
సాక్షి,నెల్లూరు : మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి బెయిల్ రాకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందా?. నెల్లూరులో కార్యకర్తలతో అందుబాటులో ఉన్నన్ని పోలీసులు నోటీసులు ఇవ్వని పోలీసులు.. కాకాణి హైదరాబాద్‌కు వెళ్లిన వెంటనే నోటీసులు ఎలా ఇస్తారు?.బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగడానికి ఒకరోజు ముందు విచారణకు హాజరుకావాలని పోలీసులు చెప్పడం వంటి పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోందని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.
కాకాణి గోవర్థన్‌రెడ్డి నెల్లూరులోని తన నివాసంలో కార్యకర్తలతో నాలుగైదు రోజులు అందుబాటులో ఉన్నారు. అందుబాటులో ఉన్నన్ని రోజులు పోలీసులు నోటీసులు ఇవ్వలేదు. అయితే, ఉగాది పండుగ పర్వదినాన హైదరాబాద్‌లో ఉన్న తన కుటుంబసభ్యులతో గడిపేందుకు వెళ్లారు. కాకాణి నెల్లూరులో లేరని తెలుసుకుని హుటాహుటీనా నివాసానికి వెళ్లి నోటీసులు అంటించారు. ఉగాది రోజు సాయంత్రం ఆరుగంటల సమయంలో కాకాణి నివాసానికి నోటీసులు అంటించారు. దీనిపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నారు.
మంగళవారం కాకాణి గోవర్థన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో సోమవారం ఉదయం 11గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాకాణినికి బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
