
‘ఎన్ని కుట్రలు చేసినా నేను గెలవడం ఖాయం’
నంద్యాల: ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి శనివారం ఉదయం నంద్యాలలో ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘టీడీపీ నేతలకు ఏ వీధి ఎక్కడుందో తెలియదు. ఎన్నికలు రాగానే వాళ్లకు నంద్యాల గుర్తొచ్చింది. సమస్యలపై ఎన్నిసార్లు చంద్రబాబును కోరినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు రాగానే ఏదో చేస్తామని చెప్తున్నారు. ఇన్ని రోజులు నంద్యాలను ఎందుకు పట్టించుకోలేదు?.
టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా నేను గెలవడం ఖాయం.’ అని స్పష్టం చేశారు. మరోవైపు నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 23న పోలింగ్, 28న కౌంటింగ్ జరగనుంది. ఇవాళ్టి నుంచి ఆగస్టు ఐదో తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉప సంహకరణకు ఆగస్టు 9 తుది గడువు.