సృష్టించారు. నూనెపల్లెలో ఇద్దరు మహిళలపై ఆయన దాడి చేశారు. వినాయక విగ్రహ ఏర్పాటు విషయంలో మహిళలపై దాడికి తెగబడ్డాడు. అనుచరులతో కలిసి వచ్చి ఏవీ సుబ్బారెడ్డి తమను విచక్షణారహితంగా కొట్టాడని దళిత మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు. అధికార పార్టీ నేతల దాడిలో పలువురు మహిళలు గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళలను శిల్పామోహన్ రెడ్డి తనయుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ గూండాల దాడులను ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ప్రశాంతంగా ఉన్న నంద్యాలలో అలజడి సృష్టించేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలు జరిగినా అందుకు టీడీపీ నేతలదే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. కాగా నంద్యాలోని విశ్వనగర్‌కు చెందిన రాములమ్మ కుటుంబీకులు టీడీపీకి ఓటు వేయలేదన్న కోపంతో టీడీపీ వర్గీయుడు సుబ్బయ్య దాడి చేసి గాయపరిచిన విషయం విదితమే. ఇక బుధవారం ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల వ్యవహారశైలి, అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు అందరికి తెలిసిందే. -
బాబు ప్రోత్సాహంతోనే శిల్పాపై హత్యాయత్నం
►రౌడీషీటర్‌కు గన్ లైసెన్స్ ఎలా ఇచ్చారు? ►అభిరుచి మధును తక్షణమే అరెస్టు చేయాలి ►వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి కర్నూలు (ఓల్డ్‌సిటీ): ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహంతోనే నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డిపై కాల్పులు జరిగాయని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పోలింగ్ ముగిసిన కొన్ని గంటల వ్యవధిలోనే దాడి జరగడం దారుణమని పేర్కొన్నారు. అసలు నంద్యాలలో ఎన్నికల కోడ్ ఏమైందని అధికారులను ప్రశ్నించారు. ఓ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన చక్రపాణిరెడ్డిపై కాల్పులు జరిపి హతమార్చేందుకు ప్రయత్నించడం అత్యంత దారుణమైన సంఘటనగా పేర్కొన్నారు. అసలు రౌడీషీటర్‌కు గన్ లైసెన్స్ ఎలా ఇచ్చారని, కోడ్ అమలులో ఉండగానే తుపాకీతో కాల్పులు జరపడానికి అవకాశం కల్పించిందెవరని ప్రశ్నించారు. టీడీపీ రౌడీషీటర్ నడిరోడ్డుపై కత్తులతో స్వైరవిహారం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఎన్నికల నిబంధనలు టీడీపీకి వర్తించవా? ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైనా జీవో ఇచ్చారేమో చూపాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రే ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ రౌడీషీటర్ అభిరుచి మధును తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
సీఎం అండతోనే శిల్పాపై హత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డిపై జరిగిన దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కాల్పులకు పాల్పడ్డ అభిరుచి మధును తక్షణమే అరెస్ట్ చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు పాలన అంతా రక్తచరిత్రే అని అన్నారు. టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, నడిరోడ్డుపై రౌడీలు వీరవిహారం చేస్తుంటే పోలీసులు పారిపోతున్నారన్నారు. రౌడీషీటర్‌కు గన్ ఎక్కడ నుంచి వచ్చిందని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఆయుధాలను పోలీస్ స్టేషన్లో ఎందుకు అప్పగించలేదని, టీడీపీ నేతలకు నిబంధనలు వర్తించవా అని అన్నారు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా నంద్యాలలో నిన్నంతా టీడీపీ నేతలు వీరంగం సృష్టించారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఇంకెంతకాలం అరాచకాలు చేస్తారని అన్నారు. ప్రభుత్వమే రౌడీయిజం చేయిస్తోందని, రౌడీలను పరోక్షంగా ప్రోత్సహిస్తోందని వ్యాఖ్యానించారు. నారాయణరెడ్డిని దారుణంగా చంపినా చంద్రబాబు కనీసం చర్యలు తీసుకోలేదని అన్నారు. పోలీసులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, తప్పు చేసినవారిని శిక్షించాలన్నారు. కళ్ల ఎదురుగానే కాల్పులు జరిపిన వ్యక్తిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ప్రశ్నించారు. నడిరోడ్డుపై రౌడీలు వీరవిహారం చేస్తుంటే పోలీసులే పారిపోతున్నారన్నారు. నేతల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అభిరుచి మధును అదుపులోకి తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాల్పుల ఘటన ప్రభుత్వ వైఫల్యమే.. నంద్యాలలో టీడీపీ నేతలు రౌడీయిజం చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారన్నారు. ముఖ్యమంత్రి మెప్పు కోసం అధికారులు, పోలీసులు యత్నిస్తున్నారని విమర్శించారు. గత నెలరోజులుగా వైఎస్ఆర్ సీపీ నేతలను టార్గెట్ చేశారని అంబటి అన్నారు. మూడు రోజులుగా శిల్పా కుటుంబాన్నే లక్ష్యంగా చేసుకున్నారని, కాల్పులను ప్రభుత్వ వైఫల్యంగా చూడాలన్నారు. పట్టపగలు టీడీపీ నేతలు కాల్పులు జరపడం దారుణమని, పోలీసుల వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. టీడీపీ నేతలు కాల్పులు జరుపుతుంటే పోలీసులు పారిపోయారన్నారు. -
అందుకే నాపై కక్ష గట్టాడు: శిల్పా
సాక్షి, నంద్యాల: తమపై హత్యాయత్నం చేసిన టీడీపీ నేత అభిరుచి మధుకి నేర చరిత్ర ఉందని శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. నేర చరిత్ర కారణంగా అప్పటి పార్టీ ఆదేశాల మేరకు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న మధును సస్పెండ్ చేశామని ఆ అక్కసుతో తనపై హత్యాయత్నం చేశాడని వెల్లడించారు. నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ రోజున కావాలనే తమతో గొడవ పెట్టుకున్నారని చెప్పారు. ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినా సహనం పాటించామన్నారు. గురువారం ఆయన 'సాక్షి' టీవీతో మాట్లాడుతూ.. రౌడిషీట్ ఉన్న మధుకు గన్‌మెన్ ఇవ్వడం దారుణమని వ్యాఖ్యానించారు. మధు ఆగడాలు, దుర్మార్గాల గురించి చంద్రబాబు, లోకేశ్‌లకు తెలుసునని వెల్లడించారు. మారణాయుధాలతో మధు సృష్టించిన వీరంగంపై పోలీసులకు వెంటనే తెలియజేశానని చెప్పారు. పోలీసులు ఆలస్యంగా రావడం బాధాకరమన్నారు. మాపైన దాడులు చేసి మాపైనే కేసులు పెట్టడం దారుణమన్నారు. దీన్ని చట్టప్రకారం ఎదుర్కొంటామని ప్రకటించారు. గొడవలు పెట్టుకోవాలనే తత్వం శిల్పా కుటుంబానికి లేదని, అలాగని తాము భయపడే రకం కాదని అన్నారు. అధికారముందని బెదిరిస్తే భయపడేది లేదని స్పష్టం చేశారు. నంద్యాల శాంతియుతంగా ఉండాలన్నదే తమ కోరిక అని చక్రపాణిరెడ్డి తెలిపారు. -
అందుకే నాపై కక్ష గట్టాడు: శిల్పా
-
రౌడీలు వీరవిహారం , పోలీసులే పారిపోయారు
-
మీ సంగతి తేల్చడానికే వచ్చామని...
-
శిల్పా చక్రపాణిరెడ్డిపై కాల్పులు దృశ్యాలు..!
-
నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డిపై కాల్పులు!
సాక్షి, నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికకు పోలింగ్ పూర్తయి 24 గంటలు కూడా గడవక ముందే తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతలు ఏకంగా కాల్పులకే దిగారు. నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు చక్రపాణిరెడ్డి లక్ష్యంగా కాల్పులు జరిగాయి. గత నెల రోజులుగా టీడీపీ నేతలకు అడ్డగా మారిన సూరజ్ గ్రాండ్ హోటల్ ముందు భూమా వర్గీయుడు, రౌడీ షీట్ వున్న అభిరుచి మధు...చక్రపాణి రెడ్డిపై అయిదు రౌండ్ల కాల్పులు జరిపాడు. అంతేకాకుండా చేతిలో కొడవలితో వీరంగం సృష్టించాడు. ఈ ఘటనలో శిల్పా చక్రపాణి రెడ్డి తప్పించుకోగా భూమా వర్గీయులను శిల్పా వర్గీయులు అడ్డుకున్నారు. మైనార్టీ నేత చింపింగ్ బాషా అంత్యక్రియల కార్యక్రమానికి హాజరైన శిల్పా చక్రపాణిరెడ్డిపై సూరజ్ గ్రౌండ్ హోటల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరగడం ప్రకంపనలు రేపుతోంది. కాగా కాల్పులు జరిపిన అభిరుచి మధుపై రౌడీషీట్ ఉంది. ఎన్నికల సమయంలో అభిరుచి మధుకు చంద్రబాబు సర్కార్ గన్మెన్లను కేటాయించడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. -
ఉద్దేశపూర్వకంగానే నాపై కాల్పులు
-
ఉద్దేశపూర్వకంగానే నాపై కాల్పులు: చక్రపాణిరెడ్డి
సాక్షి, నంద్యాల: అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపై కాల్పులు జరిపారని వైఎస్ఆర్ సీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఉద్దేశపూర్వకంగానే తనపై కాల్పులు జరిగాయని ఆయన తెలిపారు. కాల్పుల ఘటనపై శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ... ‘కాల్పులు జరిపింది అభిరుచి మధునే. మధు చేతిలో గన్‌తో మాపైకి దూసుకు వచ్చాడు. చుట్టు ఉన్నవారు నిలువరించడానికి ప్రయత్నించినా మధు ఆగలేదు. అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళితే అటకాయించారు. మా వాహనాలను ముందుకు వెనక్కి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇదేంటని మా వాళ్లు ప్రశ్నిస్తే.. మీ సంగతి చూస్తామన్నారు. మీ సంగతి తేల్చడానికే ఇక్కడికి వచ్చామని బెదిరించారు. వాళ్ల చేతుల్లో గన్లు ఉన్నాయి. కార్లలో వేట కొడవళ్లు ఉన్నాయి. దాడి విషయాన్ని పోలీసులకు చెబితే తాత్సారం చేశారు. కొత్త సూరజ్ హోటల్ వద్ద దాడి జరిగిందని పోలీసులకు చెబితే పాత సూరజ్‌కు వెళ్లామని చెప్పారు. పోలీసులు నిదానంగా వచ్చి అందరిని పంపే ప్రయత్నం చేశారు. నిన్న మా కార్యకర్తలను కొట్టారు. నేడు నాపై దాడికి ప్రయత్నించారు. అభిరుచి మధుపై రౌడీ షీట్ ఉంది. ఆయనకు నేర చరిత్ర కూడా ఉంది. కార్లలో వేట కొడవళ్లు, కత్తులు ఎందుకు?. మేం గత నెల రోజులుగా సంయమనం పాటిస్తూనే ఉన్నాం. టీడీపీ నేతలు మాత్రం ప్రతిసారి రౌడీయిజాన్ని చూపిస్తున్నారు. ఈ చర్యలకు మేము, మా కార్యకర్తలు భయపడేది లేదు. మేం ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటాం. ఇటువంటి చర్యలను ప్రభుత్వం కూడా ఖండించాలి.’ అని అన్నారు. సంబంధిత వార్త...: నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డిపై కాల్పులు! కాగా నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే ఆయుధాలను పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలి. అయితే నిబంధనల ప్రకారం గన్‌తో పాటు బుల్లెట్లను కూడా అప్పగించాలి. కౌంటింగ్ పూర్తయ్యేవరకూ ఆయుధాలు పోలీస్ స్టేషన్లోనే ఉండాలి. అయితే నిబంధనలు అతిక్రమించిన టీడీపీ నేతలు తమ వద్దే ఆయుధాలు ఉంచుకున్నారు. -
నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డిపై కాల్పులు!
-
'కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది'
-
'కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది'
సాక్షి, నంద్యాల: ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలవబోతున్నామని వైఎస్సార్ సీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత తన సోదరుడితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉప ఎన్నికను కురుక్షేత్ర మహా సంగ్రామంగా ఆయన వర్ణించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేశారని, శ్రేయోభిలాషులు వెన్నుదన్నుగా నిలిచారని చెప్పారు. తమ కార్యకర్తలు బంగారమని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పనిచేశారని మెచ్చుకున్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కష్టపడి పనిచేశారని, కార్యకర్తలు చేతులెత్తి దండం పెట్టాలని అన్నారు. సీఎం, మంత్రులు మకాం వేసి ప్రలోభాలు పెట్టినా తమకు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. సీఎం ఆరు రోజులు, ఆయన తనయుడు రెండ్రోజులు, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు నెల రోజులు ఇక్కడే మకాం వేశారని వెల్లడించారు. నామినేషన్ నుంచి పోలింగ్ ఎన్నోకుట్రలు పన్నారని ఆరోపించారు. తన సోదరుడు నామినేషన్ చెల్లకుండా చేయాలని చూశారన్నారు. ఎన్నోరకాల దుష్ప్రచారాలు చేశారని.. కుల, మతాలు అడ్డుపెట్టుకుని రాజకీయం చేశారని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు భయభ్రాంతులకు గురిచేసినా భయపడకుండా నంద్యాల ప్రజలు ఓటు వేశారని తెలిపారు. తనను ఇక్కడి నుంచి ఆత్మకూరుకు వెళ్లిపోవాలని ఒత్తిడి తెచ్చారని, స్థానికేతర టీడీపీ నాయకులు తిష్ట వేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఎన్ని కుట్రలు దాడులు చేసినా ధైర్యంగా ఎదుర్కొన్నామని చెప్పారు. కార్యకర్తలు తమ కుటుంబం వెన్నంటి నిలిచి, ఎంతో శాంతితో పనిచేసి గెలుపునకు కారణం కాబోతున్నారని చక్రపాణిరెడ్డి అన్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాం నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. టీడీపీ నేతలు డబ్బులు పంచుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు. -
రాజకీయాలు ఎక్కడికి పోతున్నాయి?
నంద్యాల: విలువలకు కట్టుబడి ఎమ్మెల్సీ పదవికి తాను చేసిన రాజీనామాను ఆమోదింప చేసుకున్నానని వైఎస్సార్ సీపీ నాయకుడు శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. తన రాజీనామాను ఆమోదించినందుకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డబ్బులు తీసుకుని పార్టీ మారిన వారు తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. శిల్పా కుటుంబం నైతిక విలువలకు కట్టుబడివుంటుందని, మైనార్టీలు తమ కుటుంబ సభ్యులాంటివారని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. తమ కుటుంబానికి కార్యకర్తలే బలమని, వారికి కాపాడుకుంటామని భరోసాయిచ్చారు. తమ మాటలను వక్రీకరిస్తూ అధికార పార్టీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి మాటను వక్రీకరిస్తున్నారు, రాజకీయాలు ఎక్కడికి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సభలకు వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నేతలకు దిక్కుతోచడం లేదని, ఒక్కొక్కరికీ రూ. 300 ఇచ్చి జగన్ వెంట వెళ్లొద్దని బతిమాలుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీతో పొత్తుపై టీడీపీ నేతలు రోజుకోరకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పొత్తు లేకపోతే బీజేపీ మంత్రులతో రాజీనామా చేయించాలన్నారు. మైనార్టీ ఓట్ల కోసం టీడీపీ నాయకులు డ్రామాలాడుతున్నారని, నంద్యాలలో మైనార్టీలకు అన్ని విషయాలు తెలుసునని అన్నారు. ఉప ఎన్నిక ద్వారా టీడీపీకి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని చక్రపాణిరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. -
రాజకీయాలు ఎక్కడికి పోతున్నాయి?
-
'అఖిలప్రియ అప్పుడు ఓట్లు అడగాలి'
నంద్యాల: ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినందుకు గర్వపడుతున్నానని వైఎస్సార్ సీపీ నాయకుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. రాజకీయాల్లో విలువల కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన రాజీనామా కోరారని వెల్లడించారు. మంగళవారం ఆయన 'సాక్షి' టీవీతో మాట్లాడుతూ.. విలువలకు తమ కుటుంబం కట్టుబడివుంటుందని, తన రాజీనామాతో ఈ విషయం నిరూపితమైందని చెప్పారు. చిత్తశుద్ధి ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి భూమా అఖిలప్రియ ముందు రాజీనామా చేసి తర్వాత ఓట్లు అడిగితే గౌరవంగా ఉంటుందని అన్నారు. నైతిక విలువలు ఎవరికున్నాయో తన రాజీనామాతో తేలిందని చక్రపాణిరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారానికి రాజీనామాతో సరైన సమాధానం చెప్పామన్నారు. తన రాజీనామాతో వైఎస్సార్ సీపీ నాయకుల విలువ మరింత పెరిగిందని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఆమోదింపజేసుకోవాలని మరోసారి డిమాండ్ చేశారు. -
'అఖిలప్రియ అప్పుడు ఓట్లు అడగాలి'
-
శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా ఆమోదం
-
శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా ఆమోదం
అమరావతి: ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా ఆమోదం పొందింది. కేవలం పదిరోజుల్లోనే ఆయన రాజీనామాను శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఆమోదించారు. టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరుతున్న సందర్భంగా నైతిక విలువలకు కట్టుబడి ఎమ్మెల్సీ పదవికి శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా చేశారు. ఉదాత్తమైన విలువలను కాపాడాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన సూచన మేరకు చక్రపాణిరెడ్డి తన పదవిని వదులుకున్నారు. అదే టీడీపీలో చేరిన 'ఫిరాయింపు' ఎమ్మెల్యేలు ఏమాత్రం విలువలకు కట్టుబడకుండా పదవిలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు టీడీపీ సర్కారు ఏకంగా మంత్రి పదవులు కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు ప్రజాతీర్పు ఉల్లంఘించి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ వైఎస్ఆర్సీపీ దాఖలు చేసిన పిటిషన్ సుదీర్ఘకాలంగా పెండింగ్‌లోనే ఉంది. ఈ పిటిషన్‌పై చర్యలు తీసుకోవడానికి ఒకవైపు మీనమేషాలు లెక్కబెడుతుండగా.. మరోవైపు విలువలకు కట్టుబడిన శిల్పా చక్రపాణి రాజీనామా ఆమోదం పొందడం గమనార్హం. -
వైఎస్సార్ సీపీలోకి కొనసాగుతున్న చేరికలు
నంద్యాల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. వైఎస్సార్ సీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లా పొన్నాపురానికి చెందిన 200 కుటుంబాలు శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వైఎస్సార్ సీపీలో చేరాయి. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. నంద్యాల ఉప ఎన్నిక ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధమని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. శిల్పా కుటుంబం ఇప్పటివరకు ఏ తప్పు చేయలేదని, చేయదని అన్నారు. చంద్రబాబు కుట్రలు నంద్యాలలో సాగవని పేర్కొన్నారు. నంద్యాల ప్రజలు కుయుక్తులు, ప్రలోభాలకు లొంగరని స్పష్టం చేశారు. తమ పార్టీకి రోజు రోజుకు బలం పెరుగుతుండటం పట్ల వైఎస్సార్ సీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేటి నుంచి నంద్యాలలో పర్యటిస్తుండటంతో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. -
వైఎస్సార్ సీపీలోకి కొనసాగుతున్న చేరికలు
-
స్పీకర్ ఫార్మెట్‌లోనే రాజీనామా చేశారు
-
స్పీకర్ ఫార్మెట్‌లోనే రాజీనామా చేశారు
రాజీనామా చేశాకే శిల్పా చక్రపాణిరెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైదరాబాద్: ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకే శిల్పా చక్రపాణిరెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు వైఎస్ఆర్ సీపీ పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. శిల్పా చక్రపాణిరెడ్డి స్పీకర్ ఫార్మెట్‌లోనే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారని వెల్లడించారు. సోమవారం ఆయన నంద్యాలలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీలో చేరిన 20మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించలేదని సీఎం చంద్రబాబును పెద్దిరెడ్డి నిలదీశారు. ప్రజాస్వామ్య విలువలకు కట్టబడి పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరితే.. జంతువులను కొన్నట్టు కొన్నారని చంద్రబాబు అన్నారని, మరి ఇక్కడ ఏ జంతువులను కొన్నట్టు ఈ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రజల మీద, ప్రజాస్వామ్యం మీద చంద్రబాబుకు నమ్మకం లేదని ఆయన దుయ్యబట్టారు. టీడీపీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతూ.. ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఎన్నికలంటేనే టీడీపీ నేతలు భయపడుతున్నారని, ఎన్నికలు రాగానే ఆగమేఘాల మీద అభివృద్ధి పనులకు శిలా ఫలకాలు వేసి.. ప్రజలకు తామేదో చేసినట్టు మభ్యపెడుతున్నారని విమర్శించారు. -
టీడీపీ నాయకులకు శిల్పా మోహన్ సవాల్
-
శిల్పా మోహన్‌రెడ్డి సవాల్
కర్నూలు: నంద్యాలలో గెలవకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని వైఎస్సార్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి ఓడితే మంత్రి భూమా అఖిలప్రియ రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. తన సవాల్‌ను స్వీకరించే దమ్ము టీడీపీ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. రాజీనామా విషయంలో తనకు డ్రామాలు తనకు చేతకాదని, అందుకే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ పంపానని మోహన్‌రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. శాసనమండలి మండలి చైర్మన్‌కు రాజీనామా లేఖ పంపినట్టు ఆయన వెల్లడించారు. పార్టీ ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ము టీడీపీకి ఉందా అని ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా నంద్యాలలో తమదే గెలుపని విశ్వాసం వ్యక్తం చేశారు. శిల్పా కుటుంబం ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని చెప్పారు. 'దేవుడిచ్చిన దాంట్లో ఎంతోకొంత సమాజానికి మేం తిరిగి ఇస్తున్నాం. ఇన్నేళ్లు మచ్చలేని రాజకీయాలు చేశాం. ఇకపై కూడా నంద్యాల ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటామ'ని చక్రపాణిరెడ్డి అన్నారు. -
నైతిక విలువలకు పట్టం
-
నైతిక విలువలకు పట్టం
♦ పదవులకు రాజీనామా చేస్తేనే వైఎస్సార్సీపీలోకి ప్రవేశం ♦ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ ♦ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన శిల్పా చక్రపాణిరెడ్డి సాక్షి, అమరావతి: నైతిక విలువలు, నీతిమంతమైన రాజకీయాలకు అద్దంపట్టే అరుదైన సంఘటన నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఆవిష్కృతమైంది. డబ్బు సంచులు, పదవులు, కాంట్రాక్టులను ఎరవేసి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా మంత్రి పదవులు సైతం కట్టబెడుతున్న తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలు రోత పుట్టిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ సంఘటన రాష్ట్ర, దేశ ప్రజలందరినీ ఆలోచింపజేస్తోంది. తమ పార్టీలోకి ఇతర పార్టీల వారెవరైనా రావాలనుకుంటే ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులన్నింటినీ వదులుకొని రావాల్సిందేనని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తేల్చిచెప్పారు. ఈ మేరకు టీడీపీ గుర్తుపై తాను సాధించిన శాసనమండలి (కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటా స్థానం) సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శిల్పా చక్రపాణిరెడ్డి ప్రకటించారు. ఆ మేరకు శాసన మండలి చైర్మన్‌ను ఉద్దేశిస్తూ నిబంధనల మేరకు స్పీకర్ ఫార్మాట్లో రూపొందించిన రాజీనామా లేఖపై సంతకం చేసి, బహిరంగ సభ వేదికపై, ప్రజల సమక్షంలో వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందించారు. రాజీనామా లేఖను స్పీకర్‌కు అందజేయాలని కోరారు. ఇతర పార్టీల గుర్తులపై గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలను డబ్బులు, పదవులు ఆశచూపి చంద్రబాబు టీడీపీలో చేర్చుకొంటున్నారని, అలాంటి నీచ రాజకీయాలకు వైఎస్సార్సీపీ ఏనాడూ పాల్పడదని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారు అక్కడి పదవులను వదులుకొంటేనే తమ పార్టీలోకి ప్రవేశం కల్పిస్తామని పేర్కొన్నారు. అటు చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ టికెట్‌పై గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను అనైతికంగా టీడీపీలో చేర్చుకోవడమే కాకుండా అందులో నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు సైతం కట్టబెట్టిన సంగతి తెలిసిందే. -
నంద్యాల విజయాన్ని జగన్‌కు కానుకగా ఇస్తాం
ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి స్పష్టీకరణ... నేడు వైఎస్సార్సీపీలో చేరుతున్నా.. సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉప ఎన్నిక విజయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇస్తామని ఎమ్మెల్సీ శిల్పా చక్రపా ణిరెడ్డి చెప్పారు. అధికార తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశానని ప్రకటించారు. ఈ సమాచారాన్ని ఫ్యాక్స్ ద్వారా పార్టీ అధిష్టానానికి పంపినట్లు వెల్లడించారు. నేడు (గురువారం) నంద్యాల బహిరంగ సభలో శ్రీశైలం నియోజకవర్గ నాయకుల తో కలిసి వైఎస్సార్సీపీలో చేరబోతున్నామ ని తెలిపారు. చక్రపాణిరెడ్డి బుధవారం నంద్యాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో చాలా అవమానకర పరిస్థితులు, ఇబ్బందులను ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘టీడీపీలో రెండేళ్ల పాటు పలు హోదాల్లో పనిచేశా. ప్రతి గ్రామంలో పేరు పెట్టి పిలిచే విధంగా సంబంధాలు ఏర్పర్చుకున్నా. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వలేని పరిస్థితుల్లో నాకు అంతకంటే ఎక్కువ అధికారాలను ఇచ్చా రు. నా నాయకత్వంలో కర్నూలు జిల్లాలో ఎన్నికల్లో గెలిచాం. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పనిచేశా. ఇప్పటివరకు టీడీపీలో చంద్రబాబు దగ్గర పనిచేశా. నేను ఎక్కడ పనిచేసినా ఆ పార్టీకి అంకితభావంతో సేవలందించా. టీడీపీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశా. నేను ఎవరి దగ్గర పనిచేసినా అంకితభావంతో, నిబద్ధతతోనే పనిచేశా. రండి.. రాజీనామా చేసి తేల్చుకుందాం.. నా సోదరుడు శిల్పా మోహన్‌రెడ్డి చీమకు కూడా హాని చేయని వ్యక్తి. మా అన్నకు దయాదాక్షిణ్యాలు ఎక్కువ. అటువంటి వ్యక్తిపై విమర్శలు చేస్తారా? నంద్యాలను అభివృద్ధి చేయలేదని మాట్లాడుతున్నారు. మీరు(టీడీపీ) ఏం అభివృద్ధి చేశారు? మేం లాడ్జీల నుంచి డబ్బులు గుంజలేదు, తుపాకులతో కాల్చలేదు. మేం చీమను కూడా చంపలేదు. నంద్యాల విజయాన్ని వైఎస్ జగన్‌కు కానుకగా ఇస్తాం. నేను రాజీనామాకు సిద్ధం.రాజీనామా లేఖను జేబులోనే పెట్టుకొని తిరుగుతున్నా, అందరూ రండి రాజీనామా చేసి తేల్చుకుందాం.’’ అని శిల్పా చక్రపాణిరెడ్డి తేల్చిచెప్పారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర నేతలు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్‌తో శిల్పా చక్రపాణి భేటీ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్న కర్నూలు జిల్లా నేత ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌ను కలిశారు. పార్టీలో చేరికకు సంబంధించి ఇరువురి మధ్య చర్చ జరిగిందని, టీడీపీకి రాజీనామా చేయడానికి దారితీసిన పరిస్థితులను జగన్‌కు చక్రపాణిరెడ్డి వివరించారని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నందున చక్రపాణిరెడ్డి వైఎస్సార్సీపీలో చేరడానికి ముందు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని జగన్ వివరించినట్లు తెలిసింది. వైఎస్సార్సీపీ మొదటి నుంచి ఉన్నతమైన విలువలతో కూడిన రాజకీయాలకే పెద్దపీట వేస్తుందని, పార్టీలో ఎవరు చేరినా అంతకుముందు ఉన్న పదవులకు రాజీనామా చేయడం సంప్రదాయమని జగన్ తెలిపినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన 18 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి 2011లో వైఎస్సార్సీపీలో చేరడం, తిరిగి పోటీ చేసి గెలవడం వంటి అంశాలను ఆయన గుర్తు చేసినట్లు తెలిసింది. -
వైఎస్ జగన్‌తో శిల్పా చక్రపాణిరెడ్డి భేటీ
హైదరాబాద్: టీడీపీకి రాజీనామా చేసిన కర్నూలు జిల్లా నాయకుడు శిల్పా చక్రపాణిరెడ్డి బుధవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. నంద్యాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన నేరుగా జగన్ దగ్గరకు వెళ్లి కలిశారు. తాను టీడీపీకి రాజీనామా చేయడానికి దారితీసిన పరిస్థితులను జగన్‌కు వివరించారు. వైఎస్ జగన్ సమక్షంలో రేపు ఆయన వైఎస్సార్ సీపీలో చేరనున్నారు. ‘రేపు నంద్యాల బహిరంగ సభలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతా. నంద్యాల గెలుపును జగన్‌కు బహుమతిగా ఇస్తామ'ని శిల్పా చక్రపాణిరెడ్డి అంతకుముందు అన్నారు. మరోవైపు నంద్యాల ఎస్పీజీ మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు భారీ బహిరంగ సభను ఉద్దేశించి జగన్ ప్రసంగిస్తారు. -
బాబు ‘మాయాబజార్’ చూపిస్తున్నారు
-
టీడీపీలో నన్ను తీవ్రంగా అవమానించారు..
-
చంద్రబాబు ‘మాయాబజార్’ చూపిస్తున్నారు
కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అకస్మాత్తుగా నంద్యాలలో ‘మాయాబజార్’ చూపిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఆయన బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... నంద్యాల ఉప ఎన్నికతో టీడీపీ ఊహలు తారుమారు అవుతాయన్నారు. రానున్న రోజుల్లో మరింతగా ఆ పార్టీ ప్రతిష్ట దిగజారుతుందన్నారు. టీడీపీని గెలిపించకపోతే అభివృద్ధి ఆగిపోతుందని బ్లాక్మెయిల్ చేస్తున్నారని, వైఎస్ఆర్ సీపీ గెలిస్తే అభివృద్ధి ఎందుకు ఆగిపోతుందని అంబటి సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తన ఇంట్లో నుంచి డబ్బులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారా అని ప్రశ్నలు సంధించారు. నంద్యాల ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాలని అంబటి కోరారు. ఉప ఎన్నికలో చంద్రబాబు, లోకేశ్‌కు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... నంద్యాలలో రేపు (గురువారం) ఎస్పీజీ గ్రౌండ్స్‌లో జరిగే వైఎస్ఆర్ సీపీ బహిరంగ సభలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాల్గొంటారని తెలిపారు. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఈ నెల 4న నామినేషన్ దాఖలు చేస్తారన్నారు. అలాగే జగన్ సమక్షంలో శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీలో చేరతారని చెప్పారు. శిల్పా చక్రపాణిరెడ్డికి ఏ పదవి ఆశ చూపలేదని అన్నారు. మూడేళ్లుగా చంద్రబాబుకు నంద్యాల గుర్తులేదా, ఉప ఎన్నిక సందర్భంగానే ఆయనకు నంద్యాల గుర్తుకొచ్చిందా అని బొత్స ప్రశ్నించారు. నంద్యాలకు, మైనార్టీలకు తాము ఏం చేస్తామో రేపు వైఎస్ జగన్ చెప్తారని, తాము చేసేదే చెప్తామని, చెప్పిందే చేసి చూస్తామన్నారు. చంద్రబాబులాగా నేతలకు గాలం వేయమని బొత్స సత్యానారాయణ అన్నారు. -
టీడీపీకి శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా
-
టీడీపీకి శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా
కర్నూలు : టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్యకర్తలు, అనుచరుల సూచనలతో ఆయన అధికార తెలుగుదేశం పార్టీకి బుధవారం అధికారికంగా రాజీనామా చేశారు. శిల్పా చక్రపాణిరెడ్డి తన రాజీనామా లేఖను చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ ద్వారా పంపారు. శిల్పా చక్రపాణిరెడ్డి రేపు (గురువారం) నంద్యాల బహిరంగ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు ఆయన హైదరాబాద్ బయల్దేరారు. కాగా శ్రీశైలం నియోజకవర్గ కార్యకర్తలు, అనుచరులతో శిల్పా చక్రపాణిరెడ్డి నంద్యాలలోని తన నివాసంలో నిన్న సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ మారుదామని కార్యకర్తలంతా మూకుమ్మడిగా ఒకేమాట తేల్చిచెప్పారు. టీడీపీ కోసం మనమంతా కష్టపడుతుంటే, నిన్నా మొన్న వచ్చిన నేతలకు పెద్దపీట వేశారని మండిపడ్డారు. టీడీపీలో అవమానాలే ఎదురయ్యాయని, ఎక్కడ గౌరవం ఉంటుందో అక్కడే ఉందామని అన్నారు. శిల్పా చక్రపాణిరెడ్డితో కలిసి నడుస్తామని వారంతా స్పష్టం చేశారు. -
టీడీపీకి శిల్పా చక్రపాణిరెడ్డి గుడ్‌బై?
నేడు భవిష్యత్ కార్యాచరణ ప్రకటన సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి అధికార తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడ్డాయి. కర్నూలు జిల్లా నంద్యాలలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. సమావేశంలో శిల్పా చక్రపాణిరెడ్డి అనుచరులు టీడీపీలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అవమానాలను ఏకరువు పెట్టారు. గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదన్నారు. సీఎం చంద్రబాబుకు వాడుకుని వదిలేయడం మొదటి నుంచీ అలవాటేనని, మన విషయంలోనూ అదే జరిగిందని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా.. నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం మరోసారి తన తమ్ముడు చక్రపాణిరెడ్డిని కలిశారు. ఉప ఎన్నికలో తనకు సహకరించాలని కోరారు. మరోవైపు చక్రపాణిరెడ్డిని బుజ్జగించేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఎ.వి.సుబ్బారెడ్డి కూడా శిల్పా చక్రపాణిరెడ్డితో భేటీ అయ్యారు. కార్యకర్తల అభిప్రాయాల మేరకు శిల్పా చక్రపాణిరెడ్డి తన భవిష్యత్ నిర్ణయాన్ని బుధవారం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో అన్నీ అవమానాలే... శ్రీశైలం నియోజకవర్గ కార్యకర్తలు, అనుచరులతో శిల్పా చక్రపాణిరెడ్డి నంద్యాలలోని తన నివాసంలో మంగళవారం సమావేశమయ్యారు. బండి ఆత్మకూరు, మహానంది, వెలుగోడు, ఆత్మకూరు, శ్రీశైలం మండలాల కార్యకర్తల అభిప్రాయాలను విడివిడిగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ మారుదామని కార్యకర్తలంతా మూకుమ్మడిగా ఒకేమాట తేల్చిచెప్పారు. టీడీపీ కోసం మనమంతా కష్టపడుతుంటే, నిన్నా మొన్న వచ్చిన నేతలకు పెద్దపీట వేశారని మండిపడ్డారు. టీడీపీలో అవమానాలే ఎదురయ్యాయని, ఎక్కడ గౌరవం ఉంటుందో అక్కడే ఉందామని అన్నారు. శిల్పా చక్రపాణిరెడ్డితో కలిసి నడుస్తామని వారంతా స్పష్టం చేశారు. వేడెక్కిన నంద్యాల రాజకీయం టీడీపీని వీడాలని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి నిర్ణయించుకోవడంతో ఆ పార్టీలో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు ఆయన ఇంటికి క్యూ కట్టారు. పార్టీ నుంచి బయటకు వెళ్లొదంటూ నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే, కార్యకర్తల అభిప్రాయం మేరకు టీడీపీని వీడి, వైఎస్సార్సీపీలో చేరాలని శిల్పా చక్రపాణిరెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో నంద్యాల రాజకీయం మరింత వేడెక్కింది. -
నా ధర్మం కొద్దీ తమ్ముడిని కలిశాను
-
కంటతడి పెట్టిన ఎంపీపీ నాగమణి
♦ చదువు రాదంటూ అవహేళన ♦ కంటతడి పెట్టిన ఎంపీపీ నాగమణి ♦ శిల్పా భువనేశ్వరరెడ్డి తీరుపై ఆగ్రహం కర్నూలు జిల్లా : ‘‘ మీ ప్రిన్సిపల్ మేడమ్ చదువుకుంది...ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంది. ఎంపీపీ చదువుకోలేదు.. సరిగా మాట్లాడలేదు’’ అంటూ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి సమీప బంధువు, టీడీపీ నాయకుడు శిల్పా భువనేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలతో మహానంది ఎంపీపీ చింతం నాగమణి కంటతడిపెట్టారు. ఈ ఘటన గురువారం మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామంలో చోటు చేసుకుంది. మండల కేంద్రమైన ఎం.తిమ్మాపురం గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్లో గురువారం సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శిల్పా భువనేశ్వరరెడ్డి విద్య ప్రాధాన్యత గురించి మాట్లాడుతూ.. ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఫర్హానాబేగం బాగా చదువుకోవడం వల్లే ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నారని, ఎంపీపీ చింతం నాగమణి పెద్దగా చదువుకోకపోవడం వల్లే మాట్లాడలేకపోతున్నారని ఉదహరించి చెప్పారు. దీంతో కార్యక్రమానికి వచ్చిన ఎంపీపీ చింతం నాగమణి కన్నీరు పెట్టుకుని ఏడ్చుకుంటూ బయటికి వెళ్లారు. ఆమె బయటికి రాగా అక్కడే ఉన్న ఎంపీటీసీ సభ్యులు దస్తగిరి, నాగపుల్లయ్యలు ఆమెకు సర్దిచెప్పడంతో ఆమె సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. శిల్పా భువనేశ్వర్ రెడ్డి మాటలను టీడీపీ నాయకులు తప్పు పట్టారు. ఇదిలా ఉండగా ఎంపీపీ నాగమణి భర్త చింతం క్రాంతికుమార్ మాట్లాడుతూ.. తన భార్య నిరక్షరాస్యురాలేమి కాదని, 2006లో ఇంటర్ పూర్తి చేశారని స్పష్టం చేశారు. చిన్న వయసులోనే ఎంపీపీ పదవిని చేపట్టడంతో స్టేజీల మీద ప్రసంగించడానికి కాస్త భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ఏ పదవీ లేని శిల్పా భువనేశ్వరరెడ్డి.. ప్రభుత్వ కార్యక్రమానికి ఏ హోదాలో ముఖ్య అతిథిగా వచ్చారని స్థానిక అధికారులు, విద్యావంతులు చర్చించుకున్నారు. -
శిల్పా..డబ్బుతో పదవులు రావు
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బుడ్డారాజశేఖర్‌రెడ్డి ఆళ్లగడ్డ : డబ్బులతో పదువులు రావని.. ప్రజల అభిమానం ఉన్నప్పుడే వస్తాయనే విషయాన్ని ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి గమనించాలని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డారాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని భూమా స్వగృహంలో బుధవారం నియోజకవర్గ జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లతో ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. దివంగత నాయకురాలు శోభానాగిరెడ్డి చిత్రపటానికి భూమానాగిరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టడానికి శిల్పా అనేక గిమ్మిక్కుల చేశారన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే బండారం బట్టబయలైందన్నారు. ఎమ్మెల్యేగా, పార్టీ జిల్లా అధ్యక్షునిగా తాను ఎన్నిక కావడంతో ఆయన కూడా.. డబ్బులు ఖర్చు పెట్టి టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి, ఎంఎల్సీ టికెట్ తెచ్చుకున్నారన్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా గెలువడం అసాధ్యమన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన వెంకటేశ్వరరెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని భూమా నాగిరెడ్డి అన్నారు. ఈ ఎన్నికలను తక్కువగా అంచనా వేయవద్దని, ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నారు. గెలిచిన తరువాత అందరికీ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకటేశ్వరరెడ్డి అన్నారు. సమావేశంలో పార్టీ నాయుడు ఏవీ సుబ్బారెడ్డి, నగరపంచాయతీ చైర్పర్సన్ ఉషారాణి, వైస్ చైర్మన్ రామలింగారెడ్డి, పార్టీ నాయకులు అయ్యపురెడ్డి, శ్రీకాంతరెడ్డి, నారాయణరెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, సింగం వెంకటేశ్వరరెడ్డి, రాముయాదవ్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఓటెత్తారు!
71.09 శాతం పోలింగ్ నమోదు సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీలకు ఆదివారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తంగా 71.09 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా గూడూరులో 84.57 శాతం.. అత్యల్పంగా ఆదోనిలో 57.98 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదిలాఉండగా నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి అడుగడుగునా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. పోలింగ్ మొదలయ్యే సమయానికి ఎన్నడూ లేనివిధంగా ఓటర్లు బారులుతీరారు. ఓటింగ్ శాతం పెరుగుతుందని తెలుసుకున్న టీడీపీ నేతలు అక్కడికక్కడే ప్రలోభాలకు గురి చేశారు. బలవంతంగా పక్కకు పిలిపించి డబ్బు పంపిణీ చేయడం కనిపించింది. అధికారులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో వారిపైనా దౌర్జన్యాలకు పాల్పడ్డారు. 26వ వార్డులో టీడీపీ అభ్యర్థి భర్త ఓటర్ల ఇళ్లకు వెళ్లి పోలింగ్ కేంద్రానికి వస్తే మీ అంతు చూస్తానంటూ బెదిరించినట్లు ఫిర్యాదులు అందాయి. 19, 22, 36వ వార్డుల్లోనూ ఇలాంటి దౌర్జన్యాలకే తెగబడ్డారు. ఆత్మకూరులో టీడీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి అనుచరులు దొంగ ఓట్లు వేయించారు. 13వ వార్డులో ప్రకాశం, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన వ్యక్తులచే దొంగ ఓట్లు వేయించినట్లు సమాచారం. 10వ వార్డులో దోర్నాల, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి వచ్చిన దొంగ ఓటర్లను గుర్తించిన వైఎస్ఆర్సీపీ, సీపీఎం కార్యకర్తలు అక్కడికక్కడ నిలదీశారు. గుర్తింపు కార్డులు లేకపోవడంతో కొందరిని తిప్పిపంపారు. మరికొందరిని పోలీసులకు అప్పగించారు. 18వ వార్డులో కొందరు టీడీపీ కార్యకర్తలు ఓటర్లను ప్రభావితం చేస్తూ డబ్బు పంపిణీ చేశారు. 5వ వార్డులో సరైన ఓటర్ల జాబితాను పీఓకు ఇవ్వకపోవడంతో ప్రారంభంలో గందరగోళం నెలకొంది. ఆ తర్వాత తప్పును సరిదిద్దారు. మూడో పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించడంతో అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. డోన్‌లో మున్సిపల్ అధికారులు ఓటరు స్లిప్పులు పంపిణీ చేయకపోవడంతో వేలాది మంది తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. ఓటింగ్ శాతం తగ్గడంతో కమిషనర్ క్రిష్ణమూర్తి పట్టణంలో మైక్‌లో ప్రచారం చేయించారు. స్లిప్పులు లేకపోయినా ఓటు వేయొచ్చని చెప్పడంతో ఓటింగ్ శాతం కాస్త మెరుగైంది. ఆదోనిలోని 28వ వార్డులో టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేసేందుకు యత్నించారు. పెద్దహరివాణం గ్రామస్తులు పలువురికి ఆదోని మున్సిపాలిటీలో ఓటర్లుగా నమోదు చేయించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల రాకతో గొడవ సద్దుమణిగింది. 34వ వార్డులో టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కుయ్యాయి. 21, 29వ వార్డుల్లో కాంగ్రెస్ వర్గీయులు టీడీపీకి అనుకూలంగా ఓటేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఎమ్మిగనూరు మున్సిపాలిటీలోని 29వ వార్డులో ఈవీఎంలు గంట పాటు మొరాయించాయి. ఎండాకాలం కావడంతో ఉదయం 7 గంటల సమయానికి పోలింగ్ కేంద్రాలు ఓటర్లతో కిక్కిరిశాయి. ఆ తర్వాత 10 గంటల సమయానికే కేంద్రాలన్నీ బోసిపోయాయి. తిరిగి సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఓటర్లు బారులు తీరారు. ఎన్నికల్లో అత్యధికంగా మహిళలే ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం.