శిల్పా..డబ్బుతో పదవులు రావు | budda rajashekar reddy fires on shilpa chakrapani reddy | Sakshi
Sakshi News home page

శిల్పా..డబ్బుతో పదవులు రావు

Published Thu, Jun 18 2015 3:45 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

శిల్పా..డబ్బుతో పదవులు రావు - Sakshi

శిల్పా..డబ్బుతో పదవులు రావు

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బుడ్డారాజశేఖర్‌రెడ్డి
 
 ఆళ్లగడ్డ : డబ్బులతో పదువులు రావని.. ప్రజల అభిమానం ఉన్నప్పుడే వస్తాయనే విషయాన్ని ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి గమనించాలని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డారాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని భూమా స్వగృహంలో బుధవారం నియోజకవర్గ జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లతో ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. దివంగత నాయకురాలు శోభానాగిరెడ్డి చిత్రపటానికి భూమానాగిరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టడానికి శిల్పా అనేక గిమ్మిక్కుల చేశారన్నారు.

ఎన్నికలు ముగిసిన వెంటనే బండారం బట్టబయలైందన్నారు. ఎమ్మెల్యేగా, పార్టీ జిల్లా అధ్యక్షునిగా తాను ఎన్నిక కావడంతో ఆయన కూడా.. డబ్బులు ఖర్చు పెట్టి టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి, ఎంఎల్‌సీ టికెట్ తెచ్చుకున్నారన్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా గెలువడం అసాధ్యమన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన వెంకటేశ్వరరెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని భూమా నాగిరెడ్డి అన్నారు.

ఈ ఎన్నికలను తక్కువగా అంచనా వేయవద్దని, ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నారు. గెలిచిన తరువాత అందరికీ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకటేశ్వరరెడ్డి అన్నారు. సమావేశంలో పార్టీ నాయుడు ఏవీ సుబ్బారెడ్డి, నగరపంచాయతీ చైర్‌పర్సన్ ఉషారాణి, వైస్ చైర్మన్ రామలింగారెడ్డి, పార్టీ నాయకులు అయ్యపురెడ్డి, శ్రీకాంతరెడ్డి, నారాయణరెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, సింగం వెంకటేశ్వరరెడ్డి, రాముయాదవ్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement