శిల్పా చక్రపాణిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆత్మకూరుకు చెందిన జంగిల్‌సా, మొమిన్ కుటుంబ సభ్యులు
సాక్షి, ఆత్మకూరు: అవినీతికి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పాలని వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలో ఆదివారం వైఎస్సార్‌సీపీలోకి జంగిల్‌సా, మొమిన్ కుటుంబ సభ్యులు చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో శిల్పా మాట్లాడుతూ.. పసుపు– కుంకుమ చెక్కులను పొదుపు మహిళలకు ఇవ్వకుండా బుడ్డా అడ్డుకున్నారని, రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే ఇలా చేయలేదన్నారు.
నీరు– చెట్టు పనుల్లో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. తెలుగుగంగ లైనింగ్ పనులు రూ. 300 కోట్లతో చేపట్టారని, వాటిలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఆత్మకూరు పట్టణంలో మూడు సార్లు ఇళ్ల పట్టాలు ఇచ్చి వెనక్కి తీసుకున్న ఘనత బుడ్డాదేనన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసకారని, అరగంటకోమాట మారుస్తున్నారన్నారు. పూర్తి రుణమాఫీ చేయకుండా రైతుల ఉసురు తీసుకున్నారన్నారు.
కర్నూలు జిల్లాలో ఎక్కువ సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇది టీడీపీ ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. వైఎస్సార్ హయాంలో ముస్లింల అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ఆత్మకూరులో పేదలకు ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇంటింటికీ మంచినీటి కుళాయి ఏర్పాటు చేసి నీటి సమస్య లేకుండా చేస్తానన్నారు. సిద్ధాపురం చెరువు నుంచి పంటకాల్వలు తీయిస్తానన్నారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ శ్రీశైలం నియోజకవర్గం నేత శిల్పా భువనేశ్వరరెడ్డి, పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బోగుల శివశంకర్ నాయుడు, పార్టీ నాయకులు అంజాద్ అలీ, చిట్యాల వెంకటరెడ్డి, పార్వతి, బాలన్న, కుందూరు శివారెడ్డి, గౌస్‌లాజం, లాలు, రాజగోపాల్, కలిముల్లా, ముర్తుజా, తిమోతి, నాగేశ్వరరెడ్డి, రామచంద్రుడు, శిఖామని, రవణమ్మ, పరిమల, ముర్తుజాబి, సుబ్బమ్మ, సుభద్రమ్మ,సుల్తాన్,ఫరుక్, ఫయాజ్, ఎమ్‌కలిముల్లా , పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment