Nandyal by-election
-
ఓటర్లకు డబ్బు పంచిన బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు
సాక్షి, అమరావతి: నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంపిణీ చేసిన హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగంగా డబ్బులు పంపిణీ చేసిన బాలకృష్ణపై ప్రజా ప్రాతినిధ్య చట్ట నిబంధనల కింద కేసు నమోదు చేసేలా ఎన్నికల అధికారులను ఆదేశించాలని కోరుతూ కె.శివకుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది యర్రంరెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ, బాలకృష్ణ నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా రోడ్‌షో నిర్వహించి, తరువాత ఓటర్లకు బహిరంగంగా డబ్బు పంపిణీ చేశారన్నారు. ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందన్నారు. అందువల్ల బాలకృష్ణపై కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసులో బాలకృష్ణ వాదనలు వినడం తప్పనిసరని స్పష్టం చేసింది. అందులో భాగంగా బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. బాలకృష్ణకు నోటీసులు అందచేసే వెసులుబాటును పిటిషనర్‌కు కల్పించింది. మరోవైపు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. -
వైఎస్ జగన్ కలిసిన గుంటూరు ముస్లిం యువకులు
-
చంద్రబాబు ముస్లిం ద్రోహి : మైనార్టీలు
-
వేడెక్కుతున్న నంద్యాల టీడీపీలో వర్గపోరు
-
నంద్యాలలో దారి దోపిడి
-
దళితులపై టీడీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
-
పల్లెనిద్ర పై నంద్యాల పోలీసుల ఉక్కుపాదం
-
నంద్యాల ఎన్నికల వేళ హామీలను మరిచిపోయారా
-
అవును.. నంద్యాలలో రూ.4 వేలే ఇచ్చాం
► టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, గుడా చైర్మన్ గన్ని కృష్ణ సాక్షి, రాజమహేంద్రవరం: అసలు చేసిందే తప్పు. ఆపై చేసిన ఘనకార్యాన్ని అందరి ముందు చెప్పుకోవడం తెలుగుదేశం నేతలకే చెల్లింది. నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవడానికి డబ్బును మంచినీళ్లలా ఖర్చు పెట్టిన తెలుగుదేశం నేతలు తాము చేసిన పనిని వెనుకేసుకొస్తున్నారు. అంతేకాదు చాలా తక్కువ పంచామంటూ చెప్పుకొంటున్నారు. వివారాల్లోకి వెళ్తే నంద్యాల ఉపఎన్నికలో డ్వాక్రా మహిళలకు రూ.4 వేలు ఇచ్చినమాట నిజమేనని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (గుడా) చైర్మన్ గన్ని కృష్ణ చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది ఎన్నికల నిబంధనల ఉల్లంఘనంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అనడం సరికాదన్నారు. తాము డబ్బు పంచడాన్ని ఎన్నికల దృష్టితో చూడవద్దని ఉండవల్లికి చెప్పడం విశేషం. -
నంద్యాల ఎస్ఆర్బీసీ కాలనీలో ఉద్రిక్తత
-
నంద్యాలలో టీడీపీది పచ్చిమోసం
- ఉప ఎన్నికలో ప్రభుత్వ అక్రమాలను బయటపెట్టిన మాజీ ఎంపీ ఉండవల్లి - ఎన్నికకు ముందు డ్వాక్రా మహిళల ఖాతాకు రూ. 4 వేలు జమ రాజమహేంద్రవరం సిటీ: నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ మోసాలకు సంబంధించి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సంచలన విషయాలు బయటపెట్టారు. గెలుపు కోసం ఏ విధంగా అధికార పార్టీ అడ్డదారులు తొక్కిందో సాక్ష్యాధారాలతో సహితంగా వివరించారు. సోమవారం రాజమహేంద్రవరంలోని ఆనం రోటరీ హాల్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా కేవలం నంద్యాలలో మాత్రమే డ్వాక్రా మహిళల ఖాతాల్లో చంద్రబాబు ప్రభుత్వం డబ్బు జమచేసిందని, ఉప ఎన్నికకు ముందు ఒక్కో ఖాతాలో రూ. 4 వేలు చొప్పున వేసిందని ఉండవల్లి వెల్లడించారు. జూలై 17 నుంచి ప్రారంభించి ఒక్కో గ్రూపునకు రూ. 48 వేలు చొప్పున జమచేశారని తెలిపారు. ఈ తతంగాన్ని నెల రోజుల్లో ముగించారని పేర్కొన్నారు. వాటికి సంబంధించిన పాస్బుక్ల కాపీలను మీడియాకు చూపారు. ఉప ఎన్నికకు ముందు ఇలా చేయడం చాలా తీవ్రమైన అంశమని, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని అన్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి కూడా తీసుకెళ్లాలని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు చంద్రబాబు హామీ ఇచ్చిన విధంగా రూ. పదివేల రుణాన్ని రద్దు చేయలేదు కానీ, నంద్యాలలో మాత్రం ఉప ఎన్నికకు ముందే అక్కడి మహిళల ఖాతాల్లో రూ. 4 వేలు చొప్పున జమచేయడం దారుణమని ఉండవల్లి అన్నారు. -
నంద్యాల ఉప ఎన్నిక.. సంచలన నిజాలు!
-
చంద్రబాబుతో లగడపాటి సమావేశం
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ముఖ్యమంత్రి రమ్మన్నారు, అందుకే వచ్చానని అన్నారు. తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదన్నారు. తాను చంద్రబాబును వ్యక్తిగతంగానే కలిశానని, ఏం మాట్లాడానో బయటికి చెప్పలేనన్నారు. పవర్ ప్లాంట్ ఒప్పందాల గురించి మాట్లాడారా అని మీడియా ప్రశ్నించగా, వ్యక్తిగతంగానే కలిశానంటూ సమాధానం దాటవేశారు. రాజకీయాలకు దూరం అని గతంలోనే చెప్పాను...దానికే కట్టుబడి ఉన్నానని లగడపాటి స్పష్టం చేశారు. సీఎంతో నంద్యాల సహా ఏ రాజకీయ అంశం గురించీ మాట్లాడలేదని తెలిపారు. రాజకీయ అంశాలు అయితే ఇంట్లోనో...పార్టీ కార్యాలయంలోనే కలిసే వాడినని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు సఖ్యతతో మెలగడం శుభపరిణామమని అన్నారు. కాగా గతంలోనూ లగడపాటి ....చంద్రబాబుతో సమావేశం అయిన విషయం తెలిసిందే. -
రూ. 576.62 కోట్ల రహస్య జీవో
♦ గ్రామీణాభివృద్ధి శాఖలో జారీ ♦ నంద్యాల ఉప ఎన్నికలో ఖర్చుచేసిన దానికేనని ఆరోపణలు సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం రూ.576.62 కోట్ల విడుదలకు సంబంధించి మంగళవారం రహస్య జీవోను జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ మంత్రిగా వ్యవహరిస్తున్న గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి ఈ జీవో జారీ అయింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం జారీ చేసిన జీవో నంబరు 608లో రూ.576.62 కోట్ల ప్రభుత్వ నిధులు విడుదల చేసినట్టు పేర్కొన్నారు. ఆ నిధులు ఏ పనులు నిమిత్తం విడుదల చేశారనే వివరాలను పేర్కొనాల్సిన చోట ఖాళీగా ఉంచి అందులో ‘కాన్ఫిడెన్షియల్( రహస్యం)’ అని రాశారు. ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా ఖర్చు పెట్టిన నిధులకు సంబంధించిన జీవోగా దీనిని అధికారులు పేర్కొంటున్నారు. పెట్టుబడి నిధి పథకంలో డ్వాక్రా మహిళలకు మూడో విడతగా రూ.4 వేల చొప్పున నిధులను రాష్ట్రమంతటా విదుదల చేయాల్సి ఉండగా.. ఉప ఎన్నిక నేపథ్యంలో కేవలం నంద్యాల నియోజకవర్గంలోని వారికి మాత్రమే ప్రభుత్వం నిధులను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఆ నిధులకు సంబంధించే ప్రభుత్వం రహస్య జీవో విడుదల చేసిందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
బాబు నిజాలు చెబితే టీడీపీకి మనుగడే ఉండదు: కాకాణి
సాక్షి, హైదరాబాద్ : ‘ప్రజలకు అబద్ధాలు చెప్పొద్దు.. చేసేదే చెప్పండి..’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీడీపీ ఎమ్మెల్యేలకు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలు నమ్మి టీడీపీలో అందరూ కాకపోయినా ఓ పదిశాతం మంది ఎమ్మెల్యేలు నిజాలు చెప్పడం ప్రారంభించినా.. అధికారపార్టీకి మనుగడే ఉండదని ఆయన ఎద్దేవా చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం కాకాని విలేకరులతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఓటుకు కోట్లు కేసులో నిజాలు చెప్పాలి అబద్ధాలు చెప్పొద్దంటున్న చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో నిజాలు చెప్పాలి. రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేలు సాగిస్తున్న ఇసుక, ఆలయ భూముల దోపిడీపై నిజాలే చెబితే అధికార పక్షం ప్రజాగ్రహంలో కొట్టుకుపోతుం ది. చంద్రబాబు గానీ, ఆయన ఎమ్మెల్యేలుగానీ నిజాలు చెబితే వారు ప్రజల్లో తిరిగే పరిస్థితి ఉంటుందా..?, చంద్రబాబు సిగ్గు విడిచి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు నవ్విపోతారనైనా ఆయనకు లేదు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మూడున్నరేళ్లుగా వైఎస్సార్ సీపీ ఎండగడుతోంది. చంద్రబాబు హామీలు ఇచ్చి తప్పడంపై రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. సరైన సమయంలో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ’’ అని కాకాణి అన్నారు. -
చంద్రబాబువి రియల్ టైమ్ పాలిటిక్స్ కావా?
సాక్షి, హైదరాబాద్ : కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్పలు చెబుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి విమర్శించారు. నంద్యాల ఎన్నికను నమూనాగా తీసుకోవాలని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. 2019 ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. మహా భారత యుద్ధంలో మొదట కౌరవులే విజయం సాధించారని, రాబోయే కురుక్షేత్ర మహా సంగ్రామంలో వైఎస్ఆర్ సీపీదే గెలుపన్నారు. రియల్ టైమ్ పాలిటిక్స్ అంటున్న చంద్రబాబు... ఇప్పటిదాకా ఆయన చేసింది రియల్ పాలిటిక్స్ కాదా అని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ వాపును చూసి బలుపు అని భ్రమ పడుతోందని కాకాణి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నదుల్ని నిర్వీర్యం చేసిన ఘటన చంద్రబాబుదేనని ఆయన మండిపడ్డారు. కరువుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని, తాగడానికి, వినాయక నిమజ్జనానికి నీళ్లులేవు కానీ జలసిరికి హారతా అని కాకాణి ఎద్దేవా చేశారు. -
'వెంకటేశ్వరరావును సన్మానించకపోయారా..?'
హైదరాబాద్: టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసింది అభినందన సభ కాదని, నంద్యాల, కాకినాడ ఎన్నికల జమ లెక్కల కోసమే ఆ సభను నిర్వహించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. ఈ సందర్భంగా వారు ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావును కూడా అభినందించాల్సిందని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలకంటే వెంకటేశ్వరరావే ఎక్కువగా పనిచేశారని చెప్పారు. ఆయనతోపాటు 600మంది సిబ్బంది కూడా ఎన్నికలకోసం బాగా పనిచేసిందని, వారిని కూడా సన్మానించాలని సూచించారు. అలాగే, నంద్యాల ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లని లోకేష్‌ను కూడా అభినందించాలన్నారు. మనీ, మీడియా, పోల్, పొలిటికల్ మేనేజ్మెంట్ వల్లే టీడీపీ గెలిచిందని, వచ్చే ఎన్నికల్లోను ఉప ఎన్నికల ఫలితాల మాదిరిగా ఉంటాయని భ్రమపడితే పొరపాటు అవుతుందని హితవు పలికారు. గౌతం రెడ్డి వ్యాఖ్యలు పార్టీ దృష్టికి రాగానే తక్షణమే సస్పెండ్ చేశామని చెప్పారు. అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని తమ పార్టీ సహించబోదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
పోల్ మేనేజ్మెంట్లో మనదే పైచేయి
- ఇదే ప్రతి ఎన్నికలో కొనసాగాలి - టీడీపీ నాయకత్వ శిక్షణ శిబిరంలో చంద్రబాబు సాక్షి, అమరావతి: ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికల పబ్లిక్, పొలిటికల్, పోల్ మేనేజ్మెంట్లో తెలుగుదేశం పార్టీదే పైచేయి అని నిరూపితమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. భవిష్యత్‌లో ప్రతి ఎన్నికల్లోనూ ఇదే ఒరవడి కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఓ రిసార్ట్స్‌లో నాయకత్వ శిక్షణ పేరుతో నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పనిచేసిన వారికి సోమవారం సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నంద్యాల గెలుపుతో అనేక ప్రశ్నలకు జవాబి చ్చామని, ఈ ఫలితాల వల్ల పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో చాన్స్ తీసుకోవడానికి సిద్ధంగా లేనని, గెలుపు సాధించడమే లక్ష్యమన్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికలలో అనుసరించిన పోల్‌స్ట్రాటజీ, ప్రచారశైలి, ఎలక్షన్ ఇంజనీరింగ్, బూత్ మేనేజ్మెంట్ వివరాలతో ఎల్లోబుక్ రూపొందిస్తున్నామని, భవిష్యత్తుల్లో అన్ని ఎన్నికలకు అది దిక్సూ చిగా ఉంటుందన్నారు. వచ్చే సాధారణ ఎన్నికలు షెడ్యూల్ కంటే ముందే 2018 చివర్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండా లన్నారు. సమావేశంలో కాకినాడ, నంద్యా ల ఎన్నికల్లో పనిచేసిన నాయకులం దరినీ సన్మానించారు. మండలి చైర్మన్‌గా ఫరూక్: సీఎం శాసన మండలి చైర్మన్‌గా ఎన్ఎండీ ఫరూక్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఫరూక్ బాగా పనిచేశారన్నారు. నంద్యాల ముస్లిం ఓట్లు కీలకం కావడంతో అప్పటికప్పుడు ఆ నియోజకవర్గానికి చెందిన ఫరూక్‌ను ఎమ్మెల్సీగా చేశారు. తాజాగా ఆయన్ను మండలి చైర్మన్‌గా ప్రకటించారు. -
‘నంద్యాల ప్రజలే ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి’
సాక్షి, అమరావతి : ఓటు రేటును రూ.300 నుంచి రూ.3 వేలకు పెంచిన చంద్రబాబు ధనబలంతో నంద్యాలలో గెలిచిన సంగతి అందరికీ తెలుసునని, అలాంటిది మంత్రులు, ఎమ్మెల్యేలను పంపి అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు చెబుతామనడం విడ్డూరంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఎద్దేవా చేశారు. విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్లో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘ఓటు రేటు పెంచినందుకు నంద్యాల ప్రజలే చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పాలి. 50 మంది ఎమ్మెల్యేలు, 20 మంది మంత్రులు, చోటా మోటా నాయకులు వందలాది మంది నంద్యాలలో మోహరించడంతోపాటు 10వేల పెన్షన్లు, రూ.వందల కోట్ల అభివృద్ధి పనులకు నిధులు ఇస్తామని ఎన్నికల్లో గెలిచారు’’ అని రామకృష్ణ అన్నారు. ఇంకా చంద్రబాబుకు దురాశ తగ్గలేదు: ఓట్లు కొని ఎమ్మెల్యేలు అవుతున్నారని, ఎమ్మెల్యేలను కొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని, తద్వారా సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారని సీపీఐ నేత మండిపడ్డారు. ‘‘ఇప్పటికే 21 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబుకు దురాశ తగ్గలేదు. ఇకనైనా వైఖరి మార్చుకోకపోతే ఆయనను ప్రజలు విశ్వసించరు’ అని రామకృష్ణ హితవు పలికారు. -
నంద్యాలపై టీడీపీ వింత లెక్కలు!
♦ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి ఖర్చు రూ.300 కోట్లు! ♦ అధికారులు నమోదు చేసింది రూ.16.60 లక్షలు మాత్రమే ♦ అభ్యర్థి చూపిస్తున్న ఎన్నికల వ్యయం రూ.6.49 లక్షలు కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాలలో అధికార పార్టీ అభ్యర్థి ఎన్నికల వ్యయానికి సంబంధించి చూపుతున్న లెక్కలు విస్తుగొలుపుతున్నాయి. ఎన్నికల్లో నెగ్గేందుకు కోట్లాది రూపాయలను వెదజల్లిన టీడీపీ తమ అభ్యర్థి ఖర్చు కేవలం రూ.6.49 లక్షలే అని పేర్కొనటంపై జనం నివ్వెరపోతున్నారు. ఉప ఎన్నికలో ఎలాగైనా నెగ్గేందుకు టీడీపీ డబ్బులు పారించిందనేది బహిరంగ సత్యం. నియోజకవర్గం మొత్తమ్మీద దాదాపు రూ.300 కోట్లు కుమ్మరించినట్లు అంచనా. టీడీపీ నేతల డబ్బు పంపిణీపై ‘సాక్షి’లో సాక్ష్యాలతో సహా కథనాలు ప్రచురితమయ్యాయి. చంద్రబాబు పర్యటన ఖర్చే రోజుకు రూ.కోటి ఉపఎన్నికల్లో అధికార పార్టీ మద్యాన్ని ఏరులై పారించింది. మద్యం ఖర్చే రూ.కోట్లలో ఉంది. అయితే టీడీపీ అభ్యర్థి చూపిన ఖర్చు అక్షరాలా కేవలం 6 లక్షల 49 వేల రూపాయలు మాత్రమే. కాంగ్రెస్ అభ్యర్థి కంటే దాదాపు రూ.20 వేలు ఎక్కువగా చూపారు. నామినేషన్ రోజు నుంచి పోలింగ్‌కు రెండు రోజుల ముందు వరకు టీడీపీ అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.6.49 లక్షలేనట. నంద్యాలలో 20 మందికి పైగా మంత్రులు తిష్టవేశారు. నామినేషన్ దాఖలైన తర్వాత సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటించారు. ఈ పర్యటన ఖర్చే రోజుకు రూ.కోటి వరకు ఉంటుంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా పర్యటించారు. టీడీపీ తరఫున బీజేపీ నేతలూ ప్రచారం చేశారు. అయినప్పటికీ టీడీపీ అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.6.49 లక్షలే అని చూపడం గమనార్హం. అభ్యర్థులు చేసిన ఖర్చును ఎన్నికల అధికారులు పరిశీలించి షాడో అబ్జర్వేషన్ రికార్డులో నమోదు చేస్తారు. దాని ప్రకారం కూడా టీడీపీ అభ్యర్థి చేసిన ఎన్నికల ఖర్చు రూ.16.60 లక్షలు అని చూపిస్తుండటంతో జనం నివ్వెరపోతున్నారు. ఇక వైఎస్సార్ సీపీ అభ్యర్థి రూ.17.50 లక్షలు, కాంగ్రెస్ అభ్యర్థి రూ.6.59 లక్షలు ఖర్చు చేసినట్లు షాడో అబ్జర్వేషన్ రికార్డులో నమోదు చేశారు. కాగా వైఎస్సార్సీపీ అభ్యర్థి రూ.10.39 లక్షలు, కాంగ్రెస్ అభ్యర్థి రూ.6.67 లక్షలు ఎన్నికల ఖర్చుగా చూపారు. -
బాలకృష్ణ డబ్బు పంపిణీపై పోలీసుల వద్దకు ఎందుకు వెళ్లలేదు?
ప్రశ్నించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లకు బహిరంగంగా డబ్బులు పంచిన హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఎందుకు ఆశ్రయించలేదని పిటిషనర్, వైఎస్సార్ సీపీ నేత శివకుమార్‌ను హైకోర్టు ప్రశ్నించింది. కేసు నమోదు విషయంలో ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు వినియోగించుకోకుండా కేసు నమోదు చేయాలని ఎన్నికల కమిషన్నే ఎలా కోరతారని ప్రశ్నించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. -
‘చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు’
సాక్షి, కర్నూలు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య మండిపడ్డారు. ఉప ఎన్నిక సందర్భంగా సీఎం సహా, మంత్రులు నంద్యాలలో తిష్టవేసి అవినీతి సొమ్మును వెదజల్లి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఆయన ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే ఐజయ్య బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... భూమా నాగిరెడ్డికి పీఏసీ పదవి ఇచ్చి వైఎస్ఆర్ సీపీ గౌరవించిందని, అయితే చంద్రబాబు భూమాకు ఆశలు కల్పించి పొట్టన పెట్టుకున్నారన్నారు. భూమా నాగిరెడ్డి ఏ పార్టీ నుంచి గెలిచాడో ఆ పార్టీకి రాజీనామా చేసుంటే పోటీ పెట్టేవాళ్లం కాదన్నారు. అలా చేయనందునే నంద్యాలలో పోటీ అనివార్యమైందని ఐజయ్య అన్నారు. అభివృద్ధికి ఓటేశారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారని, అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాకే చంద్రబాబుకు నంద్యాల గుర్తొచ్చిందని ఎద్దేవా చేశారు. ఓటుకు రూ.5వేలు ఇస్తామని చంద్రబాబే బహిరంగంగా చెప్పినా ఈసీ కేసు పెట్టలేదని ఎమ్మెల్యే ఐజయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజ్యాంగరీత్యా అది తప్పు అని, చంద్రబాబు సీఎం కాబట్టే కేసులు పెట్టలేదని అన్నారు. టీడీపీ నేతలంతా ఇంటింటికీ ప్రచారం చేస్తూ మీరు ఓటేయకపోతే పెన్షన్ ఆగిపోతుందని ఓటర్లను భయపెట్టారని, నంద్యాలలో బాబు ఓటుకు రూ.5వేలపైన అవినీతి సొమ్మును వెదజల్లాడని, చీరలు, ముక్కుపుడకలు కుమ్మరించారని ఐజయ్య తూర్పారబట్టారు. -
నంద్యాల చెప్పే నిజం
-
చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం..
హైదరాబాద్ : నంద్యాల ఉప ఎన్నికను నమునాగా తీసుకుని ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి పార్ధసారధి అన్నారు. ఉప ఎన్నిక గెలుపు కోసం టీడీపీ రూ.200 కోట్లు ఖర్చు పెట్టిందని ఆయన విమర్శించారు. ఓటరు మెడపై కత్తిపెట్టి, ప్రలోభపెట్టి గెలవడం నమూనా ఎలా అవుతుందని పార్థసారధి సూటిగా ప్రశ్నించారు. 175 నియోజకవర్గాలకు వచ్చే ఎన్నికలలో రూ.35వేల కోట్లు ఖర్చు పెట్టడమే నంద్యాల నమూనా? అని అన్నారు. పెన్షన్లు,రేషన్ రద్దు చేస్తాం అని చెబుతూ చేతిలో 6000 పెట్టి రాష్ట్రమంతా ఓట్లడుగుతారా? రాష్ట్రవ్యాప్తంగా నంద్యాల మోడల్ అంటే ఇదేనా అంటూ ప్రశ్నలు సంధించారు. నంద్యాల మోడల్ 2019 ఎన్నికల్లో టీడీపీని ఇంటికి పంపిస్తుందన్నారు. రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసి చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికపై దృష్టి పెట్టారని మండిపడ్డారు. 70వేలమంది ఓటర్లకు సెల్యూట్ వైఎస్ఆర్ సీపీకి ఓటేసిన 70వేలమంది ఓటర్లకు సెల్యూట్ చేస్తున్నామని, నంద్యాల ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే చూస్తూ ఊరుకోమని పార్థసారధి హెచ్చరించారు. టీడీపీ నేతలకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానంలో ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. -
చంద్రబాబు వ్యాఖ్యలు హాస్యాస్పదం..
-
రాష్ట్ర వ్యాప్తంగా నంద్యాల నమూనా
-
‘చంద్రబాబు పోటుగాడు, అనుభవజ్ఞుడు కాదు’
♦దమ్ముంటే 175 స్థానాల్లో పోటీకి రావాలి ♦సొంత నియోజకవర్గంలో గెలవలేక చంద్రబాబు సొల్లు కబుర్లు ♦చంద్రబాబులా దొంగదారులు వెతుక్కునే వ్యక్తి కాదు జగన్.. ♦బాబు పాలనకు నూకలు చెల్లాయి ♦2019లో వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చి తీరుతుంది హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నానీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి వల్లే నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ గెలిచిందన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. సొంత నియోజకవర్గంలో గెలవలేకపోయిన ఆయన సొల్లు చెబుతున్నారని మండిపడ్డారు. దమ్ము, ధైర్యం ఉంటే 20మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఇంకా దమ్ముంటే 175 స్థానాల్లో పోటీకి రావాలన్నారు. అప్పుడు తాము రెఫరెండంగా స్వీకరిస్తామని అన్నారు. ఎమ్మెల్యే కొడాలి నాని మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘చంద్రబాబు పోటుగాడు కాదు...అనుభవజ్ఞుడు కాదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు ఎంపీ స్థానాల్లో డిపాజిట్ కోల్పోయాడు. 44 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే...21చోట్ల చంద్రబాబు డిపాజిట్ కోల్పోయారు. పది స్థానాలతో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికలో 250మందికి పోస్టల్ బ్యాలెట్స్ ఇస్తే 39మంది పంపారు...అవి కూడా చెల్లలేదు. అంటే ఉద్యోగులు వాళ్ల నిరసనను ఈ విధంగా తెలిపారు. ఇప్పటివరకూ నారావారిపల్లెలో ఎనిమిదిసార్లు ఎన్నికలు జరిగితే.. మూడుసార్లు మినహా అన్నిసార్లు ఓడిపోయారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన సొంత నియోజకవర్గంలో నాలుగుసార్లు ఎన్నికలు జరిగాయి. ఒక్కసారి కూడా టీడీపీ గెలవలేకపోయింది. కానీ చంద్రబాబు సొల్లు చెబుతారు. ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీతో పోరాటం చేశానంటాడు. మనం వింటే బ్రిటీష్ వారితో కూడా పోరాటం చేశానని సొల్లు చెబుతారు. ఇందిరాగాంధీ ఆదేశిస్తే ఎన్టీఆర్‌పై కూడా పోటీ చేస్తానన్న నీచ చరిత్ర చంద్రబాబుది.’ అని తూర్పారబట్టారు. జగన్ పోరాట యోధుడు.. ఓ ఎమ్మెల్యే, ఎంపీతో మొదలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టే స్థాయికి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. బాబు పాలనకు నూకలు చెల్లాయి. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి తీరుతుంది. ఎన్ని సమస్యలు, కష్టాలు వచ్చినా అన్నమాట మీద నిలబడే వ్యక్తి. మాట తప్పని, మడమ తిప్పని పోరాట యోధుడు. చంద్రబాబులా దొంగదారులు వెతుక్కునే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిపైనా విమర్శలా. మా పార్టీ గుర్తుపై గెలిచినవారా మా నాయుకుడిన విమర్శించేది. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. నంద్యాల వైఎస్ఆర్ సీపీ సీటు కాబట్టే పోటీ చేశాం. చంద్రబాబు ధన, అంగబలం ఉపయోగిస్తాడని తెలిసి కూడా బాబు మాదిరిగా దొంగదారులు చూసుకోకుండా పోటీ చేసి పోరాటం చేసిన యోధుడు జగన్. చంద్రబాబు 1999లో బీజేపీతో కలిసి పోటే చేస్తే 43 శాతం, 2004లో 37 శాతం, 2009లో 28 శాతం. ఆ తరువాత బై ఎలక్షన్ లో 22 శాతం. 2014 మొన్నటి ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంతో కలుపుకుంటే 31 శాతం. చంద్రబాబు పార్టీ రోజురోజుకు తరుగుతుంది. చంద్రబాబుకు ఇంత రాజకీయ అనుభవం ఉండి అంత పోటుగాడైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 44చోట్ల ఎందుకు గెలుచుకోలేకపోయాడు. బొబ్బిలి నుంచి టీడీపీ పార్లమెంట్ సభ్యుడు చనిపోతే వాళ్ల అబ్బాయిని పెట్టి ఎన్నికల్లో పోటీ చేశాడు. కాంగ్రెస్ అభ్యర్థి బొత్స ఝాన్సీ చేతిలో ఘోరంగా ఓడిపోయాడు. రాష్ట్రంలో, కేంద్రంలో ఉప ఎన్నికలు జరిగితే 99శాతం అధికారానికే అవకాశం ఉంటుందని కొడాలి నాని అన్నారు. విజయవాడ పటంలో పెట్టారు.. హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టానని చంద్రబాబు గొప్పలు చెబుతారు. కానీ ఓటుకు నోటు కేసులో దొంగలా దొరికిపోతే కేసీఆరే హైదరాబాద్ నుంచి తట్టా బుట్టా సర్దించి చంద్రబాబును విజయవాడ పటంలో పెట్టాడు. చంద్రబాబు నీవు ఎలాంటోడివో, ఎలాంటి రాజకీయాలు చేస్తవో ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అని ఎమ్మెల్యే నాని ఎద్దేవా చేశారు. డేరా బాబా గురువే చంద్రబాబా.. డేరా బాబా గురువు చంద్రబాబా. నీపై సీబీఐ విచారణ జరిపితే జీవితాంతం జైల్లోనే ఉంటావు. చంద్రబాబు నమ్మకద్రోహి, దొంగ అని స్వయంగా ఎన్టీఆరే చెప్పారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావును అడిగినా చెబుతారు. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తిని అడిగినా చెబుతారు అని ఎమ్మెల్యే నాని ధ్వజమెత్తారు. -
‘నంద్యాల’ విజేత నల్లధనమే!
డేట్లైన్ హైదరాబాద్ ఒక్కసారి శోభా నాగిరెడ్డి మరణం సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎన్నికల బరిలో ఉండగా ప్రమాదంలో మరణిస్తే కనీసం ఆ పిల్లలను పలకరించని, ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించని చంద్రబాబు, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అసెంబ్లీలో ప్రతిపక్షం పట్టుపడితే తప్ప మొక్కుబడిగా సంతాప తీర్మానం కూడా పెట్టని బాబు, ఆయన పార్టీ పాపం తల్లితండ్రులు లేని పసిపిల్లలు అని ఇప్పుడు సానుభూతి చూపడం ఓట్లు దండుకోవడానికే కదా! ఏ ఆట అయినా గెలవడానికే ఆడతారు ఎవరయినా! ఏ ఎన్నికలో అయినా గెలవాలనే పోటీ చేస్తుంది ఏ రాజకీయ పార్టీ అయినా! ఫలితాలు వెలువడిన తరువాత సమీక్షించుకోవడం సహజం. ఈ సమీక్ష మామూలుగా ఓడిన పక్షం వైపే ఎక్కువగా జరుగుతుంది. ఏయే కారణాల వల్ల ఓడిపోయాం? ఎక్కడ పొరపాటు జరిగింది? భవిష్యత్తులో గెలవడానికి పనితీరును ఎట్లా మెరుగు పరుచుకోవాలి...? ఇలా, ఈ రీతిలో సమీక్షించుకుంటారు. సోమవారం దేశ వ్యాప్తంగా జరిగిన నాలుగు శాసనసభా స్థానాల ఉప ఎన్నికల్లో అధికార పక్షాలే గెలుపొందాయి. గోవాలో రెండు స్థానాలనూ అక్కడి అధికార పక్షం భారతీయ జనతా పార్టీ, ఢిల్లీలో ఒక స్థానం అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల స్థానాన్ని అధికార పక్షం తెలుగుదేశం పార్టీ గెల్చుకున్నాయి. మందీ మార్బలం, హంగూ ఆర్భాటం, అధికార యంత్రాంగం తమ పక్షాన పనిచేస్తాయి కాబట్టి సాధారణంగా ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా అధికార పక్షాన్నే గెలుపు వరించడం సహజం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఉప ఎన్నికల్లో అధికార పక్షం ఓడిపోవడం చూస్తాం. ఉప ఎన్నికలలో ఇది మామూలే ఇటీవలి చరిత్ర పరిశీలిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి ఫలితాలను మనం చూశాం. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు 2006లో కేంద్ర మంత్రి పదవికీ, కరీంనగర్ లోక్‌సభ స్థానానికీ రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీ చేసినప్పుడు అధికార కాంగ్రెస్ అభ్యర్థి మీద రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తరువాత డాక్టర్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీకీ, పార్లమెంట్ సభ్యత్వానికీ రాజీనామా చేసి కడప పార్లమెంట్ స్థానానికి మళ్లీ పోటీ చేసినప్పుడు అద్భుతమయిన ఆధిక్యం సాధించారు. ఆయనతో బాటు డాక్టర్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మి కూడా పులివెందుల శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ మంచి మెజారిటీతో గెలుపొందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తరువాత జగన్మోహన్రెడ్డికి మద్దతుగా శాసనసభ్యత్వాలకూ, పార్లమెంట్ సభ్యత్వాలకూ రాజీనామాలు చేసి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో అత్యధికులు గెలిచిన విషయం తెలిసిందే. ఆ తరువాత తెలంగాణలో కూడా పలువురు వివిధ పార్టీల శాసనసభ్యులు రాజీ నామా చేసి ఉప ఎన్నికల్లో గెలుపొందారు. ఈ అన్ని సందర్భాల్లోనూ కొన్ని స్పష్టమయిన అంశాలు ఎన్నికలను ప్రభావితం చేశాయి. కేసీఆర్ పోటీ చేసినప్పుడు, ఆ తరువాత తెలంగాణలో పలువురు శాసనసభ్యులు పోటీ చేసిన ప్పుడు ఉప ఎన్నికల మీద తెలంగాణ ఉద్యమ ప్రభావం తీవ్రంగా ఉండటం చూశాం. జగన్మోహన్రెడ్డి పోటీ చేసిన ఉప ఎన్నిక తండ్రి మరణానంతరం ఆయన పట్ల కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరి బలంగా ప్రభావం చూపింది. ఆ తరువాత కాలంలో వైఎస్ఆర్ సీపీలో చేరిన ఇతర పార్టీల ఎంఎల్ఏల ఉప ఎన్నికల సందర్భంలో కూడా ఇదే అంశం అధికార పక్షం ఓడిపోడానికి కారణం అయింది. 2004 నుంచి 2014 దాకా చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న కాలంలో 40కి పైగా శాసనసభా స్థానాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు జరిగితే ఎక్కడా తెలుగుదేశం పార్టీ గెలవకపోగా 20 స్థానాలకు పైగా డిపాజిట్లు కూడా కోల్పోవడం గమనార్హం. ఈ మాట ఇక్కడ ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే నంద్యాల ఉప ఎన్నిక ఫలితం వెలువడగానే కొందరు తెలుగుదేశం మంత్రులు, నాయకులు విజయోత్సాహం తట్టుకోలేక ప్రతిపక్షం పని అయిపోయింది, ఇక జగన్మోహన్రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుంటుంది అని నోటికి వచ్చినట్టు మాట్లాడారు. మరి అంత దీనస్థితిలోకి తెలుగుదేశం పార్టీ ఆనాడు దిగజారితే ఆ పార్టీకి నాయకుడిగా చంద్రబాబునాయుడు ఎందుకు సన్యాసం తీసుకోలేదు? నంద్యాలలో శిల్పా మోహన్‌రెడ్డి ఓటమికి ఆనాడు టీడీపీ వారి ఓటమికి ఎక్కడయినా పోలిక ఉందా? తప్పించుకోలేరు కాబట్టే... ఇక నంద్యాల ఉప ఎన్నిక విషయానికి వద్దాం. ఈ అసెంబ్లీ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు చెందినది. ఈ స్థానం నుంచి గెలిచి, పార్టీ ఫిరాయించి అధికార పక్షానికి వలసపోయిన నాగిరెడ్డి మరణం కారణంగా అక్కడ ఉప ఎన్నిక జరిగింది. నంద్యాలతో బాటు తమ పార్టీ నుంచి అధికార పక్షానికి వలసపోయిన మరో 20 శాసనసభా స్థానాలకు కూడా ఆ ఎంఎల్ఏలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తూనే ఉంది. అందుకు ఏ మాత్రం సాహసం చెయ్యని చంద్రబాబునాయుడుకు నాగిరెడ్డి ఆకస్మిక మృతితో అక్కడ ఉప ఎన్నికకు వెళ్లక తప్పలేదు. ఇప్పుడు నంద్యాలలో గెలిచాక ఇకపైన ఎక్కడ ఎన్నిక జరిగినా తమ పార్టీయే గెలుస్తుందని ప్రకటించుకున్నారు. అదేక్షణం మరి మిగిలిన 20 స్థానాలకు ఉప ఎన్నికలకు సిద్ధమేనా అంటే సమాధానం దాటవేసి వెళ్లిపోయారు. ఆ ఇరవై స్థానాలలో కూడా జరిగితే...! నిజంగానే నంద్యాల ప్రజలు ఈ మూడేళ్ల రెండుమాసాల కాలంలో ఆయన ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసిన తీరుకు ముచ్చట పడి ఓట్లేసి గెలిపించి ఉంటే మిగిలిన 20 స్థానాల్లో కూడా ఎన్నికలను ఎదుర్కోడానికి వెనకాడటం ఎందుకు? ఆ సాహసం ఆయన చేయరన్న విషయం అందరికీ తెలుసు. అదే చేయవలసి వస్తే ఓ నాలుగువేల కోట్ల రూపాయలు ఖర్చు చెయ్యాలి. ఒక్క ఎన్నిక కాబట్టి నంద్యాలలో 200 కోట్లతో సరిపెట్టారు. అట్లాగే ఒక్కచోటే ఎన్నిక కాబట్టి మొత్తం మంత్రివర్గాన్నీ, ఎంఎల్‌ఏలనూ, ఎంపీలనూ నెల రోజులపాటు నంద్యాలలోనేవిడిది చేయించారు. అధికార యంత్రాంగాన్ని, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ మొత్తాన్ని మోహరింప చెయ్యగలిగారు. ఫలితం వెలువడగానే మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రే స్వయంగా చెప్పారు, నంద్యాల ఉప ఎన్నిక కారణంగా రాష్ట్రమంతటా అభివృద్ధి ఆగిపోయిందని. ఒక్క ఉప ఎన్నిక కోసం మొత్తం అధికార యంత్రాంగాన్ని నంద్యాలకు తరలించమని ఎవరు చెప్పారు ఆయనకు? ఆ అవసరం ఎందుకొచ్చిందట! ఇంత చేస్తే ఈ మాత్రం గెలుపు సాధించగలిగారు. నంద్యాల ఫలితం వెలువడ్డ తరువాత పలువురు తెలుగుదేశం సీనియర్ నాయకులు సంతోషానికి బదులు దిగులు పడ్డారట. ఎందుకంటే ఒక్క నంద్యాల ఎన్నికకే 50 స్థానాల్లో పోటీ చేసినంత కష్టపడ్డాం, ఇక 2019 ఎన్నికలను ఎట్లా ఎదుర్కోవాలో అని ఆందోళన చెందారట. అట్లాంటిది ఇప్పుడు 20 స్థానాలకు ఒక్కసారే ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఇదంతా ఎట్లా సాధ్యం అవుతుంది? అందుకే చంద్రబాబు ఆ పనికి సిద్ధంగా లేకపోగా మీ ఎంపీలతో రాజీనామా చెయ్యించండని వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు సవాలు విసురుతున్నారు. ఇప్పుడు జరగాల్సింది ఏమిటి? సక్రమంగా గెలిచిన పార్లమెంట్ సభ్యులు రాజీనామా చెయ్యడమా, అక్రమంగా పార్టీ ఫిరాయించిన ఎంఎల్ఏలు రాజీనామా చెయ్యడమా? దబాయించేస్తే సరిపోతుంది అనుకుంటే ఎలా? గెలుపు ఎవరిది? ఇంతకీ నంద్యాలలో ఎవరు గెలిచారు? మొత్తం ఎన్నికల కాలంలో ఒక్క క్షణం కూడా నోరు విప్పని భూమా బ్రహ్మానందరెడ్డి గెలిచారా, ఆయనకు టికెట్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గెలిచారా? సాంకేతికంగా గెలిచింది తెలుగుదేశం అభ్యర్ధి బ్రహ్మానందరెడ్డి అయినా, అసలు గెలిచింది మాత్రం మితిమీరిన అధికార దుర్వినియోగం, వందల కోట్ల రూపాయల నల్లధనం, అభివృద్ధి పేరిట జరిగిన విధ్వంసం, గెలిపించకపోతే అభివృద్ధిని ఆపేస్తామన్న బెదిరింపులు. నిజానికి నంద్యాల ఉపఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనవ్వుల పాలయ్యారు. పెద్ద నోట్ల రద్దు (డిమోనిటైజేషన్)తో నల్లధనం మొత్తం బయట పడిపోయిందని మోదీ చెబుతుంటే ఆయన మిత్రపక్షం తెలుగుదేశం మాత్రం నంద్యాల వీధుల్లో నల్లధనం పారిం చింది. భూమా నాగిరెడ్డి మరణం, అంతకు ముందే ఆయన భార్య శోభా నాగిరెడ్డి మరణం ఈరెండింటినీ సానుభూతిగా మలచి తనకు అనుకూలంగా మార్చుకోడానికి కూడా చంద్రబాబునాయుడు ఏ అవకాశమూ వదిలిపెట్టలేదు. తల్లీతండ్రీ లేని పిల్లలను చూసి తెలుగుదేశంకు ఓటు వెయ్యండని నంద్యాల వీధుల్లో ఆ ఇద్దరి మరణానికి సంబంధించిన వీడియోలు, లేజర్ షోలు చూపించారు. ఒక్కసారి శోభా నాగిరెడ్డి మరణం సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎన్నికల బరిలో ఉండగా ప్రమాదంలో మరణిస్తే కనీసం ఆ పిల్లలను పలకరించని, ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించని చంద్రబాబునాయుడు, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అసెంబ్లీలో ప్రతిపక్షం పట్టుపడితే తప్ప మొక్కుబడిగా సంతాప తీర్మానం కూడా పెట్టని చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ పాపం తల్లితండ్రులు లేని పసిపిల్లలు అని ఇప్పుడు సానుభూతి చూపడం ఓట్లు దండుకోవడానికే కదా! నంద్యాలలో ఓడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి పార్టీ ఫిరాయింపుల విషయంలో జాతీయ స్థాయిలో చర్చకు తెర తీయడంలో విజయం సాధించారు. ఆరేళ్ల శాసన మండలి సభ్యత్వానికి శిల్పా చక్రపాణిరెడ్డి చేసిన రాజీనామా చిన్న త్యాగం కాదు. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలను సమీక్షించుకోవాల్సింది ఎవరు? సాధారణంగా ఏ ఎన్నిక ఫలితాన్నయినా సమీక్షించుకునేది ఓడిపోయిన పక్షమే. కానీ ఇక్కడ అష్టకష్టాలు పడి, అన్ని అడ్డదారులూ తొక్కి గెలిచి ఓడిన అధికార పక్షమే సమీక్ష చేసుకోవాల్సిన పరిస్థితి. datelinehyderabad@gmail.com దేవులపల్లి అమర్ -
నంద్యాల చెప్పే నిజం
ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గోవాల్లో ఈ నెల 23న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. షరా మామూలుగా అన్నిచోట్లా పాలక పక్షాలే విజయం సాధించాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించడం వల్ల నంద్యాల స్థానానికి ఎన్నిక అవసరమైంది. కేంద్ర రక్షణ మంత్రి పదవి నుంచి తప్పుకుని గోవా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన మనోహర్ పరీకర్ కోసం బీజేపీ శాసనసభ్యుడు రాజీనామా చేయడంతో పణజీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ రాష్ట్రంలోనే వాల్పోయ్ నియోజక వర్గంలో కాంగ్రెస్ నుంచి గెలిచి బీజేపీకి ఫిరాయించిన విశ్వజిత్ రాణే శాసన సభ్యత్వాన్ని వదులుకోవడం వల్ల ఆ స్థానానికీ ఎన్నిక తప్పలేదు. ఆయన తిరిగి ఎన్నికయ్యారు. ఢిల్లీలోనూ ఫిరాయింపు కారణంగానే ఉప ఎన్నిక జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే వేద్‌ప్రకాశ్ మొన్న మార్చిలో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి, శాసనసభ్యత్వాన్ని వదులుకున్నారు. కానీ ఉప ఎన్నికలో ఆయన పరాజయం పాలయ్యారు. అధికారపక్షమైన ఆప్ అక్కడ గెలిచింది. గోవా, ఢిల్లీల్లో ఫిరాయించినవారు అనుసరించిన ప్రమాణాలనే ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన 20 మంది ఫిరాయింపుదారులు కూడా పాటించి ఉంటే నంద్యాల ఒక్కచోట మాత్రమే కాదు... ఆ ఇరవై స్థానాల్లో కూడా ఉప ఎన్నికలు తప్పకపోయేవి. వారిని చేర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నైతిక విలువలకు తాను సహస్రయోజనాల దూరమని దశాబ్దాలక్రితమే ఎటూ నిరూపించుకున్నారు. కనీసం ఆ పంచన చేరినవారిలో ఒక్కరైనా తాము నైతికంగా ఉన్నతులమని చెప్పుకునే ప్రయత్నం చేయలేదు. వారిలో కొందరు మంత్రి పదవులు కూడా దక్కించుకుని తరించారు. పైపెచ్చు నంద్యాల ఫలితాన్నే ఆ స్థానాలకు కూడా అన్వయించుకోవాలని మర్కట తర్కానికి దిగుతున్నారు. గోవా, ఢిల్లీల్లో బీజేపీలోకి ఫిరాయించినవారు పాత పార్టీల ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవుల్ని వదులుకున్నారు గనుక బీజేపీ ఉన్నత ప్రమాణాలు పాటించిందనుకోనవసరం లేదు. వారిని రాజీనామా చేయమని కోరిందా లేక వారే స్వచ్ఛందంగా తప్పుకున్నారా అనే విచికిత్స కూడా అనవసరం. ఆ విషయంలో తనకు పెద్ద పట్టింపు లేదని బీజేపీ అరుణాచల్‌ప్రదేశ్‌లో నిరుడు నిరూపించుకుంది. ఆంధ్ర ప్రదేశ్‌లో ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్న తెలుగుదేశంతో చెలిమిని కొనసాగిస్తోంది. తమ నుంచి ఫిరాయించిన ఇద్దరు ఎంపీలపై అనర్హత వేటు వేయాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ ఫిర్యాదు లోక్‌సభ స్పీకర్ వద్ద మూడేళ్లుగా పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఇది చాలదన్నట్టు నంద్యాల ఉప ఎన్నిక గెలిచినందుకు బాబును స్వయానా ప్రధాని నరేంద్రమోదీ అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఆ ఎన్నిక ఎందుకు అవసరమైందో మోదీకి తెలియదనుకోలేం. పైగా అక్కడ ఎడాపెడా జరిగిన అధికార దుర్వినియోగం, సృష్టించిన భయానక వాతావరణం సంగతి ఆయనకు చేరి ఉండాలి. కనీసం తమను అక్కడ బాబు ప్రచారానికే రానీయకుండా అవమానించారన్న విషయం తెలిసి ఉండాలి. గోవా, ఢిల్లీల్లో తమ పార్టీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ జనం తీర్పు కోరినందుకైనా నంద్యాల విషయంలో ఆయన మౌనంగా ఉండిపోతే వేరుగా ఉండేది. నంద్యాల అగ్నిపరీక్ష ఎదుర్కొనడం తప్పదని గ్రహించినప్పటినుంచీ అధికార తెలుగుదేశం అక్కడ సాగించిన అరాచకాలకూ, అధికార దుర్వినియోగానికీ అంతు లేదు. అంతకిత్రం నంద్యాలసహా విపక్షం గెలిచిన 67 స్థానాల్లోనూ కనీసం ఒక్కచోటైనా బాబు సర్కారు అభివృద్ధి ఊసెత్తలేదు. ఫిరాయింపులు జరిగాక ఆ 21 చోట్ల కూడా పెద్దగా ఒరిగిందేమీ లేదు. కానీ ఉప ఎన్నిక అనేసరికి గుండెల్లో రైళ్లు పరుగెత్తి ఆగమేఘాలపైన నంద్యాలలో స్వల్ప వ్యవధిలో రూ. 1,400 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టింది. చేతికి ఎముక లేకుండా జీవోలు జారీ చేసింది. ‘అవిగో ఇళ్లు... ఇవిగో పింఛన్లు, రోడ్లు’ అంటూ హడావుడి చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల్లో, సానుభూతిపరుల్లో భయోత్పాతం సృష్టించే ప్రయత్నం చేసింది. స్వయానా ఆ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఇంటివద్దే పోలీసుల్ని మోహరిం చడంతోపాటు ఇతర నాయకుల ఇళ్లపై అర్ధరాత్రుళ్లు పోలీసు దాడులు చేయించింది. ఇవన్నీ ఒకపక్క కొనసాగిస్తూనే రూ. 200 కోట్ల మేర టీడీపీ నల్లడబ్బు ఖర్చు చేసిందన్న ఆరోపణలున్నాయి. స్వయానా చంద్రబాబే కులాలవారీ సమావేశాలు పెట్టి ప్రలోభపెట్టాలని చూశారు. ‘నా పింఛన్ తీసుకుంటున్నారు... నేనేసిన రోడ్లపై నడుస్తున్నారు, నాకు ఓటెందుకు వేయరంటూ' ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయ త్నాలకు దిగారు. తన సొంత ఆస్తుల్ని జనానికి దోచిపెడుతున్నట్టు మాట్లాడారు. దాదాపు కేబినెట్నంతటినీ, 70మంది ఎమ్మెల్యేలనూ అక్కడ దించారు. ప్రచార పర్వం ముగిశాక ఎక్కడివారక్కడికి పోవాల్సి ఉండగా వారిలో చాలామంది నంద్యా లలోనే తిష్టవేసి బెదిరింపుల పర్వాన్ని కొనసాగించారు. చేసిందంతా చేసి నంద్యాల ఫలితం తన పాలనపై రిఫరెండమని బాబు చెప్పుకుంటున్నారు. విషాదమేమంటే ఎన్నికల సంఘం అధికారులకు ఎప్పటికప్పుడు ఫిర్యాదులు అందినా వారు సరైన చర్యలు తీసుకోలేకపోయారు. ఒక ఉదంతంలో చర్య తీసుకోక తప్పనందుకు ఆ సంస్థపై బాబు ఆరోపణలు చేయడం చూస్తే ఎవరికైనా డేరా బాబా గుర్తుకు రాకమానడు. ఎన్నో అత్యాచారాలు, అఘాయిత్యాలకూ పాల్పడిన డేరా బాబా మూడు కేసుల్లో శిక్ష పడేసరికి తనకేదో అన్యాయం జరిగిందని లబలబలాడి మూడు రాష్ట్రాల్లో ఎలా విధ్వంసం సృష్టించాడో అందరికీ తెలుసు. బాబు తొలిసారి పాలనలోనే డేరా బాబాకు సాటిరాగల నయూముద్దీన్ పుట్టుకొచ్చాడు. లెక్కలేనన్ని హత్యలు, అత్యాచారాలు, ఇతర అఘాయిత్యాలు బాబు సర్కారు ఆశీస్సులతో కొనసాగించాడు. ఏదేమైనా నంద్యాల ఉప ఎన్నిక తంతు చూస్తే ఎన్నికల సంఘానికంటూ కింది స్థాయి వరకూ శాశ్వత ప్రాతిపదికన సొంత వ్యవస్థ ఉండాలనీ, అది మరింత సమర్ధవంతంగా పనిచేసేలా నిబంధనలుండాలని, ఆ సంఘం ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు తీసుకునే ఏర్పాటుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. -
రివైండ్ రివ్యూ
-
‘చంద్రబాబు పోటుగాడు, అనుభవజ్ఞుడు కాదు’
-
దమ్ముంటే 175 స్థానాల్లో పోటీకి రావాలి
-
నంద్యాలలో ప్రలోభ పెట్టి గెలిచారు
-
అది అప్రజాస్వామిక గెలుపు
- ఆ తరహా విజయాలను చూసి బెదిరేది లేదు - చంద్రబాబుపై ధ్వజమెత్తిన భూమన కరుణాకర్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, తిరుపతి: నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీకి దక్కింది అప్రజాస్వామిక గెలుపు మాత్రమేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. ఈ తరహా విజయాలను చూసి బెదిరిపోవడం, ఢీలా పడటం వంటివి తమకు లేనేలేవని స్పష్టం చేశారు. నంద్యాల ఓటర్లు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే ద్విగుణీకృత ఉత్సాహంతో పార్టీని ముందుకు తీసుకుపోతామని భూమన చెప్పారు. సోమవారం ఉదయం తిరుపతి టీఎంఆర్ కల్యాణ మండపంలో నవరత్నాలసభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భూమన నంద్యాల ఎన్నికల ఫలితాలపై అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం చంద్రబాబు పన్నిన కుట్రలను వివరించారు. నంద్యాల ఎన్నికల్లో అధికార పార్టీ అడ్డదారుల్లో విజయాన్ని దక్కించుకుందన్నారు. రూ. 1,500 కోట్ల ప్రభుత్వ సొమ్మును, రూ. 500 కోట్ల అవినీతి డబ్బును నంద్యాల సెగ్మెంట్లో అ«ధికార పార్టీ వెదజల్లిందన్నారు. ఒక వైపు పోలీసులు, మరో వైపు అన్ని విభాగాల అధికార యంత్రాంగంతో బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. రూ. 2వేల నోట్ల కట్టలను లారీలతో తెచ్చి వెదజల్లారని, చంద్రాబాబు దుర్మార్గమైన రాజకీయాన్ని నడిపారని భూమన ధ్వజమెత్తారు. -
అధికార బలంతోనే నంద్యాలలో విజయం
వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స కొత్తపల్లి (పిఠాపురం): నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అధికార బలంతోనే విజయం సాధించిందని, ఓటర్లను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆయన సోమవారం పార్టీ నాయకులతో కలిసి తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లిలో పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి దొరబాబు గృహంలో విలేకరులతో మాట్లాడారు. నంద్యాల ఎన్నికలో కోట్లాది రూపాయలను ఖర్చుపెట్టి అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడి విజయం సాధించారని విమర్శించారు. రోడ్లపై నడవనిచ్చేది లేదని, పింఛన్లు నిలిపివేస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ముద్రగడ ఉద్యమాన్ని అణచివేసే ధోరణి విడనాడాలన్నారు. సమావేశంలో పార్టీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, పిఠాపురం నియోజక వర్గ కోఆర్డినేటర్ పెండెం దొరబాబు, రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు, మండల పార్టీ అధ్యక్షుడు ఆనాల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. అది సానుభూతి గెలుపు: తమ్మినేని శ్రీకాకుళం అర్బన్: నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధితో కాకుండా భూమా దంపతుల సానుభూతితో గెలుపొందిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం చెప్పారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నంద్యాలలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా అధికార పార్టీ వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. చంద్రబాబు బావమరిది, సినీ నటుడు బాలకృష్ణ స్వయంగా డబ్బులు పంపిణీ చేస్తూ మీడియాకు అడ్డంగా దొరికిపోయారన్నారు. టీడీపీ చేసిన అభివృద్ధితోనే గెలిచామని చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు చెప్పగలరా? అని ప్రశ్నించారు. అలాగైతే వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధపడాలని సవాల్ విసిరారు. ప్రలోభాల గెలుపు: ఎమ్మెల్యే కంబాల జోగులు రాజాం: నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి గెలిచిందని శ్రీకాకుళం జిల్లా రాజాం వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే కంబాల జోగులు తెలిపారు. ఆయన రాజాంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. నంద్యాల ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. 2009–2014 మధ్య పలు పర్యాయాలు ఉప ఎన్నికలు జరిగిన సందర్భాల్లో అన్ని చోట్లా టీడీపీ ఘోరపరాజయం చవిచూసిందని, చాలా చోట్ల డిపాజిట్లు కూడా రాలేదని గుర్తుచేశారు. -
ప్రలోభాలదే పైచేయి
♦ నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ విజయం ♦ 27,466 ఓట్ల మెజారిటీతో నెగ్గిన భూమా బ్రహ్మానందరెడ్డి ♦ పోస్టల్ బ్యాలెట్‌కు స్పందన కరువు ♦ ‘నోటా’కు నాల్గో స్థానం కర్నూలు (అర్బన్)/ నంద్యాల : నంద్యాల ఉప ఎన్నికలో ప్రలోభాలదే పైచేయి అయ్యింది. డబ్బు పంపిణీతో పాటు అధికార దుర్వినియోగం, బెదిరింపులు, అభివృద్ధి ఆగిపోతుందన్న ప్రచారం..ఇలా పలు అంశాలు అధికార పార్టీ విజయానికి దోహదపడ్డాయి. ఆ పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తన సమీప ప్రత్యర్థి, వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిపై 27,466 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ మొదలుకుని పోలింగ్ వరకు సర్వత్రా ఉత్కంఠ, ఆసక్తి కొనసాగిన విషయం విదితమే. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా శిల్పామోహన్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి ప్రధానంగా పోటీ పడ్డారు. కాంగ్రెస్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నా వారికి కనీస స్థాయిలో కూడా ఓట్లు లభించలేదు. ఎన్నిక ప్రక్రియలో భాగంగా ఈ నెల 23న పోలింగ్ నిర్వహించగా, సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,18,858 మంది ఓటర్లు ఉండగా, 1,73,187 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 97,076 ఓట్లు, వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 69,610 ఓట్లు లభించాయి. దీంతో బ్రహ్మానందరెడ్డి 27,466 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపును మొత్తం 19 రౌండ్లుగా చేపట్టారు. మొదటి రౌండ్ నుంచి 15వ రౌండ్ వరకు తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో కొనసాగగా.. 16వ రౌండ్లో వైఎస్సార్సీపీ అభ్యర్థికి 654 ఓట్లు అధికంగా వచ్చాయి. మిగిలిన 17, 18, 19 రౌండ్లలో కూడా టీడీపీ ఆధిక్యత చాటుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ ఖాదర్‌కు కేవలం 1,382 ఓట్లు రావడం గమనార్హం. ‘నోటా’కు ఏకంగా 1,231 ఓట్లు లభించడంతో నాల్గో స్థానంలో నిలిచింది. మిగిలిన అభ్యర్థుల్లో అబ్దుల్‌సత్తార్‌కు 338, భవనాశి పుల్లయ్య 154, రాఘవేంద్ర 75, రావు సుబ్రమణ్యం 94, వల్లిగట్ల రెడ్డప్ప 108, మహబూబ్‌బాషా 400, కాంతారెడ్డి 234, గురువయ్య 122, నరసింహులు మాదిగ 802, బాలసుబ్బయ్య 289, ముద్దం నాగనవీన్ 789, రఘునాథరెడ్డి 483 ఓట్లు సాధించరారు. నంద్యాల పట్టణంతో పాటు నంద్యాల మండలంలోని గ్రామాల్లో టీడీపీ భారీ మెజార్టీ సాధించింది. గోస్పాడు మండలంలో మాత్రం ఆ పార్టీకి 800 మెజార్టీ వచ్చింది. పోస్టల్ బ్యాలెట్‌కు స్పందన కరువు ఎన్నికల అధికారులు మొత్తం 250 మందికి పోస్టల్ బ్యాలెట్లను పంపారు. ఇందులో చిరునామాలు సక్రమంగా లేని కారణంగా 39 పోస్టల్ బ్యాలెట్లు తిరిగి వచ్చాయి. మిగిలిన 211 పోస్టల్ బ్యాలెట్లను సంబంధిత ఉద్యోగులు ఉపయోగించుకోలేదని ఎన్నికల అధికారులు ప్రకటించారు. అభివృద్ధి ఆగుతుందని.. ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం నంద్యాలలో ఆగమేఘాలపై అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. హడావుడిగా రోడ్ల విస్తరణ ప్రారంభించడంతో పాటు పలు పనులకు శంకుస్థాపనలు చేసింది. మొత్తమ్మీద రూ.1,500 కోట్ల వరకు అభివృద్ధి పనులకు మంజూరు చేస్తూ జీవోలు విడుదల చేసింది. ఉప ఎన్నికలో టీడీపీ గెలవకపోతే ఈ పనులన్నీ ఆగిపోతాయని, రోడ్ల విస్తరణ బాధితులకు పరిహారం కూడా రాదని..ఇలా పలువిధాలుగా ప్రచారం సాగించారు. అలాగే పింఛన్లు, రేషన్ నిలిపిపోతాయని లబ్ధిదారులను బెదిరించారు. భారీగా డబ్బుతో పాటు చీరలు, ముక్కుపుడకలు పంపిణీ చేశారు. ప్రత్యర్థి పార్టీ నాయకులు, మద్దతుదారులపై పోలీసులను ఉసిగొల్పారు. ఈ విధంగా ప్రలోభపెట్టి, భయపెట్టి, దౌర్జన్యాలు చేసి అధికార పార్టీ గెలిచిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. డబ్బు, అధికారంతోనే టీడీపీ గెలుపు టీడీపీ కేవలం డబ్బు, అధికారంతోనే ఉప ఎన్నికలో విజయం సాధించింది. నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి మా పార్టీ శ్రేణులను టార్గెట్ చేయడమే కాకుండా ప్రలోభాలకు గురిచేశారు. లొంగని వారిని సోదాల పేరిట భయపెట్టారు. అభివృద్ధి చేస్తానని చంద్రబాబు చెప్పిన మాటలను ప్రజలెవరూ నమ్మలేదు. కేవలం పింఛన్లు, కార్డులు తొలగిస్తారన్న భయంతోనే టీడీపీకి ఓటు వేశారు. భూమా కుటుంబంపై సింపతీ కూడా కొద్దివరకు పనిచేసింది. ఓడినా, గెలిచినా నంద్యాల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. వారి సమస్యల పరిష్కారమే ధ్యేయం. – శిల్పా మోహన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ అభ్యర్థి అభివృద్ధి పనులు కొనసాగిస్తాం నంద్యాలలో అభివృద్ధి పనులు కొనసాగిస్తాం. భూమా నాగిరెడ్డి ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి నన్ను గెలిపించారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు నా విజయానికి కృషి చేశారు. అందరికీ కృతజ్ఞతలు. – భూమా బ్రహ్మానందరెడ్డి, టీడీపీ అభ్యర్థి -
ప్రలోభాలదే పైచేయి
► నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ విజయం ► 27,466 ఓట్ల మెజారిటీతో నెగ్గిన భూమా బ్రహ్మానందరెడ్డి ► పోస్టల్ బ్యాలెట్‌కు స్పందన కరువు ► ‘నోటా’కు నాల్గో స్థానం డబ్బు, అధికారంతోనే టీడీపీ గెలుపు టీడీపీ కేవలం డబ్బు, అధికారంతోనే ఉప ఎన్నికలో విజయం సాధించింది. నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి మా పార్టీ శ్రేణులను టార్గెట్ చేయడమే కాకుండా ప్రలోభాలకు గురిచేశారు. లొంగని వారిని సోదాల పేరిట భయపెట్టారు. అభివృద్ధి చేస్తానని చంద్రబాబు చెప్పిన మాటలను ప్రజలెవరూ నమ్మలేదు. కేవలం పింఛన్లు, కార్డులు తొలగిస్తారన్న భయంతోనే టీడీపీకి ఓటు వేశారు. భూమా కుటుంబంపై సింపతీ కూడా కొద్దివరకు పనిచేసింది. ఓడినా, గెలిచినా నంద్యాల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా. వారి సమస్యల పరిష్కారమే ధ్యేయం. – శిల్పా మోహన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ అభ్యర్థి అభివృద్ధి పనులు కొనసాగిస్తాం నంద్యాలలో అభివృద్ధి పనులు కొనసాగిస్తాం. భూమా నాగిరెడ్డి ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి నన్ను గెలిపించారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు నా విజయానికి కృషి చేశారు. అందరికీ కృతజ్ఞతలు. – భూమా బ్రహ్మానందరెడ్డి, టీడీపీ అభ్యర్థి కర్నూలు (అర్బన్)/ నంద్యాల : నంద్యాల ఉప ఎన్నికలో ప్రలోభాలదే పైచేయి అయ్యింది. డబ్బు పంపిణీతో పాటు అధికార దుర్వినియోగం, బెదిరింపులు, అభివృద్ధి ఆగిపోతుందన్న ప్రచారం..ఇలా పలు అంశాలు అధికార పార్టీ విజయానికి దోహదపడ్డాయి. ఆ పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తన సమీప ప్రత్యర్థి, వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిపై 27,466 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ మొదలుకుని పోలింగ్ వరకు సర్వత్రా ఉత్కంఠ, ఆసక్తి కొనసాగిన విషయం విదితమే. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా శిల్పామోహన్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి ప్రధానంగా పోటీ పడ్డారు. కాంగ్రెస్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నా వారికి కనీస స్థాయిలో కూడా ఓట్లు లభించలేదు. ఎన్నిక ప్రక్రియలో భాగంగా ఈ నెల 23న పోలింగ్ నిర్వహించగా, సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,18,858 మంది ఓటర్లు ఉండగా, 1,73,187 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 97,076 ఓట్లు, వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 69,610 ఓట్లు లభించాయి. దీంతో బ్రహ్మానందరెడ్డి 27,466 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపును మొత్తం 19 రౌండ్లుగా చేపట్టారు. మొదటి రౌండ్ నుంచి 15వ రౌండ్ వరకు తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో కొనసాగగా.. 16వ రౌండ్లో వైఎస్సార్సీపీ అభ్యర్థికి 654 ఓట్లు అధికంగా వచ్చాయి. మిగిలిన 17, 18, 19 రౌండ్లలో కూడా టీడీపీ ఆధిక్యత చాటుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ ఖాదర్‌కు కేవలం 1,382 ఓట్లు రావడం గమనార్హం. ‘నోటా’కు ఏకంగా 1,231 ఓట్లు లభించడంతో నాల్గో స్థానంలో నిలిచింది. మిగిలిన అభ్యర్థుల్లో అబ్దుల్‌సత్తార్‌కు 338, భవనాశి పుల్లయ్య 154, రాఘవేంద్ర 75, రావు సుబ్రమణ్యం 94, వల్లిగట్ల రెడ్డప్ప 108, మహబూబ్‌బాషా 400, కాంతారెడ్డి 234, గురువయ్య 122, నరసింహులు మాదిగ 802, బాలసుబ్బయ్య 289, ముద్దం నాగనవీన్ 789, రఘునాథరెడ్డి 483 ఓట్లు సాధించరారు. నంద్యాల పట్టణంతో పాటు నంద్యాల మండలంలోని గ్రామాల్లో టీడీపీ భారీ మెజార్టీ సాధించింది. గోస్పాడు మండలంలో మాత్రం ఆ పార్టీకి 800 మెజార్టీ వచ్చింది. పోస్టల్ బ్యాలెట్‌కు స్పందన కరువు ఎన్నికల అధికారులు మొత్తం 250 మందికి పోస్టల్ బ్యాలెట్లను పంపారు. ఇందులో చిరునామాలు సక్రమంగా లేని కారణంగా 39 పోస్టల్ బ్యాలెట్లు తిరిగి వచ్చాయి. మిగిలిన 211 పోస్టల్ బ్యాలెట్లను సంబంధిత ఉద్యోగులు ఉపయోగించుకోలేదని ఎన్నికల అధికారులు ప్రకటించారు. అభివృద్ధి ఆగుతుందని.. ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం నంద్యాలలో ఆగమేఘాలపై అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. హడావుడిగా రోడ్ల విస్తరణ ప్రారంభించడంతో పాటు పలు పనులకు శంకుస్థాపనలు చేసింది. మొత్తమ్మీద రూ.1,500 కోట్ల వరకు అభివృద్ధి పనులకు మంజూరు చేస్తూ జీవోలు విడుదల చేసింది. ఉప ఎన్నికలో టీడీపీ గెలవకపోతే ఈ పనులన్నీ ఆగిపోతాయని, రోడ్ల విస్తరణ బాధితులకు పరిహారం కూడా రాదని..ఇలా పలువిధాలుగా ప్రచారం సాగించారు. అలాగే పింఛన్లు, రేషన్ నిలిపిపోతాయని లబ్ధిదారులను బెదిరించారు. భారీగా డబ్బుతో పాటు చీరలు, ముక్కుపుడకలు పంపిణీ చేశారు. ప్రత్యర్థి పార్టీ నాయకులు, మద్దతుదారులపై పోలీసులను ఉసిగొల్పారు. ఈ విధంగా ప్రలోభపెట్టి, భయపెట్టి, దౌర్జన్యాలు చేసి అధికార పార్టీ గెలిచిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
బెదిరించి.. ప్రలోభపెట్టి..
- నంద్యాలలో టీడీపీ విజయతీరం చేరిందిలా.. - ఈ స్థాయిలో అధికార దుర్వినియోగమా..? - విస్తుపోతున్న రాజకీయ విశ్లేషకులు సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ విజయానికి.. బెదిరింపులు, ప్రలోభాలతో పాటు అభివృద్ధి ఆగిపోతుందనే ఆందోళన, పింఛన్లు– రేషన్‌కార్డులు తీసేస్తారనే భయం.. ఇలా అనేక కారణాలు దోహదం చేశాయని విశ్లేషకులంటున్నారు. నోటిఫికేషన్ కంటే ముందు హడావుడిగా మొదలుపెట్టిన రోడ్ల విస్తరణ పనులు మధ్యలోనే ఉండటంతో అధికార పార్టీకి ఓటు వేయకపోతే పనులు నిలిపివేస్తారనే భయాన్ని నంద్యాల నియోజకవర్గ ప్రజల్లో కలిగించిందని వారు పేర్కొంటున్నారు. అలాగే సర్వే టీంల పేరుతో ‘మీకు వస్తున్న పింఛన్, రేషన్‌కార్డు తీసివేయకుండా ఉండాలంటే టీడీపీకి ఓటు వేయాలి’అని అధికారపార్టీ నేతలు మానసికంగా భయపెట్టే విధంగా గూండాయిజం చేయడంతో ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందారని, ఇవన్నీ అధికారపార్టీకి అనుకూలంగా ఓటేయడానికి ఉపయోగపడ్డాయని విశ్లేషకులంటున్నారు.. ఇక మొత్తం కేబినెట్ నంద్యాలలోనే తిష్టవేసి కులాలు, మతాల వారీగా విడదీసి.. ప్యాకేజీలు ప్రకటించడంతో పాటు అనేక ప్రలోభాలకు గురిచేశారు. ప్రతిపక్ష పార్టీ గెలిస్తే మాత్రం ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో ఏమి చేయగలదు? అనే వాదనను కూడా అధికార పార్టీ కరపత్రాలు వేసి మరీ ప్రచారం సాగించింది. అంతటితో ఆగకుండా ఓటుకు ఇంత రేటు అని నిర్ణయించి అధికారపార్టీ డబ్బు పంపిణీ జరిపింది. డబ్బు పంపిణీ ఏ స్థాయిలో జరిగిందంటే ఓటుకు రూ.2,000 నుంచి రూ.10,000 వరకు పంచారని, పోలింగ్ రోజు చివరి నిమిషం వరకు కూడా ఈ పంపిణీ కొనసాగిందంటే అధికారపార్టీ ఎంత ‘జాగ్రత్త’గా వ్యవహరించిందో అర్ధమౌతోందని పరిశీలకులంటున్నారు. పదే పదే ప్రలోభాలు : వాస్తవానికి నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ కంటే ముందునుంచీ∙కేబినెట్లో సగం మంది మంత్రులు నంద్యాలలో తిష్టవేశారు. కులాలు, మతాల వారీగా సమావేశాలు నిర్వహించారు. అధికారులను అడ్డం పెట్టుకుని మరీ బెదిరింపులకు దిగారు. ఆయా కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తామని ఆశ చూపారు. ఎవరికి ఎంతివ్వాలనేది స్పష్టంగా నిర్ణయించి ఆ మేరకు నగదు పంపిణీ చేశారు. ఉదాహరణకు నంద్యాల రూరల్ మండలంలో ఒక సర్పంచ్‌కు ఏకంగా రూ.కోటి అందజేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక మసీదులు, చర్చిల మరమ్మతుల పేరుతో రూ.30 లక్షలు, రూ.20 లక్షల చొప్పున ఇచ్చారు. నంద్యాల పట్టణంలోని ఒక చర్చికి రూ.కోటి ఇస్తామని స్వయంగా ఓ మంత్రి బహిరంగంగా ప్రకటించడం గమనార్హం. పది ఓట్లు ఉన్న వారికి కూడా లక్షలకు లక్షలు అందజేశారు. రోడ్ల విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారిని తమ పార్టీకి ఓటు వేయకపోతే నష్టపరిహారం అందించేది లేదని బెదిరించారు. పోలింగ్ సమయంలో కూడా పక్కనే ఉన్న నియోజకవర్గంలో తిష్టవేసి మరీ డబ్బు పంపిణీ వ్యవహారాలను మంత్రులు పర్యవేక్షించారు.అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా నంద్యాలలోనే తిరుగుతూ డబ్బు పంపిణీ చేపట్టారు. బూత్ స్థాయిలో ఎవరెవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది లెక్కలు గడుతూ వారందరినీ కొనుగోలు చేశారు. మాట వినకపోతే బెదిరింపులకు దిగారు. వైఎస్సార్సీపీ వెంట నడిచే వారిని సోదాల పేరుతో వేధించారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను మొత్తం నంద్యాలలోనే దించి టీడీపీకి అనుకూలంగా లేనివారిని బెదిరించడమో, ప్రలోభపెట్టడమో చేశారు. సర్వేల పేరుతో బెదిరింపులు : రోడ్ల విస్తరణ పనులు ఆగిపోతాయనే భయాన్ని సృష్టించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పింఛన్, రేషన్కట్ అవుతాయంటూ సర్వే టీంలు ఇంటింటికీ తిరుగుతూ గూండాయిజం చేశాయి. ఇతర జిల్లాలకు చెందిన యువకులను, నారాయణ కాలేజీకి చెందిన యువకులను సర్వే పేరుతో తిప్పుతూ... పింఛన్, రేషన్ లబ్ధిదారుల వివరాలతో వారి ఇళ్లకు వెళ్లి మరీ బెదిరింపులకు దిగారు. ఇక మైనార్టీల్లో శిల్పా మోహన్‌రెడ్డిపై విపరీతంగా విష ప్రచారం చేశారు. ముస్లిం యువతపై రౌడీషీటు తెరిపించారని దుష్ప్రచారం సాగించారు. వీటికితోడు సానుభూతి అంశం కూడా పనిచేసింది. తల్లీ తండ్రి లేని పిల్లలపై పోటీనా అంటూ సీఎం స్థాయిలో సానుభూతిని రెచ్చగొట్టి... ఓట్లుగా మలచుకునే ప్రయత్నం చేశారు. మొత్తం మీద అభివృద్ధి ఆగిపోతుందనే ఆందోళన, పింఛన్లు, రేషన్‌కార్డులు తొలగిస్తారనే భయానికి తోడు ఉప ఎన్నికలో ప్రతిపక్ష పార్టీకి ఓటు వేసినా జగన్ సీఎం కాడుకదా అనే భావన అధికార పార్టీ విజయానికి దోహదపడ్డాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
నంద్యాల సీటు టీడీపీకి
- తెలుగుదేశం అభ్యర్థి భూమాకి 97,076 ఓట్లు - వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 69,610 ఓట్లు సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన నంద్యాల ఉప ఎన్నికలో అధికార తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపొందారు. ప్రధానంగా తెలుగుదేశం–వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య సాగిన ఈ పోరులో బ్రహ్మానందరెడ్డి 27,466 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 97,076 ఓట్లు రాగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 69,610 ఓట్లు లభించాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ ఖాదర్‌కు కేవలం 1,382 ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత స్థానం నోటా(నన్ ఆఫ్ ద ఎబోవ్)కు దక్కింది. 1,231 ఓట్లతో ‘నోటా’ ఏకంగా నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం. ఒక్క రౌండ్ మినహా అన్ని రౌండ్లలోనూ టీడీపీకి స్పష్టమైన ఆధిక్యత లభించింది. అన్ని రౌండ్ల ఫలితాల అనంతరం భూమా బ్రహ్మానందరెడ్డి ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ ప్రకటించారు. మొత్తం 250 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా.. సదరు చిరునామాల్లో ఓటర్లు లేకపోవడంతో 39 తిరిగొచ్చాయి. మిగిలిన 211లో ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం గమనార్హం. మొత్తం పోలైన ఓట్లలో టీడీపీ అభ్యర్థికి 56.05 శాతం, వైఎస్సార్సీపీ అభ్యర్థికి 40.19 శాతం లభించాయి. పోలైన ఓట్లు 1,73,187 నంద్యాల నియోజకవర్గంలో మొత్తం 2,18,858 ఓట్లు ఉన్నాయి. ఈ నెల 23న జరిగిన ఉప ఎన్నికలో మొత్తం 1,73,187 ఓట్లు పోలయ్యాయి. అంటే మొత్తం ఓట్లలో 79.13 శాతం పోలయ్యా యి. ఈ ఓట్లను సోమవారం 19 రౌండ్లలో లెక్కించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం వరకూ కొనసాగింది. విజయం ఎవరిదనే విషయంలో మాత్రం ఉదయం 11 గంటలకే స్పష్టత వచ్చింది. మొత్తం 19 రౌండ్లలో ఒక్క 16వ రౌండ్ మినహా మిగిలిన అన్ని రౌండ్లలోనూ టీడీపీకి మెజార్టీ వచ్చింది. 16వ రౌండ్లో గోస్పాడు మండలం దీబగుంట్ల గ్రామం ఉండటంతో వైఎస్సార్సీపీకి 654 ఓట్ల మెజార్టీ లభించింది. మిగిలిన 18 రౌండ్లలో అధికార టీడీపీ అభ్యర్థికే మెజార్టీ దక్కింది. నంద్యాల గ్రామీణ ప్రాంతంతోపాటు నంద్యాల అర్బన్లోనూ టీడీపీకి భారీ ఆధిక్యత రాగా, గోస్పాడు మండలంలో మాత్రం మెజార్టీ 2,000 కంటే తక్కువే లభించింది. నాలుగో స్థానంలో ‘నోటా’ నంద్యాల ఉప ఎన్నికలో ‘నోటా’ ఏకంగా నాలుగో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తర్వాత అత్యధిక ఓట్లు వచ్చింది ‘నోటా’కే కావడం విశేషం. కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న అబ్దుల్ ఖాదర్‌కు 1,382 ఓట్లు రాగా, నోటాకు 1,231 ఓట్లు లభించాయి. ఇక రాయలసీమ పరిరక్షణ సమితి(ఆర్పీఎస్) అభ్యర్థికి పెద్దగా ఓట్లు రాలేదు. మిగిలిన స్వతంత్ర అభ్యర్థుల్లో ఒక్కరికి కూడా 1,000 ఓట్లకు మించి పడలేదు. -
పోల్మేనేజ్మెంట్ చేయలేదు
- నంద్యాల విజయం శక్తినిచ్చింది - మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు సాక్షి, అమరావతి: నంద్యాల ఉప ఎన్నికలో తాను పోల్ మేనేజ్మెంట్ చేయలేదని, విశ్వసనీయతను చూసి జనం ఓటేశారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఈ విజయం తెలుగుదేశం పార్టీకి మంచి శక్తినిచ్చిందని, నంద్యాల ఓటర్లు అభివృద్ధికి పట్టం కట్టారని చెప్పారు. నంద్యాల ఎన్నిక ఫలితం అనంతరం ఆయన మంత్రులతో కలసి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. నంద్యాల అభివృద్ధిని చూసే ప్రజలు టీడీపీకి ఓటేశారని అన్నారు. నంద్యాల నియోజకవర్గానికి ఓ ప్రాధాన్యత ఉందని, ఒక రాష్ట్రపతిని, ఒక ప్రధానిని అందించిన నియోజకవర్గమన్నారు. భవిష్యత్‌లో నంద్యాలను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. నంద్యాల ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషన్ కూడా పక్షపాతంగా వ్యవహరించిందని, ఇరుపక్షాలను సమానంగా చూడలేదని చెప్పారు. ప్రతిపక్ష నేత పదమూడు రోజులు నంద్యాలలో ఉండి ఓటర్లను భయపెట్టారని, ప్రలోభాలకు గురిచేశారని, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారని.. వాటికి ప్రజలు లొంగకుండా తమ పార్టీకి ఓటు వేశారని పేర్కొన్నారు. భూమా నాగిరెడ్డి చాలా మంచివారని, చనిపోయే ముందురోజు కూడా వచ్చి తనను నియోజకవర్గ అభివృద్ధికి సాయం చేయాలని అడిగారని వెల్లడించారు. భూమా బ్రహ్మానందరెడ్డి యువకుడని, అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా ఉంటారని అభిప్రాయపడ్డారు. తనకు ఇలాంటి ఎన్నికలు కొత్త కాదని, ఎన్నో ఎన్నికలు చూశానని, ప్రతిపక్ష పార్టీకే కొత్త అని, అందుకే తత్తరపాటుకు గురయ్యారని చెప్పారు. తనకు పదే పదే ఎన్నికలు రావడం ఇష్టం లేదని, తరచూ ఎన్నికలు వస్తుంటే అభివృద్ధి కుంటుపడుతుందని, అందుకే జమిలి ఎన్నికలు నిర్వహించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఒక ముఖ్యమంత్రిపై ప్రతిపక్ష నేత చేసిన వ్యాఖ్యలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. తాను రాజకీయాల్లో ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ లాంటి వాళ్లతో పోరాటం చేశానని చెప్పారు. నంద్యాల విజయంపై టీడీపీకి ప్రధాని శుభాకాంక్షలు న్యూఢిల్లీ: నంద్యాల ఉప ఎన్నిక ఫలితాల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘నంద్యాల ఉప ఎన్నికలో విజయాన్ని అందుకున్న భూమా బ్రహ్మానందరెడ్డికి, ఎన్డీఏ మిత్ర పక్షమైన టీడీపీకి శుభాకాంక్షలు’ అని మోదీ సోమవారం ట్వీట్ చేశారు. -
ప్రలోభ పెట్టి గెలిచారు
నంద్యాలలో ఓటర్లను బెదిరించారు.. భయపెట్టారు: వైఎస్ జగన్ - కొనుగోలు చేసిన ఆ 20 మందితో రాజీనామాలు చేయించండి - ఎన్నికల్లో వాళ్లను గెలిపించండి... అదీ రెఫరెండం... సవాల్ - విలువలే మాకు ప్రాణం.. శిల్పా సోదరులకు హ్యాట్సాఫ్ - మాకూ టైం వస్తుంది... మేమూ సత్తా చూపిస్తాం - బాబు మోసాలపై ప్రజలకు అవగాహన ఉంది సాక్షి, హైదరాబాద్: అధికార దుర్వినియోగంతో గెలిచిన నంద్యాల ఉప ఎన్నికను చంద్రబాబు తన విజయంగా భావిస్తే అంతకన్నా దిగజారుడు రాజకీయం మరొకటి ఉండదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇంకో ఏడాది ఆయన పాలనే ఉంటుందని ప్రజలు భయపడి ఓట్లేశారని విశ్లేషించారు. అధికార పార్టీ ఎన్ని రకాలుగా భయభ్రాంతులకు గురిచేసినా, ప్రలోభాలకు పాల్పడినా తమ పార్టీకి ధైర్యంగా ఓటేసిన నంద్యాల ప్రజలకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ విలువలకే కట్టుబడి ఉంటోందని, ఇక ముందు కూడా ఇదే కొనసాగుతుందని జగన్ పునరుద్ఘాటించారు. అలాంటి విలువలను గౌరవించిన శిల్పా సోదరులకు హాట్సాఫ్ తెలిపారు. ఉప ఎన్నికలో పార్టీకి అండగా నిలిచిన ప్రతీ కార్యకర్తకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే.... అడుగడుగునా బెదిరింపులే... ‘‘నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా అధికార పార్టీ అన్ని రకాల అధికార దుర్వినియోగానికి పాల్పడింది. రూ. 200 కోట్లకు పైగా డబ్బులు పంచారు. పోలీసులను ఇష్టానుసారం వాడుకున్నారు. బాధాకరమైన విషయం ఏమిటంటే... ఓటర్ల దగ్గరకు మనుషులను పంపించి, ఇదిగో మీ ఆధార్ కార్డు, ఓటేయకపోతే పెన్షన్ కట్ అంటూ భయపెట్టారు. అయినా ధైర్యంగా ఓట్లేసిన నంద్యాల ప్రజలందరికీ చేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతున్నాను. నంద్యాల ఎన్నికల్లో పార్టీ కోసం ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య, ఇన్ని ప్రలోభాల మధ్య, ఇన్ని భయాల మధ్య పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తలకు చేతులెత్తి ధన్యవాదాలు చెబుతున్నాను. విజయంగా భావిస్తే మూర్ఖత్వమే... ఈ ఎన్నికను చంద్రబాబు నాయుడు విజయంగా భావిస్తే అది చాలా దిగజారుడు రాజకీయమే. కారణం ఏమిటంటే ఎన్నికల ప్రచారంలోనే అందరూ చూశారు. ప్రతీ చోట ప్రజలతో మమేకమయ్యాను. ప్రజలకే ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టాను. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు... అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన మోసం ప్రజలే చెప్పారు. రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు... ఆ తర్వాత ఏ విధంగా మోసం చేశాడనేది వాళ్ళే చెప్పారు. ఇంటింటికీ ఉద్యోగం అని చెప్పి, అ«ధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా నిరుద్యోగులను మోసం చేశాడో వాళ్ళే చెప్పారు. నిరుద్యోగులకు రూ. 2 వేల నిరుద్యోగ భృతి అని ఏ విధంగా మోసం చేశాడో చెప్పారు. రేషన్ కార్డుల దగ్గర్నుంచి, రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యం వరకూ... ఆఖరుకు కరెంట్ బిల్లులతో సహా ప్రతి విషయంలోనూ ఏ విధంగా మోసపోయామనేది ప్రజలే చెప్పారు. బాబు మోసం చేసిన వ్యక్తి అని ఆయనకు వ్యతిరేకంగా ప్రజలు చేతులెత్తే పరిస్థితి ప్రతీ మీటింగ్‌లోనూ చూశాం. ఈ పరిస్థితుల్లో టీడీపీ గెలవడానికి ఒకే ఒక కారణం ఏమిటంటే... ఇవి సాధారణ ఎన్నికలు కావు. కాబట్టి ఈ రోజు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేసినా ఆయన వెంటనే అధికారంలోంచి తప్పుకోడు. ఇంకా ఒక సంవత్సరం ఆయనతోనే కొనసాగక తప్ప, మరో గత్యంతరం లేదు కాబట్టే ప్రజలు భయపడి, ఆయనిచ్చిన డబ్బులకు ఒప్పుకుని టీడీపీకి ఓట్లు వేశారే తప్ప... ఇది ఏ రకంగానూ చంద్రబాబు విజయం కాదు. ఇదే విజయం అనుకుంటే ఇంతకంటే మూర్ఖుడు ప్రపంచంలోనే ఉండడు. విలువలే మా ప్రాణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ విలువలతో కూడిన రాజకీయాలకే కట్టుబడి ఉంది. ఎప్పుడు ఎన్నికలకు వెళ్ళినా... వేరే పార్టీ ఎమ్మెల్యేలు వైఎస్సార్ సీపీలోకి రావాలనుకుంటే కచ్చితంగా రాజీనామాలు చేసి రావాలనే విలువలతో కూడిన రాజకీయాలే చేశాం. అలా చేసిన తరువాతే పార్టీ కండువాలు వేస్తాం. అలాంటి విలువ అన్న పదానికి శిల్పా మోహన్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి అర్థం తీసుకొచ్చారు. పార్టీలో చేరాలంటే ముందుగా పదవికి రాజీనామా చేయాలంటే ... ఆరేళ్ళు ఉన్న ఎమ్మెల్సీ పదవికి కేవలం మూడు నెలల్లోనే మారు మాట్లాడకుండా శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా చేశారు. శిల్పా సోదరులకు హ్యాట్సాఫ్ చెబుతున్నా.. ఆ 20 మందిని గెలిపించండి చూద్దాం ఇది రెఫరెండం ఎలా అవుతుంది? ఒకే ఒక్కచోట ఎలక్షన్ జరపడం... మొత్తం రూ.200 కోట్లు డబ్బు గుమ్మరించడం... మంత్రులందరినీ కూర్చోబెట్టడం ... భయభ్రాంతులను చేసే విధంగా పోలీసులను వాడుకోవడం లాంటి పరిస్థితులు సృష్టించి ఎన్నిక జరిపితే ఇది రెఫరెండం ఎలా అవుతుంది? చంద్రబాబుకు సవాల్ విసురుతున్నా ...వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలను ఒకేసారి తీసుకుని రా. 20 చోట్ల రూ.4,000 కోట్లు ఎలా ఖర్చు పెడతావో చూస్తా. 20 చోట్ల పోలీసులు నీ మాట వింటారేమో చూస్తా... 20 చోట్ల ఎలా భయపెట్టగలవో చూస్తా... అదీ రెఫరెండం అంటే. మా పార్టీ గుర్తుమీద గెలిచి, తన పార్టీలో చేరిన వాళ్ళను... తన గుర్తు మీద మళ్ళీ వాళ్ళను గెలిపించుకునే ధైర్యం చంద్రబాబుకు లేదు. రాజకీయాల్లో గుండె ధైర్యం ఉండాలి. అవతల వ్యక్తి దెబ్బలు కొట్టినప్పుడు కాస్త వెనక్కు పోగలుగుతామే తప్పా....కొట్టాడే అని అనుకోవాల్సిన అవసరం లేదు. అవతల వ్యక్తి ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా తీసుకోగలిగితే అదీ ఎన్నికల్లో అసలు విజయం. ఇదే రేపటి విజయానికి నాంది. కొట్టాడు.... తీసుకున్నాం. మా టైం వస్తుంది.. మేమూ కొడతాం’’ అని వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. జగన్‌తో పాటు ఆయన రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇంకా పలువురు వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారు. -
నంద్యాల ఫలితంపై చంద్రబాబు స్పందన
అమరావతి: నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. సార్వత్రిక ఎన్నికలు ఇంకా రెండేళ్ల సమయం ఉందికాబట్టి, అభివృద్ధి కోసమే నంద్యాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారని అన్నారు. టీడీపీ నాయకత్వం పనితీరుతోనే ఈ గెలుపు సాధ్యమైందని, ఇలా జరుగుతుందని తాను ముందే ఊహించానని పేర్కొన్నారు. డేరా బాబాది మంచి ఆర్గనైజేషన్ కానీ..: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న డేరా బాబా కేసుపై బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘‘అతను బాబా పేరుతో చాలా మంది ఆర్గనైజేషన్‌ను చేతిలో పెట్టుకుని శక్తిసామర్థ్యాలను దుర్వినియోగం చేశాడు. మహిళలు నమ్మకంతో ఆడపిల్లల్ని ఆశ్రమానికి పంపిస్తే వారిపై అకృత్యాలకు పాల్పడ్డాడు. సాధువులు సాధారణంగా మిలిటెంట్లను తయారు చేయరు. కానీ డేరాలు మాత్రం హింసాకాండకు ముందే సిద్ధమయ్యారు’’ అని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు. -
అయినా టీడీపీలో సంతోషం లేదు... !!!
సాక్షి, అమరావతి : నంద్యాలు అసెంబ్లీ ఉపఎన్నికలో విజయం సాధించినప్పటికీ అధికార తెలుగుదేశం పార్టీ నేతల్లో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. కొంత మంది నేతలు పైకి గంభీరంగా కనిపించినప్పటికీ తెలియని ఆందోళన వారిలో మొదలైంది. ఈ గెలుపు ఆనందాన్ని వారు ఎక్కువగా పంచుకోవడం లేదు. నంద్యాలలో గెలిచిన అంశంకన్నా గెలవడానికి అయిన ఖర్చుపైనే చర్చే టీడీపీలో ఎక్కువగా జరుగుతోంది. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉండేవో తెలియదు గానీ తమ పార్టీ ఆడిన ‘ మైండ్ గేమ్’ వల్ల ప్రతిపక్ష పార్టీ ఓడిపోయిందన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది టీడీపీ నేతలు వ్యక్తం చేశారు. ఈ గెలుపు విషయాన్ని టీడీపీకి చెందిన ఒక సీనియర్ నేత స్పందిస్తూ, "మొత్తం రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను దాదాపు 50 నుంచి 60 నియోజకవర్గాలకు పెట్టాల్సినంత 'ఎఫర్ట్' పెడితేగానీ ఈ విజయం సాధ్యం కాలేదు. ఈ ఒక్క అసెంబ్లీ స్థానం గెలవడం కోసం ఎన్ని రకాల ప్రయోగాలు చేశామో పార్టీ నాయకులుగా మాకు తెలుసు... సాధారణ ఎన్నికల్లో ఇది సాధ్యం కాదు. ఇది గమనిస్తున్న మా పార్టీ నాయకులకు సహజంగానే భవిష్యత్తు ఎన్నికలపై ఆందోళన ఉంటుంది" అంటూ విశ్లేషించారు. భారత దేశ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన ఉపఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ గెలుచుకోవడం సర్వసాధారణంగా జరిగింది. దాదాపు 85 శాతం ఉపఎన్నికల్లో అధికార పార్టీయే గెలిచింది. ఆ లెక్కన నంద్యాలలో గెలవడం పెద్ద విశేషమేమీ కాకపోగా ఈ గెలుపుకోసం చేయని ప్రయత్నమంటూ లేదన్నారు. సాధారణ ఎన్నికలకు ఉపఎన్నికలకు ఎంతో తేడా ఉంటుంది. ఉపఎన్నికలు అనగానే అధికార పార్టీకి ఉండే అర్థ, అంగబలం వంటి అనుకూల వ్యవస్థలతో పాటు అడిగిన వారికి అడిగినట్టు అన్నీ సమకూర్చడం వంటి అంశాలే టీడీపీకి ఎక్కువగా కలిసొచ్చాయి. నంద్యాల అసెంబ్లీ స్థానంలో ఓడిపోతే ప్రభుత్వంపై వ్యతిరేకత బయటపడుతుందన్న భయంతో మొదటి నుంచి హామీలు, పనులు, డబ్బు... ఇవే ప్రధాన అస్త్రాలుగా టీడీపీ రంగంలోకి దిగిన విషయం అందరికీ తెలిసిందే. నంద్యాలలో ఉపఎన్నికల్లో గెలవడం కోసం అయిదుగురు మంత్రులు, 18 మంది ఎమ్మెల్యేలు ప్రక్రియ పూర్తయ్యే వరకు నియోజకవర్గంలోనే తిష్టవేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని విపరీతంగా పనులు మంజూరు చేశారు. ఈద్గాలు, తాగునీటి బోర్లు, సిమెంట్ రోడ్లు ఒకటేమిటి అడిగిన అన్నింటికీ అక్కడికక్కడే మంజూరు చేయించారు. పట్టణంలో మూడు కిమీ మేర రోడ్డు విస్తరణ కోసం ఇళ్ళు, షాపులు తొలగించారు. వారికి ఇప్పటివరకు ఒక్క రూపాయి పరిహారం కూడా ఇవ్వలేదు. టీడీపీ ఓడితే ఆ పరిహారం అందదంటూ టీడీపీ నేతలు చేసిన ప్రచారం నిర్వాసితుల్లో ఆందోళన కలిగించింది. తద్వారా ఓట్లూ అనివార్యంగా అధికార పార్టీ కి పడేలా "మైండ్ గేమ్" ఆడినట్టు తెలుస్తోంది. మూడేళ్లలో నంద్యాల వైపు చూడని అధికార పార్టీ ఉపఎన్నికలు వస్తున్నాయనగానే నగరంలో రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపట్టింది. ఓడిపోతే ఆ కార్యక్రమం నిలిచిపోతుందన్న అంతర్గత ప్రచారం చేయించడం ద్వారా ఓటర్లపై తీవ్ర ప్రభావం పడేలా చేసింది. ప్రతి 14 పోలింగ్ బూత్ లకు ఒక ఎమ్మెల్యేను ఇంచార్జి గా నియమించడమంటే ఏ స్థాయిలో అధికార యంత్రాంగాన్ని ఉపయోగించారో తెలిసిపోతుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక ఉపఎన్నికలో ఇంత డబ్బు ఖర్చు చేసిన దాఖలాలు లేవని సీనియర్ నేతలు స్వీయఅనుభవంతో చెబుతున్నారు. ఈ వార్డులో ఇంతమందికి పెన్షన్లు వస్తున్నాయి. ఇంత మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేశారు. అవన్నీ అగిపోవద్దు కదా... ఈ వార్డులో ఇన్ని రేషన్ కార్డులున్నాయి. ఇంత రేషన్ తీసుకుంటున్నారు. అవన్నీ నిలిచిపోకుండా చూసుకోండి... ఈ వార్డులో ఇన్ని ఇళ్లు ఇచ్చాం.. అవన్నీ పూర్తికావాలి కదా... కొత్తగా ఇంతమంది ఇళ్ల కోసం అడుగుతున్నారు. వారందరికీ మంజూరు చేయాలి కదా... అంటూ వార్డులు, కాలనీలు, కులాలు, ఇళ్ల వారిగా కూడా మైండ్ గేమ్ ప్రచారం సాగించారు. అలా చేస్తూనే ఈ వార్డులో మొత్తం ఇన్ని ఓట్లున్నాయి. మాకు ఎన్ని ఓట్లు పడ్డాయో కూడా తెలిసిపోతుంది. తర్వాత మీ ఇష్టం అంటూ పరోక్ష బెదిరింపులతో మైండ్ గేమ్ ఆడినట్టు అక్కడి ఓటర్లు చెబుతున్న కొన్ని విషయాలు విస్మయం కలిగిస్తున్నాయి. ఈ రకంగా ఓటర్లను తీవ్రస్థాయిలో ప్రభావం చేయడమే కాకుండా ఈ బై ఎలక్షన్ గెలిస్తే జగన్ మోహన్ రెడ్డి సీఎం కాడు. ఆ పార్టీ అధికారంలోకి రాదు. అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఓటు వేసి ఏం ప్రయోజనం. రెండేళ్ల తర్వాత మీరు ఎవరికైనా వేయండి. కానీ ఇప్పుడు మాకు వేయండి... అంటూ మానసికంగా ఓటర్లపై ఒత్తిడి చేయడం కూడా తమ పార్టీకి బాగా కలిసొచ్చిందని టీడీపీ నేతలు అంటున్నారు. నంద్యాల రూరల్, గోస్పాడు మండలాల్లో టీడిపి మెజారిటీ ఓట్లను కొల్పోకుండా మంత్రి ఆది నారాయణ రెడ్డి తో పాటు మరో ఏడుగురు ఎమ్మెల్యే లు నిత్యం ఆ రెండు మండలాల్లో ప్రతి వంద మంది ఓటర్లకి ఓక నేత చొప్పున నియమించి వాళ్ల ఆర్థిక, సాధక బాధలను తీర్చడం చేశారు. ఓటర్లను ప్రభావం చేసుకోవడానికి వ్యక్తిగత ప్రయోజనాలు చేకూర్చే పనులే కాకుండా ఆయా కాలనీల వారిగా బోర్లు వేయడం, రోడ్లు వేయిస్తామన్న హామీలివ్వడం, రుణాలిప్పిస్తామని చెప్పడం, దర్గాలు, మసీదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం... వంటివి ఒకవైపు చేస్తూనే మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల జగన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి కాల్చి చంపుతా అన్నట్టు జనంలో ప్రచారం చేశారు. నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో వారి ఓట్లను రాబట్టుకోవడానికి శిల్పా కుటుంబం ఆ వర్గాలకు వ్యతిరేకం అంటూ అనేక రకాల దుష్ప్రచారం చేయడంలో కూడా టీడీపీ నేతలు విజయం సాధించారు. ‘ఉపఎన్నికలను సాధారణ ఎన్నికలతో పోల్చలేం. ఏమాత్రం సంబంధం కూడా ఉండదు. అయితే ఒక్క నంద్యాల గెలుపుకోసం అన్ని రకాలుగా మేం చేయని ప్రయత్నమంటూ లేదు. ఈ నియోజకవర్గంలో మేం పెట్టిన ఎఫర్ట్ విశ్లేషించుకుంటే మాత్రం భవిష్యత్తు భయమేస్తోందంటూ’ టీడీపీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. సానుభూతి ఉండగా... ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబంపై సానుభూతి ఎంతో ఉంది. 2014 సాధారణ ఎన్నికల సందర్బంగా ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మరణించడం, రెండేళ్లకే భూమా నాగిరెడ్డి మరణించడం, బాధ్యత అంతా కుటుంబంలోని పిల్లపై పడటం వంటి సానుభూతి కూడా ప్రజల్లో ఉంది. సానుభూతి భూమా బ్రహ్మనందరెడ్డికి కలిసొచ్చే అంశం. అయితే, ఇంతగా సానుభూతి పవనాలు వీచినప్పటికీ ఎన్నో జిమ్మిక్కులు చేస్తే గానీ తమ అభ్యర్థి గెలుపు సాధ్యం కాలేదని కూడా టీడీపీ నేతలు విశ్లేషించుకుంటున్నారు. -
చంద్రబాబుది విజయం అనుకుంటే పొరపాటే: జగన్
♦చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు ♦ అధికారం అడ్డుపెట్టుకుని ఉప ఎన్నికలో గెలుపు ♦నంద్యాల ఉప ఎన్నికలో రూ.200 కోట్లు ఖర్చు చేశారు సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ గెలుపొందడటం... చంద్రబాబు నాయుడి విజయం అనుకుంటే పొరపాటేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికలో వైఎస్ఆర్ సీపీకి ఓటు వేసిన ఓటర్లకు, అలాగే ప్రలోభాలు, భయభ్రాంతుల మధ్య పార్టీ కోసం గట్టిగా నిలబడి కష్టపడ్డ కార్యకర్తలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై వైఎస్ జగన్ సోమవారం లోటస్ పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్లో మాట్లాడారు. శిల్పా సోదరులకు హ్యాట్సాఫ్... వైఎస్ జగన్ మాట్లాడుతూ... ‘అధికార పార్టీ నుంచి పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్ సీపీలోకి వచ్చి రాజకీయాల్లో విలువలు అన్న పదానికి అర్థం తీసుకొచ్చిన శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డికి హాట్సాప్. విలువలకు కట్టుబడి పదవులకు రాజీనామా చేసిన శిల్పా సోదరులకు అభినందనలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ, ఎప్పటికీ విలువలకు కట్టుబడే ఉంది. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అధికార దుర్వినియోగం చేసింది. విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేసింది. నంద్యాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. నంద్యాలలో టీడీపీ గెలుపు చంద్రబాబుది విజయం అనుకుంటే పొరపాటు. ఇది దిగజారుడు రాజకీయం మాత్రమే. ఎన్నికలలో హామీలు ఇచ్చి తర్వాత మోసం చేయడం చంద్రబాబుకు అలవాటే. సాధారణ ఎన్నికలు కాదు కాబట్టే టీడీపీ గెలిచింది. చంద్రబాబు తన అధికారం అడ్డం పెట్టుకుని గెలిచారు. రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లాక్కొని ఓట్లు వేయించుకున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో చంద్రబాబు రూ.200 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఎన్నిక రిఫరెండం కాదు. చంద్రబాబుకు ఇప్పుడు సవాల్ విసురుతున్నా. మా పార్టీ గుర్తుపై గెలిచి, అనంతరం టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలు నిర్వహించాలి. ఆ ఎన్నికలను రెఫరెండంగా భావిస్తాం.’ అని అన్నారు. -
నంద్యాల ఫలితాల అప్ డేట్స్
సాక్షి, హైదరాబాద్ / నంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపొందారు. భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై ఆయన 27వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. టీడీపీకి 97,076...వైఎస్ఆర్ సీపీకి 69,610, కాంగ్రెస్‌కు 1,382, నోటాకు 1,231 ఓట్లు వచ్చాయి. ► 19వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి : మొత్తం 19 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి సుమారు 27వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ►18వ రౌండ్ : 26వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో టీడీపీ ►17వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి: టీడీపీ ఆధిక్యం కొనసాగుతోంది. 17వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తికాగా, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి 26,523 ఓట్ల తేడాతో లీడ్‌లో ఉన్నారు. టీడీపీ 86555 వైఎస్ఆర్ సీపీ 60947 కాంగ్రెస్ 1153 ►16వ రౌండ్ లో వైఎస్ఆర్ సీపీ ఆధిక్యం: 16వ రౌండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం లభించింది. పదహారో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టీడీపీ 25,042 ఓట్ల మెజార్టీతో ఉంది. ►15వ రౌండ్ : ముగిసిన 15వ రౌండ్ ఓట్ల లెక్కింపు. 26వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో టీడీపీ. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 81,708 వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 55,675 కాంగ్రెస్ 1064 ►14వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి: టీడీపీ ఆధిక్యం కొనసాగుతోంది. 14వ రౌండ్ పూర్తయ్యేసరికి ఆ పార్టీ 24,591 ఓట్ల మెజార్టీతో ఉంది. టీడీపీ 75938 వైఎస్ఆర్ సీపీ 51347 కాంగ్రెస్ 898 13వ రౌండ్: పదమూడవ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి తెలుగుదేశం పార్టీ 23,267 ఓట్ల మెజార్టీతో కొనసాగుతోంది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 70,766 వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 47,499 కాంగ్రెస్ 738 12వ రౌండ్ ఓట్ల లెక్కింపు : 12 రౌండ్ల తర్వాత టీడీపీ 21,807కు పైగా ఆధిక్యంలో ఉంది. టీడీపీ 65,076 వైఎస్ఆర్ సీపీ 43,269 కాంగ్రెస్ 738 11వ రౌండ్ : పదకొండవ రౌండ్ పూర్తయ్యేసరికి 20,227 ఓట్ల మెజార్టీతో టీడీపీ కొనసాగుతోంది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 59447 వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 39220 కాంగ్రెస్ 516 ► పదో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి: నంద్యాలలో 10వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. టీడీపీ 19,137 ఓట్లకుపైగా ఆధిక్యంలో ఉంది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 55121 వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 35498 కాంగ్రెస్ 516 ►తొమ్మిదో రౌండ్ : తొమ్మిదో రౌండ్ పూర్తయ్యేసరికి తెలుగుదేశం పార్టీ 18,137 ఓట్ల మెజార్టీతో కొనసాగుతోంది. ►ఎనిమిదో రౌండ్ : ఎనిమిది రౌండ్లు ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టీడీపీ 17,263 ఓట్ల ఆధిక్యంలో ఉంది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 50479 వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 32342 కాంగ్రెస్ 516 ► ఏడో రౌండ్ పూర్తి : ఏడో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి టీడీపీ 16,880 ఓట్ల మెజార్టీతో ఉంది. టీడీపీకి 4,859, వైఎస్ఆర్ సీపీకి 4,347 ఓట్లు పోల్ అయ్యాయి. ► ఆరో రౌండ్ ఓట్ల లెక్కింపు: ఆరవ రౌండ్లోనూ టీడీపీ ముందంజలో ఉంది. ఆ పార్టీ 16,368 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీకి 6,161, వైఎస్ఆర్ సీపీకి పోల్ అయిన ఓట్లు 2,858. కాగా ఇప్పటివరకూ టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 36,880 , వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి 20,512 కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం అబ్దుల్ ఖాదర్ కు 330 ఓట్లు వచ్చాయి. ► ఐదో రౌండ్ : అయిదో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టీడీపీ 13,065కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉంది. టీడీపీకి 6,975, వైఎస్ఆర్ సీపీకి 3,536 ఓట్లు వచ్చాయి. ► నాలుగో రౌండ్ : నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, టీడీపీ 9,653 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. టీడీపీకి 6,465, వైఎస్ఆర్ సీపీకి 2,859 ఓట్లు పోల్ అయ్యాయి. ► మూడో రౌండ్ పూర్తి: మూడు రౌండ్ల తర్వాత టీడీపీ 6,047 ఓట్ల ఆధిక్యంలో ఉంది. టీడీపీకి 6,640, వైఎస్ఆర్ సీపీకి 3,553 వచ్చాయి. ► రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి: రెండో రౌండ్లోనూ టీడీపీ 1,762 ఓట్లలో ముందంజలో ఉంది. టీడీపీకి 5,162, వైఎస్ఆర్ సీపీకి 3400 ఓట్లు రాగా, రెండు రౌండ్ల అనంతరం టీడీపీ 2,960 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ► తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి: టీడీపీ తొలిరౌండ్లో 1,198 ఓట్ల ఆధిక్యంలో ఉంది. టీడీపీకి 5,477, వైఎస్ఆర్ సీపీకి 4,279, కాంగ్రెస్ కు 69 ఓట్లు వచ్చాయి. ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పోస్టల్ బ్యాలెట్లలో లెక్కింపులో విచిత్రం చోటుచేసుకుంది. నంద్యాలలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 250. అయితే 100కు పైగా పోస్టల్ బ్యాలెట్లు సకాలంలో చేరలేదు. కేవలం 39 ఓట్లు మాత్రమే సకాలంలో కౌంటింగ్ కేంద్రానికి చేరాయి. కాగా ఆ 39 ఓట్లు కూడా చెల్లవని అధికారులు ప్రకటించారు. ప్రత్యేక ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా ఓట్ల లెక్కింపు వివరాలు ఎప్పటికప్పుడూ ప్రదర్శిస్తున్నారు. మొత్తం 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా, ఉదయం 9.30 గంటలకల్లా ట్రెండ్ తెలియనుంది. తొలుత నంద్యాల రూరల్, తర్వాత పట్టణం, అనంతరం గోస్పాడు మండలం ఓట్ల లెక్కింపు జరగనుంది. ప్రస్తుత ఉపఎన్నిక.... ► దేశ వ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ (1), గోవా (2), ఢిల్లీ (1) అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం 27 జూలైన షెడ్యూలును విడుదల చేసింది. ► కర్నూలు జిల్లాలోని నంద్యాల (139) అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికకు జూలై 29 న నోటిఫికేషన్ జారీ కాగా అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ► ఆగస్టు 5 వ తేదీన నామినేషన్లకు గడువు ముగియడంతో మొత్తం 24 మంది అభ్యర్థులు రంగంలో మిగిలారు. ► ఈ నెల 23 (బుధవారం) పోలింగ్ జరగ్గా అనూహ్యంగా మొత్తం 79.20 శాతం పోలింగ్ నమోదైంది. ► నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,18,858 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుషుల (1,07,778) కన్నా మహిళా (1,11,018) ఓటర్లే ఎక్కువగా ఉండగా మొత్తంగా 1,73,335 ఓట్లు (79.20 శాతం) పోలయ్యాయి. తొలిసారి వీవీపీఏటీ ప్రయోగం... ► గతంలో అనేక రాష్ట్రాల్లో ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) విధానాన్నిప్రయోగాత్మకంగా పరిశీలించినప్పటికీ ఈ విధానాన్నిఆంధ్రప్రదేశ్ నంద్యాల ఉపఎన్నికలో తొలిసారి ఉపయోగించారు. ► బ్యాలెట్ లేకుండా ఈవీఎంల ద్వారా జరిగే ఎన్నికల ప్రక్రియలో ఓటు వేసిన ప్రతి ఓటరుకు తాను ఓటు వేసినట్టుగా ఒక స్లిప్ (ఒక రకంగా రసీదు లాంటిది) వస్తుంది. గత సాధారణ ఎన్నికల్లో.... ► 2014 జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో మొత్తం 1,75,140 ఓట్లు (71.32 శాతం) పోలయ్యాయి. ► గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున భూమా నాగిరెడ్డి పోటీ చేయగా ఆయనకు 82,194 ఓట్లు (47.15 శాతం) రాగా, ప్రత్యర్థిపై 3,604 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ► భూమా నాగిరెడ్డి ప్రత్యర్థిగా టీడీపీ నుంచి శిల్పా మోహన్ రెడ్డి పోటీ చేయగా ఆయనకు 78,590 ఓట్లు (45.09 శాతం) ఓట్లు వచ్చాయి. అప్పటి ఎన్నికల్లో 690 మంది నోటాకు ఓటు వేశారు. -
ఉప ఎన్నికల్లో అధికార పార్టీలదే హవా
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉపఎన్నికలు నిర్వహించిన ప్రతి సందర్భంలోనూ ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలే విజయం సాధిస్తున్నాయి. దేశంలో ఇప్పటివరకు జరిగిన ఉపఎన్నికల్లో 80 నుంచి 85 శాతం స్థానాలను ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీలే గెలుపొందాయి. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు అనుకూలంగా ఉండే అధికార యంత్రాంగం, ఇతర వ్యవస్థలు, అభివృద్ది నినాదాలు ప్రధానంగా కలిసొస్తున్న అంశాలుగా కనబడుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడిన కొద్ది కాలానికి రాజీనామాలతో ఖాళీ అవుతున్న స్థానాలకు ఎన్నికలు జరిగినప్పుడు ఆ గాలి అలాగే కొనసాగడం, లేదా ప్రభుత్వాలు ఏర్పడిన కొంతకాలం తర్వాత ఎవరైనా సభ్యులు మరణించడంతో ఖాళీ అవుతున్న స్థానాల్లో ఉపఎన్నికలు జరిగినప్పుడు ఆ సానుభూతి పవనాలు పనిచేయడం కూడా సర్వసాధారణంగా కనబడుతున్న పరిణామాలు. ప్రస్తుతం నంద్యాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న భూమా నాగిరెడ్డి అకాల మరణంతో నంద్యాల ఉపఎన్నిక అనివార్యమైంది. ♦ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల, గోవాలోని వాల్పోయి, పనాజీ, ఢిల్లీలోని బావన (ఎస్సీ) నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగ్గా, అన్నింటిలోనూ అధికార పార్టీయే విజయం సాధించింది. నంద్యాలలో టీడీపీ, గోవాలో బీజేపీలు గెలుచుకోగా, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం సాధించింది. ఇటీవలి కాలంలో (ఈ ఆగస్టు నెలలోనే) పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఏడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అన్నింటినీ కైవసం చేసుకుంది. ఈ కార్పొరేషన్లలో మొత్తం 148 వార్డులకుగాను మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 140 వార్డులను గెలుచుకుంది. ♦ 2016 నవంబర్ లో అసోం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మధ్యప్రదేశ్, తమిళనాడులతో పాటు పుదుచ్చేరి రాష్ట్రాల్లో మొత్తం నాలుగు లోక్ సభ, 10 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా దాదాపు అన్ని స్థానాలు ఆయా రాష్ట్రాల్లో అధికార పార్టీలే కైవసం చేసుకున్నాయి. ♦ మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న బీజేపీ అక్కడి నేపానగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో గెలుపొందింది. అసోంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత ఆ రాష్ట్రంలో బైథలాంగ్సో అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించగా బీజేపీ గెలుచుకుంది. అలాగే, అరుణాచల్ ప్రదేశ్ హాయులియాంగ్ స్థానాన్ని బీజేపీ తిరిగి గెలుకుంది. ♦ అలాగే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రెండు లోక్ సభ స్థానాలకు ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగ్గా ఆ మూడు స్థానాలకు తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. దాంతో పాటు మాంటేశ్వర్ అసెంబ్లీ స్థానాన్ని కూడా టీఎంసీ కైవసం చేసుకుంది. ♦ తమిళనాడులో ఉపఎన్నికలు జరిగిన మూడు (తిరుపరంకుండ్రమ్, అరవకురిచి, తంజావూర్) అసెంబ్లీ స్థానాలకు జయలలిత నేతృత్వంలోని ఏఐఏడీఎంకె తిరిగి విజయం సాధించింది. 1980 నుంచి 2012 మధ్య కాలంలో 44 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా, కేవలం 8 సార్లు మాత్రమే విపక్షం (8 చోట్ల) గెలుచుకోగా, మిగిలిన అన్ని చోట్లా అధికార పార్టీలే విజయం సాధించాయి. పుదుచ్చేరిలో నెల్లితోప్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ నేత వి. నారాయణస్వామి గెలుచుకున్నారు. ♦ త్రిపుర రాష్ట్రంలో సీపీఎం అధికారంలో ఉండగా, ఆ రాష్ట్రంలో రెండు అసెంబ్లీ స్థానాలకు (బర్జాలా, కోవాయ్ అసెంబ్లీ నియోజకవర్గాలు) ఎన్నికలు జరగ్గా రెండింటిలోనూ సీపీఎం అభ్యర్థులు విజయం సాధించారు. ♦ 2015 లో మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల్లో జరిగిన మొత్తం ఆరు స్థానాలకు జరిగిన ఉపఎన్నకల్లోనూ ఈ విధంగానే అధికార పార్టీలు గెలుపొందాయి. 1980 దశకం నుంచి ఉపఎన్నికల్లో అధికార పార్టీల "హవా"నే కొనసాగుతోంది. -
ప్రజాతీర్పును గౌరవిస్తాను: శిల్పా మోహన్‌రెడ్డి
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్ సరళిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి స్పందించారు. నంద్యాల ఉప ఎన్నికలో ఓటర్లకు టీడీపీ భారీగా డబ్బు పంచడం, భూమా నాగిరెడ్డి చనిపోయిన సానుభూతి వల్ల ఆ పార్టీ అభ్యర్థికి ఆధిక్యం లభించడానికి కారణం కావొచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. నంద్యాలలో చేపట్టిన అభివృద్ధి వల్లే టీడీపీకి ఓట్లు పడ్డాయన్న వాదనను తాను విశ్వసించడం లేదని చెప్పారు. అనారోగ్యం, మలేరియా ఫీవర్ వల్ల 28 రోజులు తాను ప్రజల్లోకి వెళ్లలేకపోయానని, అయితే, ఆ ప్రభావం పడలేదని అనుకుంటున్నట్టు చెప్పారు. ప్రస్తుతానికి 18వేల ఓట్లకుపైగా ఆధిక్యం టీడీపీకి వచ్చిన నేపథ్యంలో ఇంత ఆధిక్యం తగ్గించడం సాధ్యపడకపోవచ్చునని, ఏదిఏమైనా ప్రజాతీర్పును గౌరవిస్తానని ఆయన చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికలో పార్టీ నేతలు, కార్యకర్తలు శాయశక్తులా కృషి చేశారని తెలిపారు. ఉప ఎన్నిక ఫలితాన్ని విశ్లేషించకుంటామని ఆయన చెప్పారు. -
పారదర్శకంగా కౌంటింగ్
♦ పొరపాట్లకు తావివ్వొద్దు ♦అప్రమత్తతతో వ్యవహరించండి ♦అధికారులు, సిబ్బందికి కలెక్టర్ సూచన కర్నూలు (అగ్రికల్చర్): నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి పొరపాట్లకూ తావివ్వరాదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.సత్యనారాయణ సూచించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కౌంటింగ్ అధికారులు, అసిస్టెంట్లు, సూక్ష్మ పరిశీలకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ఈ నెల 28న ఉదయం ఎనిమిది గంటలకు నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మొదలవుతుందన్నారు. సిబ్బంది ఆదివారం రాత్రికే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక వాహనం ఏర్పాటు చేస్తామన్నారు. కౌంటింగ్‌లో పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. మొత్తం 15 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో ఒక టేబుల్ రిటర్నింగ్ అధికారికి ఉంటుందని తెలిపారు. ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు వినియోగిస్తున్నామన్నారు. ప్రతి టేబుల్‌కు కౌంటింగ్ ఆఫీసర్, కౌంటింగ్ అసిస్టెంట్, సూక్ష్మ పరిశీలకుడు ఉంటారని తెలిపారు. రిజర్వుతో సహా 20 మంది కౌంటింగ్ అధికారులు, 20 మంది కౌంటింగ్ అసిసెంట్లను ఓట్ల లెక్కింపునకు వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందన్నారు. బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్ అవసరం ఉండవని, కంట్రోల్ యూనిట్‌ను మాత్రమే కౌంటింగ్‌కు ఉపయోగిస్తామని వివరించారు. రిజల్ట్ బటన్ నొక్కితే సీరియల్ నంబర్ల వారీగా ఎవరికెన్ని ఓట్లు వచ్చాయనే వివరాలు డిస్ప్లే అవుతాయన్నారు. వాటిని రాసుకోవడం, లెక్కించడంలో పొరపాట్లకు తావు లేకుండా చూడాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా జరుగుతోందా, లేదా అనే విషయాలను సూక్ష్మ పరిశీలకులు గమనిస్తుంటారన్నారు. మొదట రిటర్నింగ్ అధికారి టేబుల్‌పై పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారని, ఇది అరగంటలో పూర్తవుతుందని తెలిపారు. ఆ తర్వాత కంటోల్ యూనిట్లలో నమోదయిన ఓట్లను లెక్కిస్తారని వివరించారు. కౌంటింగ్ సిబ్బందిని సిస్టమ్ ద్వారా టేబుళ్లకు ర్యాండమైజేషన్ పద్ధతిలో కేటాయిస్తామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ ప్రసన్నవెంకటేష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్, కర్నూలు, ఆదోని ఆర్డీఓలు హుసేన్‌సాహెబ్, ఓబులేసు, సీపీఓ ఆనంద్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయండి : భన్వర్‌లాల్ నూనెపల్లె: నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ గోపినాథ్ జట్టి, రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ హాజరయ్యారు. భన్వర్‌లాల్ మాట్లాడుతూ కౌంటింగ్ రోజున పోలీసులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. అనుమతి పత్రాలు ఉన్న వారినే లోపలికి పంపాలన్నారు. కౌంటింగ్ హాల్ వద్ద భద్రత పెంచాలని ఎస్పీని ఆదేశించారు. కౌంటింగ్ వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన నూనెపల్లి: ఉప ఎన్నిక కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ గోపినాథ్ జట్టి, రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ శనివారం నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పరిశీలించారు. అనంతరం కలెక్టర్, ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రెండింతల భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రజలు కౌంటింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరంలో ఉండేలా చూస్తామన్నారు. కేంద్రం వద్ద ఎవరైనా అల్లర్లు సృష్టించాలని చూస్తే అరెస్టు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్ సుందర్ రెడ్డి, ఏఆర్ఓ జయరాంరెడ్డి, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. -
ఎవరి ధీమా వారిదే!
= ఉప ఎన్నిక ఫలితంపై నేతల్లో టెన్షన్ = గ్రామాల వారీగా లెక్కలు చూస్తున్న వైనం = రూ.కోట్లలో బెట్టింగ్ నంద్యాల: ఉప ఎన్నికల ప్రచారంలో హోరాహోరీగా తలపడిన ప్రధాన పార్టీల నాయకులు ప్రస్తుతం ఫలితంపై టెన్షన్‌గా గడుపుతున్నారు. గ్రామాల వారీగా లెక్కలు చూసుకుంటూ విజయంపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయంపై కోట్లాది రూపాయల బెట్టింగ్ కాసిన వారు అభ్యర్థులను మించి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా రు. ఈ క్రమంలో ఉప ఎన్నికల ఫలితాలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. గత బుధవారం పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా ముగించిన అధికారులు సోమవా రం కౌంటింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. అంచనాల్లో నిమగ్నమైన నేతలు.. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా శిల్పామోహన్‌రెడ్డి, టీడీపీ తరఫున భూమా బ్రహ్మానందరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా అబ్దుల్ఖాదర్తోపాటు మరో 13మంది ఎన్నికల్లో పోటీ చేశారు. పట్టణంలో 1,42,628 ఓటర్లకుగాను 1,05,629 మంది, రూరల్‌కు సంబంధించి 47,386 ఓటర్లకుగాను 41,514 మంది, గోస్పాడు మండలంలో 28,844 ఓటర్లలో 26,192 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. నియోజకవర్గ చర్రితలో ఎన్నడూ లేని విధంగా 79.20శాతం పోలింగ్ నమోదైంది. ఫలితం మిగిలి ఉండడంతో నాయకుల దృష్టి అటువైపు పడింది. గ్రామాల వారీగా నాయకులు, ఓటర్లకు పంపిణీ చేసిన నగదు, చీరలు, ముక్కుపుడకలు, దేవాలయాలకు అందజేసిన నగదు, వాటి కారణంగా తమకు వచ్చే ఓట్లను అంచనా వేస్తూ గడుపుతున్నారు నాయకులు. ఓటింగ్ శాతం పెరగడంతో టీడీపీలో ఆందోళన... నియోజకవర్గంలోని 2,18,858 ఓటర్లలో 1,73,335 మంది ఓటు వేసి రికార్డు సృష్టించడంతో టీడీపీ నాయకులు ఆందోళ న చెందుతున్నారు. ఓటింగ్ శాతం పెరిగింది కనుక ప్రతిపక్ష పార్టీకి కలిసి వస్తుందని లోలోన మధనపడుతున్నారు. నియోజకవర్గంలో 1,11,018 మంది మహిళలుండగా 88,503 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరు ఎవరికి ఓటు వేశారనేది అంతు పట్టడం లేదు. గ్రామాల్లో కూడా టీడీపీ నాయకుల అంచనా కన్నా పోలింగ్ శాతం పెరగడం ఆ పార్టీ నాయకుల్లో అలజడికి కారణమైంది. గోస్పాడు, నంద్యాల మండలాల్లోని గ్రామాలు మొదటి నుంచి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉండటం, వాటిలో ఓటింగ్ శాతం విపరీతంగా పెరగడం టీడీపీ నాయకులు కలవర పడుతున్నారు. పందెంరాయుళ్ల ఉత్కంఠ.. నంద్యాల ఉప ఎన్నిక ఫలితం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఫలితంపై నాయకులు, బెట్టింగ్ రాయళ్లు రూ.కోట్లలో పందాలు కాస్తున్నారు. ఒక్క నంద్యాల నియోజకవర్గంలోనే రూ.50కోట్ల వరకు పందాలు జరిగినట్లు సమాచారం. స్థానిక నాయకులు సైతం గ్రామాల వారీగా పందె కాస్తున్నట్లు తెలిసింది. విజయం ఎవరిని వరిస్తుందనే విషయం రేపటి సోమవారంతో బహిర్గతం కానుంది. -
ఇంకొక్క రోజు..
నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తేలేది రేపే కర్నూలు (అగ్రికల్చర్): రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక ఫలితం సోమవారం వెల్లడి కానుంది. ప్రస్తుతం ఈవీఎంలు కేంద్ర బలగాల రక్షణలో ఉన్నాయి. వీటిలో నిక్షిప్తమై ఉన్న ఫలితం సోమవారం ఉదయం 11 గంటలకల్లా వెల్లడయ్యే అవకాశం ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా నంద్యాల నియోజకవర్గం ఉప ఎన్నికలో తీవ్ర స్థాయిలో పోరు సాగింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు యావత్ తెలుగు ప్రజలు ఈ ఫలితం కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా ప్రధానంగా అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ మధ్యనే నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగింది. ఇటు వైఎస్సార్సీపీ, అటు తెలుగుదేశం పార్టీలు ఉప ఎన్నికను ప్రతిష్టా్టత్మకంగా తీసుకొని సర్వశక్తులూ ఒడ్డాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్‌రెడ్డి, టీడీపీ తరఫున భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ వెబ్ క్యాస్టింగ్ సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ చేపడతారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లు, ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్‌కు మొత్తం 15 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఒకటి రిటర్నింగ్ అధికారికి ఉంటుంది. ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు ఉంటాయి. మొత్తం 255 పోలింగ్ కేంద్రాలు ఉండగా 255 ఈవీఎంల్లోని ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. మొత్తం 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
'కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం'
కర్నూలు: శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు కర్నూలు జిల్లా ఎస్పీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 28న ఉప ఎన్నిక కౌంటింగ్ జరుగుతుందని, సీఆర్పీఎఫ్ బలగాలు, ఏపీఎస్పీ బలగాలను బందోబస్తుకు ఏర్పాటు చేశామని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ అనంతరం సమస్యాత్మక ప్రాంతాలలో ఏ చిన్నపాటి ఇబ్బందులు తలెత్తకుండా పికెట్స్, మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్సు ఏర్పాటు చేశామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, గట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నిక పూర్తి చేశామని ఎస్పీ తెలిపారు. ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రజలకు, రాజకీయ పార్టీలు, మీడియా వారికి కృతజ్ఞతలు తెలిపారు. కౌంటింగ్ బందోబస్తుకు ఒక అడిషనల్ ఎస్పీ, ఐదుగురు డీఎస్పీలు, 17 మంది సిఐలు, 38 మంది ఎస్సైలు, 74 మంది ఎఎస్సై, హెడ్ కానిస్టేబుళ్ళు, 260 మంది కానిస్టేబుళ్ళు, 20 మంది మహిళా కానిస్టేబుళ్ళు, 44 సెక్షన్ల ఎఆర్ సిబ్బంది, 10 స్పెషల్ పార్టీలు, ఒక కంపెనీ సీఆర్పీఎఫ్ దళం, 5 ప్లటూన్ల ఏపీఎస్పీ బలగాలు ఏర్పాటు చేసి అన్నిరకాల ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీలు పి.షేక్ షావలి, ఐ.వెంకటేష్ డీఎస్పీలు జె.బాబుప్రసాద్, డి.వి. రమణమూర్తి, సీఐలు శ్ములకన్న, కృష్ణయ్య, డేగల ప్రభాకర్, నాగారాజా రావు పాల్గొన్నారు. -
నంద్యాలలో ఏవీ సుబ్బారెడ్డి వీరంగం
కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాలలో టీడీపీ నేతల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డిపై హత్యాయత్నం ఘటన మరవక ముందే.. తాజాగా భూమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి వీరంగం సృష్టించారు. నూనెపల్లెలో ఇద్దరు మహిళలపై ఆయన దాడి చేశారు. వినాయక విగ్రహ ఏర్పాటు విషయంలో మహిళలపై దాడికి తెగబడ్డాడు. అనుచరులతో కలిసి వచ్చి ఏవీ సుబ్బారెడ్డి తమను విచక్షణారహితంగా కొట్టాడని దళిత మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు. అధికార పార్టీ నేతల దాడిలో పలువురు మహిళలు గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళలను శిల్పామోహన్ రెడ్డి తనయుడు శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ గూండాల దాడులను ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ప్రశాంతంగా ఉన్న నంద్యాలలో అలజడి సృష్టించేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలు జరిగినా అందుకు టీడీపీ నేతలదే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. కాగా నంద్యాలోని విశ్వనగర్‌కు చెందిన రాములమ్మ కుటుంబీకులు టీడీపీకి ఓటు వేయలేదన్న కోపంతో టీడీపీ వర్గీయుడు సుబ్బయ్య దాడి చేసి గాయపరిచిన విషయం విదితమే. ఇక బుధవారం ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల వ్యవహారశైలి, అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు అందరికి తెలిసిందే. -
కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
కలెక్టర్ సత్యనారాయణ కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఎస్. సత్యనారాయణ తెలిపారు. గురువారం కలెక్టర్ చాంబరులో కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఈ నెల 28న నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతుందన్నారు. కౌంటింగ్‌కు 15 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో ఒక టేబుల్ రిటర్నింగ్ అధికారికి ఉంటుందని చెప్పారు. మొత్తం 19 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుందని వివరించారు. ఒక టేబుల్‌కు ఒక కౌంటింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ ఉంటారని తెలిపారు. ప్రతి టేబుల్‌కు ఒక సూక్ష్మ పరిశీలకుడు కూడా ఉంటారన్నారు. కౌంటింగ్ సిబ్బందిని సిస్టమ్ ద్వారా ర్యాండమైజేషన్ వివరించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, అదే తరహాలో కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీపీఓ ఆనంద్‌నాయక్, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ శశిదేవి, నిక్ అసిస్టెంట్ టెక్నికల్ డైరెక్టర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగని అధికార పార్టీ అరాచకాలు
- నంద్యాలలో వైఎస్సార్సీపీకి ఓటు వేశారని కుటుంబంపై దాడి - కర్రలతో కొట్టి గాయపరిచిన వైనం నంద్యాల అర్బన్: నంద్యాల ఉప ఎన్నికలో పోలింగ్ శాతం భారీగా నమోదు కావడం అధికార టీడీపీ నేతల్లో అసహనం రేగుతోంది. పోలింగ్ సందర్భంగా టీడీపీ అక్రమాలను అడ్డుకున్న వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీకి ఓటు వేశారన్న కారణంతో గురువారం ఓ కుటుంబంపై దాడి చేశారు. మహిళ చీర లాగి గాయపరిచారు. ఈ ఘటన నంద్యాల పట్టణంలోని విశ్వనగర్‌లో చోటు చేసుకుంది. విశ్వనగర్‌కు చెందిన రాములమ్మ కుటుంబం కిరాణా దుకాణం నడుపుకొంటూ జీవనం సాగిస్తోంది. ఇంటి ఎదురుగా పది సెంట్ల స్థలంలో టీడీపీకి చెందిన సుబ్బయ్య ఇసుక డంపు నిర్వహిస్తున్నాడు. బుధవారం జరిగిన ఉప ఎన్నిక పోలింగ్‌లో రాములమ్మ కుటుంబంతోపాటు ఇరుగుపొరుగు కుటుంబాల వారు వైఎస్సార్సీపీకి ఓటు వేశారు. దీన్నిజీర్ణించుకోలేని సుబ్బయ్య కుటుంబ సభ్యులు టీడీపీకి ఎందుకు ఓటు వేయలేదంటూ గురువారం రాములమ్మ కుటుంబంతో వాదనకు దిగారు. తాము వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులమని, తమకు ఇష్టమైన వారికి ఓటు వేసుకునే హక్కు ఉందంటూ రాములమ్మ కుటుంబం సమాధానం ఇచ్చింది. దీంతో సుబ్బయ్య కుటుంబ సభ్యులు, అనుచరులు ఒక్కసారిగా వారిపై దాడికి దిగారు. కిరాణా షాపులోని వస్తువులను బయటకు విసిరేశారు. అడ్డొచ్చిన రాములమ్మ చీర లాగుతూ వీరంగం సృష్టించారు. ఇదేమని ప్రశ్నించిన పక్కింటి మహిళ కవితను తోసేశారు. రాములమ్మతోపాటు ఆమె కుమారుడు శ్రీనివాసరెడ్డిపై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
రౌడీ రాజ్యం
నంద్యాల్లో మాజీ ఎమ్మెల్సీ చక్రపాణి రెడ్డిపై హత్యాయత్నం - నడిరోడ్డుపై వేట కొడవలితో అధికార పార్టీ నేత అభిరుచి మధు వీరంగం - రెండు రౌండ్లు కాల్పులు జరిపిన గన్‌మ్యాన్ - కనీసం అదుపులోకి తీసుకోని పోలీసులు నంద్యాల పట్టణంలోని సూరజ్ గ్రాండ్ హోటల్ ప్రాంతం.. గురువారం మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట కావస్తోంది.. దారికి అడ్డంగా ఓ వాహనం ఉండటంతో మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి వాహనం అక్కడికొచ్చి ఆగింది.. వాహనాన్ని పక్కకు తీయండని డ్రైవర్ చెబుతుండగానే ఎదుటి వైపు నుంచి రాళ్ల దాడి మొదలైంది.. టీడీపీ నేత మధు చేత్తో వేట కత్తి పట్టుకుని ఊగిపోతూ ఆవేశంతో రంకెలేస్తున్నాడు.. అంతలోనే ఆయన పక్కనున్న మరో వ్యక్తి చేతిలో రివాల్వర్ ప్రత్యక్షమైంది.. చేయి పైకెత్తి టపా..టపా.. మని కాల్పులు జరిపాడు.. ఫ్యాక్షన్ సినిమాలోని సీన్‌ను తలదన్నేలా సాగిన ఈ సన్నివేశం సాక్షాత్తూ పోలీసుల కళ్లెదుటే జరిగింది.. స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో ఓటమి భయంతో అధికార పార్టీ అరాచకాలకు తెరలేపింది. పోలింగ్ రోజున పోలింగ్ శాతం పెరిగే కొద్దీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతూ నియోజకవర్గం మొత్తం కలియదిరుగుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. తాజాగా పోలింగ్ ముగిసిన మరుసటి రోజే గురువారం మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డిపై అధికార పార్టీకి చెందిన అభిరుచి మధు ఏకంగా వేట కొడవలితో హత్యాయత్నం చేశాడు. మధు గన్‌మ్యాన్ శిల్పాను లక్ష్యంగా చేసుకుని రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. నంద్యాల నడిరోడ్డులో కార్లతో అటకాయించి మరీ.. చక్రపాణి రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడిన వైనం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయిం ది. ఈ తతంగమంతా పోలీసుల కళ్లెదుటే జరిగింది. అయినప్పటికీ బాధితులు శిల్పా చక్రపాణి రెడ్డి, ఆయన అనుచరులపైనే తొలు త కేసు నమోదు చేశారు. పోలీసుల కళ్లెదుటే టీడీపీ నేత మధు వేట కత్తి పట్టుకుని వీరంగం సృష్టిస్తుంటే కనీసం దానిని లాక్కొని అదుపు లోకి తీసుకునే ప్రయత్నం చేయలేదు. రౌడీషీటర్‌గా ఉన్న అధికార పార్టీకి చెందిన అభిరుచి మధును పోలీసులు కనీసం వారించే ప్రయత్నం జరగకపోవడం.. నిందితులను వెనకేసు కొస్తూ మంత్రి అఖిలప్రియ మాట్లాడటాన్ని గమనిస్తే అంతా స్కెచ్ ప్రకారమే వ్యవహారం నడిచిందన్న అనుమానాలు బలపడుతున్నా యి. మధుపై రౌడీషీట్ ఎత్తివేయడంతో పాటు ఉప ఎన్నికకు ముందు హడావుడిగా గన్‌మ్యాన్ ను కేటాయించడం చర్చనీయాంశమైంది. అంటే ఉప ఎన్నికకు ముందు అధికార పార్టీ.. ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులకు వ్యూహాత్మ కంగా రంగం సిద్ధం చేసిందని తెలుస్తోంది. జరిగింది ఇదీ... నంద్యాలలోని సలీంనగర్లో నివాసం ఉంటు న్న వైఎస్సార్సీపీ మైనార్టీ నాయకుడు చింపిం గ్ బాషా బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డితో పాటు నలుగురు కౌన్సిలర్లు పరామర్శించి తిరిగి వస్తున్నారు. అధికార పార్టీకి కేంద్రంగా ఉన్న సూరజ్ హోటల్ సెంటర్లో టీడీపీ నేత అభిరుచి మధుతో పాటు మరికొందరు కార్యకర్తలు తమ కార్లను అడ్డంగా నిలిపి ఉంచి చక్రపాణి రెడ్డి కారును అటకాయించారు. దీంతో సైడ్ ఇవ్వమని చక్రపాణిరెడ్డి కారు డ్రైవర్ పదే పదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఏ మాత్రం వారు స్పందించలేదు. అనంతరం నానాబూతులు తిడుతూ చక్రపాణి రెడ్డి కారువైపు అభిరుచి మధుతో పాటు మరికొందరు రాళ్లు రువ్వుతూ వేట కొడవళ్లతో దూసుకొచ్చారు. దీంతో చక్రపాణిరెడ్డి వెంట ఉన్న వారు ప్రతిఘటించేందుకు యత్నించా రు. ఈ సందర్భంగా మధు గన్‌మ్యాన్ సోమ భూపాల్ (నం.1681) రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ తతంగం జరుగుతుండగా అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. అయితే వారు మధు చేతిలోని వేట కొడవలిని లాక్కునేందుకు కానీ, అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం కానీ చేయలేదు. కొంత సేపటి తర్వాత చక్రపాణిని ఇంటికి పంపించా రు. అభిరుచి మధును బుజ్జగిస్తూ అతన్ని కూడా కారు ఎక్కించి మరీ సాగనం పారు. కనీసం ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా అతన్ని అదుపులోకి తీసుకునే యత్నం కూడా చేయకపోవడం విమర్శలకు తావిచ్చింది. బాధితులపైనే కేసులు ఏదైనా సంఘటన జరిగితే మొదటగా ఎవరైతే బాధితులో వారి పక్షాన పోలీసులు నిలవాలి. అయితే ఇక్కడ మాత్రం పోలీసు యంత్రాంగం మొత్తం అధికార పార్టీకి కొమ్ముకాసే విధంగానే వ్యవహరించిందన్న అభిప్రాయం వ్యక్తమవు తోంది. నడిరోడ్డుపై వేట కొడవలి పట్టుకుని వీరంగం సృష్టించడంతో పాటు గీత గీసి మరీ సవాల్ విసిరిన మధును కనీసం ముందస్తు జాగ్రత్తలో భాగంగా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయలేదు. పైగా ఒకడుగు ముం దుకు వేసి మధు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చక్రపాణి రెడ్డితో పాటు ఇతర నేతలపై కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ నేత జగదీశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధుతో పాటు మున్నా అలియాస్ ఖాదర్, షేక్ చిన్ను, వేణు, గన్‌మ్యాన్ సోమభూపాల్‌పై కేసు నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొంటున్నారు. రౌడీషీట్ ఎత్తేసి ప్రోత్సహించారు.. వాస్తవానికి టీడీపీ నేత అభిరుచి మధు వ్యవహారంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా అనేక మందిపై నడిరోడ్డుపై దాడి చేయడంతో పాటు పలు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆయనపై 2009లో నంద్యాల టూటౌన్ పోలీసు స్టేషన్లో రౌడీ షీటు నమోదైంది. వరుస దాడులతో జిల్లా ఉపాధ్యక్షుడి పదవి కూడా పోయింది. అయితే తిరిగి బాబు, లోకేశ్‌లను కలసి పదవి సంపా దించుకున్నారు. 2014లో చంద్రబాబు వచ్చాక రౌడీషీటర్‌ను కూడా ఎత్తివేశారు. ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేసేందుకు వీలుగా ఏకంగా గన్మ్యాన్లను ప్రభు త్వం కేటాయించింది. జరిగిన సంఘట నలను విశ్లేషిస్తే పక్కా స్కెచ్ ప్రకారమే వ్యవ హారం నడిచిందని అర్థమవుతోంది. రౌడీషీట ర్గా రికార్డు ఉన్న మధుకు గన్మ్యాన్లను (1+1)ఎలా కేటాయిస్తారన్న ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో నే భద్రత కల్పించారన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో మారణాయుధాలతో నడిరోడ్డుపై ఎలా తిరిగారన్న ప్రశ్న ఎదురవుతోంది. -
అందుకే నాపై కక్ష గట్టాడు: శిల్పా
సాక్షి, నంద్యాల: తమపై హత్యాయత్నం చేసిన టీడీపీ నేత అభిరుచి మధుకి నేర చరిత్ర ఉందని శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. నేర చరిత్ర కారణంగా అప్పటి పార్టీ ఆదేశాల మేరకు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న మధును సస్పెండ్ చేశామని ఆ అక్కసుతో తనపై హత్యాయత్నం చేశాడని వెల్లడించారు. నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ రోజున కావాలనే తమతో గొడవ పెట్టుకున్నారని చెప్పారు. ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినా సహనం పాటించామన్నారు. గురువారం ఆయన 'సాక్షి' టీవీతో మాట్లాడుతూ.. రౌడిషీట్ ఉన్న మధుకు గన్‌మెన్ ఇవ్వడం దారుణమని వ్యాఖ్యానించారు. మధు ఆగడాలు, దుర్మార్గాల గురించి చంద్రబాబు, లోకేశ్‌లకు తెలుసునని వెల్లడించారు. మారణాయుధాలతో మధు సృష్టించిన వీరంగంపై పోలీసులకు వెంటనే తెలియజేశానని చెప్పారు. పోలీసులు ఆలస్యంగా రావడం బాధాకరమన్నారు. మాపైన దాడులు చేసి మాపైనే కేసులు పెట్టడం దారుణమన్నారు. దీన్ని చట్టప్రకారం ఎదుర్కొంటామని ప్రకటించారు. గొడవలు పెట్టుకోవాలనే తత్వం శిల్పా కుటుంబానికి లేదని, అలాగని తాము భయపడే రకం కాదని అన్నారు. అధికారముందని బెదిరిస్తే భయపడేది లేదని స్పష్టం చేశారు. నంద్యాల శాంతియుతంగా ఉండాలన్నదే తమ కోరిక అని చక్రపాణిరెడ్డి తెలిపారు. -
'టీడీపీ కుట్రపై న్యాయ విచారణ'
-
'టీడీపీ కుట్రపై న్యాయ విచారణ'
సాక్షి, హైదరాబాద్: నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఎన్నికల సంఘానికి వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ విజ్ఞప్తి చేశారు. నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డిపై టీడీపీ నేత కాల్పులకు దిగడంపై ఆయన స్పందించారు. ఈ నెల 31 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ చాలా మంది ఆయుధాలు పోలీసులకు అప్పగించలేదని తెలిపారు. కర్నూలు జిల్లాలో మొత్తం 2,252 మందికి తుపాకీ లైసెన్సులు ఉన్నాయని, ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో 1,211 మంది మాత్రమే స్థానిక పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేశారని వెల్లడించారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. ఆయుధాలు డిపాజిట్ చేయకుండా టీడీపీ పథక రచన చేసిందని ఆయన ఆరోపించారు. టీడీపీ కుట్రపై న్యాయ విచారణ జరిపించాలని శివకుమార్ డిమాండ్ చేశారు. ఈ నెల 28న నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది. -
నంద్యాలలో టీడీపీ నేతల అరాచకం
సాక్షి, నంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాల విశ్వనగర్ లో టీడీపీ నేతలు అరాచకానికి పాల్పడ్డారు. ఇళ్లకు అడ్డంగా ఇసుక డంప్ ఏర్పాటు చేయడాన్ని ప్రశ్నించిన మహిళలపై గురువారం ఉదయం ఎదురుదాడి చేశారు. నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్ఆర్ సీపీకి ఓటేశారంటూ ఇద్దరు మహిళలతో పాటు ఓ వ్యక్తిని టీడీపీ నేతలు కొట్టారు. దీంతో తమపై దాడి చేసినవారిపై కేసు నమోదు చేయాలంటూ టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే... టీడీపీ కార్యకర్త సుబ్బయ్య కక్షసాధింపు చర్యతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులపై దాడికి దిగాడు. నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీకి ఓటు వేయడంతో... కావాలనే టీడీపీ నాయకుడికి సంబంధించిన ఇసుక ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డం పెట్టారు. రోడ్డుకు అడ్డంపెట్టి అసౌకర్యం కలిగిస్తున్నారని అడిగినందుకు మహిళ అని కూడా చూడకుండా నానా దుర్భాశలాడుతూ మహిళ చీర లాగి కొట్టారు. అడ్డుకోబోయిన పక్కింటి మహిళను కూడా కొట్టారు. ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేసి కుమారుడిపై కూడా దాడికి పాల్పడ్డారు. -
కాయ్ రాజా... కాయ్...!
- నంద్యాల ఫలితంపై పందేల జోరు - వైఎస్సార్సీపీ గెలుస్తుందంటూ సవాల్ - ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ - సచివాలయంలోనూ అదే పరిస్థితి - హైదరాబాద్‌లోనూ చర్చోపచర్చలు సాక్షి, అమరావతి: నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై భారీ స్థాయిలో పందేలు సాగుతున్నాయి. గత వారం రోజులుగా సాగుతున్న బెట్టింగులు ఒక ఎత్తయితే బుధవారం జరిగిన పోలింగ్ సరళిని పరిశీలించిన తర్వాత నడుస్తున్న బెట్టింగులు మరో ఎత్తుగా మారాయి. వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్థుల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై మంగళవారం వరకూ రూపాయికి రూపాయి దామాషాలో పందేలు సాగాయి. బుధవారం ఉదయం ఆరు గంటల నుంచే మహిళలు, గ్రామీణులు పోలింగ్ కేంద్రాల ఎదుట బారులు తీరి ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనడం, గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత అధికంగా ఓట్లు పోల్ కావడంతో పందెపు రాయుళ్ల వ్యవహార సరళి మారిపోయింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోటెత్తిందని, దీనివల్ల వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమని ఆ పార్టీని బలపరిచేవారు విశ్వసిస్తున్నారు. ప్రభుత్వ అనుకూల ఓటింగ్ వల్లే పోలింగ్ పెరిగిందని టీడీపీ అనుకూలవాదులు విశ్లేషించుకుంటున్నారు. పోలింగ్ శాతం పెరిగినప్పుడల్లా అధికార పక్షాలకు వ్యతిరేక తీర్పు వచ్చిందని, పైగా నంద్యాలలో జగన్ అనుకూల ఓటింగ్ జరిగినందున తమదే విజయమని వైఎస్సార్సీపీ శ్రేణులు ధీమాతో అధిక మొత్తంలో పందేలకు దిగుతున్నాయి. పోలింగ్ ఆరంభమైన తర్వాత టీడీపీ గెలుస్తుందని పందేలు కాయడానికి బెట్టింగురాయుళ్లు కొంత వెనుకంజ వేశారు. దీంతో వైఎస్సార్సీపీ తరఫున రూపాయికి రూపాయిన్నర (వైఎస్సార్సీపీ గెలిస్తే రూ. లక్ష ఇవ్వండి.. ఓడిపోతే మేం రూ.1.5లక్షన్నర ఇస్తాం) అంటూ ఆ పార్టీ అనుకూలవాదులు సవాల్ విసురుతున్నారు. రాయలసీమతోపాటు గుంటూరు, కోస్తా జిల్లాల్లో భారీగా బెట్టింగులు సాగుతున్నాయి. ‘‘వైఎస్సార్సీపీ గెలుస్తుందంటూ వైఎస్సార్ జిల్లాకు చెందిన ఒక వ్యాపారి బుధవారం రూ. 15 లక్షలు పందెం కాశారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా హైదరాబాద్‌లో కూడా నంద్యాల ఎన్నిక ఫలితంపై తీవ్ర స్థాయిలో పందేలు సాగుతున్నాయి. రాయలసీమ, కోస్తా జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడినవారే కాకుండా తెలంగాణకు చెందినవారు కూడా చాలామంది వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం సాధిస్తారంటూ బుధవారం పందేలు కాశారు. టీడీపీ తరఫున పందేలకు వస్తున్న వారిలో కృష్ణా, గుంటూరు జిల్లాల వారే ఎక్కువగా ఉన్నారు. వైఎస్సార్సీపీ గెలుస్తుందంటూ కూకట్‌పల్లికి చెందిన ఒక పారిశ్రామికవేత్త కృష్ణా జిల్లాకు చెందిన వ్యాపారితో రూ. 10 లక్షలు పందెం కాశారు. పోలింగ్ సరళిని సొంతంగా అంచనా వేయడంతోపాటు కచ్చితమైన విశ్లేషణ కోసం చాలామంది మీడియా ప్రతినిధులతోనూ, ఇతరత్రా వాకబు చేస్తున్నారు. ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత పందేలకు దిగుతున్నారు. పోలింగ్ తర్వాత వైఎస్సార్సీపీకి అనుకూలంగా పందేలు కాచే వారి సంఖ్య ఎక్కువైంది. అందుకే రూపాయికి రూపాయన్నర రేటు నడుస్తోంది..’’ అని ఈ వ్యవహారాల్లో తలపండిన ఒక వ్యాపారి ’సాక్షి’కి తెలిపారు. అన్నిచోట్లా హాట్ టాపిక్... ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా హైదరాబాద్‌లో కూడా ఎక్కడ నలుగురు కలిసినా నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపైనే చర్చ సాగుతోంది. అమరావతి సచివాలయంలోని ఉద్యోగులు కూడా ఉదయం నుంచి ఇదే చర్చలో మునిగిపోయారు. నంద్యాలలో విజయావకాశాలు ఎవరికి ఉన్నాయంటూ వారు మీడియా ప్రతినిధులను, కర్నూలు జిల్లాలో ఉన్న తమ బంధువులు, మిత్రులు, ఉద్యోగులను సెల్ఫోన్లో వాకబు చేశారు. ఎక్కువమంది ఉద్యోగులు బుధవారం పోలింగ్ సరళిపై టీవీలు, సెల్ఫోన్లలో చూస్తూ కనిపించారు. టీవీల్లో ప్రసారాలు సరిగా రాకపోవడంతో విసుక్కున్నారు. -
నంద్యాల సాక్షిగా
-
చివరి మూడు గంటల్లో టీడీపీ రౌడీ రాజకీయం
-
ఓటెత్తిన నంద్యాల
-
మీకు జ్ఞానముందా..?
- వాస్తవం తెలుసుకోకుండా వార్త ఎలా ఇస్తారు.. - ‘ఏబీఎన్ చానల్‌పై కర్నూలు కలెక్టర్ ఆగ్రహం - పీవో అస్వస్థతకు గురైతే మరణించినట్లు బ్రేకింగ్ న్యూస్ ఇవ్వడంపై మండిపాటు కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శించిన ఏబీఎన్ చానల్‌పై కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిసైడింగ్ అధికారి(పీవో) అస్వస్థతకు గురైతే.. ఏకంగా మరణించారంటూ ఏబీఎన్ చానల్లో బ్రేకింగ్ న్యూస్ రావడంపై ఆయన మండిపడ్డారు. ‘అసలు మీకు జ్ఞానముందా? వాస్తవం తెలుసుకోకుండా బ్రేకింగ్ న్యూస్ ఎలా ఇస్తారంటూ..’ ఏబీఎన్‌ను నిలదీశారు. బుధవారం నంద్యాల మండలం పోలూరులోని పోలింగ్ కేంద్రం– 2లో పీవోగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాసరెడ్డికి గుండెపోటు వచ్చింది. దీంతో సిబ్బంది ఆయన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో కొద్దిసేపటికి ఆయన కోలుకున్నారు. అయితే ఏబీఎన్ చానల్లో మాత్రం గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి అంటూ బ్రేకింగ్ న్యూస్ రావడంతో కలకలం రేగింది. కాన్ఫరెన్స్ హాల్ నుంచి పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న కలెక్టర్ సత్యనారాయణ.. ఈ వార్తతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే వివరాలు ఆరా తీశారు. గుండెపోటుకు గురైన శ్రీనివాసరెడ్డి కోలుకున్నారన్న సమాచారం రావడంతో కలెక్టర్ వెంటనే ఏబీఎన్ చానల్ కార్యాలయానికి ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీకు కొంచమైనా జ్ఞానముందా? వాస్తవాలు తెలుసుకోకుండా ఒక పీవో మరణించారని ఎలా బ్రేకింగ్ న్యూస్ ఇస్తారు? ఈ వార్త చూస్తే ఆయన కుటుంబ సభ్యుల పరిస్థితి ఏం కావాలి? వార్త ఇచ్చేటప్పుడు వాస్తవాలు ధ్రువీకరించుకోవాలనే విషయం తెలియదా..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవో కోలుకున్నట్లు వెంటనే బ్రేకింగ్ న్యూస్ ఇవ్వాలని ఏబీఎన్ చానల్‌ను ఆయన ఆదేశించారు. లేకపోతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కలెక్టర్ ఆగ్రహంతో ఖంగుతిన్న ఏబీఎన్ చానల్.. పీవో కోలుకున్నారంటూ ఆ తర్వాత స్క్రోలింగ్ ఇచ్చింది. -
అధికార పార్టీలో అసహనం
నంద్యాల ఉప పోరులో రౌడీయిజం - ఓటమి తప్పదని గ్రహించి రెచ్చిపోయిన టీడీపీ నేతలు - నంద్యాలలో మైనారిటీలపై దాడులు - వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యకాండ - పోలీసుల సాక్షిగా శిల్పా కుమారుడిపై దాడి - భూమా కుమార్తె, కుమారుడి హల్చల్ నంద్యాల నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: నంద్యాల ఉప ఎన్నికలో ఓటమి తప్పదని గ్రహించిన అధికార తెలుగుదేశం పార్టీ నేతలు చివర్లో రెచ్చిపోయారు. దొంగ ఓటర్లను అడ్డుకున్నందుకు వైఎస్సార్సీపీ నేతలు రాజగోపాల్‌రెడ్డి, శిల్పా కుమారుడు రవిచంద్ర కిషోర్‌రెడ్డి, కార్యకర్తలపై దాడి చేసి గాయపరిచారు. దీనికితోడు భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె, కుమారుడు నంద్యాలలో హల్చల్ చేశారు. పోలీసుల అండతో టీడీపీ నేతలు సాగించిన రౌడీయిజాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. బుధవారం జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ నేతలు నిజస్వరూపాన్ని బయటపెట్టారు. ఉదయం ప్రశాంత వాతావరణంలో ప్రాంభమైన ఉప ఎన్నికలో పోలింగ్ శాతం అనూహ్యంగా పెరిగింది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వల్లే పోలింగ్ శాతం పెరిగిందని గుర్తించిన టీడీపీ నేతలు సహనం కోల్పోయారు. వైఎస్సార్సీపీ నేతలు, ముస్లిం మైనారిటీ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. శిల్పా మోహన్‌రెడ్డి కుమారుడిపై దాడి నంద్యాలలోని జగజ్జనని కాలనీలో సాయంత్రం 5 గంటల సమయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైఎస్సార్సీపీ వార్డు కౌన్సిలర్ రహీం, మైనారిటీ నాయకుడు కలాంపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి తన మనుషులతో వచ్చి దాడి చేశారు. టీడీపీ నేతలు దొంగ ఓటర్లను తీసుకొచ్చి సైకిల్ గుర్తుకు వేయాలని చెప్పి పంపుతుండటాన్ని గమనించిన కౌన్సిలర్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి.. రహీంపై దాడి చేశారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపైనా దౌర్జన్యానికి దిగారు. పరిస్థితి చేయిదాటుతోందని పోలీసులు హెచ్చరించటంతో ఏవీ సుబ్బారెడ్డి హడావుడిగా వెళ్లిపోయారు. రహీంపై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న శిల్పా మోహన్‌రెడ్డి కుమారుడు రవిచంద్ర కిషోర్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. టీడీపీ నాయకుడు అభిరుచి మధు ఐజీ ఇక్బాల్ కళ్లెదుటే శిల్పా కుమారుడిపై దాడి చేశారు. పోలీసులు శిల్పా కుమారుడిని నెట్టుకుంటూ వెళ్లారు. పోలీసులు తమకు సహకరిస్తున్నారని గ్రహించిన టీడీపీ నేతలు మరింత రెచ్చిపోయారు. పోలీసుల సాక్షిగా అభిరుచి మధు మరోసారి శిల్పా కుమారుడిపై దాడికి ప్రయత్నించారు. జగజ్జనని కాలనీలో వివాదం గురించి తెలుసుకున్న భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనికారెడ్డి, కుమారుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి తమ అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఎంత వారించినా వారు వినలేదు. వైఎస్సాఆర్సీపీ కార్యకర్తలపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలీసులు బలవంతంగా పంపేసినా మళ్లీ వచ్చి రహీం వర్గంపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. డబ్బుల పంపిణీని అడ్డుకున్నందుకు... గాంధీనగర్ పోలింగ్ బూత్ వద్ద సాయంత్రం టీడీపీ నేతలు ఓటర్లకు నగదు పంపిణీ చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేత రాజగోపాల్‌రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయనపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా దౌర్జన్యానికి దిగారు. రాజగోపాల్‌రెడ్డి అనుచరులపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. అదేవిధంగా 75వ బూత్ వద్ద వైఎస్సార్సీపీ ఏజెంట్ పాస్‌లను సీఐ బలవంతంగా లాక్కొన్నారు. ఆ బూత్‌లో టీడీపీకి ఏకపక్షంగా ఓట్లు వేయించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 16వ వార్డు వద్ద వైఎస్సార్సీపీ ఏజెంట్లను నియంత్రించేందుకు టీడీపీ నాయకులు రకరకాలు ప్రయత్నాలు చేశారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ నౌమన్ పోలీసుల సాక్షిగా ఓటర్లను ప్రలోభపెట్టారు. వైఎస్సార్ నగర్లో టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతుండగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నంద్యాలలో ఆళ్లగడ్డ మనుషులు నంద్యాల ఉప ఎన్నికలో ఎక్కడ చూసినా ఆళ్లగడ్డ వాసులే కనిపించారు. నంద్యాల నడిగడ్డ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాల చుట్టూ మంత్రి అఖిలప్రియ పర్యటించారు. ఆమె సోదరి మౌనికారెడ్డి పలు ప్రాంతాల్లో తిరుగుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారు. సెయింట్ జోసెఫ్ కళాశాలలోని పోలింగ్ బూత్‌లో భూమా మౌనికారెడ్డి తన అనుచరులతో కలిసి హల్చల్ చేశారు. బయటకు వెళ్లాని కోరిన పోలింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఎన్జీఓ కాలనీ, 55, 56 వార్డుల్లో పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి విధుల్లో ఉన్న అధికారులు, ఏజెంట్ల గుర్తింపు కార్డులు చూపించాలని డిమాండ్ చేశారు. మీకు రూ.2 వేలు అందాయా? 57, 58, 59వ పోలింగ్ బూత్‌ల వద్ద దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను అధికారులు అడ్డుకున్నారు. వారిని టీడీపీ ఎమ్మెల్సీ ఫరూఖ్ తన కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. చాబోలులో అధికార పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసింది. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి టీడీపీకి ఓటు వేసేలా ప్రలోభాలకు తెరలేపారు. సాధిక్నగర్లో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను ఉద్దేశించి ‘మీకు రూ.2 వేలు అందాయా?’ అని టీడీపీ కౌన్సిలర్ హారిక అడిగారు. నంద్యాల ఎస్బీఐ కాలనీలో ఆత్మకూరు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఓటర్లను కలుసుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
బెట్టింగ్‌ల జోరు
►నంద్యాల ఉపఎన్నికపై జోరుగా పందేలు ►జిల్లాలో రూ.కోట్లలో జరుగుతున్న వైనం ►వైఎస్ఆర్సీపీ గెలుపు అంచనాలతో వెనక్కి తగ్గుతున్న టీడీపీ ►ఎక్కడ చూసినా నంద్యాల గురించే చర్చ కడప : జిల్లాలో బెట్టింగ్‌రాయుళ్లు ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారు. ఒకసారి ఐపీఎల్, మరోసారి ఇండియా మ్యాచ్‌లపై బెట్టింగ్ జరుగుతుండగా.. ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నికపైనే జోరుగా బెట్టింగ్‌లు వేయిస్తున్నారు. ఊహకందని రీతిలో రాష్ట్రవ్యాప్తంగా బెట్టింగ్‌లు జరుగుతుండగా.. జిల్లాలో కూడా పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి 40రోజులుగా ప్రచార పర్వం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా బెట్టింగ్‌రాయుళ్లు అప్పటినుంచే భారీగా పందేలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నంద్యాల పోలింగ్ నేపథ్యంలో ఎక్కడ చూసినా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బెట్టింగ్‌కు అన్ని పార్టీల వారు కాలర్ ఎగరేస్తున్నారు. కోట్లలో బెట్టింగ్ జిల్లాలో నంద్యాల ఉపఎన్నికపై భారీగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. ఎన్నికకు ముందు ఒక రేటు.. పోలింగ్ సరళిని బట్టి అయితే మరొక రేటు అన్నట్లు బెట్టింగ్ జరుగుతోంది. ఎక్కడచూసినా చిన్న, పెద్దా, ఉద్యోగ, కార్మిక ఇలా పార్టీల నాయకులతోపాటు ప్రతి ఒక్కరిలోనూ నంద్యాల ఉప ఎన్నిక గురించే చర్చ జరుగుతోంది. కిందిస్థాయి కార్యకర్తల నుంచి ఓ రకమైన నేతల వరకు నంద్యాల ఉపఎన్నికపై ఆరా తీసి పందేలు పెట్టేందుకు ఆసక్తిచూపుతున్నారు. ఏదీ ఏమైనా జిల్లాలో పెద్ద ఎత్తున బెట్టింగ్ వ్యవహారం కొనసాగుతోంది. ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఈనెల 28వ తేదీన వెలువడనున్నాయి. వెనుకంజ వేస్తున్న టీడీపీ కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ముందురోజు వరకు టీడీపీ గెలుపు తమదేనంటూ కాలర్ ఎగరేసినా బుధవారం మాత్రం చతికిలపడ్డారు. పోలింగ్ సరళి బట్టి వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి గెలుపు తథ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు వెనుకంజ వేస్తున్నారు. ఎన్నిక ముందురోజు వరకు లక్షకు రూ.1.50లక్షలు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చిన టీడీపీ నేతలు ప్రస్తుతం లక్షకు లక్ష ఇచ్చేందుకు కూడా సిద్ధంగా లేకపోగా పందేలు కాయడానికి కూడా వెనుకంజ వేస్తున్నారు. ఎన్నికలలో శిల్పా మోహన్‌రెడ్డి గెలుపు దాదాపు ఖాయమైందని, ఈ నేపథ్యంలో అనవసరంగా పందేలు పెట్టి నష్టపోవడంకంటే ఊరకుండటమే మంచిదనే నిర్ణయానికి టీడీపీ నేతలు వచ్చినట్లు తెలుస్తోంది. -
బెట్టింగ్ బంగార్రాజు
అనంతలో నంద్యాల హీట్ - ఉప ఎన్నిక ఫలితంపై జోరుగా బెట్టింగ్ - రంగంలోకి ప్రధాన పార్టీల నేతలు, కార్యకర్తలతో పాటు వ్యాపారులు - గెలుపోటములపై ఎవరి లెక్కలు వారికి - పోలింగ్ శాతం పెరుగుదలతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఆనందం - ఈ నెల 27 వరకు తర్జనభర్జనలే.. 28న భవితవ్యం బెట్టింగ్.. బెట్టింగ్.. బెట్టింగ్. టీ కేఫ్‌లు.. డాబాలు.. బార్ అండ్ రెస్టారెంట్లు.. లాడ్జీల్లో బెట్టింగ్ బంగార్రాజుల హడావుడి కనిపిస్తోంది. ఇండియా.. శ్రీలంక వన్డే మ్యాచ్‌లకు తోడు, నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై బెట్టింగ్ హోరందుకుంది. అధికార.. ప్రతిపక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నిక చుట్టూ రాజకీయం చక్కర్లు కొడుతోంది. గెలుపోటములపై ఎవరి లెక్కలు వారేసుకుంటుండగా.. బెట్టింగ్‌రాయుళ్లు తెరపైకి రావడంతో ఫలితం హీటెక్కుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఏ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? నంద్యాలపై ఏ పార్టీ జెండా ఎగురుతుంది? ఇప్పుడు జిల్లాలో ఇదే హాట్ టాపిక్. పోలింగ్ సరళి ఆధారంగా బెట్టింగ్‌రాయుళ్లు పందెం కాస్తూ ఫలితానికి ముందే రాజకీయ సునామీ సృష్టించారు. ఇప్పటికే వేళ్లూనుకున్న క్రికెట్ బెట్టింగ్‌ను నిలువరించేందుకు అష్టకష్టాలు పడుతున్న పోలీసు శాఖకు.. తాజాగా నంద్యాల ఫలితంపై విచ్చలవిడిగా సాగుతున్న బెట్టింగ్ రూపంలో సరికొత్త సవాల్ ఎదురవుతోంది. ఈనెల 28న ఎన్నికల కౌంటింగ్ ఉండగా.. ఈ లోపు ఈ బెట్టింగ్ ఫీవర్ మరింతే ముదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో బుధవారం నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి, టీడీపీ తరఫున భూమా బ్రహ్మానందరెడ్డి బరిలో నిలిచారు. గత ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ శాతం భారీగా పెరిగింది. 80శాతం పైగా పోలింగ్ నమోదైంది. ఉప ఎన్నికల ప్రచారంలో ఇరుపార్టీల తరఫున ‘అనంత’కు చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు పాల్పంచుకున్నారు. దీంతో ఎన్నికల సరళి, ఫలితాలపై కర్నూలు జిల్లా నేతలకు ఏస్థాయిలో అవగాహన ఉందో.. ఇంచుమించు అదేస్థాయిలో అనంత నేతలు ఒక అంచనాకు వచ్చారు. ఫలితంగా పోలింగ్‌కు మూడురోజుల ముందు నుంచే ఎన్నికలపై పందేలు కాసేందుకు నేతలతో పాటు అనుచరులు సిద్ధమయ్యారు. బుధవారం పోలింగ్ ముగిసిన తర్వాత బెట్టింగ్ కాస్తా ఊపందుకుంది. ఉప ఎన్నికను ఇరుపార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ రోజూ ‘నంద్యాల అప్డేట్స్’ను ఆసక్తిగా తెలుసుకున్నారు. వీరిలో బెట్టింగ్‌కాసే వారు కూడా అభ్యర్థుల విజయావకాశాలపై తమ పరిధిలోని వారందరితో మాట్లాడి ఓ అభిప్రాయానికి వచ్చి పందెం కాస్తుండటం గమనార్హం. ఎవరి లెక్క వారిది నంద్యాల ఉప ఎన్నికలో భారీ పోలింగ్ నమోదు కావడం రాజకీయ వర్గాలు తీవ్ర చర్చకు తావిస్తోంది. భారీ పోలింగ్ వెనుక ప్రభుత్వ వ్యతిరేకత ఉందని.. ఇదే శిల్పా గెలుపును ఖాయం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయనకు 10-15వేల మెజార్టీతో గెలుపొందవచ్చనే చర్చ జరుగుతోంది. ఆ మేరకు 1ః1 లెక్కన పందెం కాస్తున్నారు. 5-10వేల మధ్య మెజార్టీ ఉంటుందనే అంశంపైనా 1ః1 బెట్టింగ్ సాగింది. అదేవిధంగా మెజార్టీతో సంబంధం లేకుండా శిల్పా గెలుపుపై 1ః2 లెక్కన పందెం పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధిస్తారని కూడా టీడీపీ నేతలతో పాటు కొందరు వ్యాపారులు కూడా పందెం కాస్తున్నారు. బ్రహ్మానందరెడ్డిపై పందెం కాసేవారంతా గెలుస్తారని 1ః1 లెక్కన బెట్టింగ్ కాస్తున్నారు. మెజార్టీపై ఎవ్వరూ బెటింగ్ నిర్వహించడం లేదు. మరో ఐదు రోజులు భారీ బెట్టింగ్ ఉప ఎన్నిక ఫలితం 28న వెలువడనుంది. ఈ ఐదు రోజుల్లో బెట్టింగ్ మరింత పెరిగే అవకాశం ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా డబ్బు వెనకేసుకున్న ఓ ఎమ్మెల్యే ఆ పార్టీ గెలుస్తుందని.. ఎంతమంది బెట్టింగ్ కాసినా తీసుకోండని ఓ టీంను సిద్ధం చేశారు. అలాగే ఓ మంత్రి సమీప బంధువు శిల్పా మోహన్‌రెడ్డి గెలుస్తాడని పందేలు తీసుకుంటున్నారు. అనంతపురం కార్పొరేషన్ పరిధిలోని కొందరు కాంట్రాక్టర్లు కూడా ఇరుపార్టీల అభ్యర్థులపై బెట్టింగ్ కాస్తున్నారు. వీరు అనంతపురంతో పాటు కర్నూలు జిల్లా వాసులతోనూ పందేలు కాస్తున్నారు. మొత్తం మీద ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా రూ.5కోట్ల మేర బెట్టింగ్ జరిగినట్లు తెలుస్తోంది. 28వ తేదీ నాటికి ఈ మొత్తం రూ.60–70కోట్లకు చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
వీధి రౌడీలా చంద్రబాబు విమర్శలు
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజం ►ఆ ఎమ్మెల్యేలు నంద్యాలలో ఎందుకు తిరుగుతున్నారు? ►ఓటర్లు మరింత భారీగా పోలింగ్‌లో పాల్గొనాలి ►వైఎస్ఆర్ సీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు ►ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు సాక్షి, హైదరాబాద్: ఓటర్లను ప్రభావితం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీధి రౌడీలా వ్యవహరించారని, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అవాకులు చవాకులు పేలారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలో ఉప ఎన్నికలో అధికార పార్టీ ఎన్నికల కోడ్‌ను పూర్తిగా ఉల్లంఘించిందని, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తమ ఎమ్మెల్యేలను నంద్యాలకు పంపించి ‘ఏం చేయగలుగుతారో.. చేయండి’ అంటూ ఆదేశాలు ఇచ్చారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ బుధవారం విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వ్యక్తి ఎన్నికల కోడ్ ఉల్లంఘించడం దారుణమన్నారు. పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు నంద్యాలలో బాహటంగా తిరిగినా పట్టించుకోని పోలీసులు, నంద్యాల నివాసి శిల్పా చక్రపాణిరెడ్డిని ఓటర్ కాదంటూ పంపించివేశారని ఆమె ధ్వజమెత్తారు. -
పోలింగ్ బూత్‌లో భూమా నాగ మౌనిక దౌర్జన్యం
వైఎస్సార్సీపీ ఏజెంట్‌ను భయపెట్టేందుకు విఫలయత్నం నంద్యాల అర్బన్ : నంద్యాల అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక సందర్భంగా బుధవారం దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా నాగ మౌనిక పోలింగ్ బూత్‌లలో దౌర్జన్యం చేశారు. భారీగా అను చరు లను వెంటే సుకుని వచ్చి ఎన్జీఓ కాలనీ పోలింగ్ బూత్‌లో దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్సీపీ రిలీవింగ్ ఏజెంట్‌ను బెదిరించడానికి విఫల యత్నం చేశారు. ‘అతన్ని అరెస్ట్ చేయండి. మీకు చేతకాకపోతే మా వాళ్లను పంపి సెటిల్ చేస్తా’ అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టీడీపీ కార్యకర్తలు.. వైఎస్సార్సీపీ ఏజెంట్‌పై చేయి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అతను వారి దాడి నుంచి తప్పించుకుని పక్కకు వెళ్లగా ‘వాన్ని పట్టుకోండి రా..’ అని వేలు చూపిస్తూ తన వెంట ఉన్న అనుచరులను ఆదేశించారు. పోలీసులు ఆపేందుకు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ‘వాన్ని అరెస్ట్ చేయకపోతే నా మనుషులకు నేను సమాధానం చెప్పలేను.. తక్షణమే అరెస్ట్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అంటూ పోలీసులను హెచ్చరించారు. -
నంద్యాలలో ప్రజాస్వామ్యం ఖూనీ
వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజం సాక్షి, హైదరాబాద్: నంద్యాల నడి వీధుల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన సీఎం చంద్రబాబు వైఖరిని ప్రజాస్వామ్య వాదులంతా వ్యతిరేకించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ.వందల కోట్లు వెదజల్లిన చంద్రబాబు దిగజారుడుతనాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనించాలని కోరారు. డబ్బులుంటే చాలు ఎన్నికల్లో నెగ్గొచ్చని భావిస్తున్న చంద్రబాబు ఆలోచనలకు భిన్నంగా నంద్యాల ఓటర్లు తీర్పునిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అంబటి బుధవారం హైదరాబాద్‌లో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గెలుపు కోసం ఇంతలా బరితెగించాలా? ‘‘నంద్యాల ఎన్నికల సందర్భంగా చంద్రబాబు చేతుల్లో ప్రజాస్వామ్యం మరోసారి అపహాస్యానికి గురైంది. పోలీసు యంత్రాంగం చంద్రబాబు చెప్పుచేతుల్లో నడిచింది. దొంగ ఓట్లు వేయించే దుస్థితికి టీడీపీ దిగజారింది. ఇదేమిటని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేశారు. పార్టీ సీఈసీ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డిపై దౌర్జన్యం చేసి, గాయపరిచారు. గెలుపు కోసం ఇంతగా బరితెగించాలా?’’ అని ప్రశ్నించారు. జగన్ వస్తే టీడీపీకి భయం మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎన్నికల నుంచి బహిష్కరించాలని, కాకినాడకు వెళ్లకుండా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పే అధికారం మంత్రి యనమల రామకృష్ణుడికి ఎక్కడిది? ప్రతి ఫిర్యాదుపైనా ఎన్నికల సంఘం అన్ని కోణాల్లో విచారిస్తుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. జగన్ కాకినాడకు వెళ్లకుండా అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర పన్నుతోంది. జగన్ వస్తే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలవలేమని భయపడుతోంది’’ అని అంబటి అన్నారు. -
టీడీపీ ఎమ్మెల్యేల హంగామా
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు హంగామా సృష్టించారు. బుధవారం ఉదయం పోలింగ్ ప్రశాంతంగానే మొదలైనప్పటికీ.. పోలింగ్ శాతం పెరిగేకొద్దీ అధికారపార్టీలో అసహనం ఎక్కువైంది. దీంతో ఎక్కడికక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు పర్యటిస్తూ తమ పార్టీకి ఓటేయాలంటూ బాహాటంగానే ప్రజల్ని హెచ్చరించే ప్రయత్నం చేశారు. ఎన్నికల నిబంధనలను తోసిరాజని కర్నూలు, శ్రీశైలం, కోడుమూరు, బనగానపల్లె, అనపర్తి ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. మంత్రి అఖిలప్రియ సైతం రంగంలోకి దిగి నంద్యాల పట్టణంలో పలువార్డుల్లో పర్యటించారు. ఇంత చేస్తున్నా వారిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించలేదు. భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె నాగమౌనిక అయితే పోలింగ్ కేంద్రాల్లో దుర్భాషలాడుతూ హంగామా సృష్టించడం గమనార్హం. ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు: అధికారపార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఎన్నికల నిబంధనలను సైతం పట్టించుకోకుండా నంద్యాల నియోజకవర్గంలో ఇష్టానుసారంగా తిరిగారు. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చాపిరేవులలో పర్యటించి పార్టీ నేతలతో మాట్లాడి ఓట్లేయించే ప్రయత్నం చేశారు. ఇక బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి గోస్పాడు మండలంలోని యాళ్లూరులో ఏకంగా డీఎస్పీతోనే మాటామంతీ నిర్వహించారు. అదేరీతిలో కర్నూలు, కోడుమూరు, శ్రీశైలం ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, బుడ్డా రాజశేఖరరెడ్డిలు పట్టణంలోని నడిగడ్డ, ఎన్జీవో కాలనీలలో ప్రధానంగా పర్యటిస్తూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారు. చివరకు పదేపదే మీడియాలో రావడంతో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. అదేబాటలో మంత్రి..: మంత్రి అఖిలప్రియ కూడా ఆళ్లగడ్డ నుంచి నంద్యాలలోకి అడుగుపెట్టారు. బుధవారం ఉదయం ఆళ్లగడ్డ నుంచి బయల్దేరి నంద్యాలకు చేరుకున్న ఆమె అనంతరం టీవీలకు అక్కడి అద్దెభవనం నుంచి ఇంటర్వ్యూలిచ్చారు. అంతేకాక దర్జాగా నంద్యాల నడివీధుల్లో తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. -
రెండు దశాబ్దాల్లో ఇదే అత్యధిక పోలింగ్
- నంద్యాల ఉప ఎన్నికపై సీఈవో భన్వర్‌లాల్ - స్వల్ప సంఘటనలు మినహా అంతా ప్రశాంతం - దాదాపు 80 శాతం పోలింగ్ నమోదు సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సంఘం తీసుకున్న పకడ్బందీ చర్యల వల్ల నంద్యాల ఉప ఎన్నిక ఒకటి రెండు స్వల్ప సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) భన్వర్‌లాల్ చెప్పారు. ఈ ఉప ఎన్నికలో పోలింగ్ రికార్డు స్థాయిలో దాదాపు 80 శాతానికి చేరిందని, గత రెండు దశాబ్దాల్లో ఇదే గరిష్టమని తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన వివరాలను ఆయన బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో మీడియాకు వివరించారు. ఆయన ఏం చెప్పారంటే...‘‘నంద్యాల నియోజకవర్గంలో 2009లో 76 శాతం, 2014 సాధారణ ఎన్నికల్లో 71 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుత ఉప ఎన్నికలో సాయంత్రం 5 గంటల వరకు 76 శాతం మందిపైగా ఓట్లు వేశారు. పోలింగ్ ముగిసేటప్పటికి ఇది దాదాపు 80 శాతానికి చేరింది. ఒకటి రెండు స్వల్ప సంఘటనలు మినహా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనావళిని పాటించాయి. కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలింగ్ రోజు వరకూ దాదాపు రూ.1.2 కోట్ల నగదు జప్తు చేశాం. 72 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 62 చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం వల్ల అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలింగ్ ముగిసింది. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి రాజకీయ పార్టీలు, మీడియా సహకరించాయి. అందరికీ ధన్యవాదాలు’’ అని భన్వర్‌లాల్ పేర్కొన్నారు. నియమావళి ఉల్లంఘనలపై విచారణ ఉప ఎన్నిక ప్రచారంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగం పట్ల కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాల విష యంలో మేము ఏ అంశాన్నీ తొక్కి పెట్టలేదు. 21వ తేదీ సాయంత్రం 8 గంటలకు మాకు ఎన్నికల సంఘం నుంచి లేఖ అందింది. దీనిపై వెంటనే రిటర్నింగ్ అధికారికి డైరెక్టన్ (సూచన) ఇచ్చాం. 22వ తేదీన రిటర్నింగ్ అధికారి పోలింగ్ ఏర్పాట్లలో బిజీగా ఉన్నందు న 23వ తేదీన చర్యలు తీసుకున్నారు. అంతా ప్రొసీజర్ (పద్ధతి) ప్రకారమే జరిగింది. ఎన్ని కల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై అన్ని పార్టీల నేతలూ ఫిర్యాదులు చేశారు. వాటిపై విచారణ జరిపించి నిర్ణయం తీసుకుంటాం’’ అని భన్వర్‌లాల్ చెప్పారు. 28న ఓట్ల లెక్కింపు ‘‘నంద్యాలలో ఈ నెల 28వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. లెక్కింపు కోసం 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తాం. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నానికల్లా తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది’’ అని భన్వర్‌లాల్ వెల్లడించారు. -
ఓటెత్తిన నంద్యాల
ఉప ఎన్నికలో 79.20 శాతం పోలింగ్ - గోస్పాడు మండలంలో అత్యధికంగా 90.81 శాతం నమోదు - దశాబ్దాల తర్వాత అత్యధిక పోలింగ్‌గా రికార్డు - ఉదయం నుంచే బారులుతీరిన ప్రజానీకం - ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో మహిళలే అధికం - అధికార పార్టీ ఎమ్మెల్యేల హల్చల్.. చివరి 3 గంటలూ దౌర్జన్యం - రిలీవర్ ఏజెంట్లను లోపలికి అనుమతించని వైనం - ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసులు నంద్యాల నుంచి సాక్షి ప్రతినిధి: రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపిన కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ బుధవారం స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు ఉదయం నుంచే బారులు తీరారు. ప్రధానంగా మహిళలు అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల సమయానికి నంద్యాల చరిత్రలో లేని విధంగా 79.20 శాతం ఓటింగ్ నమోదైంది. వైఎస్ఆర్ సీపీ తరఫున నంద్యాల ఎమ్మెల్యేగా గెలిచిన భూమా నాగిరెడ్డి పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరాక గుండె పోటుతో మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇందులో భాగంగా బుధవారం పోలింగ్ ప్రారంభం కాగానే ఓటింగ్ శాతం భారీగా పెరుగుతుండటంతో బెంబేలెత్తిన అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగి ఓటర్లను ప్రలోభపెట్టడంతో పాటు భయోత్పాతం సృష్టించేందుకు తీవ్రంగా యత్నించారు. ఉదయం నుంచి అత్యంత ప్రశాంతంగా కొనసాగిన పోలింగ్.. చివరి మూడు గంటల్లో రౌడీ రాజ్యాన్ని తలపించింది. 7వ వార్డులో కౌన్సిలర్ కలాంపై టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి దాడి చేశారు. భూమా మౌనిక, జగత్విఖ్యాత్రెడ్డిలు భారీగా అనుచరులను వెంటేసుకుని పట్టణంలో హల్చల్ చేయడం సామాన్యులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. గాంధీనగర్ పోలింగ్ బూత్ వద్ద వైఎస్సార్సీపీ సీఈసీ మెంబర్ రాజగోపాల్‌రెడ్డిపై ఒంగోలు మాజీ ఎమ్మెల్యే రాంబాబు అనుచరులు దాడికి విఫలయత్నం చేశారు. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి కాన్వాయ్‌తో పట్టణంలో కలియ తిరుగుతూ ఇబ్బంది కలిగిస్తున్నా పోలీసులు అభ్యంతరం చెప్పలేకపోయారు. మంత్రి అఖిలప్రియ అళ్లగడ్డకు చెందిన వ్యక్తులను వెంటబెట్టు కొని పలు పోలింగ్ బూత్‌లలో కలియతి రిగారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లు, మీడియా ప్రతినిధులపై దూషణలకు దిగారు. అయినా వైఎస్సార్సీపీ శ్రేణులు ఎక్కడికక్కడ సంయమనం పాటించి, పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాయి. కాగా, గెలుపు తమదేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బారులు తీరిన మహిళలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. పోలింగ్ ప్రారంభమైన రెండు గంటలకు 17 శాతం పోలింగ్ నమోదైంది. ఓటింగ్‌లో అదే పరంపర కొనసాగుతూ వచ్చింది. మధ్యాహ్నం 1 గంట సమయానికి 53 శాతం, సాయంత్రం 5 గంటలకు 77.6 శాతం ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 79.20 శాతం నమోదైంది. గోస్పాడు మండలంలో అత్యధికంగా 90.81 శాతం, నంద్యాల రూరల్‌లో 87.61 శాతం ఓటింగ్ నమోదు కావడం విశేషం. ముస్లిం మైనార్టీ మహిళలు ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు తరలివచ్చారు. పరిశీలకుల అంచనాలను తలకిందులు చేస్తూ ఓటును సద్వినియోగం చేసుకున్నారు. ఎవరికి ఓటు వేశారంటూ వివిధ న్యూస్ చానళ్లు, పత్రికలు (సాక్షి కాదు) పలు విధాలా ప్రయత్నించినా ఓటు సీక్రెట్ అంటూ బహిర్గత పరచక పోవడం విశేషం. అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదు కావడంతో ఇది ప్రభుత్వ వ్యతిరేకతను సూచిస్తోందని అధికార పార్టీ నేతలు నిరాశలో ఉండిపోయారు. టీడీపీ ఎమ్మెల్యేల హల్చల్ నియోజకవర్గానికి చెందిన ప్రజలు తప్ప ఇతరులెవరూ నంద్యాల నియోజవర్గ పరిధిలో ఉండకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశించినప్పటికీ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు లెక్క చేయలేదు. పోలింగ్ మొదలైనప్పటి నుంచి ఇష్టమొచ్చినట్లు తిరుగుతూ పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి హల్చల్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికల పాస్ లేకుండా కేంద్రాల్లోకి వెళ్లి ఓటర్లు, ఏజెంట్లను ప్రభావితం చేస్తున్నా అధికారులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని అందరూ చర్చించుకుంటున్న సమయంలో తమకు ఓట్లు పడటం లేదని అధికార పార్టీ నాయకులు అనుమానించారు. మరో మూడు గంటల్లో పోలింగ్ గడువు ముగుస్తుందనగా టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు బూత్‌లలోకి వెళ్లి ఓటర్లను ప్రలోభపెట్టారు. ఏజెంట్లను లొంగదీసుకునేందుకు బెదిరింపులకు దిగారు. వైఎస్సార్ నగర్లో కౌన్సిలర్ శివశంకర్ ఓటర్లకు మరోమారు యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేశారు. పట్టణంలోని పలు పోలింగ్ బూత్‌ల సమీపంలో టీడీపీకి ఓటు వేస్తామంటే రూ.2 వేలు ఇస్తానంటూ కౌన్సిలర్ జేవీసి హారిక బహిరంగంగా ప్రలోభాలకు గురిచేస్తూ హల్చల్ చేశారు. టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి 7వ వార్డు కౌన్సిలర్ కలాంపై దాడి చేయడం, ఎన్జీవో కాలనీలో మంత్రి అఖిలప్రియ సోదరి మౌనికారెడ్డి, తమ్ముడు జగత్విఖ్యాత్రెడ్డిలు ఏజెంట్లు, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. ఎన్టీఆర్ షాదీఖాన సమీపంలో దొంగ ఓట్లు వేస్తున్న టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకోగా.. వారిని ఎమ్మెల్సీ ఫరూక్ తన వాహనంలో ఎక్కించుకుని వెళ్లారు. యథేచ్ఛగా దొంగ ఓట్లకు తెగించిన టీడీపీ నందమూరినగర్‌లోని పోలింగ్ బూత్‌లలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. అధికార టీడీపీకి అనుకూలంగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వివక్ష చూపారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయాందోళన నెలకొంది. వైఎస్సార్సీపీకి చెందిన రిలీవర్ ఏజెంట్లను బయటకు గెంటివేసిన పోలీసులు... తిరిగి వారిని లోపలికి అనుమతించలేదు. నంద్యాల్లోని 18, 18ఏ, 19, 19ఏ, 20, 20ఏ బూత్‌లలో ఉన్న ఏజెంట్లు మధ్యాహ్నం కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్తామంటే వారి స్థానంలో రిలీవర్ ఏజెంట్లు మంజుల, రమాదేవిని అనుమతించలేదు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు వారిని తీవ్ర పదజాలంతో దూషించారు. పూర్తిగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. నందమూరి నగర్‌లోని నాలుగు బూత్‌లలో బనగానపల్లె, కోవెలకుంట్ల తదితర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు దొంగ ఓట్లు వేశారు. ఇక్కడికి మొత్తం 60 మందికి పైగా దొంగ ఓటర్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు తెలిపినా పట్టించుకోలేదు. చివరి క్షణంలో స్పందించిన పోలీసులు.. కేవలం ఆరుగురు దొంగ ఓటర్లను మాత్రమే అరెస్టు చేశారు. నందమూరి నగర్ పోలింగ్ బూత్‌లో మూడున్నర గంటలపాటు ఈవీఎం మిషన్‌కు అనుబంధంగా ఉండే వీవీ ప్యాట్ యంత్రం మొరాయించింది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.40 గంటల వరకు మరమ్మతుకు నోచుకోలేదు. క్యూలో 70 మందికిపైగా ఓటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు అదనపు వీవీ ప్యాట్ యంత్రాన్ని అమర్చడంతో దాదాపు 7 గంటలకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైఎస్ఆర్ నగర్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ ఎదుట ఓటర్లకు టీడీపీ కౌన్సిలర్ శివశంకర్ యాదవ్, టీడీపీ నాయకుడు ప్రసాదరెడ్డి డబ్బులు పంచుతుండడంతో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఇటుక పెళ్లతో దాడికి యత్నించారు. కొందరిపై చేయి చేసుకున్నాడు. పోలీసులు కలుగజేసుకొని అక్కడి నుంచి ఇరు పార్టీల నేతలను చెదరగొట్టారు. -
నూరు శాతం మాదే విజయం: శిల్పా మోహన్‌రెడ్డి
- టీడీపీ కుట్రలకు ఓటుతో బదులిచ్చిన ప్రజలకు ధన్యవాదాలు - అన్ని వర్గాల ఓటర్లూ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారు - ఓటమి ఫ్ట్రస్ట్రేషన్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు బరితెగించారు నంద్యాల: అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రలోభాలకు దిగిన తెలుగుదేశం పార్టీకి నంద్యాల ఓటర్లు గట్టిగా బుద్ధిచెప్పారని వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. వాతావరణాన్ని కలుషితం చేసేలా టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా, ప్రజలు శాంతియుతంగా ఓటింగ్‌లో పాల్గొన్నారని, నూటికి నూరు శాతం గెలుపు వైఎస్సార్‌సీపీదేనని, భారీ మెజారిటీతో గెలుస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు. బుధవారం ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ముందుగా నంద్యాల ప్రజలందరికీ కృతజ్ఞతలు. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా బెదిరిపోకుండా సామరస్యాన్ని ప్రదర్శించిన ఓటర్లకు ధన్యవాదాలు. రైతులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున బారులుతీరి ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొనడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున కుట్రలు చేశారు. ఎన్నికలు రద్దయ్యేలా పన్నాగాలు పన్నారు. కానీ, వాటిని వైఎస్సార్సీపీ సమర్థవంతంగా అడ్డుకుంది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, కార్యకర్తలు, మా కుటుంబసభ్యులు అందరం సహకరించాం. మా తమ్ముడు చక్రపాణిరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడానికి పోలీసులు పలుమార్లు ప్రయత్నించారు. కానీ ఈసీ లెటర్ లేనిదే మేం లొంగిపోమని బదులిచ్చాం. చివరిదాకా వాళ్లు ఆ లేఖను తేలేకపోయారు’’ అని శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. ఆ ఘటనలు బాధించాయి: ‘‘భూమా మౌనిక రెడ్డి.. పోలింగ్ స్టేషన్లో మా పార్టీ ఏజెంట్ బాషాను బయటికి పంపేందుకు యత్నించడం, టీడీపీ నేతల జోలికి పోకుండా మమ్మల్ని మాత్రమే పోలీసులు పలు మార్లు అడ్డుకోవడం, పోలింగ్ ముగుస్తున్న సమయంలో మైనారిటీలపై టీడీపీవాళ్లు దాడులు చేయడం లాంటి ఘటనను నన్ను తీవ్రంగా బాధించాయి. నంద్యాలకు సంబంధంలేని టీడీపీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, మణిగాంధీ, జనార్థన్‌రెడ్డి, అఖిలప్రియ, ఎంపీ టీజీ వెంకటేశ్ ఇంకా చాలా మంది ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్పించారు. గొడవలు సృష్టించి పోలింగ్‌ను నిలిపేసేలా కుట్రలు చేశారు. ఫరూఖ్ నగర్లో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి, ఆయన అనుచరులు వైఎస్సార్సీపీ కౌన్సిలర్, ఇతర మైనారిటీ నేతలపై దాడిచేసి, చంపుతామని బెదిరించారు. ఓటమి ఖాయం కావడంతోనే టీడీపీ ఫ్ట్రస్ట్రేషన్కి లోనైంది’’ అని శిల్పా పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆ 20 మంది రాజీనామా చేయండి: ‘‘ఎమ్మెల్సీగా 6 సంవత్సరాలు పదవిలో కొనసాగే వీలున్నా, పార్టీ మారినందుకుగానూ నైతిక విలువలకు కట్టుబడి కేవలం 91 రోజుల్లోనే నా తమ్ముడు శిల్పా చక్రపాణిరెడ్డి పదవికి రాజీనామా చేశారు. నంద్యాల ఉప ఎన్నికను ధీటుగా ఎదుర్కొన్నాడు. ఇప్పటికైనా టీడీపీలోకి ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలి. ప్రజల మద్దతుతో మాత్రమే పదవుల్లో కొనసాగాలి. ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి నాతో కలిసి పనిచేసిన అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అని శిల్పా మోహన్‌రెడ్డి ముగించారు. -
నంద్యాల ఉప ఎన్నిక అప్ డేట్స్...
సాక్షి, నంద్యాల : ఉప ఎన్నికలో భాగంగా బుధవారం జరిగిన పోలింగ్‌లో నంద్యాల ఓటర్లు చైతన్యం ప్రదర్శించారు. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు 255 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. సమస్యాత్మక, అతిసమస్యాత్మక కేంద్రాల్లో ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ♦ కురుక్షేత్రం ముగిసింది: నంద్యాల ఉప ఎన్నికను కురుక్షేత్ర మహా సంగ్రామంగా శిల్పా చక్రపాణిరెడ్డి అభివరణించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేశారని, శ్రేయోభిలాషులు వెన్నుదన్నుగా నిలిచారని చెప్పారు. ♦ నూటికి నూరు శాతం గెలుపు వైఎస్సార్సీపీదే: టీడీపీకి నంద్యాల ఓటర్లు గట్టిగా బుద్ధిచెప్పారని, నూటికి నూరుశాతం గెలిచేది వైఎస్సార్సీపీనే అని ఆ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ♦ 82 శాతానికి పెరగనున్న ఓటింగ్: నంద్యాల ఉప ఎన్నికలో భాగంగా బుధవారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా సాగిందని, రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదవుతోందని ప్రధాన ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ చెప్పారు. ♦ సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసింది. ఈ సమయంలోగా పోలింగ్ కేంద్రంలో వరుసలో నిలుచుకున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల సంఘం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ప్రకటించింది. ♦ నంద్యాలలో సాయంత్రం 5 గంటల వరకు 76 శాతంపైగా పోలింగ్ నమోదయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఆయన ప్రకటించారు. కొత్తగా ప్రవేశపెట్టిన వీవీ పాట్స్ బాగా పనిచేశాయన్నారు. ♦ రహీంపై దాడి: వైఎస్సార్సీపీ మైనారిటీ నేత రహీంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. నంద్యాలలోని ఫారూఖ్ నగర్లో రహీంపై దాడి చేసిన దృశ్యాలు సంచలనం రేపాయి. ♦ ఫరూఖ్ నగర్లో ఘర్షణ: మైనారిటీలే లక్ష్యంగా టీడీపీ దాడులకు తెగబడింది. నంద్యాలలోని ఫరూఖ్ నగర్ ఏరియాలో వైఎస్సార్సీపీ నేత రహీం, మరికొద్ది మందిపై టీడీపీ నేతలు దాడికి దిగడంతో అక్కడ ఘర్షణ చెలరేగింది. ♦ అబ్దుల్ కలాంపై భౌతికదాడి: నంద్యాల ఏడోవార్డులో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అబ్దుల్ కలాంపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి భౌతికదాడి చేశారు. ♦ గాంధీనగర్‌లో తీవ్ర ఉద్రిక్తత: నంద్యాలలోని గాంధీనగర్‌లో డబ్బులు పంచుతోన్న టీడీపీ నేత అన్న రాంబాబు అనుచరులు.. అడ్డుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు. టీడీపీ గుండాల దాడి.. తోపులాటతో భయాందోళనకు గురైన ఓటర్లు. చోద్యం చూస్తూ నిలబడిన పోలీసులు. ♦ రికార్డ్ పోలింగ్ శాతం దిశగా: నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌లో మధ్యాహ్నం 3 గంటల వరకు 71.91 శాతం పోలింగ్ నమోదయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటల వరకు నంద్యాల గ్రామీణంలో 81.10 శాతం, నంద్యాల అర్బన్‌లో 67.60 శాతం, గోస్పాడు మండలంలో 81.14 శాతం ఓటింగ్ నమోదయినట్లు ఈసీ పేర్కొంది. ♦ మధ్యాహ్నం 3 గంటల వరకు... ఒక లక్షా 57 వేల 401 ఓట్లు పోలయ్యాయని, వారిలో మహిళలు 81వేల 492 మందికాగా, పురుషులు 75 వేల 910 మంది అని ఈసీ తెలిపింది. 2014 సాధారణ ఎన్నికల్లో నంద్యాలలో పోలింగ్ శాతం 72.14కాగా, నేటి ఉప ఎన్నికలో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ శాతం నాటి రికార్డుకు చేరువైంది. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కేంద్రానికి వచ్చే వారికి ఓటు వేసే అవకాశం ఉండటంతో ఓటింగ్ శాతం రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉంది. ♦ పోలింగ్ బూత్ వద్ద దౌర్జన్యం: నంద్యాల 29వ వార్డు, పోలింగ్ బూత్ నంబర్162 వద్ద టీడీపీ కార్యక్తలు దౌర్జన్యానికి పాల్పడుతుండటంతో అడ్డుకున్న వైఎస్సార్సీపీ కార్యర్తలు. టీడీపీ నేతలకు అనుకూలంగా ప్రవర్తించిన త్రీటౌన్ సీఐ దేవంద్ర.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను వెళ్లగొట్టే యత్నం. ♦ చిక్కిన టీడీపీ దొంగ ఓటర్లు: ఉదయం నుంచి కొనసాగుతున్న టీడీపీ అక్రమపర్వం పరాకాష్టకు చేరింది. ఏకంగా భారీ సంఖ్యలో దొంగ ఓటర్లను రంగంలోకి దించింది. నంద్యాలలోని నందమూరి నగర్లో 10 మంది టీడీపీ దొంగ ఓటర్లను ఎన్నికల పరిశీలకులు పట్టుకున్నారు. విచారణ కోసం వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. 10 మంది దొరికిపోవడంతో మరో 20 మంది ఓటర్లు పోలింగ్ స్టేషన్ నుంచి పారిపోయారు. ♦ నంద్యాల రూరల్ మండల్లాల్లో భారీగా పోలింగ్: మధ్యాహ్నం ఒంటిగంట వరకు.. చాపిరేవులలో 2750 ఓట్లకుగానూ ఇప్పటివకర 2100 ఓట్లు పోలయ్యాయి. మిట్నాలలో 1500కుగానూ 860, భామవరంలో 1800కుగానూ 1000, గుంతనాలలో 700కుగానూ 600, బ్రాహ్మణపల్లిలో 560 ఓట్లకుగానూ 460 ఓట్లు పోలయ్యాయి. ♦మధ్యాహ్నం 1గంట వరకూ 53.1 శాతం పోలింగ్ నమోదు ♦ఒంటి గంట వరకూ పోలైన ఓట్లు లక్షా 16వేల 214 ♦పోలైన ఓట్లలో మహిళలు 59,954, పురుషులు 56,260 ♦నంద్యాలలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న టీడీపీ నేతలు ♦వార్డుల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్న మంత్రి అఖిలప్రియ ♦నంద్యాల మండలం ఒంటిగంట వరకూ రూరల్‌లో భారీగా పోలింగ్ ♦చాపరేవులలో 2750కి 2100 ఓట్లు పోల్ ♦మిట్నాలలో 1500కి 860, భీమవరంలో 1800కి 1000 ఓట్లు పోల్ ♦గుంతనాలలో 700కి 600..బ్రాహ్మణపల్లిలో 560కి 460 ఓట్లు పోల్ ♦రికార్డు స్థాయి పోలింగ్ దిశగా దూసుకెళ్తున్న నంద్యాల ♦పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితిని స్వయంగా వెళ్లి తెలుసుకుంటున్న శిల్పా మోహన్ రెడ్డి ♦ప్రశాంతంగా ఎన్నిక జరగడానికి అందరూ సహకరించాలి ♦ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించండి ♦పోలీస్ ఉన్నతాధికారితో ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి మంతనాలు ♦గోస్పాడు మండలం యళ్లూరులోని ఓ ఆలయంలో భేటీ ♦గ్రామీణ ప్రాంతాల్లో భారీగా పోలింగ్ ♦చాపరేవులలో మధ్యాహ్నం 12 గంటల వరకూ 75 శాతం పోలింగ్ నమోదు ♦2,750 ఓట్లకుగాను పోలైన 2,050 ఓట్లు ♦నంద్యాల 74,76 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు టీడీపీ ప్రలోభాలు ♦అడ్డుకున్న వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, వాగ్వాదం ♦గోస్పాడు మండలం పార్వతీపురంలో ఈవీఎం మొరాయింపు ♦స్థానికేతరులు జిల్లాలో ఉండొద్దని ఈసీ ఆదేశించినా పట్టించుకోని వైనం ♦యథేచ్చగా ఓటర్లపై ఒత్తిడులు, ప్రలోభాలు ♦అధికార పార్టీ ప్రలోభాలపై నిస్తేజంగా పోలీసు యంత్రాంగం ♦ప్రజాస్వామ్యం పరిహాసం అవుతుందంటున్న వైఎస్ఆర్సీపీ ♦ఈసీకి ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్ సీపీ నేతలు ♦తక్షణమూ టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ♦యళ్లూరులో తిరుగుతున్న బనగానపల్లె ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి ♦ఎమ్మెల్యే స్టిక్కర్‌ఉన్న ఫార్ఛునర్ కారులో సంచారం ♦ఎస్బీఐ కాలనీలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రచారం ♦నిబంధనల ప్రకారం కర్నూలు జిల్లాలో స్థానికేతరులు ఉండరాదు ♦టీడీపీ కౌన్సిలర్ భర్త ప్రసాద్ హల్చల్ ♦27వ వార్డులో కౌన్సిలర్ హారిక, ప్రసాద్ అధికార దుర్వినియోగం ♦అధికార పార్టీ బెదిరింపులకు భయపడొద్దని రవిచంద్ర కిషోర్ రెడ్డి సూచన ♦అందరూ ఓటువేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలి ♦మహిళలు భారీగా ఓటింగ్‌లో పాల్గొనడం సంతోషం ♦ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి ♦మిట్నాలలో భూమా నాగిరెడ్డి తనయుడు విఖ్యాత్ రెడ్డి హల్చల్ ♦నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన విఖ్యాత్ ♦నంద్యాల ఎస్బీఐ కాలనీలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ప్రచారం ♦ఓటర్లను ప్రభావితం చేస్తున్న ఎమ్మెల్యే బుడ్డా ♦ఉదయం 11 గంటల వరకూ 32.4 శాతం పోలింగ్ నమోదు ♦ఓటు హక్కు వినియోగించుకున్న 70,909 ఓటర్లు ♦ఓటు వేసిన 36,305 మంది పురుషులు, మహిళలు 34,604 ♦చాబోలులో అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ♦ఓటర్లను ప్రభావితం చేస్తున్న ఎమ్మెల్యే ♦నంద్యాలలో వెల్లువెత్తిన ఓటరు చైతన్యం ♦పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూలు ♦క్యూలైన్లో పెద్ద ఎత్తున బారులు తీరిన మహిళలు ♦ప్రలోభాలకు లొంగకుండా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు ♦పలు గ్రామాల్లో ఇప్పటికే 40శాతం దాటిన పోలింగ్ ♦నంద్యాల పట్టణంలోని పోలింగ్ కేంద్రాల్లోనూ భారీగా ఓటింగ్ ♦వైఎస్ఆర్ సీపీకి గట్టి పట్టున్న వైఎస్ఆర్ నగర్లో టీడీపీ నేతల స్వైర విహారం ♦టీడీపీ అభ్యర్థి అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి హల్చల్ ♦ఎటువంటి పాస్‌లు లేకుండానే ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్న నేతలు ♦కొనసాగుతున్న అధికార పార్టీ ప్రలోభాల పర్వం ♦ఎన్టీఆర్ షాదీఖానా వద్ద కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మకాం ♦12వ వార్డులోని ఓ ఇంట్లో ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదరి, మణిగాంధీ ♦144 సెక్షన్ అమల్లో ఉన్నా ఖాతరు చేయని టీడీపీ నేతలు ♦ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన అనంతపురం టీడీపీ ఎమ్మెల్యేలు ♦నంద్యాలకు ప్రభాకర్ చౌదరి, జితేందర్ గౌడ్, పార్టీ నేత చమన్ ♦ఓటర్లను ప్రలోభపెట్టేందుకు విస్తృత ప్రయత్నాలు ♦నందమూరి నగర్లో భూమా మౌనిక ప్రచారం ♦మౌనికతో పాటు ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ నేతల ప్రచారం ♦పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్ సీపీ నేతలు ♦ నంద్యాల నందమూరి నగర్లో కేంద్ర బలగాల పహారా ♦టీడీపీ కౌన్సిలర్ శివశంకర్ డబ్బుల పంపిణీపై ఫిర్యాదులు ♦ఏపీ సచివాలయంలోనూ అధికార దుర్వినియోగం ♦కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ ♦ఓటర్లను ప్రభావితం చేసేలా అధికారులకు మంత్రుల ఆదేశాలు ♦నంద్యాలలోకి ప్రవేశించిన ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, మణిగాంధీ ♦నంద్యాల 94,97 పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంల మొరాయింపు ♦మెజార్టీ పోలింగ్ బూత్‌లలో ఇద్దరు టీడీపీ ఏజెంట్లకు అనుమతి ♦వైఎస్ఆర్ సీపీ ఏజెంట్లకు పాస్‌లు ఇవ్వకుండా వేధిస్తున్న అధికారులు ♦10వ వార్డు శారదా విద్యాపీఠం వద్ద సర్వే పేరిట ఓటర్లకు బెదిరింపులు ♦ఉదయం 9 గంటల వరకూ 17 శాతం పోలింగ్ నమోదు ♦ఓటు హక్కు వినియోగించుకున్న 37,236 మంది ఓటర్లు ♦ఓటు వేసిన మహిళలు (18,245) పురుషులు (18,991) ♦నంద్యాలలో మంత్రి ఆదినారాయణరెడ్డి అత్యుత్సాహం ♦గోస్పాడు మండలం దీబగుంటలోవైఎస్‌ఆర్ సీపీ నేత పీపీ నాగిరెడ్డి బంధువులను అరెస్ట్ చేయాలని ఒత్తిడి ♦నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసిన అధికారులు ♦నంద్యాలలోని 84, 85, 86 బూత్‌లలో టీడీపీ రిలీవింగ్ ఏజెంట్ల హల్చల్ ♦వైఎస్ఆర్ సీపీ ఏజెంట్లను బయటకు పంపి ఓటర్లను ప్రలోభపెడుతున్న టీడీపీ ఈ ఉప ఎన్నికలో టీడీపీ, వైఎస్ఆర్ సీపీ, కాంగ్రెస్‌తో పాటు మొత్తం 15 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 2 లక్షల 18 వేల 858 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి ఎన్నికల నిబంధనలకు ఉల్లంఘిస్తున్నారు. సుమారు 20మంది అనుచరులతో కలిసి పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు యత్నించారు. మరోవైపు బ్రహ్మానందరెడ్డి సోదరి ఏకంగా పోలింగ్ బూత్‌లోనే ఎన్నికల ప్రచారం చేపట్టారు. టీడీపీకే ఓటు వేయాలని బ్రహ్మానందరెడ్డి సోదరి నాగ మౌనిక ఆదేశాలు ఇచ్చారు. -
'కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది'
-
'కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది'
సాక్షి, నంద్యాల: ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలవబోతున్నామని వైఎస్సార్ సీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన తర్వాత తన సోదరుడితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉప ఎన్నికను కురుక్షేత్ర మహా సంగ్రామంగా ఆయన వర్ణించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేశారని, శ్రేయోభిలాషులు వెన్నుదన్నుగా నిలిచారని చెప్పారు. తమ కార్యకర్తలు బంగారమని, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పనిచేశారని మెచ్చుకున్నారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కష్టపడి పనిచేశారని, కార్యకర్తలు చేతులెత్తి దండం పెట్టాలని అన్నారు. సీఎం, మంత్రులు మకాం వేసి ప్రలోభాలు పెట్టినా తమకు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. సీఎం ఆరు రోజులు, ఆయన తనయుడు రెండ్రోజులు, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు నెల రోజులు ఇక్కడే మకాం వేశారని వెల్లడించారు. నామినేషన్ నుంచి పోలింగ్ ఎన్నోకుట్రలు పన్నారని ఆరోపించారు. తన సోదరుడు నామినేషన్ చెల్లకుండా చేయాలని చూశారన్నారు. ఎన్నోరకాల దుష్ప్రచారాలు చేశారని.. కుల, మతాలు అడ్డుపెట్టుకుని రాజకీయం చేశారని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు భయభ్రాంతులకు గురిచేసినా భయపడకుండా నంద్యాల ప్రజలు ఓటు వేశారని తెలిపారు. తనను ఇక్కడి నుంచి ఆత్మకూరుకు వెళ్లిపోవాలని ఒత్తిడి తెచ్చారని, స్థానికేతర టీడీపీ నాయకులు తిష్ట వేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ఎన్ని కుట్రలు దాడులు చేసినా ధైర్యంగా ఎదుర్కొన్నామని చెప్పారు. కార్యకర్తలు తమ కుటుంబం వెన్నంటి నిలిచి, ఎంతో శాంతితో పనిచేసి గెలుపునకు కారణం కాబోతున్నారని చక్రపాణిరెడ్డి అన్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాం నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు రాజగోపాల్ రెడ్డి తెలిపారు. టీడీపీ నేతలు డబ్బులు పంచుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు. -
నూరు శాతం మాదే విజయం
-
చివరి మూడు గంటల్లో టీడీపీ రౌడీ రాజకీయం
సాక్షి, నంద్యాల: పోలింగ్ సమయం తుది దశకు చేరుకోవండంతో తెలుగుదేశం నేతలు రెచ్చిపోయారు. చివరి మూడు గంటల్లో రౌడీ రాజకీయానికి దిగారు. పోలింగ్ శాతం భారీగా పెరగడంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. దీంతో మధ్యాహ్నం మూడు గంటలకు తెలుగుదేశం అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఫరూఖ్‌లు పోలింగ్ స్టేషన్లలో తిరగడం ప్రారంభించారు. చివరి మూడు గంటల్లో ఓట్లకోసం రౌడీ రాజకీయానికి పథకం వేశారు. పరిమితికి మించి అనుచరులను వెంటేసుకొని తిరుగుతున్నా కనీసం పోలీసులు పట్టించుకోనుకుడా పట్టించుకోలేదు. అనంతరం తెలుగుదేశం నేతలు, అనుచరులు వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుఉడు రాజగోపాల్‌పై దాడులకు పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా, గిద్దలూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే మనుషులు రాజగోపాల్ రెడ్డిపై దాడిచేశారు. మరోవైపు ఏడోవార్డులో డబ్బుల పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మైనారిటీలు అధికంగా నివసించే వార్డుల్లో తెలుగుదేశం కార్యకర్తలు వీరంగం సృష్టించారు. నంద్యాలలోని ఫరూఖ్‌నగర్‌లో వైఎస్సార్సీపీ మైనారిటీ నేతలు రహీం, ఏడోవార్డు కౌన్సిలర్ అబ్దుల్ కలాంలపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి దాడికి పాల్పడ్డారు. ఇష్టారీతిగా కొడుతూ ‘‘మేం మిమ్మల్ని కొట్టిన విషయం ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో, ఏం చేసుకుంటారో చేసుకోండి’’ అని ఏవీ సుబ్బారెడ్డి దూషించారు. కాగా ఈ వ్యవహారంలో టీడీపీకి వత్తాసుగా ప్రేక్షపాత్ర వహించిన పోలీసుల తీరును శిల్పా ప్రశ్నించారు. దొంగ ఓట్లు వేయడానికి ఇతర నియోజక వర్గాలనుంచి పెద్దఎత్తున మనుషులను పిలిపించారు. నందమూరి నగర్లో దొంగ ఓట్లకు ప్రయత్నిస్తున్న 45 మందిని వైఎస్సార్సీపీ నేతలు పోలీసులుకు అప్పగించారు. మరో 30 మంది పరారయ్యారు. వైఎస్సార్సీపీకి పట్టున్న వైఎస్సార్ నగర్లో అంగన్ వాడీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేయడానికి స్లిప్పులు ఇచ్చిమరీ పంపిచారు. అయితే వైఎస్సార్సీపీ ముస్లిం మైనార్టీ శ్రేణులు వారిని అడ్డుకున్నాయి. -
నంద్యాలలో రికార్డు బద్దలు: ఈసీ
-
మైనారిటీ నేతలపై టీడీపీ దాడి
- ఫరూఖ్‌నగర్‌లో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు - రహీం, కలాంలపై సుబ్బారెడ్డి వీరంగం - పోలీసుల ప్రేక్షకపాత్ర.. ప్రశ్నించిన శిల్పా నంద్యాల: మైనారిటీలు అధికంగా నివసించే వార్డుల్లో తెలుగుదేశం కార్యకర్తలు వీరంగం సృష్టించారు. నంద్యాలలోని ఫరూఖ్‌నగర్‌లో వైఎస్సార్సీపీ మైనారిటీ నేతలు రహీం, ఏడోవార్డు కౌన్సిలర్ అబ్దుల్ కలాంలపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి దాడికి పాల్పడ్డారు. మైనారిటీలంతా మూకుమ్మడిగా వైఎస్సార్సీపీకి ఓటేశారనే దుగ్ధతోనే టీడీపీ తమపై దాడులు చేస్తోందని బాధితుడు రహీం ఆరోపించారు. ఇష్టారీతిగా కొడుతూ ‘‘మేం మిమ్మల్ని కొట్టిన విషయం ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో, ఏం చేసుకుంటారో చేసుకోండి’’ అని ఏవీ సుబ్బారెడ్డి దూషించినట్లు మైనారిటీ నేత రహీం మీడియాకు చెప్పారు. కాగా, ఫారూఖ్‌నగర్‌లో ఘర్షణ గురించి తెలుసుకున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి.. అక్కడికి వెళ్లి రహీంతో మాట్లాడారు. ఈ వ్యవహారంలో టీడీపీకి వత్తాసుగా ప్రేక్షపాత్ర వహించిన పోలీసుల తీరును శిల్పా ప్రశ్నించారు. -
మైనారిటీ నేతలపై టీడీపీ దాడి
-
'చంద్రబాబు గుండెల్లో రైళ్లు'
హైదరాబాద్: నంద్యాల ప్రజలు ధర్మం, న్యాయం వైపు నిలబడతారని.. ధర్మాన్ని గెలిపిస్తారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. అధికార టీడీపీ నాయకులు ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఓటర్లు ప్రశాంతంగా ఓటేశారని కితాబిచ్చారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజాస్వామ్యాన్ని సీఎం చంద్రబాబు అపహాస్యం చేశారని ధ్వజమెత్తారు. ఉప ఎన్నికను అత్యంత ఖరీదైన వ్యవహారంగా మార్చేశారని మండిపడ్డారు. ప్రజల అభిప్రాయం ప్రపంచానికి తెలుస్తున్న భయంతోనే నంద్యాల ఉప ఎన్నికకు ఆయన ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఓడిపోతామన్న భయంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇంత డబ్బు విచ్చలవిడిగా పంచడం, ఇన్ని ప్రలోభాలకు గురి చేయడం ఎప్పుడూ చూడలేదని వాపోయారు. వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్థాయికి చంద్రబాబు ఎదిగారో, దిగజారారో ప్రజలే చెప్పాలన్నారు. అమరావతిలో మనిషి కూర్చున్నారు కానీ మనసంతా నంద్యాలలో ఉందని పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్ గది నుంచి ఆదేశాలిస్తున్నారని.. ఎక్కడ డబ్బులు పంచాలో, ఎవరి ప్రలోభ పెట్టాలో స్వయంగా సీఎం చెప్పడం దారుణమని వ్యాఖ్యానించారు. చివరి నిమిషంలో దొంగ ఓట్లు వేయించే ప్రయత్నం చేయగా, ఎన్నికల పరిశీలకులు పట్టుకున్నారని తెలిపారు. క్యూలో ఉన్నవారికీ డబ్బులు పంచుతున్నారని, పోలీసులు చంద్రబాబు చెప్పుచేతుల్లో ఉండే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ నాయకులపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. అరాచకం సృష్టించి గెలవాలని ప్రయత్నిస్తున్నారని, ఓటమి భయంతో దాడులకు దిగుతున్నారని విమర్శించారు. దుర్మార్గమైన రాజకీయానికి విత్తు నాటిన వ్యక్తి చంద్రబాబు అని, డబ్బులుంటే చాలు గెలవొచ్చన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు నీతి వాక్యాలు బ్రహ్మాండంగా చెబుతున్నారు కానీ ఎన్నికలు వచ్చినప్పుడు దుర్మార్గమైన పద్ధతులు అవలంభిస్తున్నారన్నారు. చంద్రబాబు విధానాలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలన్నారని కోరారు. -
'చంద్రబాబు గుండెల్లో రైళ్లు'
-
టీడీపీ డబ్బుల పంపకం: ఉద్రిక్తత
- గాంధీనగర్‌లో తీవ్ర ఉద్రిక్తత - కెమెరాలకు దొరికిపోయిన ఒంగోలు తెలుగు తమ్ముళ్లు - అక్రమాన్ని అడ్డుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి నంద్యాల: పట్ణంలోని ఏడో వార్డు గాంధీనగర్ పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓటర్లకు డబ్బులిచ్చి పురమాయిస్తోన్న టీడీపీ నాయకులను వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రెంచ్చిపోయిన టీడీపీ గుండాలు.. వైఎస్సార్సీపీ శ్రేణులపై విచక్షణారహితంగా దాడి చేశారు. టీడీపీ అక్రమాలను అడ్డుకోకుండా పోలీసులు చోద్యం చూస్తున్న దృశ్యాలు కూడా ఈ వీడియోలో రికార్డయ్యాయి. వాళ్లు అన్నా రాంబాబు మనుషులే: బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో గాంధీనగర్ పోలింగ్ స్టేషన్ సమీపంలో కొందరు టీడీపీ నాయకులు డబ్బులు పంచుతూ కనిపించారు. వీరిని ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అనుచరులుగా గుర్తించారు. డబ్బు పంపకాన్ని అడ్డుకోవడంతో రెంచ్చిపోయిన రాంబాబు అనుచరులు.. వైఎస్సార్సీపీ ఈసీఈ సభ్యుడు రాజగోపాల్ రెడ్డి, మరికొందరిపై దాడి చేసి గాయపర్చారు. ఈసీకి ఫిర్యాదు చేస్తాం: ఒంగోలు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడి అనుచరులు నంద్యాలలో ఉండటమేకాక, డబ్బులు పంచుతూ దొరికారని, వాళ్లను అడ్డుకున్న తమపై దాడి చేశారని వైఎస్సార్సీపీ నాయకులు చెప్పారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, వీడియోలను కూడా అందిస్తామని పేర్కొన్నారు. -
టీడీపీ డబ్బుల పంపకం: ఉద్రిక్తత
-
టీడీపీ ఎమ్మెల్యే, డీఎస్పీ రహస్య మంతనాలు
నంద్యాల: ఉప ఎన్నికలో భారీగా పోలింగ్ జరుగుతుండటంతో తెలుగుదేశం నేతలు, శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. వారికి పోలీసు అధికారులు సైతం వత్తాసు పలుకుతున్నారు. తెలుగుదేశం నేతలు పిలిచిన వెంటనే వారివద్ద వాలిపోయి, రహస్య సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఎన్నికలను పరిశీలించాల్సిన పోలీసులు తెరవెనుక రాజకీయాలు చేస్తున్నారు. పోలింగ్ సమయం ముగుస్తుండటంతో తెలుగుదేశం నేతలు పోలీసులతో రహస్య మంతనాలు జరుపుతున్నారు. ఉపఎన్నికలో భాగంగా గోస్పాడు మండలం ఆంజనేయ స్వామి గుడి వద్ద బనగానిపల్లె ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి, డీఎస్పీలు ఇలా చెట్టు చాటుకు వెళ్లి రహస్య మంతనాలు జరుపుతున్నారు. -
టీడీపీ ఎమ్మెల్యే, డీఎస్పీ రహస్య మంతనాలు
-
నంద్యాల: అడ్డంగా దొరికిన టీడీపీ దొంగ ఓటర్లు
-
నంద్యాల: అడ్డంగా దొరికిన టీడీపీ దొంగ ఓటర్లు
నంద్యాల: ఉప ఎన్నిక పోలింగ్ ముగియయడానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ అధికార తెలుగుదేశం పార్టీ అక్రమాలు తారాస్థాయికి చేరాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో దొంగ ఓటర్లను రంగంలోకి దింపింది. అయితే, ఆ దొంగ ఓటర్లను ఎన్నికల పరిశీలకులు పట్టుకోవడం సంచలనంగా మారింది. నంద్యాలలోని నందమూరి నగర్ పోలింగ్ కేంద్రం వద్ద 10 మంది టీడీపీ దొంగ ఓటర్లను ఎన్నికల పరిశీలకులు పట్టుకున్నారు. ఈ దృశ్యాలను చూసి మరో 20 మంది దొంగ ఓటర్లు అక్కడి నుంచి పారిపోయారు. ఇలా బయటపడింది:పోలింగ్ కేంద్రానికి సమీపంలో టాటా ఏస్ వాహనంలో కూర్చొన్న కొందరు మహిళలు.. ఓట్ల గురించి మాట్లాడుకుంటుండగా స్థానికులు గుర్తించారు. ‘అమ్మా, మీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు?’ అని స్థానికులు ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. అనుమానంతో స్థానికులు ఎన్నికల పర్యవేక్షకులకు సమాచారం అంచారు. భూమా చెబితనే వచ్చాం: అధికారులు వచ్చి, ఆ మహిళల దగ్గరున్న ఆధార్, రేషన్, ఇతర కార్డులను పరిశీలించగా.. వారు నంద్యాల వాసులు కాదని తేలిసింది. భూమా కుటుంబ సభ్యులు చెబితేనే ఓట్లు వేయడానికి వచ్చామని వారు అధికారులతో చెప్పారు. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసుకున్న అధికారలు.. దొంగ ఓటర్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
ఎప్పటి కప్పుడు పరిస్ధితిని సమీక్షిస్తున్నాం
-
నంద్యాల పోలింగ్ చిత్రాలు
-
నంద్యాల ఓటర్లకు వైఎస్ఆర్ సీపీ విజ్ఞప్తి
సాక్షి, నంద్యాల : నంద్యాల ఉప ఎన్నికలో అక్రమాలు జరిగినా, ఓటర్లను ప్రలోభపెట్టినా తమ దృష్టికి తీసుకురావాలని ఓటర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. అక్రమాలు, ప్రలోభాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వెళతామని తెలిపారు. 79812 30095, 79814 29455 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని వైఎస్ఆర్ సీపీ నేతలు సూచించారు. కాగా నంద్యాల వైఎస్ఆర్ నగర్లో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలింగ్ బూత్‌కు రెండొందల మీటర్లలోపే టీడీపీ నేతలు, ఓటర్లకు డబ్బులు పంచుతుండగా, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పలుచోట్ల పోలింగ్ కు ఆటంకం కాగా పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడం, లైటింగ్ సమస్యలు తలెత్తడంతో...పోలింగ్‌కు ఆటంకం కలుగుతోంది. బూత్ నంబర్ 152లో సరిగా వెలుతురు లేకపోవడంతో .....ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. అటు ఎన్టీఆర్ నగర్‌లోని బూత్ నెంబర్ 19Aలో ఈవీఎం మొరాయించింది. పోలింగ్ బూత్ నెంబర్ 72లో ఈవీఎం తెరుచుకోకపోవడంతో .....గందరగోళం తలెత్తింది. ఎస్పీజీ హైస్కూల్లోని బూత్ నంబర్ 96లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో...పోలింగ్ ప్రారంభం కాలేదు. అటు గోస్పాడు మండల పరిధిలో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఈవీఎంలు మొరాయించడంతో యాళ్లూరు, ఎం కృష్ణాపురంలో పోలింగ్ ప్రారంభం కాలేదు. -
నంద్యాల ఉప ఎన్నిక ప్రశాంతంగా జరగాలి..
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నిక ప్రశాంతంగా జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. భార్య, కుమారుడు, కోడలు, కుమార్తె సహా శిల్పా పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. నంద్యాల సంజీవ్‌నగర్ బూత్ నెంబర్ 81లో ఓటు వేశారు. అనంతరం శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్‌ను ఎన్నికల కమిషన్ పూర్తి చేస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గత రాత్రి కూడా తమ ఇంటిపై దాడులు చేశారని ఆయన తెలిపారు. పౌరులంతా స్వేచ్ఛగా ఓటింగ్‌లో పాల్గొనాలని శిల్పా మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వ దౌర్జన్యాలకు ఓటు రూపంలో జవాబు చెప్పాలన్నారు. జగనన్న సీఎం కావాలనేది అందరి కోరిక.. శిల్పా మోహన్ రెడ్డి తనయుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ అధికార పక్ష వైఖరిని ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రశాంత వాతారవణాన్ని చెడగొట్టాలని అధికార పక్షం ప్రయత్నిస్తోంది. శాంతియుతంగా ఎన్నికలు జరగాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా. జగనన్న సీఎం కావాలనేది అందరి కోరిక. ఆ కోరికకు తొలి మెట్టు నంద్యాల ఉప ఎన్నిక.’ అని అన్నారు. శిల్పా నాగినిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలంతా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. ఓటర్లు వేసే ఓటు వారికి తప్ప ఎవరికీ తెలియదని పేర్కొన్నారు. కాగా నంద్యాల ఉప ఎన్నికలో మహిళాలోకం కదలి వస్తోంది. అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు మహిళా ఓటర్లు...... పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. దాదాపు చాలా పోలింగ్ బూత్స్ వద్ద ....మహిళా ఓటర్లే ఎక్కువుగా కన్పించడం ఇందుకు నిదర్శనం. 85 ఏళ్లు దాటిన మహిళలు, గర్భిణి మహిళలు సైతం ఓటు వేసేందుకు రావడం విశేషం. -
నంద్యాలలో పోలీసుల ఓవర్ యాక్షన్!
-
ఉప పోరుకు సర్వం సిద్ధం
- నేటి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ - 6 గంటల్లోపు వరుసలో నిల్చున్న వారందరికీ ఓటు వేసేందుకు అనుమతి - 82 ప్రత్యేక స్క్వాడ్లు.. అభ్యర్థుల వెంట షాడో పార్టీల నియామకం - 15 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న 2,18,858 మంది ఓటర్లు కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. నేడు(బుధవారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నికను అధికార, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. పోలింగ్‌ను పకడ్బందీగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కర్నూలు జిల్లా ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. గతంలో ఏ ఉప ఎన్నికకూ లేనివిధంగా నంద్యాల ఉప ఎన్నికకు పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి హిమాన్స్ జ్యోతి చౌదరిని సాధారణ పరిశీలకుడిగా నియమించింది. అలాగే వ్యయ పరిశీలకుడిగా మూకాంబికేయన్ను, పోలీసు పరిశీలకుడిగా డేవిడ్సన్ను నియమించింది. పోలింగ్ కేంద్రంలో జరిగే ప్రతి అంశాన్ని గమనించేందుకు ఒక్కో కేంద్రానికి ఒక సూక్ష్మ పరిశీలకుడిని నియమించారు. వీరు సాధారణ పరిశీలకుడి ఆధ్వర్యంలో పనిచేస్తారు. 82 ప్రత్యేక స్క్వాడ్లు కర్నూలు జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ఉప ఎన్నిక ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఎన్నికల కమిషన్‌తోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ పోలింగ్ ప్రక్రియను లైవ్ వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించనున్నారు. ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6 గంటల్లోపు పోలింగ్ కేంద్రాల వద్ద వరుసలో నిల్చున్న వారందరినీ ఓటు వేసేందుకు అనుమతిస్తారు. నియోజకవర్గాన్ని 20 రూట్లుగా విభజించి.. రూట్ అధికారులను నియమించారు. 20 మంది జిల్లా అధికారులు సెక్టోరల్ అధికారులుగా ఉన్నారు. 82 ప్రత్యేక స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులను అనుసరించేందుకు ప్రత్యేకంగా షాడో పార్టీలను ఏర్పాటు చేశారు. మొబైల్ స్క్వాడ్లు, స్ట్రైకింగ్ ఫోర్స్‌లను రంగంలోకి దించారు. 141 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర కేంద్ర బలగాలను మోహరించారు. ఎలాంటి సమస్య తలెత్తినా 92231 66166 నంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇవ్వొచ్చు. వెంటనే సంబంధిత రూట్ అధికారులను అప్రమత్తం చేస్తారు. 247 పోలింగ్ కేంద్రాలకు లైవ్ వెబ్‌కాస్టింగ్ నంద్యాల ఉప ఎన్నిక నిర్వహణకు 255 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు లైవ్ వెబ్‌కాస్టింగ్ సదుపాయం కల్పించాల్సి ఉండగా.. ఎనిమిది కేంద్రాలకు ఈ అవకాశం లేదని అధికారులు తేల్చారు. భీమవరంలో 2, బిల్లలాపురంలో 2, పార్వతీపురంలో 2, ఎస్.నాగులవరంలో 1, బీవీ నగర్లో 1 పోలింగ్ కేంద్రాలకు ఏ నెట్వర్క్ అందని కారణంగా వెబ్‌కాస్టింగ్‌కు అవకాశం లేకుండా పోయింది. దీంతో 247 పోలింగ్ కేంద్రాలకు లైవ్ వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అవకాశం లేని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. 247 పోలింగ్ కేంద్రాల్లో 195 కేంద్రాలకు బీఎస్ఎన్ఎల్, 52 కేంద్రాలకు జియో నెట్‌వర్క్‌తో వెబ్‌కాస్టింగ్ సదుపాయం కల్పించనున్నారు. -
‘కోడ్’ దాటిన అసత్య ప్రచారం
పోలింగ్ ముంగిట కోడ్ ఉల్లంఘించిన ముఖ్యమంత్రి చంద్రబాబు - నిబంధనలకు విరుద్ధంగా విలేకరుల సమావేశం - అనుకూల చానళ్లన్నిటిలో ‘లైవ్’ ప్రసారం.. - ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం - నెల రోజుల కిందట తనే సొంత సర్వే చేయించుకొని తనే మార్కులు వేసుకున్న సీఎం - సర్వే ఫలితాలంటూ పోలింగ్ ముందు రోజు ఆ వివరాలు వెల్లడి - అందులో అంతా అవాస్తవాలే.. - సీఎం తీరుతో విస్తుపోతున్న జనం - సుమోటోగా విచారణ జరపాలని ఈసీకి వైఎస్సార్ సీపీ డిమాండ్ సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: నంద్యాల ఎన్నికల ప్రచారం 21వ తేదీ సాయంత్రం ముగిసిపోయింది.. 23న పోలింగ్ జరగనుంది. అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ప్రచారాన్ని ఇంకా ఆపలేదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమలులో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దానిని పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాల్సి ఉన్నా స్వయంగా తానే దానిని ఉల్లంఘించడం చూసి రాష్ట్రప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. సోమవారం సాయంత్రంతో ప్రచారానికి గడువు ముగిసిపోయినా మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి విలేకరుల సమావేశాన్ని నిర్వహించి.. దానిని నంద్యాల ఎన్నికల ప్రచారంలా ఉపయోగించుకుని ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. ఇది కచ్చితంగా కోడ్ ఉల్లంఘనేనని, ఈ ఘటనను సుమోటోగా తీసుకుని ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడో నెల రోజుల క్రితం మొదలుపెట్టిన ఓ సర్వేలో తేలిన అంశాలంటూ కొన్ని వివరాలను ఏకరువు పెడుతూ నంద్యాల ఓటర్లను ప్రభావితం చేసేలా ముఖ్యమంత్రి అనేక వ్యాఖ్యలు చేయడంపై విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తీరా ఇదేదో రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన సర్వేనా అనుకుంటే అదీకాదు. ముఖ్యమంత్రి జరిపించుకుంటున్న సర్వేఅట. ఓ ప్రొఫెషనల్ ఏజెన్సీతో అధికారుల ప్రమేయం లేకుండా జరిపించిన సర్వే అని ఆయనే చెప్పుకున్నారు. అంటే తానే సర్వే జరిపించుకుని అందులో తేలిన అంశాలంటూ ముఖ్యమంత్రి తనకు ‘నచ్చిన సమయం’లో ‘తోచిన కథలు’ వినిపించారన్నమాట. నిబంధనలకు విరుద్ధంగా విలేకరుల సమావేశం నిర్వహించడమే కాక అందులోనూ అనేక అవాస్తవాలను గుదిగుచ్చి వివరించడం, నంద్యాల ఓటర్లను ప్రభావితం చేసేలా మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం హైహై... చానళ్లు సైసై.. ఒకవైపు నంద్యాలలో 23వ తేదీ అంటే బుధవారం ఉదయం పోలింగ్ జరగనుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు 22 సాయంత్రం 6 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించడం, తగుదునమ్మా అంటూ అనుకూల చానళ్లన్నీ దానిని ఆసాంతం లైవ్‌లో ప్రసారం చేయడం చూసి ప్రజాస్వామిక వాదులంతా నిర్ఘాంతపోయారు. ఇదెక్కడి విడ్డూరమంటూ రాష్ట్రమంతా చర్చించుకుంటున్నారు. పాలన, మద్యం విధానం, ఇసుక విధానం, విశాఖ భూముల వ్యవహారం, రైతుబజార్లు, టౌన్‌ప్లానింగ్ తదితర అనేక అంశాలపై ఎప్పుడో నెల రోజుల క్రితం తాను జరిపించుకున్నానని చెబుతున్న ఓ సర్వేను ముఖ్యమంత్రి ఇపుడు తన ప్రచారానికి ఉపయోగించుకున్నారు. తన ప్రభుత్వాన్ని పొగుడుకోవడానికి తన పాలనను కీర్తించుకోవడానికి ఆ సర్వేను ముఖ్యమంత్రి వాడుకున్నారు. తాము అనుసరిస్తున్న విధానాల పట్ల రాష్ట్ర ప్రజలలో సంతప్తి వ్యక్తమౌతోందని చెప్పుకునేందుకు ఈ విలేకరుల సమావేశాన్ని ఉపయోగించుకున్నారు. నెల రోజుల క్రితం ప్రారంభించిన ఈ సర్వే ముగియలేదని, ఇంకా మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని ముఖ్యమంత్రే చెప్పారు. అయినా ఇపుడు ఆ సర్వే వివరాలను ఎందుకు వెల్లడించాల్సి వచ్చింది? ఎందుకు నంద్యాల ఎన్నికల పోలింగ్ ముందు రోజు ఆ సర్వే వివరాలను వెల్లడించడానికి ఎంచుకున్నారు? అందులో పెద్దగా అర్ధం కాకపోవడానికి ఏమీ లేదు. ఆ మిషతో నంద్యాల ఓటర్లను ఎంతోకొంత ప్రభావితం చేయవచ్చన్న కుట్ర ఇందులో దాగి ఉందని విమర్శకులంటున్నారు. ప్రభుత్వం బాగా పనిచేస్తోందన్న భావన ప్రజలలో కలిగించడానికే ఈ విలేకరుల సమావేశం ఉద్దేశించినట్లు స్పష్టంగా అర్ధమవుతూనే ఉందని వారు పేర్కొంటున్నారు. కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి విలేకరుల సమావేశాన్ని చానళ్లు కూడా ప్రసారం చేయకూడదన్న ఆంక్షలున్నాయి. కానీ ముఖ్యమంత్రి అనుకూల చానళ్లు ఆ సంగతిని పట్టించుకున్నట్లు లేదు. ఓటర్లను ప్రభావితం చేసే కుయుక్తులు.. తాము ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలతో చర్చించి ప్రజల ఆమోదం తీసుకున్న తర్వాతనే అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. నంద్యాలలో రోడ్ల విస్తరణ పనుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. బాధితులతో అస్సలు మాట్లాడలేదని, మాట్లాడి ఉంటే గజం రూ.1.10లక్షలున్న చోట గజం రూ.18వేల పరిహారానికి ఒప్పుకునేవారం కామని నంద్యాల ప్రజలందరికీ తెలుసు. విశాఖలో 47,315మందికి కొత్తగా ఇళ్లజాగాలిచ్చామని ముఖ్యమంత్రి చెప్పుకున్నారు. అది నిజమో కాదో.. అర్హులెందరో.. ఆ పేరుతో పచ్చచొక్కాలు కాజేసినవెన్నో తర్వాత సంగతి.. ముందు నంద్యాల ఓటర్లను ప్రభావితం చేయాలన్న దుగ్ధ ఇందులో కనిపిస్తోందని విమర్శకులంటున్నారు. అన్ని అవాస్తవాలా..? పరిపాలన బ్రహ్మాండంగా సాగుతోందని, అధికారులలో అత్యధికులు సంతప్తిగా ఉన్నారని ముఖ్యమంత్రి చెప్పుకున్నారు. మూడున్నరేళ్లలో అవినీతి ఆకాశమెత్తుకు పెరిగిపోయిందని, 3.75 లక్షల కోట్ల రూపాయలమేర అవినీతి జరిగిందని సాక్ష్యాలతో సహా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా తన ప్రభుత్వం బాగా పనిచేస్తోందని, బాగా పాలన సాగిస్తున్నామని ప్రచారం చేసుకునేందుకు ముఖ్యమంత్రి ఈ సొంత సర్వేను ఉపయోగించుకున్నారు. ఇసుక విధానం గురించి చెబుతూ సమస్య అంతా ప్రజల వల్లే వస్తోందని చెప్పే ప్రయత్నం చేశారు. కూలీలు రేట్లు పెంచేస్తున్నారని, రవాణాకు ఉపయోగించే లారీలు, ట్రాక్టర్ల రేట్లు పెంచేస్తున్నారని వాపోయారు. అంతేకానీ రీచ్‌లన్నీ తెలుగుదేశం నాయకులు ఆక్రమించేసుకుని దందా సాగిస్తున్నారన్న విషయాన్ని ఆయన దాచేశారు. కూలీల రేట్లు, రవాణా చార్జీల పెంపు వల్ల రీచ్‌లలో దందాలు సాగిస్తున్న తమ్ముళ్లు బాధపడుతున్నారనేగానీ ప్రజలకు ఈ ఉచిత ఇసుక విధానం వల్ల నష్టం జరుగుతోందన్న బాధ ఆయనకు ఏ కోశానా కనిపించలేదు. బెల్టుషాపులను అరికట్టామని, పరిమితంగా వ్యాపారం చేసుకునేందుకు మాత్రమే అనుమతిస్తున్నాం తప్ప విచ్చలవిడిగా లేవని ముఖ్యమంత్రి చెప్పారు. కానీ ఎక్సైజ్ అధికారులకు నెలవారీ టార్గెట్లు ఇస్తున్న విషయాన్ని గానీ, తమ్ముళ్లు నడుపుతున్న మద్యం షాపుల జోలికి, బెల్టుషాపుల జోలికి వెళ్లనీయకుండా అధికారులను అడ్డుకుంటున్న విషయాన్ని గానీ ఆయన బైటపెట్టలేదు. ఇవాళ మంచినీళ్లు దొరకని ఊళ్లు ఉన్నాయి గానీ మద్యం దొరకని, బెల్టుషాపులు లేని ఊళ్లు లేవంటే అతిశయోక్తి కాదని అందరూ అంగీకరిస్తారు. కానీ ప్రజల కళ్లకు గంతలు కట్టేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నించారు. అరకొరగా అదీ తెలుగుతమ్ముళ్లకు మాత్రమే అమలవుతున్న కొన్ని పథకాల గురించి ఘనంగా వివరించే ప్రయత్నం చేయడం చూసి జనం విస్తుపోతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా కరెంటు సమస్యలేదని, తాగునీటి సమస్యలేదని, రోడ్లపై ఎక్కడా గుంతలు లేవని, వీధిలైట్లన్నీ వెలుగుతున్నాయని, ఇదంతా తాము సాధించిన ఘనత అని ముఖ్యమంత్రి చేస్తున్న ప్రచారం చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. -
పోలింగ్ నేడే
►నంద్యాల ఉపపోరుకు సర్వం సిద్ధం ► భారీగా పోలీసు బలగాల మోహరింపు ► స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటెయ్యాలని అధికారుల సూచన ► ఓటెవరికి వేశారో ఇతరులెవరికీ తెలియదు ► ఓటరు మాత్రమే చూసుకునే అవకాశం నంద్యాల/కర్నూలు(అగ్రికల్చర్): ఇన్నాళ్లూ ప్రచారాలతో హోరెత్తిన నంద్యాల.. నేడు ఓటింగ్‌తో పోటెత్తనుంది. ఉప ఎన్నికలో కీలక ఘట్టమైనపోలింగ్కు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఈ ఉప ఎన్నికను అధికార టీడీపీ, ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో రాష్ట్రం యావత్తు నంద్యాల వైపు ఆసక్తిగా చూస్తోంది. నేటి (బుధవారం) ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. సాయంత్రం ఆరులోపు క్యూలో ఉన్న వారందరినీ ఓటు వేసేందుకు అనుమతిస్తారు. పోలింగ్ నేపథ్యంలో భారీ ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు. ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. మొదటిసారిగా వినియోగిస్తున్న వీవీప్యాట్ యంత్రాలపై అపోహలు వద్దని, ఓటెవరికి వేశారో ఇతరులెవరూ తెలుసుకునే అవకాశమే లేదని స్పష్టం చేస్తున్నారు. ఓటరు మాత్రమే ఏడు సెకన్ల పాటు చూసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. 2,18,858 మంది ఓటర్లు నంద్యాల నియోజకవర్గంలో మొత్తం 2,18,858 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,07,778, మహిళా ఓటర్లు 1,11,018, ఇతరులు 62 మంది ఉన్నారు. ఈ ఓటర్లలో 40శాతం మంది యువ ఓటర్లే కావడం గమనార్హం. 18 నుంచి 35 ఏళ్లలోపు ఓటర్లు 85వేల మంది ఉన్నారు. వీరి ఓట్లే ఈ ఉప ఎన్నికలో కీలకం కానున్నాయి. ఓటర్ల స్లిప్‌లు అందని వారు తగిన గుర్తింపు కార్డు చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో నీటి వసతి కల్పిస్తున్నారు. దివ్యాంగులు ఓటు వేసేందుకు వీలుగా ర్యాంప్‌లను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో మొత్తం 255 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 141 అత్యంత సమస్యాత్మకమైనవిగా, 74 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. పోలింగ్ సరళిని లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల అధికారులు పరిశీలించనున్నారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే ఫిర్యాదు చేయాలని, 25 మందితో కూడిన సాంకేతిక బృందాన్ని రప్పించామని, వీరంతా ఆర్డీఓ, మున్సిపల్, గోస్పాడు, నంద్యాల తహసీల్దార్ కార్యాలయాల్లో ఉంటారని అధికారులు తెలిపారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ గోపీనాథ్ జట్టి తెలిపారు. నంద్యాలలో ఉండే సిబ్బందితో పాటు ఎస్పీలు, డీఎస్పీలు, ఎస్ఐలు, సీఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లతో పాటు ఇతర జిల్లాల పోలీస్ సిబ్బంది, పారామిలటరీ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద బాడీ ఓన్, సీసీ, డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు. ప్రధాన పోటీ వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యనే.. నంద్యాల ఉప ఎన్నిక బరిలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు. అయితే.. వైఎస్ఆర్సీపీ, టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకోవడంతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు నోటిఫికేషన్‌కు ముందు నుంచే నంద్యాలలో మకాం పెట్టారు. ఎన్నికల ప్రచారం ఈ నెల 21వ తేదీ సాయంత్రం 6గంటలతో ముగిసింది, ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఇతర జిల్లాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు జిల్లా వదలి వెళ్లాల్సి ఉంది. కానీ నంద్యాల నియోజకవర్గానికి చేరువలోనే మకాం వేసి ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలను వేగవంతం చేసినట్లు సమాచారం. ముఖ్యమైన అధికారుల ఫోన్ నంబర్లు ఎన్నికల సాధారణ పరిశీలకుడు హిమాన్స్ జ్యోతి చౌదరి సెల్ నంబరు 9704009097, వ్యయ పరిశీలకుడు ముకాంబికేయన్ 70329 49977, పోలీసు పరిశీలకుడు డేవిడ్సన్ 99892 23650, రిటర్నింగ్ అధికారి సెల్ నంబరు 89788 40011. -
భద్రత కట్టుదిట్టం
కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్‌కు పోలీస్ భద్రత కట్టుదిట్టం చేశారు. కర్నూలుతో పాటు వైఎస్సార్ జిల్లా, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల నుంచి సిబ్బందిని రప్పించారు. దాదాపు 40 మందిడీఎస్పీలు, 150 మంది సీఐలు, 350 మంది ఏఆర్ సిబ్బంది, 20 ప్లటూన్ల ఏపీఎస్పీ, 8 ప్లటూన్ల కేంద్ర బలగాలతో పాటు 50 స్పెషల్‌పార్టీ బృందాలను బందోబస్తు విధులకు వినియోగిస్తున్నారు. పోలీసు శాఖ తరఫున ఎన్నికల అబ్జర్వర్‌గా డేవిడ్సన్ను నియమించారు. రాయలసీమ ఐజీ షేక్ మహమ్మద్ ఇక్బాల్, డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, ఎస్పీ గోపినాథ్ జట్టి నంద్యాలలోనే ఉండి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. నంద్యాల టౌన్ ఇన్చార్జ్గా చిత్తూరు ఎస్పీ రాజశేఖర్‌బాబు, నంద్యాల రూరల్ ఇన్చార్జ్గా విశాఖపట్టణం ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, గోస్పాడ్ ఇన్చార్జ్గా ప్రకాశం ఎస్పీ సత్య ఏసుబాబుకు బాధ్యతలు అప్పగించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా కోసం వీడియో, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. -
ఆ ఏజెంట్ల విధులను నిరోధించవద్దు
నంద్యాల పోలీసులకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి పోలింగ్ ఏజెంట్లుగా ఉన్న వారిని వారి విధులు నిర్వర్తించకుండా నిరోధించరాదని హైకోర్టు మంగళవారం నంద్యాల పోలీసులను ఆదేశించింది. ఒకవేళ వారు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై చట్టప్రకారం మాత్రమే తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఉత్తర్వులు జారీ చేశారు. తమపై తప్పుడు కేసులు నమోదు చేయకుండా.. చట్ట విరుద్ధంగా అరెస్ట్‌లు చేయకుండా.. ఎటువంటి వేధింపులకు గురి చేయకుండా నంద్యాల పోలీసులను ఆదేశించాలని కోరుతూ పోలింగ్ ఏజెంట్లు ఎం.విజయశేఖర్‌రెడ్డి మరో 44 మంది సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ విచారణ జరిపారు. -
'పోలీసులను పంపాల్సిన అవసరం లేదు'
సాక్షి, నంద్యాల: టీడీపీ నాయకులు అధికార బలంతో నంద్యాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వైఎస్సార్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి తనయుడు రవిచంద్ర కిశోర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం రాత్రి పోలీసులు తమ నివాసంలో సోదాలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. పోలీసులను తమ ఇంటికి పంపాల్సిన అవసరం లేదని, తాము ఎటువంటి అక్రమాలకు పాల్పడటం లేదని చెప్పారు. తాము భయపడే రకం కాదని, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగబోమని స్పష్టం చేశారు. నంద్యాల ప్రజలు భయపడాల్సిన పనిలేదని భరోసాయిచ్చారు. అధికార పార్టీ ఒత్తిడితో పోలీసులు పనిచేస్తున్నట్టు కనబడుతోందన్నారు. ఈరోజు ఉదయం నుంచి తమ సేవా సంస్థలను పోలీసులు టార్గెట్ చేశారని, మూడు నాలుగుసార్లు వచ్చి మూసివేయాలని ఒత్తిడి తెచ్చారని తెలిపారు. పోలీసులు ఒత్తిడికి తాము లొంగలేదని, తాము ఉల్లంఘనకు పాల్పడితే చర్య తీసుకోమని చెప్పామన్నారు. నంద్యాల ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని, రేపటి ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెబుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. నంద్యాలలో యథేచ్ఛగా ఉల్లంఘనకు పాల్పడుతున్న టీడీపీ నాయకులను పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మంత్రులు ఆదినారాయణరెడ్డి, అమర్నాథ్రెడ్డి, సోమిరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు ఇక్కడున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ ఫరూఖ్.. డబ్బులు, చీరలు, ముక్కుపుడకలు పంచినా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని వాపోయారు. రాజకీయాల కోసం ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడేందుకు అధికార పక్షం వెనుకాడటం లేదని, టీడీపీ అరాచకాలపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రేపు పోలింగ్ ఉంది కాబట్టి ఏజెంట్లకు తమ ఇంటి దగ్గర సంబంధిత పత్రాలు అందజేస్తున్నామని, తామేమి జనసమీకరణ చేయడం లేదని వివరణయిచ్చారు. ఓడిపోతామనే భయంతో తమపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు కనబడుతోందన్నారు. నంద్యాలలో తప్ప దేశంలో ఎక్కడా ఈ పరిస్థితి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగబోమని రవిచంద్ర కిశోర్ రెడ్డి పునరుద్ఘాటించారు. -
శిల్పా ఇంటి వద్ద పోలీసుల ఉద్రిక్తత
-
నంద్యాల: శిల్పా ఇంటి వద్ద పోలీసుల హల్చల్
- ఏజెంట్ ఫారాలు ఇవ్వనీయకుండా కుట్రలు - పోలింగ్ ఏజెంట్లు, సిబ్బందిని బయటికి పంపిన అధికారులు - ఖాకీల తీరుపై మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం - టీడీపీ మంత్రులు తిరుగుతున్నా పట్టించుకోని అధికారులు నంద్యాల: మరికొద్ది గంటల్లో ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభంకానుండగా, నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఇంటివద్ద పోలీసులు హల్చల్ చేశారు. మంగళవారం రాత్రి నంద్యాలలోని శిల్పా ఇంటికి వచ్చిన పోలీసులు.. అక్కడున్న సిబ్బంది, పోలింగ్ ఏజెంట్లను బలవంతంగా బయటికి పంపేశారు. దీంతో ఆగ్రహించిన శిల్పా మోహన్‌రెడ్డి పోలీసుల తీరును తప్పుపట్టారు. ఏజెంట్లకు ఫారాలు పంచనీయకుండా అడ్డుపడటం సరికాదని హితవుపలికారు. కానీ పోలీసులు ఎంతకీ వినిపించుకోలేదు. రేపటి పోలింగ్ కోసం ఆయా పోలింగ్ స్టేషన్లలో కూర్చునే ఏజెంట్లుకు సంబంధిత పత్రాలు ఇస్తుండగా, పోలీసులు బిలబిలమంటూ దూసుకొచ్చి అక్కడున్నవారిని బయటికి తీసుకెళ్లారు. పత్రాలు తీసుకోకపోతే రేపు ఉదయం పోలింగ్ స్టేషన్లో కూర్చునే వీలుండదని, కొద్ది నిమిషాల్లోనే పత్రాలు తీసుకొని వెళ్లిపోతామని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన శిల్పా మోహన్‌రెడ్డి...‘మీరు అధికార పక్షానికి కొమ్ము కాయడం సరికాదు’అని పోలీసులతో అన్నారు. అటుపై మీడియాతో మాట్లాడారు. కుట్రలకు భయపడం: ‘‘ఎస్సైలు, సీఐలు, డీఎస్సీలు ఇంటికొచ్చి మా పోలింగ్ ఏజెంట్లు, వాచ్మెన్, డ్రైవర్లును పంపేశారు. సోదరుడు చక్రపాణిరెడ్డిని కూడా వెళ్లిపోమన్నారు. మా ఇంట్లో మమ్మల్ని ఉండొద్దనడమేంటి? మేం ఉండేదే నంద్యాలలో. ఇంకా ఎక్కడికి పోవాలి? ట్రాఫిక్ అంటున్నారు, మా ఇల్లు మెయిన్ రోడ్డుమీద లేదే, అయినా టీడీపీ మంత్రులు బసచేసిన సూరజ్ గ్రాండ్ హోటల్ వద్ద పదుల సంఖ్యలో వాహనాలు, వందల సంఖ్యలో జనం ఉన్నారు. ట్రాఫిక్ సమస్య అక్కడ లేదా? టీడీపీ నాయకుడు వర్ల రామయ్య నంద్యాల సినిమా హాలులో కనిపించాడు. మంత్రి ఆదినారాయణరెడ్డి నంబర్‌ప్లేట్ లేని వాహనంలో తిరుగుతున్నాడు. సోమిరెడ్డి తదితరులు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ల గురించి పట్టించుకోని పోలీసులు.. ఏకపక్షంగా మా ఇళ్లపైకి రావడమేంటి? కుట్రలతో మమ్మల్ని భయపెట్టాలనుకుంటే మేము భయపడే సమస్యేలేదు’’ అని శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. మా ‘డ్యూటీ’ మేం చేస్తున్నాం: ‘ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థిగా శిల్పా మోహన్‌రెడ్డికి ఏజెంట్లతో మాట్లాడే హక్కు ఉటుందికదా? మీకె ఎందుకు అడ్డుకుంటున్నారు?’అని ‘సాక్షి’ ప్రతినిధి పోలీసులను ప్రశ్నించగా.. ‘మా డ్యూటీ మేం చేస్తున్నాం’ అనే సమాధానం వచ్చింది. నంద్యాలలో 144 సెక్షన్ ఉందని, ఇంట్లో ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండొద్దని పోలీసులు చెప్పారు. అయితే శిల్పా ఇంటి నుంచి బయటికొచ్చిన వారిలో కొందరు మాత్రం ‘పోలీసులు టీడీపీ డ్యూటీ’ చేస్తున్నారంటూ మండిపడ్డారు. -
ఏబీఎన్ చానల్‌పై ఫిర్యాదు
భన్వర్‌లాల్‌ను కలిసి ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ నేతలు హైదరాబాద్: గడువు ముగిసినా మంత్రులు, టీడీపీ నాయకులు నంద్యాలలోనే ఉన్నారని వైఎస్సార్ సీపీ నాయకులు మంగళవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కె.శివకుమార్, చల్లా మధుసూదన్ రెడ్డి.. ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను కలిసి ఈ మేరకు విజ్ఞాపనపత్రం సమర్పించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ చానల్‌పైనా ఫిర్యాదు చేశారు. ఇవాళ, రేపు అధికార పార్టీ నేతలు నిర్వహించే విలేకరుల సమావేశాలపైనా కూడా దృష్టి సారించాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రచార గడువు ముగిసినా మంత్రులు, స్థానికేతర టీడీపీ నాయకులు ఇంకా నంద్యాలలో తిష్ట వేశారని ఆరోపించారు. స్థానికేతర నేతలను తక్షణమే అక్కడి నుంచి పంపించాలని ఎన్నికల అధికారిని కోరినట్టు తెలిపారు. ముక్కుపుడకలు, చీరలు, మద్యం కూడా విచ్చలవిడిగా పంచుతున్నారని వెల్లడించారు. ఈసీ ఆదేశాలను పట్టించుకోకుండా సర్వే వివరాలు ప్రసారం చేసిన ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ చానల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. నంద్యాలలో టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే కేబినెట్ అంతా అక్కడ మకాం వేసిందని ఆరోపించారు. అన్నివర్గాల ప్రజలు తమను ఆదరిస్తుండటంతో ఆంధ్రజ్యోతితో తప్పుడు వార్తలు రాయిస్తున్నారని పేర్కొన్నారు. ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వెంటనే చర్యలు తీసుకోవాలని భన్వర్‌లాల్‌కు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. ఎవరికి ఓటు వేశారో తమకు తెలుస్తుందని ఓటర్లను టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారని చెప్పారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని నంద్యాలలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని శ్రీకాంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు ప్రెస్మీట్లను కర్నూలు జిల్లాలో ప్రసారం కానివ్వబోమని భన్వర్‌లాల్ తమకు హామీయిచ్చారని తెలిపారు. -
ఏబీఎన్ చానల్‌పై వైఎస్సార్ సీపీ నేతలు ఫిర్యాదు
-
నంద్యాల: ఎమ్మెల్యే వాహనంలో మంత్రులు
-
నంద్యాల: ఎమ్మెల్యే వాహనంలో మంత్రులు
నంద్యాల: ఉప ఎన్నిక పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో అధికార పార్టీ ప్రలోభాలు తారాస్థాయికి చేరాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. బనగానపల్లె కేంద్రంగా మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నారు. మంత్రులు అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బనగానపల్లె టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో బసచేశారు. ఇతర జిల్లాల నేతలు కర్నూలు విడిచి వెళ్లాలని ఎన్నికల సంఘం ఆదేశించినా లెక్కచేయడం లేదు. మరికొంత టీడీపీ నాయకులు ఆళ్లగడ్డలో తిష్టవేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ కర్నూలు జిల్లాలో మంత్రులు యథేచ్ఛగా తిరుగుతున్నారు. బనగానపల్లె ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి వాహనం(ఏపీ 21 బీఎల్ 9999)లో తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు పలు లాడ్జిల్లో మకాం వేసి నంద్యాలలో మంత్రాంగం నడుపుతున్నారు. నంబర్ ప్లేట్ లేని ఫార్చ్యునర్ కారులో మంత్రి ఆదినారాయణరెడ్డి ఆళ్లగడ్డలో హల్చల్ చేయడం మీడియా కంటపడింది. ఎన్నికల కోడ్ ప్రకారం కర్నూలు జిల్లాను వదిలివెళ్లాల్సివున్నా మంత్రి పట్టించుకోకపోవడం గమనార్హం. అయ్యలూరి సమీపంలోని ఓ రెస్టారెంట్లో టీడీపీ నేతలు రహస్యంగా సమావేశమయ్యారు. వార్డుల వారీగా నేతలకు మద్యం, డబ్బులు పంపిణీ చేస్తుండటంతో రెస్టారెంట్ ఎదుట టీడీపీ నేతలు క్యూ కట్టారు. టీడీపీ నేతలున్న రెస్టారెంట్ వైపు పోలీసులు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
ముస్లిం మైనారిటీలను ప్రలోభాలకు గురిచేస్తూ..
-
బయటపడ్డ చంద్రబాబు అసత్య ప్రచారం
►మహిళను అత్యాచారం చేసి, హత్య చేశారని చంద్రబాబు ప్రచారం ►రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నీచమైన ఆరోపణలు నంద్యాల: నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అసత్య ప్రచారం బయటపడింది. ఓ మహిళను అత్యాచారం చేసి హతమార్చారంటూ ఆమె ఫొటో చూపిస్తూ ఆయన ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే వైఎస్ఆర్ సీపీ నేతలపై చంద్రబాబు చేసిన ఆరోపణలు అబద్దమని తేలిపోయాయి. చంద్రబాబు చూపిన ఫొటోలోని మహిళ మీడియా ముందుకొచ్చి... తాను బతికే ఉన్నానంటూ చెప్తోంది. రాజకీయ లబ్ధి కోసం అంత నీచమైన ఆరోపణలు చేస్తారా అంటూ బాధిత మహిళ కన్నీరు పెట్టుకుంది. బాధిత మహిళ షమీమ్ మాట్లాడుతు..‘ చనిపోయింది నేను కాదు, ఆ ఫోటోలో ఉన్న నా పక్కన ఉన్న పిల్ల. ఈ ఫోటోను పదే పదే సిటీ కేబుల్‌లో ప్రసారం చేస్తున్నారు. అయితే అందులో నన్నే ఎక్కువసార్లు చూపిస్తున్నారు.’ అంటూ తన భర్తతో కలిసి మీడియా ముందుకు వచ్చింది. మరోవైపు బాధితురాలి కుటుంబీకులు కూడా చంద్రబాబు అసత్య ప్రచారంపై మండిపడుతున్నారు. సీఎం స్థాయి వ్యక్తి...రాజకీయ లబ్ది కోసం ఇంతకు దిగజారుతా అని మండిపడుతున్నారు. ఎదురు తిరిగిన మహిళలు.. మరోవైపు ప్రచారం ముగిసినా, నంద్యాలలో టీడీపీ నేతలు ప్రలోభాల పర్వం విచ్చలవిడిగా కొనసాగుతోంది. పలు బస్తీల్లో మహిళా ఓటర్లను ప్రలోభపెడుతూ ముక్కుపుడకలు, చీరలు పంపిణీ చేశారు. అయితే రోల్డ్‌గోల్డ్ ముక్కుపుడకలు, డ్యామేజీ చీరలు ఇస్తారా?. ఓట్ల కోసం మోసం చేస్తారా అంటూ ఆగ్రహంతో మహిళలు ఎదురు తిరిగారు. దీంతో చేసేదేమీ లేక టీడీపీ నేతలు పలాయనం చిత్తగించారు. స్థానికేతర నేతల మకాం.. అలాగే నంద్యాల రూరల్, గోస్పాడు మండలాల్లో టీడీపీ నేతలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇతర ప్రాంతాలవారు నంద్యాలలో ఉండకూడదని ఎన్నికల సంఘం ఆదేశించినా, స్థానికేతర టీడీపీ నేతలు మాత్రం యథేచ్చగా వాహనాల్లో తిరుగుతున్నారు. ఓటర్లకు మద్యం, డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం స్థానికేతర టీడీపీ నేతలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ ...నంద్యాలో అదనపు కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేస్తోంది. -
2 వేలు..3 వేలు..5 వేలు
►ఓటమి భయంతో ఓటుకు వెల కట్టి పంచిన అధికార పార్టీ ►ఒక్కో చోట ఒక్కో రేటేంటని జనం నిలదీత ►కొన్ని చోట్ల మహిళలకు ముక్కు పుడకలు, చీరల పంపిణీ ►జగన్‌కు వెల్లువెత్తిన ప్రజాభిమానం చూసి బెంబేలు ►ఓటమి తప్పదని తెలిసి ఏకంగా ఈసీపైనే విమర్శలు ►జిల్లాలోనే ఉండి ఓటింగ్ సరళి పర్యవేక్షించనున్న అధికార పార్టీ నేతలు సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉప ఎన్నిక ప్రచార హోరు నిన్నటితో ముగిసింది. అసలు పోరు ఈ నెల 23న ఓటింగ్ రూపంలో జరగనుంది. పోలింగ్‌కు గడువు దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీలో అలజడి రేగుతోంది. ఎంతగా అభివృద్ధి పేరుతో మాయమాటలు చెప్పినా, ఎంతగా నోట్ల కట్టలు గుమ్మరించి ప్రలోభాలకు గురి చేసినా, పోలీసులతో సోదాలు, నేతలపై దాడులు చేయించినా ప్రతిపక్ష పార్టీ వైపే ఓటర్లు మొగ్గు చూపుతుండటంతో అధికార పార్టీ ఆందోళనకు గురవుతోంది. అయితే చివరి ప్రయత్నంగా ఓటర్లను కొనుగోలు చేసేందుకు వెచ్చించే మొత్తాన్ని అమాంతం పెంచేసింది. ఇందులో భాగంగా టీడీపీ నేతలు ఒక్కోచోట ఒక్కో రేటు కట్టి పంచడం ప్రారంభించారు. ఒక చోట ఓటుకు రూ.2 వేలు, మరో చోట రూ.3, రూ.5 వేలు ఇచ్చారు. కొన్ని చోట్లయితే ఏకంగా రూ.10 వేల వరకూ పంచుతున్నారు. మంత్రులు కొందరు జిల్లాలోనే ఉండి ఓటింగ్ సరళిని పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. పక్క జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు గోస్పాడు మండలంలోని ఒక గ్రామంలో బస చేసినట్లు సమాచారం. జిల్లాను వదిలి వెళ్లిపోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినప్పటికీ బేఖాతరు చేస్తూ ఉల్లంఘనలకు పాల్పడేందుకే సిద్ధమయ్యారు. ప్రధానంగా ఓటింగ్‌పై భయం ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఓటమి తప్పదని తెలిసే ఏకంగా ఎన్నికల సంఘంపైనే విమర్శలకు దిగడంతో పాటు పక్కనే ఉండి అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి తమకు అనుకూలంగా పని చేయించుకునేందుకు ప్రణాళిక వేసుకున్నట్టు సమాచారం. ఒక్కో ఓటుకు ఒక్కో రేటు.. ఉదయం పూట ఒక రేటు, రాత్రి సమయాల్లో మాట్లాడితే మరో రేటు అనే మొబైల్ కంపెనీల ఆఫర్ల తరహాలో అధికార పార్టీ కూడా ఓటర్లకు ఆఫర్లు ప్రకటిస్తోంది. కొన్ని వార్డుల్లో రూ.2, 3, 5 వేలు పంచుతున్న తెలుగుదేశం నేతలు మరికొన్ని చోట్ల ఓటర్ల మనస్థత్వాన్ని బట్టి ధర నిర్ణయిస్తున్నారు. ఉడుమాల్పురం లాంటి గ్రామాల్లో ఏకంగా రూ.10 వేల వరకూ ఓటుకు పంచడం గమనార్హం. ఇక్కడితో ఆగకుండా కొన్ని ప్రాంతాల్లో మహిళలకు చీరలు, ముక్కెరలను కూడా పంపిణీ చేస్తున్నారు. అయితే, అధికార పార్టీ బరితెగించి డబ్బులు పంపిణీ చేస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం కన్నెత్తి చూడకపోగా, ఎవరూ అడ్డుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న తీరు విమర్శల పాలవుతోంది. తెలుగుదేశం బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఓటుకు రూ.10 వేల మేరకు పంచుతున్న తీరు విస్తుగొలుపుతోంది. అంటే.. టీడీపీకి అనుకూలంగా ఉండటమే తాము చేసుకున్న పాపమా అని పలువురు ఆ పార్టీ కార్యకర్తలు.. స్థానిక నేతలను నిలదీస్తున్నారు. మీరే తింటున్నారంటూ శాపనార్థాలు పెడుతున్నారు. దీనిని గమనించిన స్థానిక నేతలు వారి వద్దకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఒక వార్డులో ఓటుకు రూ.2 వేలు ఇవ్వగా, పక్కనే ఉన్న మరో వార్డులో రూ.3 వేలు, రూ.5 వేలు ఇచ్చారని తెలియడంతో రూ.2 వేలు తీసుకున్న ఓటర్లు ఆ పార్టీ నేతలపై మండిపడ్డారు. 15వ వార్డులో ఏకంగా ఆ పార్టీ స్థానిక నేత ఇంటి ముందు కొద్ది మంది మహిళలు ఆందోళనకు కూడా దిగారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొన్ని గ్రామాల్లో ఏకంగా రూ.10 వేలు ఇచ్చారని తెలియడంతో ఇతరులు రగిలిపోతున్నారు. తమ ఓటుకైనా.. ఇంకొకరి ఓటుకైనా విలువ ఒకటేనని, అలాంటపుడు ఎందుకు వ్యత్యాసం చూపుతున్నారని నిలదీస్తుండటంతో ఎలా సర్ది చెప్పాలో తెలియక టీడీపీ నేతలు తల పట్టుకుంటున్నారు. ►చాపిరేవుల, అయ్యలూరు, చాబోలు, పెద్దకొట్టాలలో ఓటుకు రూ.3 వేలు, మహిళలకు చీరలు, ముక్కు పుడకలు పంపిణీ చేశారు. పొన్నాపురంలో ఓటుకు రూ.2 వేల చొప్పున పంపిణీ చేసిన అనంతరం రెండు సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లకు మాత్రం అదనంగా గుంపగుత్తగా రూ.5 లక్షలు ఇచ్చారు. ►యాళ్లూరు, దీబగుంట్ల గ్రామాల్లో వర్గ వైషమ్యాలు లేపేందుకు భారీగా ప్రలోభాలకు గురిచేశారు. ►నంద్యాల మున్సిపాలిటీలోని వార్డులకు ఇన్‌చార్జ్‌లుగా ఉన్న మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు మెజార్టీ చూపించుకోవాలనే లక్ష్యంతో ఎవరికి తోచిన విధంగా వారు డబ్బులు పంపిణీ చేశారు. ఈ క్రమంలో కొన్ని వార్డుల్లో ఓటుకు రూ.5 వేలు ఇచ్చారు. ఆ మొత్తం తీసుకున్న వారు ఆ విషయాన్ని పక్క వార్డుల్లోని బంధువులు, సన్నిహితులకు తెలిపారు. దీంతో ఒక్కో ఏరియాలో ఒకలాగా పంచుతారా అంటూ పలు చోట్ల ఓటర్లు వాదనకు దిగారు. ►ఒకటవ వార్డు మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేస్తామని ప్రకటించిన టీడీపీ పెద్దలు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో వారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయమై 22వ వార్డులో టీడీపీ నేతల ఇళ్ల వద్దకు వెళ్లి కొందరు ఓటర్లు నిలదీశారు. ►తాము టీడీపీ సానుభూతిపరులుగా ముద్ర ఉన్నప్పటికీ తమకు డబ్బులు ఎందుకు తక్కువగా ఇచ్చారని పలు ప్రాంతాల నుంచి ఆ పార్టీ నేతలపై ఒత్తిడి పెరిగింది. మంగళవారం మిగతా మొత్తాన్ని ఇవ్వకపోతే తమ సత్తా చూపుతామని హెచ్చరిస్తున్నారు. -
మీ ఓటు రహస్యమే
-
లైవ్ వెబ్‌కాస్టింగ్‌తో కట్టుదిట్టమైన ఏర్పాట్లు
-
ఆల్ ది బెస్ట్ అన్నా...!
సాక్షి, నంద్యాల : ‘ఆల్ ది బెస్ట్ అన్నా...!’ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. నిన్న (సోమవారం) నంద్యాలలో ఉప ఎన్నికల పోరు ప్రచార ముగింపు సభ పూర్తయిన తరువాత ఆయన... మోహన్ రెడ్డిని గట్టిగా ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పారు. వీరిద్దరూ 13 రోజులుగా ప్రచార రథంపై అలుపూ సొలుపూ లేకుండా తిరిగారు. ఎస్పీజీ మైదానంలోనూ, గాంధీ చౌక్‌లోనూ భారీ బహిరంగ సభలు నిర్వహించారు. తొలుత రోడ్‌షో ద్వారా ప్రచారం మొదలు పెట్టినా.. జనాభిమానం వెల్లువెత్తడంతో అది కాస్తా పాదయాత్రగా మారింది. ఎండనకా వాననకా తిరిగిన నేతలిద్దరూ ప్రచారం చివరి రోజున ప్రచార రథంపైనే ఆలింగనం చేసుకున్నపుడు చూసిన వేలాదిమంది కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కాగా కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక ప్రచార పర్వం నిన్నటితో ముగిసింది. అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి ఈ నెల 23వ తేదీ బుధవారం పోలింగ్ జరగనుంది. మొత్తం 255 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 141 సమస్యాత్మకంగా, 74 అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు. 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 6 కంపెనీల పారా మిలటరీ బలగాలను రప్పించారు. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలవుతుంది. సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ఎన్నికల అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆ ప్రాంతాల్లో ఓటింగ్ సరళిని వీడియో చిత్రీకరణ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటర్లకు సరిపడా ఈవీఎంల ను ఏర్పాటు చేశారు. సాంకేతిక ఇబ్బందులేవైనా తలెత్తితే అదనంగా కూడా ఈవీఎంలను సిద్ధం చేశారు. ఈ నెల 28న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితం వెల్లడి కానుంది. -
ధర్మానికే ఓటెయ్యండి
నంద్యాల ప్రజలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు - వ్యవస్థలో మార్పు...నంద్యాల నుంచి ప్రారంభం కావాలి - నంద్యాల అభివృద్ధి నాకు వదిలేయండి - నవరత్నాలకూ ఇక్కడి నుంచే నాంది నంద్యాల నుంచి సాక్షి ప్రతినిధి: ‘ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయండి.. రాబోయే రోజుల్లో నవరత్నాల వెలుగులకు నంద్యాల నుంచే నాంది పలకండి’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘ఇవాళ మూడున్నర సంవత్సరాల తర్వాత చంద్రబాబు పరిపాలకు తీర్పు ఇవ్వబోతున్నాం. చంద్రబాబు మోసాలకు వ్యతిరేకంగా మీరు ఓటు వేయబోతున్నారు. ఆయన చేసిన అవినీతికి, దుర్మార్గానికి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నాం. రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత లేకపోతే ప్రజా స్వామ్యం దిగజారిపోతుంది. ఎన్నికలప్పుడు హామీలిచ్చి, తర్వాత మోసం చేసే నాయకులను ప్రజలు కాలర్ పట్టుకుని నిలదీసే రోజు రావాలి. అప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది.’ అని జగన్ పేర్కొన్నారు. ‘మీ దగ్గరకు డబ్బు మూటలతో వస్తారు.. రూ. 5వేలు చేతిలో పెట్టి జేబులో నుంచి దేవుడి బొమ్మ తీస్తారు.. అది చూపించి ప్రమాణం చేయమంటారు. ఆ క్షణంలో ఒక్కసారి కళ్లు మూసుకు ని దేవుడా.. ధర్మం వైపు ఉండేలా చూడమని ప్రార్థించండి. ఏ దేవుడైనా పాపానికి ఓటు వేయమని చెప్పడు.. దెయ్యాలు మాత్రమే అలా అడుగుతాయి. రేపు ఆ దెయ్యాలు వస్తాయి.. జాగ్రత్తగా ఉండండి. ధర్మానికి.. న్యా యానికి ఓటేయండి’ అని ఆయన నంద్యాల ప్రజలకు పిలుపునిచ్చారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ సోమవారం నంద్యాల పట్టణంలోని గాంధీచౌక్ వద్ద ఉప ఎన్నికల ముగింపు ప్రచార సభలో మాట్లాడారు. నంద్యాల ప్రజలు తనపై చూపిస్తోన్న ప్రేమానురాగాలను చూసి చంద్రబాబు వెన్నులో భయంపుట్టిందని, అందుకే అడ్డదారుల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. నంద్యాల అభివృద్ధి బాధ్యతను తనపై ఉంచి.. నీతిని, ధర్మాన్ని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సభలో ఇంకా ఆయన ఏమన్నారంటే.... నంద్యాల నుంచే నవరత్నాలు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నవరత్నాల పథకాల అమలుకు నంద్యాల నుంచే శ్రీకారం చుడతా. ప్రతి ఇంటికి పథకాలు చేరాలంటే వ్యవస్థలో మార్పు రావాలి. నంద్యాలను జిల్లాగా చేస్తా. జిల్లాకేంద్రం అయితే కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, వివిధ జిల్లాస్థాయి కార్యాలయాలు ఏర్పాటవుతాయి. దీంతో నంద్యాల అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఒక్క ఏడాది గట్టిగా దువా చెయ్యమని కోరుతున్నా. ఏడాది ఓపిక పడితే.. వచ్చేది మన ప్రభుత్వమే. ఏ పేదవాడూ అప్పు తీసుకుని ఇల్లు్ల కట్టుకోవల్సి న అవసరం లేదు. ఉచితంగా ఇల్లు కట్టి, రిజిస్ట్రేషన్ చేసిస్తామని మాటిస్తున్నా. నంద్యాల పేద ప్రజలకు మూడున్నర సెంట్లలో ఉచితంగా ఇల్లు కట్టిస్తా. ఆటోనగర్ వాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయిస్తా. మార్కెట్లో ఏ ఒక్కరూ రాయల్టీ కట్టాల్సిన అవసరం లేకుండా చేస్తా. రోడ్డు విస్తరణ పనుల్లో వ్యాపార సముదాయాలు పోగొట్టుకున్న వారి కి మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లిస్తా. రైతులకు కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరించడంతోపాటు గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మిస్తా. అగ్రిగోల్డ్, కేశవరెడ్డి ఆస్తుల వెనుక చంద్రబాబు బినామీలే ఉన్నారు. ఆ బాధితులకు హామీ ఇస్తున్నా.. మన ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే వారికి ఇవ్వాల్సింది పూర్తిగా చెల్లిస్తాం. అడ్డుపడితే.. అవసరమైతే చంద్రబాబు చొక్కా విప్పిస్తాం. ఆదినారాయణరెడ్డి నిక్కర్ కూడా విప్పిస్తాం. వెళ్లే ముందు ఒక్క విషయం చెప్పాలి.. పార్టీ గుర్తు గుర్తుంచుకోండి. ప్రజల్ని అయోమయానికి గురిచేయడానికి ఎస్.మోహన్‌రెడ్డి అనే పేరుతో 10 మందితో నామినేషన్ వేయించారు. అందుకే గుర్తు గురించి మళ్లీ చెబుతున్నా.. ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి ’’ అంటూ జగన్ ప్రచారానికి ముగింపు పలికారు. -
మళ్లీ కాంగ్రెస్ – టీడీపీ కుట్రలు
భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శ - జగన్ వ్యక్తిత్వంపై విషప్రచారం - అవినీతి డబ్బు తీసుకుని అసత్య ప్రచారాలు.. - బీజేపీతో అంటకాగుతున్నట్లు దుష్ప్రచారం - నిజానికి కాకినాడలో కలసి ఉంది టీడీపీయే - నంద్యాలలో ముస్లిం ఓట్ల కోసమే నాటకాలు సాక్షి ప్రతినిధి, నంద్యాల: ‘కుట్రలు చేసేందుకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మళ్లీ ఒక్కటవుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్ అభ్యర్థికి చంద్రబాబు రూ. 10 కోట్లు ఇచ్చారు’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. గతంలో తెలుగుదేశం పార్టీతో మిలాఖత్ అయి రాజకీయ కక్షతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జైలుకు పంపించిన కాంగ్రెస్ ...ఇప్పుడు నంద్యాల ఎన్నికల్లో టీడీపీకి మేలు చేయాలని చూస్తోందని మండిపడ్డారు. భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... టీడీపీ, కాంగ్రెస్ పార్టీల దొంగ నాటకాలను ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ వాళ్లు చంద్రబాబు అవినీతి సొమ్ము తీసుకుని వైఎస్ జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. కుట్రలు మీరు చేసి జగన్‌పై విషప్రచారమా? కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, అన్యాయాలు, అవినీతితో వ్యవస్థను భ్రష్టు పట్టించిన చంద్రబాబు నాయుడు వాటిని కప్పిపెట్టుకుని తాను చెప్పినట్టల్లా ఆడే చానళ్లు, పత్రికల సాయంతో జగన్మోహన్రెడ్డిపై విషప్రచారాలు సాగిస్తున్నాడని భూమన విమర్శించారు. చంద్రబాబు చేస్తున్న దుర్మార్గ, నీచ నికృష్ట పాలనపై దండయాత్ర సాగించి దానిని కచ్చితంగా ఖతం చేయాల్సిన అవసరం ఉందని జనం భావిస్తున్నారని, దానినే తన గొంతు ద్వారా జగన్ వినిపించారు తప్ప ఎవరిపైనా ఆయనకు వ్యక్తిగత ద్వేషం లేదని వివరించారు. ‘ఎంతో హింస సాగించిన చంద్రబాబు శాంతిపావురమా? ఏనాడూ ఒక్క హింసాయుత సంఘటనలో పాల్గొనని, మాటలు మాట్లాడని జగన్ హంతకుడట. చంద్రబాబు ఏది చెబుతాడో దానికి వ్యతిరేకంగా చేస్తాడు. చంద్రబాబు, సోనియా ఇద్దరూ కలిసే కుట్రలు పన్ని జగన్‌పై సీబీఐని ఉసిగొల్పి 16 నెలలు జైలులో నిర్బంధించారు.’ అని భూమన వివరించారు. జగన్ వ్యక్తిత్వం ముందు మీరెంత? ‘ఎంత స్థాయిలో నిర్బంధం ఎదురైనా ఏనాడూ జగన్ వెనుకంజ వేయలేదు. అలజడి నా జీవితం, ఆందోళన నా ఊపిరి, తిరుగుబాటు నా వేదాంతం అంటూ ప్రజా క్షేత్రంలో ప్రజల జీవితాలతోమమేకమై పోరాడుతున్న యోధుడు, యుద్ధవీరుడు జగన్’ అని భూమన వివరించారు. జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వం ముందు చంద్రబాబు చిట్టెలుక అని భూమన వ్యాఖ్యానించారు. నీచాతినీచమైన చరిత్ర చంద్రబాబుది. ఎంతగా నిర్బంధించినా వెరవకుండా ప్రజల తరఫున నిలబడి పోరాడుతున్న వ్యక్తి జగన్ అన్నారు. ఈ ఎన్నికలలో మళ్లీ కాంగ్రెస్ చంద్రబాబు ఒక్కటై మా నాయకుడిపై దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వారికి ఓటేస్తే డ్రెయినేజ్‌లో వేసినట్లే... కాంగ్రెస్ పార్టీకి వేసే ఓటు డ్రైనేజ్‌లో వేసినట్లేనని భూమన వ్యాఖ్యానించారు. రైతులు, డ్వాక్రా మహిళలు, ముస్లింలు, కాపులు, దళితులు, విద్యార్థులు సహా అందరికీ చంద్రబాబు మోసం చేశారన్నారు. ఏ ఒక్క వరానికీ ఆయన మేలు చేయలేదని, దేశంలో కెల్లా లోకేశ్‌ను అత్యంత సంపన్నుడిని చేసేందుకు చంద్రబాబు బకాసురుడిలా అవినీతికి పాల్పడుతున్నారన్నారు. వారు అంటకాగుతూ మాపై దుష్ప్రచారం.. తాము బీజేపీలో కలుస్తున్నట్లుగా ఎల్లో మీడియాతో ప్రచారం చేయిస్తున్నారని, నంద్యాలలో బీజేపీ జెండా కనిపించకుండా ఆ పార్టీతో అంటకాగుతున్న చంద్రబాబు ఎన్నికల వేళ తమపై నిందలు వేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీయే కాకినాడలో బీజేపీని కౌగలించుకుని ఆ పార్టీతో సమన్వయం చేసుకుని ప్రచారం చేస్తోంది. నంద్యాలలో మాత్రం బీజేపీతో కలసి ప్రచారం చేస్తే ముస్లింలు ఓటేయరన్న భయంతో దూరం పాటిస్తూ నాటకాలాడుతున్నారని భూమన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఇచ్చిన అవినీతి సొమ్ము ఉపయోగించుకుని పాదయాత్రలు చేస్తూ కాంగ్రెస్ నాయకులు మేము బీజేపీకి అమ్ముడుపోయామంటూ నిందలు వేస్తున్నారని భూమన విమర్శించారు. నంద్యాల ప్రజలు టీడీపీకి కచ్చితంగా గుణపాఠం చెబుతారని భూమన అన్నారు. పోలింగ్ ఏజెంట్లను బెదిరించి, రిగ్గింగ్ చేయాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని, అయితే నంద్యాల ప్రజలు వాస్తవాలన్నీ గ్రహించారని, చంద్రబాబు∙పాపపు పాలనకు తప్పకుండా చరమగీతం పాడతారని భూమన పేర్కొన్నారు. -
‘శిల్పా కుటుంబాన్ని ఏమీ చేయలేరు’
►శిల్పా కుటుంబంపై ఎన్నడూ అవినీతి ఆరోపణలు లేవు ►నీతి నిజాయితీలే పరమావధిగా భావించి రాజకీయాల్లోకి వచ్చాం ►వైఎస్ జగన్ ప్రజాదరణను చూసి టీడీపీ భయపడుతోంది ►భూమా కుటుంబంలోని పిల్లలు చిన్నపిల్లలేం కాదు ►ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దు నంద్యాల : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...శిల్పా సహకార సొసైటీపై చేసిన ఆరోపణలను వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఖండించారు. సోమవారం ఉదయం శిల్పా మోహన్ రెడ్డి నంద్యాలలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం విమర్శలు, ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు. శిల్పా కుటుంబంపై ఎన్నడూ అవినీతి ఆరోపణలు లేవని, తాము ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. తమ కుటుంబానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారాలు, తాజా పరిణామాలు చాలా బాధపెడుతున్నాయన్నారు. తనపై ఇప్పటివరకూ చిన్నకేసు కూడా లేదని శిల్పా మోహన్ రెడ్డి తెలిపారు. తాము ఎన్నడూ సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదన్నారు. పదిమందికి సహాయం చేయాలని ఆశించామని, నీతి నిజాయితీలే పరమావధిగా భావించి రాజకీయాల్లోకి వచ్చామన్నారు. బెదిరింపులతో భయపడేది లేదని శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. నంద్యాల ఎన్నికల్లో టీడీపీ పెద్ద ఎత్తున అక్రమాలు చేస్తోందని, టీడీపీకే ఓట్లు వేయాలంటూ అన్నివర్గాలను బెదిరింపులకు గురి చేస్తున్నారని, కోట్ల రూపాయిలు టీడీపీ నేతలు వెదజల్లుతున్నారని శిల్పా మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అధికార బలంతో టీడీపీ నేతలు భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రలోభపెట్టి కౌన్సిలర్లను, నాయకులను తీసుకున్నారన్నారు. అర్థరాత్రి తమ కార్యకర్తలు, అనుచరులపై పోలీసులు దాడి చేశారని ఆయన తెలిపారు. ప్రజల అండ ఉన్నంతవరకూ శిల్పా కుటుంబాన్నిఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. ఆరోపణలు బాధాకరం.. ‘శిల్పా సహకార బ్యాంకుపై చంద్రబాబు ఆరోపణలు చేయడం బాధాకరం. శిల్పా సహకార సొసైటీ చట్ట వ్యతిరేకమని సీఎం ఆరోపించారు. చంద్రబాబు చేసిన ఆరోపణలపై వివరణ ఇవాల్సిన అవసరం ఉంది. శిల్పా సహకార సొసైటీ రిజిస్ట్రర్ అయింది. ఏ విచారణకు అయినా మేం సిద్ధం. ఎప్పుడు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. ఈ రోజు వరకూ మేం నిజాయితీగా ఉన్నాం. మానవ సేవే మాధవ సేవగా నమ్మి రాజకీయాల్లోకి వచ్చాం. పేద కుటుంబంలో పుట్టి పదిమందికి సేవ చేయాలని ఆశించా. శిల్పా కుటుంబంపై ఎప్పుడు అవనీతి ఆరోపణలు లేవు. టీడీపీ భయపడుతోంది.. 12 రోజుల పర్యటనలో వైఎస్ జగన్‌కు ప్రజా స్పందన వస్తోందని, ప్రచారంలో అనేక మందిని కలిశారన్నారు. వైఎస్ జగన్ ప్రజాదరణను చూసి టీడీపీ భయపడుతోంది. మూడున్నరేళ్లుగా చంద్రబాబు అవినీతి పాలనపై మాట్లాడారు. వైఎస్ జగన్‌కు మా కుటుంబం తరఫున ధన్యవాదాలు. మూడేళ్లు టీడీపీలో ఉన్నాం. ఎన్ని విజ్ఞప్తులు చేసి చంద్రబాబు పట్టించుకోలేదు. ఇప్పటికిప్పుడు టీడీపీ చేస్తున్న పనులను మేం నమ్మడం లేదు. టీడీపీకే ఓటు వేయాలంటూ అన్ని వర్గాలను బెదిరిస్తున్నారు. ప్రజలు భయభ్రాంతులకు గురికావొద్దు. వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుంది.. మీకు వచ్చే పెన్షన్లు, రేషన్ మొత్తం ఆన్లైన్లో ఉంటుంది. మీకు ఏ ఇబ్బంది కలిగినా వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుంది. ఎన్ని కుట్రలు పన్నినా శిల్పా కుటుంబాన్ని ఏమీ చేయలేరు. బెదిరిస్తే నేను భయపడేవాడిని కాదు. అలాంటి బెదిరింపులకు లొంగేది లేదు. మేం ఎప్పుడు ఏ వ్యక్తి గురించి చెడు మాట్లాడలేదు. చెడను ప్రచారం చేయలేదు. నేను అనని మాటలను కూడా అన్నానని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇదంతా నంద్యాల ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలి.’ అని సూచించారు. -
ప్రచారం పరిసమాప్తం
► నంద్యాలను విడిచిన ‘బయటి’ నేతలు ► రేపటి పోలింగ్‌కు సర్వం సిద్ధం ► పోలీస్ శాఖ భారీ బందోబస్తు నంద్యాల విద్య: నంద్యాల ఉపఎన్నిక ప్రచారానికి సోమవారం సాయంత్రంతో తెరపడింది. గత నెల 29 వతేదీన ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన విషయం విదితమే. ఆగస్టు 5వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. వాటి ఉపసంహరణకు ఆగస్టు 9 వతేదీ గడువు విధించారు. తొమ్మిది మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా 15 మంది బరిలో నిలిచారు. ప్రధానంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి మధ్య పోటీ నెలకొంది. ఈ రెండు పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రథమశ్రేణి, ద్వితీయశ్రేణి నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ప్రచారాలకు నాయకత్వం వహించారు. ఎన్నికల ప్రచారాన్ని ప్రజలకు అందించడంలో మీడియా హడావుడి కనిపించింది. అధినాయకుల సభలు, ప్రసంగాలు, రోడ్‌షోలతో నంద్యాల పట్టణంలోని ప్రధాన కూడళ్లు, వీధులు హోరెత్తాయి. అ«ధికార, ప్రతిపక్ష నేతలు ఆకట్టుకొనే ప్రసంగాలతో ప్రచారం చేశారు. వేలాది మంది కార్యకర్తలతో, జెండాలతో పట్టణంలో సందడి వాతావరణం కనిపించింది. ప్రచారాలు సోమవారం సాయంత్రానికి పూర్తికావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు నంద్యాలను వీడారు. ఇదిలా ఉండగా.. ఉప ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ పకడ్బందీ చర్యలు తీసుకుంది. ప్రత్యేకంగా నలుగురు పరిశీలకులను నియమించింది. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. బుధవారం జరిగే పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. -
అందరి అభ్యున్నతే.. నా అభిమతం
► నంద్యాల ప్రజలకు అండగా ఉంటా ► మీరు చూపిన ప్రేమాభిమానాలు, ఆప్యాయత మరువలేనివి ► ఇంతకు ముందు చంద్రబాబు ఒక్కసారైనా నంద్యాల వచ్చారా? ► రోడ్‌షోలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ► దిగ్విజయంగా ముగిసిన ఉప ఎన్నిక ప్రచారం ► చివరిరోజూ పోటెత్తిన జనం సాక్షి బృందం, నంద్యాల : ‘నంద్యాల అభివృద్ధి విషయం నాకు వదిలేయండి. పట్టణంలోని మార్కెట్‌యార్డులో పేదల నుంచి ఈ టీడీపీ ప్రభుత్వంలో పన్నులు వసూలు చేస్తున్నారు. దేవుడి దయతో మనం అధికారంలోకి వస్తే ఏ ఒక్కరూ పన్నులు చెల్లించే అవసరం ఉండద’ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అలాగే ఆటోనగర్‌లో ఏ ఒక్కరికీ స్థలాలు పోవని, వారికి అండగా ఉంటామని, అవసరమైతే రిజిష్టర్ కూడా చేయిస్తామని హామీ ఇచ్చారు. అగ్రిగోల్డ్, కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. పేదవారందరికీ సొంతిళ్లు నిర్మిస్తామన్నారు. నంద్యాలను జిల్లా చేసి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన సోమవారం పట్టణంలోని గాంధీ చౌక్‌లో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. తాను 13 రోజులుగా నంద్యాల పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించానని, మీరు చూపిన ప్రేమాభిమానాలను, ఆత్మీయతను రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారని అన్నారు. దీంతో చంద్రబాబు వెన్నులో భయం పుట్టుకొచ్చిందన్నారు. ఆయన భయం ఎలాంటిదో తనకు ఓ అభిమాని చెప్పాడని, నంద్యాలలో ఇన్ని రోజులు జగన్‌కు పనేంటని చంద్రబాబు అన్నట్లు తెలిపాడన్నారు. ఉప ఎన్నిక ముందు చంద్రబాబు ఒక్కసారైనా నంద్యాల ముఖం చూశారా అని ప్రశ్నించారు. కృష్ణా జిల్లా నందిగామ ఉపఎన్నికల్లో కూడా వైఎస్సార్సీపీ పోటీ పెట్టినప్పుడే అక్కడి వెళ్లారని గుర్తు చేశారు. అభివృద్ధి అంటే సీఎం దృష్టిలో ఇదేనా? సీఎం చంద్రబాబు దృష్టిలో నంద్యాల అభివృద్ధి అంటే రెండు, మూడు కిలోమీటర్ల మేర దుకాణాలను టపాటపా పగులగొట్టడమేనా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. రోడ్డు వేసే సమయంలో బాధితులకు న్యాయం చేయకుండా ప్రభుత్వం ముష్టి వేసినట్లు గజానికి రూ.18 వేలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. రోడ్డు విస్తరణలో సర్వం కోల్పోయిన బాధితులకు తాము అధికారంలోకి వచ్చాక గజానికి రూ.లక్ష చొప్పన పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దిగ్విజయంగా ముగిసిన ప్రచారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నంద్యాల నియోజకవర్గంలో 13 రోజుల పాటు చేపట్టిన ఉప ఎన్నిక ప్రచారం దిగ్విజయంగా ముగిసింది. చివరి రోజు సోమవారం రోడ్‌షోకు కూడా ప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చారు. పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ సర్కిల్ వద్ద రోడ్‌షో ప్రారంభమైంది. తమ అభిమాన నేతను చూసి యువకులు, ప్రజలు, రామకృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులు కేరింతలు కొట్టారు. ఆ కళాశాలకు చెందిన విద్యార్థినులు శివలక్ష్మీ, మమత, ముంతాజ్, వరలక్ష్మి, నిష.. జగనన్నను కలిసి సెల్ఫీలు తీసుకుని సంబరపడ్డారు. రోడ్‌షోలో రాధ అనే మహిళ తన కుమారుడు సుమన్‌ను అందించి సెల్ఫీ తీసుకుని పొంగిపోయింది. హసీన, ముంతాజ్‌లు పూలమాల వేసి సెల్ఫీలు తీసుకున్నారు.నాసర్‌అలీ అనే వికలాంగుడు జననేతకు పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి ఆనందపడ్డాడు. సుబ్బమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలిని ఇంటి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించడంతో ‘బాగున్నావా నాయనా’ అంటూ సంబరపడింది. తన మనవడు అల్లిషెరన్ను జగన్ తీసుకోవడంతో మంజుపీర్ రహిమాన్ అనే ముస్లిం సోదరుడు సంబరపడ్డారు. ఇలా రోడ్‌షో మున్సిపల్ పార్క్, ఫాతిమా స్కూల్, మున్సిపల్ హైస్కూల్, బైర్మల్ సెంటర్, కల్పనా సెంటర్, సాహెబ్ దర్గా, ముల్లాన్‌పేట, పెద్దమార్కెట్ మీదుగా గాంధీచౌక్ వరకు కొనసాగింది. అన్ని కాలనీల్లో జనం పోటెత్తారు. వేల సంఖ్యలో తరలివచ్చారు. ఎండ తీవ్రంగా ఉన్నా అభిమానులు ఏమాత్రమూ లెక్కచేయకుండా వీధుల వెంట పోటెత్తారు. పట్టణంలో రోడ్‌షో ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ఈ కార్యక్రవకుంలో పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు శిల్పా చక్రపాణిరెడ్డి, రెహమాన్, పసుపల బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ మద్దతు వైఎస్ జగన్ రోడ్‌షో నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల మీదుగా వెళ్తుండగా ఆ కళాశాల కరస్పాండెంట్ రామకృష్ణారెడ్డి జననేతకు దుశ్శాలువా అందించి తమ కాలేజీలోకి సాదరంగా ఆహ్వానించారు. అలాగే పార్టీ అభ్యర్థి మోహన్‌రెడ్డిని ఆప్యాయంగా పలకరించారు. ఎన్నికల్లో పూర్తి సహకారం అందిస్తామంటూ మద్దతు తెలిపారు.మహమ్మద్ ముస్తాక్ కుటుంబ సభ్యులు తమ ఇంట్లోకి జగన్‌ను ఆహ్వానించారు. ముస్తాక్‌కు జగన్ వైఎస్ఆర్సీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కల్పనా సెంటర్లో మంజుపీర్ రహంతుల్లా దర్గాలోకి జననేత వెళ్లి.. ముస్లిం సోదరులతో కలిసి దువా చేశారు. ముస్లింలకు అండగా ఉంటా : శిల్పా నంద్యాల నియోజకవర్గంలో ప్రతి ముస్లిం సోదరుడికి అండగా ఉంటానని వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నంద్యాలలోని గాంధీ చౌక్‌లో జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. తాను ఎవరినీ ఎప్పుడు కూడా ఒక్క మాట అనలేదన్నారు. టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని, ఇది సరైంది కాదని అన్నారు. తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టానన్నారు. ఇందులో ప్రధానంగా నంద్యాల ప్రజల దాహార్తి తీర్చేందుకు ఉచితంగా మినరల్ వాటర్‌ను అందిస్తున్నామని గుర్తు చేశారు. అన్ని కాలనీలకు నీటి సమస్య లేకుండా చేశామన్నారు. శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు, వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు. శిల్పా సేవా సమితి, సేవా సంస్థలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించడంలో నిజం లేదన్నారు. శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. నేడు ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని అనాథ అని ముఖ్యమంత్రి పేర్కొనడం ఎంతవరకు సమంజసమన్నారు. ఆయనకు తల్లిదండ్రులు ఉన్నారని, ఎలా అనాథ అవుతారని ప్రశ్నించారు. నంద్యాల అభివృద్ధికి తాను అనునిత్యం కృషి చేస్తానన్నారు. -
నంద్యాల పోలింగ్ ఏజెంట్ల న్యాయ పోరాటం
సాక్షి, హైదరాబాద్: నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా అధికార పార్టీ అండతో స్థానిక పోలీసుల బెదిరింపులు, కక్ష సాధింపు చర్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి పోలింగ్ ఏజెంట్లు న్యాయ పోరాటం ప్రారంభించారు. తమపై తప్పుడు కేసులు నమోదు చేయకుండా, చట్ట విరుద్ధంగా అరెస్ట్‌లు చేయకుండా, ఎటువంటి వేధింపులకు గురి చేయకుండా నంద్యాల పోలీసులను ఆదేశించాలని కోరుతూ పోలింగ్ ఏజెంట్లు ఎం.విజయశేఖర్‌రెడ్డి మరో 44 మంది సోమవారం హైకోర్టులో పిటిష న్ వేశారు. ఇందులో హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి, జిల్లా ఎస్పీ, డీఎస్పీ, ఇతర పోలీసులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు విచారణ జరపనుంది. -
భన్వర్‌లాల్‌పై టీడీపీ ఫిర్యాదు
సర్వేలను నిషేధించడం నిబంధనలకు విరుద్ధమని వాదన సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌పై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, నిమ్మల కిష్టప్ప, మాల్యాద్రి శ్రీరామ్ సోమవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ అచల్‌కుమార్ జ్యోతితో సమావేశమై.. నంద్యాల ఉపఎన్నికలో భన్వర్‌లాల్ పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తున్న భన్వర్‌లాల్.. తాము చేసే ఫిర్యాదులను అసలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ డీఎస్పీపై ప్రతిపక్ష పార్టీ ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్.. ఆయన్ను బదిలీ చేసిందని పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రిపై విపక్ష నేత చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదన్నారు. సర్వేలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారని, ఇది నిబంధనలకు విరుద్ధమన్నారు. ఉప ఎన్నికపై సాక్షి దినపత్రిక, చానల్లో వస్తున్న కథనాలను పెయిడ్ ఆర్టికల్స్‌గా పరిగణించాలన్నారు. -
నంద్యాల సర్వే నిషేధంపై జోక్యానికి నో
కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: నంద్యాల ఉప ఎన్నిక పూర్తయ్యేంత వరకు ఓటర్ల ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించిన సర్వే ప్రచురణ, ప్రసారాలపై నిషేధం విధిస్తూ రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఉత్తర్వుల విషయంలో జోక్యానికి ఉమ్మడి హైకోర్టు నిరాకరించింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారి, కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్ల ప్రజాభిప్రాయ సేకరణ సర్వే ప్రచురణ, ప్రసారాలపై నిషేధం విధిస్తూ రిటర్నింగ్ అధికారి ఈ నెల 15న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ స్వచ్ఛంద సంస్థ ‘స్పార్క్’ ఏపీ కార్యదర్శి నున్నా రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్ వాదనలు వినిపిస్తూ... రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఉత్తర్వులు ప్రజా ప్రాతినిధ్య చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. వాస్తవానికి ప్రజా ప్రాతినిధ్య చట్ట నిబంధనల్లో ఎన్నిక ప్రారంభం కావడానికి 48 గంటల ముందు నుంచి మాత్రమే సర్వే ప్రచురణ, ప్రసారాలపై నిషేధం ఉందని ఆయన కోర్టుకు నివేదించారు. -
మీ ఓటు రహస్యమే
మీరు ఓటెవరికి వేశారో ఇతరులు ఎవరికీ తెలియదు నిర్భయంగా ఓటు వేయండి.. నంద్యాల ఓటర్లకు ఈసీ భన్వర్‌లాల్ పిలుపు - ఓటర్లు 92231 66166 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు - లైవ్ వెబ్‌కాస్టింగ్‌తో కట్టుదిట్టమైన ఏర్పాట్లు - 23వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సాక్షి, హైదరాబాద్: ఓటరు ఎవరికి ఓటు వేసింది ఇతరులకు తెలిసే అవకాశం ఎంత మాత్రం లేదని, నంద్యాల ఉప ఎన్నికలో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు గురికాకుండా నిర్భయంగా ఓటేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్ పిలుపునిచ్చారు. తమకు నచ్చినవారికి, అభీష్టం మేరకు ఓటు వేయాలని సూచించారు. ఈ విషయంలో ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు వీలుగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్టు ఆయన వెల్లడించారు. పోలింగ్ పూర్తయ్యేవరకు ఎలాంటి సర్వేలు, ఒపీనియన్ పోల్స్ నిర్వహించినా, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని పునరు ద్ఘాటించారు. సోమవారం హైదరాబా ద్‌లోని కార్యాలయంలో భన్వర్‌లాల్ మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలోని 255 పోలింగ్ కేంద్రాల్లో బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగు తుందని చెప్పారు. ఆరు గంటల సమయానికి పోలింగ్ స్టేషన్ వద్ద క్యూలో ఉన్న వారిని రాత్రి ఎన్ని గంటల వరకైనా ఓటేయడానికి అనుమతిస్తామన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ లోపలా, బయట లైవ్ వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ ఏర్పాటు చేశామని, పోలింగ్ తీరును అనుక్షణం పరిశీలిస్తారని భన్వర్‌లాల్ వివరించారు. ఎక్కడ ఏం జరిగినా ఎన్నికల సిబ్బంది క్షణాల్లో స్పందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ప్రచారం ముగిసినందున స్థానికేత రులు నంద్యాల విడిచి వెళ్లాలని ఆయన ఆదేశించారు. భారీ బందోబస్తు: 2,500 మంది పోలీ సులు, ఆరు కంపెనీల పారామిలటరీ బలగా లు బందోబస్తులో పాల్గొంటున్నారని భన్వర్ లాల్ తెలిపారు. 82 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లంద రికీ ఓటింగ్ స్లిప్‌లు పంపామని, పోలింగ్ బూత్‌ల్లో తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం కల్పించామని చెప్పారు. వికలాంగులకు ప్రత్యే క ఏర్పాట్లున్నాయని, అంధులకు బ్రెయిలీ లిపి ద్వారా ఓటు వేసే సదుపాయం కల్పించామని తెలిపారు. ఓటరు ఎవరికి ఓటు వేసిందీ ఇతరులెవరికీ తెలిసే అవకాశం లేదని, పోలిం గ్ బూత్‌లో ఓటరు తాను వేసిన ఓటును ఏడు సెకన్ల పాటు చూసుకోవచ్చని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో 15 వేలమంది ఓటర్లకు ఓటింగ్ స్లిప్ లు ఇవ్వలేదని, వీరిలో స్థానికంగా లేనివారు, డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్టుగా గుర్తించామన్నారు. చానళ్లపై నిఘా: రాష్ట్రంలోని 16 తెలుగు చానళ్లను 24 గంటలూ వాచ్ చేస్తున్నామని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ప్రసారాలు చేసినా చర్యలు తప్పవని భన్వర్‌లాల్ హెచ్చరించారు. పోలింగ్ పూర్తయ్యేవరకు ఎలాంటి సర్వేలు, ఒపీనియన్ పోల్స్, చర్చలను అనుమతించవద్దని ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాలను కోరారు. పోలింగ్ ఫలితాలను ప్రభావితం చేసేలా ఎలాంటి కథనాలు ప్రసారం చేసినా దాన్ని ఎన్నికల నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తామని చెప్పారు. సామాజిక మాధ్యమాలు, వాట్సాప్, బల్క్ ఎస్ఎంఎస్లపై నిషేధం కొనసాగుతుం దన్నారు. వీటినీ ఎన్నికల సిబ్బంది గమనిస్తున్నారని, ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని చెప్పారు. ఓటర్లు తమకు ఎలాంటి అసౌకర్యం కలిగినా, పార్టీలు నిబంధనలు ఉల్లంఘించినా 9223166166 అనే నంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంపిణీ చేసినట్టు వచ్చిన ఫిర్యాదులపై భన్వర్‌లాల్ స్పందించారు. దీనిపై ఎన్నికల కమిషన్ వివరణ కోరిందని, తమకు అందిన వివరణతో జిల్లా కలెక్టర్ ఓ నివేదిక పంపారని, అయితే, దాన్ని మరోసారి పరిశీలించి నివేదిక పంపాలని ఆయన్ను కోరినట్టు తెలిపారు. ఇప్పటివరకు రూ.1.16 కోట్ల నగదు సీజ్ చేశామని, 316 మందిపై కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. -
నంద్యాలలో ముగిసిన వైఎస్ జగన్ ప్రచారం
-
ఓటమి భయంతో టీడీపీ నేతలు అక్కడే!
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార టీడీపీలో ఓటమి భయం తారాస్థాయికి చేరింది. నంద్యాల ఓటర్లు ఒక్కొక్కరి చేతిలో డబ్బులుపెట్టి ఓటేయాలంటూ దేవుడి బొమ్మ మీద ప్రమాణం చేయిస్తున్నా.. వారి భవిష్యత్తు కళ్లకు కనిపిస్తుండటంతో పచ్చ నేతలు నంద్యాలను వీడటం లేదు. మరోవైపు నేటితో నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఏపీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఎన్నికల కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ నంద్యాలోనే తిష్టవేశారు. కర్నూలు జిల్లాను వదిలి వెళ్లాలని ఈసీ ఆదేశించినా నంద్యాలలోనే పాగా వేసిన టీడీపీ నేతలు, మంత్రులు, కార్యకర్తలు డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. గుంటూరు, కృష్ణా సహా ఇతర జిల్లాల నుంచి టీడీపీ నేతలు నంద్యాలకు భారీ ఎత్తున చేరుకుంటున్నారు. నంద్యాల హోటళ్లు, లాడ్జీలు మొత్తం టీడీపీ నేతలతో నిండిపోయాయి. ఇతర జిల్లాల మంత్రులు సైతం నంద్యాలలోనే మంత్రాంగం నడుపుతున్నారు. ప్రతిపక్ష పార్టీకి ఓటేస్తే అభివృద్ధి జరగదంటూ టీడీపీ నేతలు ఓటర్లను భయాందోళలనకు గురిచేస్తున్నారు. టీడీపీ నేతల చర్యలను వైఎస్ఆర్సీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. డబ్బులు పంచుతూ టీడీపీ నేతలు ఇదివరకే అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ 23న నంద్యాల నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. -
నంద్యాలలో టీడీపీ దౌర్జన్యాలు..
-
పోలింగ్‌కు అంతా రెడీ: భన్వర్‌లాల్
సాక్షి, హైదరాబాద్: నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం ముగిసిన నేపథ్యంలో ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన వెల్లడించారు. ఓటర్లను ప్రలోభ పెట్టినా, నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. మొత్తం 255 పొలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. 6 కంపెనీ పారా మిలటరీ బలగాలతో భద్రతా ఏర్పాటు చేశామని, 82 ఫ్లైయింగ్ స్వ్కాడ్ లు క్షేత్రస్థాయిలో ఎన్నికలను పరిశీలిస్తాయని ఆయన అన్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు క్యూలో ఉన్నవారంతా ఓటేయొచ్చని తెలిపారు. 23వ తేదీ వరకు మద్యం షాపులు బంద్ చేయాలని, బల్క్ ఎస్సెమ్మెస్‌లపై నిషేధం విధించినట్లు తెలిపారు. ఎలాంటి ఒపీనియన్ పోల్స్, సర్వేలు నిర్వహించకూడదన్న ఆదేశాలు ఇప్పటికే జారీ చేశామన్నారు. సోషల్ మీడియాలో కూడా ప్రచారం నిర్వహించరాదని తెలిపారు. ఓటర్లందరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో స్పందించేలా ఏర్పాట్లు చేశామని భన్వర్‌లాల్ వెల్లడించారు. ఓటర్లకు ఎలాంటి సమస్యలు ఎదురైనా 9223 166166 నంబర్ కు ఎస్ఎమ్మెస్ చేయాలని ఎన్నికల ప్రధానాధికారి సూచించారు. -
పోలింగ్‌కు అంతా రెడీ
-
నంద్యాల.. చరిత్రాత్మక ఎన్నిక: వైఎస్ జగన్
- నవరత్నాల వెలుగులకు నంద్యాలలో గెలుపే నాంది - మోసకారి చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పాలి - నంద్యాలను జిల్లా కేంద్రం చేస్తాం.. అభివృద్ధి బాధ్యత నాది - టీడీపీ వాళ్లు డబ్బుతో వస్తారు.. మీరు మాత్రం న్యాయాన్నే గెలిపించండి - నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడి వ్యాఖ్యలు సాక్షి, నంద్యాల: ‘ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయండి.. రాబోయే రోజుల్లో నవరత్నాల వెలుగులకు నంద్యాల నుంచే నాంది పలకండి’ అని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సోమవారం స్థానిక గాంధీచౌక్‌లో ఆయన మాట్లాడారు. నంద్యాల ప్రజలు తనపై చూపిస్తోన్న ప్రేమానురాగాలను చూసి చంద్రబాబు వెన్నులో భయంపుట్టిందని, అందుకే అడ్డదారుల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని గుర్తుచేశారు. నంద్యాల అభివృద్ధి బాధ్యతను తనపై మోపి నీతిని, ధర్మాన్ని గెలిపించాలని అభ్యర్థించారు. ‘‘మీరంతా నాకోసం వచ్చి ఎండలో నిల్చున్నారు. చిరునవ్వుతోనే ఆత్మీయతలను పంచిపెడుతున్నారు. మీ అందరి ప్రేమానురాగాలకు నేను కృతజ్ఞుడిని. ఇక్కడికొచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి అవ్వకు, ప్రతి తాతకు.. ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి.. చేతులో జోడించి, శిరస్సు వంచి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇవాళ నంద్యాలలో ఉప ఎన్నిక జరుగుతున్నాయి. దాదాపుగా ప్రతి గ్రామంలో తిరిగాం. ఈ 13 రోజులుగా మీరు పంచిన ఆత్మీయతను చూశా. నేనొక్కడినేకాదు.. రాష్ట్రం మొత్తం కూడా చూసింది. ఆ ఆత్మీయత.. చంద్రబాబు వెన్నెముకలో భయాన్నికూడా పుట్టించింది. అందుకే సీఎంతోపాటు క్యాబినెట్ మొత్తం ఇక్కడికి దిగింది. గడిచిన మూడున్నర సంవత్సరాల్లో చంద్రబాబును నంద్యాల రోడ్లపై ఎప్పుడైనా చూశారా? ఆయనంటారు.. జగన్‌కు పనిలేదు.. 15 రోజులుగా నంద్యాలలో తిరుగుతున్నాడు అని. నిజానికి తిరగాల్సింది నేను కాదు.. ఆయన తిరగాలి. సీఎం పదవిలో ఉన్నాయన ప్రజల కోసం తిరగాలి. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కాదు. చంద్రబాబు మనస్తత్వం ఏమంటే.. ఎన్నికలు వచ్చినప్పుడే ఆయనకు ప్రజలు గుర్తొస్తారు. 2014లో నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే చనిపోతే.. సానుభూతితో వైఎస్సార్సీపీ పోటీ పెట్టలేదు. ఆ తర్వాత చంద్రబాబు నందిగామ ముఖం చూశారా? అని గుర్తుచేస్తున్నా. ఇవాళ మూడున్నర సంవత్సరాల తర్వాత చంద్రబాబు పరిపాలకు తీర్పు ఇవ్వబోతున్నాం. తాను చేసిన మోసానికి వ్యతిరేకంగా మీరు ఓటు వేయబోతున్నారు. ఆయన చేసిన అవినీతికి, దుర్మార్గానికి వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నాం. రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత లేకపోతే ప్రజాస్వామ్యం దిగజారిపోతుంది. ఎన్నికలప్పుడు హామీలిచ్చి, తర్వాత మోసం చేస్తే వ్యవస్థకాదు.. ప్రజలు నాయకుల కాలర్ పట్టుకుని నిలదీసే రోజు రావాలి. అప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ఈ మూడేళ్లలో ఏం చేశాడు? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా... ఉప ఎన్నికలు వచ్చేదాకా ఒక్క రోజైనా ఆయన నంద్యాల నడిరోడ్డుపై కనిపించారా? పేదలకు ఇళ్లు, రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావలంటే బాబు రావాలని టీవీల్లో ప్రచారం చేశారు. మరి ఈ మూడున్నరేళ్లలో హామీని నిలబెట్టుకున్నారా? , డ్వాక్రా మహిళలకు హామీలు ఇచ్చారు..14 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తానని మాటిచ్చారు.. నిలబెట్టుకున్నాడా? ఆయన సీఎం అయిన తర్వాత రేషన్ సరుకుల్లో ఎన్నింటికి కత్తెర వేశారు? ఎన్నికలప్పుడు టీవీల్లో ఏమేం చెప్పించారు? జాబు రావాలంటే.. బాబు రావాలన్నారు.. జాబు రాకుంటే ప్రతి ఇంటికీ రూ.2 వేలు ఇస్తామన్నారు. ఆయన సీఎం అయి 38 నెలలలైంది. 1.70కోట్ల ఇళ్లున్నాయి. ప్రతి ఇంటికీ 78 లక్షలు బాకీ పడ్డాడా లేదా? వీటిలో కనీసం ఒక్క రూపాయానై ఇచ్చాడా? ప్రజలను మోసం చేశాడు. ఆయన సీఎం కావడం కోసం సమాజంలోని అన్ని వర్గాలనూ మోసం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన మోసాలకు అంతే ఉండదు నిజం చెప్పనివాడే చంద్రబాబు: జీవితంలో ఒక్క అబద్ధం చెప్పనివాడిని సత్యహరిశ్చంద్రుడు అంటాం. అదే, ఒక్క నిజం కూడా చెప్పనివాడిని నారా చంద్రబాబునాయుడు అంటాం. ముఖ్యమంత్రి హోదాలో మూడేళ్ల కిందట కర్నూలుకు వచ్చి చాలా చెప్పారు. సీఎం చెబితే చేస్తారని మనమంతా అనుకున్నాం. కర్నూలుకు ఎయిర్పోర్ట్, స్మార్ట్ సిటీ చేస్తామన్నారు. ఇప్పుడు నంద్యాలను స్మార్ట్ సిటీ చేస్తామంటున్నారు. ట్రిపుల్ఐటీ కాలేజీ కడతామన్నారు.. స్విమ్స్ తరహాలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి అన్నారు.. అవుకు దగ్గర పార్క్, మైనింగ్ స్కూలు, ఉర్దూ యూనివర్సిటీ, ఆపారెల్పార్కులు, కడతామన్నారు. కేసీ కెనాల్ గుండ్రేవుల ప్రాజెక్టు కడతామనిచ ఎప్పారు. వీటిలో కనీసం ఒక్కటైనా కట్టారా అని అడుగుతన్నా. ఇవాళ నంద్యాలలో ఉప ఎన్నిక వచ్చేసరికి.. మళ్లీ అరిగిపోయిన టేప్‌రికార్డర్ వేస్తున్నారు. మళ్లీ అవే మోసాలు, అవే అబద్ధాలు. అలాంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా ఇంటికి పంపించాలి. ఇలాంటి పార్టీని బంగాళాఖాతంలో కలపాలి. ఇది చరిత్రాత్మక ఎన్నిక: తాను ముఖ్యమంత్రిననే అహంకారం చంద్రబాబుకు ఉంది. ఏమైనా చెయ్యొచ్చు.. ఎవరైనా ఏమైనా అంటే పోలీసులను పంపిచ్చొచ్చని ఆయన భావన. ప్రశ్నించినవాళ్లని కళ్లు పెద్దవి చేసి ‘నువ్వు జగన్ మనిషివ’ని అంటాడు. నిలదీసినవాళ్లపై అపనిందలువేసి, పోలీస్ స్టేషన్లలో పెట్టిస్తారు. ఈ వ్యవస్థలో మార్పు రాకుంటే, చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి. లేకుంటే, ప్రతి ఇంటికీ మారుతీ కారు, కేజీ బంగారం ఇస్తామంటాడు. మూడున్నరేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలు వచ్చాయి. మోసం చేసివాళ్లకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. నంద్యాలలో వేసే ఓటు చరిత్రాత్మకమైనది. ఇక్కడి నుంచి మొదలయ్యే మార్పు శ్రీకాకుళం దాకా వెళుతుంది. చంద్రబాబుకు ఓటేయకపోతే నంద్యాల అభివృద్ధి ఆగిపోతుందని భయపెట్టిస్తున్నారు. కానీ మీకో మాటిస్తున్నా.. చంద్రబాబు మాదిరి డబ్బులేదు, పదవి లేదు, పోలీసులు లేరు, ఉన్నదిలేనట్లు, లేనిది ఉన్నట్లు చూపించలేను. నా దగ్గరున్న ఆస్తి.. దివంగత నేత ప్రయతమనాయకుడు రాజశేఖర్‌రెడ్డిగారు పోతూపోతూ ఇచ్చిన ప్రజలే నా కుటుంబం. ఆయన చేసిన మంచి, సంక్షేమ పథకాలు ఇవ్వాళ్టికీ బతికే ఉన్నాయి. అదే నాకున్న ఆస్తి. జగన్ మోసం చేయడు. జగన్ అబద్ధమాడడు. జగన్ ఏదైనా చెబితే మాట ఇస్తే కట్టుబడి ఉంటాడు. వాళ్ల నాన్న మాదిరే ప్రజలకు మంచిచేస్తాడు. జనానికి మేలు చేయాలనే నవరత్నాలను ప్రకటించాడు. వాళ్ల నాన్న లాగే మంచి చేస్తారని జనం నమ్ముతున్నారు. అదే నాకున్న పెద్ద ఆస్తి. దేవుడి దయ, మీ అందరి ఆశీర్వాదంతో అవి కలకాలం కొనసాగుతాయి. మనం గుడికిపోయినా, చర్చికిపోయినా, మసీదుకు పోయినా.. దేవుడికి దగ్గరికి కావాలని పోతాం. దేవుడు మనకేం చెబుతాడు? అన్యాం చేయొద్దు, అధర్మం చేయొద్దు అని చెబుతాడు. మూడేళ్లుగా జరుగుతోన్న అన్యాయానికి వ్యతిరేకించండి జరుగుతోన్న అన్యాయాన్ని ఇప్పుడు తిప్పుకొట్టే సమయం వచ్చింది. చంద్రబాబు నంద్యాలలో డబ్బులు పంపిణీ చేస్తున్నాడు.. అక్కడక్కడ 2వేలు, ఒక్కోచోట 5వేలు ఇస్తున్నారని తెలుసు. ఒక్కొక్కరి చేతిలో డబ్బులుపెట్టి దేవుడి బొమ్మ మీద ప్రమాణం చేయిస్తారు. ఏ దేవుడైనా పాపానికి ఓటేయమని చెప్పడని ఖచ్చితంగా చెబుతున్నా. అలా చెప్పేది దెయ్యాలు మాత్రమే. అలాంటప్పుడు దేవుణ్ని మనసులో తలచుకుని ధర్మం వైపే ఉండాలని అనుకోండి. లౌక్యంగా వ్యవహరించండి. ఓటు మాత్రం ధర్మానికే ఓటేయండి. న్యాయాన్ని గెలిపించండి. మీకు ఒకటే హామీ ఇస్తున్నా.. నంద్యాల అభివృద్ధిని నాకొదిలేయండి. పులివెందుల మీద ఎలా శ్రద్ధచూపిస్తానో, నంద్యాలపైనా అలానే చూపిస్తా. రాబోయే రోజుల్లో నంద్యాలను జిల్లా చేస్తాం. నవరత్నాలను ప్రకటించాం. అవి ప్రతి ఇంటికీ చేరితే ప్రతి కుటుంబంలో వెలుగులు కనిపిస్తాయి. అలా జరగాలంటే ఇప్పుడున్న వ్యవస్థ ఇంకా మారాలి. పథకాలు ప్రజల దగ్గరికి వెళ్లాలంటే 13 జిల్లాలను 25 జిల్లాలుగా మారుస్తామని చెబుతున్నా. నంద్యాల జిల్లా హెడ్‌క్వార్టర్ అయిన తర్వాత ఇక్కడే కలెక్టరేట్, మిగతా ఆఫీసులన్నీ వస్తాయి. అప్పుడు నంద్యాల ఎలా అభివృద్ధి చెందుతుందో నేను చెప్పాల్సిన పనిలేదు. చంద్రబాబు చేసేది అభివృద్ధే కాదు.. రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో బిల్డింగులు పగడొట్టడమే అభివృద్ధి అనుకుంటున్నారు. మూడున్నరేళ్లు పట్టించుకోకుండా ఉప ఎన్నికలు వచ్చిన తర్వాతే రోడ్డు విస్తరణ చేపట్టారు. షాపులు కోల్పోయినవారి కడుపుల గురించి ఆలోచించలేదు. మార్కెట్ రేటు ప్రకారం వాళ్లకు న్యాయం చేయాలి. కానీ గజానికి 1.10లక్షలు పలికే స్థలానికి ముష్టి రూ.18 వేలు ఇచ్చారు. ఇదా అభివృద్ధి? చంద్రబాబు కట్టించే ఇళ్లు తీసుకుంటే పేదలు అప్పులపాలు కావాల్సిందే. రూ.3 లక్షలు ఖర్చయ్యే ఇంటిని రూ.6లక్షలుపెట్టి కాంట్రాక్టర్లతో కట్టిస్తారట. వాటిలో లక్షన్నర కేంద్ర సబ్సిడీ, మరో లక్షన్నర రాష్ట్రం సబ్సిడీ. మరో మూడులక్షల అప్పును.. 20 ఏళ్లపాటు కట్టాలి. ఒక్క సంవత్సరం గట్టిగా దువా చెయ్యమని కోరుతున్నా. ఒక్క సంవత్సరం ఓపిక పడితే.. వచ్చేది మన ప్రభుత్వమే. ఏ పేదవాడూ అప్పుతీసుకుని ఇళ్లు కట్టుకోవల్సిన అవసరం లేదు. ఉచితంగా ఇల్లు కట్టి, రిజిస్ట్రేషన్ చేసిస్తామని మాటిస్తున్నా. ఈ బిల్డింగ్ వాళ్లందరికీ మార్కెట్ రేటు కట్టిస్తామని మాటిస్తున్నా. మార్కెట్లో చిరువ్యాపారులకు న్యాయం చేస్తాం. ఆటోనగర్‌లో వాళ్లకు భూములు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తాం. గుండ్రేవుల ప్రాజెక్టు జగన్ పూర్తిచేస్తాడని హామీ ఇస్తున్నా. నంద్యాలలో తిరుగుతున్నప్పుడు అగ్రిగోల్డ్, కేశవరెడ్డి బాధితులు నా దగ్గరికొచ్చారు. ఆ రెండు కుంభకోణాలతో చంద్రబాబుకు సంబంధం ఉంది కాబట్టి బాధితులకు న్యాయం జరగదు. మనం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో మీకు కోల్పోయినదంతా ఇచ్చేస్తాం. అడ్డుపడితే.. అవసరమైతే చంద్రబాబు చొక్కా ఇప్పిస్తాం. ఆదినారాయణరెడ్డి నిక్కర్ కూడా విప్పిస్తాం. మన గుర్తు ఫ్యాన్:మోసం చేసినవాళ్లకు ఓటు వేయమని సంకేతం పంపండి. మీ చల్లని దీవెనలు వైఎస్సార్‌కాంగ్రెస్ పట్ల, మోహన్అన్న పట్ల సంపూర్ణంగా , రేపు నవరత్రాలతో జీవితాలు బాగుపడేలా నంద్యాల నుంచే ఆశీర్వదించాలని పేరుపేరునా ప్రార్థిస్తాఉన్నాను. వెళ్లే ముందు ఒక్క విషయం చెప్పాలి.. పార్టీ గుర్తు గుర్తుంచుకోండి. ప్రజల్ని అయోమయానికి గురిచేయడానికి ఎస్.మోహన్‌రెడ్డి అనే పేరుతో 10 మందితో నామినేషన్ వేయించాయి. అందుకే గుర్తు గురించి మళ్లీ ఒకసారి చెబుతున్నా.. ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి’’ అని జగన్ అన్నారు. చదవండి: టీడీపీ బెదిరింపులకు భయపడొద్దు: శిల్పా స్మశానానికి ముగ్గు..చంద్రబాబుకు సిగ్గు ఉండదు: రోజా విమర్శ సీఎం ఆరోపణలు హాస్యాస్పదం: శిల్పా ఫ్యామిలీ -
నంద్యాల.. చరిత్రాత్మక ఎన్నిక: వైఎస్ జగన్
-
టీడీపీ బెదిరింపులకు భయపడొద్దు
-
టీడీపీ బెదిరింపులకు భయపడొద్దు: శిల్పా
నంద్యాల, సాక్షి: తెలుగుదేశం పార్టీ బెదిరింపులకు నంద్యాల వాసులు భయపడాల్సిన అవసరం లేదని వైఎస్సార్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆఖరి రోజు గాంధీ చౌక్ లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన రోడ్ షోలో శిల్పా మోహన్ రెడ్డి ప్రసంగించారు. చంద్రబాబు ఇళ్లు కట్టిస్తామన్న మాట పచ్చి అబద్ధమని ఈ సందర్భంగా శిల్పా తెలిపారు. భూమా నాగిరెడ్డి బతికున్న సమయంలో పదివేల ఇండ్లు ఫ్రీగా కట్టిస్తామని చెప్పారని, కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం డబ్బులు అడుగుతూ ఆ మాట నిలబెట్టుకోలేకపోయిందన్నారు. వైఎస్ జగన్ సీఎం కావటం ఖాయమని, ఆయన అధికారంలోకి రాగానే మూడు సెంట్ల స్థలం, ఉచిత ఇళ్లు మంజూరు చేస్తామని శిల్పా హామీ ఇచ్చారు. ఓట్లు వేయకపోతే రేషన్ కార్డులు తొలగిస్తామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని, ఒక్క రేషన్ కార్డు పోనివ్వకుండా చూసుకునే బాధ్యత తమదేనని ఆయన తెలిపారు. రౌడీయిజంను అదుపు చేసే చర్యల్లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు, వైఫై సదుపాయం ఇలాంటివన్నీ నెరవేర్చలేదని శిల్పా పేర్కొన్నారు. అభివృద్ధి అంటే బిల్డింగ్లు కూలగొట్టడం, రోడ్లువేయటం కాదని, పరిశ్రమలు, విద్యాలయాలు రావాల్సిన అవసరం ఉందని శిల్పా అభిప్రాయపడ్డారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పట్టణానికి తాగునీటి ఇబ్బంది లేకుండా చూసుకున్నానని, శిల్పా కేబుల్ పేరిట తక్కువ నగదుకే సదుపాయాన్ని కల్పించానని ఆయన పేర్కొన్నారు. మీకు ఆళ్లగడ్డ రాజకీయాలు కావాలో? నంద్యాల రాజకీయాలు కావాలో నిర్ణయించుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఓటేయాలని ప్రజలకు ఆయన విజ్నప్తి చేశారు. -
స్మశానానికి ముగ్గు..చంద్రబాబుకు సిగ్గు ఉండదు
- నంద్యాల ప్రచారంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్ - భూమాను దొంగ అన్నోళ్లు ఇవాళ దేవుడంటున్నారు - శిల్పా లోకల్.. ఎన్నికల తర్వాత టీడీపీ అభ్యర్థి కనపడరు - ఫ్యాన్ ఇంట్లో ఉంటుంది.. సైకిల్ బయట - వైఎస్సార్సీపీకి ఓటేసి టీడీపీకి దిమ్మతిరిగేలా బుద్ధి చెప్పండి నంద్యాల: ‘‘మేము నిర్మించిన రోడ్లపై నడుస్తూ మాకు ఓటేయరా? అని చంద్రబాబు అడుగుతున్నారు. మరి మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిగారు వేయించిన రోడ్లపై నువ్వు పాదయాత్ర ఎలా చేశావ్? ఆయన నుంచి ఎన్నో మేళ్లు పొందిన రైతులు, మహిళలు, విద్యార్థులను ఓట్లు ఎలా అడిగావ్?’’ అని ముఖ్యమంత్రిని నిలదీశారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. సోమవారం నంద్యాలలోని యాళ్లూరులో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఉప ఎన్నికలో చంద్రబాబుకు బుద్ధి చెప్పకుంటే.. వచ్చే రెండేళ్లలో టీడీపీ భరించలేని స్థాయిలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతుందని రోజా గుర్తుచేశారు. అసెంబ్లీ టైగర్, ఆంధ్రా ఫ్యూచర్ వైఎస్ జగన్మోహన్రెడ్డిని బలపరుస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. ‘‘మీరు ఓటు ఎవరికి వేశారో తెలిసిపోతుంది, ప్రభుత్వ పథకాలు తొలగిస్తామని టీడీపీ వాళ్లు ఓటర్లను బెదిరిస్తున్నారు. కానీ, మనం వేసే ఓటు ఎప్పటికీ సీక్రెట్‌గానే ఉంటుంది. ఎన్నికల సంఘం కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. కాబట్టి మీరు భయపడాల్సిన పనిలేదు. ధైర్యంగా.. మూడేళ్లుగా ప్రజలను మోసం చేస్తోన్న చంద్రబాబుకు దిమ్మతిరిగి బొమ్మ కనపడేలా ఓటు వేయండి. స్మశానానికి ముగ్గుండదు.. చంద్రబాబుకు సిగ్గుండదు. గతంలో భూమా నాగిరెడ్డిని దొంగ, విషవృక్షం అని తిట్టిపోసి.. ఇప్పుడు దేవుడని పొగుడుతున్నారు. మైనారిటీలు పక్కన కూర్చునేందుకు అర్హతలేదన్న విధంగా ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వని చంద్రబాబు.. పనికిరాని వాళ్లకు, దద్దమ్మ లోకేశ్‌కు మాత్రం ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారు. తీరా నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థిని నిలబెట్టిన తర్వాతగానీ ఫరూఖ్గారికి పదవి ఇవ్వలేదు. అంటే ఎన్నికలు రాకపోతే ఆ పదవి కూడా ఇవ్వకపోయేవారు. అదే, మహానేత వైఎస్సార్.. మైనారిటీలను కుటుంబసభ్యులుగా చూసుకున్నారు. నలుగురికి మంత్రి పదవులు, మండలి డిప్యూటీ చైర్మన్ పదవి, ముస్లిం విద్యార్థినులకు రీయింబర్స్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు జగనన్న.. నలుగురు మైనారిటీ ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు’’ అని రోజా గుర్తుచేశారు. ‘‘దళితులుగా పుట్టాలని కోరుకుంటారా? అని చంద్రబాబు అన్నాడు. దళితులకు చదువు రాదని, స్నానం చేయరిని ఆదినారాయణరెడ్డి అనే దద్దమ్మ అంటున్నాడు. అంబేద్కర్ మొదలు నేటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఇంకా ఎంతోమంది దళిత మేధావులు డాక్టర్లు, ఐఏఎస్‌లుగా పనిచేస్తున్నారు. దళితులను, మైనారిటీలను, రైతులను, మహిళలను, విద్యార్థులను మోసం చేసిన చంద్రబాబుకు బుద్ధి చెప్పాల్సిందే. అలా చెప్పాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాల్సిందే’’ అని రోజా అన్నారు. శిల్పా మోహన్‌రెడ్డి లోకల్: ‘‘నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి లోకల్. ఎవరికి ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి, పరిష్కరిస్తారు. అదే టీడీపీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి? ఎన్నికల తర్వాత ఆయన కనీసం కనిపించకుండాపోతారు. అఖిలప్రియకు, బ్రహ్మానందరెడ్డికి నంద్యాలలో కనీసం ఓట్లు కూడా లేవు. ఫ్యాన్ ఇంట్లో ఉంటుంది. సైకిల్ బయట ఉంటుంది. ఇంటిపార్టీ గుర్తు ఫ్యాన్ కు ఓటేసి జగనన్నను బలపర్చండి’’ అని రోజా అన్నారు. బోండా.. నీకు దమ్ముంటే..: విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనకు సవాల్ విసరడంపై ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. ‘బోడాగాడికి చంద్రబాబు పాలనపై అంత నమ్మకముంటే.. యెస్.. గుండు కొట్టించుకోవడానికి నేను రెడీ! బోండా నీకు దమ్ముంటే.. డబ్బులిచ్చి కొనుకున్న ఆ 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలి. బోడి గుండు ఎవరికి అవుతుందో తెలుస్తుంది’’ అని రోజా బదులిచ్చారు. ఇంట్లో చెల్లనివాళ్లు ఇక్కడ మాట్లాడటమా?: ‘‘నెల్లూరు జిల్లాకు చెందిన ఒకాయన.. ఐదు సార్లు ఎన్నికల్లో ఓడిపోయాడు. నాయనా.. నువ్వు ఇంట్లో కూర్చో అని ప్రజలు తీర్పు ఇచ్చారు. కానీ ఇవాళ మంత్రి పదవిలో ఉన్నాడు. ఇంట్లో చెల్లనివాళ్లు నంద్యాలకొచ్చి జగన్‌ను ఓడించాలని మాట్లాడుతుండటం విడ్డూరం. ఇక పుంగనూరు అమర్నాథ్రెడ్డికి మీసం, రాయలసీమ రోషం ఉంటే రాజీనామా చెయ్యాలి. నీతోపాటు ఫ్యాన్ గుర్తుపై గెలిచి, అసెంబ్లీలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతోన్న మిగతా ముగ్గురు మంత్రులూ రాజీనామా చేసి అప్పుడు మాట్లాడాలి’’ అని రోజా ఫైర్ అయ్యారు. -
నంద్యాల ఎన్నికపై హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ దుర్వినియోగానికి పాల్పడుతోందని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో సోమవారం రిట్ పిటిషన్ దాఖలైంది. కిరణ్‌బాబు అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి అధికార పార్టీ ప్రచారం నిర్వహిస్తోందని పిటిషనర్ ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ప్రలోభానికి గుర్తిచేస్తోందని తెలిపారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, అధికార టీడీపీ నాయకులపై ఇప్పటికే ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ పలుమార్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం నాయకుల ప్రలోభాల వ్యవహారం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్లింది. టీడీపీ నేతల అక్రమాలపై ఈసీ సీరియస్‌గా దృష్టి సారించింది. -
స్మశానానికి ముగ్గు చంద్రబాబుకు సిగ్గు..
-
వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి టీడీపీ నేత..
నంద్యాల: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. నంద్యాల ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా టీడీపీ నేత ముస్తాక్ సోమవారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా ముస్తాక్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ముస్తాక్... టీడీపీ ఎమ్మెల్సీ ఫరూఖ్ మేనల్లుడు, హరున్ మోటార్స్ అధినేత. పార్టీలో చేరిన అనంతరం ముస్తాక్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ సీపీ గెలుపుకు కృషి చేస్తామన్నారు. మరోవైపు రామకృష్ణారెడ్డి డిగ్రీ కాలేజీ అధినేత రామకృష్ణారెడ్డి...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. కాగా నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నెల 23న ఎన్నికలు, 28న ఫలితాలు వెలువడతాయి. -
‘ఉప ఎన్నికతో ముస్లిం సంక్షేమం గుర్తొచ్చిందా’
విజయవాడ: ఇన్నాళ్లు లేనిది ముస్లింలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు హటాత్తుగా ప్రేమ పుట్టుకొచ్చింది. అంత ప్రేమే ఉంటే తన మంత్రివర్గంలో ఒక్క ముస్లింకు కూడా ఎందుకు చోటు కల్పించలేదని ముస్లిం మైనార్టీ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ ముఖ్తార్ అలీ అహ్మద్ ప్రశ్నించారు. ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నంద్యాల ఎన్నికలతోనే ముస్లింల సంక్షేమం గుర్తుకు వచ్చిందా? ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మా ప్రార్థనా మందిరాలను తొలగించినప్పుడు గుర్తుకు రాలేదా? ముస్లింల మనోభావాలను గౌరవించకుండా ఇన్నాళ్లు ప్రభుత్వం వ్యవహరించింది. ఎన్నికలు వచ్చేసరికి వారికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టి మభ్యపెట్టడానికి యత్నిస్తున్నారు. ఈ కుట్రలన్నిటికీ ఓటు ద్వారానే మైనార్టీలు తమ తీర్పు వెల్లడిస్తారన్నారు. -
సీఎం ఆరోపణలు హాస్యాస్పదం: శిల్పా ఫ్యామిలీ
నంద్యాల : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణలను వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కుటుంబం తీవ్రంగా ఖండిచింది. ఓడిపోతామనే భయంతోనే దిగజారుడు రాజకీయం చేస్తున్నారని, తాము ఏ విచారణకైనా తమ కుటుంబం సిద్ధమని శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి, కోడలు నాగిని రెడ్డి, కుమార్తె శిల్పా తెలిపారు. నంద్యాలలో సోమవారం ఉదయం నిర్వహించిన ప్రెస్మీట్లో రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ...‘ మా కుటుంబంపై ముఖ్యమంత్రి ఆరోపణలు హాస్యాస్పదం. గతంలో శిల్పా సేవా సమితిని చంద్రబాబు, లోకేశ్ ఇద్దరు పొడిగారు. 2014 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు అర్థరాత్రి రెండు గంటల సమయంలో నాన్నను పిలిపించుకుని మాట్లాడారు. సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆయనను పార్టీలో చేరాలని చంద్రబాబే స్వయంగా ఆహ్వానించారు. గతంలో లోకేశ్ నంద్యాలలో పర్యటించినప్పుడు కూడా శిల్పా సహకార బ్యాంకు పనితీరును మెచ్చుకున్నారు. శిల్పా సేవా సమితి ద్వారానే మా నాన్నకు మంచి పేరు ఉంది. గతంలో నాన్న చేసిన మంచి పనులు ఇప్పుడు చెడుగా కనిపిస్తున్నాయా?. నాన్న ఇప్పటివరకూ ఏ ఒక్క కాంట్రాక్టర్‌ను బెదిరించలేదు. బెదిరించిన ఘటనలు మా కుటుంబ చరిత్రలోనే లేనే లేదు. మహిళల పట్ల నాన్నకు అపారం గౌరవం ఉంది. కూతురి పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారు. వాగ్దానాలన్నీ శిలా ఫలకాలకే పరిమితం అయ్యాయి. నంద్యాలను అభివృద్ధి చేస్తామని సీఎం అనడం విచారకరం’ అన్నారు. మా బ్యాంక్ గురించి మాట్లాడటం ఆశ్చర్యం... శిల్పా సహకార బ్యాంక్ ద్వారా వేలమంది మహిళలకు రుణాలు ఇచ్చామని శిల్పా చక్రపాణిరెడ్డి కోడలు నాగినిరెడ్డి తెలిపారు. వడ్డీలేని రుణాలు నుంచి అర్థరూపాయి వడ్డీ వరకూ రుణాలు ఇస్తున్నామన్నారు. ఇప్పటివరకూ ఏ మహిళను రుణం కట్టమని గట్టిగా అడిగింది లేదన్నారు. మహిళలకు మంచి గుర్తింపు ఇవ్వడానికే బ్యాంక్ పెట్టాం. బ్యాంకు గురించి చెడుగా ప్రచారం చేయడం మంచిది కాదు. బ్యాంకు నష్టాల్లో నడుస్తున్నా సంకల్ప బలంతో ముందుకు నడిపించుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. బ్యాంకు ద్వారా మహిళల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. స్వయం ఉపాధితో సొంత కాళ్లపై నిలబడేలా చేస్తున్నామన్నారు. ఇవన్నీ ఆగిపోవాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశం. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు. సీఎం తన స్థాయిని దిగజార్చుకుంటున్నారు. గడిచిన ఆరు నెలల సీసీ పుటేజ్‌ను ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఈ పుటేజ్‌ను పరిశీలించి కావాలంటే ప్రభుత్వం విచారణ చేసుకోవచ్చు. బ్యాంకును మూసేయాలంటూ రెండు నెలలుగా అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. విచారణ పేరుతో నన్ను, నా స్టాఫ్‌ను ఇబ్బంది పెడుతున్నారు. విచారణ పేరుతో గంటల కొద్దీ వేధిస్తున్నారు. ఏడేళ్లుగా ఎలాంటి మచ్చ లేకుండా బ్యాంకును నడుపుతున్నాం. కేవలం రాజకీయా ప్రయోజనాల కోసం మా కుటుంబంపై బురద జల్లుతున్నారు. సూపర్ మార్కెట్లో సరుకులు ఫ్రీగా ఇప్పిస్తున్నామని చెబుతుతున్నారు. దయచేసి ఆధారాలు లేకుండా మాట్లాడవద్దు అని నాగినిరెడ్డి అన్నారు. జవాబు చెప్పరు కానీ, మాపై నిందలా? వైఎస్ఆర్ సీపీ గుర్తుపై గెలిచిన 21మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా టీడీపీలో ఎలా కొనసాగుతారని శిల్పా మోహన్ రెడ్డి కుమార్తె శిల్పారెడ్డి సూటిగా ప్రశ్నించారు. ‘దీనిపై జవాబు చెప్పరు. మాపై నిందలు మాత్రం వేస్తారు. నాన్నగారు నంద్యాలకు ఉచిత మినరల్ వాటర్ ఇస్తున్నారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. రెండు రోజలు తర్వాత మంత్రులు ఎవరూ ఇక్కడ కనిపించరు. నాన్న అనుభవం ఉన్న వ్యక్తి, మంచి వ్యక్తికి అవకాశం ఇవ్వండి. నంద్యాల ప్రజల పెన్షన్లు, రేషన్ కార్డులు ఎక్కడికీ పోవు.’ అని తెలిపారు. -
‘చంద్రబాబు ఫ్రస్టేషన్ పీక్ స్టేజికి చేరింది’
►ఓటమి భయంతోనే శిల్పా మోహన్ రెడ్డిపై ఆరోపణలు ►నిన్నటివరకూ శిల్పా మోహన్ రెడ్డి మంచోడు.. ►చంద్రబాబు నైజం ఎలాంటిదో ఎన్టీఆరే చెప్పారు నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్రస్టేషన్ పీక్ స్టేజికి చేరిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. అందుకే ఓటమి భయంతో శిల్పా మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె సోమవారమిక్కడ మాట్లాడుతూ...‘ నిన్నటివరకూ శిల్పా మోహన్ రెడ్డి మంచోడు. టీడీపీ నుంచి వైఎస్ఆర్ సీపీలో చేరగానే విమర్శలు. గతంలో భూమా నాగిరెడ్డిని విషవృక్షం అన్న చంద్రబాబు ఇప్పుడు అదే భూమాను పొగుడుతున్నారు. మామను వెన్నుపోటు పొడిచినప్పుడు ఎన్టీఆర్‌ను ఇలానే విమర్శించారు. మైనార్టీల అభివృద్ధి గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం. మైనార్టీలకు వైఎస్ రాజశేఖరరెడ్డి మూడు మంత్రి పదవులు ఇచ్చారు. చంద్రబాబు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లను అందించిన ఘటన వైఎస్ఆర్దే. ఫీజు రీయింబర్స్మెంట్ అందించిన ఏకైక సీఎం వైఎస్ఆర్. సాయం చేసిన వైఎస్ఆర్ను మైనార్టీలు ఎప్పటికీ మరిచిపోరు. చంద్రబాబుకు దమ్ముంటే పార్టీ ఫిరాయించిన 21మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలి. తన అవినీతి పాలనకు ఓట్లు రావు కాబట్టే..నంద్యాలలో రూ.కోట్లు పంపిణి చేసి కొనాలనుకుంటున్నారు’ అని ధ్వజమెత్తారు. -
13వ రోజు నంద్యాలలో జగన్ పర్యటన సాగేదిలా
-
అసెంబ్లీ హామీల్లో అమలైనవెన్ని?
ఎన్నికల ముందు చంద్రబాబు ఎన్నో హామీలిచ్చారు. ప్రజలు నమ్మి ఓటేశారు. మూడున్నరేళ్లయింది. నంద్యాలలో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు మరలా అనేక హామీల వర్షం కురిపిస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలన్నీ మూడేళ్లలోనే అమలు చేసేశామని కూడా చెబుతున్నారు. అసలు చంద్రబాబు మేనిఫెస్టోలో ఏం చెప్పారు? రాజధానిని ప్రకటిస్తూ అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో ఏం చెప్పారు? ఆ హామీల పరిస్థితి ఏమిటి? అన్న దానిపై రాష్ట్రంలో విస్తృత చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో జిల్లాలకు సంబంధించి ఇచ్చిన హామీలలో ముఖ్యమైనవాటి పరిస్థితి చూద్దాం.. – సాక్షి, అమరావతి సిక్కోలుకు ఒట్టిచేయి... సిక్కోలు (శ్రీకాకుళం) స్మార్ట్ సిటీగా అభివృద్ధి, జిల్లాలో నూతన పారిశ్రామిక నగరం ఏర్పాటు, భావనపాడు, కళింగపట్నంలో పోర్టుల నిర్మాణం కల్లలుగానే మిగిలిపోయాయి. జిల్లాలో ఎయిర్‌పోర్టు, ఫుడ్‌పార్కు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్, ఆర్కిటెక్చర్ ఏర్పాటు జాడే లేదు. వంశధార, నాగావళి నదులపై నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తి.. ఒట్టి హామీగానే మిగిలిపోయింది. తేలినీలాపురం పక్షుల సంరక్షణ, బౌద్ధ కట్టడాలు, శ్రీకూర్మం, అరసవెల్లి దేవాలయాలను, బారువ బీచ్‌ను కలుపుతూ పర్యటక కేంద్రాలుగా అభివృద్ధి పట్టించుకున్న పాపాన పోలేదు. విజయనగరం ‘స్మార్ట్’ కలే.. జిల్లా కేంద్రమైన విజయనగరం పట్టణాన్ని స్మార్ట్ సిటీగా మార్చుతామన్న బాబు మాట నిలబెట్టుకోలేదు. వైద్య కళాశాల ఏర్పాటు మూడేళ్లుగా కలగానే మిగిలింది. పారిశ్రామిక నగరం నిర్మాణం హామీ అమలు ఊసే లేదు. ఫుడ్‌పార్కు జాడ లేదు. గిరిజన యూనివర్సిటీ, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పార్కు, సంగీత లలిత కళల అకాడమీ, గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు తదితర బాసలన్నీ గాలికి వదిలేశారని జిల్లా వాసులు అంటున్నారు. విశాఖ మెగా సిటీ ఏదీ? విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు, విశాఖపట్నం మెగా సిటీగా అభివృద్ధి అన్న బాబు హామీలు బాసలుగానే మిగిలాయి. వీసీఐసీ పారిశ్రామిక వాడ ఏర్పాటు, మెట్రోరైలు ప్రాజెక్టు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, మెగా ఐటీ హబ్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కేంద్రం, ఫుడ్ పార్కు, ఎగ్జిబిషన్, కన్వెన్షన్ సెంటర్, గంగవరం ఎల్. ఎన్.జి. టెర్మినల్.. ఊసే లేదు. విమానాశ్రయానికి కూడా అంతర్జాతీయ స్థాయి హోదా ఇంకా రాలేదు. ‘తూర్పు’నకు ఒట్టి మాటలే.. కాకినాడ, రాజమండ్రి నగరాలు స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి. పెట్రోలియం యూనివర్సిటీ, పెట్రోలియం కారిడార్, కాకినాడ ఎల్ఎన్జీ టెర్మినల్, తునిలో నౌకా నిర్మాణ కేంద్రం, పోర్టు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ పార్కు, వీసీఐసీ కారిడార్‌లో కాకినాడ, తెలుగు విశ్వవిద్యాలయం, కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమ, ఫుడ్ పార్కు, భూ ఉపరితల జలమార్గాలు, ఆక్వా కల్చర్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు.. మాటలుగానే మిగిలాయి. జిల్లాకు సీఎం ఇచ్చిన హామీల్లో ఒక్కటంటే ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. పశ్చిమ బాసలు గోదాట్లోనే... పశ్చిమ గోదావరి జిల్లాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, క్రాఫ్ట్, నర్సాపూర్‌లో పోర్టు, తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్టు, సిరామిక్, ఆయిల్‌పామ్ పరిశ్రమలు, కొల్లేరు సరస్సు పర్యాటక ప్రాంతం, జలమార్గాల అభివృద్ధి, చింతలపూడిలో బొగ్గు వెలికితీత, కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమలు, మెట్ట ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్, ఆక్వాకల్చర్ ప్రాసెసింగ్ యూనిట్, ఉద్యానవన పరిశోధన కేంద్రం ఏర్పాటు హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు కమీషన్ల బారిన పడి నిర్మాణం నత్తనడకన సాగుతోంది. హామీలు కృష్ణార్పణం కృష్ణా జిల్లాలో మచిలీపట్నం పోర్టు, ఆయిల్ రిఫైనరీ, క్రాకరీ యూనిట్, వీజీటీఎం మెట్రోరైలు, ఆటోమొబైల్ , లాజిస్టిక్‌హబ్, ఫుడ్‌పార్కు, మెగాసిటీ, స్మార్ట్ సిటీ, ఆక్వా కల్చర్ ప్రాసెసింగ్ యూనిట్, టెక్స్టైల్ పార్కు, భవానీ దీవుల టూరిజం సర్క్యూట్, అవనిగడ్డలో మిస్సైల్ పార్కు, ఐటీ హబ్, కూచిపూడి అకాడెమీ, నూజివీడులో మామిడి పరిశోధన కేంద్రం ఏర్పాటు, గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయంగా విస్తరణ హామీలు నీటి మూటలుగానే మిగిలాయి. గుంటూరులో జాడలేని ఎయిమ్స్ గుంటూరు జిల్లాలో టెక్స్‌టైల్‌పార్కు, ఫుడ్ పార్కు, నాగార్జున కొండ అమరావతి టూరిజం సర్క్యూట్, నాగార్జున సాగర్ థీమ్ పార్కు, సౌర విద్యుత్కేంద్రం మాటలకే పరిమితమయ్యాయి. వీజీటీఎం మెట్రోరైలు, ఎయిమ్స్, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ, స్మార్ట్ సిటీ, ఫుడ్ పార్కు, నాగార్జున సాగర్ ఎయిర్ పోర్టు ఉత్తిమాటలుగా మారాయి. కర్నూలులో కర్మాగారాలెక్కడ? కర్నూలు జిల్లాకు బాబు ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి. స్మార్ట్ సిటీగా కర్నూలు, కొత్త విమానాశ్రయం ఏర్పాటు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, అవుకులో పారిశ్రామికవాడ, హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో కర్నూలు, టెక్స్టైల్ క్లస్టర్, కోయిలకుంట్లలో సిమెంటు ఉత్పత్తుల హబ్, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, పర్యాటకాభివృద్ధి, విత్తనోత్పత్తి కేంద్రం, రైల్వే వ్యాగన్ల మరమ్మతుల కర్మాగారం, మైనింగ్ స్కూలు, ఫుడ్ పార్కు, స్విమ్స్ తరహాలో కర్నూలులో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి... అన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. సీఎం సొంత జిల్లాకూ మొండిచేయి సీఎం సొంత జిల్లా చిత్తూరు జిల్లాకు ఇచ్చిన హామీలు కూడా ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. కుప్పం ఎయిర్‌పోర్టు, అపోలో హెల్త్ సెంటర్, హార్టికల్చర్ జోన్, తిరుపతి మెగా సిటీగా అభివృద్ధి. ఫుడ్ పార్కు, మెట్రో రైలు, శ్రీకాళహస్తి , తిరుపతి, కాణిపాకం, ఆధ్యాత్మిక, పర్యాటక సర్క్యూట్ ఏదీ అమలు కాలేదు. కల్లలుగా నెల్లూరు హామీలు నెల్లూరు జిల్లాకు చేసిన బాసలు కలగానే మిగిలాయి. విశాఖపట్నం చెన్నై, బెంగళూరు చెన్నై పారిశ్రామిక వాడల ఏర్పాటు, ఆటోమొబైల్ హబ్, ఎయిర్‌పోర్టు, దుగరాజపట్నం పోర్టు, పులికాట్ సరస్సు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి, స్మార్ట్ సిటీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, మెరైన్ ఇన్స్టిట్యూట్, ఎరువుల కర్మాగారం హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. వైఎస్సార్ జిల్లాకు ఉత్తిచేయి.. వైఎస్సార్ జిల్లాలో స్టీల్‌ప్లాంటు ఏర్పాటు హామీ నీటి మూటగా మిగిలింది. స్టీల్‌ప్లాంటు ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ కేంద్ర ప్రభుత్వంపై కనీస ఒత్తిడి తేవడంలేదు. సిమెంటు పరిశ్రమలు, ఖనిజాధార పరిశ్రమలు, పారిశామ్రిక స్మార్ట్ సిటీ, ఫుడ్ పార్కు, ఉర్దూ యూనివర్సిటీ, గార్మెంట్ క్లస్టర్. రేణిగుంట రాజంపేట కడప మధ్య నాలుగులేన్ల రహదారుల నిర్మాణం హామీలేవీ అమలు కాలేదు. ‘అనంత’ హామీలు కాగితాల్లోనే.. దేశంలోనే అత్యంత కరువు ప్రాంతంగా అల్లాడుతున్న అనంతపురం జిల్లాకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. జిల్లాలో ఉద్యాన యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్ అనుబంధ కేంద్రం, నూతన పారిశ్రామిక నగరం, స్మార్ట్ సిటీ, బెంగుళూరు చెన్నై కారిడార్లోకి హిందూపురం. టెక్స్టైల్ పార్కు, ఫుడ్ పార్కు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ క్లస్టర్, సౌర, పవన విద్యుదుత్పత్తి. పెనుగొండలో ఇస్కాన్ ప్రాజెక్టు, పుట్టపర్తి ఆధ్యాత్మిక నగరం, పుట్టపర్తిలో విమానాల నిర్వహణ, మరమ్మతుల కేంద్రం, కుద్రేముఖ్ ఇనుప ఖనిజ ఆధారిత ప్రాజెక్టు, హంద్రీ నీవా ప్రాజెక్టు పూర్తి. వంద శాతం డ్రిప్, తుంపరసేద్యం హామీలు నీటిమూటలుగానే మిగిలాయి. ప్రకాశంలో పారిశ్రామిక నగరం ఏది? ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. దొనకొండ పారిశ్రామిక నగరం, మైన్స్ యూనివర్సిటీ, మినరల్ సైన్సెస్, ఒంగోలు ఎయిర్‌పోర్టు, కనిగిరిలో జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తి జోన్, రామాయపట్నం పోర్టు, ఫుడ్ పార్కు, వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ఏడాదిలో పూర్తి. స్మార్ట్ సిటీ, ఆక్వా కల్చర్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు అన్నీ నీటి మూటలుగానే మిగిలిపోయాయి. -
సొంతింటి కల నెరవేరుస్తా..
► పేదలకు ఇళ్లు కట్టించి రిజిష్టర్ పత్రాలు అందిస్తా ► మోసపూరిత సీఎంను సాగనంపండి ►12వ రోజు రోడ్‌షోలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపు ► జననేతను చూసేందుకు జోరువానలోనూ పోటెత్తిన ప్రజలు సాక్షి బృందం, నంద్యాల : ‘నంద్యాల వైఎస్ఆర్ నగర్ వాసులు ఇళ్లు లేవని ఆందోళన చెందొద్దు. అండగా నేనున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పేదవాడికీ ఇళ్లు కట్టించి రిజిష్టర్ పత్రాలు అందిస్తాం’ అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. తన తండ్రి వైఎస్ఆర్.. ఈ కాలనీకి 4,500 ఇళ్లు మంజూరు చేశారని, ఇంకా రెండు వేల ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పనులు చేయిస్తామని హామీ ఇచ్చారు. తమ కాలనీని ఖాళీ చేయాలని ప్రభుత్వం హుకుం జారీ చేసిందని ఎస్సార్బీసీ కాలనీకి చెందిన నరసింహారావు .. జగన్మోహన్రెడ్డి దృష్టికి తేగా.. కాలనీ ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 12వ రోజు రోడ్‌షో వర్షంలోనూ కొనసాగింది. జోరుగా వర్షం కురుస్తున్నా.. తడిసి ముద్దయినా యధావిధిగా ›ప్రచారం కొనసాగింది. ఆదివారం రోడ్‌షో ప్రారంభమైన సంఘమిత్ర నుంచే వర్షం ప్రారంభమైంది. వర్షాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా జగన్మోహన్రెడ్డి ప్రచారం కొనసాగించారు. ఈ సమయంలో జగనన్నను కలిసిన ముంతాజ్ అనే అరవైఏళ్ల వృద్ధురాలు ‘జగన్ వచ్చాక వర్షం కురవకుండా ఉంటుందా నాయనా’ అంటూ వానలో నిలిచి పొంగిపోయింది. సుప్రజ అనే విద్యార్థిని వర్షంలోనే తడుస్తూ జగన్‌కు రాఖీ కట్టి సంబరపడింది. ప్రియాంకనగర్ నుంచి సూరజ్ గ్రాండ్ చేరుకునే సరికి వర్షం మరింత అధికమైంది. దీంతో అక్కడి ప్రజలు ‘జగన్ వచ్చాడు.. వానొచ్చిందం’టూ కేరింతలు కొట్టారు. అక్కడి నుంచి రోడ్ షో డేనియల్పురం, సంజీవనగర్, రాణి, మహారాణి టాకీస్ మీదుగా నందమూరి నగర్‌కు చేరుకుంది. జగన్ ఓ వైపు తడుస్తూనే రోడ్‌షో కొనసాగించడంతో మహిళలు, వృద్ధులు, యువకులు అన్న తేడా లేకుండా పెద్ద ఎత్తున ప్రజలు తడుస్తూనే తమ అభిమాన నేతను చూసేందుకు పోటీ పడ్డారు. వర్షంలోనే మహిళలు జగనన్నా అంటూ రాఖీలు కట్టేందుకు పోటీపడ్డారు. యువకులు బాణా సంచా కాలుస్తూ కేరింతలు కొట్టారు. నందమూరి నగర్‌లోని ప్రజలందరూ ‘చంద్రబాబు నంద్యాల వదిలాడు.. జగన్ మన ప్రాంతానికి వచ్చాడు... వర్షం కురిసిందం’టూ నినాదాలు చేశారు. అండగా ఉంటామంటూ భరోసా.. ప్రియాంక నగర్ రోడ్‌షో నుంచి ముందుకు సాగిన జననేత.. 35వ వార్డు కౌన్సిల్ సభ్యురాలు జిమ్మక్ మహబూబ్‌బీ బేగం ఇంటికి వెళ్లి ఆమె భర్త, మాజీ కౌన్సిలర్ మహబూబ్ బాషాను కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహబూబ్‌బాషా మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయ్యాక నంద్యాలకు వచ్చిన సమయంలో తన ఇంటికి వచ్చారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు జగనన్న రావడం సంతోషదాయకమన్నారు. అప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏం కావాలో కోరుకోమనగా కుందూనది, శ్యామకాలువ, మద్దిలేరు వాగు పొంగిపొర్లి ఇళ్లలోకి నీరు వస్తోందని తెలపడంతో శాశ్వత పనులు చేపడతామని హామీ ఇచ్చారన్నారు. సీఎం అయిన వెంటనే ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి కృషి చేయాలని జగన్‌ను కోరారు. తనకు మెదడు ఆపరేషన్ జరిగిందని తెలుసుకుని ఇంటికి వచ్చి పరామర్శించడం ఆనందంగా ఉందన్నారు. కార్పెంటర్ దాదావలి ఇంటిలోకి వెళ్లి ఆపరేషన్ చేయించుకున్న దాదావలిని జగన్ పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వైఎస్ఆర్నగర్లో నూర్జహాన్ ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత అదే నగర్లో ఆల్జామియతుల్ అరబియా అయిషా నిస్వాన్ సంస్థలోకి జగన్‌ను ముస్లింలు ఆహ్వానించడంతో అక్కడికి చేరుకుని వారితో కలిసి దువా చేశారు. డేనియల్ పురంలో సీఎస్ఐ క్రైస్ట్ చర్చిలో పాస్టర్ ప్రసాదరావు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పదకొండు గంటలపాటు సాగిన రోడ్‌షోలో పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత పాల్గొన్నారు. అడుగడుగునా బ్రహ్మరథం... జననేత జగన్‌కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సంఘమిత్ర కాలనీలో సుధాకర్‌రెడ్డి, పూర్ణమ్మ దంపతులు జగన్‌కు హారతులిచ్చి పూలమాల వేసి స్వాగతం పలికారు. చెన్నారెడ్డి, పద్మావతి దంపతులు తమ ఇంటి ముందు జగన్‌కు గుమ్మడికాయతో దిష్టితీశారు. వసుంధర, రుక్జాన, అన్వర్, అభిష్ అశ్విత్, కుమారి, యామిని, సుజాత, వైఎస్ఆర్ నగర్లో వాసంతి, రామేశ్వరమ్మ ఇలా పలువురు మహిళలు జగన్‌కు గజమాలలు వేసి హారతులు ఇచ్చి వీరతిలకం దిద్ది రాఖీ కట్టారు. ఇలా అన్ని కాలనీల్లో పెద్ద ఎత్తున మహిళలు, యువకులు జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. గంటల తరబడి ప్రజలు ఎదురుచూసి జననేతపై అభిమానం చాటుకున్నారు. భయపడకుండా వైఎస్ఆర్సీపీకి ఓటు వేయండి: శిల్పా నంద్యాల ఓటర్లు భయపడకుండా వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి గెలిపించాలని పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి కోరారు. నందమూరి నగర్, వైఎస్ఆర్నగర్లో జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ ఏ కాలనీలోని ప్రజల ఇళ్ల పట్టాలు రద్దు కావని, రేషన్‌కార్డులు, పింఛన్లు తొలగించరని తెలిపారు. ఈ విషయంలో టీడీపీ నాయకుల బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, అండగా ఉంటామన్నారు. 2004లో ఈ కాలనీలకు రహదారులు, మంచినీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం లేదని, మూడు బోర్లు వేసి నీరందించానని అప్పటి నుంచి ఈ కాలనీ అభివృద్ధికి కృషి చేశానని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చలువతో ఈ రెండు కాలనీలను మున్సిపాల్టీలో కలిపారని పేర్కొన్నారు. ధర్మంవైపు నిలిచి ఓటు వేయాలని ప్రజలను కోరారు. మోసపూరిత చంద్రబాబును ఇంటికి సాగనంపుదాం.. మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మభ్యపెడుతున్న చంద్రబాబును ఇంటికి సాగనంపాలని నందమూరినగర్, వైఎస్ఆర్ నగర్లో నిర్వహించిన రోడ్‌షోలో ప్రతిపక్ష నేత జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిత్యావసర దుకాణాల్లో 9 రకాల సరుకులు అందేవని, నేడు బియ్యం తప్ప ఏమీ అందడం లేదన్నారు. ప్రజలు రెండు కారణాల వల్ల పేదలవుతారన్నారు. ఉన్నత చదువులు చదువుకునే సమయంలో ఫీజులు కట్టలేక చదువు మధ్యలో ఆగిపోతుందని, ప్రతి పేదవాడు అస్వస్థతకు గురైతే ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోవాలంటే అప్పులు చేయాల్సి ఉందని గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసి డాక్టర్, లాయర్, ఇంజినీర్, ఇలా ఏ ఉన్నత చదువు చదువుకోవాలన్నా ఉచిత విద్యనందించారన్నారు. కేన్సర్, కిడ్నీ, గుండె వంటి ప్రాణాంతక వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం అందించి చిరునవ్వుతో వారిని ఇంటికి పంపించారన్నారు. నేడు అధికారంలో ఉన్న చంద్రబాబు ఈ పథకాలకు చరమగీతం పాడారని, ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. -
ప్రచారానికి నేటితో తెర
► సాయంత్రం 6 గంటల తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ జిల్లా వీడాలి ► వీవీ ప్యాట్‌తో రహస్య ఓటింగ్‌కు భంగం వాటిల్లదు ► ఓటర్లయిన వారు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా సెలవు వర్తింపు ► ఏఎస్డీ లిస్ట్‌లో ఉన్న ఓటర్లు ఏదో ఒక గుర్తింపు కార్డు చూపి ఓటు వేయొచ్చు ► విలేకర్ల సమావేశంలో కలెక్టర్ సత్యనారాయణ వెల్లడి కర్నూలు (అగ్రికల్చర్): నంద్యాల ఉప ఎన్నిక ప్రచారం సోమవారం సాయంత్రానికి ముగుస్తుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.సత్యనారాయణ తెలిపారు. 21వ తేదీ 6 గంటల తర్వాత రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రచారాలు నిర్వహించరాదని చెప్పారు. ఆదివారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్లతో సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ... ఎన్నికల ప్రచారం సమయం ముగిసిన తర్వాత మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర స్థానికేతరులు జిల్లాను వదలి వెళ్లాలని ఆదేశించారు. ప్రచారం గడువు ముగిసిన తర్వాత అన్ని లాడ్జిలు, హోటళ్లు తనిఖీ చేసి స్థానికేతరులను బయటికి పంపే విధంగా పోలీసులకు ఆదేశాలు ఇచ్చామని స్పష్టం చేశారు. పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. నంద్యాల నియోజకవర్గంలో ఓటర్లయిన వారు జిల్లాలో ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా 23న వారికి వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఏఎస్డీ లిస్ట్‌లో 24,748 మంది ఓటర్లు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,18,858 మంది ఉండగా 1,94,110 మందికి ఓటరు స్లిప్‌లను పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగిలిన 24,748 మంది ఓటర్లను ఏఎస్డీ లిస్ట్ (ఆబ్సెంట్, షిఫ్ట్టెడ్, డెత్)లో పెట్టామని, ఇందులో డబుల్ ఓటర్లు ఉంటారని, వీరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎన్నికల కమిషన్ సూచించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపాల్సి ఉంటుందని వివరించారు. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు పాసుపుస్తకం, పాస్‌పోర్టు, ఎన్ఆర్ఇజీఎస్ జాబ్ కార్డు, ఫొటో కలిగిన పెన్షన్ డాక్యుమెంట్, ఉద్యోగులయితే సంబంధిత అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డు, విద్యార్థులయితే విద్యాసంస్థ ఇచ్చిన గుర్తింపు కార్డు తదితర వాటిల్లో ఏదో ఒకటి చూపి ఓటు వేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం కోరితే నివేదిక పంపుతాం ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా రాజకీయ పార్టీలు నంద్యాలలో కులాలు, మతాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ఓట్లు అడుగుతున్నారని దీనిపై చర్యలు తీసుకుంటున్నారా అంటూ ఒక విలేకరి ప్రశ్నించగా కలెక్టర్ స్పందించారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల్లో కులం, మతం పేరుతో ఓట్లు అడగరాదని, దీనిపై ఎన్నికల కమిషన్ నివేదిక అడిగితే పంపుతామని స్పష్టం చేశారు. ఓటు ఎవరికి పడిందో తెలుసుకునే అవకాశం ఓటరుకు మాత్రమే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు మొదటి సారిగా వీవీపీఏటీను అనుసంధానం చేస్తున్నామన్నారు. ఓటర్లు బ్యాలెట్ యూనిట్‌పై గుర్తు నొక్కిన వెంటనే ఏ గుర్తుకు ఓటు వేశారో ఆ గుర్తుకు పడిందా లేదా అని వెంటనే బ్యాలెట్ యూనిట్‌కు పక్కనే ఉన్న స్క్రీన్‌పై ఏడు సెకండ్ల పాటు చూసుకోవచ్చన్నారు. ఓటర్లు ఓటు ఎవరికి వేశారనేది ఓటరుకు తప్ప ఇతరులకు ఎంత మాత్రం తెలిసే అవకాశం లేదని వివరించారు. ఇటీవల వరకు జరిగిన ఎన్నికల్లో ఒక గుర్తుకు ఓటు వేస్తే మరో గుర్తుకు ఓటు పడుతుందనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ ఏర్పాటు చేసిందన్నారు. వీవీప్యాట్‌తో రహస్య ఓటింగ్‌కు ఎటువంటి భంగం వాటిల్లదని స్పష్టం చేశారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్పేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేయాలన్నారు. -
బరితెగించిన టీడీపీ
నంద్యాలలో ఓటర్లకు డబ్బు పంచుతూ అడ్డంగా దొరికిన ఆ పార్టీ సర్పంచ్ నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ నేతలు బరితెగించారు. ఓటర్లకు డబ్బులు పంచుతూ ఆదివారం రాత్రి అడ్డంగా దొరికిపోయారు. నంద్యాల మండలం రైతునగరం గ్రామ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ నేత లక్ష్మీకొండారెడ్డి స్థానిక క్రాంతినగర్‌లో ఓటుకు రూ. 5 వేలు పంచుతున్నట్లు ‘సాక్షి’కి సమాచారం అందింది. అక్కడికి వెళ్లి చూడగా ఓటర్లకు ఆయన డబ్బులు పంచుతూ కనిపించారు. రైతునగరం పంచాయతీలో 3 వేల మందికి సర్పంచ్ ఆధ్వర్యంలో ఓటుకు రూ. 5 వేలు చొప్పున పంపిణీ చేసినట్లు సమాచారం. ఇక్కడే కాకుండా నంద్యాల, గోస్పాడు మండలాల్లోని గ్రామాలతో పాటు నంద్యాల పట్టణంలోని 42 వార్డుల్లో కూడా టీడీపీ నాయకులు ఓటుకు రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు బహిరంగంగా డబ్బులు పంపిణీ చేస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
టీడీపీ నేతలకు ఈసీ వార్నింగ్!
- అక్రమాలకు పాల్పడితే ఎంతటివారిపైనైనా చర్యలు తప్పవు - టీడీపీ ఎంపీలకు స్పష్టం చేసిన భన్వర్‌లాల్ సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. ఎన్నికల సంఘంపైనే ఆరోపణలకు దిగిన అధికారపక్షానికి ఈసీ వద్ద గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే ఏస్థాయి వారిపైనైనా కఠిన చర్యలు తప్పవని టీడీపీ నేతలకు ఈసీ వార్నింగ్ ఇచ్చింది. ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని, అనవసరంగా తమపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికింది. సర్వేలు, ఒపీనియన్ పోల్స్‌పై నిషేధం ఎత్తివేయాలన్న టీడీపీ డిమాండ్‌ను తోసిపుచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని నాని ఆదివారం ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను కలిశారు. వైఎస్సార్ సీపీ నిబంధనలను అతిక్రమిస్తోందని, ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలని కోరారు. డబ్బులు తరలిస్తున్నారంటూ వైఎస్సార్ సీపీ చేసిన ఫిర్యాదుపై గంటలోనే స్పందించారని, అందులో నిజం లేదని తేలినా ఆపార్టీపై చర్యలు తీసుకోలేదని, ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. ఈ వ్యాఖ్యలపై భన్వర్‌లాల్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల సంఘం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఏ ఆధారంతో ఆరోపిస్తున్నారని టీడీపీ ఎంపీలను భన్వర్‌లాల్ నిలదీసినట్టు తెలిసింది. సర్వేలపై దర్యాప్తునకు ఆదేశం: నంద్యాల ఉప ఎన్నికల్లో సర్వేలు, ఒపీనియన్ పోల్స్‌పై నిషేధం కొనసాగుతుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందే ఎవరికి ఓటు వేస్తారని ఓటర్లను అడగడం చట్టవిరుద్ధమని ఈసీ చెప్పినట్లు తెలిసింది. సర్వే పేరుతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, భయపెట్టడం లాంటి చర్యలకు దిగుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందటంతోనే సర్వేలు, ఒపీనియన్ పోల్స్ నిషేధించామని టీడీపీ నేతలకు భన్వర్‌లాల్ వివరించారు. ఇప్పటివరకూ జరిగిన ఇలాంటి వాటిపై దర్యాప్తునకు ఆదేశించినట్టు ఆయన స్పష్టం చేశారు. నంద్యాల ఉప ఎన్నిక జరిగే ఈ నెల 23వ తేదీ సాయంత్రం వరకూ ఎలాంటి సర్వేలు, ఒపీనియన్ పోల్స్ నిర్వహించవద్దని, వాటిని ఏ చానల్ ప్రసారం చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఉప ఎన్నికలో గెలిపిస్తే అభివృద్ధి చేస్తా..
- నంద్యాల మైనారిటీలకు అండగా ఉంటా.. - ముస్లింల సమావేశంలో సీఎం బాబు సాక్షి బృందం, నంద్యాల: నంద్యాల నియోజకవర్గంలోని మైనారిటీలకు తాను అండగా ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం కర్నూలు జిల్లా నంద్యాలలో ముస్లింలతో ఆయన సమావేశం నిర్వహించారు. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీకి ఓట్లు వేసి గెలిపిస్తే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వచ్చాక మైనారిటీ వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టానన్నారు. అభివృద్ధి చేయడం తన ఒక్కరితోనే సాధ్యమని, ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలపించాలని మైనారిటీలకు విజ్ఞప్తి చేశారు. కాగా, కర్నూలు జిల్లాలో ముస్లింలకు ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోగా, రాష్ట్ర మంత్రివర్గం లోనూ చోటు కల్పించకపోవడం పట్ల సమావేశంలో పాల్గొన్న ఆ వర్గం ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రుణమాఫీ చేశా.. ఓట్లు వేయండి తాను అధికారంలోకి వచ్చాక డ్వాక్రా రుణాలను మాఫీ చేశానని, నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీకి ఓట్లు వేసి గెలిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా మహిళలను కోరారు. ఆయన ఆదివారం నంద్యాలలో డ్వాక్రా మహిళలతో సమావేశమయ్యారు. -
చెప్పిందేమిటి.. చేస్తున్నదేమిటి?
- చంద్రబాబు వైఖరిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపాటు - మోసకారి బాబుకు గుణపాఠం చెప్పి.. విశ్వసనీయతకు పట్టం కట్టండి నంద్యాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘అధికారంలోకి రావడానికి చంద్రబాబు 2014 ఎన్నికలప్పుడు ఎన్నెన్నో హామీలిచ్చాడు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తానన్నాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు. అలా ఇవ్వలేకపోతే రూ.2 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఇలా ఒక్కటి కాదు.. రెండు కాదు.. వందలాది హామీలు గుప్పించాడు. అరచేతిలో స్వర్గం చూపిస్తూ అన్ని వర్గాల వారి ఓట్లు వేయించుకని తీరా ముఖ్యమంత్రి అయ్యాక అందరినీ మోసం చేశాడు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా దారుణంగా అందరినీ వంచించాడు. ముఖ్యమంత్రి హోదాలో కర్నూలులో స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొని జిల్లాకు పలు హామీలిచ్చారు. వాటిలో కూడా ఒక్కటీ నెరవేర్చలేదు. ఇపుడు నంద్యాల అసెంబ్లీకి ఉప ఎన్నిక వచ్చిందని మళ్లీ పాత టేప్ రికార్డర్‌లా అవే అబద్ధాలు.. అవే మోసాలు వల్లె వేస్తున్నారు. చంద్రబాబూ.. ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత చెప్పిందేమిటి? చేస్తున్నదేమిటి?’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా 12వ రోజు ఆదివారం వైఎస్ జగన్ రోడ్‌షో.. సంఘమిత్ర నుంచి ప్రారంభమై ప్రియాంకనగర్, డేనియల్పురం చర్చి, సంజీవనగర్ గేట్, రాణి మహారాణి, నందమూరినగర్ మీదుగా వైఎస్ నగర్ వరకు సాగింది. ఈ సందర్భంగా నందమూరినగర్, వైఎస్ నగర్లో జగన్ మాట్లాడారు. మోసం చేయడం కోసం చంద్రబాబు ఏ గడ్డి తినడానికైనా వెనుకాడరని మండిపడ్డారు. మోసకారి చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలంటే ప్రజలు విశ్వనీయతకు పట్టం కట్టి శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. వైఎస్ హయాంలోనే పేదలకు భరోసా.. పేదలెవరూ విద్య, వైద్యం విషయంలో అప్పులపాలు కాకూడదని తపించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశపెట్టారు. పేదవాళ్లు ఇంజినీరింగ్, డాక్టర్, కలెక్టర్ వంటి గొప్ప చదువులు చదువుతానంటే నేను తోడుగా ఉంటానంటూ వైఎస్సార్ ఆ విద్యార్థులకయ్యే ఫీజు మొత్తాన్ని ఆ పథకాల ద్వారా చెల్లించారు. పేదవాడికి తోడుగా నిలవడంతో ఎందరో పేదవాళ్లు డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యారు. ఇప్పుడు బాబు హయాంలో ఇంజినీరింగ్ చదివేందుకు ఏటా రూ.లక్షదాకా ఖర్చవుతుంటే.. బాబు మాత్రం ముష్టి వేసినట్లు కేవలం రూ.35 వేలు మాత్రమే ఇస్తున్నారు. అది చెల్లించడానికి ఏడాదికిపైగా సమయం తీసుకుంటున్నారు. పైగా మిగిలిన సొమ్ము కట్టకపోతే చదివే పరిస్థితి లేదు. అందుకోసం ఇల్లు, పొలం అమ్ముకుంటారులే అని హేళనగా మాట్లాడుతున్నారు. ఆరోగ్యం బాగోలేక ఏ పేదవాడైనా మంచం పట్టి.. 108కు ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో వచ్చి కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించి.. చిరునవ్వుతో ఇంటికి పంపించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. చంద్రబాబు హయాంలో ఇవాళ ఆరోగ్యశ్రీ నిర్వీర్యమవుతోంది. 8 నెలలుగా నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించడం లేదు. దీంతో ప్రైవేటు డాక్టర్లు ఆపరేషన్లు చేయడానికి వెనకాడుతున్నారు. కాక్లియర్ ఇంప్లాంట్, కీమోథెరపీ, డయాలసిస్ వంటి వాటికి చంద్రబాబు సర్కారు షరతులు పెట్టింది. చంద్రబాబు దారుణ పాలనలో వైద్యం అందక పేదవాళ్లు చనిపోయే దుస్థితి నెలకొంద’’ని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
నంద్యాలలో ఏం జరుగుతోంది!
-
నంద్యాలలో టీడీపీ 'ఓటుకు నోటు'
-
జోరువానలో వైఎస్ జగన్ భారీ రోడ్‌షో
-
పేదలకు సొంతింటి కల నెరవేరుస్తా