
నంద్యాల ఫలితంపై చంద్రబాబు స్పందన
అమరావతి: నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. సార్వత్రిక ఎన్నికలు ఇంకా రెండేళ్ల సమయం ఉందికాబట్టి, అభివృద్ధి కోసమే నంద్యాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారని అన్నారు. టీడీపీ నాయకత్వం పనితీరుతోనే ఈ గెలుపు సాధ్యమైందని, ఇలా జరుగుతుందని తాను ముందే ఊహించానని పేర్కొన్నారు.
డేరా బాబాది మంచి ఆర్గనైజేషన్ కానీ..: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న డేరా బాబా కేసుపై బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘‘అతను బాబా పేరుతో చాలా మంది ఆర్గనైజేషన్‌ను చేతిలో పెట్టుకుని శక్తిసామర్థ్యాలను దుర్వినియోగం చేశాడు. మహిళలు నమ్మకంతో ఆడపిల్లల్ని ఆశ్రమానికి పంపిస్తే వారిపై అకృత్యాలకు పాల్పడ్డాడు. సాధువులు సాధారణంగా మిలిటెంట్లను తయారు చేయరు. కానీ డేరాలు మాత్రం హింసాకాండకు ముందే సిద్ధమయ్యారు’’ అని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు.