Robert Vadra
-
రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి!.. రాబర్ట్ వాద్రా
ఢిల్లీ: అమేథీ ప్రజలు కోరుకుంటే తానూ పోటీ చేయడానికి సిద్ధమని ప్రియాంక గాంధీ భర్త 'రాబర్ట్ వాద్రా' గతంలో పలుమార్లు పేర్కొన్నారు. అయితే ఇటీవలే కాంగ్రెస్ పార్టీ అమేథీ బరిలోకి 'కిషోరి లాల్ శర్మ'ను దింపింది. ఈ తరుణంలో వాద్రా కీలక వ్యాఖ్యలు చేశారు.అమేథీ ఎంపీ టికెట్ కేఎల్ శర్మకు కేటాయించడం వల్ల.. వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా రాజ్యసభ సభ్యుడిగా రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఉన్నట్లు పేర్కొన్నారు. కొంతకాలం తరువాత తాను ఖచ్చితంగా క్రియాశీల రాజకీయాల్లో చేరుతానని స్పష్టం చేశారు.రాబర్ట్ వాద్రా మీడియాతో మాట్లాడుతూ.. నేను ఎవరికీ సమాధానం చెప్పడానికి రాజకీయాల్లోకి రావాలని కోరుకోవడం లేదు. నేను ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ మీద మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రధానిగా ఇలాంటి మాట్లాడటం తగదని పేర్కొన్నారు.ప్రధాని మోదీ ఏది ఆరోపించినా వాటిని రుజువు చేయాలి. రుజువు చేయని పక్షంలో ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. రాహుల్, ప్రియాంకా ఇద్దరూ ప్రజలకు సేవ చేయడానికి పాటుపడుతున్నారు. ఈ సమయంలో మోదీ చేసిన వ్యాఖ్యలు సమంజసంగా లేదని వాద్రా అన్నారు.#WATCH | Robert Vadra says "...I do not want to come to politics to give a reply to anyone. I want to serve the people of the country, so maybe it is through Rajya Sabha. I will keep working for the people across the country and will travel to Amethi, Raebareli, and Morabadab as… pic.twitter.com/kUvzDHieEi— ANI (@ANI) May 9, 2024 -
‘నేను రాజకీయాల్లోకి రావాలని దేశమంతా కోరుకుంటుంది’
డెహ్రాడూన్: దేశం మొత్తం తాను క్రీయాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని కోరుకుంటుందని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ కంచుకోట ఆమేథీ నుంచి పోటీచేస్తారని గత కొన్నిరోజులుగా ఉహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. తాజాగా రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘దేశం మొత్తం నుంచి ఒకటే అభిప్రాయం వినిపిస్తోంది. దేశ ప్రజలంతా తాను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. ప్రజలు తనను వారి ప్రాంతాల్లో ఉండాలని ఆశిస్తున్నారు. నేను 1999లోనే ఆమెథి ప్రచారంలో పాల్గొన్నాను. ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న స్మృతి ఇరానీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చలేదు. గడిచిన రెండు విడతల్లోను కాంగ్రెస్ పార్టీ ముందజలోనే కొనాసాగుతోందని పేర్కొన్నారు. ‘దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. బీజేపీతో ప్రజలు తీవ్రంగా విసిగిపోయారు. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ శ్రమను దేశ ప్రజలు చూస్తున్నారు. గాంధీ కుటుంబం వెంటే దేశ ప్రజల ఉన్నారు’ అని రాబర్ట్ వాద్రా అన్నారు. ఆయన తనకు రాజకీయాల్లోకి రావాలని, ఎంపీగా పోటీ చేయాలన్న కోరికను ఉన్నట్లు ఇలా పరోక్షంగా వెల్లడిస్తున్నారని పార్టీ శ్రేణులో తీవ్ర చర్చ జరుగుతోంది.అమెథిలో గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన స్మృతి ఇరానీ సమీప కాంగ్రెస్ అభ్యర్థి అయిన రాహుల్ గాంధీని ఓడించిన విషయం తెలిసిందే. మళ్లీ ఈసారి కూడా బీజేపీ అమెథి సెగ్మెంట్ నుంచి స్మృతి ఇరానీకి టికెట్ కేటాయించింది. -
అమేథీ కాంగ్రెస్ అభ్యర్థి రాబర్ట్ వాద్రా?
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. మే 20న ఐదవ దశలో అమేథీ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అయితే కాంగ్రెస్ ఇక్కడి అభ్యర్థి ఎవరనేది వెల్లడించకముందే స్థానికంగా వెలసిన పోస్టర్లు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తెలియజేస్తున్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా.. అమేథీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేస్తూ పలు చోట్ల పోస్టర్లు వెలిశాయి. ‘అమేథీ ప్రజలు ఈసారి రాబర్ట్ వాద్రాను ఆహ్వానించాలి’ అని పోస్టర్‌పై రాశారు. రాబర్ట్ వాద్రా అమేథీ నుంచి పోటీ చేయాలనే డిమాండ్ గత కొంతకాలంగా వినిపిస్తోంది. అమేథీ, గౌరీగంజ్లలోని కాంగ్రెస్ కార్యాలయాలు, హనుమాన్ తిరహా, రైల్వే స్టేషన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో ఈ తరహా పోస్టర్లను గోడలపై అతికించారు. ఈ పోస్టర్ గురించి స్థానిక కాంగ్రెస్ నేత సోను సింగ్ రఘువంశీ మాట్లాడుతూ రాబర్ట్ వాద్రా ఈసారి అమేథీ నుండి ఎన్నికల్లో పోటీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రియాంక గాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తారు. అందుకే రాబర్ట్ వాద్రా ఇక్కడి నుంచి పోటీచేయాలని స్థానిక కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారన్నారు. -
సీటు కోసం కర్చీఫ్ వేసుకోవాలేమో.. రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ సెటైర్లు
లక్నో : కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనిపై అమేథీ బీజేపీ సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన బావ రాబర్ట్ వాద్రాపై విమర్శలు గుప్పించారు. 15ఏళ్ల పాటు ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్ గాంధీ అమోథీలో ఎలాంటి అభివృద్ది చేయలేదు. అలాంటిది రాబర్ట్ వాద్రా వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అధికారంలో ఉండగా చేయంది.. తాను కేవలం ఐదేళ్లలో చేసినట్లు తెలిపారు. బస్సులో సీటు కోసం ఖర్చీఫ్ వేసుకున్నట్లు అమోథీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్మృతి ఇరానీ మాట్లాడారు. జమనాలో బస్సు ప్రయాణంలో మరొకరు కూర్చోకుండా సీట్లలో కర్చీఫ్ వేసేవాళ్లు. రాహుల్ గాంధీ కూడా తన అమోథీ ఎంపీ సీటు కోసం కర్చీఫ్ వేయాల్సి ఉంటుందేమో.. ఎందుకంటే రాబర్ట్ వాద్రా అదే సీటుపై కన్నేశారని ఎద్దేవా చేశారు. పట్టుమని నెలరోజులు లేవు అమోథీలో ఎన్నికల పోలింగ్ సమయం పట్టుమని నెలరోజుల కూడా లేదు. కాంగ్రెస్ ఇంతవరకు అభ్యర్ధిని నిలబెట్టలేదు. ఇలాంటి చోద్యం ఎప్పుడూ చూడలేదు. ఎస్. రాహుల్ గాంధీ 15 ఏళ్లలో చేయంది నేను కేవలం ఐదేళ్లలో చేశాను అని స్మృతి ఇరానీ అన్నారు. పార్టీ ఆదేశిస్తే.. నేను ఆచరిస్తా అంతకుముందు.. కేరళలోని వయనాడ్ లోక్‌సభ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రాహుల్ గాంధీని పలు మీడియా ప్రతినిధులు ‘మీరు అమేథీ లోక్‌సభ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా? అని ప్రశ్నించారు. అందుకు పార్టీ ఆదేశాలకు ప్రకారం తాను పనిచేస్తాను’ అని బదులిచ్చారు. అమోథీలో నేనూ పోటీ చేస్తా రాబర్ట్ వాద్రా సైతం ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడితే అది అమోథీని ఎంచుకుంటానని తెలిపారు. ఆ నియోజకవర్గ ప్రజలు కూడా గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులే కావాలని కోరుకుంటారని వాద్రా అన్నారు. నా ఎంట్రీతో.. ఓటర్లు చేసిన తప్పును ఈ సందర్భంగా అమేథీలో పోటీ చేస్తే.. ప్రస్తుతం అమేథీ సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీని ఎన్నుకుని తప్పు చేశామని భావిస్తున్న ఓటర్లు.. నేను అమోథీ నుంచి పోటీ చేస్తే వారు చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. నేను పోటీ చేస్తే ఓటర్లు నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వరుస రాజకీయ పరిణామాలపై స్మృతి ఇరానీ తాజాగా స్పందించారు. -
అమేథీ నుంచి పోటీ!.. రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలు
మథుర: కాంగ్రెస్ అగ్ర నేత 'రాహుల్ గాంధీ' అమేథీ నుంచి పోటీ చేయనున్నట్లు గతంలో కొన్ని వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టినప్పటికీ.. ఆయన వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టమైంది. ప్రశ్నార్థకంగా మారిన అమేథీ నుంచి ప్రియాంక గాంధీ భర్త 'రాబర్ట్ వాద్రా' పోటీ చేయనున్నట్లు ఇప్పటికే పేర్కొన్నారు. అమేథీ ప్రజలు తమకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నారని, సరైన సమయంలో లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌ని సందర్శించి, లార్డ్ బాంకే బిహారీని దర్శనం చేసుకున్న తరువాత ఈ వ్యాఖ్యలు చేశారు. రాబర్ట్ వాద్రా విలేకరులతో మాట్లాడుతూ.. తాను కూడా రాజకీయాల్లోకి వస్తానని, దేశంలో మార్పు వాతావరణం నెలకొందని అన్నారు. తన కుటుంబం మొత్తం దీనిపై శ్రద్ధగా పని చేస్తుందని తెలిపారు. తాను రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నా, పాల్గొనలేకపోయినా.. దేశం కోసం, ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తానని చెప్పారు. దేశంలో లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తూనే ఉంటామని వాద్రా చెప్పారు. అమేథీ నుంచి అభ్యర్థిగా పోటీ చేయాలనే ప్రశ్నపై దేశంలోని ప్రతి మూలలో చర్చలు జరుగుతున్నాయని వాద్రా అన్నారు. ఇది ప్రజల పిలుపు. వారి కష్టాన్ని తాను అర్థం చేసుకున్నానని చెప్పారు.నేను వారికి ప్రాతినిధ్యం వహించాలని, వారి ప్రాంతానికి వెళ్లి వారి సమస్యలు వినాలని వారు కోరుకుంటున్నారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాను, ప్రస్తుతం తొందరపడటం లేదని ఆయన అన్నారు. అన్నారు. వాద్రా వెంట యూపీ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మాజీ నేత ప్రదీప్ మాథుర్ ఉన్నారు. #WATCH | Mathura, UP: Robert Vadra says, "I am very happy after the 'Darshan' of 'Banke Bihari'. I pray that there is peace in the country. My whole family is campaigning and trying to understand the problems of the people and they will definitely find a solution to it... Whether… pic.twitter.com/HtgzFCj79i — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 15, 2024 ఒక వ్యక్తికి ఏ సమస్య వచ్చినా తన దేవుణ్ణి స్మరించుకుంటాడన్నారు. కష్టాల్లో ఉన్న వ్యక్తి భగవంతుడిని స్మరించుకుంటే ధైర్యం పెరుగుతుందని.. అందుకే మతం పేరుతో వివక్ష రాజకీయాలు చేయకూడదని వాద్రా అన్నారు. బీజేపీ 'వివక్ష రాజకీయాలు' చేస్తున్న పార్టీ అని ఆరోపించిన ఆయన, కాంగ్రెస్‌ను సనాతన్ వ్యతిరేకి అని అనడం బీజేపీ సొంత పబ్లిసిటీ అని పేర్కొన్నారు. కాంగ్రెస్, కూటమిని గెలిపించేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చాలా కష్టపడుతున్నారని చెప్పారు. దేశంలో సంతోషం, శాంతి నెలకొనాలని బాంకే బిహారీకి ప్రార్థిస్తున్నానని, రాహుల్, ప్రియాంక కచ్చితంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని ఆయన అన్నారు. అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు. ప్రియాంక గాంధీ సోదరుడు రాహుల్ గాంధీ మళ్లీ అమేథీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. దీనిపైనా అధికారిక ప్రకటన వెలువడలేదు. 2019లో రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు కూడా బీజేపీ స్మృతి ఇరానీనే మళ్ళీ పోటీకి దింపింది. Radhe Radhe!! 🙏♥️ As part of my Birthday, a spiritual and charity week, my visit to Banke Bihari Temple in Biharipura in Vrindavan Dham in Mathura was really enlightening. My prayers for peace, harmony and staying secular for the people of our great nation. To keep Priyanka,… pic.twitter.com/9QtL46K9q5 — Robert Vadra (@irobertvadra) April 15, 2024 -
Lok sabha elections 2024: అమేధీ నుంచి రాబర్ట్ వాద్రా..?
సాక్షి, న్యూఢిల్లీ: గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేధీ నియోజకవర్గం నుంచి అగ్రనేత ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా రాజకీయ అరంగేట్రం చేసే అవకాశాలున్నాయని ఏఐసీసీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టుగా అమేధీ ప్రజలు తనను కోరుకుంటే ఎంపీగా ప్రాతినిధ్యం వహించేందుకు సిధ్దమని ఆయన ఇటీవల చేసిన ప్రకటన ఈ తరహా ప్రచారానికి బలాన్నిస్తోంది. దీనికి తోడు ప్రస్తుతం అమేధీ ఎంపీగా ఉన్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ఉద్దేశించి, ‘ఆమె వల్ల అమేధీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆమెను ఎన్నుకోవడం ద్వారా తప్పుచేశామని నమ్ముతున్నారు’ అంటూ విమర్శలు సంధించడంతో వాద్రా పోటీ ఖాయమని ఏఐసీసీ వర్గాలంటున్నాయి. -
అమేథీ బరిలో 'రాబర్ట్ వాద్రా'?
కాంగ్రెస్ అగ్ర నేత 'రాహుల్ గాంధీ' అమేథీ నుంచి పోటీ చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. అయితే ఈయన వయనాడ్ నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు. ప్రశ్నార్థకంగా మారిన అమేథీ నుంచి ప్రియాంక గాంధీ భర్త 'రాబర్ట్ వాద్రా' పోటీ చేయనున్నట్లు సమాచారం. అమేథీ ప్రజలు నేను ఎంపీ కావాలని నిర్ణయించుకుంటే.. తప్పకుండా ప్రాతినిధ్యం వహిస్తానని రాబర్ట్ వాద్రా ప్రకటించారు. ప్రస్తుత ఎంపీ 'స్మృతీ ఇరానీ' ప్రజలకు ఏమీ చేయలేదని, వారందరూ నిరాశ చెందుతున్నారని అన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీని నిందించడానికి మాత్రమే ఆమె ఉన్నారని పేర్కొన్నారు. స్మృతీ ఇరానీని గెలిపించి తప్పు చేశామని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలు భావిస్తున్నట్లు వాద్రా పేర్కొన్నారు. అమేథీ నుంచి బరిలోకి దిగి.. ప్రజల అభివృద్ధికి దోహదపడతానని ఆయన అన్నారు. రాజకీయ రంగప్రవేశం గురించి వాద్రా మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు. ఏప్రిల్ 2022లో కూడా ప్రజలు కోరుకుంటే ఎన్నికల్లో నిలబడటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే ఇప్పుడు మరోసారి ఎన్నికల బరిలో నిలబడటానికి సన్నద్ధమవుతున్నారు. మున్ముందు ఏం జరుగుతుందో.. ఎలాంటి రాజకీయ పరిణామాలు జరుగుతాయనేది తెలియాల్సి ఉంది. Delhi | On UP's Amethi Lok Sabha constituency, Robert Vadra says, "...The people of Amethi expect me to represent their constituency if I decide to become a member of Parliament...For years, the Gandhi family worked hard in Rae Bareli, Amethi and Sultanpur...The people of Amethi… pic.twitter.com/2kdmgQtrvv — ANI (@ANI) April 4, 2024 -
అత్యంత అవినీతిమయం.. సోనియా కుటుంబంపై బీజేపీ తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ: గాంధీల కుటుంబం దేశ రాజకీయాల్లో అత్యంత అనైతిక, అత్యంత అవినీతిమయ కుటుంబమంటూ బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై మనీ ల్యాండరింగ్ కేసును కొట్టి వేసేందుకు రాజస్తాన్ హైకోర్టు గత వారం నిరాకరించడాన్ని ప్రస్తావించారు. వాద్రాపై అవినీతి, మనీ ల్యాండరింగ్ కేసులపై సోనియా, రాహుల్ మౌనం వీడాలన్నారు. ‘‘భారత రాజకీయాల్లో సోనియాది అత్యంత అవినీతిమయ, అనైతిక కుటుంబం. ఆ కుటుంబానికి చెందిన ముగ్గురు అవినీతి కేసుల్లో బెయిల్‌పై ఉన్నారు. 2008–13 మధ్య రాబర్ట్ వాద్రా రాజస్తాన్‌లో భారీగా భూములను బినామీ పేర్లతో సొంతం చేసుకున్నారు. అప్పుడు కేంద్ర రాష్ట్రాల్లో కాంగ్రెసే అధికారంలో ఉంది. దాంతో రాబర్ట్ కన్నుసన్నల్లో ల్యాండ్ మాఫియా నడిచింది. చట్టానికి అతీతులమని అనుకుంటున్న గాంధీల కుటుంబం.. ఇప్పుడు అదే చట్టం ముందు నిలబడేందుకు వణికిపోతోంది’’ అన్నారు. -
రాబర్ట్ వాద్రాకు రాజస్తాన్ హైకోర్టులో ఎదురుదెబ్బ
జోద్పూర్: భూమి కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు రాజస్తాన్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తును నిలిపివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం గురువారం తిరస్కరించింది. అయితే, ఆయనకు కొంత ఊరట కల్పించింది. ఇదే కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ వ్యవహారంలో రాబర్ట్ వాద్రాను అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన స్టేను మరో నాలుగు వారాలు పొడిగించింది. స్కై లైట్ హాస్పిటాలిటీ అనే సంస్థ రాజస్తాన్‌లోని బికనేర్‌లో 41 ఎకరాలకు పైగా భూమిని కొనుగోలు చేసింది. ఈ సంస్థతో రాబర్ట్ వాద్రాకు, ఆయన తల్లి మౌరీన్ వాద్రాకు సంబంధాలు ఉన్నట్లు ఈడీ చెబుతోంది. భూకొనుగోలులో మనీ ల్యాండరింగ్ జరిగిందని, ఇందులో రాబర్ట్ వాద్రా పాత్ర ఉన్నట్లు గుర్తించింది. -
కలిసి నడిస్తే అడుగులు మరింత బలపడతాయి.. రాహుల్ ఆసక్తికర ట్వీట్
భోపాల్: భారత్ జోడో యాత్రలో భాగంగా సోదరుడు రాహుల్ గాంధీతో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కలిసి నడిశారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడు రోహిన్‌తో కలిసి గురువారం రాహుల్ పాదయాత్రలో పాల్గొన్నారు. చెల్లెలితో కలిసి నడుస్తున్న ఫోటోను ట్విటర్లో షేర్ చేసిన రాహుల్.. ''మనం కలిసి నడిస్తే అడుగులు మరింత బలపడతాయంటూ'' పేర్కొన్నారు. ప్రియాంక వాద్రా భారత్ జోడోలో పాల్గొనడం ఇదే తొలిసారి. సోనియాగాంధీ కర్ణాటకలో రాహుల్‌తో కలిసి నడిశారు. रास्तों से लड़कर हमने कई मुक़ाम बनाए हैं। साथ हैं तो यकीन है, मंज़िल ज़रूर पाएंगे। pic.twitter.com/hDuIdsVoNr — Rahul Gandhi (@RahulGandhi) November 24, 2022 సెప్టెంబర్ 7న మొదలైన భారత్ జోడో యాత్ర.. నవంబర్ 23న మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించింది. రాష్ట్రంలో ఐదు లోక్‌సభ, 26 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పదకొండు రోజులపాటు భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. చదవండి: (కల్లలైన కలలు.. భర్త వివాహేతరసంబంధం.. మహిళా టెక్కీ ఆత్మహత్య) -
కాంగ్రెస్‌ది 'భారత్ జోడో' యాత్ర కాదు 'పరివార్ జోడో' యాత్ర
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న భారత్ జోడో యాత్ర బుధవారం ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. దీనికి సబంధించి సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేశారు. ఇందులో గాంధీ కుటుంబంతో పాటు వాద్రా కూడా ఉన్నారు. Bharat Jodo! 🇮🇳 🙏 pic.twitter.com/KxDqLGoFfk — Robert Vadra (@irobertvadra) September 7, 2022 ఈ ఫోటోపై స్పందిస్తూ బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. రాహుల్ గాంధీ చేపట్టింది 'భారత్ జోడో' కాదు 'పరివార్ జోడో'(కుటుంబాన్ని ఏకం చేసే)యాత్ర అని సెటైర్లు వేసింది. బీజేపీ నేత షెహ్జాద్ పూనావాలా ఈమేరకు ట్వీట్ చేశారు. ఈ ఏడాది జూన్‌లో తాను రాజకీయాల్లోకి వస్తానని సూచనప్రాయంగా చెప్పారు రాబర్ట్ వాద్రా. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించిన అనంతరం ఈ విషయాన్ని తెలిపారు. దేశంలో మార్పు అవసరమని, అది తన వల్ల సాధ్యమవుతుందని ప్రజలు అనుకుంటే కచ్చితంగా రాజకీయ ప్రవేశం చేస్తానని వాద్రా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపడుతున్నారు. బుధవారం సాయంత్రం కన్యాకుమారిలో ఇది ప్రారంభమవుతుంది. మొత్తం 12 రాష్ట్రాలను కవర్ చేస్తూ 3,570 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. చదవండి: వాద్రా ఫోటో.. భారత్ జోడో యాత్రపై బీజేపీ నేత సెటైర్లు -
వాద్రాకు పాజిటివ్.. క్వారంటైన్లో కుటుంబం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తామిద్దరు ఢిల్లీలోని వారి నివాసంలో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నామని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. అంతకు ముందు తనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలిందని రాబర్ట్ వాద్రా ఫేస్బుక్ వేదికగా ప్రకటించారు. ఎలాంటి లక్షణాలు లేనప్పటికి తనకు పాజిటివ్ వచ్చిందని తెలిపాడు వాద్రా. ఆ తర్వాత ప్రియాంక తన ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘‘నా భర్తకు కరోనా పాజిటివ్‌గా తేలింది. నేను కూడా టెస్ట్‌లు చేయించుకున్నాను. నాకు నెగిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం మేం హోం క్వారంటైన్లో ఉంటున్నాం. అసెంబ్లీ ఎన్నికల దృష్టా నేను అస్సాం, తమిళనాడులో పర్యటించాల్సి ఉంది. అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడికి రాలేను. ఇందుకు నేను చింతిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నాను’’ అని ప్రియాంక వీడియోలో తెలిపారు. हाल में कोरोना संक्रमण के संपर्क में आने के चलते मुझे अपना असम दौरा रद्द करना पड़ रहा है। मेरी कल की रिपोर्ट नेगेटिव आई है मगर डॉक्टरों की सलाह पर मैं अगले कुछ दिनों तक आइसोलेशन में रहूँगी। इस असुविधा के लिए मैं आप सभी से क्षमाप्रार्थी हूँ। मैं कांग्रेस विजय की प्रार्थना करती हूँ pic.twitter.com/B1PlDyR8rc — Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 2, 2021 ‘‘పిల్లలు కూడా గత కొద్ది కాలంగా మాతోనే ఉంటున్నారు.. అదృష్టం కొద్ది ప్రియాంకకు, పిల్లలకు నెగిటివ్‌గా తేలింది’’ అని రాబర్ట్ వాద్రా ప్రకటించారు. ఇక ప్రియాంక మంగళవారం కేరళలో రోడ్ షోలో పాల్గొన్నారు. అంతకు ముందు అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అక్కడ ప్రచారం చేశారు. చదవండి: క్వారంటైన్ కలిపింది ఆ ఇద్దరినీ... -
మోదీకి చురక: పెట్రోల్ ధరలపై బావమరుదుల భగ్గు
న్యూఢిల్లీ: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ వయనాడ్‌లో భారీ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టగా.. ఆయన బావ (ప్రియాంకగాంధీ భర్త) రాబర్ట్ వాద్రా సైకిల్ తొక్కుతూ నిరసన వ్యక్తం చేశారు. అడ్డూఅదుపు లేకుండా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరగడంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ నిరసనల్లో భాగంగా సోమవారం బావబామరుదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బామ్మర్దికి పోటీగా బావా వాద్రా సైకిల్‌పై వేగంగా వెళ్తూ కేంద్ర ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని సుజన్‌సింగ్ పార్క్ నుంచి తన కార్యాలయం సుఖ్‌దేవ్ విహార్ ఆఫీస్ వరకు సైకిల్‌పై వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏసీ కార్ల నుంచి బయటకు వచ్చి ప్రజల సమస్యలు చూడాలి’ అని పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చురకలంటించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ‘యూపీఏ హయాంలో పెట్రోల్ ధరలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మోదీ ఇప్పుడు ఏం చెబుతారు’ అని ప్రశ్నించారు. ఏదైనా సమస్యలు తలెత్తితే ఎప్పుడు ఇతరులపై బురద జల్లడం మోదీకి అలవాటే’ అని ఎద్దేవా చేశారు. సూటుబూటు వేసుకుని సైకిల్‌పై రావడం అందరినీ ఆకట్టుకుంది. ఒకవిధంగా రాహుల్ కన్నా రాబర్ట్‌కే ఎక్కువ గుర్తింపు వచ్చింది. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్‌లో పర్యటించారు. వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై నిరసన వ్యక్తం చేశారు. ‘ప్రపంచమంతా రైతుల సమస్యలపై స్పందిస్తుంటే మోదీ ప్రభుత్వం మాత్రం కళ్లుండి చూడలేకపోతుంది’ అని తెలిపారు. వెంటనే కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘22 మంది ప్రజల జేబులు ఖాళీ చేస్తూ తమ స్నేహితుల జేబులు నింపుతున్నట్లు’ అభివర్ణించారు. ధరల పెంపుతో ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీజేపీ పెట్రోల్ దోపిడీ’ అని కొత్తగా హ్యాష్‌ట్యాగ్ క్రియేట్ చేసి ట్వీట్ చేశారు. पेट्रोल पम्प पर गाड़ी में तेल डालते समय जब आपकी नज़र तेज़ी से बढ़ते मीटर पर पड़े, तब ये ज़रूर याद रखिएगा कि कच्चे तेल का दाम बढ़ा नहीं, बल्कि कम हुआ है। पेट्रोल 100 रुपय/लीटर है। आपकी जेब ख़ाली करके ‘मित्रों’ को देने का महान काम मोदी सरकार मुफ़्त में कर रही है!#FuelLootByBJP — Rahul Gandhi (@RahulGandhi) February 22, 2021 చదవండి: కట్టెలు, మట్టి పొయ్యితో అసెంబ్లీకి చదవండి: నాగాలాండ్‌లో అరుదైన దృశ్యం.. 58 ఏళ్ల తర్వాత -
రాబర్ట్ వాద్రా ఇంటికి ఐటీ అధికారులు
సాక్షి న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా, ఆదాయ పన్ను అధికారులు విచారించారు. బినామీ ఆస్తుల కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఇంటికి వెళ్లి ఐటీ అధికారులు సోమవారం విచారించారు. యూకేలోని ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారి ద్వారా కొనుగోలు చేసిన లండన్ ఆస్తులతో ముడిపడి ఉన్న ఈ కేసుకు సంబంధించి తాజా పరిణామం చోటు చేసుకుంది. లండన్‌లో బ్రయాన్స్టన్ స్క్వేర్ భవనం సుమారు 77 17.77 కోట్ల విలువైన ఆస్తితోపాటు, మరొకవిలువైన ఆస్తిని కొనుగోలు చేసిన కేసులో కూడా వాద్రాను ఈడీ విచారిస్తోంది. అలాగే 4 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.37.42 కోట్లు) 5 మిలియన్ పౌండ్ల (రూ. 46.77 కోట్ల కంటే ఎక్కువ) విలువైన మరో రెండు ఆస్తులను కూడా ఈడీ అక్రమ ఆస్తులుగా గుర్తించింది. వీటితోపాటు ఆరు ఫ్లాట్లు కూడా వాద్రాకు చెందినవని అనుమానిస్తున్నట్లు ఈడీ ఆరోపించింది. 2005 -2010 మధ్య వీటిని కొనుగోలు చేసినట్లు పేర్కొంది. మొత్తంగా లండన్‌లో సుమారు 12 బిలియన్ల పౌండ్లమ ఆస్తులను కలిగి ఉన్న కేసులో విచారణ జరుగుతోంది. అలాగే గుర్గావ్లో భూ వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో 2018 సెప్టెంబర్‌లో ఆయనపై, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాపై కూడా పోలీసు కేసు నమోదైంది. కాగా రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు నమోదు చేసినట్లు వాద్రా ఆరోపించారు. -
ప్రియాంకా..నిన్ను చూసి గర్విస్తున్నా!
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పట్ల లక్నోలో యూపీ పోలీసులు వ్యవహరించిన తీరును ఆమె భర్త రాబర్ట్ వాద్రా తీవ్రంగా ఖండించారు. మాజీ ఐపీఎస్ అధికారి ఎస్ఆర్ దారాపురి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళుతున్న ప్రియాంకను మహిళా పోలీసులు అడ్డగించి దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం సరైంది కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల్లో ఒకరు ప్రియాంక గొంతు పట్టుకోగా, మరొకరు తోసివేయడంతో ప్రియాంక కిందపడ్డారని అన్నారు. ‘నీకు అవసరమైన వారిని కలిసేందుకు ఎంతదూరమైనా వెళ్లే నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నానని, నిన్ను చూసి గర్విస్తున్నాన’ని వాద్రా ట్వీట్ చేశారు. మహిళా పోలీసులు అడ్డగించినా టూ వీలర్‌పై మాజీ ఐపీఎస్ అధికారి ఎస్ఆర్ దారాపురి కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వెళ్లడం ఆమె అంకితభావానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ‘నీవు చేసింది సరైన పనే.. బాధలో మునిగి సహాయం కోసం వేచిచూసే వారిని కలిసేందుకు వెళ్లడం నేరమేమీ కాద’ని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. కాగా తనపై మహిళా పోలీసులు అనుచితంగా వ్యవహరించారని ప్రియాంక చేసిన ఆరోపణలను యూపీ పోలీసులు తోసిపుచ్చారు. ప్రియాంక గాంధీపై పోలీసులు భౌతిక దాడికి పాల్పడ్డారని జాతీయ మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు నమోదైంది. చదవండి : పోలీసులు నాపై చేయి చేసుకున్నారు -
ప్రియాంకకు భద్రత తగ్గింపుపై వాద్రా ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి ఎస్పీజీ భద్రతను తొలగించడంపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా కేంద్ర సర్కార్‌పై ధ్వజమెత్తారు. గత నెలలో ప్రియాంక నివాసంలోకి ఓ కారు దూసుకురావడం భద్రతా లోపాలను ఎత్తిచూపిన క్రమంలో ఎస్పీజీ భద్రతను తొలగించకూడదని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా భద్రత విషయంలో రాజీపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా లోపాలను మహిళల భద్రతకు ముడిపెడుతూ వాద్రా ఫేస్బుక్ పోస్ట్‌లో ప్రభుత్వ తీరును ఆక్షేపించారు. ‘ప్రియాంకకు, నా కుమార్తె, కుమారుడు లేదా నాకు గాంధీ కుటుంబానికే భద్రత కరవవడం కాదు..దేశంలో మహిళలకు భద్రమైన పరిస్థితి కల్పించాల్సి ఉండగా, దేశవ్యాప్తంగా భద్రతపై రాజీపడుతున్నారు..యువతులు, బాలికలపై లైంగిక దాడులు కొనసాగుతున్నాయి..ఎలాంటి సమాజాన్ని మనం ఏర్పరుస్తున్నా’మని వాద్రా ఆ పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగించి జడ్ క్యాటగరీ భద్రతను కల్పించిన సంగతి తెలిసిందే. -
రాహుల్‌కు బావ భావోద్వేగ లేఖ
న్యూఢిల్లీ : యువతలో స్ఫూర్తి నింపుతున్న రాహుల్ గాంధీ నుంచి తానెంతో నేర్చుకోవాల్సి ఉందని ఆయన బావ, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా అన్నారు. దేశ సేవలో ఎల్లప్పుడూ తన వెంటే ఉంటానని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రాబర్ట్ వాద్రా తన సోషల్ మీడియాలో రాహుల్‌కు భావోద్వేగ లేఖను పోస్ట్ చేశారు. ఈ మేరకు.. ‘ భారత జనాభాలో 65 శాతం ఉన్న యువత, వర్ధమాన, యువ నాయకులు నీ వైపే చూస్తున్నారు. నీ నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది రాహుల్. దృఢమైన వ్యక్తిత్వం కలిగిన నీవు తీసుకున్న నిర్ణయాలు అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాయి. నా దృష్టిలో పదవి కంటే దేశ సేవకు పునరంకితం కావడమే గొప్ప విషయం. ఈ విషయంలో ఎల్లప్పుడూ నీకు నేను తోడుగా ఉంటా. ప్రజలతో మమేకమవుదాం. అత్యుత్తమ మార్గంలో జాతికి సేవ చేద్దాం’ అని రాబర్ట్ వాద్రా ఫేస్బుక్లో రాసుకొచ్చారు. కాగా పార్టీ అభివృద్ధికి జవాబుదారీతనం కీలకమని, అందుకోసమే తాను రాజీనామా చేస్తున్నానన్న రాహుల్.. ఈ మేరకు ట్విటర్లో నాలుగు పేజీల లేఖను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 542 లోక్‌సభ స్థానాలకు గానూ 52 స్థానాల్లో మాత్రమే పార్టీ గెలుపొందడంతో రాహుల్‌తో పాటు పలువురు పీసీసీ చీఫ్‌లు కూడా తమ పదవుల నుంచి వైదొలిగారు. ఈ నేపథ్యంలో పరిస్థితులకు చక్కదిద్దే క్రమంలో రాహుల్ సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా లేదా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టనున్నారనే ప్రచారం జోరందుకుంది. -
రాబర్ట్ వాద్రాకు మరో గట్టి షాక్
సాక్షి, న్యూఢిల్లీ : నగదు అక్రమ చలామణి ద్వారా విదేశాల్లో ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు గట్టి షాక్ తగిలింది. రాబర్ట్ వాద్రా బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారి సంస్థ ఆఫ్సెట్ ఇండియా సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్, ఈ గ్రూపు సంస్థలు, ఇతర విభాగాలతో అన్ని వ్యాపార లావాదేవీలను కేంద్రం నిషేధించింది. ఈ మేరకు రక్షణశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో (ఫిబ్రవరి 2018)మొట్టమొదటిసారిగా ఆఫ్సెట్ ఇండియా సొల్యూషన్స్‌తో వ్యాపారాన్ని ఆరునెలలపాటు నిషేధించింది. తాజాగా తదుపరి ఆదేశాల వరకు నిషేధం కొనసాగుతుందని వెల్లడించడం గమనార్హం కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో అనేక ఒప్పందాలతో (2005లో రక్షణ ఒప్పందం, 2009లో పెట్రోలియం,తదితర) భండారీకి సంబంధం ఉన్నాయని ఆరోపణలు. సంజయ్ భండారీ 2008లో కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఆఫ్సెట్ ఇండియా సొల్యుషన్స్ కంపెనీ కొన్నేళ్లలో కొన్ని కోట్ల రూపాయలకు ఎలా ఎదిగిందో దర్యాప్తు జరపాల్సిందిగా 2014లో అధికారంలోకి రాగానే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఐబీ అధికారులను ఆదేశించింది. 2012లో భారత ప్రభుత్వంతో దాదాపు మూడు వేల కోట్ల రూపాయలకు శిక్షణ విమానాల ఒప్పందాన్ని చేసుకున్న స్విస్ సంస్థ 'పిలాటస్'తో భండారీకి సంబంధాలు ఉన్నాయని, ఆ సంస్థ యాజమాన్యంతో రాబర్ట్ వాద్రా కూడా సంబంధాలు ఉన్నాయంటూ ఐబీ అధికారులు కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు 2016 లో ఐటీ దాడుల నేపథ్యంలో డిఫెన్స్ డీలర్ సంజయ్ భండారి లండన్ పారిపోయాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఈడీ రాబర్ట్ వాద్రా కస్టోడియల్ రిమాండ్‌ను కోరుతోంది. పెట్రో, రక్షణ వ్యవహారాల్లో భండారి లంచాలు తీసుకున్నారని దర్యాప్తు ఏజెన్సీ పేర్కొంది. అలాగే లండన్ నుంచి భండారిని తిరిగి ఇండియాకు రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. -
రాబర్డ్ వాద్రాకి ఊరట
-
రాబర్ట్ వాద్రాకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఊరట లభించింది. వైద్య చికిత్స నిమిత్తం ఆరు వారాల పాటు విదేశీ పర్యటన కోసం ఆయనను రోజ్ ఎవెన్యూ కోర్టు సోమవారం అనుమతించింది. వాద్రా అమెరికా, న్యూజిలాండ్ వెళ్లవచ్చని అయితే లండన్‌కు దూరంగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. లండన్‌లో విలాసవంతమైన భవనం కొనుగోలులో మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్టు వాద్రాపై అభియోగాలున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు ఈడీ వాద్రాను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఈ ఏడాది ఏప్రిల్ 1న వాద్రాకు కోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. -
రాబర్ట్ వాద్రాపై మండిపడ్డ నెటిజన్లు..!
న్యూఢిల్లీ : కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఓ పొరపాటు కారణంగా నెటిజన్ల ట్రోలింగ్‌కు బలయ్యాడు. ఆదివారం జరిగిన ఆరో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో లోధి ఎస్టేట్‌లోని సర్దార్‌పటేల్ పాఠశాలలో సతీమణి ప్రియాంకతో కలిసి ఆయన ఓటుహక్కు వినియోగించుకున్నాడు. అయితే, ఓటింగ్ అనంతరం.. ‘నేను ఓటు హక్కు వినియోగించుకున్నాను. మన హక్కే మన బలం. వయోజనులంతా ఓటు వేయండి. మన ప్రియతమ నేతల్ని గెలిపించుకునేందుకు, మంచి భవిష్యత్ కోసం మన మద్దతు అవసరం. లౌకికమైన, సురక్షితమైన, మెరుగైన దేశం కోసం ఓటు వేయండి’ అని చెబుతూ ట్విటర్లో ఫింగర్ చూపిస్తూ పోస్టు చేశాడు. అయితే, తన సందేశంలో భారత్ జెండా గుర్తు బదులు పరాగ్వే దేశపు జెండా గుర్తును చేర్చాడు. వాద్రా చర్యపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. ‘తికమక పడి వాద్రా.. కాంగ్రెస్‌కి బదులు భాజపాకు ఓటు వేసి ఉండొచ్చు’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ఎట్టకేలకు తాను పరాగ్వే దేశానికి చెందిన పౌరుడినని రాబర్ట్ వాద్రా ఈ రోజు అంగీకరించారు’ అని మరొకరు చురకలంటించారు. పొరపాటును గుర్తించిన వాద్రా.. వెంటనే పరాగ్వే జెండాను తొలగించి, భారత్ జెండాను పోస్ట్ చేశారు. అయితే, అప్పటికే నెటిజన్లు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్న ఫొటోలు షేర్ చేయడంతో వైరల్‌గా ఈ న్యూస్ వైరల్‌గా మారింది. -
అధికారంలోకి వస్తే ఆయన జైలుకే
ఫతేబాద్: ప్రజల ఆశీస్సులతో మరోసారి తమ పార్టీ అధికారం చేపట్టబోతోందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధీమా వ్యక్తం చేశారు. హరియాణాలోని ఫతేబాద్‌లో బుధవారం నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులను లూటీ చేసిన ’షెహన్షా’ను రాబోయే ఐదేళ్లలో కటకటాల వెనక్కి పంపిస్తానంటూ పరోక్షంగా యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రాను హెచ్చరించారు. కేంద్రం, హరియాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా అతి తక్కువ రేట్లకు రైతుల నుంచి భూములు లాక్కుంటుందని ఆరోపించారు. రైతులను లూటీ చేసిన వారిన ప్రజల ఆశీస్సులతో ఈ చౌకీదారు కోర్టుకు ఈడుస్తాడని చెప్పారు. ’వాళ్లు బెయిల్‌పై తిరుగుతున్నారు. ఈడీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తామే సార్వభౌమాధికారులమని, తమను ఎవరూ తాకలేరని వారనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్లకు వణుకు పట్టుకుంది. వాళ్లను నేను దాదాపు జైలు గుమ్మం వరకూ తీసికెళ్లాను. మీ ఆశీస్సులుంటే రాబోయే ఐదేళ్ల లోపే వారిని జైలులో పెట్టిస్తా’ అని మోదీ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. దేశాన్ని దోచుకున్న వారి నుంచి ఆ సొమ్ము కక్కిస్తానని ప్రధాని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల పోరులో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేతులెత్తేశాయంటూ ఎద్దేవా చేశారు. ఆ పాపం వారిదే. 1984లో ఢిల్లీ, పంజాబ్, హరియాణా సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సిక్కులను కాంగ్రెస్ కుటుంబం పొట్టనబెట్టుకుందని మోదీ ఆరోపించారు. 34 ఏళ్లుగా పది కమిషన్లను నియమించారని, అయినప్పటికీ వారికి న్యాయం జరగలేదని అన్నారు. -
రాహుల్, సోనియా నామినేషన్ తర్వాతే..!
న్యూఢిల్లీ : ప్రస్తుత ఈడీ ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా.. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించబోతున్నారు. త్వరలోనే క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానని ఆయన తన మనసులోని మాటను వెల్లడించిన సంగతి తెలిసిందే. హరియాణాలో భూకుంభకోణాలు, మనీ లాండరింగ్ అభియోగాలను ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రాపై ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈడీ కేసుల నుంచి నిర్దోషిగా బయటపడిన అనంతరం తాను రాజకీయాల్లోకి వస్తానని, రాజకీయాల్లో పెద్ద పాత్ర పోషించాలని భావిస్తున్నానని వాద్రా ఇప్పటికే తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లో నామినేషన్లు దాఖలు చేసిన తర్వాత తాను ప్రచారగోదాలోకి దిగుతానని, కాంగ్రెస్ పార్టీ తరఫున తాను ప్రచారం చేయనున్నానని ఆయన తెలిపారు. -
న్యాయమే గెలిచింది - రాబర్ట్ వాద్రా
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు మనీ ల్యాండరింగ్ కేసులో ఊరట లభించింది. మధ్యతర బయిల్పై ఉన్న రాబర్ట్ వాద్రాతోపాటు ఆయన సన్నిహితుడు మనోజ్ అరోరాకు మరోసారి ఊరటనిస్తూ ముందస్తు బెయిల్ మంజూర్ చేసింది స్పెషల్ సీబీఐ కోర్టు. ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్ సోమవారం ఈ ఆదేశాలిచ్చారు. అయితే దేశం విడిచి వెళ్లరాదంటూ షరతులు విధించారు. దర్యాప్తునకు పిలిచినపుడు విచారణ అధికారులతో సహకరించాలని, సాక్ష్యాలను నాశనం చేయవద్దని, సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించ వద్దని నిందితులిద్దరినీ న్యాయమూర్తి కోరారు. షరతులతో కూడిన ఈ బెయిల్ కోసం ఇద్దరూ చెరి రూ. 5లక్షల పర్సనల్ బాండ్లను సమర్పించాల్సి ఉంటుంది. అయితే ముందస్తు అనుమతి లేకుండా వాద్రా, అరోరా దేశం విడిచి వెళ్లరాదని కోర్టు స్పష్టం చేసింది. న్యాయ వ్యవస్థ విజయం సాధించిందని వాద్రా న్యాయవాది అభిషేక్ మను సంఘ్వి వ్యాఖ్యానించారు. నిజం నిగ్గు తేలిందనీ, న్యాయమే గెలిచిందని రాబర్ట్ వాద్రా పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ పట్ల తనకున్న అచంచల విశ్వాసం విజయం సాధించిందనీ, ఇందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన హితులు, సన్నిహితులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈడీ సవాల్ చేసేందుకు సన్నద్ధమవుతోంది. -
రాహుల్‌గాంధీ బావకు ఊరట
న్యూఢిల్లీ: లండన్‌లో ఆస్తుల కొనుగోలు కేసులో నగదు అక్రమ రవాణాకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా తాత్కాలిక బెయిల్‌ను ఢిల్లీ కోర్టు గురువారం పొడిగించింది. ఈ కేసులో ఇప్పటికే మార్చి 27 వరకు రాబర్ట్ వాద్రాకు తాత్కాలిక బెయిల్ ఇచ్చిన ఢిల్లీ కోర్టు తాజాగా ఏప్రిల్ 1వ తేదీ వరకు బెయిల్ పొడిగింపునకు అనుమతిని ఇచ్చింది. అప్పటివరకు వాద్రాను అరెస్ట్ చేయరాదని దర్యాప్తు సంస్థకు ఈ సందర్భంగా కోర్టు సూచించింది. గురువారం ఈ కేసులో వాదనలు జరిగాయి. ఇంటరాగేషన్ కోసం రాబర్ట్ వాద్రాను అప్పగించాలని ప్రత్యేక న్యాయమూర్తి అర్వింద్ కుమార్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోరింది. అయితే వాద్రా తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కేటీఎస్ తులసి వాదనలు వినిపిస్తూ, వాద్రాపై వచ్చినవి నిరాధార ఆరోపణలని, కోర్టు మంజూరు చేసిన తాత్కాలిక బెయిల్‌ను ఆయన దుర్వినియోగం చేయలేదని న్యాయమూర్తికి వివరించారు. -
ఫ్యామిలీ కోటాలో రాబర్ట్ వాద్రాకు భారత రత్న!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా లక్ష్యంగా బీజేపీ పదునైన వ్యంగ్యాస్త్రాలు సంధించింది. దేశాన్ని దోచుకున్నానని అంగీకరించినందుకు ఆయన భారత రత్న పురస్కారానికి అర్హులని చురకలు అంటించింది. దేశాన్ని లూటీ చేసిన వ్యక్తులు దేశం నుంచి పారిపోయారని, కానీ, తాను ఇంకా దేశంలోనే ఉన్నానని రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలపై బీజేపీ ఈ మేరకు ట్విటర్లో విమర్శలు చేసింది. ‘రాబర్ట్ వాద్రా నిజాయితీపరుడు. లూటీ చేశానని అంగీకరించినందుకు ఆయనకు ధన్యవాదాలు. ఫ్యామిలీ కోటా ప్రకారం ఆయన ఇప్పుడు భారత రత్న పురస్కారానికి అర్హులు’ అని బీజేపీ తన అధికారిక ట్విటర్ పేజీలో ఎద్దేవా చేసింది. బుధవారం మీడియాతో మాట్లాడిన వాద్రా.. తాను దేశంలోనే ఉంటానని, అవినీతి ఆరోపణల నుంచి బయటపడేవరకు రాజకీయాల్లోకి రానని చెప్పారు. ‘నేను దేశంలోనే ఉన్నాను. దేశాన్ని లూటీ చేసి దేశం నుంచి పారిపోయిన వ్యక్తులు ఉన్నారు. వారి గురించి ఏమంటారు? నేను ఎప్పుడూ దేశంలోనే ఉంటాను. నాపై ఉన్న అభియోగాలు తొలగిపోయేవరకు నేను దేశాన్ని వీడను. రాజకీయాల్లోకి రాను. అది నా హామీ’ అని వాద్రా అన్నారు. Robert is really honest. Thanks for accepting that you looted. You are now eligible for the Bharat Ratna as per your family quota :) https://t.co/zQRl5hQ0xt — BJP (@BJP4India) 7 March 2019 -
ఈడీ దర్యాప్తుపై స్టే కుదరదు..
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొం టున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాకు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణపై స్టే విధించాలన్న వాద్రా పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. మంగళవారం జరగనున్న ఈడీ విచారణకు హాజరుకావాలని వాద్రాను ఆదేశించింది. ఇక గతేడాది వాద్రా ఆఫీసుల్లో నిర్వహించిన దాడుల్లో సేకరించిన డాక్యుమెంట్ల హార్డ్‌కాపీలను వాద్రాకు అందించాలని సీబీఐ ప్రత్యేక జడ్జి అరవింద్ కుమార్ ఈడీని ఆదేశించారు. తదుపరి విచారణను మార్చి 2కు వాయిదా వేశారు. గతేడాది డిసెంబర్ 7న ఢిల్లీలో ఉన్న వాద్రా ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించిన ఈడీ పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. వీటి ఆధారంగా ప్రస్తుతం తనను విచారిస్తోందని.. ఈ డాక్యుమెంట్ల కాపీలను తనకు అందించాలని కోరుతూ వాద్రా కోర్టును ఆశ్ర యించారు. డాక్యుమెం ట్ల కాపీలు తనకు ఇచ్చేవరకు విచారణ ఆపేయాల్సిందిగా ఈడీని ఆదేశించాలని వాద్రా తన పిటిషన్లో కోరారు. తొందరేముంది.. వస్తా ప్రస్తుతం తనపై ఉన్న కేసులన్నీ పూర్తయిన తర్వాత రాజకీయాల్లోకి వస్తానని వాద్రా అన్నారు. సోమవారం ఆయన ఈ మేరకు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. వాద్రా రాజకీయాల్లోకి వస్తున్నారని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘రాజకీయాల్లోకి వస్తా. ప్రజా సేవ చేస్తా. తొందరేముంది. తొలుత నాపై ఉన్న నిరాధార ఆరోపణలన్నీ తొలగిపోవాల్సి ఉంది. అలాగే నేను మార్పు తీసుకురాగలనని ప్రజలు కూడా నమ్మాలి’ అని పేర్కొన్నారు. -
వాద్రాజీ రండి.. అబ్బే తొందరేం లేదు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా రాజకీయాల్లోకి రాబోతున్నానని సంకేతాలు ఇవ్వడంతో ఆయనను ఆహ్వానిస్తూ తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. మొరాదాబాద్ వాద్రా స్వస్థలం కావడంతో స్థానిక మద్దతుదారులు ఆయనకు అనుకూలంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు పెట్టారు. ‘మొరాదాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా రాబర్ట్ వాద్రాజీనీ ఆహ్వానిస్తున్నాం’ అని వారు ఫ్లెక్సీల్లో రాశారు. మనీలాండరింగ్ కేసు నుంచి విముక్తి పొందగానే ప్రజాసేవలో మరింత పెద్దపాత్ర పోషించాలని ఆశిస్తున్నట్టు వాద్రా ఆదివారం ఫేస్బుక్లో చేసిన ఓ పోస్టులో పేర్కొనడం పలువురిని ఆశ్చర్యపరించింది. ఆయన రాజకీయాల్లోకి రాబోత్తున్నట్టు పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం.. చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో సోమవారం ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడిన రాబర్ట్ వాద్రా.. రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న మాట నిజమే కానీ, అందుకు తొందరేమీ లేదని వివరణ ఇచ్చారు. మొదట తనపై వచ్చిన ఆరోపణలు తప్పు అని రుజువు చేసుకోవాల్సిన అవసరముందని, ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడంపై కృషి చేస్తానని చెప్పారు. మరోవైపు వాద్రా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడింది. ప్రియాంక, రాహుల్ నడుపుతున్న సర్కస్.. జోకర్ కోసం ఎదురుచూస్తున్నదని, వాద్రా ఆ సర్కస్‌కు జోకర్ అని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఘాటుగా విమర్శించారు. -
పాలిటిక్స్‌లోకి ప్రియంకాగాంధీ భర్త!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజా జీవితంలోకి రావాలని ఉందంటూ రాజకీయ ప్రవేశంపై ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఫేస్బుక్ పోస్ట్ ద్వారా సంకేతాలు పంపిన నేపథ్యంలో ఆయనను రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ సోమవారం యూపీలోని మొరాదాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. ప్రియాంక గాంధీని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించి నెల తిరక్కుండానే ఆమె భర్త, వాణిజ్యవేత్త రాబర్ట్ వాద్రా రాజకీయాల్లో తాను చురుకైన పాత్ర పోషించాలనుకుంటున్నటు ఇటీవల సంకేతాలు పంపారు. తాను దేశ ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని, అయితే తాను రాజకీయాల్లోకి వస్తే భారీ వ్యత్యాసం ఉంటుందంటే ఎందుకు రాకూడదని ఆయన తన ఆకాంక్షను వెలిబుచ్చారు. ఇక మొరాదాబాద్‌లో వాద్రా పేరిట వెలిసిన పోస్టర్లు ఆసక్తికరంగా మారాయి. ‘రాబర్ట్ వాద్రాజీ మొరాదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేయాలని స్వాగతిస్తు’న్నామని ఆ పోస్టర్లలో పొందుపరిచారు. -
వాద్రా మధ్యంతర బెయిల్ పొడిగింపు
న్యూఢిల్లీ: భూకుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను ఢిల్లీ కోర్టు మార్చి 2 వరకు పొడిగించింది. ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు సహకరించాలని వాద్రాకు సూ చించింది. తదుపరి వాదనలు వినేంత వరకు వాద్రా ను అరెస్టు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో మరో నిందితుడు, వాద్రా సన్నిహితుడు మనోజ్ అరోరాను కూడా మార్చి 2 వరకు అరెస్టు చేయకూడదని ఈడీని ఆదేశించింది. మనీల్యాండరింగ్ కేసులో వాద్రా విచారణకు సహకరించడం లేదని.. అతడిని మరింత ప్రశ్నించాల్సి ఉందని ఈడీ కోర్టుకు నివేదించింది. విచారణకు సంబంధించిన విషయాలను వాద్రా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారంది. అతడికి మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపింది. ఈ వాదనలను వాద్రా తరఫు న్యాయవాది ఖండించారు. ఈడీ ఆదేశించిన ప్రతిసారీ వాద్రా విచారణకు హాజర య్యారని, తదుపరి విచారణకు కూడా హాజరయ్యేందుకు సిద్ధం గా ఉన్నారని కోర్టుకు తెలిపారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. వాద్రా మధ్యంతర బెయిల్ ను పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. విచారణ పేరుతో వేధిస్తున్నారు.. ఈడీ విచారణ తీరుపై రాబర్ట్ వాద్రా మండిపడ్డారు. విచారణకు సహకరిస్తున్నా అధికారులు తనను వేధిస్తున్నారన్నారు. రూ. 4.62 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్బుక్ వేదికగా ఈడీపై విమర్శల వర్షం కురిపించారు. ఈడీ ఆదేశించిన నాటి నుంచి తాను విచారణకు సహకరిస్తున్నానని, ఏమీ దాయ డం లేదని స్పష్టం చేశారు. 6 రోజుల నుంచి రోజూ 8 నుంచి 12 గంటల పాటు తనను విచారిస్తున్నారని తెలిపారు. లంచ్‌కు మాత్రమే 40 నిమిషాల విరా మం ఇచ్చేవారని చెప్పారు. వాష్‌రూమ్‌కు వెళ్లే సమయంలో కూడా తన వెంట అధికారులను పంపే వారని ఆరోపించారు. -
రాబర్ట్ వాద్రా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
సాక్షి, న్యూఢిల్లీ : లండన్‌లో అక్రమాస్తుల కేసులో మనీల్యాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు బికనీర్ భూ కుంభకోణం కేసులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి వాద్రా కంపెనీ స్కైలైట్ హాస్పిటాలిటీ లిమిటెడ్‌కు చెందిన రూ 4.62 కోట్ల విలువైన ఆస్తులను శుక్రవారం ఈడీ అటాచ్ చేసింది. ఇదే కేసులో మరికొందరి ఇతరుల ఆస్తులనూ ఈడీ అటాచ్ చేసింది. భూ నిర్వాసితులకు కేటాయించిన భూమిని రాబర్ట్ వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ కేవలం రూ 72 లక్షలకే దాదాపు 150 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అదే భూమిని రూ 5.15 కోట్లకు అలిగెన్సీ అనే కంపెనీకి విక్రయించారని ఈడీ ఆరోపిస్తోంది. అక్రమ లావాదేవీ ద్వారా ఆయన మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ వాద్రాపై అభియోగాలు మోపింది. -
తల్లితోపాటు ఈడీ ఎదుట వాద్రా
జైపూర్: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా, అతని తల్లి మౌరీన్ వాద్రా మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు. రాజస్తాన్‌లోని బికనీర్ జిల్లాలో భూ కుంభకోణానికి పాల్పడ్డారని వాద్రాపై పలు ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో నాలుగు రోజుల పర్యటనలో ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా తన భర్త, అత్తతోపాటు వచ్చి జైపూర్‌లోని ఈడీ కార్యాలయం వద్ద వారిని వదిలివెళ్లారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అధికారులు ముందుగా రాబర్ట్ వాద్రాను, కొద్దిసేపటి తర్వాత మౌరీన్‌ను విచారణ నిమిత్తం లోపలికి పిలిచారు. సుమారు 9 గంటలపాటు రాబర్ట్ వాద్రాను ప్రశ్నించిన ఈడీ అధికారులు.. బుధవారం కూడా హాజరుకావాల్సి ఉం టుందని ఆయనకు తెలిపారు. బికనీర్‌లో 2015లో జరిగిన భూ లావాదేవీల్లో వాద్రా ఫోర్జరీకి పాల్పడ్డారంటూ అప్పటి తహశీల్దార్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ కేసులు నమోదు చేశారు. ఈ మేరకు ఈడీ కూడా కేసు నమోదు చేసింది. దీంతోపాటు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూ కొనుగోళ్లు చేపట్టిన స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో గల సంబంధాలపైనా వాద్రాను ఈడీ ప్రశ్నించిందని సమాచారం. ఈ కేసులో ఈడీ మూడుసార్లు సమన్లు ఇచ్చినప్పటికీ రాబర్ట్ వాద్రా స్పందించలేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిటిషన్‌పై స్పందించిన రాజస్తాన్ హైకోర్టు.. విచారణకు సహకరించాలంటూ వాద్రాతోపాటు ఆయన తల్లి మౌరీన్‌ను ఆదేశించింది. అయితే, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంటూ ఈడీకి స్పష్టం చేసింది. -
వృద్ధురాలిపై మీకు ఎందుకింత కక్ష.. ?
-
వృద్ధురాలిపై మీకు ఎందుకింత కక్ష.. ?
జైపూర్ : లండన్‌లో అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఈడీ విచారణ కొనసాగుతోంది. మంగళవారం జైపూర్‌లో రాబార్్ట వాద్రాతో పాటు ఆయన తల్లి మౌరీన్ వాద్రాను కూడా ఈడీ విచారిస్తోంది. ఈ సందర్భంగా భర్త, అత్తతో పాటుగా ప్రియాంక గాంధీ జైపూర్ చేరుకున్నారు. ఈ క్రమంలో తన తల్లిని కూడా ఈడీ విచారించడంపై వాద్రా తీవ్రంగా స్పందించారు. తన భార్య ప్రియాంక రాజకీయ అరంగేట్రం నేపథ్యంలో తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని నరేంద్ర మోదీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు... ‘నాతో పాటు, 75 ఏళ్ల మా అమ్మ కూడా ఈరోజు జైపూర్‌లో ఈడీ ఎదుట హాజరయ్యారు. కారు ప్రమాదంలో కూతురిని, డయాబెటిస్ కారణంగా ఎదుగుతున్న కొడుకుని, అదే విధంగా భర్తను పోగొట్టుకున్న ఓ వృద్ధురాలి పట్ల ఈ ప్రభుత్వం ఇంత కక్షపూరితంగా, దిగజారుడు చర్యలకు పాల్పడుతుందో అర్థం కావడం లేదు. ఆ మూడు మరణాల కారణంగానే నాతో కలిసి ఆఫీసుకు రావాలని అమ్మను కోరాను. అక్కడ నాతో పాటే ఉంటే తనను ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకోవచ్చని భావించాను. ఆ సమయంలో మా జీవితంలో చోటుచేసుకున్న విషాదం గురించి దుఃఖిస్తూ బాధను కాస్త తగ్గించుకునే వాళ్లం. ఈరోజు తను కూడా ఈడీ ముందుకు రావాల్సి వచ్చింది. అయినా దేవుడు మాతో ఉన్నాడు’ అంటూ రాబర్ట్ వాద్రా ఫేస్బుక్లో భావోద్వేగ పోస్టును ఉంచారు.(రాబర్ట్ వాద్రా స్కామ్ ఏమిటీ ?) కాగా మనీల్యాండరింగ్ కేసులో వాద్రాను ఈనెల 6, 7, 10 తేదీల్లో విచారించిన ఈడీ మంగళవారం మరోసారి సుదీర్ఘంగా ప్రశ్నించింది. వాద్రా లండన్‌లో వరుసగా 5 మిలియన్ పౌండ్లు, 4 మిలియన్ పౌండ్ల విలువ చేసే రెండు ఇళ్లను, ఆరు ఫ్లాట్స్, ఇతర ఆస్తులను కొనుగోలు చేశారని, వీటిలో కొత్తగా చేజిక్కించుకున్న ఆస్తులు సైతం ఉన్నాయని ఈడీ ఢిల్లీ కోర్టుకు నివేదించిన సంగతి తెలిసిందే. -
రాబర్ట్ వాద్రా భావోద్వేగ పోస్ట్..
సాక్షి, న్యూఢిల్లీ : తొలిసారిగా క్రీయాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టిన ప్రియాంకగాంధీకి ఆమె భర్త రాబర్ట్ వాద్రా బెస్ట్ విషెస్ తెలిపారు. ఉత్తరప్రదేశ్ (తూర్పు) పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా బాధ్యతల అనంతరం తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ఆమె సోమవారం లక్నోలో పబ్లిక్ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రియాంక నాలుగు రోజుల పాటు యూపీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా రాబర్డ్ వాద్రా ...భార్య పొలిటికల్ ఎంట్రీతో పాటు ప్రియాంకను పరిపూర్ణ మహిళ అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ మేరకు తన ఫేస్బుక్లో... కొత్త ప్రయాణం మొదలుపెట్టిన ‘పి’ నీకు నా బెస్ట్ విషెస్ అని పోస్ట్ చేశారు. ప్రియాంక నాకు మంచి స్నేహితురాలే కాదు.. పర్ఫెక్ట్ వైఫ్. మా పిల్లలకు బెస్ట్ మదర్ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దుర్మార్గపు, విద్వేషపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని, ఈ పరిస్థితుల్లోనూ ప్రజలకు సేవ చేయడాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఆమెను దేశ ప్రజల చేతుల్లో పెడుతున్నాను. మీరే జాగ్రత్తగా చూసుకోండి అంటూ భావోద్వేగ పూరితంగా ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ 1997లో రాబర్డ్ వాద్రాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇక యూపీఏ హయాంలో ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రారంభించి రాజస్థాన్, హరియాణా, ఢిల్లీలో అక్రమంగా భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయి. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోయాక వాద్రా భూ కుంభకోణాలపై విచారణ కొనసాగుతోంది. అలాగే మనీ లాండరింగ్ కేసులో ఆయన ఈడీ ఎదుట విచారణకు హాజరు అవుతున్నారు. కాగా ఆహార్యంలోనే కాకుండా మాటతీరు, నడవడికలోనూ నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీని పోలి ఉండే ప్రియాంకనే ఆమెకు నిజమైన వారసురాలని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు. ప్రియాంకకు ఇందిరా గాంధీ పోలికలు ఉండటం పార్టీకి కలిసొస్తుందని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉండగా జరిగిన 1999 లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాంధీ అమేథీ నుంచి పోటీచేసినప్పుడు ప్రియాంక ఎన్నికల ప్రచారంలో తొలిసారి పాల్గొన్నారు. -
సత్యమే గెలుస్తుంది : రాబర్ట్ వాద్రా
సాక్షి, న్యూఢిల్లీ : లండన్‌లో అక్రమాస్తులు కూడబెట్టుకున్నారనే ఆరోపణలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను ఈడీ ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన క్రమంలో తానెలాంటి తప్పూ చేయలేదని వాద్రా ఆదివారం పేర్కొన్నారు. ఈడీ తనను ప్రశ్నించిన ఉదంతంపై స్పందించిన వాద్రా చివరికి సత్యమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా తనకు మద్దతుగా నిలిచిన స్నేహితులు, మద్దతుదారులకు ధన్యవాదాలని, తాను ధైర్యంగా, క్రమశిక్షణతో దేన్నైనా ఎదుర్కొంటానని వాద్రా ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. మనీల్యాండరింగ్ కేసులో వాద్రాను ఈనెల 6, 7 తేదీల్లో విచారించిన ఈడీ శనివారం మరోసారి సుదీర్ఘంగా ప్రశ్నించింది. వాద్రా లండన్‌లో వరుసగా 5 మిలియన్ పౌండ్లు, 4 మిలియన్ పౌండ్ల విలువ చేసే రెండు ఇళ్లను, ఆరు ఫ్లాట్స్, ఇతర ఆస్తులను కొనుగోలు చేశారని, వీటిలో కొత్తగా చేజిక్కించుకున్న ఆస్తులు సైతం ఉన్నాయని ఈడీ ఢిల్లీ కోర్టుకు నివేదించింది. కాగా తనకు విదేశాల్లో అక్రమాస్తులు లేవని, రాజకీయ కక్ష సాధింపుతోనే తనపై దాడులు చేస్తున్నారని వాద్రా చెబుతున్నారు. -
రాబర్ట్ వాద్రా స్కామ్ ఏమిటీ ?
సాక్షి, న్యూఢిల్లీ : లండన్‌లో అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను బుధ, గురు వారాలతోపాటు శనివారం నాడు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపు 15 గంటలపాటు విచారించింది. ఇంతకు ఆయనపై వచ్చిన ఆరోపణలు ఏమిటీ? ఆ ఆరోపణలు ఎలాంటివి, ఇప్పుడు వచ్చాయి ? వాటికి సంబంధించి ఈడీ అధికారుల వద్ద ఉన్న ఆధారాలు ఏమిటీ? ఆయనపై 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ ఆరోపణలు చేసినప్పటికీ ఆయన్ని విచారించేందుకు ఎందుకు ఇంతకాలం పట్టింది ? ఆయనపై ఎప్పటి నుంచో ఈ ఆరోపణలు ఉన్నా ఆయన్ని ఇప్పుడే ఎందుకు విచారణ జరపాల్సిన అవసరం ఏర్పడింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2005లో ఓ రక్షణ ఒప్పందం, 2009లో ఓ పెట్రోలియం ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాలు, ముఖ్యంగా రక్షణ ఒప్పందం ద్వారా లబ్ది పొందిన ప్రముఖ ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారి 2009లో లండన్‌లోని 12 బ్య్రాన్‌స్టన్ స్క్వేర్‌లో ఓ భవనాన్ని తన కంపెనీ ‘వోర్టెక్స్’ ద్వారా 19 లక్షల పౌండ్లకు కొనుగోలు చేశారు. దాన్ని ఆ మరసటి సంవత్సరమే దుబాయ్ వ్యాపారి సీసీ థంపీకి విక్రయించారు. ఆ భవనం పునరుద్ధరణకు సీసీ థంపీ 65 వేల పౌండ్లు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత ఆ భవనాన్ని బ్రిటన్‌లో సంజయ్ భండారీకి సంబంధం ఉన్న ఓ సింటాక్ కంపెనీకి కొన్న రేటుకే అంటే 19 లక్షల పౌండ్లకే విక్రయించారు. అంటే భండారీ కొనుగోలు చేసిన భవనం తిరిగి భండారీ చేతికే వచ్చిందన్న మాట. భండారి, సీసీ థంపీ, వాద్రాలకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్నది ఈడీ అధికారుల వాదన. ఒప్పందాల్లో లబ్ది పొందినందుకుగాను భండారీ ఆ భవనాన్ని రాబర్ట్ వాద్రా కోసం ముడుపుల కింద కొనుగోలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. మరి ఈ ఆరోపణకు రుజువు ఏమిటీ? 2016లో ఢిల్లీలోని సంజయ్ భండారీ ఇంటిపై ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడి చేసినప్పుడు ఓ కంప్యూటర్లో భండారి బంధువుకు, వాద్రా కార్యదర్శికి మధ్య నడిచిన ఈమెయిళ్లు దొరికాయి. లండన్‌లో ఉంటున్న భండారీ మేనల్లుడు సుమిత్ ఛద్దా, లండన్ 12 బ్య్రాన్‌స్టన్ స్కేర్ భవనం పునరుద్ధరణ బిల్లుల చెల్లింపుల గురించి వాద్రా కార్యదర్శికి ఆ మెయిల్స్ పంపించారు. అందులో ఓ మెయిల్‌కు వాద్రా స్వయంగా స్పందిస్తూ ‘రేపు ఉదయం ఈ విషయాన్ని పరిశీలిస్తాం. కార్యదర్శి మనోజ్ పరిష్కరిస్తారు’ అని చెప్పారు. భవనం పునరుద్ధర ణకు అయిన 65 వేల పౌండ్లను వాద్రా చెల్లించారనే, అందుకనే భండారి వద్ద కొన్న రేటుకు సీసీ థంపీ తిరిగి విక్రయించారని, తన ఆస్తి కావడం వల్ల వాద్రా పునరుద్ధరణ ఛార్జీలు చెల్లించారన్నది ఈడీ అధికారుల అనుమానం. సంజయ్ భండారీ 2008లో కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఆఫ్సెట్ ఇండియా సొల్యుషన్స్ కంపెనీ కొన్నేళ్లలో కొన్ని కోట్ల రూపాయలకు ఎలా ఎదిగిందో దర్యాప్తు జరపాల్సిందిగా 2014లో అధికారంలోకి రాగానే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఐబీ అధికారులను ఆదేశించింది. 2012లో భారత ప్రభుత్వంతో దాదాపు మూడు వేల కోట్ల రూపాయలకు శిక్షణ విమానాల ఒప్పందాన్ని చేసుకున్న స్విస్ సంస్థ ‘పిలాటస్’తో భండారీకి సంబంధాలు ఉన్నాయని, ఆ సంస్థ యాజమాన్యంతో రాబర్ట్ వాద్రా కూడా సంబంధాలు ఉన్నాయంటూ ఐబీ అధికారులు కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వెల్లడించారు. లండన్‌లోని ఆస్తులు, ముడుపులకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు సంజయ్ భండారి, తన ఇంటిపై 2016లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన నేపథ్యంలో నేపాల్ మీదుగా లండన్ పారిపోయారు. దాంతో లండన్ ఆస్తుల కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు. వాద్రా కార్యదర్శి, భండారి బంధువు మధ్య కొనసాగిన ఈ మెయిళ్లు మినహా మరో సాక్ష్యాన్ని ఈడీ అధికారులు సాధించలేకపోయారు. లండన్‌లో తనకు ఎలాంటి ఆస్తులు లేవని చెబుతున్న రాబర్ట్ వాద్రాను విచారిస్తున్న అధికారులు, భండారీతో ఆయనకున్న సంబంధాల గురించే గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నారని తెల్సిందే. ప్రియాంక గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి రాగానే ఆమె భర్త వాద్రాను విచారించడానికి కారణం ఆమె నైతిక స్థయిర్యాన్ని దెబ్బతీయడానికి లేదా ఆమె పరువు తీయడానికి ప్రయత్నం కావచ్చు. రఫేల్ యుద్ధ విమానాల డీల్‌లో నరేంద్ర మోదీని ప్రత్యక్షంగా విమర్శిస్తున్న రాహుల్ గాంధీ నోటికి తాళం వేసే ప్రయత్నమూ కావచ్చు. ఏదీ ఏమైనా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందడమే అసలు విషయం. -
మళ్లీ ఈడీ ముందుకు వాద్రా
న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ బావ రాబర్ట్ వాద్రా వరుసగా రెండో రోజు గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. ముగ్గురు అధికారులు వాద్రాను దాదాపు 9 గంటలకుపైగా ప్రశ్నించారు. లండన్‌లో ఆస్తుల కొనుగోలు వ్యవహారంలో బుధవారం వాద్రా ఇచ్చిన సమాధానాలపై సంతృప్తిచెందకపోవడంతో రెండు రోజు విచారణకు పిలిచింది. తొలిరోజు మాదిరిగానే రెండో రోజు కూడా ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదుచేశారు. బికనీర్ భూకుంభకోణానికి సంబంధించి మరో మనీ ల్యాండరింగ్ కేసులో వాద్రా ఈ నెల 12న జైపూర్‌లో మళ్లీ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. మరో కేసులో కార్తీ చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కూడా గురువారం ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. రాజకీయ కుటుంబాలకు చెందిన ఇద్దరు ప్రముఖులు ఒకేరోజు విచారణకు రావడంతో ఢిల్లీలోని జామ్‌నగర్ హౌజ్ ఈడీ కార్యాలయంలో కోలాహలం నెలకొంది. ఆ ప్రాంగణంలో ఢిల్లీ పోలీసులు, ఐటీబీపీ సిబ్బందిని మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. మీడియా ప్రతినిధులను నియంత్రించడానికి బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఉదయం 11 గంటలకు కార్తీ ఈడీ కార్యాలయానికి చేరుకోగా, 11.25 గంటలకు వాద్రా వచ్చారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసుకే సంబంధించి పి.చిదంబరంను శుక్రవారం విచారించే అవకాశాలున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. మాల్యాతో తల్వార్‌కు సంబంధాలు: ఈడీ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి విదేశాలకు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యాతో కార్పొరేట్ మధ్యవర్తి దీపక్ తల్వార్‌కు సంబంధాలు ఉన్నాయని ఈడీ ఢిల్లీ కోర్టుకు తెలిపింది. విదేశాల్లో ఉన్న తల్వార్ కొడుకు ఫిబ్రవరి 11న తమ ముందు విచారణకు హాజరవుతున్నారని, ఇద్దరిని కలిపి ప్రశ్నించాల్సి ఉందని వెల్లడించింది. తల్వార్ కస్టడీని వారం పాటు పొడిగించాలని కోరగా కోర్టు ఫిబ్రవరి 12 వరకు అనుమతిచ్చింది. -
బలపడుతున్న రాహుల్, మమతల మైత్రి
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్‌కతా పోలీసు కమిషనర్‌పై సీబీఐ దాడి, విదేశీ ఆస్తులకు సంబంధించి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఈడీ విచారణ సంఘటనలు కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలను మరింత దగ్గర చేశాయి. కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు మొదటి నుంచి ఐక్యతా రాగాన్ని ఆలపిస్తున్నప్పటికీ ఢిల్లీ పీఠాన్ని ఎవరు అధిష్టించాలన్న అంశంలో రాజీ కుదరక ఈ ఇరు పార్టీలు కాస్త దూర దూరంగానే ఉంటూ వచ్చాయి. గత ఆదివారం నాడు సీబీఐకి చెందిన 40 మంది అధికారులు కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ నివాసాన్ని ముట్టడించడం, అందుకు నిరసనగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధర్నా చేపట్టడం తెల్సిందే. ఈ వార్త తెల్సిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మమతకు ఫోన్ చేసి పార్టీ మద్దతును ప్రకటించారు. రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రాకు బ్రిటన్‌లో అక్రమంగా ఆస్తులున్నాయన్న ఆరోపణలపై ఈడీ అధికారులు నిన్న, నేడు ఆయన్ని విచారించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో మమతకు కూడా స్పందించి రాహుల్‌కు మద్దతుగా నిలిచారు. వాద్రాకు కేవలం షోకాజ్ నోటీసు జారీ చేసి విచారణ పేరుతో హంగామా చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. ‘మనమంతా ఐక్యంగా ఉన్నంత కాలం మనల్ని ఎవరు, ఏం చేయలేరు’ అని ఆమె బుధవారం కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘బీజేపీకే పాస్ సీబీఐ హైతో హమారే పాస్ ఘట్బంధన్ హై’ అని ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తామని ప్రకటించిన అఖిలేష్ యాదవ్, మాయావతిలు సంయుక్తంగా నినదించారు. వారు కూడా ఇప్పుడు వాద్రా విషయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. అఖిలేష్, మాయావతిలపై కూడా సీబీఐ దాడులు జరుగుతున్న విషయం తెల్సిందే. ప్రతిపక్షాలు లక్ష్యంగా సీబీఐ దాడులు జరిగితే ఆ పార్టీలు కకావికలంగా విచ్ఛిన్నం అవుతాయని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావించి ఉండవచ్చు. కానీ ఈ సీబీఐ దాడుల కారణంగా విపక్షాల మధ్య ఐక్యత మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. -
రెండోరోజు ఈడీ ముందుకు రాబర్ట్ వాద్రా
సాక్షి, న్యూఢిల్లీ: యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అల్లుడు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా రెండోరోజు గురువారం కూడా ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. విదేశాల్లో అక్రమాస్తులు, ఆర్థిక నేరాలకు సంబంధించిన ఆరోపణలపై వాద్రా బుధవారం తొలిసారి ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. రెండోరోజు రెండు గంటలపాటు వాద్రాను ఈడీ అధికారులు ప్రశ్నించారు. లండన్‌లోని ఆయన ఆస్తులపై ప్రధానంగా విచారించినట్టు తెలుస్తోంది. అక్రమాస్తుల వ్యవహారంలో వాద్రా ఓ దర్యాప్తు సంస్థ ముందు విచారణకు హాజరుకావడం ఇదే తొలిసారి. బుధవారం వాద్రాను దాదాపు ఐదున్నర గంటలపాటు విచారించిన అధికారులు, 40కి పైగా ప్రశ్నలను అడిగినట్లు సమాచారం. బుధవారం వాద్రాకు తోడుగా ప్రియాంక కూడా ఈడీ కార్యాలయం వరకు రావడం తెలిసిందే. కాగా, తనకు విదేశాల్లో ఎలాంటి అక్రమాస్తులూ లేవనీ, రాజకీయ కుట్రతోనే ఇదంతా జరుగుతోందని వాద్రా అంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనను వెంటాడి వేధిస్తున్నారన్నారు. అక్రమాస్తుల కేసులకు సంబంధించి తనకు ముందస్తు బెయిలు కావాలంటూ వాద్రా గతంలో ఢిల్లీలోని ఓ కోర్టును ఆశ్రయించగా, ఈడీ విచారణకు సహకరించాల్సిందిగా కోర్టు ఆయనకు సూచించింది. ఆర్థిక లావాదేవీలు, లండన్‌లో వాద్రా కొనుగోలు చేసిన, ఆయన అధీనంలో ఉన్న కొన్ని స్థిరాస్తులు తదితరాలపై వాద్రాను నగదు హవాలా నియంత్రణ చట్టం కింద విచారించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని అంతకుముందు అధికార వర్గాలు తెలిపాయి. లండన్‌లోని 12, బ్య్రాన్‌స్టన్ స్క్వేర్‌లో 1.9 మిలియన్ పౌండ్లు ఖర్చు పెట్టి వాద్రా ఓ ఆస్తిని కొన్నాడనీ, ఇందుకు ఆర్థికంగా ఆయన అక్రమ మార్గాలను వాడినట్లు ప్రధాన ఆరోపణ. లండన్‌లో మరికొన్ని ఆస్తులను వాద్రా అక్రమంగా కలిగి ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉందని కోర్టుకు ఈడీ తెలిపింది. -
ఈడీ విచారణకు వాద్రా
న్యూఢిల్లీ: యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అల్లుడు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా విదేశాల్లో అక్రమాస్తుల కేసుకు సంబంధించి బుధవారం ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆర్థిక నేరాలకు సంబంధించిన ఆరోపణలపై వాద్రా ఓ దర్యాప్తు సంస్థ ముందు విచారణకు హాజరుకావడం ఇదే తొలిసారి. వాద్రాకు తోడుగా ప్రియాంక కూడా ఈడీ కార్యాలయం వరకు రావడం విశేషం. బుధవారం మధ్యాహ్నం 3.45 గంటలకు తన న్యాయవాదులతో కలిసి వాద్రా ఈడీ విచారణకు హాజరయ్యారు. దాదాపు ఐదున్నర గంటలపాటు వాద్రాను విచారించిన అధికారులు, 40కి పైగా ప్రశ్నలను అడిగినట్లు సమాచారం. రేపు ఉదయం 10.30కి మళ్లీ విచారణకు రావాల్సిందిగా అధికారులు వాద్రాను ఆదేశించారు. అంతకుముందు వాద్రా మాట్లాడుతూ తనకు విదేశాల్లో ఎలాంటి అక్రమాస్తులూ లేవనీ, రాజకీయ కుట్రతోనే ఇదంతా జరుగుతోందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనను వెంటాడి వేధిస్తున్నారన్నారు. అక్రమాస్తుల కేసులకు సంబంధించి తనకు ముందస్తు బెయిలు కావాలంటూ వాద్రా గతంలో ఢిల్లీలోని ఓ కోర్టును ఆశ్రయించగా, ఈడీ విచారణకు సహకరించాల్సిందిగా కోర్టు ఆయనకు సూచించింది. ఆర్థిక లావాదేవీలు, లండన్‌లో వాద్రా కొనుగోలు చేసిన, ఆయన అధీనంలో ఉన్న కొన్ని స్థిరాస్తులు తదితరాలపై వాద్రాను నగదు హవాలా నియంత్రణ చట్టం కింద విచారించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని అంతకుముందు అధికార వర్గాలు తెలిపాయి. లండన్‌లోని 12, బ్య్రాన్‌స్టన్ స్క్వేర్‌లో 1.9 మిలియన్ పౌండ్లు ఖర్చు పెట్టి వాద్రా ఓ ఆస్తిని కొన్నాడనీ, ఇందుకు ఆర్థికంగా ఆయన అక్రమ మార్గాలను వాడినట్లు ప్రధాన ఆరోపణ. లండన్‌లో మరికొన్ని ఆస్తులను వాద్రా అక్రమంగా కలిగి ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉందని కోర్టుకు ఈడీ తెలిపింది. నా కుటుంబం వెంటే ఉంటా: ప్రియాంక భర్త వాద్రాకు తోడుగా ఈడీ కార్యాలయం వరకు ప్రియాంక వచ్చారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా మీరు బాధ్యతలు తీసుకుంటున్న తరుణంలో ఏదైనా రాజకీయ సందేశం పంపడానికే మీరు ఇక్కడకు వచ్చారా?’ అని మీడియా ప్రియాంకను ప్రశ్నించగా ‘ఆయన నా భర్త. ఆయనే నా కుటుంబం. నేను నా కుటుంబానికి మద్దతుగా ఉంటాను’ అని ఆమె చెప్పారు. రాజకీయ కక్షసాధింపుతోనే ఇది జరుగుతోందా అన్న ప్రశ్నకు ‘ఇదంతా ఎందుకు జరుగుతోందో అందరికీ తెలుసు’ అని ఆమె బదులిచ్చారు. బెంగాల్ సీఎం మమత కాంగ్రెస్ పక్షాన నిలుస్తూ, ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం కావాలనే ఆరోపించారు. వాద్రాను కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని స్థానిక కాంగ్రెస్ నేత, ఈ కేసులో ఇంతకుముందే ఈడీ విచారణను ఎదుర్కొన్న జగదీశ్ శర్మ అన్నారు. మరో హవాలా కేసుకు సంబంధించి ఈ నెల 12న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా రాజస్తాన్ హైకోర్టు గతంలో వాద్రాను ఆదేశించింది. కాగా, వాద్రాకు సన్నిహితుడు, ఆయనకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ ఎల్ఎల్పీలో ఉద్యోగి మనోజ్ అరోరాను అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఢిల్లీ కోర్టు ఈ నెల 16 వరకు పొడిగించింది. పెట్రోలియం, రక్షణ ఒప్పందాల్లో వాద్రాకు ముడుపులు: బీజేపీ వాద్రా ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో బీజేపీ ఆయనపై బుధవారం పలు ఆరోపణలు చేసింది. యూపీఏ అధికారంలో ఉన్న కాలంలో పెట్రోలియం, రక్షణకు సంబంధించిన ఒప్పందాల్లో వాద్రాకు ముడుపులు అందాయని ఆ పార్టీ ఆరోపించింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ ‘2008–09 కాలంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు అందిన ముడుపులతో వాద్రా లండన్‌లో 8 నుంచి 9 స్థిరాస్తులు కొన్నారు’ అని పేర్కొన్నారు. ‘రోడ్ల వెంట తిరిగే వ్యక్తి కోటీశ్వరుడు అవ్వడానికి సూత్రం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం అవినీతికి పాల్పడటమే. ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్న కుటుంబంలో ప్రతి ఒక్కరూ బెయిల్‌పై బయటే ఉన్నారని అందరికీ తెల్సు. అవినీతి ముఠాకు, పారదర్శక మోదీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరాటమే 2019 లోక్‌సభ ఎన్నికలు’ అని అన్నారు. విధుల్లో ప్రియాంక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తూర్పు ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను ఆమె పర్యవేక్షించనున్నారు. భర్త వాద్రాను ఈడీ ఆఫీస్ వద్ద దించిన తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమె బాధ్యతలను చేపట్టారు. తర్వాత కార్యకర్తలతో మాట్లాడారు. ప్రియాంకను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఆమె అన్న, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గత నెలలో నియమించడం తెల్సిందే. ప్రియాంక పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో గురువారమే తన తొలి కార్యక్రమంలో పాల్గొననున్నారు. లోక్‌సభ ఎన్నికల కోసం వ్యూహ రచనకు రాహుల్ అధ్యక్షతన అందరు ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఇన్–చార్జ్‌లతో ఈ సమావేశం జరగనుంది. -
లండన్‌లో ఆస్తులు లేవన్న వాద్రా
సాక్షి, న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఈడీ విచారణకు హాజరైన ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా తనకు లండన్‌లో ఎలాంటి ఆస్తులూ లేవని దర్యాప్తు సంస్థకు తెలిపారు. లండన్‌లో వాద్రా స్ధిరాస్తుల కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలు, ఆస్తుల వివరాలపై బుధవారం ఆయనను ప్రశ్నించిన ఈడీ మనీల్యాండరింగ్ చట్టం కింద వాద్రా స్టేట్మెంట్ను రికార్డు చేసింది. లండన్‌లో తన తరపున ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలు చక్కబెట్టిన మనోజ్ అరోరా గురించి ఈడీ ప్రశ్నించగా అరోరా గతంలో తన వద్ద పనిచేసిన ఉద్యోగిగా తెలుసని, ఆయన తన తరపున ఎలాంటి ఈమెయిల్స్ రాయలేదని ఈడీ అధికారులతో తెలిపారు. వాద్రాకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన అరోరా వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ ఎల్ఎల్పీ ఉద్యోగి. కాగా ఆర్థిక అవకతవకల ఆరోపణలపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ బావ, ప్రియాంక భర్త వాద్రా దర్యాప్తు సంస్ధల ఎదుట హాజరవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా అంతకుముందు వాద్రాను ప్రియాంక గాంధీ ఈడీ కార్యాలయం వద్ద డ్రాప్ చేసి పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టేందుకు నేరుగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. టొయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహనంలో ఎస్పీజీ భద్రత నడుమ వాద్రా దంపతులు మధ్య ఢిల్లీలోని జామ్‌నగర్ హౌస్‌లోని ఈడీ కార్యాలయం చేరుకున్నారు. -
పార్టీ బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ బుధవారం పార్టీ ప్రధాన కార్యలయంలో బాధ్యతలు స్వీకరించారు. ప్రియాంకను పార్టీ ప్రధాన కార్యదర్శిగా, తూర్పు యూపీ ఇన్‌ఛార్జ్‌గా ఆమె సోదరుడు, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ జనవరి 23న నియమించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని అక్బర్ రోడ్ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాహుల్ చాంబర్ పక్కనే ప్రియాంక కార్యాలయం ఏర్పాటు చేశారు. కాగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ప్రియాంక గురువారం తొలి అధికారిక సమావేశంలో పాల్గొంటారు. సార్వత్రిక ఎన్నికలకు అవసరమైన వ్యూహాలను రూపొందించేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లతో జరిగే సమావేశానికి ప్రియాంక హాజరుకానున్నారు. వాద్రాకు బాసట మనీల్యాండరింగ్ కేసులో ఈడీ ఎదుట హాజరైన తన భర్త, వాణిజ్యవేత్త రాబర్ట్ వాద్రాకు ప్రియాంక సంఘీభావం తెలిపారు. కుటుంబానికి అండగా నిలుస్తానని స్పష్టం చేశారు. ఈడీ విచారణ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు. వాద్రాను ఈడీ కార్యాలయం వద్ద డ్రాప్ చేసిన అనంతరం నేరుగా ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్న ప్రియాంక పార్టీ బాధ్యతలు స్వీకరించారు. కాగా వాద్రాకు ఈనెల 16 వరకూ మధ్యంతర బెయిల్‌ను ఢిల్లీ కోర్టు మంజూరు చేసింది. -
టార్గెట్ వాద్రా.. దాడిని ముమ్మరం చేసిన బీజేపీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకగాంధీ రాజకీయ ఆరంగేట్రం చేసిన నేపథ్యంలో ఆమె భర్త రాబర్ట్ వాద్రా లక్ష్యంగా బీజేపీ తన దాడిని ముమ్మరం చేసింది. గతంలో వెలుగుచూసిన అవినీతి ఆరోపణలపై ఈడీ విచారణకు హాజరయ్యేందుకు ఆయన సిద్ధమవుతున్న నేపథ్యంలో బీజేపీ తన విమర్శల దాడిని పెంచింది. పెట్రోల్, డిఫెన్స్ ఒప్పందాల ద్వారా రాబార్ట్ వాద్రా భారీ ఎత్తున ముడుపులు అందుకున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ముడుపుల ద్వారా అందుకున్న డబ్బుతో లండన్‌లో వాద్రా ఎనిమిది ఆస్తులు కొన్నారని పేర్కొన్నారు. ఈ కేసులో ముద్దాయిగా ఈడీ ముందు రాబర్ట్ వాద్రా హాజరవుతున్నారని చెప్పారు. వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని వాద్రా దోచుకున్నారని, అవినీతి పునాదులపై కాంగ్రెస్ పార్టీ నిలబడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని లూటీ చేసిందని, లక్ష రూపాయలు కూడా లేని వాద్రా దేశవిదేశాల్లో ప్లాట్లు ఎలా కొన్నారని, రోడ్‌పతి నుంచి కరోడ్‌పతి వరకు వాద్రా ఎలా ఎదిగారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఫ్యామిలీ అంతా బెయిల్ ఫ్యామిలీగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రియాంక గాంధీ ఫ్యామిలీ బిజినెస్‌లో చేరడం పెద్ద విషయం కాదంటూ ఆమె రాజకీయాల్లో చేరడాన్ని ప్రస్తావించారు. -
మనీల్యాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ఊరట
-
వాద్రా సంబంధీకులపై ఈడీ దాడులు
న్యూఢిల్లీ: రక్షణ ఒప్పందాల్లో కమీషన్లు తీసుకున్నారన్న ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా సంబంధీకుల ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఢిల్లీ, బెంగళూరులోని పలుచోట్ల శుక్రవారం ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. వాద్రా, మరో వ్యక్తికి చెందిన సంస్థల్లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగుల ఇళ్లపై దాడులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రక్షణ కొనుగోళ్ల ఒప్పందాల్లో వారు కమీషన్లు తీసుకున్నట్లు అనుమానిస్తున్నామని, ఆ డబ్బుతో వారు విదేశాల్లో ఆస్తులు కొన్నట్లు ఆరోపణలున్నాయని తెలిపారు. వారి ఇళ్లల్లోనే సోదాలు జరపడానికి తగిన సాక్ష్యాలు సేకరించినట్లు చెప్పారు. అయితే ఎవరి ఇళ్లపై దాడులు జరిపినదీ, ఏ రక్షణ ఒప్పందం కింద ఈ చర్యలు తీసుకున్నదీ వెల్లడించలేదు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో మధ్యవర్తి క్రిస్టియన్ మైకేల్‌ను యూఏఈ భారత్‌కు అప్పగించిన నాలుగు రోజుల తరువాత ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీకి ఓటమి భయం: కాంగ్రెస్ తాజా సోదాలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతో మోదీ..వాద్రాపై రాజకీయ కక్షకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ఇలాంటి చర్యలకు తాము భయపడేది లేదని తేల్చిచెప్పింది. వాద్రా లాయర్ జ్యోతి ఖైతాన్ కూడా ఈడీ అధికారుల తీరును తప్పుపట్టారు. సెర్చ్ వారంట్లు లేకుండానే ఈడీ అధికారులు వాద్రా సంబంధీకుల ఇళ్లలోకి ప్రవేశించి లోపలి నుంచి తాళం వేశారని ఆరోపించారు. ఈ చర్య వెనక ప్రభుత్వ పాత్ర ఉండొచ్చని సందేహం వ్యక్తం చేశారు. లేని సాక్ష్యాల్ని సృష్టించేందుకు కుట్ర జరుగుతోందన్నారు. -
భూ స్కాంతో వాద్రా కోట్లు ఆర్జించారు
జైపూర్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సొంత బావ రాబర్ట్ వాద్రా భారీ భూ కుంభకోణానికి పాల్పడి, డబ్బు బాగా వెనకేశారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాజస్థాన్‌లో ఎన్నికల ర్యాలీల్లో ఆరోపించారు. రాబర్ట్ వాద్రాకు చెందిందిగా భావిస్తున్న బికనీర్‌లోని స్కైలైట్ హాస్పిటాలిటీ భూములు కొనుగోలు చేసేందుకు అప్పులిచ్చిన ఒక సంస్థకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా పన్ను రాయితీలు కల్పించిందంటూ వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో నెహ్రూ–గాంధీ కుటుంబం అల్లుడు(వాద్రా) భారీగా కమీషన్లు పుచ్చుకున్నారని ఆరోపించారు. దీనిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అక్రమ పద్ధతుల్లో ఇచ్చిన రుణాలే ఇప్పుడు నిరర్థక ఆస్తులు(ఎన్పీఏ)గా మారాయన్నారు. రాజస్తాన్‌లోని బీజేపీ ప్రభుత్వాన్ని ‘అంగదుని పాదం’ అని అభివర్ణించారు. రాబర్ట్ వాద్రాకు ఈడీ సమన్లు న్యూఢిల్లీ: భూ కుంభకోణం కేసులో వాద్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. విచారణకు వచ్చే వారం హాజరు కావాల్సిందిగా కోరింది. నవంబర్‌లో జారీ చేసిన మొదటి సమన్లకు వాద్రా స్పందించలేదు. ప్రముఖ స్టీల్ కంపెనీ ఒకటి దేశ సరిహద్దుల్లోని సుమారు వందెకరాల స్థలం కొనుగోలు చేసేందుకు వాద్రా సంస్థలకు రుణం ఇవ్వడంపైనా ప్రశ్నించనుంది. వాద్రాకు చెందిన పలువురు వ్యక్తులపై గతంలో ఈడీ దాడులు కూడా చేపట్టింది. -
రాబర్ట్ వాద్రాకు ఈడీ సమన్లు
సాక్షి, న్యూఢిల్లీ : బికనీర్ భూ ఒప్పందం కేసుకు సంబంధించి సోనియా గాంధీ అల్లుడు, వాణిజ్యవేత్త రాబర్ట్ వాద్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. బికనీర్‌లో భూముల కొనుగోలుకు అధిక వడ్డీతో ఓ కంపెనీ రుణం సమకూర్చిందని, ఈ రుణం వాద్రాకు పన్ను ఎగవేతలకు ఉపకరించిందని, ఆదాయ పన్ను సెటిల్మెంట్ నుంచి ఉపశమనం కలిగిందనే వార్తలు వెలువడిన కొద్ది గంటల్లోనే ఈడీ నుంచి సమన్లు రావడం గమనార్హం. ఆర్మీ ఫైరింగ్ రేంజ్ నిర్వాసితులకు ఉద్దేశించిన కోయాపేట్ ప్రాంతంలోని భూ లావాదేవీల్లో అక్రమాలపై ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ వ్యవహారంలో ఈడీ 2015లో మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం (పీఎంఎల్ఏ) కింద క్రిమినల్ కేసు నమోదు చేసింది. చట్టవిరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తుల పేరుతో కేటాయింపులు జరిగాయని రెవెన్యూ శాఖ నిర్ధారించడంతో రాజస్ధాన్ ప్రభుత్వం 374 హెక్టార్ల భూమి హక్కుల బదలాయింపులను రద్దు చేసింది. హర్యానాలోని గురుగ్రామ్‌లోనూ 2008లో ఓ భూ కుంభకోణానికి సంబంధించిన మరో కేసులోనూ వాద్రా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వాద్రా వివరణ బికనీర్ భూ కుంభకోణంపై ఈడీ సమన్లు జారీ చేయడంపై రాబర్ట్ వాద్రా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ తరహా కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. రాఫేల్ డీల్, ఇతర అంశాలపై బీజేపీని ప్రశ్నించిన ప్రతిసారీ తన పేరును బయటికి లాగుతున్నారని మండిపడ్డారు. తనపై వచ్చిన అభియోగాలన్నీ న్యాయస్ధానాల పరిధిలో ఉన్నాయన్నారు. -
రూపాయి విలువ పడిపోయినా నేనే కారణమా!?
సాక్షి, న్యూడిల్లీ : ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాఫెల్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. భారత ప్రభుత్వం సూచన మేరకే రిలయన్స్ డిఫెన్స్‌ని ఒప్పందంలో భాగస్వామిగా చేసుకున్నట్టు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే బాంబు పేల్చిన నాటి నుంచి.. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ లక్ష్యంగా.. రాహుల్ గాంధీ విమర్శల పర్వం కొనసాగిస్తుంటే మరోవైపు బీజేపీ నేతలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాను టార్గెట్ చేశారు. రాబర్ట్ వాద్రాకు సంబంధించిన సంస్థకు రాఫెల్ కాంట్రాక్టు దక్కలేదనే అక్కసుతోనే కాంగ్రెస్ మోదీ ప్రభుత్వంపై దాడికి దిగుతోందని వారు ఆరోపించారు. ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలపై రాబర్ట్ వాద్రా స్పందించారు. ఇప్పటికైనా నిజం చెప్పండి.. రాఫెల్ డీల్ గురించి కనీసం ఇప్పుడైనా భారత ప్రజలకు నిజం చెప్పాల్సిన బాధ్యత మోదీ ప్రభుత్వానికి ఉందని వాద్రా వ్యాఖ్యానించారు. అబద్ధాలతో ప్రజలను ఇంకెన్నాళ్లు మభ్యపెడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఫెల్ ఒప్పందం కోసం భరత జాతిని అమ్మి వేశారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతీ విషయానికి తనను టార్గెట్ చేయడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు. బీజేపీదంతా ఓ ప్రహసనమని.. రూపాయి విలువ పడిపోయినా, ఇంధన ధరలు పెరిగినా దానికి కూడా వాద్రానే కారణమనేలా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. దర్యాప్తు సంస్థలను సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటూ నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ వాద్రా ఆరోపించారు. కాగా యూపీఏ హయాంలో జరిగిన రక్షణ ఒప్పందం కుదర్చడంలో రాబర్ట్ వాద్రా సహాయం పొందేందుకు ఓ డిఫెన్స్ డీలర్.. ఆయనకు లండన్‌లో ఒక ఫ్లాట్ బహుమతిగా ఇచ్చారంటూ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా లండన్ వెళ్లేందుకు వాద్రా కోసం సదరు డీలర్ ఫస్ట్ క్లాస్ టికెట్లు బుక్ చేశారంటూ.. అందుకు సంబంధించిన కాపీలను సంబిత్ మీడియాకు విడుదల చేశారు. -
వాద్రా, హుడాపై ఎఫ్ఐఆర్
చండీగఢ్: గుర్గావ్లో అక్రమ భూ ఒప్పందాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ బావ రాబర్ట్ వాద్రా, హరియాణా మాజీ సీఎం భూపిందర్‌సింగ్ హుడాలపై శనివారం పోలీసులు కేసు నమోదుచేశారు. సురేందర్ శర్మ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు వాద్రా, హుడాతో పాటు డీఎల్ఎఫ్, ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ కంపెనీలపై ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్లు మనేసర్ డీసీపీ రాజేశ్ చెప్పారు. గుర్గావ్లోని 4 గ్రామాల్లో హౌసింగ్ కాలనీలు, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి హుడా సీఎంగా ఉన్న సమయంలో ఇచ్చిన అనుమతుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలున్నాయి. వీటిపై విచారణకు ఖట్టర్ ప్రభుత్వం 2015లో జస్టిస్ ధింగ్రా కమిటీ వేసింది. వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ 2008లో ఓంకారేశ్వర్ ప్రాపర్టీస్ నుంచి 3.5 ఎకరాల భూమిని రూ.7.50 కోట్లకు కొనుగోలుచేసి, హుడా పలుకుబడితో వాణిజ్య అనుమతులు పొంది ఆ భూమిని డీఎల్ఎఫ్కు రూ.58 కోట్లకు విక్రయించిందని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. -
‘రాహుల్ ప్రధాని కావాలని మొక్కుకున్నా’
సాక్షి, తిరుపతి: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి సుప్రభాత సేవలో ఆయన పాల్గోన్నారు. శ్రీవారిని దర్శించకున్న వాద్రాకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. దర్శనాంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సోనియా గాంధీ ఆరోగ్యం బాగుండాలని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని స్వామివారిని మొక్కుకున్నట్లు వాద్రా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ కోసం చాల కష్టపడుతున్నారని కోనియాడారు. ప్రియాంక గాంధీ మద్దతు రాహుల్‌కు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టంచేశారు. రద్దీ సాధారణం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఒక్క కంపార్టుమెంట్లోనే భక్తులు వేచిఉన్నట్లు అధికారులు తెలిపారు. సర్వదర్శనానికి ఐదు గంటలు, స్లాట్ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. శనివారం తిరుమలలో వెంగమాంబ వర్దంతి వేడుకలు నిర్వహించనున్నట్టు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. తిరుమల శ్రీవారి ఆలయంలో 12 ఏళ్లకో సారి ఆగమోక్తంగా నిర్వహించే అష్టబంధన బాలా లయ మహాసంప్రోక్షణ కార్యక్రమం గురువారం శాస్త్రోక్తంగా ముగిసింది. శుక్రవారం నుంచి భక్తులు శ్రీవారి దర్శించుకోవడానికి అధికారులు అనుమతిస్తున్న విషయం తెలిసిందే. -
మౌనమెందుకు రాహుల్?: బీజేపీ
న్యూఢిల్లీ: పన్ను ఎగవేతకు సంబంధించి బావ రాబర్ట్ వాద్రాకు ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం నోటీసులు పంపడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఎందుకు మాట్లాడటం లేదని బీజేపీ బుధవారం ప్రశ్నించింది. ఈ అంశంపై రాహుల్ మాట్లాడాలని డిమాండ్ చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ‘బావకు నోటీసులు రావడంపై రాహుల్ ఎందుకు మౌనంగా ఉన్నారు?’ అని ప్రశ్నించారు. ‘యూపీఏ ప్రభుత్వ హయాంలో మాల్యా, వాద్రాలు చట్టాలను ఉల్లంఘించి కోట్లు గడించారు. అప్పుడు సకల సౌకర్యాలతో బతికిన వారు ఇప్పుడు కష్టాలను ఎదుర్కొంటున్నారు. అక్రమార్కులను మేం ఎలా చూస్తామో, యూపీఏ ఎలా చూసిందో మీరే చెప్పాలి’ అని విలేకరులతో సంబిత్ పాత్ర అన్నారు. -
24 ఏళ్ల సర్వీసు.. 51 పోస్టులు.. మెగా దంగల్
చండీగఢ్: హరియణా కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా.. 52 ఏళ్లకే.. 51 పోస్టింగ్‌లు.. 24 ఏళ్ల సర్వీసులో తరచుగా బదిలీలు... అవినీతికి వ్యతిరేకంగా గొంతెత్తినందుకు ఆయనకు లభించిన బహుమానాలు. నిజాయితీ, కచ్చితమైన నిర్ణయాలు తీసుకునే సాహసం చేసినందుకు ప్రాణాలు తీస్తామంటూ బెదిరింపులు.. కానీ ఆయన నిజాయితీ ముందు ఇవేమి నిలవలేకపోయాయి. సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు గుర్గావ్లో భూమార్పిడిని నిలిపివేసి ఒక్కసారిగా అశోక్ వార్తల్లోకెక్కారు. అంతేకాదు హరియణా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా పాలనలో చోటుచేసుకున్న అనేక కుంభకోణాలను బయటపెట్టారు. ఆ కారణంగానే తరచుగా ట్రాన్స్ఫర్లు.. ప్రస్తుతం ఆయన ‘మెగా దంగల్’కు సిద్ధం అవుతున్నారు. ఎన్నో బదిలీల తర్వాత అశోక్ ఖేమ్కా హరియణా రాష్ట్ర యువజన, క్రీడా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన క్రీడాకారులతో నిండి ఉన్న హరియణా వంటి రాష్ట్రంలో ఇంత పెద్ద ఈవెంట్‌కు నిర్ణయకర్తగా వ్యవహరించడం గర్వంగా ఉందన్నారు. 2010 కామన్వెల్త్ క్రీడల్లో కూడా అత్యధిక పతకాలు సాధించింది హరియణా క్రీడాకారులేనన్నారు. పోటీతత్వానికి మారుపేరుగా నిలిచే క్రీడాకారులకు జీవనోపాధి కల్పించడం కనీస బాధ్యత అని, అందుకోసం వారికి ఉద్యోగాలు కల్పించడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్యంతో కూడిన క్రీడా అకాడమీలు పెంచడం ద్వారా క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. మార్చి21 నుంచి 23 వరకు జరిగే మల్లయుద్ధ పోటీల నిర్వహణ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నానని అశోక్ ఖేమ్కా చెప్పారు. ఉద్యోగం ఉంటేనే భద్రత.. ‘ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తర్వాత ప్రతిభకు గుర్తింపుగా ఎంతో కొంత పారితోషకం లభిస్తుంది. కానీ జీవితం సాఫీగా సాగాలంటే ఉద్యోగం అవసరం. క్రీడలను కెరీర్‌గా ఎంచుకునేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకోసం ప్రతిభకు పదునుపెట్టాలి. ఒలింపిక్స్‌లో భారత్‌కు 5 నుంచి 10 పతకాలు హర్యానా క్రీడాకారులు అందిస్తారని’ అశోఖ్ విశ్వాసం వ్యక్తం చేశారు. మెగా దంగల్ ఎందుకంటే.. స్వాతంత్ర్య సమర యోధులు.. భగత్ సింగ్, శివరాం హరి రాజ్‌గురు, సుఖ్‌దేవ్ థాపర్లను ఉరి తీసిన రోజును హరియణాలో సహేదీ దివస్‌గా జరుపుతారు. ఈ రోజును పురస్కరించుకుని హర్యానా ప్రభుత్వం మల్ల యుద్ధ పోటీలు నిర్వహిస్తోంది. రూ.1.8 కోట్ల భారీ ప్రైజ్ మనీ అందిస్తోంది. ‘ఈ పోటీలను విజయవంతం చేసేందుకు ఇండోర్ స్టేడియంను సిద్ధం చేశామని, ప్రేక్షకుల కోసం ఈసారి ఏసీలు కూడా ఏర్పాటు చేశామని’ క్రీడా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అశోఖ్ తెలిపారు. -
ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు: హార్ధిక్
అహ్మదాబాద్ : సీడీల వ్యవహారంతో వార్తల్లో నిలిచిన పటేల్ ఉద్యమ నాయకుడు హార్థిక్ పటేల్ తనపై వచ్చిన తాజా ఆరోపణలను తోసిపుచ్చారు. ఎన్నికల సమయంలో తాను సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాను కలిసినట్లు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని ఆయన బుధవారమిక్కడ అన్నారు. తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారం జరుగుతోందని హార్ధిక్ పటేల్ ధ్వజమెత్తారు. రేపో...మాపో తాను నవాజ్ షరీఫ్, దావూద్ ఇబ్రహీంను కలిసినట్లు ప్రచారం చేసేలా ఉన్నారని ఆయన విమర్శించారు. బీజేపీ ఇలాంటి చెత్త రాజకీయాలు చాలా చేస్తుందని వ్యాఖ్యానించారు. కాగా హార్ధిక్ పటేల్‌పై ఆయన మాజీ అనుచరుడు దినేశ్ బంభూనియా మరో బాంబ్ పేల్చారు. ఎన్నికలకు ముందు హార్ధిక్ నాలుగు సార్లు రాహుల్ గాంధీని, ఓ సారి రాబర్ట్ వాద్రాతో రహస్యంగా సమావేశం అయినట్లు ఆరోపణలు చేశారు. ఈ మంతనాలు ఓ ఫైవ్ స్టార్ హోటల్లో జరిగాయని దినేశ్ బంభూనియా తెలిపారు. ఈ సీక్రెట్ మీటింగ్ ఎందుకన్నది హార్ధిక్ ప్రజలకు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో హార్థిక్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో రెండో దశ పోలింగ్ గురువారం జరగనుంది. -
‘వేరొకరి సొమ్ముతో ఉడాయించలేదు’
సాక్షి,న్యూఢిల్లీ: రాబర్ట్ వాద్రా, వీరభద్రసింగ్‌లా తాను రాజకీయ బాధితుడినని లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చేసిన వ్యాఖ్యలపై వాద్రా స్పందించారు. తాను ఇతరుల సొమ్ముతో ఉడాయించలేదని, తన పేరును అనవసరంగా ఉపయోగించవద్దని మాల్యాకు వాద్రా సూచించారు. తన కేసు నుంచి దృష్టి మరల్చేందుకు మాల్యా బ్రిటన్ కోర్టులో తన పేరు ప్రస్తావించడంపై మండిపడుతూ వాద్రా ట్వీట్ చేశారు. మాల్యా దయచేసి భారత్‌కు తిరిగి వచ్చి న్యాయపరమైన వ్యవహారాలను ఎదుర్కోవాలని, బకాయిలు తిరిగి చెల్లించాలని సూచించారు. తన పేరును ఎక్కడ ప్రస్తావించవద్దని, తనకు ఏ విషయంలోనూ మీతో (మాల్యా) పోలిక లేదని వాద్రా స్పష్టం చేశారు. తాను రాజకీయ బాధితుడే అయినా తన హోదాను ఎన్నడూ దుర్వినియోగం చేయలేదని, అంతకుమించి వేరొకరి సొమ్ముతో భారత్ నుంచి పారిపోలేదని అన్నారు. మాల్యా అప్పగింత కేసులో బ్రిటన్ కోర్టులో మాల్యా తన వాదన వినిపిస్తూ సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా, హిమాచల్ సీఎం వీరభద్రసింగ్‌ల మాదిరిగా కక్ష సాధింపు చర్యలకు తనను భారత ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆరోపించారు. -
మోదీజీ...ఆ ఖర్చులు భరించిందెవరు..?
సాక్షి,న్యూఢిల్లీ: వాద్రా విమాన ఖర్చులను దళారీ చెల్లించాడనే ఆరోపణలను హైలైట్ చేస్తున్న బీజేపీకి కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ గతంలో గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 100కు పైగా చేసిన దేశీయ, అంతర్జాతీయ పర్యటనల విమాన ఖర్చులను ఎవరు భరించారని ప్రశ్నించింది. మోదీ చార్టర్డ్ విమానాలను పలు కార్పొరేట్ సంస్థలు స్పాన్సర్ చేశాయని పేర్కొంది. రాబర్ట్ వాద్రాకు విమాన టికెట్ల కోసం మధ్యవర్తి సంజయ్ భండారి రూ 10 లక్షల కోట్లు ఇచ్చారన్న బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. బీజేపీ చీఫ్ అమిత్ షా కుమారుడు జయ్ షాపై వచ్చిన ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ ఇలాంటి చౌకబారు ఎత్తుగడలకు పాల్పడుతోందని ఏఐసీసీ ప్రతినిధి అబిషేక్ సింఘ్వి అన్నారు. 2003 నుంచి 2007 వరకూ మోదీ విమాన ప్రయాణ ఖర్చులు రూ 16.56 కోట్లని ఆర్టీఐ కింద గుజరాత్ ప్రభుత్వం నుంచి తాను సేకరించిన వివరాల్లో వెల్లడైందని చెప్పారు. అయితే మోదీ చార్టర్డ్ విమానాల్లో విహరించేందుకు అయిన ఖర్చును ఎవరు చెల్లించారని దేశమంతా తెలుసుకోగోరుతోందని సింఘ్వి అన్నారు. 2007లో తాను దీనిపై ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు ఇంతవరకూ స్పందన లేదన్నారు.రూ 16.56 కోట్ల మేర ప్రయివేటు సంస్థలు ఇచ్చిన బహుమతిని ప్రభుత్వాధినేత ఎలా స్వీకరిస్తారని సింఘ్వి నిలదీశారు. వాద్రా ఎయిర్ టికెట్లపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ స్పందన కోరడాన్ని సింఘ్వి తోసిపుచ్చారు. ఏడేళ్ల కిందటి వ్యవహారాన్ని బీజేపీ ఇప్పుడు హైలైట్ చేస్తున్నదని వారు చెబుతున్న దళారీ ఇటీవల వరకూ మోదీ ప్రభుత్వానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారని అన్నారు. -
మీ పర్యటన ఖర్చులు ఎవరు పెట్టారు?
సాక్షి, న్యూఢిల్లీ : రాబర్ట్ వాద్రా విమాన టిక్కెట్ల విషయంలో బీజేపీపై కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి ప్రారంభించింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ దేశవ్యాప్త పర్యటనలు ఖర్చుల వివరాలను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ముఖ్యంగా 2003 నుంచి 2007 మధ్య కాలంలో నరేంద్రమోదీ చార్టర్డ్ ఫ్లయిట్లో వందసార్లు జాతీయ, అంతర్జాతీయ పర్యటనలు నిర్వహించారని.. ఈ మొత్తం ఖర్చును ఎవరు భరించారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ అప్పటి పర్యటనల ఖర్చు మొత్తం రూ.16.56 కోట్ల వరకూ ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ఖర్చు ఎవరు పెట్టారో.. ప్రజలకు తెలపాలని ఆయన బీజేపీని డిమాండ్ చేశారు. వివాదాస్పద ఆయుధ వ్యాపారి సంజయ్ భండారితో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాకు ఉన్న సాన్నిహిత్యం మరోసారి తెరపైకి వచ్చిన నేపథ్యంలో సింఘ్వి ఇటువంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. రాబర్ట్ వాద్రా-సంజయ్ భండారి ఈ మెయిల్స్‌లో తమకు అనుకూలంగా ఉన్న ఈ మెయిల్స్‌నే కేంద్రం లీక్ చేస్తోందని ఆయన ఆరోపించారు. పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, ఇతర బీజేపీ నేతలతోమ కూడా సంబయ్ భండారీ సన్నిహితంగా ఉన్నారని ఆయన చెప్పారు. -
డేరాల విధ్వంసం.. రాబర్ట్ వాద్రా ఆందోళన!
న్యూఢిల్లీ: హరియానాతో పాటుగా ఉత్తరాది రాష్ట్రాల్లో కొనసాగుతున్న విధ్వంసకాండపై ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా తీవ్రంగా స్పందించారు. డేరా సచ్ఛా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీం మద్ధతుదారులు చేస్తున్న దాడుల్లో ఇప్పటివరకూ 36 మంది మృతిచెందడంతో పాటు 250కి పైగా మంది గాయపడ్డారని.. దీనికి హరియానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఆదివారం ఆయన డిమాండ్ చేశారు. గుర్మీత్ అనుచరుల దాడుల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గతంలో తనపై తప్పుడు కేసులు బనాయించి, ఎన్నోసార్లు విచారణ చేపట్టి వేధించారని.. ఇంటిగ్రిటీ లేదని ఆరోపించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం హరియానాలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతున్నా వాటిని నియంత్రించలేని వ్యక్తి సీఎం హోదాలో ఉండేందుకు అనర్హుడని వాద్రా పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు గుర్మీత్ ఆస్తులు వేలం వేసి నష్టపరిహారం ఇప్పించాలని విజ్ఞప్తిచేశారు. దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ మనోహర్ లాల్ కట్టర్ ప్రభుత్వం ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తుందని పంజాబ్, హరియానా ఉమ్మడి హైకోర్టు ప్రశ్నించడాన్ని వాద్రా మెచ్చుకున్నారు. స్వేచ్ఛగా ప్రాణాలతో బతికేందుకు హరియానా ప్రజలకు అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. అయితే దేశంలో ఇలాంటి విధ్వంసక చర్యలు మరోసారి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. 2002లో జరిగిన అత్యాచారాల కేసులో డేరా అధిపతి గుర్మీత్ రాంరహీం సింగ్‌ను దోషిగా తేలుస్తూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో హరియాణలో ఆయన మద్దతుదారులు హింసాకాండను సృష్టించారు. -
రాజస్థాన్ సర్కార్‌పై రాబర్ట్ వాద్రా ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : బికనీర్ భూ ఒప్పందంపై సీబీఐ విచారణకు రంగం సిద్దమవుతున్న క్రమంలో రాబర్ట్ వాద్రా రాజస్థాన్ సర్కార్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. తనను టార్గెట్‌గా చేసుకుని రాజస్థాన్ ప్రభుత్వం వేధిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భూ కుంభకోణంలో తన ప్రమేయం ఉన్నట్టు ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదని వాద్రా అన్నారు. ‘నన్ను ఎంతైనా వేధించండి...వెంటాడండి...ప్రాసిక్యూట్ చేసుకోండి..ఇలాంటి అసత్యాలు నిజాన్ని కప్పిపుచ్చలేవు’ అని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఫేస్బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. రాజస్థాన్ ప్రభుత్వం తనపై సాగిస్తున్న కుట్రపూరిత ప్రచారంలో ఇది ఓ భాగమేనని ఆయన అన్నారు. బికనీర్ భూముల ఒప్పందంలో వాద్రా పాత్రను నిగ్గుతేల్చేందుకు రాజస్ధాన్ ప్రభుత్వం సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాదాన్యత సంతరించుకున్నాయి. -
సీబీఐకి రాబర్ట్ వాద్రా బికనీర్ స్కామ్
జైపూర్: రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో భూముల ఒప్పందానికి సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా నిందితుడైన బికనీర్ భూములు, మనీ ల్యాండరింగ్ కేసులను త్వరలో సీబీఐ విచారించనుంది. ఈ కేసులపై సీబీఐ విచారణ కోరుతూ రాజస్థాన్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరినట్టు రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా తెలిపారు. ఈ కేసు ప్రాధాన్యత, సుదీర్ఘంగా విచారణ సాగుతున్న క్రమంలో తదుపరి సీబీఐచే విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు. కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశామని చెప్పారు. రాజస్థాన్‌లోని బికనీర్‌లో రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీలు 275 బిగాల భూమి అక్రమ క్రయవిక్రయాల్లో పాలుపంచుకున్నాయని ఆరోపణలున్నాయి. మహజన్ ఫైరింగ్ రేంజ్ కోసం సేకరించిన భూమికి పరిహారంగా ఈ స్థలాలను కేటాయించారని 2010 నుంచి వీటి క్రయవిక్రయాల్లో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయని చెప్పారు. అధికారులు నకిలీ గుర్తింపులు, పేర్లతో భూములను ఇతరులకు రిజిస్టర చేశారనే అనుమానాలున్నందునే సీబీఐ విచారణ కోరామని తెలిపారు. -
చెల్లి, బావతో చైనా రాయబారిని కలిసిన రాహుల్
న్యూఢిల్లీ: చెల్లెలు ప్రియాంక గాంధీ, బావ రాబర్ట్ వాద్రా, భారత్‌లో చైనా రాయబారి ల్యూఝూహీలతో కలిసి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దిగిన ఫోటో బుధవారం వెలుగులోకి వచ్చింది. భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు ఉన్న విషయం తెలిసిందే. భారత్-చైనాల మధ్య ఉన్న సమస్యపై తనకు ఎలాంటి సమాచారం లేదంటూ.. రాహుల్ ఢిల్లీలో చైనా రాయబారిని కలిశారు కూడా. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులతో రాహుల్ చైనా రాయబారిని మరోమారు కలిశారా? లేదా మరేదైనా విషయంపై కలిశారా? అన్న విషయం తెలియరాలేదు. కాగా, రాహుల్ చైనా రాయబారిని కలవడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దాంతో డామేజ్ కంట్రోల్ చేయడానికి కాంగ్రెస్ నేతలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీ-20 సదస్సు వేదికగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిసిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రశ్నించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఫోటోను ఎప్పుడూ తీశారన్న విషయం మాత్రం తెలియరాలేదు. మరి కాంగ్రెస్ పార్టీ ఈ ఫోటోపై ఎలా స్పందిస్తుందో చూడాలి. -
నేనే కొన్నా.. నా భర్తకు సంబంధం లేదు
-
నేనే కొన్నా.. నా భర్తకు సంబంధం లేదు: ప్రియాంక
న్యూఢిల్లీ: హర్యానాలో తాను కొనుగోలు చేసిన వ్యవసాయ భూమికి తన భర్త రాబర్ట్ వాద్రా డబ్బులు ఇవ్వలేదని, ఆ భూమికి తన భర్తకు ఎలాంటి సంబంధం లేదని ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రియాంక కార్యాలయం నుంచి ఓ అధికారిక ప్రకటన వచ్చింది. హర్యనాలోని ఫరిదాబాద్‌లో ప్రియాంక వ్యవసాయ భూమి కొనుగోలు చేశారని, దానికి వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ, డీఎల్ఎఫ్ సంస్థల నుంచి డబ్బులు వచ్చాయంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన భర్త నుంచి ఒక్క రూపాయి కూడా ఆ భూమి కొనుగోలుకు రాలేదని ఆమె చెప్పారు. తాను చెక్ ద్వారా 5 ఎకరాల భూమిని రూ.15లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. నాలుగేళ్ల తర్వాత అదే భూమిని అదే యజమానికి 2010 ఫిబ్రవరి 17న మార్కెట్ ధరల ప్రకారం రూ.80లక్షలకు అమ్మినట్లు చెప్పారు. అది కూడా చెక్ ద్వారానే స్వీకరించినట్లు తెలిపారు. తన భర్తనే ఆ భూమి కొనుగోలు చేశాడంటూ వచ్చిన వార్తలన్నీ కూడా బూటకాలని, ఆధారం లేనివని చెప్పారు. -
సోనియా అల్లుడు వస్తున్నాడా?
న్యూఢిల్లీ: ఇప్పుడు జాతీయ మీడియాలో పరోక్షంగా ఓ చర్చ జరుగుతోంది. అది రాబర్ట్‌వాద్రా గురించి. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త అయిన ఆయన తెర వెనుక ఉండి రాజకీయ ప్రవేశం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా అని అంతా చెవులు కొరుక్కుంటున్నారు. ఇటీవల కాలంలో ఆయన అనుసరిస్తున్న విధానాలు చూస్తుంటే ఏదో ఒక రోజు అనూహ్యంగా తెరమీదకు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. సోషల్ మీడియాలో ఆయన క్రియాశీలం అవుతున్న తీరు చూస్తుంటే కూడా ఇప్పుడిప్పుడే సామాన్యుల జీవన విధానాలను, స్థితిగతులను పట్టించుకుంటున్నారని తెలుస్తోంది. ఎప్పుడు బిజినెస్ కార్యక్రమాల్లో తలమునకలై ఉండే రాబర్ట్ వాద్రా.. ఈ మధ్య ఎయిమ్స్ ఆస్పత్రి బయట ఎక్కువగా కనిపిస్తున్నారు. అక్కడి రోగులకు, పేదవారికి అన్నదానం చేస్తూ దర్శనం ఇస్తున్నారు. ప్రతి క్షణం ఏదో ఒక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫొటోల, వీడియోల రూపంలో పోజులిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. అంతేకాదు, ఢిల్లీలోని ప్రముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో దాన ధర్మాలు చేయడంతోపాటు అంధుల మధ్య కేకులు కట్ చేస్తూ కనిపిస్తున్నారు. పైగా ఇలాంటి పనుల్లో పాల్గొన్న ఆయన ‘ఇతరుల సంతోషం కోసం నువ్వు ఏది చేయని నాడు నీకంటూ ప్రత్యేకమైన రోజు ప్రత్యేకంగా ఉండదు’ అంటూ తాత్విక హితబోధలు తన ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల్లో పెడుతున్నారు. అలాగే, ఇటీవల జాదవ్‌కు పాక్ ఉరిశిక్ష విధించడంపై స్పందిస్తూ గతంలో జాదవ్ కంటే ముందు ఐదుగురు భారతీయులను ఇలాంటి ఆరోపణలతోనే అరెస్టు చేసిన పాక్ చివరకు వారి జైళ్లలోనే చనిపోయేలా చేసిందని ఓ పత్రిక కథనం వెలువరించినట్లు గుర్తు చేశారు. కేంద్రం ఈ ఒక్కసారి దేశం తరుపున తన శక్తివంచన లేకుండా ప్రయత్నించి జాదవ్‌ను సురక్షితంగా తీసుకురావాలని అభ్యర్థించారు. అంతేకాకుండా గ్రేటర్ నోయిడాలో ఓ నైజీరియన్‌పై జరిగిన దాడికి సంబంధించి, తరుణ్ విజయ్ జాత్యహంకార కామెంట్ల గురించి, మద్యం నిషేధంపై కూడా తన వ్యూహాలను పంచుకున్నారు. మరో అడుగు ముందుకేసి ఇటీవల తన కామెంట్లను చూస్తున్నవారు ‘నేను రాజకీయాల్లో చేరుతున్నానా అని ప్రశ్నిస్తున్నారు. చాలామంది నేను అవసరం అని తప్పకుండా రాజకీయాల్లోకి రావాలంటున్నారు. వాస్తవానికి నేను రాజకీయాల్లోకి చేరాలంటే నాకు పెద్ద కష్టమైన పనికాదు.. ఈ 20 ఏళ్లలో ఎప్పుడైనా చేరేవాడిని. నేను రాజకీయాల కోసం, ప్రజల కోసం పనిచేయగలను. నేను మార్పు తీసుకురాగలనని ప్రజలు భావిస్తే తప్పకుండా వస్తాను. అయితే, ముందు నాకంటే ఓ స్థానం సంపాధించుకోవాలి’ అని ఓ మీడియాకు చెప్పారు. దీని ప్రకారం పరోక్షంగా తనకు రాజకీయంపై అభిలాష ఉందని వాద్రా చెప్పారా? ఒక వేళ నిజంగానే ఆయన రాజకీయాల్లో చేరితే ఎప్పుడు చేరుతారు? ఎలా చేరుతారు? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, ఇప్పటికే పలు కేసుల్లో తల మునకలై ఉన్న రాబర్ట్ వాద్రా రాజకీయాల్లోకి రాకపోవచ్చని ఇంకోవర్గం అంటోంది. అలా చేస్తే, వెంటనే ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా కేంద్రం ముందుకు జరిపించి అడ్డుకుంటుందని, అవినీతి అక్రమాల ఆరోపణలతో రాజకీయాల్లో అడుగుపెట్టి ఆయన క్రియాశీలకంగా పనిచేయలేకపోవచ్చని కూడా అంటున్నారు. ఈ కారణాలవల్లే ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక పూర్తిస్థాయిలో పాల్గొనలేదని, అలా చేస్తే వాద్రా కేసులను బయటపెట్టి అధికార పక్షం ఇబ్బందుల్లో పెట్టే ప్రమాదం ఉందని కూడా అభిప్రాయపడుతున్నారు. సమాజ్‌వాది పార్టీతో పొత్తు సమయంలో కాంగ్రెస్ నేతలు వాద్రా సలహా కూడా తీసుకున్నారట. -
రాబర్ట్ వాద్రా.. కేజ్రీవాల్ మధ్య గొడవేంటి?
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్య ఏదో గొడవ జరిగింది. అదేంటన్నది పూర్తిగా బయటకు రావడం లేదు గానీ... ఈమధ్య కాలంలో తన మీదకు జనాన్ని రెచ్చగొడుతున్నారంటూ కేజ్రీవాల్ మీద వాద్రా విపరీతంగా మండిపడుతున్నారు. కావాలంటే తనతో నేరుగా మాట్లాడాలి గానీ ఇలా నిరాధార ఆరోపణలు చేయొద్దని, అర్థంపర్థం లేని పనులకు పాల్పడొద్దని హెచ్చరించారు. ఈ మేరకు వాద్రా తన ఫేస్బుక్ పేజీలో ఓ పెద్ద పోస్ట్ పెట్టారు. ''ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిక్షనరీలో ఎక్కువగా వినిపించే పేరు రాబర్ట్ వాద్రానే. 'వాద్రా వాళ్లను సజీవంగా తినేస్తాడు' లాంటి వ్యాఖ్యలు చూస్తే ఆయనకు నామీద ప్రత్యేకమైన ప్రేమ ఉన్నట్లుంది. కావాలంటే ఢిల్లీ ముఖ్యమంత్రి బయటకు వచ్చి, నాతో నేరుగా మాట్లాడాలని కోరుతున్నాను. నా మీద ఆయనకు ఏమైనా కోపం ఉంటే.. ప్రజలను నామీదకు ఎగదోయద్దు. ఢిల్లీ ముఖ్యమంత్రి అన్ని విషయాల్లో ముందుకెళ్లాలని ఆశిస్తున్నాను'' అని ఆ పోస్ట్‌లో రాశారు. ఢిల్లీ అసెంబ్లీలో రెండు రోజుల క్రితం జరిగిన ఘటన గురించి వాద్రా ఇలా స్పందించారు. ''మీరు కేవలం సత్యేంద్ర జైన్‌ను మాత్రమే అరెస్టు చేస్తారు, షీలా దీక్షిత్‌ను అరెస్టు చేయరు. ప్రధానమంత్రి రాబర్ట్ వాద్రా గురించి ఏమైనా మాట్లాడితే, ఆయనకు 56 అంగుళాల ఛాతీ ఉందని నేను నమ్ముతాను. వాద్రా ఆయనను సజీవంగా తినేస్తారు... ఢిల్లీ ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నందుకు మోదీ వాళ్ల మీద కక్ష తీర్చుకుంటున్నారు. మా పనికి అడ్డు తగులుతున్నారు. అన్ని అడ్డంకులున్నా మేం చాలానే చేస్తున్నాం'' అని కేజ్రీవాల్ అన్నారు. అసెంబ్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చలో మాట్లాడుతూ ఆయనిలా చెప్పారు రాబర్ట్ వాద్రా పెద్ద భూకుంభకోణంలో ఉన్నారని కేజ్రీవాల్ 2012లో ఆరోపించారు. డీఎల్ఎఫ్ వాళ్లు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా భారీ మొత్తంలో రుణాలు ఇస్తే వాటితో ఆయన కోట్లాది రూపాయల భూములు కొన్నారని.. ఢిల్లీ, రాజస్థాన్, హరియాణాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు డీఎల్ఎఫ్కు చేసిన మేలుకు ప్రతిఫలంగానే ఆ కంపెనీ ఆ సొమ్ము ముట్టజెప్పిందని ఆయన ఆరోపించారు. అలాగే 300 కోట్ల విలువైన భూమిని డీఎల్ఎఫ్ వాళ్లు రాబర్ట్ వాద్రాకు కారు చవగ్గా ఇచ్చేశారని కూడా అన్నారు. -
‘మోదీ అలాంటి మాటలు సిగ్గుచేటు’
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్రమోదీపై సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్‌వాద్రా ధ్వజమెత్తారు. మన్మోహన్పై మోదీ అలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని పరిణితికి, గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనం అని అభివర్ణించారు. ‘ఇది దేశం మొత్తానికి పెద్ద సిగ్గుచేటు. మోదీ మాజీ ప్రధానిని కించపరిచేలా మాట్లాడారు. అయినప్పటికీ ఎలాంటి మాటల దాడి చేయకుండా ఆయన పరిణితిని చాటుకున్నారు. మొన్న రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చేసే సమయంలో మాట్లాడుతూ రాహుల్ చెప్పిన భూకంపం వచ్చి వెళ్లిందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇలాంటి మాటలు ప్రజల మనోభావాలను దెబ్బకొడతాయి’ అంటూ తన ఫేస్బుక్ పేజీలో రాసుకొచ్చారు. మన్మోహన్ పై మోదీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. -
నవ్వేసి ఊరుకున్న భార్య.. సారీ చెప్పాలన్న భర్త
తనపై వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకుడు వినయ్ కతియార్‌ను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ పెద్దగా పట్టించుకోలేదు గానీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా మాత్రం వాటిని సీరియస్‌గా తీసుకున్నారు. కతియార్ తప్పనిసరిగా క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. ప్రియాంకను యూపీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్‌గా తాను భావించడం లేదని, ఆమెకంటే చాలామంది అందమైన మహిళలు, హీరోయిన్లు ఈసారి ప్రచారపర్వంలో ఉన్నారని కతియార్ అన్నారు. వాటిపై వాద్రా ఫేస్బుక్లో స్పందించారు. మహిళలను మనమంతా గౌరవించాలని, వారికి సమాన గౌరవం ఇవ్వాలని వాద్రా చెప్పారు. కతియార్ క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. అయితే అంతకుముందు దీనిపై స్పందించిన ప్రియాంకా గాంధీ మాత్రం వాటిని తేలిగ్గా తీసిపారేశారు. వాళ్లు తనను నవ్వుకునేలా చేస్తున్నారని, కతియార్ వ్యాక్యలు మహిళలపై బీజేపీ ఆలోచనా విధానాన్ని బయట పెడుతున్నాయని కామెంట్ చేశారు. సారీ చెప్పను గాక చెప్పను.. అయితే, ఈ వ్యవహారంపై తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని బీజేపీ నాయకుడు వినయ్ కతియార్ స్పష్టం చేశారు. ఈ విషయమై మీడియా అడిగిన ప్రశ్నలన్నింటికీ ఆయన ఆ ఒక్క సమాధానం మాత్రమే చెప్పి ఊరుకున్నారు. -
రాహుల్‌గాంధీపై ప్రశంసల జల్లు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు కుదిర్చినందుకు ప్రియాంకగాంధీ ప్రశంసల జల్లులో తడిసిపోతున్న తరుణంలో.. ఆమె భర్త రాబర్ట్ వాద్రా ఫేస్బుక్లో ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. ఈ పొత్తును 'బ్రిలియంట్ ఐడియా' అంటూ కొనియాడిన ఆయన.. అదే సమయంలో రాహుల్‌గాంధీ, అఖిలేశ్ యాదవ్‌ను ఆకాశానికెత్తారు. ఈ ఇద్దరు యంగ్, డైనమిక్ నాయకులు అంటూ కితాబిచ్చారు. అయితే, ఈ పోస్టులో భార్య ప్రియాంకగాంధీ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. వాద్రా వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఎస్పీతో పొత్తు ప్రియాంక విజయమంటూ కాంగ్రెస్ పార్టీ ఓవైపు హోరెత్తిస్తూనే.. మరోవైపు ప్రియాంక తెరమీదకు రావడంతో రాహుల్‌ను పక్కనబెట్టలేదన్న సంకేతాలను ఇస్తోంది. అంతేకాకుండా 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నియోజకవర్గంలో ప్రియాంక పోటీచేసే అవకాశం కూడా ఉందని వినిపిస్తోంది. ఈ తరుణంలో వాద్రా చేసిన రాజకీయ వ్యాఖ్యలు సహజంగానే ఆసక్తి రేపుతున్నాయి. రాహుల్, అఖిలేశ్ యూత్ ఐకాన్లు అని ప్రశంసించిన రాబర్ట్ వాద్రా.. ఈ ఇద్దరి నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ ప్రపంచస్థాయి రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందంటూ కూటమికి అభినందనలు తెలిపారు. -
సోనియా అల్లుడికి ఆగ్రహం
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా స్పందించారు. ఎలాంటి ప్రణాళిక లేకుండా అమలు చేసిన కార్యక్రమం పెద్ద నోట్ల రద్దు అని అన్నారు. ప్రణాళికలు చేసుకున్నట్లు ప్రభుత్వం వద్ద కానీ, ఆర్బీఐ వద్దగానీ ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. పెద్ద నోట్లను రద్ద చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న దాదాపు నెల రోజుల తర్వాత వాద్రా వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా డిపాజిట్ దారులు ఐదు వేల కంటే మొత్తాన్ని ఏకకాలంలో చేయాలని, అది కూడా సంతృప్తికర సమాధానాలు ఇస్తేనే డిపాజిట్లు చేసేందుకు అనుమతి ఉంటుందని తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకునన్న నేపథ్యంలో రాబర్ట్ వాద్రా తన ఫేస్ బుక్ పేజీలో స్పందించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతోపాటు తన అభిప్రాయాన్ని కూడా ఒక ఫొటో ప్రేమ్లాగా తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసి తన అభిప్రాయాలు వెల్లడించారు. కేంద్రం ప్రజలపైనా ప్రయోగాలు చేస్తుందని, ఇంకెంతకాలం, ఇంకెంత ప్రయోగం చేస్తారని ప్రశ్నించారు. ఒకేసారి రూ.5000 కంటే ఎక్కువమొత్తాన్ని జమ చేయాలనే నిర్ణయంతో కేంద్ర ఆర్థిక సంస్థ ఇక విచారణ సంస్థగా మారినట్లు కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం చేస్తున్నపిచ్చి చర్యల కారణంగా అమాయకులైన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అదంతా చూస్తుంటే చాలా బాధేస్తుందని అన్నారు. వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు, బాధలు చూసి తాను ఎంతో బాధపడుతున్నానని తెలిపారు. -
రాబర్ట్ వాద్రాకు అనుమతుల్లో అక్రమాలు
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు కష్టాలు తప్పేలా లేవు. గుర్గావ్లో ఆయనకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ గ్రూపునకు అనుమతులు ఇవ్వడంలో అక్రమాలు చోటుచేసుకున్నట్లుగా జస్టిస్ (రిటైర్డ్) ఎస్ఎన్ ఢింగ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ నిగ్గుతేల్చినట్లు తెలిసింది. గుర్గావ్లోని నాలుగు గ్రామాల్లో భూముల వినియోగ మార్పిడి విషయంలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణకు ఈ కమిషన్‌ను నియమించారు. రాబర్ట్ వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ గ్రూపు కూడా ఈ భూమి వినియోగ మార్పిడి వల్ల లబ్ధి పొందింది. ఆ గ్రూపునకు అనుమతులు మంజూరుచేయడంలో సైతం అక్రమాలు జరిగినట్లు ఢింగ్రా కమిషన్ నిర్ధారించిందని సమాచారం. ఈ ప్రాంతంలో పెద్ద మనుషులకు భూవినియోగ మార్పిడి అనుమతులు ఇవ్వడం వల్ల ఆ తర్వాత ఇక్కడి భూముల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయని ఢింగ్రా కమిషన్ గుర్తించింది. -
బీజేపీ ఎమ్మెల్యే బెదిరించారు: సోనియా అల్లుడు
డెహ్రాడూన్: పోలీసు గుర్రం ‘శక్తిమాన్’ చావుకు కారణమైన ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే గణేశ్ జోషి తనను బెదిరించారని సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఆరోపించారు. తనపై నోరు పారేసుకున్నారని తెలిపారు. బీజేపీ ఎంపీని ఆహ్వానించేందుకు తన అనుచరులతో కలిసి డెహ్రాడూన్ విమానాశ్రయానికి వచ్చిన జోషి.. తన మీదకు దూసుకొచ్చి బెదిరించారని వాద్రా ఆరోపించారు. ‘మీరు దౌర్జన్యం చేస్తున్నా మాట్లాడకపోవడానికి నేను గుర్రాన్ని కాదు. మూగజీవం కాబట్టి గుర్రం మాట్లాడలేదు. కానీ నేను మాట్లాడగలన’ని జోషికి సమాధానం ఇచ్చినట్టు రాబర్ట్ వాద్రా తెలిపారు. జోషిని ఆయన అనుచరులు విమానాశ్రయం బయటకు తీసుకెళ్లారని చెప్పారు. డెహ్రాడూన్ లో మార్చిలో బీజేపీ ఆందోళన సందర్భంగా ఎమ్మెల్యే గణేశ్ జోషి లాఠీతో కొట్టడంతో ‘శక్తిమాన్’ మరణించిన తెలిసిందే. -
ఫేస్బుక్లో వాద్రా సంచలన వ్యాఖ్యలు
ఆయనకు పదవులు అంటూ ఏమీ లేవు.. కానీ ఉన్న గుర్తింపు మాత్రం తక్కువది కాదు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు. అవును.. ఆయనే రాబర్ట్ వాద్రా. ఆయనగారి మీద లెక్కలేనన్ని ఆరోపణలున్నాయి. భూముల విషయంలో అక్రమాలు చేశారన్న ఆరోపణలపై వాద్రామీద ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అయితే.. ఈ వ్యవహారంపై రాబర్ట్ వాద్రా ఫేస్బుక్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఎప్పుడూ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటారని, ప్రభుత్వాలు తన విషయంలో ఏమీ రుజువు చేయలేవని అన్నారు. ‘‘ఆధారాలు లేకుండా వాళ్లు ఏమీ రుజువు చేయలేరు. దాదాపు దశాబ్దం నుంచి ప్రభుత్వాలు నాపై తప్పుడు, నిరాధార ఆరోపణలు చేస్తున్నాయి’’ అని వాద్రా తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. హర్యానాలో డీఎల్ఎఫ్ సంస్థకు, వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థకు మధ్య జరిగిన భూములఘొప్పందాలపై జస్టిస్ ఎస్ఎన్ ఢింగ్రా కమిషన్ విచారణ పూర్తిచేసిన ఒకరోజు తర్వాత ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. జస్టిస్ ఢింగ్రా కమిషన్ విచారణ సమయంలో వాద్రాను మాత్రం తమ ముందుకు పిలవలేదు. కమర్షియల్ లైసెన్సుల మంజూరుకు సంబంధించిన 250 ఫైళ్లను పరిశీలించింది. 26 మంది ప్రభుత్వాధికారులను విచారించింది. 2014 హర్యానా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు వాద్రా భూ అక్రమాలపై బీజేపీ మండిపడింది. 2015 మే నెలలో హర్యానా ప్రభుత్వం జస్టిస్ ఢింగ్రా కమిషన్‌ను ఈ అక్రమాలపై విచారణకు నియమించింది. -
మాకు ఈ రోజే అందాయి: ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన భర్త రాబర్ట్ వాద్రాకు జారీచేసిన నోటీసులపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ స్పందించారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తమకు ఈడీ నోటీసులు అందాయని ఆమె తెలిపారు. రాజస్థాన్ లో భూముల కొనుగోలు విషయంలో మనీలాండరింగ్ ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు తమ ముందుకు హాజరుకావాలంటూ ఈడీ రాబర్ట్ వాద్రాకు నోటీసులు జారీచేసింది. అయితే, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడైన వాద్రాను కార్నర్ చేయడం ద్వారా తమ పార్టీ అధినాయకత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ స్పందిస్తూ 'మేం ఈ రోజు 4 గంటలకు ఈడీ నోటీసులు అందుకున్నాం. మీకు (మీడియా) ఇవి నిన్ననే అందినట్టు ఉన్నాయి' అని పేర్కొన్నారు. బీజేపీ సర్కార్ ఉద్దేశపూరితంగానే ఈడీ నోటీసు వార్తలను ముందే మీడియాకు లీక్ చేసినట్టు ఆమె ఆరోపించారు. -
మంత్రి అశోక్ ఓఎస్డీకి భండారీ నుంచి 355 కాల్స్
- నెంబరు పెద్దగా గుర్తుపెట్టుకోలేదన్న ఓఎస్డీ అప్పారావు - ఏడాదిన్నరలో 3-4 సార్లు కలిశాడని ప్రకటన న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాకు చెందినట్లుగా భావిస్తున్న ఇంటిని కొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ ఆర్థిక వ్యవహారాలపై విచారణ కొత్త మలుపు తిరిగింది. భండారీతో కేంద్ర విమానయాన మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) అప్పారావు ఫోన్‌కాల్స్‌పై ఆధారాలు లభించిన నేపథ్యంలో ఆసక్తికర చర్చకు తెరలేసింది. భండారీ ఇంట్లో విచారణ సంస్థల సోదాల్లో దొరికిన ఆధారాల్లో.. గతేడాదిగా అప్పారావుతో 355 సార్లు భండారీ మాట్లాడినట్లు వెల్లడైంది. అయితే తనకు భండారీ ఫోన్ చేసిన మాట వాస్తవమేనని అయితే.. చాలా తక్కువసార్లు చేసినందున ఆ నెంబరును గుర్తుపెట్టుకోలేదని అప్పారావు తెలిపారు. మంత్రిని కలిసేందుకు భండారీ ఏడాదిన్నర కాలంలో మూడు, నాలుగు సార్లు ఇంటికొచ్చారని.. అయితే విమానయాన పరికరాల వ్యాపారంలో ఉన్నందుకే మంత్రి ఈయనతో మాట్లాడారాన్నారు. ఏడాదిన్నర క్రితం బెంగళూరులో జరిగిన ఎయిర్‌షోలో అశోక్ గజపతి రాజును భండారీ కలిసినట్లు వెల్లడించారు. కాగా, భండారీతో తనకు వ్యక్తిగత పరిచయమే తప్ప వృత్తిపరమైన సంబంధాల్లేవని బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ వెల్లడించారు. 2009లో వాద్రాకు చెందిన లండన్ ఇంటిని భండారీ కొనుగోలు చేశారనే ఆరోపణలతో ఈ కేసుకు రాజకీయ రంగు పులుముకుంది. కాగా, బ్యాంకు అకౌంట్లు, ఆస్తులకు సంబంధించిన వివరాలివ్వాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) భండారీకి నోటీసులు జారీ చేసింది. -
కుట్రతోనే వాద్రాపై ఆరోపణలు: సోనియా
మోదీ షెహన్‌షాలా వ్యవహరిస్తున్నారని ధ్వజం రాయ్‌బరేలీ: తన అల్లుడు రాబర్ట్ వాద్రాపై బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం ఆరోపణలను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తిప్పికొట్టారు. కాంగ్రెస్ విముక్త భారత్‌ను సాధించాలనే లక్ష్యంతోనే బీజేపీ నేతలు రాబర్ట్ వాద్రాపై కుట్రపూరితంగా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి దమ్ముంటే ఆరోపణలపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని సవాల్ విసిరారు. దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. మంగళవారం తన పార్లమెంటరీ నియోజకవర్గం రాయ్‌బరేలీలో సోనియాగాంధీ పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు విలేకరులు.. ఒక ఆయుధ వ్యాపారికి, వాద్రాకు మధ్య ఉన్న లింకులపై ఆదాయ పన్ను శాఖ దర్యాప్తు చేపట్టనుందనే వార్తలపై సోనియాను ప్రశ్నించగా ఆమె పైవిధంగా స్పందించారు. మోదీ షెషన్‌షాలా ప్రవర్తిస్తున్నారు.. నరేంద్రమోదీ ప్రధానమంత్రిలా కాకుండా షెహన్షా (చక్రవర్తి) మాదిరిగా ప్రవర్తిస్తున్నారని సోనియా మండిపడ్డారు. దేశంలో పేదరికం, కరువు తీవ్రంగా ఉండి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయితే ప్రభుత్వం రెండేళ్ల సంబరాలు చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. మరోవైపు వాద్రాను సోనియాగాంధీ వెనకేసుకురావడం ఒక నాటకమని బీజేపీ కొట్టిపారేసింది. -
సోనియాపై కేంద్ర మంత్రి తీవ్ర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సవాల్ కేంద్ర ప్రభుత్వానికి విసిరిన సవాల్ పై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మహారాణులకు చోటులేదని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై సోనియా ఎలాంటి వ్యాఖ్యలు చేశారో టీవీ లో చూశాను. రాయ్ బరేలిలో ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. తన అల్లుడు రాబర్ట్ వాద్రా చేసిన ఆరోపణలను రుజువు చేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఆమె సవాల్ విసిరారు. పెద్ద కుటుంబానికి కోడలు అయినంత మాత్రాన ఆమె మహారాణిలా ఫీలవుతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కూడా ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రతి పేదవారి ఇంటింటికీ తిరుగుతూ రాహుల్ నాటకాలు ఆడుతున్నారంటూ కామెంట్ చేశారు. మీరు టార్గెట్ చేయడానికి.. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అని, ఆయన చక్రవర్తి కాదు అని సోనియాను ఉద్దేశించి కేంద్ర మంత్రి రాధా మోహన్ వ్యాఖ్యానించారు. ఆయుధాల వ్యాపారి నుంచి బినామీ పేరుతో సెంట్రల్ లండన్ లో వాద్రా ఇల్లు కొన్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఆదాయపన్ను శాఖ దర్యాప్తు జరపనుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో సోనియా తీవ్రంగా స్పందించి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. -
రాబర్ట్ వాద్రా బినామీ బాగోతం బట్టబయలు!
ఆయుధాల డీలర్ బినామీగా లండన్‌లో ఇల్లు కొనుగోలు న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఓ ఆయుధాల డీలర్‌తో సంబంధాలు ఉన్నట్టు తాజా దర్యాప్తులో వెల్లడైంది. సదరు డీలర్‌ను బినామీగా పెట్టుకొని లండన్‌లో ఆయన పెద్ద భవనాన్ని (మాన్షన్) సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించిన దర్యాప్తు ఫైల్‌ను ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సమీక్షిస్తోంది. గత నెలలో ఆయుధాల డీలర్ సంజయ్ భండారికి చెందిన 17 నివాసాలు, కార్యాలయాలపై ఎన్ఫోర్స్ మెంట్ సంస్థలు దాడులు నిర్వహించాయి. సంజయ్‌కి, వాద్రాకు ఉన్న సంబంధాలపై ఈ దాడుల్లో కీలక వివరాలు వెల్లడయ్యాయి. వాద్రా, అతని ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మనోజ్ అరోరా.. భండారికి పంపిన ఈమెయిల్స్, విచారణలో భండారి తెలిపిన వివరాలు దర్యాప్తు నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. లండన్ బ్రియాన్స్టన్లోని ఎల్లెర్టన్ హౌస్ రూ. 19 కోట్లకు కొనుగోలు చేయగా.. దాని చెల్లింపులు, అదనపు హంగులు చేకూర్చే విషయమై ఈ ఈమెయిల్స్‌లో వాద్రా చర్చించినట్టు తెలుస్తోంది. అయితే, వాద్రా లాయర్లు మాత్రం ఈ అంశాలను తిరస్కరిస్తున్నారు. -
త్రిమూర్తుల చిత్త ప్రవృత్తి ప్రకోపం
బైలైన్ ఒక ఇటాలియన్ కోర్టు తీర్పు భారత ప్రజాస్వామ్యాన్ని ఎలా హతమార్చిందో చెప్పగలరా? శక్తివంతమైన ఒక ప్రత్యేక కాంగ్రెస్ ‘‘కుటుంబం’’ తీసుకున్న లంచాలను అనుమతిస్తేనే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందా? పోలీసులను వారి విధులను నిర్వర్తించమని చెప్పినంత మాత్రాన ప్రజాస్వామ్యాన్ని కాలరాచివేసినట్టేనా? ప్రాచీనులకు పోలికలు బాగా తెలుసు. మనిషి మానసిక స్థితులను వారు శరీరాంతర్గత స్రావాల ఆధారంగా (గ్రీకులు) నాలుగు రకాలుగా లేదా ‘ప్రవృ త్తులు’గా విభజించారు. రక్తం, కఫం, నల్ల పైత్యం, పచ్చ పైత్యం అనే నాలుగూ వారి దృష్టిలో దేహాంతర్గత ద్రవాలు. ప్రజా స్వామ్య వ్యవస్థలో విమర్శను లేదా వ్యతిరేకతను కూడా వాటిలో ఒకటిగా చేర్చడం ఉపయోగకరం. ఎన్డీఏ ప్రభుత్వ ద్వితీయ వార్షికోత్సవం సమీపిస్తుండగా అవన్నీ కలసి ప్రకో పిస్తుండటాన్ని చూస్తుంటే నాకీ విషయం హఠాత్తుగా స్ఫురించింది. మొదటిది, రక్తం. అన్ని శరీరాల్లాగే రాజకీయ వ్యవస్థ కూడా రక్తం నిరంతరాయంగా ప్రవహించనిదే మనజాలదు. ప్రజాస్వామ్య వ్యవస్థ హృదయం, మస్తిష్కాలు ప్రభుత్వ అధీనంలో ఉంటే... అధికారానికి ఎదురు నిలిచే సంస్థల చేతుల్లో అభిప్రాయాలనే రక్తనాళాలుంటాయి. ప్రభుత్వం చేసే ప్రతి తప్పును పట్టి చూసే హక్కు ప్రతిపక్షానికి ఉంది. అతిశయీకరించడం, వక్రీకరించడం ఆ ద్వంద్వ యుద్ధ ఆయుధాలలో భాగం. కఫం, శాంతిని సూచిస్తుంది. ఆర్థిక లేదా రాజకీయ విజ్ఞాన శాస్త్రాలకు చెందిన స్వతంత్ర విశ్లేష కుల ప్రవృత్తి ఇది. వారి తీర్పు ప్రతికూల అంశాలవైపు ఎక్కు వగా మొగ్గు చూపే ధోరణితో ఉంటుంది. అయితే సాను కూల అంశాలపై వారి ప్రశంసల విశ్వసనీయతను అది పెంచుతుంది. అధికారంలో ఉన్నవారు స్వీయ ప్రయోజన ప్రేరితులైతే తప్ప, ఇది వారికి తోడ్పడేదే. విషాదాన్ని సూచించే నల్ల పైత్యం అధికారం పట్ల మీడియా వైఖరిని బహుశా అత్యుత్తమంగా అభివ ర్ణిస్తుంది. పాత్రికేయులు అవహేళన చేయాలని చూస్తుంటారు. అది వారు సంధించే ప్రశ్నలకు వ్యంగ్యంతో కూడిన పదనును, ఉద్వేగాన్ని కలిగిస్తుంది. వారి సవాళ్లకు పోరాటపు మైకం ఉంటుంది. బహుశా ఇది 80% మీడియా విషయంలో నిజం కావచ్చు. దురదృష్టవశాత్తూ ఆ మిగతావారు అవినీతి పరులు. కాబట్టి అంతగా పట్టించుకోవాల్సిన పని లేదు. అమెరికాలో స్వేచ్ఛాయుతమైన పత్రికలు పుట్టినప్పటి నుంచీ ఎల్లో జర్నలిజంపై చర్చ కూడా పుట్టింది. భావ ప్రక టనా స్వేచ్ఛ ఉన్నంత కాలం బహుశా అది కూడా ఉంటుంది. సెన్సార్షిప్ ఒక్కటే దీనికి విరుగుడు అను కుంటాం. కానీ, అది నిజం కాదు. పాఠకులకు లేదా వీక్ష కులకు ఎల్లో జర్నలిజాన్ని తిరస్కరించే సామర్థ్యం ఉంది. అలాంటి అలుగ్గుడ్డలను కొనడాన్ని, చూడటాన్ని మానేసి సర్క్యులేషన్ లేదా టీఆర్పీలు తగ్గిపోయేలా చేయగలరు. నాలుగో ప్రవృత్తి అయిన పచ్చ పైత్యంతోనే ఉంది అసలు పెద్ద సమస్య. కాలేయం నుంచి స్రవించి, పిత్తాశయంలో నిల్వ ఉండే పైత్యం తలకు ఎక్కితే... నిరాశానిస్పృహల వల్ల పెరిగి పెద్దదై దుర్మార్గపూరితంగా, విషపూరితంగా మారి నాలుకకు పాకుతుంది. ఇక ఆ వ్యాధిగ్రస్తులు స్పందించడానికి బదులు ప్రేలాపిస్తుంటారు, వాదించడానికి బదులు ఆరోపిస్తుం టారు, వివరించడానికి బదులు దుమ్మెత్తిపోస్తుంటారు, మాట్లాడటానికి బదులు ఆగ్రహంతో రగులుతుంటారు. ఇప్పటికే ఒక టీవీ ప్రధానికి వ్యతిరేకంగా దుర్మార్గమైన వ్యక్తి గత దాడిని ప్రసారం చేసింది. ఎలాంటి ఆధారాలూ లేని ఆరోపణలను ఏకరువు పెడుతూ తమ దుష్ట బుద్ధిని ఇంతైనా దాచుకోకుండా ఆ దాడి సాగింది. అదృష్టవశాత్తూ, అలాంటి ద్వేషం వారికే శత్రువుగా పరిణమిస్తుంది. దుమ్మెత్తి పోసేవారే చూసేవారికి దుష్టులుగా కనిపిస్తారు. అయితే ఐదవది, కొత్తది అయిన మరో ప్రవృత్తి కూడా ఉంది. ప్రాచీనులు దాన్ని ఎన్నడూ పరిగణనలోకి తీసుకో లేదు. అసంబద్ధ నాటక రంగస్థలం మరింత ఆధునిక పరి ణామం కావడమే అందుకు కారణం కావచ్చు. ఒక ఇటాలి యన్ కోర్టు, భారతదేశంతో వీఐపీ హెలికాప్టర్ల అమ్మకం ఒప్పందం కుదుర్చుకునేందుకు అగస్టా వెస్ట్‌లాండ్ హెలి కాప్టర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు లంచాలు ఇచ్చారని శిక్ష విధిం చింది. ఆ విషయంపై కాంగ్రెస్ స్పందించిన తీరునే ఇందుకు ఉదాహరణగా చూడొచ్చు. లంచాలు ఇచ్చారంటే ఎవరో తీసుకున్నారు. ఆ డబ్బు యూపీఏ ప్రభుత్వంలో పలుకు బడిగల వారికి చేరిందనేది స్వయంవిదితమే. ఇంతవరకు విచారణాధికారులు ఈ లంచాల గొలుసులో అట్టడుగునున్న వారి వరకే చేరారు, అసలు సూత్రధారులను కాదు. కానీ కాంగ్రెస్ యుద్ధ బాకాల హోరును చూస్తుంటే.... అది ఇటాలియన్ కోర్టు మొదటి తీర్పులాగా లేదు, బైబిల్లోని తుది తీర్పులా ఉంది. నేటి ప్రభుత్వం ‘ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోం’దని ఢిల్లీలో జరిగిన ఓ ప్రదర్శనలో సోనియా గాంధీ ఆరోపిం చారు. అదే ప్రదర్శనలో కాంగ్రెస్ అత్యున్నత నాయక ద్వయం అధికారికంగా నాయక త్రయంగా మారింది. సోనియా, రాహుల్ గాంధీల మధ్య రాబర్ట్ వాద్రా చిత్రాన్ని ఉంచారు. ఒక ఇటాలియన్ కోర్టు తీర్పు భారత ప్రజాస్వా మ్యాన్ని ఎలా హతమార్చిందో చెప్పగలరా? శక్తివంతమైన ఒక ప్రత్యేక కాంగ్రెస్ ‘‘కుటుంబం’’ తీసుకున్న లంచాలను అనుమతిస్తేనే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందా? ఇంతవరకు మనకు తెలిసింది ఒక ‘‘కుటుంబం’’ అని మాత్రమే. అనుమానితులను ఇంకా విచారించిన తర్వాత మరింత నిర్దిష్ట సమాచారం లభిస్తుందని ఆశించవచ్చు. పోలీసులను వారి విధులను నిర్వర్తించమని చెప్పినంత మాత్రాన ప్రజాస్వామ్యాన్ని కాలరాచివేసినట్టేనా? ఒక పార్టీ నాయకత్వం తన మంచి ప్రవృత్తిని లేదా సంతులనాన్ని కోల్పోతే జరిగేది ఇదేనేమో అనుకుంటాను. కాంగ్రెస్‌ను ఇప్పడు తమ శాశ్వత నియంత్రణలోకి తీసు కున్న కుటుంబానికి ముప్పు ఏర్పడటం తప్ప మరేదీ ఆ పార్టీని అంత వేగంగా లేచి నిలబడేలా చేయలేదను కుంటాను. ఆ లంచాలు పుచ్చుకున్న వ్యక్తి ఏ క్యాబినెట్ మంత్రో అయ్యుంటే... ఇలా భుజాలెగరేసి, అలా అతన్ని వదిలిపారేసేవారే. కానీ ఈ భుజాల కుదుపుతో పాటూ విన వస్తున్న అరుపులు, పెడబొబ్బలు మనకేదో చెబుతున్నాయి. - ఎం.జె. అక్బర్ సీనియర్ సంపాదకులు వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి. -
కాంగ్రెస్ పోస్టర్లపై సోనియా అల్లుడు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఫొటో.. ఆ పార్టీ పోస్టర్లపై తొలిసారి దర్శనమిచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ శుక్రవారం 'సేవ్ డెమోక్రసీ' పేరుతో నిర్వహించిన మార్చ్‌లో ఈ దృశ్యం కనిపించింది. ఈ ర్యాలీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా, రాహుల్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. ర్యాలీ వేదిక జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన పోస్టర్లలో సోనియా, రాహుల్‌తో పాటు వాద్రా ఫొటోలు కనిపించాయి. గాంధీ కుటుంబానికి విధేయుడైన జగదీష్ శర్మ వీటిని ఏర్పాటు చేసినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ పోస్టర్లపై 47 ఏళ్ల వాద్రా ఫొటో కనిపించడం ఇదే తొలిసారి. ఎన్నికల్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తరపున ప్రియాంక గాంధీ ప్రచారం నిర్వహించినా, ఆమె భర్త వాద్రా మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. హరియాణాలో భూకుంభకోణంలో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. -
రాబర్ట్ వాద్రా రాయని డైరీ
ఈ పేపర్ వాళ్లు రాయాల్సిందంతా రాసేశారు. చెప్పాల్సిందంతా చెప్పేశారు. అవన్నీ నమ్మి ఉంటే పెళ్లయిన రెండో రోజే ప్రియాంక నాకు విడాకులు ఇచ్చి ఉండాలి. అలా జరగలేదు. పందొమ్మిదేళ్లుగా సుఖంగా ఉన్నాం. ఇంకో ఏడాది సుఖంగా ఉండగలిగితే ఇరవై ఏళ్లు సుఖంగా ఉన్నట్లు అవుతుంది. ఇరవై కంప్లీట్ అవనిస్తారో లేదో చూడాలి మీడియా మహానుభావులు. సుఖ సంతోషాల గురించి మీడియా అదే పనిగా రాయదు. సుఖ సంతోషాలను చెడగొట్టే వార్తల్ని మాత్రం పనిగట్టుకుని రాస్తుంది! ఇన్ని కోట్లు, ఇంత పలుకుబడి సంపాదించి ఏం లాభం? మీడియా దృష్టిలో నేనింకా అల్లుడినే. నేనింకా భర్తనే. ఆ తర్వాతే రాబర్ట్ వాద్రాని. ఒక్కోసారి ఒక్కణ్నీ కూర్చుని కుమిలిపోతుంటాను. ఎందుకు ప్రియా నా ప్రేమను అంగీకరించావ్? ఎందుకు ప్రియా నన్ను నీ జీవిత భాగస్వామిని చేసుకున్నావ్? అప్పుడే వద్దంటే.. ఇప్పుడు నాకింత వ్యధ ఉండేది కాదు కదా, నిన్ను అడ్డం పెట్టుకుని ఎదుగుతున్నాననే మాట పడేవాడిని కాదుగా.. అని ప్రపంచమంతా వినిపించేలా పెద్దగా అరిచి చెప్పాలనిపిస్తుంది. ప్రేమ వల్ల మనిషిగా ఎదిగినవాణ్ణే కానీ, ప్రేమించిన మనిషి వల్ల ఎదిగినవాణ్ణి కాదు నేను. ఎవరు నమ్ముతారు? ‘రాబీ’ అంటూ వచ్చి మెడ చుట్టూ చేతులు వేసింది ప్రియాంక. ‘రేపు నీ బర్త్‌డే. గుర్తుందా?’ అంది! మౌనంగా తన కళ్లల్లోకి చూశాను. నిజమే. రేపు సోనియాగాంధీ అల్లుడి బర్త్ డే. ప్రియాంకగాంధీ భర్త బర్త్ డే! ‘ఏం ఇమ్మంటావ్ రాబీ.. బర్త్‌డే గిఫ్ట్‌గా’ అంటోంది ప్రియాంక. తనేం మారలేదు. తన ప్రేమా మారలేదు. అలాంటి మనిషికా నేను అరిచి ఏదో చెప్పాలనుకుంది?! ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశాను.. ‘పెళ్లి చేసుకుందాం ప్రియా’ అని. ప్రియాంక వెంటనే ఒప్పుకుంది! రాహుల్ ఒప్పుకున్నాడు. సోనియాజీ ఒప్పుకున్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒప్పుకుంది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఒప్పుకుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఒప్పుకుంది. మీడియానే.. ఒప్పుకోలేదు! నాకు బ్యాక్‌గ్రౌండ్ లేదంది. మాది రిచ్ ఫ్యామిలీ కాదంది. నాలో గొప్ప లక్షణాలేవీ లేవంది. ఫిజికల్లీ నాట్ ఎట్రాక్టివ్ అంది. ప్రియాంక కంటే ఎత్తు తక్కువ అంది. చదువులో పూర్ అంది. డిగ్రీ ఫెయిల్ అంది. కనీసం మాటకారి కూడా కాదంది. అసలు గాంధీ-నెహ్రూల ఫ్యామిలీకి ఇంత కర్మేమిటని దేశ ప్రజలను ఉద్దేశించి కూడా అడిగింది! ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టింది.. నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే ప్రియాంక మంచి లీడర్‌గా ఎదిగి ఉండేదని! నేను లేని ప్రియాంకను మీడియా ఊహిస్తూ ఉంటే .. ప్రియాంక లేని నన్ను ఊహించుకుంటూ నేను చాలాసేపు ఒంటరిగా ఉండిపోయాను. పక్కనే ప్రియాంక ఉందన్న సంగతి కూడా మార్చిపోయి అలా ఉండిపోయాను. ‘రాబీ.. ఏంటి ఆలోచిస్తున్నావు? డోన్ట్ వాంట్ గిఫ్ట్?’ అంటోంది నవ్వుతూ. అవే చిలిపి కళ్లు. అదే చిలిపి నవ్వు. తన పదమూడేళ్ల వయసులో ప్రియాంక నాతో ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. ఇంతకన్నా గొప్ప గిఫ్ట్ ఏముంటుంది?