ప్రచారమే తప్ప అభివృద్ధి ఏదీ?
►టీడీపీ నాయకులవి కల్లబొల్లి ప్రకటనలు
►ప్రజల్లో నమ్మకం కోల్పోత్ను అధికార పార్టీ
►మాజీ మంత్రి, నంద్యాల వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి
నంద్యాలవిద్య: అధికార పార్టీ ఒట్టి ప్రచారమే తప్ప..అభివృద్ధి చేయడం లేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త శిల్పామోహన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన నివాసంలో నందమూరినగర్ 37వ వార్డుకు చెందిన అల్తాఫ్ ఆధ్వర్యంలో 100మంది టీడీపీ కార్యకర్తలు.. వైఎస్సార్‌సీపీలోకి చేరారు. అదే విధంగా చాంద్‌బాడ 12వ వార్డుకు చెందిన టీడీపీ కార్యకర్తలు 100 మంది వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా శిల్పామోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న నాయకులు, మంత్రులు నంద్యాలను అభివృద్ధి చేస్తామని కల్లబొల్లి ప్రకటనలు చేస్తున్నారన్నారు. నంద్యాలలో పేదలకు 13వేల ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించినా 825మంది మాత్రమే లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారన్నారు.
దీన్నిబట్టి చూస్తే ప్రజలకు వారిపై నమ్మకం ఎలా ఉందో తేటతెల్లమవుతోందన్నారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులను అధికార పార్టీ నాయకులు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని, వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకుంటే రేషన్ డీలర్‌షిప్‌లు తొలగిస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నామన్నారు. మహిళలకు 7వేల కుట్టుమిషన్లు ఇస్తామని ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. నంద్యాలలో రోడ్ల వెడల్పు పనులు అన్ని ప్రాంతాల్లో చేయాలన్నారు.
శిల్పాతోనే అభివృద్ధి సాధ్యం...
నంద్యాల అభివృద్ధి సాధించాలంటే కేవలం శిల్పామోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుందని మాజీ మున్సిపల్ చైర్మన్ కైపరాముడు అన్నారు. దివంగత రాజశేఖర్‌రెడ్డి స్ఫూర్తితో శిల్పామోహన్‌రెడ్డి అనేక ప్రజా సంక్షేమ పథకాలను తన సొంత నిధులతో చేపట్టారని అన్నారు. నంద్యాలలో గతంలో ఎన్నుడు లేని విధంగా శిల్పా ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీ పనులు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని తెలిపారు. కేవలం అధికార పార్టీ రోడ్ల వెడల్పుతోనే అభివృద్ధి చేస్తామనడం ప్రజలను మభ్యపెట్టడమే అన్నారు. తాత్కాలిక పనులతో రాజీపడని నైజం శిల్పాదని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకుడు ఇషాక్ అహమ్మద్, కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్, వైఎస్సార్సీపీ నాయకులు ఆదిరెడ్డి, జగదీశ్వరరెడ్డి, రవికుమార్, కార్యకర్తలు మహమ్మద్ అలీ, నూర్, అబ్బాసలీం, మహబూబ్, రవి, చాంద్‌బాడ కాలనీ వాసులు అల్తాఫ్, నౌమాన్, సల్మాన్, మున్నా, యూసుఫ్, షబ్బీర్, తదితరులు పాల్గొన్నారు.
యువ ఇంజినీర్లు మద్దతు...
నంద్యాల శ్యాంనగర్ కాలనీకి చెందిన యువ ఇంజీనీర్లు శిల్పామోహన్‌రెడ్డికి మద్దతు తెలిపారు. శిల్పామోహన్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీకి విద్యావంతులైన యువకులు ఎంతో అవసరమన్నారు. మద్దతు తెలిపిన వారిలో జోయెల్, దినేష్, వినయ్, యోగేంద్ర, మహేష్, కార్తీక్, తదితరులు ఉన్నారు.