సాక్షి, కర్నూలు: కర్నూలులో హైకోర్టు పెడతామని ఇది వరకే చెప్పామని.. ఆ మాటకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. గురువారం జిల్లాలో నేషనల్ లా యూనివర్సిటీ భూమి పూజ.. భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
‘శ్రీబాగ్ ఒడంబడికలో భాగంగా ఈ ప్రాంతానికి సరైన న్యాయం జరిగేందుకు నేషనల్ లా యూనివర్శిటి దోహదపడుతుంది. హైదరాబాద్‌కు రాజధానిని తరలించే సమయంలోనూ హైకోర్టు ఏర్పాటు చెయ్యాలని తీర్మానించారు. కర్నూలులో హైకోర్టు పెడతామని ఇది వరకే చెప్పాం. నేషనల్ లా యూనివర్శిటి నిర్మాణానికి అడుగులు వేగంగా పడాలని కోరుకుంటున్నాను. రూ.1000 కోట్లతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం.
ఈ యూనివర్సిటీతో పాటు న్యాయపరమైన అంశాలకు సంబంధించిన ఏపీ లీగల్ మెట్రాలాజీకల్ కమిషన్, లేబర్ కమిషన్, వ్యాట్ అప్పిలేట్ కమిషన్, వక్ఫ్ బోర్డ్, మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు కానున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. వీటి వల్ల ఈ ప్రాంతానికి మంచి జరగాలని కోరుతున్నాను’ అని వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment