ఏపీలో దగాకోరు పాలన: శిల్పా చక్రపాణి | Shipa Chakrapani Reddy Slams Chandrababu In Kurnool | Sakshi
Sakshi News home page

ఏపీలో దగాకోరు పాలన: శిల్పా చక్రపాణి

Published Thu, Oct 4 2018 3:05 PM | Last Updated on Thu, Oct 4 2018 6:02 PM

Shipa Chakrapani Reddy Slams Chandrababu In Kurnool - Sakshi

శిల్పా చక్రపాణి రెడ్డి

రూ.1000 చెల్లించడం అనేది నిరుద్యోగులను కించపరచడమే..

కర్నూలు: యువనేస్తం పేరుతో మోసం చెయ్యడమే రాష్ట్రంలో దగాకోరు పాలన నడుస్తుందనడానికి నిదర్శనమని నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..కేవలం 2 లక్షల మంది నిరుద్యోగులే అర్హులని లోకేష్‌ అనడం నిరుద్యోగులను అవమానపర్చడమే అవుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగభృతి అని మాయమాటలు చెప్పి నిరుద్యోగులను చంద్రబాబు నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు.

ఎన్నికల స్టంట్‌ కోసం నిరుద్యోగ భృతి చెల్లిస్తామని, అది కూడా రూ.1000 చెల్లించడం అనేది నిరుద్యోగులను కించపరచడమేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వేల పరిశ్రమలు తెచ్చామని, లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అబద్దాలు చెప్పడం చంద్రబాబు అసమర్థతకు నిదర్శనమన్నారు. రైతులు, డ్వాక్రా మహిళల్ని రుణామాఫీ పేరుతో చంద్రబాబు మోసం చేశారు..ప్రస్తుతం చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కర్నూలులో జలదోపిడీ జరుగుతోందని, ఈ దోపిడీని ఆపకపోతే పోతిరెడ్డిపాడును రైతులతో ముట్టడిస్తామని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement