Moradabad
-
సినిమా రేంజ్లో బీజేపీ మేయర్ ఓవరాక్షన్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్
లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ మేయర్ ఓవరాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాను రక్తదానం చేయకపోయినా రక్తం ఇస్తున్నట్టు నటించడమే ఇందుకు కారణం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మేయర్‌ను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రక్తదానం చేసేందుకు చాలా మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక, శిబిరంలో పాల్గొనేందుకు మొరదాబాద్ పట్టణ మేయర్ వినోద్ అగర్వాల్ కూడా అక్కడికి వచ్చారు. అయితే, వచ్చిన వ్యక్తి రక్తదానం చేయకుండా ఓవరాక్షన్ చేశారు. అయితే ఆయన రక్తదానం ఇచ్చినట్టు ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.Uttarpradesh, Moradabad BJP mayor Vinod Agarwal did a fake for blood donation on the occasion of the Birthday of PM Narendra Modi. I am remembering that signature acting if you know. pic.twitter.com/6QhDaNmo0B— Mr.Haque (@faizulhaque95) September 20, 2024 అక్కడ రక్తదాన శిబిరంలో ఏర్పాటు చేసిన బెడ్‌పై పడుకుని రక్తం ఇచ్చినట్టు కలరింగ్ ఇచ్చాడు. ఈ సందర్భంగా డాక్టర్‌తో మాట్లాడుతూ.. తాను రక్తం ఇవ్వట్లేదని, కేవలం ఫోటోలు మాత్రమే దిగుతానని చెప్పి ఫోజు ఇచ్చాడు. అనంతరం బెడ్‌పై నుంచి లేచి వెళ్లిపోయారు. అనంతరం, రక్తదానం ఇచ్చినట్టు దిగిన ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అంతేకాకుండగా.. రక్తదానం చేసి మీ బాధ్యతను నెరవేర్చండి అని రాసుకొచ్చారు. దీంతో మేయర్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజాప్రతినిధి అయి ఉంది ఇలా మాట్లాడటమేంటని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు. ఇక, ఆయనపై వస్తున్న తీవ్ర విమర్శలకు తాజాగా మేయర్ స్పందించారు. తాను డయాబెటిక్ పేషంట్ అని చెప్పుకొచ్చారు. అందుకే తాను రక్తదానం చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఇది కూడా చదవండి: అర్బన్ నక్సల్స్, తుక్డే గ్యాంగ్ కాంగ్రెస్‌ను నడిపిస్తున్నాయి -
అమాయకుల ఇళ్లపైకే బుల్డోజర్లు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా నిప్పులు చెరిగారు. బుల్డోజర్లతో అమాయక ప్రజల ఇళ్లను కూలి్చవేస్తున్నారని, ప్రభుత్వ నిర్వాకం వల్ల నేరగాళ్లు మాత్రం నిక్షేపంగా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఆమె శనివారం ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో తన సోదరుడు రాహుల్ గాంధీతోపాటు భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం రైతులు రోజుల తరబడి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. రైతుల మొర ఆలకించే తీరిక పాలకులకు లేదా? అని నిలదీశారు. ఉత్తరప్రదేశ్‌లో రైతులపైకి జీపులు నడిపించి చంపిన నాయకుల ఇళ్లపైకి, మహిళలను వేధించిన దుర్మార్గుల ఇళ్లపైకి, ప్రశ్నాపత్రాలను లీక్ చేసినవారి ఇళ్లపైకి బుల్డోజర్లు వెళ్లడం లేదని ధ్వజత్తారు. అమాయకుల ఇళ్లు మాత్రమే బల్డోజర్ల కింద నలిగిపోతున్నాయని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులు, రైతులకు అన్యాయం జరుగుతుండడం వల్లే యాత్రలో ‘న్యాయ్’ పదాన్ని చేర్చామన్నారు. ఆదివారం ఆగ్రాలో యాత్రలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఆ పిల్లలు రీల్స్ చూడరు: రాహుల్ దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ఇక యువత రోజుకు 12 గంటలు మొబైల్ ఫోన్లు చూడక ఏం చేస్తారని రాహుల్ ప్రశ్నించారు. ఆయన శనివారం యూపీలోని సంభాల్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్రలో మాట్లాడారు. రోజుకు ఎన్ని గంటలు ఫోన్ వాడుతున్నారని యువతను ప్రశ్నించగా 12 గంటలని బదులిచ్చారు. దాంతో రాహుల్ ఈ మేరకు స్పందించారు. సంపన్నులు, బడా వ్యాపారవేత్తల పిల్లలు ఫోన్లలో రీల్స్ చూడరని, రోజంతా డబ్బులు లెక్కపెట్టుకొనే పనిలోనే ఉంటారని అన్నారు. శనివారం యూపీలోని మొరాదాబాద్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్, ప్రియాంక -
65 ఏళ్ల వయసులో ‘డాన్సింగ్ దాదీ’గా ఫేమస్..
సాధారణంగా 65 ఏళ్ల వయసులో మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి అంటూ బాధపడేవారిని చూస్తుంటాం. కానీ, రవి బాల శర్మ బాలీవుడ్ తారలకు దీటుగా డ్యాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నారు. ఆమె అసలు పేరుకన్నా ‘డాన్సింగ్ దాదీ’గా ఫేమస్ అయ్యింది. మహిళలే కాదు యువత కూడా ఆమె డ్యాన్స్ స్టెప్పులకు ఆశ్చర్యపోతూ ఫాలో అవుతున్నారు. ఈ వయసులో పూజలు చేసుకోకుండా డ్యాన్సులు ఏంటి అనేవారికి మీలో స్కిల్స్ లేకనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఘాటుగా సమాధానం చెబుతుంది. ఇంతకీ ఎవరీ రవి బాల శర్మ... ‘‘నా పేరు ముందు రవి అని అబ్బాయిల పేరు ఉంటుంది. మా చెల్లి పేరు శశి ప్రభ శర్మ అంటే చంద్రుడు. నా పేరులో సూర్యుడు ఉండాలని రవి అని నాన్న అనుకున్నారట. అందుకే బాల అనే నా పేరు ముందు రవి చేర్చారు. చాలా మంది నా పూర్తి పేరు తెలుసుకోకుండా మిస్టర్ అని సంబోధిస్తుంటారు. నేను స్కూల్ టీచర్‌గా చేసే రోజుల్లో ప్రమోషన్ జాబితాలో నా పేరు కనిపించలేదు. విషయమేంటని ఆరా తీస్తే మగ టీచర్ల జాబితాల్లో నా పేరు ఉందని తెలిసింది. సంగీత వారసత్వం ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో పుట్టి పెరిగాను. మా ఇంట్లో ఎప్పుడూ సంగీత వాతావరణం ఉంటుంది. మా నాన్న సంగీత ఉపాధ్యాయుడు. అనేక వాద్యాలను వాయించేవాడు. ఆయన దగ్గరే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. మా అమ్మ కూడా చాలా బాగా పాడేది. కానీ, పిల్లల పెంకంలో ఆమె ఎప్పుడూ బిజీగా ఉండేది. మా నాన్న కొడుకు, కూతురు అనే తేడా చూడలేదు. నా కూతుళ్లు తమ కాళ్లపై తాము నిలబడగానే పెళ్లి చేస్తానని చెబుతుండేవాడు. దీంతో ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం రాలేదు. పాడటమే కాకుండా కథక్ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్నాను. సితార్, తబలా కూడా వాయిస్తాను. హిందీలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నాను. 27 ఏళ్లుగా ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో మ్యూజిక్ టీచర్‌గా ఉన్నాను. పెళ్లయ్యాక ఇల్లు, పిల్లలు, స్కూలు బాధ్యతలతో బిజీ అయిపోయాను. నా ఆసక్తుల గురించి పట్టించుకోలేదు. స్కూల్లో పిల్లలకు సంగీతం నేర్పించడంలో ఎంతో సంతృప్తి ఉండేది. కానీ, సంగీతం టీచర్లకు మిగతా టీచర్లకు ఉన్నంత ప్రాధాన్యత ఉండేది కాదు. కొడుకుతో కలిసి.. నా భర్తకు కేన్సర్ అని తెలియగానే కుప్పకూలిపోయాం. అతని మరణం నన్ను బాగా కుంగదీసింది. కూతురికి పెళ్లయ్యింది. మా అబ్బాయి ఏకాంష్ రచయిత, నటుడు. దీంతో అతనితో పాటు ముంబై వచ్చాను. లాక్డౌన్ సమయంలో మా అబ్బాయి సోషల్ మీడియా అకౌంట్‌ను క్రియేట్ చేశాడు. నన్ను విషాదం నుంచి తేరుకునేలా చేసేందుకు కొన్ని వీడియోలు షూట్ చేసేవాడు. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించాడు. వాటిని చూసి, వస్తున్న ప్రశంసలు చూసి నేనూ చాలా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. మొదట్లో పెద్దగా వ్యూస్ రాకపోయినా తర్వాత ఫేమస్ అయ్యాను. వైరల్ అయిన విధం.. గాయకుడు, గేయ రచయిత దిల్జీత్ దోసాంజ్ పాటకు డ్యాన్స్ చేసి, ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తే, ఆ వీడియోను అతను షేర్ చేయడంతో తెగ వైరల్ అయ్యింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నా డ్యాన్స్ టాలెంట్ నన్ను సోషల్ మీడియాకు ‘డ్యాన్స్ దాది’ని చేసింది. లక్షలాది మంది అభిమానులను తెచ్చిపెట్టింది. బాలీవుడ్ తారలు ఏ నటి పాటతో డ్యాన్స్ చేసినా ఆమె నా వీడియోను షేర్ చేసేంతగా పేరు రావడం నిజంగా ఆశ్చర్యమనిపించింది. ఈ వయస్సులో డ్యాన్స్ చేయడం చూసి వాళ్లూ ఆశ్చర్యపోతుంటారు. కానీ నా వయస్సును హాబీకి దూరంగా ఉంచుతున్నాను. నృత్యం నా హాబీ. అది నన్ను నా మనసులో ఎప్పుడూ యవ్వనంగా ఉంచుతుంది. నా డ్యాన్స్ వీడియోలు చూసిన తర్వాత చాలామంది మహిళలు ‘మీ నుంచి చాలా స్ఫూర్తి పొందుతున్నామ’ని చెబుతుంటారు. చాలా మంది యువకులు కూడా నా డ్యాన్స్ ఫాలో అవుతున్నారు. కొందరు మాత్రం ‘ఈ వయసులో పూజలు చేసుకోకుండా, డ్యాన్స్ ఎందుకు, నడుం పట్టేస్తుంది జాగ్రత్త’ అని కామెంట్స్ చేస్తుంటారు. అలాంటి వారికి నేను భయపడను. వారికి డ్యాన్స్‌లో స్కిల్ లేదు. కాబట్టి, వారికి ఆ కళ తెలియదు. విమర్శించేవారు వారి వ్యక్తిగత చిరాకుల కారణంగానే అలాంటి కామెంట్స్ చేస్తారు అనిపిస్తుంది. కొందరికి ఇష్టం ఉన్నా తమలో ఉన్న బిడియం వల్ల డ్యాన్స్ చేయలేరు. ఇంకొందరు తమకు నచ్చినది ఇతరులు చేయడం చూస్తే ‘నేనెందుకు చేయలేకపోయాను’ అని బాధపడతారు. ఇది ఒకరకమైన మానసిక రుగ్మత తప్ప మరొకటి కాదు. అలాంటి వారిపై మన శక్తిని వృథా చేయకూడదు. ఎందుకంటే అది మనల్ని ముందుకెళ్లకుండా ఆపుతుంది. వయసు ఓ సంఖ్య మాత్రమే! హృదయంలో పిల్లల్లాగే ఉండి, హాబీస్తో జీవిస్తున్నట్లయితే మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరు. అదే, ఎన్నో విషాదాలను వెనక్కి నెట్టేస్తుంది. మీ హాబీ మిమ్మల్ని యంగ్‌గా ఉండటానికి సహాయపడుతుంది. ఇలాంటప్పుడు వయసు తన ప్రభావాన్ని చూపడంలో ఎప్పుడూ ఫెయిల్ అవుతుంది. నేను డాన్స్ చేయకపోతే వయసు నన్ను ఓడించేది. కానీ, నా హాబీని సజీవంగా ఉంచుకుని, దానిని పూర్తి స్థాయిలో జీవించడం ద్వారా వయసును ఓడించాను’’ అని ఆనందంగా తెలియజేస్తారు ఈ డ్యాన్సర్. -
బీజేపీ నేత దారుణ హత్య.. కారణం అదేనా?
లక్నో: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. కొందరు దుండగులు అధికార పార్టీ నేతను ఆయన ఇంటి ముందే కాల్చి చంపారు. ఈ ఘటన స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దీంతో, బీజేపీ నేత హత్య యూపీలో సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. శంభాల్ జిల్లాలోని మొరదాబాద్‌కు చెందిన బీజేపీ నేత అనూజ్ చౌదరీ(34) దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు గురువారం సాయంత్రం మొరాదాబాద్‌లోని ఆయన నివాసం బయటే ఆయనను కాల్చి చంపారు. అనూజ్ చౌధురి తన అపార్ట్మెంట్ నుంచి మరో వ్యక్తితో కలిసి గురువారం సాయంత్రం బయటకు రాగా.. బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు పలు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన ఆయనను కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. పొలిటికల్ ప్రత్యర్థుల పనేనా.. ఇక, కాల్పుల ఘటన ఆయన నివాసం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. మరోవైపు.. ఎస్పీ హేమ్రాజ్ మీనాతో సహా పోలీసు అధికారులందరూ సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. అనూజ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. అనూజ్‌పై కాల్పుల ఘటనలో అస్మోలీ బ్లాక్ చీఫ్ కుమారుడు అనికేత్‌పై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్ట తెలిపారు. ఇక, అనూజ్ హత్యలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు అమిత్, అనికేత్లుగా బాధిత కుటుంబం తెలిపింది. BJP Leader Anuj Chaudhary Shot dead on day light in Uttar Pradesh But still it's The Best Law & Order state in Bharatvarsh according to Bhakts 🙏#NarendraModi #NarendraModiji #NoConfidenceMotion #NoConfidence #NoConfidenceDebate #PMModi #earthquake #MohanLal #OMG2 #Gadar2 #UP pic.twitter.com/PnmhWMAyDA — Dr Jain (@DrJain21) August 11, 2023 ఇదిలా ఉండగా.. స్థానిక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తోన్న అనూజ్.. రెండేళ్ల కిందట జరిగిన యూపీ బ్లాక్ చీఫ్ ఎన్నికల్లో శంభాల్లోని అస్మోలీ బ్లాక్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. అనూజ్‌కు బీజేపీ కీలక నాయకులు, మంత్రులతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. రాజకీయ ప్రత్యర్థులే హత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: మోదీకి కాంగ్రెస్ ఫోబియా -
ఘోర ప్రమాదం.. చిన్నారి సహా ఎనిమిది మంది మృత్యువాత
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ వ్యాన్‌ను ట్రక్కు ఢీకొట్టడంతో ఓ చిన్నారి సహా ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. మరో 12 మందికిపైగా గాయాలయ్యాయి. మోరాదాబాద్ జిల్లాలోని ఖైర్‌ఖాతా గ్రామ సమీపంలోని దల్పత్పూర్-కాశీపూర్ రహదారిపై ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. ఓ వివాహ వేడుకకు హజరయ్యేందుకు కుటుంబ సభ్యులు, బంధువులంతా వ్యాన్‌లో వెళ్తున్నారు. ఇంతలో అతివేగంతో వెళ్తున్న ట్రక్కు పికప్ వ్యాన్‌ను ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో వ్యాన్‌పై లారీ బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న చాలా మంది ప్రయాణికులు శిథిలాల కింద చిక్కుకుపోవడంతో అధికారులు.. చాలా కష్టం మీద వారిని బయటకు తీశారు. ఈ ఘటనలో 15 మంది గాయపడగా వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో రెండు వాహనాల్లో ప్రయాణికులు ఉన్నారు. చదవండి: పుల్వామాలో ఉగ్రకుట్ర భగ్నం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం -
‘కిలాడి కపుల్’.. పెళ్లి పేరుతో 35 మందికి ట్రాప్.. కోటికిపైగా వసూల్!
లక్నో: మ్యారేజ్ బ్యూరోల్లో నకిలీ వివరాలతో మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. అలాంటి సంఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో వెలుగుచూసింది. నకిలీ మ్యాట్రిమోనియల్ ప్రోఫైల్స్ ద్వారా ఓ కిలాడి జంట ఏకంగా 35 మందిని మోసం చేసింది. వారికి సుమారు రూ.1.6 కోట్లకు టోకరా వేశారు దంపతులు. నకిలీ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న జంటను సైబర్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన మహిళ, జార్ఖండ్‌కు చెందిన వ్యక్తి కలిసి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఇద్దరు కలిసి ఇప్పటి వరకు 35 మందిని మోసగించారు. వారి నుంచి సుమారు రూ.1,63,83,000లు దోచుకున్నారు. ‘వివాహం పేరుతో తన కూతురి వద్ద రూ.27 లక్షలు తీసుకున్నారని ఓ సైనికాధికారి మొరాదాబాద్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సైబర్ సెల్ టీంతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. దర్యాప్తు చేపట్టిన టీం ఇద్దరిని అరెస్ట్ చేసింది. వారిని కోర్టులో ప్రవేశపెట్టాం. గత ఏడాదిన్నరగా సుమారు 35 మందిని మోసగించినట్లు తేలింది. అందమైన ఫోటోలతో మ్యాట్రిమేనియల్ సైట్స్‌లో ఆకర్షించేలా ప్రోఫైల్స్ పెడతారు. ఎవరైనా వారి కాంటాక్ట్‌లోకి వస్తే వారిని మాటల్లో పెట్టి మచ్చిక చేసుకుంటారు. ఆ తర్వాత వివిధ కారణాలతో డబ్బులు అడుగుతారు. అరెస్ట్ చేసిన వారు జార్ఖండ్‌కు చెందిన బబ్లూ కుమార్, బిహార్‌కు చెందిన పూజా కూమారిగా గుర్తించాం. ఇరువురికి వివాహం జరిగింది ’ అని వివరాలు వెల్లడించారు డీఎస్పీ అనూప్ కుమార్. ఇదీ చదవండి: Squid Game: ఒకేసారి 1415 మంది విద్యార్థుల ఆట.. వీరికి రికార్డులు కొత్తేం కాదు.. -
నగ్నంగా రోడ్డుపై గ్యాంగ్‌రేప్ బాధితురాలు.. ఆపై దిమ్మతిరిగే ట్విస్ట్!
లక్నో: సంచలనం సృష్టించిన వైరల్ వీడియోపై దిమ్మతిరిగిపోయే ప్రకటన ఇచ్చారు పోలీసులు. నగ్నంగా నడిరోడ్డుపై నిస్సహా స్థితిలో నడుచుకుంటూ వెళ్లిన అమ్మాయి(15) అత్యాచార బాధితురాలు కాదని, అసలు ఆమెపై అత్యాచారం జరగలేదని, వైద్య పరీక్షలోనూ అది నిర్ధారణ అయ్యిందని ప్రకటించారు. అంతేకాదు.. బాధితురాలిగా చెప్పుకుంటున్న అమ్మాయి తల్లిదండ్రుల స్టేట్మెంట్ సైతం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. మోరాదాబాద్ వైరల్ వీడియోపై యూపీ పోలీసులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నగ్నంగా ఓ అమ్మాయి నిస్సహాయ స్థితిలో నడిరోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న వీడియో అది. పదిహేను సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లోనూ చక్కర్లు కొట్టి.. స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ వైరల్ వీడియోలో ఉంది తన కుటుంబానికి చెందిన వ్యక్తే అని, ఆమె బంధువు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రక్తస్రావంతో ఆమె ఇంటికి చేరిందని, ఆమెపై గ్యాంగ్‌రేప్ జరిగిందని అందులో పేర్కొన్నాడు. భోజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 1వ తేదీన అఘాయిత్యం జరగ్గా.. 7న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో.. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమెను ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని పేర్కొంటూ ఐదుగురిని అరెస్ట్ కూడా చేసి.. జ్యూడీషియల్ కస్టడీకి తరలించారు. అయితే.. వైద్య పరీక్షలో బాధితురాలిపై అఘాయిత్యం జరిగినట్లు రుజువు కాలేదు. అయినప్పటికీ కేసులో దర్యాప్తు కొనసాగించారు పోలీసులు. ఈ లోపు.. మెజిస్ట్రేట్ ముందు బాధితురాలి తల్లిదండ్రుల స్టేట్మెంట్ అందరికీ షాక్ ఇచ్చింది. తమ కూతురిపై అసలు సామూహిక అత్యాచారం జరగలేదని, చిన్నప్పటి నుంచి మానసిక సంబంధిత సమస్యలతో ఆమె ఇబ్బందిపడుతోందని మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ కేసు ఎవరూ ఊహించని మలుపు తిరిగినట్లయ్యింది. అత్యాచారం జరగకుంటే.. ఆమెను ఆకతాయిలు వేధించి దుస్తులు విప్పించి నడిరోడ్డుపై నడిపించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేసులో దర్యాప్తు కొనసాగుతూ ఉంది. మరోవైపు నడిరోడ్డుపై నగ్నంగా ఓ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంటే సాయం చేయాల్సిందిపోయి.. వీడియోలు తీసి వైరల్ చేసిన యువకుల తీరుపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. Warning: Disturbing details ahead -
దారుణం.. మైనర్‌ను వివస్త్రను చేసి సామూహిక అత్యాచారం
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం వెలుగుచూసింది. 15 ఏళ్ల బాలికను వివస్త్రను చేసి సామూహిక అత్యాచారనికి పాల్పడ్డారు నలుగురు కిరాతకులు. మొరాదాబాద్ జిల్లాలో సెప్టెంబర్ 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక పక్క గ్రామంలో తిరనాళ్లకు వెళ్లినప్పుడు స్థానిక యువకులు ఆమెపై కన్నేసి ఈ క్రూర చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటన అనంతరం బాలిక నగ్నంగా తన స్వగ్రామానికి వెళ్తుండగా.. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి అంకుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నలుగురు నిందితుల్లో ఇప్పటివరకు ఒక్కరిని మాత్రమే అరెస్టు చేశారు. అయితే సెప్టెంబర్ 7న తమకు ఫిర్యాదు అందిందని పోలీసుల చెప్పారు. బాధితురాలి తల్లిదండ్రులను అడిగితే తమ కూతురికి జరిగిన విషయం చెప్పలేదని పేర్కొన్నారు. అయినా తాము దర్యాప్తు చేపట్టి నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామన్నారు. విచారణ కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. చదవండి: హోటల్ రూమ్‌లో లవర్‌తో భర్త రాసలీలలు.. భార్య ఎంట్రీతో సీన్ రివర్స్! -
ఘోర అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి దుర్మరణం
లక్నో: అర్ధరాత్రి చెలరేగిన భారీ అగ్నిప్రమాదంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉత్తర ప్రదేశ్ మోరాదాబాద్‌లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. మూడంతస్తుల బిల్డింగ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు నివసిస్తున్నారు. అందులో ఒకరికి ఫంక్షన్ హాల్ ఉంది. ఆ సామాన్లను బిల్డింగ్ కింది ఫ్లోర్లో ఉంచాడతను. అయితే గురువారం అర్ధరాత్రి దాటాక షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి.. ఆ సామాన్లు తగలబడ్డాయి. క్రమంగా మూడంతస్తుల బిల్డింగ్‌లో మంటలు చెలరేగి.. ఎగిసిపడ్డాయి. స్థానికులు అతికష్టం మీద ఏడుగురిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. ఐదు ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటల్లోంచి మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. వీళ్లలో ఐదుగురు గాయాలతో కన్నుమూశారు. మిగతా ఏడుగురిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉందని జిల్లా కలెక్టర్ శైలేందర్ కుమార్ సింగ్ వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు ఆయన తెలిపారు. #UPDATE | UP: Five people lost their lives while seven were injured after fire broke out in a 3-storey building in Moradabad. People of the same family were residing in the building. Fire dept conducting further probe to ascertain the reason: Shailendra Kumar Singh, DM, Moradabad https://t.co/dHNUTt8IyD pic.twitter.com/K32BLObSm9 — ANI UP/Uttarakhand (@ANINewsUP) August 25, 2022 -
దారుణం.. కూతుర్ని చంపమని సుపారీ ఇచ్చిన తండ్రి..
లక్నో: కన్నతండ్రే కూతురి పాలిట విలన్‌గా మారాడు. ఆమె ఓ యువకుడితో ప్రేమలో ఉందని తెలిసి మందలించాడు. అతడ్ని దూరం పెట్టమని పదే పదే హెచ్చరించాడు. అయినా ఆమె వినకపోవడంతో కిరాతక ఆలోచన చేశాడు. తన కుమార్తెను చంపమని హాస్పిటల్లో వార్డు బాయ్‌కి రూ.లక్ష సుపారీ ఇచ్చాడు. దీంతో అతడు ఆమెకు పోటాషియం క్లోరైడ్ అధిక మోతాదులో ఇంజెక్ట్ చేశాడు. ఫలితంగా యువతి తీవ్ర అనారోగ్యం పాలైంది. తండ్రితో పాటు వార్డు బాయ్, అతనికి సహకరించిన ఆస్పత్రిలో ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కూతురు ప్రేమలో ఉందని తెలిసి నవీన్ కుమార్ అనే తండ్రి ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తాను చెప్పినా వినడం లేదని ఆమెను హతమార్చాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆ యువతి ఆనారోగ్యంపాలైందని శుక్రవారం రాత్రి మొరాదాబాద్ జిల్లా కంకర్ఖేడాలోని ఆస్పత్రిలో చేర్పించాడు. ఆ తర్వాత కొద్ది గంటలకే ఆమెను ఫ్యూచర్ ఆస్పత్రికి మార్చాడు. కానీ కొద్ది సేపటికే యువతి ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. పొటాషియం క్లోరైడ్ అధిక మోతాదులో ఇచ్చినట్లు గుర్తించారు. వెంటనే సీసీటీవీని పరిశీలించగా అసలు విషయం తెలిసింది. వార్డు బాయ్‌గా పనిచేసే నరేశ్ కుమార్ యువతికి ఇంజెక్షన్ ఇచ్చాడు. అతడికి ఓ మహిళా ఉద్యోగి సహకరించింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన వారు యువతి తండ్రితో పాటు వార్డు బాయ్ నరేశ్ కుమార్, మహిళా ఉద్యోగిని అరెస్టు చేశారు. నరేశ్ నుంచి రూ.90వేలు స్వాధీనం చేసుకున్నారు. విచారణతో తండ్రి నేరం అంగీకరించాడు. అంతేకాదు తన కూతురు కోతులను చూసి భయపడిందని చెప్పి ఆస్పత్రిలో అడ్మిట్ చేశానని, కానీ నిజానికి ఆమె ఇంటిపై నుంచి దూకిందని వెల్లడించాడు. చదవండి: కన్నబిడ్డ హత్యకు వరుస ప్లాన్లు.. కసాయి తల్లిపై విచారణ -
రూ.600 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చిన డాక్టర్.. ఎందుకో తెలుసా?
ఇతరులకు సాయం చేయాలి అనిపించినా చేసే స్థోమత అందరికీ లేకపోవచ్చు. కొంతమంది ఆ సామర్థ్యం ఉన్నా సాయం చేసేందుకు మనసు ఒప్పదు. కానీ ఇందుకు భిన్నంగా కొందరు తమ స్థాయి గురించి ఆలోచించకుండా ప్రజాసేవే పరమావధి జీవిస్తుంటారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అర్వింద్ గోయల్ అనే డాక్టర్ కూడా అచ్చం ఇలాంటి వాడే. ఏకంగా తన యావదాస్తిని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చారు. అయితే ఆస్తి అనేగానే ఏదో 10, 20 లక్షలు, మహా అయితే కోటి రూపాయలు అనుకునేరు.. అక్షరాల 600 కోట్ల విలువైన ఆస్తిని పేదల సంక్షేమం,అభివృద్ధి కోసం యూపీ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చేశారు. దాదాపు 50 ఏళ్లుగా వైద్య వృత్తి ద్వారా ప్రజలకు సేవ చేస్తున్న అర్వింద్ గోయల్ కేవలం తన ఇంటిని మాత్రమే ఉంచుకొని మిగతా ఆస్తినంతా ఇచ్చేశారు. ఆస్తిని ఇచ్చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నిర్ణయం 25 ఏళ్ల క్రితమే తీసుకున్నట్లు తెలిపారు. కాగా రోనా లాక్డౌన్ సమయంలో వేల మందిని కష్టాల నుంచి ఆదుకున్నారు. మోరదాబాద్‌లోని 50 గ్రామాలను దత్తత తీసుకొని అన్ని రకాల వసతులను ఉచితంగా కల్పించారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం వంటి సదుపాయాలను అందించారు. చదవండి: ముగిసిన సోనియా గాంధీ ఈడీ విచారణ.. గోయల్ 100కు పైగా విద్యాసంస్థలు, వృద్ధాశ్రమాలు, ఆస్పత్రులకు ట్రస్టీగా ఉన్నారు. తన సేవలకుగాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సహా నలుగురు రాష్ట్రపతుల చేతులమీదుగా పలు పురస్కారాలు అందుకున్నారు. అరవింద్‌కు భార్య రేణు గోయల్‌తో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆస్తిని విరాళంగా ఇస్తానని చెప్పగానే కుటుంబసభ్యులు కూడా మద్దతు ఇచ్చారు. -
సినిమాలోనూ ఇలాంటి ట్విస్ట్ ఉండదేమో!.. చనిపోయి మళ్లీ బతికాడు.. వీడియో వైరల్
లక్నో: చనిపోయాడనుకున్న వ్యక్తి మళ్లీ బతకడం లాంటివి సినిమాలో చూసుంటాం. కానీ ఈ తరహా ఘటనే యూపీలోని మోరదాబాద్‌లో చోటుచేసుకుంది. ఆ వ్యక్తి చనిపోయాడనుకుని సుమారు 7 గంటలపాటు మార్చురీ ఉంచిన్నప్పటికీ సజీవంగా బతికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వివరాల్లోకి వెళితే.. మొరాదాబాద్ పౌరసరఫరాల సంస్థలో ఎలక్ట్రీషియన్ శ్రీకేష్ కుమార్ (40) పని చేస్తున్నాడు. గురువారం రాత్రి వేగంగా వస్తున్న బైక్ ఢీకొనడంతో శ్రీకేష్ కుమార్‌ను జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే ఆసుపత్రిలోని వైద్యులు అతను చనిపోయినట్లు ధ్రువీకరించి అతన్ని మార్చురీలో ఫ్రీజర్‌లో ఉంచి పోస్ట్‌మార్టం పరీక్ష పెండింగ్‌లో ఉంచారు. పంచనామ పూర్తి చేసి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించడానికి పోలీసులు వచ్చారు. ఆ సమయంలో శ్రీకేశ్ కుమార్ మృతదేహంలో కదలికలను అతని వదిన గుర్తించారు. ప్రస్తుతం అతని వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వెంటనే డాక్టర్లు శ్రీకేశ్కు చికిత్స అందించగా బతికి బయటపడ్డాడు. చదవండి: Viral Video: పెళ్లిలో డ్యాన్స్‌తో దుమ్మురేపిన వదిన.. అందరి చూపు ఆమె వైపే -
‘జనగణమన’ మరిచిపోయి దిక్కులు చూసిన ఎంపీ..!
లక్నో: స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు ఆదివారం దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో పలుచోట్ల అపశ్రుతి, తప్పులు దొర్లాయి. తాజాగా ఓ లోక్‌సభ సభ్యుడు జాతీయ గీతం ‘జనగణమన’ మరచిపోయారు. జెండా ఎగురవేసిన అనంతరం జాతీయ గీతం ఆళపిస్తుండగా ఎంపీ నోరు తిరగలేదు. ఆయనతో పాటు ఆయన అనుచరులు, కార్యకర్తలు కూడా జాతీయ గీతం పాడలేక అవస్థలు ఎదుర్కొన్నారు. కొందరు గీతం మరచిపోయి మధ్యలోనే ఆపివేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ఎస్టీ హసన్ ఉత్తరప్రదేశ్ మొరదాబాద్‌లోని గుల్షాహీద్ పార్క్ సమీపంలో స్వాతంత్ర్య వేడుకలకు హాజరయ్యారు. జెండా ఎగురవేసిన అనంతరం ఎంపీ హసన్‌తో పాటు ఆయన కార్యకర్తలు జనగణమన ప్రారంభించారు. వారు జాతీయ గీతాన్ని.పాడుతూ మధ్యలో మరచిపోయి ఇష్టమొచ్చినట్టు పాడారు. చివరకు జయ జయహే అనేది పూర్తిగా అనకుండానే ముగించారు. ఈ గీతం ఆళపిస్తుండగా ఎంపీ హసన్ బిత్తిరిచూపులు చూస్తుండడం వైరల్‌గా మారింది. ఈ సంఘటన రాజకీయ దుమారం రేపింది. ‘ఎంపీ, ఆయన కార్యకర్తలు జాతీయ గీతాన్ని పాడలేకపోయారు. మన నేతల పరిస్థితి ఇలా ఉంది’ అని బీజేపీ సీనియర్ నాయకుడు సంబిత్ పాత్ర ట్వీట్ చేస్తూ ఎద్దేవా చేశారు. So finally they thought that the best way out of the mess that they had created was to quickly move on to “जय है” ..and then move out .. वाह समाजवादियों वाह!! pic.twitter.com/BbqFffanMi — Sambit Patra (@sambitswaraj) August 15, 2021 -
ఉత్తరప్రదేశ్: మొరాదాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
-
‘యముండా’ మాస్క్ లేకుంటే తాటతీస్తా
మొరదాబాద్: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పిస్తున్నారు. మాస్క్‌లు ధరించండి.. భౌతిక దూరం పాటించండి.. శానిటైజర్ వినియోగించండి అంటూ చెబుతూ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో చేసిన అవగాహన దేశం దృష్టిని ఆకర్షించింది. యమధర్మరాజు వేషధారణలో గద.. పాశం ధరించి భీకర రూపంలో ఓ వ్యక్తి చేస్తున్న ప్రచారం అందరినీ ఆకట్టుకుంది. ‘భూలోకవాసుల్లారా మాస్కులు ధరించండి.. భౌతిక దూరం పాటించండి’ మొరదాబాద్ గల్లీలో నల్లటి వస్త్రాలు ధరించి కిరీటం, గదధారుడై ఓ స్థానిక కళాకారుడు యజధర్మరాజు రూపంలో వచ్చి కరోనా జాగ్రత్తలు వివరించాడు. కరోనా మళ్లీ విజృంభిస్తోంది.. జాగ్రత్తగా ఉండండి అని సూచించాడు. మాస్క్ ధరించకపోతే నేనొస్తా అంటూ పరోక్షంగా కరోనా సోకి మృతి చెందితే యమధర్మరాజుగా తానొస్తానంటూ హెచ్చరికలు జారీ చేస్తూ వెళ్లాడు. ఉత్తరప్రదేశ్‌లో తీవ్రస్థాయిలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పాక్షిక లాక్డౌన్ కొనసాగుతోంది. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చర్యలు చేపట్టారు. ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 6,54,404 నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 8,474 కేసులు వెలుగులోకి వచ్చింది. -
పడిలేచిన ‘ప్రగతి’!
అవయవాలన్నీ బాగున్నప్పటికీ కష్టపడకుండా ఎవరో ఒకరి మీద ఆధారపడి జీవిస్తుంటారు కొందరు. రెండు చేతులు కోల్పోయిన ఓ అమ్మాయి మాత్రం ఎవరి మీదా ఆధారపడకుండా, తన పనులు తానే చేసుకుంటూ, ఖర్చులకోసం సొంతంగా సంపాదిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన ప్రగతి దురదృష్ట వశాత్తు రెండు చేతులను కోల్పోయింది. 2010లో ప్రగతి అనుకోకుండా విద్యుత్ సరఫరా అవుతున్న వైర్‌ను పట్టుకోవడంతో..∙రెండు చేతులు కాలిపోయాయి. చికిత్సలో భాగంగా చేతులను మోచేయి వరకు డాక్టర్లు తొలగించారు. దీంతో తన రోజువారి పనులు చేసుకోవడానికి కూడా ప్రగతి చాలా కష్టపడేది. అయినా ఎలాగైనా ఎవరిసాయం తీసుకోకుండా బతకాలనుకుంది. క్రమంగా తన ఆత్మవిశ్వాసం పెంపొందించుకుని మొబైల్ ఫోన్, కంప్యూటర్లను ఆపరేట్ చేయడం నేర్చుకుంది. అంతేగాకుండా ఒకపక్క విద్యార్థులకు పాఠాలు చెబుతూ మరోపక్క బ్యాంక్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ‘‘ఎన్ని కష్టాలు ఎదురైనా అమ్మాయిలు తమ కలల్ని నిజం చేసుకోవడంలో వెనక్కి తగ్గకుండా కష్టపడి సాధించాలి’’ అని ప్రగతి చెప్పింది. మొదట్లో తన పనులు తాను చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. క్రమంగా పనులు చేసుకోవడం మొదలు పెట్టాను. అలా పనులు చేసుకోవడం వల్ల ఏదైనా చేయగలను అనిపించింది. ఈ క్రమంలోనే ఫోన్ ఆపరేట్ చేయగలిగాను. తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశ్యంతో టీచర్‌గా పనిచేస్తూ సంపాదిస్తున్నానని, భవిష్యత్తులో బ్యాంక్ ఉద్యోగం పొందడమే తన కలని ప్రగతి చెప్పింది. -
డాక్టర్లను కొట్టారు.. కరోనా సోకింది
మొరదాబాద్: వైద్య సిబ్బంది, పోలీసులపై దాడికి పాల్పడిన ఐదుగురికి కరోనా వైరస్ సోకింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్ జిల్లాలో ఈ నెల 15న ఈ దాడి జరిగింది. ఇద్దరు మహిళలు, 8 మంది పురుషులతో పాటు 10 మందిని ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఐదుగురు కోవిడ్ బారిన పడినట్టు మొరదాబాద్ ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ఎంసీ గార్గ్ మంగళవారం వెల్లడించారు. ‘జైలు నుంచి 11 నమూనాలు పరీక్షల కోసం పంపించగా ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇందులో 10 మంది కరోనా హాట్‌స్పాట్‌కు చెందిన వారు. వైద్య, పోలీసు సిబ్బందిపై రాళ్లు విసిరిన కేసులో వీరు నిందితులు. ఒక వ్యక్తి మరో కేసులో అరెస్టయ్యాడు. వీరితో కాంటాక్ట్‌లో ఉన్నవారందరినీ క్వారంటైన్ చేస్తామ’ని డాక్టర్ గార్గ్ చెప్పారు. (పాపం.. కరోనా కాటుకు డాక్టర్ మృతి) కోవిడ్-19 మృతుడి కుటుంబ సభ్యులను తీసుకొచ్చేందుకు అంబులెన్స్‌లో వెళ్లిన వైద్య సిబ్బంది, పోలీసులపై ఈ నెల 15న స్థానికులు రాళ్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే.ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. నేషనల్ సెక్యూరిటి యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కావడంతో అవి కూడా వారితోనే కట్టించాలని పోలీసులను ఆదేశించారు. కాగా, కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు 1294 కరోనా పాజిటివ్ నమోదు కాగా, 20 మంది మృతి చెందారు. 140 మంది కరోనా నుంచి కోలుకున్నారు. లాక్డౌన్: కేంద్రం వివాదాస్పద ప్రకటన -
పాపం.. కరోనా కాటుకు డాక్టర్ మృతి
మొరదాబాద్(యూపీ): కరోనా పోరాటంలో ముందుండి పోరాడుతున్న వైద్యులను కూడా మహమ్మారి బలి తీసుకుంటోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో ఓ వైద్యుడు కరోనా కాటుకు బలైయ్యారు. కోవిడ్-19 సోకిన వైద్యుడొకరు.. తీర్థంకర్ మహవీర్ యూరివర్సిటీ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ప్రాణాలు కోల్పోయినట్టు మొరదాబాద్ ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ఎంసీ గార్గ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో కరోనా వైరస్ కారణంగా వైద్యుడు మృతి చెందడం ఇదే మొదటిసారి. మొరదాబాద్ నుంచి తబ్లిగీ జమాత్ సమ్మేళనానికి హాజరైన వారిని గుర్తించడానికి నిర్వహించిన సర్వేలో సదరు డాక్టర్ కూడా పాల్గొన్నారు. ఏప్రిల్ 10న ఆయనకు కోవిడ్ సోకినట్టు గుర్తించారు. పరిస్ధితి విషమంగా మారడంతో తర్వాతి రోజు ఆయనను ఐసీయూకు తరలించారు. గత ఐదు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, చికిత్స కూడా ఆయన స్పందించలేదని వైద్యులు తెలిపారు. కాగా, కేంద్ర వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకు 1176 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 18 మంది మృత్యువాత పడ్డారు. కోవిడ్-19 సోకినప్పటికీ 129 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 17,656 కాగా, మృతుల సంఖ్య 559గా తేలింది. 2,842 మంది కరోనా నుంచి బయటపడ్డారని కేంద్ర వైద్యారోగ్య తాజాగా వెల్లడించింది. మా నాన్న మరణ వార్త విని బాధపడ్డా.. అంత్యక్రియలకు వెళ్లను -
వైద్య సిబ్బందిపై మరోదాడి!
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని మోరీదాబాద్‌లో వైద్య ఆరోగ్య సిబ్బందిపై దాడి చేసిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అనుమానితులను క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. అయితే ఈ క్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బందిపైన దాడులు చేస్తున్న ఘటనలు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అంతకు ముందు వైద్యుల పై జరిగిన దాడిని మరువక ముందే ఉత్తరప్రదేశ్‌లోని మోరీదాబాద్‌లో వైద్యాఆరోగ్య సిబ్బందిపై రాళ్లదాడికి పాల్పడ్డారు. మోరీదాబాద్‌లో ఇద్దరు కరోనా అనుమానితులు ఉన్నారనే సమాచారంతో వారిని తీసుకువచ్చేందుకు ప్రయత్నించిన వైద్య ఆరోగ్య సిబ్బందిపై అక్కడి వారు రాళ్ల దాడిచేశారు. అంతేకాకుండా వారిని రక్షించడానికి వచ్చిన పోలీసులపై కూడా ఇదే తరహాలో రాళ్లదాడికి పాల్పడ్డారు. #UPDATE Today a very unfortunate incident took place in Moradabad. A team of doctors had gone to take family of #COVID19 positive patient (who died recently), to take them to a quarantine facility. 3 people injured including a doctor & pharmacist: Dr SP Garh,Chief Medical Officer https://t.co/BFh2Ply4fO pic.twitter.com/tDgI9cLWmE — ANI UP (@ANINewsUP) April 15, 2020 ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన వారందరిని గుర్తించి వారిపై నేషనల్ సెక్యూరిటి యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని సీఎం యోగి ఆదిత్యనాధ్ పోలీసులను ఆదేశించారు. ప్రభుత్వఆస్తులు ధ్వంసం కావడంతో అవి కూడా వారితోనే కట్టించాలని ఆదేశించారు. ఈ దాడికి పాల్పడిన 10 మందిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకు భారత్‌లో 12,380 కరోనా కేసులు నమోదు కాగా 414 మంది మరణించారు. -
'ఆర్ఎస్ఎస్ బీజేపీ కీలుబొమ్మ కాదు'
మొరాదాబాద్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, దేశంలో నైతికత, సాంస్కృతిక, మానవ విలువలను పెంపొందించేందకు మాత్రమే పనిచేస్తుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. మొరాదాబాద్‌లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు నాలుగు రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొన్నారు. శనివారం ముగింపు కార్యక్రమం సందర్భంగా మొరాదాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. మోహన్ భగవత్ మాట్లాడుతూ.. దేశంలో జరిగే ఎలాంటి ఎన్నికలైనా తాము పరిగణలోకి తీసుకోమని, గత 60 సంవత్సరాలుగా దేశ అత్యున్నత విలువలను కాపాడడమే ముఖ్యమని పేర్కొన్నారు. తమకు రాజకీయాల కన్నా 130 కోట్ల మంది భారతీయుల నైతిక విలువలే తమకు ముఖ్యమని, వారికోసమే ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా బీజేపీ చేతిలో ఆర్ఎస్ఎస్ ఒక కీలు బొమ్మ అంటూ వచ్చిన ఆరోపణలను భగవత్ ఖండించారు. 1925 లో ఆర్ఎస్ఎస్ ఏర్పడినప్పుడు చాలా కొద్ది మంది వ్యక్తులతో మాత్రమే ప్రారంభమయిందన్న విషయాన్ని గుర్తుచేశారు. కాగా కాలక్రమంలో మా సంస్థ దేశ నిర్మాణానికి నిరంతర అంకితభావంతో ముందుకు సాగినట్లు పేర్కొన్నారు. దీని ఫలితమే ప్రసుత్తం దేశవ్యాప్తంగా 1.3 లక్షల సభ్యత్వాన్ని ఆర్ఎస్ఎస్ కలిగి ఉండడం తమ అదృష్టంగా భావిస్తున్నామని భగవత్ వెల్లడించారు. దేశంలోని చాలా మంది అగ్రశ్రేణి మేధావులు, సామాజిక సంస్కర్తలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను తమ భావజాలంలో పుణికిపుచ్చుకోవడం తాము సాధించిన గొప్ప విజయమని అన్నారు. రష్యా, చైనా, అమెరికా దేశాలు అభివృద్ధి పరంగా శక్తివంతమైన దేశాలుగా ముందుకు సాగుతున్నప్పటికి వాటి వల్ల ఇతర దేశాలకు కలుగుతున్న సమస్యలను చూస్తుంటే వారు తమ గౌరవాన్ని కోల్పోతున్నారని వివరించారు. గంటపాటు తన ప్రసంగాన్ని కొనసాగించిన మోహన్ భగవత్ పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)లపై ఏ విధమైన వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. -
వలేసి పట్టుకుని.. తాళ్లతో చేతులు కట్టేసి
మొరదాబాద్: బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ మాజీ బాడీగార్డ్ ఒకరు పిచ్చాసుపత్రి పాలయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్ నగరంలో రద్దీ రోడ్లపై బీభత్సం సృష్టించడంతో అతడిని గురువారం మెంటల్ ఆస్పత్రికి తరలించారు. అనాస్ ఖురేషి గతంలో ఏడాదిన్నర పాటు సల్మాన్‌ఖాన్ దగ్గర బాడీగార్డ్‌గా పనిచేశాడు. బుధవారం సాయంత్రం జిమ్‌కు వెళ్లేముందు పెద్ద మొత్తంలో అతడు మెడిసిన్స్ తీసుకున్నాడు. ఎక్కువ బరువులు ఎత్తేందుకు, శారీరక సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడే ఔషధాలను ఎక్కువగా తీసుకోవడంతో వాటి ప్రభావం కారణంగా రోడ్డుపై హల్చల్ చేశాడు. గురువారం ఉదయం అతడి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పాదచారులపై అకారణంగా దాడులకు దిగాడు. ఇనుప కడ్డీ తీసుకుని కార్ల అద్దాలు పగలగొట్టాడు. అతడిని కంట్రోల్ చేసేందుకు ప్రత్యక్ష సాక్షి ఒకరు పోలీసులకు సమాచారం అందించాడు. స్థానికుల సహాయంతో అనాస్‌ను పోలీసులు అడ్డుకున్నారు. చేపల వల సాయంతో అతడిని బంధించి తాళ్లతో కట్టేసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మోతాదుకు మించి ఔషధాలు సేవించడం వల్ల అనాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంటూ బరేలీలోని మెంటల్ ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని మంత్రి వద్ద అంగ రక్షకుడిగా పనిచేస్తున్న అనాస్ గత పది రోజులుగా తన సొంతూరు మొరదాబాద్‌లో ఉన్నాడు. ఇటీవల నిర్వహించిన మిస్టర్ మొరదాబాద్ చాంపియన్‌షిప్‌లో రెండో స్థానంలో నిలిచాడు. -
ఘోర రోడ్డుప్రమాదం : ఆరుగురు మృతి
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని మోరాదాబాద్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. 30 మందితో వెళ్తున్న ట్రాక్టర్ దిలారీలో అదుపుతప్పి బోల్తా పడింది. నఖుంకా గ్రామంలో పుట్టిన రోజు వేడుకలు ముగించుకొని భజల్‌పూర్ గ్రామానికి తిరిగి వెలుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఆరు నెలల పాపతోపాటూ ఓ బాలుడు ఉన్నారు. మరో ముగ్గురి పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులు జ్యోతి(6నెలలు), మోను(10), బిస్మా(50), పరమేశ్వరి(40), గబ్బర్(35), షీలా(40)గా గుర్తించారు. -
వాద్రాజీ రండి.. అబ్బే తొందరేం లేదు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా రాజకీయాల్లోకి రాబోతున్నానని సంకేతాలు ఇవ్వడంతో ఆయనను ఆహ్వానిస్తూ తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. మొరాదాబాద్ వాద్రా స్వస్థలం కావడంతో స్థానిక మద్దతుదారులు ఆయనకు అనుకూలంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు పెట్టారు. ‘మొరాదాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా రాబర్ట్ వాద్రాజీనీ ఆహ్వానిస్తున్నాం’ అని వారు ఫ్లెక్సీల్లో రాశారు. మనీలాండరింగ్ కేసు నుంచి విముక్తి పొందగానే ప్రజాసేవలో మరింత పెద్దపాత్ర పోషించాలని ఆశిస్తున్నట్టు వాద్రా ఆదివారం ఫేస్బుక్లో చేసిన ఓ పోస్టులో పేర్కొనడం పలువురిని ఆశ్చర్యపరించింది. ఆయన రాజకీయాల్లోకి రాబోత్తున్నట్టు పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం.. చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో సోమవారం ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడిన రాబర్ట్ వాద్రా.. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న మాట నిజమే కానీ, అందుకు తొందరేమీ లేదని వివరణ ఇచ్చారు. మొదట తనపై వచ్చిన ఆరోపణలు తప్పు అని రుజువు చేసుకోవాల్సిన అవసరముందని, ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడంపై కృషి చేస్తానని చెప్పారు. మరోవైపు వాద్రా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది. ప్రియాంక, రాహుల్ నడుపుతున్న సర్కస్.. జోకర్ కోసం ఎదురుచూస్తున్నదని, వాద్రా ఆ సర్కస్‌కు జోకర్ అని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఘాటుగా విమర్శించారు. -
పాలిటిక్స్‌లోకి ప్రియంకాగాంధీ భర్త!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజా జీవితంలోకి రావాలని ఉందంటూ రాజకీయ ప్రవేశంపై ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఫేస్బుక్ పోస్ట్ ద్వారా సంకేతాలు పంపిన నేపథ్యంలో ఆయనను రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ సోమవారం యూపీలోని మొరాదాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. ప్రియాంక గాంధీని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించి నెల తిరక్కుండానే ఆమె భర్త, వాణిజ్యవేత్త రాబర్ట్ వాద్రా రాజకీయాల్లో తాను చురుకైన పాత్ర పోషించాలనుకుంటున్నటు ఇటీవల సంకేతాలు పంపారు. తాను దేశ ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని, అయితే తాను రాజకీయాల్లోకి వస్తే భారీ వ్యత్యాసం ఉంటుందంటే ఎందుకు రాకూడదని ఆయన తన ఆకాంక్షను వెలిబుచ్చారు. ఇక మొరాదాబాద్‌లో వాద్రా పేరిట వెలిసిన పోస్టర్లు ఆసక్తికరంగా మారాయి. ‘రాబర్ట్ వాద్రాజీ మొరాదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేయాలని స్వాగతిస్తు’న్నామని ఆ పోస్టర్లలో పొందుపరిచారు. -
మొరాదాబాద్‌లో అదుపు తప్పి కారుపై పడ్డ వ్యాన్
-
నియమం పేరుతో కోడలిపై మామ అత్యాచారం..
లక్నో: నిఖా హలాల పేరుతో అత్యాచారానికి పాల్పడుతున్న ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నియమం పేరుతో తమ జీవితాలతో ఆడుకుంటున్నారని ఎంతో మంది ముస్లిం మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నిఖా హలాల పేరుతో కోడలిపై సొంత మావయ్యే అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. సొంత మావయ్యతో పాటు మరో నలుగురు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని యూపీకి చెందిన ఓ ముస్లిం మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొరదాబాద్ జిల్లాకి చెందిన ఓ మహిళకి 2014 డిసెంబర్లో వివాహం అయింది. పెళ్లి అయిన కొద్ది రోజులకే అత్తమామల వేధింపులు మొదయ్యాయి. 2015 డిసెంబర్లో ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఆమె తనను వేధిస్తున్నారంటూ భర్తతో పాటు అత్తమామలపై కేసు పెట్టారు. కొద్ది రోజులకి పెద్దలతో ఒప్పందం కుదుర్చుకొని మళ్లీ ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. దీంతో సదరు మహిళ కేసు వాపసు తీసుకున్నారు. అంతా సుఖాంతం అయిందన్న వేళ భర్త నిఖాహలాలను ముందుకు తీసుకొచ్చాడు. మనకు విడాకులయ్యాయని, ఆచారం ప్రకారం మరో పెళ్లి చేసుకోవాలని మహిళను సూచించాడు. మావయ్యతో కాపురం చెయ్యాలని వేధించాడు. గదిలో బంధించి... మామయ్యతో పెళ్లికి నిరాకరించిన ఆ మహిళను భర్త గదిలో బంధించారు. నియమం పేరుతో కోడలిపై అత్యాచారానికి పాల్పడిన మావయ్య మరుసటి రోజు విడాకులిచ్చారు. అనంతరం భర్త బంధువులైన మరో ముగ్గురు కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో గర్భం దాల్చిన సదరు మహిళ 2017లో బాబుకు జన్మనిచ్చింది. నిఖా హలాల పేరుతో అత్యాచారం చేసిన అత్తింటి వారిపై మహిళ ఆదివారం మొరదాబాద్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరిస్తున్నారని మహిళ వాపోయారు. సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిఖా హలాల్... ఇస్లాం నియమాల ప్రకారం విడాకులు పొందిన స్త్రీ, తిరిగి తన మాజీ భర్తను మళ్లీ వివాహం చేసుకోవాలంటే ముందు ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకోవాలి. తర్వాత ఆ భర్తకు విడాకులైన ఇవ్వాలి, లేదా అతను మరణించేంత వరకూ ఎదురు చూడాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే ఆ జంట మళ్లీ కలిసుండటానికి ఇస్లాం ఒప్పుకుంటుంది. -
క్యూ లైన్లలో లొల్లి లేకుండా..
మొరాదాబాద్: బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలు కొనసాగుతున్నాయి. క్యాష్ కొరతతో ఏటీఎంలలో బ్యాంకు సిబ్బంది డబ్బు నింపడం లేదు. అందువల్ల ఎక్కువ శాతం ఏటీఎంల వద్ద నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఏటీఎంలలో డబ్బు నింపినా.. ఆ పక్కనే ఉన్నవారికి తెలిసేలోపే క్యాష్ అయిపోతుంది. దీంతో బ్యాంకు సిబ్బంది డబ్బు నింపేలోపే ఏటీఎంల వద్ద జనం క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల క్యూ లైన్లలోని జనంలో పెరిగిపోతున్న అసహనం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. చాలా చోట్ల ఘర్షణలు నివారించేందుకు పోలీసులు క్యూలను నియంత్రిస్తున్నారు. అయితే.. ఉత్తర ప్రదేశ్ మొరాదాబాద్‌లోని ఏటీఎంల వద్ద ఉద్రిక్తతలకు తావు లేకుండా జనం కొత్త పద్దతిని అనుసరిస్తున్నారు. క్యూలో నిలుచున్న జనం చేతిపైనే వారి సీరియల్ నంబర్‌ను మార్కర్‌తో రాస్తున్నారు. దీంతో క్యూ లైన్లలో తలెత్తే ఘర్షణలను నివారిస్తున్నామని స్థానికులు వెల్లడించారు. -
ఇక అది జనధనమే
జన్‌ధన్ ఖాతాల్లో జమ అయిన నల్లధనం పేదలకే ఆ ఖాతాల్లో డిపాజిట్ చేసిన నల్ల కుబేరులు జైలుకే - అవినీతికి వ్యతిరేకంగా పోరాటం నేరమా? చేయొద్దా? - 70 ఏళ్లుగా క్యూలోనే నిలబడ్డ ప్రజలకు ఇదే చివరి క్యూ - నిజాయితీపరులు బ్యాంకు ముందు, అవినీతిపరులు పేదల ఇళ్ల ముందు క్యూ - వ్యతిరేకులు నన్నేం చేయగలరు? నేనో ఫకీర్ని.. - ప్రజలే నా నాయకులు... నాకు హైకమాండ్ లేదు - బిచ్చగాడు సైతం స్వైపింగ్ మిషన్ వాడుతున్నాడు - మొరాదాబాద్ బీజేపీ పరివర్తన్ ర్యాలీలో ప్రధాని మోదీ కొందరు నన్ను నేరస్తుడిగా పిలుస్తున్నారు. గత 70 ఏళ్లుగా ఈ దేశంలో నెలకొన్న అన్ని అనర్థాలకు ప్రధాన కారణమైన అవినీతికి వ్యతిరేకంగా పోరాటం నేరమా?.. నేనేదో నేరం చేసినట్లు ప్రతిపక్షాలు నన్ను ఇబ్బంది పెడుతున్నారుు. నా ప్రత్యర్థులు నన్నేం చేయగలరు. నేనొక ఫకీర్‌ను... నా కొద్దిపాటి వస్తువులతో నేను వెళ్లిపోగలను. ఎంతవరకూ వాస్తవమో తెలియదు కానీ.. వాట్సప్‌లో ఓ వీడియో హల్చల్ చేస్త్తోంది. ఒక వ్యక్తి తన వద్ద చిల్లర లేదని బిచ్చగాడికి చెబుతాడు. దీంతో బిచ్చగాడు స్వైపింగ్ మిషన్ బయటకు తీసి డెబిట్ కార్డు ఇమ్మంటాడు. అవినీతిపరులు, ధనవంతులు క్యూలో నిలబడి తమ డబ్బు బ్యాంకుల్లో డిపాజిట్ చేయమని పేదల్ని కోరుతున్నారు. బ్యాంకుల ముందు నిలబడకుండా పేదల ఇళ్లముందు వారు క్యూ కడుతున్నారు. క్యూలలో గంటల కొద్దీ నిలబడ్డ దేశ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నా. క్యూలపై విపరీతంగా బాధపడుతున్న రాజకీయ నాయకుల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. మీరు స్వాతంత్య్రం తర్వాత మొత్తం దేశాన్ని దాదాపు 70 ఏళ్లు క్యూలో నిలబెట్టారు. పంచదార, కిరోసిన్, గోధుమల కోసం గతంలో క్యూలో నిలబడాల్సిన పరిస్థితి. అలాంటి క్యూలకు ముగింపు పలికేందుకు ఇదే చివరి క్యూ. మొరాదాబాద్ : జన్‌ధన్ ఖాతాల్లో చేరిన నల్లధనం పేదలకే చెందుతుందని, ఆ ఖాతాల్లో నగదు డిపాజిట్ చేసిన అవినీతిపరుల్ని ఎలా జైలుకు పంపాలన్న అంశంపై సమాలోచనలు చేస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలపై రాజకీయ ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నిత్యావసరాల కోసం 70 ఏళ్లుగా రోజూ వరుసలో నిలబడుతున్న వారికి ఇక ఇదే చివరి క్యూ అని అన్నారు. త్వరలో యూపీ ఎన్నికల నేపథ్యంలో మొరాదాబాద్‌లో నిర్వహించిన బీజేపీ పరివర్తన్ యాత్రలో శనివారం మోదీ ప్రసంగించారు.‘జన్‌ధన్ ఖాతాల్లో ఇతరులు డబ్బులు వేస్తే వాటిని తిరిగి ఇవ్వక్కర్లేదు. మీరు అలా చేస్తానని వాగ్దానం చేస్తే... అక్రమంగా డబ్బును మీ ఖాతాల్లో వేసిన వారిని జైలుకు పంపేందుకు ఒక ప్రణాళిక తెస్తా. ఆ డబ్బు పేదలకే చెందుతుంది’ అని అన్నారు. అక్రమార్కులు ఈ ధనాన్ని పేదల నుంచి దోచుకుని ఏన్నో ఏళ్లుగా పేదల కోసం ఎలాంటి మంచి చేయడం లేదన్నారు. ‘క్యూలలో గంటల కొద్దీ నిలబడ్డ దేశ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నా. క్యూలపై విపరీతంగా బాధపడుతున్న రాజకీయ నాయకుల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. మీరు స్వాతంత్య్రం తర్వాత మొత్తం దేశాన్ని దాదాపు 70 సంవత్సరాలు క్యూలో నిలబెట్టారు. పంచదార, కిరోసిన్, గోధుమల కోసం గతంలో క్యూలో నిలబడాల్సిన పరిస్థితి. అలాంటి క్యూలకు ముగింపు పలికేందుకు ఇదే చివరి క్యూ’ అని వ్యాఖ్యానించారు. వారిని నేను సరిచేస్తా ‘గతంలో డబ్బు డబ్బు అని, ఇప్పుడు మోదీ జపం చేస్తున్నవారిని సరిచేస్తా.. అవినీతిపరులు, ధనవంతులు క్యూలో నిలబడి తమ డబ్బు బ్యాంకుల్లో డిపాజిట్ చేయమని పేదల్ని కోరుతున్నారు. బ్యాంకుల ముందు నిలబడకుండా పేదల ఇళ్లముందు వారు క్యూ కడుతున్నారు’ అని మోదీ విమర్శించారు. ఏం జరిగినా ఈ పోరాటం ఆగదు నోట్ల రద్దు విషయంలో ప్రతిపక్షాలు తనను నేరస్తుడిగా పేర్కొంటున్నాయని ఆరోపించారు. ‘‘ కొందరు నన్ను నేరస్తుడిగా పిలుస్తున్నారు. గత 70 ఏళ్లుగా ఈ దేశంలో నెలకొన్న అన్ని అనర్థాలకు ప్రధాన కారణమైన అవినీతికి వ్యతిరేకంగా పోరాటం నేరమా?.. నేనేదో నేరం చేసినట్లు ప్రతిపక్షాలు నన్ను ఇబ్బంది పెడుతున్నారుు. నా ప్రత్యర్థులు నన్నేం చేయగలరు. నేనొక ఫకీర్‌ను... నా కొద్దిపాటి వస్తువులతో నేను వెళ్లిపోగలను’ అని చెప్పారు. కాంగ్రెస్‌ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శిస్తూ.. దేశంలోని 125 కోట్ల మంది ప్రజలే నాయకులని, తనకు హైకమాండ్ లేదన్నారు. అవినీతి దానంతట అదే పోదని, దానిని రూపుమాపాల్సి ఉందన్నారు. ప్రభుత్వాలు కేవలం ప్రకటనలు చేయడానికే పరిమితం కాకూడదని... పథకాల్ని ప్రారంభించి, వాటిని సమర్థంగా అమలయ్యేలా చూడాలన్నారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీలు కేవలం తమ కోసం, సన్నిహితుల కోసం పనిచేశాయని, పేదల కోసం ఏమీ చేయలేదని విమర్శించారు. దాచుకున్న వారే విమర్శిస్తున్నారు... ‘అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయకూడదా? అవినీతి వ్యతిరేక పోరాటం నేరమా? అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతుంటే తప్పు చేస్తున్నానని ఎందుకు కొందరు విమర్శిస్తున్నారు? డబ్బు దాచుకున్న వారే నన్ను విమర్శిస్తున్నారు’ అని అన్నారు. అవినీతి నిర్మూలనకు క్యూలో నిలబడడం తప్పనిసరి ‘ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఉంటాయని నేను ముందే చెప్పాను. పరిస్థితులు మెరుగుపడతారుు. మీరు నగదు విత్‌డ్రా కోసం క్యూలలో నిలబడవచ్చు. అరుుతే అవినీతి నిర్మూలనకు అది తప్పనిసరి’ అని అన్నారు. విద్యుత్ సరఫరా లేని 18 వేల గ్రామాలకు వెరుు్య రోజుల్లో సరఫరా చేస్తామని రెడ్ ఫోర్ట్ నుంచి ప్రకటించానని, ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్ సరఫరా లేని 1000 గ్రామాలుండగా... సగం సమయంలోనే ఆ రాష్ట్రంలో 950 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని ప్రధాని తెలిపారు. బిచ్చగాడి దగ్గరా స్వైపింగ్ మిషన్ చివరికి బిచ్చగాడు కూడా అడుక్కునేందుకు స్వైపింగ్ మిషన్ వాడుతున్నాడని, ప్రజలు కూడా డిజిటల్ చెల్లింపులకు మారాలంటూ మోదీ ఒక వాట్సప్ వీడియోను ఉదహరించారు. ‘ఎంతవరకూ వాస్తవమో తెలియదు కానీ... వాట్సప్‌లో ఒక వీడియో హల్చల్ చేస్తోంది. ఒక వ్యక్తి తన వద్ద చిల్లర లేదని బిచ్చగాడికి చెబుతాడు. ఇంతలో బిచ్చగాడు ఆందోళన వద్దంటూ స్వైపింగ్ మిషన్ బయటకు తీసి డెబిట్ కార్డు ఇమ్మని అడుగుతాడు’ అంటూ ప్రధాని అనగానే బహిరంగసభలో నవ్వులు పూశారుు. నిర్ణయం వెనుక ఉద్దేశం సరైనదైతే కొత్త విషయాల్ని అంగీకరించేందుకు భారతీయులు ఎక్కువ సమయం తీసుకోరని మోదీ పేర్కొన్నారు. డిజిటల్‌కు మారండి ప్రజలు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు మారాలని మోదీ సూచించారు. మొబైల్ ఫోన్లను వాలెట్లుగా వాడాలని, ప్లాస్టిక్ మనీని ఉపయోగించాలని, దాంతో నగదు అవసరముండదన్నారు. దేశవ్యాప్తంగా 40 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయని, వాటి ద్వారా నగదు రహిత చెల్లింపులు చేయాలన్నారు. ‘ఈ రోజుల్లో మొబైల్ బ్యాకింగ్, నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ప్రతీది దొరుకుతుంది. మీ ఫోన్లో కేవలం యాప్ డౌన్లోడ్ చేసుకోవడమే... బ్యాంకులకు వెళ్లకుండా, క్యూలో నిలబడకుండా ప్రతీది సాధ్యమవుతుంది’ అని పేర్కొన్నారు. మార్పును ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, దేశం ఇంకా సాంకేతికంగా అభివృద్ధి చెందలేదని చెపుతున్న వారిని మోదీ తప్పుపట్టారు. ‘అదే ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే సమయంలో బటన్ నొక్కే ఎన్నుకున్నారన్న విషయం గుర్తుంచుకోవాలి’ అని ప్రతిపక్షాలకు సూచించారు.దేశం నుంచి పేదరికం నిర్మూలించాలంటే ముందుగా పెద్ద రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి పేదరికాన్ని రూపుమాపాలన్నారు. స్వర్ణదేవాలయంలో వడ్డించిన మోదీ అమృత్సర్: హార్ట్ ఆఫ్ ఆసియా కాన్ఫరెన్సలో పాల్గొనేందుకు అమృత్సర్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అస్రఫ్ ఘనీలు శనివారం సాయంత్రం స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. ముందుగా చారిత్రక కారిడార్‌లో కొద్దిసేపు నడిచి అనంతరం స్వర్ణదేవాయాలనికి వెళ్లారు. ఈ సందర్భంగా భారీగా గుమిగూడిన ప్రజలు వారికి ఘన స్వా గతం పలికారు. వీరి రాక సందర్భంగా స్వర్ణ దేవాలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించారు. ఆలయంలో దాదాపు 30 నిమిషాలు గడిపిన మోదీ, ఘనీలు ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని వంటగదిలో భక్తులకు మోదీ ఆహారపదార్థాల్ని వడ్డించారు. ఇద్దరు అధినేతలకు ఆలయ నిర్వాహకులు 24 క్యారెట్ల స్వర్ణ దేవాలయం ప్రతిమను అందచేశారు. త్వరలో పంజాబ్‌లో ఎన్నికల నేపథ్యంలోనే మోదీ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించినట్లు కొందరు విశ్లేషిస్తున్నారు. ఘనీ, మోదీలు నేడు అమృత్‌సర్‌లో జరిగే హార్ ఆఫ్ ఆసియా మినిస్టీరియల్ సదస్సును ప్రారంభిస్తారు. -
ఆ డబ్బు అంతా మీకే వచ్చాలా చూస్తాను!
మొరాబాద్: ‘నాకు హైకమాండ్ లేదు. ప్రజలే నా హైకమాండ్. వారే నాకు ముఖ్యం. వారికే నేను నివేదిస్తాను’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌లో శనివారం జరిగిన పరివర్తన్ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ పెద్దనోట్ల రద్దుపై భావోద్వేగంగా మాట్లాడారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటం తన నేరమా? అవినీతి అంతానికి పోరాడినవాడు నేరస్తుడు అవుతాడా? అని ప్రశ్నించారు. కొందరు వ్యక్తులు తనను నిందిస్తుండటం చూసి ఆశ్చర్యం కలుగుతోందని, పేదల కోసం పనిచేయడమే తాను చేసిన తప్పా? అని ఆయన అన్నారు. ఆ డబ్బు అంతా మీకే వచ్చాలా చూస్తాను! ‘నేను మీ కోసమే ఈ యుద్ధాన్ని చేస్తున్నాను. ఆ అవినీతిపరులు నన్నేమీ చేయగలరు? మహా అయితే ఏం చేస్తారు? నేను ఫకీర్‌ను. జోలె సర్దుకొని ఏ క్షణమైన వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నాను’ అని పేర్కొన్నారు. ధనికులు ఇప్పుడు పేదల ఇళ్లముందు క్యూలు కడుతున్నారని, పెదలను పొగుడుతూ.. మీ జన్‌ధన్ ఖాతాల్లో రూ. 2-3 లక్షలు వేసుకోమని బతిమిలాడుతున్నారని అన్నారు. శక్తిమంతులు, నిజాయితీపరులు ఇప్పుడు బ్యాంకుల ముందు క్యూలు కడుతున్నారని, ధనికులు మాత్రం రహస్యంగా పేదల ఇళ్ల ముందు క్యూలు కట్టి వారి జన్‌ధన్ ఖాతాల్లో డబ్బులు వేసుకోమని వేడుకుంటున్నారని అన్నారు. ‘ఎవరి డబ్బు అయినా మీ ఖాతాల్లో వేసుకుంటే.. అందులో ఒక్క పైసా కూడా విత్‌డ్రా చేయకండి. వాళ్లు మీ ఇంటి చుట్టూ చక్కర్లు కొడతారు. మిమ్మల్ని వేడుకుంటారు. మీ కాళ్ల మీద పడతారు. ఎవరైనా మిమ్మల్ని హెచ్చరిస్తే.. నేను ప్రధాని మోదీకి లేఖ రాస్తానని ధైర్యంగా చెప్పండి. మీ ఖాతాల్లో చేరిన నల్లధనాన్ని విత్‌డ్రా చేయబోమని హామీ ఇవ్వండి. అలా చేస్తే మీ ఖాతాల్లో డబ్బు వేసిన వారిని జైలుకు పంపించి.. ఆ డబ్బు మీ ఇంటికి చేరే మార్గాన్ని నేను కనిపెడతాను’ అని మోదీ స్పష్టం చేశారు. మీ జన్‌ధన్ ఖాతాలోని డబ్బులు వాపస్ ఇవ్వాలని ధనికులు అడిగితే.. ఎదురు ప్రశ్నించాలని, ఆధారాలు అడుగాలని ప్రధాని మోదీ సూచించారు. ఆ డబ్బు అంతా పేదలకే చెందేలా చేస్తానని హామీ ఇచ్చారు. కాలం మారిందని, కాలంతోపాటు మనమూ మారాలని సూచించారు. మొబైల్‌ఫోన్‌లోకే బ్యాంకు వచ్చేసిందని, మొబైల్ ఫోన్ ద్వారా కొనుగోళ్లు చేయవచ్చునని చెప్పారు. -
ఆ డబ్బు అంతా మీకే వచ్చాలా చూస్తాను!
-
కిలో ఉప్పు రూ.250!
-
కిలో ఉప్పు రూ.250!
మొరాదాబాద్: పాత పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. కొత్త నోట్ల కోసం బ్యాంకుల ముందు ప్రజలు భారీగా క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నలుగురు మరణించారు కూడా. కేంద్రం చర్యతో నిత్యవసర ధరలు విపరీతంగా పెరుగుతాయని వదందతులూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వదంతులను నిజం చేస్తూ ఉత్తరప్రదేశ్ లో కిలో ఉప్పు ధర ఏకంగా రూ.250లకు ఏగబాకిందనే పుకార్లు వినిపిస్తున్నాయి. శుక్రవారం ఉత్తరప్రదేశ్ నుంచి వెలువడిన వార్తలను బట్టి ఆ రాష్ట్రంలో ఉప్పు కొరత ఏర్పడిందని ప్రజలు భయాందోళనల్లో మునిగిపోయారు. ఇందుకు కారణం ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ పట్టణంలో కిలో ఉప్పు రూ.250లకు అమ్ముతున్నారనే వార్తలు వినిపించడమే. వార్తలపై స్పందించిన లక్నో జిల్లా మెజిస్ట్రేట్ సత్యేంద్ర సింగ్ పుకార్లను కొట్టిపారేశారు. ఉప్పుకు సంబంధించి రాష్ట్రంలో ఎలాంటి కొరత లేదని పేర్కొన్నారు. పుకార్లు సృష్టించిన వారిని అరెస్టు చేస్తామని చెప్పారు. పుకార్లను పట్టించుకోవద్దని లక్నో ఐజీ ప్రజలను కోరారు. -
మీనాక్షి.. ఎంతపని చేసింది!
మొరాదాబాద్: ఇద్దరు పరాయి పురుషులతో కలిసి ఉండగా చూసి, గోలచేశాడని భర్త నాలుకను కోసిపారేసిందో భార్య! ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో జరిగిన ఈ సంఘటన వివరాలను మొదరాబాద్ పోలీసులు మీడియాకు చెప్పారు. వారి కథనం ప్రకారం.. సంబల్ పట్టణానికి చెందిన జితేంద్ర అనే యువకుడు కొద్ది రోజుల కిందట తన భార్య మీనాక్షితో కలిసి మొరాదాబాద్ కు వలస వచ్చాడు. ఇటుకబట్టీల్లో కూలీగా పనిచేసే అతను.. ఓ ఇంట్లో అద్దెకుంటున్నాడు. ఆదివారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వచ్చిన జితేంద్ర.. తన ఇంటి బెడ్ రూమ్ లో దృశ్యాన్ని చూసి షాక్ అయ్యాడు. ఇద్దరు పరాయి మగవాళ్లతో మీనాక్షి దగ్గరగా ఉండటాన్ని చూసి.. వారిపై దాడికి యత్నించాడు. అంతలోపే మీనాక్షి, అతని ప్రియులు కలిసి జితేంద్రను బంధించారు. పదునైన చాకుతో మీనాక్షి తన భర్త నాలుకను కోసేసింది. తర్వాత ముగ్గురూ అక్కడి నుంచి తప్పించుకున్నారు. కొద్దిసేపటికి రక్తం మడుగులో పడిఉన్న జితేంద్రను ఇరుగుపొరుగువారు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. జితేంద్రకు ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు తొమ్మిది కుట్లువేసి నాలుకను సరిచేశారు. ఫిర్యాదుమేరకు రంగంలోకి దిగిన పోలీసులు జితేంద్ర కుటుంబసభ్యులను పిలిపించారు. మీనాక్షికి పెళ్లికి ముందే చాలామందితో సంబంధాలున్నాయని, పెళ్లయ్యాక కూడా విచ్చలవిడిగా ప్రవర్తించేదని, సొంత ఊళ్లో పరువు కాపాడుకునేందుకే మీనాక్షిని తీసుకుని జితేంద్ర మొరాదాబాద్ వచ్చాడని, అయినా కూడా ఆమె మారలేదని బాధితుడి బంధువులు పోలీసులకు చెప్పారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
మొరాదాబాద్‌లో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
-
మోరాబాద్‌లో పోలీసుల ఓవర్ యాక్షన్
-
ఔరా! ఆవు కథ
అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక వ్యక్తి ఒక ఆవు ఉండేది. అది ఒక రోజు ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడిపోయింది. అది సహాయం కోసం ఎన్నో గంటలు అరిచి గీపెట్టింది. చాలాసేపటి తర్వాత గాని ఆవు బావిలో పడిందని తెలుసుకోలేకపోయాడు ఆ యజమాని. ఇన్నాళ్లుగా తనకి ఎంతో సేవ చేసిన ఆవును కాపాడాలని అతను అనుకోలేదు. ఎందుకంటే అది ముసలిది. అంతేకాక ఆ బావిని కూడా మూసేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అందుకని దానిమీద మట్టి వేసి బావి నింపటం మంచిదని భావించాడు. ఆ పని చేయడానికి తనకు సహాయం చేయమని పక్కింటి వారిని కూడా పిలిచాడు. అతను పారతో బావిలోని ఆవుపై మట్టి వేయడం ప్రారంభించాడు. పక్కింటివారు కూడా పారలతో మట్టి వేస్తూ ఆయనకు సహాయం చేయసాగారు. ఏం జరుగుతోందో అర్ధం కాని ఆవు మొదట అంబా అరిచింది, తరువాత అరవకుండా ఉండిపోయింది. హమ్మయ్య ఆనుకున్నాడు. కొద్దిసేపు పారతో మట్టి వేసిన తరువాత బావిలోకి చూసిన ఆయన ఆశ్చర్యపోయాడు. తనపైన మట్టిపడుతున్న ప్రతిసారి ఆవు మట్టిని విదుల్చుకుంటూ ఆ మట్టిమీదే నిలబడి పైకి రాసాగింది. బావిలో నిండిన మట్టి మీదుగా ఎక్కి ఆవు పైకి వచ్చేసింది. ఆవు తెలివికి మెచ్చిన అతడు తన తప్పు తెలుసుకొని అప్పటి నుంచి ప్రేమగా చూడసాగాడు. ఇది వాట్సప్ లో చక్కర్లు కొడుతున్న కథ. దీనికి వ్యతిరేకంగా జరిగిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని మొరదాబాద్ లో సోమవారం చోటు చేసుకుంది. ఓ ఆవు 35 అడుగుల లోతున్న బావిలోకి పడిపోయింది. అయితే దాన్ని అలాగే వదిలేయాలని అక్కడి వారు అనుకోలేదు. బావిలో చిక్కుకుపోయిన మూగజీవిని ఎలాగైనా రక్షించాలనుకున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహకారంలో దాన్ని బావిలోంచి బయటకు తీశారు. తాళ్ల సహాయంలో ఆవును బావిలోంచి బయటకు లాగారు. సాధు జంతువు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మూగజీవాల మట్ల మనుషులకు మమకారం తగ్గలేదనడానికి ఈ ఉదంతం అద్దం పట్టింది. -
తృటిలో తప్పించుకున్న వరుణ్ గాంధీ
మొరదాబాద్ (ఉత్తరప్రదేశ్) : బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఉత్తరప్రదేశ్ లో ఓ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆదివారం రైతులతో సమావేశమవడానికి వెళుతున్న వరుణ్.. మార్గమధ్యంలో మొరదాబాద్-హరిద్వార్ జాతీయ రహదారిలో తన కోసం వేచి ఉన్న మద్దతుదార్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సమయంలో వరుణ్ ఉన్న వేదిక కూలిపోయింది. వేదికపై వరుణ్ తో పాటు స్థానిక ఎంపీ సర్వేశ్ కుమార్, మొరదాబాద్ మేయర్ వీనా అగర్వాల్ ఉన్నారు. ప్రమాదంలో ఎవ్వరూ గాయపడలేదని మొరదాబాద్ ఏఎస్పీ యస్విర్ సిన్హా తెలిపారు. -
చుక్కలు చూపించిన అక్కా చెల్లెళ్లు
మొరదాబాద్: ఈవ్ టీజింగ్‌కు పాల్పడిన ఓ ప్రబుద్ధుడికి ఇద్దరు అక్కా చెల్లెళ్లు బుద్ధి చెప్పారు. తమ జోలికి ఇంకోసారి రాకుండా అతడికి చుక్కలు చూపించారు. ఉత్తరప్రదేశ్‌లోని మోరదాబాద్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెకిలి చేష్టలకు పాల్పడిన ఆ వ్యక్తిని కాలర్ పట్టుకొని ఆ చెంపా ఈచెంపా వాయించడమే కాకుండా కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మొరదాబాద్‌లో పోలీసు ఉద్యోగాలపై అభిరుచి ఉన్న ఇద్దరు అక్కా చెల్లెల్లు ప్రతి రోజు ఉదయాన్నే రన్నింగ్‌కు వెళుతుంటారు. అదే సమయంలో రోడ్డుపక్కనే ఓ తోపుడుబండి పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్న ఓ వ్యక్తి వారిని అభ్యంతరమాటలు అనేవాడు. అలా కొద్ది రోజులుగా అతడిని సహించిన ఆ ఇద్దరు యువతులు చివరకు తమ ఆగ్రహం ఆపుకోలేక అతడిని ఈడ్చి తన్నారు. చెంపలు వాయించి, కాళ్లతో తన్నారు. దీంతో వారి దెబ్బలు తాళలేక తనను వదిలిపెట్టమని అతడు బ్రతిమాలికున్నాడు. అయినా, వదిలిపెట్టని ఆ అక్కా చెల్లెళ్లు అతడిని కాలర్ పట్టుకొని తీసుకెళ్లి పోలీసులకు పట్టించారు. -
వామ్మో... అంత కరెంట్ బిల్లా?
మొరదాబాద్: పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణసంకటం అంటే ఇదేనేమో. జాతీయ వినియోగదారుల దినోత్సవం రోజున ఉత్తరప్రదేశ్ లో విద్యుత్ శాఖ అధికారులు తమ నిర్లక్ష్యంతో ఓ వినియోగదారుడికి పెద్ద షాక్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (యూపీపీసీల్) అధికారులు పంపిన కరెంట్ బిల్లు చూసి సదరు వినియోగదారుడికి గుండె ఆగినంతపనైంది. రూ.232 కోట్లు కట్టాలని బిల్లు ఇవ్వడంతో అతడు అవాక్కయ్యాడు. మొరదాబాద్ లో ఓ చిన్న పరిశ్రమ నడుపుతున్న పరాగ్ మిత్తల్ అనే వ్యక్తి ఈ భారీ బిల్లు వచ్చింది. 300,00,92,466 యూనిట్లు వాడినందుకు రూ. 232,07,08,464 కట్టాలని బిల్లులో చూపించారు. పాషిమంచల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి ఈ బిల్లు వచ్చింది. అయితే మిత్తల్ కంపెనీకి 49 కిలోవాట్ల వరకు మాత్రమే విద్యుత్ వాడుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. సాంకేతిక లోపం కారణంగానే రూ.232 కోట్ల కరెంట్ బిల్లు వచ్చిందని పీవీవీఎన్ లిమిటెడ్ సీనియర్ ఇంజనీర్ ఒకరు తెలిపారు. -
మురాదాబాద్ మహిళా పీఎస్‌లో ఖాకీ బట్టల్లోనే స్టెప్పులు
-
ఇదో వెరైటీ పెళ్లి!
రాంపూర్: హీరోయిన్ కు పెళ్లి కుదురుతుంది. తర్వాత ఆమె హీరోతో ప్రేమలో పడి చివరి అతడినే పెళ్లాడుతోంది. ఇలాంటి సినిమాలు చాలానే చూసేవుంటారు. అయితే సినిమాకు ఏమాత్రం తీసిపోని వెరైటీ పెళ్లి ఉత్తప్రదేశ్ లోని రాంపూర్ లో జరిగింది. అసలు ఏం జరిగిందంటే... మొర్దాబాద్ కు చెందిన జుగల్ కిశోర్(23), రాంపూర్ కు చెందిన ఇందిర(23)తో పెళ్లి కుదిరింది. 'వరమాల' కార్యక్రమం వరకు పెళ్లితంతు సవ్యంగానే సాగింది. ఇక్కడే కథ కొత్త మలుపు తిరిగింది. మూర్ఛరోగంతో బాధపడుతున్న కిశోర్ వధువుకు వరమాల వేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వరుడుకు ఉన్న రోగాన్ని దాచిపెట్టిన పెళ్లికొడుకు, అతడి కుటుంబ సభ్యులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను మోసం చేసిన వరుడికి బుద్ధి చెప్పేందుకు అదే పెళ్లి పందిరిలో మరొకరిని పెళ్లాడింది. తన వివాహానికి అతిథిగా వచ్చిన హర్పాల్ సింగ్ అనే యువకుడిని వరించింది. హర్పాల్ మొదట ఆశ్చర్యానికి గురైనా తర్వాత అంగీకరించాడు. ఇక ఆలస్యంగా చేయకుండా ఇందిర, హర్పాల్ అక్కడిక్కడే దండలు మార్చుకున్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ ఏడు అడుగులు నడిచారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన కిశోర్ ను బంధువులు ఆస్పత్రికి తరలించారు. అతడు వెంటనే కోలుకుని తిరిగొచ్చేప్పటికి ఇందిర మరొకరి భార్య అయింది. కిశోర్ బతిమాలినా, భయపెట్టిన ఇందిర నిబ్బరంగానే ఉంది. మనసు మాత్రం మార్చుకోలేదు. చేసేది లేక స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పెద్దలు జోక్యం చేసుకోవడంతో ఫిర్యాదు ఉపసంహరించుకోవడంతో పెళ్లి కథ సుఖాంతమైంది. -
ప్రియుడికి ఉరి... ప్రియురాలికి విషం
మొరదాబాద్: అభ్యంతరకర రీతిలో పట్టుబడిన ప్రేమికులపై పెద్దలు ప్రతాపం చూపారు. ప్రియుడిని ఉరేసి చంపారు. ప్రియురాలి నోట్లో విషం పోశారు. సంచలనం రేపిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మొరదాబాద్ జిల్లా భర్తాల్ గ్రామంలో సోమవారం ఉదయం జరిగింది. రాకేష్ సింగ్(17), సుష్మ(15) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఏకాంతంగా ఉండగా సుష్మ తండ్రి మఖాన్ సింగ్, ఆయన నలుగురు కుమారులు సుఖ్వీర్, సునీల్, సుశీల్, ఉమైద్ లకు తమింట్లో కంటపడ్డారు. తమ పిల్ల పరాయివ్యక్తితో కనబడడంతో మఖాన్ సింగ్, ఆయన కుమారులు కోపంతో రగిలిపోయారు. రాకేష్ సింగ్ ను ఉరేసి చంపారు. సుష్మతో బలవంతంగా విషం తాగించారు. తర్వాత అక్కడినుంచి పరారయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి రాకేష్ మృతి చెందాడు. చావుబతుకుల్లో ఉన్న సుష్మను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. తన కుమారుడిని ఇనుప రాడ్ తో కొట్టి తర్వాత ఉరేసి చంపారని రాకేష్ తండ్రి ఆరోపించారు. సుష్మ కుటుంబ సభ్యులు పరువుహత్య పాల్పడ్డారని పేర్కొన్నారు. మరోవైపు ఈ హత్యకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న సుష్మ చావుబతుకుల్లో ఉండడంతో ఆమె వాంగ్మూలం తీసుకోవడం పోలీసులకు సాధ్యపడలేదు. రాకేష్ సింగ్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని మొరదాబాద్ రూరల్ ఎస్పీ తెలిపారు. -
ఆర్ఎస్ఎస్ చెప్పినట్లు ఆడుతున్న బిజెపి: సోనియా
మొరాదాబాద్(యుపి): అతివాద భావజాలమున్న ఆర్ఎస్ఎస్ చెప్పినట్లు బీజేపీ ఆడుతోందని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వారిది సమాజాన్ని విభజించే సిద్ధాంతమని ఆరోపించారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు రెండు పూర్తి భిన్నమైన సిద్ధాంతాల మధ్య పోరాటమని ఆమె అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో సోమవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ ముస్లింలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మైనార్టీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, జాతీయ వక్ఫ్ అభివద్ధి కార్పొరేషన్ లాంటి చారిత్రక నిర్ణయాలతో ముస్లిం మహిళల అభివద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. మహాత్మా గాంధీ, మౌలానా ఆజాద్ మొదలైన వారి అడుగు జాడల్లో కాంగ్రెస్ నడుస్తుంటే.. మరోవైపు అతివాద భావజాలం ఉన్న సంస్థ చెప్పినట్లు బీజేపీ పని చేస్తోందన్నారు. ఎన్నో ఏళ్లుగా విలువలు, సిద్ధాంతాలను తాము భద్రంగా చూసుకుంటే.. బిజెపి వాటిని ధ్వసం చేస్తోందని మండిపడ్డారు. దేశానికి కావలసిన స్థిరమైన, సమర్థవంతమైన పాలన అందించే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పారు. మొరాదాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బేగం నూర్ బానో పోటీలో ఉన్నారు. -
ములాయం వ్యాఖ్యలపై నిర్భయ తండ్రి ఆగ్రహం
న్యూఢిల్లీ: అత్యాచార నిందితులకు ఉరిశిక్ష వేయడమేంటని వ్యాఖ్యలు చేసిన సమాజ్ వాదీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పై నిర్భయ తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించని నేతలను ఎన్నుకోవద్దని నిర్భయ తల్లితండ్రులు ఓటర్లకు సూచించారు. ములాయం పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మహిళలకు రక్షణ కల్పించాలనుకునే వ్యక్తి.. కించపరిచే విధంగా మాట్లాడరని నిర్భయ తండ్రి అన్నారు. ములాయం వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరమని వారన్నారు. అత్యాచారం కేసులో నేరస్థులకు ఉరిశిక్ష విధించడం తప్పు అని, కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చట్టాలను మారుస్తామని మొరాదాబాద్ లో జరిగిన ర్యాలీలో ములాయం వ్యాఖ్యలు చేయడం వివాదస్పదమైంది. ఢిల్లీలో డిసెంబర్ 16న నిర్భయ అనే మెడికోపై అత్యాచారం జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. -
పోలీసులపై ఎస్పీ ప్రతాపం: సస్పెన్షన్
ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్ సీనియర్ ఎస్పీ రాజేష్ మోదక్ తన సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. అనుచితంగా ప్రవర్తించినందుకుగాను ఆయనపై ఆ రాష్ట్ర ప్రభుత్వం క్రమ శిక్షణ చర్యలు తీసుకుంది. రాజేష్ మోదక్‌ను ఆదివారం సస్పెండ్ చేసింది. తన నివాసం వద్ద విధులు నిర్వహించే ముగ్గురు పోలీసు సిబ్బందిని ఆయన కొట్టినట్టు కేసు నమోదైంది. ఎస్పీ అకారణంగా తమపై చేయి చేసుకున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై విచారించిన అనంతరం పోలీసు శాఖ ఉన్నతాధికారులు రాజేష్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ విషయాన్ని హోం శాఖ వర్గాలు ధ్రువీకరించాయి.