Shilpa Mohan Reddy
-
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమార్తె నిశ్చితార్థం
-
ఎంపీ కోమటిరెడ్డి కుమార్తె నిశ్చితార్థం
సాక్షి, హైదరాబాద్: భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమార్తె శ్రీనిధిరెడ్డి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. కర్నూలుకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా ప్రతాప్ రెడ్డి కుమారుడికి ఆమెను ఇచ్చి వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ వేడుకకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. (మర్డర్’ దర్శక నిర్మాతలు నల్గొండ కోర్టుకు..) -
చంద్రబాబుకు ఓడిపోతానని అర్ధమైంది
-
బుడ్డాకు బుద్ధి చెప్పండి : శిల్పా చక్రపాణిరెడ్డి
సాక్షి, ఆత్మకూరు: అవినీతికి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలో ఆదివారం వైఎస్సార్సీపీలోకి జంగిల్‌సా, మొమిన్ కుటుంబ సభ్యులు చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో శిల్పా మాట్లాడుతూ.. పసుపు– కుంకుమ చెక్కులను పొదుపు మహిళలకు ఇవ్వకుండా బుడ్డా అడ్డుకున్నారని, రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే ఇలా చేయలేదన్నారు. నీరు– చెట్టు పనుల్లో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. తెలుగుగంగ లైనింగ్ పనులు రూ. 300 కోట్లతో చేపట్టారని, వాటిలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఆత్మకూరు పట్టణంలో మూడు సార్లు ఇళ్ల పట్టాలు ఇచ్చి వెనక్కి తీసుకున్న ఘనత బుడ్డాదేనన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసకారని, అరగంటకోమాట మారుస్తున్నారన్నారు. పూర్తి రుణమాఫీ చేయకుండా రైతుల ఉసురు తీసుకున్నారన్నారు. కర్నూలు జిల్లాలో ఎక్కువ సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇది టీడీపీ ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. వైఎస్సార్ హయాంలో ముస్లింల అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే ఆత్మకూరులో పేదలకు ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇంటింటికీ మంచినీటి కుళాయి ఏర్పాటు చేసి నీటి సమస్య లేకుండా చేస్తానన్నారు. సిద్ధాపురం చెరువు నుంచి పంటకాల్వలు తీయిస్తానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ శ్రీశైలం నియోజకవర్గం నేత శిల్పా భువనేశ్వరరెడ్డి, పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బోగుల శివశంకర్ నాయుడు, పార్టీ నాయకులు అంజాద్ అలీ, చిట్యాల వెంకటరెడ్డి, పార్వతి, బాలన్న, కుందూరు శివారెడ్డి, గౌస్‌లాజం, లాలు, రాజగోపాల్, కలిముల్లా, ముర్తుజా, తిమోతి, నాగేశ్వరరెడ్డి, రామచంద్రుడు, శిఖామని, రవణమ్మ, పరిమల, ముర్తుజాబి, సుబ్బమ్మ, సుభద్రమ్మ,సుల్తాన్,ఫరుక్, ఫయాజ్, ఎమ్కలిముల్లా , పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నంద్యాల: వైఎస్సార్సీపీలోకి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు
సాక్షి, నంద్యాల : ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు కొనసాగున్నాయి. తాజాగా నంద్యాల పట్టణంలోని వెంకటాచలం కాలనీకి చెందిన టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆ పార్టీని వీడి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వెంకటాచలం కాలనీకి 34వ వార్డుకు చెందిన 50 కుటుంబాలకు చెందిన సుమారు వందమంది టీడీపీని వీడి.. వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ స్థానిక కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి సమక్షంలో వారు పార్టీలోకి వచ్చారు. ఈ సందర్భంగా వారికి వైస్సార్సీపీ కండువా కప్పి.. శిల్పామోహన్‌రెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. -
జగన్ సీఎం అయితేనే సమస్యలన్నీ పరిష్కారం
సాక్షి, కర్నూల్ : భవిష్యత్తులో వైఎస్సాఆర్సీపీ అధికారంలోకి రావటం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఖాయమని ఆ పార్టీ నేత శిల్పామోహన్‌రెడ్డి చెబుతున్నారు. ప్రజాసంకల్పయాత్ర నేడు కర్నూల్ జిల్లాలో ముగియనున్న నేపథ్యంలో ‘సాక్షి’ మోహన్‌రెడ్డిని పలకరించింది. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో పాదయాత్ర విజయవంతమైనట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రజలు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నారని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ‘‘అందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. అదే సమయంలో వైఎస్ జగన్‌పై వారిలో నెలకొన్న సమ్మోహన శక్తి. ఈ రెండూ కూడా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారబోతున్నాయని శిల్పా చెప్పారు. జిల్లాలో రైతులు, యువకులు ఇలా ప్రతీ ఒక్క వర్గం నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర వైపు మొగ్గుచూపటంతో విజయవంతం అయ్యిందని, వారి ఆశీర్వాదం జననేతకు నూటికి నూరుపాలు ఉంటాయని మోహన్‌రెడ్డి అన్నారు. ఇక పాదయాత్రలో ఇరిగేషన్ మీద ఎక్కువ సమస్యలు జగన్ దృష్టికి వచ్చాయన్న ఆయన.. దివగంత నేత వైఎస్ ప్రారంభించిన ప్రాజెక్టుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. అందుకు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందేనన్న భావన ప్రజల్లో నానాటికీ పెరిగిపోతుందని శిల్పామోహన్‌రెడ్డి చెప్పారు. -
జగన్ సీఎం అయితేనే సమస్యలన్నీ పరిష్కారం
-
నంద్యాల వైఎస్సార్సీపీ నేతలకు గన్మెన్లు తొలగింపు
నంద్యాల అర్బన్: కర్నూలు జిల్లా నంద్యాల వైఎస్సార్సీపీ నేతలపై ప్రభుత్వం కక్ష్యసాధింపు చర్యలకు పూనుకుంది. గతంలో వారికి కేటాయించిన గన్మెన్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు స్థానిక వైఎస్సార్సీపీ నంద్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ శిల్పామోహన్‌రెడ్డికి 2+2 గన్మెన్లు, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డికి 2+2, రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డికి 1+1, మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచనకు 1+1 గన్మెన్ల సౌకర్యం లేకుండా ఉత్తర్వులు వెలువరించింది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం గన్మెన్ల తొలగించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. అవసరమైతే జిల్లా ఎస్పీని కూడా కలుస్తామని తెలిపారు. -
నంద్యాల సీటు టీడీపీకి
- తెలుగుదేశం అభ్యర్థి భూమాకి 97,076 ఓట్లు - వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 69,610 ఓట్లు సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన నంద్యాల ఉప ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపొందారు. ప్రధానంగా తెలుగుదేశం–వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య సాగిన ఈ పోరులో బ్రహ్మానందరెడ్డి 27,466 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 97,076 ఓట్లు రాగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 69,610 ఓట్లు లభించాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ ఖాదర్‌కు కేవలం 1,382 ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత స్థానం నోటా(నన్ ఆఫ్ ద ఎబోవ్)కు దక్కింది. 1,231 ఓట్లతో ‘నోటా’ ఏకంగా నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం. ఒక్క రౌండ్ మినహా అన్ని రౌండ్లలోనూ టీడీపీకి స్పష్టమైన ఆధిక్యత లభించింది. అన్ని రౌండ్ల ఫలితాల అనంతరం భూమా బ్రహ్మానందరెడ్డి ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ ప్రకటించారు. మొత్తం 250 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా.. సదరు చిరునామాల్లో ఓటర్లు లేకపోవడంతో 39 తిరిగొచ్చాయి. మిగిలిన 211లో ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం గమనార్హం. మొత్తం పోలైన ఓట్లలో టీడీపీ అభ్యర్థికి 56.05 శాతం, వైఎస్సార్సీపీ అభ్యర్థికి 40.19 శాతం లభించాయి. పోలైన ఓట్లు 1,73,187 నంద్యాల నియోజకవర్గంలో మొత్తం 2,18,858 ఓట్లు ఉన్నాయి. ఈ నెల 23న జరిగిన ఉప ఎన్నికలో మొత్తం 1,73,187 ఓట్లు పోలయ్యాయి. అంటే మొత్తం ఓట్లలో 79.13 శాతం పోలయ్యా యి. ఈ ఓట్లను సోమవారం 19 రౌండ్లలో లెక్కించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం వరకూ కొనసాగింది. విజయం ఎవరిదనే విషయంలో మాత్రం ఉదయం 11 గంటలకే స్పష్టత వచ్చింది. మొత్తం 19 రౌండ్లలో ఒక్క 16వ రౌండ్ మినహా మిగిలిన అన్ని రౌండ్లలోనూ టీడీపీకి మెజార్టీ వచ్చింది. 16వ రౌండ్లో గోస్పాడు మండలం దీబగుంట్ల గ్రామం ఉండటంతో వైఎస్సార్సీపీకి 654 ఓట్ల మెజార్టీ లభించింది. మిగిలిన 18 రౌండ్లలో అధికార టీడీపీ అభ్యర్థికే మెజార్టీ దక్కింది. నంద్యాల గ్రామీణ ప్రాంతంతోపాటు నంద్యాల అర్బన్లోనూ టీడీపీకి భారీ ఆధిక్యత రాగా, గోస్పాడు మండలంలో మాత్రం మెజార్టీ 2,000 కంటే తక్కువే లభించింది. నాలుగో స్థానంలో ‘నోటా’ నంద్యాల ఉప ఎన్నికలో ‘నోటా’ ఏకంగా నాలుగో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తర్వాత అత్యధిక ఓట్లు వచ్చింది ‘నోటా’కే కావడం విశేషం. కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న అబ్దుల్ ఖాదర్‌కు 1,382 ఓట్లు రాగా, నోటాకు 1,231 ఓట్లు లభించాయి. ఇక రాయలసీమ పరిరక్షణ సమితి(ఆర్పీఎస్) అభ్యర్థికి పెద్దగా ఓట్లు రాలేదు. మిగిలిన స్వతంత్ర అభ్యర్థుల్లో ఒక్కరికి కూడా 1,000 ఓట్లకు మించి పడలేదు. -
ప్రజాతీర్పును గౌరవిస్తాను: శిల్పా మోహన్‌రెడ్డి
-
ప్రజాతీర్పును గౌరవిస్తాను: శిల్పా మోహన్‌రెడ్డి
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్ సరళిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి స్పందించారు. నంద్యాల ఉప ఎన్నికలో ఓటర్లకు టీడీపీ భారీగా డబ్బు పంచడం, భూమా నాగిరెడ్డి చనిపోయిన సానుభూతి వల్ల ఆ పార్టీ అభ్యర్థికి ఆధిక్యం లభించడానికి కారణం కావొచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. నంద్యాలలో చేపట్టిన అభివృద్ధి వల్లే టీడీపీకి ఓట్లు పడ్డాయన్న వాదనను తాను విశ్వసించడం లేదని చెప్పారు. అనారోగ్యం, మలేరియా ఫీవర్ వల్ల 28 రోజులు తాను ప్రజల్లోకి వెళ్లలేకపోయానని, అయితే, ఆ ప్రభావం పడలేదని అనుకుంటున్నట్టు చెప్పారు. ప్రస్తుతానికి 18వేల ఓట్లకుపైగా ఆధిక్యం టీడీపీకి వచ్చిన నేపథ్యంలో ఇంత ఆధిక్యం తగ్గించడం సాధ్యపడకపోవచ్చునని, ఏదిఏమైనా ప్రజాతీర్పును గౌరవిస్తానని ఆయన చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికలో పార్టీ నేతలు, కార్యకర్తలు శాయశక్తులా కృషి చేశారని తెలిపారు. ఉప ఎన్నిక ఫలితాన్ని విశ్లేషించకుంటామని ఆయన చెప్పారు. -
వైఎస్సార్ సీపీ నేతలను టార్గెట్ చేస్తారా?
-
నూరు శాతం మాదే విజయం: శిల్పా మోహన్‌రెడ్డి
- టీడీపీ కుట్రలకు ఓటుతో బదులిచ్చిన ప్రజలకు ధన్యవాదాలు - అన్ని వర్గాల ఓటర్లూ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారు - ఓటమి ఫ్ట్రస్ట్రేషన్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు బరితెగించారు నంద్యాల: అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రలోభాలకు దిగిన తెలుగుదేశం పార్టీకి నంద్యాల ఓటర్లు గట్టిగా బుద్ధిచెప్పారని వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. వాతావరణాన్ని కలుషితం చేసేలా టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా, ప్రజలు శాంతియుతంగా ఓటింగ్‌లో పాల్గొన్నారని, నూటికి నూరు శాతం గెలుపు వైఎస్సార్‌సీపీదేనని, భారీ మెజారిటీతో గెలుస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. బుధవారం ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ముందుగా నంద్యాల ప్రజలందరికీ కృతజ్ఞతలు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా బెదిరిపోకుండా సామరస్యాన్ని ప్రదర్శించిన ఓటర్లకు ధన్యవాదాలు. రైతులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున బారులుతీరి ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొనడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున కుట్రలు చేశారు. ఎన్నికలు రద్దయ్యేలా పన్నాగాలు పన్నారు. కానీ, వాటిని వైఎస్సార్సీపీ సమర్థవంతంగా అడ్డుకుంది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, కార్యకర్తలు, మా కుటుంబసభ్యులు అందరం సహకరించాం. మా తమ్ముడు చక్రపాణిరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడానికి పోలీసులు పలుమార్లు ప్రయత్నించారు. కానీ ఈసీ లెటర్ లేనిదే మేం లొంగిపోమని బదులిచ్చాం. చివరిదాకా వాళ్లు ఆ లేఖను తేలేకపోయారు’’ అని శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. ఆ ఘటనలు బాధించాయి: ‘‘భూమా మౌనిక రెడ్డి.. పోలింగ్ స్టేషన్లో మా పార్టీ ఏజెంట్ బాషాను బయటికి పంపేందుకు యత్నించడం, టీడీపీ నేతల జోలికి పోకుండా మమ్మల్ని మాత్రమే పోలీసులు పలు మార్లు అడ్డుకోవడం, పోలింగ్ ముగుస్తున్న సమయంలో మైనారిటీలపై టీడీపీవాళ్లు దాడులు చేయడం లాంటి ఘటనను నన్ను తీవ్రంగా బాధించాయి. నంద్యాలకు సంబంధంలేని టీడీపీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, మణిగాంధీ, జనార్థన్‌రెడ్డి, అఖిలప్రియ, ఎంపీ టీజీ వెంకటేశ్ ఇంకా చాలా మంది ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్పించారు. గొడవలు సృష్టించి పోలింగ్‌ను నిలిపేసేలా కుట్రలు చేశారు. ఫరూఖ్ నగర్లో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి, ఆయన అనుచరులు వైఎస్సార్సీపీ కౌన్సిలర్, ఇతర మైనారిటీ నేతలపై దాడిచేసి, చంపుతామని బెదిరించారు. ఓటమి ఖాయం కావడంతోనే టీడీపీ ఫ్ట్రస్ట్రేషన్కి లోనైంది’’ అని శిల్పా పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆ 20 మంది రాజీనామా చేయండి: ‘‘ఎమ్మెల్సీగా 6 సంవత్సరాలు పదవిలో కొనసాగే వీలున్నా, పార్టీ మారినందుకుగానూ నైతిక విలువలకు కట్టుబడి కేవలం 91 రోజుల్లోనే నా తమ్ముడు శిల్పా చక్రపాణిరెడ్డి పదవికి రాజీనామా చేశారు. నంద్యాల ఉప ఎన్నికను ధీటుగా ఎదుర్కొన్నాడు. ఇప్పటికైనా టీడీపీలోకి ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలి. ప్రజల మద్దతుతో మాత్రమే పదవుల్లో కొనసాగాలి. ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి నాతో కలిసి పనిచేసిన అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అని శిల్పా మోహన్‌రెడ్డి ముగించారు. -
నూరు శాతం మాదే విజయం
-
నంద్యాల ఉప ఎన్నిక ప్రశాంతంగా జరగాలి
-
నంద్యాల ఉపఎన్నికలో పోటెత్తిన మహిళాలోకం
-
ఓటు వేసిన శిల్పా , కుటుంబసభ్యులు
-
నంద్యాల ఉప ఎన్నిక ప్రశాంతంగా జరగాలి..
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నిక ప్రశాంతంగా జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. భార్య, కుమారుడు, కోడలు, కుమార్తె సహా శిల్పా పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. నంద్యాల సంజీవ్‌నగర్ బూత్ నెంబర్ 81లో ఓటు వేశారు. అనంతరం శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్‌ను ఎన్నికల కమిషన్ పూర్తి చేస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గత రాత్రి కూడా తమ ఇంటిపై దాడులు చేశారని ఆయన తెలిపారు. పౌరులంతా స్వేచ్ఛగా ఓటింగ్‌లో పాల్గొనాలని శిల్పా మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ దౌర్జన్యాలకు ఓటు రూపంలో జవాబు చెప్పాలన్నారు. జగనన్న సీఎం కావాలనేది అందరి కోరిక.. శిల్పా మోహన్ రెడ్డి తనయుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ అధికార పక్ష వైఖరిని ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రశాంత వాతారవణాన్ని చెడగొట్టాలని అధికార పక్షం ప్రయత్నిస్తోంది. శాంతియుతంగా ఎన్నికలు జరగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా. జగనన్న సీఎం కావాలనేది అందరి కోరిక. ఆ కోరికకు తొలి మెట్టు నంద్యాల ఉప ఎన్నిక.’ అని అన్నారు. శిల్పా నాగినిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలంతా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. ఓటర్లు వేసే ఓటు వారికి తప్ప ఎవరికీ తెలియదని పేర్కొన్నారు. కాగా నంద్యాల ఉప ఎన్నికలో మహిళాలోకం కదలి వస్తోంది. అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు మహిళా ఓటర్లు...... పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. దాదాపు చాలా పోలింగ్ బూత్స్ వద్ద ....మహిళా ఓటర్లే ఎక్కువుగా కన్పించడం ఇందుకు నిదర్శనం. 85 ఏళ్లు దాటిన మహిళలు, గర్భిణి మహిళలు సైతం ఓటు వేసేందుకు రావడం విశేషం. -
ఓటు వేసిన శిల్పా, కుటుంబసభ్యులు
-
ఓటు వేసిన శిల్పా, కుటుంబసభ్యులు
సాక్షి, నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంజీవ్‌నగర్ బూత్ నంబర్ 81కి కుటుంబ సమేతంగా వచ్చిన శిల్పా.. ఓటు వేశారు. కాగా, ఉప ఎన్నికలో అధికార పార్టీ తెలుగుదేశం, ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్న విషయం తెలిసిందే. -
అక్రమాలపైనే అధికార పార్టీ దృష్టి
-
శిల్పా సహకార్‌లో ఆధారాలు లభించలేదు
-
చెల్లని రూల్స్
నేడే నంద్యాల ఉప ఎన్నిక.. అక్రమాలపైనే అధికార పార్టీ దృష్టి నంద్యాల నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: మహాసంగ్రామానికి నాంది కాబోతున్న నంద్యాల ఉప ఎన్నిక నేడే జరగనుంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సాగే పోలింగ్‌పై రాష్ట్రమంతా ఉత్కంఠ నెలకొంది. విజయం ఖాయమైపోయిందని ఓవైపు, మెజారిటీ ఎంత అని మరోవైపు రాజకీయ నేతలు, ప్రజలు కూడా లెక్కల్లో మునిగితేలారు. ఇంకోవైపు పోలింగ్‌కు ఇక ఒక్కరోజే సమయం మిగిలి ఉండడంతో ఎలాగైనా నెగ్గాలన్న లక్ష్యంతో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఎన్నికల కోడ్‌ను అపహాస్యం చేస్తూ నంద్యాల నియోజకవర్గంలో హల్చల్ చేశారు. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ జరిగింది. మరోవైపు వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి తన ఇంట్లో పార్టీ ఏజెంట్లకు గుర్తింపు కార్డులు ఇస్తుండగా ఒక్కసారిగా భారీగా తరలివచ్చిన పోలీసులు సోదాలంటూ హల్చల్ చేశారు. ఏజెంట్లకు గుర్తింపు కార్డులు ఇవ్వకుండా అడ్డుకునేందుకు చివరి వరకు అధికారపార్టీ ప్రయత్నిస్తోందనడానికి ఇదే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రతిపక్ష ఏజెంట్లు ఉండొద్దా? నంద్యాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఇంట్లోని సిబ్బందిని, పోలింగ్ ఏజెంట్లను బయటకు తరిమేశారు. అలాగే పేదలకు చౌక ధరలకే సరుకులు అందజేస్తున్న ‘శిల్పా సహకార్’ను బలవంతంగా మూసివేశారు. శిల్పా ఇంటి వద్ద మంగళవారం రాత్రి పోలీసులు భారీగా మోహరించారు. విధినిర్వహణలో ఉన్న పోలింగ్ ఏజెంట్లను అడ్డుకోవద్దని, ఎన్నికల ఏజెంట్లను అడ్డుకునే హక్కు పోలీసులకు లేదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా వారు లెక్కచేయలేదు. శిల్పా ఇంటివద్ద ఎవరూ ఉండవద్దంటూ హెచ్చరించారు. పోలింగ్ బూత్‌ల ఏజెంట్లకు గుర్తింపు కార్డులు ఇవ్వకుండా అడ్డుకున్నారు. అక్కడున్న ఏజెంట్లపై లాఠీలు ఝుళిపించారు. దీంతో శిల్పా ఇంటి వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్సీపీ ఏజెంట్లను నియమించుకోకపోతే ఇక తమ అరాచకాలకు అడ్డే ఉండదని టీడీపీ నాయకత్వం భావిస్తోందని స్థానికులు మండిపడ్డారు. పోలీసుల తీరుపై శిల్పా మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ఏజెంట్లను అడ్డుకోవడాన్ని ప్రశ్నించారు. మరోవైపు శిల్పా మోహన్‌రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి స్థానికేతరుడని, ఆయన నంద్యాల నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. ఆధారాలు లభించలేదు నంద్యాలలో పేదలకు ఆసరాగా ఉన్న ‘శిల్పా సహకార్’ సూపర్ మార్కెట్‌ను టీడీపీ నేతల ఒత్తిడి మేరకు అధికారులు మూసివేశారు. శిల్పా సహకార్‌లో నిత్యావసర సరుకులను పేదలకు 10 శాతం రాయితీతో విక్రయిస్తున్నారు. ఇక్కడ సరుకులు ఉచితంగా ఇస్తున్నారంటూ తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం కర్నూలు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ గోపీనాథ్ జెట్టి, అదనపు ఎస్పీ రవిప్రకాశ్, రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్, డిప్యూటీ కలెక్టర్ తిప్పేనాయక్.. ఇలా ఒకరి తర్వాత ఒకరు శిల్పా సహకార్ సూపర్ మార్కెట్లోకి వెళ్లి అక్కడ పంపిణీ చేస్తున్న నిత్యావసరాలను పరిశీలించారు. రాత్రి 8 గంటలకు సంస్థను మూసివేశారు. కొందరు చేసిన ఫిర్యాదు మేరకే ఇక్కడ తనిఖీలు నిర్వహించామని, ఉచితంగా సరుకులు ఇస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని డిప్యూటీ కలెక్టర్ తిప్పేనాయక్ చెప్పారు. బెదిరింపులకు భయపడం నంద్యాల ఉప ఎన్నికలో ఎలాగైనా నెగ్గాలనే కుట్రతో అధికార పార్టీ నాయకులు భయానక వాతావరణం సృష్టిస్తున్నారని, వారి బెదిరింపులకు భయపడబోమని వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి తేల్చిచెప్పారు. మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగాల్సి ఉండగా తన ఇంట్లో సోదాలు చేశారని, ఏజెంట్లకు గుర్తింపు కార్డులు ఇవ్వకుండా అడ్డుకున్నారని, శిల్పా సహకార్‌ను మూసివేశారని మండిపడ్డారు. స్థానికేతరులైన మంత్రులు, ఎమ్మెల్యేలు నంద్యాలలోనే మకాం వేసినా పట్టించుకోని పోలీసులు వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రి ఆదినారాయణరెడ్డి నంద్యాలలోనే తిరుగుతూ డబ్బులు పంచుతున్నా పట్టించుకోని పోలీసులు తన ఇంట్లో మాత్రం సోదాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకే ముగిసినా టీడీపీ ఎమ్మెల్సీ ఫరూఖ్ మంగళవారం కూడా నంద్యాలలో సమావేశం ఏర్పాటు చేసి, ఓటర్లకు డబ్బులు పంచారని ఆరోపించారు. ప్రజలంతా వైఎస్సార్సీపీ వెంటే... ప్రతిపక్ష ఏజెంట్లు లేకుండానే పోలింగ్‌ను ఏకపక్షం చేసి, దౌర్జన్యంగా నెగ్గాలని అధికార పార్టీ కుట్ర పన్నుతోందని శిల్పా మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని, వైఎస్సార్సీపీ శ్రేణులు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ప్రజలంతా వైఎస్సార్సీపీ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. తన సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి నంద్యాలలో స్థానికుడేనని ఆయన పేర్కొన్నారు. ఇందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. చక్రపాణిరెడ్డి నంద్యాలను విడిచి వెళ్లాలంటూ పోలీసులు హెచ్చరించడాన్ని తప్పుపట్టారు. పోలీసుల చర్యలను న్యాయస్థానం ద్వారా ఎదుర్కొంటామన్నారు. పోలీసులు పట్టించుకోవడంలేదు తమ సంస్థలను పోలీసులు టార్గెట్ చేశారని, మూసివేయాలంటూ తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారని శిల్పా మోహన్‌రెడ్డి తనయుడు రవిచంద్ర కిషోర్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంత్రులు ఆదినారాయణరెడ్డి, సోమిరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డితోపాటు 50 మంది టీడీపీ ఎమ్మెల్యేలు నంద్యాలలోనే ఉంటున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. కాగా, శిల్పా మోహన్‌రెడ్డి తన మామ కావడం వల్ల అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో 17 రోజులుగా ప్రతి రోజూ ఒక పరిశీలకుడిని శిల్పా సహకార్‌లో ఉంచారని శిల్పా సేవా సమితి చైర్మన్ శిల్పా నాగినిరెడ్డి చెప్పారు. ఇక్కడ ఎవరికీ ఉచితంగా సరుకులు ఇవ్వడం లేదని, పేదలకు 10 శాతం సబ్సిడీతో ఇస్తున్నామని తెలిపారు. నంద్యాలలో మంత్రుల హల్చల్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఉప ఎన్నికల నేపథ్యంలో నెల రోజులకు పైగా నంద్యాలలో తిష్టవేసి మంత్రాంగం నడిపిన మంత్రులు.. ప్రచారం గడువు ముగిసి 24 గంటలైనా పట్టణం వీడటం లేదు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇతర జిల్లాలవారు సోమవారం సాయంత్రం ఐదు గంటల తర్వాత జిల్లాలో ఎక్కడా ఉండేందుకు వీలులేదు. నంద్యాల ఓటర్లు మినహా జిల్లాలోని ఇతర ప్రాంతాల వారు సైతం నంద్యాలలో మకాం వేయకూడదని ఈసీ స్పష్టంగా పేర్కొంది. అయితే, మొదటి నుంచి నంద్యాల ఉప ఎన్నికలను పర్యవేక్షించిన మంత్రులు ఇతర జిల్లాల వారు కావడంతో వారు తప్పకుండా సోమవారం ఐదు గంటలకు జిల్లా సరిహద్దులను దాటి వెళ్లిపోవాల్సి ఉంటుంది. కానీ బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఇంట్లో సోమవారం రాత్రి వరకూ విందు అనంతరం 12 గంటల ప్రాంతంలో తమ జిల్లాలకు వెళ్లారు. తిరిగి మంగళవారం ఉదయమే ఎమ్మెల్యే ఇంట్లో తిష్టవేసి అక్కడి నుంచే నగదు పంపిణీపై సూచనలు, అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు బొండా ఉమాకు చెందిన ఏపీ16డీఎఫ్1314, బోడేప్రసాద్‌కు చెందిన ఏపీ16డీఏ567 కార్లు ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్లడం కనిపించింది. మంత్రి అమరనాథరెడ్డి వెలుగోడులో మకాం వేశారు. మరికొందరు మంత్రులు నంబర్ ప్లేట్లు తీసేసిన కార్లలో తిరుగుతున్నారు. ప్రధానంగా జమ్మలమడుగు, చిత్తూరు జిల్లాల నుంచి తీసుకొచ్చిన రూ.40 కోట్లు మొత్తాన్ని వైఎస్సార్సీపీకి పట్టున్న గోస్పాడు మండలంలో పంచిపెట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఉప పోరుకు సర్వం సిద్ధం నంద్యాల ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 2,18,858 మంది ఓటర్లు 15 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. ఉప ఎన్నిక నిర్వహణకు 255 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల్లోపు పోలింగ్ కేంద్రాల వద్ద వరుసలో నిల్చున్న వారందరినీ ఓటు వేసేందుకు అనుమతిస్తారు. ఉప ఎన్నికను అధికార, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. పోలింగ్‌ను పకడ్బందీగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కర్నూలు జిల్లా ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. గతంలో ఏ ఉప ఎన్నికకూ లేనివిధంగా నంద్యాల ఉప ఎన్నికకు బెంగాల్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి హిమాన్స్ జ్యోతి చౌదరిని సాధారణ పరిశీలకుడిగా నియమిం చింది. ఎన్నికల కమిషన్‌తోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ పోలింగ్ ప్రక్రియను లైవ్ వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించనున్నారు. ఉప ఎన్నిక బరిలో 15 మంది అభ్యర్థులు నిలిచినా.. ప్రధాన పోటీ వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యే నెలకొంది. మొదటిసారిగా వీవీప్యాట్ యంత్రాల ద్వారా ఓటర్లు తాము ఏ గుర్తుకు ఓటు వేశామో.. ఆ గుర్తుకు ఓటు పడిందా, లేదా అని 7 సెకన్లపాటు చూసుకోవచ్చు. ఇది ఓటరుకు తప్ప ఇతరులకు తెలియదు. -
శిల్పా ఇంటి వద్ద పోలీసుల ఉద్రిక్తత
-
నంద్యాల: శిల్పా ఇంటి వద్ద పోలీసుల హల్చల్
- ఏజెంట్ ఫారాలు ఇవ్వనీయకుండా కుట్రలు - పోలింగ్ ఏజెంట్లు, సిబ్బందిని బయటికి పంపిన అధికారులు - ఖాకీల తీరుపై మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం - టీడీపీ మంత్రులు తిరుగుతున్నా పట్టించుకోని అధికారులు నంద్యాల: మరికొద్ది గంటల్లో ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభంకానుండగా, నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఇంటివద్ద పోలీసులు హల్చల్ చేశారు. మంగళవారం రాత్రి నంద్యాలలోని శిల్పా ఇంటికి వచ్చిన పోలీసులు.. అక్కడున్న సిబ్బంది, పోలింగ్ ఏజెంట్లను బలవంతంగా బయటికి పంపేశారు. దీంతో ఆగ్రహించిన శిల్పా మోహన్‌రెడ్డి పోలీసుల తీరును తప్పుపట్టారు. ఏజెంట్లకు ఫారాలు పంచనీయకుండా అడ్డుపడటం సరికాదని హితవుపలికారు. కానీ పోలీసులు ఎంతకీ వినిపించుకోలేదు. రేపటి పోలింగ్ కోసం ఆయా పోలింగ్ స్టేషన్లలో కూర్చునే ఏజెంట్లుకు సంబంధిత పత్రాలు ఇస్తుండగా, పోలీసులు బిలబిలమంటూ దూసుకొచ్చి అక్కడున్నవారిని బయటికి తీసుకెళ్లారు. పత్రాలు తీసుకోకపోతే రేపు ఉదయం పోలింగ్ స్టేషన్లో కూర్చునే వీలుండదని, కొద్ది నిమిషాల్లోనే పత్రాలు తీసుకొని వెళ్లిపోతామని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన శిల్పా మోహన్‌రెడ్డి...‘మీరు అధికార పక్షానికి కొమ్ము కాయడం సరికాదు’అని పోలీసులతో అన్నారు. అటుపై మీడియాతో మాట్లాడారు. కుట్రలకు భయపడం: ‘‘ఎస్సైలు, సీఐలు, డీఎస్సీలు ఇంటికొచ్చి మా పోలింగ్ ఏజెంట్లు, వాచ్మెన్, డ్రైవర్లును పంపేశారు. సోదరుడు చక్రపాణిరెడ్డిని కూడా వెళ్లిపోమన్నారు. మా ఇంట్లో మమ్మల్ని ఉండొద్దనడమేంటి? మేం ఉండేదే నంద్యాలలో. ఇంకా ఎక్కడికి పోవాలి? ట్రాఫిక్ అంటున్నారు, మా ఇల్లు మెయిన్ రోడ్డుమీద లేదే, అయినా టీడీపీ మంత్రులు బసచేసిన సూరజ్ గ్రాండ్ హోటల్ వద్ద పదుల సంఖ్యలో వాహనాలు, వందల సంఖ్యలో జనం ఉన్నారు. ట్రాఫిక్ సమస్య అక్కడ లేదా? టీడీపీ నాయకుడు వర్ల రామయ్య నంద్యాల సినిమా హాలులో కనిపించాడు. మంత్రి ఆదినారాయణరెడ్డి నంబర్‌ప్లేట్ లేని వాహనంలో తిరుగుతున్నాడు. సోమిరెడ్డి తదితరులు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ల గురించి పట్టించుకోని పోలీసులు.. ఏకపక్షంగా మా ఇళ్లపైకి రావడమేంటి? కుట్రలతో మమ్మల్ని భయపెట్టాలనుకుంటే మేము భయపడే సమస్యేలేదు’’ అని శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. మా ‘డ్యూటీ’ మేం చేస్తున్నాం: ‘ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థిగా శిల్పా మోహన్‌రెడ్డికి ఏజెంట్లతో మాట్లాడే హక్కు ఉటుందికదా? మీకె ఎందుకు అడ్డుకుంటున్నారు?’అని ‘సాక్షి’ ప్రతినిధి పోలీసులను ప్రశ్నించగా.. ‘మా డ్యూటీ మేం చేస్తున్నాం’ అనే సమాధానం వచ్చింది. నంద్యాలలో 144 సెక్షన్ ఉందని, ఇంట్లో ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండొద్దని పోలీసులు చెప్పారు. అయితే శిల్పా ఇంటి నుంచి బయటికొచ్చిన వారిలో కొందరు మాత్రం ‘పోలీసులు టీడీపీ డ్యూటీ’ చేస్తున్నారంటూ మండిపడ్డారు. -
శిల్పా ఇంటి వద్ద భారీగా పోలీసులు
-
ఆల్ ది బెస్ట్ అన్నా...!
సాక్షి, నంద్యాల : ‘ఆల్ ది బెస్ట్ అన్నా...!’ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. నిన్న (సోమవారం) నంద్యాలలో ఉప ఎన్నికల పోరు ప్రచార ముగింపు సభ పూర్తయిన తరువాత ఆయన... మోహన్ రెడ్డిని గట్టిగా ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పారు. వీరిద్దరూ 13 రోజులుగా ప్రచార రథంపై అలుపూ సొలుపూ లేకుండా తిరిగారు. ఎస్పీజీ మైదానంలోనూ, గాంధీ చౌక్‌లోనూ భారీ బహిరంగ సభలు నిర్వహించారు. తొలుత రోడ్‌షో ద్వారా ప్రచారం మొదలు పెట్టినా.. జనాభిమానం వెల్లువెత్తడంతో అది కాస్తా పాదయాత్రగా మారింది. ఎండనకా వాననకా తిరిగిన నేతలిద్దరూ ప్రచారం చివరి రోజున ప్రచార రథంపైనే ఆలింగనం చేసుకున్నపుడు చూసిన వేలాదిమంది కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కాగా కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక ప్రచార పర్వం నిన్నటితో ముగిసింది. అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 23వ తేదీ బుధవారం పోలింగ్ జరగనుంది. మొత్తం 255 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 141 సమస్యాత్మకంగా, 74 అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు. 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 6 కంపెనీల పారా మిలటరీ బలగాలను రప్పించారు. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవుతుంది. సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆ ప్రాంతాల్లో ఓటింగ్ సరళిని వీడియో చిత్రీకరణ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటర్లకు సరిపడా ఈవీఎంల ను ఏర్పాటు చేశారు. సాంకేతిక ఇబ్బందులేవైనా తలెత్తితే అదనంగా కూడా ఈవీఎంలను సిద్ధం చేశారు. ఈ నెల 28న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితం వెల్లడి కానుంది. -
‘శిల్పా కుటుంబాన్ని ఏమీ చేయలేరు’
►శిల్పా కుటుంబంపై ఎన్నడూ అవినీతి ఆరోపణలు లేవు ►నీతి నిజాయితీలే పరమావధిగా భావించి రాజకీయాల్లోకి వచ్చాం ►వైఎస్ జగన్ ప్రజాదరణను చూసి టీడీపీ భయపడుతోంది ►భూమా కుటుంబంలోని పిల్లలు చిన్నపిల్లలేం కాదు ►ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దు నంద్యాల : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...శిల్పా సహకార సొసైటీపై చేసిన ఆరోపణలను వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఖండించారు. సోమవారం ఉదయం శిల్పా మోహన్ రెడ్డి నంద్యాలలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం విమర్శలు, ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు. శిల్పా కుటుంబంపై ఎన్నడూ అవినీతి ఆరోపణలు లేవని, తాము ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. తమ కుటుంబానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారాలు, తాజా పరిణామాలు చాలా బాధపెడుతున్నాయన్నారు. తనపై ఇప్పటివరకూ చిన్నకేసు కూడా లేదని శిల్పా మోహన్ రెడ్డి తెలిపారు. తాము ఎన్నడూ సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదన్నారు. పదిమందికి సహాయం చేయాలని ఆశించామని, నీతి నిజాయితీలే పరమావధిగా భావించి రాజకీయాల్లోకి వచ్చామన్నారు. బెదిరింపులతో భయపడేది లేదని శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. నంద్యాల ఎన్నికల్లో టీడీపీ పెద్ద ఎత్తున అక్రమాలు చేస్తోందని, టీడీపీకే ఓట్లు వేయాలంటూ అన్నివర్గాలను బెదిరింపులకు గురి చేస్తున్నారని, కోట్ల రూపాయిలు టీడీపీ నేతలు వెదజల్లుతున్నారని శిల్పా మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అధికార బలంతో టీడీపీ నేతలు భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రలోభపెట్టి కౌన్సిలర్లను, నాయకులను తీసుకున్నారన్నారు. అర్థరాత్రి తమ కార్యకర్తలు, అనుచరులపై పోలీసులు దాడి చేశారని ఆయన తెలిపారు. ప్రజల అండ ఉన్నంతవరకూ శిల్పా కుటుంబాన్నిఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. ఆరోపణలు బాధాకరం.. ‘శిల్పా సహకార బ్యాంకుపై చంద్రబాబు ఆరోపణలు చేయడం బాధాకరం. శిల్పా సహకార సొసైటీ చట్ట వ్యతిరేకమని సీఎం ఆరోపించారు. చంద్రబాబు చేసిన ఆరోపణలపై వివరణ ఇవాల్సిన అవసరం ఉంది. శిల్పా సహకార సొసైటీ రిజిస్ట్రర్ అయింది. ఏ విచారణకు అయినా మేం సిద్ధం. ఎప్పుడు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. ఈ రోజు వరకూ మేం నిజాయితీగా ఉన్నాం. మానవ సేవే మాధవ సేవగా నమ్మి రాజకీయాల్లోకి వచ్చాం. పేద కుటుంబంలో పుట్టి పదిమందికి సేవ చేయాలని ఆశించా. శిల్పా కుటుంబంపై ఎప్పుడు అవనీతి ఆరోపణలు లేవు. టీడీపీ భయపడుతోంది.. 12 రోజుల పర్యటనలో వైఎస్ జగన్‌కు ప్రజా స్పందన వస్తోందని, ప్రచారంలో అనేక మందిని కలిశారన్నారు. వైఎస్ జగన్ ప్రజాదరణను చూసి టీడీపీ భయపడుతోంది. మూడున్నరేళ్లుగా చంద్రబాబు అవినీతి పాలనపై మాట్లాడారు. వైఎస్ జగన్‌కు మా కుటుంబం తరఫున ధన్యవాదాలు. మూడేళ్లు టీడీపీలో ఉన్నాం. ఎన్ని విజ్ఞప్తులు చేసి చంద్రబాబు పట్టించుకోలేదు. ఇప్పటికిప్పుడు టీడీపీ చేస్తున్న పనులను మేం నమ్మడం లేదు. టీడీపీకే ఓటు వేయాలంటూ అన్ని వర్గాలను బెదిరిస్తున్నారు. ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దు. వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుంది.. మీకు వచ్చే పెన్షన్లు, రేషన్ మొత్తం ఆన్లైన్లో ఉంటుంది. మీకు ఏ ఇబ్బంది కలిగినా వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుంది. ఎన్ని కుట్రలు పన్నినా శిల్పా కుటుంబాన్ని ఏమీ చేయలేరు. బెదిరిస్తే నేను భయపడేవాడిని కాదు. అలాంటి బెదిరింపులకు లొంగేది లేదు. మేం ఎప్పుడు ఏ వ్యక్తి గురించి చెడు మాట్లాడలేదు. చెడను ప్రచారం చేయలేదు. నేను అనని మాటలను కూడా అన్నానని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇదంతా నంద్యాల ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలి.’ అని సూచించారు. -
మా బ్యాంక్‌పై సీఎం ఆరోపణలు హాస్యాస్పదం
-
సీఎం ఆరోపణలు హాస్యాస్పదం: శిల్పా ఫ్యామిలీ
నంద్యాల : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణలను వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కుటుంబం తీవ్రంగా ఖండిచింది. ఓడిపోతామనే భయంతోనే దిగజారుడు రాజకీయం చేస్తున్నారని, తాము ఏ విచారణకైనా తమ కుటుంబం సిద్ధమని శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి, కోడలు నాగిని రెడ్డి, కుమార్తె శిల్పా తెలిపారు. నంద్యాలలో సోమవారం ఉదయం నిర్వహించిన ప్రెస్మీట్లో రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ...‘ మా కుటుంబంపై ముఖ్యమంత్రి ఆరోపణలు హాస్యాస్పదం. గతంలో శిల్పా సేవా సమితిని చంద్రబాబు, లోకేశ్ ఇద్దరు పొడిగారు. 2014 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు అర్థరాత్రి రెండు గంటల సమయంలో నాన్నను పిలిపించుకుని మాట్లాడారు. సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆయనను పార్టీలో చేరాలని చంద్రబాబే స్వయంగా ఆహ్వానించారు. గతంలో లోకేశ్ నంద్యాలలో పర్యటించినప్పుడు కూడా శిల్పా సహకార బ్యాంకు పనితీరును మెచ్చుకున్నారు. శిల్పా సేవా సమితి ద్వారానే మా నాన్నకు మంచి పేరు ఉంది. గతంలో నాన్న చేసిన మంచి పనులు ఇప్పుడు చెడుగా కనిపిస్తున్నాయా?. నాన్న ఇప్పటివరకూ ఏ ఒక్క కాంట్రాక్టర్‌ను బెదిరించలేదు. బెదిరించిన ఘటనలు మా కుటుంబ చరిత్రలోనే లేనే లేదు. మహిళల పట్ల నాన్నకు అపారం గౌరవం ఉంది. కూతురి పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారు. వాగ్దానాలన్నీ శిలా ఫలకాలకే పరిమితం అయ్యాయి. నంద్యాలను అభివృద్ధి చేస్తామని సీఎం అనడం విచారకరం’ అన్నారు. మా బ్యాంక్ గురించి మాట్లాడటం ఆశ్చర్యం... శిల్పా సహకార బ్యాంక్ ద్వారా వేలమంది మహిళలకు రుణాలు ఇచ్చామని శిల్పా చక్రపాణిరెడ్డి కోడలు నాగినిరెడ్డి తెలిపారు. వడ్డీలేని రుణాలు నుంచి అర్థరూపాయి వడ్డీ వరకూ రుణాలు ఇస్తున్నామన్నారు. ఇప్పటివరకూ ఏ మహిళను రుణం కట్టమని గట్టిగా అడిగింది లేదన్నారు. మహిళలకు మంచి గుర్తింపు ఇవ్వడానికే బ్యాంక్ పెట్టాం. బ్యాంకు గురించి చెడుగా ప్రచారం చేయడం మంచిది కాదు. బ్యాంకు నష్టాల్లో నడుస్తున్నా సంకల్ప బలంతో ముందుకు నడిపించుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. బ్యాంకు ద్వారా మహిళల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. స్వయం ఉపాధితో సొంత కాళ్లపై నిలబడేలా చేస్తున్నామన్నారు. ఇవన్నీ ఆగిపోవాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశం. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు. సీఎం తన స్థాయిని దిగజార్చుకుంటున్నారు. గడిచిన ఆరు నెలల సీసీ పుటేజ్‌ను ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఈ పుటేజ్‌ను పరిశీలించి కావాలంటే ప్రభుత్వం విచారణ చేసుకోవచ్చు. బ్యాంకును మూసేయాలంటూ రెండు నెలలుగా అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. విచారణ పేరుతో నన్ను, నా స్టాఫ్‌ను ఇబ్బంది పెడుతున్నారు. విచారణ పేరుతో గంటల కొద్దీ వేధిస్తున్నారు. ఏడేళ్లుగా ఎలాంటి మచ్చ లేకుండా బ్యాంకును నడుపుతున్నాం. కేవలం రాజకీయా ప్రయోజనాల కోసం మా కుటుంబంపై బురద జల్లుతున్నారు. సూపర్ మార్కెట్లో సరుకులు ఫ్రీగా ఇప్పిస్తున్నామని చెబుతుతున్నారు. దయచేసి ఆధారాలు లేకుండా మాట్లాడవద్దు అని నాగినిరెడ్డి అన్నారు. జవాబు చెప్పరు కానీ, మాపై నిందలా? వైఎస్ఆర్ సీపీ గుర్తుపై గెలిచిన 21మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా టీడీపీలో ఎలా కొనసాగుతారని శిల్పా మోహన్ రెడ్డి కుమార్తె శిల్పారెడ్డి సూటిగా ప్రశ్నించారు. ‘దీనిపై జవాబు చెప్పరు. మాపై నిందలు మాత్రం వేస్తారు. నాన్నగారు నంద్యాలకు ఉచిత మినరల్ వాటర్ ఇస్తున్నారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. రెండు రోజలు తర్వాత మంత్రులు ఎవరూ ఇక్కడ కనిపించరు. నాన్న అనుభవం ఉన్న వ్యక్తి, మంచి వ్యక్తికి అవకాశం ఇవ్వండి. నంద్యాల ప్రజల పెన్షన్లు, రేషన్ కార్డులు ఎక్కడికీ పోవు.’ అని తెలిపారు. -
‘చంద్రబాబు ఫ్రస్టేషన్ పీక్ స్టేజికి చేరింది’
-
‘చంద్రబాబు ఫ్రస్టేషన్ పీక్ స్టేజికి చేరింది’
►ఓటమి భయంతోనే శిల్పా మోహన్ రెడ్డిపై ఆరోపణలు ►నిన్నటివరకూ శిల్పా మోహన్ రెడ్డి మంచోడు.. ►చంద్రబాబు నైజం ఎలాంటిదో ఎన్టీఆరే చెప్పారు నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్రస్టేషన్ పీక్ స్టేజికి చేరిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. అందుకే ఓటమి భయంతో శిల్పా మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె సోమవారమిక్కడ మాట్లాడుతూ...‘ నిన్నటివరకూ శిల్పా మోహన్ రెడ్డి మంచోడు. టీడీపీ నుంచి వైఎస్ఆర్ సీపీలో చేరగానే విమర్శలు. గతంలో భూమా నాగిరెడ్డిని విషవృక్షం అన్న చంద్రబాబు ఇప్పుడు అదే భూమాను పొగుడుతున్నారు. మామను వెన్నుపోటు పొడిచినప్పుడు ఎన్టీఆర్‌ను ఇలానే విమర్శించారు. మైనార్టీల అభివృద్ధి గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం. మైనార్టీలకు వైఎస్ రాజశేఖరరెడ్డి మూడు మంత్రి పదవులు ఇచ్చారు. చంద్రబాబు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లను అందించిన ఘటన వైఎస్ఆర్దే. ఫీజు రీయింబర్స్మెంట్ అందించిన ఏకైక సీఎం వైఎస్ఆర్. సాయం చేసిన వైఎస్ఆర్ను మైనార్టీలు ఎప్పటికీ మరిచిపోరు. చంద్రబాబుకు దమ్ముంటే పార్టీ ఫిరాయించిన 21మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలి. తన అవినీతి పాలనకు ఓట్లు రావు కాబట్టే..నంద్యాలలో రూ.కోట్లు పంపిణి చేసి కొనాలనుకుంటున్నారు’ అని ధ్వజమెత్తారు. -
‘శిల్పా కుటుంబాన్ని ఏమీ చేయలేరు’
-
పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ : వైఎస్ జగన్
-
మా మద్దతు శిల్పాకే
► ఆత్మీయ సమావేశంలో ప్రకటించిన ఆర్యవైశ్యులు ► వైఎస్ జగన్, శిల్పా సోదరులతో సహా ప్రముఖుల హాజరు ► వైశ్యులకు వైఎస్ఆర్ ఎంతో మేలు చేశారని ప్రశంసలు ► కార్పొరేషన్ ఏర్పాటు హామీపై జగన్‌కు అభినందనలు సాక్షి బృందం, నంద్యాల : నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి తామంతా మద్దతునిస్తున్నట్లు నంద్యాల పట్టణ ఆర్యవైశ్యులు ప్రకటించారు. శనివారం నంద్యాల టౌన్ హోలులో నిర్వహించిన ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో వైశ్యులు ఈ మేరకు నిర్ణయించారు. దాల్మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు నెరవాటి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి, ఆయన సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ హయాంలో ఏ సమస్య వచ్చినా నేరుగా ఆయనకు చెప్పుకొని పరిష్కారం పొందేవాళ్లమని గుర్తు చేశారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించడం అభినందనీయమన్నారు. దీంతో నంద్యాలతో పాటు 13 జిల్లాల్లో ఉన్న ప్రతి ఆర్యవైశ్యుడూ సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. పీఏసీ సభ్యుడు గుబ్బా చంద్రశేఖర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ఎంతో మేలు చేశారని, అదే బాటలో అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ ప్రకటించడం అభినందనీయమన్నారు. పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ మాజీ సీఎం కె.రోశయ్య 2009 ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారని గుర్తు చేశారు. ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మూడేన్నరేళ్ల నుంచి తిరుగున్నా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ ప్రకటించడం అభినందనీయమన్నారు. ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో కార్యక్రమం అనంతరం వైఎస్ జగన్‌ను పెద్ద పూల మాలలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అత్కూరి ఆంజనేయులు, కార్యదర్శి మిట్టపల్లి రమేష్, అధికార ప్రతినిధి రేపాల శ్రీనివాస్, సుబ్బ లక్ష్మయ్య, స్థానిక నాయకులు గంగిశెట్టి శ్రీధర్, మాఘం రఘు, అయ్యపుశెట్టి సుబ్రహ్మణ్యం, సుబ్బా రామయ్య, రమేష్, రాజేష్, మహేష్, వస్త్ర వ్యాపారస్తుల సంఘం నాయకులు మేడం సుబ్బలక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యుల మేలు కోరే వ్యక్తిని ఆర్యవైశ్యులంటే నాకెంతో అభిమానం. 1982 నుంచి నా వ్యాపార, రాజకీయ ఎదుగుదలకు సహకరించిన వారిలో ఆర్యవైశ్యులే ఎక్కువ. ఇప్పటి వరకు ఏ వ్యాపారస్తుడికీ చిన్న కీడు కూడా చేయలేదు. వారి నుంచి వచ్చిన విన్నపాల మేరకే, ఆర్యవైశ్యుల వ్యాపారం కోసం 29 ప్రాంతాల్లో ఉన్న శిల్పా దుకాణాలను తొలగించాం. ఎంతో మంది నిరుపేద ఆర్యవైశ్యులకు వడ్డీలేని రుణాలు, ఇళ్ల స్థలాలు అందించాం. అధికార పార్టీకి చెందిన నేతలు రూ.100 కోట్లు దోచుకున్నారు. నంద్యాల పట్టణంలో ఆళ్లగడ్డ రాజకీయాలకు తావు లేకుండా చేస్తాం. ఏడాది ఓపిక పడితే నంద్యాలకు మంచి వైభవం వస్తోంది. – శిల్పా మోహన్‌రెడ్డి ఆర్యవైశ్యులకు అండగా మా కుటుంబం వ్యాపారస్తులు, ఆర్యవైశ్యులకు మా కుటుంబం ఎప్పుడూ అండగా ఉం టోంది. ఏ ఇబ్బందులు వచ్చినా ఆదుకునేం దుకు ముందుంటాం. మధ్య వ్యక్తి లేకుండానే నేరుగా వచ్చి మాతో సమస్యలు చెప్పుకోవచ్చు. – మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి -
ప్రజాస్వామ్యం ఖూనీ
- నంద్యాల ప్రజలను, వైఎస్సార్సీపీ సానుభూతిపరులను బెదిరిస్తున్నారు - సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నంద్యాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘చంద్రబాబు హయాంలో నంద్యాలలో పట్టపగలు ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. కొద్ది రోజుల్లో ఉప ఎన్నిక జరుగుతోన్న నేపథ్యంలో అధికార పార్టీ ఓటమి భయంతో దాడులు, బెదిరింపులకు సిద్ధపడింది. పోలీసు బలగాన్ని ఉపయోగించి నంద్యాల ప్రజలు, వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. అర్ధరాత్రి దాటాక వైఎస్సార్సీపీ సానుభూతి పరుల ఇళ్లపై ఆకస్మిక తనిఖీల పేరిట దాడులు చేసి భయాందోళన సృష్టిస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది. సెర్చ్ వారంట్లు లేకుండానే పోలీసులు అర్ధరాత్రి దాటాక ఆకస్మిక తనిఖీలకు వెళ్లాల్సిన అవసరమేమొచ్చిందో స్పష్టం చేయాలి. ఇంట్లో ఏది ఉంటే అది సీజ్ చేయడం దారుణం. అధికార పార్టీ నేతలు మాత్రం ఓటర్లను ప్రలోభ పెడుతూ.. విచ్చలవిడిగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. వార్డులు.. గ్రామాల వారీగా రూ. 2 వేలు, 3 వేలు, 5 వేలు చొప్పున డబ్బులు పంచుతున్నారు. వారిపై ఎలాంటి దాడులు ఉండవు. ఎవరూ వారిని పట్టుకోరు. ఎవరు ఎవరిపై వేధింపులకు పాల్పడుతున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా?’ అని ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. శనివారం నంద్యాల టౌన్ హోలులో ఏర్పాటు చేసిన ఆర్య వైశ్యుల ఆత్మీయ సమావేశంలో, ఆ తర్వాత పెద్దబండ సత్రం సెంటర్ రోడ్‌షోలో జగన్ మాట్లాడారు. పదకొండో రోజు రోడ్‌షో సంజీవనగర్ రామాలయం నుంచి ప్రారంభమై.. శాంతినికేతన్ స్కూల్, శేషయ్య చికెన్ సెంటర్, డాక్టర్ శౌరిరెడ్డి హాస్పిటల్, బైటిపేట, పెద్దబండ సత్రం, తల్లిపీరు వీధి, నీలివీధి, రేణుక ఎల్లమ్మ టెంపుల్, మెయిన్ బజార్, పప్పులబట్టి బజార్ మీదుగా తెలుగుపేట వరకు సాగింది. చంద్రబాబు అరాచక పాలనకు ముగింపు పలకాలంటే శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించాలని జగన్ పిలుపునిచ్చారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. పొట్టి శ్రీరాములును ప్రభుత్వం విస్మరించింది.. రాష్ట్ర విభజనకు ముందు ఏటా నవంబర్ 1న పొట్టి శ్రీరాములు జయంతి ఎంతో ఘనంగా జరిగేది. మూడేళ్ల చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పొట్టి శ్రీరాములు జయంతిని జరుపుకోవడం మానేశారు. ప్రభుత్వం ఆయన్ను పూర్తిగా విస్మరించింది. ఆర్య వైశ్యులంటే దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో అభిమానం చూపేవారు. 2009లో రోశయ్యకు ఆరోగ్యం సహకరించక ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఆ తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేసిన ఘనత రాజశేఖరరెడ్డిదే. కులాలు, పార్టీలకు అతీతంగా నవరత్నాలు.. అవకాశం వస్తే దివంగత నేత రాజశేఖరరెడ్డిలా ప్రజలకు మంచి పరిపాలన అందించాలన్నదే నా లక్ష్యం. అందులో భాగంగా నవరత్నాల పథకాలను ప్రకటించాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ నవరత్నాలు అందాలి. అప్పుడు ఏ ఇంట్లోనూ అశాంతి అనేది ఉండదు. చిరునవ్వులు ఉంటాయి. కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు అని చూడకుండా ఆ పథకాలు అందరికీ అందించాలన్నదే నా తాపత్రయం. నంద్యాల రోడ్డు విస్తరణ పనులు చంద్రబాబు ఇష్టారాజ్యంగా చేశారు. పనులు చేపట్టే ముందు కనీసం వ్యాపారులను సంప్రదించలేదు. నష్టపరిహార విషయంపై చర్చించలేదు. రాత్రికి రాత్రే పోలీసులను పెట్టి భవనాలు కూలదోయించారు. అక్కడ మార్కెట్ ధర ప్రకారం సెంటు (48 గజాలు) స్థలం రూ.50 లక్షలు పలుకుతోంది. ఆయన మాత్రం ముష్టి వేసినట్లు గజానికి రూ.18 వేలే ఇస్తున్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో దుకాణాలు కోల్పోయి నష్టపోయిన వారికి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కెట్ ధర ప్రకారం పరిహారం అందజేస్తాం. వ్యాపారంలో కష్టనష్టాలు నాకు తెలుసు.. నంద్యాల పట్టణంలో కొందరి ఇళ్లను టార్గెట్ చేసుకుని.. సెర్చ్ వారంట్లు లేకుండా సోదాలు జరిపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? సత్యనారాయణ, రమేష్ లాంటి వాళ్ల ఇళ్లపై పోలీసులు రాత్రి వేళ దాడులు జరపాల్సిన అవసరమేముంది? పోనీ సోదాల్లో చివరికి ఏమైనా దొరికిందా అంటే అదీ లేదు. అమృత్‌రాజ్, నాగిరెడ్డి, జగదీశ్వరరెడ్డి, రామలింగారెడ్డి, లక్ష్మీనారాయణ, బాల హుస్సేన్, భువనేశ్వర్‌ల ఇళ్లపైనా దాడులు చేసి రూ.10 వేలు, రూ.20 వేలు సీజ్ చేశారు. ఈ దాడులకు సంబంధించి వారంట్ ఉండదు. ఒకేసారి 40, 50 మంది పోలీసులు బిలబిల మంటూ ఇళ్లలోకి వచ్చేస్తారు. వాళ్లను చూసి మహిళలు, పిల్లలు భయపడిపోతున్నారు. ప్రియతమ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోక ముందు వరకు నేనూ వ్యాపారాలు చేశాను. చైర్మన్‌గా సాక్షి పేపర్‌ను నడిపాను. సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాను. వ్యాపారం కష్టనష్టాలు నాకు తెలుసు. నంద్యాలలో వ్యాపారులు పడుతున్న కష్టాలు చూశాను. వారికి వైఎస్సార్సీపీ అండదండగా ఉంటుంది. మానవతా దృక్పథంతో మీకు నేను సాయం అందిస్తాను. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక వ్యాపారుల ను టార్గెట్ చేశారు. ప్రభుత్వ ఆదాయం పెంచుకో వడానికి కమర్షియల్ టాక్స్ అధికారులకు ఏటా లక్ష్యాలను పెట్టి వ్యాపారులపై దాడులు చేయిస్తు న్నారు. మూడున్నరేళ్లుగా ఈ కార్యక్రమం నిరాటం కంగా సాగుతోంది. వ్యాపారులు బాగా ఇబ్బందు లు పడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. చంద్రబాబు ఎవరినీ వదల్లేదు.. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం ఎన్నికల ముందు.. ఆ తర్వాత అన్ని విధాలుగా ప్రజలను మోసం చేశారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటలు.. ఎన్నికలయ్యాక వాటిని పక్కన పెట్టి ఏరకంగా ప్రజలను మోసం చేశారన్నది అందరికీ తెలిసిందే. ఎన్నికల ముందు రైతుల వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లను పూర్తిగా మాఫీ చేస్తానన్నారు. నేటికీ ఒక్క రూపాయి మాఫీ చేయలేదు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం బయటకు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలంటూ మోసపూరిత వాగ్దానాలతో రైతులను అతి దారుణంగా వంచించారు. వడ్డీనే ఏడాదికి రూ.15 వేల కోట్లు అవుతోంది. చంద్రబాబు మాత్రం రైతుకు ఏడాదికి రూ.3 వేలు మాత్రమే ఇచ్చి అదే రుణమాఫీ అని చెప్పి బొంకుతున్నారు. పొదుపు సంఘాల అక్క,చెల్లెమ్మలనూ మోసం చేశారు. వారి రుణాలకు సంబంధించి ఒక్క రూపాయి మాఫీ చేయలేదు. విద్యార్థులు, నిరుద్యోగులను కూడా వదిలి పెట్టలేదు. జాబు రాకపోతే నెలనెలా రూ.2 వేల చొప్పున ప్రతి ఇంటికీ నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఒక్క రూపాయి ఇవ్వలేదు. ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం.. పక్కా ఇల్లు కట్టిస్తానన్నారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో ఒక్క ఇల్లు కట్టించలేదు. బెల్టు షాపులు లేకుండా చేస్తాన న్నారు. అదీ చేయలేదు. కర్నూలు జిల్లా ప్రజల సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో మూడేళ్ల కిందట ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా అందరినీ మోసం చేశారు. ఇలాంటి చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సమయం ఆసన్నమైంది. నంద్యాల ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయాలి. ధర్మం, న్యాయం వైపు నిలిచి శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించాలి’’ అని జగన్ పిలుపునిచ్చారు. -
జీవితంలో నిజం చెప్పని వ్యక్తి చంద్రబాబు: వైఎస్ జగన్
►ఈ మూడేళ్లలో చంద్రబాబు ఒక్క హామీ అయినా అమలు చేశారా? ►రేషన్ షాపులో బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు ►మీ జగన్ అబద్ధం ఆడడు. మోసం చేయడు ►నాకున్నదల్లా వైఎస్ఆర్ ఇచ్చి పెద్ద కుటుంబమే నా ఆస్తి సాక్షి, నంద్యాల : ‘ఎవరినో ఎమ్మెల్యే చేయడానికి మనం ఓటు వేయడం లేదు. మూడేళ్లుగా చంద్రబాబు చేసిన మోసాలకు వ్యతిరేకంగా ఓటు వేస్తున్నాం. చంద్రబాబు చేసిన దుర్మార్గం, అన్యాయానికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నాం. హామీలు ఇచ్చి ప్రజలను వెన్నుపోటు పొడవటం న్యాయమేనా? నంద్యాలలో వైఎస్ఆర్ సీపీ పోటీ పెట్టకపోయి ఉంటే బాబు నంద్యాల వచ్చేవారా?. ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం ఇస్తామన్నారు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామన్నారు. ఇప్పటివరకు ఒక్క ఇళ్లు అయినా కట్టించారా? మూడేళ్ల పాలనలో పేదవాడికి ఒక్క ఎకరా అయినా భూమి ఇచ్చారా?. ఈ మూడున్నరేళ్లలో చంద్రబాబు ఒక్క హామీనైనా నెరవేర్చారా? వైఎస్ఆర్ హయాంలో రేషన్ షాపులకు వెళితే 9 రకాల సరుకులు ఇచ్చేవారు. చంద్రబాబు సీఎం అయ్యాక బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదు. ఎన్నికల ముందు బెల్టు షాపులు లేకుండా చేస్తామన్నారు. మూడేళ్లలో బెల్టు షాపులు తీసేయడం దేవుడెగురు. ప్రతి గ్రామంలో బెల్టు షాపులను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీధివీధికి ఓ బెల్టు షాపు, మెసేజ్ పెడితే మందు ఇంటికే. ఇదిగో ఇలా ఉంది చంద్రబాబు పాలన’ అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. నంద్యాల ఉప ఎన్నక ప్రచారంలో భాంగా శనివారం 11వ రోజు రోడ్ షోలో ఆయన పెద్దబండ వద్ద జగన్ ప్రసంగించారు. ఈ మూడేళ్లలో నంద్యాలను కాపాడటానికి ఒక్క రూపాయి అయినా చంద్రబాబు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు కావాలన్న చంద్రబాబు... అధికారంలోకి వచ్చాక హోదాను కూడా తీసుకురాలేదన్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారని, జాబు ఇవ్వకపోతే నెలకు రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి 38 నెలలు అయిందని, అంటే ఆయన ప్రతి ఇంటికి రూ.76వేలు బాకీ పడ్డారన్నారు. వైఎస్ జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే.... ‘రైతులకు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం బయటకు వచ్చిందా అని అడుగుతున్నా. చంద్రబాబు నిరుద్యోగ భృతి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారు. 2014 ఆగస్టు 14న సీఎం హోదాలో చంద్రబాబు కర్నూలు వచ్చారు. ఎయిర్‌పోర్టు, ట్రిపుల్ ఐటీ, స్మార్ట్ సిటీ, ఉర్దూ వర్సిటీ, మైనింగ్ స్కూల్ తెస్తామన్నారు. అలవికానీ హామీలను ఎన్నో చెప్పారు. సీఎం హోదాలో ఇచ్చిన హామీని ఏ ఒక్కటీ అమలు చేయలేదు. జీవితంలో నిజం చెప్పని వ్యక్తి చంద్రబాబు. మట్టి నుంచి ఇసుక నుంచి, గుడి భూములు, రాజధాని భూములు, విశాఖ భూములను కూడా వదలలేదు. చంద్రబాబులా నా దగ్గర డబ్బు, అధికారం, దుర్భద్ధి, పోలీసులు లేరు. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లుగా చూపే చానళ్లు, పేపర్లు నా దగ్గర లేవు. ఆయన మాదిరిలా నా దగ్గర సీఎం పదవి లేదు. నాకున్నదల్లా దివంగత నేత వైఎస్ఆర్ ఇచ్చి పెద్ద కుటుంబమే నా ఆస్తి. వైఎస్ఆర్ సంక్షేమ పథకాల అమలుతో ప్రజల గుండెల్లో బతికుండటమే నా ఆస్తి. మీ జగన్ అబద్ధం ఆడడు. మోసం చేయడు. మాట మీద నిలబడే విశ్వసనీయతే నా ఆస్తి. విలువలతో కూడిన రాజకీయాలే నా ఆస్తి. జగన్ వాళ్ల నాన్న మాదిరే మాటపై నిలబడతాడన్న విశ్వసనీయతే నా ఆస్తి. నాన్న మాదిరే గొప్ప పరిపాలన అందిస్తాడనే నమ్మకం నాకున్న ఆస్తి. దేవుడి దయ, మీ ఆశీస్సులు నాకు కావాలి. రాజకీయాల్లో జవాబుదారితనం రావాలి. రాబోయే రోజుల్లో చంద్రబాబు అవినీతి సొమ్ముతో మీ దగ్గరకు వస్తాడు. ఆ అవినీతి సొమ్ములోంచి రూ.5వేలు మీ చేతిలో పెట్టి ఒట్టు వేయించుకుని మరీ డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తాడు. దెయ్యాలతో గొడవ పడాల్సిన పనిలేదు. మనసులో దేవుడిని తలుచుకోండి. ధర్మంవైపే నిలిచి శిల్పా మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించండి’ అని కోరారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సంబంధిత కథనం : అర్ధరాత్రి పోలీసు దాడులపై వైఎస్ జగన్ ఆగ్రహం -
జీవితంలో నిజం చెప్పని వ్యక్తి చంద్రబాబు
-
అర్ధరాత్రి పోలీసు దాడులపై వైఎస్ జగన్ ఆగ్రహం
- మహిళలు, చిన్నపిల్లల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు - వారెంట్లు లేకుండా ఇళ్లలోకి వచ్చే హక్కు మీకు ఎవరిచ్చారు? - మోసకారి చంద్రబాబుకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది - నంద్యాలలో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశంలో వైఎస్సార్సీపీ అధినేత నంద్యాల: అర్ధరాత్రి ఇళ్లపై దాడులు చేస్తోన్న పోలీసులు.. కుటుంబాల్లోని మహిళలు, చిన్నపిల్లలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. నంద్యాల పట్టణంలో కొందరి ఇళ్లను టార్గెట్ చేసుకుని.. సెర్ఛ్వారెంట్లు లేకుండా సోదాలు జరిపే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ఆగ్రహించారు. శనివారం నంద్యాల టౌన్ హాలులో జరిగిన ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాలకు చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు, నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి, ఇతర కీలక నేతలంతా పాల్గొన్నారు. ‘సత్యనారాయణ, రమేశ్ లాంటి వాళ్ల ఇళ్లపై పోలీసులు రాత్రి వేళల్లో దాడులు జరపాల్సిన అవసరమేముంది? పోనీ సోదాల్లో చివరికి ఏమైనా దొరికాయా అంటే, అదీ లేదు. ఇంట్లో ఏది దొరికితే దానిని సీజ్ చేస్తారు. అమృతరాజ్, నాగిరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, రామలింగారెడ్డి, లక్ష్మీనారాయణ, బాల హుస్సేన్, భువనేశ్వర్‌ల ఇళ్లపైనా దాడులు చేసి రూ.10 వేలు, రూ.20 వేలు సీజ్ చేశారు. ఈ దాడులకు సంబంధించి ఒక వారెంట్ ఉండదు, ఒకేసారి 40,50 మంది పోలీసులు బిలబిలా ఇళ్లలోకి వచ్చేస్తారు. వాళ్లను చూసి మహిళలు, పిల్లలు భయపడిపోతున్నారు’ అని వైఎస్ జగన్ ఆవేదన చెందారు. మోసం చేస్తోన్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి: ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క దానినీ నెరవేర్చకుండా గడిచిన మూడున్నర సంవత్సరాలుగా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు.. సమాజంలోని అన్నివర్గాలనూ చంద్రబాబు మోసం చేశారు. 2014లో ముఖ్యమంత్రి హోదాలో కర్నూలులో జెండా ఎగరేసి, జిల్లాకు చాలా హామీలిచ్చారు. వాటిలో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదన్న సంగతి జిల్లా వాసులకు తెలిసిందే. ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబుకు ప్రజలు గుర్తొస్తారు. మోసకారి చంద్రబాబుకు బుద్ధిచెప్పాల్సిన సమయం వచ్చింది’ అని వైఎస్ జగన్ అన్నారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అర్ధరాత్రి పోలీసు దాడులపై వైఎస్ జగన్ ఆగ్రహం
-
చావు రాజకీయాలు చేస్తున్నారు
► టీడీపీ నాయకులపై శిల్పా మోహన్‌రెడ్డి ధ్వజం ► వైఎస్ జగన్ రోడ్‌షోలో ప్రసంగం సాక్షి బృందం నంద్యాల: టీడీపీ నాయకులు చావు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి అన్నారు. నంద్యాల సాయిబాబానగర్‌లో శుక్రవారం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన రోడ్‌షోలో శిల్పా ప్రసంగించారు. ‘ఈ నెల 23న ఉప ఎన్నికల పోలింగ్ ఉంది. గత ఎన్నికల్లో వారం పాటు సిటీ కేబుల్‌లో శోభానాగిరెడ్డి మరణానికి సంబంధించిన ఘటనలు చూపించారు. ఈ కారణంగా అప్పటి ఎన్నికల్లో ఓడిపోయినా, తిరిగి అదే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు కూడా చనిపోయిన భూమానాగిరెడ్డి, శోభానా గిరెడ్డిని టీవీల్లో చూపుతూ చావు రాజకీయాలతో మీ ముందుకు వస్తున్నారు. ఈ సమయంలోనే అక్కా చెల్లెమ్మలు, అన్నలు, తమ్ముళ్లు విజ్ఞత ప్రదర్శించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి. 2019లో జగన్మోహన్రెడ్డి సీఎం కావడానికి æ నంద్యాల ఎన్నికలే నాంది కావాలి’ అని పిలుపునిచ్చారు. ‘వైఎస్జగన్మోహన్రెడ్డి సభలు, రోడ్‌షోలకు మహిళలను రానివ్వకుండా రూ.300 నుం చి రూ.500 వరకు డబ్బు చెల్లించి అడ్డుకుంటున్నారు. సభలు జయప్రదం కాకూడదని ఇలా చేస్తున్నారు. అయినా లెక్క చేయకుండా జగన్మోహన్రెడ్డిపై, నాపై అభిమానంతో ఎంతో మంది తరలివచ్చారు. వైఎస్సార్సీపీ బలాన్ని ఎదుర్కోలేక టీడీపీ కుల , మత రాజకీయాల చేస్తోంది. నా పేరు ప్రతిష్టలు కూడా దెబ్బతీసేలా ఆరోపణలు చేస్తున్నారు. ఎవరినీ ఒక్క మాట కూడా అనకున్నా ఏవేవో అన్నట్లు చిత్రీకరిస్తున్నారు’ అని శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు . ‘20ఏళ్లుగా పేదల సంక్షేమం కోసం శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో పైసా తీసుకోకుండా గ్రామాలు, పట్టణంలో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశాం. ఉచితంగా మినరల్ వాటర్ సరఫరా చేస్తున్నాం. వడ్డీలేకుండా, పావలా వడ్డీతో రుణాలు ఇస్తున్నాం. సూపర్ మార్కెట్లో సరుకులు అందిస్తున్నాం. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ప్రజలకు సేవ చేస్తున్నాం. వ్యాపారంగానీ, బ్రాందీషాపులు కాని, పర్సెంటేజీలు గాని తీసుకోలేదు. ప్రస్తుతం టీడీపీ నాయకులు డబ్బుతో పలువురిని కొనుగోలు చేస్తున్నారు. పోలీసులతో బెదిరిస్తున్నారు. ఓటు వేయకపోతే రేషన్‌కార్డులు, పింఛన్లు పోతాయంటూ జనాన్ని బెదిరిస్తున్నారు. ఒక్కసారి రేషన్‌కార్డు, పింఛన్ వస్తే ఆ వివరాలు ఆన్లైన్లో ఉంటాయి. వాటి ఆధారంగా కోర్టుకు వెళ్లయినా సరే తిరిగి సాధిస్తాం. ఎవరికీ భయపడకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి’ అని శిల్పా మోహన్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగన్ చలువతోనే మంత్రి పదవి వైఎస్ జగన్మోహన్రెడ్డి చలువతోనే వైఎస్సార్ హయాంలో మంత్రి పదవి పొందినట్లు శిల్పా మోహన్‌రెడ్డి తెలిపారు. తాను మంత్రిగా ఉన్న సమయంలోనే దేవనగర్ క్రాస్‌రోడ్, వెంకటేశ్వర స్టోర్, పార్కురోడ్ సెంటర్, నాగులకట్ట తదితర కాలనీలను అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. ఈ కాలనీల వాసులు 2004లో మోకాళ్లలోతు గుంతలతో విద్యుత్ లేక పూరిగుడిసెల్లో నివశించేవారన్నారు. దీంతో వాటి అభివృద్ధికి హామీ ఇచ్చానని, ఇచ్చిన మాట మేరకు నెరవేర్చానని చెప్పారు. పీవీ నరసింహారావు, నీలం సంజీవరెడ్డి లాంటి నాయకులను గెలిపించిన ఘనత నంద్యాల ఓటర్లదని, మరోమారు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. తన సోదరుడు చక్రపాణిరెడ్డి వంద రోజులు కూడా ఎమ్మెల్సీ పదవి అనుభవించకుండా రాజీనామా చేసి జగన్మోహన్రెడ్డి వెంట నడిచారని, దమ్ముంటే వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను ఇదే తరహాలో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం చంద్రబాబుకు సవాలు విసిరారు. రాష్ట్రంలో పేదల అభ్యున్నతి జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమవుతుందని, ఫ్యాను గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు -
చంద్రబాబు ఎందులో డిగ్రీ చేశారో తెలుసా?: వైఎస్ జగన్
ఆత్మకూరు: మోసం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిగ్రీ చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. కులాలు, మతాల పేరిట మనుషుల్ని వాడుకోవడం, ఏరు దాటాకా తెప్ప తగలేయడం చంద్రబాబు చేసిన డిగ్రీ అని ఆయన వ్యాఖ్యానించారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఎనిమిదో రోజు బుధవారం ఆత్మకూరు జంక్షన్ వద్ద వైఎస్ జగన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. ఎన్నికలు వస్తే చాలు. మనకళ్లకు గంతలు కడతారు. చంద్రబాబు ఏం చెప్పినా ఆహా, ఓహో అంటూ తన పేపర్లు, టీవీలు చెప్పేస్తాయి. తీరా ఏరు దాటాక ఆ విషయాలపై ఎవరైనా నిలదీసి అడిగితే చంద్రబాబు చిందులు తొక్కుతారు. ఎవరైనా కొంచెం గట్టిగా అడిగితే గ్లోబెల్ ప్రచారం చేస్తారు. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడలో మున్సిపల్ ఎన్నికలు సందర్భంగా కాపులను పిలిచి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి, మరోవైపు వెన్నుపోటు పొడుస్తున్నారు. 2014లో మైనార్టీలకు సంబంధించి ఓ డిక్లరేషన్ ఇచ్చారు. మైనార్టీలకు 15 సీట్లు ఇస్తా, ఉద్యోగాల్లో 6 శాతం రిజర్వేషన్లు, పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య. రూ.2500 కోట్లతో మైనార్టీ సబ్‌ప్లాన్ ప్రవేశపెడతా అని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో మైనార్టీలకు ఒక్క రూపాయి అయినా పెట్టారా?. చంద్రబాబు నైజం వాడుకోవడం ఆ తర్వాత తోసేయడం. అలా ఎన్నిసార్లైనా వాడేసుకుంటారు. మళ్లీ అదే అబద్ధాలు చెప్పేస్తారు. ఎన్నికలప్పుడు ఏం చెప్పారు. ఎన్నికల తర్వాత ఏం చేశారు?. అబద్దాలతో అధికార పీఠం ఎక్కి ఆ తర్వాత రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేశారు. ఈ మూడేళ్లలో పేదలకు ఒక్క ఇల్లు అయినా కట్టించారా? చంద్రబాబు నైజం గురించి సొంత మామ ఎన్టీఆర్ చక్కగా చెప్పారు. జామత దశమ గ్రహం అని. జామతా అంటే అల్లుడు. ...9 గ్రహాలుంటే నా అల్లుడు పదో గ్రహం అని ఎన్టీఆర్ అన్నారు. 2014 ఆగస్టు 15న ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కర్నూలు వచ్చారు. సీఎం నోటి నుంచి మాట వస్తే అయిపోతుందని అనుకుంటం కదా?. కర్నూలుకు ఎయిర్‌పోర్టు తెస్తామన్నారు. ట్రిపుల్ ఐటీ అన్నారు. స్మార్ట్ సిటీ, ఉర్దూ వర్సిటీ, మైనింగ్ స్కూల్, అవుకు వద్ద ఇండస్ట్రియల్ పార్క్, ఆదోని, ఎమ్మిగనూరులో అపెరల్ పార్క్‌లు, కర్నూలులో సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి, ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. అవన్నీ ఏమయ్యాయి. సీఎం హోదాలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదు. నంద్యాల ఉప ఎన్నిక వచ్చేసరికి మరోసారి మోసం చేయాలని చూస్తున్నారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా అని అడుగుతున్నా. మళ్లీ ఇవాళ నంద్యాలలో ఎన్నికలు వచ్చాయి. అందుకే ప్రజలతో పని పడింది. మళ్లీ అరిగిపోయిన పాత టేప్‌రికార్డర్ ఆన్ చేస్తున్నారు. అవే అబద్ధాలు, అవే మోసాలు. ప్రతి ఇంటికి మారుతీ కారు, కేజీ బంగారం అంటారు. రేపొద్దున నేను చెప్పిన ప్రతిమాట చేశాననే బొంకుతారు. సిగ్గులేకుండా బొంకుతుంటే ఇలాంటి వ్యక్తిగా ఓటు వేసేది. ఆయనలా నాకు అధికారం, డబ్బులు, సీఎం పదవి, పోలీసుల బలం లేదు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపే పేపర్లు లేవు. కానీ ఇవాళ నాకున్న ఆస్తి నాన్న ఇచ్చిన ఇంత పెద్ద కుటుంబం. నాకున్న ఆస్తి సంక్షేమ పథకాల అమలుతో ప్రతి గుండెలో ఉండటమే. జగన్ మోసం చేయడు, అబద్ధం ఆడడు. ఏదైనా చెప్పాడు అంటే చేస్తాడు అనే విశ్వసనీయత అదే నా ఆస్తి. నాన్న మాదిరిగానే చెరగని ముద్ర వేసుకోవాలి. దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులే నాకున్న ఆస్తి. అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. లంచాల రూపంలో లక్షల కోట్లు దోచుకున్నారు. ఇప్పుడా డబ్బులో కొంత నంద్యాల ఉప ఎన్నిక కోసం ఖర్చు చేయడానికి వస్తున్నారు. చంద్రబాబు పంపిన డబ్బు మూటలతో దెయ్యాలు మీ ఇంటికి వస్తాయి. చేతిలో రూ.5వేలు పెట్టి.. ఆ తర్వాత జేబులో నుంచి దేవుడి పటం తీసీ చేతిలో పెట్టి... దేవుడి మీద ప్రమాణం చేయించుకుని మరీ డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తారు. ఏ దేవుడు కూడా పాపానికి ఓటు వేయమని చెప్పడు, అలా చెప్పిదెయ్యాలే డబ్బులు ఇచ్చినప్పుడు దేవుడిని ప్రార్థించి లౌక్యంగా ఓటేయండి. ధర్మానికి, న్యాయానికే ఓటు వేయండి. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని మీ దీవెనలు, ఆశీస్సులు అందించి గెలిపించండి.అని పిలుపునిచ్చారు. -
చంద్రబాబు ఎందులో డిగ్రీ చేశారో తెలుసా?
-
చంద్రబాబూ..అభివృద్ధి అంటే ఇదేనా..?
-
నంద్యాలలో జననేతకు ప్రజల బ్రహ్మరథం
-
అధికారం కోసం ఎవరినైనా మోసం చేస్తాడు
చంద్రబాబుపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం - అధికారం కోసం అందరినీ మోసం చేసిన ఘనుడు - మూడన్నరేళ్లలో లక్షల కోట్ల ప్రజల సొమ్ము దోచుకున్నాడు - పేదలకు రూ.3 లక్షల ఫ్లాట్‌ను రూ.6 లక్షలకు కట్టబెడతాడట - డబ్బుల మూటలతో వస్తున్నారు.. లౌక్యంగా వ్యవహరించండి - చెప్పింది చేస్తాడన్న విశ్వసనీయతే నాకున్న ఆస్తి నంద్యాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘చంద్రబాబు అధికారం కోసం ఎవరినైనా మోసం చేస్తాడు. ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. గత ఎన్నికల్లో గెలవడానికి రైతులు చేసిన రూ.86,612 కోట్ల రుణాలను మాఫీ చేస్తానన్నాడు. డ్వాక్రా అక్క, చెల్లెమ్మలకు సంబంధించి రూ.14 వేల కోట్లను పూర్తిగా మాఫీ చేస్తానన్నాడు. ఓట్ల కోసం చదువుకున్న యువతనూ వదిలి పెట్టలేదు. ఇంటింటికీ నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి.. 38 నెలలుగా ప్రతి ఇంటికి రూ.76 వేల చొప్పున బాకీ పడ్డాడు. అధికారంలోకి రావడం కోసం అన్ని సామాజిక వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు. ముఖ్యమంత్రి హోదాలో కర్నూలుకు వచ్చినపుడు అనేక హామీలు ఇచ్చి జిల్లా ప్రజలను మోసం చేశాడు. ఇచ్చిన హామీల్లో నేటికీ ఒక్కటంటే ఒక్క హామీని నెరవేర్చక పోవడం ఆయన మోసకారి తనానికి నిదర్శనం. ముఖ్యమంత్రిగా స్వాతంత్య్ర దినోత్సవం నాడు అబద్ధాలు ఆడే గొప్ప వ్యక్తి ఆయన ఒక్కడే’ అని ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఐదవ రోజు ఆదివారం రోడ్‌షో నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్ నుంచి ప్రారంభమై ఏడవ వార్డులోని వెంకప్ప అంగడి మీదుగా 8, 9, 10, 11, 12వ వార్డుల్లో సాగింది. నంద్యాల ఉప ఎన్నిక ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధమని, నంద్యాల ప్రజలు ధర్మం వైపే నిలబడాలని.. రాబోయే కురుక్షేత్ర మహా సంగ్రామానికి ఇక్కడి నుంచే నాంది పలకాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. మీరు వేసే ఓటు రాజకీయ వ్యవస్థను మార్చబోతోంది.. మోసాలు చేసి డబ్బుతో ఓటు కొనుగోలు చేయవచ్చని అనుకునే వారికి బుద్ధి చెప్పేలా ఉంటుంది.. ఈ ఉప ఎన్నిక బరిలో నిలిచిన శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించి మార్పునకు నాంది పలకాలని కోరారు. శ్రీనివాస సెంటర్, గుడిపాటిగడ్డ సెంటర్లలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ఏకగ్రీవానికి అంగీకరించి ఉంటే ఒక్క రూపాయి ఇచ్చేవాడు కాదు.. ‘‘ఉప ఎన్నికల బరిలో వైఎస్సార్సీపీ తన అభ్యర్థిని పోటీలో నిలబెట్టింది కాబట్టే నంద్యాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.కోట్లు కేటాయించాడు. అదే పోటీ పెట్టకుండా.. ఏకగ్రీవానికి అంగీకరించి ఉంటే.. ఈవేళ నంద్యాల రోడ్లపై ముఖ్యమంత్రి, ఆయన తనయుడు, వారి కేబినెట్ మొత్తం కనిపించేది కాదు. సీనియర్ నాయకులు లాడ్జీల్లో తిష్ట వేసేవారు కాదు. అధికారం కోసం ఏ మోసానికైనా సిద్ధపడే చంద్రబాబు.. ఉప ఎన్నికల కోసం తాను మూడున్నరేళ్ల పరిపాలనలో దోచుకున్న లక్షల కోట్ల రూపాయల్లో కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టబోతున్నాడు. పేదల ఇల్లు.. అతి పెద్ద స్కాం! ప్రతీ పేదవాడికి 3 సెంట్ల స్థలం.. పక్కా ఇల్లు కట్టిస్తానన్నాడు. కానీ ఒక్క ఇల్లు కట్టించలేదు. ఇప్పుడు కట్టించబోతున్నానంటున్నాడు. అందులోనూ చంద్రబాబు మార్కు అవినీతి ఉంది. అతిపెద్ద స్కాంకు పక్కాగా స్కెచ్ వేశాడు. పేదల కోసం కేవలం రూ.3 లక్షల వ్యయమయ్యే ఫ్లాట్‌ను బాబు రూ.6 లక్షలకు కట్టిస్తానంటున్నాడు. ఒక ఫ్లాట్ కట్టడానికి ఒక చదరపు అడుగుకు మహా అయితే రూ.1000 అవుతుంది. చంద్రబాబు కట్టించి ఇస్తానంటున్న 300 చదరపు అడుగుల ఫ్లాట్‌కు రూ.3 లక్షలు మాత్రమే ఖర్చవుతుంది. మిగిలిన రూ.3 లక్షలు పేదల నెత్తిన వేస్తున్నాడు. కేవలం తన మామూళ్ల కోసం ధర రూ.6 లక్షలకు పెంచేశాడు. బినామీ కాంట్రాక్టర్‌కు మాత్రం అడుగుకు రూ.2075 చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. దీనిని అభివృద్ధి అంటారా? అభివృద్ధి అంటే ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేయడం. లౌక్యంగా వ్యవహరించండి.. చంద్రబాబు తన మూడున్నరేళ్ల పాలనలో ప్రజల నుంచి దోచుకుని అవినీతి డబ్బుల మూటలతో నంద్యాల ఓటర్లను కొనుగోలు చేయడానికి వస్తున్నాడు. ఓటుకు రూ.5 వేల చొప్పున ఇచ్చి.. చేతిలో దేవుని పటం పెట్టి ప్రమాణం చేయిస్తాడు. ఏ దేవుడు పాపానికి ఓటు వేయమని చెప్పడు. దెయ్యాలు మాత్రమే ఆ మాట చెబుతాయి. కాబట్టి మీ వద్దకు తెలుగుదేశం నాయకులు వచ్చినప్పుడు ధర్మం వైపే ఉంటామని మనసులో తలుచుకోండి. దెయ్యాల దగ్గర లౌక్యంగా వ్యవహరించండి. అంతిమంగా మీరు ధర్మానికే ఓటు వేసి శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించండి. మోసం చేసే వారిని ప్రజలు కాలరు పట్టుకుని నిలదీస్తారనే భయం రాజకీయ నేతల్లో కలగాలి. అప్పుడే రాజకీయాల్లో విశ్వసనీయత వస్తుంది. అధికారం కోసం నేను చంద్రబాబులా అబద్ధాలు ఆడను. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం నాకు చేతకాదు. జగన్ చెప్పింది చేస్తాడన్న విశ్వసనీయతే నాకున్న ఆస్తి అని గర్వంగా చెప్పగలను. దివంగత నేత రాజశేఖరరెడ్డి నాకు ఇచ్చిన ఇంత పెద్ద కుటుంబమే నా ఆస్తి. చంద్రబాబులా రైతులను, డ్వాక్రా అక్క చెల్లెమ్మలను, విద్యార్థులను మోసం చేసే గుణం నాలో లేదు. ప్రతి పేదవాడిలో చిరునవ్వు.. రైతుల మొహంలో ఆనందం.. అవకాశం వస్తే తొమ్మిది నవరత్నాలను ప్రతి ఇంటికీ అందించి వారిని బాగుపరుస్తానన్న నమ్మకమే నా ఆస్తి’’ అని జగన్ అన్నారు. -
'చంద్రబాబు వల్లే అక్కచెల్లెమ్మల కళ్లల్లో కన్నీళ్లు'
నంద్యాల : ఉప ఎన్నికలు రాకముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు ఒక్కసారైనా నంద్యాల వచ్చారా అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. నేడు ఉప ఎన్నికలు వచ్చాయి కాబట్టే వారికి నంద్యాల గుర్తొచ్చిందని, తండ్రికొడుకులు ఇద్దరు ఇప్పుడు నంద్యాల రోడ్లపై కనిపిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీని తట్టుకోలేక ఏపీ కేబినెట్ మొత్తం నంద్యాల్లో దిగిందని అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఐదో రోజు నంద్యాల రోడ్‌షోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంద్యాలలోని శ్రీనివాస సెంటర్లో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ చంద్రబాబు అవినీతి, అన్యాయాలను తూర్పారబట్టారు. అందరినీ మోసం చేశారు అధికారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చారు. రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేశారు. బ్యాంకుల గడప తొక్కలేని స్థితిలో డ్వాక్రా మహిళలు ఉన్నారు. నేడు రాష్ట్రంలో మహిళల కళ్లల్లో కన్నీళ్లకు కారణం చంద్రబాబే. మూడున్నారేళ్లలో చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. జాబు రావాలంటే బాబు రావాలని, జాబు రాకుంటే నెలకు రూ.2వేల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి చివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. విద్యార్థులను కూడా చంద్రబాబు మోసం చేశారు. ప్రతి ఇంటికి నేడు రూ.76 వేలు బాకీ పడ్డారు. ఆఖరికి పేదవారిని కూడా ఆయన వదిలిపెట్టలేదు. ఒక్క ఇళ్లయినా కట్టించారా..? ప్రతి పేదవాడికి మూడు సెంట్ల భూమి ఇస్తానని అన్న చంద్రబాబు పేదవారికి ఒక్క ఇళ్లయినా ఇప్పటి వరకు కట్టించలేదు. అధికారం కోసం చంద్రబాబు ప్రజలను వాడుకుంటున్నారు. ఏ ఒక్క సామాజిక వర్గానికి కూడా న్యాయం చేయలేదు. చంద్రబాబు తీరుతో ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కర్నూలు జిల్లాకు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. రైతును మోసం చేసేందుకు గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పిన బాబు ఆ పనిచేయలేదు. ఎన్నికలుంటేనే చంద్రబాబుకు గుర్తొస్తారు.. ఎన్నికలుంటేనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రజలు గుర్తొస్తారు. నంద్యాల ఉప ఎన్నిక వచ్చింది కాబట్టే చంద్రబాబుకు మళ్లీ ప్రజలు గుర్తొచ్చారు. మరోసారి మోసం చేసేందుకు మళ్లీ టేపు రికార్డర్ ఆన్ చేశారు. ఎక్కడైనా రోడ్ల విస్తరణ జరుగుతుంది. అది అభివృద్ధి కాదు. ఎవరిని అడగకుండా షాపులను కూల్చేస్తారు. నాకున్న ఆస్తి మీరే చంద్రబాబులాగా నా దగ్గర డబ్బు, అధికారం, దుర్బుద్ది, పోలీసులు లేరు. లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చూపించే టీవీ చానెళ్లు పేపర్లు నా వద్ద లేవు. నాకున్న ఆస్తి నాన్నగారు ఇచ్చిన పెద్ద కుటుంబమే. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో బతికుండటమే నాకున్న ఆస్తి. మీ జగన్ అబద్ధం ఆడడు. మోసం చేయడు. మాట మీద నిలబడే విశ్వసనీయతే నా ఆస్తి. విలువలతో కూడిన రాజకీయాలే నా ఆస్తి. నవరత్నాలతో వెలుగు నింపుతా నవరత్నాలతో అందరి జీవితాల్లో వెలుగు నింపుతాను. ఒక్క అవకాశం ఇస్తే నాన్న మాదిరిగా అందరి గుండెల్లో ముద్ర వేసుకుంటాను. బిల్డింగ్లు కూల్చేయడం, రోడ్లు తవ్వడం అభివృద్ది కాదు.. రైతుల, పేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే నిజమైన అభివృద్ధి. నంద్యాల ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటాను. నంద్యాల ప్రజలను నేను ఒక్కటే కోరుతున్నాను. ధర్మానికే ఓటెయ్యండి. న్యాయాన్ని గెలిపించండి. మీ ఓటుతో నేను వెంటనే ముఖ్యమంత్రిని కాకపోవచ్చు. కానీ, ఏడాది తర్వాత జరిగే కురుక్షేత్రానికి నంద్యాల ఎన్నిక నాంది కావాలి. లౌక్యంగా ఓటు వేయండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డబ్బు మూటలతో మీ దగ్గరకు వస్తారు. ఈ మూడున్నరేళ్లలో దోచుకున్న అవినీతి సొమ్మును తీసుకొస్తారు. రూ.5వేలు ఇచ్చి దేవుడి పటం చూపించి ప్రమాణం చేయించుకుంటారు. ఏ దేవుడు కూడా పాపానికి ఓటేయమని చెప్పడు.. అలా దెయ్యాలే చెబుతాయి. రూ.5వేలు మీ చేతుల్లో పెట్టినప్పుడు దేవుడిని ప్రార్థించి లౌక్యంగా ఓటెయ్యండి. ధర్మానికి ఓటెసి న్యాయాన్ని గెలిపించండి. -
'బాబు వల్లే అక్కచెల్లెమ్మల కళ్లల్లో కన్నీళ్లు'
-
నంద్యాలలో ప్రారంభమైన వైఎస్ జగన్ పర్యటన
సాక్షి బృందం, నంద్యాల: ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదో రోజు రోడ్ షో ఆదివారం నంద్యాల పట్టణంలో ప్రారంభమైంది. శ్రీనివాస సెంటర్, వెంకప్ప అంగడిల మీదుగా బాలాజీ కాంప్లెక్స్, పైప్‌లైన్ రోడ్, సింగ్ కాలనీ, ఫరూక్నగర్, చౌరస్తా వరకు రోడ్‌షో కొనసాగుతోంది. అక్కడి నుంచి ఫరూక్ నగర్, ఎన్ఆర్ఎస్ మూర్తి హాస్పిటల్, స్కావెంజర్స్, బాల్కొండహాల్, సంచిబట్టల సందు మీదుగా రోడ్‌షో కొనసాగనుంది. వెంకటేశ్వర దేవాలయం సెంటర్, గుడిపాటిగడ్డ సెంటర్, మేడం వారి వీధి, జుమ్మా మసీదు, గాంధీచౌక్‌ల మీదుగా కల్పనా సెంటర్, ఫళాని కూల్‌డ్రింక్స్ సందు, ముల్లాన్‌పేట వరకు రోడ్‌షో కొనసాగి, అనంతరం బైర్మల్‌వీధి, మున్సిపల్ హైస్కూల్ సెంటర్, చాంద్‌బాడ మీదుగా నిర్వహించనున్నారు. -
వెల్లువెత్తిన ప్రజాదరణ
♦ జగన్ రోడ్‌షోకు భారీ స్పందన ♦ రాఖీలు కడుతూ, హారతులిస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ స్వాగతం పలికిన మహిళలు గోస్పాడు: ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన రోడ్‌షోకు ప్రజాదరణ వెల్లువెత్తింది. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని ఒంటివెలగల, గోస్పాడు, శ్రీనివాసపురం, యాళ్లూరు, ఎం.కృష్ణాపురం గ్రామాల్లో శనివారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఆయనకు రాఖీలు కడుతూ, హారతులిస్తూ, సెల్ఫీలు తీసుకుంటూ బ్రహ్మరథం పట్టారు. ఒంటివెలగలలో ప్రారంభమైన రోడ్‌షో ఎం.కృష్ణాపురం వరకు 16 కి.మీ పొడవునా 8గంటల పాటు జరిగింది. ఏ గ్రామానికి వెళినా దారి పొడవునా ప్రజలు జగన్‌ను కలిసేందుకు ఉత్సాహంతో వేచి చూశారు. ఆప్యాయంగా పలకరింపు.. జగనన్న వస్తున్నారని తెలుసుకొని పొలాల్లో పనిచేస్తున్న మహిళలు రోడ్లపైకి వచ్చి ఆయనతో మాట్లాడారు. జగన్ కూడా వారిని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. పెన్షన్లు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా గ్రామాల్లో ప్రజలనుద్దేశించి జగన్ మాట్లాడుతున్నంత సేపు యువకులు కేరింతలు కొడుతూ, చేతులు ఊపుతూ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సీఈసీ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ప్రహ్లాదరెడ్డి, మండల కన్వీనర్ వంగూరి భాస్కరరెడ్డి, ద్వారం వీరారెడ్డి, ఎంపీపీ రాజశేఖర్‌రెడ్డి, పామిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, నాగమోహన్‌రెడ్డి, అరవింద ప్రసాద్, రాజారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, సర్పంచ్ కోటిరెడ్డి, రామసుబ్బారెడ్డి, బెక్కెం నాగేశ్వరరెడ్డి, నారాయణ, నాగేశ్వరరావు, సైమాన్, ముక్కమళ్ల భాస్కరరెడ్డి, ముక్కమళ్ల అశోక్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, భక్తవత్సలరెడ్డి, కూలూరు ప్రసాద్, చిన్ననరసింహారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, వంగూరి రామనాథరెడ్డి, గడ్డం ప్రసాద్, పార్థసారథిరెడ్డి, సర్వేశ్వరరెడ్డి, శివానందరెడ్డి, న్యాయవాదులు ద్వారం మాధవరెడ్డి, వివేకానందరెడ్డి, రామసుబ్బారెడ్డి, సూర్యప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలు ఉంటేనే ప్రజలు గుర్తొస్తారా
- రోడ్‌షోలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం - మూడున్నరేళ్లలో ఏ ఒక్క హామీనీ బాబు నెరవేర్చలేదు - నంద్యాల ప్రజలు న్యాయం వైపే నిలబడాలి నంద్యాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో దారుణమైన పాలన సాగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ బాబు నెరవేర్చలేదు. మూడున్నరేళ్లలో ఎక్కడా అభివృద్ధి జరగలేదు. రెండు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాలను కూల్చివేయడమే అభివృద్ధి్ద అంటూ ఫోజులు కొట్టుకోవడం చంద్రబాబుకే చెల్లింది. ఎన్నికలుంటేనే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొస్తారు. ఎన్నికలున్నా లేకపోయినా రైతులు, ప్రజలు, అక్కచెల్లెమ్మల మొహాల్లో ఎప్పుడూ చిరునవ్వులు చూడటమే నిజమైన అభివృద్ధి. నాకు అవకాశం వస్తే అభివృద్ధి అంటే ఏంటో నేను చేసి చూపిస్తా..’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నాల్గవరోజైన శనివారం రోడ్ షో గోస్పాడు మండలంలోని ఒంటెలగల గ్రామం నుంచి ప్రారంభమై గోస్పాడు, శ్రీనివాసపురం, యాళ్లూరు మీదుగా ఎం. కృష్ణాపురం వరకూ సాగింది. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ వాగ్దానాన్నీ అమలు చేయలేదు కాబట్టే.. చంద్రబాబు, ఆయన కొడుకుతోపాటు కేబినెట్ మొత్తం నంద్యాల రోడ్ల్లపై తిరిగే పరిస్థితి వచ్చిందని జగన్ అన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతి సామాజికవర్గాన్నీ మోసం చేశారని విమర్శించారు. ‘ఎన్నికల హమీలలో ఒక్కటీ అమలు కాలేదని ప్రశ్నించే వారిపై కన్నెర్రజేస్తాడు. జైలుకు పంపిస్తానంటాడు. ఇలాంటి వ్యక్తికి ఉరిశిక్ష విధించినా తప్పేమీ కాదు’ అని అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక న్యాయానికీ అన్యాయానికీ మధ్య జరుగుతున్న యుద్ధమని.. చివరకు న్యాయమే గెలుస్తుందని జగన్ పేర్కొన్నారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ సారాంశం ఇదేనని వ్యాఖ్యానించారు. నంద్యాల ప్రజలు ధర్మం, న్యాయం వైపు నిలబడాలని.. నంద్యాల బరిలో ఉన్న శిల్పామోహన్‌రెడ్డిని గెలిపించుకుని రానున్న కురుక్షేత్ర ఎన్నికలకు నాంది పలకాలని ప్రజలకు జగన్ పిలుపునిచ్చారు. రోడ్‌షోలో భాగంగా గోస్పాడు, యాళ్లూరు, ఎం. కృష్ణాపురం గ్రామాల్లో వైఎస్ జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. మోసం చేసేవాడు కావాలా..? మాట మీద నిలబడే వాడు కావాలా? ‘‘ఇవాళ రాష్ట్రంలో దారుణమైన పాలన సాగుతోంది. ఇరిగేషన్ నుంచి మద్యం దాకా.. మట్టి నుంచి ఇసుక దాకా.. గుడి భూముల నుంచి రాజధాని భూముల దాకా దోచిన సొమ్ముతో ఎవరినైనా కొనొచ్చనే అహంకారం చంద్రబాబులో పెరిగిపోయింది. ఆయనకు కళ్లు నెత్తిన ఉన్నాయి. ఎన్నికల ముందు ఒక మాట చెబుతారు. ఎన్నికలైన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబులా అధికారం కోసం ఏ గడ్డి అయినా తినడానికి నా మనస్తత్వం ఒప్పుకోదు.. ఎన్నికల్లో గెలవడానికి ప్రజల్ని మోసం చేసినా పర్వాలేదనే గుణం నా దగ్గర లేదు. చంద్రబాబు పాలనపై, చేసిన మోసాలపై, అన్యాయాలపై ఓటు వేస్తా ఉన్నాం. మోసం చేసే వాడు కావాలా.. మాట మీద నిలబడే వాడు కావాలా ప్రజలే నిర్ణయించుకోవాలి. నంద్యాల ఎన్నికల్లో మళ్లీ అవే బొంకులు..! సీఎంగా 2014 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు కర్నూలు జిల్లాకు అనేక హామీలు గుప్పించారు. ఎయిర్‌పోర్టు, ఉర్దూ వర్శిటీ అన్నారు. కర్నూలును స్మార్ట్ సిటీగా చేస్తానన్నారు. త్రిపుల్‌ఐటీ, కర్నూలు ఆస్పత్రిని స్విమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీగా, రైల్వే వ్యాగన్ల మరమ్మతు ఫ్యాక్టరీ, మైనింగ్ కళాశాల, ఫుడ్‌పార్క్, హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్, టైక్స్‌టైల్ పార్కులు, గుండ్రేవుల ప్రాజెక్టు ఇలా అలవి కాని వాగ్దానాలు ఇచ్చాడు. ఒక్కటీ నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేశాడు. ఇప్పుడు మళ్లీ నంద్యాలలో అవే బొంకులు.. అవే వాగ్దానాలు. ఇప్పుడు దోచిన సొమ్ములో కొంత తీసుకొచ్చి నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటర్లను, చిన్నాచితక నేతలను కొనుగోలు చేసేందుకు టీడీపీ నేతలు వస్తున్నారు.. రూ. 5వేలు చేతిలో పెట్టి ఓటు వేయమని అడుగుతున్నారు. ఏ దేవుడూ పాపానికి ఓటు వేయమని చెప్పడు. పాపానికి ఓటు వేయమనేది దెయ్యాలు మాత్రమే. ధర్మం వైపే మేము ఉంటామని మనసులో తలచుకుని.. దెయ్యాల దగ్గర లౌక్యంగా వ్యవహరించి దుర్మార్గులను ఇంటికి పంపి ధర్మానికే ఓటు వేయండి’’ అని జగన్ అన్నారు. -
అబద్దాలతో మళ్లీ చంద్రబాబు మోసం చేస్తారు
-
‘జగన్ అబద్ధం ఆడడు.. ఏం చెప్తే అదే చేస్తాడు’
►ఎన్నికలప్పుడు చంద్రబాబు చెప్పిందేంటి.. ఇవాళ చేస్తుందేమిటి? ►అబద్దాలతో మళ్లీ చంద్రబాబు మోసం చేస్తారు.. ►దేవుడిని ప్రార్థించి లౌక్యంగా ఓటేయండి ►ధర్మం, న్యాయంవైపు నిలబడండి.. ►చంద్రబాబు సీఎం అయ్యాక వర్షాలు కూడా పడటం లేదు.. ►నాలుగో రోజు రోడ్ షో లో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం నంద్యాల: రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేశారని, రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న ఆయన మాటలు ఏమయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు మిర్చి పంటను కూడా నడిరోడ్డుపై తగలబెట్టే పరిస్థితి ఏర్పడిందని, చివరకు డ్వాక్రా అక్కాచెల్లెమ్మలను కూడా చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నాలుగో రోజు శనివారం వైఎస్ జగన్ రోడ్ షో... గోస్పాడు, శ్రీనివాసపురం, యాలూరు మీదగా కొనసాగింది. ఉద్యోగాల పేరుతో యువతను కూడా చంద్రబాబు మోసం చేశారని, జాబు రవాలంటే బాబు రావాలి అన్నారని, లేదంటే రూ.2వేల నిరుద్యోగ భృతి అన్నారు...ఏమైందని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ఇప్పటివరకూ ప్రతి ఇంటికి చంద్రబాబు రూ.76వేలు బాకీ పడ్డారన్నారు. పేదవారిని కూడా చంద్రబాబు వదిలిపెట్టలేదని, ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం ఇస్తామన్నారని, ఈ మూడున్నరేళ్లలో ఒక్క ఇల్లు అయినా కట్టించారా? అని అడిగారు. చంద్రబాబు సీఎం కాకముందు రేషన్ షాపుకు వెళితే తొమ్మిది రకాల సరుకులు ఇచ్చేవారని, కానీ బాబు సీఎం అయ్యాక బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదన్నారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు చెప్పిందేమిటి?..ఇప్పుడు చేస్తుందేమిటి?.. కర్నూలుకు ఎయిర్‌పోర్టు, ఉర్దూ వర్శిటీ, స్మార్ట్ సిటీ, ట్రిపుల్ ఐటీ, రైల్వే వ్యాగన్ల ఫ్యాక్టరీ, ఫుడ్ పార్క్, ఇండస్ట్రీయల్ సిటీ అన్నారని, అంతేకాకుండా రైతులను మోసం చేసేందుకు గుండ్రేవుల ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారని, వీటిలో చంద్రబాబు ఒక్క హామీనైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా చంద్రబాబు మళ్లీ వస్తున్నారని, మరోసారి మోసం చేసేందుకు మళ్లీ టేప్ రికార్డర్ ఆన్ చేస్తారని వైఎస్ జగన్ అన్నారు. నంద్యాలకు ఇది చేస్తా... అది చేస్తానంటూ మోసం చేస్తారని, హామీల పేరుతో ఇలా మోసాలు చేసే చంద్రబాబును ప్రశ్నించకూడదంట. ఇలాంటి వ్యక్తికి ఉరిశిక్ష విధించినా తప్పులేదు. చంద్రబాబులా నా దగ్గర డబ్బు, అధికారం, దుర్బుద్ధి, పోలీసులు లేరు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చూపే చానళ్లు, పేపర్లు నా దగ్గర లేవు. నాకున్న ఆస్తి నాన్నగారు ఇచ్చిన పెద్ద కుటుంబమే. వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే ఇప్పటికీ ప్రజల గుండెల్లోఉన్నాయి. జగన్ అబద్ధం ఆడడు.. ఏం చెప్తే అదే చేస్తాడు. జగన్ నాన్నాల రైతుల గురించి, అక్కచెల్లెమ్మల గురించి ఆలోచిస్తాడు. అవినీతి సొమ్ముతో మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు వస్తారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లే.. ప్రజలను కొనుగోలు చేయాలని చూస్తారు. మూటలు, మూటలు డబ్బులు పట్టుకుని వస్తారు. రూ.5వేలు ఇచ్చి, దేవుడి పటంపై ప్రమాణం చేయించుకుంటారు. అలాంటి సమయంలో దేవుడిని ప్రార్థించి లౌక్యంగా ఓటేయండి. ధర్మం, న్యాయంవైపు నిలబడండి. నవరత్నాలతో అందరి జీవితాల్లో వెలుగులు నింపుతా. మీ ఓటుతో నేను వెంటనే ముఖ్యమంత్రి కాకపోవచ్చు. కానీ ఏడాది తర్వాత జరిగే కురుక్షేత్రానికి ఈ ఎన్నికే నాంది. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి ఓటు వేసి ఆశీర్వదించండి’ అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. -
‘జగన్ అబద్ధం ఆడడు ఏం చెప్తే అదే చేస్తాడు’
-
తప్పుచేశావ్ చంద్రబాబూ!
-
తప్పుచేశావ్ చంద్రబాబూ!
♦ ప్రజలను మోసం చేసిన నిన్ను వదిలిపెట్టం ♦ ఈ నేరాలకు, మోసాలకు ఏ శిక్ష విధించినా తక్కువే అంటాం.. ♦ ఇలాంటి వ్యక్తికి ఉరిశిక్ష వేసినా తప్పులేదంటాం.. ♦ అధికారంలోకి రాగానే గుండ్రేవుల నిర్మిస్తాం ♦ నంద్యాల రోడ్ షోలో ప్రతిపక్షనేత సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికారంలోకి రావడం కోసం ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చి... అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తున్న చంద్రబాబును కచ్చితంగా ప్రశ్నిస్తామని, నిలదీస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో మైకు పట్టుకుని ఇచ్చిన హామీలను కూడా అమలు చేయని చంద్రబాబును నిలదీస్తూనే ఉంటామని....ఇలాంటి వ్యక్తికి ఎటువంటి శిక్ష వేయాలని జగన్ ప్రశ్నించారు. ‘అయ్యా చంద్రబాబు తప్పుచేశావు.... నిన్ను ప్రశ్నిస్తాం.... తప్పుచేసిన నిన్ను నిలదీస్తాం’ అని పేర్కొన్నారు. నీ నేరాలకు, నీ మోసాలకు ఏ శిక్ష విధించినా తక్కువే అని చెబుతూ ఉంటామన్నారు. అన్యాయాలు, మోసాలు చేసే వ్యక్తికి ఉరిశిక్ష వేసినా తప్పులేదు అని గట్టిగా అంటూనే ఉంటామని తేల్చిచెప్పారు. కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరించి నీరు అందించేందుకు అధికారంలోకి రాగానే గుండ్రేవుల ప్రాజెక్టును చేపడతామని ఆయన హామీనిచ్చారు. నంద్యాలను గుండెల్లో పెట్టుకుంటానని మాట ఇచ్చారు. శిల్పామోహన్‌రెడ్డికి వేసే ఈ ఓటుతో చంద్రబాబు గూబ గుయ్ మనాలని పిలుపునిచ్చారు. మీరు వేసే ఓటు జగన్‌కు అని గుర్తుపెట్టుకోవాలని కోరారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజు జగన్ రోడ్ షో నూనెపల్లె నుంచి ప్రారంభమై చాబోలు, సాంబవరం, దీబగుంట్ల, నెహ్రూనగర్, జిల్లెల్ల, కానాలపల్లె మీదుగా అయ్యలూరు వరకూ సాగింది. ఈ సందర్భంగా పలుచోట్ల మాట్లాడుతూ జగన్ ఏమన్నారంటే.. గుండ్రేవుల నిర్మిస్తాం... ‘‘గుండ్రేవుల ప్రాజెక్టును నిర్మిస్తానని ముఖ్యమంత్రి హోదాలో 2014 ఆగస్టు 15న స్వాతంత్య్రదినోత్సవ సాక్షిగా కర్నూలులో చంద్రబాబు హామీనిచ్చారు. ఈ మూడున్నరేళ్లలో కనీసం అటువైపు చూడలేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో కేసీకెనాల్‌కు రెండుకార్ల పంటలకు నీరు వచ్చేది. ఇప్పుడు ఒక్కకారు పంటకైనా నీరు వచ్చే పరిస్థితి ఉందా? చంద్రబాబు గుండ్రేవుల ప్రాజెక్టు కట్టే పరిస్థితి లేదు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘గుండ్రేవుల’ నిర్మిస్తాం. కేసీ కెనాల్‌కు మళ్లీ రెండు కార్లపంటలకు నీరు ఇస్తాం. అందరినీ మోసం చేశారు.. రైతులను, డ్వాక్రా మహిళలను, నిరుద్యోగులు అందరినీ చంద్రబాబు మోసం చేశారు. ఇంతకు ముందు రైతులకు వడ్డీలేని రుణాలు వచ్చేవి. ఇప్పుడు ఆ వడ్డీ డబ్బులను చంద్రబాబు ఒక చేత్తో లాక్కొని...దానికే రుణమాఫీ అని పేరు పెట్టి మోసం చేస్తున్నారు. ఇప్పుడు రుణాలు మాఫీ కాక వడ్డీ భారం పెరిగి రైతులు బ్యాంకుల గడప తొక్కే పరిస్థితి లేకుండా పోయింది. డ్వాక్రా మహిళలకు పావలావడ్డీ రుణాలు వచ్చేవి. ఇప్పుడు ఆ పావలా వడ్డీ సబ్సిడీ ఇవ్వకుండా పసుపు–కుంకుమ పేరుతో మోసం చేస్తున్నారు. ఇది అక్కాచెల్లెమ్మల కంట్లో ఉప్పూ–కారం కాదా? చదువుకుంటున్న పిల్లలకు ఉద్యోగం ఇస్తానని...ఇవ్వకపోతే రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. ఇప్పటికి చంద్రబాబు అధికారంలోకి వచ్చి 38 నెలలు అయ్యింది.. నాకు చంద్రబాబు రూ.76 వేలు బాకీ ఉన్నారని....కాలర్ పట్టుకుని అడుగుతానని యువభేరీ సభలో ఒక పిల్లాడు నాతో అన్నాడు. ఎమ్మెల్యేలకు డబ్బులు ఇస్తూ ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికి...కేసుల భయంతో మోదీ కాళ్ల మీద పడి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. ప్రత్యేక హోదా వస్తే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వచ్చేవి. ఇళ్లులేని పేదలకు 3 సెంట్ల స్థలం ఇస్తానని, ఇళ్లు కట్టిస్తానన్నారు. ఇప్పటివరకు ఒక్క ఇల్లైనా కట్టించారా? ముఖ్యమంత్రి హోదాలో కర్నూలుకు వచ్చి స్మార్ట్ సిటీ చేస్తా, ట్రిపుల్ ఐటీ, ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తా, మైనింగ్ యూనివర్సిటీ, చేనేత క్లస్టర్లు పెడతా, గుండ్రేవుల ప్రాజెక్టు కడతా అని హామీనిచ్చారు. ఏ ఒక్కటైనా అమలు చేశారా? ఇప్పుడు మళ్లీ నంద్యాలకు వచ్చి అది చేసేస్తాను...ఇదీ చేసేస్తానని హామీలిస్తున్నారు. ఏమీ అనకూడదంట... ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన హామీలను అమలు చేయని ఈ వ్యక్తిని ఏమీ అనకూడదంట. 21 మంది ఎమ్మెల్యేలను కొనుగోలుచేసినా, ఆ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించకపోయినా ఏమీ మాట్లాడకూడదంట. వేరే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను డిస్ క్వాలిఫై చేయకపోయినా, వాళ్లల్లో కొందరిని మంత్రులుగా చేసినా, రాజకీయాలు భ్రష్టు పట్టించినా ఎవ్వరూ మాట్లాడకూడదంట. చంద్రబాబు చట్టాన్ని పరిహాసం చేస్తున్నా ప్రశ్నిస్తే తప్పంట. రైతులను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను వెన్నుపోటు పొడిచినా అడగనే కూడదంట. నిరుద్యోగుల తరఫున మాట్లాడితే కేసులంట. ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు గురించి నేను ఒక్క మాట మాట్లాడితే టీవీలన్నీ ఊదరగొట్టేశాయి. నన్నా ఈ మాట అన్నది జగన్ అని చంద్రబాబు గింజుకున్నారు. అబ్బ.... ఎంత గింజుకున్నారంటే నాకే అర్థంకాలే. చంద్రబాబుకు ఒక్కటి చెప్పదలచుకున్నా. అయ్యా చంద్రబాబు తప్పుచేశావు. నిన్ను ప్రశ్నిస్తాం. తప్పుచేసిన నిన్ను నిలదీస్తాం. ఈ అన్యాయాలకు, మోసాలకు గాను నీకు ఏ శిక్ష విధించాలని అడుగుతూనే ఉంటాం. అంతేకాదు నీ నేరాలకు, నీ మోసాలకు ఏ శిక్ష విధించినా తక్కువే అని చెబుతూ ఉంటాం. ఇలాంటి అన్యాయాలు, మోసాలు చేసే వ్యక్తికి ఉరిశిక్ష వేసినా తప్పులేదు అని గట్టిగా అంటూనే ఉంటాం. ఏమయ్యా చంద్రబాబు...నేనేదో ఒక మాట అంటే తప్పు. మరి ఎన్నికలకు ముందు మాట ఇచ్చి మోసం చేసినప్పుడు అది తప్పు అనిపించలేదా? నిన్నేమన్నా అంటే దిష్టిబొమ్మలు కాల్పిస్తావు. మాట తప్పడం, మడమ తిప్పడం నీకున్న దురలవాటు. మాట తప్పకపోవడం, మడమ తిప్పకపోవడం నేను మా నాన్న దివంగత నేత రాజశేఖరరెడ్డి నుంచి నేర్చుకున్న అలవాటు’ అని జగన్ పేర్కొన్నారు. -
నా గుండెల్లో నంద్యాల
నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం.. వైఎస్ జగన్ హామీ - ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం - నంద్యాల ప్రజలు న్యాయంవైపు నిలబడాలి - బాబు మాదిరిగా అబద్ధాలు, మోసాలు నావల్ల కాదు - జగన్ మాట ఇస్తే తప్పడు.. చెప్పింది చేస్తాడు.. - ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్షనేత రోడ్ షో సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘నంద్యాలను నా గుండెల్లో పెట్టుకుంటా. అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా నంద్యాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తా. నంద్యాలను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దుతా’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. నంద్యాల ఉప ఎన్నికల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నరకు స్థానిక రైతు నగరం నుంచి ప్రారంభమైన జగన్ రోడ్ షో రాత్రి 9 గంటల వరకూ పసురుపాడు వరకూ సాగింది. ఈ సందర్భంగా అశేషంగా హాజరైన జనాన్ని ఉద్దేశించి జగన్ పలు చోట్ల ప్రసంగించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్టబట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్ద పెద్ద నేతలు నంద్యాల రోడ్లపై తిరుగుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ఎన్నిక ఏకగ్రీవం చేసి ఉంటే వీరంతా నంద్యాలవైపు తొంగిచూసేవారా అని ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యే సీటును గెలిపించేందుకు జరుగుతున్నవి మాత్రమే కావని... మూడున్నరేళ్ల చంద్రబాబు దుర్మార్గ, అవినీతి, అసమర్థ, అన్యాయ, అధర్మపాలనకు వ్యతిరేకంగా జనం వేస్తున్న ఓటు అని పేర్కొన్నారు. ఈ ఓటు ద్వారా నంద్యాల ప్రజలు ధర్మం, న్యాయం వైపు నిలిచారని రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలని పిలుపునిచ్చారు. ‘‘మీరు వేసే ఓటుతో నేను సీఎం కాకపోవచ్చు. కానీ ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మోసాలకు, అన్యాయానికి, అబద్ధాలకు, అధర్మానికి, అవినీతికి వ్యతిరేకంగా మీరు ఓటు వేస్తున్నారు. ఇవాళ జరిగే ఈ ఉప ఎన్నికలు... రాబోయే కురుక్షేత్ర మహా సంగ్రామానికి నాంది పలకాలని కోరుతున్నా’’ అని జగన్ పిలుపు నిచ్చారు. చంద్రబాబు మాదిరిగా తన దగ్గర డబ్బుల మూటలు, పోలీసు బలగం, ముఖ్యమంత్రి పదవి, బాకా చానళ్లు, పత్రికలు లేవని.... దివంగత ముఖ్యమంత్రి, నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డి మీద మీకున్న అభిమానం. నాన్న సంక్షేమపథకాలు ఇంకా మీ గుండెల్లో బతికే ఉండడమే తనకున్న ఆస్తి అని పేర్కొన్నారు. ‘‘జగన్ అబద్ధం ఆడడు. జగన్ మోసం చేయడు... జగన్ మాట ఇస్తే తప్పడు. జగన్ ఏదైనా చెబితే చేస్తాడు అన్న విశ్వసనీయ రాజకీయాలే నాకు ఉన్న బలం’’ అని ఆయన వివరించారు. అహంకారంతో చంద్రబాబుకు కళ్లు నెత్తికి ఎక్కాయి. డబ్బుతో ఎమ్మెల్యేల మాదిరిగా ప్రజలనూ కొనవచ్చునని అనుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు మొట్టికాయలు వేసి... అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు శిల్పా మోహన్ రెడ్డి మీద చూపించి ఫ్యాను గుర్తుకు ఓటెయ్యాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే... అన్ని వర్గాలకూ మోసమే...! ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ వాగ్దానాన్నీ చంద్రబాబు అమలు చేయలేదు. ఇవాళ నంద్యాల ఉప ఎన్నికలు వచ్చేసరికి మళ్లీ టేప్ రికార్డర్ ఆన్ చేశారు. నంద్యాలకు అది చేసేస్తాను...ఇది చేసేస్తాను అని మొదలుపెట్టారు. మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు మాదిరిగా మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం నా చేతగాదు. నిజంగా నాకు ఆ గుణమే ఉంటే...నేను కూడా నిన్నటి ఎన్నికల్లో చంద్రబాబు మాదిరిగా రైతులందరికీ రుణాలన్నీ మాఫీ చేస్తానని అని ఉంటే బహుశా ఆ ముఖ్యమంత్రి సీట్లో నేను కూర్చొని ఉండేవాడినేమో. ఆ రోజు ఎంత ఒత్తిడి వచ్చినా నా నోట్లో నుంచి అబద్ధాలు రాలేదు. మోసం చేయడం చేతకాలేదు. నేను ఈ రోజు ఒక్క హామీ ఇస్తున్నా. సంవత్సరం, సంవత్సరన్నరలో కురుక్షేత్ర సంగ్రామం రాబోతోంది. ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మోసాలకు, అన్యాయానికి, అబద్దాలకు, అధర్మానికి, అవినీతికి వ్యతిరేకంగా మీరు ఓటు వేస్తున్నారు. ఇవాళ జరిగే నంద్యాల ఉప ఎన్నికలు... రాబోయే కురుక్షేత్ర సంగ్రామానికి నాంది పలకాలని కోరుతున్నా. న్యాయం, ధర్మం వైపు నిలబడాలని కోరుతున్నా. నంద్యాల ప్రజలు ధర్మం, న్యాయం వైపు నిలబడ్డారని రాష్ట్ర ప్రజలకు తెలపండి. మీరు వేసే ఓటు కేవలం ఒక ఎమ్మెల్యేను ఎన్నుకోవడానికి మాత్రమేకాదు... ఇటువంటి మోసగాళ్లను మేం క్షమించం. ఇటువంటి అవినీతిపరులు మాకొద్దు అని ఓటు వేస్తున్నాం అని తెలియజేయడానికి.. చంద్రబాబు మాదిరిగా నా దగ్గర డబ్బుల్లేవు. నా దగ్గర ముఖ్యమంత్రి పదవి లేదు. పోలీసుల బలం నా దగ్గర లేదు. లేనిది ఉన్నట్టుగా...ఉన్నది లేనట్టుగా చూపించే టీవీ చానళ్లు నా దగ్గర లేవు. అలా రాసే పేపర్లు నా దగ్గర లేవు. చంద్రబాబు మాదిరిగా నా దగ్గర దుర్బుద్ధ్ది లేదు. అధికారం కోసం ఎంతకైనా దిగజారిపోయే మనస్తత్వం అంతకన్నా లేదు. నాకున్న ఆస్తి దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి....నాన్నగారి మీద మీకున్న అభిమానం. నా కున్న ఆస్తి నాన్నగారు చేసిన ఆ సంక్షేమపథకాలు ఇంకా మీ గుండెల్లో బతికే ఉండటం. జగన్ అబద్ధ్దం ఆడడు. జగన్ మోసం చేయడు. జగన్ మాట ఇస్తే తప్పడు. జగన్ ఏదైనా చెబితే చేస్తాడు అన్న విశ్వసనీయత నాకున్న ఆస్తి. విలువలతోకూడిన రాజకీయాలు చేయడం నాకున్న ఆస్తి. నవరత్నాలతో జగన్ కూడా ప్రతీ పేదవాడి ఇంట్లో వాళ్ల నాన్న మాదిరిగానే వెలుగులు నింపుతాడు అన్న నమ్మకం నాకు న్న ఆస్తి. నాకున్న ఆస్తి దేవుడి దయ. మీ అంద రి ఆశీస్సులు. నంద్యాలకు అన్నిరకాలుగా తోడుగా ఉంటా. నా గుండెల్లో పెట్టుకుంటా. డబ్బుల మూటలతో వస్తారు.. రాబోయే రోజుల్లో చంద్రబాబు మూటలు మూటలు డబ్బులతో వస్తారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో విపరీతంగా సంపాదించిన ఆ డబ్బులతో విపరీతంగా పంచే కార్యక్రమం చేస్తారు. ఎమ్మెల్యేలను ఏ విధంగా కొనుగోలు చేశాడో... మళ్లీ ప్రజలను అదేమాదిరిగా కొనుగోలు చేసేదానికి డబ్బుల మూటలతో వస్తాడు. ధర్మానికి, న్యాయానికి ఓటు వేయండి. చంద్రబాబు మాటలను మళ్లీ నమ్మకండి. ఆయన మాటలకు మోసపోకండి. చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపే రోజు కూడా తొందరలోనే ఉంది అని చెబుతున్నా.’’ అని జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. -
'ప్రశ్నిస్తే జగన్ మనుషులని అంటున్నారు'
-
'ప్రశ్నిస్తే జగన్ మనుషులని అంటున్నారు'
ఎం చింతకుంట్ల : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఎవరు ప్రశ్నించినా వారిని జగన్ మనుషులని చంద్రబాబునాయుడు అంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సాయంత్రం గోస్పాడు మండలం, ఎం చింతకుంట్ల గ్రామంలో మాట్లాడిన వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని దింపిందికాబట్టే ఇప్పుడు ఏపీ కేబినెట్ మొత్తం నంద్యాల రోడ్లపై వాలిందన్నారు. తాము ఏకగ్రీవం అంటే ఒక్కరైనా నంద్యాల ముఖం చూసేవారా అని ప్రశ్నించారు. ఇన్ని రోజులు గుర్తుకురాని నంద్యాల ప్రజలు ఇప్పుడెందుకు వారికి గుర్తొస్తున్నారని నిలదీశారు. చంద్రబాబు నైజం అందరికీ తెలిసిందేనని మోసం, దగా ఆయన అలవాట్లని అన్నారు. నంద్యాల చుట్టుపక్కల నియోజకవర్గాల ఎమ్మెల్యేలంతా ఎప్పుడు పైకి పోతారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని సాక్షాత్తు భూమానాగిరెడ్డి బావమరిది అన్నారని, వారు పోతే ఉప ఎన్నికలు వచ్చి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకోవచ్చని చూస్తున్నారని అభిప్రాయపడ్డారని గుర్తు చేశారు. చంద్రబాబు గొప్పగా చెప్పుకునే పని ఏ ఒక్కటీ చేయలేదని, ఆయనను ఎవరైనా నిలదీస్తే వారిపై కళ్లెర్ర జేసి 'నువ్వు జగన్ మనిషివి' అంటున్నారని మండిపడ్డారు. కడుపుమండిన రైతులు ప్రశ్నించినా, దగాపడిన అక్కచెల్లెమ్మలు అడిగినా, మోసపోయిన యువత, విద్యార్థులు ప్రశ్నించినా వారిని కూడా 'మీరంతా జగన్ మనుషులే' అని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే వారంతా చంద్రబాబునాయుడిని బంగాళఖాతంలో కలుపుతారని స్పష్టం చేశారు. 2014 ఆగస్టు 15న సీఎం హోదాలో కర్నూలు వచ్చి జెండా ఎగురేసిన చంద్రబాబు మైకు పట్టుకొని ఏవేవో చేస్తానని చెప్పి వాటిల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఎండగట్టారు. చంద్రబాబుకోసం వచ్చే మంత్రులంతా కూడా దెయ్యాలని, ధర్మానికి ఓటు వేసి అధర్మాన్ని ఇంటికి పంపాలని చెప్పారు. చంద్రబాబు అవినీతికి, అన్యాయానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. రాబోయే కురుక్షేత్రానికి నంద్యాల ఉప ఎన్నిక నాంది కావాలని, ఓటు ద్వారా చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని సూచించారు. ఎమ్మెల్యేలలాగే ఓట్లు కొనాలని చంద్రబాబు చూస్తున్నారని, ఓటుకు రూ.5వేలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని, అలాంటి దుర్మార్గుడిని ఓటు ద్వారా ఇంటికి పంపాలని వైఎస్ జగన్ కోరారు. -
‘నంద్యాలను నా గుండెల్లో పెట్టుకుంటా’
-
జనసంద్రంగా మారిన రైతు నగర్
-
జనసంద్రంగా మారిన రైతు నగర్
నంద్యాల: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంద్యాల ఉప ఎన్నిక ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బుధవారం ఆయన నంద్యాల మండలం రైతునగర్‌లో రోడ్ షో నిర్వహించారు. వైఎస్ జగన్ రాకతో రైతునగర్ జనసంద్రంగా మారింది. పార్టీ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ...‘ మీ అందరి దీవెనలు, ఆశీస్సులు వైఎస్ఆర్ సీపీకి ఉండాలి. పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి మద్దతు తెలపాలి. ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్నది నంద్యాల ఉప ఎన్నిక. నంద్యాల ఉప ఎన్నిక జరగకపోయి ఉంటే మంత్రులు నంద్యాలలో తిష్ట వేసేవారా?. చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. రుణమాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. అబద్ధాలతో చంద్రబాబు అందరినీ మోసం చేశారు. చంద్రబాబులా మోసం చేయడం నాకు చేతకాదు. ఆయనలా నాకు అబద్ధాలు చెప్పడం రాదు. చంద్రబాబులా అబద్ధాలు చెప్పి ఉంటే ఆ స్థానంలో నేనే ఉండేవాడిని. ప్రతి పార్లమెంట్‌ను ఒక జిల్లా చేస్తూ 25 జిల్లాలు చేయబోతున్నాం. నంద్యాలను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దుతాం. ఇచ్చిన హామీని తప్పకుండా అమలు చేస్తాం. ఏడాదిన్నరలో కురుక్షేత్ర యుద్ధం రాబోతుంది. నంద్యాల ఉప ఎన్నికలో వేసే ఓటు ఆ మహా సంగ్రామానికి నాంది పలకాలి. అందరికి ఉపయోగపడేలా నవరత్నాలను మనం ప్రకటించుకున్నాం. నవరత్నాలను ప్రతి ఇంటికి చేరాలి. కేసీ కెనాల్లో నీరు లేక సతమతమవుతున్నారు. చంద్రబాబుకు చూపించి అడగండి. ఆయన నోట్లో నుంచి ఒక్క నిజం కూడా రాదు. చంద్రబాబుకు ఒక ముని శాపం ఉంది. నిజం చెబితే ఆయన తల వెయ్యి ముక్కలవుతుందట. నంద్యాలలో ధర్మానికి ఓటు వేస్తారనే సంకేతం అందరికీ వెళ్లాలి.’ అని కోరారు. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి ఓటు వేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు. కాగా వైఎస్ జగన్ ను చూసేందుకు వచ్చిన మహిళలను ఆయన వాహనం దిగి పలకరించారు. -
నంద్యాలలో న్యాయం గెలిచింది: శిల్పా మోహన్ రెడ్డి
నంద్యాల : నంద్యాలలో న్యాయం గెలిచిందని వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. కుట్రలు, కుతంత్రాలతో టీడీపీ విష ప్రచారం చేసిందని ఆయన మండిపడ్డారు. కాగా టీడీపీ ఎన్ని అభ్యంతరాలు, కుట్రలు చేసినప్పటికీ శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ... స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కుట్రలను ప్రోత్సహిస్తున్నారు. బూత్‌ల వారీగా మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ప్రలోభాలకు గురి చేస్తూ కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ సీపీదే విజయం... శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ ఆమోదంపై వైఎస్ఆర్ సీపీ నేతలు శిల్పా చక్రపాణిరెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ...‘నంద్యాలలో టీడీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్‌ను తిరస్కరించేలా టీడీపీ కుట్రలు పన్నిందని, ఎన్నికల నిబంధనల మేరకే శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారన్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా నంద్యాలలో వైఎస్ఆర్ సీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. సిగ్గుంటే 21మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. టీడీపీ పతనం ప్రారంభం.. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ నేతలు మాట్లాడుతూ... ‘ ఇవాళ్టి నుంచే నంద్యాలలో టీడీపీ పతనం ప్రారంభం. రిటర్నింగ్ అధికారి నిర్ణయం టీడీపీకి చెంపపెట్టు. అభ్యంతరాల పేరుతో టీడీపీ విష ప్రచారం చేసింది. ఓటమి భయంతోనే కుట్రలు, కుతంత్రాలు పన్నారు. చిన్న విషయాన్ని ఎల్లో మీడియా చిలువలు పలువలు చేసింది. నామినేషన్ ఆమోదం కష్టమేనంటూ టీడీపీ నేతలు లీకులు ఇచ్చారు. నామినేషన్ల సమయంలోనే టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. విష ప్రచారంతో నామినేషన్ చెల్లకుండా చేయాలని చూశారు. చివరకు న్యాయమే గెలిచింది. చంద్రబాబు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. నంద్యాలలో ఎంతకైనా దిగజారేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. ఇప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకోవాలి. చంద్రబాబు ఆటలను సాగనివ్వం. నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డికి ఎదురే లేదు. .’ అని అన్నారు. -
నంద్యాలలో న్యాయం గెలిచింది
-
శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్ ఆమోదం
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. టీడీపీ అభ్యంతరాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తోసిపుచ్చారు. నోటరీ రెన్యువల్ అంశాన్ని, స్టాంప్ పేపర్‌పై అదనపు అఫిడవిట్ ఇవ్వలేదంటూ టీడీపీ మెలికపెట్టినప్పటికీ వాటిని.. ఈసీ పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో రెండు గంటలపాటు టీడీపీ మీడియా దుష్ప్రచారానికి ఈసీ పుల్‌స్టాప్ పెట్టినట్లు అయింది. కాగా నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల పరిశీలన నేటితో ముగిసింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు కుట్రలకు ఎన్నికల కమిషన్ చెంపపెట్టులా సమాధానం ఇచ్చినట్లు అయిందన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయాలని ఎల్లో బ్యాచ్ ఆలోచనలకు ఈసీ బ్రేక్ వేసిందని ఆయన వ్యాఖ్యానించారు. నామినేషన్ల దగ్గర కూడా రాజకీయంగా లబ్ధి పొందాలని చూడటం దుర్మార్గమన్నారు. ధైర్యంగా పోరాటం చేయలేక టీడీపీ సాకులు వెతుకుతుందని అంబటి విమర్శించారు. నంద్యాలలో గెలవడానికి వెయ్యి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ కూడా ఈసీ ఆమోదించింది. -
ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది
-
శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్ దాఖలు
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శిల్పా మోహన్‌రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్య నేతలతో కలిసి ఆయన తన నివాసం నుంచి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. వైఎస్సార్సీపీ తరఫున శిల్పా మోహన్‌రెడ్డి మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి కూడా రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ సిద్ధం శివరాం, కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్, ముస్లిం మైనార్టీ నాయకుడు ఇసాక్, కానాల విజయశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నాయకులకు శిల్పా మోహన్ సవాల్
-
శిల్పా మోహన్‌రెడ్డి సవాల్
కర్నూలు: నంద్యాలలో గెలవకుంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని వైఎస్సార్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి ఓడితే మంత్రి భూమా అఖిలప్రియ రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. తన సవాల్‌ను స్వీకరించే దమ్ము టీడీపీ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. రాజీనామా విషయంలో తనకు డ్రామాలు తనకు చేతకాదని, అందుకే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ పంపానని మోహన్‌రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. శాసనమండలి మండలి చైర్మన్‌కు రాజీనామా లేఖ పంపినట్టు ఆయన వెల్లడించారు. పార్టీ ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ము టీడీపీకి ఉందా అని ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా నంద్యాలలో తమదే గెలుపని విశ్వాసం వ్యక్తం చేశారు. శిల్పా కుటుంబం ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని చెప్పారు. 'దేవుడిచ్చిన దాంట్లో ఎంతోకొంత సమాజానికి మేం తిరిగి ఇస్తున్నాం. ఇన్నేళ్లు మచ్చలేని రాజకీయాలు చేశాం. ఇకపై కూడా నంద్యాల ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటామ'ని చక్రపాణిరెడ్డి అన్నారు. -
నామినేషన్ దాఖలు చేసిన శిల్పా మోహన్‌రెడ్డి
-
నేడు శిల్పా మోహన్‌రెడ్డి నామినేషన్
-
నంద్యాలలో వైఎస్సార్ సీపీ బహిరంగ సభ
-
అఖిలప్రియ అనాథ ఎందుకయ్యారు?
నంద్యాల: వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే నంద్యాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని నంద్యాల ఉప ఎన్నిక వైఎస్సార్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి కోరారు. నంద్యాల ఎస్పీజీ మైదానంలో గురువారం వైఎస్సార్ సీపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే తప్పనిసరిగా నంద్యాలను ప్రత్యేక జిల్లాగా చేయాలని కోరుతున్నాను. ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి. మీరు నంద్యాలను ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తే అభివృద్ధి పథంలో దూసుకుపోతాం. ఈ రోజు అఖిలప్రియను అడుగుతున్నాను. సిటీ కెబుల్ మీదే.. నంద్యాలలో సాక్షి టీవీ ఎందుకు రావడం లేదు. ఐదేళ్లు టీవీ9ను బంద్ చేశారు. ఈ రోజు సాక్షి ప్రసారాలు బంద్ చేశారు. అనాధ బిడ్డలను ఆశీర్వదించమని బోర్డులు పెట్టుకొని తిరుగుతున్నారు. మీ తండ్రిని ఎవరైనా చంపారా? మీ తండ్రి ఎంత మందిని అనాథలుగా చేశారో గుర్తు చేసుకోండి. ఆ కుటుంబం పరిస్థితి ఏందో ఆలోచించండి. ఉప ఎన్నికల వేళ చంద్రబాబు నంద్యాలపై ప్రేమ ఒలకబోస్తున్నట్టు నటిస్తున్నారు. ఇదే దీబగుంట్లకు చంద్రబాబు వచ్చినప్పుడు రోడ్ల విస్తరణ గురించి అడిగాను. చాలా సందర్భాల్లో అడిగాను. ఆ రోజు అమరావతికి డబ్బులు లేవు అన్నారు. మీ వద్ద డబ్బులు ఉంటే సగం పెట్టుకోమని చెప్పారా? లేదా? ఆ రోజు డబ్బులు లేవని, ఈ రోజు ఉప ఎన్నిక ఉందని హడావుడిగా రోడ్డు విస్తరణ పనులు మొదలు పెట్టారు. పక్కా ఇళ్ల్లకు ఎన్ని అర్జీలు వచ్చాయే చెప్పండి. ఆ రోజు ఉచితంగా ఇళ్లు కట్టిస్తానని భూమా మాట ఇచ్చారు. ఆ మాట తప్పారు. ఫరూక్ ముస్లింల వద్ద నాపై విష ప్రచారం చేస్తున్నారు. ముస్లింలకు తోడుగా ఉండింది నేనే. ఎన్నో షాదీఖానాలు, మసీదులు నిర్మించాను. ఎంతో సాయం చేశాను. ఈ రోజు ముస్లింల పేరుతో విష ప్రచారం చేస్తున్నారు. శిల్పా ఏ ముస్లిం సోదరుడిని కూడా అవమానించలేదు. తప్పుగా మాట్లాడలేదు. కరీం, ఇస్సాక్, మగ్బుల్, చాంద్ వంటి పెద్దలు ఉన్నారు. ఆ రోజు రౌడిషీట్ విషయంలో బెయిల్ ఇప్పించింది నేనే. ఎంపీ ఎస్పీవైరెడ్డి, ఫరూక్ ఊర్లో ఉండి కూడా ముస్లింలను పలకరించేందుకు స్టేషన్‌కు వెళ్లలేదు. నేను ఆ రోజు ఊర్లో లేక పలకరించలేకపోయాను. ముస్లింలను ఎప్పుడు అగౌరవపర చలేదు. ఒక వేళ ఏదైనా చిన్న గాయం చేసినా క్షమించమని మనస్ఫూర్తిగా ముస్లింలను కోరుతున్నాను. రాజకీయాలను మతాలకు, కులాలకు వాడుకోవద్దని టీడీపీ నాయకులను కోరుతున్నాను. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాకు రాజకీయ భిక్ష పెట్టారు. అందుకే ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడ్డాం. నేను కానీ, నా తమ్ముడు గానీ ఊపిరి ఉన్నంత వరకు వైఎస్ జగన్ కుటుంబం కోసం, నంద్యాల ప్రజల కోసం ప్రాణాలు అర్పిస్తామని హమీ ఇస్తున్నాన’ని శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. -
అఖిలప్రియ అనాథ ఎందుకయ్యారు?
-
నంద్యాలలో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయం
-
నా ధర్మం కొద్దీ తమ్ముడిని కలిశాను
-
ఓటమి భయంతోనే దాడులు
►అధికార బలాన్ని ప్రయోగిస్తే ప్రజలు ఊరుకోరు ►చంద్రబాబు ప్రజాద్రోహి ►ఉప ఎన్నికలో టీడీపీకి గుణపాఠం తప్పదు ►వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ►ఇంటింటి ప్రచారానికి అపూర్వ స్పందన నంద్యాల అర్బన్: ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే అధికార పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయిస్తోందని వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి విమర్శించారు. ‘అధికార’ బలం ప్రయోగించి..ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, గట్టిగా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఆదివారం ఆయన నంద్యాల పట్టణంలోని 19, 20 వార్డులు, మండలంలోని రాయమాల్పురం, మునగాల గ్రామాల్లో నిర్వహించిన ప్రచారానికి విశేష స్పందన లభించింది. వందలాది మంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శిల్పా మోహన్‌రెడ్డి మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా చంద్రబాబు ప్రజాద్రోహిగా మిగిలారన్నారు. ఆయనకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గోరుకల్లు రిజర్వాయర్ నిర్మించి ఎస్సార్బీసీ ద్వారా మునగాల, రాయమాల్పురం, ఊడుమాల్పురం గ్రామాల రైతులకు సాగునీరు అందించారని గుర్తు చేశారు. రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడంతో ప్రజల్లో అసహనం పెరిగిపోయిందన్నారు. టీడీపీ ఓటమి పాలవుతుందని తెలిసి నాయకులకు పదవులు, కార్యకర్తలకు డబ్బు ఎర వేస్తున్నారన్నారు. నంద్యాల ప్రజలు విజ్ఞులు అని, ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పార్టీ సీఈసీ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు, మహిళలు, నిరుద్యోగులు.. ఇలా ప్రతి ఒక్కరినీ మోసం చేసిన చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో టీడీపీ డబ్బు సంచులు సిద్ధం చేసుకుందన్నారు. మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నిక ధర్మం, అధర్మం మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. ముస్లింలపై రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమ చూపుతుందన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముస్లింలకు చేసిన సేవలు ఎనలేనివన్నారు. అందుకే మైనార్టీలు ఎప్పుడూ వైఎస్సార్సీపీ వెంటే ఉంటారన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన మాట్లాడుతూ ఉప ఎన్నిక గెలుపును వైఎస్ జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇవ్వాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో 19వ వార్డు పార్టీ ఇన్చార్జ్ వై.భీమ్‌రెడ్డి, గోస్పాడు మాజీ ఎంపీపీ రాజశేఖర్‌రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు దేశం సుధాకర్‌రెడ్డి, సిమెంట్ ప్రసాదరెడ్డి, మహేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, నాజర్రెడ్డి, గోవిందరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, భూషణం, శ్రీనివాసగౌడ్, వెంకటేశ్వరగౌడ్, రాజగోపాల్‌రెడ్డి, బాల హుసేనయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఎన్ని కుట్రలు చేసినా నేను గెలవడం ఖాయం’
-
‘ఎన్ని కుట్రలు చేసినా నేను గెలవడం ఖాయం’
నంద్యాల: ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి శనివారం ఉదయం నంద్యాలలో ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘టీడీపీ నేతలకు ఏ వీధి ఎక్కడుందో తెలియదు. ఎన్నికలు రాగానే వాళ్లకు నంద్యాల గుర్తొచ్చింది. సమస్యలపై ఎన్నిసార్లు చంద్రబాబును కోరినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు రాగానే ఏదో చేస్తామని చెప్తున్నారు. ఇన్ని రోజులు నంద్యాలను ఎందుకు పట్టించుకోలేదు?. టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా నేను గెలవడం ఖాయం.’ అని స్పష్టం చేశారు. మరోవైపు నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 23న పోలింగ్, 28న కౌంటింగ్ జరగనుంది. ఇవాళ్టి నుంచి ఆగస్టు ఐదో తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉప సంహకరణకు ఆగస్టు 9 తుది గడువు. -
నంద్యాల గెలుపు.. రాజకీయాలకు మలుపు
►టీడీపీని చిత్తుగా ఓడించండి ►ఓటర్లకు వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి పిలుపు ►ఇంటింటి ప్రచారానికి విశేష స్పందన నంద్యాల అర్బన్: ‘దేశ రాజకీయాల్లో నంద్యాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. విలక్షణమైన తీర్పు ఇవ్వడం ఇక్కడి ప్రజల ప్రత్యేకత. ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించి రాజకీయాలను మలుపు తిప్పాల’ని వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ గురువారం ఆయన సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషా, మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, పార్టీ సీఈసీ మెంబర్ రాజగోపాల్‌రెడ్డితో కలిసి పట్టణంలోని 1, 2 వార్డుల పరిధిలో గల పీవీనగర్, అరుంధతినగర్, సంగపేట, మాల్దారిపేట తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నేతలకు స్థానికులు పూలమాలలు వేసి.. ఘన స్వాగతం పలికారు. అలాగే గోస్పాడు మండలంలోని ఎస్.నాగులవరం, నెహ్రూనగర్ గ్రామాల్లో కూడా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పా మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నిక గెలుపుతో టీడీపీ పతనం ప్రారంభమవుతుందన్నారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అలాగే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించి నంద్యాల ప్రత్యేకతను చాటాలన్నారు. బాబు బూటకపు హామీలకు మోసపోవద్దు... ఓటర్లను ప్రలోభ పెట్టడం, బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని, ఆయన బూటకపు హామీలకు మోసపోవద్దని సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య ప్రజలకు సూచించారు. ఎన్నికల సమయంలో మాత్రమే నంద్యాల అభివృద్ధి గుర్తుకు రావడం బాబు మోసకారితనానికి నిదర్శనమన్నారు. అమలు కాని హామీలు ఇస్తున్న బాబుకు ఓటుతోనే బుద్ధి చెప్పాలన్నారు. నాలుగు శాతం రిజర్వేషన్ల ఘనత వైఎస్సార్‌దే... ముస్లింలకు విద్య, ఉద్యోగ రంగాల్లో నాలుగుశాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖరెడ్డిదేనని కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషా అన్నారు. రిజర్వేషన్‌తో ఎంతో మంది ఉద్యోగాల్లో స్థిరపడ్డారని, వారంతా వైఎస్సార్‌ను దేవుడిలా కొలుస్తున్నారని అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రిజర్వేషన్లు కల్పించి ఎన్నో ముస్లిం కుటుంబాల్లో వెలుగులు నింపారన్నారు. అదే చంద్రబాబు ముస్లింలను భయపెట్టి ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నారని, ఆయనకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఒకటో వార్డు కౌన్సిలర్ కన్నమ్మ, మాజీ కౌన్సిలర్ మునెయ్య, భీమవరం సీనియర్ నాయకులు పార్థసారథిరెడ్డి, ఎర్రన్న, కడప మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్నప్ప, పులి, సునీల్‌కుమార్, పార్టీ ఎస్సీసెల్‌రాష్ట్ర కన్వీనర్ మద్దయ్య, దేశం సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శిల్పాను భారీ మెజార్టీతో గెలిపించండి
►నంద్యాల ప్రజలకు ఎంపీ అవినాష్‌రెడ్డి పిలుపు ►పట్టణంలో విస్తృత ప్రచారం నంద్యాల అర్బన్: ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల ప్రజలకు, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి మధ్య చక్కటి అనుబంధం ఉందన్నారు. ప్రతి ఎన్నికలోనూ ప్రజలు వైఎస్ కుటుంబంపై అభిమానాన్ని చూపుతున్నారన్నారు. ఇప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో పోటీ చేస్తున్న శిల్పా మోహన్‌రెడ్డిని ఆదరించాలని కోరారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం ఎంపీ అవినాష్‌రెడ్డి నంద్యాల ఒకటో వార్డులోని అరుంధతినగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా విన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల సమయంలో వైఎస్సార్ చేసిన సహాయాన్ని నంద్యాల ప్రజలు ఎన్నటికీ మరచిపోలేరన్నారు. వైఎస్సార్సీపీ ప్లీనరీలో ఆమోదించిన తొమ్మిది పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కరెంట్ బిల్లులు, ఆర్టీసీ చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు.. ఇలా ప్రతిదీ పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందని విమర్శించారు. జగనన్న ప్రభుత్వం వస్తే పెరిగిన ధరలను నియంత్రించడమే కాకుండా పింఛన్ల పెంపు, రైతు భరోసా తదితర ఎన్నో ప్రయోజక పథకాలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కన్నమ్మ, పార్టీ నాయకులు కల్లూరి రామలింగారెడ్డి, వైఎస్సార్ జిల్లా పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ పులికుమార్, కోలా భాస్కర్, సోమసుందరం మాదిగ, మద్దయ్య, ఎల్లయ్య, శీను తదితరులు పాల్గొన్నారు. -
ఫ్యాక్షనిస్టులు, రౌడీలకు.. నంద్యాలలో స్థానం లేదు
►ఇక్కడి ప్రజలు విజ్ఞత కల్గినవారు ►బెదిరింపులు, దౌర్జన్యాలకు ఓటుతో దీటుగా సమాధానం చెప్పండి ►వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి పిలుపు ►అలజడి రేపేందుకు ప్రభుత్వ పెద్దల యత్నం: అనంత ►23వ వార్డులో ప్రచారానికి విశేష స్పందన నంద్యాల అర్బన్: ‘నంద్యాలకు దేశ చరిత్రలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి ప్రజలు సౌమ్యులు, విజ్ఞత కల్గిన వారు. ఫ్యాక్షనిస్టులకు, రౌడీలకు ఎట్టిపరిస్థితుల్లోనూ స్థానం కల్పించబోర’ని వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన పట్టణంలోని 23వ వార్డులో పర్యటించారు. భగత్‌సింగ్ కాలనీ, పక్కీర్‌పేట, టీచర్స్ కాలనీ, ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని వీధుల్లో స్థానిక మహిళలు, నాయకులు, కార్యకర్తలు పూలవర్షం కురిపించి.. ఘన స్వాగతం పలికారు. అనంతరం తిక్కస్వామి దర్గా, శివాలయాల్లో శిల్పా ప్రత్యేక ప్రార్థనలు, పూజలు చేశారు. శ్రమదానం బ్రిడ్జి సమీపంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బెదిరింపులు, దౌర్జన్యాలకు ఓటుతో దీటుగా సమాధానం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అబద్ధాలతో మభ్యపెడుతున్న సీఎం చంద్రబాబు దిమ్మతిరిగేలా ఉప ఎన్నికలో తీర్పు ఇవ్వాలని కోరారు. టీడీపీ ఎన్ని అడ్డదారులు తొక్కినా వైఎస్సార్సీపీ గెలుపును ఆపలేదని స్పష్టం చేశారు. ఉప ఎన్నిక విజయంతో తమ పార్టీ జైత్రయాత్ర ప్రారంభమవుతుందన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ రాబోయే సాధారణ ఎన్నికలకు నంద్యాల ఉప ఎన్నిక నాంది కాబట్టే అధికార పార్టీ గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. ఆ పార్టీ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. ప్రశాంతమైన నంద్యాలలో అలజడి రేపేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రజా బలంలో మనమే బలవంతులమని, అధికార పార్టీ ఆగడాలకు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఉప ఎన్నికలో విజయానికి ప్రతి కార్యకర్తగా సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. సీఈసీ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెట్టడం వైఎస్సార్సీపీ చేతకాదని, అలా చేసి ఉంటే 2014లోనే జగన్ సీఎం అయ్యేవారని అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన మాట్లాడుతూ టీడీపీ కల్లబొల్లి హామీలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే ప్రభుత్వానికి నంద్యాల అభివృద్ధి గుర్తుకు రావడం విడ్డూరమన్నారు. కార్యక్రమంలో అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్దారెడ్డి, సీఈసీ సభ్యుడు ఆదిశేషు, స్థానిక కౌన్సిలర్ షేక్‌హజరాబీ, కో ఆప్షన్ సభ్యుడు దేశం సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు అమృతరాజు, సుబ్బరాయుడు, కృష్ణమోహన్, దేవనగర్ బాషా, నాయకులు బషీర్ అహమ్మద్, మహబూబ్, కాంట్రాక్టర్ శీను, లాయర్ శ్రీనివాసులు, మస్తాన్, పెద్దకదిర్, రంగనాయకులు, సుబ్బారావు, మునెయ్య, శేఖర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ,కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్సార్సీపీలోకి చేరిక
-
ప్రచారమే తప్ప అభివృద్ధి ఏదీ?
►టీడీపీ నాయకులవి కల్లబొల్లి ప్రకటనలు ►ప్రజల్లో నమ్మకం కోల్పోత్ను అధికార పార్టీ ►మాజీ మంత్రి, నంద్యాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నంద్యాలవిద్య: అధికార పార్టీ ఒట్టి ప్రచారమే తప్ప..అభివృద్ధి చేయడం లేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త శిల్పామోహన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన నివాసంలో నందమూరినగర్ 37వ వార్డుకు చెందిన అల్తాఫ్ ఆధ్వర్యంలో 100మంది టీడీపీ కార్యకర్తలు.. వైఎస్సార్సీపీలోకి చేరారు. అదే విధంగా చాంద్‌బాడ 12వ వార్డుకు చెందిన టీడీపీ కార్యకర్తలు 100 మంది వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా శిల్పామోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న నాయకులు, మంత్రులు నంద్యాలను అభివృద్ధి చేస్తామని కల్లబొల్లి ప్రకటనలు చేస్తున్నారన్నారు. నంద్యాలలో పేదలకు 13వేల ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించినా 825మంది మాత్రమే లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. దీన్నిబట్టి చూస్తే ప్రజలకు వారిపై నమ్మకం ఎలా ఉందో తేటతెల్లమవుతోందన్నారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులను అధికార పార్టీ నాయకులు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని, వైఎస్సార్సీపీ కండువా కప్పుకుంటే రేషన్ డీలర్‌షిప్‌లు తొలగిస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నామన్నారు. మహిళలకు 7వేల కుట్టుమిషన్లు ఇస్తామని ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. నంద్యాలలో రోడ్ల వెడల్పు పనులు అన్ని ప్రాంతాల్లో చేయాలన్నారు. శిల్పాతోనే అభివృద్ధి సాధ్యం... నంద్యాల అభివృద్ధి సాధించాలంటే కేవలం శిల్పామోహన్రెడ్డితోనే సాధ్యమవుతుందని మాజీ మున్సిపల్ చైర్మన్ కైపరాముడు అన్నారు. దివంగత రాజశేఖర్‌రెడ్డి స్ఫూర్తితో శిల్పామోహన్‌రెడ్డి అనేక ప్రజా సంక్షేమ పథకాలను తన సొంత నిధులతో చేపట్టారని అన్నారు. నంద్యాలలో గతంలో ఎన్నుడు లేని విధంగా శిల్పా ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీ పనులు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని తెలిపారు. కేవలం అధికార పార్టీ రోడ్ల వెడల్పుతోనే అభివృద్ధి చేస్తామనడం ప్రజలను మభ్యపెట్టడమే అన్నారు. తాత్కాలిక పనులతో రాజీపడని నైజం శిల్పాదని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకుడు ఇషాక్ అహమ్మద్, కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్, వైఎస్సార్సీపీ నాయకులు ఆదిరెడ్డి, జగదీశ్వరరెడ్డి, రవికుమార్, కార్యకర్తలు మహమ్మద్ అలీ, నూర్, అబ్బాసలీం, మహబూబ్, రవి, చాంద్‌బాడ కాలనీ వాసులు అల్తాఫ్, నౌమాన్, సల్మాన్, మున్నా, యూసుఫ్, షబ్బీర్, తదితరులు పాల్గొన్నారు. యువ ఇంజినీర్లు మద్దతు... నంద్యాల శ్యాంనగర్ కాలనీకి చెందిన యువ ఇంజీనీర్లు శిల్పామోహన్‌రెడ్డికి మద్దతు తెలిపారు. శిల్పామోహన్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీకి విద్యావంతులైన యువకులు ఎంతో అవసరమన్నారు. మద్దతు తెలిపిన వారిలో జోయెల్, దినేష్, వినయ్, యోగేంద్ర, మహేష్, కార్తీక్, తదితరులు ఉన్నారు. -
గెలుపు మాదే!
►సవాల్‌కు మంత్రి అఖిల కట్టుబడి ఉండాలి ►చైర్‌పర్సన్‌ను దించడం సాధ్యం కాదు ►వైఎస్ఆర్సీపీ బలం రోజురోజుకూ పెరుగుతోంది ►బ్రహ్మానందరెడ్డి భూమా వారసుడు కాదు ►మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ►పార్టీలో గోపీనాథరెడ్డి, బాలపక్కీరయ్య చేరిక నంద్యాల/నంద్యాల వ్యవసాయం: ఉపఎన్నికలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని, సవాల్‌కు కట్టుబడి మంత్రి, ఎమ్మెల్యే పదవులకు అఖిలప్రియ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. తాను ఓడితే రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పారు. టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ బాలపక్కీరయ్య, మాజీ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి సన్నిహితుడు గోపవరం గోపీనాథరెడ్డి బుధవారం వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా శిల్పా మాట్లాడుతూ.. ఏడుగురు కౌన్సిలర్లు తమ వర్గంలోకి వచ్చారని.. మొత్తం 42మందిలో 26మంది తమ వైపు ఉన్నారన్నారు. చైర్ పర్సన్ దేశం సులోచనను పదవి నుంచి దించుతామని ప్రచారం చేస్తున్నారని, దీన్ని తాను సవాల్‌గా స్వీకరించానని చెప్పారు. తన వర్గానికి చెందిన వారిని ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకున్నారని, కాని వారంతా తనకే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ నేతలు తేదీ ఎప్పుడు చెప్పినా బల ప్రదర్శన చేయడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. బ్రహ్మానందరెడ్డి భూమా వారసుడు కాదు... టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి..దివంగత ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి వారసుడు కాదని శిల్పా అన్నారు. భూమా నాగిరెడ్డి కుమార్తెలు, కుమారుడు మాత్రమే వారసులన్నారు. నంద్యాలలో జరిగిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. బ్రహ్మానందరెడ్డి పేరును ప్రకటించారన్నారు. అయితే అతను భూమా వారసుడు కాకపోవడంతో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ప్రకటించారన్నారు. తాను వైఎస్సార్సీపీలో చేరడానికి గంట ముందు కూడా పలువురు మంత్రులు ప్రలోభ పెట్టడానికి ప్రయత్నాలు చేశారన్నారు. కాని తాను నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదని చెప్పారు. టీడీపీ నాన్పుడు ధోరణి, మంత్రి అఖిలప్రియ వ్యవహారశైలి వల్లనే తాను టీడీపీకి దూరం కావాల్సి వచ్చిందన్నారు. అధికార పార్టీలో కార్యకర్తలు, నేతలు చేరడం సహజమేనని, కాని ప్రతిపక్ష పార్టీలో చేరడం సాహసోపేతమన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు, బెదిరింపులకు లొంగకుండా ఎదురీదాల్సి వస్తుందని, కార్యకర్తలు తాను అండగా ఉంటానని చెప్పారు. వైఎస్ఆర్సీపీలో చేరిన గోపీనాథరెడ్డి, బాలపక్కీరయ్య... దివంగత ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి సన్నిహితుడు గోపీనాథరెడ్డి స్థానిక బ్రహ్మాటవర్స్‌లో జరిగిన కార్యక్రమంలో శిల్పా సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా గోనీనాథరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ పతనం నంద్యాల నుంచే ప్రారంభమవుతుందన్నారు. ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామన్నారు. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తామని, శిల్పామోహన్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలుపిస్తామన్నారు. గోపీనాథరెడ్డి సేవలను వినియోగించుకుంటామని శిల్పామోహన్‌రెడ్డి తెలిపారు. అరాచకాలను అడ్డుకట్ట వేద్దాం.. శిల్పా స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బాలపక్కీరయ్య ఆయన వర్గానికి చెందిన గఫూర్, రాజశేఖర్‌గౌడ్, శ్రీనివాసులుగౌడ్, 150మంది కార్యకర్తలు శిల్పా సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ దేశం సులోచన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలను అడ్డుకట్ట వేసి, ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలంటే శిల్పాను గెలిపించాలన్నారు. మార్క్‌ఫెడ్ ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి మాట్లాడుతూ.. గోపీనాథరెడ్డి, బాలపక్కీరయ్యల చేరికతో పార్టీ బలోపేతమైందన్నారు. కార్యక్రమంలో నాయకులు విజయశేఖర్‌రెడ్డి, రామసుబ్బయ్య, సాయినాథరెడ్డి, కౌన్సిలర్లు అనిల్ అమృతరాజ్, వెంకటసుబ్బయ్య, పున్నా రాజేశ్వరి, జాకీర్, కో ఆప్షన్ సభ్యుడు దేశం సుధాకర్‌రెడ్డి, కృష్ణమోహన్, చంద్రమోహన్, మధు పాల్గొన్నారు. -
నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా శిల్పా
సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లా నంద్యాల శాసనసభా నియోజకవర్గానికి త్వరలో జరుగనున్న ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డిని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదివారం అధికారికంగా ఒక ప్రకటన వెలువడింది. 2014 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన భూమా నాగిరెడ్డి ఆ తరువాత టీడీపీలోకి ఫిరాయించారు. కొంత కాలానికి ఆయన మరణించడంతో నంద్యాల స్థానానికి ఉప ఎన్నిక అవసరమవుతున్నది. ఈ స్థానాన్ని తిరిగి ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న దృఢ నిశ్చయంతో ఉన్న జగన్ ఇటీవలే పార్టీలో చేరిన శిల్పా మోహన్‌రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. నంద్యాల వైఎస్సార్ కాంగ్రెస్ సమన్వయకర్తగా కూడా శిల్పాను జగన్ నియమించారు. పార్టీలోని సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపిన దరిమిలా జగన్ శిల్పా పేరును ప్రకటించారు. -
వైఎస్సార్సీపీలోకి శిల్పా మోహన్‌రెడ్డి
నంద్యాల మున్సిపల్ ౖచైర్‌పర్సన్ సహా పలువురు నేతల చేరిక సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి తన వందలాది మంది అనుచరులతో కలిసి అట్టహాసంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీకి రాజీనామా చేసిన మోహన్‌రెడ్డి పెద్ద సంఖ్యలో అనుచరులు వెంట రాగా బుధవారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. జగన్ ఆయనకు, ఇతర ముఖ్య నేతలకు కార్యకర్తలకు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నంద్యాల నుంచి తరలి వచ్చిన వాహనాలతో పార్టీ కేంద్ర కార్యాలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. మోహన్‌రెడ్డితో పాటు నంద్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ దేశం సులోచన, మార్క్‌ఫెడ్ ఉపాధ్యక్షుడు పి.పి.నాగిరెడ్డి, 25 మంది మున్సిపల్ కౌన్సిలర్లు, 21 మంది ఎంపీటీసీలు, 16 మంది సర్పంచ్‌లు, ఒక జడ్పీటీసీ, ఒక ఎంపీటీసీ వైఎస్సార్సీపీలో చేరారు. మోహన్‌రెడ్డి చేరిక సందర్భంగా పార్టీ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరామయ్య, యక్కలదేవి ఐజయ్య, వై.బాలనాగిరెడ్డి, వై.సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బివై రామయ్య, కర్నూలు సమన్వయకర్త హఫీజ్ ఖాన్, జిల్లా పార్టీనేతలు పోచింరెడ్డి మురళీధర్‌రెడ్డి, నాగరాజు యాదవ్, సురేంద్రరెడ్డి హాజరయ్యారు. మోహన్‌రెడ్డి తొలుత జగన్‌ను ఆయన నివాసంలో కలుసుకుని పార్టీలో చేరాలన్న తన అభీష్టాన్ని వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిలు ఈ సందర్భంగా ఉన్నారు. శిల్పా చేరికతో పార్టీకి బలం: ఎంపీ బుట్టా రేణుక మోహన్‌రెడ్డి చేరికతో కర్నూలు జిల్లాలో వైఎస్సార్సీపీకి మరింత బలం చేకూరినట్లు అయిందని ఎంపీ బుట్టా రేణుక చెప్పారు. శిల్పాకు మంచి పేరుందని, నంద్యాలలోనే కాకుండా ఇతర చోట్ల కూడా ఆయన చేరిక ప్రభావం ఉంటుందని తెలిపారు. గత మూడేళ్లుగా జిల్లాలో వైఎస్సార్సీపీ ప్రజల్లో మరింతగా బలపడుతూ వస్తోందని, బలహీన పర్చాలనే ప్రయత్నాలు ఎవరు చేసినా ఫలించవని ఆమె చెప్పారు. ఏపీసీసీ నేత పద్మజారెడ్డి చేరిక ఏపీసీసీ నేత పద్మజారెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డితో కలిసి ఆమె బుధవారం ఉదయం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకుని పార్టీలో చేరా లన్న తన అభీష్టాన్ని వెల్లడించారు. జగన్ ఆమెను సాదరంగా ఆహ్వానిస్తూ పార్టీ కండువా కప్పి అభినందనలు తెలిపారు. చిత్తూరు జిల్లాకు చెందిన పద్మజ రాష్ట్ర విభజనకు ముం దు ఏపీసీసీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో సాగిస్తున్న అరాచక పాలనపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న రాజీలేని పోరాటంలో ఉడతాభక్తిగా తన వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీలో చేరినట్లు పద్మజారెడ్డి మీడియాకు వెల్లడించారు. సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉంది: శిల్పా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందని, ఇకపై పార్టీ పటిష్టత కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీలో చేరిన అనంతరం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో నంద్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ దేశం సులోచన, మార్క్‌ఫెడ్ ఉపాధ్యక్షుడు పి.పి.నాగిరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు రాజకీయ గురువు అని, ఆయన వల్లే తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా అయ్యానని వెల్లడించారు. తనకు వైఎస్ కుటుంబం పట్ల ఎప్పుడూ గౌరవాభిమానాలున్నాయని, కొన్ని కారణాల వల్ల గతంలో పార్టీలోకి రాలేకపోయినా 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా ఉండాలనే ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్నానని చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికల్లో కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ జెండాను ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీని వీడటానికి ప్రధానంగా నంద్యాలలో నెలకొన్న అంతర్గత విభేదాలే కారణమని చెప్పారు. జగన్ పోరాట పటిమ, సమర్థవంతమైన ఆయన నాయకత్వం కింద పని చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తానేమీ అధికారం కోసం ప్రతిపక్షంలోకి వెళ్లడం లేదన్నారు. నంద్యాల అసెంబ్లీ టికెట్ ఆశించి పార్టీలో చేరలేదని, జగన్ ఏది చెబితే ఆ పని చేస్తామని ఆయన తెలిపారు. -
నంద్యాల నుంచే నూతన శకం
మొదట పార్టీ మారిన ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచే అధికార పార్టీకి షాక్ – మునిసిపాలిటీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా – చైర్పర్సన్ సహా 24 మంది కౌన్సిలర్లు పార్టీలో చేరిక సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎక్కడి నుంచి ఎమ్మెల్యేల కొనుగోలు ప్రారంభమయ్యిందో అక్కడి నుంచే అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగలడం మొదలయింది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ద్వారానే గోడదూకుడు వ్యవహారానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. అయితే, అదే నియోజకవర్గం నుంచే ఇప్పుడు అధికార పార్టీపై తిరుగుబాటు ప్రారంభమయ్యింది. ఇంకా రెండేళ్లపాటు అధికారం చేతిలో ఉండికూడా.. కేవలం నమ్మిన సిద్ధాంతాల కోసం, నమ్మకమైన లీడర్ కోసం ప్రతిపక్ష పార్టీలో చేరారు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో శిల్పా చేరికతో.. నంద్యాల నియోజకవర్గంలో ఉప ఎన్నికలకు ముందు అధికార పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. నంద్యాల నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శిల్పా మోహన్ రెడ్డి బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు అనేక మంది ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు జగన్ సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకున్నారు. దీంతో అధికార పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ జెండా...! నంద్యాల మునిసిపాలిటీలో మొత్తం 42 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో చైర్పర్సన్ దేశం సులోచనతో పాటు 24 మంది కౌన్సిలర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వీరంతా వైఎస్ఆర్సీపీ కండువాలు స్వీకరించారు. దీంతో మునిసిపాలిటీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. ఇక నియోజకవర్గంలో ఉన్న ఇద్దరు జెడ్పీటీసీల్లో ఒకరు వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. 16 మంది ఎంపీటీసీలూ చేరిక శిల్పా మోహన్‌రెడ్డితో పాటు 16 మంది సర్పంచ్‌లు కూడా వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఫలితంగా నంద్యాల నియోజకవర్గంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు ముందుగా మునిసిపాలిటీ నుంచే అడుగులు పడ్డాయి. మొత్తం మీద నంద్యాల నియోజకవర్గంలో నూతన ఉత్తేజం ప్రారంభమైంది. -
వైఎస్సార్ సీపీలో చేరిన శిల్పామోహన్ రెడ్డి
హైదరాబాద్: మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి బుధవారం వైఎస్సార్ సీపీలో చేరారు. లోటస్ పాండ్‌లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో తన మద్దతుదారులతో కలిసి వైఎస్సార్ సీపీలోకి వచ్చారు. పార్టీ కండువా వేసి జగన్ సాదర స్వాగతం పలికారు. నంద్యాల మునిసిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి, పార్టీ నేతలు గోస్పాడు ప్రహ్లాదరెడ్డి, శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, ఆదిరెడ్డితో సహా కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు కూడా వైఎస్సార్సీపీలో చేరారు. వీరందరినీ పేరు పేరును జగన్‌కు శిల్పామోహన్‌రెడ్డి పరిచయం చేశారు. శిల్పామోహన్‌రెడ్డి మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. శిల్పామోహన్‌రెడ్డి చేరికను కర్నూలు జిల్లా వైఎస్సార్ సీపీ నేతలు స్వాగతించారు. శిల్పామోహన్‌రెడ్డి లాంటి బలమైన నేత తమ పార్టీలో చేరడం లాభిస్తుందని ఎంపీ బుట్టా రేణుక అన్నారు. ఇంకా చాలా మంది నాయకులు తమ పార్టీలో చేరతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని చెప్పారు. రాబోయే రోజుల్లో తమ పార్టీ మరింత బలోపేతం అవుతుందని, వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోని వస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. -
శిల్పాతో ఇంకెవరైనా వెళతారా?
- వెళ్లే నాయకులతో మాట్లాడి ఆపండి - నంద్యాల నాయకులతో సీఎం మంతనాలు సాక్షి, అమరావతి: తాను ఎంత నచ్చజెప్పినా వినకుండా కర్నూలు జిల్లా కీలక నేత శిల్పా మోహన్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కలవరపడి అక్కడి నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. నంద్యాల పరిణా మాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం తోపాటు అక్కడి నాయకులతో మాట్లాడుతూ ఏం చేయాలనే దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు. శిల్పా మోహన్‌రెడ్డి సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన వెంటనే మంత్రి భూమా అఖిలప్రియ, ఇతర ముఖ్య నాయకులతో సీఎం టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మంగళవారం ఉదయం కూడా మరోసారి అఖిలప్రియ, మంత్రులు అచ్చెంనాయుడు, కాల్వ శ్రీనివాసులు తదితరులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శిల్పాతో పాటు ఇంకా ఎవరెవరు టీడీపీని వీడతారని ఆయన నాయకులను ప్రశ్నించినట్లు తెలిసింది. వారి వివరాలు తెలుసుకుని పార్టీని వదిలి వెళ్లకుండా చూడాలని కోరారు. అధికారంలో ఉన్న పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వెళితే ఏర్పడే ఇబ్బందులు, ఇతర అంశాలను వివరించా లని సూచించారు. పార్టీ శ్రేణుల్ని కూడా జారిపోకుండా చూడాలని కోరారు. శిల్పా వైఎస్సార్సీపీలో చేరడం వల్ల టీడీపీకి నష్టం ఉండదని ప్రచారం చేయాలని, ముఖ్య నాయకులు కూడా ఈ విషయాన్ని బయటకు చెప్పాలని సూచించారు. ప్రస్తుత పరిణామాలపై అఖిలప్రియను వివరణ కోరగా... ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆమె చెప్పినట్లు తెలిసింది. అయినా శిల్పా పార్టీని వీడితే నంద్యాలతో పాటు కర్నూలు జిల్లాలో చాలా ప్రభావం ఉంటుందనే విషయాన్ని గ్రహించి నేతలందరితోనూ సీఎం మాట్లాడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికలపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయంపైనా వారితో చర్చించి వెంటనే నంద్యాల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న పనులన్నిం టినీ వెంటనే చేపట్టి పూర్తి చేయాలని, ఇంకా ఏమేం పనులు చేయాలో ప్రణాళిక తయారు చేసుకుని తన వద్దకు రావాలని చంద్రబాబు సూచించారు. ఈ నెల 21వ తేదీన తాను నంద్యాలలో పర్యటిస్తానని తెలిపారు. అదేరోజు పట్టణ గృహనిర్మాణ పథకానికి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం రాష్ట్రంలో పలు మెగా ప్రాజెక్టుల ఏర్పాటుకు ఎస్ఐపీబీ(స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు) ఆమోదం తెలిపింది. సచివాలయంలో మంగళవారం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరిశ్రమలకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఐటీ శిక్షణ సెంటర్ల ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. పెట్టుబడుల కోసం అవసరమైతే 13 జిల్లాల్లోనూ ప్రత్యేకంగా కన్సల్టెంటులను నియమించుకోవాలన్నారు. -
నంద్యాల నుంచే టీడీపీ పతనం
కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి శిల్పా ప్రకటన - 14న జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరతా సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. ఇక్కడి నుంచే అధికార తెలుగుదేశం పార్టీ పతనం ప్రారంభమవుతుందని మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి ప్రకటించారు. అధికార పార్టీలో తమకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయని.. తమ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారని వాపోయారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఆయన కర్నూలు జిల్లా నంద్యాలలో సోమవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి పలువురు నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా శిల్పా మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీలో భూమా నాగిరెడ్డిని చేర్చుకున్న తర్వాత కూడా సర్దుకుపోయిన విషయాన్ని గుర్తుచేశారు. పార్టీలో ఎదురవుతున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకపోయినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. పార్టీకి చేస్తున్న సేవలనూ గుర్తించలేదన్నారు. నంద్యాల ఉప ఎన్నిక సీటు విషయంలో నాన్చుడు ధోరణిని అవలంబిస్తున్నారని మండిపడ్డారు. తమ నేతలు, కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్న పార్టీలో ఇక కొనసాగలేమన్నారు. వ్యతిరేకత పెరుగుతోంది అధికారం చేపట్టి మూడేళ్లు గడిచినప్పటికీ జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని ఈ సందర్భంగా కార్యకర్తలు మండిపడ్డారు. నంద్యాలను సీడ్ హబ్‌గా మారుస్తామన్న సీఎం మాటలు ప్రకటనలకే పరిమితం అయ్యాయని విమర్శించారు. నంద్యాల పట్టణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా కేటాయించని విషయాన్ని ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు ఎత్తి చూపారు. అంతేకాకుండా రాష్ట్ర విభజన అనంతరం జరిగిన మొదటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు. -
నంద్యాల సీటుపై సీఎందే తుది నిర్ణయం
-
నంద్యాల సీటు మాకే.. కాదు మాకే!
గుంటూరు: నంద్యాల ‘సీటు’ పంచాయితీ ఇంకా తేలలేదు. టికెట్ తమకే కేటాయించాలంటూ ఇప్పటికే కోరిన శిల్పాబ్రదర్స్ ఆదివారం మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. శిల్పామోహన్‌రెడ్డి తనకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. '2014లో పార్టీ తరఫున నేనే పోటీ చేశా. ఈసారి కూడా టికెట్ నాకు ఇవ్వడమే న్యాయం. మేం అన్ని రకాలుగా నష్టపోయాం’ అని సీఎంను కలిసిన అనంతరం శిల్పామోహన్‌రెడ్డి అన్నారు. ‘నంద్యాల సీటు మాకే ఇవ్వాలి’ అని ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన వెల్లడించారు. కాగా, మంత్రి భూమా అఖిలప్రియ సైతం ఈ వ్యవహారంపై నేడు ముఖ్యమంత్రిని కలిశారు. సంప్రదాయం ప్రకారం టికెట్ తమకే ఇవ్వాలని ఆమె పట్టుబడుతున్నారు. ఇలా నంద్యాల టికెట్ వివాదం రెండు రోజులుగా ముఖ్యమంత్రి వద్ద కొనసాగుతోంది. -
మంత్రి కళా వెంకట్రావుతో అఖిలప్రియ భేటీ
-
నంద్యాల ఉప ఎన్నికపై కొనసాగుతున్న వివాదం
అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్ధిత్వంపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. నంద్యాల ఉప ఎన్నికలో తాను నూటికి నూరుపాళ్లు పోటీ చేసి తీరతానని శిల్పా మోహన్‌రెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి స్పష్టం చేశారు. కొద్దిరోజుల క్రితమే శిల్పా సోదరులు సీఎంను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. తన వర్గాన్ని కాపాడుకోవడానికి, తన ఉనికిని నిలబెట్టుకోవడానికి పోటీ చేయక తప్పదని స్పష్టం చేశారు. మరోవైపు మంత్రి అఖిలప్రియ కూడా తమ అనుచరులకే సీటు ఇవ్వాలని పట్టుపడుతున్నారు. దీంతో ఇరువురి మధ్య విభేదాల నేపథ్యంలో ఏకాభిప్రాయం కోసం చంద్రబాబు పాట్లు పడుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి కళా వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి అఖిలప్రియ, మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరై నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిత్వంపై చర్చించారు. నంద్యాల ఉప ఎన్నికపై నేతలతో కళా వెంకట్రావు విడివిడిగా భేటీ అవుతున్నారు. అలాగే ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్‌రెడ్డి కూడా వెంకటరావుతో మాట్లాడారు. కళా వెంకట్రావుతో చర్చల అనంతరం వీరంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవనున్నట్లు సమాచారం. -
నంద్యాలలో పోటీ చేస్తా
-
నంద్యాలలో పోటీ చేస్తా
చంద్రబాబుకు తెగేసి చెప్పిన శిల్పా మోహన్‌రెడ్డి సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో తాను నూటికి నూరుపాళ్లు పోటీ చేసి తీరతానని శిల్పా మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తెగేసి చెప్పారు. తన వర్గాన్ని కాపాడుకోవడానికి, తన ఉనికిని నిలబెట్టుకోవడానికి పోటీ చేయక తప్పదని స్పష్టం చేశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో బుధవారం రాత్రి శిల్పా సోదరులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా నంద్యాల ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం తనకు ఇవ్వాల్సిందేనని మోహన్‌రెడ్డి పట్టుబట్టారు. ఒకవేళ సీటు రాకపోతే క్యాడర్‌ను నిలబెట్టుకోవడానికి తాను ఎలాంటి నిర్ణయాన్నయినా తీసుకుంటానని చెప్పారు. దీంతో తొందరపడి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవద్దని సీఎం సూచించారు. శిల్పా చక్రపాణిరెడ్డికి శాసన మండలి ఛైర్మన్ పదవి ఇస్తున్నాం కాబట్టి సహకరించాలని కోరారు. భూమా కుటుంబానికి మంత్రి పదవి ఇచ్చినా తాను అభ్యంతరం వ్యక్తం చేయలేదని, తన సోదరుడికి మండలి ఛైర్మన్ ఇచ్చినా తన సీటు తనకివ్వాల్సిందేనని మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నచ్చజెప్పడానికి ప్రయత్నించినా మోహన్‌రెడ్డి వినిపించుకోకపోవడంతో... ఒకటి, రెండు రోజులు ఆగాక నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు ఆయనకు చెప్పారు. నంద్యాలలో తమ కుటుంబానికి చెందిన వ్యక్తే పోటీ చేస్తారని, ఈ నెల 24న శోభానాగిరెడ్డి వర్థంతి రోజున అభ్యర్థిని ప్రకటిస్తామని మంత్రి అఖిలప్రియ చెప్పిన విషయం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత బయటకు వచ్చి మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... నంద్యాల ఉప ఎన్నికలో తాను వంద శాతం పోటీ చేస్తానని స్పష్టం చేశారు. (చదవండి: ఉపఎన్నికపై మంత్రి సంచలన ప్రకటన) -
కొత్త చిచ్చు!
మంత్రి పదవి ఆశల చుట్టూ రాజకీయం - భూమా వైపు మొగ్గితే తాముండబోమంటున్న శిల్పా? - సీఎం వద్ద పంచాయితీకి నిర్ణయం - ఎన్నికలు వస్తే స్వతంత్రంగానైనా పోటీకి సిద్ధం - భూమాను ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతామని స్పష్టీకరణ సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘ఎన్నికల ముందు నుంచీ పార్టీలో ఉన్నాం. మమ్మల్ని పట్టించుకోకుండా కొత్తగా వచ్చిన వారికి పదవులు అప్పగిస్తే పార్టీకే నష్టం. ప్రధానంగా భూమా నాగిరెడ్డికి ఏకంగా మంత్రి పదవి ఇస్తామంటే ఒప్పుకోం. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో మేం ఎలా కొనసాగగలం. మంత్రి పదవి కావాలంటే ఎమ్మెల్యేకు రాజీనామా చేయాల్సిందే. అదే జరిగితే భూమాకు వ్యతిరేకంగా మేం ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తాం. సహకరించే అవకాశమే లేదు. ఇదే విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి విన్నవించాలని భావిస్తున్నాం.’’ ఇవీ తన ప్రధాన అనుచరులతో శిల్పా బ్రదర్స్ చెబుతున్న మాటలు. ఈ నేపథ్యంలో మరోసారి నంద్యాల రాజకీయం రసకందాయంలో పడబోతుందని అర్థమవుతోంది. తెలంగాణలో జరిగిన మంత్రి తలసాని ఎపిసోడ్‌తో.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కొత్తగా ఎవ్వరికీ మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదనేది శిల్పా వర్గీయుల భావనగా ఉంది. ఎన్నికలు తప్పవని.. ఇదే జరిగితే తాము స్వతంత్రంగా పోటీ చేసి సత్తా చాటుతామని కూడా వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. ఇదీ ఇప్పుడు అధికార పార్టీలో మరింత కాక పుట్టిస్తోంది. ఎన్నికలొస్తే.. వాస్తవానికి తెలంగాణలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే తలసానికి మంత్రి పదవి అప్పగించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తీరుపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదులు వెళ్లాయనే ప్రచారం ఉంది. దీంతో గవర్నర్‌కు కేంద్ర హోంశాఖ లేఖ పంపిందని కూడా తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మంత్రి పదవులు లభించే అవకాశం లేదని స్వయంగా అధికార పార్టీ నేతలే పేర్కొంటున్నారు. భూమాకు మంత్రి పదవి రావాలంటే కచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో నంద్యాల అసెంబ్లీలో ఉప ఎన్నికలు తథ్యమని కూడా అధికార పార్టీలో వాదన ఉంది. ఒకవేళ భూమాకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించి.. ఉప ఎన్నికలకు సిద్ధపడితే తమ నేత కూడా బరిలో ఉంటారని శిల్పా వర్గీయులు పేర్కొంటున్నారు. పోటీలో తమ నేత గెలిచినా, గెలవకపోయినా భూమాను మాత్రం కచ్చితంగా ఓడిస్తామని స్పష్టం చేస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని స్పష్టంగా అధినేతకు వివరించిన తర్వాతే తమ నిర్ణయం ఉంటుందని వక్కాణిస్తున్నారు. కాగా.. ఎన్నికలు వచ్చి ఓడిపోతే పార్టీ పరువు బజారున పడుతుందని అధికార పార్టీలో అలజడి రేగుతోంది. ఇదిలాఉంటే తమ నేతకు మాత్రం కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని భూమా వర్గీయులు ధీమాగా ఉన్నారు. ఆదీ నుంచి సమన్వయలేమి..! ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవనే సామెతకు అనుగుణంగా.. నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ, కోడుమూరు, కర్నూలు, శ్రీశైలం నియోజకవర్గాల్లో ఇదే జరుగుతోందనే వాదన అధికారపార్టీలో వినిపిస్తోంది. పైకి ఎంత బహిరంగంగా విమర్శలు చేసుకోకపోయినప్పటికీ లోలోపల మాత్రం పాత నేతలు కొత్త నేతల రాకపై మండిపడుతున్నారు. పైగా తమ అధినేత కూడా కొత్తగా వచ్చిన వారికే పట్టం కడుతున్నారని వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పాత నేతలంతా కలిసి తమ స్థానానికి కన్నం పెట్టే ప్రయత్నాలు పార్టీ నుంచే జరిగితే సహించేది లేదని తేల్చి చెప్పాలని నిర్ణయించుకున్నారు. తమకంటూ ఒక అసెంబ్లీ నియోజకవర్గం లేకపోతే.. తమకు విలువ ఏముంటుందని మదనపడుతున్నారు. ఈ నేపథ్యంలో పాత నేతలంతా కలిసి అధినేతను కలవాలనే చర్చ కూడా సాగుతున్నట్టు సమాచారం. మొత్తం మీద మంత్రి పదవి వ్యవహారం కాస్తా అధికార పార్టీలో అగ్గి రాజేస్తోంది. -
‘నన్ను జైల్లో పెట్టించడం నీ తరం కాదు’
నంద్యాల: ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ శిల్పా మోహన్ రెడ్డి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇరువురు నాయకుల మధ్య మాటల యుద్ధం ముదిరి తిట్లకు దారి తీసింది. తాజాగా శిల్పా మోహన్ రెడ్డిపై నాగిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘శిల్పా మోహన్ రెడ్డి లాంటి నేతలను వేల మందిని చూశాను. నన్ను జైల్లో పెట్టించడం నీ అబ్బ తరం కాదు. నా మౌనాన్ని చేతగానితనంగా భావించొద్దు. మోహన్ రెడ్డి వల్లే కుందు నది ఆక్రమణలకు గురైంది. శిల్పా 12 ఏళ్లలో 12 ఇళ్లు మంజూరు చేయించలేకపోయారు. నేను ఐదు నెలల్లో నంద్యాల నియోజకవర్గానికి రూ. 500 కోట్లు నిధులు మంజూరు చేయించాన’ని భూమా నాగిరెడ్డి అన్నారు. జనచైతన్య యాత్ర వేదికగా ఇంతకుముందు ఇరువురు నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ‘ఇలాగే మాట్లాడితే మీరు ఏఏ వ్యాపారాలు చేస్తారో, ఏ దందా చేస్తున్నారో బహిర్గతం చేస్తాం. నంద్యాలకు రూ.450 కోట్లు తెచ్చామని ప్రకటిస్తున్నారు. ఏఏ పనులకు, ఏఏ ప్రాంతంలో ఈ నిధులను కేటాయించారో వివరాలతో వెల్లడించాలి. ఆలోచించి మాట్లాడండి. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమ’ని శిల్పా మోహన్ రెడ్డి అంతకుముందు ధ్వజమెత్తారు. -
భూమా వర్సెస్ శిల్పా
⇒ పార్టీలో ఉంటే ఉండు.. లేకుంటే పో : భూమా ⇒ రెండు రోజుల్లో బండారం బయట పెడతా : శిల్పా ⇒ భూమా సెటిల్మెంట్ దందాలు చేస్తున్నారు : చైర్పర్సన్ నంద్యాల: ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ శిల్పామోహన్‌రెడ్డి వర్గాల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు ఇరువురు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఇందుకు జనచైతన్య యాత్రలను వేదికలుగా చేసుకున్నారు. భూమా తొలి సభ నుంచే శిల్పాపై విమర్శల దాడికి దిగగా, శిల్పా రెండు రోజుల నుంచి తానేమి తీసిపోనని ఎదురుదాడికి దిగారు. భూమాకు మద్దతుగా వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్‌కుమార్, శిల్పాకు మద్దతుగా చైర్పర్సన్ దేశం సులోచన నిలిచి ప్రత్యర్థులపై విమర్శలు సంధిస్తున్నారు. భూమా శుక్రవారం పట్టణంలోని 22, 23వార్డుల్లో, శిల్పా సాయంత్రం పట్టణంలోని 18వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా వారు ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగారు. పార్టీలో ఉండాలో లేదో తేల్చుకోండి : భూమానాగిరెడ్డి నన్ను రెచ్చగొట్టడంతోనే పార్టీ ఫిరాయించాను. ఇదంతా మీ స్వయం కృపారాదం. మీరు పార్టీలో ఉండాలో లేదో తేల్చుకోండి నేను మాత్రం మళ్లీ పోటీ చేస్తా. ఉప్పు, పప్పులు అమ్ముకునే వారికి రాజకీయాలు ఎందుకు. అలాంటి వారు నాకు పోటీనేకాదు. గెలిచిన వారికి, ఓడిన వారికి తేడా ఉంది. గెలిచిన వారే ప్రజల సమస్యలను తీరుస్తారు. ఓడిన వారు ఏం చేయగలరు. ప్రతి మీటింగ్‌లో తనకు ఓట్లు వేయకుండా ఓడించారని ప్రజలను నిందించడం కంటే ఆత్మపరిశీలన చేసుకోవడం మంచిది. బండారం బయట పెడతా : శిల్పామోహన్‌రెడ్డి, టీడీపీ ఇన్చార్జి ఉప్పు, కందిపప్పు విక్రయించినది వాస్తవమే. కాని పేద ప్రజలకు లాభాపేక్షలేకుండా అందించాను. రెండు మూడు రోజులు చూస్తా. ఇలాగే మాట్లాడితే మీరు ఏఏ వ్యాపారాలు చేస్తారో, ఏ దందా చేస్తున్నారో బహిర్గతం చేస్తాం. నంద్యాలకు రూ.450 కోట్లు తెచ్చామని ప్రకటిస్తున్నారు. ఏఏ పనులకు, ఏఏ ప్రాంతంలో ఈ నిధులను కేటాయించారో వివరాలతో వెల్లడించాలి. రోడ్ల వెడల్పు మాత్రమే సమస్యలకు పరిష్కారం కాదు. ముందు మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆలోచించి మాట్లాడండి. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం. సెటిల్మెంట్లు చేయడమే మీ పని: దేశం సులోచన, చైర్పర్సన్ శిల్పా ఉప్పు, పప్పు అమ్ముకున్నది నిజమే. ఆయన ప్రజల బాగుకోసమే చేశారు. మీరు మాత్రం సెటిల్మెంట్లు, దందా చేస్తున్నారు. శిల్పా రెండోసారి గెలిచినప్పుడే మంత్రి పదవి వచ్చింది. మీరు 30ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా మంత్రి పదవి రాకపోవడానికి కారణం నేతలకు మీ పై నమ్మకం లేకపోవడమే. అధికారులపై ఒత్తిడి తెచ్చి పనులు చేయించుకోవడం మంచిది కాదు. అమృత్ పథకం కింద శిల్పా బ్రదర్స్ తెచ్చిన నిధులను తాము తెచ్చినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు. -
తులసీరెడ్డి హత్య కేసులో 9 మంది అరెస్ట్
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి అనుచరుడు, న్యాయవాది తులసీరెడ్డి హత్య కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 29వ తేదీన నంద్యాల పట్టణంలో శిల్పా మోహన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, న్యాయవాది తులసిరెడ్డిపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి.. ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా మారడంతో ... మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
శోభమ్మ అభివృద్ధి చేయలేదా?
మరోవైపు అభివృద్ధి చేయలేదంటూ పరోక్షంగా శిల్పాపై భూమా విమర్శలు మండిపడుతున్న మాజీ మంత్రి సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ వ్యాఖ్యలు ఆ రెండు నియోజకవర్గాలతో పాటు అధికార పార్టీ నేతల్లోనూ కలకలం రేపుతున్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మొదటి నుంచీ భూమా కుటుంబ సభ్యులదే హవా. సుమారు రెండు దశాబ్దాల పాటు నియోజకవర్గాన్ని పాలించింది ఆ కుటుంబమే. అయినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి జరగలేదన్న భూమా అఖిలప్రియ వ్యాఖ్యలపై ఆ నియోజకవర్గంలో చర్చనీయాంశమవుతోంది. అంటే తమ కుటుంబ హయాంలోనే అభివృద్ధి జరగలేదంటూ.. అందులోనూ శోభమ్మ అభివృద్ధి చేయలేదనే రీతిలో ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని కేడర్ బాధపడుతున్నట్లు సమాచారం. మరోవైపు నంద్యాలను గతంలో అభివృద్ధి చేయలేదంటూ భూమా నాగిరెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల శిల్పా వర్గీయులు గుర్రుమంటున్నారు. తమ నేతను లక్ష్యంగా చేసుకునే భూమా మాట్లాడారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా చేరికలు అధికార పార్టీలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. రెండు దశాబ్దాల పాలనలో.. వాస్తవానికి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మొదటి నుంచి భూమా కుటుంబానిదే హవా. 1989 లో భూమా శేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఆ కుటుంబం నుంచి రంగప్రవేశం చేశారు. అయితే, 1992 లో శేఖర్ రెడ్డి చనిపోవడంతో భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. 1994లో సాధారణ ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయినప్పటికీ.. ఆ తర్వాత ఎంపీ కావడంతో 1997లో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో 1997లో శోభానాగిరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం 1999 సాధారణ ఎన్నికల్లోనూ ఆమె గెలు పొందారు. కేవలం 2004 నుంచి 2009 వరకూ గంగుల ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక 2009లో పీఆర్పీ నుంచి శోభానాగిరెడ్డి ఎన్నికయ్యారు. తాజాగా భూమా అఖిలప్రియ ఎన్నికయ్యారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అధికారంలో ఉన్నది రెండు దశాబ్దాల పాటు పాలించింది భూమా కుటుంబమే. అయినప్పటికీ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదంటూ తమ కుటుంబాన్నే విమర్శించేలా మాట్లాడటం తగదనే అభిప్రాయం వారి అనుచరుల్లో వ్యక్తమవుతోంది. మా పైనే విమర్శలా? నంద్యాల అభివృద్ధిపై అనేక వాగ్దానాలు చేసి ఎమ్మెల్యేగా గెలు పొంది.. చివరకు ఏమీ చేయలేక అధికార పార్టీలో చేరుతూ తమపై పరోక్షంగా విమర్శలు చేయడం తగదని అధికార పార్టీలోని నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. నంద్యాలను గతంలో అభివృద్ధి చేయలేదన్న వ్యాఖ్యలు.. పరోక్షంగా శిల్పా, ఫరూఖ్లపై విమర్శలు చేశారని తెలుస్తోంది. కేవలం గతంలో ఎన్నడూ అభివృద్ధి జరగలేదనే వ్యాఖ్యలపై అటు శిల్పా వర్గీయులు కూడా గుర్రుగా ఉన్నారు. పార్టీలో చేరిన వెంటనే తనను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం చూస్తుంటే విభేదాలకు ఆజ్యం పోయడమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భూమా వ్యాఖ్యలపై మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ‘‘ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు. అందుకే నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరాను.’’ - టీడీపీలో చేరిక సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ‘‘నంద్యాల నియోజకవర్గాన్ని గతంలో అభివృద్ధి చేయలేదు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే తెలుగుదేశంలో చేరుతున్నా.’’ - విజయవాడలో భూమా నాగిరెడ్డి -
ఎరువుల గుట్టు..విభేదాలతో రట్టు
నంద్యాల: ఎరువుల అక్రమ నిల్వలు వెలుగులోకి రావడం వెనుక అధికార పార్టీకి చెందిన వ్యాపారుల మధ్య ఆధిపత్య పోరే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన మద్దతు దారుడుగా కొనసాగుతున్న దియ్యాల మధుసూదనరావు వ్యవసాయ అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన 1175 టన్నుల ఎరువులను ఈ నెల 24న విజిలెన్స అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం విధితమే. వీటి విలువ రూ.2.09 కోట్లు ఉంటుందని విజిలెన్స్ అధికారులు అంచనా వేశారు. నంద్యాల పట్టణంలో ఏటా దాదాపు రూ.15 కోట్లు విలువ చేసే ఎరువులను స్థానిక వ్యాపారులు విక్రయిస్తుంటారు. పట్టణంలోని వ్యాపారులు స్థానిక రైతులకే కాకుండా శ్రీశైలం, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం నియోజకవర్గాల్లోని 10 మండలాలకు ఎరువులను విక్రయిస్తుంటారు. అయితే ఐదారుగురు వ్యాపారులు మాత్రం స్థానిక రైతులకు విక్రయించడం కంటే సీజన్‌ను బట్టి నెల్లూరు, కడప, ప్రకాశం, మహబూబ్‌నగర్ జిల్లాలకు తరలించి భారీ ఎత్తున ఆదాయాన్ని గడిస్తుంటారు. పది సంవత్సరాల నుంచి నంద్యాల పట్టణంలోని ఎరువుల వ్యాపారులు అధికార పార్టీకి అండదండలను అందిస్తూ తమ అక్రమ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగించుకుంటున్నారు. వీరిపై దాడులు నిర్వహించడానికి కూడా అధికారులు వెనుకడుగు వేసేవారు. దాడికి వెళ్లే సమయంలోనే అధికార పార్టీకి చెందిన నాయకుల నుంచి ఫోన్లు వచ్చేవి. పక్కా సమాచారం మేరకు నాలుగు రోజుల క్రితం విజిలెన్స్ అధికారులు ధైర్యంగానే దాడులు కొనసాగించి అక్రమంగా నిల్వ ఉంచిన ఎరువులు 1175 టన్నులను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయం కోసం ఆధిపత్య పోరు.. ఎరువుల వ్యాపారులు కొందరు తమ ఆధిపత్యం కొనసాగించేందుకు ప్రత్యర్థిపై అధికారులకు పక్కా సమాచారం అందించి వారిని ఇరకాటంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. దియ్యాల మధుసూదనరావు పట్టణంలో ఎరువుల వ్యాపారుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఈయన మాజీ ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డికి తలలో నాలుకలాగా వ్యవహరించే వ్యక్తిగా గుర్తింపు ఉంది. ఎరువుల కంపెనీలు కూడా ఈయన కనుసన్నల్లోనే స్టాక్‌ను ఇతర వ్యాపారులకు కేటాయిస్తుంటారు. ఏ వ్యాపారి దగ్గర లేనన్న నిల్వలు దియ్యాల దగ్గర ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో ఆయన వ్యతిరేక వర్గీయులు ఎరువుల అక్రమ నిల్వలపై పక్కా సమాచారాన్ని విజిలెన్స్ అధికారులకు అందించినట్లు తెలుస్తోంది. -
శిల్పా నిర్ణయాలతో టీడీపీకి ఇక్కట్లు
- శోభానాగిరెడ్డి సంతాప సభలపై అభ్యంతరం అనవసరం - ఆరోపణలతో వైఎస్సార్సీపీ మరింత బలోపేతం నంద్యాల, న్యూస్‌లైన్ : ప్రజాభిమానమున్న నేతలపై అకారణంగా ఆరోపణలు చేస్తూ శిల్పా మోహన్‌రెడ్డి సొంతపార్టీ అయిన టీడీపీనే దెబ్బతీస్తున్నారని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పేర్కొంటున్నారు. దివంగత శోభానాగిరెడ్డి సంతాపసభలు నంద్యాలలో నిర్వహించడం, ఆమె ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై శిల్పా రాద్ధాతం చేస్తున్నారు. ఆదివారం గోస్పాడు మండలంలోని జూలేపల్లె, తది తర గ్రామాల్లో, సోమవారం నంద్యాలలో నిర్వహించిన కార్యక్రమాల్లో శిల్పా మోహన్‌రెడ్డి మాట్లాడారు. శోభానాగిరెడ్డి ఆళ్లగడ్డకు చెందిన నాయకురాలని, ఆమెకు నంద్యాలతో సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయం తెలిసిన భూమా, శోభా అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. 2004లో శోభానాగిరెడ్డి నంద్యాల పార్లమెంట్‌కు పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఆమెకు 41 వేల ఓట్లు పోలయ్యాయని వివరిస్తున్నారు. ఆర్టీసీ చైర్మన్‌గా నంద్యాల ఆర్టీసీ డిపోను ఆధునికీకరించడమే కాకుండా అత్యధిక సంఖ్య లో బస్సులను తెప్పించిన ఘనత ఆమెకే దక్కుతుందని తెలిపారు. వ్యవసాయ పరిశోధనా కేంద్రం డెరైక్టర్‌గా పని చేసి అప్పట్లో అనేక కార్యక్రమాలను నంద్యాల వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో చేపట్టారని తెలిపారు. శోభానాగిరెడ్డి హైదరాబాద్‌లో మృతి చెందిన తర్వాత ఆళ్లగడ్డకు అంత్యక్రియలకు తీసుకెళ్తూ నంద్యాలలో గంట సేపు ఉంచితే దాదాపు 40 వేల మంది చూసి నివాళి అర్పించారని పేర్కొన్నారు. అలాంటి నాయకురాలి సంతాపసభలను ప్రజలు స్వచ్ఛందంగా జరుపుకుంటున్నారని, దానిని వద్దనే హక్కు ఎవ్వరికీ లేదని అంటున్నారు. ఇప్పటికే శోభానాగిరెడ్డి అభిమానులు దాదాపు 100 మంది వారి వాహనాలకు ఆమె ఫొటోలు ఏర్పాటు చేసుకున్నారని, పరిస్థితి ఇలాగే ఉంటే ఆ సంఖ్య మరింత పెరిగేలా ఉందని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే టీడీపీపై ప్రజల్లో చులకన భావం ఉందని, అందుకే ప్రచారం చేసేందుకు కూడా సాధ్యపడడం లేదని తెలిపారు. అదే సమయంలో వైఎస్సార్సీపీపై సానుభూతి మరింత అధికమవుతోందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా శిల్పా తన పద్ధతి మార్చుకోవాలని సూచిస్తున్నారు. -
‘పచ్చ’ నోట్ల ప్రవాహం
సాక్షి ప్రతినిధి, కర్నూలు : తమ్ముళ్ల పరువు బజారునపడుతోంది. అడ్డదారుల్లో అందలం ఎక్కేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా బెడిసికొడుతున్నాయి. ప్రలోభాలపర్వం దాచినా దాగని పరిస్థితి. ఎన్నికల నిబంధనలను యథేచ్ఛగా తుంగలో తొక్కుతున్నా.. ఏదో ఒక రూపంలో వారి బండారం బయటపడుతోంది. నంద్యాలలో మంగళవారం నంద్యాల, శ్రీశైలం నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులైన శిల్పా మోహన్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి బంధువుల ఇళ్లలో భారీగా పట్టుబడిన నగదు ఇందుకు తాజా ఉదాహరణ. సర్వేల్లో ‘వైఎస్ఆర్సీపీ’ హవా కొనసాగుతుండటం ‘పచ్చ’పార్టీలో గుబులు రేపుతోంది. ఈ పరిస్థితుల్లో ఓటర్లను డబ్బుతో కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ వారిలో ఓటమి భయం రెట్టింపవుతోంది. ఫలితంగా నల్లధనం ‘కట్ట’లు తెంచుకుంటోంది. ఉన్నతాధికారుల సమాచారంతో నంద్యాల డీఎస్పీ అమర్నాథ్నాయుడు మంగళవారం తెల్లవారుజామున పట్టణంలోని నంద్యాల, ఆత్మకూరు టీడీపీ అభ్యర్థులు శిల్పా మోహన్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి సమీప బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి రికార్డులు లేని రూ.66 లక్షల నగదును గుర్తించారు. ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకే ఈ డబ్బును సిద్ధం చేసినట్లు డీఎస్పీ వెల్లడించడం గమనార్హం. రెండు రోజుల క్రితం వరకు టీడీపీ అభ్యర్థులు వారి నివాసాల నుంచే డబ్బు పంపిణీ చేయగా.. పోలీసుల నిఘా పెరగడంతో ఇటీవల రూటు మారింది. బంధువులు, సన్నిహితుల నివాసాలకు డబ్బు, గృహోపకరణాలను తరలించి అక్కడి నుంచే కార్యం చక్కబెడుతున్నారు. ఈ తరహాలో కర్నూలు, నంద్యాల, శ్రీశైలం, బనగానపల్లె, ఆదోని, డోన్, పత్తికొండ ప్రాంతాల్లో టీడీపీ నేతలు ‘సరంజామా’ను ఇప్పటికే చేరవేసినట్లు సమాచారం. డబ్బుతో పాటు క్రికెట్ కిట్లు, గ్యాస్ స్టౌలు, ఎల్పీజీ సిలిండర్లు, కుట్టు మిషన్లు, చీరలు భారీగా నిల్వ చేసినట్లు తమ్ముళ్లలోనే చర్చ జరుగుతోంది. సుమారు కోటిన్నర రూపాయలకు పైగా నగదు.. చెక్కులను అధికారులు ఇటీవల కాలంలో స్వాధీనం చేసుకోవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. పురుషులకు డబ్బు పంపిణీ చేస్తుండగా.. మహిళలను బంగారు నగలతో ఆకట్టుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో ముక్కు పుడకలు.. చెవి రింగులు.. ఉంగరాలు.. వెండి నగలను ఓటర్ల ఇళ్లకు చేరవేస్తున్నారు. ఇటీవల కాలంలో పట్టుబడిన బంగారం, వెండి నగలే ఇందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే కొన్నిచోట్ల బ్యాంకుల్లో రుణాలను కూడా ఇప్పిస్తున్నారు. కర్నూలు పార్లమెంట్ స్థానం పరిధిలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఒకరు ఈ తరహా ప్రలోభానికి తెరతీశారు. టీడీపీ నేత ఒకరు ఓ గ్రూపు నుంచి గంపగుత్తగా ఓట్లు రాల్చుకునేందుకు నివాస స్థలాలను అగ్రిమెంట్ చేయిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇదంతా ఎన్నికల స్టంట్ మాత్రమేననే ప్రచారం ఉంది. ఇదిలా ఉండగా.. ఈ డబ్బు వ్యవహారంపై పోలీసులకు ఎవరు ఉప్పందించారో తెలియక శిల్పా సోదరులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికలు మరో 15 రోజుల్లో ఉండగా రూ.66 లక్షలు పట్టుబడడంతో పరువు పోయినట్లు అయిందని వారు సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
ఇరకాటంలో శిల్పా
- కాంగ్రెస్, జేఎస్పీ అభ్యర్థులతో తలనొప్పి - గతంలో ఇద్దరికీ చేయివ్వడమే కారణం - మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల వ్యవహారంతో జహీర్ మనస్తాపం - గోస్పాడులో ఆధిపత్యం భరించలేని రాకేష్‌రెడ్డి - టీడీపీ శిబిరంలో ఓటమి భయం నంద్యాల, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలి వీస్తోంది. చంద్రబాబు ద్వంద్వ నీతికి తోడు.. అభ్యర్థుల స్వయంకృతాపరాధం వారిని ఓటమి దిశగా పయనింపజేస్తోంది. బీజేపీతో జత కట్టడంతో ముస్లిం ఓటర్లు ‘పచ్చ’ పార్టీకి దూరం కాగా.. గతంలో కలిసి నడిచిన నేతలే ఇతర పార్టీల తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో నిలవడం శిల్పా మోహన్‌రెడ్డికి తలనొప్పిగా మారింది. నంద్యాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జూపల్లె రాకేష్‌రెడ్డి, జై సమైక్యాంధ్ర పార్టీ (జేఎస్పీ) అభ్యర్థిగా జహీర్బాషాలు బరిలో నిలిచారు. జహీర్ ప్రస్తుతం టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఫరూక్ సోదరుని కుమారుడు కావడం గమనార్హం. ఈయన మూడు దశాబ్దాలకుపైగా ఆ పార్టీ జెండా మోశారు. ఫరూక్‌కు చేదోడువాదోడుగా.. పార్టీ శ్రేణులకు తలలో నాలుకగా మెలిగిన జహీర్ ప్రజల్లో తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆరు వార్డుల్లో తన మద్దతుదారులకు టికెట్లు ఇవ్వాలని ఫరూక్ ద్వారా ఎమ్మెల్యే శిల్పాను సంప్రదించారు. అయితే ఒక్క వార్డు విషయంలోనూ ఆయన మాటకు విలువివ్వకపోవడంతో మనస్థాపం చెందారు. ఏమాత్రం గుర్తింపు లేని పార్టీలో తానెలా కొనసాగాలంటూ ఫరూక్ వద్ద జహీర్ మొరపెట్టుకోగా ఆయన కూడా చేతులెత్తేశారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ బరిలో నిలిచి తన సత్తా ఏంటో శిల్పా మోహన్‌రెడ్డికి చాటేందుకు ఆయన నిర్ణయించుకున్నారు. ఆ మేరకు జై సమైక్యాంధ్ర పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. రెండు రోజులుగా జహీర్ టీడీపీ ఓటు బ్యాంక్ లక్ష్యంగా ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. ఓట్లు చీలుతాయనే భయంతో ఫరూక్, శిల్పాలు మధ్యవర్తుల ద్వారా ఆయనతో రాయబారం నెరపగా.. ససేమిరా అనడం టీడీపీ శిబిరాన్ని ఇరుకున పెడుతోంది. జహీర్ వైపు టీడీపీ శ్రేణులు వెళ్లకుండా ఫరూక్ తన తనయుడు ఫిరోజ్‌ను రంగంలోకి దింపడం ఆయన మరింత రెట్టించిన ఉత్సాహంతో పని చేసేందుకు కారణమవుతోంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ రాకేష్‌రెడ్డి కుటుంబీకులు మూడు దశాబ్దాలుగా ఇదే పార్టీలో కొనసాగుతున్నారు. ఈయన స్వగ్రామం గోస్పాడు మండలంలోని సాంబవరం. మండలంలో ప్రహ్లాదరెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ పీపీ నాగిరెడ్డికి ఎమ్మెల్యే శిల్పా మద్దతునిస్తుండటంతో వారిద్దరి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ రెండేళ్ల క్రితం రాకేష్‌రెడ్డి కుటుంబం కాంగ్రెస్‌కు దూరమైంది. ఆ తర్వాత పరిణామాలతో శిల్పా టీడీపీలో చేరిపోవడంతో.. కాంగ్రెస్ తరఫున పోటీకి రాకేష్‌రెడ్డి సిద్ధమయ్యారు. ఈయన బంధువులు రాజగోపాల్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, స్వామిరెడ్డి తదితరులు కాంగ్రెస్‌లోనే కొనసాగుతుండటం రాకేష్‌రెడ్డికి కలసిరానుంది. వీరంతా శిల్పా ఓటమే ధ్యేయంగా పని చేస్తుండటం గమనార్హం. ఇదే సమయంలో గోస్పాడు మండలంలోని పసురపాడు గ్రామంలో శిల్పా ప్రధాన అనుచరుడు దామోదర్‌రెడ్డి సైతం రాకేష్‌రెడ్డి వెంట నడిచేందుకు నిర్ణయించుకోవడం శిల్పాకు మింగుడుపడటం లేదు. మొత్తం మీద శిల్పాను ఓడించడమే రాకేష్‌రెడ్డి, జహీర్ లక్ష్యం కావడంతో టీడీపీ శ్రేణులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. -
అనాథ కాంగ్రెస్
జిల్లాలో పార్టీ ఫిరాయిస్తున్న కాంగ్రెస్ నాయకులు వరుస ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయలేని పరిస్థితి కళ తప్పిన కళా వెంకట్రావు భవన్ కర్నూలు, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ జెండాను జిల్లాలో పట్టుకునే నాయకుడే కనిపించడం లేదు. ఇప్పటికే ముఖ్య నాయకులంతా పార్టీని వీడారు. ఇప్పుడు దిశా, నిర్దేశం లేకుండా పార్టీ ఒకటే మిగిలిపోయింది. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఒక్కరే పార్టీలో ఉన్నా... వచ్చే ఎన్నికల్లో ఎలా బయట పడాలనే విషయంపైనే దృష్టి తప్ప పార్టీ పునర్ నిర్మాణంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో వరుసగా వచ్చి పడిన ఎన్నికల్లో కనీసం అభ్యర్థులను కూడా ఖరారు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రతి ఎన్నికల ముందు నాయకులు, కార్యకర్తలతో కళకళలాడే కళా వెంకట్రావు భవన్ కార్యకర్తలు రాక ప్రస్తుతం కళా విహీనంగా మారిపోయింది. ఎన్నికల కోలాహలం కనిపించడం లేదు. పార్టీ కార్యాలయానికి వచ్చే నాయకులే లేకుండా పోయారు. తాజాగా నందికొట్కూరు ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి పచ్చ కండువా కప్పుకోగా ఆలూరు ఎమ్మెల్యే నీరజారెడ్డి కిరణ్ పార్టీకి జై చెప్పారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా పట్టుబట్టి మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టిన జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్ పిపి.నాగిరెడ్డి కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో దారి చూపే చుక్కాని లేని విధంగా కాంగ్రెస్ మిగిలిపోయింది. జిల్లాలో ఐదేళ్లపాటు మంత్రులుగా అధికారాన్ని అనుభవించిన టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి అందరికంటే ముందే పచ్చ కండువాలు కప్పుకుని మిగిలిన వారి వలసలకు మార్గం చూపారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తే ఆర్థికంగా ఆదుకునేదెవరనే ప్రశ్న బరిలోకి దిగుతున్న అభ్యర్థుల్లో తలెత్తుతోంది. చేతులెత్తేసిన రామయ్య: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బీవై.రామయ్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ కార్యాలయానికే పరిమితమయ్యారని చర్చ జరుగుతోంది. నిన్నటి వరకు సర్వం తానై వ్యవహరించిన టీజీ వెంట, ప్రస్తుతం పెద్ద దిక్కుగా మారిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సలహాతోనే ఆయన కార్యక్రమాలు చేపట్టారు. వరుస ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాల జిల్లా నేతలు బిజీ బిజీగా గడుపుతున్నప్పటికీ బీవై.రామయ్య మాత్రం నాయకుల అనుమతి కోసం ఎదురు చూస్తూ కార్యాలయంలోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు. పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలంతా జంప్ జిలాని అంటున్నప్పటికీ వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదని తెలిసింది. మొన్నటి వరకు జిల్లా కాంగ్రెస్‌లో జోడు పదవులు అలంకరించిన మాజీ మేయర్ రఘురామిరెడ్డి కూడా మొహం చాటేశారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ జిల్లాలో నామమాత్రంగా మారిపోయే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కార్యకర్తలూ జారుకుంటున్నారు.. జిల్లాలో ఐదు మునిసిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీలకు ఏప్రిల్ 30న పోలింగ్ జరగనుంది. 324 వార్డులకు ఆయా మునిసిపాలిటీల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కేవలం రెండు రోజుల వ్యవధి ఉన్నా ఇప్పటి వరకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కూడా జరగలేదు. అలాగే 815 ఎంపీటీసీలు, 53 జడ్పీటీసీలకు కూడా అభ్యర్థులను ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కత్తి మీద సాములా మారింది. ఈనెల 17 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారభమవుతుంది. కేవలం ఆరు రోజుల వ్యవధి ఉన్నప్పటికీ అభ్యర్థుల ఎంపికపై ఇంత వరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కసరత్తు చేయలేదు. నాయకులతో పాటు కిందిస్థాయి కార్యకర్తలు ఒక్కొక్కరు జారుకుంటుండటంతో అయోమయ పరిస్థితినెలకొంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే సరికి ఎవరు బరిలో ఉంటే వారికే బీ ఫారం ఇవ్వాలన్న ఆలోచనలో నియోజకవర్గ స్థాయి నాయకులు ఉన్నారు. గతంలో పార్టీ తరపున టికెట్ కోసం పోటీ పడిన నేతలు ప్రస్తుతం ఎన్నికల్లో మొహం చాటేస్తున్నారు. కర్నూలు నగరపాలక సంస్థకు మరో ఆరు నెలల పాటు ఎన్నికలు జరిగే పరిస్థితి లేనందున కాంగ్రెస్ పార్టీకి ఊరట కల్పించిన అంశం. -
బ్రిజేశ్ తీర్పుతో అన్యాయం
నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల నంద్యాల ప్రాంత రైతులకు అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి అన్నారు. టెక్కె మార్కెట్ యార్డు నూతన పాలక మండలి ఆదివారం ప్రమాణస్వీకారం చేపట్టింది. ఆయన మాట్లాడుతూ తీర్పుతో నికరజలాలు ఉపయోగించుకునే అవకాశం ఉండదన్నారు. రైతులు లాభసాటి ధర కోసం పోరాటాలు చేయాలన్నారు. ప్రభుత్వం పామాయిల్, చక్కెర, గోధుమలను దిగుమతి చేసుకుందని, కాని రైతులను ప్రోత్సహించడం లేదన్నారు. రసాయనాల వాడకం, నీటి యాజమాన్య పద్ధతులపై రైతుశిక్షణకేంద్రాల ద్వారా అన్నదాతలకు వివరించాలన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాలసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ మూడుసార్లు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని నంద్యాల ప్రాంతానికి ఇచ్చామని, ఇకపై తమ ప్రాంతం వారికి ఇవ్వాలని కోరారు. మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ పీపీనాగిరెడ్డి మాట్లాడుతూ మార్కెట్ కమిటీ రైతులకు అందుబాటులో ఉంటూ, సలహానిస్తూ సేవలను అందజేయాలని కోరారు. కమిటీ ప్రమాణస్వీకారం: మార్కెట్‌యార్డు కమిటీ చైర్మన్‌గా సిద్ధంశివరాం, వైస్ చైర్మన్‌గా చంద్రశేఖర్‌రెడ్డి, సభ్యులుగా వంగాల నాగనందిరెడ్డి, బిజ్జల నాగేశ్వరరెడ్డి, కడుగు బాలమద్దిలేటిరెడ్డి, బత్తుల పెద్ద సుబ్బారెడ్డి, గద్వాల సుబ్బరాయుడు, మనిపాటి మురళీ, దివిరెడ్డి భారతమ్మ, నబీరసూల్, సేగి విజయభాస్కర్‌రెడ్డి, అయ్యపుశెట్టి సుబ్రహ్మణ్యం, గడ్డం వెంకటసుదర్శనం, కేవీఎస్ఎస్ కృష్ణమూర్తి ప్రమాణస్వీకారం చేశారు. ఆర్డీఓ నరసింహులు, తహశీల్దార్‌శివరామిరెడ్డి, మాజీ చైర్మన్ కైపరాముడు, శ్రీశైలం దేవస్థానం మాజీ చైర్మన్ పెసల శ్రీనివాసులుశెట్టి, ఆర్జీఎం విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ శాంతిరాముడు పాల్గొన్నారు.