
వీధి రౌడీలా చంద్రబాబు విమర్శలు
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజం
►ఆ ఎమ‍్మెల్యేలు నంద్యాలలో ఎందుకు తిరుగుతున్నారు?
►ఓటర్లు మరింత భారీగా పోలింగ్‌లో పాల్గొనాలి
►వైఎస్‌ఆర్ సీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు
►ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు
వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ బుధవారం విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వ్యక్తి ఎన్నికల కోడ్ ఉల్లంఘించడం దారుణమన్నారు. పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు నంద్యాలలో బాహటంగా తిరిగినా పట్టించుకోని పోలీసులు, నంద్యాల నివాసి శిల్పా చక్రపాణిరెడ్డిని ఓటర్ కాదంటూ పంపించివేశారని ఆమె ధ్వజమెత్తారు.