Court Hearing
-
ఉమామహేశ్వరరావు లెక్క ఇంకా తేల్చాల్సి ఉంది!
సాక్షి, హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును కస్టడీ కోరుతూ ఏసీబీ పిటిషన్ వేసింది. 8 రోజులు కస్టడీ కి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది.నేడు(శుక్రవారం) కస్టడీ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేయనుంది. ఉమామహేశ్వరరావు అక్రమాల చిట్టాపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. బినామీ ఆస్తులు, యాపారవేత్తలతో కలిసి పెట్టుబడులపై ఏసీబీ విచారణ చేయనుంది. ఉమామహేశ్వరరావు ల్యాప్‌టాప్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రెండు బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు తెరవనున్నారు. దీంతో ఉమామహేశ్వరరావు లెక్క ఇంకా తేల్చే పనిలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.ట్యాబ్‌లో ఉన్న ఆస్తి వివరాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. బీనామీ ఆస్తులపై కూపీలాగుతున్నారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ఆస్తులు డాక్యుమెంట్స్ వివరాలను ఏసీబీ అధికారులు కోర్టుకు అందించారు. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం మూడు కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది.ఆస్తి విలువ అనధికారికంగా బహిరంగ మార్కెట్లో రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. పలుమార్లు సస్పెండయినా కానీ కీలక పోస్టింగ్‌లు దక్కించుకోవటంపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఉమామహేశ్వరరావు వెనక ఉన్న అధికారుల అవినీతిపై ఏసీబీ విచారణ చేస్తోంది.ఉమామహేశ్వరరావు ఫిర్యాదుదారులనే బెదిరించి వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ల్యాప్ టాప్‌లో దొరికిన సమాచారం ఆధారంగా ఏసీబీ విచారణ చేపట్టింది. కొందరు పోలీస్ అధికారులతో కలిసి బినామీ వ్యాపారాలు చేసినట్టు ఏసీబీ గుర్తించింది. -
కోర్టుల్లో కేసుల వాయిదాలు.. సీజేఐ అసహనం
న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో కేసులు పదేపదే వాయిదా పడటంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అసహనం వ్యక్తం చేశారు. ఇది కేసుల్ని వేగవంతంగా పరిష్కరించాలనే ఉద్ధేశాన్ని దెబ్బతిస్తుందని అన్నారు. అవసరమైతే తప్ప కేసులను వాయిదా కోరవద్దని న్యాయవాదులకు సూచించారు. సుప్రీంకోర్టు 'తారిఖ్ పే తారిఖ్ కోర్టు'గా మారడం తమకు ఇష్టం లేదని అన్నారు. సుప్రీంకోర్టులో వాయిదా కేసులకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ శుక్రవారం సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 3 వరకు 3,688 కేసుల్లో న్యాయవాదులు విచారణ వాయిదా కోరారని సీజేఐ చంద్రచూడ్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ఒక్క రోజే(నవంబర్3) 178 కేసుల్లో వాయిదాలు వచ్చాయని తెలిపారు కోర్టులు వాయిదాల మీద వాయిదాలు(తారీఖ్-పే-తారీఖ్ కోర్టు) వేసే వాటిగా ఉండాలని తాము కోరుకోవడం లేదని తెలిపారు. ఇది పౌరుల విశ్వాసాన్ని దెబ్బతీస్తోందని, న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని తగ్గిస్తుందని తెలిపారు. రెండు నెలల్లోనే 3.688 కేసుల్లో వాయిదా పడటం వల్ల ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. ‘తారిఖ్ పర్ తారిఖ్ కోర్టు’ ఏంటిది? ఇక తారిఖ్ పర్ తారిఖ్ కోర్టు అనేది బాలీవుడ్ సినిమా ‘దామిని’ లోని డైలాగ్. ఈ చిత్రంలో న్యాయవాదిగా నటించిన సన్నీ డియోల్.. అత్యాచార బాధితురాలి తరఫున కేసు వాదిస్తారు. నిందితుడి తరఫు న్యాయవాది తన క్లైంట్‌ను కేసు నుంచే తప్పించే ఉద్దేశంతో పదే పదే వాయిదాలు కోరగా.. "tareek peh tareek" అనే పదాన్ని సన్నీ ఉపయోగిస్తాడు. ఈ డైలాగ్‌నే సీజేఐ ప్రస్తావించారు. చదవండి: ఇదేమైనా బావుందా? కేంద్రమంత్రి సంచలన ట్వీట్: విస్తారా రియాక్షన్ -
Nov 3rd 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Naidu Cases, Petitions, Court Hearings And Updates 6:46 PM, నవంబర్ 03, 2023 ఇంతకీ ఈ ఏడాది చంద్రబాబు కుటుంబం ఆస్తుల లెక్కలు చెబుతారా? : YSRCP ►ప్రతీ ఏటా కుటుంబం ఆస్తుల లెక్కలు అంటూ ఓ పక్కా పకడ్బందీ స్క్రిప్ట్ విడుదల చేసే లోకేష్ ►ఈ ఏడాది జీవితంలో తొలిసారి జైలుకు వెళ్లిన చంద్రబాబు ►చంద్రబాబు ఆస్తులపై రెండు తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ చర్చ ►ఇన్నాళ్లు చంద్రబాబును అద్భుత స్థాయిలో కీర్తించిన ఎల్లో మీడియా ►తాజా కేసులతో బయటపడుతున్న చంద్రబాబు, కుటుంబం అసలు రంగు ►రెండెకరాలతో రాజకీయ జీవితం ప్రారంభించానని తరచు చెప్పుకున్న చంద్రబాబు ►ఇటీవల నోరు జారి నిజాలు కొన్ని చెప్పేసిన భువనేశ్వరీ ►హెరిటేజ్ లో 2 శాతం షేర్లు అమ్మితే 400 కోట్లు వస్తాయి : భువనేశ్వరి ►అంటే హెరిటేజ్ ఆస్తుల విలువ 20 వేల కోట్లు.! ►హెరిటేజ్ లో 20 వేల కోట్లు వైట్ మనీ ఐతే ... 70 వేల కోట్ల బ్లాక్ మార్కెట్.! ►మరి కొండాపూర్ , మాదాపూర్ , అమరావతి , సింగపూర్ , దుబాయ్‌లో ఉన్న ఆస్తుల విలువెంత.? ►లోకేష్.. ప్లీజ్ తొందరగా ప్రెస్ మీట్ పెట్టి కొన్నయినా నిజాలు చెప్పవా.? 6:06 PM, నవంబర్ 03, 2023 బాబు పై ఎన్ని కేసులు? ఎన్ని స్టేలు? ►దేశ రాజకీయాల్లో స్టేBNగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ►1997లో రెడ్యానాయక్ మీ అక్రమాస్తులపై కేసు వేస్తే స్టే ►1998లో వైఎస్సార్ గారు హైకోర్టులో దావా వేస్తే స్టే ►1999లో షబ్బీర్ అలీ, 1999లో డీఎల్ రవీంద్రారెడ్డి వేసిన దావాల్లో స్టే. ►1999, 2000, 2001 వైఎస్సార్ గారు తిరిగి దావా వేస్తే స్టే. ►2003లో కృష్ణకుమార్ గౌడ్ కేసు వేస్తే స్టే ►2003లో కన్నా లక్ష్మీనారాయణ వేసిన కేసు ఏంటంటే పాపపు సొమ్ముతో చంద్రబాబు హెరిటేజ్ పెట్టాడని దావా వేస్తే స్టే ►2004లో కన్నా మళ్లీ కేసు వేస్తే స్టే. ►2004లో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి చంద్రబాబుపై రెండు కేసులు ►ఒకటి అక్రమాస్తులు, రెండు భూదోపిడీ.. దాంట్లోనూ స్టే ►2005లో బాబు అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి హైకోర్టులో కేసు వేస్తే స్టే ►2005 శ్రీహరి, అశోక్ అనే ఏపీ పౌరులు కేసు వేస్తే స్టే ►2011లో బి.ఎల్లారెడ్డి అనే వ్యక్తి చంద్రబాబుపై కేసు వేస్తే స్టే ►విచారణలు జరగకుండా ఈ స్టేల బాగోతం ఎందుకు? : YSRCP 5:56 PM, నవంబర్ 03, 2023 యువగళం సంగతేంటీ? భువనేశ్వరీ యాత్ర ఎటు పోయింది? ►చంద్రబాబు విడుదల తర్వాత మారిన టీడీపీ తీరు ►చంద్రబాబు భార్య భువనేశ్వరి ఇక నిజం యాత్రకు ఫుల్స్టాప్ పెడతారని పార్టీలో టాక్ ►చంద్రబాబు ఇంటికొచ్చారు, నేను రాలేనని చెబుతున్నట్టు సమాచారం ►ఇప్పటికే లోకేష్ పేరుతో ఎన్నో యాత్రల ప్రచారం ►ముందు యువగళం, తర్వాత మేలుకో తెలుగోడా, ఆ తర్వాత మరొకటి ► ఢిల్లీకి వెళ్లడం, తిరిగి రావడం తప్ప ప్రజల్లోకి వెళ్లేందుకు ససేమిరా ►యువగళం ఇప్పుడు తిరిగి ప్రారంభించేకంటే.. ఇంకొన్నాళ్లు ఆగే ఉద్దేశ్యంలో లోకేష్ ►ముందు తన నియోజకవర్గం ఫైనల్ చేసుకుంటానంటున్న లోకేష్ 5:52 PM, నవంబర్ 03, 2023 లోకేష్ కు సేఫ్ సీటు ఎక్కడ? మామకు వెన్నుపోటు తప్పదా? ► మంగళగిరివైపు చినబాబు సందేహంగా చూపులు ► తనకు సేఫ్ సీటు కావాలంటూ ముందే కమిటీకి తేల్చిచెప్పిన చినబాబు ► మంగళగిరిలో మళ్లీ ఓడితే తన రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అవుతుందన్న ఆందోళన ► లోకేష్ ముందు నాలుగు ప్రతిపాదనలు పెట్టిన టిడిపి సీనియర్లు ► ఎక్కడయితే గెలవగలవో తేల్చుకోవాలని సూచించిన టిడిపి సీనియర్లు 1. హిందూపురం - సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ ► హిందూపురంలో బాలకృష్ణ సీటుకు ఎసరు పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన ► అక్కడ టిడిపి 2019లో గెలిచింది కాబట్టి ఈ సారి అల్లుడు అడుగుపెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన ► తానే పోటీ చేస్తానని ఇప్పటికే స్పష్టం చేసిన బాలకృష్ణ ► అల్లుడి కోసం త్యాగం చేస్తాడా? తండ్రి తరహాలో మామకు వెన్నుపోటు తప్పదా? 2. గుడివాడ - సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని ► గుడివాడలో తమ సామాజిక వర్గం ఉందన్న ఆలోచనలో తెలుగుదేశం ► అబ్బో.. కొడాలి నానిని తట్టుకోవడం కష్టమని తేల్చేసిన చినబాబు వర్గం ► ఘోరంగా ఓడిపోతే.. అసలుకే ఎసరు వస్తుందని స్పష్టం చేసిన చినబాబు వర్గం 3. పెనమలూరు - సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ► పెనమలూరులో ఇప్పటివరకు టిడిపి ఇన్ ఛార్జ్ బొడ్డేటి ప్రసాద్ ► పెనమలూరు అయితే తమ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారన్న యోచనలో టిడిపి సీనియర్లు ► పార్థసారథి బలంగా ఉన్నారన్న సర్వేల రిపోర్టులు చూపించిన చినబాబు వర్గం ► కృష్ణా జిల్లా అయినా పెనమలూరులో నెగ్గడం అతి కష్టం అని తేల్చిన చినబాబు వర్గం 4. విజయవాడ ఈస్ట్ - సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ► విజయవాడలో పార్టీ పరిస్థితి బాగుందన్న టిడిపి సీనియర్లు ► 2019లో ఈస్ట్ నుంచి గద్దె రామ్మెహన్ రావు గెలిచాడన్న సీనియర్లు ► ఈ నియోజకవర్గం ఎంచుకుంటే గ్యారంటీ ఉండొచ్చేమో అని సూచన ► విజయవాడ అయినా ఈస్ట్ లో కచ్చితంగా గెలిచే సీను లేదంటున్న లోకేష్ వర్గం 5:45 PM, నవంబర్ 03, 2023 దోచుకోవడం, పంచుకోవడం.. ఇవే చంద్రబాబు నమ్మిన సిద్ధాంతం : YSRCP ► ఏపీలో ప్రతిపక్షాలు అన్నీ కూడా పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయి ► వారు ఎంతమంది కలిసినా… రెండు సున్నాలు కలిసినా, నాలుగు సున్నాలు కలిసినా.. సున్నాయే. ► ఎన్ని సున్నాలు కలిసిన వచ్చేది పెద్ద సున్నాయే. ► ఒకరైతే రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాలు అయింది. చంద్రబాబును మోయడమే ఆయన పని. ► ప్రతి నియోజకవర్గానికి కనీసం ఒక అభ్యర్థి లేడు. ప్రతి గ్రామంలో జెండా మోసే కార్యకర్తా లేరు ► చంద్రబాబు దోచుకున్న దాంట్లో ఈయన పార్టనర్. మోసాలు చేయడంలో పార్టనర్. ► బిస్కట్ వేసినట్టు, చాక్లెట్ వేసినట్టు. సంపాదించిన సొమ్ములో భాగం పంచడం.. ► దోచుకోవడం.. పంచుకోవడం.. ఇదే వీరికి తెలిసింది ► చంద్రబాబును సమర్థించామంటే.. .ఈ రాష్ట్రంలో పేద సామాజిక వర్గాలన్నింటినీ కూడా వ్యతిరేకించడమే అన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ► చంద్రబాబును సమర్థించడమంటే.. పేదవాళ్లకు వ్యతిరేకంగా ఉండటమే. ► చంద్రబాబును సమర్థించడమంటే.. పెత్తందారీ వ్యవస్థను, నయా జమీందారీ వ్యవస్థను సమర్థించడమే. ► చంద్రబాబును సమర్థించడమంటే.. పేదవర్గాల పిల్లలకు ఇంగ్లీషు మీడియం అందకుండా వ్యతికేకించడమే. ► చంద్రబాబును సమర్థించడమంటే.. డెమోగ్రఫిక్ ఇన్ బ్యాలెన్స్ అంటూ వారు ఏకంగా కోర్టుల్లో వేసిన దావాలను సమర్థించడమే. ► చంద్రబాబును సమర్థించడమంటే.. కొన్ని వర్గాలు ఎప్పటికీ పేదలుగా, కూలీలుగా మిగిలివాలని సమర్థించినట్టే. ► ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తానన్న పెత్తందారీ భావజాలాన్ని సమర్థించడమే. 05:10 PM, నవంబర్ 03, 2023 తెలంగాణలో కాంగ్రెస్ కోసం తెలుగుదేశం ప్రయత్నాలు ► ఆస్పత్రిలో చేరినా.. రాజకీయ మంతనాలతో బాబు బిజీ బిజీ ► తెలంగాణలో కాంగ్రెస్ గెలవడమే తమ లక్ష్యమని బాబు చెబుతున్నట్టు సమాచారం ► తెలంగాణలోని తమ పార్టీ లీడర్లందరినీ ఈ దిశగా సమాయత్తం చేస్తోన్న బాబు ► రేవంత్ రెడ్డి మనోడేనంటూ ఫోన్లో చెబుతోన్న చంద్రబాబు ► రేవంత్ గెలిస్తేనే మనకు సాయంగా నిలుస్తాడంటూ చెప్పుకొస్తోన్న చంద్రబాబు ► ఎంత డబ్బైనా ఏర్పాటు చేస్తాం, కాంగ్రెస్‌కు ఓట్లేయించాలంటూ చంద్రబాబు సూచనలు ► ఏపీ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ ఓటర్ల వివరాలు సేకరిస్తోన్న టిడిపి క్యాడర్ ► అవసరమయితే హైదరాబాద్‌లో ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం చేయాలన్న వ్యూహంలో టిడిపి నేతలు ► ఇప్పటికే టిడిపి కుట్రను బయటపెట్టిన BJP నేతలు ► చంద్రబాబు పూర్తిగా కాంగ్రెస్ కోసం పని చేస్తున్నారన్న ఈటల 05:02 PM, నవంబర్ 03, 2023 బుద్ధా వెంకన్నకు నోటీసులు ► టీడీపీ నేత బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు ► చంద్రబాబు రిమాండ్ విషయంలో జడ్జి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బుద్ధా వెంకన్న ► హైకోర్టు ఆదేశాల మేరకు బుద్ధా వెంకన్నకు నోటీసులిచ్చిన CID 04:30 PM, నవంబర్ 03, 2023 AIG ఆస్పత్రి నుంచి చంద్రబాబు డిశ్చార్జ్ ► హైదరాబాద్ : గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రి నుంచి చంద్రబాబు డిశ్చార్జ్ ► చాంతాడంత రోగాల జాబితాతో AIGలో చేరిన చంద్రబాబు ► చంద్రబాబుకు నిన్నటి నుంచి పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ► ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో ఇవ్వాళ చంద్రబాబుకు కంటి పరీక్షలు 03:10 PM, నవంబర్ 03, 2023 బెయిల్ వచ్చాక చంద్రబాబు డ్రామాలు బయటపడ్డాయి : మంత్రి రోజా ► రిషికొండపై టీడీపీ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది ► ఉత్తరాంధ్ర, విశాఖపై టీడీపీ విషం చిమ్ముతూనే ఉంది ► టీడీపీ ఎంత గింజుకున్నా అధికారుల కమిటీ నివేదిక ఆధారంగా సీఎం క్యాంప్ కార్యాలయం ఉంటుంది ► చంద్రబాబు మామని, ప్రజలనే కాదు బెయిల్ ఇచ్చిన జడ్జినీ మోసం చేశారు ► చంద్రబాబుకు లేని జబ్బులన్నీ టీడీపీ నేతలే ప్రచారం చేశారు ► బెయిల్ వచ్చాక చంద్రబాబు డ్రామాలన్నీ బయటపడ్డాయి ► లోకేష్ కి జగన్ అంటేనే కాదు... ఆయన సినిమా అన్నా భయమే ► అందుకే వ్యూహం సినిమా మీద ఫిర్యాదు చేశాడు : మంత్రి రోజా 03:10 PM, నవంబర్ 03, 2023 చంద్రబాబు కుంభకోణాలు అన్నీ ఇన్నీ కావు : సజ్జల ► చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టే కేసులు పెట్టారు ► ఉచిత ఇసుక అన్నారు... ఎక్కడైనా ఉచితంగా ఇసుక దొరికిందా? ► ఉచిత ఇసుక అంటే ఎవరికి వాళ్లు తెచ్చుకోవాలి ► కానీ పెద్ద పెద్ద ప్రొక్లెయినర్లు పెట్టి దందా చేశారు ► ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము నొక్కేశారు ► ప్రస్తుతం ఇసుకపై ఏడాదికి రూ.765 కోట్లు ప్రభుత్వానికి వస్తుంది ► గతంలో ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి..? ► పురంధేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలా..? టీడీపీకి ఉపాధ్యక్షురాలా..? : సజ్జల 02:29PM, నవంబర్ 03, 2023 హైదరాబాద్‌లో చంద్రబాబు ర్యాలీపై నేషనల్ హ్యూమన్ రైట్స్‌కు ఫిర్యాదు ►పోలీసులు ర్యాలీలు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ఫిర్యాదు ►అంబులెన్స్‌కు దారివ్వకుండా ప్రాణాలతో చెలగాటం ఆడారని ఫిర్యాదు ►మెడికల్ బెయిల్ పొంది ర్యాలీలో పాల్గొన్నాడని పేర్కొన్న పిటిషనర్ ►ఉద్దేశపూర్వకంగా న్యూసెన్స్ క్రియేట్ చేశారని హ్యూమన్ రైట్స్‌కు ఫిర్యాదు 11:55 AM నవంబర్ 03 2023 లింగమనేని పిటిషన్ కొట్టివేత ►రుషికొండ పై నిర్మాణాలు చేయొద్దని టీడీపీ నేత లింగమనేని శివరామ ప్రసాద్ పిటిషన్ ►రుషికొండపై నిర్మాణాలు అక్రమమని.. జగన్ క్యాంపు ఆఫీస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా సుప్రీంలో లింగమనేని రిట్ దాఖలు ►ఎన్జీటీ, ఏపీ హైకోర్టులో రిషికొండ పై వున్న కేసులు పరిష్కారం అయ్యేవరకు ఏవిధమైన నిర్మాణాలు, ప్రారంభోత్సవాలు జరుగకుండా ఉత్తర్వులు ఇవ్వాలన్న లింగమనేని ►రిషి కొండ కేసును విచారించిన సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం ►ఈ అంశంలో జోక్యం చేసుకోబోం: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ►ఇది రాజకీయ ఫిర్యాదు: సీజేఐ ►ముఖ్యమంత్రిని అక్కడికి వెళ్ళొద్దని అంటారా ?: పిటిషనర్‌కు సీజే ప్రశ్న ►ఏవైనా ఉంటే హైకోర్టుకు వెళ్లాలని సూచన ►లింగమనేని శివరాం ప్రసాద్ పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు 11:39AM నవంబర్ 03 2023 ఎల్వీప్రసాద్ ఆస్పత్రికి చంద్రబాబు! ►హైదరాబాద్‌లో ప్రముఖ ఆస్పత్రులకు చంద్రబాబు నాయుడు ►వైద్య పరీక్షల కోసం గురువారం గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేరిక ►ఆస్పత్రిలో రకరకాల పరీక్షలు ►నేటి మధ్యాహ్నాం ఏఐజీని నుంచి డిశ్చార్జి అయ్యే ఛాన్స్ ►ఏఐజీ నుంచి ఆయన నేరుగా ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి! ►క్యాటరాక్టు సమస్యకు వైద్యులు చంద్రబాబుకు శస్త్రచికిత్స చేసే అవకాశం ►తీవ్ర అలర్జీ, ఇతర అనారోగ్య కారణాల రీత్యా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ 11:13AM నవంబర్ 03 2023 అదనపు షరతుల పిటిషన్ తీర్పు వెల్లడి ►చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై అదనపు షరతుల విధించాలంటూ సీఐడీ అనుబంధ పిటిషన్ ►తీర్పు వెల్లడించిన ఏపీ హైకోర్టు ►స్కిల్ కేసు అంశాలపై మీడియాతో మాట్లాడవద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగింపు ►రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని ఇచ్చిన ఆదేశాలు కొనసాగింపు ►చంద్రబాబు కార్యక్రమాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థన మాత్రం తిరస్కరణ 10:43AM నవంబర్ 03 2023 చంద్రబాబు చెప్పింది ఒకటి చేసింది ఒకటి ►చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రమంతా అవినీతియంగా మారింది ►సీఐడీ రూ.10వేల కోట్లలు ఇసుక కుంభకోణాన్ని గుర్తించింది ►చంద్రబాబుతో పాటు అప్పటి కేబినెట్ మంత్రులపై కేసు నమోదయ్యింది ►చంద్రబాబు చెప్పింది ఒకటి చేసింది ఒకటి ►చంద్రబాబు అమరావతి పేరుతో రాష్ట్ర ప్రజలను వంచించారు ►స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు ముద్దాయిగా ఉన్నారు ►చంద్రబాబు పాలనలో ప్రజలకు సరైన సంక్షేమం అందలేదు :::ఎమ్మెల్యే మల్లాది విష్ణు 10:34AM నవంబర్ 03 2023 తెలంగాణ కాషాయంలోజనసేన కుంపటి ►హస్తినకు చేరిన పంచాయితీ ►అధిష్టానం పెద్దలతో ఢిల్లీ వెళ్లి మాట్లాడిన కొండా విశ్వేశరరెడ్డి ►కూకట్పల్లి సీటు జనసేనకు ఇవ్వొద్దని డిమాండ్ ►నిన్న నాగర్ కర్నూల్ కార్యకర్తల ఆందోళన ►ఆందోళనకు సై అంటున్న తాండూరు బీజేపీ కార్యకర్తలు ►కొండాపై నమ్మకంతో తాండూరు టికెట్ ఆశిస్తున్న రమేష్ 10:22AM నవంబర్ 03 2023 అసైన్డ్ భూములు కేసు విచారణ 10కి వాయిదా ►అసైన్డ్ భూములు కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ ►క్వాష్ పిటిషన్ల కేసులో విచారణ రీ ఓపెన్ చేయాలని సీఐడీ పిటిషన్ దాఖలు ►అసైన్డ్ కుంభకోణంలో ఆధారాలను కోర్టు ముందు ఉంచామని తెలిపిన సీఐడీ న్యాయవాదులు ►ఇప్పటికే ఆడియో, వీడియో క్లిప్స్ కోర్టుకు నివేదించినట్లు వెల్లడి ►చంద్రబాబు, నారాయణ తరపున కౌంటర్ దాఖలు చేసిన లాయర్లు ►ఏపీ హైకోర్టులో తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా 09:45 AM, నవంబర్ 03 2023 హైకోర్టులో షరతుల పిటిషన్‌పై నేడు తీర్పు ►స్కిల్ స్కాం కేసులో ఏపీ హైకోర్టులో సీఐడీ కంపిటిషన్ ►చంద్రబాబుకు అక్టోబర్ 31న మధ్యంతర బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు ►నాలుగు వారాల బెయిల్‌కు.. ఐదు షరతులు విధించిన కోర్టు ►మరో ఐదు నిబంధనలు పెట్టాలని సీఐడీ పిటిషన్ ►ఇప్పటికే పూర్తైన వాదనలు ►నేడు నిర్ణయం ప్రకటించనున్న జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు 09:01 AM, నవంబర్ 03 2023 నవంబర్1 అయిపోయింది కదా ► నవంబర్ 1న ఉమ్మడి మ్యానిఫెస్టో అంటూ టీడీపీ, జనసేన గత వారం ఘనంగా ప్రచారం ► అక్టోబర్ 25న రాజమండ్రిలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించిన లోకేష్, పవన్ కళ్యాణ్ ► చంద్రబాబు జైల్లో (అక్టోబర్ 25న) ఉన్నాడు కాబట్టి మినీ మ్యానిఫెస్టో అని ప్రకటన ► ప్రకటన చేసిన పవన్‌కళ్యాణ్ ఇటలీకి జంప్, కోరస్ ఇచ్చిన లోకేష్ ఢిల్లీకి జంప్ ► జైలు నుంచి విడుదలయిన చంద్రబాబు హైదరాబాద్‌కు జంప్ ► మ్యానిఫెస్టో గురించి ఎవరయినా అడిగినా.? అంతే సంగతులు ► మ్యానిఫెస్టోను మాయం చేసిన చరిత్ర ఉన్న పార్టీలే టిడిపి, జనసేన : YSRCP 08:13 AM, నవంబర్ 03 2023 స్కిల్ కేసులో ట్విస్ట్ ►మొత్తం 12మంది ఐఏఎస్ అధికారుల్ని విచారించాలని సీఐడీకి ఫిర్యాదు ►టీడీపీ హయాంలో సీమెన్స్ ప్రాజెక్టు అమలు, పర్యవేక్షణ కమిటీల్లోని ఐఏఎస్ అధికారుల్ని విచారణ పరిధిలోకి తీసుకురావాలని ఏపీ సీఐడీకి ఫిర్యాదు ►సీఐడీకి ఫిర్యాదు చేసిన న్యాయవాది ప్రసాద్ ►అజేయ కల్లం, అజయ్ జైన్, రావత్, రవిచంద్ర, ఉదయలక్ష్మీ, ప్రేమ్ చంద్రారెడ్డి, సిసోడియా, కేవీ సత్యనారాయణ, శామ్యూల్ ఆనంద్ కుమార్, కృతిక శుక్లా, అర్జా శ్రీకాంత్, జీ.జయలక్ష్మీలను విచారించాలని ఫిర్యాదు ►ప్రస్తుత స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి పై ఫిర్యాదు ►అప్పటి సీఎండీ బంగారు రాజులతో పాటు కార్పొరేషన్ లోని సీఎఫ్ఓ, సీఈవో, ఈడీలను విచారించాలన్న ఫిర్యాదుదారు 07:55 AM, నవంబర్ 03 2023 వర్మ వ్యూహానికి జడుసున్న సినబాబు ►రాం గోపాల్ వర్మ వ్యూహం సినిమాకు సెన్సార్ చిక్కులు ►ఏపీ రాజకీయ వాస్తవ ఘటనల ఆధారంగా వ్యూహం తీసిన వర్మ ►సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెన్సార్ బోర్డుకు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ లేఖ ►ఆర్జీవీ కౌంటర్ ►అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపలేరు.. ఎన్ని వ్యూహాలు పన్నినా మా " వ్యూహం" నీ ఆపలేరు అంటూ ట్వీట్ ►నారా లోకేష్‌ను ర్యాగింగ్ చేస్తూ వరుస ట్వీట్లు Doctor gaaru ! https://t.co/pxhJL1sPwS — Ram Gopal Varma (@RGVzoomin) November 2, 2023 07:32 AM, నవంబర్ 03 2023 స్కిల్ కేసులో టీడీపీ సాంకేతిక పిటిషన్లు ►ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు పై చర్యలు తీసుకోవాలన్న పిల్ పై విచారణ ►పిల్ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ►స్కిల్ డెవలప్మెంట్ కేసు దర్యాప్తులో ఉండగా ప్రజాధనం దుర్వినియోగం చేసి ప్రెస్‌మీట్ లు ఏర్పాటు చేశారని పిల్ ►ప్రజాధనం ఎంత వృధా అయ్యిందో వివరాలు తెలపాలన్న కోర్టు ►ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వలేదన్న పిటిషనర్ ►మరోసారి వివరాల కోసం దరఖాస్తు చేయాలన్న కోర్టు ►కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ►ప్రెస్ మీట్ల కోసం వారు ప్రజాధనం ఖర్చు చేసినట్లు ఆధారాలున్నాయా? ►ఏఏజీ, సీఐడీ చీఫ్ ఏం మాట్లాడారో....తర్జుమా చేసి ఇవ్వండి ►పిటిషనర్ కు ధర్మాసనం ప్రశ్న ►విచారణ 8వ తేదీకి వాయిదా 07:07 AM, నవంబర్ 03 2023 నేడు ఏ కోర్టుల్లో ఏ ముందంటే.. ►ఏసీబీ కోర్టులో సీఐడీ ఫైబర్ కేసు పిటిషన్ ►ఫైబర్ గ్రిడ్ స్కా మ్ కేసులో చంద్రబాబు సన్నిహితులు ►బాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్‌కు సీఐడీ ప్రతిపాదన ►గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఏపీ హోం శాఖ ►నేడు స్థిరాస్తులు అటాచ్మెంట్ అనుమతి కోసం ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసే ఛాన్స్ ►మరోవైపు.. స్కిల్ స్కాంలో సీఐడీ కండిషన్స్ పిటిషన్ ►చంద్రబాబుకు అక్టోబర్ 31న మధ్యంతర బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టు ►నాలుగు వారాల బెయిల్‌కు.. ఐదు షరతులు విధించిన కోర్టు ►మరో ఐదు నిబంధనలు పెట్టాలని సీఐడీ పిటిషన్ ►ఇప్పటికే పూర్తైన వాదనలు ►నేడు నిర్ణయం ప్రకటించనున్న జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు 06:48 AM, నవంబర్ 03 2023 చంద్రబాబుపై మరో కేసు నమోదు ► టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదు ►ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగేలా వ్యవహరించారంటూ ఏపీఎండీసీ డైరెక్టర్ వెంకటరెడ్డి ఫిర్యాదు ► వెంకటరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సిఐడీ ► ఏ1 గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు నాయుడు ► ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4 గా దేవినేని ఉమ ► ప్రభుత్వ ఖజానాకు తీవ్రనష్టం చేకూర్చారని ఫిర్యాదు ► ఇప్పటి వరకు చంద్రబాబుపై స్కిల్ స్కాం, ఇన్నర్‌రింగ్‌రోడ్, ఫైబర్ నెట్, అసైన్డ్ ల్యాండ్, మద్యం కేసులు ► మొత్తం 6 కేసుల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆధారాలు 06:40 AM, నవంబర్ 03 2023 బాబూ.. మీకో దండం.. ► చంద్రబాబు, లోకేష్‌ల నుంచి బయటకొచ్చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ► ఇవాళ బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్న కాసాని ► గజ్వేల్ ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో చేరిక ► తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులుగా రెండు రోజుల క్రితం వరకు పని చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ►తెలంగాణలో పోటీ వద్దని అధిష్టానం నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర అసంతృప్తి ►చంద్రబాబు, లోకేష్ తీరులను తప్పుబడుతూ పార్టీకి రాజీనామా ►తెలంగాణ ఎన్నికల్లో లోకేష్ పెత్తనం ఏంటని లేఖలో ప్రశ్నించిన కాసాని ►కాసాని బయటకు రావడంతో.. తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ 06:39 AM, నవంబర్ 03 2023 పొత్తుపై పునరాలోచనలో చంద్రబాబు? ► జనసేనతో పొత్తుపై చంద్రబాబు నాయుడి పునరాలోచన ►తెలుగుదేశం, జనసేన పొత్తుపై పలు సందేహాలు ► జైల్లో చంద్రబాబును కలిసి బయట పొత్తు ప్రకటించిన జనసేనాని ► ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంటు సీట్లు ► తమకు 50 అసెంబ్లీ, 8 పార్లమెంటు సీట్లు కావాలని చెప్పిన పవన్ ► ఇప్పుడు 20 అసెంబ్లీ, 3 పార్లమెంటు ఇవ్వాలన్న యోచనలో తెలుగుదేశం ► చంద్రబాబు విడుదలైన తర్వాత కరకట్ట ఇంట్లో సుదీర్ఘంగా చర్చలు ► అన్ని చోట్లా మనమే పోటీ చేద్దామని బాబుకు చెబుతోన్న టీడీపీ నేతలు ► జనసేన సీను అంతే అయినప్పుడు మనమెందుకు ఎక్కువ సీట్లు ఇవ్వాలంటున్న టీడీపీ నేతలు ► పునరాలోచనలో పడ్డ తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ 06:30AM, నవంబర్ 3 2023 ఇవాళ చంద్రబాబు డిశ్చార్జి? ►స్కిల్ స్కామ్ మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన టీడీపీ చంద్రబాబు నాయుడు ► హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు ►బుధవారం రాత్రి ఇంటికి వెళ్లి మరీ చంద్రబాబును పరిశీలించిన వైద్యులు ► వైద్యుల సూచన మేరకు.. పరీక్షల కోసం నిన్న ఉదయం చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన బాబు ► నేటి మధ్యాహ్నం వరకు ఆస్పత్రిలోనే చంద్రబాబు ►టెస్టుల అనంతరం డిశ్చార్జి అయ్యే ఛాన్స్ ►వైద్య నివేదికల్ని ఏసీబీ కోర్టుకు సమర్పించే అవకాశం ►నాలుగు వారాల తర్వాత రాజమండ్రి జైల్లో సరెండర్ కానున్న చంద్రబాబు -
Nov 2nd : చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Naidu Cases, Petitions, Court Hearings & Political Updates 17:30 PM, నవంబర్ 02 2023 BRS పార్టీలో చేరనున్న కాసాని జ్ఞానేశ్వర్ బాబూ.. మీకో దండం.. ► చంద్రబాబు, లోకేష్‌ల నుంచి బయటకొచ్చేసిన కాసాని ► రేపు ఉదయం బీఆర్ఎస్లో చేరనున్న కాసాని ► గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి ఫార్మ్ హౌజ్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక ► తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులుగా రెండు రోజుల క్రితం వరకు పని చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. 17:00 PM, నవంబర్ 02 2023 రేపటి దాకా ఆస్పత్రిలోనే చంద్రబాబు.! ► హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు ► ఉదయం 11 గంటలకు చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన బాబు ► రేపు మధ్యాహ్నం వరకు ఆస్పత్రిలోనే చంద్రబాబు 16:45 PM, నవంబర్ 02 2023 చంద్రబాబుపై మరో కేసు నమోదు ► టిడిపి హయాంలో ఇసుక అక్రమాలపై కేసు నమోదు ► APMDC ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సిఐడీ ► ఏ1 గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు ► ఏ3గా చింతమనేని, ఏ4 గా దేవినేని ఉమ ► ప్రభుత్వ ఖజానాకు తీవ్రనష్టం చేకూర్చారని ఫిర్యాదు ► ఇప్పటి వరకు చంద్రబాబుపై స్కిల్ స్కాం, ఐఆర్ఆర్, ఫైబర్ నెట్, అసైన్డ్ ల్యాండ్, మద్యం కేసులు ► మొత్తం 6 కేసుల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆధారాలు 15:45 PM, నవంబర్ 02 2023 జనసేనలో ఏం జరుగుతోంది? ► పవన్ కళ్యాణ్ చర్యలతో విసుగు చెందుతోన్న జనసేన నాయకులు ► నెల్లూరు జనసేన ఇన్ఛార్జ్ కేతంరెడ్డి వినోద్ ఎందుకు దూరంగా ఉంటున్నారు? ► పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మాకినేని శేషుకుమారి ముఖమెందుకు చాటేశారు? ► తిరుపతి జనసేన నాయకులు పసుపులేటి సురేష్, దిలీప్ సుంకర ఎందుకు దూరమయ్యారు? ► రాయలసీమ ప్రాంతీయ మహిళా కోఆర్డినేటర్ పసుపులేటి పద్మావతి ఎందుకు పార్టీవైపు చూడడం లేదు? ► జనసేన నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ వెనక ఏం జరుగుతోంది? ► ఇప్పుడు జనసేనలో అధికారం ఎవరి చేతిలో ఉంది? ► జనసేన ప్రధాన కార్యాలయంలో రుక్మిణికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన బాధ్యతలేంటీ? 15:25 PM, నవంబర్ 02 2023 నారా వారిది అబద్దాల ఫ్యాక్టరీ : YSRCP ► సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదిరిందని కేబినెట్‌కు చెప్పింది.. అబద్ధం ► పది శాతం నిధులు పెడితే.. సీమెన్స్ సిమన్స్ కంపెనీ 90 శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా ఇస్తుందన్నది.. అబద్ధం ► స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా లక్షలాది మందికి నైపుణ్యాలు నేర్పితే వేలాది మందికి బంగారంలాంటి ఉద్యోగాలు వచ్చాయన్నది.. అబద్ధం ►సెప్టెంబరు 9న చంద్రబాబు నాయుడ్ని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేస్తే.. 24 గంటల లోపు కోర్టు ముందు హాజరు పర్చలేదని చంద్రబాబు ఆరోపణ.. అబద్ధం ►48 రోజులకు పైగా జైల్లో ఉండి.. ఏ కోర్టులోనూ బెయిల్ రాకపోవడంతో మధ్యంతర బెయిల్ కోసం ఆరోగ్యం బాగాలేదని చెప్తుండడం.. అబద్ధం ►చంద్రబాబు నాయుడు జైల్లో బరువు తగ్గారని నారా భువనేశ్వరి చేస్తున్న ప్రచారం.. అబద్ధం ► జైల్లో సదుపాయాల గురించి టీడీపీ చేస్తున్న ప్రచారం.. అబద్ధం ►తన తండ్రికి స్టెరాయిడ్స్ ఇచ్చి అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని నారా లోకేష్ చెప్తుండడం.. అబద్ధం ► చైనా నుండి డ్రాగన్ దోమలను దిగుమతి చేసి వాటిని చంద్రబాబు పైకి ఉసిగొల్పి కుట్టిస్తున్నారని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించడం.. అబద్ధం ►తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారని చంద్రబాబు గగ్గోలు పెడుతుండడం.. అబద్ధం ► స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగనే లేదని చంద్రబాబు చెప్తుండడం.. అబద్ధం 15:25 PM, నవంబర్ 02 2023 కాసాని దెబ్బకు కళ్లు బైర్లు కమ్మిన తెలుగుదేశం ► తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేదని అధిష్టానాన్ని ప్రశ్నించిన కాసాని.! ► మీకో దండం, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్లకు వెన్నుపోటేనా అని ప్రశ్నించిన కాసాని ► కాసాని ప్రకటనను ఇప్పటివరకు ఖండించలేకపోతోన్న తెలుగుదేశం అధిష్టానం ► ఎందుకు పోటీ చేయలేకపోతుందో చెప్పలేకపోతోన్న చంద్రబాబు, లోకేష్ ► హైదరాబాద్‌లో చాలా బలంగా ఉన్నామంటూ ర్యాలీలు చేసిన వారు పోటీకి ఎందుకు భయపడ్డారు? ► గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న 150 డివిజన్ లలో గత ఎన్నికల్లో ఒక డివిజన్‌ను కూడా తెలుగుదేశం ఎందుకు గెలవలేదు? ► తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక శాతం ఓట్లయినా గ్యారంటీ లేకున్నా బిల్డప్‌లు ఎందుకు? ► నిజంగా నాలుగు ఓట్లయినా పడే సీను లేకున్నా.. గొప్పలకు పోయి వాతలెందుకు పెట్టించుకుంటారు? ► చింత చచ్చినా.. పులుపు చావలేదన్నట్టు కాంగ్రెస్ కోసం ఎందుకు కుటిల ప్రయత్నాలు ► చంద్రబాబు ఏం చేస్తున్నారో నిన్న ఢిల్లీలో బయటపెట్టిన బీజేపీ నేత ఈటల రాజేందర్ ► తెలంగాణలో చంద్రబాబును ఎవరూ నమ్మబోరన్న డాక్టర్ లక్ష్మణ్ ► బీజేపీని బ్లాక్మెయిల్ చేసేలా ఉంటోన్న చంద్రబాబు చర్యలు 15:20 PM, నవంబర్ 02 2023 బాబు విడుదల తర్వాత తేడా కొడుతున్న నెంబర్లు ► తెలుగుదేశం, జనసేన పొత్తుపై పలు సందేహాలు ► జైల్లో చంద్రబాబును కలిసి బయట పొత్తు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ► ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంటు సీట్లు ► తమకు 50 అసెంబ్లీ, 8 పార్లమెంటు సీట్లు కావాలని చెప్పిన పవన్ ► ఇప్పుడు 20 అసెంబ్లీ, 3 పార్లమెంటు ఇవ్వాలన్న యోచనలో తెలుగుదేశం ► చంద్రబాబు విడుదలైన తర్వాత కరకట్ట ఇంట్లో సుదీర్ఘంగా చర్చలు ► అన్ని చోట్లా మనమే పోటీ చేద్దామని బాబుకు చెబుతోన్న టిడిపి నేతలు ► తెలంగాణలో పొత్తులో భాగంగా జనసేనకు బీజేపీ ఇచ్చేది 10కి మించబోవంటున్న టిడిపి నేతలు ► జనసేన సీను అంతే అయినప్పుడు మనమెందుకు ఎక్కువ సీట్లు ఇవ్వాలంటున్న టిడిపి నేతలు ► పునరాలోచనలో పడ్డ తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ 15:15 PM, నవంబర్ 02 2023 భువనేశ్వరీ నిజం నిలిచిపోయిందా? ► రూ.3లక్షల చొప్పున ఇస్తామంటూ ఘనంగా తెలుగుదేశం ప్రకటనలు ► చంద్రబాబు కోసం చనిపోయారు కాబట్టి రూ.3లక్షలు ఇస్తామన్న భువనేశ్వరీ ► అలా ఓ నలుగురికి పంచేసరికి మారిపోయిన సీను ► చంద్రబాబు విడుదల కాగానే నిలిచిపోయిన నిజం యాత్ర ► మిగతా వాళ్లకెపుడు ఇచ్చేది మూడు లక్షల చెక్కులు? ► పాత డేట్లతో ముందే చెక్కులు ఎలా తయారు చేశారు? ► మీ నిజం యాత్రకు నిజంగానే బ్రేకులేశారా? 14:55 PM, నవంబర్ 02 2023 చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టిడిపి చెప్పిన రోగాల జాబితా ► పుట్టుకతోనే చంద్రబాబుకు గుండె సమస్య ఉంది, ఇప్పటి వరకు జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటున్నారు : కొడుకు లోకేష్ ► చంద్రబాబు కంటి సమస్య ఉంది, తక్షణం సర్జరీ చేయాలని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి డాక్టర్లు చెబుతున్నారు : ఎల్లో మీడియాలో ఒక పత్రిక ► చంద్రబాబుకు యాంగిల్ క్లోజర్ గ్లకోమా అనే కంటి వ్యాధి ఉంది. ఇంట్రా ఆక్యులర్ ప్రెజర్ ద్వారా కేవలం ఆస్పత్రిలోనే చికిత్స అందించాలి : ఎల్లోమీడియాలో ఓ ఛానల్ ► చంద్రబాబు వెన్ను కింది భాగంలో నొప్పితో పాటు చర్మవ్యాధులున్నాయి. వీపరీతంగా దద్దర్లు రావడం వల్ల గోకుతున్నారు : ఎల్లో మీడియాలోని మరో ఛానల్ ► చంద్రబాబు మలద్వారం వద్ద తీవ్రంగా నొప్పి వస్తోంది. రాత్రంతా నిద్ర లేకుండా నొప్పితో బాధపడుతున్నారు : ఎల్లో మీడియాలోని ఓ పత్రిక ► చంద్రబాబు ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవద్దు, నడుము తట్టుకోలేదు, వీపరీతంగా నొప్పి ఉంది : ఎల్లోమీడియాలోని మరో ఛానల్ ►మరి, వీటన్నింటికి సరైన ట్రీట్మెంట్ ఇప్పుడయినా చేయిస్తున్నారా? : YSRCP ►ఇన్ని సమస్యలున్నా.. చంద్రబాబు 14గంటల పాటు ర్యాలీ చేశారా? : YSRCP 14:35 PM, నవంబర్ 02 2023 మ్యానిఫెస్టోను అలా విజయవంతంగా మరిచిపోయారు.! ► నవంబర్ 1న ఉమ్మడి మ్యానిఫెస్టో అంటూ టిడిపి, జనసేన గత వారం ఘనంగా ప్రచారం ► అక్టోబర్ 25న రాజమండ్రిలో ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించిన లోకేష్, పవన్ కళ్యాణ్ ► చంద్రబాబు జైల్లో (అక్టోబర్ 25న) ఉన్నాడు కాబట్టి మినీ మ్యానిఫెస్టో అని ప్రకటన ► ప్రకటన చేసిన పవన్‌కళ్యాణ్ ఇటలీకి జంప్, కోరస్ ఇచ్చిన లోకేష్ ఢిల్లీకి జంప్ ► జైలు నుంచి విడుదలయిన చంద్రబాబు హైదరాబాద్‌కు జంప్ ► మ్యానిఫెస్టో గురించి ఎవరయినా అడిగినా.? అంతే సంగతులు ► మ్యానిఫెస్టోను మాయం చేసిన చరిత్ర ఉన్న పార్టీలే టిడిపి, జనసేన : YSRCP 14:29 PM, నవంబర్ 02 2023 స్కిల్ అంతా స్కామే : ఆర్థికమంత్రి బుగ్గన ►విజయవాడలో ఆర్థికమంత్రి బుగ్గన ►స్కిల్ స్కామ్ GST వల్ల బయట పడింది ►2018 లోనే మన రాష్ట్రానికి విచారణ చెయ్యమని లేఖ రాశారు ►GST, SEBI, ED విచారణ చేసిన స్కామ్ ఇది ►2017 నుండి ఈ కేసులో విచారణ జరుగుతోంది ►అలాంటి కేసు CID విచారణ చెయ్యకూడదా..? ►అసలు వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటో తెలుసా..? ►5 రోజుల్లోనే ట్రైనింగ్ సాధ్యమా..? దానిని ట్రైనింగ్ అంటారా..? ►డెమో చూపించి దాన్నే ట్రైనింగ్ అని కోట్లు కొల్లగొట్టారు..? ►370 కోట్ల కి డిజైన్ టెక్ ఈరోజు కి ఎంత ఖర్చయ్యిందో బిల్లే ఇవ్వలేదు ►సీమన్స్ కంపెనీ అసలు ఈ గ్రాంట్ ఇన్ కైండ్ అన్న పద్ధతే లేదు అని చెప్పింది ►అనంతపురం JNTU సెంటర్ లో లెక్కేస్తే 8 కోట్లు పరికరాలు ఉన్నాయి ►ఎంత చూసిన ఈ స్కామ్ లో 250 కోట్లు లెక్కలు దొరకడం లేదు ►పయ్యావుల కేశవ్ కోర్టు తేల్చేంత వరకు ఓపిక పట్టాలి ►కోర్టుకి ఆధారాలు చూపించామో లేదో వీళ్లకు తెలుసా..? ►విచారణలో సేకరించిన ఆధారాలు ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో వారికి ఇస్తారు 14:12 PM, నవంబర్ 02 2023 పయ్యావులకు బోలెడు అనుమానాలు ►స్కిల్ కేసుపై పయ్యావుల కేశవ్ పరిశోధన ►90%-10% అనేదే కాదని చెబుతున్నారు, మరో 5 రాష్ట్రాలు చేశాయి ►MOUపై తేదీ లేకుండా సంతకం పెట్టారని ఆరోపిస్తున్నారు ►ప్రధాన కంపెనీ జర్మనీలో ఉంది, సీమన్స్ కు మీరు లేఖ రాశారా? ►గ్రాంట్ ఇన్ ఎయిడ్ కు బదులు గ్రాంట్ ఇన్ కైండ్ అని రాసుకున్నారు. పదాలు మార్చినా.. ఆరోపణలు చేస్తారా? ►అయ్యా.. కేశవా.. ఇదే ఆర్గ్యుమెంట్ కోర్టు ముందు వినిపిస్తారా? : YSRCP ►ఇన్ని ఆధారాలు మీ దగ్గర ఉంటే.. 17a ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేశారని ఎందుకు వాదిస్తున్నారు? ►తప్పు చేయలేదు అన్న ఏకవాక్యాన్ని కోర్టు ముందు ఎందుకు వినిపించడం లేదు? 14:09PM, నవంబర్ 02 2023 చంద్రబాబు కేరాఫ్ AIG ►చంద్రబాబుకు వైద్య పరీక్షలు ప్రారంభించిన ప్రత్యేక వైద్య బృందం ►ముందుగా చర్మ సంబంధ వైద్య పరీక్షలు ►దాంతో పాటు సాధారణ పరీక్షలు చేయనున్న వైద్యులు ►వెన్నుముక సంబంధిత వైద్య పరీక్షలు ►చంద్రబాబు వైద్య పరీక్షలకు 3 నుంచి 4 గంటల సమయం 13:29PM, నవంబర్ 02 2023 టీడీపీ ఖేల్ ఖతం ►చంద్రబాబు ఒక దొంగ.. ప్రజల డబ్బులు దోచేశాడు ►దొంగ అయిన చంద్రబాబు బయటకు వస్తే జనాలు ఏం ఆదరిస్తారు? ►40ఏళ్ల ఇండస్ట్రీ అనే చంద్రబాబు సింపతీ కోసం ఒక గేమ్ ఆడుతున్నాడు ►ఈ రాష్ట్రంలో అతి పెద్ద రోగిస్టు చంద్రబాబు ►అనేక రోగాలు ఉన్నాయి అని కోరితే కోర్టు చంద్రబాబుకి బెయిల్ ఇచ్చింది ►లోకేష్ వల్ల కాకపోవడంతో పురందేశ్వరి బీజేపీ ముసుగులో బాబు కోసం పని చేస్తున్నారు ►టీడీపీ పని అయిపొయింది.. ఇక కోలుకోదు :::విజయవాడలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్లు 12:53PM, నవంబర్ 02 2023 మళ్లీ 4 వారాలకు చంద్రబాబు జైలుకే! ►చంద్రబాబు హయాంలో అడ్డగోలు అవినీతి జరిగింది ►బాబు నిజాయితీపరుడు అయితే జైలుకు ఎందుకు వెళ్లారు? ►కన్ను బాగోలేదనే బెయిల్ ఇచ్చారు ►మళ్లీ నాలుగు వారాల తర్వాత జైలుకు రమ్మన్నారు ►అనకాపల్లి సామాజిక సాధికార యాత్ర ప్రారంభ సమావేశంలో మంత్రి బొత్స వ్యాఖ్యలు ఇదీ చదవండి: బాబుకు అనారోగ్యం సాకు మాత్రమే! 12:29PM, నవంబర్ 02 2023 ఆధారాలివ్వండి ►ఏపీ హైకోర్టులో సంజయ్, పొన్నవోలుపై పిల్ ►ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ పిటిషన్ ►ప్రెస్ మీట్ల కోసం వారు ప్రజాధనం ఖర్చు చేసినట్లు ఆధారాలున్నాయా? ►ఏఏజీ, సీఐడీ చీఫ్ ఏం మాట్లాడారో....తర్జుమా చేసి ఇవ్వండి ►పిటిషనర్ కు ధర్మాసనం ప్రశ్న ►విచారణ 8వ తేదీకి వాయిదా 12:07PM, నవంబర్ 02 2023 బాబుకు వైద్య పరీక్షలు ►హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు ►చంద్రబాబు వైద్య పరీక్షలకు సుమారు 4 గంటలు పట్టే అవకాశం 11:54AM, నవంబర్ 02 2023 చంద్రబాబుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు ►అరెస్ట్ తర్వాత నిన్న హైదరాబాద్‌కు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి ర్యాలీ ►ర్యాలీపై హైదరాబాద్ లో కేసు నమోదు ►ఎన్నికల కోడ్ ఉల్లంఘన పై కేసు నమోదు చేసిన బేగంపేట పోలీసులు ►పనిగట్టుకుని జనసమీకరణ చేపట్టిన తెలుగుదేశం నేతలు ►చంద్రబాబు ర్యాలీ యాత్రలను సమర్థించుకున్న అచ్చెన్నాయుడు 10:30AM, నవంబర్ 02 2023 ఏఐజీ ఆసుపత్రికి నారా లోకేశ్ ►హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న నారా లోకేశ్ ►మరికాసేపట్లో ఆసుపత్రికి వెళ్లనున్న చంద్రబాబు ►చంద్రబాబు వెళ్తున్న దృష్ట్యా ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు 08:20AM, నవంబర్ 02 2023 వైద్యపరీక్షలు చేయించుకోనున్న చంద్రబాబు ►ప్రత్యేక విమానంలో నిన్న హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు ►జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి కాసేపట్లో వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి ►నిన్న చంద్రబాబును కలిసిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) వైద్యుల బృందం ►వైద్యుల సూచన మేరకు నేడు ఏఐజీకి ►హైకోర్టు ఆదేశాల ప్రకారం.. వైద్య పరీక్షల నివేదికల్ని ఏసీబీ కోర్టుకు సమర్పించే అవకాశం 07:18AM, నవంబర్ 02 2023 ఫైబర్ నెట్ కుంభకోణంలో సీఐడీ దూకుడు ►ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబు సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు నిర్ణయం ►ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలని ప్రతిపాదన ►సీఐడీ ప్రతిపాదనకు హోంశాఖ ఆమోదం ►అనుమతి కోసం నేడు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న సీఐడీ ►టెరాసాఫ్ట్ కంపెనీ, చంద్రబాబు సన్నిహితులకు చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలన్న సీఐడీ ప్రతిపాదన ►ఆమోదిస్తూ రాష్ట్ర హోంశాఖ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ ►ఫైబర్ నెట్ కుంభకోణంలో 114 కోట్లు దుర్వినియోగమయ్యామని ఇప్పటికే ఎఫ్ ఐ ఆర్ నమోదు ►ఈ కేసులో ఎ 1 గా వేమూరి హరికృష్ణ, ఎ 11 గా టెర్రా సాఫ్ట్ ఎండి తుమ్మల గోపీచంద్, ఎ -25 గా చంద్రబాబునాయుడి పేర్లు ►ఫైబర్ నెట్ కుంభకోణంలో నిందితులైన టెర్రా సాఫ్ట్ ఎండి తుమ్మల గోపీచంద్ కి ఆస్ధులతో పాటు పలు కంపెనీల ఆస్ధులు అటాచ్ చేయాలని ప్రతిపాదన ►తుమ్మల గోపీచంద్ మరియు ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్నమంగళారం లలో ఉన్న ఇల్లు, వ్యవసాయ క్షేత్రాలు అటాచ్ ►ఈ కుంభకోణంలో నిందితులైన నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ డైరక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరు, విశాఖ కిర్లంపూడి లే అవుట్ లోని ఇల్లులు అటాచ్ ►మొత్తంగా అటాచ్ ఆస్తుల్లో గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్‌లోని నాలుగు ఫ్లాట్లు, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ►హోంశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో ఆ స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేయనున్న సీఐడీ ఇదీ చదవండి: చంద్రబాబు కనుసన్నల్లోనే ‘ఫైబర్ గ్రిడ్’ అక్రమాలు 07:13AM, నవంబర్ 02 2023 అదనపు షరతుల పిటిషన్‌పై నిర్ణయం రేపే ►చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై సీఐడీ అనుబంధ పిటిషన్ ►బెయిల్‌కు మరికొన్ని షరతులు విధించాలని కోర్టుకు విజ్ఞప్తి ►బుధవారం కొనసాగిన వాదనలు ► సీఐడీ కోరుతున్న షరతులు చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయన్న బాబు లాయర్ దమ్మాలపాటి శ్రీనివాస్ ►కోర్టు ఉత్తర్వులను చంద్రబాబు ఉల్లంఘించారని.. జైలు బయట మీడియా సమావేశం నిర్వహించారన్న సీఐడీ తరఫు లాయర్ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ►ప్రత్యేక పరిస్థితుల్లోనే చంద్రబాబుకి కోర్టు మధ్యంతర బెయిలు ఇచ్చిందని గుర్తు చేసిన ఏఏజీ ► శుక్రవారం నిర్ణయం వెల్లడిస్తామన్న జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు 06:59AM, నవంబర్ 02 2023 మళ్లీ ఢిల్లీకి వెళ్లిన లోకేష్‌పై సెటైర్లు ►మళ్లీ నిన్న ఢిల్లీకి వెళ్లిపోయిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు ►టీడీపీ అధినేత, తండ్రి చంద్రబాబు మీద ఉన్న కేసులపై న్యాయ నిపుణులతో చర్చించేందుకేనన్న ప్రచారం ►వ్యక్తిగత పని మీద అని టీడీపీ వివరణ ►నవంబర్ 8న సుప్రీంలో క్వాష్ పిటిషన్‌పై తీర్పు.. 9న ఫైబర్కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►పదుల సంఖ్యలో పిటిషన్లపై చర్చ కోసమేనంటూ ప్రచారం ►మళ్లీ.. అరెస్ట్ భయంతోనేనంటూ సోషల్ మీడియాలో సెటైర్లు 06:49AM, నవంబర్ 02 2023 చంద్రబాబు కోసం జనాలు.. టీడీపీ నేతల తంటాలు ►జైలు జీవితం తర్వాత కరకట్ట ఇంటి.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు చంద్రబాబు ►యథేచ్ఛగా కోర్టు షరతులను ఉల్లంఘించిన చంద్రబాబు ►మొన్న సాయంత్రం నుంచి నిన్న సాయంత్రం వరకు చంద్రబాబు యాత్రల పేరిట హడావిడి ►నిన్న సాయంత్రం హైదరాబాద్‌కు చేరిక ►బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి దాకా టీడీపీ భారీ ర్యాలీ ►జనసమీకరణలో పోటీ పడ్డ తెలుగుదేశం నాయకులు 06:40AM, నవంబర్ 02 2023 స్కిల్డ్ దొంగ.. చంద్రబాబు ►స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో అవినీతికి పాల్పడ్డ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ►సీఎంగా ఉన్న టైంలో ప్రభుత్వ ఖజానా నుంచి షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు ►కొల్లగొట్టిన రూ.371 కోట్లలో రూ.27 కోట్లు టీడీపీ ఖాతాకు చేరాయని ఆధారాలు సమర్పించిన సీఐడీ ►సెప్టెంబర్ 09వ తేదీన అరెస్ట్ చేసిన పోలీసులు.. అక్టోబర్ 31 సాయంత్రం మధ్యంతర బెయిల్ మీద విడుదల ►52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు ►కోర్టుల్లో వరుస ఎదురు దెబ్బలతో వరుస పిటిషన్లు ►చివరకు ఏపీ హైకోర్టులో స్వల్ఫ ఊరట ►షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ►నాలుగు వారాల తర్వాత.. నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5గం.లోపు జైల్లో సరెండర్ కావాలని చంద్రబాబుకి ఆదేశం ►కేవలం మానవతా ధృక్పథం.. ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ ఇస్తున్నామన్న హైకోర్టు ►కంటి సర్జరీ కోసం బెయిల్.. ఆస్పత్రి మినహా మరేయితర కార్యక్రమాల్లో పాల్గొనద్దని ఆదేశం ►షరతులు ఉల్లంఘిస్తే వెంటనే బెయిల్ రద్దు అవుతుందని హెచ్చరిక -
'పదివేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నా'
ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ప్లేయర్ బెంజమిన్ మెండీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 2020లో 24 ఏళ్ల యువతిని సెంట్ ఆండ్రూలోని తన మాన్షన్లోని లాకర్ రూమ్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బెంజమిన్ మెండీని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అప్పటినుంచి ఈ కేసు పలు దఫాలుగా చెస్టర్టౌన్ కోర్టులో విచారణకు వస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఈ కేసు విచారణకు రాగా.. సదరు బాధితురాలు బెంజమిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను రికార్డు చేసిన టేప్‌ను కోర్టుకు సమర్పించింది. ఆ టేప్‌లో బెంజమిన్ బాధితురాలితో.. '' ఇది కొత్త కాదు.. నేను 10 వేలమంది మహిళలతో శృంగారలో పాల్గొన్నాను'' అని చెప్పాడు. ఇదే విషయమై జడ్జి బెంజమిన్‌ను ప్రశ్నించాడు. ''24 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడింది నిజమేనని.. అంతకముందు 29 ఏళ్ల మహిళ నాపై దాడి చేసేందుకు యత్నిస్తే ఆమెపై కూడా అత్యాచారానికి పాల్పడ్డాను. తాను మరో 10వేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నట్లు'' మెజిస్ట్రేట్ ముందు ఒప్పుకున్నాడు. ఈ సమయంలో బెంజమిన్ మెండీ మొహంలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు. అనంతరం నిజానిజాలు తేల్చేందుకు ఆరుగురు మహిళలు, ఆరుగురు పురుషులతో ఏర్పాటైన జ్యూరీని వీలైనంత త్వరగా వివరాలు సేకరించి రిపోర్టు అందించాలని ట్రయల్ జడ్డి ఆదేశించారు. 2018 ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు 2017 నుంచి 2019 వరకు ఫ్రాన్స్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాదు 2018లో ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన ఫ్రాన్స్ జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు. ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ సిటీతో ఒప్పందం చేసుకున్నాడు. కాగా బెంజమిన్ తన సరదాల కోసం ఎంతో మంది మహిళలను లోబర్చుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆసియా కప్ విజేతగా భారత్.. ఎనిమిదోసారి టైటిల్ కైవసం -
సినీ పెద్దలకు ఆ భూమిపై హక్కుల్లేవు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ సర్వే నంబర్ 4, 5, 8, 9, 10, 12లోని 26.16 ఎకరాల భూమి వ్యవహారంలో పలువురు సినీ పెద్దలకు ఎలాంటి హక్కులు లేవని హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఖానామెట్‌లో చట్ట ప్రకారం హక్కులు లేని భూమిని నిర్మాత డి.రామానాయుడు, దర్శకుడు కె.రాఘవేంద్రరావు, గోవిందరెడ్డి, ఇతరులు 26.16 ఎకరాలు కొనుగోలు చేశారని నివేదించింది. చదవండి: వెసక్టమీ చేయించుకుంటే పురుషులు శక్తిహీనులవుతారా? సదరు భూ హక్కుల వివాదంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్. నంద ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదనలు వినిపించారు. మాజీ సైనికుడికి భూమి ఇచ్చిన పత్రాలపై సంతకాలకు అప్పటి తహసీల్దార్ సంతకాలకు పొంతన లేదన్నారు. ఫోర్జరీ సంతకాలతో మాజీ సైనికుడికి కేటాయించినట్లు పత్రాలు సృష్టించారని, అతని నుంచి మరొక వ్యక్తి కొనుగోలు చేస్తే.. వారి నుంచి ప్రతివాదులు భూమిని కొనుగోలు చేశారన్నారు. సైన్యంలో జవాన్లకు 5 ఎకరాలు ఇవ్వాలన్నది ప్రభుత్వ నిబంధనని, కమాండర్ ఇన్ చీఫ్ నరసింహనాయక్‌కు ఇది వర్తించదని చెప్పారు. తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లుగా ఫోరెన్సిక్ శాఖ నిర్ధారించడంతో ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకుందని వెల్లడించారు. 15 ఏళ్ల తర్వాత ప్రభుత్వం రికార్డులను సవరించడం చెల్లదని సింగిల్ జడ్జి తీర్పును కొట్టేయాలని కోరారు. రామానాయుడు, రాఘవేంద్రరావు ఇతరుల వాదనల నిమిత్తం విచారణను హైకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. -
జీతం పడకుండా తగ్గినట్లు మీకు ఎలా తెలుసు?: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: పీఆర్సీ జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. జీతం పడకుండా తగ్గినట్లు మీకు ఎలా తెలుసు అని హైకోర్టు ప్రశ్నించింది. ‘సమస్య పరిష్కారం కోసం కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు సమ్మె చేయడం అంటే ధర్మాసనంపై అనవసర ఒత్తిడి కలిగించడమే.. ఉద్యోగుల సమ్మెతో సమస్య పరిష్కారం కాదు’ అని హైకోర్టు పేర్కొంది. చదవండి: ఏప్రిల్‌లో ఇంటర్ పరీక్షలు కోర్టుకు ఏజీ శ్రీరాం వాదనలు వినిపిస్తూ.. ఉద్యోగులు అనవసర భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒక్క రూపాయి కూడా తగ్గదన్నారు. అత్యున్నతమైన న్యాయస్థానం భావించినట్లే మేము కూడా కోర్టులో పిటిషన్‌కు సంబంధించిన విచారణ నడుస్తున్నప్పుడు సమ్మె చేయటం ప్రయోజనకరం కాదని భావిస్తున్నామని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. -
రీ-నోటిఫికేషన్‌పై హైకోర్టులో విచారణ
-
హైకోర్టుకు ఎస్ఈసీ క్షమాపణ..
సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ రీ-నోటిఫికేషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయడానికి ఎస్ఈసీ సమయం కోరారు. కోర్టు కేసులు ఉన్నాయని ఎస్ఈసీ ఆలస్యం చేస్తోందని ప్రభుత్వం తెలిపింది. కౌంటర్ దాఖలు చేయనందుకు కోర్టుకు ఎస్ఈసీ క్షమాపణ చెప్పారు. సోమవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఎస్ఈసీ కౌంటర్ దాఖలు చేయనిపక్షంలో.. కౌంటర్ దాఖలు చేసినట్లుగానే భావించి విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణ హైకోర్టు.. సోమవారానికి వాయిదా వేసింది. చదవండి: చంద్రబాబు ఫ్లాప్ షో: టీడీపీలో నిరుత్సాహం సిట్టింగ్‌లకు టీడీపీ షాక్.. జనసేనతో లోపాయికారి ఒప్పందం! -
టీడీపీ నేతలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
సాక్షి, ఢిల్లీ: అమరావతి భూ కుంభకోణంపై సిట్ ఏర్పాటు, మాజీ ఏజీ దమ్మాలపాటి కేసుపై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ జరిపింది. నోటీసులకు టీడీపీ నేతలు కౌంటర్ దాఖలు చేయకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే ఆఖరి అవకాశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లేదంటే తాము ప్రొసీడ్ అవుతామని హెచ్చరించింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రలను సుప్రీంకోర్టు ఆదేశించింది. రీ జాయిండర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. మార్చి 5న తుది విచారణ చేస్తామని ధర్మాసనం వెల్లడించింది. కాగా, అమరావతి భూ కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సబ్ కమిటీ పరిశీలన మేరకు ఏర్పాటైన సిట్ దర్యాప్తును నిలిపివేయాలంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేయగా దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. (చదవండి: వివరాలు లేకుండా పిల్ ఎలా వేస్తారు?) సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోండి -
అగ్నిప్రమాదం కేసు: కస్టడీ పిటీషన్‌పై నేడు విచారణ
సాక్షి, విజయవాడ: అగ్నిప్రమాదం లో పది మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయిన కేసులో నిందితుల కస్టడీ పిటీషన్ పై నేడు కోర్టు విచారణ జరపనుంది. కేసులో అరెస్టై రిమాండ్ లో ఉన్న రమేష్ ఆసుపత్రికి చెందిన కీలక వ్యక్తులు జైలులో ఉన్న రమేష్ ఆసుపత్రి సీ ఓఓ రాజగోపాల్, జనరల్ మేనేజర్ సుదర్శన్, కోఆర్డినేటర్ వెంకటేష్ కస్టడీకి పోలీసులు పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురూ స్వర్ణపాలెస్ హోటల్ తో ఒప్పందం కుదుర్చుకున్నారని పిటీషన్లో పేర్కొన్నారు. (రమేష్ వాటాదారు ‘ఆస్టర్’కు నోటీసులు) ముగ్గురు నుంచి కీలక సాక్ష్యాలు రాబట్టాలని పిటీషన్లో పోలీసులు కోరారు.పోలీసులు కస్టడీ పిటీషన్ పై మూడవ అదనపు మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టు నేడు విచారించనుంది. కస్టడీ నుంచి తప్పించుకునేందుకు బెయిల్ కి ప్రయత్నిస్తున్న నిందితులు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసులు తెలపనున్నారు. రమేష్ ఆసుపత్రి నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం వల్లే పదిమంది ప్రాణాలు పోయాయని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు స్పష్టం చేశారు. (ఆరోగ్యశ్రీ ముసుగులో ‘రమేష్’ మోసాలు!) -
కోమటిరెడ్డి, సంపత్ కోర్టు ధిక్కార పిటిషన్‌పై విచారణా
-
రెండు రోజుల్లో కోర్టుకు.. అనూహ్యంగా హత్య
మౌ: ఉత్తరప్రదేశ్‌లో పద్దేనిమిదేళ్ల బాలిక విషయంలో దారుణం చోటుచేసుకుంది. తొలుత అత్యాచారానికి గురైన ఆమె.. మరో రెండు రోజుల్లో కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి ఉండగా గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో దారుణ హత్యకు గురైంది. మోటార్ సైకిల్‌పై సాయుధులుగా వచ్చిన ఇద్దరు యువకులు ఆమెపై కాల్పులు జరిపి హతమార్చి వెళ్లారు. ఈ ఘటన బిజాపూర్ అనే గ్రామంలో చోటుచేసుకుంది. ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వారే ఈ హత్య చేయించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ బోరున విలపించారు. ఈ ఘటన సందర్భంగా కుటుంబ సభ్యులు, స్థానికులు బలియా జాతీయ రహదారిని స్తంభింపజేశారు. 2011 జూన్ 6న స్థానిక కాలేజీ మేనేజర్ అయిన బీకే సింగ్ అనే వ్యక్తి అదే కాలేజీలో చదువుతున్న ఆ బాలికపై లైంగిక దాడి చేశాడు. ఈ నేపథ్యంలో అతడిపై కేసు నమోదైంది. అయితే, అతడు గత కొంతకాలంగా కేసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. కానీ, అందుకు బాధితురాలి కుటుంబ సభ్యులు ఒప్పకోకపోవడంతో మరో రెండు రోజుల్లో కీలక విచారణ నేపథ్యంలో అతడు ఈ హత్య చేయించినట్లు వారు ఆరోపిస్తున్నారు.