వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంద్యాల ఉప ఎన్నిక ప్రచారాన్ని ప్రారంభించారు. బుధవారం ఆయన నంద్యాల మండలం రైతునగర్‌లో రోడ్ షో నిర్వహించారు. వైఎస్ జగన్ రాకతో రైతునగర్ జనసంద్రంగా మారింది. పార్టీ కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ...‘ మీ అందరి దీవెనలు, ఆశీస్సులు వైఎస్‌ఆర్ సీపీకి ఉండాలి. పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి మద్దతు తెలపాలి. ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్నది నంద్యాల ఉప ఎన్నిక. నంద్యాల ఉప ఎన్నిక జరగకపోయి ఉంటే మంత్రులు నంద్యాలలో తిష్ట వేసేవారా?. చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. రుణమాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు.