Shilpa cakrapani reddy
-
బుడ్డాకు బుద్ధి చెప్పండి : శిల్పా చక్రపాణిరెడ్డి
సాక్షి, ఆత్మకూరు: అవినీతికి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలో ఆదివారం వైఎస్సార్సీపీలోకి జంగిల్‌సా, మొమిన్ కుటుంబ సభ్యులు చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో శిల్పా మాట్లాడుతూ.. పసుపు– కుంకుమ చెక్కులను పొదుపు మహిళలకు ఇవ్వకుండా బుడ్డా అడ్డుకున్నారని, రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే ఇలా చేయలేదన్నారు. నీరు– చెట్టు పనుల్లో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. తెలుగుగంగ లైనింగ్ పనులు రూ. 300 కోట్లతో చేపట్టారని, వాటిలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఆత్మకూరు పట్టణంలో మూడు సార్లు ఇళ్ల పట్టాలు ఇచ్చి వెనక్కి తీసుకున్న ఘనత బుడ్డాదేనన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసకారని, అరగంటకోమాట మారుస్తున్నారన్నారు. పూర్తి రుణమాఫీ చేయకుండా రైతుల ఉసురు తీసుకున్నారన్నారు. కర్నూలు జిల్లాలో ఎక్కువ సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇది టీడీపీ ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. వైఎస్సార్ హయాంలో ముస్లింల అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ఆత్మకూరులో పేదలకు ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇంటింటికీ మంచినీటి కుళాయి ఏర్పాటు చేసి నీటి సమస్య లేకుండా చేస్తానన్నారు. సిద్ధాపురం చెరువు నుంచి పంటకాల్వలు తీయిస్తానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ శ్రీశైలం నియోజకవర్గం నేత శిల్పా భువనేశ్వరరెడ్డి, పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బోగుల శివశంకర్ నాయుడు, పార్టీ నాయకులు అంజాద్ అలీ, చిట్యాల వెంకటరెడ్డి, పార్వతి, బాలన్న, కుందూరు శివారెడ్డి, గౌస్‌లాజం, లాలు, రాజగోపాల్, కలిముల్లా, ముర్తుజా, తిమోతి, నాగేశ్వరరెడ్డి, రామచంద్రుడు, శిఖామని, రవణమ్మ, పరిమల, ముర్తుజాబి, సుబ్బమ్మ, సుభద్రమ్మ,సుల్తాన్,ఫరుక్, ఫయాజ్, ఎమ్కలిముల్లా , పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
చంద్రబాబు పాలనకు కౌంట్ డౌన్ : శిల్పా కిషోర్ రెడ్డి
-
ఏపీలో దగాకోరు పాలన: శిల్పా చక్రపాణి
కర్నూలు: యువనేస్తం పేరుతో మోసం చెయ్యడమే రాష్ట్రంలో దగాకోరు పాలన నడుస్తుందనడానికి నిదర్శనమని నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..కేవలం 2 లక్షల మంది నిరుద్యోగులే అర్హులని లోకేష్ అనడం నిరుద్యోగులను అవమానపర్చడమే అవుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగభృతి అని మాయమాటలు చెప్పి నిరుద్యోగులను చంద్రబాబు నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల స్టంట్ కోసం నిరుద్యోగ భృతి చెల్లిస్తామని, అది కూడా రూ.1000 చెల్లించడం అనేది నిరుద్యోగులను కించపరచడమేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వేల పరిశ్రమలు తెచ్చామని, లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అబద్దాలు చెప్పడం చంద్రబాబు అసమర్థతకు నిదర్శనమన్నారు. రైతులు, డ్వాక్రా మహిళల్ని రుణామాఫీ పేరుతో చంద్రబాబు మోసం చేశారు..ప్రస్తుతం చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కర్నూలులో జలదోపిడీ జరుగుతోందని, ఈ దోపిడీని ఆపకపోతే పోతిరెడ్డిపాడును రైతులతో ముట్టడిస్తామని హెచ్చరించారు. -
చంద్రబాబువి డ్రామాలు
వెలుగోడు: మరో ఏడాదిలో ఎన్నికలు ఉండడంతో చంద్రబాబు కేంద్రంలోని తన పార్టీ మంత్రులతో రాజీనామా చేయించి డ్రామాలాడుతున్నారని వైఎస్ఆర్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. మంత్రి పదవులకు రాజీనామా చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదన్నారు. హోదా సాధన కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఈ నెల 21న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారని, చిత్తశుద్ధి ఉంటే టీడీపీ మద్దతివ్వాలని సూచించారు. శనివారం ఆయన వెలుగోడు పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ ఎంపీల మాదిరిగా టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలకు సిద్ధపడితే దేశం మొత్తం మన వైపు చూస్తుందని, అప్పుడు కేంద్రం దిగొస్తుందని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీలో టీడీపీ, బీజేపీ డ్రామా కంపెనీలుగా మారాయని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాలుగేళ్లుగా ఈ అంశాన్ని నీరుగార్చి.. ఇప్పుడు హఠాత్తుగా మాటమార్చారన్నారు. అదే వైఎస్ జగన్ నాలుగేళ్లుగా పోరాటం చేస్తూ ప్రత్యేక హోదాకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా 15 సీట్లు కూడా రావన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు..చంద్రబాబు బతికుండగానే ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ చంద్రబాబుకు బినామీగా మారారని, ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలంతా ఉద్యమిస్తుంటే జనసేన అధినేత మాత్రం కనిపించడం లేదని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు భారీ స్పందన లభిస్తుండడంతో టీడీపీ నేతల్లో వణుకు మొదలైందన్నారు. పుష్కరాల పేరుతో టీడీపీ నేతలు భారీగా అవినీతికి పాల్పడ్డారన్నారు. ఆ డబ్బు రుణమాఫీ కింద జమ చేసి ఉంటే రైతులు బాగుపడేవారన్నారు. మార్చి ఆఖరు లేదా ఏప్రిల్‌లో ‘వైఎస్ఆర్ గంగా హారతి’ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. ‘నీరు– చెట్టు’లో దోపిడీ టీడీపీ నేతలు నీరు– చెట్టు పథకంలో దోపిడీకి తెర లేపారని శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. డబ్బుకు అమ్ముడుపోయే నాయకులు కూడా మాట్లాడుతున్నారని, వారికి నైతిక విలువలు లేవని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి నీరు– చెట్టు పథకం, పాత లెట్రిన్ల బిల్లుల్లో అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై లోక్‌యుక్తా, హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. కేసీ కెనాల్లో చేపట్టే 200 ఆధునికీకరణ పనులపైనా కలెక్టర్, మైనర్ ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు టీడీపీ నాయకుల కోసమే ఏర్పాటు చేశారని మండిపడ్డారు. వీబీఆర్‌లో దాదాపు 7 టీఎంసీల నీరు ఉండగా.. మార్చి చివరి వరకు మాత్రమే నీరిస్తామని ఎమ్మెల్యే చెప్పడం శోచనీయమన్నారు. ఆలస్యంగా పంటలు వేసుకున్న రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రైతులకు సాగునీరు ఇవ్వకపోతే ఆందోళన చేపడతానని హెచ్చరించారు. టీజీపీలో రూ.20 కోట్ల నుంచి రూ. 30 కోట్ల పనులు జరుగుతున్నాయని, వీటిని పారదర్శకంగా, నాణ్యతతో చేపట్టాలని సూచించారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు శిల్పా భువనేశ్వర్‌రెడ్డి, అంబాల ప్రభాకర్‌రెడ్డి, తిరుపంరెడ్డి, మండ్ల శంకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలు స్థానిక ఎమ్మెల్సీ స్థానానికి ఈసీ షెడ్యూల్
సాక్షి, కర్నూలు: ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరిపేందుకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 19న నోటిఫికేషన్ జారీ చేయనుంది. జనవరి 12న పోలింగ్, 16న కౌంటింగ్ జరపాలని నిర్ణయించింది. కాగా, శిల్పా చక్రపాణిరెడ్డి వైఎస్సార్సీపీలోకి మారడంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. -
మా ప్రత్యర్థులను పార్టీలో చేర్చుకోవద్దు
టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి పార్టీ అవసరాల దృష్ట్యా తప్పదన్న లోకేష్ నేడు చంద్రబాబుతో కేఈ, శిల్పా సోదరుల భేటీ సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లాలోని తమ రాజకీయ ప్రత్యర్ధులను టీడీపీలో చేర్చుకోవద్దని జిల్లా పార్టీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి, సోదరుడు శిల్పా మోహన్‌రెడ్డి కోరారు. కర్నూలు జిల్లా నుంచి ప్రతిపక్ష పార్టీ కొందరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని వార్తలు వెలువడుతున్న నేపధ్యంలో వీరిద్దరూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను హైదరాబాద్‌లో కలిశారు. తమకు, పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతున్నవారికి ఎంతోకాలంగా రాజకీయంగా వైరం ఉందని వివరించారు. పార్టీ అవసరాలు, రాజకీయ భవిష్యత్ దృష్ట్యా కొందరిని పార్టీలో చేర్చుకోక తప్పదని, ఎవరు పార్టీలో చేరినా అభ్యంతర పెట్టవద్దని, ఎవరి ప్రాధాన్యత వారికి ఉంటుందని లోకేష్ చెప్పినట్లు సమాచారం. జిల్లాలో రానున్న మూడు సంవత్సరాల్లో ఏ ఉప ఎన్నిక జరిగినా పోటీచేసే అవకాశం మీకే ఇస్తానని లోకేష్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. శిల్పా సోదరులతో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కె. అచ్చాన్నాయుడు కూడా మాట్లాడారు. పార్టీ కోసం అధినేత తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకించవద్దని సూచించారు. కర్నూలు జిల్లా నుంచి పార్టీలో కొందరు చేరే అంశంపై ఆ జిల్లా నేతలతో శనివారం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పామోహన్‌రెడ్డి తదితరులు శనివారం విజయవాడ వెళ్లనున్నారు. -
రాజకీయ వలయం
కర్నూలు : పోలీసుల శాఖపై నేతల పెత్తనం ఏ స్థాయిలో సాగుతుందో సీఐ బదిలీల ప్రక్రియ చెప్పకనే చెబుతోంది. అప్రాధాన్యత పోస్టులోని సమర్థుడైన ఒక్క అధికారికీ బదిలీల్లో అనువైన చోటు దక్కకపోవడం నాలుగో సింహం పరువును బజారున పడేస్తోంది. అధికార పార్టీ నేతలకు సహకరించలేదనే కారణంతో కొన్ని నెలల క్రితం వీఆర్‌కు వచ్చిన ఓ ఇన్స్పెక్టర్కు కర్నూలు నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్‌కు నియమిస్తామని రేంజ్ స్థాయి అధికారి ఇచ్చిన హామీ కూడా నాయకుల పంతంతో మరుగున పడింది. సుదీర్ఘకాలం జిల్లాలో పనిచేసి సాధారణ ఎన్నికల పుణ్యమా అని కడప జిల్లాకు బదిలీ అయిన ఓ అధికారి స్థానిక ఎమ్మెల్యే సిఫారసుతో ఖాళీగా ఉన్న ఆ సర్కిల్లో పాగా వేశారు. కర్నూలు నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్‌కు మాజీ మంత్రుల సిఫారసు మేరకు రామకృష్ణను నియమించిన ట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. అదేవిధంగా కర్నూలులో కీలకమైన మూడవ పట్టణ పోలీసుస్టేషన్‌లోనూ మాజీ మంత్రి తనకు అనుకూలమైన వ్యక్తిని ఈ బదిలీల్లో నియమించుకున్నట్లు చర్చ జరుగుతోంది. మధుసూదన్‌రావు ప్రస్తుతం తిరుపతి ట్రాఫిక్‌లో అటాచ్ విధులు నిర్వహిస్తున్నారు. తిరుపతి ఎమ్మెల్యే సిఫారసు మేరకు కర్నూలుకు చెందిన మాజీ మంత్రి ఆయనను అనుకూలమైన స్టేషన్‌కు కేటాయించుకున్నట్లు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన మరో ఇన్స్పెక్టర్ టీడీపీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి ద్వారా నంద్యాలలో పోస్టింగ్ దక్కించుకున్నారు. ఈయన సోదరుడు సీఎం సెక్యూరిటీ వింగ్‌లో ముఖ్య అధికారిగా పని చేస్తున్నందున అధికార పార్టీ నేతల సిఫారసుతో పోస్టింగ్ దక్కిందనే చర్చ ఉంది. కడప జిల్లాకే చెందిన మరో అధికారి కూడా శిల్పా ద్వారానే పోస్టింగ్ వేయించుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన మరో అధికారి మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి ద్వారా ఆయన నియోజకవర్గానికి చేరుకున్నారు. ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడుతో ఒక డీఎస్పీకి ఉన్న సన్నిహిత సంబంధంతో నంద్యాల నుంచి ఆదోని సర్కిల్ పోస్టులు దక్కించుకున్నట్లు సమాచారం. ఈ బదిలీల్లో వీఆర్‌లోని ఇద్దరు అధికారులకు పోస్టింగ్ దక్కగా, సర్కిల్లో పనిచేస్తున్న ము గ్గురు అధికారులను వీఆర్‌కు పంపుతూ శనివా రం బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాయలసీమ ఐజీ గోపాలకృష్ణతో పాటు కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకె రవికృష్ణ శుక్రవారం రాత్రి బదిలీల ప్రక్రియపై కసరత్తు పూర్తి చేశారు. పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, ప్యాపిలి, బేతంచెర్ల తదితర సర్కిళ్ల అధికారులపైనా రెండో విడత బదిలీల్లో వేటుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.