చంద్రబాబువి రియల్‌ టైమ్‌ పాలిటిక్స్‌ కావా? | YSRCP MLA Kakani Govardhan Reddy takes on Chandrababu Naidu over Real Time Politics | Sakshi
Sakshi News home page

చంద్రబాబువి రియల్‌ టైమ్‌ పాలిటిక్స్‌ కావా?

Published Wed, Sep 6 2017 3:15 PM | Last Updated on Tue, Oct 30 2018 6:08 PM

చంద్రబాబువి రియల్‌ టైమ్‌ పాలిటిక్స్‌ కావా? - Sakshi

చంద్రబాబువి రియల్‌ టైమ్‌ పాలిటిక్స్‌ కావా?

సాక్షి, హైదరాబాద్‌ :  కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్పలు చెబుతున్నారని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌ రెడ్డి విమర్శించారు. నంద్యాల ఎన్నికను నమూనాగా తీసుకోవాలని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. 2019 ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో ప్రజలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. మహా భారత యుద్ధంలో మొదట కౌరవులే విజయం సాధించారని, రాబోయే కురుక్షేత్ర మహా సంగ్రామంలో వైఎస్ఆర్‌ సీపీదే గెలుపన్నారు.

రియల్‌ టైమ్ పాలిటిక్స్‌ అంటున్న చంద్రబాబు... ఇప్పటిదాకా ఆయన చేసింది రియల్‌ పాలిటిక్స్‌ కాదా అని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ వాపును చూసి బలుపు అని భ్రమ పడుతోందని కాకాణి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నదుల్ని నిర్వీర్యం చేసిన ఘటన చంద్రబాబుదేనని ఆయన మండిపడ్డారు. కరువుకు కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు అని, తాగడానికి, వినాయక నిమజ్జనానికి నీళ్లులేవు కానీ జలసిరికి హారతా అని కాకాణి ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement