సాక్షి, న్యూఢిల్లీ : ప్రజా జీవితంలోకి రావాలని ఉందంటూ రాజకీయ ప్రవేశంపై ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా సంకేతాలు పంపిన నేపథ్యంలో ఆయనను రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ సోమవారం యూపీలోని మొరాదాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. ప్రియాంక గాంధీని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించి నెల తిరక్కుండానే ఆమె భర్త, వాణిజ్యవేత్త రాబర్ట్ వాద్రా రాజకీయాల్లో తాను చురుకైన పాత్ర పోషించాలనుకుంటున్నటు ఇటీవల సంకేతాలు పంపారు.
తాను దేశ ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని, అయితే తాను రాజకీయాల్లోకి వస్తే భారీ వ్యత్యాసం ఉంటుందంటే ఎందుకు రాకూడదని ఆయన తన ఆకాంక్షను వెలిబుచ్చారు. ఇక మొరాదాబాద్‌లో వాద్రా పేరిట వెలిసిన పోస్టర్లు ఆసక్తికరంగా మారాయి. ‘రాబర్ట్ వాద్రాజీ మొరాదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేయాలని స్వాగతిస్తు’న్నామని ఆ పోస్టర్లలో పొందుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment