లక్నో: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. కొందరు దుండగులు అధికార పార్టీ నేతను ఆయన ఇంటి ముందే కాల్చి చంపారు. ఈ ఘటన స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దీంతో, బీజేపీ నేత హత్య యూపీలో సంచలనంగా మారింది.
వివరాల ప్రకారం.. శంభాల్ జిల్లాలోని మొరదాబాద్‌కు చెందిన బీజేపీ నేత అనూజ్ చౌదరీ(34) దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు గురువారం సాయంత్రం మొరాదాబాద్‌లోని ఆయన నివాసం బయటే ఆయనను కాల్చి చంపారు. అనూజ్ చౌధురి తన అపార్ట్‌మెంట్ నుంచి మరో వ్యక్తితో కలిసి గురువారం సాయంత్రం బయటకు రాగా.. బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు పలు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన ఆయనను కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు.
పొలిటికల్ ప్రత్యర్థుల పనేనా..
ఇక, కాల్పుల ఘటన ఆయన నివాసం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. మరోవైపు.. ఎస్పీ హేమ్‌రాజ్ మీనాతో సహా పోలీసు అధికారులందరూ సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. అనూజ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. అనూజ్‌పై కాల్పుల ఘటనలో అస్మోలీ బ్లాక్ చీఫ్ కుమారుడు అనికేత్‌పై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్ట తెలిపారు. ఇక, అనూజ్ హత్యలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు అమిత్, అనికేత్‌లుగా బాధిత కుటుంబం తెలిపింది.
BJP Leader Anuj Chaudhary Shot dead on day light in Uttar Pradesh
— Dr Jain (@DrJain21) August 11, 2023
But still it's The Best Law & Order state in Bharatvarsh according to Bhakts 🙏#NarendraModi #NarendraModiji #NoConfidenceMotion #NoConfidence #NoConfidenceDebate #PMModi #earthquake #MohanLal #OMG2 #Gadar2 #UP pic.twitter.com/PnmhWMAyDA
ఇదిలా ఉండగా.. స్థానిక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తోన్న అనూజ్.. రెండేళ్ల కిందట జరిగిన యూపీ బ్లాక్ చీఫ్ ఎన్నికల్లో శంభాల్‌లోని అస్మోలీ బ్లాక్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. అనూజ్‌కు బీజేపీ కీలక నాయకులు, మంత్రులతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. రాజకీయ ప్రత్యర్థులే హత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: మోదీకి కాంగ్రెస్ ఫోబియా
Comments
Please login to add a commentAdd a comment