breaking news
kakani govardhan reddy
-
‘పుట్టా మహేష్‌ను రక్షించడానికి రంగంలోకి చంద్రబాబు’
హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసిన వీకెండ్ పార్టీలో డ్రగ్స్ లభ్యం కావడం కలకలం రేపుతోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగిల్) ఫోర్స్ పోలీసుల ప్రకటించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పందిస్తూ పుట్టా మహేష్ తీరుపై మండిపడ్డారు.‘చంద్రబాబు బ్రాండ్.. డ్రగ్స్ బ్రాండ్. డ్రగ్స్ మాఫియాను చంద్రబాబు పెంచి పోషిస్తున్నారు. సామాన్యుడికి ఒక రూల్.. ఎంపీకి మరో రూల్ ఉండకూడదు. పుట్టా మహేష్‌ను రక్షించడానికి చంద్రబాబు రంగంలోకి దిగారు. పుట్టా మహేష్‌కు ఎంపీగా కొనసాగే అర్హత లేదు’ అని కాకాణి అన్నారు. కాగా, వీకెండ్ పార్టీలో డ్రగ్స్ లభ్యం కావడంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఫాంహౌస్‌లో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రకటించారు. -
2025లో జరిగిన చోరీ ఇప్పటివరకూ ఎందుకు దాచారు ?
-
‘టీటీడీని చంద్రబాబు రాజకీయ వేదికగా వాడుకుంటున్నారు’
నెల్లూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల ప్రాశస్త్యం మసకబారిందన్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. టీటీడీనే స్వయంగా చంద్రబాబే రాజకీయ వేదికా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. గో శాల, లడ్డూ, బిఆర్ నాయుడు రాసలీలు అనేక సంఘటనలు చూశాం. పరకామణీ కేసులో పెంచులయ్య 2025లో పట్టుబడ్డాడు. అతనికి బెయిల్ కూడా మంజీరా చేశారు. అదే రకమైన కేసులో రవి కుమార్ అనే నిందితుడు ఆస్తులు శ్రీవారికి రాసి ఇచ్చారు. కేసు నమోదు చేసి లోకాదలత్కు వెళ్ళింది.. పరకామణీ చోరి కేసులో కూటమి అధికారంలోకి వచ్చాక కేసును నీరు గార్చే ప్రయత్నాలు జరిగాయి. పెంచులయ్య ఎంత బంగారు చోరి చేశాడో అసలు నిజాలు బయటపెట్టలేదు. 2024 చివరిలో పెంచులయ్య చోరి చేస్తే బయటకు పొక్కకుండా చూశారు. పెంచులయ్య వెనుక ఎవరు వున్నారు. అసలు భద్రతా వ్యవస్థ పనిచేస్తుందా.. భద్రతా వైఫల్యం క్లియర్ గా కనబడుతుంది. శ్రీవారి పరకామణీలో చోరీ చేసిన నగలు కార్పొరేట్ దుకాణాల్లో మార్పిడి జరిగింది. మరీ వింతగా బ్యాంకులో శ్రీవారి నగలతో రుణాలు కూడా పొందారు.ఈ చోరీ వెనుక వున్న వారిని ఎవ్వరినీ విచారించిన పాపాన పోలేదు’ అని విమర్శించారు కాకాణి. -
రాష్టంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే.. నోటీసిలిచ్చుకుంటూ ఉంటారా..
-
బాధితులను పరామర్శించడమే నేరమా? వైఎస్ జగన్ పాలన చూసి నేర్చుకోండి
-
పోలీసులపై కాకాణి సీరియస్.. బాధితులను పరామర్శించడమే నేరమా?
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో పోలీసులు ఏకపక్షంగా అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. కోవూరులో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, హత్యను ఖండించడమే నేరమా.. బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించడం పాపమా? అని ప్రశ్నించారు. కోవూరు ఘటన ముమ్మటికీ ప్రభుత్వ వైఫల్యమేనని ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి కాకాణి ఈరోజు.. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అనంతరం, కాకాణి మాట్లాడుతూ.. ‘కోవూరులో బాలిక హత్యను ఖండించడమే నేరమా?. పోక్సో చట్టంపై అవగాహన ఉన్న మేము ఎక్కడా బాలిక వివరాలు వ్యాఖ్యానించలేదు. అధికార పార్టీలోని వక్ఫ్ బోర్డు చైర్మన్ ఈ ఘటనలో స్వయంగా గంజాయిపై వ్యాఖ్యలు చేశారు. నిందితుల పట్ల ఉదాశీలతగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ అక్రమ కేసులో నాకు మూడు సార్లు నోటీసులు ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి అధికార పార్టీ ముందుకు రావడం లేదు.జిల్లాలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఈ అక్రమ కేసులో సంబంధం లేని ప్రశ్నలు వేశారు. కోవూరు మైనర్ బాలిక కేసు ఘటన ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే. పరిపాలన చేత కాకపోతే వైఎస్ జగన్ పాలన చూసి నేర్చుకోండి. ఇలాంటి అక్రమ కేసులు ఎన్ని బనాయించినా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానుకునే సమస్య లేదు. నిన్న వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు అశేష జనాభా కదిలి వచ్చారు. వైఎస్ జగన్ ప్రజాదరణ ఓర్వలేక పచ్చ మీడియా ప్రత్యేక కథనాలు ప్రచురించింది’ అని మండిపడ్డారు. -
‘చంద్రబాబుకి ప్రాజెక్టుల మీద అవగాహన లేదు’
సాక్షి, నెల్లూరు : వ్యవసాయం దండగ అనే మైండ్ సెట్‌తో రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రాజెక్టుల మీద అవగాహనే లేదన్నారు. వైఎస్ జగన్‌కి మంచి పేరు వస్తుందనే కుట్రతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఆపేశారని ఆరోపించారు.రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైఎస్సార్సీపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సీమతో పాటు జిల్లాకు వర ప్రదాయిని. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం రాగానే అది ఆగిపోయింది. రాబోయే రోజుల్లో రైతులతో కలిసి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఉద్యమించబోతున్నాం. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టీఎంసీలు నీరు తెచ్చుకోగలిగితే చివరి ఆయకట్టుకు కూడా నీరు అందుతుంది.రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..‘రాయలసీమ ఎత్తిపోతల పథకంపై భవిష్యత్‌లో చేయాల్సిన పోరాటాల గురించి జిల్లా నేతలతో చర్చించాం. మన నీటిని ఇతర రాష్ట్రాలు వాడుకుంటూ ఉంటే.. చంద్రబాబు మౌనంగా ఉంటున్నారు. ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు. ప్రాజెక్ట్ అవసరం లేదని చంద్రబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. చంద్రబాబు చర్యల వల్ల ఈ ప్రాంతం ఏడాదిగా మారుతుంది. లక్షల ఎకరాలు బీడుగా మారుతాయి. రాయలసీమ, ఒంగోలు, నెల్లూరు జిల్లాలోని ప్రజాప్రతినిధులతో కలిసి సమావేశమై, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం.మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ..‘వ్యవసాయం దండగ అనే మైండ్ సెట్‌తో రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి కాకపోతే రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లా కూడా ఏడారి అవ్వడం ఖాయం. కలిసి వచ్చే అన్ని పార్టీలను కలుపుకుపోయి లిఫ్ట్ ఇరిగేషన్‌ను సాధిస్తాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మన గొంతులు, భూములు తడిపే ప్రాజెక్ట్. వైఎస్ జగన్‌కి మంచి పేరు వస్తుందనే కుట్రతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఆపేశారు. మార్చి ఒకటో తేదీన కడపలో ఆరు నియోజకవర్గ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తాం. చంద్రబాబుకి ప్రాజెక్టుల మీద అవగాహన లేదు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
మాజీ మంత్రి కాకాణికి పోలీసుల నోటీసులు
-
మాజీ మంత్రి కాకాణితో పోలీసుల దాగుడు మూతలు
సాక్షి, నెల్లూరు జిల్లా: మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డితో పోలీసులు దాగుడు మూతలు ఆడుతున్నారు. మైనర్ మృతి కేసులో విచారించేందుకు ఇంటికి వస్తామంటూ పోలీసులు సమాచారం ఇచ్చారు. 10 గంటల నుంచి విచారణ నిమిత్తం కాకాణి.. ఇంట్లోనే అందుబాటులో ఉన్నారు. పోలీసులు రాకపోవడంతో రాజకీయ పర్యటన కోసం కాకాణి వెళ్లిపోయారు.కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ.. బాలిక మృతిపై ప్రశ్నించేందుకు నా పై కేసు పెట్టారు. టీడీపీ నేతల ఫిర్యాదుతో కేసు పెట్టారు. 14వ తేదీ విచారణకు రావాలని నోటీస్ ఇచ్చారు.. చివరలో రావద్దన్నారు. ఇవాళ ఇంటికి వస్తామన్నారు.. ఇప్పటి వరకు రాలేదు.. మేము ఫోన్ చేసినా.. పోలీసులు స్పందించలేదు. బాలిక కుటుంబ సభ్యుల వివరాలు నేను ఎక్కడా బహిర్గతం చేయలేదు...గంజాయి గురించి అధికార పార్టీ నేతలు మాట్లాడితే కేసులు కట్టలేదు.. నేను మాట్లాడకపోయినా కేసు కట్టారు. పోలీసులు అక్రమార్కుల మీద నిఘా పెట్టకుండా.. వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెట్టేందుకే పోలీసులు పని చేస్తున్నారు. మా హయాంలో ఓ బాలిక మీద దాడి జరిగితే.. వైద్య ఖర్చులు ప్రభుత్వం భరించి.. కుటుంబాన్ని ఆదుకుంది’ అని కాకాణి గుర్తు చేశారు. -
రైతులను నిట్టనిలువునా మోసం చేసే బడ్జెట్ చంద్రబాబు మోసాలకు...
-
చంద్రబాబు మోసాలకు అద్దంపట్టే బడ్జెట్: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ హయాంలో ప్రవేశ పెట్టిన ఐదు బడ్జెట్లు ప్రజా ఆమోదయోగ్యమైనవని.. కరోనా లాంటి పరిస్థితుల్లో సైతం సంక్షేమం ఎక్కడా ఆగలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దారుణంగా ఉందని.. ఆడ బిడ్డ నిధి, నిరుద్యోగ భృతి కేటాయింపు లేదన్నారు. సూపర్ సిక్స్ పథకాలకు సైతం అంతంతమాత్రమే కేటాయింపులు జరిపారన్నారు.‘‘అన్నదాత సుఖీభవ పథకానికి 6 లక్షల అప్లికేషన్స్ పెండింగ్‌లో వున్నాయి. రైతులను నిట్టనిలువునా మోసం చేసే బడ్జెట్. ఉద్యోగులను, కార్మికులను ఇలా అన్ని రంగాల వారిని మోసం చేశాడు. అన్ని సామాజిక వర్గాలకు అన్యాయం చేసిన బడ్జెట్‌గా చూడాలి. చంద్రబాబు మోసాలకు అద్దం పట్టే బడ్జెట్’’ అంటూ కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. -
కొవ్వూరులో మైనర్ బాలికపై అత్యాచారం కాకాణి స్ట్రాంగ్ రియాక్షన్
-
మాజీ మంత్రి కాకాణికి కోవూరు పోలీసుల నోటీసులు
-
కాకాణిపై మరో అక్రమ కేసు
-
మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు
సాక్షి నెల్లూరు : కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తుంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో అక్రమ కేసు నమెదు చేసింది. ఇటీవల కోవూరు, గుమ్మళ్లదిబ్బలో ఓక మైనర్ బాలిక మృతి చెందింది. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు మాజీ మంత్రి వెంటనే స్పందించారు.బాధిత కుటుంబానికి అండగా నిలిచి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించారు. దీంతో మంత్రిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. ఇటీవల వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసుల నమోదు చేసి తీవ్ర వేదింపులకు గురిచేస్తున్నారు. -
అంబటి కుటుంబాన్ని పరామర్శించిన కాకాణి, పూజిత
-
ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ.. అరెస్ట్‌కు భయపడం: కాకాణి
సాక్షి, గుంటూరు: కూటమి ప్రభుత్వం.. నాటి బ్రిటిష్ పాలనను మించిపోయింది.. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. పోలీసులను అడ్డు పెట్టుకొని దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వ్యక్తిత్వం కోల్పోయాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారు. అంబటి ఇంటిపై కూడా దాడి చేశారు. ఆయన కుటుంబాలకు ధైర్యం చెప్పటానికి వచ్చాం. కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉన్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది. రాష్ట్రంలో జరుగుతున్న అనేక అంశాలపై అంబటి ప్రశ్నించారు. దీంతో దాడి చేసి అరెస్ట్ చేశారు. పోలీసులను అడ్డు పెట్టుకొని దౌర్జన్యాలు చేశారు.సీఎం చంద్రబాబు లడ్డూ విషయంలో అబద్ధాలు ఆడారు. కూటమి పాలన అధ్వాన్నంగా ఉంది. సమాధానం చెప్పలేక చంద్రబాబు దాడులు చేయిస్తున్నారు. గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం ప్రమాదం అన్న విషయం కూటమి నేతలు గుర్తుంచుకోవాలి. పైశాచిక ఆనందం పొందటం తప్ప ఎటువంటి ఫలితం ఉండదు. చంద్రబాబు వ్యక్తిత్వం కోల్పోయాడు. చంద్రబాబు తనని అరెస్టు చేసినందుకు మమ్మల్ని అరెస్టు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తట్టుకోలేరు. రాంబాబు తుపాకి తూటాలకు కూడా భయపడరు’ అని అన్నారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు కాకాణి పూజిత మాట్లాడుతూ..‘మౌనిక.. తండ్రి బాధ్యతను తీసుకొంది. ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొంది. అంబటి కుటుంబ సభ్యులను ఈ పరిస్థితుల్లో కలుస్తామనుకోలేదు. రాజకీయాలు దిగజారిపోయాయి. వైఎస్ జగన్‌కు సైన్యంలా నిలబడే భావన కూటమి నేతలే కల్పిస్తున్నారు. ప్రాణాలర్పించైనా జగన్‌ను గెలిపించుకుంటాం. కూటమి పాలనను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మహిళలంటే గౌరవం లేదు. ప్రభుత్వం చేసే తాటాకు బెదిరింపులకు భయపడం’ అని హెచ్చరించారు. -
సోమిరెడ్డి కింగ్ ఆఫ్ కరప్పన్.. విజిలెన్స్ విచారణకు సిద్ధమా
-
‘సోమిరెడ్డి.. విజిలెన్స్ విచారణకు సిద్ధమా?’
నెల్లూరు: జిల్లాలో ఇరిగేషన్ శాఖ అవినీతి అక్రమాలకు నిలయంగా మారిపోయిందని వైఎస్సార్సీపీ నేత కాకాణి గోవర్థన్‌రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రైతుల పేరిట, రైతులను అడ్డం పెట్టుకుని దొంగ బిల్లులు పెట్టుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశానని, కానీ ఎక్కడా స్పందన లేదన్నారు. మళ్లీ ఇంకోసారి రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాస్తాన్నన్నారు. ‘సోమిరెడ్డికి సవాలు విసురుతున్నా.. విజిలెన్స్ విచారణకు సిద్ధమా?, రైట్ ఇన్ఫర్మేషన్ కింద వివరాలు అడిగితే సరైన సమాచారం ఇవ్వడం లేదు. ఇరిగేషన్ లో జరుగుతున్న అక్రమాల్ పై మాట్లాడితే మాపై దాడులు చేస్తున్నారు. గంగాధర్ అనే ఉద్యోగి అక్రమంగా రైతులు నుండి ఫోన్ పే ద్వారా డబ్బులు తీసుకున్నారు.. ఈ ఉద్యోగిపై చర్యలు తీసుకోకుండా కొన్ని రోజులు తప్పించి మళ్ళీ ఇప్పుడు తీసుకు వచ్చారు. గంగాధర్ కొడుకు ఆయన కుటుంబ సభ్యుల ఖాతాల్లో అక్రమంగా డబ్బులు జమ చేసినట్టు పూర్తి ఆధారాలు వున్నా విచారణ లేదు, చర్యలు లేవు. విజిలెన్స్ విచారణ కానీ ఇతర అధికారులు కానీ అవినీతి చేస్తున్న వారి పై చర్యలు శూన్యం. ఒకప్పుడు సోమిరెడ్డి ఆర్ట్ ఆఫ్ కరెప్షన్.. ఇప్పుడు కింగ్ ఆఫ్ కరెప్షన్ గా మారాడు’ అంటూ ధ్వజమెత్తారు కాకాణి. -
Kakani: రాషాన్ని ఒక అగ్నిగుండంగా మార్చేశావయ్యా చంద్రబాబు
-
‘ మీ దుష్ప్రచారాలను తిప్పికొడితే దాడులు చేస్తారా?’
నెల్లూరు: సీఎం చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొడుతుంటే దాడులకు పాల్పడతారా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని గతంలో చంద్రబాబు మాట్లాడరని, సీబీఐ రిపోర్ట్ ప్రకారం అందులో ఎలాంటి కొవ్వు లేదని స్పష్టమైందన్నారు. దాంతో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలేనని తేటతెల్లమైందన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అనుకున్న విధంగా రిపోర్ట్ రాలేదని ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ను బలి పశువును చేశారన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబపై హత్యాయత్నం చేస్తారా? అని నిలదీశారు. -
ఉచిత ఇసుక పథకం పచ్చి బూటకం: కాకాణి
సాక్షి, నెల్లూరు: కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రచారం చేసుకునే ఉచిత ఇసుక హామీ పెద్ద బూటకమని, ఆ పేరుతో కూటమి నాయకులు సహజ వనరులను దోచుకుని జేబులు నింపుకుంటున్నారని నెల్లూరు జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా 5 రెట్లకు పైగా అధిక ధరలు వసూలు చేస్తూ ఒక్కో ఇసుక రీచ్ నుంచి కూటమి ఎమ్మెల్యేలు నెలకు రూ.3 కోట్లకు పైగా దోచుకుంటున్నారని ఆరోపించారు.సూరాయపాలెం ఇసుక రీచ్‌పై సమగ్ర పరిశీలన తర్వాతే మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. నిబంధనలను బేఖాతర్ చేస్తూ విరివూరు ఇసుక రీచ్‌లో అర్ధరాత్రి, వేకువ జామున ఇసుక తవ్వి తరలిస్తున్న ఫొటోలను ఈ సందర్భంగా కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రదర్శించారు. ఇసుక అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని క్యూఆర్ కోడ్ ద్వారా ఎలా దోచేస్తున్నదీ ఆయన వివరించారు.సీఎం చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న ఇలాంటి వారికి బేడీలు వేసి నడిరోడ్డుపై నడిపించి తీసుకెళ్లాలని కాకాణి గోవర్థన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇసుకను అక్రమంగా దోచుకుంటున్న వారు దొరికితే అరెస్ట్ చేసి శిక్షించాల్సిన పోలీసులు మంత్రి పర్మిషన్ అడగడం ఏమిటని మండిపడ్డారు. పైగా కూటమి నాయకుల ఇసుక దందాను బయటపెట్టడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం చూస్తుంటే కూటమి నాయకుల దందాకు కలెక్టర్, ఎస్పీ లైసెన్స్ ఇచ్చినట్లుగా ఉందని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ప్రెస్మీట్లో కాకాణి గోవర్థన్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:పెన్నా నదికి గర్భశోకం:అధికార పార్టీ నాయకుల ధన దాహానికి సహజ వనరులు అడుగంటిపోతున్నాయి. నెల్లూరులో పెన్నా నదీ గర్భం శోకంతో అల్లాడిపోతుంది. ఉచిత ఇసుక పేరుతో స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ జేబులు నింపుకుంటున్నారు. నదీగర్భంలోనే రోడ్లు నిర్మించి భారీ యంత్రాలతో ఇసుకను అక్రమంగా తవ్వి లారీలతో తరలిస్తున్నారు. పగలూ రాత్రీ తేడా లేకుండా పెన్నా నదిలో 10 మీటర్ల లోతు వరకు ఇసుకను తవ్వి టిప్పర్లు, లారీలతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.సెమీ మెకనైజ్డ్ రీచ్‌లకు పొక్లెయినర్లకు అనుమతి లేదని తెలిసినా నిబంధనలు ఉల్లంఘించి ఇసుకను తరలించడమే కాకుండా, ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఐదు రెట్లు అధిక ధరలకు ఇసుకను అమ్మేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక టెండర్లు నిర్వహించి ఏడాదికి రూ.700 కోట్ల చొప్పున అయిదేళ్లలో రూ.3500 కోట్ల ఆదాయం తీసుకొస్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక పేరుతో ఆ మొత్తాన్ని కూటమి నాయకులు దోచుకుంటున్నారు.రాత్రింబవళ్లూ ఇసుక దోపిడీ:ఒక్క సూరాయపాలెం ఇసుక రీచ్ ద్వారానే ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రూ.100 కోట్లు దోపిడీకి స్కెచ్ వేశారని గతంలో నేను ఆరోపిస్తే, ఆయన తోసిపుచ్చారు. కానీ, ఆయన ఇప్పుడు ఏకంగా సాయి శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన బ్యాంక్ అకౌంట్‌కి వెళ్లేలా క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి నేరుగా కోట్లు కొల్లగొడుతున్నారు. ఇసుక కొనుగోలు చేసిన వారికి ట్రిప్ షీట్ పేరుతో చేత్తో రాసిన స్లిప్ చేతిలో పెట్టి పంపిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం నాలుగున్నర టన్నులు లోడ్‌తో వెళ్లే ఒక ట్రాక్టర్‌కి టన్నుకి రూ.68 చొప్పున రూ.300 లోపు వసూలు చేయాల్సి ఉంటే ఐదు రెట్లు అధికంగా రూ.1,250 వసూలు చేస్తున్నాడు. పైగా ఉ. 6 గం. నుంచి సా. 6 గం. మధ్య మాత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ రేయింబవళ్లు పొక్లెయినర్లతో తోడేస్తున్నారు. (అంటూ.. పెన్నా నదిలో విరువూరు ఇసుక రీచ్‌లో వేకువజామున, అర్ధరాత్రి వేళల్లో ఇసుక తవ్వుతున్న ఫొటోలు ప్రెస్మీట్లో ప్రదర్శించారు).ఓపెన్ రీచ్‌లలో ఏకంగా రైతులకు సాగు నీరు వెళ్లే కాలువలకు అడ్డంగా గట్టు కట్టి మరీ గ్రావెల్‌తో రోడ్డేసి ఇసుక లారీలను రప్పిస్తున్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను బేఖాతరు చేసి మరీ విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలతో ఏర్పడిన గుంతల్లో పడి అమాయకుల ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు నాయుడికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇసుక దోపిడీకి పాల్పడుతున్న వారిని నడిరోడ్డు మీద బేడీలు వేసి నడిపించాలి.ఐదు రెట్లకు మించి అధిక ధరలు:సూరాయపాలెం ఇసుక రీచ్‌ను కేస్ స్టడీగా తీసుకుని తెలుగుదేశం నాయకుల ఇసుక దోపిడీపై మేం కూలంకషంగా స్టడీ చేశాం. ఇసుక రీచ్ మీద నెలకు ఏకంగా రూ.3 కోట్లు దోచేస్తున్నారు. రూ.1400 వసూలు చేయాల్సిన టిప్పర్‌కి ఏకంగా రూ.8 వేలు వసూలు చేస్తున్నారు. 12 టైర్ల లారీకి రూ.1600 వసూలు చేయాల్సి ఉంటే రూ.12 వేలు, 14 టైర్ల లారీకి రూ.2024 వసూలు చేయాల్సి ఉంటే రూ.15 వేలు వసూలు చేస్తున్నారు.ఇసుక దోపిడీదారులకు పోలీసుల రక్షణ!:కూటమి నాయకుల ఇసుక దోపిడీని ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. పోలీసులకే కమీషన్లు ఇస్తున్నామని వారు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఈ ఇసుక దోపిడీని పోలీసులు తన దృష్టికి తీసుకొచ్చారని మంత్రి నారాయణ సైతం చెబుతూ నిందితులపై చర్యలు తీసుకోమని ఆదేశించకుండా, రాత్రుళ్లు టిప్పర్లతో కాకుండా ట్రాక్టర్లతో తరలించుకోమని ఉచిత సలహాలిస్తున్నారు. (అంటూ.. మంత్రి మాటల ఆడియోను ప్రెస్మీట్లో వినిపించారు)ఇసుక దొంగలు చేతికి దొరికితే వారిని అరెస్ట్ చేయకుండా మంత్రి నారాయణ సలహా అడగడం చూస్తుంటే పోలీసులు ఎవరి కోసం పని చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు న్యాయబద్ధంగా నిబంధనల మేరకు వ్యవహరించడం లేదు. కూటమి నాయకుల ఇసుక దోపిడీని ప్రజలకు చూపించడానికి వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకుంటున్నారు. అంటే, కూటమి నాయకుల ఇసుక దోపిడీకి కలెక్టర్, ఎస్పీలు లైసెన్స్ ఇచ్చారా అనే అనుమానాలు కలుగుతున్నాయని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు. -
Kakani : అర్థరాత్రి ఏంటీ పని పెన్నా నదిలో పగలూ రాత్రి దోపిడీ
-
సీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపివేతకు లోపాయికారీ ఒప్పందం నిజమా ? కాదా ?
వెంకటగిరి (సైదాపురం): రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపివేతకు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల లోపాయికారీ ఒప్పందాలు నిజమా ? కాదా ? అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో శనివారం వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడిన తర్వాతే నిలిపివేశారని ఆరోపించారు. చంద్రబాబు లోపాయికారితనం ఒప్పందంతో రైతులు అన్యాయం అయిపోతారన్న ఉద్దేశంతో సోమశిల–కండలేరు వద్ద చేపట్టిన ఆందోళనకు నెల్లూరు జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల్లో ఉన్న వందలాది మంది అన్నదాతలు తమకు సంఘీభావం తెలిపారన్నారు. అయితే వందలాది మంది పోలీసులను పంపి అన్యాయంగా అరెస్టు చేయించి పోలీసుస్టేషన్‌కు తరలించారన్నారు. అదే ప్రాజెక్టుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు పోతే వారి వెంట నలుగురు రైతులు కూడా లేరన్నారు. కూటమి ప్రభుత్వంలో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించామని మాయమాటలు చెబుతున్నారని.. వారికి దమ్ము, ధైర్యం ఉంటే ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో సచివాలయాల వారీగా జాబితా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రెడ్‌బుక్ రాజ్యాంగం పాలన నడుస్తోందని వైఎస్సార్సీపీ తిరుపతి పార్లమెంట్ పరిశీలకులు, మేడా రఘునాథరెడ్డి విమర్శించారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై బాబు దుష్ప్రచారంల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించిందని తిరుపతి ఎంపీ గురుమూర్తి విమర్శించారు. భూముల రీసర్వేతో ఎంతోమంది రైతులకు మేలు జరిగిందని, దీంతో జగన్మోహన్రెడ్డికి మంచి పేరు వస్తుందనే అక్కసుతో చంద్రబాబు, ఎల్లో గ్యాంగ్ ఎన్నికల ముందు దు్రష్పచారంతో పాటు పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారన్నారు. రీసర్వేలో ఏపీ ప్లాటినం గ్రేడింగ్ సాధించిందని 2023లోనే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచి్చందన్నారు. అందుకు ప్రతిఫలంగా 2025 ఫిబ్రవరి 19న రాష్ట్ర ప్రభుత్వానికి రూ.400 కోట్ల నిధులను కేంద్రం రాయితీ రూపంలో మంజూరు చేసిందన్నారు. దీనిని సీఎం చంద్రబాబు తన ఘనతగా చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యంత్రిని చేసుకునేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత, ఎస్ఈసీ సభ్యులు బొలిగర్ల మస్తాన్‌యాదవ్, పాపకన్ను మధుసూదన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ బి.వెంకటరమణారెడ్డి, సనత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
Kakani: దేవుడి సొత్తుపై కన్నేస్తావా..? కడుపుకు అన్నం తినేవాడివేనా నువ్వు..
-
'సంస్కార హీనుడు చంద్రబాబు కాకాణి గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
యర్రగొండపాలెంలో కాకాణి సంక్రాంతి సంబరాలు
-
బాబూ.. ఓటుకు నోటు కేసు భయమా?: కాకాణి
సాక్షి, నెల్లూరు: చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయడం నిజమా కాదా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో రైతుల్లో గందరగోళం నెలకొన్నదని కాకాణి చెప్పుకొచ్చారు. ప్రశ్నిస్తే ఓటుకు నోటు కేసు తిరిగి లోడుతారు అని చంద్రబాబుకు భయం పట్టుకుంది అంటూ విమర్శలు గుప్పించారు.మాజీ మంత్రి కాకాణి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రహస్య ఒప్పందంతో చంద్రబాబు రైతు ప్రయోజనాలు తాక్కట్టు పెట్టి ద్రోహిగా మారాడు. కలత చెందిన రైతులను మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేయడం నిజమా..? కాదా?. రేవంత్ రెడ్డి అడగటంతో చంద్రబాబు ఈ చర్యలకు పాల్పడటం నిజం కాదా?. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఖండిస్తారు ఏమో అనుకుంటే సమర్థించుకునే పరిస్థితికి వచ్చారు. 20 టీఎంసీల నీళ్ళు పోతే ఏంటి అని రివర్స్ లో మాట్లాడటం విడ్డూరంగా వుంది.రాయలసీమ లిఫ్ట్ రైతులకు ఒక ఇన్సూరెన్స్ లాంటిది అని ఆలోచించి వైఎస్ జగన్ ఆ ప్రాజెక్టు చేపట్టారు. నేడు సంజీవనీ లాంటి రాయలసీమ లిఫ్ట్ ను స్వప్రయోజనాల కోసం చంద్రబాబు తాకట్టు పెట్టాడు. పోతిరెడ్డిపాడు నుండి పూర్తి స్థాయిలో నీటిని ఉపయోగించున్న పరిస్థితి లేదు. రైతులు చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై ఉమ్మేస్తున్నా పట్టించుకోవడం లేదు. కల్వకుర్తి సామర్థ్యం పెంచుకుంటే నోరు మెదపలేదు. తెలంగాణ ప్రభుత్వం 8 టీఎంసీలు అధికంగా వినియోగించుకుంటున్నా నోరు మెదపటం లేదు. ప్రశ్నిస్తే ఓటుకు నోటు కేసు తిరిగి లోడుతారు అని చంద్రబాబుకు భయం.చంద్రబాబు సీఎం అయ్యాక తెలంగాణ ప్రభుత్వం ఏపీ రైతులకు ద్రోహం తలపెట్టడం ప్రారంభించారు. అడ్డదారుల్లో నీటి ప్రాజెక్టు నిర్మాణాలు చేపడుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుండి నీటిని తరలించుకుంటున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ నిలుపుదలతో రాయలసీమతో పాటు నెల్లూరు, కొంత ఒంగోలు రైతాంగం కూడా నష్టపోతున్నారు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కు మూడు సార్లు అవకాశం వచ్చినా ఉపయోగించుకోలేదు. రాయలసీమ, మిట్ట ప్రాంతాల రైతాంగం కోసం ఆలోచన చేసిన నాయకులు వైఎస్సార్, జగన్ మాత్రమే’ అని చెప్పుకొచ్చారు. -
కండలేరు సందర్శనపైనా ఆంక్షల సంకెళ్లు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/రాపూరు–సైదాపురం: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని రాపూరు మండలం కండలేరు జలాశయం సందర్శనకు ఆదివారం బయల్దేరిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అడుగడుగునా ఆంక్షలతో అడ్డుకున్నారు. సోమశిల జలాశయ సందర్శనపై శనివారం ఉక్కుపాదం మోపినట్లుగానే తాజాగా కండలేరు సందర్శననూ పోలీసులు నిలువరించారు. నెల్లూరు జిల్లా ప్రజలు, రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలిపేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి నేతృత్వంలో పలువురు నేతలు కండలేరు ప్రాజెక్టుకు ఆదివారం బయల్దేరారు.ఆయనతో పాటు పార్టీ నెల్లూరు రూరల్, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్తలు ఆనం విజయకుమార్‌రెడ్డి, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్యను కండలేరు ముఖద్వారం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. మార్గంమధ్యలో నెల్లూరు, పొదలకూరు, డేగపూడి, కండలేరు డ్యామ్ మెయిన్ రోడ్డు వద్ద బారికేడ్లను అడ్డుపెట్టి నిలువరించారు. రాపూరు, సైదాపురం, వెంకటగిరి, కలువాయి, పొదలకూరు, చేజర్ల మండలాలకు చెందిన రైతుల్ని కండలేరు వద్దకు వెళ్లనీయకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అయితే, ఎలాగోలా రైతులు పెద్ద సంఖ్యలో కండలేరు ముఖద్వారం వద్దకు చేరుకుని నేతలకు మద్దతు ప్రకటించారు. జై జగన్ నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. అడ్డుకున్న డీఎస్పీ .. నేతలు బైఠాయింపు.. కండలేరు ముఖద్వారం వద్దకు చేరుకున్న కాకాణి, ఆనం, నేదురుమల్లి, కిలివేటిని ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ అక్కడే నిలిపేశారు. ఐదుగుర్ని మాత్రమే జలాశయ సందర్శనకు అనుమతిస్తామని తేల్చిచెప్పారు. దీంతో తమను ఎందుకు పంపరని పోలీసులను ప్రశి్నస్తూ ముఖద్వారం వద్ద కాకాణి, ఆనం, నేదురుమల్లి, కిలివేటి బైఠాయించారు. పోలీసులు సైతం ముఖద్వారం వద్ద భారీగా మోహరించారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ పర్యవేక్షణలో ఆరుగురు సీఐలు, ఎస్సైలు, అదనపు బలగాలతో నేతలను నియంత్రించారు. ప్రాజెక్టు సందర్శనకు 50 మందికి అనుమతివ్వాలని కాకాణి డిమాండ్ చేశారు. పోలీస్ అధికారులు ససేమిరా అనడంతో నాలుగు గంటల పాటు ముఖద్వారం వద్దే నేతలు బైఠాయించారు. బలవంతంగా నేతల అరెస్టు.. తుపాను ప్రభావంతో వర్షం కురుస్తున్నా వైఎస్సార్సీపీ నేతలు ఏ మాత్రం తగ్గకుండా అక్కడే బైఠాయించి ఆందోళన కొనసాగించారు. సుమారు నాలుగు గంటలపాటు బైఠాయించిన నాయకులు ఎంతసేపైనా అక్కడే ఉంటామని వెల్లడించడంతో రైతులు వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని షామియానాలను తీసుకొచ్చారు. అయితే, వీటిని తొలగించేందుకు పోలీసులు యత్నించడంతో తోపులాట జరిగింది. సా.3.45 గంటల సమయంలో పోలీసులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య కాకాణి, ఆనం, నేదురుమల్లి, కిలివేటిని అరెస్టుచేసి రాపూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సమయంలో కాకాణి, కిలివేటిని లాక్కెళ్లేందుకు పోలీసులు యత్నించడంతో కార్యకర్తలు అడ్డుకునే యత్నం చేయగా తోపులాట జరిగింది. ఆ తర్వాత నేతలను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.బాబు అర్ధంతరంగా ప్రాజెక్టును ఆపేశారు.. ఈ సందర్భంగా కాకాణి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమతో పాటు నెల్లూరు ప్రాంత రైతులకు ఎలాంటి కష్టాలు రాకూడదని, మెట్ట ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరుకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.3,825 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసి పనులు ప్రారంభించారని చెప్పారు.పనులు జరుగుతున్న సమయంలోనే చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్టును అర్ధంతరంగా నిలిపివేశారని మండిపడ్డారు. అరెస్టులకు భయపడేదిలేదని, చావుకైనా సిద్ధపడే వచ్చామని ఆయన స్పష్టంచేశారు. ఎవరైతే దీనిపై గళం విప్పుతారో వారిని అరెస్టుచేస్తున్నారని.. రైతు ద్రోహిగా ముద్రపడుతుందనే భయంతో ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఛీకొడుతున్నారన్నారు. ఇక రేవంత్‌రెడ్డి, చంద్రబాబు మధ్య జరిగిన చీకటి ఒప్పందాలను ప్రజలకు తెలియజేసేందుకే జలాశయ సందర్శనకు వచ్చామని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. -
బాబూ.. అరెస్ట్‌లతో వైఎస్సార్సీపీ పోరాటం ఆగదు: కాకాణి
సాక్షి, నెల్లూరు: చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడి చేయిస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా వైఎస్సార్సీపీ కార్యకర్తలు భయపడరు అని చెప్పుకొచ్చారు. అరెస్ట్‌లతో వైఎస్సార్సీపీ పోరాటం ఆగదు అని అన్నారు.కండలేరు డ్యామ్ వద్ద వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణిని కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. సీమ లిఫ్ట్ నిలిపేసి నెల్లూరు జిల్లాకు బాబు ద్రోహం చేశారు. లాఠీ దెబ్బలకు, బుల్లెట్లకు భయపడేవాళ్లం కాదు. పోలీసులను అడ్డుకుని చంద్రబాబు.. దాడులు చేయిస్తున్నాడు. పోలీసు శాఖ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా మొండి వైఖరి ప్రవర్తిస్తోంది.కండలేరు డ్యామ్ పరిశీలనకు వెళ్ళకుండా అరెస్టులు చేస్తారా?. అరెస్టులతో మా పోరాటం ఆగదు. మా నాయకుడు వైఎస్ జగన్ ఆశయాలు, ఆదేశాలతో పోరాడుతూ ముందుకు వెళ్తాం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలుపుదల వలన నెల్లూరు జిల్లాకు కూడా చంద్రబాబు తీరని లోటు తలపెట్టాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వైఎస్సార్సీపీ నేతల కండలేరు సందర్శన అడ్డగింత
నెల్లూరు: రాపూర్ మండలంలోని కండలేరు రిజర్వాయర్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రిజర్వాయర్ సందర్శనకు వెళుతున్న వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం(జనవరి1వ తేదీ) వైఎస్సార్సీపీ నేతల కండలేరు సందర్భనన అడ్డుకున్నారు. పొదలకూరు సర్కిల్ వద్ద వైఎస్సార్సీపీ నేతల్ని అడ్డగించారు పోలీసులు. అదే సమయంఓ కండలేరు వద్ద పోలీసుల్ని భారీగా మోహరించారు. దాంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు కాకాణితో పాటు పలువురు నేతలు.దీనిపై నేదురమల్లి రామ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కుల్ని హరించారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే తమను అడ్డకుంటున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం నిలిపివేయడంతో వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీన్ని అర్థాంతరంగా నిలిపివేస్తే రాయలసీమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబులు లోపాయకారీ ఒప్పందంలో భాగంగానే ఈ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శిస్తన్నారు. -
సోమశిల సందర్శనపై పోలీసుల ఉక్కుపాదం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాయలసీమతోపాటు నెల్లూరు జిల్లా ప్రజలు, రైతుల భవిష్యత్‌ను తెలంగాణ సీఎంకు తాకట్టు పెట్టి.. సీమ ఎత్తిపోతల పథకాన్ని బాబు సర్కారు నిలిపివేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ పిలుపు మేరకు శనివారం చేపట్టిన సోమశిల ప్రాజెక్ట్ సందర్శనపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడా లేని ఆంక్షలతో వేకువజాము నుంచే ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆనం విజయకుమార్‌రెడ్డి నివాసాలకు పోలీసులు చేరుకుని హౌస్ అరెస్ట్‌లతో నానాహంగామా సృష్టించారు. సోమశిల డ్యామ్ సందర్శనకు వెళ్తే శాంతిభద్రతలు అదుపు తప్పుతాయని నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేస్తున్నామని ప్రకటించారు. రైతుల ప్రయోజనాలు తాకట్టు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకుని సీఎం చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేయడంపై శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు సందర్శనకు వైఎస్సార్సీపీ పిలుపునిచి్చంది. జిల్లాలోని రైతులు సోమశిలకు చేరుకుని వారికి జరిగే అన్యాయంపై మీడియాతో మాట్లాడేలా కార్యక్రమానికి రూపకల్పన చేశారు. సీమ ఎత్తిపోతల పథకం నిలిపివేతతో జరిగే నష్టాలపై జిల్లా రైతులు కన్నెర్ర చేయడంతో ఎక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందోనని భయపడిన ప్రభుత్వ పెద్దలు ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులను ప్రయోగించారు.సోమశిల ప్రాజెక్టు వద్దకు ఎవరినీ వెళ్లనివ్వకుండా అన్ని ప్రాంతాల్లో పోలీసులు కఠిన ఆంక్షలు పెట్టారు. రహదారులపై బారికేడ్లు పెట్టి రైతులను అడ్డుకున్నారు. నెల్లూరు నుంచి పొదలకూరు మీదుగా సోమశిల ప్రాజెక్టుకు వెళ్లే రహదారిపై మూడుచోట్ల, సర్వేపల్లి నియోజకవర్గంలోని రైతులను నిలువరించేందుకు రెండు ప్రాంతాలతోపాటు అనంతసాగరం మండలం ఉప్పలపాడు హైవే వద్ద బారికేడ్లు పెట్టి రైతులను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేసి ఉక్కుపాదం మోపారు. కాకాణి నివాసం వద్ద ఉద్రిక్తత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సోమశిల ప్రాజెక్టు సందర్శన కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైన కాకాణిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీఐ శ్రీనివాసరావు పోలీసు బలగాలతో వేకువజాము నుంచే కాకాణి నివాసం వద్ద కాపు కాశారు. ఆయనకు నోటీసు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్యతోపాటు వందలాది మంది కార్యకర్తలు కాకాణి నివాసం వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.సోమశిల ప్రాజెక్టు సందర్శన కోసం వెళ్లడం నేరమా? అంటూ కాకాణి వాహనం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు బలవంతంగా నెట్టేశారు. దీంతో కాకాణితోపాటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పోలీసు ఆంక్షలకు నిరసనగా నెల్లూరులోని పొదలకూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు గంటపాటు రహదారిని దిగ్బంధించడంతో రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు నేతృత్వంలో సీఐలు, ఎస్ఐలు, అదనపు బలగాలు నేతలను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి కాకాణి నివాసంలో ఉంచి హౌస్ అరెస్ట్ చేశారు. కార్యకర్తలపై లాఠీచార్జి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకునే సమయంలో కార్యకర్తలు ఆయనకు అడ్డుగా నిల్చోవడంతో పోలీసులు లాఠీలతో చితక్కొట్టారు. కొందరు కానిస్టేబుళ్లు అత్యుత్సాహం ప్రదర్శించి వైఎస్సార్సీపీ కార్యకర్తలను లాఠీలతో చావబాదారు. పోలీసుల అత్యుత్సాహంపై మాజీ మంత్రి కాకాణి మండిపడ్డారు. తాము శాంతియుతంగా సోమశిల ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం చేపడితే పోలీసులు అత్యుత్సాహం ఏమిటని ప్రశి్నంచారు. పోలీసుల ఓవర్ యాక్షన్ చేస్తే గుర్తు పెట్టుకుంటామని, ఎవరిని వదిలి పెట్టబోమని మండిపడ్డారు. -
Kakani : బాబూ.. అడ్డుకోవాలని చూడకు.. ప్రజలే నిన్ను తరిమి తరిమి కొడతారు
-
కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద హై టెన్షన్..
-
Kakani: దొంగతనం ఏలా చెయ్యాలో బాబు దగ్గర నేర్చుకో.. సోమిరెడ్డికి చెమటలు
-
వింజమూరు ఎంపీపీ ఎన్నిక అప్రజాస్వామికం
ఉదయగిరి: రాష్ట్రంలో కూటమి పాలన అరాచకాలు వింజమూరు ఎంపీపీ ఎన్నిక ఘటనతో పరాకాష్టకు చేరాయని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘గతంలో వైఎస్సార్సీపీ తరఫున వింజమూరు ఎంపీపీగా ఉన్న వ్యక్తిపై అవిశ్వాసాన్ని ప్రకటించి టీడీపీ నేతలు బలవంతంగా పదవి నుంచి దించారు. ఈ నేపథ్యంలో ఎంపీపీ ఎన్నికకు అధికారులు సోమవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీకి తగినంత బలం లేకపోవడంతో కుట్రలకు తెరలేపింది. వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీటీసీ మోహన్‌రెడ్డిని పోలీసులతో బలవంతంగా కిడ్నాప్ చేయించి నిర్బంధించి, కుటుంబ సభ్యులను బెదిరించి ఆ«దీనంలో ఉంచుకున్నారు.ప్రత్యేక సమావేశానికి వస్తున్న ఊటుకూరు ఎంపీటీసీ మల్లికార్జునను పోలీసుల సమక్షంలో టీడీపీ గూండాలు కిడ్నాప్ చేశారు. మరో మహిళా ఎంపీటీసీ ఉంటా రత్నమ్మను కిడ్నాప్ చేసేందుకు యత్నించగా మా పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో ఆమెకు గాయాలయ్యాయి. టీడీపీ సభ్యులకు తగిన కోరం లేనందున తటస్థంగా ఉన్న ఎంపీటీసీనీ పోలీసుల ద్వారా బలవంతంగా స్టేషన్‌కు తరలించి అక్కడి నుంచి ఎమ్మెల్యే కార్యాలయానికి తీసుకెళ్లి అప్పగించారు. ఎమ్మెల్యే బలవంతంగా ఆ వ్యక్తిని సమావేశం దగ్గరకు తీసుకొచ్చి ఎన్నిక వాయిదా పడేందుకు రెండు నిమిషాల ముందు దొడ్డిదారిన లోపలికి పంపారు. అక్కడే తిష్ట వేసిన ఎమ్మెల్యే తమ ఎంపీటీసీలను పోలీసులు, అధికారుల ద్వారా బలవంతంగా బయటకు పంపి ఏకగ్రీవంగా ఎన్నిక పూర్తిచేశారు.ఓటమి భయంతో టీడీపీ బరితెగించి, మా పార్టీ ఎంపీటీసీలను బలవంతం చేస్తూ దౌర్జన్యాలు, దాడులకు తెగబడి ప్రజాస్వామ్య విలువలను కాలరాసింది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకే ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయింది. ఇక సామాన్యుల పరిస్థితులు ఎలా ఉంటాయో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్ విధానాలను, కూటమి పాలనను ప్రజలు ఈసడించుకుంటున్నారు.’’ అని కాకాణి విమర్శించారు. టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా, దౌర్జన్యాలు, అరాచకాలను లెక్క చేయకుండా ఎదురొడ్డి నిలబడిన ఎంపీటీసీలు, వైఎస్సార్సీపీ శ్రేణులకు కాకాణి ధన్యవాదాలు తెలిపారు. వింజమూరులో పోలీసులు, టీడీపీ శ్రేణులు, టీడీపీ ఎమ్మెల్యే గూండాల్లాగా వ్యవహరించిన తీరును వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. -
‘ఎన్నికల కమిషన్‌కు కళ్లు లేవా?.. ఎంపీటీసీలపై దాడులేంటి?’
సాక్షి, తాడేపల్లి/ నెల్లూరు: వింజమూరు ఎంపీపీ ఎన్నికల్లో అధికార టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు వైఎస్సార్సీపీ నేతలు. రాష్ట్రంలో ప్రజాస్వామం లేదు.. ఉప ఎన్నికల్లో సైతం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కళ్లు ఉండి.. గుడ్డిగా వ్యవహరిస్తోందన్నారు.వింజమూరు, బొమ్మనహళ్లి ఎన్నికలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పందిస్తూ..‘వింజమూరు, బొమ్మనహళ్లిలో టీడీపీ నేతలు రౌడీయిజానికి దిగారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏనాడూ ఇలాంటి అప్రజాస్వామ్యమైన పనులు చేయలేదు. ఎంపీటీసీ సభ్యులను పట్టపగలే కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్తుంటే పోలీసులు చోద్యం చూస్తూ నిలబడ్డారు. ఎన్నికల కమిషన్ గుడ్డిగా వ్యవహరిస్తోంది. మా పార్టీ ఎంపీటీసీ సభ్యులను పోలీసుల ఎదుటే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. మహిళా ఎంపీటీసీపై దాడి చేయటంతో చేతికి గాయమైంది. అధికారులు పద్దతులు మార్చుకోవాలి. టీడీపీ గూండాలకు మద్దతుగా వ్యహరించిన వారందరి పేర్లనూ మా డిజిటల్ బుక్‌లో ఎక్కిస్తాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.మరోవైపు.. నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ..‘వింజమూరు ఎంపీపీ ఎన్నికల్లో అధికార టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలపై అతి దారుణంగా దాడి చేశారు. మహిళా ఎంపీటీసీకి గాయలయ్యాయి. సంఖ్యా బలం కోసం నీచ రాజకీయాలకు ఒడిగట్టారు. నైతికంగా వైఎస్సార్సీపీ విజయం సాధించిన విషయం గుర్తుపెట్టుకోవాలి’ అని అన్నారు.ఇదిలా ఉండగా.. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల ఎంపీపీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేయడానికి యత్నించడంతో కలకలం రేగింది. ఐదుగురు ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న కారును టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. అనంతరం, ఎంపీటీసీలపై టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వర్గీయులు రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఓ మహిళా ఎంపీటీసీ రత్నమ్మకు గాయాలయ్యాయి. అంతేకాకుండగా మల్లికార్జున్ అనే వైఎస్సార్సీపీ ఎంపీటీసీని కిడ్నాప్ చేశారు. మరో ఎంపీటీసీ మోహన్ రెడ్డిని పోలీసులు నిర్బంధించారు. ఎన్నిక జరిగే ప్రాంతం అయిన ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే అనుచరుల జులం ప్రదర్శించారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. -
వారం రోజులుగా అజ్ఞాతంలోనే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
నెల్లూరు రూరల్: సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ వారం రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, రాష్ట్ర ప్రజలకు కనీస సమాచారం ఇవ్వకుండా విదేశీ పర్యటనలు చేయడం వెనుక రహస్యం ఏమిటో చెప్పాలని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నెల్లూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘కనీస సమాచారం కూడా ఇవ్వకుండా వారిద్దరూ విదేశీ పర్యటనలకు ఎందుకు వెళ్లినట్టు. తండ్రీ కొడుకుల రహస్య పర్యటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. జనం దృష్టి మరల్చడానికి మళ్లీ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారు.పెట్టుబడులు ఆకర్షించడంలో తమకు ఎవరూ సాటిలేరంటూ ఫోర్బ్స్ ఒక స్టోరీ రాసిందంటూ తండ్రీ కొడుకులు సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచి్చన నాటినుంచి పెట్టుబడులన్నీ కట్టుకథలే తప్ప ఏ ఒక్కటీ నిజం లేదు. చంద్రబాబు రాష్ట్రంలో లేకపోయినా రెవెన్యూ పుస్తకాల ముద్రణ, పంపిణీ గురించి చర్చించినట్టు ఎక్స్‌లో పోస్టులు పెట్టి ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవుల్లో ఉండి ఇలా రహస్య ప్రదేశాల నుంచి ట్వీట్లు వేయడం వెనుక ఉద్దేశం ఏమిటి. వైఎస్ జగన్ గతంలో తన కుమార్తె గ్రాడ్యుయేషన్ డే కోసం లండన్ వెళ్తున్నట్టు చెప్పి మరీ వెళ్లారు. అయినా దాని గురించి ఈ తండ్రీ కొడుకులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కానీ.. చంద్రబాబు, లోకేశ్ ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్లి కూడా ఎక్కడున్నారో చెప్పడం లేదు. అంత రహస్యంగా పర్యటనలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది’అని కాకాణి నిలదీశారు. ‘వీటిలో ఒకటైనా వచ్చిందా’ 2014–19 మధ్య భాగస్వామ్య సదస్సుల ద్వారా 1,761 ఒప్పందాల ద్వారా రూ.18.87 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 30.91 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఊదరగొట్టారు. పరిశ్రమల శాఖ కుదుర్చుకున్న రూ.7.68 లక్షల కోట్ల విలువైన 327 ఒప్పందాల్లో అమల్లోకి వచి్చనవి కేవలం 45 మాత్రమే. 2014–19 మధ్య మూడుసార్లు నిర్వహించిన సీఐఐ సదస్సు సహా అనేక సందర్భాల్లో చంద్రబాబు పెట్టుబడులు, పరిశ్రమలపై గొప్పగా ప్రకటనలు చేశారు. వీటిలో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. అమరావతి నుంచి విశాఖకు నిమిషాల్లో చేరుకునే హైపర్ లూప్ అన్నారు.దొనకొండ వద్ద డ్రోన్ డిఫెన్స్, సుఖోయ్ ఎయిర్ క్రాఫ్ట్ సైంటిఫిక్ ఇండ్రస్టియల్ కలిపి యూనిట్ ఏర్పాటవుతాయన్నారు. నెక్స్ట్ ఆర్బిట్ వెంచర్స్ ద్వారా సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేష¯న్ యూనిట్, కాకినాడ వద్ద పెట్రో కెమికల్ యూనిట్ అంటూ హడావుడి చేశారు. టైటాన్ ఏవియేషన్ విమానాల తయారీ, స్విట్జర్లాండ్‌కి చెందిన ఏరో స్పేస్ వెంచర్స్ రూ.10 వేల కోట్ల పెట్టుబడి, ఎయిర్ బస్, మైక్రోసాఫ్ట్, బ్లాక్ చైన్ టెక్నాలజీకి విశాఖ కేరాఫ్ అన్నారు. వీటిలో ఏ ఒక్కటీ ఏపీకి రాలేదు. చంద్రబాబు హయాంలో బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ నాశనమైంది’అని కాకాణి గోవర్దన్ రెడ్డి ఎద్దేవా చేశారు. -
‘చంద్రబాబు, లోకేష్ ఎక్కడ?.. ప్రజలు అడుగుతున్నారు’
సాక్షి, నెల్లూరు జిల్లా: కూటమి సర్కార్ 19 నెలల పాలన కేవలం ప్రచార ఆర్భాటాలకే పరిమితమైందని.. మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌లు పెట్టుబడులు ఆకర్షించడంలో దిట్టలు అన్నట్టుగా బాకాలు ఊదుతున్నారు. రకరకాల ట్వీట్స్ చేస్తున్నారు. ఈ ప్రచారాలు, ట్వీట్లు ఏ ప్రాంతం నుండి చేస్తున్నారో చెప్పలేరా? మీరు ఉంది.. ఏమైనా రహస్య ప్రదేశమా?. తెలియపరచకూడదా?. చంద్రబాబు, లోకేష్ ఎక్కడ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు’’ అని కాకాణి గోవర్థన్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘వారం రోజులు నుండి లోకేష్ పత్తాలేడు, చంద్రబాబు నాలుగు, ఐదు రోజులుగా జాడ లేదు. మీకు వున్న అనుకూల ఎల్లో మీడియాకు కూడా పాపం సమాచారం లేదు. ప్రజల్లో మీ జాడ ప్రస్తావన వస్తుందంటూ ఈ ట్వీట్ల డ్రామా చేస్తున్నారు. గతంలో కుమార్తెను చూడటానికి వైఎస్ జగన్ లండన్‌కు వెళ్తే బాబు హంగామా చేశారు’’ అంటూ కాకాణి దుయ్యబట్టారు.‘‘నేడు రాష్ట్రంలో అపారమైన పెట్టుబడులని ప్రచారం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల ప్రతిపాదనలకు మాత్రం మొదటి స్థానం అని ఓ పత్రిక రాసింది. ఎన్ని కంపెనీలు కార్యరూపం దాల్చాయి అంటే ఐదు శాతం కూడా లేదు. 2014-19 మధ్యన 1761 కంపెనీలతో ఎంవోయూలు, 18.87 లక్షల కోట్లు పెట్టుబడులు అన్నాడు. అందులో కార్యరూపం దాల్చింది 10 శాతం మాత్రమే, అంటే 90 శాతం అబద్ధాలే...అమరావతి నుండి విశాఖకు హైపర్ లూప్ అన్నాడు.. ఎక్కడ..?. కాకినాడ వద్ద పెట్రో కెమికల్ యూనిట్ అన్నాడు.. ఎక్కడ ?. ఏవియేషన్, విమానాల తయారీ అన్నాడు.. ఎక్కడ బాబు..?. ఏయిర్ బస్సు, మైక్రోసాఫ్ట్ రకరకాల పేర్లు చెప్పాడు. 2023 మా హయాంలో 394 ఒప్పందాలు చేసుకున్నాము. 13.15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయి అంచనా వేశాం. తద్వారా 6.16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అన్నాం. మొదటి సంవత్సరంలోనే 20 శాతం ఎంవోయూలు కార్యరూపం దాల్చాయి. జగన్ నిర్ణయాలు, సంస్కరణలతో 91.6 శాతం కార్యరూపం దాల్చాయి. కరోనా విపత్కర పరిస్థితిల అనంతరం 17.700 లక్షల కోట్లు పెట్టుబడులు వాస్తవ రూపం చేశాం. వాస్తవాలు దాచి 2019-24 మధ్యలో ఏపీ బ్రాండ్ నాశనం అయిపోయింది అంటూ దుష్ప్రచారం చేశారు’’ అని కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. -
ఇరిగేషన్ శాఖలో భారీ అవినీతి: మాజీ మంత్రి కాకాణి
-
అవినీతిని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడతారా?: కాకాణి
సాక్షి, నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు పోలీస్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిరసనకు దిగారు. వైఎస్సార్సీపీ నాయకుడు ప్రభాకర్‌రెడ్డిపై మనుబోలు పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. మనుబోలు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న కాకాణి.. ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న అవినీతి ప్రశ్నిస్తూ పోస్ట్ పెడితే కేసులు కడతారా? అంటూ మండిపడ్డారు.కావాలనే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారు. మా పార్టీ నాయకులు ఫిర్యాదులు ఇస్తే పట్టించుకోవడం లేదు. కూటమినేతలు తప్పుడు ఫిర్యాదులు ఇస్తే వెంటనే అక్రమ కేసులు కడుతున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు నేను బతికున్నంత కాలం అండగా నిలబడతా’’ అని కాకాణి పేర్కొన్నారు. -
కాకాణి రిట్ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్న్రెడ్డి రిట్ పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. తనపై నమోదైన 9 అక్రమ కేసుల్లో సీబీఐ విచారణను కాకాణి కోరారు. రిట్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని.. ఏపీ ప్రభుత్వం, సీబిఐ, సిఐడీతో పాటు ప్రతివాదులను హైకోర్టు ధర్మాసనం అదేశించింది. గతంలో తనపై నమోదైన కేసులపై సీబీఐ విచారణ జరపాలని సీఎం చంద్రబాబుకు మెయిల్ చేశారు. సీఎం స్పందించకపోవడంతో కాకాణి.. హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు.కాగా, చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను, అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తుండటంతో కాకాణిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో కాకాణి గోవర్ధన్‌రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 85 రోజులు జైల్లో ఉన్న ఆయన కాకాణి గోవర్దన్‌రెడ్డి.. బెయిల్ రావడంతో బయటకువచ్చారు. అక్రమ కేసులు బనాయించడంతో.. కూటమి ప్రభుత్వంపై ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. -
‘నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు నేను సిద్ధం.. సోమిరెడ్డి సిద్ధమా?’
సాక్షి, నెల్లూరు జిల్లా: అక్రమ కేసులకు బెదిరేదే లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. ‘‘సోమిరెడ్డి అక్రమాలపై ధర్మ పోరాటం చేశాను. దేవాలయాల భూములు కాజేస్తున్నాడని ఎమ్మెల్యే సోమిరెడ్డిని ప్రశ్నించడం నేరమా..?. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఏంటి.. కొంచెం అయిన సిగ్గు పడ్డాలి’’ అంటూ కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘టీడీపీ ఎమ్మెల్యే సొమిరెడ్డి నోరు తెరిస్తే అబద్ధాల కంపు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దేవుడి భూమలకు కాపలా కాశాం. టీడీపీ కూటమి పాలకులు దేవుడి భూములను కబ్జా చేస్తున్నారు. దేవుడి ధర్మాన్ని పక్కనపెట్టి దోపిడీ ధర్మాన్ని పాటిస్తున్నారు. సోమిరెడ్డిలాంటి దొంగల మీద కేసు పెట్టకుండా మీద నా మీద పెట్టడమేంటి?’’ అని కాకాణి మండిపడ్డారు.‘‘సోమిరెడ్డి దమ్ముంటే నార్కో అనాలిసిస్ టెస్ట్‌కి సిద్ధమా?. నువ్వు కోటి రూపాయలు తీసుకుని దేవుని భూమిని అక్రమార్కులకు ఇచ్చావని చెప్పడానికి నేను టెస్ట్‌కు సిద్ధం’’ అని కాకాణి సవాల్ విసిరారు.దేవుడు భూములు దగ్గరకు పోలీసులు వస్తే నిజాలు బయటకు వస్తాయి. కాకుటూరు శివాలయం భూములు సోమిరెడ్డి కబ్జా చేశారు. 1980లో హరిప్రసాద్‌రెడ్డి అనే దాత శివాలయానికి భూములిచ్చారు. దేవాదాయ భూమి అని ప్రభుత్వ రికార్డ్ల్లోనే ఉంది. దేవుడి భూములు వేరుచేసి పెన్సింగ్ వేయాల్సిన అవసరం ఏంటి?. దేవుడి భూములు వేరుచేసి రోడ్డు ఎందుకు వేశారు?. సోమిరెడ్డి రూ.కోటి తీసుకుని దేవుడి భూమిని అక్రమార్కులకు కట్టబెట్టారు. కాకుటూరులో సర్వే నెంబర్ 63-ఏ1లోని 0.48 సెంట్ల భూమిని ఆక్రమించారు. భూమిని ఆక్రమించి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు’’ అని కాకాణి ఆరోపించారు. -
కక్ష సాధింపు.. కాకాణిపై మరో అక్రమ కేసు
సాక్షి, నెల్లూరు జిల్లా: మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై మరో అక్రమ కేసు నమోదైంది. రాజకీయ విమర్శలు ఎదుర్కొలేక కాకాణిపై సోమిరెడ్డి అనుచరులు ఫిర్యాదు చేశారు. వెంకటాచలం పీఎస్‌లో సోమిరెడ్డి అనుచరులు ఫిర్యాదు చేశారు. కాకాణిపై కేసు నమోదు చేయాలని సోమిరెడ్డి ఆదేశాలు చేయగా.. కక్ష సాధింపులో భాగంగా కాకాణిపై అక్రమ కేసు నమోదు చేశారు.కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తుండటంతో కాకాణిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా సర్కారు పెద్దల బరితెగింపు హద్దులు మీరుతోంది. ప్రశ్నించే వారే ఉండకూడదని హూంకరిస్తూ నిత్యం తప్పుడు కేసులతో చెలరేగిపోతోంది.ఈ ఏడాది మే నెలలో కాకాణి గోవర్ధన్‌రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 85 రోజులు జైల్లో ఉన్న ఆయన కాకాణి గోవర్దన్‌రెడ్డి.. బెయిల్ రావడంతో బయటకువచ్చారు. అక్రమ కేసులు బనాయించడంతో.. కూటమి ప్రభుత్వం ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు. -
సీబీఐ దర్యాప్తునకు టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధమా?.. కాకాణి సవాల్
సాక్షి, నెల్లూరు: వరుస తుపాన్లు, వరదల కారణంగా రైతులు నష్టపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని, కూటమి ప్రభుత్వానికి వ్యవసాయంపై నిర్లక్ష్యం కాగా, సీఎం చంద్రబాబుకు రైతులంట ఏహ్యభావమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు. మొంథా తుపాను, తాజా దిత్వా తుపానుతో నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు పరిహారం, ఇన్‌ఫుట్ సబ్సిడీ ఏదీ ఇవ్వలేదని ఆయన విమర్శించారు. అధికార పార్టీ నేతలు వరద సాయాన్ని దొంగ బిల్లులు పెట్టి దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప, రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి వారిలో లేదని నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి దుయ్యబట్టారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:అసలు ప్రభుత్వం అనేది ఉందా?:రాష్ట్రంలో గత నెల మొంథా తుపాన్, తాజాగా దిత్వా తుపాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా మొత్తం నష్టపోయినా ఇప్పటి వరకు ప్రభుత్వం పరిహారం ప్రకచించలేదు. ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. జిల్లాలో వరినాట్లు పూర్తిగా పాడైపోయాయి. ఎకరాకు రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చు పెట్టిన రైతులకు పైసా సహాయం లేదు. పంట నష్టం అంచనా వేసేందుకు అధికారులు గ్రామాలకు వెళ్లలేదు.ఇవన్నీ చూస్తుంటే, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఉందా అన్న సందేహం కలుగుతోంది. తుపాన్ల సమయంలో ప్రభుత్వం పట్టించుకోకపోతే, మా పార్టీ చాలా చోట్ల భోజన వసతి ఏర్పాటు చేసి ప్రజలకు అండగా నిల్చింది. గతంలో మా ప్రభుత్వ హయాంలో 2023లో ఇలాంటి పరిస్థితి తలెత్తితే, చాలా వేగంగా స్పందించాం. రైతులను వెంటనే ఆదుకున్నాం.మా ఎమ్మెల్యే ఆ మాటలు ఫాలో అవుతున్నారు:సీఎం చంద్రబాబు ఎప్పుడూ ఒక మాట అంటారు. ‘సంక్షోభంలో అవకాశాలు వెతుక్కోండి’ అని ఆయన చెబుతుంటారు. వాటిని మా సర్వేపల్లి ఎమ్మెల్యే గట్టిగా వంట బట్టించుకున్నాడు. అందుకే కష్టనష్టాల్లో ఉన్న రైతులను ఎలా ఆదుకోవాలని ఆలోచించకుండా, ఎక్కడ దొంగ బిల్లులు పెట్టుకోవచ్చని ఆలోచిస్తున్నారు. మా జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఫ్లడ్ డ్యామేజ్ మరమ్మతుల పేరిట కోట్లు దోచుకుంటున్నారు. రైతుల పేరు చెప్పి గతంలో నీరు–చెట్టు కార్యక్రమంలో ఎలా అయితే దోచుకున్నారో.. ఈరోజు మరమ్మతు పేరిట మళ్లీ అదే చేస్తున్నారు.అరాచకంగా మారిన విజిలెన్స్ విభాగం:ఈరోజు విజిలెన్స్ దర్యాప్తు అన్న దానికి అర్థమే పూర్తిగా మారిపోయింది. అధికార పార్టీ నేతల ఆదేశాలను రాసి పెట్టే కార్యాలయంగా ఇక్కడి విజిలెన్స్ విభాగం తయారైంది. ఒకసారి జిల్లా విజిలెన్స్ అధికారుల కాల్ లిస్టులు బయటపెడితే, మంత్రి, ఎమ్మెల్యేలతో ఎలాంటి సంబంధాలు కొనసాగుతున్నాయి.. వారి ఆదేశాలు అధికారులు ఎలా అమలు చేస్తున్నారనేది బయటపడుతుంది. విజిలెన్స్, ఏసీబీ విభాగాలు.. జిల్లాలో అధికార పార్టీ నేతల ఇళ్లకు వెళ్లి, వారితో ఫోన్లలో మాట్లాడి, వారి ఆదేశాలు, సూచనలకు అనుగుణంగా రిపోర్టులు తయారు చేస్తున్నారు. ఇదే అత్యంత దారుణం. అరాచకం.దమ్ముంటే బహిరంగ చర్చకు రండి:మీ ప్రభుత్వంలో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోంది. కూటమి ప్రభుత్వం ఏ ఒక్క రైతుకూ మేలు చేయడం లేదు. అదే గత మా వైయస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో రైతుల చేయి పట్టుకుని నడిపించాం. విత్తనం మొదలు, పంటల అమ్మకాల వరకు గ్రామాల్లో ఆర్బీకేలు రైతుల కోసం పని చేశాయి. అందుకే మీకు, దమ్ము, ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రండి. మీడియా, రైతుల సమక్షంలో ఎక్కడైనా కూర్చొని మాట్లాడుదాం. జగన్‌గారి హయాంలో రైతులకు ఎలా సహాయం జరిగింది? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎలా దోపిడీ జరుగుతోంది.. అన్నదానిపై కూలంకషంగా చర్చిద్దాం. నా నియోజకవర్గం సర్వేపల్లిలోనే చర్చ మొదలు పెడదాం. మరి మీరు అందుకు సిద్ధమా?.విజిలెన్స్ రిపోర్టులపై సీబీఐ విచారణకు సిద్ధమా?:వరద సాయాన్ని అధికార పార్టీ నేతలు దొంగ బిల్లులతో దోచుకుంటున్నారు. వీటిని సీబీఐ విచారణ పెడితే ఎంత మంది అధికారులు ఇళ్లకు వెళ్తారో, ఎన్ని అవకతవకలు బయటపడతాయో తెలుస్తుంది. ఈరోజు ఫాల్స్ విజిలెన్స్ రిపోర్టులు తయారు చేసి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. విచారణ సంస్థలు కూడా పూర్తిగా రాజకీయ బానిసలయ్యాయి. ఈ దుస్థితి కొనసాగితే సమాజంపై ప్రమాదకర ప్రభావం ఉంటుంది. అధికారంలో ఉండి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వ్యవసాయ మంత్రికి లెటర్ రాయడం విడ్డూరంగా ఉంది. ఆయనకు నేరుగా మంత్రితో, ప్రభుత్వంతో మాట్లాడే దమ్ము, ధైర్యం లేదా?. ఏదేమైనా కోట్ల రూపాయల దోపిడిపై సీబీఐ విచారణకు అధికార పార్టీ నేతలు సిద్ధమా?వ్యవసాయ మంత్రి పారిపోతున్నారు:వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడికి అసలు వ్యవసాయం గురించే తెలియదు. ఆయన రైతుల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో మేం చర్చకు సిద్ధమైతే అచ్చెన్నాయుడు తోక ముడుచుకుని పారిపోయాడు. ఇప్పుడు కూడా అచ్చెన్నాయుడు వేదిక, సమయం నిర్ణయిస్తే గత ప్రభుత్వ రైతు సంక్షేమం, ఈ ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ చర్చకు మేం సిద్ధం. కానీ, ఆయన పారిపోతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు. -
Kakani : నెల్లూరు రైతుల పరిస్థితి ఎలావుందంటే.. సీఎం అని చెప్పుకోవడానికి కూడా..
-
పిచ్చెక్కి మాట్లాడుతున్నావా.. సోమిరెడ్డిపై కాకాణి ఫైర్
-
Kakani: గంజాయి డాన్ కామాక్షి ఇంటిని ప్రజలే నేల మట్టం చేశారు
-
కూటమి సర్కార్‌పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరులో గంజాయి డాన్ అరవ కామాక్షి పక్కాగా టీడీపీకి చెందిన వ్యక్తి అని, ఆ పార్టీ ఎమ్మెల్యేనే ఆమెకు అండగా ఉన్నారని, ఆ మేరకు అనేక ఫోటోలు కూడా ఉన్నాయని వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. అయినా కామాక్షి వైఎస్సార్సీపీకి చెందిందంటున్నారని, అలా తమ పార్టీకి మసి అంటించాలని చూస్తున్నారని ఆయన ఆక్షేపించారు. చివరకు సీఎం చంద్రబాబు సైతం నిస్సిగ్గుగా అవే మాటలు మాట్లాడుతున్నారని కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన ఏం మాట్లాడారంటే..:అందుకే కామాక్షి ఇల్లు కూల్చారు:కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. నెల్లూరులో అరవ కామాక్షి ఇల్లు కూల్చివేత ప్రజల అసహనానికి ఒక నిదర్శనం. ఒక హంతకురాలి ఇంట్లో 25 కేజీల గంజాయి దొరికిందంటే, ఆమెకు అధికార పార్టీ అండ ఉన్నట్లు కాదా? ఇంకా అది ఇంటలిజెన్స్ వైఫల్యం కాదా?. అయినా సీఎం చంద్రబాబు వైయస్ఆర్సీపీపై నెపం నెట్టుతున్నారు. కామాక్షి మా పార్టీకి చెందిందని నిస్సిగ్గుగా చెబుతున్నారు. పెంచలయ్య హత్యపై ఇటీవల సీఎం ఒక బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఇది అత్యంత హేయం.రాష్ట్రంలో చెలరేగుతున్న డ్రగ్స్ మాఫియా:రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోవడం వల్ల ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. నెల్లూరులో మాదకద్రవ్యాల వ్యతిరేకంగా పోరాడిన సామాజిక ఉద్యమకారుడు పెంచలయ్య హత్య ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. చెడు అలవాట్ల నిర్మూలన కోసం పెంచలయ్య అనేక కార్యక్రమాలు నిర్వహించగా, వాటిని సహించలేని గంజాయి, డ్రగ్స్ మాఫియా దారుణంగా హత్య చేసింది. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ నిర్మూలిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు 550 రోజులు పూర్తైనా ఆ పని చేయలేదు. పైగా పరిస్థితి మరింత దయనీయంగా మారింది. డ్రగ్స్ స్మగ్లర్లకు చంద్రబాబు ప్రభుత్వం అండగా నిలుస్తోంది.ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం:పెంచలయ్య హత్యలో ప్రధాన నిందితురాలు అరవ కామాక్షిని పోలీసులు అరెస్టు చేసి సోదాలు జరపగా, ఆమె ఇంట్లో 25 కేజీల గంజాయి బయటపడింది. ఆమె టీడీపీ నేతల అండతోనే ఇదంతా చేసిందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ ఈ గంజాయి నిజంగా వైయస్ఆర్సీపీ వాళ్లది అయితే అమ్మే ధైర్యం వారికి ఉంటుందా?.చివరకు ప్రజలు స్వయంగా కామాక్షి ఇల్లు కూల్చివేశారంటే మీ ప్రభుత్వంపై నమ్మకం పోయింది అని సందేశం కాదా? కామాక్షి ఇంట్లో గంజాయి ఉన్నట్లు తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో ఆమె ఇంటిని కూల్చివేయడం ప్రజల్లో పెరిగిన అసహనానికి నిదర్శనం. ఈరోజు కామాక్షి ఇల్లు కూల్చారు. రేపు మీ ప్రభుత్వాన్నే కూల్చేస్తారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి బాబూ.టీడీపీ ద్వంద్వ ప్రమాణాలు:బంద్‌కు ముందు మద్దతు.. ఆ తర్వాత అడ్డుకోవడం. ఇది టీడీపీ రెండు కళ్ల సిద్ధాంతం. ద్వంద్వ ప్రమాణాలు. డిసెంబర్ 2న నెల్లూరు బంద్‌కు టీడీపీ, వైయస్ఆర్సీపీ, సీపీఐ, కాంగ్రెస్‌లు మద్దతు తెలిపినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటించారు. తీరా బంద్ సందర్భంగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ర్యాలీ నిర్వహిస్తే పోలీసులతో అడ్డుకోవడం ఏమిటి?. ముందుగా మద్దతు ఇచ్చి తరువాత వెనక్కి తగ్గడం టీడీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం కాదా?.పోలీసులు ఎందుకు భయపడుతున్నారు?:టీడీపీ ప్రభుత్వం రౌడీషీటర్లకు అండగా ఉండటంతో అరాచకాలు పెరిగిపోతున్నాయి. డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్టు చేస్తే వెంటనే ఎమ్మెల్యేల ఆఫీసుల నుంచి ఫోన్లు వెళ్తు్తన్నాయి. కేసుల తీవ్రత తగ్గించి, నిందితులను వదిలివేయడం, అమాయకులను ఇరికించే పరిస్థితి నెలకొంది. పోలీసులు ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరపాల్సిన స్థితి వచ్చింది. ఇది ఎంత దారుణమో పోలీసులే ఆత్మపరిశీలన చేసుకోవాలి. పోలీసులు నిద్ర లేచింది మొదలు ప్రతిపక్షంపై కేసులు పెట్టడానికి మాత్రమే పని చేస్తున్నారు. డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు లేవు.ప్రజలు తిరగబడ్డారు. ఇక మౌనం పాటించరు:పెంచలయ్య హత్యకు నిరసనగా ప్రజలు చేపట్టిన బంద్‌కు వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించింది. అంతే కాకుండా పెంచలయ్య కుటుంబానికి మా పార్టీ పూర్తి అండగా ఉంటుంది. ఇవాళ్టి (మంగళవారం) బంద్ విజయవంతం కావడం.. ప్రజలు ఈ ప్రభుత్వంపై తిరగబడ్డారని చెప్పడానికి నిదర్శనం. పెంచలయ్య సమాజహితం కోసం పని చేశాడు. అలాంటి వ్యక్తిని హత్య చేయడం అత్యంత దుర్మార్గం. ఇవన్నీ చూస్తుంటే.. టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజలు తిరగబడ్డారని, వారు ఇక మౌనం వహించరని అర్థమవుతోందని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. -
Kakani: కూటమి అధికారంలోకి వచ్చాక నెల్లూరు జిల్లాలో హత్యలు పెరిగాయి
-
‘రైతుల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు’
నెల్లూరు : జిల్లాలో పునర్విభజన అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వంద్వ ధోరణి గురించి చర్చించెకోవాల్సిన అవసరం ఉందన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. 2019లో వైఎస్ జగన్ చెప్పిన విధంగా ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాలు చేశారని, భౌగోళిక పరిస్థితులను, ప్రజల అభ్యంతరాలను అనుగుణంగా ఆనాడు విభజన చేయడం జరిగిందన్నారు. ఆ రకంగా 26 జిల్లాలను పునర్విభజన చేశారన్నారు. ఇప్పుడు చంద్రబాబు రైతుల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు కాకాణి. ‘ఆ రోజు భౌగోళిక పరిస్థితుల దృశ్య వెంకటగిరి నియోజకవర్గం లోని రాపూర్, కలువాయా, సైదాపురాన్ని నెల్లూరు జిల్లాలో చేర్చడం జరిగింది. నేడు చంద్రబాబు ఓ డ్రాఫ్ట్ విడుదల చేసి ఈ మూడు మండలాలను తిరిగి తిరుపతి జిల్లాలో కలుపుతామని అంటున్నారు. ఈ విభజన ద్వారా రైతాంగం, ప్రజానికం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. జలాశయాలు నీటి విడుదలలో అనేక సమస్యలు ఎదురవుతాయి. సోమశిల, కండలేరు జలాశయాలకు సంబంధించిన నీటి విడుదల కమిటీలో ఈ నియోజకవర్గ ప్రతినిధులు ఆ జిల్లాలో ఉండే అవకాశం లేదు’ అని పేర్కొన్నారు. -
మీ డ్రామాలు ఆపండి.. కోటంరెడ్డి అండతోనే పెంచలయ్య హత్య
-
వదిలిపెట్టం అన్నీ చూస్తున్నాం రాజా లోకేష్ కు కాకాణి వార్నింగ్
-
Kakani : గంజాయి వద్దన్నందుకు చంపేస్తారా..! కోటంరెడ్డి..ఇక నటించకు
-
లా అండ్ ఆర్డర్ విషయంలోనూ చంద్రబాబు మోసమే!
సాక్షి, నెల్లూరు జిల్లా: రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని.. అందుకు నిదర్శనమే ప్రజా ఉద్యమకారుడు పెంచలయ్య దారుణ హత్య అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేవలం మాదకద్రవ్యాలపై పోరాటం చేస్తున్నాడనే కారణంతోనే పెంచలయ్యను హత్య చేశారన్నారు. ‘‘హత్య చేసిన నిందితులు మరోవైపు పోలీసులపై దాడి చేశారు. డ్రగ్స్ మాఫియా పోలీసులపైనే తిరగబడుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అంటూ కాకాణి ప్రశ్నించారు. ‘‘ఏపీని గంజాయి, డ్రాగ్స్ హబ్‌గా చంద్రబాబు మార్చారు. వంద రోజుల్లో గంజాయి నిర్ములిస్తానన్న చంద్రబాబు.. నేడు 555 రోజులవుతుంది అధికారం చేపట్టి.. నేడు శాంతి భద్రతల విషయంలో కూడా మోసం చేస్తున్నారు. చంద్రబాబుకు ఇప్పటికైనా కనువిప్పు కలుగుతుందని నేను అనుకోవడం లేదు. లోకేష్ ఆధ్వర్యంలో ఏదో సబ్ కమిటీ అన్నారు. ఏం వెలగబెట్టాడో సమాధానం చెప్పాలి...విశాఖ కేంద్రంగా జాతీయ డ్రగ్స్ ముఠా లావాదేవీలు జరుపుతున్న తీరు చూశాం. ఇతర దేశస్థులు వచ్చి రాష్ట్రంలో ఇలాంటి మాదకద్రవ్యాల సరఫరా సాగిస్తుంటే నిఘా వర్గం ఏం చేస్తోంది?. కేవలం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు అనుకూలంగా ఇంటిలిజెన్స్ పనిచేస్తుంది తప్ప ఇంకోటి లేదు’ అంటూ కాకాణి మండిపడ్డారు. -
మీసం లేనోడు మీసం తిప్పుతా అన్నట్టు.. టీడీపీ నేతలపై కాకాణి పంచులు అదుర్స్
-
టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డికి మాజీ మంత్రి కాకాణి సవాల్
-
జగన్ హైదరాబాద్ పర్యటన పై ఎల్లో మీడియా చిల్లర డిబేట్లు... ఏకిపారేసిన కాకాణి
-
Kakani: జైల్లో జోగి రమేష్ మాతో ఏం చెప్పాడంటే
-
Kakani: రేపటి రోజు అనేది ఒకటి ఉంటుంది గుర్తుపెట్టుకో
-
రైతులకు ఒకే ఏడాది 7800 కోట్లు.. అది జగన్ ట్రాక్ రికార్డు
-
‘సర్వేపల్లి’లో కోటి సంతకాలు సక్సెస్
పొదలకూరు: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉవ్వెత్తున వ్యతిరేకత ఎగిసిపడింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం సర్వేపల్లిలో ఆదివారంతో పూర్తయింది. ఈ నియోజకవర్గంలో 60 వేల సంతకాల సేకరణను చేపట్టాలని పార్టీ అధిష్టానం లక్ష్యంగా నిర్ణయించింది. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ లక్ష్యాన్ని ముందుగానే పూర్తిచేయడంతో ప్రైవేటీకరణపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు అద్దంపట్టింది.ఈ నెల 22 నాటికి సంతకాల సేకరణ పూర్తిచేయాల్సి ఉండగా, 16వ తేదీకే కాకాణి పూర్తిచేయించి ముగింపు సభను పొదలకూరు మండలం విరువూరులో ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలనను ఖండిస్తూ సర్వేపల్లిలో పెద్దఎత్తున నిర్వహించిన ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలను పెట్టారు. బిడ్డల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కోటి సంతకాల సేకరణలో భాగస్వామ్యులయ్యారు. పేదలకు ప్రభుత్వ వైద్యం దూరం అవుతుందని చాటిచెబుతూ కాకాణి గోవర్థన్‌రెడ్డితో పాటు ఆయన కుమార్తె, పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత నియోజకవర్గంలో పర్యటించి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. -
Kakani: ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ చేసిన ప్రతి ఒక్క YSRCP నేతకు ధన్యవాదాలు
-
Kakani: కిరాణా షాపు ఫ్రీజర్‌లో బీర్లు పెట్టి అమ్ముతున్న వైనం
-
మంత్రి అచ్చెన్నాయుడుకు కాకాణి సవాల్
సాక్షి, నెల్లూరు: మంత్రి అచ్చెన్నాయుడుకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. అలాగే, రైతుల సమస్యలపై చర్చించేందుకు చంద్రబాబు, అచ్చెన్నాయుడు సిద్ధమా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీ హయాంలో ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతులకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. వైఎస్ జగన్ తెచ్చిన వ్యవస్థలను చంద్రబాబు కుట్రపూరితంగా నిర్వీర్యం చేశారు. చంద్రబాబు మాటలను నమ్మ ప్రజలు, రైతులు మోసపోయారు. కూటమి నేతల తీరు చూసి ప్రజలు ఛీకొడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం. అసెంబ్లీ సాక్షిగా కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులే విమర్శలు చేసుకుంటున్నారు. రైతులు సమస్యలపై చర్చించేందుకు చంద్రబాబు, అచ్చెన్నాయుడు సిద్ధమా? అని సవాల్ విసిరారు.కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. ఏపీలోని బెల్టు షాపుల్లో 90 శాతం నకిలీ మద్యమే. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో బెల్టు షాపులను ఎత్తేశాం. ప్రజల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కలేదు. మద్యం బాటిళ్లపై క్యూఆర్ కోడ్ ఎక్కడుంది?. ఎక్సైజ్ అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రజల ఆరోగ్యంతో సంబంధం లేకుండా దోచుకుంటున్నారు’ అని ఘాటు విమర్శలు చేశారు. -
Kakani: నీకెందుకు అంత తొందర.. ఎగిరెగిరి పడకు రా.. చంద్రబాబుపై కాకాణి అదిరిపోయే సెటైర్లు
-
హ్యాట్సాఫ్ వంగా గీత.. పవన్ చేయాల్సిన పని చేస్తుంది కాకాణి స్ట్రాంగ్ కౌంటర్
-
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు
-
చంద్రబాబుకు రైతులంటే పగ: కాకాణి
సాక్షి, నెల్లూరు: కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. పత్తి కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదంటూ నిలదీశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వర్షాలకు వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని.. వారిని ఆదుకోవాలన్నచిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు.చంద్రబాబుకు రైతులంటే పగ.. వారి గోడును పట్టించుకునే పరిస్థితిలో లేడు. రైతుల సమస్యలను గాలికొదిలేసి తండ్రీకొడుకులు విదేశాల్లో తిరుగుతున్నారు. రైతుల సమస్యలపై చంద్రబాబు, లోకేష్ హేళనగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ యూరియా కొరత లేదు. కూటమి పాలనలో యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబే అంగీకరించారు’’ అని కాకాణి గుర్తు చేశారు.‘‘తుపాను నేపథ్యంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు, హెచ్చరికలు లేవు. వరి నాట్లు వేసిన తరువాత యూరియా కొరత ఏర్పడింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. నెల్లూరు జిల్లాకు సంబంధించి 2 లక్షల ఎకరాలలో రైతులు నష్టపోయారు. మరో వైపు లక్ష ఎకరాలలో నెల్లూరు, కర్నూలు, ఒంగోలులో నీట మునిగిపోయింది. రాష్ట్రంలో వ్యవసాయ శాఖా మంత్రి పనిచేస్తున్నాడా?. రైతుల కష్టాలపై ఏమాత్రం అయినా స్పందన ఉందా?...ఇప్పటికే మామిడి రైతులు, పత్తి రైతులు భారీగా నష్టపోయారు. తాజా వర్షాలతో 50 వేల ఎకరాల పంట నష్టపోయారు. మొక్కజొన్న రైతులు ఎకరానికి 12 వేల రూపాయలు మేర నష్టపోయారు. కృష్ణ, గోదావరి డెల్టాలలో తుపాన్ నేపథ్యంలో వరి రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం వుంది. పంట నష్టం పై ఎక్కడా నష్టపరిహారం లేదు. చంద్రబాబుకు రైతు అంటే పట్టదు.. వ్యవసాయం అంటే గిట్టదు. చంద్రబాబు ఇప్పటి వరకు రైతులపై ఒక్క సమీక్ష నిర్వహణ లేదు. టమోటా రైతులు, ఉల్లి రైతులను హేళనగా మాట్లాడే పరిస్థితి... వైఎస్ జగన్ హయాంలో ఏనాడు అయినా యూరియా కోసం రైతు కష్టపడ్డ పరిస్థితులు లేవు. రైతుల కోసం జగన్ నిర్మించిన రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశాడు. ఇన్పుట్ సబ్సిడీ ఊసే లేదు. చంద్రబాబు ఏనాడు సీఎం అయినా రాష్ట్రం దుర్భిక్షం... రైతాంగానికి తీరని నష్టం. అన్నదాత సుఖీభవ సాక్షిగా రైతులకు 20 వేలు ఇస్తానని హామీ ఇచ్చాడు. నేడు కేవలం ఐదు వేలు ఇచ్చి మోసం చేశాడు. వ్యవసాయ శాఖ మంత్రి దళారీల లబ్ధి కోసం పనిచేస్తాడు తప్ప రైతుల కోసం కాదు. రైతులను ఆదుకోకపోతే వైఎస్సార్సీపీ వారికి తోడుగా నిలుస్తుంది. ఎకరానికి మూడు బస్తాలు ఇవ్వడం, దానికి కార్డులు పంచడం హాస్యాస్పదం. యూరియా విషయంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయింది. యూరియా కోసం రేషన్లాగా కార్డులు పంచిన చరిత్ర హీనుగా చంద్రబాబు నిలిచిపోతాడు. రైతులకు అవసరం మేర యూరియా పంపిణీ చేయాలి’’ అని కాకాణి డిమాండ్ చేశారు. -
సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?: కాకాణి
సాక్షి, నెల్లూరు: నకిలీ మద్యం వ్యవహారంలో సీఎం చంద్రబాబు కుట్రలు వెలుగు చూస్తున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్థన్‌రావుతో ఒక వీడియోను కుట్రపూరితంగా తయారు చేయించి, జోగి రమేష్ పేరు చెప్పించడం ద్వారా వైఎస్సార్సీపీకి ఆ బురదను అంటించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో కీలకమైన నిందితుడు, టీడీపీ నేత జయచంద్రారెడ్డిని ఏపీకి తీసుకురావడంలో ఎందుకు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. సీబీఐ విచారణకు ఎందుకు చంద్రబాబు భయపడుతున్నారని నిలదీశారు. ఇంకా ఆయనేమన్నారంటే..డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే చంద్రబాబు ఒక పథకం ప్రకారం కుట్రలకు పాల్పడుతున్నారు. నకిలీ మద్యం విషయంలో చంద్రబాబు నీచమైన డ్రామాలకు పాల్పడుతున్నారనే దానిని ప్రజలు గమనిస్తున్నారు. నకిలీ మద్యం తయారీ ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దీనికి కారకులైన తన పార్టీ వారిని కాపాడుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందే తప్ప, దీని మూలాలను దర్యాప్తు చేసి, దానిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా లేదు.ప్రజల దృష్టిని మళ్ళించేందుకు నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పేరును తెరమీదికి తీసుకువచ్చారు. చంద్రబాబు ఇంటిపైన దాడి చేశారంటూ గతంలోనే జోగి రమేష్‌పై ఆయనకు అక్కసు ఉంది. ఎవరైతే గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారో, నేడు కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై గళం ఎత్తుతున్నారో వారిపైన దాడులు చేయించాలి, పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టాలనే లక్ష్యంతోనే చంద్రబాబు పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం ప్రారంభించింది.కూటమి ప్రభుత్వంలోనే ఈ దందా అని నిర్థారించిన ఎక్సైజ్ అధికారులునకిలీ మద్యం తయారీలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు, చంద్రబాబు, లోకేష్‌లతో సన్నిహత సంబంధాలు ఉన్నవారే సూత్రదారులు అని బయటపడింది. సాక్షాత్తు తంబళ్ళపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసిన జయచంద్రారెడ్డి ప్రమేయం వెలుగుచూసింది. అయినా కూడా సిగ్గులేకుండా విషయాన్ని డైవర్ట్ చేయడానికి నకిలీ మద్యం మరకను వైఎస్సార్సీపీపై రుద్దడానికి చంద్రబాబు అండ్ కో ప్రయత్నిస్తోంది. నకిలీ మద్యం వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఈ నెల 3వ తేదీన ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ పరిశ్రమ బయటపడింది.నకిలీ మద్యం, సీసాలు, లేబుళ్ళు వెలుగుచూశాయి. ఇబ్రహీంపట్నంలో వేల లీటర్ల మద్యంను నిల్వ చేసిన గోడవున్ను గుర్తించారు. ఈ దందా రెండుమూడు నెలలుగా జరుగుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చినట్లుగా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషన్ చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. డిప్యూటీ కమిషన్ మూడు నెలలుగా జరుగుతున్నట్లు చెప్పారు.రెండుమూడు నెలలుగా ఈ నకిలీ మద్యం దందా రెండుమూడు నెలల నుంచే జరుగుతోందని ఒకవైపు ప్రభుత్వ అధికారులు చెబుతుండటంతో ఇది కూటమి ప్రభుత్వం హయాంలోనే అనే విషయం ప్రజలకు తెలిసిపోతుందనే భయంతో ఈ నకిలీ మద్యం దందా రెండు మూడేళ్ల నుంచి జరుగుతోందంటూ వైఎస్సార్సీపీకి కూడా ఆ బురదను అంటించే కుట్రకు ఈ ప్రభుత్వం పాల్పడుతోంది. అందులో భాగంగా ఒక విషప్రచారాన్ని ప్రారంభించింది. ఇది మా ప్రభుత్వంలో జరిగిందే కాదు, గత ప్రభుత్వంలోనూ జరిగిందంటూ చెప్పేందుకు తంటాలు పడుతోంది.జనార్థన్ వీడియో ద్వారా డైవర్షన్అక్టోబర్ ఆరో తేదీన జనార్థన్‌రావు విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ 'నకిలీ మద్యం తయారీలో నన్ను ముద్దాయిగా చూపుతున్నారు. దీనితో తెలుగుదేశం పార్టీ వారికి సంబంధం లేదు. నాకు ఆరోగ్యం బాగోలేదు, ఆఫ్రికాలో వున్నాను, నేను ఇండియాకు వచ్చిన తరువాత జరిగిన వాస్తవాలను వెల్లడిస్తాను' అని చెప్పాడు. ఆయన వీడియోలో ఎక్కడా జోగి రమేష్ గురించి ప్రస్తావన తీసుకురాలేదు. ఇక ఆయన రెండో వీడియో ఈ నెల 13న విడుదల చేశాడు. దీనిలో జోగి రమేష్ పేరును ప్రస్తావిస్తూ, కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడానికి జోగి రమేష్ కుట్రపన్ని, తనకు డబ్బులు ఇచ్చి ఈ నకిలీ మద్యం తయారీని చేయించారంటూ' ఆరోపణలు చేశాడు.'నకిలీ మద్యం తయారీ బయటపడటంతో జయచంద్రారెడ్డి తదితరులను టీడీపీ సస్పెండ్ చేయడంతో జోగి రమేష్ తన ప్లాన్ మార్చుకున్నాడని, ఇబ్రహీంపట్నంలో ముందుగా సరుకును తెచ్చిపెట్టమని చెప్పడని, దానిని సాక్షి మీడియా ద్వారా ఎక్సైజ్ వారికి పట్టించాడని, ఇదంతా ఒక పథకం ప్రకారం చేశాడంటూ' కూడా ఆ వీడియోలో పేర్కొన్నాడు. మొత్తం వ్యవహారం అంతా కూడా జోగి రమేష్ చెబితేనే తాను చేశానని, టీడీపీ వారికి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా పేర్కొన్నారు. తొలి వీడియోకు, రెండో వీడియోకు సంబంధం లేకుండా జనార్థన్‌రావు మాట్లాడాడు. రెండో వీడియోతో నకిలీ మద్యం కేసును డైవర్ట్ చేసేందుకు కుట్ర ప్రారంభమైంది.టీడీపీ నేతలు తప్పు చేయకపోతే ఎందుకు సస్పెండ్ చేశారు?టీడీపీ నేత జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు తదితరులపై టీడీపీ ఎందుకు సస్పెన్షన్ వేటు వేసింది? జయచంద్రారెడ్డికి చెందిన వాహనంలోనే తాను నకిలీ మద్యంను రవాణా చేశానంటూ డ్రైవర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. దానికి ఆధారాలు కూడా ఉండటంతోనే విధిలేని స్థితిలో టీడీపీ నుంచి వారిని సస్పెండ్ చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం వ్యవహారంపై సీరియస్‌గా ఉందని, మేమే ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని, గోడౌన్లను వెతికి పట్టుకున్నామని, దాడి చేయించామని కూడా ప్రభుత్వం చెప్పుకుంది.అలాంటప్పుడు జనార్థన్‌రావు విడుదల చేసిన రెండో వీడియోలో జోగి రమేష్ నకిలీ మద్యంను తెప్పించి, ఇబ్రహీంపట్నంలో పెట్టించి, సాక్షి మీడియా ద్వారా దానిని బయటపెట్టించి, ఎక్సైజ్ వారితో సీజ్ చేయించారని ఎలా చెబుతారు? చంద్రబాబుకు వంతపాడే ఎల్లోమీడియా ఈనాడులో నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడినా కూడా రెండుమూడు రోజుల పాటు దానిపై ప్రస్తావన కూడా చేయలేదు. తరువాత తప్పు చేశారు కాబట్టే మా పార్టీకి చెందిన నాయకులను సస్పెండ్ చేస్తున్నామని నారా లోకేష్, వర్ల రామయ్య ప్రకటించారు. టీడీపీ అధికారిక ట్వీట్లో జయచంద్రారెడ్డి 'ఏ1' అంటూ పేర్కొని, తరువాత రెండు రోజుల్లో 'ఏ1' అనే దానిని తొలగించారు. అంటే తమ కుట్రను ప్రారంభించడానికి సిద్దమయ్యే, దానికి అనుగుణంగా తమ వైఖరిని మార్చుకున్నారనేందుకు ఇదే నిదర్శనం.సీబీఐ విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగుచూస్తాయినకిలీ మద్యంపై ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్‌షాప్‌ల్లో ఎందుకు తనిఖీలు చేయడం లేదు? దానికి బదులుగా వైఎస్సార్సీపీపై బురదచల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రబాబు కపట నాటకాన్ని మొదలుపెట్టారు. హడావుడిగా పన్నెండో తేదీన చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టడానికి కారణం, వైయస్ఆర్సీపీ ఎంపీ మిధున్‌రెడ్డి నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర హోమంత్రికి లేఖ రాయడమే. ఎక్కడ ఇది సీబీఐ దర్యాప్తునకు దారి తీస్తుందోనని భయంతోనే చంద్రబాబు మీడియాతో రకరకాలుగా మాట్లాడారు. వైఎస్ జగన్‌కి, ఆయన బంధువులుకు కూడా ఆపాదించే విధంగా చంద్రబాబు మాట్లాడారు. నకిలీ మద్యం బయటపడిన తరువాత మౌనంగా ఉన్న ఈనాడు పత్రిక, ఈ నెల తొమ్మిదో తేదీన ఆఫ్రికాలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు లిక్కర్ వ్యాపారంలో ఉన్నారంటూ వైఎస్ జగన్ బంధువులకు అంటగట్టేలా ఒక కథనాన్ని రాసింది.ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలిజనార్థన్రావును అరెస్ట్ చేసి విచారించిన తరువాత ఆయనను న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ సందర్బంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో జోగి రమేష్ పేరు ఉందా? రెండో వీడియోలో మొత్తం జోగి రమేష్ చెబితేనే చేశాను అన్న జనార్థన్‌రావు, పోలీసుల విచారణలో ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? దానికి సమాధానం చెప్పాలి. జనార్థన్‌రావు నెల్లూరు జైలుకు రిమాండ్‌కు వెళ్ళిన 24 గంటల తరువాత ఏ విధంగా ఆయన మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది?ఒకవేళ పోలీసులు విచారణలో జనార్థన్‌రావు ఈ వీడియోలో మాట్లాడి వుంటే, రిమాండ్ రిపోర్ట్‌లో ఆ విషయం ఎందుకు రాయలేదు? జనార్థన్‌రావు మాట్లాడిన వీడియో ఎలా బయటకు వచ్చిందో విచారణ జరిపారా? పక్కన ఎవరో ఉండి ప్రామ్టింగ్ ఇస్తుంటే జనార్థన్‌రావు మాట్లాడినట్లు కనిపిస్తోంది, అలా ప్రామ్టింగ్ ఇచ్చింది ఎవరు? ప్రభుత్వానికి ఉన్న సమాచారంతోనే ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో పోలీసులు దాడులు చేశారని సీఎం చంద్రబాబు చెప్పుకున్న విషయం వాస్తవం కాదా? రెండో వీడియోలో జనార్థన్‌రావు 'జోగి రమేష్ ఒక పథకం ప్రకారమే ఇబ్రహీంపట్నం గోడవున్లో నకిలీ మద్యంను పెట్టించి, ఎక్సైజ్ వారికి పట్లించారని' మాట్లాడిన విషయం వాస్తవం కాదా? అంటే ప్రభుత్వమే నకిలీ మద్యం గురించి తెలుసుకుని దాడులు చేసి, పట్టుకుందన్న సీఎం చంద్రబాబు మాటలు అబద్దమా? లేక జనార్థన్‌రావు తన వీడియోలో చెప్పిన మాటలు అబద్దమా?నకిలీ మద్యం వ్యవహారంలో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని, టీడీపీని అసహ్యించుకుంటున్నారని తెలియగానే, వైఎస్సార్సీపీపై బుదరచల్లేందుకు గానూ జనార్థన్‌రావుతో ఒక పథకం ప్రకారం ఈ రెండో వీడియోను కుట్రపూరితంగా తయారుచేసి, బయటకు వదిలిపెట్టారనేది వాస్తవం కాదా? తాను విదేశాలకు వెళ్ళిపోతే రూ.3 కోట్లు ఇస్తానని జోగి రమేష్ ఆఫర్ చేశారని, అందుకే ఆఫ్రికాకు వెళ్ళినట్లు చెప్పిన జనార్థన్‌రావు, ఎవరు చెబితే తిరిగి ఏపీకి వచ్చారు? ఆయన చెబుతున్నట్లుగా మూడు కోట్లు తీసుకోకుండానే ఎలా ఏపీకి వచ్చాడు? మొలకలచెరువు ఘటనలో కొందరు దోషులను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వారిని విచారణకు ఇవ్వాలంటూ కష్టడీ పిటీషన్ వేశారు. కానీ జనార్థన్‌రావు విషయంలో ఎందుకు కస్టడీ పిటీషన్ వేయలేదు? జనార్థన్‌రావును లోతుగా విచారించకుండా, దొంగ వీడియోను విడుదల చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? టీడీపీ నేతగా ఉన్న జనార్థన్‌రావును ఆఫ్రికా నుంచి పిలిపించిన ప్రభుత్వం, కీలకమైన జయచంద్రారెడ్డిని ఎందుకు పిలిపించడం లేదు? ఆయనపై లుక్అవుట్ నోటీస్ ఎందుకు జారీ చేయలేదు? ఎందుకు ఆయనపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు? పోలీసుల విచారణలో టీడీపీకి చెందిన నాయకులు పాల వ్యాన్ల ద్వారా నకిలీ మద్యాన్ని సరఫరా చేశారని అధికారులు వెల్లడించారు. ఆ వ్యాన్లను, వాటి యాజమానులను ఎందుకు అదుపులోకి తీసుకోలేదు?వారంతా టీడీపికి చెందిన వారు కావడం వల్లే వారిని ఉపేక్షిస్తున్నారా? రాష్ట్రంలో ఉన్న డెబ్బై అయిదు వేల బెల్ట్‌షాప్‌లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? రాష్ట్ర వ్యాప్తంగా మద్యం శాంపిళ్లను సేకరించి, నకిలీ అవునా కాదా అని తెలుసుకునేందుకు ఎందుకు ల్యాబ్‌లకు పంపించడం లేదు? జనార్థన్‌రావుతో గుర్తుతెలియని ప్రాంతంలో ఒక వీడియోను తీయించి, రాజకీయం చేయాలని ఎందుకు చూస్తున్నారు. ఈ వ్యవహారం ముదురుతుంటే ఎంపీ మిధున్‌రెడ్డి నివాసాలపై దాడులు చేయించడం, ప్రజల దృష్టి మళ్లించేందుకు కాదా? నకిలీ మద్యంపై మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు సీబీఐ దర్యాప్తును కోరడం లేదు? -
నకిలీ మద్యంపై సిట్ దర్యాప్తు హాస్యాస్పదం
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం తయారు చేసి రాష్ట్రమంతటా యథేచ్ఛగా సరఫరా చేస్తున్న టీడీపీ నేతలు పూర్తి ఆధారాలతో పట్టుబడినా... ఇప్పటివరకు నోరు మెదపని సీఎం చంద్రబాబు హఠాత్తుగా ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్సీపీ నేతలు, మాజీ మంత్రులు కె.నారాయణస్వామి, కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు.ఆదివారం మాజీ మంత్రులిద్దరూ సంయుక్త ప్రకటన చేస్తూ.. కేవలం నిజాలను సమాధి చేయడానికి, కేసును నీరుగార్చడం కోసమే సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని వారు స్పష్టం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి చంద్రబాబు వేసిన ‘సిట్’లన్నీ కేవలం కక్షసాధింపు కోసం లేదా వాస్తవాలు బయటకు రాకుండా చేయడం కోసమేనని వారు గుర్తు చేశారు. ఆ ప్రకటనలో నారాయణస్వామి, కాకాణి ఏమని పేర్కొన్నారంటే.. పరిశ్రమల మాదిరిగా.. ‘రాష్ట్రంలో ఇంత విచ్చలవిడిగా.. పరిశ్రమల్లా యంత్రాలు పెట్టి నకిలీ మద్యం తయారు చేస్తున్న టీడీపీ నేతలు దాన్ని రాష్ట్రమంతా సరఫరా చేస్తూ పక్కా ఆధారాలతో పట్టుబడ్డారు. నకిలీ మద్యానికి ఇప్పటికే పలువురు బలయ్యారు. అందుకే నకిలీ మద్యంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. మరి దానికి సీఎం చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు? నిజానికి ‘సిట్’ అనేది చంద్రబాబు జేబులోని సంస్థ. మేం డిమాండ్ చేస్తున్నట్టుగా సీబీఐ దర్యాప్తు కోరకుండా, సిట్ ఏర్పాటు చేయడమంటే.. తాము తప్పు చేశామని చంద్రబాబు అంగీకరించినట్లే కదా?రాష్ట్రంలో ఇప్పుడు నకిలీ మద్యం అనేది ఏదో ఒకచోట మాత్రమే బయటపడటం లేదు.దాన్ని పక్కాగా వ్యవస్థీకృతంగా లిక్కర్ మాఫియా నడుపుతోంది. ఆ మాఫియాలో ఉన్న వారంతా టీడీపీ నాయకులే. నిజానికి పెదబాబు, చినబాబు కనుసన్నల్లోనే నకిలీ మద్యం దందా కొనసాగుతోంది. తన హయాంలో అంత యథేచ్ఛగా నడుస్తున్న ఆ రాకెట్‌పై తానే సిట్ వేయడం హాస్యాస్పదం. నిజానికి ములకలచెరువు ఘటన తర్వాత రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క వైన్‌షాపుపై కూడా ఎక్సైజ్ అధికారులు దాడి చేయలేదు. పరి్మట్ రూమ్‌లు, బెల్టు షాప్‌లను కనీసం తనిఖీ చేయలేదు. అంటే ఏ స్థాయిలో ఈ నకిలీ మద్యం మాఫియా నడుపుతున్నారో స్పష్టమైంది. ఇంత జరిగినా ఇప్పుడు కూడా గత మా ప్రభుత్వంపైనే చంద్రబాబు బురద చల్లుతున్నారు. చంద్రబాబు ఇప్పుడు చెబుతున్న క్యూఆర్ కోడ్, స్కానింగ్ వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు అమలు చేశారు. అప్పుడు ప్రభుత్వమే వైన్‌షాపులు నడపడం వల్ల ఎక్కడా అక్రమాలకు తావు లేకుండా పోయింది. కానీ, చంద్రబాబు సీఎం అయ్యాక గత ప్రభుత్వ మద్యం విధానాలన్నింటినీ రద్దు చేసి మద్యం షాపులన్నిటినీ ప్రైవేటుపరం చేశారు. వాటన్నింటినీ తన మాఫియా ముఠా చేతుల్లో పెట్టారు. తమ పార్టీ వారికే మద్యం షాపులు కట్టబెట్టి, వాటికి పర్మిట్ రూమ్‌ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. చివరకు బెల్టు షాపులను కూడా మద్యం మాఫియా చేతుల్లో పెట్టారు. అంటే నకిలీ మద్యం వాళ్లే తయారు చేస్తారు. వాళ్ల మద్యం షాపులు, బెల్టుషాపులకు తరలించి అమ్మేస్తారు. ఇదే స్పష్టంగా జరుగుతోంది. ఇప్పుడు ఈ నకిలీ మద్యం దందా ఆధారాలతో సహా బట్టబయలు కావడంతో ప్రజల ముందు దోషిగా నిలబడిన సీఎం చంద్రబాబు కేసు డైవర్షన్ కోసం ఈ సిట్ డ్రామాకు తెరలేపారు.ఈ దందాలో ఆయనకు ఏ మాత్రం ప్రమేయం లేకపోతే.. కేసుపై కొంతైనా చిత్తశుద్ధి ఉంటే మా పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు నకిలీ మద్యంపై సిట్‌తో కాకుండా సీబీఐతో దర్యాప్తు చేయించాలి. అలా తన నిర్దోషిత్వాన్ని, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని వైన్‌షాపుల్లో వెంటనే తనిఖీలు చేయాలి. ఏది అసలు మద్యమో.. ఏది నకిలీదో, కల్తీదో తేల్చాలి. ఈ వ్యవహారం వెనుక ఉన్న టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలి. ఎక్సైజ్ శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. జయచంద్రారెడ్డితో ఒప్పందం కుదుర్చుకుని నకిలీ మద్యం దందా నడిపించిన కిలారు రాజేష్ ద్వారా ముడుపులు అందుకున్న లోకేశ్‌పైనా సీబీఐ విచారణకు ఆదేశించాలి. అప్పుడే ప్రజలకు చంద్రబాబుపై నమ్మకం ఏర్పడుతుంది’ అని మాజీ మంత్రులు కె.నారాయణస్వామి, కాకాణి గోవర్థన్‌రెడ్డి తేల్చి చెప్పారు. -
నకిలీ మద్యం వ్యవహారంలో డైవర్షన్ పాలిటిక్స్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నకిలీ మద్యం వ్యవహారంలో పీకల వరకు కూరుకుపోయిన టీడీపీ పెద్దలు దానినుంచి బయటపడేందుకు అరెస్టయిన వారు కోవర్ట్‌లు అంటూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నకిలీ మద్యం కేసులో అరెస్టయిన టీడీపీ నేత జయచంద్రారెడ్డికి వైఎస్సార్సీపీతో లింకులున్నాయని, కోవర్ట్‌గా తమ పారీ్టలో చేరాడంటూ సీఎం చంద్రబాబు అనడం ఆయన దివాళాకోరు తనానికి నిదర్శనమన్నారు.దొరికిన దొంగలకు వైఎస్సార్సీపీ కోవర్ట్ అనే ముద్ర వేసి, తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. చిత్తశుద్ధి ఉంటే నకిలీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. నకిలీ మద్యం మరణాలపై వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ యాజమాన్యం, విలేకరులపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు ప్రజలకు తెలియకూడదని మీడియా గొంతు నొక్కేందుకు కూడా ఈ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా నకిలీ మద్యం మాఫియా బయటపడిందని, ఇందులో టీడీపీ నాయకుల పాత్ర ఆధారాలతో సహా రుజువైందని చెప్పారు.సీఎం సొంత జిల్లా ములకలచెరువులోనే నకిలీ మద్యం తయారు చేసి అసలు మద్యం మాదిరిగా మార్కెట్లోకి తీసుకువచ్చారన్నారు. ఇంత పెద్ద వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో కీలకపాత్రధారి దాసరిపల్లె జయచంద్రారెడ్డి 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున చంద్రబాబు నుంచి బీఫాం తీసుకుని తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారన్నారు. ఈ నిందితుల్లో జయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్‌రెడ్డి, కట్టా సురేంద్రనాయుడు, జనార్దన్ తదితరులు చంద్రబాబు, లోకేశ్‌కు అత్యంత సన్నిహితులే అన్నారు.ఈనాడు రామోజీరావు కొడుకు కిరణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ నకిలీ మద్యం వ్యవహారం నుంచి టీడీపీని ఎలా కాపాడాలా అని మధనపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి నియోజకవర్గంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పాటయ్యాయన్నారు. నెల్లూరు జిల్లా కలిగిరి, నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ‘సాక్షి’ పత్రిక విలేకరులపై, యాజమాన్యంపై రెండు కేసులు పెట్టారన్నారు. ‘సాక్షి’ విలేకరి ఇంట్లోకి వెళ్లిన ఎక్సైజ్ పోలీసులు హంగామా సృష్టించారని, నకిలీ మద్యం తాగి చనిపోయారు అని వార్త రాసినందుకు విలేకరిపై జులుం ప్రదర్శించారని పేర్కొన్నారు. -
Kakani: నీ పాలనలో రైతుల పరిస్థితి ఇది చంద్రబాబు..
-
ఈఆర్సీ నిర్ణయం సర్కారుకు చెంపపెట్టు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ) తలంటితే సిగ్గు పడాల్సింది పోయి ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ చార్జీలను తగ్గిస్తున్నట్లు ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం చంద్రబాబు సర్కారు దివాళాకోరుతనానికి నిదర్శనమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. ఈఆర్సీ ఆదేశాలతో వినియోగదారులకు తిరిగి చెల్లించాల్సిన రూ.923.55 కోట్లను తాను ఎంతో ఉదారంగా ఇస్తున్నట్లు చెప్పుకోవడం సిగ్గుగా లేదా? అని ప్రశి్నంచారు.అనుమతి లేకుండా విద్యుత్ చార్జీల భారం మోపిన చంద్రబాబు ప్రభుత్వానికి ఈఆర్సీ నిర్ణయం చెంప పెట్టు లాంటిదన్నారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం కాకాణి మీడియాతో మాట్లాడారు. విద్యుత్ చార్జీలు ఇంకా తగ్గిస్తానని నమ్మబలికిన చంద్రబాబు ఏడాదిలోనే ప్రజలపై రూ.19 వేల కోట్ల భారాన్ని మోపారని ధ్వజమెత్తారు. ట్రూ డౌన్ చంద్రబాబు ఘనతగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అనుమతించిన ధరకు మించి కొనుగోలు 2024–25 సంవత్సరానికి రూ.2,758.76 కోట్లు ట్రూ అప్ చార్జీలకు డిస్కంలు ఈ ఏడాది జూలైలో అనుమతి కోరగా ఏపీఈఆర్సీ రూ.1,863.64 కోట్లకు మాత్రమే అనుమతి ఇచి్చందన్నారు. కూటమి సర్కారు ఏపీఈఆర్సీ అనుమతించిన ధరకు మించి విద్యుత్ కొందన్నారు. ఏపీఈఆర్సీ యూనిట్ రూ.5.27కు కొనమని చెబితే.. ఈపీడీసీఎల్ రూ.5.84 చొప్పున, సీపీడీసీఎల్ రూ.5.86 చొప్పున, ఎస్పీడీసీఎల్ యూనిట్ రూ.5.89 చొప్పున వెచి్చంచి విద్యుత్ కొన్నట్లు వెల్లడించాయన్నారు. విద్యుత్ కొనుగోలు ఖర్చు రూ.34,517 కోట్లకు అనుమతి ఉంటే రూ.45,476 కోట్లు వెచి్చంచామని డిస్కంలు చెప్పాయన్నారు. ప్రసార, పంపిణీ నష్టాలు 10.17 శాతమని డిస్కంలు ప్రతిపాదిస్తే ఈఆర్సీ మాత్రం 9.87 శాతానికే అంగీకరించిందన్నారు. 2024–25కి సంబంధించి ప్రతి నెలా యూనిట్‌కు 0.40 పైసలు చొప్పున డిస్కమ్‌లు ఇప్పటికే రూ.2,787.18 కోట్లు వసూలు చేశాయన్నారు. అనుమతించిన మొత్తం పోనూ మిగిలిన రూ.923.55 కోట్లను ఈ ఏడాది నవంబర్ నుంచి ట్రూ డౌన్ చేయాలని ఈఆర్సీ ఆదేశించిందన్నారు. కూటమి సర్కారు 2024 నవంబర్ బిల్లు నుంచే రూ.6,072.86 కోట్ల భారాన్ని ప్రజలపై మోపి వసూలు చేస్తుండగా ఈ ఏడాది జనవరి బిల్లు నుంచి మరో రూ.9,412.50 కోట్ల అదనపు భారం మోపిందన్నారు. -
Kakani: కళ్ళు ఆర్పకుండా అలవోకగా అబద్ధాలు చెప్తాడు
-
చంద్రబాబు పాలనలో ఎప్పుడూ రైతులకు కష్టాలే: కాకాణి
సాక్షి, తాడేపల్లి: వ్యవసాయంపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలు మాట్లాడారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆధునిక వ్యవసాయానికి తానే ఆధ్యుడినంటూ చంద్రబాబు అసెంబ్లీలో ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి రైతులు నవ్వుకుంటున్నారని అన్నారు. వ్యవసాయం దండగ అన్న ఆలోచనలతో ఉన్న చంద్రబాబు, తన రైతు వ్యతిరేకతను ఏనాడు దాచుకోలేదని గుర్తు చేశారు.నేడు రాష్ట్రంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేని పరిస్థితి ఒకవైపు, యూరియా కొరత మరోవైపు తీవ్రంగా ఉంటే, వాటిని పరిష్కరించలేని అసమర్థ సీఎం చంద్రబాబేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి చంద్రబాబు వ్యవసాయానికి తాను చేసిన కృషిని గురించి గొప్పగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆక్షేపించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన నాయకుడుగా వైయస్ జగన్ పాలనలో చేసిన మంచిని కూడా వక్రీకరిస్తూ, అసెంబ్లీలో దిగజారుడు మాటలు మాట్లాడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే..అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వ్యవసాయంపై సుదీర్ఘమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో రైతుల సమస్యలపై ఒక్క సమీక్ష కూడా నిర్వహించని సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలో మాట్లాడుతూ 'తన పాలనలో వ్యవసాయం చాలా బాగుంది, రైతులకు ఎటువంటి కష్టాలు లేవు, రైతులు ఎంతో సంతోషంతో ఉన్నారు. రైతులే యూరియాను ఎక్కువ వాడుతూ తప్పు చేస్తున్నారు, దీనివల్ల క్యాన్సర్ వంటి జబ్బులు వస్తున్నాయని' అన్నారు. మొత్తం మీద 62 శాతం వ్యవసాయం మీద ఆధారపడ్డారు అని చెబుతూనే, రైతులు ఎటువంటి సమస్యలను ఎదుర్కొనడం లేదని ముక్తాయింపు నివ్వడం ఆయన దివాలాకోరుతనంకు నిదర్శనం.యూరియాపై చంద్రబాబు కొత్త సిద్దాంతంచంద్రబాబు సిద్దాంతం ప్రకారం రైతులు యూరియా వాడకం తగ్గించేయాలి. నేడు రాష్ట్రంలో యూరియా కొరత ఉంది, కాబట్టి యూరియా వినియోగాన్ని రైతులు తగ్గించుకోవాలి, దానివల్ల నాణ్యమైన పంటలు పండుతాయి, వాటికి మంచి మార్కెటింగ్ ఉంటుంది అని చెబుతున్నారు. అంతేకానీ రైతులకు కావాల్సిన యూరియాను ఇవ్వలేకపోతున్నాం, ప్రభుత్వ వైఫల్యాన్ని ఏ మాత్రం అంగీకరించడం లేదు. అసహ్యాన్ని జయించిన నేత చంద్రబాబు. తన మాటలు చూసి ప్రజలు నవ్వకుంటారని తెలిసి కూడా నిస్సిగ్గుగా మాట్లాడగలరు.డ్రిప్ ఇరిగేషన్ పైనా అబద్దాలేనా బాబూ?ఈ దేశానికి డ్రిప్ ఇరిగేషన్‌ను తానే పరిచయం చేశానంటూ చంద్రబాబు అసెంబ్లీలో లేని గొప్పలను చెప్పుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్‌ను ఆనాడు పీఎం వాజపేయ్‌కు చెప్పి, వన్‌మెన్ కమీషన్ కింద ఇజ్రాయిల్‌కు వెళ్ళినని, శాస్త్రీయంగా పరిశోదనలు చేసి, దానిని పీఎంకు ఇస్తే, దానిని ఆయన ఈ దేశంలో అమలు చేశారంటూ చంద్రబాబు తన గొప్పతనాన్ని చెప్పుకున్నారు. కానీ డ్రిప్ ఇరిగేషన్ ఈ దేశంలో ఎప్పుడు ప్రారంభమైందని చూస్తే, 1980లోనే తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలో రైతులే ఇతర దేశాల్లో వాడకాన్ని చూసి దీనిని ప్రారంభించారు.1987లో ఎన్సీపీఏ డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రారంభించింది. 1991లో కేంద్రం దీనిని చేపట్టడం వల్ల ఏపీలో కూడా ఈ విధానం ప్రారంభమైంది. చంద్రబాబు 1995లో ఎన్డీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యాడు. ఆయన సీఎం కాకముందే ఇరవై ఏళ్ళుగా దేశంలో డ్రిప్ ఇరిగేషన్ విధానం అమలులో ఉంది. ఎటువంటి సిగ్గు లేకుండా తాను వచ్చిన తరువాతే ఈ విధానం దేశంలో ప్రారంభమైందని అసెంబ్లీలో చంద్రబాబు చెప్పుకోవడం ఆయన దివాలాకోరుతనంకు నిదర్శనం.గిట్టుబాటు ధరలు ఎవరి హయాంలో ఎంతో తెలుసా?రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరలపై చంద్రబాబు మాట్లాడుతూ మిరపకు రికార్డు లేదు అన్నారు. మరోవైపు వ్యవసాయశాఖ మంత్రి మిర్చిపంటను ఈ-క్రాప్ కింద రికార్డు చేశామని చెబుతున్నారు. కానీ చంద్రబాబు తన వద్ద ఎటువంటి రికార్డు లేకపోవడం వల్ల వారిని ఆదుకోలేకపోయామంటూ మాట్లాడారు. దీనితో పాటు తాను ఉల్లి, పత్తి, మామిడి, టమాటా పంటలకు మద్దతు ధర కల్పించానంటే ఆర్భాటంగా ప్రకటించుకున్నారు. వైఎస్ జగన్ హయాంలో, ఇప్పుడు చంద్రబాబు హయాంలో పంటకు కల్పించిన గిట్టుబాటు ధరలను ఒకసారి పరిశీలిస్తే...- వైఎస్ జగన్ హయాంలో ధాన్యం క్వింటాకు రూ.1800 నుంచి రూ.2000 ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.1150 నుంచి రూ.1400 మాత్రమే ఉంది. - కందులు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా 10,200 నుంచి రూ.11,800 ఉంటే చంద్రబాబు హయాంలో 5500 నుంచి 6200లకు పడిపోయాయి. - మినుములు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా రూ.9200-9850 వరకు ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.6000 లకు తగ్గిపోయాయి. - పెసలు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా 9100-9700 వరకు ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.5000-5200 లకు తగ్గిపోయాయి. - సజ్జలు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా రూ.2860-3650 వరకు ఉంటే, చంద్రబాబు హయాంలో హయాంలో రూ.1800-2000 లకు తగ్గిపోయాయి. - మిర్చి.. వైఎస్ జగన్ హయాంలో రూ.21,000 - 27,000 ఉంటే చంద్రబాబు హయాంలో రూ.8000 - 11,000 లకు పడిపోయాయి.- పొగాకు.. వైఎస్ జగన్ హయాంలో క్వింటా రూ.15000 -18000 ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.100 - 300 వరకు పడిపోయింది. - ఉల్లికి వైఎస్ జగన్ హయాంలో రూ.4000 - 12000 లకు అమ్మితే, చంద్రబాబు హయాంలో క్వింటా ఉల్లి కేవలం రూ.300లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి కల్పించారు. రైతుల గోడును పట్టించుకోకుండా ఉల్లి రైతును ఆదుకున్నాను అని చెప్పుకుంటున్నారు. - వైఎస్ జగన్ హయాంలో టమాటా కిలో రూ.20-25 ఉంటే, మీ హయాంలో రూ.1.50 కి పడిపోయింది.- వైఎస్ జగన్ హయాంలో కోకో 950-1050 ఉంటే, మీ హయాంలో రూ.240-500 కి పడిపోయింది.- చీనీ టన్ను జగన్ హయాంలో రూ.30,000 - రూ.1 లక్ష వరకు రైతులు అమ్ముకున్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో రూ.7000 -14000- మామిడికి జగన్ హయాంలో క్వింటా రూ.2200 - 2900 ఉంటే, చంద్రబాబు హయాంలో రూ.200 లకు పడిపోయింది.మద్దతుధరలను ధైర్యంగా ప్రకటించిన వైఎస్ జగన్దమ్మున్న నాయకుడు ఈ రాష్ట్రానికి సీఎం అయితే, రైతులు పండించిన పంటలకు మా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు ఇవీ అని బహిరంగంగా రేట్లను ప్రకటించారు. ఆ పని ఆనాడు సీఎంగా వైఎస్ జగన్ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ ప్రతులను కూడా మీడియాకు చూపిస్తున్నాం. మా ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. ఈ రేట్లకే రైతులకు మద్దతు ధర కల్పిస్తామని బహిరంగంగా చెప్పిన నాయకుడు వైఎస్ జగన్. దాని ప్రకారం రైతులకు అండగా నిలిచారు. ధరల స్థిరీకరణ నిధి కింద చంద్రబాబు హయాంలో 3,74,680 మంది రైతులకు రూ.3,322.15 కోట్లు ఇచ్చారు. అదే వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో 6,16,991 మందికి రూ. 7,746.31 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చారు.సోమశిల కింద రెండో పంటకు తొలిసారి నీరిచ్చారంటూ అబద్ధాలు'సోమశిల కండలేరు కింద ఎప్పుడూ రెండు పంటలు వేయరూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రెండో పంటకు తొలిసారి నీరు ఇవ్వడం వల్ల పంటల విస్తీర్ణం పెరిగి యూరియా కొరత ఏర్పడింది' అంటూ చంద్రబాబు కొత్త సూత్రీకరణ చేశారు. మిడిమిడి జ్ఞానంతో సీఎం స్థానంలో ఉండి చంద్రబాబు మాట్లాడటం చూసి నెల్లూరు రైతులు నవ్వుకుంటున్నారు. 2004 వరకు సోమశిలలో 36 టీఎంసీలకు మించి నీటిని నిల్వ ఉంచేవారు కాదు, దీనివల్ల నీరులేక ఒక్క పంటకే నీరు ఇచ్చేందుకు ఇబ్బంది పడేవారు.స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయిన తరువాత సోమశిలలో దాదాపు 74 టీఎంసీలను నిల్వ చేసి, దాదాపు అన్ని సంవత్సరాల పాటు రెండోపంటకు నెల్లూరు జిల్లాకు నీరుఇచ్చారు. అలాగే వైయస్ జగన్ సీఎంగా ఉన్న అయిదేళ్ళపాటు కూడా రెండోపంటకు ఈ రిజర్వాయిర్ నుంచి నీటిని ఇచ్చారు. వాస్తవాలను తెలుసుకోకుండా సీఎంగా చంద్రబాబు మాట్లాడిన మాటలు పచ్చి అబద్దాలు. దీనిపై నెల్లూరుకు వచ్చి రైతులతో మాట్లాడితే వాస్తవాలు తెలుస్తాయి. చంద్రబాబు సీఎం అయిన తరువాత నెల్లూరు ప్రాంతానికి రెండోపంటకు నీరివ్వడం ఇదే తొలిసారి, అదీ అయన గొప్పతనం.అన్నదాత సుభీభవ కింద ఎంత ఎగ్గొట్టారో చెప్పాలివరి అనేది తినడానికి పనికిరాదు, ఆల్కాహాల్ తయారీకి వాడుకోవాల్సిందేనని సీఎం చంద్రబాబు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ధాన్యం గిట్టుబాటుధర లేక క్వింటా రూ.12వేలకు రైతులు అమ్ముకుంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెట్టే దిక్కులేదు. నీళ్ళు ఉంటే వరి తప్ప మరో పంట పండించుకునే అవకాశం లేదని, తాను ధాన్యంకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నాను అని ఒకవైపు చెబుతూనే, వరి నాణ్యత తగ్గితే ఆల్కహాల్‌కు ఉపయోగించుకోవాలని చెబుతున్నాడు. అన్నదాత సుఖీభవ పథకాన్ని పూర్తిగా అమలు చేశాను అని చెప్పుకుంటున్నాడు.కేంద్రం ఇచ్చే దానితో సంబంధం లేకుండా రూ.20వేలు ప్రతి రైతుకు ఇస్తాను అని చెప్పారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే ఆరువేలతో కలిసి ఇస్తాను అని మాట మార్చేశారు. దీనిలో కూడా తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. కనీసం రెండో ఏడాది కూడా అరకొరగా అది కూడా 54 లక్షల మందికి గానూ కేవలం 48 లక్షల మందికే ఇచ్చారు. ఎందకు రైతుల సంఖ్య తగ్గిందీ అని ప్రశ్నిస్తే, రైతులు చనిపోయారంటూ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. అంటే రైతులు చనిపోతే, ఆ కుటుంబాలకు చెందిన వారు వ్యవసాయం చేయడం మానుకున్నారా? కొందరికి అనవసరంగా ఇస్తున్నామని, వారిని తొలగించామని చెబుతున్నారు. చంద్రబాబు వాటర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడారు. ఇరిగేషన్ కాలువలను ఉపాధి హామీ కింద పనులు చేస్తున్నామని చెబుతూ ఒకవైపు దోచుకుంటున్నారు, అదే కాలువలకు ఇరిగేషన్ శాఖ నుంచి బిల్లులు దండుకుంటున్నారు. ఈ అక్రమాల్లో కాలువ పనుల నాణ్యతా ప్రమాణాలను పూర్తిగా గాలికి వదిలేశారు. యూరియాపై రెండు నాలుకల ధోరణియూరియా కొరత లేదని మాట్లాడుతున్న చంద్రబాబు నిత్యం పత్రికల్లో వస్తున్న రైతుల గోడు గురించి ఏమంటారు? పొరుగు రాష్ట్రాల్లో కొరత ఏర్పడిందని, ఏపీలో కూడా అదే పరిస్థితి ఉందని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశానికే దిశానిర్దేశం చేశాను, వ్యవసాయానికి కొత్త మెలకువలు నేర్పించాను అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రంలో యూరియా కొరతను ఎందుకు పరిష్కరించలేకపోయారు. వివిధ జిల్లాల్లో రైతులు యూరియా కోసం ఎలా బారులు తీరారో, ఎలా ఆందోళనలు చేస్తున్నారో పత్రికల్లో వచ్చిన కథనాలను ఈ సందర్బంగా మీడియా ద్వారా ప్రదర్శిస్తున్నాం. వీటికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. వీరంతా రైతులు కాదా? రైతుల కన్నా చంద్రబాబు వ్యవసాయంలో నిష్ణాతుడా? రైతులు ప్యానిక్ బయ్యింగ్ చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారు.ప్రైవేటు వ్యక్తులకు యాబైశాతం వరకు ఇచ్చాం కాబట్టే ఇబ్బంది ఏర్పడిందని అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఆయన మాట్లాడిన వీడియోను కూడా ఈ మీడియా సమావేశంలో ప్రదర్శిస్తున్నాం. ఈనెల 2వ తేదీన మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 'కేంద్రం మన రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో యాబైశాతం ప్రైవేటుకు, మిగిలిన యాభైశాతం ప్రభుత్వానికి కేటాయిస్తుంది. ప్రైవేటుకు ఎక్కువ కేటాయించడం వల్ల చాలా మంది రైతులు అటు రైతుభరోసా కేంద్రాల వద్ద తీసుకుంటున్నారు. కొంతమంది బయట తీసుకుంటున్నవారు ఇబ్బంది పడుతున్నారు.' అంటూ మాట్లాడారు. అదే మంత్రి అచ్చెన్నాయుడు ఈ రోజు అంటే 22వ తేదీన అసెంబ్లీలో మాట్లాడుతూ... ఏపీ చరిత్రలో తొలిసారి ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన యూరియాను యాబై శాతం నుంచి డెబ్బైశాతంకు పెంచి రైతుసేవా కేంద్రాలకు పంపి, రైతులకు విక్రయిస్తున్నాం' అంటూ మాట్లాడారు.అలాగే తెలంగాణ, కర్ణాటకలో యూరియాకు ఎటువంటి సమస్యలు వచ్చాయో చూస్తున్నాం. ఆ ఫోటోలను తీసుకుని ఒక ఫేక్ పార్టీ యూరియా కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు' అంటూ మాట్లాడారు. ఇదే మంత్రి అచ్చెన్నాయుడు యూరియా కొరత యాబైశాతం ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం వల్లే వచ్చిందని మీడియా ప్రతినిధుల సమావేశంలో అంగీకరించాడు. దీనిపై చంద్రబాబు ఆయనకు తలంటడం వల్ల మాట మార్చి ఈ రోజు అసెంబ్లీలో డెబ్బైశాతం రైతుసేవా కేంద్రాల్లోనే పంపిణీ చేస్తున్నామని పచ్చి అబద్దాలు మాట్లాడారు. గతం కన్నా ఎక్కువ యూరియాను తీసుకువచ్చామని మంత్రి చెప్పారు. తెచ్చిన యూరియాను యాబైశాతం ప్రైవేటుకు ఇవ్వడం వల్ల, వారు దానిని బ్లాక్ చేసి రూ.270 కి అమ్మాల్సిన కట్టను రూ.600 లకు బ్లాక్‌లో అమ్మే పరిస్థితిని తీసుకువచ్చారు. దీనివల్ల రూ.250 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. రైతులకు సేవాకేంద్రాల ద్వారా ఇవ్వాల్సిన యూరియాను ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఎందుకు అమ్మించారో చెప్పాలి. పంటల బీమా చెల్లింపులపై చర్చకు సిద్దమా?రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేసిన యూరియాను డోర్ డెలివరీ చేస్తాను అని చంద్రబాబు చెబుతున్నారు. ఎకరాకు ఎంత యూరియా వేయాలో భూసార పరీక్ష చేసి, దాని ప్రకారం యూరియాను ఎంత ఇవ్వాలో నిర్ణయించి, ఆ మేరకు ఆధార్ అనుసంధానం ద్వారా రైతుకు డోర్ డెలివరీ చేస్తాను అని చంద్రబాబు చెబుతున్నాడు. అంటే యూరియా కష్టాలు అనేవి ఈ ఏడాది మాత్రమే కాదు, భవిష్యత్తులోనూ ఉంటాయి, వాటిని పరిష్కరించే సామర్థ్యం తనకు లేదని చంద్రబాబే ఒప్పుకుంటున్నారు. 800 మంది అమెరికా నుంచి పోస్ట్‌లు పెట్టారని అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. అమెరికాలో ఉన్న వారి తల్లిదండ్రులు రాష్ట్రలో వ్యవసాయం చేయడం లేదా?అంతర్జాతీయ స్థాయిలో కూటమి ప్రభుత్వ పరువుపోతోందని సిగ్గుపడాలి. భూసార పరీక్షలు వైఎస్ జగన్ హయాంలో జరగలేదని, ల్యాబ్‌లు పెట్టి, ఎటువంటి పరికరాలను పెట్టలేదని తప్పుడు కూతలు కూస్తున్నారు. వైయస్ జగన్ నిర్మించిన ఆధునిక ల్యాబ్‌లను వంద జన్మలు ఎత్తినా చంద్రబాబు చెయ్యలేరు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా ఆర్బీకేలను ఏర్పాటు చేసిన ఘనత వైయస్ జగన్‌ను దక్కుతుంది. ల్యాబ్‌లు, రీజనల్ కోడింగ్ సెంటర్లను నిర్మించారు. వీటిపైన పచ్చి అబద్దాలు మాట్లాడటం సిగ్గుచేటు.చంద్రబాబు హయాంలో ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని రైతులకు బకాయిలు పెట్టి వెళ్లిపోతే, వైయస్ జగన్ గారు దానిని చెల్లించారు. ఏ సీజన్లో రైతులకు నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగా ఆ సబ్సిడీనీ అందించిన ఘనత వైయస్ జగన్‌కే దక్కుతుంది. 2018-19కి సంబంధించి రూ.596.40 కోట్లు, అలాగే 2019-20కి సంబంధించి రూ.1252 కోట్లు, 2020-21కి సంబంధించి రూ.1739 కోట్లు, 2021-22 రూ.2977.82 కోట్లు ఉచిత పంటల బీమా కింద ఇవ్వడం జరిగింది. వైఎస్ జగన్ హయాంలోనే మొత్తం 54,55,363 మంది రైతులకు మొత్తం 7802 కోట్లు ఉచిత పంటల బీమా కింద ఇవ్వడం జరిగింది. దీనిని ఇది నిజం కాదని అచ్చెన్నాయుడు నిరూపించగలరా? అచ్చెననాయుడిని సవాల్ చేస్తున్నాం. నిరూపించలేకపోతే తన పదవికి రాజీనామా చేస్తారా?కౌలురైతులను ఆదుకున్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేకౌలురైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతుభరోసా ఇవ్వలేని ఎమ్మెల్యే కొణతల రామకృష్ణ అసెంబ్లీలో మాట్లాడారు. పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చే రూ.6వేలు ఇవ్వకపోతే, రాష్ట్రమే దానిని భరించి మొత్తం రూ.13,500 రైతుభరోసా కింద వారికి ఇచ్చాం. ప్రభుత్వం వద్ద దానికి సంబంధించి రికార్డులు ఉన్నాయి, ఒకసారి పరిశీలించిన తరువాత దానిపై మాట్లాడాలి. సున్నావడ్డీ పంటరుణాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ దిగిపోయే నాటికి 84,66,217 మంది రైతులకు పెట్టిన రూ. 2050 కోట్లు బకాయిలను కూడా వైయస్ జగన్ ప్రభుత్వమే చెల్లించింది. -
సోమిరెడ్డికి కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్
సాక్షి, నెల్లూరు: సర్వేపల్లిలో గ్రావెల్‌కు అనుమతులుంటే చూపాలంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిపరులు ఎవరో సీబీఐ విచారణ వేయించుకుందాం. సీబీఐ విచారణకు నేను సిద్ధం, సోమిరెడ్డి సిద్ధమా?. సీబీఐ ఎవరికి క్లీన్ చిట్ ఇస్తే.. వాళ్లే పోటీ చేయాలని కాకాణి అన్నారు.అచ్చెన్నాయుడికి దమ్ముంటే యూరియా కొరతపై బహిరంగ చర్చకు రావాలన్న కాకాణి.. డిమాండ్ వున్న ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పరిశీలనకు సిద్ధమా అంటూ నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో రైతుల గోడు పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక వైపు యూరియా కొరత.. మరో వైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు శూన్యం. సోమిరెడ్డికి వైఎస్ జగన్ గురించి మాట్లాడే స్థాయి లేదు. ఏదో జగన్‌ను విమర్శిస్తే మంత్రి పదవి వస్తుందని నోరు పారేసుకోకు అంటూ కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. -
మీరు ఎంత అణగదొక్కలని చూస్తే అంత తిరగబడతారు..
-
రైతుల ధర్నాను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేసింది: కాకాణి
-
ఏపీలో రోడ్డెక్కిన అన్నదాత
-
Kakani: ఇమామ్, మౌజన్ లకు న్యాయం జరిగే వరకూ YSRCP పోరాటం ఆగదు..
-
ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి కాకాణి
-
యూరియా కొరత వెనుక రూ.200 కోట్ల అవినీతి: కాకాణి
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో యూరియా కొరత వెనుక రూ.200 కోట్ల అవినీతి ఉందని, ఉద్దేశపూర్వకంగానే ఎక్కువ యూరియాను ప్రైవేటు మార్కెట్‌కు తరలించారని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. అందుకే రైతు సేవా కేంద్రాలు, మార్క్‌ఫెడ్ నుంచి యూరియా పంపిణీ కావడం లేదని ఆయన గుర్తు చేశారు.యూరియా కావాలన్న రైతుల మాట వినిపించకుండా, నిర్దాక్షిణ్యంగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగం సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాకాణి ఇంకా ఏం మాట్లాడారంటే..:రూ.200 కోట్ల అవినీతి:రాష్ట్రంలో ఏటా దాదాపు 7 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంటుంది. దాంట్లో ఏకంగా 5 లక్షల టన్నుల వరకు యూరియాను వ్యాపారులకే ఇచ్చేస్తే రైతులకు ఎలా అందుతుంది?. అందుకే వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో బస్తా మీద రూ.200 నుంచి రూ.300లు అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఈ ఒక్క యూరియా బ్లాక్ మార్కెట్ వ్యవహారంలోనే దాదాపు రూ. 200 కోట్లు చేతులు మారినట్టు స్పష్టంగా అర్థమైపోతుంది. ఆ మేరకు రైతుల జేబులకు చిల్లు పడుతోంది. మరి ఆ డబ్బంతా జేబుల్లోకి వెళ్లిందో త్వరలోనే తేలుస్తాంరైతులకు మంత్రి క్షమాపణ చెప్పాలి:డిమాండ్‌కు తగిన యూరియాను ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా పంపిణీ చేయకుండా, ప్రైవేటు మార్కెట్‌కు చాలా ఎక్కువ సరుకు పంపించడం వల్ల అది బ్లాక్ మార్కెట్‌కు చేరింది. అందుకే గతంలో రూ.270 కే దొరికిన యూరియా బస్తా, ఇప్పుడు రూ.600 పెట్టినా దొరకని పరిస్థితి నెలకొంది. యూరియా దొరక్క రైతులు నానా ఇబ్బంది పడుతుంటే, సమస్య పరిష్కారంపై ఏ మాత్రం దృష్టి పెట్టని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, వారిని అవమానపర్చేలా మాట్లాడారు. పెళ్లిళ్లలో భోజనం కోసం బఫే వద్ద ప్లేటు పట్టుకుని నిలబడినట్లు, రైతులు కూడా యూరియా కోసం నిలబడలేరా? అని వ్యాఖ్యానించడం తప్పు. అచ్చెన్నాయుడు వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలి.ప్రశ్నిస్తే గొంతు నొక్కే ప్రయత్నం:డిమాండ్‌కు తగిన యూరియాను కేంద్రం నుంచి రప్పించడంలో విఫలమైన టీడీపీ కూటమి ప్రభుత్వం, ఆ సమస్యను లేవనెత్తే రైతుల గొంతు నొక్కాలని చూస్తోంది. యూరియా కొరతపై ఎక్కడైనా రైతులు నిరసనకు దిగితే, నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తున్నారు. చివరకు గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు కోసం వస్తున్న రైతులను కూడా దారుణంగా అరెస్ట్ చేసి వేధిస్తున్నారు. అసలు రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా ఎందుకు పంపిణీ చేయడం లేదు? దీనికి సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి.‘మీ’ మీడియాలో వస్తున్నా కనిపించడం లేదా?:యూరియా దొరక్క దాదాపు మూడు నెలలుగా రైతులు తీవ్ర ఇబ్బంది పడుతుంటే, ఇన్నాళ్లూ కుంభకర్ణుడిలా నిద్ర పోయిన మంత్రి కె.అచ్చెన్నాయుడు.. మా పార్టీ నిరసన కార్యక్రమాన్ని ప్రకటించడంతో హడావుడిగా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి, యూరియా కొరత లేదని చెప్పే ప్రయత్నం చేశారు. కేంద్రం నుంచి యూరియా వస్తున్నా బ్లాక్ మార్కెట్‌కు తరలి పోతుంటే ఏం చేస్తున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. రైతులు ఆ మాత్రం క్యూలైన్లలో నిలబడలేరా? అని ఎగతాళిగా మాట్లాడటం సిగ్గుచేటు.యూరియా కొరతపై చివరకు టీడీపీ అనుకూల పత్రికల్లో రాస్తున్నా మంత్రి కళ్లకు కనిపించడం లేదా?. ఇంకా కేంద్రం కేటాయించిన యూరియాలో సింహభాగం ప్రైవేటు డీలర్లకు ఇచ్చేయడం వల్లే కొరత ఏర్పడిందని మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. మరి రైతు ప్రయోజనాలను పణంగా పెట్టి నిబంధనలను అతిక్రమించి మరీ 50 శాతం కన్నా అధికంగా ప్రైవేట్ డీలర్లకు ఎందుకు కేటాయించాల్సి వచ్చిందో మంత్రి చెప్పాలి.ఈనెల 9న నిరసన కార్యక్రమం:రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం రైతుల పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. వ్యవసాయ అవసరాలను ఫణంగా పెట్టి, రైతులను దోచుకోవడానికి కూడా ప్రభుత్వం ఏ మాత్రం సిగ్గు పడటం లేదు. ఒకవైపు యూరియా దొరకడం లేదు. మరోవైపు పండిన పంటలకు మద్దతు ధర లభించడం లేదు. ఇక ఉచిత పంటల బీమా లేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించి, పంట నష్టం జరిగితే కనీసం పరిహారం కూడా అందడం లేదుఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతాంగ సమస్యలపై ఈనెల 9న వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతోంది. ఆ రోజున ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి, ఆ తర్వాత ఆ అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తామని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి వివరించారు. -
రైతులపై అచ్చెన్నాయుడు కామెంట్స్... కాకాణి కౌంటర్
-
మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఊరట
సాక్షి,విజయవాడ: మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఊరట దక్కింది. నెల్లూరులో ప్రవేశించొద్దన్న షరతును ఏపీ హైకోర్టు తొలగించింది. నెల్లూరు జిల్లాలో ఉండొద్దన్న పోలీసులు పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. నెల్లూరులో ఉండేందుకు కాకాణి గోవర్ధన్‌రెడ్డికి కోర్టు అనుమతి ఇచ్చింది. -
కోటంరెడ్డి సంతకం పెడితేనే... శ్రీకాంత్ పెరోల్ పై కాకాణి కామెంట్స్
-
‘కోటంరెడ్డి.. శ్రీకాంత్ పెరోల్ డైవర్షన్ కోసం మాస్టర్ ప్లాన్’
సాక్షి, నెల్లూరు: నెల్లూరులో రౌడీ షీటర్స్, ముఠాలను పెంచి పోషించింది కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కాదా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఎమ్మెల్యేలపై హత్యాయత్నం అంటూ కేసులు నమోదు అవుతున్నాయి. శ్రీకాంత్ పెరోల్ విషయం నుండి బయట పడటానికి కోటంరెడ్డి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని ఆరోపించారు. శ్రీకాంత్‌కు పెరోల్ మంజూరు చేసింది కూటమి ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నెల్లూరులో అనేక నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. క్రిష్ణారెడ్డి, కోటంరెడ్డి, ప్రశాంతి రెడ్డిపై స్కెచ్ అంటూ వార్తలు వస్తున్నాయి. హత్యా రాజకీయాలు మేము ప్రోత్సహించం. శ్రీధర్ రెడ్డి మొదట ఎమ్మెల్యే అవ్వడానికి కారణం వైఎస్ జగన్. తల్లి పాలు దాగి రొమ్ము గుద్దే పనులు చేయకూడదు. నీతి నియమాలు లేకుండా మాట్లాడే వ్యక్తి కోటంరెడ్డి. నెల్లూరులో రౌడీ షీటర్స్, ముఠాలను పెంచి పోషించింది కోటంరెడ్డి కాదా!. శ్రీకాంత్ పెరోల్ విషయం నుండి బయట పడటానికి డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. నెల్లూరులో రౌడీ కల్చర్ తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం, కోటంరెడ్డి. పెరోల్‌పై హోంమంత్రి సంతకం పెట్టింది నిజం కాదా?. ఏం తీసుకొని, ఎవరు ప్రలోభంతో హోంమంత్రి పెరోల్ సంతకం చేశారు. పెరోల్ మంజూరు చేసింది కూటమి ప్రభుత్వం కాదా?.నేడు నీపై హత్యాయత్నం ప్లాన్ చేసిన వ్యక్తులు నీ అనుచరులు కాదా!. మా ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు తప్పు చేసినా వదిలిపెట్టలేదు. నాడు కోటంరెడ్డి ప్రభుత్వ ఉద్యోగిపై దాడి ఘటనలో చర్యలు తీసుకోమన్నారు జగన్. నేడు సంబంధం లేని వ్యక్తులపై కక్ష్య సాధింపు కేసులు నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. పోలీసులు వైఫల్యం చెందారు. నెల్లూరు ఎస్పీ అసమర్థుడు. మీకు నిజంగా చిత్త శుద్ధి ఉంటే పెరోల్ మంజూరు విషయం, హత్యాయత్నాలు విషయాలపై సీబీఐ విచారణ వేయాలి. శ్రీధర్ రెడ్డి నీ ప్రవర్తన సరికాదు. వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే సహించే పరిస్థితులు ఉండవు జాగ్రత్త అని హెచ్చరించారు.మరోవైపు.. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. రైతాంగానికి యూరియా ఇవ్వలేని విజనరీ చంద్రబాబుది. రైతు ప్రయోజనాలు కోసం పనిచేసే ప్రభుత్వం కాదు ఇది. దళారీలు, వ్యాపారస్తుల ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఉల్లి రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు. అన్నదాతా సుఖీభవా పేరుకే పరిమితం అయింది. ఒకటిన్నర ఏడాది తరువాత ఉచిత బస్సు పెట్టి మహిళలు లక్షాధికారులు అయిపోతారు అనడం సిగ్గు చేటు. చంద్రబాబు ఏనాడు అధికారంలోకి వచ్చినా రైతులకు చీకటి రోజులే అనుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో రైతులు పారదర్శకమైన లబ్ధి పొందారు. వైఎస్సార్సీపీ రైతాంగానికి మద్దతుగా పోరాటం కొనసాగిస్తుంది. అండగా నిలుస్తుంది అని చెప్పుకొచ్చారు. -
Kakani: రౌడీలను పెంచి పోషించిందే నువ్వు, కోటంరెడ్డి కొత్త డ్రామా...
-
కావలికి వచ్చి తీరుతాం.. హౌస్ అరెస్ట్ పై కాకాణి స్ట్రాంగ్ రియాక్షన్
-
కావలిలో అడుగు పెట్టి తీరతాం.. బుడ్డ బెదిరింపులకు భయపడం: కాకాణి
సాక్షి, నెల్లూరు: మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి సంఘీభావంగా వైఎస్సార్సీపీ నేతలు చేపట్టిన నిరసనకు పోలీసులు అడ్డు తగిలారు. మాజీ మంత్రి కాకాణి గోవర్దనరెడ్డిని, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి సహా పలువురు నేతలను కావలికి వెళ్లకుండా అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలపై ఈ ఇద్దరూ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ప్రతాప్ కుమార్ రెడ్డి పై అక్రమ కేసు నమోదు చేశారు. ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పడానికి కావలి బయల్దేరాం. కానీ, కావలిలో ఎలా అడుగు పెడతారో చూస్తాం.. తలలు తీస్తాం అంటూ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేడు పోలీసులను అడ్డం పెట్టుకొని హౌస్ అరెస్ట్ చేయించారు. కానీ, టీడీపీ బుడ్డ బెదిరింపులకి భయపడేది లేదు. అక్రమాలపై పోరాడతాం. పోలీసులు రాష్ట్రంలో శాంతిభద్రతను గాలికి వదిలేశారు. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు, అరెస్ట్ ప్రధాన ఎజెండాగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. ఇవాళ కాకపోయినా రేపోమాపో కావలిలో అడుగుపెట్టి తీరతాం. కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అరాచకాలు అక్రమాలను బయటపెడతాం అని కాకాణి అన్నారు.హౌజ్ అరెస్ట్‌లో ఉన్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలో ప్రజాస్వామ్యం చనిపోయింది. మాపైనే దాడి చేసి.. తిరిగి మాపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మాజీ మంత్రి కాకాణి అక్రమ అరెస్టుతో ఈ పరంపర మొదలైంది. ఇప్పుడు ప్రతాప్ కుమార్ రెడ్డి పై అక్రమ కేసు బనాయించారు. ఆ కుటుంబాన్ని కలవడానికి వెళ్తే.. మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. కావలి టోల్ ప్లాజా దాటితే తలలు నరుకుతామని టీడీపీ బెదిరిస్తోంది. ఇప్పుడు పోలీస్ శాఖ అడ్డం పెట్టుకొని హౌస్ అరెస్ట్ చేయిస్తోంది అని మండిపడ్డారు.మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసును నిరసిస్తూ కాకాణి, చంద్రశేఖర్ కావలికి పయనం అయ్యారు. అయితే.. కావలిలో ఎలా అడుగు పెడతారో చూస్తాను అంటూ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి బెదిరింపులకు దిగిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ క్రమంలో పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ నేతలపై కక్షసాధింపునకు దిగారు. ఎమ్మెల్యే ఆదేశాలనుసారం వేదాయపాళెం పోలీసులు నోటీసులు జారీ చేయడానికి వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
మీలాగా పిరికిపందలు అనుకుంటున్నావా ఇది జగనన్న సైన్యం..
-
వినాయక చవితి వేడుకలో పాల్గొన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి
-
పోలీసుల పరిస్థితే ఇలా వుంటే సామాన్య ప్రజల సంగతేంటి?
సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ మంగళవారం వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అయ్యన్నపై పిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అయ్యన్నపాత్రుడు అనకాపల్లి, దొండపూడి గ్రామంలో ఓ సిఐ, ఎసైను నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఎస్స్కార్ట్ ఆలస్యంపై పరుషపదజాలం ఉపయోగించడం సిగ్గుచేటు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నత స్థానంలో వున్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కావవి. అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై పోలీస్ అసోసియేషన్ స్పందించకపోవడం బాధాకరం.. .. మా పార్టీకి, నాయకులకు పోలీసులపై గౌరవ మర్యాదలు వున్నాయి. సభ్యసమాజం తల దించుకునేలా వుంది అయ్యన్నపాత్రుని తీరు. పోలీసుల పరిస్థితే ఇలా వుంటే సామాన్య ప్రజల సంగతి ఏంటి అని ఆలోచించాలి’’ అని అన్నారు. అయ్యన్న సొంత జిల్లా అనకాపల్లి జిల్లా దొండపూడిలో గ్రామ దేవత సంబరాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను.. స్పీకర్ అయ్యన్న ప్రారంభించేందుకు వచ్చారు. అయితే.. ఆయనను చూడగానే పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. ఈ సందులో తనపై దాడి జరిగితే ఏంటి? అనేది అయ్యన్న ఆవేదన. దీంతో పోలీసులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమాషాలు చేస్తున్నారా?. మేం వస్తుంటే సీఐ,ఎస్సై ఏం చేస్తున్నారు? కనీసం ప్రొటోకాల్ కూడా తెలియకపోతే మీకు ఉద్యోగాలు ఎందుకు? ఈ సంగతి అసెంబ్లీలోనే తేలుస్తా అంటూ పోలీసులను బండబూతులు తిట్టారాయన. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో రచ్చకు దారితీసింది. పోలీసులను తిట్టారంటూ.. అయ్యన్నపై పలువురు మండిపడుతున్నారు. దీంతో సీఎంవో, డీజీపీ కార్యాలయం అసలు ఏం జరిగిందో వివరణ ఇవ్వాలని డీఎస్పీని ఆదేశించారు. -
జైలు నుంచి కాకాణి విడుదల.. మొక్కులు తీర్చుకున్న అభిమానులు
-
నెల్లూరులో దుమ్ములేపిన కాకాణి కాన్వాయ్
-
‘అక్రమ కేసులు పెట్టడంలో పోలీసులు హుషారుగా ఉన్నారు’
నెల్లూరు జిల్లా: ఏపీలో లా అండ్ ఆర్డర్‌ను పక్కను పెట్టిన పోలీసులు.. అక్రమ కేసులు పెట్టడంలో మాత్రం హుషారుగా ఉన్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్సీపీ కార్యకర్తల దగ్గర్నుంచీ మాజీ మంత్రులు వరకూ కేసులు పెట్టడం సర్వసాధారణంగా మారిపోయిందని మండిపడ్డారు. కావాలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ఇంటికి వెళ్లిన కాకాణి.. మీడియాతో మాట్లాడారు. ‘ కావలిలో రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన సౌమ్యుడు అయిన ప్రతాప్ కుమార్ రెడ్డిపై కేసు పెట్టడం దారుణం. ఎమ్మెల్యేపై హత్యాయత్నం చేయబోయారు అంటూ చెప్పడం సిగ్గుచేటు. దొంగ మాటలు చెప్పినా, అబద్ధాలు చెప్పినా అతికినట్లు ఉండాలి. అన్నవరం దగ్గర క్వాడ్జ్లో అక్రమాలు జరుగుతుంటే ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మాకు ఉంది. పోలీసులు లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్ అయ్యారు..అక్రమ కేసులు పెట్టటంలో హూషారుగా ఉన్నారు.. జిల్లా ఎస్పీగా కృష్ణకాంత్ వచ్చాక లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది ఆయనకు ప్రభుత్వం జీతం ఇవ్వటం దండుగ.కావలిలో 800 కోట్ల రూపాయలు మనీ స్కాం జరిగిందని ప్రశ్నిస్తే పోలీసులు దొంగ కేసులు పెడతారా?, అక్రమ మైనింగ్ జరుగుతుంటే నే డ్రోన్ ద్వారా వీడియోలు ప్రజలకు తెలియజేయాలని తీస్తే అక్రమ కేసులు పెడతారా?, ఇప్పుడు చేసే పాపాలు మీకు శాపాలుగా మారక తప్పవు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోలీసులు అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు.. ప్రసన్న కుమార్ రెడ్డిపై దాడి చేస్తే ఇంతవరకు వాళ్ల పేర్లను కూడా పోలీసులు గుర్తించలేక పోవటం శోచనీయం. అభివృద్ధి చేసి చూపించలేకే కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. ఈ ప్రభుత్వంలో గ్రావెల్ ఇసుక మాఫియా దర్జాగా కొనసాగుతుంది’ అని ధ్వజమెత్తారు. -
కూటమి ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది
-
వైఎస్ జగన్ పథకాల్ని కాపీకొట్టడంలో చంద్రబాబు దిట్ట
సాక్షి,తాడేపల్లి: సీఎం చంద్రబాబుకు కొత్త పథకాల ఆలోచన ఎప్పుడూ రాదని, వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పథకాల్ని కాపీ కొట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కాకాణి మీడియాతో మాట్లాడారు.‘రాష్ట్రంలో ఎరువులు అందక రైతులు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయింది. కీలక సమయంలో రైతులకు ఎరువులు అందలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా అన్నీ సమకూర్చాం. కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. రైతాంగాన్ని పట్టించుకునే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. రైతుల్ని అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారు.రైతుల సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసింది. రైతులను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తున్న దుస్థితిలో ప్రభుత్వం ఉంది. అవినీతి సొమ్మును కూడబెట్టే పనిలో మంత్రులు ఉన్నారు. మంత్రి అచ్చెన్నాయుడికి నైతికత ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. ఆగ్రోస్ ఎండీ ద్వారా లంచాలు గుంజాలని చూసిన వ్యక్తి అచ్చెన్నాయుడు. ఎంతటి నీచ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందో అర్థం చేసుకోవచ్చు.ఆగ్రోస్ ఎండీ రాసిన లేఖపై ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదంటేనే వారి వేధింపులను అర్థం చేసుకోవచ్చు.అధికారుల ద్వారా కమీషన్లు గుంజుకోవాలని చూడటం సిగ్గుచేటు. ఆ తప్పుడు పని చేయలేనంటూ ఆ అధికారి లేఖ రాశారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలి.రైతులకు యూరియా అందించలేని ప్రభుత్వం కూడా ఒక ప్రభుత్వమేనా?.అసలు రైతాంగ సమస్యలపై ఒక్క సమీక్ష కూడా చంద్రబాబు చేయలేదు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారా? అనే అనుమానం కలుగుతోంది. వ్యవసాయ ప్రణాళికలు, విత్తనాలు, ఎరువుల సమస్యలను పట్టించుకోవటం లేదు. రైతులు రాష్ట్రంలో ఉన్నారనే విషయాన్ని కూడా చంద్రబాబు మర్చిపోయారు.రాష్ట్రంలో యూరియా దొరక్క రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. బ్లాక్ మార్కెట్ లో రూ.200 అదనంగా వెచ్చించి కొనాల్సి వస్తోంది. యూరియా, ఎరువులు అన్నీ బ్లాక్ మార్కెట్ లోకి వెళ్లిపోయాయి. వైఎస్ జగన్ హయాంలో ఆర్బీకేల ద్వారా రైతుల చెంతకే చేర్చాం. ఐదేళ్లలో ఏనాడూ యూరియా కొరత రాలేదు.కానీ నేడు రైతులను కూటమి ప్రభుత్వం సంక్షోభమలోకి నెట్టేసింది. రాష్ట్రానికి రావాల్సిన యూరియాలో సగం కూడా ఏపీకి రాలేదు.అయినా చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఏ పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేయకుండానే చేసినట్టుగా చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. రైతులకు పెట్టుబడి కింద సొంతంగా రూ.20 వేలు ఇస్తామన్న చంద్రబాబు ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదు.వైఎస్ జగన్ రైతుల కోసం ప్రత్యేకంగా రూ.7,800 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు.అన్ని విధాలా రైతాంగాన్ని ఆదుకున్నారు. బీమా కోసం వైఎస్ జగన్ ప్రతి ఏటా ప్రభుత్వం తరపునే ఖర్చు చేశారు. దాన్ని కూడా టీడీపీ ఎంపీలు తప్పుదారి పట్టించేలా మాట్లాడారు. రైతులను ఈ ప్రభుత్వం పట్టించుకోనందునే 250 మంది ఆత్మహత్య చేసుకున్నారు.అంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేం ఉంటుంది?. ఆగ్రోస్ ఎండీ రాసిన లేఖపై ఇప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు?.వరదలకు నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి.రైతులకు యూరియాను వెంటనే అందించాలి. రాష్ట్రంలో వ్యవసాయశాఖ మంత్రి ఉన్నాడా అనే అనుమానం ఉంది. కూటమి ప్రభుత్వం ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు. చంద్రబాబుకు కొత్తపథకాల ఆలోచన ఎప్పుడూ రాదు. అన్నీ వైఎస్ జగన్ పథకాలే చంద్రబాబు కాపీ కొట్టాడు. వైఎస్ జగన్ హయాంలోనే రైతులకు న్యాయం జరిగింది. రైతులకు రైతు భరోసా అందించిన ఘటన వైఎస్ జగన్‌దే. చంద్రబాబు అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు ఇస్తానని మోసం చేశారు’అని ధ్వజమెత్తారు. -
శ్రీకాంత్ పెరోల్ వెనుక ఉన్నది వారే: కాకాణి
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగట్టడం వల్లే కక్షతో కేసులు పెట్టారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. జైలుకెళ్లొచ్చినా వెనక్కి తగ్గేది లేదని.. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానన్నారు.‘‘దాదాపుగా రాష్ట్రంలోని అన్నీ జైళ్లు వైఎస్సార్సీపీ నేతలతో నిండిపోయాయి. టీడీపీ వాళ్లు అరాచకాలు చేసినా పోలీసులు కేసులు పెట్టే ధైర్యం చేయలేకపోతున్నారు. అక్రమ కేసుల వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు భవిష్యత్తులో ఫేస్ చేయాల్సి వస్తుంది. గతంలో మాపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినా మేం ఎవరి మీద కేసులు పెట్టలేదు. ఇప్పుడు ఎప్పుడో జరిగిందని ఓ టీడీపీ నాయకుడి వాంగ్మూలాన్ని తీసుకుని కేసులు పెడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని దుష్ట సంప్రదాయానికి చంద్రబాబు నాంది పలుకుతున్నారు...జగన్ పరామర్శకు వెళ్లిన సమయంలో కూడా అనేక అక్రమ కేసులు పెట్టారు. అరెస్టులు చేయటం, పీటీ వారెంట్లు వేయటం.. జైళ్ల చుట్టూ తిప్పటం.. ఇదే వాళ్ల పని.. ప్రసన్న కుమార్ ఇంటిపై దాడి కేసులో నిందితులు ఎవరూ కూడా పోలీసులు గుర్తించలేదు. మా పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై అక్రమ కేసు పెట్టారు. ఎవరో డ్రోన్ ఎగరేస్తే మా పార్టీ నేతపై మర్డర్ కేసులు పెడుతున్నారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వెనుక ఉన్నది టీడీపీ ఎమ్మెల్యేలే.ఎస్పీ స్థాయి అధికారులు వద్దన్నా టీడీపీ నేతల ఒత్తిడి తోనే పెరోల్ ఇచ్చారు.. దీన్ని మళ్ళీ వైఎస్సార్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఇప్పటికైనా టీడీపీ చేసిన తప్పులు ఒప్పుకుని చెంపలేసుకోవాలి. అడ్రస్ లేని వ్యక్తులు, ఏ గాలికి ఆ చాప ఎత్తే వ్యక్తులు మాట్లాడిన మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీని బలోపేతం చేస్తాం. వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం చేసేందుకు కృషి చేస్తా’’ అని కాకాణి తెలిపారు. -
మాజీ మంత్రి కాకాణిని వెంటాడిన పోలీసులు
వెంకటాచలం: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బుధవారం విడుదలైన తర్వాత పోలీసులు ఆయనను వెంటాడారు. ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లికి చేరే క్రమంలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి జైలు నుంచి విడుదలయ్యాక నెల్లూరు జిల్లా పరిధిలో ఉండకూడదని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. దీంతో జైలునుంచి బయటకు వచ్చాక కాకాణి కారులో తాడేపల్లికి బయలుదేరారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు కార్లు, ద్విచక్ర వాహనాల్లో బయలుదేరారు. దీంతో పోలీసులు బుజబుజ నెల్లూరు దగ్గర నుంచి అయ్యప్పగుడి క్రాస్ రోడ్డు, చిల్డ్రన్స్ పార్కు రోడ్డు, కోవూరు సమీపంలో జాతీయ రహదారిపై కాకాణి గోవర్ధన్‌రెడ్డి వాహనం వెంట ఇతర వాహనాలను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. నెల్లూరు జిల్లా పరిధి దాటిన తర్వాత ఇక్కడి పోలీసులు ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వడంతో అక్కడ కూడా పోలీసులు అత్యుత్సాహం చూపి వాహనాలు వెళ్లనివ్వకుండా ఆంక్షలు విధించారు. రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెళ్లే కారు వెనక ఇతర కార్లను వెళ్లనీయకుండా అడ్డంకులు సృష్టించారు. పోలీసుల ఆంక్షలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి తాడేపల్లి చేరే వరకు కొనసాగాయి. కూటమి వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటాంకూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామని కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. జైలు నుంచి విడుదలైన అనంతరం జైలు వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆయన కుమారుడి దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు పోరాటాలు ఆపబోనని తేల్చిచెప్పారు. కూటమి ప్రభుత్వం మోపే అక్రమ కేసులకు భయపడి వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. మంత్రిగా, జెడ్పీ చైర్‌పర్సన్‌గా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన తనను 86 రోజులపాటు అక్రమ కేసులతో జైల్లో పెట్టారని పేర్కొన్నారు. ఈ సంస్కృతి తెచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తనపై సోషల్ మీడియా పోస్టులు ఎన్నో పెట్టారని.. వారిపై కేసులు పెట్టిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. కూటమి పాలనలో తనపై సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా 6 కేసులు పెట్టారన్నారు. ఏడు పీటీ వారెంట్లతో చిత్ర, విచిత్రంగా కేసులు పెట్టి తనను జైలుకు పంపారని చెప్పారు. జైల్లో వేసినంత మాత్రాన మనోధైర్యం కోల్పోలేదన్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఎక్కువగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులే ఉన్నారని, చంద్రబాబు వల్ల జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కిందన్నారు. జైళ్లకు, కేసులకు భయపడి కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, చంద్రబాబు మోసాలు, కుట్రలపై మౌనంగా ఉండే ప్రసక్తే లేదన్నారు. -
విడుదల తరువాత కాకాణి ఫస్ట్ రియాక్షన్
-
తండ్రిని చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న కూతురు
-
జైళ్లు అడ్డంకి కాదు.. సోమిరెడ్డి దోపిడీని అడ్డుకుంటాం: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బుధవారం విడుదలయ్యారు. జిల్లా నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అభిమానుల కోలాహలం మధ్య బయటకు వచ్చాక ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నాపై అక్రమ కేసులు పెట్టారు. చిత్రవిచిత్రమైన కేసులు పెట్టారు. ఏడు పీటీ వారెంట్లు వేశారు. కేసులకు భయపడే ప్రసక్తే లేదు. మా లక్ష్య సాధనలో జైళ్లు అడ్డంకి కాదు. నెల్లూరు జిల్లా ప్రజలే నా ఆస్తి. మాజీ మంత్రి(నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి) ఇంటిపై దాడి దుర్మార్గం. సర్వేపల్లిలో సోమిరెడ్డి అవినీతికి అడ్డే లేకుండా పోయింది. ఆ దోపిడీని అడ్డుకుంటాం. ప్రభుత్వంపై పోరాటానికి మానసికంగా సిద్ధంగా ఉన్నాం’’ అని కాకాణి అన్నారు. ఇదిలా ఉంటే.. కూటమి ప్రభుత్వం కాకాణిపై వరుసగా కేసులు పెట్టగా ఒక్కోదాంట్లో బెయిల్ మంజూరు అవుతూ వచ్చింది. రుస్తుం మైనింగ్ కేసులో ఏపీ హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించినట్లయ్యింది. బెయిల్‌పై ప్రాసిక్యూషన్ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. ఆ అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. కొన్ని షరతులతో కాకాణికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా.. కూటమి ప్రభుత్వం కాకాణిపై అక్రమ కేసులు పెట్టిందని వైఎస్సార్సీపీ అంటున్న సంగతి తెలిసిందే. ఆ కేసుల్లో 86 రోజులు రిమాండ్ ఖైదీగా కాకాణి జైల్లో గడిపారు. అయితే ఆయన మంగళవారమే విడుదల కావాల్సి ఉండగా.. ప్రక్రియ జాప్యం కావడంతో ఈ ఉదయం విడుదలయ్యారు. -
కాకాణి గోవర్ధన్ రెడ్డి విడుదల
-
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి విడుదల వాయిదా
సాక్షి, నెల్లూరు: మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి విడుదల వాయిదా పడింది. కోర్టు ఆర్డర్స్ ఆలస్యంతో కాకాణి ఆలస్యమైంది. గూడూరు కోర్టులో ఉదయమే ఆర్డర్స్ కోసం కాకాణి లాయర్లు అప్లై చేశారు. సాయంత్రం 5:30 గంటలు దాటాక కోర్టు ఆర్డర్స్ రిలీజ్ చేసింది. జైలు రిలీజింగ్ సమయం ముగిసిందని జైలు అధికారులు తెలిపారు.వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా కేసుల మీద కేసులు పెడుతూ జైలు నుంచి బయటకు రాకుండా చేస్తున్న కూటమి ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాక్‌నిచ్చిన సంగతి తెలిసిందే. రుస్తుం మైనింగ్ కేసులో ఏపీ హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించినట్లయ్యింది. బెయిల్‌పై ప్రాసిక్యూషన్ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. ఆ అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. కొన్ని షరతులతో కాకాణికి బెయిల్ మంజూరు చేస్తూ.. తీర్పు ఇచ్చింది.‘సహ నిందితుని వాంగ్మూలం ఆధారంగానే దర్యాప్తు చేశారు. సహ నిందితుని వాంగ్మూలాన్ని సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకోలేం. దాదాపు 36 మంది సాక్షులను విచారించారు. వారి వాంగ్మూలాలను రికార్డ్ చేశారు. కాబట్టి సాక్షులను బెదిరిస్తారని, సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న ఆందోళన ఎంత మాత్రం అవసరం లేదు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఏమీ లేదు. దర్యాప్తులో ప్రాథమిక భాగమంతా పూర్తయింది. కాబట్టి దర్యాప్తు ప్రభావితమయ్యే అవకాశం లేదు.కాకాణి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా. కాబట్టి ట్రయల్ సందర్భంగా ఆయన హాజరుకాకపోవడం అంటూ జరగదు. కాకాణిపై నమోదైన 14 కేసుల్లో ఇది కూడా ఒకటి. ఈ కేసులన్నింటినీ కూడా సహ నిందితుల వాంగ్మూలాల ఆధారంగా నమోదు చేసినవే. కాకాణి సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే. ఈ కేసులో సాక్ష్యం ఇచ్చింది మాజీ మంత్రి, ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే. ఒకే నియోజకవర్గానికి చెందిన రెండు పార్టీలకు చెందిన ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య జరుగుతున్న న్యాయ, రాజకీయ పోరాటం ఇది.’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.కాకాణిపై 13 కేసులు ఉన్నాయని, ఆయనకు బెయిలిస్తే దర్యాప్తులో జోక్యం చేసుకోవడంతోపాటు సాక్షులను బెదిరిస్తారన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఒకటి కంటే ఎక్కువ కేసులు ఉన్నంత మాత్రాన దానిని నేర చరిత ఉన్నట్లుగా భావించలేమని, ఈ కారణంగా బెయిల్‌ను నిరాకరించలేమని తేల్చి చెప్పారు. కాకాణిపై నమోదైన దాదాపు అన్నీ కేసుల్లోనూ బెయిల్ వచి్చందని, బెయిల్ షరతులను దుర్వినియోగం చేసినట్లు గానీ, సాక్ష్యాలను తారుమారు చేసినట్లు, సాక్షులను బెదిరించినట్లు గానీ ఎలాంటి ఫిర్యాదులు లేవని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.బెయిల్ ఇస్తే ట్రయల్ సందర్భంగా కాకాణిని కోర్టు ముందు హాజరుపరచడం కష్టమవుతుందన్న వాదననూ న్యాయమూర్తి తోసిపుచ్చారు. కాకాణి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. బెయిల్ మంజూరు చేస్తే కాకాణి సాక్షులను, సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న వాదననూ తిరస్కరించారు. అరెస్ట్‌కు ముందు ఆయన సాక్షులను బెదిరించినట్లు ఎలాంటి ఆరోపణలు లేవని పేర్కొన్నారు. -
మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డికి బెయిల్ మంజూరు
-
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి బెయిల్
సాక్షి,అమరావతి: మాజీ మంత్రి గోవర్ధన్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. రుస్తుం మైనింగ్ కేసుల్లో కాకాణికి బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ కోర్టు సోమవారం(ఆగస్టు 18)న తీర్పును వెలవరించింది. మొత్తం ఎనిమిది కేసుల్లో బెయిల్ రావడంతో 85రోజులుగా జైల్లో ఉన్న ఆయన కాకాణి గోవర్దన్‌రెడ్డి మంగళవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా సర్కారు పెద్దల బరితెగింపు హద్దులు మీరుతోంది. ప్రశ్నించే వారే ఉండకూడదని హూంకరిస్తూ నిత్యం తప్పుడు కేసులతో చెలరేగిపోతోంది. ఈ క్రమంలో ఈ ఏడాది మే నెలలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్ చేశారు. కేరళ రాష్ట్రంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తుండటం వల్లే కాకాణిపై తప్పుడు కేసు పెట్టారు. ఇందులో భాగంగా పొదలకూరు మండలం తాటిపర్తి రుస్తుం మైన్స్‌లో అక్రమ మైనింగ్ జరిగిందని ఈ ఏడాది ఫిబ్రవరిలో మైనింగ్ శాఖ ఇన్చార్జ్ డీడీ బాలాజీ నాయక్ పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్‌లో కాకాణి అనుచరుల ప్రమేయం ఉందని, ఆయన వారికి సహకరించారంటూ 120(బి), 447, 427, 379, 290, 506, 109 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ, సెక్షన్ 3 పీడీపీపీఎ, సెక్షన్ 3 అండ్ 5 ఆఫ్ ఈఎస్ యాక్ట్ అండ్ సెక్షన్ 21(1), 21(4) ఆఫ్ ఎంఎండీఆర్ యాక్ట్ కింద పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.ఈ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సంబంధం లేకపోయినా.. పట్టుబట్టి, టార్గెట్ చేసి ఏ4గా చేర్చారు. తొలుత ఈ కేసులో బలం లేదని ఏ1తో పాటు మరో ఇద్దరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కేసును మరింత పటిష్టం చేసి కాకాణిని జైలుకు పంపే కుట్రలో భాగంగా అట్రాసిటీ సెక్షన్లు జత చేశారు. ఇలా కూటమి ప్రభుత్వం కాకాణిపై అక్రమ కేసులు బనాయించడంతో వాటిపై న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ కాకాణి గోవర్దన్‌రెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
కాకాణితో వైఎస్ జగన్ ములాఖత్
-
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన.. చంద్రబాబు సర్కార్ మరో కుట్ర
సాక్షి,నెల్లూరు: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కూటమి ప్రభుత్వం కుట్రలు కొనసాగుతున్నాయి. గురువారం వైఎస్ జగన్ తన నెల్లూరు పర్యటనలో భాగంగా కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించనున్నారు. అయితే వైఎస్ జగన్ నెల్లూరు రానున్న తరుణంలో చంద్రబాబు ప్రభుత్వం మరో కుట్రకు తెరతీసింది.గురువారం కాకాణిని వైఎస్ జగన్ పరామర్శించనుండగా.. అదే సమయంలో కాకాణిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసుల పిటిషన్ దాఖలు చేశారు. రేపటి నుంచి ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలంటూ నెల్లూరు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, ఆ పిటిషన్‌పై విచారణను కోర్టు వాయిదా వేసింది. కాగా,వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనను దృష్టిలో ఉంచుకొని కాకాణిని కస్టడీ కోరడంపై పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన వివరాలు వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(జులై 31) నెల్లూరులో పర్యటించనున్నారు. అక్రమ కేసులో జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ ద్వారా కలవనున్నారు. అనంతరం మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఆయన, కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. -
రేపు వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(జులై 31) నెల్లూరులో పర్యటించనున్నారు. అక్రమ కేసులో జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ ద్వారా కలిసిన అనంతరం మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలో ఆయన, కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్ మాట్లాడనున్నారు.ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నెల్లూరు చేరుకుంటారు. అక్కడ జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ ద్వారా కలిసి, అనంతరం కాకాణి కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. అక్కడినుంచి నెల్లూరు సుజాతమ్మ కాలనీకి చేరుకుని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసంలో ఆయన, కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. -
Poojitha: నాన్న పై వేసిన కేసులలో ఒక్కదానికైనా సాక్ష్యాలు చూపించండి
-
మీకు దమ్ముంటే నాన్నపై వేసిన కేసులలో ఒక్కదానికైనా సాక్ష్యాలు చూపించండి
-
కూటమి వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న చంద్రబాబు
-
కాకాణిపై పీటీ వారెంట్.. హైకోర్టు షాక్
-
ఇది చాలా దురదృష్టకరం
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సహేతుక కారణాలు చెప్పకుండానే రిమాండ్ విధించడం, పీటీ వారెంట్లు జారీ చేస్తుండటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ‘ఏం చేస్తాం.. మేజిస్ట్రేట్ల తీరు అలాగే ఉంది. ఇది చాలా దురదృష్టకరం (సారీ స్టేట్ ఆఫ్ ఎఫైర్స్)’ అని హైకోర్టు ఒకింత ఘాటుగా వ్యాఖ్యానించింది. పలు అభ్యర్థనలతో కాకాణి దాఖలు చేసిన మూడు వ్యాజ్యాల్లో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడు పిటిషన్లు దాఖలు చేసిన కాకాణి అక్రమ మైనింగ్ ఆరోపణలపై నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ కేసులో తన బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తూ నెల్లూరు కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కాకాణి గోవర్ధన్‌రెడ్డి హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. అలాగే మట్టి తవ్వకాలకు సంబంధించి నెల్లూరు జిల్లా వి.సత్రం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు పీటీ వారెంట్ జారీ చేస్తూ నెల్లూరు కోర్టు గత నెల 10న జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ కాకాణి మరో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాక టీడీపీ సీనియర్ నేత, సర్వేపల్లి ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫొటోలను మారి్ఫంగ్ చేశారంటూ సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు కోర్టు తనకు పీటీ వారెంట్ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ గోవర్ధన్‌రెడ్డి ఇంకో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మూడు వ్యాజ్యాలు గురువారం జస్టిస్ శ్రీనివాసరెడ్డి ముందు విచారణకు వచ్చాయి. ఏడేళ్లకన్నా తక్కువ శిక్ష పడే సెక్షన్లున్నా కూడా 41ఏ వర్తిందన్నారు ఈ సందర్భంగా కాకాణి తరఫున సీనియర్ న్యాయవాది ఒ.మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు. మట్టి తవ్వకాలకు సంబంధించి కాకాణిపై నమోదైన సెక్షన్లన్నీ ఏడేళ్లకన్నా తక్కువ శిక్ష పడేవేన్నారు. అయినా కూడా మేజిస్ట్రేట్ సెక్షన్ 41ఏ వర్తించదన్నారని తెలిపారు. అంతేకాక సహేతుక కారణాలు తెలియచేయకుండానే పీటీ వారెంట్ జారీ చేశారన్నారు. మేజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించారని తెలిపారు. ఇది ఎంత మాత్రం సరికాదన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. మేజిస్ట్రేట్ల తీరుపై వ్యాఖ్యానించారు. అంతకు ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. మైనింగ్ కేసులో కాకాణిని మరోసారి తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, దీనిపై కోర్టు విచారణ జరపనుందని తెలిపారు. అందువల్ల కాకాణి దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణను వాయిదా వేయాలని పలుమార్లు అభ్యరి్థంచారు. దీంతో కాకాణి గోవర్ధన్‌రెడ్డి దాఖలు చేసిన మూడు వ్యాజ్యాల్లో విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. -
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన ఏర్పాట్లపై అనిల్ కుమార్ యాదవ్..
-
నాన్న ఏమైనా దొంగ నక్సలైటా.. టీడీపీపై కాకాణి పూజిత ఫైర్..
-
మా నాన్న తప్పు చేయడు.. ఎవరైనా చేస్తే ఒప్పుకోడు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘నేను గట్టిగా నమ్ముతున్నాను. మా నాన్న ఎలాంటి తప్పు చేయలేదని. చేయని తప్పులకు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారు. బెయిల్ రాకుండా రోజుకో కేసు తెరపైకి తెచ్చి వేధిస్తున్నారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నను దగ్గరగా చూస్తున్నాను. ఆయన ఏ తప్పు చేయడు. తప్పు చేసిన వారు ఎవరైనా ఒప్పుకోడు. అలాంటి ఆయనపై అక్రమ కేసులు పెడుతున్నారు. అన్నింటిని ఆ భగవంతుడే చూస్తున్నాడు. నాన్నపై కుట్ర పన్ని తప్పులు చేసిన వారు, చేయిస్తున్న వారిని భగవంతుడే శిక్షిస్తాడు. నాన్న కడిగిన ముత్యంలా బయటకు వస్తాడని నేను నమ్ముతున్నాను’ వైఎస్సార్సీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తనయ కాకాణి పూజితతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.మీ నాన్న అరెస్ట్ తర్వాత మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏమిటి? కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ప్రశి్నస్తున్నారని మానాన్నపై అక్రమ కేసులు బనాయించి రిమాండ్‌లో ఉంచారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్నను వదిలి ఉండలేదు. ఎప్పుడు ఆయనతోనే ఉండేవాళ్లం. నాకు వివాహం అయి తొమ్మిదేళ్లు. అప్పుడే నా ఇద్దరు బిడ్డలు నా వద్దే ఉండాలని చెప్పి చేశారు. నాన్నను చూడకుంటా ఒక్క రోజు కూడా ఉండలేదు. అలాంటిది మూడు నెలలుగా నాన్నకు దూరంగా ఉంటే ఎలా ఉంటుంది?. 80 ఏళ్ల మా నాన్నమ్మ నా బిడ్డ ఏం తప్పు చేశాడని జైల్లో పెట్టారని ప్రశి్నస్తుంటే ఆమెను ఓదార్చలేకపోతున్నాం. మా పిల్లలు తాతయ్య ఎక్కడని రోజూ ఏడుస్తున్నారు. పిల్లలు వాళ్ల తాతయ్యను వదిలి ఉండలేదు. మా నాన్న మనస్తత్వం తెలిసిన నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆయన తప్పు చేయడు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా జంకడు. ఆయన్ను ఒక రాజులా చూశాను. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆయన్ను చూడలేకే ములాఖత్‌కు వెళ్లడం లేదు.కాకాణిని జైల్లో పెట్టడంతో పార్టీ కేడర్ పరిస్థితి ఏమిటి? మూడు నెలలుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మా నాన్న దూరంగా ఉన్నారు. అయినా పార్టీ కేడర్ ఏమీ భయపడడం లేదు. నా తండ్రి అందుబాటులో లేకపోయినా.. ఆయన బిడ్డగా నేను పార్టీ కేడర్‌కు అండగా నిలబడి ధైర్యం చెబుతున్నాను. అందరికి మంచి చేసిన మా నాన్నను జైల్లో పెట్టడంతో పార్టీ కేడర్ మొత్తం కసితో ఉన్నారు. వారే ముందుకు వచ్చి మాకే ధైర్యం చెబుతున్నారంటే ఆయన వారిపట్ల ఎంత నిబద్ధతగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.పార్టీ కేడర్‌ను వేధిస్తున్నారన్న సమాచారం ఎంత వరకు నిజం? కూటమి ప్రభుత్వ పెద్దలు ఆదేశాలతో పోలీసులు మా నాన్న గోవర్ధన్‌రెడ్డిపై ఇప్పటికే చాలా అక్రమ కేసులు పెట్టారు. రోజుకో కేసు పెడుతున్నారు. ఆధారాలు లేని ఆ కేసుల్లో నాన్న పేరు చెప్పాలని పార్టీ కేడర్‌ను పోలీసులు తీసుకెళ్లి చిత్రహింసలు పెడుతున్నారు. వాళ్ల టార్చర్ భరించలేకపోతున్నట్లు కొందరు నాకు ఫోన్ చేసి అమ్మా మమ్మల్ని పోలీసులు ఇబ్బంది పెట్టి సంతకాలు తీసుకుంటున్నారు అని చెబుతుంటే బాధగా అనిపిస్తుంది. నాన్న ఒక్కడిని ఇబ్బంది పెట్టడం కోసం ఇంత మందిని హింసించడం చూస్తే నా మనస్సు చలిస్తుంది. నాన్న వెంట నడిచిన నేతలందరిని కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారు.భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? మా కుటుంబం విలువలతో కూడిన రాజకీయం చేసింది. మా తాతయ్యకు ఇప్పటికి మంచి పేరు ఉంది. మా తాత విలువలకు వారసుడిగా రాజకీయ చేస్తున్నారే కానీ.. ఏనాడు తెలియక కూడా తప్పు చేయలేదు. జెడ్పీ చైర్మన్‌గా, రెండు సార్లు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఎవరికి అన్యాయం చేయలేదు. తప్పు చేసిన వారిని రాజకీయ కోణంలోనే ఆ తప్పులను ఎత్తి చూపి విమర్శలు చేశారనే కానీ, అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తిగత కక్ష తీర్చుకునే ప్రయత్నం చేయలేదు. మా నాన్న ఏ తప్పు చేయలేదు కాబట్టి కచ్చితంగా కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు. అంత వరకు మా నియోజకవర్గంలోని మా పార్టీ కార్యకర్తలకు నేను అండగా ఉంటానని చెప్పాను. -
3న నెల్లూరుకు వైఎస్ జగన్
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ జూలై 3న నెల్లూరు రానున్నారు. సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ములాఖత్‌లో పరామర్శిస్తారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.ఆదివారం నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మేరిగ మురళి, సూళ్లూరుపేట సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కాకాణిని కలిసిన అనంతరం వారి కుటుంబ సభ్యులను కూడా వైఎస్ జగన్ పరామర్శిస్తారని తెలిపారు. -
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఊరట
-
హైకోర్టులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఊరట
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డికి హైకోర్టు ఊరటనిచ్చింది. సీఐడీ పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేసింది. కాకాణికి రిమాండ్ విధిస్తూ మేజి్రస్టేట్ జారీ చేసిన ఉత్తర్వులను తప్పుపట్టింది. పిటిషనర్‌పై నమోదు చేసిన కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయా? లేదా? అనే ప్రాథమిక, ముఖ్యమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే మేజిస్ట్రేట్ యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చారని హైకోర్టు ఆక్షేపించింది. ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూలై 3కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సోమిరెడ్డి ఫోటోలను మార్ఫింగ్ చేశారంటూ అక్రమ కేసు... శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ అల్లీపురంకి చెందిన టీడీపీ నేత మేకల సురేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరిలోని సీఐడీ పోలీసులు కాకాణిపై అక్రమ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపివేయడంతో పాటు గుంటూరు 6వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు తన మీద జారీ చేసిన పీటీ వారెంట్ ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ కాకాణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు. మేజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించారు.. కాకాణి గోవర్ధన్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు. మేజి్రస్టేట్ యాంత్రికంగా పీటీ వారెంట్ జారీ చేశారన్నారు. పీటీ వారెంట్ కూడా సరైన ఫార్మాట్లో లేదన్నారు. కాకాణికి రిమాండ్ విధించే సమయంలో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ ప్రకారం అనుసరించాల్సిన విధి విధానాలను పాటించలేదన్నారు. కాకాణిపై పెట్టిన సెక్షన్లన్నీ కూడా ఏడేళ్లలోపు శిక్ష పడేవేనని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఈ విషయాన్ని మేజి్రస్టేట్ కనీస స్థాయిలో కూడా పరిగణనలోకి తీసుకోలేదన్నారు. మనోహర్‌రెడ్డి వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు.. పిటిషనర్ కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై సీఐడీ పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
నెల్లూరు జైల్లో కాకాణిని పరామర్శించిన పెద్దిరెడ్డి
సాక్షి, నెల్లూరు జిల్లా: కాకాణి గోవర్థన్‌రెడ్డిపై అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారని.. కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. శనివారం.. జైల్లో కాకాణిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎప్పుడూలేని విధంగా రాజకీయ నేతలకు పీటీ వారెంట్లు వేస్తున్నారన్నారు. చంద్రబాబుకు కూడా ఈ పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. -
మీరు ఎన్ని కేసులైన పెట్టుకోండి.. సర్వే పల్లి మొత్తం నా కుటుంబమే
-
అందుకే కాకాణిపై కేసులు.. పేర్నినాని కీలక వ్యాఖ్యలు
-
నెల్లూరు జైలు నుంచి కాకాణి తరలింపు
-
మాజీ మంత్రి కాకాణి కుమార్తె పూజితపై అక్రమ కేసు
సాక్షి, నెల్లూరు: మాజీ మంత్రి కాకాణి కుమార్తె పూజిత పై అక్రమ కేసు నమోదైంది. వినతి పత్రం ఇచ్చినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాకాణి కుమార్తె పూజిత సహా వైఎస్సార్సీపీ నేతలపై కేసు నమోదైంది. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మేరుగ మురళిలపైనా పోలీసులు కేసులు పెట్టారు. జేసీకి కార్తీక్ కి వినతిపత్రం ఇచ్చినందుకు కేసు నమోదు చేశారు.కాకాణి అక్రమ అరెస్ట్‌పై సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. నిన్న జేసీని కాకాణి కుమార్తె పూజిత, ఎమ్మెల్సీలు, వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. దీంతో ప్రజలకు అశాంతి కలిగించారంటూ పది మందిపై అక్రమ కేసు నమోదు చేశారు. పోలీసులు అక్రమ కేసుపై నెల్లూరు ప్రజలు విస్తుపోతున్నారు. -
కాకాణి కుటుంబానికి సజ్జల పరామర్శ
-
మా నాన్నను అక్రమంగా అరెస్ట్ చేశారు
-
అక్రమ కేసులతో మా నాన్నను భయపెట్టలేరు: కాకాణి పూజిత
సాక్షి, నెల్లూరు: ప్రజలకు మంచి చేసిన వ్యక్తి కాకాణి గోవర్థన్ రెడ్డి.. అలాంటి వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు కాకాణి కుమార్తె పూజితా రెడ్డి. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఇంకా విచారణలో ఉంది. విచారణలో ఉండగానే అరెస్ట్ చేసి బెదిరించాలని చూస్తున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజితా రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మా నాన్నని అక్రమంగా అరెస్ట్ చేశారు. ప్రజలకి మంచి చేసిన ప్రతీసారి మా నాన్న మొహంలో ఆనందం కనిపిస్తుంది. కరోనా సమయంలో ప్రాణాలని కూడా లెక్కచేయకుండా ప్రజలకి సదుపాయాలు కల్పించారు. మంత్రిగా పనిచేసిన రెండేళ్లలో మా నాన్నని నేను ఒక పదిసార్లు మాత్రమే చూశాను.. ఎప్పుడు జనాల్లోనే ఉండేవారు. ప్రతిపక్షాన్ని రాజకీయ ప్రత్యర్ధులుగా మాత్రమే చూడాలని.. శత్రువులుగా చూడొద్దని మా నాన్న చెప్పేవారు. అలాంటి వ్యక్తిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం చాలా బాధాకరం.గతంలో పెట్టిన కేసుల్లో విచారణకు నాన్న వచ్చారు. ఈ అక్రమ కేసులో అరెస్ట్ చేస్తారని తెలిసి దూరంగా ఉన్నారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఇంకా విచారణలో ఉంది. విచారణలో ఉండగానే అరెస్ట్ చేసి బెదిరించాలని చూస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలని బెదిరించాలని, భయపెట్టాలని చూస్తున్నారు. మా నాన్నకు అండగా నిలుస్తున్న కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు చెబుతున్నాం. మా నాన్న కడిగిన ముత్యంలా బయటకి వస్తారు’ అని వ్యాఖ్యానించారు. -
కాకాణికి 14 రోజుల రిమాండ్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్సీపీ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తిరుపతి జిల్లా వెంకటగిరి జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో ఉన్న రుస్తుం మైన్స్‌లో తవ్వకాలకు సంబంధించి కాకాణిపై అక్రమ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను ఆదివారం అదుపులోకి తీసుకున్న పోలీసులు సోమవారం గూడూరు అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. వెంకటగిరి జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఎస్.విష్ణువర్మ ఈ కోర్టుకు ఇన్చార్జిగా ఉన్నారు. ఈ క్రమంలో వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి 14 రోజుల పాటు కాకాణికి రిమాండ్ విధించారు. దీంతో ఆయనను పోలీసులు వెంకటాచలం మండలం చెముడుగుంటలో ఉన్న సెంట్రల్ జైలుకు తరలించారు.రెండు గంటల పాటు వాదోపవాదాలురుస్తుం మైన్స్‌లో అక్రమ మైనింగ్ జరిగిందందటూ నమోదు చేసిన కేసు అక్రమం అని కాకాణి గోవర్ధన్‌రెడ్డి తరఫు న్యాయవాదులు రోజారెడ్డి, ఉమామహేశ్వరరావు తమ వాదనలు వినిపించారు. రిమాండ్ రిపోర్ట్‌లో లోపాలున్నాయని, అరెస్ట్ సమయంలో కాకాణి కుటుంబసభ్యులకు తెలియజేయలేదని వివిధ లోపాలను ఎత్తిచూపారు. అనారోగ్య సమస్యల కారణంగా కాకాణికి స్పెషల్ కేటగిరీ కింద సదుపాయాలు కల్పించాలని కోరారు. దీంతో మానవతా దృకృథంలో ఆయా సౌకర్యాలు కల్పించాలని న్యాయమూర్తి ఉత్తర్వులో పేర్కొన్నారు. దీంతోపాటు వారానికి రెండుసార్లు కాకాణి తరఫు న్యాయవాదులు రోజారెడ్డి, ఉమామహేశ్వరరావు జైల్లో ఆయనను కలిసేందుకు అవకాశం కల్పించారు.–రుస్తుం మైన్స్‌లో తవ్వకాలపై ఈ ఏడాది ఫిబ్రవరి 16 జిల్లా ఇన్చార్జి మైనింగ్ డీడీ బాలాజీనాయక్ ద్వారా అధికార టీడీపీ నేతలు పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఈ అక్రమ కేసులో.. ముగ్గురు నిందితులను చేర్చారు. వారు హైకోర్టులో ముందస్తు బెయిల్ పొందారు. అయితే, రెడ్‌బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా పోలీసులు మార్చి 28న ఆ ఎఫ్ఐఆర్కు కొనసాగింపుగా రిమాండ్ నివేదిక ద్వారా ఏ4గా మాజీ మంత్రి కాకాణిని చేర్చారు. అన్నా.. నేనున్నా.. అధైర్యపడొద్దు–కాకాణికి ఫోన్లో వైఎస్ జగన్ భరోసా–బెయిల్‌పై ఆరా తీసిన వైఎస్సార్సీపీ అధినేతవెంకటగిరి(సైదాపురం): అక్రమ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. ‘‘నేనున్నాను’’ అని భరోసా ఇచ్చారు. కాకాణిని సోమవారం వెంకటగిరి కోర్టుకు తీసుకురావడంతో ఆయనకు బెయిల్ విషయమై వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తితో ఫోన్ ద్వారా ఆరా తీశారు.కోర్టు దగ్గర ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి ఫోన్ ద్వారా కాకాణితో మాట్లాడారు. ‘‘అన్నా.. నీకు అండగా నేనున్నా.. నీవు అధైర్య పడొద్దు.. న్యాయం గెలుస్తుంది.. నీవు నిష్కళంకుడిగా బయటకు వస్తావు’’ అంటూ వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. మూడు గంటల వ్యవధిలో కాకాణితో రెండుసార్లు ఫోన్లో మాట్లాడారు. కాకాణి కుటుంబ సభ్యులను కూడా వైఎస్ జగన్ ఫోన్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు. రిమాండ్ విధించిన విషయమై కూడా వైఎస్ జగన్‌కు స్థానిక నేతలు సమాచారం ఇచ్చారు. సోమవారం వెంకటగిరిలో జరిగిన పరిణామాలన్నిటినీ వైఎస్ జగన్‌కు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి వివరించారు. -
కూటమి ప్రభుత్వ తాజా టార్గెట్ ‘కాకాణి’
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రభుత్వ వైఫల్యాలు, అసమర్థతను ప్రశ్నించే వారిపై రెడ్‌బుక్ రాజ్యాంగం ద్వారా ఉక్కుపాదం మోపుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం తాజాగా మాజీమంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిని టార్గెట్ చేసింది. అక్రమ కేసులతో వేధించే పరంపరలో కాకాణిపై అక్రమ కేసు పెట్టింది. పొదలకూరు మండలం తాటిపర్తిలోని ‘రుస్తుం మైన్స్’లో అక్రమ మైనింగ్ జరిగిందని.. అందులో కాకాణి అనుచరుల ప్రమేయం ఉందని, వారికి ఆయన సహకరించారంటూ కాకాణిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో పోలీసులు అక్రమ కేసులు నమోదుచేశారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తున్న ఆయన్ని కట్టడి చేయాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం వేధిస్తోందన్నది స్పష్టమవుతోంది. కాకాణిపై ఇవీ కేసులు..⇒ గతేడాది గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్సీపీ సెంట్రల్ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెడితే ఆ వార్తను ’సాక్షి’ కవర్ చేసింది. ఆ కథనాన్ని తన వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశారని వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు.⇒ వెంకటాచలం మండలానికి చెందిన బీజేపీ నేత నెల్లూరులో ప్రెస్‌మీట్ పెడితే కాకాణి ఆ వీడియోను కూడా వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశారని మరో కేసు పెట్టారు.⇒ స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డిపై అసభ్యకరంగా పోస్టింగ్ పెట్టారని ముత్తుకూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించారు.⇒ గతేడాది అక్టోబరులో ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలుచేయకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు నిరసన చేపట్టారు. జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా కాకాణి గోవర్థన్‌రెడ్డి వారికి సంఘీభావంగా వెళ్లి అందులో పాల్గొన్నందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. ⇒ గతేడాది డిసెంబరులో వెంకటాచలం మాజీ జెడ్పీటీసీ శేషయ్యపై పోలీసులు అక్రమ కేసు నమోదుచేసి జైలుకు పంపారు. వీరి తీరుపై కాకాణి మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఓ టీడీపీ కార్యకర్త నెల్లూరు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదుచేస్తే కేసు నమోదు చేశారు.⇒ ఇక కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలం కోళ్లదిన్నెలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. గాయపడ్డ వారిని పరామర్శించిన కాకాణి అక్కడ మీడియాతో మాట్లాడుతూ పోలీసుల పక్షపాత వైఖరిని ఎండగట్టారు. దీనిపై టీడీపీ కార్యకర్త ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేశారు. ⇒ తాజాగా.. పొదలకూరు మండలంలోని రుస్తుం మైన్స్‌లో గత ప్రభుత్వ హయాంలో అనధికారికంగా మైనింగ్ చేసి క్వార్ట్జ్ మెటల్‌ను తరలించారని, అందుకు కాకాణి తన అనుచరులకు సహకరించారనే కారణం చూపి ఆయనపై కేసు బనాయించారు. కానీ, ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు అరెస్టుకాగా.. వారి రిమాండ్ రిపోర్టులో ఎక్కడా కాకాణి పాత్ర ఉన్నట్లు ధృవపరచలేదు. ఇదంతా కూడా పోలీసుల కల్పితమే తప్ప ఎక్కడా వీరి పాత్రగానీ, కాకాణి పాత్రగానీ లేకపోవడం గమనార్హం.ఇప్పటివరకు 16 విచారణలు..గత ప్రభుత్వ హయాంలో కాకాణి గోవర్థన్‌రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారంటూ స్థానిక ఎమ్మెల్యే పలుమార్లు విజిలెన్స్ విచారణ చేయించారు. ఇప్పటికి 16సార్లు విజిలెన్స్ అధికారులు విచారణచేసి అవినీతి జరగలేదని తేల్చిచెప్పారు. దీంతో ఎలాగైనా కాకాణిని జైలుకు పంపేందుకు ప్రభుత్వ పెద్దలు చేయని ప్రయత్నాల్లేవు. ఇందులో భాగంగా.. ఒంగోలుకు చెందిన డీఎస్పీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటుచేసి విచారణ చేయిస్తున్నారు. -
తప్పుడు కేసులకు భయపడం: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, తిరుపతి జిల్లా: రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. జిల్లా అంత ఒక్కతాటిపై ఉండి మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి అండగా ఉంటాం.. మీరు ఎన్ని కేసులు పెడితే అంత బలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దగ్గర అవుతుంది. ఎన్ని కేసులు పెట్టిన వైఎస్సార్సీపీ నాయకులు భయపడరు. న్యాయస్థానంపై మాకు నమ్మకం ఉంది’’ అని అనిల్ చెప్పారు.వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి పై తప్పుడు కేసులు పెట్టీ జైలుకు పంపించారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారువెంకటగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇంచార్జి నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందన్నారు. సీఎం చంద్రబాబును ఇళ్లకు పంపించాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. అందరికీ ఇల్లు సాధ్యం కాదని.., చంద్రబాబుకు మాత్రమే ఇల్లు కట్టుకుంటున్నారు. ప్రజలే చంద్రబాబును ఇంటికి పంపిస్తారుఎమ్మెల్సీ మేరుగ మురళి మాట్లాడుతూ.. నిరాధారమైన ఆరోపణలతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తప్పుడు కేసులకు వైఎస్సార్సీపీ నాయకులు భయపడరు.ఎమ్మెల్సీ చంద్ర శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా చరిత్రలో తప్పుడు కేసులతో మాజీ మంత్రిని అరెస్ట్ చేసిన ఘటన ఎప్పుడు జరగలేదు. జూన్ 4 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం బలంగా నిర్వహిస్తాం. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తాం -
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి రిమాండ్
-
అక్రమ కేసులో మాజీ మంత్రి కాకాణి అరెస్టు
-
మెజిస్ట్రేట్ ఎదుట కాకాని
-
కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్.. రంగంలోకి వైఎస్సార్సీపీ నేతలు
-
మేజిస్ట్రేట్ ముందుకు కాకాణి.. 144 సెక్షన్ అమలు..
కాకాణి అరెస్ట్ అప్డేట్స్..మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి రిమాండ్14 రోజుల రిమాండ్ విధించిన వెంకటగిరి కోర్టుకాసేపట్లో నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలింపు తిరుపతి..వెంకటగిరి జూనియర్ సివిల్ జడ్జి మేజిస్ట్రేట్ కోర్టులో కాకాణిని హాజరు పరిచిన నెల్లూరు పోలీసులు కాసేపట్లో మేజిస్ట్రేట్ ముందుకు కాకాణి..కాసేపట్లో నెల్లూరు డీటీసీ నుంచి వెంకటగిరి మేజిస్ట్రేట్ ముందు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికాకాణిని హాజరుపరుచనున్న పోలీసులు.వెంకటగిరి మేజిస్ట్రేట్ ఆవరణలో 144 సెక్షన్ విధింపు. కాకాణికి వైద్య పరీక్షలు పూర్తి..వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తి.చెముడు గుంటలోని డీటీసీ నుంచి నేరుగా వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి కాకాణిని తీసుకెళ్లిన పోలీసులువైద్య పరీక్షల అనంతరం అక్కడి నుంచి వెంకటగిరి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే అవకాశం ఉంది.👉 రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెడ్‌బుక్ పాలన పీక్ స్టేజ్‌కు చేరుకుంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా సర్కారు పెద్దల బరితెగింపు హద్దులు మీరాయి. ప్రశ్నించే వారే ఉండకూడదని టార్గెట్ చేస్తూ అరెస్ట్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్ చేశారు. కేరళ రాష్ట్రంలో ఆయన్ను అదుపులోకి తీసుకుని ఆదివారం రాత్రి నగరానికి తీసుకువచ్చారు.👉పొదలకూరు మండలం తాటిపర్తి రుస్తుం మైన్స్‌లో అక్రమ మైనింగ్ జరిగిందని ఈ ఏడాది ఫిబ్రవరిలో మైనింగ్ శాఖ ఇన్చార్జ్ డీడీ బాలాజీ నాయక్ పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్‌లో కాకాణి అనుచరుల ప్రమేయం ఉందని, ఆయన వారికి సహకరించారంటూ 120(బి), 447, 427, 379, 290, 506, 109 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ, సెక్షన్ 3 పీడీపీపీఎ, సెక్షన్ 3 అండ్ 5 ఆఫ్ ఈఎస్ యాక్ట్ అండ్ సెక్షన్ 21(1), 21(4) ఆఫ్ ఎంఎండీఆర్ యాక్ట్ కింద పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.👉ఈ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సంబంధం లేకపోయినా.. పట్టుబట్టి, టార్గెట్ చేసి ఏ4గా చేర్చారు. తొలుత ఈ కేసులో బలం లేదని ఏ1తో పాటు మరో ఇద్దరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కేసును మరింత పటిష్టం చేసి కాకాణిని జైలుకు పంపే కుట్రలో భాగంగా అట్రాసిటీ సెక్షన్లు జత చేశారు.👉కాకాణి ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఉండగా నెల్లూరు పోలీసులు ఆదివారం మధ్యాహ్నం ఆయన్ను అదుపులోకి తీసుకుని నెల్లూరు డీటీసీకి తరలించారు. సమాచారం అందుకున్న మాజీ మంత్రి డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు డైకస్ రోడ్డులోని కాకాణి గృహానికి చేరుకున్నారు. -
కాకాణిని జైలుకు పంపడమే లక్ష్యంగా కూటమి పెద్దల కుట్ర
-
ఆగని కక్ష సాధింపులు.. కాకాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
అక్రమ కేసులో మాజీ మంత్రి కాకాణి అరెస్టు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రెడ్‌బుక్ పాలన రోజురోజుకూ శ్రుతిమించుతోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా సర్కారు పెద్దల బరితెగింపు హద్దులు మీరుతోంది. ప్రశ్నించే వారే ఉండకూడదని హూంకరిస్తూ నిత్యం తప్పుడు కేసులతో చెలరేగిపోతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్ చేశారు. కేరళ రాష్ట్రంలో ఆయన్ను అదుపులోకి తీసుకుని ఆదివారం రాత్రి నగరానికి తీసుకువచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక.. వాటిని ప్రజలకు గుర్తు చేస్తున్న నేతలపై కూటమి ప్రభుత్వం కళ్లెర్ర చేస్తోందనేందుకు కాకాణి అరెస్టే నిదర్శనం. ఆయనకు ఏమాత్రం సంబంధం లేని సిల్లీ కేసులో ప్రభుత్వ పెద్దలు పట్టుబట్టి మరీ అరెస్ట్ చేయించడం దుర్మార్గం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసులను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు.. అరెస్టులు.. వేధింపులతో ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. రెడ్‌బుక్ కుట్రలతో ఇప్పటికే పదుల సంఖ్యలో ముఖ్య నేతలపై తప్పుడు కేసులు బనాయించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తుండటం వల్లే కాకాణిపై తప్పుడు కేసు పెట్టారు. ఇందులో భాగంగా పొదలకూరు మండలం తాటిపర్తి రుస్తుం మైన్స్‌లో అక్రమ మైనింగ్ జరిగిందని ఈ ఏడాది ఫిబ్రవరిలో మైనింగ్ శాఖ ఇన్చార్జ్ డీడీ బాలాజీ నాయక్ పొదలకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్‌లో కాకాణి అనుచరుల ప్రమేయం ఉందని, ఆయన వారికి సహకరించారంటూ 120(బి), 447, 427, 379, 290, 506, 109 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ, సెక్షన్ 3 పీడీపీపీఎ, సెక్షన్ 3 అండ్ 5 ఆఫ్ ఈఎస్ యాక్ట్ అండ్ సెక్షన్ 21(1), 21(4) ఆఫ్ ఎంఎండీఆర్ యాక్ట్ కింద పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సంబంధం లేకపోయినా.. పట్టుబట్టి, టార్గెట్ చేసి ఏ4గా చేర్చారు. తొలుత ఈ కేసులో బలం లేదని ఏ1తో పాటు మరో ఇద్దరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కేసును మరింత పటిష్టం చేసి కాకాణిని జైలుకు పంపే కుట్రలో భాగంగా అట్రాసిటీ సెక్షన్లు జత చేశారు. కాకాణి ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో ఉండగా నెల్లూరు పోలీసులు ఆదివారం మధ్యాహ్నం ఆయన్ను అదుపులోకి తీసుకుని నెల్లూరు డీటీసీకి తరలించారు. సమాచారం అందుకున్న మాజీ మంత్రి డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు డైకస్ రోడ్డులోని కాకాణి గృహానికి తరలి వస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పరాకాష్ట గత ప్రభుత్వ హయాంలో రుస్తుం మైన్స్‌లో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ అప్పటి టీడీపీ నేత, ప్రస్తుత సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో మైనింగ్ శాఖ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసింది. ఆ మైన్‌లో క్వార్ట్జ్, పల్స్పర్, మిక్స్డ్ మైకా 1050 మెట్రిక్ టన్నులు నిల్వ ఉందని, అక్కడ అక్రమ మైనింగే జరగలేదని నివేదిక ఇచ్చింది. ప్రభుత్వం మారడంతో స్థానిక ఎమ్మెల్యే, కూటమి పెద్దలు కాకాణిని టార్గెట్ చేసి, అక్రమంగా మైనింగ్ జరిగిందంటూ బాలాజీ నాయక్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయించారు. వాస్తవంగా ఆ మైన్‌లో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి నివేదిక ఇచ్చిన వారిలో ప్రస్తుతం ఫిర్యాదు చేసిన మైనింగ్ శాఖ ఇన్చార్జ్ డీడీ కూడా ఉండడం విశేషం. అధికార దుర్వినియోగం జరిగిందనేందుకు ఇంత కంటే నిదర్శనం అవసరమా? -
కూటమి సర్కార్ కక్ష సాధింపు.. కాకాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
సాక్షి, నెల్లూరు: ఏపీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కాకాణిపై మైనింగ్ పేరుతో పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డిని రెండు నెలలుగా పోలీసులు టార్గెట్ చేశారు.రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని గాలికొదిలేసి.. చంద్రబాబు సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. పొదలకురు మండలం రుస్తుం మైన్ కేసులో కాకాణిని పోలీసులు ఇరికించారు. ప్రభుత్వం వైఫల్యాలు, చంద్రబాబు దోపిడీ విధానాలను విమర్శించినందుకు కక్ష కట్టిన ప్రభుత్వం.. మాజీ మంత్రి సోమిరెడ్డి మైనింగ్‌ని బయటపెట్టినందుకు ఎదురు కేసులు పెట్టించి వేధిస్తోంది.క్వార్జ్ మైనింగ్ మైనింగ్‌పై తప్పుడు నివేదికతో కాకాణిపై కేసు నమోదు చేశారు. రుస్తుంలో ఎలాంటి అక్రమ మైనింగ్ జరగలేదని గతంలోనే మైనింగ్ అధికారులు నివేదిక ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం రాగానే అదే మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ ద్వారా అక్రమ మైనింగ్ జరిగిందంటూ ఫిర్యాదు చేయించారు. ఓ వైపు క్వార్జ్‌ను టీడీపీ నేతలు యథేచ్ఛగా దోచుకుంటున్నారు. మరోవైపు, వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తోంది. కాకాణిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం పట్ల వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఆయనపై కేసులున్నాయని మీరెలా చెబుతున్నారు?
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసులు ఉన్నాయని మీరెలా చెబుతారు.. అంటూ సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. క్వార్ట్జ్ ఖనిజం తవ్వకాల కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కాకాణి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారించింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారని, గిరిజనులను బెదిరించారని మైనింగ్ అధికారి బాలాజీనాయక్ ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాణి గోవర్దన్ రెడ్డిని ఏ–4గా చేర్చారు. దీంతో ముందస్తు రక్షణ కల్పించాలని కోరుతూ.. ఆయన మే 13న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఆ పిటిషన్ శుక్రవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. కాకాణి గోవర్ధన్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ దవే వాదనలు వినిపించారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పెట్టిన కేసేనని, అందులో ఏ మాత్రం వాస్తవం లేదని కోర్టుకు తెలిపారు. అందుకు ధర్మాసనం.. ‘హైకోర్టు డివిజన్ బెంచ్ వద్దే తేల్చుకోవచ్చు కదా.. దీనికోసం ఇక్కడి వరకు ఎందుకు వచ్చారు.. అని అడిగింది.హైకోర్టు డివిజన్ బెంచ్ కేసును జూన్ 16కు వాయిదా వేసిందని, అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించామని దవే బదులిచ్చారు. కాగా.. తనపై గతంలో ఇలాంటి కేసులేవీ నమోదు కాలేదని గోవర్దన్ రెడ్డి కోర్టును తప్పుదారి పట్టించేలా పిటిషన్లో పేర్కొన్నారని ఏపీ ప్రభుత్వం తరఫున ప్రేరణ సింగ్ ధర్మాసనానికి తెలిపారు. ‘ఆయన మీద కేసులు ఉన్నాయని మీరు ఎలా చెబుతున్నారు?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. అయినా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, వాస్తవాలపై స్పష్టత రావాల్సి ఉన్నందున అరెస్టు నుంచి కాకాణికి మినహాయింపు ఇవ్వలేమని ధర్మాసనం తెలిపింది. -
కాకాణి అక్రమ కేసులపై గురుమూర్తి సీరియస్
-
ఎస్ బాస్‌లకే ‘రెడ్’ కార్పెట్!
‘రెడ్బుక్కే రూల్ బుక్...! కచ్చితంగా అమలు చేయడమే జిల్లా ఎస్పీల బాధ్యత..! టీడీపీ ప్రధానకార్యాలయంతోపాటు జిల్లాల్లోని పార్టీ నేతలు సూచించిన ప్రకారం వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులుపెట్టాల్సిందే..! వారిని తీవ్రంగా వేధించాల్సిందే..!’ - ముఖ్యనేత అల్టిమేటం...!‘ప్రభుత్వ పెద్దలు చెప్పింది అర్థమైంది కదా...! ఫాలో కావాల్సిందే...! లేదంటే చార్జ్‌మెమోలు ఇస్తాం.. చెప్పినట్లుగా నడుచుకోని ఎస్పీలను పక్కనబెడతాం.. డీఎస్పీలతో రెడ్‌బుక్ కేసులు ఫాలో అప్ చేయిస్తాం..!’ - పోలీస్ బాస్ హుకుం..! రెడ్‌బుక్ అరాచకాలతో పోలీసు ఉన్నతాధికారులు ఒత్తిళ్లతో సతమతమవుతున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ రెడ్‌బుక్ ఒత్తిళ్లతో తీవ్ర అస్వస్థతకు గురి కావడం ఎస్పీలను ఆందోళనకు గురి చేస్తోంది. గత 20 రోజులుగా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో జరిగిన పరిణామాలను వాకబు చేస్తూ అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. - సాక్షి, అమరావతి నెల రోజులుగా కృష్ణకాంత్‌కు వేధింపులు..!రెడ్‌బుక్ కుట్రను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌పై ప్రభుత్వ పెద్దలు, డీజీపీ కార్యాలయం నెల రోజులుగా తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు స్పష్టమవుతోంది. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై అక్రమ కేసులు నమోదు, అక్రమ అరెస్టులో ఎస్పీ తమ అంచనాలకు తగ్గట్టుగా పని చేయడం లేదని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014–19 మధ్య పెండింగ్‌లో ఉన్న పలు కేసులను తిరగదోడి రాజకీయ ప్రత్యర్థులపై ఐపీసీ సెక్షన్ 307 చేర్చి హత్యాయత్నం కింద కేసులు బనాయించాలని పట్టుబట్టారు. దీంతో టీడీపీ నేతల ఒత్తిళ్లతో పలువురు స్టేషన్ హౌస్ అధికారులు వాస్తవాలతో నిమిత్తం లేకుండా వివిధ కేసుల్లో సెక్షన్ 307 చేర్చేందుకు యత్నించారు. ఈ విషయం తెలియడంతో ఎస్పీ కృష్ణకాంత్ వారిని వారించినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా సెక్షన్ 307 చేర్చితే న్యాయపరంగా ఇబ్బందులు తప్పవని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. దీన్ని సహించలేని సోమిరెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దాంతో ముఖ్యమంత్రి కార్యాలయం ఎస్పీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలని ఆదేశించడంతో కృష్ణకాంత్‌ను డీజీపీ తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. రెడ్‌బుక్ కేసులకు సంబంధించి చెప్పినట్లు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. అనంతరం రోజూ ఫోన్లు చేస్తూ ఒత్తిడి పెంచడంతో ఎస్పీ కృష్ణకాంత్ తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనకు తక్షణం మెరుగైన చికిత్స అందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆయనకు హృదయ సంబంధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని, ఒత్తిడికి గురి కావద్దని సూచించారు. రెడ్‌బుక్‌ను కాదనే ఎస్పీలకు మెమోలుఅడ్డగోలుగా వ్యవహరించేందుకు వెనుకంజ వేసే ఎస్పీలను వెంటనే పక్కనబెట్టాలని డీజీపీని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. ఆయా జిల్లాల్లో టీడీపీ వీర విధేయ డీఎస్పీలను గుర్తించి వారితో రెడ్‌బుక్ కేసుల దర్యాప్తును పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం అదే సూత్రాన్ని అనుసరిస్తున్నారు. నెల్లూరు రూరల్ డీఎస్పీగా ఉన్న ఘట్టమనేని శ్రీనివాస్‌ను తెరపైకి తెచ్చారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధ్థన్‌రెడ్డిపై అక్రమ కేసుతోపాటు ఇతర రెడ్‌బుక్ కేసుల దర్యాప్తును ఆయనే పర్యవేక్షిస్తుండటం గమనార్హం. పోలీసు బృందాల ఏర్పాటు, వివిధ ప్రాంతాలకు పంపించడం, జిల్లావ్యాప్తంగా పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం తదితర వ్యవహారాలను డీఎస్పీ శ్రీనివాసే నిర్వర్తిస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు మోడల్‌నే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ఎస్పీలకు డీజీపీ కార్యాలయం తేల్చి చెప్పినట్లు సమాచారం. రెడ్‌బుక్‌ను ఫాలో కాకుంటే ఎస్పీలకు చార్జ్ మెమోలు తప్పవని, ఆ తరువాత తాము ఎంపిక చేసిన డీఎస్పీలు ఆయా కేసులను పర్యవేక్షిస్తారని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు ఐపీఎస్ అధికారులైన ఎస్పీలను అవమానించడమేనని పోలీసువర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
కాకాణి బెయిల్ పిటిషన్ పై ఇవాళ వాదనలు
-
బెయిల్ రాకుండా.. కాకాణిపై కూటమి ప్రభుత్వం కుట్ర
సాక్షి,నెల్లూరు : మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి బెయిల్ రాకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందా?. నెల్లూరులో కార్యకర్తలతో అందుబాటులో ఉన్నన్ని పోలీసులు నోటీసులు ఇవ్వని పోలీసులు.. కాకాణి హైదరాబాద్‌కు వెళ్లిన వెంటనే నోటీసులు ఎలా ఇస్తారు?.బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగడానికి ఒకరోజు ముందు విచారణకు హాజరుకావాలని పోలీసులు చెప్పడం వంటి పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోందని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. కాకాణి గోవర్థన్‌రెడ్డి నెల్లూరులోని తన నివాసంలో కార్యకర్తలతో నాలుగైదు రోజులు అందుబాటులో ఉన్నారు. అందుబాటులో ఉన్నన్ని రోజులు పోలీసులు నోటీసులు ఇవ్వలేదు. అయితే, ఉగాది పండుగ పర్వదినాన హైదరాబాద్‌లో ఉన్న తన కుటుంబసభ్యులతో గడిపేందుకు వెళ్లారు. కాకాణి నెల్లూరులో లేరని తెలుసుకుని హుటాహుటీనా నివాసానికి వెళ్లి నోటీసులు అంటించారు. ఉగాది రోజు సాయంత్రం ఆరుగంటల సమయంలో కాకాణి నివాసానికి నోటీసులు అంటించారు. దీనిపై వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. మంగళవారం కాకాణి గోవర్థన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో సోమవారం ఉదయం 11గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాకాణినికి బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
కాకాణిపై ఆగని కక్ష సాధింపు చర్యలు..
నెల్లూరు: వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోంది. వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను, పార్టీకి అండగా నిలిచే వారిపై రెడ్ బెక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి సంక్షేమ పథకాల్ని గాలికొదిలేసి.. కేవలం కక్ష పూరిత రాజకీయాలను మాత్రమే చేస్తోంది కూటమి సర్కారు. తాజాగా వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగింది ‘కూటమి’ ప్రభుత్వం. క్వార్జ్ అక్రమ రవాణా కేసులో కాకాణికి పోలీసులు నోటీసులు ఇవ్వడానికి ఆయన ఇంటికి వెళ్లారు. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కాకాణితో ఫోన్ లో మాట్లాడేందుకు పొదలకూరు పోలీసులు యత్నించిన తర్వాత ఆయన ఇంటికి నోటీసులు అంటించి వెళ్లారు. రేపు ఉదయం గం.11లకు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.ఇప్పటిదాకా ఆరు అక్రమ కేసులు.. దేనికైనా రెడీ: కాకాణి -
మీ దొంగ కేసులకు భయపడే ప్రసక్తే లేదు
-
సోమిరెడ్డి ఫిర్యాదుతోనే నాపై అక్రమ కేసు: కాకాణి
సాక్షి, నెల్లూరు: ఏపీలో అధికార కూటమి పార్టీ నేతలు చెప్పినట్లు వింటున్న అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి. తమపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. బెదిరిది లేదు.. వెనక్కి తగ్గిదిలేదని స్పష్టం చేశారు. మరిన్ని పోరాటాలు చేస్తామని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి కాకాణి.. తనపై నమోదైన అక్రమ కేసులపై స్పందించారు. ఈ క్రమంలో నెల్లూరులో కాకాణి మీడియాతో మాట్లాడుతూ..‘మైనింగ్ అధికారులు ఇచ్చిన నివేదికలో తన ప్రమేయం ఉందని ఎక్కడా ప్రస్తావించలేదు. సోమిరెడ్డి ఫిర్యాదు చేశారని.. నాపై పొదలకూరు పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారు. 16 విచారణలు జరుగుతున్నాయి. ఎనిమిది అక్రమ కేసులు నాపై నమోదు చేశారు. రుస్తుం మైన్స్ కేసులో ఇద్దరిని అరెస్టు చేసి వారి ద్వారా నా పేరు చెప్పించే ప్రయత్నం చేశారు. నా ప్రమేయం లేదని తెలిసినా.. నాపై పోలీసులు తప్పుడు కేసు పెట్టారు.అధికార పార్టీ నేతలు చెప్పినట్లు వింటున్న అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. కావాలనే క్వార్జ్ అక్రమ రవాణాలో కేసు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నాయకత్వంలో మరిన్ని పోరాటాలు చేస్తాము తప్పా.. రాజీ పడే ప్రసక్తే లేదు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాను కాబట్టే ప్రభుత్వానికి నేను టార్గెట్ అయ్యాను. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బెదిరేది లేదు.. వెనక్కి తగ్గేది లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
Kakani: ఎన్ని కేసులైనా పెట్టుకోండి మీ బెదిరింపులకు భయపడేది లేదు


