budda rajashekar reddy
-
శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..
-
మరోసారి నోరుపారేసుకున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
-
నమ్మితే నట్టేట ముంచారు.. లోకేష్ హామీకే దిక్కులేదు...
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తెలుగుదేశం పార్టీలో సీట్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటికి నిన్న తన సతీమణి ఆరోగ్యం బాగోలేదని, ఎన్నికల బరి నుంచే కాకుండా ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్టు ప్రకటించిన బుడ్డా రాజశేఖరరెడ్డి.. తిరిగి పోటీలో నిలవాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల వ్యయాన్ని భరించేందుకు ఎంపీ అభ్యర్థి మాండ్ర ముందుకు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు పర్యటన సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది. మరోవైపు సీటు దక్కని అభ్యర్థులు అధిష్టానం తీరుపై మండిపడుతున్నారు. నమ్మితే నట్టేట ముంచారంటూ వాపోతున్నారు. ఏకంగా మంత్రి లోకేష్ హామీ ఇచ్చినప్పటికీ తనకు సీటు ఇవ్వకపోవడంపై కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడుతున్నారు. లోకేష్ హామీకే దిక్కులేకుండా పోయిందంటూ తన అనుచరుల వద్ద వాపోయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన కర్నూలులో మంగళవారం జరిగిన చంద్రబాబు సభకు గైర్హాజయ్యారు. ఇక నంద్యాల సీటు విషయంలో తమకు చంద్రబాబు నమ్మక ద్రోహం చేశారని మండిపడిన ఎంపీ ఎస్పీవై రెడ్డి స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. ఈ నెల 21వ తేదీన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా తాము నామినేషన్ వేస్తున్నట్టు వెల్లడించారు. చివరి వరకు నీకే సీటు ఇప్పిస్తామని నమ్మించిన కోట్ల వర్గం కూడా తుదకు చేతులెత్తేయడంతో మణిగాంధీ వేదన చెందుతున్నారు. అందరూ కలసి తనను మోసం చేశారంటూ వాపోతున్నారు. కోడుమూరు నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన రామాంజినేయులు.. మణిగాంధీని కలిసి సహకరించాలని కోరినట్టు తెలిసింది. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లేదని ఆయన తేల్చిచెప్పినట్లు సమాచారం. ఇక నిన్నటివరకు కనీసం శ్రీశైలం సీటైనా దక్కుతుందని భావించిన ఏవీ సుబ్బారెడ్డికి చివరకు నిరాశే మిగిలింది. అంతేకాకుండా తాను వద్దన్న భూమా బ్రహ్మానందరెడ్డికి సీటు ప్రకటించడంతో ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. మొత్తమ్మీద అధికార పార్టీలో సీట్ల వ్యవహారం కాక రేపుతోందనే చెప్పవచ్చు. ఏకాంతంగా భేటీ..బుడ్డా అంగీకారం తన సతీమణి ఆరోగ్యం బాగోలేనందున తాను ఎన్నికల బరితో పాటు ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు శ్రీశైలం అసెంబ్లీ అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి సోమవారం ప్రకటించారు. చంద్రబాబు పర్యటన ముందు రోజు ఈ పరిణామం జరగడంతో అధికార పార్టీలో కలవరం మొదలయ్యింది. చిత్తుగా ఓడిపోతాననే ఆందోళనతోనే ఈవిధంగా తప్పుకోవాలని బుడ్డా భావించినట్టు తెలుస్తోంది. పార్టీ మారిన సమయంలో ఇచ్చిన మొత్తంతో పాటు ఆ తర్వాత కూడా బాగా సంపాదించినందువల్ల ఎన్నికల ఖర్చు ఇవ్వలేమని అధినేత తేల్చిచెప్పారు. దీంతో సంపాదించిన మొత్తాన్ని ఎన్నికల కోసం ఖర్చు పెట్టినా గెలిచే అవకాశం లేనందువల్ల బరి నుంచి తప్పుకోవాలని బుడ్డా భావించినట్టు తెలుస్తోంది. అయితే, చంద్రబాబు పర్యటన సందర్భంగా కర్నూలుకు రావాలంటూ కబురు పంపడంతో మంగళవారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బుడ్డాతో అరగంట పాటు నంద్యాల ఎంపీ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డి భేటీ అయ్యారు. ఎన్నికల ఖర్చు భరిస్తానని హామీనిచ్చారు. చంద్రబాబు వద్దకు కూడా బుడ్డాను తీసుకెళ్లి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో తిరిగి బరిలో నిలిచేందుకు బుడ్డా అంగీకరించినట్టు తెలుస్తోంది. పుండు మీద కారం.. ఇప్పటికే సీటు రాక ఇబ్బంది పడుతున్న ఎస్వీ మోహన్‌రెడ్డిని సభ సాక్షిగా చంద్రబాబు మరింతగా అవమానించారు. సమర్థులకే సీట్లు ఇచ్చానని.. అందులో భాగంగా కర్నూలుకు టీజీ భరత్‌ను ఎంపిక చేశామని ప్రకటించారు. తద్వారా ఎస్వీ మోహన్‌రెడ్డిని అసమర్థుడిగా పేర్కొన్నారని ఆయన వర్గీయులు వాపోతున్నారు. మరోవైపు కర్నూలు ఎంపీ అభ్యర్థికయ్యే ఖర్చు సుమారు రూ.100 కోట్ల మేర భరించేందుకు సిద్ధం కావడంతోనే టీజీ భరత్‌కు సీటు ఇచ్చేందుకు కోట్ల కూడా మద్దతిచ్చినట్టు ప్రచారం సాగుతోంది. ఇక భరత్ కూడా తనకు సీటు రావడానికి తండ్రి టీజీ వెంకటేష్ స్ట్రాటజీ పనిచేసిందని అనడంతో సభకు హాజరైన వారందరూ ముక్కున వేలేసుకున్నారు. -
పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ అభ్యర్థి!
సాక్షి, కర్నూలు: ఎన్నికల వేళ అధికార టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. టీడీపీ టికెట్‌పై పోటీ చేయడానికి అభ్యర్థులు వెనుకంజ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ సీటు కైవసం చేసుకున్న అదాల ప్రభాకర్ ఆ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీశైలంలో టీడీపీ ప్రకటించిన అభ్యర్థి పోటీ చేసేందుకు సంసిద్ధత చూపడం లేదని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. టీడీపీ ఇటీవల శ్రీశైలం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా బుడ్డా రాజశేఖర్‌రెడ్డిని ప్రకటించింది. అయితే ఆయన పోటీ చేసేందుకు సంసిద్దత చూపడం లేదని సమాచారం. ఓటమి భయంతో ఆయన బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపడం లేదు. దీనిపై చర్చించడానికి ఆయన సాయంత్రం వెల్పనూరులో కార్యకర్తలతో భేటీ కానున్నారు. టీడీపీ ఇంకా పలు స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించాల్సి ఉండగానే.. ఈ పరిణామాలు చోటుచేసుకోవడం టీడీపీలో కలకలం రేపుతోంది. (తొలి రోజే టీడీపీకి షాకిస్తున్న రెబల్స్.. ) -
బుడ్డా రాజశేఖర్ రెడ్డి అ‘రాజ’క పాలన ఇంకెన్నాళ్లు..
సాక్షి, ఆత్మకూరు రూరల్: ఎన్నికలు మళ్లీ వచ్చాయి.. మైకుల రొదలు మొదలయ్యాయి.. అవి చేస్తాం..ఇవి చేస్తాం..అడిగినవన్నీ చేస్తాం.. ఎన్నెన్నో హామీలు..అంతటా వాగ్దానాలు గతాన్ని పరికిస్తే..పాలనను విశ్లేషిస్తే.. శ్రీశైల ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అ‘రాజ’క పాలన కళ్ల ముందు కదలాడుతుంది. నీళ్లివ్వకుండా ఆయన చేసిన దాష్టీకం మరవబోమని రైతులోకం మండిపడుతోంది. సిద్ధాపురం..జిల్లాలోనే అతిపెద్ద చెరువు. వర్షాలు పడక నిండేది కాదు. ఎత్తిపోతలతో దీనికి జీవ కల తీసుకురావాలన్నది రైతుల ఆకాంక్ష. ఎందరో ముఖ్యమంత్రులు చేతులెత్తేయగా..దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పూనికతో ఈ ప్రాజెక్ట్ సాకరమైంది. వైఎస్సార్ పాలనలో 80 శాతం పనులు పూర్తికాగా..మిగిలిన 20 శాతం టీడీపీ ప్రభుత్వ పూర్తి చేయలేకపోయింది. కాల్వలు, ప్రధాన రహదారుల కల్వర్టులు పూర్తి కాకుండానే గతేడాది జనవరి 7న ముఖ్యమంత్రి చంద్రబాబు చేత ప్రారంభోత్సవం చేశారు. ఆయకట్టు రైతులకు 2018లో రబీకి నీరందిస్తానని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయకట్టులోని అన్ని గ్రామాల నుంచి సాగు నీటి కోసం డిమాండ్ పెరగడంతో బుడ్డా..తమ రాజకీయాలకు అనుకూలంగా మార్చుకునే యత్నం చేశారు. అందరికీ నీరందించేందుకు శ్రమిస్తున్నట్లు డ్రామాలాడారు. అయితే నీరు లేకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. పైగా కాల్వలపై తిరుగుతూ రైతులపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. సాక్షాత్తు ఎమ్మెల్యే సమక్షంలోనే పెద్దనంతాపురం గ్రామానికి చెందిన ఇద్దరు, సిద్ధపల్లెకు చెందిన మరో రైతుపై టీడీపీ నాయకులు భౌతిక దాడులకు దిగారు. ఇదీ వైఫల్యం.. శ్రీశైలంలో 200 టీఎంసీలు, వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 16 టీఎంసీల నీరున్నపుడు ఖరీఫ్‌కు అనుమతి లేదంటూ అధికారులు ఎత్తిపోతల మోటార్లను ఆన్ చేయలేదు. ఆన్ చేయించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించనూ లేదు. అరకొర నీటికోసం ఆయకట్టు గ్రామాల నడుమ జలయుద్ధాలు మొదలయ్యాయి. టీడీపీ నాయకులు మాత్రం చేయాల్సింది చేయకుండా కాల్వల వెంట పచార్లు చేస్తూ రైతులపై దాడులు చేస్తూ వచ్చారు. సిద్ధాపురం..జిల్లాలోనే అతిపెద్ద చెరువు. వర్షాలు పడక నిండేది కాదు. ఎత్తిపోతలతో దీనికి జీవ కల తీసుకురావాలన్నది రైతుల ఆకాంక్ష. ఎందరో ముఖ్యమంత్రులు చేతులెత్తేయగా..దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పూనికతో ఈ ప్రాజెక్ట్ సాకరమైంది. వైఎస్సార్ పాలనలో 80 శాతం పనులు పూర్తికాగా..మిగిలిన 20 శాతం టీడీపీ ప్రభుత్వ పూర్తి చేయలేకపోయింది. కాల్వలు, ప్రధాన రహదారుల కల్వర్టులు పూర్తి కాకుండానే గతేడాది జనవరి 7న ముఖ్యమంత్రి చంద్రబాబు చేత ప్రారంభోత్సవం చేశారు. ఆయకట్టు రైతులకు 2018లో రబీకి నీరందిస్తానని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయకట్టులోని అన్ని గ్రామాల నుంచి సాగు నీటి కోసం డిమాండ్ పెరగడంతో బుడ్డా..తమ రాజకీయాలకు అనుకూలంగా మార్చుకునే యత్నం చేశారు. అందరికీ నీరందించేందుకు శ్రమిస్తున్నట్లు డ్రామాలాడారు. అయితే నీరు లేకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. పైగా కాల్వలపై తిరుగుతూ రైతులపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారు. సాక్షాత్తు ఎమ్మెల్యే సమక్షంలోనే పెద్దనంతాపురం గ్రామానికి చెందిన ఇద్దరు, సిద్ధపల్లెకు చెందిన మరో రైతుపై టీడీపీ నాయకులు భౌతిక దాడులకు దిగారు. నీటి కోసం పోరాటం చేశాం సిద్ధాపురం చెరువుకు నీళ్లు వస్తున్నాయి..ఇక కరువు ఉండదనుకున్నాం. చెరువుకు నీరు తీసుకురావడంలో అధికార పార్టీ నాయకులు విఫలమయ్యారు. ఉన్న నీటికోసం పోరాటాలు చేయాల్సి వచ్చింది. చివరకు పైర్లు ఎండే పోయాయి. –ద్రోణారెడ్డి , రైతు, నల్లకాల్వ పంట కాల్వలు పూర్తి చేయండి పనులు పూర్తి కాకుండానే ప్రారంభించేసి తెలుగు దేశం నాయకులు లబ్ధి పొందాలనుకున్నారు. ప్రధాన కాల్వలే ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. పంటకాల్వల సంగతి అతీ గతీ లేదు. –లక్ష్మన్న, రైతు, కరివేన -
బుడ్డాకు బుద్ధి చెప్పండి : శిల్పా చక్రపాణిరెడ్డి
సాక్షి, ఆత్మకూరు: అవినీతికి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలో ఆదివారం వైఎస్సార్సీపీలోకి జంగిల్‌సా, మొమిన్ కుటుంబ సభ్యులు చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో శిల్పా మాట్లాడుతూ.. పసుపు– కుంకుమ చెక్కులను పొదుపు మహిళలకు ఇవ్వకుండా బుడ్డా అడ్డుకున్నారని, రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే ఇలా చేయలేదన్నారు. నీరు– చెట్టు పనుల్లో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. తెలుగుగంగ లైనింగ్ పనులు రూ. 300 కోట్లతో చేపట్టారని, వాటిలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఆత్మకూరు పట్టణంలో మూడు సార్లు ఇళ్ల పట్టాలు ఇచ్చి వెనక్కి తీసుకున్న ఘనత బుడ్డాదేనన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసకారని, అరగంటకోమాట మారుస్తున్నారన్నారు. పూర్తి రుణమాఫీ చేయకుండా రైతుల ఉసురు తీసుకున్నారన్నారు. కర్నూలు జిల్లాలో ఎక్కువ సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇది టీడీపీ ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. వైఎస్సార్ హయాంలో ముస్లింల అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ఆత్మకూరులో పేదలకు ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇంటింటికీ మంచినీటి కుళాయి ఏర్పాటు చేసి నీటి సమస్య లేకుండా చేస్తానన్నారు. సిద్ధాపురం చెరువు నుంచి పంటకాల్వలు తీయిస్తానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ శ్రీశైలం నియోజకవర్గం నేత శిల్పా భువనేశ్వరరెడ్డి, పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బోగుల శివశంకర్ నాయుడు, పార్టీ నాయకులు అంజాద్ అలీ, చిట్యాల వెంకటరెడ్డి, పార్వతి, బాలన్న, కుందూరు శివారెడ్డి, గౌస్‌లాజం, లాలు, రాజగోపాల్, కలిముల్లా, ముర్తుజా, తిమోతి, నాగేశ్వరరెడ్డి, రామచంద్రుడు, శిఖామని, రవణమ్మ, పరిమల, ముర్తుజాబి, సుబ్బమ్మ, సుభద్రమ్మ,సుల్తాన్,ఫరుక్, ఫయాజ్, ఎమ్కలిముల్లా , పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
బుడ్డా తీరుపై తిరుగుబాటు
ఆత్మకూరురూరల్/ కర్నూలు సీక్యాంప్: జన్మభూమి సాక్షిగా అధికార పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఆ పార్టీ శ్రేణులు వర్గాలుగా విడిపోయి గొడవలకు దిగుతున్నారు. ముఖ్యంగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తీరుపై సొంత పార్టీలోని మైనార్టీ నేతలు రగిలిపోతున్నారు. తమను ఎమ్మెల్యే అవమానిస్తున్నారంటూ గురువారం జన్మభూమి సాక్షిగా సాక్షాత్తు రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సమక్షంలోనే ఆందోళనకు దిగారు. ఆత్మకూరు పట్టణ శివారులో రూ.2.20 కోట్లతో నిర్మించనున్న షాదీఖానకు శంకుస్థాపన చేయడానికి మంత్రి ఫరూక్, ఉర్దూ అకాడమీ చైర్మన్ నౌమాన్ ముఖ్యఅతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు మైనార్టీలు మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. తమకు ఎమ్మెల్యే తీవ్ర అన్యాయం చేస్తున్నారని, మైనార్టీ కాలనీని సర్వే చేయించేందుకు వెళితే సర్వేయర్లను రానివ్వడం లేదని, తమ స్థలాలను వేరే పనులకు వినియోగించేందుకు పూనుకున్నారని వాపోయారు. అలాగే రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ అహమ్మద్ హుసేన్‌ను ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించకుండా అవమానిస్తున్నారన్నారు. ప్రొటోకాల్ పాటించకుండా అధికారులను సైతం బెదిరిస్తున్నారన్నారు. ఆందోళన నేపథ్యంలో సుమారు గంట సేపు ఉద్రిక్తత నెలకొంది. ఇన్చార్జ్ డీఎస్పీ వినోద్ కుమార్, సీఐ కృష్ణయ్య తమ సిబ్బందితో కలిసి ఆందోళనకారులను పక్కకు తొలగించి.. మంత్రి కాన్వాయ్కి దారి చూపే యత్నం చేశారు. అయినప్పటికి వారు పట్టు వీడలేదు. చివరకు మంత్రి తన వాహనం దిగి.. వారిని సముదాయించారు. కాగా.. తనకు ఆహ్వానాలు అందకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని అహమ్మద్ హుసేన్ టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో అధిష్టానం నుంచి ఎమ్మెల్యేకు ఫోన్ రావడంతో ఆయన స్వయంగా అహమ్మద్ హుసేన్‌కు ఫోన్ చేసి జన్మభూమి కార్యక్రమానికి ఆహ్వానం పలికినట్లు సమాచారం. ఉల్చాలలో గొడవ కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని ఉల్చాల గ్రామంలో జన్మభూమి సభలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు రెండు వర్గాలు విడిపోయి గొడవ పడ్డారు. గురువారం ఉదయం కర్నూలు డిప్యూటీ తహసీల్దార్ చంద్రకళ ఆధ్వర్యంలో జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. వేదికపై ఒకవైపు ఎమ్మెల్యే మణిగాంధీ, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, మరోవైపు కర్నూలు ఎంపీపీ రాజవర్ధన్‌రెడ్డి కూర్చున్నారు. మూడేళ్లుగా తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టించుకోవడానికి మామూళ్లు తీసుకుంటున్నారని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ సమస్యలపై ఎమ్మెల్యే బదులు కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి వివరణ ఇచ్చారు. దీంతో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ విష్ణువర్ధన్‌రెడ్డి వర్గీయులు కొత్తకోట ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే మణిగాంధీనా లేక కొత్తకోట ప్రకాశ్రెడ్డా? అంటూ గొడవకు దిగారు. ప్రొటోకాల్ పాటించకుండా ఇష్టమొచ్చినవారిని మాట్లాడించడమేంటని అధికారులను ప్రశ్నిస్తూ కర్నూలు వైస్ ఎంపీపీ వాసు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. అనంతరం జన్మభూమిని బహిష్కరించి వెళ్లారు. -
బుడ్డా..నోరు అదుపులో పెట్టుకో
సాక్షి, ఆత్మకూరు: ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా చక్రపాణిరెడ్డి హితవు చెప్పారు. సోమవారం ఆయన ఆత్మకూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బుడ్డా రాజశేఖరరెడ్డి అయ్యప్ప మాలధారణ చేసి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. నైతిక విలువలు, అవినీతి గురించి ఆయన మాట్లాడడం విడ్డూరమన్నారు. ‘నేను అవినీతికి పాల్పడుతున్నానని చెప్పడం సిగ్గుచేటు. శ్రీశైలం పాతాళగంగలో మునిగి అవినీతిపై బహిరంగంగా చర్చిద్దాం.. సవాల్‌కు సిద్ధమేనా? వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన నీవు టీడీపీలో చేరినప్పుడు సీఎం చంద్రబాబు దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే చేరావా? పార్టీ మారేటప్పుడు మీరు రాజీనామా చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇస్తానని అన్నావు. నేను నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేశా. మరి నీవెందుకు చేయలేదు’ అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పశువులను కొన్నట్లు కొన్నారని చంద్రబాబు అన్నారని, మరి అదే ఏపీలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు 23 మందిని ఎలా కొన్నారని నిలదీశారు. ఎమ్మెల్యే బుడ్డా ఎన్ని కోట్లకు అమ్ముడుపోయారో నియోజకవర్గ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ‘నీరు– చెట్టు, మట్టి, ఇసుక ..ఇలా ప్రతి పనిలో అవినీతికి పాల్పడలేదా? నీ వెంట ఉన్న వారే నీవు అవినీతికి పాల్పడుతున్నావని అంటున్నారు. వినిపించడం లేదా? ఏ అవినీతికీ పాల్పడని నన్ను విమర్శించడం భావ్యమా? ప్రతిపక్ష పార్టీలో ఉన్న మాకు ప్రశ్నించే అధికారం ఉంది. విమర్శలను స్వీకరించి బాధ్యతగా నడుచుకోవాలే తప్ప ఇష్టారాజ్యంగా మాట్లాడడం తగదు. శ్రీశైలంలో శిల్పా ఇళ్లు ఎలా కట్టిస్తారని అంటున్నావు. అది కూడా తెలియదా? చంద్రబాబును అడుగు.. ఆయనే చెబుతాడు. అటవీ భూములు కావాల్సి వస్తే.. అందుకు ప్రతిగా మరో భూమిని ఇప్పిస్తే క్లియరెన్స్ వస్తుంది. ప్రభుత్వం ఉంటే ఇళ్లు కట్టించడం పెద్ద సమస్య కాద’ని అన్నారు. సిద్ధాపురం చెరువు కింద పంటలు ఎండిపోతున్నా ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి వెలుగోడు రిజర్వాయర్‌కు నీరు నింపే సమయంలోనే సిద్ధాపురం చెరువుకూ నింపివుంటే పంటలు ఎండేవి కాదన్నారు. చెరువులో సగం టీఎంసీ నీరు లేకున్నా పది వేల ఎకరాలకు పారించానని ఎమ్మెల్యే చెప్పడం శోచనీయమన్నారు. తెలుగుగంగ రిజర్వాయర్‌లోని మూడు టీఎంసీల నీరు ఇప్పిస్తే మహానంది, బండిఆత్మకూరు, వెలుగోడు మండలాల్లోని వరి పొలాలకు నీరు పారించి పంటలు ఎండిపోకుండా కాపాడతానని, మరి నీరిప్పించే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. ఇందిరేశ్వరం, వడ్లరామాపురం గ్రామాలకు ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయించి నీరు ఎందుకివ్వరని ప్రశ్నించారు. ఎలాంటి జీఓలు లేకుండా నెల్లూరు జిల్లా సోమశిలకు 50 టీఎంసీల నీరు తీసుకెళ్తున్నా బుడ్డా నోరు మెదపడం లేదన్నారు. తాను, తన తమ్ముడు శిల్పా భువనేశ్వరెడ్డి అవినీతికి పాల్పడి ఉంటే అన్ని విషయాల్లో క్వాలిటీ కంట్రోల్ అధికారులతో విచారణ చేయించుకోవాలని సూచించారు. ఇక పవన్‌కల్యాణ్ వైఎస్ జగన్ గురించి మాట్లాడటం సరికాదన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి మాట్లాడుతూ తాము అక్రమాలకు పాల్పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామని, దోచుకునేందుకు కాదని పేర్కొన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పట్టణ, మండల అధ్యక్షులు అంజాద్‌అలీ, దరగమ్మ, నాయకులు పార్వతి, లాలు, స్వామి, రమణమ్మ, జిలానీ, సుల్తాన్, తిమోతి, కలీముల్లా, ఫరూక్ తదితరులు పాల్గొన్నారు. -
మామ Vs కోడలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఇప్పటివరకు నీరు–చెట్టు పథకం కింద పోటీపడి పనులు తీసుకున్న అధికార పార్టీ నేతలు.. ప్రస్తుతం ఆ పనులు లేకపోవడంతో ఎర్రమట్టిపై కన్నేశారు. ఎలాంటి అనుమతి లేకుండానే భారీఎత్తున ఎర్రమట్టిని తవ్వుతూ రూ.కోట్లలో వెనకేసుకుంటున్నారు. నంద్యాల పట్టణానికి సమీపాన మహానంది మండల పరిధిలో సాగుతున్న ఎర్రమట్టి తవ్వకాల వ్యవహారం ఇప్పుడు మంత్రి అఖిలప్రియకు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి మధ్య విభేదాలను తీవ్రస్థాయికి తీసుకెళుతోంది. తన నియోజకవర్గంలో తాను మాత్రమే ఎర్రమట్టిని తవ్వుకుంటానని ఎమ్మెల్యే బుడ్డా వాదిస్తున్నారు. అయితే.. తాము పొలందారుడి నుంచి లీజుకు తీసుకున్నామని మంత్రి అనుచరులు అంటున్నారు. అటు ఎమ్మెల్యే అనుచరులు బుడ్డా స్టిక్కర్ ఉన్న వాహనాల్లో తిరుగుతూ ఎర్రమట్టిని అక్రమంగా తవ్వుతున్నారు. ఇటు మంత్రి అనుచరులు కూడా ఆమె స్టిక్కర్ అతికించి ఉన్న వాహనాల్లో హల్చల్ చేస్తూ మట్టి దందా సాగిస్తున్నారు. వరుస చెదిరి..చిచ్చు రేగి అఖిలప్రియను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ‘కోడలా..’ అని పిలిచేవారు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య అంటే మామ– కోడళ్ల మధ్య రేగిన మట్టి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. మంత్రి అక్రమంగా ఎర్రమట్టిని తవ్విస్తున్నారంటూ ఏకంగా విజిలెన్స్ విభాగానికి ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఇదే తరుణంలోవిజిలెన్స్ సిబ్బంది అక్కడికి వెళ్లే సమయానికి తన వాహనాలు తిరగకుండా ఎమ్మెల్యే తెలివిగా వ్యవహరించారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. మట్టి దందాపై లోతుగా విచారణ జరపవద్దంటూ విజిలెన్స్ సిబ్బందికి కూడా మంత్రి నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇటుకల తయారీదారులకు బెదిరింపులు ఎర్రమట్టిని అటు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, ఇటు మంత్రి అఖిలప్రియ అనుచరులు పోటీపడి తవ్వేస్తున్నారు. ఈ విధంగా తవ్విన మట్టిని మొత్తం ఇటుకల తయారీదారులకు సరఫరా చేయాల్సిందే. ఈ నేపథ్యంలో వారికి ఇరువురి నేతల అనుచరుల నుంచి తమ మట్టే తీసుకోవాలంటూ ఒత్తిళ్లు వస్తున్నాయి. ఇక ఈ పోటీ ఎక్కడి వరకు వెళ్లిందంటే.. డబ్బు ఇవ్వకపోయినప్పటికీ ఎర్రమట్టిని ఇటుకల తయారీదారులకు ముందుగానే తోలుతున్నారు. ఒకానొకదశలో ధర కూడా పోటీపడి తగ్గించారు. ఈ వార్ కాస్తా ముదిరి ఏకంగా ఇటుకల తయారీదారులను బెదిరించే స్థాయికి చేరుకుంది. తమ ఎర్రమట్టే తీసుకోవాలని, లేదంటే ఇబ్బందులు తప్పవని ఇరువురు నేతల అనుచరులు బెదిరిస్తున్నారు. నంద్యాల చుట్టుపక్కల 400 నుంచి 500 వరకు ఎర్ర ఇటుకల బట్టీలు ఉన్నాయి. వీటి నిర్వాహకులు కాస్తా ఇరువురు నేతల అనుచరుల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఒక్కటవుతున్న వైరి వర్గం ఇప్పటికే మంత్రి అఖిలప్రియకు, భూమా సన్నిహితుడు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల పర్యాటక శాఖ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలో మొదట ఏవీ సుబ్బారెడ్డి పేరును ప్రచురించలేదు. దీనిపై విమర్శలు రావడంతో ఆ తర్వాత పర్యాటక శాఖ ఆయన పేరును ప్రచురించింది. నంద్యాలకు ఆగస్టు 15న మంత్రి హోదాలో అఖిలప్రియ వచ్చిన సందర్భంలో కౌన్సిలర్లు ఎవ్వరూ వెళ్లవద్దంటూ ఏవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. ఆ కార్యక్రమానికి మంత్రితో పాటు కొద్దిమంది కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. ఇప్పుడు ఎర్రమట్టి వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే బుడ్డా.. అఖిలప్రియతో విభేదాలు ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని దగ్గరకు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన బంధువుకు కూడా ఎర్రమట్టి తవ్వకాల్లో కొంచెం వాటా ఇచ్చారని సమాచారం. మొన్నటివరకు ‘కోడలా’ అని పిలిచిన బుడ్డానే ప్రస్తుతం మంత్రి అఖిలప్రియకు వ్యతిరేకంగా కూటమి కడుతుండడంపై ఆ పార్టీ నేతల్లో చర్చ సాగుతోంది. ఈ ఇద్దరు నేతల మధ్య రేగిన చిచ్చు ఎక్కడి దాకా వెళ్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
ఆఫీస్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన టీడీపీ నేతలు
-
లిఫ్ట్‌లో ఇరుక్కున్న టీడీపీ నేతలు.. పావుగంట ఉత్కంఠ
సాక్షి, విజయవాడ : పౌర సరఫరాలశాఖ కార్యాలయంలో లిఫ్ట్‌లో టీడీపీ నేతలు ఇరుక్కుపోవడం కలకలం రేపింది. పావుగంటపాటు నేతలు లిఫ్ట్‌లో ఉండిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. టీడీపీ నేతలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, మీనాక్షి నాయుడు తదితరులు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. 15 నిమిషాలు లిఫ్ట్‌లోనే వారు బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరకు సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగి.. ఎట్టకేలకు లిఫ్ట్ డోర్ తెరిచి నేతలను బయటకు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ చైర్మన్‌గా చల్లా రామకృష్ణారెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, కాలువ శ్రీనివాసులు హాజరయ్యారు. వీరితోపాటు పలువురు టీడీపీ నేతలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టీడీపీ నేతలు బుడ్డా రాజశేఖర్, మీనాక్షి నాయుడు, మరికొందరు నేతలు లిఫ్ట్ ఎక్కారు. వారు లిఫ్ట్ ఎక్కిన తర్వాత సాంకేతిక లోపంతో అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో 15 నిమిషాలపాటు నేతలు లిఫ్ట్‌లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. శ్వాస అందక ఒక దశలో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ క్రమంలో లిఫ్ట్‌లోని నేతలు ఫోన్ ద్వారా బయట ఉన్నవారికి సమాచారం అందించడంతో.. సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగింది. లిఫ్ట్ డోర్‌ను తొలగించి.. వారిని బయటకు తీసుకురావడంతో నేతలు ఊపిరి పీల్చుకున్నారు. -
చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారు...
హైదరాబాద్ : కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ పార్టీని వీడరని, గతంలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. తాము పార్టీని వీడుతున్నామంటు మీడియా దుష్ప్రచారం చేసిందని ఆయన శనివారమిక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా బుడ్డా రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ...' చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారు. మీడియాలో ప్రతిరోజు వైఎస్ఆర్ సీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీలో అభద్రతా భావం తీసుకు రావాలని మీడియా ప్రయత్నిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనైనా టీడీపీ నెరవేర్చగలిగిందా?. తెలంగాణలో టీడీపీ ఖాళీ అయిపోయింది. టీడీపీ చెప్పినట్లు చానల్స్ ఆడటం సరికాదు. మీడియా పట్ల మాకు గౌరవం ఉంది. దాన్ని నిలుపుకోవాలి' అని అన్నారు. మాపై ఎందుకు అభాండాలు పార్టీ మార్పు ప్రచారాన్ని తాము పదేపదే ఖండించామని, తోక పార్టీ మీడియాలు తమపై ఎందుకు అభాండాలు వేస్తున్నాయో అర్థం కావడం లేదని ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. తమ పేర్లు పెట్టి ఎందుకు మీడియా ప్రచారం చేస్తుందోనని, మీడియా ప్రచారాల వల్ల ప్రజలు తమని నిలదీస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటిది ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా మళ్లీ ఎందుకు బురద చల్లుతున్నారో తెలియట్లేదన్నారు. సీమ ప్రజలను టీడీపీ పూర్తిగా విస్మరించింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోనే తాము కొనసాగుతామని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. రాయలసీమ ప్రజలను టీడీపీ పూర్తిగా విస్మరించిందని, ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల వల్లే ఒక్క పనీ కావడం లేదని ఆమె అన్నారు. అమరావతి, ఉత్తరాంధ్ర వైపు చంద్రబాబు దృష్టి పెడుతున్నారని, సీమను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. -
ఎన్నికల నియమావళికి టీడీపీ తూట్లు
కర్నూలు(అగ్రికల్చర్) : శాసనమండలి ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల నియమావళికి తూట్లు పొడుస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీ నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జి ఎం.శివానందరెడ్డి కోడ్ ఉల్లంఘించడంపై నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, ఎమ్మెల్సీ అభ్యర్థి డి.వెంకటేశ్వరరెడ్డితో కలసి మంగళవారం ఆయన రిటర్నింగ్ అధికారి, జేసీ హరికిరణ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడ్ అమలులో ఉండగా జూపాడుబంగ్లా మండల పరిషత్ కార్యాలయంలో అధ్యక్షుని కుర్చీలో కూర్చొని ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులతో సమావేశమై టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డిని గెలిపించాలని మాండ్ర ప్రచారం చేయడం కోడ్‌కు విరుద్ధమన్నారు. తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై జేసీ స్పందిస్తూ తక్షణం విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం బుడ్డా రాజశేఖర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి జిల్లాలో బలం లేకపోయినా ఎమ్మెల్సీ అభ్యర్థిని పోటీకి నిలపడం చూస్తే ఓటుకు నోటుతో గట్టెక్కే ప్రయత్నం స్పష్టమవుతోందన్నారు. వైఎస్సార్సీపీ తరపున గెలిచిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను, మున్సిపల్ కౌన్సిలర్లను అధికార బలంతో లోబర్చుకుని గెలుపొందేందుకు ఆ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోందన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు తరహా విధానాన్ని ఇక్కడా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రకాశం జిల్లాలోనూ టీడీపీ నేతలు ఓటుకు నోట్లు ఇచ్చి గెలుపొందే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారన్నారు. అయినప్పటికీ అదే ప్రయత్నం ఇక్కడా చేస్తున్నారన్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘిస్తోందన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన మాండ్ర శివానందరెడ్డి ఎన్నికల నియమావళికి తూట్లు పొడవటం దారుణమైన విషయమన్నారు. వైఎస్ఆర్సీపీ తరపున గెలిచి.. టీడీపీ అనుకూలంగా ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్న ఎంపీపీ మంజులపైనా అనర్హత వేటు వేసి ఎంపీటీసీ సభ్యత్వాన్నిరద్దు చేయాలని ఆయన కోరారు. -
శిల్పా..డబ్బుతో పదవులు రావు
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బుడ్డారాజశేఖర్‌రెడ్డి ఆళ్లగడ్డ : డబ్బులతో పదువులు రావని.. ప్రజల అభిమానం ఉన్నప్పుడే వస్తాయనే విషయాన్ని ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి గమనించాలని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డారాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని భూమా స్వగృహంలో బుధవారం నియోజకవర్గ జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లతో ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. దివంగత నాయకురాలు శోభానాగిరెడ్డి చిత్రపటానికి భూమానాగిరెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టడానికి శిల్పా అనేక గిమ్మిక్కుల చేశారన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే బండారం బట్టబయలైందన్నారు. ఎమ్మెల్యేగా, పార్టీ జిల్లా అధ్యక్షునిగా తాను ఎన్నిక కావడంతో ఆయన కూడా.. డబ్బులు ఖర్చు పెట్టి టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి, ఎంఎల్సీ టికెట్ తెచ్చుకున్నారన్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా గెలువడం అసాధ్యమన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన వెంకటేశ్వరరెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని భూమా నాగిరెడ్డి అన్నారు. ఈ ఎన్నికలను తక్కువగా అంచనా వేయవద్దని, ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నారు. గెలిచిన తరువాత అందరికీ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకటేశ్వరరెడ్డి అన్నారు. సమావేశంలో పార్టీ నాయుడు ఏవీ సుబ్బారెడ్డి, నగరపంచాయతీ చైర్పర్సన్ ఉషారాణి, వైస్ చైర్మన్ రామలింగారెడ్డి, పార్టీ నాయకులు అయ్యపురెడ్డి, శ్రీకాంతరెడ్డి, నారాయణరెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, సింగం వెంకటేశ్వరరెడ్డి, రాముయాదవ్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు
జిల్లాలోని మంత్రాలయం రాఘవేంద్రస్వామిని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే ఎం. మణిగాంధీ దర్శించుకున్నారు. శనివారం ఉదయం ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
'ప్రజల ఆస్తులతోనే చంద్రబాబు వ్యాపారం'
కర్నూలు : ప్రజల సొమ్ము దోచుకోవడం చంద్రబాబు నాయుడుకే చెల్లుతుందని శ్రీశైలం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, కొదమూరు ఎమ్మెల్యే మణిగాంధీ విమర్శించారు. శనివారం వారు మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రాజధాని పేరుతో ప్రజల ఆస్తులను లాక్కుంటున్నారని విమర్శించారు. రాజధాని కోసం భూ సేకరణలో అనుసరిస్తున్న విధానాలను వారు తప్పుపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గుండ్రేవుల ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం విచారకరమని మణిగాంధీ అన్నారు.