కర్నూలు సిటీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ దూసుకుపోతోంది. హ్యాట్రిక్ విజయం కోసం ఆ పార్టీ కేడర్ సిద్ధం అవుతున్నారు. రెండోసారి కూడా ఇక్కడి సీటును మైనారిటీలకే కేటాయించడంతో సిటీలోని మొత్తం మైనారిటీలంతా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇక టీడీపీ అభ్యర్థి సొంత మేనిఫెస్టో ప్రకటించుకుని ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మైనారిటీలను చిన్నచూపు చూసే చంద్రబాబుకు మూడోసారి కూడా బుద్ధి చెప్పడానికి కర్నూల్ ప్రజానీకం రెడీ అవుతున్నారు. కర్నూల్ పాలిటిక్స్‌పై ఓ లుక్కేద్దాం.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఆవిర్భవించినప్పటినుంచీ కర్నూల్‌లో ఫ్యాన్ టాప్ స్పీడ్‌లో తిరుగుతోంది. గత రెండు ఎన్నికల్లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కూడా మైనారిటీకే కర్నూల్ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించడంతో సిటీలోని పార్టీలో కొత్త జోష్ వచ్చింది. రిటైర్డ్ ఐఏఎస్ ఇంతియాజ్ ను సమన్వయకర్తగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. ఈ నియామకంతో టీజీ కుటుంబంలో నిర్వేదం మొదలైంది. ఇంతియాజ్ మామ, డాక్టర్ ఇస్మాయిల్ మైనార్టీ వర్గంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తి. నగరంలో టీజీ కుటుంబం విజయంలో ఇస్మాయిల్ కీలకంగా పని చేశారు. మైనార్టీ ఓట్లు అత్యధికభాగం టీజీ కుటుంబానికి పొలయ్యేలా చూడటంలో గతంలో ఆయన కీలకంగా వ్యవహరించేవారు.
ఇప్పుడు ఇంతియాజ్‌కు టిక్కెట్ దక్కడంతో మైనార్టీ వర్గం మొత్తం ఆయనకు అనుకూలంగా ఏకమైంది. ఇంతియాజ్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలనే చర్చ మైనార్టీ వర్గాల్లో నడుస్తోంది. ఈ పరిణామంతో టీజీ కుటుంబానికి మైనార్టీ ఓట్లు పూర్తిగా దూరమైనట్లే. ఇంతియాజ్ కు మైనార్టీలతో పాటు అన్ని వర్గాల్లో మంచి పేరు ఉంది. పైగా రిటైర్డ్ ఐఏఎస్ కావడం వల్ల ఆయన్ను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి కూడా బాగుంటుందనే అభిప్రాయం అన్నివర్గాల్లోనూ వ్యక్తమవుతోంది. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి, మేయర్ రామయ్యతో సహా అందరూ సమష్టిగా ఇంతియాజ్ విజయం కోసం కలిసి పనిచేస్తున్నారు. ఫ్యాన్ స్పీడ్‌కు తట్టుకోలేకపోతున్న టీడీపీ పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన సొంత మేనిఫెస్టోని రూపొందించి మాయ మాటలతో ప్రజల్ని మభ్యపెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment