రెండు రోజుల్లో కోర్టుకు.. అనూహ్యంగా హత్య | Rape Survivor Shot Dead in Uttar Pradesh 2 Days Before Court Hearing | Sakshi
Sakshi News home page

రెండు రోజుల్లో కోర్టుకు.. అనూహ్యంగా హత్య

Published Mon, Sep 14 2015 9:08 AM | Last Updated on Sat, Jul 28 2018 8:43 PM

రెండు రోజుల్లో కోర్టుకు.. అనూహ్యంగా హత్య - Sakshi

రెండు రోజుల్లో కోర్టుకు.. అనూహ్యంగా హత్య

మౌ: ఉత్తరప్రదేశ్లో పద్దేనిమిదేళ్ల బాలిక విషయంలో దారుణం చోటుచేసుకుంది. తొలుత అత్యాచారానికి గురైన ఆమె.. మరో రెండు రోజుల్లో కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి ఉండగా గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో దారుణ హత్యకు గురైంది. మోటార్ సైకిల్పై సాయుధులుగా వచ్చిన ఇద్దరు యువకులు ఆమెపై కాల్పులు జరిపి హతమార్చి వెళ్లారు. ఈ ఘటన బిజాపూర్ అనే గ్రామంలో చోటుచేసుకుంది. ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వారే ఈ హత్య చేయించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ బోరున విలపించారు.

ఈ ఘటన సందర్భంగా కుటుంబ సభ్యులు, స్థానికులు బలియా జాతీయ రహదారిని స్తంభింపజేశారు. 2011 జూన్ 6న స్థానిక కాలేజీ మేనేజర్ అయిన బీకే సింగ్ అనే వ్యక్తి అదే కాలేజీలో చదువుతున్న ఆ బాలికపై లైంగిక దాడి చేశాడు. ఈ నేపథ్యంలో అతడిపై కేసు నమోదైంది. అయితే, అతడు గత కొంతకాలంగా కేసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. కానీ, అందుకు బాధితురాలి కుటుంబ సభ్యులు ఒప్పకోకపోవడంతో మరో రెండు రోజుల్లో కీలక విచారణ నేపథ్యంలో అతడు ఈ హత్య చేయించినట్లు వారు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement